SNo,text 0,"     సుశీలమ్మ కళ్ళలో భయం పారాడింది.     ""అనాధ బిడ్డ అని చిన్నప్పుడే తెలిస్తే మన దగ్గిరవాడు అలా అరమరిక లేకుండా చనువుగా పెరిగేవాడా?"" పుట్టెడు దిగులు సుశీలమ్మ కంఠంలో పలికింది.     ""అది మనం పెంచేదాన్ని బట్టి వుంటుంది. అటువంటి బేధాలు మనలో లేనట్టు తెలుసుకొనేలా పెంచాలి.""     ""చాలామంది అలాగే పెంచుతారు గదండీ.""     ""ఏనాడో ఒకనాడు ఆ విషయం తెలియకపోదు. మనం పట్నంలో వుంటున్నాం గనక యింత కాలమయినా ఈ రహస్యాన్ని దాచగలిగాం.     సుశీలమ్మ వింటూ కూర్చుంది.     ""ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పడ్డాక ఆ రహస్యం తెలిస్తే లోతుగా గాయపడతారు. అనేక ఆలోచనలు వస్తాయి. చిన్నప్పుడే తెలిస్తే అంతగా తలక్రిందులై పోరు"" అన్నాడు.       ""వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడేమో!"" అనలేక అంటున్న ఆమె గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.     రామనాథానికి కూడా ఆ భయం లేకపోలేదు.     ఆ భయాన్ని దాచుకుంటూ వెళ్ళడు. ఎలా వెళతాడు? ఎక్కడికి వెళతాడు? అసలు ఎందుకు వెళ్ళాలి? వాడికి మనమేం తక్కువ చేశామని వెళ్తాడు?"" అన్నాడు.     సుశీలమ్మకు ఎక్కడికో లోతు తెలియని అగాధంలోకి పడుతున్న వ్యక్తికి జారుడుమెట్లు చేతికి అందినట్టు అనిపించింది.        ""వాడు వెళ్ళిపోడంటారా?"" చేతికందిన జారుడుమెట్టును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అన్నది.     ""పిచ్చిదానా! వాడెక్కడి కెల్తాడే? వాడు ఎప్పటికీ సుశీలమ్మ కొడుకే.     ""నేను సుశీలమ్మ కొడుకునే!"" అన్న శరత్  బాబు మాటల్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు రామనాథం.     అగాధంలోకి పడిపోతున్న సుశీలమ్మ చేతికి మెట్టు ఒడుపుగా దొరికినట్టు అనిపించింది.     ""నిజంగానా? వాడు వెళ్ళిపోతే నేను బతకనండీ"" కంఠం రుద్దమయింది.     ""ఛ! ఏం మాటలవి? నా వల్లనే ఈ అనర్థం ఏర్పడింది. నువ్వు వాడికి తల్లివి కాగలిగావు కాని నేను తండ్రిని కాలేకపోయాను"" గద్గద కంఠంతో అన్నాడు రామనాథం.     ""అలా అనకండి. మీకూ వాడి మీద ప్రేమ వుంది. అది నాకు తెలుసు. నిజం చెప్పండి. వాడు ఏం చేస్తాడోనని మీకు మాత్రం భయంగా లేదూ!""       రామనాథం కళ్ళలో నీరు తిరిగింది.     ""నాకు తెలుసు. వాడంటే మీకూ ఇష్టమే. మీరూ బాధపడుతూనే వున్నారు.""     ""వాడు ఎక్కడికెళ్ళడూ?"" మాట మార్చే ఉద్దేశంతో అన్నాడు రామనాథం.     ""ఏమో తెలియదు. పిచ్చి సన్నాసి! వాడూ నా గురించి బాధపడుతున్నాడండీ పొద్దున్నే కలవరిస్తున్నాడు. ""అమ్మా!"" అంటూ పిచ్చికేక వేశాడు. నామీద ఏదో పీడకల వచ్చిందట!""     ""నేను చెప్పలా? వాడు నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళడు.""     ""ఆ మాటే  వాడూ అన్నాడండీ?""     ""ఎప్పుడూ?""     ""నిన్న సాయంకాలమే. నేను బాధపడుతుంటేనూ....""     ""నువ్వు వాడి ముందు బాధపడకు. గుచ్చి గుచ్చి ఏమీ అడగకు ఎప్పటిలాగే ఉండు. రెండురోజుల్లో వాడు మళ్ళీ అన్నీ మర్చిపోతాడు.     అన్నాడే కాని శరత్ ఈ విషయాన్ని అంత త్వరగా మర్చిపోడు. రామనాథానికి అంతరాంతరాల్లో ఎక్కడో భయంగానే వుంది. అంత త్వరగా మర్చిపోవడానికి పసివాడు కాడని తెలుసు. అయినా భార్యకు ధైర్యం చెప్పడానికి అన్నాడు.          ""నాకు ఆఫీసు టైం అయింది.""     ""టిఫెన్ చెయ్యండి"" అంటూ టిఫెన్ ప్లేట్లో పెట్టింది.     ""నువ్వు కూడా తిను.""     ""నేను తర్వాత తింటాను.""     రామనాథం టిఫెన్ చేస్తూ వుంటే సుశీలమ్మ శరత్ చిన్ననాటి విషయాలు చెప్పసాగింది.     రామనాథం శ్రద్ధగా వింటూ టిఫెన్ చేస్తున్నాడు.     రామనాథం భార్యకు దిగులుగా కనిపించవద్దని మరోసారి హెచ్చరించి ఆఫీసుకు వెళ్ళిపోయాడు.     సుశీలమ్మ కూర్చున్న చోటునే దిగాలుపడి కూర్చుండిపోయింది.     భర్త వెళ్ళిపోగానే మళ్ళీ పుట్టెడు దిగులు ఆమె మనసును కుదిపింది.                                                                      9     శరత్ పిచ్చెక్కినట్లు ఊరంతా ఎక్కడెక్కడో తిరిగి అప్రయత్నంగానే అనేక బస్ స్టాపుల్లో నిన్నటి బిచ్చగత్తె కోసం చూచాడు.       ఆమె ఎక్కడా కన్పించలేదు.     తన పిచ్చికి తనే నవ్వుకున్నాడు." 1,"                                                                                        8. దశరథుని మరణము         పశ్చాత్తాపముతో కుమిలిపోవుచున్న నేనప్పుడా ముని వాక్యమును పట్టించుకొనలేదు. అప్పటికింకనూ అవివాహితుడైన నాకు పుత్రులను గురించిన ఆలోచన లేవియూ రాలేదు. అనతి కాలముననే శాపము మాట మరచిపోయినాను.         రథముతో అయోధ్యకు తిరిగి వచ్చిన సుమంత్రుడు కౌసల్య అంతఃపురముననున్న దశరథునితో ""ప్రభూ సీతారామ లక్ష్మణులను 'గంగ యొడ్డు'న దింపి వచ్చినాను. వారీపాటికి నదిని దాటి అరణ్యమున ప్రవేశించి యుందురు"" అని చెప్పి వెడలినాడు. దశరథుడు 'పుత్రకామేష్టి ప్రసాదించిన పుత్రులలో ఇరువురును అడవుల పాలు చేసికొంటినని"" దుఃఖించసాగినాడు. కౌసల్య నిష్ఠురముగ 'కైకకు వశ్యులై మీరు నాకునూ సుమిత్రకును శోకమును కలిగించినారు! ఏడ్వవలసినది మేము. మీకెందులకీ దుఃఖము?"" అన్నది. దశరథుడు దైన్యముతో ""కౌసల్యా, చచ్చిన పామును కొట్టెదవెందులకు? శాపగ్రస్తుడనగు నేనింక బ్రతుకను!"" అన్నాడు. కౌసల్య పశ్చాత్తాప్తయై ""ప్రభూ నన్ను క్షమించుడు. రామునితో ఎడబాటు నా వివేకమును నశింపజేసినది!.....'శాపగ్రస్తుడ'నన్నారేమిటి? ఇదివరకెన్నడునూ చెప్పలేదే"" అని ఆందోళనను వ్యక్తము చేసినది.         ""నేను యువరాజుగా ఉన్నప్పుడు జరిగినదది. నేనా విషయమును మరచియే పోతిని. ఇప్పుడెందు వల్లనో జ్ఞప్తికి వచ్చినది. వినుము: నేనానాడు సరయూనదీ తీరమందలి యడవికి వేట కొరకు పోయినాను. ధనుస్సును పట్టుకొని క్రూరమృగములకై నిరీక్షించుచూ ఒక చెట్టు మాటున నిలిచినాను. సూర్యుడస్తమించి చీకటి వ్యాపించినది కాని జంతువేదియూ అటు రాలేదు. నగరమునకు తిరిగిపోవుద మనుకొనుచుండగా సమీపమందలి సెలయేరు నుండి బుడ బుడయను శబ్దము వినవచ్చినది. జంతువేదియో వచ్చి నీరు త్రాగుచున్నదని తోచినది. శబ్దమును బట్టి జంతువెక్కడనున్నదో ఊహించుకొని దానికి తగులునట్లు బాణమును ప్రయోగించు నేర్పు నాకున్నది. నేను వదలిన వాడియమ్ము అత్యంత రయమున పోయి గుణిని గ్రుచ్చుకొన్నది మరుక్షణము నాకచ్చట నుండి మానవ కంఠమున నొక ఆర్తనాదము వినవచ్చినది: ""అయ్యో! ఎన్నడునూ ఎవ్వరికినీ అపచారము చేయని నన్నీ బాణముతో కొట్టిన క్రూరుడెవడు? అంధులునూ వృద్దులునూ అగు నా తల్లిదండ్రుల దాహమును తీర్చుటకు ఈ జల కలశమును కొనిపోవుటకు ముందే ఇచ్చట మృత్యువువాత పడుచున్నాను"".         ....నేను జరిగిన నా పొరబాటును తెలిసికొని ఆచోటునకు పరుగెత్తి పోయినాను. నా వాడియమ్ము రొమ్మున లోతుగా చొచ్చుకొని పోయి గిలగిల కొట్టుకొనుచున్న ముని కుమారుడొకడు సెలయేటి యొడ్డున కనపడినాడు. అతడు నన్ను చూచుటతోనే ""ఈ శరమును నా వక్షము నుండి పెరికివైచి నా ప్రాణములు త్వరగా పోవుటకు తోడ్పడుము. మరణయాతనను భరించలేకపోవుచున్నాను...సమీపముననే ఉన్న మా పర్ణశాలకు పోయి నా తల్లిదండ్రులకు నా మరణవార్తను తెలియజేయుము"" అని అర్ధించినాడు.         నేనాతడు కోరినట్లు చేసి అతడు అసువులను బాసిన పిమ్మట జలభాండమును తీసికొని కుటీరమునకు పోయినాను. అంధుడగు అతని తండ్రి నా అడుగుల సవ్వడిని విని తన తనయుడే యనుకొని ""నాయనా శ్రవణ కుమారా నీరు దెచ్చెదనని పోయి ఆలసించితివేమి?"" అని అడిగినాడు. నేను దైన్యముతో జరిగినదంతయూ విన్నవించినాను. ఏకైక సుతుని మరణవార్తను విని ఆ దంపతులు గుండెలు పగులునట్లు రోదించినారు. ""ముదిమియందున్నాము; కన్నులు కనపడుటలేదు; ఇంక మాకు దిక్కెవరు? మేమునూ ప్రాణములను విడిచెదము"" అని యేడ్చినారు. ఆ వృద్దుడు క్రుద్ధుడై ""మమ్మీ దుస్థితికి తెచ్చిన నీవునూ పుత్రశోకమున మరణించెదవు గాక!"" అని శపించినాడు.         పశ్చాత్తాపముతో కుమిలిపోవుచున్న నేనప్పుడా ముని వాక్యమును పట్టించుకొనలేదు. అప్పటికింకనూ అవివాహితుడనైన నాకు పుత్రులను గురించిన ఆలోచన లేవియూ రాలేదు. అనతి కాలముననే శాపము మాట మరచిపోయినాను.         ...కైకేయి ఆదేశానుసారము భరత శత్రుఘ్నులు అయోధ్యను చేరుకొనుటకు ఎనిమిది దినములు పట్టునని అనుకొనుచుండగా సుమంత్రుడు వచ్చి రామలక్ష్మణులీపాటికి అరణ్యమును ప్రవేశించి యుందురని చెప్పినాడు. నాకు తటాలున నా నల్వురు కుమారులలో ఎవరునూ నేడు నావద్ద లేడన్న సత్యము గోచరించినది. ఆ క్షణముననే ముని శాపమునూ స్పురించినది. ఇప్పుడు నా శరీరమున అణువణువునూ కంపించుచున్నది! అవయవములు శక్తిని కోల్పోవుచున్నవి! శాపము ప్రకారము నా ప్రాణములు నిష్క్రమించు సమయము సమీపించుచున్నదని తోచుచున్నది!""         కౌసల్యాదేవి ఆందోళనతో లేచి ""నాథా మీకిప్పుడు విశ్రాంతి అవసరము"" అని దశరథుని తల్పము వద్దకు తీసుకొనిపోయి పరుండ బెట్టినది. నిద్రకువశ్యుడైన దశరథుని కన్నులు మూయబడినవి. అవి మరల తెరువబడలేదు. మహారాజు ప్రాణములు సుషుప్తియందే ఎగిరిపోయినవి. తల్పమున తనువు మాత్రమే మిగిలినది.                                                                                          *" 2,"    ""ఎలా వుంది ఫ్రెండ్..... ""     ""టప్ టపా టప్"" దూరంగా ఎక్కణ్నుంచో వస్తున్నట్టూ వుంది ఆ స్వరం. సన్యాల్ సన్నగా నవ్వేడు.     టెలివిజన్ తెరమీద గ్రాఫ్ కనబడ్తుంది. కంప్యూటర్ చేరవలసిన పాయింట్ కన్నా ఎడమవైపుకి వెళుతున్నట్టు గమనించి చూపుడు వేల్తో కొద్దిగా పక్కకి జరిపేడు. అతడు దాన్ని తలలో కొద్దిగా కదుపుతూ వుంటే బయట టెలివిజన్ లో అది కనబడుతూంది.     రెండు నిమిషాల్లో అతను చేరవలసిన స్థానాన్ని చేరుకున్నాడు. గ్రాఫ్ లో వున్న పాయింట్ కి, మెదడులో వున్న కంప్యూటర్ పాయింట్ కి చేరుకోగానే -ఏడు టెలివిజన్ తెరల్లోనూ ఒకే పదం కనిపించింది.     CORRECT     సన్యాల్ సిమెంట్ తో తల రంధ్రాన్ని పూడ్చేసేడు. భూమిలోంచి కొత్తిమీర మొక్కలు పొడుచుకొచ్చినట్లు, రోగి తలలోంచి వైర్లు బయట కొచ్చి వున్నాయి.     సన్యాల్ సంతృప్తిగా నిలబడి ఊపిరి పీల్చుకోవటంతో ఆపరేషన్ స్టేజీ వన్ విజయవంతమైనట్టు పండిత్ గ్రహించేడు. గాఢంగా ఊపిరి వదులుతూ సన్యాల్ గుండె నిమురుకోవడం చూసి, ""ఏమైంది"" అని అడిగేడు పండిత్.     ""సన్నటి నొప్పి -అప్పుడప్పుడొస్తూంది"" నవ్వేడు సన్యాల్.     ఫర్లేదు గుండెకి బదులు బర్చర్ వాల్వ్ పెట్టొచ్చు. రేడియో ధార్మిక శక్తితో అది నడుస్తూంది. అప్పుడు గుండె నిరంతరం కొట్టుకునే అవసరం ఉండదు. ఆ ఎనర్జీ అంతా శరీరానికి మిగిలిపోతుంది. దాంతో మనిషికి విపరీతమైన శక్తి వస్తుంది. గంటకి యాభై మైళ్ళ వేగంతో పరిగెత్త గలిగే శక్తి వస్తుంది. అప్పుడు సిటీబస్ లు అక్కర్లేదు. ఈ లోపులో STAGE 5 COMPUTER system వస్తుంది. అనాసిస్ టాబ్లెట్ పరిమాణంలో మెదడు తయారు చేయబడుతుంది. ఇంగ్లండులో వున్న స్నేహితుడు అతడి మెదడులో ఈ టాబ్లెట్ ని చొప్పించుకుని పరిదోరుజపాటు లండన్ అంతా చూసి, దాన్ని భారతదేశం పంపిస్తే - ఆ టాబ్లెట్ ని ఇక్కడ మన మెదడులో చొప్పించుకుంటే ......పదిరోజుల పాటు లండన్ చూసిన అనుభూతి కల్గుతుంది. అంటే..... భౌతికమైన అనుభవానికీ, మానసిక అనుభూతికీ మధ్య తేడాని కంప్యూటర్ తగ్గించేస్తుంది. మనిషి ఇంట్లో కూర్చుని ఈ భావనా తరంగాల సాయంతో గాలిలో ప్రయాణం చెయ్యవచ్చు. (నారదుడిలా) తెలివైన వాళ్ళ మెదళ్లు తెలివి తక్కువ వాళ్ల మెదడుని ట్యూన్ చేస్తే బార్య హేమమాలినిలా కనబడ్తుంది. ఇంకా ముందుకెళితే - ఇంట్లో కూర్చునే మెదడుని సినిమా హాలుకి పంపిచవచ్చు. స్మశానంలో కూర్చుని ఎక్కడో హాయిగా పని చేసుకుంటున్న వాడిని క్షణాలమీద చంపవచ్చును........     అంతే చేతబడి...     .....................     ......................     ""ఏమిటి ఆలోచిస్తున్నారు""     పండిత్ తడబడి ""ఏం లేదు"" అన్నాడు.     ""ఇంకా చిన్న పని మిగిలివుంది......."" అన్నాడు సన్యాల్. ఔను -మెదడులో అమర్చిన కంప్యూటర్ కు సరిపోయే శక్తినిచ్చే పని ఇంకా మిగిలివుంది. పండిత్ చిన్న పాకెట్ లాటికి డాక్టర్ కి అందించేడు. అందులో ముప్పైఏడు గ్రాముల రేడియో ఆక్టివ్ ఐసోటోపు ప్లూటోనియం -  239 వుంది. పైకి అది మామూలుగా కనబడుతోంది. కానీ, అది బహిర్గతం చేసే వేడితో పదిమందికి సరిపడా వంట చెయ్యవచ్చు.     సన్యాల్ రోగి భుజం దగ్గిర చర్మాన్ని కోసి, ఆ పాకెట్ ని శరీరంలో అమర్చేడు. తల దగ్గిర్నుంచి సన్నటి గీతలా చర్మాన్ని కోసి, వైర్లని భుజం దగ్గిర కలిపేడు.     పండిత్ కి తెలుసు -ఈ రోగి మరణించినపుడు జాగ్రత్తగా ఈ శరీరంలోంచి ఆ రేడియో ఆక్టివ్ పాకెట్ తీసెయ్యాలని..... లేకపోతే రోగి చచ్చిపోయిన తరువాత, ఆ పాకెట్ గానీ విడిపోతే ఆ శవాన్ని పాతిపెట్టిన ధార్మిక శక్తికి స్మశానంలో ప్రవేశించినవాళ్ళు కూడా శవాలుగా మారతారు -రేడియో.     మరో రెండు నిముషాల్లో సన్యాల్ రోగి భుజం దగ్గిర చర్మం కుట్టేశాడు. ఆ తరువాత పెద్ద కంప్యూటర్ దగ్గిరనుంచి రోగి మెదడుకి సూచన్లు యివ్వసాగాడు. ఒకటి రెండు -మూడు-     అలా ఒక్కో సూచనా పంపిస్తూంటే -రోగిలో చలనం లేదు. ఆపరేషన్ ఫెయిలయిందా అని అనుమానపడ్డాడు పండిత్. ముప్పైరెండు ఎలక్ట్రోడ్ నుంచి పంపిన సూచనకి రోగి కొద్దిగా కదిలేడు. సన్యాల్ పెదవులమీద విజయవంతమైన చిరునవ్వు వెలిసింది రోగి చెవి దగ్గరగా వంగి ""నీ పేరు"" అన్నాడు. రోగి పెదవులు అస్పష్టంగా కదిలినయ్ మాటరాలేదు! ముప్పైమూడో ఎలక్ట్రోడ్ ప్రయత్నించి - తిరిగి అడిగాడు ""నీ పేరు""" 3,"    ""అది ఊరుకున్నా  మీరు వుండలేరు. మీరిద్దరే  వుండండి. నేను వెళ్ళిపోతాను"" అని కోపంతో  చేతినున్న  బంగారు గాజులన్నీ  తీసేసి విసిరేశారావిడ.     దీపాలు  పెట్టేవేళ అవుతోంది.     నేను గబగబా  వెళ్ళి ఆ గాజులన్నీ  తీసి ఆవిడ చేతికిచ్చి, ""చూడండీ మరెప్పుడూ  ఇలాంటి పని చెయ్యకండి. నేను కూడా మీ మనసు నొప్పించే పని చెయ్యను. ముందు మీరీ గాజులు  తొడుక్కోండి. ఇప్పుడు  చెపుతున్నాను. నా మాట నమ్మండి. మీరే వచ్చి నన్ను పిలిచేవరకూ మళ్ళీ మీ గుమ్మంలో  అడుగుపెట్టన""ని చెప్పేసి చకచకా  నడుచుకుంటూ  వెళ్ళిపోయాను.                                                *    *    *    *     ఇంటికెళ్ళి  జరిగినదంతా  చెప్పాను.     ""పెళ్ళి విషయం  చెప్పావా?"" అని అడిగారు.     ""మీకు  చెప్పద్దని చెప్పి నేనెలా  చెప్తాననుకున్నారు?"" అన్నాను.     నాకు మాత్రం  మనసు మనసులోలేదు. పరిస్థితులు  చక్కబడి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ  హాయిగా  వుంటామన్న ఆశ లేదనుకుంటూనే నిద్రపోయాను.                                                     *    *    *    *     మర్నాడు ఉదయం ఎనిమిది గంటలు  కూడా కాలేదు. శ్రీశ్రీగారు వచ్చేశారు. నాడు చెప్పలేనంత  ఆనందం, ఆశ్చర్యం కలిగాయి.     ""అదేమిటి? మీరొచ్చేశారు?"" అన్నాను.     ""నువ్వెలాగూ  అక్కడికి రావని నిర్ధారణ అయిపోయింది. అందుకే నేనే వచ్చేశాను"" అన్నారు.     ""ఒంట్లో ఎలా వుంద""ని  మావాళ్ళందరూ  ప్రశ్నించారు.     ""బాగుంది"" అన్నారాయన.     ""ఏవండీ! డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారుగా! మీరిలా  తిరిగితే  ఎలా?"" అని అడిగాను.     ""మరేం ఫరవాలేదు సరోజా! వారం పైగా   అయింది. ఇంట్లోనే  వుండి, నాకూ బోరే"" అన్నారు.     మా అమ్మ కాఫీ ఇచ్చింది.     ""ఇక రెండు పూటలా  నేనే వచ్చి వెళుతూ  వుంటాను"" అనీ, కొంతసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయారు.     అలా మరో పదిరోజులైపోయింది. పెళ్ళివారి దగ్గరి నుండి మాకు కూడా ఉత్తరాలు వస్తున్నాయి. మా ఇంట్లో 'శ్రీశ్రీగారితో  ఈ మాట ఎప్పుడు చెప్తామా?' అని కాచుకు కూర్చున్నారు.     శ్రీశ్రీగారు బాగా  కోలుకున్నారు. కంపెనీలకి  కూడా వెళ్ళి వస్తున్నాం.     ఓ రోజు సాయంకాలం ,అయిదు గంటలప్పుడు  శ్రీశ్రీగారు వచ్చారు. మా నాన్నగారు కూడా ఇంట్లోనే వున్నారు. అందరం కూర్చున్నాం.     ""మా సరోజకి  పెళ్ళి చెయ్యాలనుకుంటున్నామండీ"" అని మా నాన్నగారు శ్రీశ్రీగారితో అన్నారు.     ఆయన సిగరెట్ దమ్ము తీస్తూ  ఏదో ఆలోచనలో వున్నట్టున్నారు. ఈ మాట సరిగ్గా గమనించలేదు.     నేను వెంటనే ""మిమ్మల్నేనండీ! నాన్నగారు ఏదో అంటున్నారు"" అన్నాను.     'ఏమిటి' అన్నట్టు  మా నాన్నగారివైపు  చూశారు.     ""మా సరోజకి  పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాం. సంబంధం కూడా సెటిలయింది"" అన్నారు.     ""సంబంధం సెటిలయిందా? సరోజకి  పెళ్ళి చేస్తారా? అదెలా  చేస్తారండీ"" అన్నారు శ్రీశ్రీగారు.     ""ఎలా చెయ్యడం ఏమిటి? ఆడపిల్లని కన్నాక  ఎప్పుడైనా పెళ్ళి చేసి పంపాల్సిందేగా? తప్పుతుందా?"" అన్నారు  మా నాన్నగారు.     ""మీరు సరోజకి పెళ్ళి చెయ్యడానికి  వీల్లేదండి"" అని శ్రీశ్రీగారన్నారు.     ""మీరన్నది  మరీ బాగుంది. వీల్లేదంటే  ఎలా? అలాగనడంలో  మీ ఉద్దేశం ఏమిట""ని నాన్నగారు  అడిగారు.      ""ఇందులో  ఉద్దేశానికేముంది? సరోజ  నాకు కావాలి. అది లేకుంటే నేను బతకలేను. సరోజ నాది_నా స్వంతం"" అన్నారు శ్రీశ్రీగారు.     ""అంటే  అది లేకుంటే  మీరు..."" అని ఆశ్చర్యంతో ఏదో అడగబోయి ఆగిపోయారు నాన్నగారు.     ""అవును. నేను చచ్చిపోతాను"" అన్నారు శ్రీశ్రీగారు.     ""ఇలాంటి మాటలాడకండి. అనడం తేలికే_ఒకరికోసం ఒకరు చనిపోవడమన్నది అనుకున్నంత, అన్నంత తేలిక కాదు"" అన్నారు మా  నాన్నగారు.     ""మీకు శ్రీశ్రీ సంగతింకా  తెలీదు. నేను  అనుకుంటే  తిరుగులేదు. మీరు సరోజని  ఇంకొకడికిచ్చి  పెళ్ళి చేస్తే నేను సముద్రంలో  పడిపోతాను"" అంటూ చటుక్కున లేచి, సిగరెట్ దమ్ము లాగుతూ, చకచకా  గేటుదాటి వెళ్ళిపోయారు.                                          ఐ లవ్ యూ సరోజా!     ""ఏవండీ_ఏవండీ"" అని  పిలుస్తూ  ఆయనవెంట  పడ్డాను.     వెనక్కి తిరిగి చూడకుండా  వెళ్ళిపోతున్నారు. నేనూ  తొందరగా వెళ్ళి  ""ఎక్కడికండీ వెళుతున్నారు"" అని చటుక్కున  చెయ్యి  పట్టుకుని  ఆపాను.     ఆయన వెళుతున్నది  సముద్రంవైపే! ఆయన కళ్ళు ఎర్రగా  వున్నాయి. ""చెయ్యి వదులు సరోజా!"" అన్నారు.     అంతవరకూ  ఆయన ముఖాన్నే  చూస్తున్న  నేను ఆ మాటలతో  కోలుకొని చెయ్యి వదిలేశాను.     మళ్ళీ ఆయన నడవడం  ప్రారంభించారు. ఆయనతోపాటు  నేనూ నడుస్తున్నానని  చెప్పడం కన్నా, పరుగు పెడుతున్నానంటే  బాగుంటుంది.     ""నీకీ పెళ్ళి  విషయం ముందే తెలుసా?"" అని ప్రశ్నించారు.     ""తెలుసు"" అన్నాను. " 4,"    అయన అలా వెళ్ళిపోగానే గుమ్మం పక్కనుంచి  రాజు బయటకు వస్తూ ""పడ నీళ్ళున్నాయి.... ఈ రోజు వేణ్ణీళ్ళులే.  స్పెషల్..... అంతేకాదు ప్రతిరోజూ లాగా అక్కడ రష్ గా వుండదు. వాళ్ళంతా లేచే సమయానికి నువ్వెళ్ళిపోతావ్ గా"" అన్నాడు. అదే శాడిస్టు నవ్వుతో .         చిరంజీవి మాట్లాడలేదు. అతడి మనసంతా అదోలాటిస్థబ్ధత అపరించి వుంది. ఏదో లోకంలో వున్నట్టు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కొద్దిసేపట్లో, చాలా కొద్దిసేపట్లో  ఒకతాడు తన మెడకి బిగుసుకోబోతున్నదన్న ఆలోచనే నమ్మశక్యం కాకుండావుంది. కానీ అదంతా  మామూలుగా జరిగిపోతూంది.__ ఏడీ ఆగటంలేదు ప్రాణం కూడా అలానే పోతుంది.         నాలుగు గోడలమధ్య__ నెమ్మదిగా నాలుగు చెంబుల నీళ్ళు పోసుకొని,స్నానం అయిందనిపించాడు. జైలు  దుస్తులు కొత్తవి __ తెల్లవి ఉరికి ముందు తోడగబడేవి__ ఇవ్వబడ్డాయి.         వాటిని ధరించాడు.         వేడినీటి తాలూకు ప్రాభవం పోయి, కొద్దిగా చలి పెట్టసాగింది. చుట్టూ ఇద్దరు గార్డులు. అతడి కళ్ళు తడబడ్డాయి.కనీ బహుశా,అది చలివల్ల వచ్చింది అయి వుంటుంది.మెట్లెక్కి వరండా గుండా తన సెల్ కి వచ్చాడు. అక్కడో ఇద్దరు సెంట్రీలున్నారు. అందరూ వొక్కరొక్కరే చాలా నిశ్శబ్దంగా తమ పనులకి తాయారవాటం తెలుస్తూంది.         అతడు  సెల్ వైపుకి రాగానే, అక్కడివాళ్ళు కొద్దిగా దూరంగా వెళ్ళి నిలబడ్డారు.         దైవప్రార్ధనచేసుకోవటం కోసం ఏకాంతం కల్పించబడింది. మోకాళ్ళమీద వంగి కొద్దిసేపు, చాలా కొదిసేపు తన ఇష్టదైవాన్ని పార్ధించాడు. తరువాత కళ్ళు తెరిచాడు. అతడి చూపు కాగితాల మీద పడింది. సర్వోత్తమారావు ఇచ్చిన కాగితాలు అవి. ఉరి రద్దుకోసం ఏర్పాటుచేసిన ఉపన్యాసం కాగితాలు. అనుకున్నది అనుకోన్నట్టూ జరిగితే ఎత్తయిన ఉపన్యాస వేదికమీద చదవవలసినవి!         ప్రార్ధన ముగియగానే, అతను వాటిని చదవటం ప్రారంభించాడు. సర్వోత్తమరావు చేతి వ్రాతతో వున్న వ్యాసం అది.         ""ప్రతీ సహజమైన చావు భయం, కరుణ, బాధ వుంటాయి. రక్షించటానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తూ వుంటారు. బంధువులు ఆశతో ఆవేదనతోఎదురుచూస్తూ వుంటారు. ఎన్నోకన్నీటిచుక్కలు రాలటానికి సిద్ధంగా ఉంటాయి. ముందు కోమా వస్తుంది. ఆ నిద్రలో మరణం నెమ్మదిగా వచ్చి, తనతోపాటుహాయిగా తీసుకుపోతుంది. కానీ ""ఉరి"" వెనుక భయం తప్ప ఇంకేమి లేదు. ఆర్నెల్లముందే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలుస్తుంది. అప్పట్నుంఛీ క్షణం క్షణమూ దిగులే. ఆశ ఉండదు. మన కోసం ఏడ్చే వాళ్ళుండరు. అనారోగ్యం ఉండదు. చాలా స్థబ్దంగా, అమనుషంగా తోటి మనిషి ప్రాణం మేడద్వారా బయటకి లాగి వేయబడుతుంది.         హత్య చేసిన వ్యక్తికీ మరణమే సరి అయిన శిక్ష అన్న భావం మనలోంచి పోవాలి. 1956 లో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం అడిగినప్పుడు చాలా ప్రభుత్వాలు ఉరిని "" ఉంచుకుని"" కోరటం దురదృష్టం. 1972 లో ఎర్పాటయిన""లా కమీషన్ "" కూడా కొన్ని ప్రత్యెక సందర్భాలలో ఉరి అమలు జరపవచ్చునన్నది. అయితే ఏ ఏ  ప్రత్యెక సందర్భాల్లో వివరించలేదు. ఈ కమిటీ అడవాల్లాని కూడా ఉరి తీయవచ్చుని రికమెండు చేసింది.         ఉరిశిక్ష దేశంలో నేరాల్ని తగ్గిస్తుందనీ కానీ, ఉరి తీస్తారుమానాన్న భయంతో మనిషి హత్య చేయటం మానేస్తాడన్న వాదనగానీ నిలబడవు. భారతదేశంలో హత్యలు, సెక్సు సమస్యల వల్లగానీ గ్రామీణ  ప్రాంతాల్లో భూమి, రాజకీయ తగాదాళవల్ల కాని ఎక్కువగా జరుగుతాయి. వీటికీ, ఉరిశిక్షకీఏ సంబంధమూ లేదు.....         చాలామంది జడ్జీలు ఉరిశిక్షకు వ్యతిరేకులు. జస్టిస్ కారేగట్ తన జీవితంలో ఎవరికీ ఉరిశిక్ష విధించని, ప్రకటించాడు.  ప్రభుత్వం అతడిని రాజీనామా చేయమని కోరగానే, మాటమీద నిలబడి ఉద్యోగం వదులుకున్నాడు. ఇలాటి మానవతా వాదులు భారతదేశంలో యెక్కువమందిలేకపోవతండురద్రుష్టకరం. జవహర్ లాల్ నెహ్రూ తాను వ్యక్తిగతంగా ఉరికి వ్యతిరేకినని చెప్పేవారు. శ్రీమతి ఇందిరాగాంధీకూదాయిదే అభిప్రాయం పలుమార్లు వెల్లడించారు.         మన న్యాయశాస్రం  బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకోబడింది. చిత్ర మేమిటంటే ప్రస్తుతం బ్రిటనే ఉరిని రద్దుచేసింది. మనం యింకా దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. పాకిస్తాను లో నేరస్తుణ్ణి ఇప్పటికీ బహిరంగంగా రాళ్ళతోకొట్టి చంపుతారట. ఒకప్పుడు కాళ్ళకి రాయికట్టి నీళ్ళలో పడవేసిచంపటం, గుర్రాలచేత తొక్కించిచంపడం అమల్లులో ఉండేవట. ఇవన్నీ మనకెంత అనాగరికంగా కనబడ్తూన్నాయో , మన 'ఉరి' మిగతా దేశవాసులకు అంత అనాగరికంగా కనబడ్తుంది. ఒక వందేళ్ళు పోయేక మన భావితరం వాళ్ళు మన గురించి కూడా ""వాళ్ళు ఉరి తీసి మనుష్యుల్నిచంపేవారట"" అని చిత్రంగా చెప్పుకుంటారు.         ఎటువంటి నేరస్తుల్ని ఉరికంబానికిపంపాలో మన న్యాయశాస్రం సరిగ్గా చెప్పలేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉరిశిక్ష విధించాలో మన జడ్జీలకుతెలీదు. ఒక నిర్దోషికివేసిన ""ఉరి""  అది అమలు జరిగిన తర్వాత అతడి నిర్దోషిత్వం బయటపడితే, వెనక్కి తీసుకోలేని దారినమైనాశిక్ష. నిర్దోషిత్వం బయటపడింది.         దేశంలో మరణశిక్షని పూర్తిగా రద్దు చేయాలి. దారుణంగా హత్య చేసిన వ్యక్తిని అంతకన్నా దారుణంగా చిత్రహింస పెట్టండి!! మరణించే వరకూ జైల్లో బంధించండి! అంతేకాని మరణశిక్ష విధించకండి.!!         ఉరి అమానుషమైనది!         ఉరి క్రూరమైనది!         మనిషి బ్రతికే హక్కుని సాటిమనిషితీసేయయలేదు!!         ఉరి రద్దు చెయ్యండి! సెక్షన్ 302 మార్చండి!!         అదే మా ""అభిలాష!!""        " 5,"     ""ఎందుకొచ్చావ్ లోపలికి?"" అన్నాడు పరుషంగా.     తాపిగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు తేజస్వి. తన చేతిలో ఉన్న డిస్మిసల్ ఆర్డర్ ని నిర్లక్ష్యంగా టేబుల్ మీద పడేశాడు.     ""వాటిజ్ దిస్!"" అన్నాడు శశికాంత్ కోపంగా.     ""అదే నేను అడుగుతున్నాను. ఏమిటది?"" అన్నాడు తేజస్వి.     ఓరకంటితో ఆ పేపరు వైపు నిర్లక్ష్యంగా చూసి, ""అది నీ డిస్మిసల్ ఆర్డర్! వుద్యోగం ఉడపీకేస్తున్నట్లు ఉత్తర్వు! ఇంగ్లిషు చదవడం రాదా నీకు?"" అన్నాడు శశికాంత్.     ""ఏ కారణం మీద నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారు?""     ""అది అక్కడే రాసి ఉంది. పర్మిషన్ లేకుండా లీవులో వెళ్ళడం!""     ""నేను ఉద్యోగంలో చేరాక ఇన్నేళ్ళ సర్వీసులో ఇదే మొదటిసారి లీవు పెట్టడం!""     ""అయితే! నేను ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో ఇదే మొదటిసారి వ్యభిచరించడం - అని ఏడ్చిన పతివ్రత కధలా ఉంది నువ్వు చెప్పేది.""     ""నాకు కావలసినంత లీవు ఉంది"" అన్నాడు తేజస్వి.     ""కానీ లీవు తీసుకోవడానికి నా పర్మిషన్ లేదు.""     సహనం కోల్పోయి అన్నాడు తేజస్వి-     ""నాలుగు రోజుల క్రితం మనిషిగా చలామణి అయ్యే ఓ రెండు కాళ్ళ మృగం తన భార్యని బలవంతంగా బయటికి గేంటేస్తే ఆ నిస్సహాయురాలి బాగోగులు చూడడానికి నేను ఉండిపోవలసి వచ్చింది.     అది విని భగభగలాడుతూ అన్నాడు శశికాంత్.     ""ఆ రోజు దాన్ని తరిమివేసినట్లే ఇవాళ నిన్ను వెళ్ళగొట్టేస్తాను.""     ""అది మీ తరంకాదు? ఒక పర్మినెంట్ ఉద్యోగిని ఉద్యోగంలో నుంచి తీసెయ్యడమంటే, భార్యని బయటికి గేంటేసినంత తేలిక కాదు. నేను నోరూ వాయీ లేని సౌమ్యని కాను. కిక్కురు మనకుండా వెళ్ళిపోవడానికి.""     ""నేను ఈ కంపెని యజమానిని. నా ఇష్టానుసారం చెయ్యగలను.""     ""యూ ఆర్ మిస్టేకెన్! ఈ కంపెని యజమాని మిసెస్ సౌమ్య.     ""అని దురభిప్రాయపడుతున్నావు నువ్వు.""     ""అంటే! వాట్ డూ యూ మీన్!"" అన్నాడు తేజస్వి అనుమానంగా.     చటుక్కున లేచి నిలబడ్డాడు శశికాంత్!     ""నీతో ఎక్కువ మాటలు అనవసరం! ముందు బయటకు నడు!""     తేజస్వి కూడా లేచి నిలబడ్డాడు.     ""మిస్టర్ శశికాంత్! ఈ విషయం ఇక్కడితో ఆగదు. చాలా దూరం పోతుంది. ప్లీజ్ టేక్ దిస్ యాజ్ ఏ ఫ్రెండ్లి వార్నింగ్!     షటప్ అండ్ గెట్ అవుట్!'     పెద్ద పెద్ద అంగలు వేస్తూ బయటకు నడిచాడు తేజస్వి.     కోపాన్ని ఆపుకోలేక, పళ్ళు కొరుకుతూ అటూ ఇటూ పచార్లు చెయ్యడం మొదలెట్టాడు శశికాంత్.     కానీ పావుగంట గడవకముందే,     తేజస్వి ఇచ్చిన వార్నింగ్ తాలూకు ఎఫెక్టు కనబడటం మొదలెట్టింది శశికాంత్ కి.     తేజస్వి శశికాంత్ చాంబర్ లో నుంచి బయటికి రాగానే, అతన్ని చుట్టుముట్టారు కొలీగ్స్.     ""వాట్ బాస్! వాట్ హపెండ్?"" అన్నాడు సిసిల్ ఆదుర్దాగా.     జరిగినదంతా చెప్పాడు తేజస్వి.     ""ఎంత తల పొగరు వీడికి! యూనియన్ లీడరువి, నిన్నే డిస్మిస్ చేస్తానంటాడా? నువ్వు వెళ్ళిపోతే మేం మాత్రం ఇక్కడ ఉంటామా ఏమిటి? అని పేపరు ఒకటి తీసుకుని, బాల్ పాయింట్ పెన్నుతో చకచక రాస్తూ, తన రాజీనామా పత్రం తయారుచేశాడు సిసిల్.     ఆ తరువాత, అలా చెయ్యమని ఎవరూ ఆదేశించకుండానే, అక్కడా వున్న ఉద్యోగులందరూ, చివరికి శశికాంత్ పర్సనల్ కారు డ్రయివర్ , గేట్ కీపర్ , ఆఫీసు బాయ్స్ సహా అందరూ - తమ ఉద్యోగాలకు రాజీనామా ఇస్తూ లెటర్స్ తయారుచేశారు.     తన సహచరులతో తేజస్వికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది!     ఆ లెటర్స్ అన్నిటిని కట్టగా పట్టుకెళ్ళి శశికాంత్ టేబుల్ మీద గిరవాటు వేసి వచ్చాడు సిసిల్. ఈలోగా రెచ్చిపోయిన ఉద్యోగులు కొందరు కిటికీల అద్దాలు బద్దలుకొట్టారు. పైళ్ళు ఆఫీసు పేపర్సు, చిందరవందర చేసి పారేశారు. గందరగోళం చోటు చేసుకుంది అక్కడ.     అతి కష్టం మీద వాళ్ళని శాంతపరచగలిగాడు తేజస్వి.       తరువాత అందరూ కలిసి, తేజస్విని భుజాల మీద మోసుకుంటూ , గేటు దాకా వచ్చి, అక్కడ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు.     అదే సమయానికి ఉజ్వల కారు అక్కడికి వచ్చింది. గేటుకి అడ్డంగా ఉన్న మనుషులని చూసి, అసహనంగా హారన్ మోగించింది ఉజ్వల. దానితో రెచ్చిపోయి, వాళ్ళు ఆమె కారు లోపలికి వెళ్ళకుండా చుట్టుముట్టేశారు.     తేజస్వి గనక కలగ జేసుకోకపోయి ఉంటె అక్కడ రక్తపాతం జరిగి వుండేదే. కానీ వాళ్ళని అదుపులో పెట్టగాలిగాడు తేజస్వి. హింసకు తావు ఉండకూడదని శాంతంగానే పనులు సాధించుకోవాలని వాళ్ళకు హితభోద చేశాడు.     ఉజ్వల కారుని లోపలికి వెళ్ళనిచ్చారు ఎంప్లాయిస్. శశికాంత్ చాంబర్ లోనికి నడిచింది ఉజ్వల. ఆగ్రహంతో దహించుకుపోతున్న శశికాంత్ ని చూసి అంది.     ""ఏమయింది శశీ?""     కోపాన్ని కంట్రోలు చేసుకోలేక వణుకుతూ చెప్పాడు శశికాంత్.     ""బాస్టర్డ్ ని ఉద్యోగంలో నుంచి పీకేయ్యడం చాలా సులభమనుకున్నాను. కానీ అనుకోకుండా పెద్ద ప్లేరప్ అయిపొయింది కేసు! కుందేళ్ళకి కొమ్ములోచ్చాయి కుమ్మడానికి చూస్తున్నారు"" వద్దనుకున్నా అతని గొంతులో కంగారు ధ్వనిస్తోంది.     ""ఉజ్వలా! ఏం చేయ్యబోతున్నావ్?""     ""చేసేది చెప్పను! చెప్పేది చెయ్యను!"" అంది ఉజ్వల పరిహాసంగా.                                                            * * *     ఆరోజు ఆఫీసులో జరిగిన గొడవ సౌమ్యతో చెప్పలేదు తేజస్వి.     అతను ఇంటికి వెళ్ళేసరికి సింపుల్ గా వంటచేసి ఉంచింది సౌమ్య. అతను రాగానే కాఫీ పెట్టి ఇచ్చింది.     మరో గంట తరువాత భోజనం చేస్తూ అన్నాడు తేజస్వి.      ""రేపు మనం పిక్నిక్ కి వెళుతున్నాం.""     అది వినగానే ఎగిరి గంతేసినంత పనిచేశాడు చిన్నీ.     ""నిజంగానా? అయితే జూకి వెళదాం!""     ""జూకే వెళుతున్నాం. అక్కడ నీలాంటి కోతి కూడా ఉంది. "" అన్నాడు తేజస్వి." 6,"         నీకు మాటిచ్చాను. ఆమాట కోసం నా ఉద్యోగమే కాదు. ప్రాణం పోయినా లక్ష్యపెట్టను. ఆ నరేంద్ర సంగతి నేను చూసుకొంటాను, భయపడకు, భీముడు, కీచకుడ్ని చంపినట్లు చంపేస్తాను. వాడ్ని , సరేనా!     ""ఒద్దు. అలాంటి పని చేసి నువ్వు వాకు దూరం కాకూడదు. నేను బతికినంతకాలం నీ స్నేహం నాకు కావాలి విజయ్"" అంది నాగమణి.     అమె మాటల్లో స్ధిరత్వం.......     అమె కళ్ళల్లో కురుస్తున్న కన్నీటిని చూసి చలించిపోయాడు విజయ్.     నరేంద్రని అప్పటికప్పుడు చీల్చి చెండాడాలనుంది.     అమె మాటల్ని అతను విశ్వసించాడు.     ""నేను నీకు నిజమే చెప్పాను"" అంది.     ""నాకు తెలుసు!""     ""నువ్వు నమ్మితే చాలు!"" అంది హాండ్ కర్చీప్ తో కళ్ళు తుడుచుకొంటూ నాగమణి.     ""మా వారు చాలా దుర్మార్గుడు విజయ్. మనిషిని ఎలాంటి హింస పెట్టడానికి వెనుకాడడు. డబ్బుతో తను చేసిన పాపాలని కప్పెట్టేస్తాడు. ఈ మద్య లాయర్ని పిలిచి వీలునామా రాయించడానికి ప్రయత్నిస్తున్నారు"".     ""వీలునామా దేనికి? వుంది నీవేగా!""     "" నేను మంచిదాన్ని కాదని, నన్ను వదిలించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. నేను జి.కె.ని పెళ్ళిచేసుకొంది డబ్బుకోసమే!""      అతను ఆశ్చర్యంగా చూశాడు.     ""ఆ డబ్బుతో నేను కొండెక్కి కూర్చోవాలని కాదు. అది బ్యాంకుల్లో ఇనప్పెట్టెల్లో మూలగకుండా సద్వినియోగం చేయాలని కోరిక. నాలాంటి పేదవాళ్ళని అదుకోవాలన్న తపన""     ""ఆయన ఇండ్రస్ట్రీయలిస్టు కదా!""     "" అలాని డబ్బంతా పెట్టుబడి పెట్టడు ఏ పారిశ్రామికవేత్త కూడా!""     ""అది నిజమే!""     "" ఏం చేయాలో నేను ఆలోచించి చెప్తాను. ఇప్పటికే అలస్యం అయింది. పద!""     "" నిన్ను డ్రాప్ చేసి వెళతాను!"" అంది.     అమెతోపాటు కారు దగ్గరికి నడిచాడు విజయ్.     అమె కారు స్టార్ట్ చేసింది. అతను అమె పక్కనే కూర్చున్నాడు.     ""ఎక్కడ దింపాలి?"" అడిగింది నాగమణి.     ""దారిలో వదిలేస్తావా?"" అడిగాడు నవ్వుతూ.     ""మరి?""     "" మీ ఇంటికి తీసుకెళ్ళవచ్చుగా"" నవ్వుతున్నాడు విజయ్.     ""చాల్లే!"" నాకిప్పుడే విడాకులు ఇప్పించేలా వున్నావు!"" అంది.     అతను సీటుమీదుగా అమె భుజంపైన చేయి వేశాడు.     ""భుజంమీద చేయ్యి వేస్తేనే, స్నేహితుడనుకోనవసరం లేదు."" చిరుకోపంతో అంది నాగమణి.     ""కిరణ్ వేస్తే లేని అభ్యంతరం నేను వేస్తే వుందా?"" అన్నాడు విజయ్ నవ్వుతూ.     చురుగ్గా చూసింది కారు గభాల్న అపేసింది.     ""ప్లీజ్ , కారు దిగు"" అంది కోపంతో నాగమణి.      అమె ముక్కుపుటాలు ఎగిరిపడుతున్నాయి.     ""నేను దిగను"" మొండిగా అన్నాడు.     అమె అయోమయంగా చూసింది.     అతను నవ్వుతున్నాడు.     ""నువ్వు కోపంలో ఎంత అందంగా వున్నావో తెలుసా?"" అన్నాడు విజయ్. వెనక్కి తల తిప్పి రోడ్డు కేసి చూస్తూ." 7,"ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి, అతని భార్య చతుర, కొడుకు మదన్, కూతురు కామిని, అల్లుడు, కోడలు, మిగతా కుటుంబ సభ్యులు, అతని బంధుమిత్ర పరివారం, అధికారులు, సేవకులు, ప్రొఫెసర్ అన్ వేషి. అందరూ ఆ స్పేస్ షిప్ లో ప్రత్యక్షం అయ్యారు. నిజానికి ఆ స్పేస్ షిప్ లో అంతమంది పట్టరు. కానీ మనం ముందే చెప్పుకున్నాం. ఆ అంతరిక్ష నౌక ఒక బతికివున్న యంత్రం. ఇరవయ్యో శతాబ్దపు మనిషి మస్తిష్కానికి అందని యంత్రం అది. నిజానికి ఆ అంతరిక్ష నౌక కనుక ఒరిజినల్ సైజులోనే వుండి వుంటే అంతమంది మనుషులు అందులో పట్టేవాళ్ళు కాదు. కానీ - ఎంతమంది ఎక్కినా కూడా ఇంకా ఒకళ్ళకి స్థలం వుంటూనే వుంటుంది అందులో! పుష్పక విమానంలాగా! తను ఎక్కడ వున్నాడో అర్థంకాలేదు సర్వాధికారికి. అయోమయంగా చుట్టూ చూశాడు. తన కుటుంబ సభ్యులూ, తనకి కావాల్సినవాళ్ళూ తన పక్కనే వుండడం చూసి అతని మనసు కాస్త కుదుటపడింది. ఏ నాయకుడికి అయినా అంతే కదా! తనూ తన కుటుంబం క్షేమంగా వుండాలి. చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష. తనూ తనవాళ్ళు బాగున్నంతవరకూ లోకమంతా ఏమైపోతేనేమి? బ్రహ్మప్రళయం వస్తేనేమి? అదే క్షణంలో - సైంటిస్టు అన్ వేషీ కనబడ్డాడు సర్వాధికారికి. ""అన్ వేషీ"" అన్నాడు ఎగ్జయిటెడ్ గా. స్టన్ అయిపోయి వున్నట్టు కనబడుతున్నాడు అన్ వేషి. ""అన్ వేషీ! చెప్పు! ఏం జరిగింది? ఏం జరగబోతోంది?"" అన్నాడు సర్వాధికారి. పాలిపోయిన మొహంతో వున్న అన్ వేషీ పెదిమలు తడి చేసుకుంటూ అతికష్టం మీద గొంతు పెగల్చుకుని అన్నాడు. ""సర్వాధికారీ! ఏం జరుగుతోందో నాకూ అర్థం కావడంలేదు."" ""ఇదేదో రాక్షసమాయలాగా వుంది"" అన్నాడు సర్వాధికారి భయంగా. అన్ వేషి అన్నాడు ""లుక్! బడ్డీ! నాకు దేవుడూ, దయ్యాలు అంటే నమ్మకం లేదు. కానీ హిందూ పురాణాలలోని...ఒక్క హిందూ పురాణాలేమిటి...ఎన్నెన్నో మతాల తాలూకు పురాణ గాథల్లో వున్న దేవుళ్ళనీ, దేవతలనీ గురించి ఎంతో చదివాను నేను. దేవతలంటే ఎవరో కాదు. ఇంకేదో గ్రహంనుంచి వచ్చిన అంతరిక్ష యాత్రికులయి వుంటారని ఎరిక్ వాన్ డైనికన్ లాంటివాళ్లు ప్రతిపాదించిన సిద్ధాంతాలు నాకు తెలుసు! అయితే ఆ సిద్ధాంతాలని పూర్తిగా నమ్మలేం. అలాగని పూర్తిగా కొట్టిపారెయ్యలేం కూడా! సర్వాధికారీ! జరిగినవీ, జరుగుతున్నవీ, జరగబోయేవీ అన్నీ సైన్సు పరిధికిందే వస్తాయి. అయితే ఆ సైన్సు మనకి ప్రస్తుతం తెలిసిన సైన్సా, రేపు తెలియబోయే సైన్సా అన్నది వేరే సంగతి! సర్వాధికారీ! మొత్తానికి ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను"" అన్నాడు అన్ వేషి. షాక్ లో వున్నట్లు ఏదో ధోరణిలో మాట్లాడేస్తున్నాడు అన్ వేషి. ""ఏమిటి నువ్వు అంత ఖచ్చితంగా చెప్పగలిగినది?"" ""ఇదంతా చేస్తున్నది ఎవరోగానీ వాళ్ళది మనకంటే కొన్నివేల రెట్లు సుపీరియర్ టెక్నాలజీ"" అన్నాడు అన్ వేషి. ""ఏడ్చి మొత్తుకున్నట్లే ఉంది! ఆ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సైంటిస్టు కావాలా?"" అన్నాడు సర్వాధికారి వ్యంగ్యంగా.                                                 *    *    *    *అదే క్షణంలో భూమిమీద- కేపిటల్ సిటీలో- హఠాత్తుగా 'ప్రత్యక్షం' అయ్యాడు సాహస్. సాహస్ కాదు - సాహస్ రూపంలో వున్న కెప్టెన్. ""హలో ప్రగతీ!"" అన్నాడు చిరునవ్వుతో. సాహస గొంతు వినబడగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది ప్రగతి. వెంటనే ఆమె కళ్ళు ఆశ్చర్యంగా విప్పారాయి. ""సాహస్! నువ్వా? ఇక్కడా?"" అంది సంభ్రమంగా. ""అవును! నేనే!"" అన్నాడు సాహస్ రూపంలో వున్న స్పేస్ షిప్ కెప్టెన్. అతని అసలు పేరు టూటూ. ఒక్క అంగలో అతన్ని చేరుకుంది ప్రగతి. ""టెలిపతీ ద్వారా భావాలు తెలుసుకోవడం, రూపాన్ని చూడగలగడం సాధ్యం అన్నావ్! మరి ఇప్పుడు మనిషే ఎదురుగా వున్నాడంటే...ఇదేం ప్రక్రియ?"" అంది ఆనందాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ." 8,"     ""నేనంతకాలం ఇల్లు పట్టకుండా తిరిగినా, బాధ్యత లేకుండా ప్రవర్తించినా ఎందుకు ప్రేమతో ఆదరించింది?""     ""కొడుకువి కాబట్టి...""     ""చివరి ప్రశ్న - స్వామికీ మీకూ ఏమిటి సంబంధం?""     ""ఆయన నా గాడ్ ఫాదర్. నేను బికారిగా వున్న రోజుల్లో నా తెలివితేటలు గుర్తించిన మొదటి వ్యక్తి. పరమపద సోపానంలో నన్ను పై అంతస్థుకి తీసుకువెళ్ళాడు. చట్టంతో తనకి నేను కల్పిస్తూన్న రక్షణకి ప్రతిగా సమాజంలో నాకు స్థానం కల్గించాడు. ఒక స్వంత తమ్ముడిలా నన్ను చూసుకుంటూ వచ్చాడు.""     ""కానీ నీలాంటి స్వంత తమ్ముడే ఒకడు అక్కడ ఆస్పత్రిలో తన రహస్యాలు బయట పెడతాడేమో అన్న అనుమానం రాగానే, మరో తమ్ముడిచేత అతడిని చంపించడం ఎలా- అని ఆలోచిస్తున్నాడు.... చూశావా నాన్నా మన ఇంటికీ ఆ ఇంటికీ వున్న తేడా! ఈ యిల్లు ప్రేమా ఆప్యాయతలు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు. ఆ ఇల్లు ఏ క్షణం కూలిపోతుందో తెలియని లక్క ఇల్లు. ఇక్కడ బంధాలకు పునాది ప్రేమ. అక్కడ మీ మధ్య బంధాలకి పునాది డబ్బు. ఇక్కడ తప్పుచేస్తే ప్రేమగా తిడతాం. అక్కడ తప్పుచేస్తే అడ్డు తొలగిస్తారు. ఈ ప్రేమ, మమత, ఆప్యాయత మనిషికి నైతిక ధర్మాన్ని, కట్టుబాట్లని బోధిస్తూ వుంటాయి. అవే లేకపోతే ఈ పాటికి ప్రతివాడూ ఒక తుపాకో, కత్తో తీసుకుని డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకునేవాడు.""      ""భేష్"" వెనుక నుంచి వినిపించింది. స్వామి చప్పట్లు కొడుతూ మరోసారి ""భేష్"" అన్నాడు. అతడు తమ ఇంట్లో వున్నాడని వూహించని విహారి క్షణం బిత్తరపోయినా, వెంటనే తేరుకున్నాడు. అతడి కోపం ద్విగుణీకృతమైంది. ఈ లోపులో స్వామి అన్నాడు.     ""పరమేశ్వరం! ఇన్ని తెలివితేటలున్న కొడుకుని కన్నందుకు చాలా సంతోషంగా వుంది. పోతే మీ వాడు ఇంకా చిన్నపిల్లాడిలా, చిన్న మెదడుతో, యువరక్తపు ఆవేశంతో ఆలోచిస్తున్నాడు. కొంచెం పాఠాలు చెప్పాలి"" అని విహారివైపు తిరిగి, ""నువ్వు నాది లక్క యిల్లు అన్నావు కదూ... చాలా అజ్ఞానంతో కూడుకున్న మాట అది. నాది నాలుగు స్థంభాల మీద నిర్మింపబడిన పటిష్టమైన భవనం... ఈ దేశపు రాజ్యంగమంత పటిష్టమైన భవనం అది.""     ""ఎంత గట్టి భవనమైనా, తెలివితేటలనే గునపంతో తవ్వి, పట్టుదల అనే డైనమేట్ తో పేలిస్తే కూలిపోక తప్పదు.""     ""అదే జరిగిన మరుక్షణం నీ తల్లి నుదుటున కొత్తగా చేరిన బొట్టు చెరిగిపోతుంది. పట్టుచీరలా చుట్టుకున్న ఆనందం తొలగిపోయి వైధవ్యం మళ్ళీ మిగులుతుంది"" అంటూ నవ్వేడు. ""నువ్వు నీ ప్రయత్నాలు ప్రారంభించిన రోజున- అలా తెలిసిన మరుక్షణం నీ తల్లికి తన భర్త ఎటువంటివాడో తెలుస్తుంది. ఏం చేస్తుంది ఆవిడ? న్యాయం కోసం, ధర్మం కోసం భర్తని వదిలేస్తుందా? కొడుకు పక్షాన నిలబడుతుందా? అసలావిడ గుండె ఆ షాక్ కి తట్టుకోగలుగుతుందా? అయినా భర్త పోవడం వేరు. భర్త వదిలేయడం వేరు. సమాజంలో నీ తల్లి స్థానం దిగజారిపోతుంది కలిసి నెలరోజులయినా కాకముందే భర్త ఎందుకు వదిలేశాడో అని అందరూ చెవులు కొరుక్కుంటారు. చూశావా విహారీ నిన్నెంత ఇరుకున పెట్టానో.... నన్ను లోయలోకి తోసినందుకు ఇదీ ప్రతిఫలం. ఇకనుంచీ అనుక్షణం నిన్ను నరకయాతన పెడతాడు నీ తండ్రి. ఇదంతా భరించలేక ఏ క్షణమైతే నువ్వు నీ తండ్రిమీద తిరగబడి విజయం సాదిస్తావో, ఆ క్షణం నీ తల్లి విధవరాలవుతుంది. నీ తల్లి బొట్టుని నువ్వే చెరిపేసినవాడివి అవుతావు. భర్త చిన్నప్పుడే పోవడం వేరు. పోయాడనుకున్న భర్త తిరిగి దొరికాక నిజంగా ఇంకొకసారి పోవడం వేరు. చెప్పు... ఆవిడని నీ చేతుల్తో విధవరాల్ని చేస్తావా? ఏ పురాణాల్లోనూ, ఏ శాస్త్రాల్లోనూ ఏ తల్లికీ ఏ కొడుకూ యివ్వని ""బొట్టు చెరపడం"" అనే బహుమతిని నువ్విస్తావా?""     ""అనంతానంతస్వామి అని పేరు పెట్టుకున్నందుకు శాస్త్రాల్నీ పురాణాల్నీ బాగా విశదీకరించావు. నేను చెప్పేది కూడా విను. ణా తండ్రిని నీ భవంతి పై అంతస్తులో బంధించావు. కాళ్ళను 'హోదా' అనే అడ్రసులోనూ, చేతుల్ని 'డబ్బు' అనే సంకెళ్ళలోనూ బిగించావు. ణా తండ్రిని ఆ శృంఖలాల్నుంచి తప్పించి, ఆ అంతస్థులన్నీ దింపి, ఒక మామూలు మనిషిగా ణా తల్లికి అప్పగిస్తాను. ఏ పురాణాల్లోనూ, ఏ శాస్త్రాల్లోనూ ఏ కొడుకూ ఏ తల్లికీ ఇవ్వని 'భర్త' అనే బహుమతి నేనిస్తాను...""     స్వామి బిగ్గరగా నవ్వాడు. ""విహారీ...! నా నాలుగో స్థంభం ఏదో ప్రవల్లికకి మాత్రమే చెప్పాను. ఇప్పుడు నీకూ చెప్తాను విను. నా నాలుగో స్థంభం నువ్వు.""     ""నేనా?""     ""అవును- నీలాంటి సామాన్యుడు. తన వీపుమీద మమ్మల్ని పెట్టుకుని మోస్తున్నాడు. మా తెలివికి లొంగిపోయి పన్నుల రూపంలో డబ్బులు ఇస్తూ మా సౌభాగ్యానికి సోపానాలు కడుతూన్న అమాయకుడు. మా రాజకీయానికి పొంగిపోయి, అదే స్వర్గమనుకుని ఓట్లు వేస్తూ మాకు అధికారం కట్టబెడుతున్న దౌర్భాగ్యుడు. మేము చేస్తున్నదంతా న్యాయం అని నమ్మినవాడు. వాడు పిరికివాడు, వాడు అజ్ఞాని, వాడు భయస్తుడు. అలాంటి ఆలోచనా రహితుల నుంచి విడివడి కావాలంటే నువ్వూ రా. ఈ భవంతిలో కావలసినన్ని సుఖాలున్నాయి. కోరినంత డబ్బు వుంది.""     ""మనిషికి డబ్బొక్కటే కాదు. చాలా కావాలి.""     ""ఆ చాలా కావాలంటే డబ్బు కావాలి.""     ""ఆ డబ్బుతో పాటు నైతిక విలువలు కూడా కావాలి.""     ""తాతలు సంపాదించిన ఆస్థి ఖర్చు పెడుతూ రోడ్డుమీద డాన్సులు, స్టేజీమీద నాటకాలు ఆడేవాడివి నువ్వు మాట్లాడుతున్నావా 'విలువల' గురించి... తప్పో ఒప్పో... ప్రాణాలు పణంగా పెట్టి మేం కష్టపడతాం- కష్టానికి ఫలితం అనుభవిస్తాం.... అంతేకానీ తిని కూర్చుని కబుర్లు చెప్పం...""     విహారి తెల్లబోయాడు. స్వామి మాటలు బాణాల్లా గుండెల్లో తగిలాయి. ఇంతవరకూ తనీ కోణంలో ఆలోచించలేదు. డ్రింకు కలుపుతూ విప్లవం గురించి మాట్లాడేవారికన్నా హీనుడతను. అది తట్టలేదు.     ""విహారీ! నువ్వు అసలు విషయం మర్చిపోతున్నట్టున్నావు. వర్ధని ఆస్థికి ""కొడుగ్గా"" నీ కన్నా- ""భర్త""గా నేను మొదటి హక్కుదారుడ్ని! నువ్వు నాకు ఏమాత్రం వ్యతిరేకంగా పనిచేసినా ఈ ఆస్థిలో ఒక్కపైసా అయినా ఖర్చుపెట్టే హక్కు నీకుండదు.""     విహారి వినడంలేదు. అతడు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. పరమేశ్వరం చెప్పదల్చుకున్నది అర్ధమైంది.     అతడు తన తండ్రివైపూ, స్వామివైపూ చూసి స్థిరంగా అన్నాడు ""నేనీక్షణమే ఇంటినుంచి వెళ్ళిపోతున్నాను.""     అతడి గొంతులో ఒక నిశ్చయం తొంగిచూసింది.     ""కోట లోపలుండి తిరగబడితే నమ్మకద్రోహం అవుతుంది. కోట బయట నుంచి తిరగబడితే అది యుద్ధం అవుతుంది. మీరన్నట్టు నేను చాలా సామాన్యుడిని, ఈ దేశపు శక్తివంతమైన దుర్మార్గుడిని ఎదుర్కొనే శక్తి కేవలం సామాన్యుడికే వుంది తప్ప మరే అధికార్లకీ.... బ్యూరోక్రాట్లకీ లేదు.""     వెళ్ళబోతూ ఆగి అతనన్నాడు- ""చూశావా స్వామీ... నాలుగు స్థంభాల పటిష్టమైన భవంతి అన్నావు. స్వార్ధాన్ని, భద్రతపట్ల భయాన్నీ ,సుఖాన్నీ వదులుకుని సామాన్యుడు తిరగబడితే, ఎంత సులభంగా నీ మొదటి స్థంభం కూలిపోయిందో చూడు. యిక మూడు స్థంభాలే వున్నాయి. నీ ""బలాన్నీ"", ""రాజకీయాన్నీ"" పడగొట్టి, ""తెలివిని"" నా తల్లికి బహుమతిగా ఎలా అర్పిస్తానో చూస్తూ వుండు- నీకే తెలుస్తుంది.""                                16     ""గోల్డెన్ ఐలెండ్"" లో స్వామి తాలూకూ స్వంత హెలికాఫ్టర్ దిగింది. హెలిపాడ్ నుంచి కారు వరకూ ఎర్ర తివాచీ, చుట్టూ పూలమొక్కలు, క్రమశిక్షణతో నిష్ణాతులయిన సైనికులు వందనం చేస్తుండగా స్వామి దిగి కారులో ఎక్కి కూర్చున్నాడు.     రోడ్డు కిరువైపులా కొబ్బతిచెట్లు, మధ్యలో చక్కటిదారి. దాదాపు పదినిమిషాలు ప్రయాణం చేసిన తరువాత అతడికారు పెద్ద కాంపౌండ్ లో ప్రవేశించింది. చుట్టూ బార్బ్ డ్ వైరు ఫెన్సింగ్- గార్డులు, సుశిక్షితమైన ఆల్సేషన్ కుక్కలు- అదో కొత్తరకం ప్రపంచంలా వుంది.     అశేషమైన ప్రజల అజ్ఞానాన్ని ధనంగా మర్చి కట్టినట్టు- ఆ దీవి మధ్యలో విశాలమైన భవంతి- ఎత్తయిన చెట్లు- మొత్తం పాలరాయి.     స్వామి ఠీవిగా ఎక్కుతూ వుంటే- బారులు తీర్చిన సైనికులు సెల్యూట్ చేశారు.     అతడు దీవికి చేరుకున్న గంటలోపులో మరో రెండు హెలికాప్టర్లు, మూడు ఫ్రెండ్స్ ఫోకర్స్ వచ్చి దిగాయి. మొరాకో, ఈక్విడార్ మొదలైన దేశాల్నుంచీ, కేప్ టౌన్, ప్రిటోరియా, బ్లూమ్ ఫీల్డు మొదలయిన నగరాల్నుంచీ ప్రతినిధులు వచ్చారు. భారతదేశపు పక్క శత్రుదేశాలు, ఒక అగ్రరాజ్యపు రహస్య ప్రతినిధుల సంగతి సరేసరి. దక్షిణాఫ్రికా సంగతి తెలియనిదేముంది? రెండు కోట్లకు పైగా జనసంఖ్య వున్న దేశంలో కేవలం 37 లక్షల మందికే ఓటుహక్కు వున్న దౌర్భాగ్యదేశం. అటువంటి దేశ ప్రతినిధులు స్వామిలాటివారికి సాయపడడంలో విచిత్రం లేదు. ఆసియా ఖండంలో భారతదేశపు ప్రాబల్యం తగ్గిస్తే కొన్ని దేశాలకు మంచిది. వారూ పాల్గొన్నారు.     కొంతమంది స్వార్ధపూరిత వ్యక్తులు, తమ లాభం కోసం పన్నే ""వ్యూహా""నికి మరోపేరు ""రాజనీతి!!"" ఫిలిఫ్ఫైన్స్ లో అయినా, ఫీజీ ద్వీపంలో అయినా, దక్షిణాఫ్రికాలో అయినా వీరు ఉపయోగించేది ఆ పేరే. మొట్టమొదటిసారి భారతదేశంలో ఆ రకమైన తిరుగుబాటు జరగడానికి పునాదులు తవ్వబడుతున్నాయి.     స్వామి అండతో కేంద్ర మంత్రివర్గంలో నెంబర్ టూ అయిన సూర్యారావు చాపక్రింద నీరులా విజృంభిస్తున్నాడు. ఇప్పటికే రకరకాల ""తలనొప్పు""లతో సతమతమౌతూన్న ప్రధానమంత్రి ,అతడిని తొలగిస్తే ఏ పరిణామాలు సంభవిస్తాయా అన్న సందిగ్ధంలో ఉన్నారు. సూర్యారావు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో ఇంకా పూర్తిగా బయటపడలేదు. దేశంలో స్వామికి కావలసిన పరిస్థితులు క్రమంగా అలుముకుంటున్న సమయంలో-     ఇక్కడ దీనిలో.... ఆ హాలులో సమావేశం మొదలైంది.     అదేమీ రహస్య సమావేశం కాదు. రోమన్ సాంప్రదాయపు పద్ధతిలో అందమైన ఆడవాళ్ళు వైన్ నింపుతున్నారు. ఒక మూల ఒక స్త్రీ తీగెలతో చేయబడిన సంగాతి (సితారు లాంటి వాద్య విశేషం) వాయిస్తున్నది. కొందరు పరిచారికలు తినుబండారాలు సర్దుతున్నారు. అతిధుల మాటలన్నీ వింటున్నారు.     అదే అనుమానం ఎవరికో వచ్చినట్టుంది. ""మనం ఏదైనా మందిరం లోపల కూర్చుంటే బావుంటుందేమో"" అని అడిగాడు.     స్వామి నవ్వేడు. ""ఈ దీవే ఒక మందిరం. ఇక్కడ పురుగుకూడా అనుమతి లేకుండా బయటకు పోలేదు.""     నిజమే అయివుండవచ్చు. మామూలుగా అయితే ఇటువంటి మీటింగ్స్ అండర్ గ్రౌండ్స్ లోనో, చీకటి కప్పిన గదుల్లోనో జరగాలి. ఏది ఏమైనా అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా వుంది. చెట్ల నీడలు అద్దాల అవతల్నుంచి అందంగా కదుల్తున్నాయి. షాండ్లీయర్ల కాంతి కెరటాలు ఆ హాల్లో పరుచుకుంటూంది. బాలీసులు కాసుకుని కూర్చుని వున్నారు వాళ్ళు. అగరొత్తు పరిమళం ఆ హాలంతా పరుచుకుని వుంది. ఆ వాతావరణంలో వాళ్ళ భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చించసాగారు.     జపాన్ నుంచి వచ్చే షిప్ లో మారణాయుధాలు ఎలా మార్పిడి జరగాలి. దేశంలోకి అవి ఎలా సరఫరా జరగాలి. ఈపాటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో సర్దుకున్న సుశిక్షితులైన సైనికులు వివిధ పుణ్యక్షేత్రాలలో ఎలా అలజడి సృష్టించి, హిందూ దేశపు మెజారిటీ మతస్తులని ఎలా రెచ్చగొట్టాలి. ఎన్ని రోజుల తరువాత ప్రధానమంత్రి మీద సూర్యారావు తిరగబడాలి. ఎప్పుడు అనంతానంతస్వామి సర్వసైనికాధికారిగా, మత సంరక్షకుడిగా, దేశపు రక్షణ బాధ్యత స్వీకరించాలి. వెంటనే ఎప్పుడు ఈ రాజ్యాలన్నీ అతడిని రాజుగా గుర్తించాలి- అన్న విషయంమీద చర్చలు జరిగి, ప్రామాణికలు ఏర్పాటు చేయబడ్డాయి.     దాదాపు అరగంట సమావేశం అయ్యాక వారు లంచ్ కి లేచారు. " 9,"                                                                                                                     18-6-88     శ్రీ రఘుగారికి ,     నమస్తే,         మీరు ప్రేమతో పంపిన 'బొద్ లేయర్' ఫోటో స్టాట్ కాపి - సెలవుల తరవాత యిప్పడే. అందుకు  యీ ఆలస్యం.         చదువుతాను నాకు  అర్ధమవుతుందో లేదో, యింగ్లిషు ఆ ప్తెన కవిత్వం.         మీ కవితలు బావున్నాయి. 'జానపద మాండలిక భాష' literary main - stream కాజాలదు.         సంగితాస్వాదనతో  జీవితం సాగుతూ వుంది                      తాత్విక సాహిత్య వ్యాసంగం సాగించండి. వుంటానూ,                                                                                                                     -వడ్డెర చండీదాస్.                                                                                                                             Nuzvid                                                                                                                         15 - 6- 90     రఘుగారికి,     నమస్తే,         యీ మధ్య వూళ్ళు తిరుగుతూ యిక్కడికి వొచ్చాను. అక్కడ గోవాలో నాకు బస వీలవుతుందా! ముఖ్యంగా స్తేకలాజికల్ గా యేంతకాలమో  సరిగా తెలియదుగాని ఆరు నెలలకో, యేడాదికో తగ్గకుండా అరేబియా సముద్రప్రాంతాన  వుందాలనుకుంటున్నాను.         ప్రస్తుతం economically  constrained. వుండటానికి  'shelter' గానీ 'paying  guest ' గాని moderate rates లో - యేంతలో  విలుపడుతుందా? అసలు విలు పడుతుందా? కింది నుంచి ప్తె స్ధాయికి వరకూ యెలా ఐనా పరవాలేదు. I  do not  mind ' status '.     వెంటనే  యే సంగతి రాస్తారని యెదురుచూస్తూ,             ప్రేమతో,                                                                                                                              -వడ్డెర చండీదాస్.     C/o.  sri kakani  vikram kumar     vidyanagar     Nuzvid - 521 201     krishna district,  A.P.,     Phone :295                                                                                                                              తిరుపతి                                                                                                                             15- 7- 90     ప్రియమిత్రులు రఘుగారికి     నమస్తే,         మీ వుత్తరం. very many thanks  for the  concern  you have for me.         వో పది రోజుల్తెంది యిక్కడికి వొచ్చి. కాస్త స్వస్ధతగానే వుంది.         అవసరం వున్నప్పుడు ముందుగా రాస్తాను.         రావటం సింపుల్ గా వొచ్చి నాలుగ్తేదు రోజుల్లో నివాసం చూసుకుంటాను మీ సహాయంతో.         మీ శ్రీ మతికి శుభాకాంక్షలు. చిరంజీవికి దీవెనలు.         విడిగా కూడా, వోసారి గోవా సముద్రతీరంలో కొన్నాళ్ళు  గడపాలన్న ఆలోచన వుంది. Tourist spots లో కాదు simple sea shore areas.                                                             శుభాకాంక్షలతో,                                                                                                                        -వడ్డెర చండీదాస్ .                                                                                                                   తిరుపతి                                                                                                                 11- 11-90     మిత్రులు శ్రీ. యే.రఘుగారికి ,     నమస్తే ,     రహస్యోద్యమం మీద నేను రాసిన అచ్చుకాగితం యింకా కనిపించలేదు. కనిపించగానే జిరాక్స్ తీయించి పంపుతాను.     గితాదేవి గురించి జలంధర వ్యాసం పంపుతున్నాను.     మీ యిరువురికి శుభాకాంక్షలు. చిన్నారికి దీవనలు.     మళ్ళి వుత్తరం దాకా,                                                                                                                     - వడ్డెర చండీదాస్.                                                                                                                 20 - 01 - 91     ప్రియమిత్రులు రఘుగారికి     నమస్తే,     మీ వుత్తరం ఆనందంగా అనిపించింది నిరిహంగా వున్న నాకు.     తత్వశాస్త్రి సంబంధంగా వో మంచి పరిశీలన రచన గురించి ఆలోచించండి. అందుకు కావాల్సిన సామర్ధ్యం వుంది మీకు.     సెలవులకి వొచ్చినప్పుడు కలుస్తారు కదూ?! నేను విలుబట్టి గోవా ప్రయాణం పెట్టుకుంటాను. యెప్పడో తెలియదు. మీ సెలవులు మీరు అక్కడ వుండని  రోజులు తెలియజేస్తూండండి. ఐనా ముందుగా రాసి జవాబు చూసుకునే ప్రయాణం ఖాయపరుచుకుంటాను.     మీ ముగ్గురికి శుభాకాంక్షలు.     ప్రేమతో,                                                                                                                     -వడ్డెర చండీదాస్ .                                                                                                                      8- 2- 91     ప్రియమ్తెన రాఘుగారికి,     గురిచూసిపాడేపాట - స్త్రీవాద కవితలు - అంటూ వో పుస్తకం వొచ్చింది. యివాళే శ్రీ త్రిపురనేని శ్రీనివాస్ గారికి రాస్తున్నాను వాళ్ళ ప్రచురణలు యిక నుంచి వో ప్రతి మీకు పంపిస్తూడమని. ప్రతిదానికి చిల్లరచిల్లరగా కాక వోకసారిగా DD పంపిస్తుంటారని. నేను పుస్తకాల వేలకి రెట్టింపు చెల్లించ దళిచాను. యత్నం నచ్చి ప్రోత్సాహంగా తోడ్పాటుగా వుంటుందని.     నేను యెప్పడో తప్పక వొస్తాను అక్కడికి. యీ వేసవిలోగానో - వచ్చే దసరాలోగానో.     వుంటాను.     మీ ముగ్గురికి శుభాకాంక్షలు.                                                                                                            -వడ్డెర చండీదాస్." 10,"     బ్రతకాలి, నాకు మిగిలిందింకా ఒకటి వుంది.     ""పగ!""     అవును. ""పగ!""     పగ తీర్చుకోవాలి! పగ తీర్చుకోవాలి! లేచేను. నాలో ఏదో  ఉన్మాదం ప్రవేశించింది. పగ! ప-గ- గట్టిగా అరుస్తున్నానేమో- నాకే తెలియదు. పిచ్చెక్కిపోతోంది. నాకు- అదొక్కటేతెలుసు నాకు. తల విదిలించేను. గట్టిగా  అరవాలనిపిస్తోంది. బట్టలు చింపుకొని వికృతంగా నవ్వుతూ రోడ్డుమీద పరుగెత్తాలనిపిస్తోంది. అరుస్తున్నాను-""లక్ష్మీనారాయణా-నిన్ను బ్రతకనివ్వను, నిన్ను బ్రతక....""     భుజం మీద  ఎవరిదో చల్లగా చెయ్యిపడింది. వెనక్కి తిరిగి చూసేను.     రాజా నరేంద్రవర్మ.                                                      9     ప్రహరీ గోడ గేటు దగ్గర నిలబడ్డాను. పదిహేనుమంది దాకా  దాదాపు పనిలో వున్నారు. ఇద్దరు రోడ్డు మీద మట్టిపోసి, గట్టిగా  చదునుచేస్తున్నారు. ఒకడు తెల్లసున్నం పోసిన ఇటుకరాళ్ళు వరుసగా సర్దుతున్నాడు. ఇద్దరు గులాబీ మొక్కలకి నీటి కాలువలు తవ్వుతున్నారు. కొందరు గదమంచె లెక్కిరంగులు వేస్తున్నారు. ఆ రంగులు స్పెషల్ గా రాయపూర్ నుంచి తెప్పించినవి. రంగులు కలిపి ప్రయోగాలు చేయటంలో శంకర్ దాదాకి  మంచి అనుభవం వుంది.     రోడ్డుమీద వెళ్ళేవాళ్ళు క్షణం ఆగి, ఇంటిని పరకాయించి చూస్తూ సాగిపోతున్నారు.     ""అద్భుతం"" అంటున్నారెవరో. పక్కవాడితో కష్టపడి పనిచేసిన కూలివాడికి రోజుకు దొరికేది నా చేతిలోవున్న సిగరెట్ పెట్టె ఖరీదులో సగం. ఉహూఁ నేను అలా ఆలోచించకూడదు.     దృష్టి ఇంటిమీదకు మరల్చేను.     ఇంటిముందు చిన్న స్విమ్మింగ్ పూల్ తయారయింది. పోర్టికో వెడల్పుగా అందంగా.....హుందాగా వుంది. మెయిన్ గేట్ నుంచి పోర్టికో వరకూ వేసిన ఎర్రరోడ్డుకి ఇరువైపులా పెంచిన గడ్డి పచ్చగా మెరుస్తోంది.     శంకర్ దాదా వచ్చి నా పక్కన నిల్చున్నాడు. పనివాళ్ళు చేస్తున్న దానిని తిలకిస్తూ- చాలా తొందరగా జరిగిపోయింది పని"" అన్నాను.     ""అవును"" తలూపేడు. ""ఇంత పెద్ద ఇల్లు రెండు నెలల్లో తయారవటం అంటే సామాన్యమైన విషయం కాదు"" అన్నాడు.     అంతకుముందు అమెరికన్ మాగజైన్ తో చదివిన ""పెర్టు"" సి.పి.ఎం' మీద ఆర్టికల్ జ్ఞాపకం వచ్చింది. ""ఎవరన్నా  పందెం కడితే ఇంతకన్నా పెద్ద యింటిని ఇంకా తక్కువ టైమ్ లో కట్టించగలను"" అన్నాను.     ""దగ్గిరుండి కట్టించటం సులభమే కాని, అక్కడెక్కడో వుండి ఉత్తరాలమీద పని జరిపించటం అంటే మాటలు కాదు"".     ""తొందరగా వచ్చేసేవాణ్ని. కానీ తాతయ్య బలవంతం చేసేడు"" చెప్పాను.     ""మీరు లేని లోపం ఏదైనా కనపడుతోందా?' అనుమానంగా అడిగేడు.     ""అహఁ అటువంటిదేమీ లేదు. నాకు చాలా తృప్తిగా వుంది. నీలాంటివాడు  చేతిక్రింద వుంటే, కుర్చీలోంచి లేవకుండానే ఎంత పనైనా చేయించుకోవచ్చు"".     ""నాలాంటివాళ్ళు ఎక్కడయినా దొరుకుతారు బాబూ, కానీ కుర్చీలో కూర్చునే అన్ని విషయాలు గమనిస్తూ కావాల్సిన పన్లు చేయించుకోవటం అంటే మాటలు కాదు. ఆ శక్తి మీ తాతగారిలోనే చూసేను, యిప్పుడు మీలో చూస్తున్నాను-""     మాట మర్చి, ""నాదో చిన్న అనుమానం"" అన్నాను.     ""చెప్పండి బాబూ-""     ""ఆ రోజు లాడ్జిలో నన్ను గది మర్పించాడు మేనేజరు"" ఆగేను. ""ఆ రెండో  గదిలో  మైక్రోఫోను ఆరేంజి చేసింది నువ్వే కదూ!""     శంకర్ దాదా  ముడతలుపడ్డ చెక్కిళ్ళమీద  నవ్వు వెలిసింది.     ""పెదబాబుగారు కూడా  అప్పుడు ఈ ఊళ్ళోనే వున్నారు బాబూ! జరిగినదంతా వారికి ఎప్పటికప్పుడు వినవించటమే నేను చేసిన పని-""     ఇంతలో ఎదురింటిముందు కారు ఆగింది. ఇంటి ఓనరు దిగి, లోపలికి వెళ్ళబోయి, మమ్మల్ని గమనించి, మావైపుగా వచ్చాడు. శంకర్ దాదా అతన్ని చూసి ""నమస్తే సాబ్, రండి - రండి"" అన్నాడు ఆహ్వానిస్తూ. అతడు నావైపు చూస్తూ. ఈయన.....అన్నాడు ప్రశ్నార్థకంగా.     ""మా యజమాని, ఈ రోజే వచ్చారు"" అన్నాడు దాదా.     అతను నాకు చెయ్యి అందిస్తూ, ""మిమ్మల్ని కలుసుకొంటున్నందుకు చాలా సంతోషంగా వుంది"" అన్నాడు.     నేనూ చెయ్యి అందించేను. ""నాకూ....."" అన్నాను. బాగా కండపట్టిన అతడి చేయి మెత్తగా అసహ్యంగా తగిలింది.     ""ఇంత తొందర్లో పూర్తి చేయగలిగారంటే - చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి వుండాలి మీరు.""     ""ఇంత చిన్న చిన్న ప్లాన్ లు కూడా మనం వేయటం మొదలుపెడితే మన టైము అంతా దీనికే వేస్టు అవుతుంది. దీనికి ప్లాన్ వేసింది నా గుమస్తా"" అని శంకర్ దాదాని చూపించేను.     ""నిజవేఁ....... నిజవేఁ......."" అన్నాడు అతడు తలూపుతూ. ""పెద్ద పెద్ద డిసిషన్ లు మనం తీసుకోవాలి"" అర్థంతరంగా గొప్పవాడై పోయి, స్టేటస్ నిలుపుకునే తాపత్రయం అతడు వాడే ఇంగ్లీషు పదాల్లో కనిపించింది.     ""ఇంతవరకూ నా ఇల్లు ఈ ఊళ్ళోకల్లా పెద్దది, ఇక నుంచి మీది"" నవ్వేడు. ""అందులోనూ ఎదురెదురు"".         ""నాలుగు రోజుల్లో మంచి ముహూర్తం వుందట. ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళందరికీ పార్టీ ఇద్దామనుకొంటున్నాను. గృహప్రవేశం సందర్భంలో"" అన్నాను మాటమారుస్తూ. ""ఎలాగూ ఈ ఊళ్ళోనే సెటిల్ అవుదామనుకొంటున్నాను కాబట్టి అందర్నీ పరిచయం చేసుకోవాలి కదా!""     ""అవునవును. అందరూ మిమ్మల్ని కలుసుకోవాలకొంటున్నారు.....""     ""మీరు ఆ రోజు నాతో తప్పకుండా రావాలి. నాకెవరూ తెలీదుకదా"" అభ్యర్థిస్తున్నట్లు అడిగేను. అతడి మొహంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. ""అలాగే అలాగే...."" అన్నాడు ఉబ్బితబ్బిబ్బవుతూ.     ""సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకొందాం"" అన్నాను షేక్ హేండిస్తూ.     ""మంచిది-"" అని కదలబోతూ ""మీ పేరు?"" అని అడిగేడు.     ""మోహన్, కృష్ణమోహన్"" అన్నాను.     ""అలాగా, బావుంది.....బావుంది.....నా పేరు లక్ష్మీనారాయణ "" అన్నాడు     ""ఎంత ఖర్చయింది ఇప్పటికి?""     ""లక్ష. ఇంకో ఇరవై వేలదాకా ఖర్చ వుంటుంది"" పుస్తకం చూడకుండానే చెప్పేడు.     ""రేపు పార్టీకి ఓ పదివేలు ఖర్చు పెట్టవలసి వుంటుంది"".     తలూపేడు.     ""బైదిబై- ఆ అడవి పాడటం ఏమయింది?""     ""మనకే వచ్చింది"".     ""గుడ్. పీచు?""     ""స్టాకు రెడీగా వుంది. షిప్ కుదర్లేదు. అదే ఆలస్యం"".     ""ఆ క్వారీలో' పని ఎలా జరుగుతూంది?""     ""అన్నిటికన్నా అందులోనే ఎక్కువలాభం వచ్చేట్టు వుంది.     పనిచురుగ్గా సాగుతోంది. ఆ రంపపుపొడి కాంట్రాక్టురు మొత్తం అంతా తనే కొనుక్కుంటా నంటున్నాడు"".     ""వెంటనే అమ్మేయండి. మనం తొందరగా డబ్బు 'రొటేట్' చెయ్యాలి. ఎక్కువ సమయంలేదు. ఖర్చు పెట్టిందికాక పదిహేను పర్సెంట్ లాభం చూపిస్తానని తాతయ్యతో పందెం కాసేను. ఇప్పటికి రెండులక్షలు ఖర్చయింది"".     ........ఆరు లక్షలకి- సంవత్సరంన్నరకి పదిహేను పర్సెంట్- అంటే లక్షా ముప్ఫె అయిదువేలు సంపాదించాలి. సంవత్సరంన్నరలోనూ మూడు లక్షల ముప్ఫె అయిదువేలు.     చాలా కష్టమైన ఆట.     ఆలోచనల్లో వుండగానే పక్కన ఏదో గొడవ జరుగుతూ వుండటం చూసి అటు తిరిగేను.     శంకర్ దాదా ఎవరి మీదో అరుస్తున్నాడు. ఎవరో ముసలివాణ్ని కసిరి వెళ్ళిపొమ్మంటున్నాడు.     ""ఏమిటి విషయం?"" అడిగేను.     'మన క్వారీలో పనిచేసే కూలీ బాబూ! ఇంట్లో చిన్నపిల్లకి బావోలేదట. వారం రోజుల కూలీ ఈవేళ కావాల్ట' అన్నాడు. అతడివైపు చూసేను. అరవై ఏళ్ళుంటాయి. అస్థిపంజరానికి చర్మపు బట్టలు తొడిగినట్లున్నాడు.     ""మేనేజర్ని అడక్కుండా ఇక్కడికెందుకు వచ్చేడు?""     ""అలా ఇవ్వరు బాబూ"" అన్నాడా వృద్ధుడు.     అవును ఒకసారి వారం రోజుల కూలి ఇచ్చేస్తే మళ్ళీ కనబడరు. అలాగే ఉడాయించేస్తారు"" అన్నాడు దాదా.     శంకర్ దాదా వైపు తదేకంగా చూసేను. ""మనిషి మంచితనంమీద అంత తక్కువ నమ్మకం పెంచుకోవటం సాటి మనిషిగా అవమానం గాదా"" -అన్నట్టు.     ""మా పిల్లకి అస్సలు బావోలేదు బాబూ"" దీనంగా చేతులు జోడించాడు అతడు. అతడికి బావోలేనట్టుంది- జోడించిన చేతులు సన్నగా వణుకుతున్నాయి వృద్ధాప్యంతో ముడతలుపడ్డ చెక్కిళ్ళమీద నీటిచుక్క తళుక్కుమంది- గాజుకళ్ళు ఆర్తిగా చూస్తున్నాయి- జేబులోంచి ఇరవై రూపాయలు తీసేను, ""ఇదిగో వారం రోజులకి కూలీ! ఎగ్గొట్టకుండా రా-"" అన్నాను.     వణుకుతున్న చేతుల్తో అందుకొని, నావైపు నీళ్ళు నిండిన కళ్ళతో చూసేడు. నేను వూహించినంత తొందరగా వంగి, నా కాళ్ళుస్పృశించి, ""తప్పక వస్తాను బాబూ- తప్పకుండా"" అని గొణుక్కుంటూ వడివడిగా వెళ్ళిపోయేడు నిశ్చేష్టత నుంచి తేరుకొని దాదావైపే తిరిగి నవ్వేను, అతడు నవ్వలేదు.     నెమ్మదిగా అన్నాడు. ""అనుభవం లేనప్పుడు ఈ కష్టాలు వింటూంటే రక్తం పరుగెత్తి ఏదో చెయ్యాలనిపిస్తుంది బాబూ! అలా చేసేస్తూపోతే, అనుభవం వచ్చేసరికి ఏవీఁ మిగల్దు"" కొరడాతో కొట్టినట్టు నిలబడిపోయేను.     నిజమే! పచ్చి నిజం! నాక్రింద దాదాపు వెయ్యిమంది దాకా పన్జేస్తున్నారు. అందరికీ తలో కథా వుండొచ్చు. ఇలా సహాయం చేసుకుంటూపోతే ఏవీ - మిగల్దు. నాలో పెట్టుబడిదారుణ్ని ఇంకా బలంగా నిర్మించుకోవాలి.     ........అంతకు ముందు రాత్రి పదివేల రూపాయల్ని చాలా సులభంగా వదిలేసుకోగలిగిన నేను - ఈ ఇరవై రూపాయల కోసం ఇంత ఆలోచిస్తున్నాను-     ఆలోచిస్తూనే డబ్బు సంపాదించడానికి వీలైన మార్గాలన్నీ వెతికేను దొరికింది! ""మీ పేరుమీద  కార్నావాల్ ఒకటి ప్రారంభిద్దాంమనుకొంటున్నాను దాదా"" అన్నాను. శంకర్ దాదా, మామూలు బిజినెస్సుల్లో మనం అనుకున్నంత డబ్బురాదు మనుష్యుల బలహీనతమీద ఆడుకోవాలి, తప్పదు.""     శంకర్ దాదా వెళ్ళిపోయేడు. ఎంతో అసంతృప్తిగా వుంది. ఇదో ఏగోనీ.....     వికలమయిన మనస్సుని అదుపులో పెట్టుకోవటానికి చాలా శ్రమపడవలసి వచ్చింది. " 11,"    ""శివశివా..."" అన్నారు రాంపండూ, బ్రహ్మాజీ.     ఇన్స్ సెక్టార్ అయోమయం ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాడు.     ""కొంపదీసి మీరు శివసేన పార్టీవాళ్ళా?"" అని అడిగాడు.     ""అబ్బా!""...."" ఏడుకొండలు టోపి మీద గుద్దుకున్నాడు. ""వాళ్ళు అవేమీ కాద్సార్... మన స్టేషన్ ఆవరణంలో అనుమానస్పద స్థితిలో తచ్చాడుతుంటే పట్టుకుని మీ దగ్గరకి తెచ్చాను.""     అయోమయం హాఠాత్తుగా లేచి నిలబడి బెల్టుకున్న కేసులోంచి రివాల్వర్ తీసి ఇద్దరకీ గురిపెట్టి ""చెప్పండి...ఎవరు మీరు? అక్కడేం చేస్తున్నారు? బాంబులు పెట్టి మా స్టేషన్ని పేల్చి పారేయ్యాలని చూస్తున్నారా? అంతకంటే ముందే నేను కాల్చి పారేస్తా"" అన్నాడు.     ""ఏమండీ... మేము సాధారణ పౌరులం... అంతేకానీ టెర్రరిస్టులమో, నక్సలైట్లమో కాదు"" అన్నాడు రాంపండు బాధగా.     ""ఓహొ... కంప్లైంట్ యివ్వాలని వచ్చారా? కూర్చోండి"" అన్నాడు ఇన్స్ సెక్టార్ అయోమయం తను కూర్చుంటూ.     రాంపండు, బ్రహ్మాజీ తాని ముందు కూర్చ్గున్నారు.     ""ఊ... ఇప్పుడు చెప్పండి ఏంటి మీ కంప్లైంట్? మీ ఇంట్లో చోరీ జరిగిందా? బంగారం ఏమైనా పోయిందా?"" అడిగాడు ఇన్స్ సెక్టార్ అయోమయం.     బంగారం ఏంటండీ బాబూ! బంగారంలాంటి అమ్మాయ్ పోయింది. వీళ్ళా విడ తప్పిపోయింది"" అన్నాడు బ్రహ్మాజీ.     ""తప్పిపోవడం కాదండీ! మా ఆవిడా కనిపించటంలేదు"" బ్రహ్మాజీ వాక్యాన్ని సరిదిద్దుతూ అన్నాడు రాంపండు.     ""కనిపించకపోతే కళ్ళద్దాలు పెట్టుకుని చూడండి. హహహ"" నవ్వాడు ఇన్స్ సెక్టార్ అయోమయం       ""చూశావా! కనిపించటం లేదని అంటే అలా అంటాడని నేను చేపానా లేదా?"" రాంపండు చెవిలో అంటూ డొక్కలో మోచేత్తో పొడిచాడు బ్రహ్మాజీ.     ""సార్! మా ఆవిడ కనిపించక నేను బాధ పడుతుంటే మీరిలా అనడం అన్యాయం సార్"" అన్నాడు రాంపండు.     ""ఒక్కే..ఒక్కే...నేనిక సీరియస్! చెప్పండి మీ ఆవిడా ఎప్పుడు నుండి కనిపించడంలేదు?"" నవ్వాపుకుంటూ అన్నాడు ఇన్స్ సెక్టార్ అయోమయం.     ""ఈ వేళ ఉదయం లేచినప్పటినుండీ కనపడ్డంలేదండీ"" చెప్పాడు రాంపండు.     అది వినగానే కాని స్టేబుల్ ఏడుకొండలూ, ఇన్స్ సెక్టార్ అయోమయం మోహమోహాలు చూసుకుని భళ్ళున నవ్వారు.     ""చంపేవ్ కదయ్యా బాబూ! ఈ వేళ ఉదయం నుండి కనిపించటంలేదా? ఇంకానయం. ఓ గంట క్రితం నుండి అన్నావ్ కాదు. ఉదయం నుండీ కనిపించడం లేదని అంటే ఏ చూట్టాలింటికో, ప్రెండ్స్ యింటికో వెళ్ళి వుంటుంది. మరో రెండురోజులు కనబడకపోతే అప్పుడు కంప్లైంటు యివ్వడానికి రా"" అన్నాడు అయోమయం.     ""లేద్సార్! మా ఆవిడ ఎప్పుడు ఎక్కడికీ వెళ్ళకపోవచ్చేమోగానీ ఈ వేళ వెళ్ళాలని అనిపించిందేమో. అందుకే రెండు రోజుల తర్వాత రా.""     ""ప్లీజ్! న మాట వినండి సార్! ఆమెకి తెలిసిన వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి అడిగాను. రాలేదని చెప్పారు. విజయవాడలో వాళ్ళింటికి కూడా ఫోన్ చేశాను. అక్కడకీ రాలేదని తెల్సింది. ప్లీజ్! మీరు కేస్ రిజిస్టర్ చేసుకోండి సార్"" దీనంగా అన్నాడు రాంపండు.     ""సరే! కంప్లెయింట్ రాసివ్వు చూద్దాం""అన్నాడు ఇన్స్ సెక్టార్ అయోమయం.     రాంపండు కంప్లైంట్ రాసి సంతకం పెట్టి ఇంటి ఆడ్రస్ రాసి ఇన్ స్పెక్టర్ కి యిచ్చాడు.     ఆమెది రీ సెంట్ ఫోటోగ్రాఫ్ ఏదైనా వుందా?"" అడిగాడు అయోమయం.     అతను చొక్కా జేబులోంచి ఓ కవరు తీసి అందులోంచి రాజీ ఫోటోతీసి యిచ్చాడు.     ఇన్స్ సెక్టార్ అయోమయం ఫోటోవంక దీక్షగా చూడసాగాడు. కాని స్టేబుల్ ఏడుకొండలు కూడా ముందుకి వంగి ఫోటో వంక చూశాడు.     ఇన్స్ సెక్టార్ ఫోటో ని చూస్తూ పెదవి విరిచాడు.     రాంపండు గుండెల్లో పీచుపీచుమంది.     ""ఏం సార్ అలా పెదవి విరుస్తున్నారు? కొంపదీసి మా ఆవిడగానీ మీకు కనిపించిందా? ఆమెకేమీ ప్రమాదం జరగలేదు కదా?"" అడిగాడు కంగారుగా.     ""నేను పెదవి విరించింది అందుక్కాదు. ఈ ఫోటో ఎవడు తీశాడో గానే అంత బాగా తియ్యలేదు"" అన్నాడు అయోమయం. తర్వాత కానిస్టేబుల్ ఏడుకొండలు  వైపుకి తిరిగి ""ఈ ఫేసు చూశావా? కాస్త యిటు టర్నింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది కదూ?"" అన్నాడు.     ""అవున్సార్! కేమెరా యాంగిల్ కూడా సరిగ్గా లేదు. క్రింద నుండి తీశాడు పైనుండి తీస్తే బాగుండేది"" అన్నాడు ఏడుకొండలు కూడా ఫోటో వంక దీక్షగా చూస్తూ.     ""లైటింగో? ఛండాలంగా వుంది. ఆ బ్యాక్ గ్రౌండ్ లో కర్టెన్ చూశావా? పువ్వుల పువ్వుల కర్టెన్ వేశాడు దానికంటే ప్లెయిన్ ది వేసి వుంటే బాగుండేది. ఇలాంటి ఫోటో స్టూడియో వాళ్ళని కాల్చి పారెయ్యాలి.""     ""సార్!"" దీనంగా పిలిచాడు రాంపండు.     ఇన్స్ పెక్టర్, కాని స్టేబుల్ ఇద్దరి తలలూ అతని వైపుకి తిరిగాయ్.     ""ఇంతకీ ఆ ఫోటో మా ఆవిడ్ని వెతకడానికి పనికోస్తుందా లేదా సార్?""     ""పని కొస్తుందనుకో. అయినా  యింకోసారి ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళకు"" అని ఫోటో టేబుల్ సొరుగులో పడేశాడు ఇన్స్ స్పెక్టర్ అయోమయం.     ""మేమింక వెళ్ళొచ్చాండీ?"" అడిగాడు బ్రహ్మాజీ.     ""ఒయ్యాస్! మీ ఆవిడని ఎక్కడున్నా వెతికి పట్టుకుని కాల్చిపారేస్తాం.""     ""అదేమీటండీ?"" అయోమయంగా అడిగాడు రాంపండు.     ""మరి అమ్తెనయ్యా! మొగుడికి చెప్పకుండా యిల్లు వదలిపెట్టి వెళ్ళిపోతే యిమ్కేం చెయ్యాలి?""     ""అలా కాల్చి పారేయ్యాడాలూ, పేల్చి పారెయ్యడాలూ వద్దుగానీ నకు అప్పగించండి చాలు!""     ""సరేలే... మీ రెళ్ళండి!""ఇద్దరూ లేచి గుమ్మం వైపు అడుగులు వేశారు.     ""చూడు జాంపండూ!"" పిలిచాడు ఇన్స్ పెక్టర్.     ""జాపండు కాదండీ! రాంపండు"" చెప్పాడు పండు.     ""ఏదో ఒక పండులేవయ్యా! ఓ నిమిషం అడగడం మర్చిపోయాం మీరిద్దరూ ఏమయినా దెబ్బలాడుకున్నారా?""     ""మేమిద్దరమా? అబ్బే లేదే- ఏరా బ్రహ్మాజీ! మనిద్దరం దెబ్బలాడుకున్నామాఎప్పుడయినా?"" అడిగాడు రాంపండు.     ""అబ్బే! మేమిద్దరం ఎప్పుడూ దేబ్బలాడుకోలేదు ఇన్స్ స్పెక్టర్ ఏమనుకుంటున్నారో ఏమో_ నేనడుగుతుమ్దినువ్వూ, నీ పెళ్ళాం అన్నాడు ఇన్స్ స్ప్ర్క్తర్ అయోమయం.     ""లేదు ఇన్స్ స్పెక్టర్ ! మేమిద్దరం కూడా ఎప్పుడూ దేబ్బలాడుకోలేదు"" అబద్దం చెప్పాడు రాంపండు." 12,"      ""మధ్యాహ్నం భోజనానికి ఇంటికొస్తావా"" అడిగిందావిడ.          మాట్లాడలేదు త్రిభువనేశ్వరి.          ""పిన్నీ... నువ్వు నన్ను అడగాలనుకొంటున్నది... ఇదేనా"" ఖాళీ పాలగ్లాసుని ఆమె చేతికిస్తూ ఆమె ముఖంలోని భావాలను పసికట్టడానికి ప్రయత్నిస్తూ అంది త్రిభువనేశ్వరి.          ""అది కాదమ్మా! మీ చిన్నాన్న...."" ఏదో చెప్పబోయిందావిడ.          అంతవరకూ ప్రసన్నంగా ఉన్న త్రిభువనేశ్వరి ముఖంలో కోపం ప్రవేశించింది.          ""చూడు- పిన్నీ....బాధ్యత మరిహ్చిపోయిన వాళ్ళకోసం భయపడి పారిపోయిన వాళ్ళ కోసం... బాధ పడడం మన తెలివి తక్కువ.....అయినా కాశీ, రామేశ్వరాలు నా జ్యూరిస్ డిక్షన్ లో లేవు....వెతికించడానికీ"" లేచి తన గదిలోకి విసురుగా వెళ్ళిపోయింది త్రిభువనేశ్వరి.          అవాక్కయిపోయి అల అచూస్తూ నిల్చుండిపోయింది సుందరమ్మ.          మరో అరగంట గడిచింది.          అడుగుల శబ్దం....వినబడగానే లేచి నించున్నాడు హేమాద్రి శర్మ...          కర్టెన్ తీసుకొని హాల్లో కొచ్చింది త్రిభువనేశ్వరి దేవి.          ""గుడ్ మార్నింగ్ మేడమ్"" హేమాద్రిశర్మ విష్ చేశాడు.          త్రిభువనేశ్వరి దేవి...          ముఫ్ఫై ఏళ్ల త్రిభువనేశ్వరి దేవి....అయిదడుగుల, ఆరంగుళాల ఎత్తు...బలమైన, దృఢమైన శరీరం మేరీలో స్ట్రీప్ లాంటి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు- ఆమె మెరిసే కళ్ళలో ఎప్పుడూ చిరునవ్వు- ఆమె అందం ఇతరుల్ని తక్కువగా ఆలోచింపజేసేదికాదు.... ఈమె తన జీవిత భాగస్వామి అయితే బాగుండన్న హుందాతనంతో కూడుకున్న కోరిక....అదో అద్భుతమైన ఆకర్షణ-వీటన్నిటింనీ మించిన గ్రేస్....ఎంతటి వారినయినా, తన వాగ్ధాటి ద్వారా శాసించగలిగే నేర్పు-          తండ్రి సుభాష్ చంద్ర గాంధేయవాది....స్వాతంత్రోద్యమంలో, ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుశిక్ష అనుభవించి, అనేక రకాలయిన చిత్రహింసలకు గురైన వ్యక్తి.          ఆంద్రరాష్ట్రం ఏర్పడ్డాక నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా 1955లో ఏర్పడ్డ తొలిమంత్రి వర్గంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా చేసిన వ్యక్తి ఆ తర్వాతః చాలాకాలం పార్టీ అధ్యక్షుడుగా సేవలు అందించిన వ్యక్తి. ప్రస్తుతం ఆయనకు ఎనభై ఏళ్ళు - ప్రస్తుతం స్వంత వూళ్ళో కృష్ణాజిలా నందిగామలో వుంటున్నారు.          త్రిభువనేశ్వరి రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం తండ్రి సుభాష్ చంద్రే.          ఎనిమిదేళ్ళపాటు పార్టీలో సాధారణ కార్యకర్తగా, కార్పొరేటర్ గా ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిత్వం త్రిభునేశ్వరిదేవిది.          పార్టీలో ఒక్కసారిగా అధికారం కోసం చెలరేగిన కుమ్ములాటల్లో ఇద్దరు ప్రధనమైన నాయకుల మధ్య ఏర్పడిన స్పర్ధ, అసమ్మతి రాజుకోవడంతో నాటకీయ పరిణామాల్లో త్రిభువనేశ్వరీ దేవిని అదృష్టం వరించింది.          హైకమాండ్ త్రిభువనేశ్వరి దేవికి చీఫ్ మినిస్టర్ పట్టం కట్టింది.          ఆరునెలల కాలంలో తనను తాను రుజూవు చేసుకోవడానికి అనుక్షణం ప్రయత్నిస్తోంది త్రిభువనేశ్వరీ దేవి.          జలపాతంలాంటి జుత్తు, విశాలమైన నుదురు- ఆ నుదుటిమీద సూర్యబింబంలాంటి బొట్టు, బెనారస్ పట్టుచీర....ఎడంచేతికి వాచీ, కుడిచేతికి రెండు బంగారు గాజులు....ఎంతో సాదాసీదాగా ఉంటుంది. ప్రస్తుతం విశాలమైన సోఫామీద కూర్చుంది త్రిభువనేశ్వరీదేవి! లోన్నించి పనిమనిషి కొన్ని ఫైల్స్ ని తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది.          వాటిలోంచి ఓ ఫైల్ ను అందుకుంది సి. ఎమ్. త్రిభువనేశ్వరీ దేవి.          ""ఫైల్స్ అన్నీ వెరిఫై చేశాను.....మద్యాన్ని నిషేధించడానికి నిర్ణయించుకొన్నాను"" సీరియస్ గా అంది త్రిభువనేశ్వరీ దేవి.          ""మరోసారి ఆలోచించండి.... పాత గవర్నమెంట్స్ తెచ్చిన జి.వోలు, ప్రాక్టికల్ ఫెయిల్యూర్స్.... అన్నీ మీకు విపులంగా తెల్సే ఉంటాయి.          ఇంకా కొన్నాళ్ళాగితే....బాగుంటుందని నా సలహా"" హేమాద్రి శర్మ చెప్పాడు.          ""నిన్న రాత్రి కూడా...మీరిదే చెప్పారు....ఒక కార్యకర్తగా నేను పార్టీలో పని చేస్తున్నప్పటి నుంచి....మీకు తెలుసు....మా డాడీ ఆశయం మీకు తెల్సు...మా డాడీలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్, నా నుంచి, నా ప్రభుత్వం నుంచి ఏవాశిస్తున్నారో మీకు తెలుసు- జి.వో తేవడంతో నేను చేతులు దులుపుకుని ఊరుకోను. ""ప్రాక్టికల్'గా ఇంప్లిమెంట్ చేసేవరకూ నిద్రపోను... నా పదవి పోయినా ఫర్వాలేదు- మద్యాన్ని నిషేధిస్తాను. పేద ప్రజల్ని కాపాడతాను.""          ""ఒక ఐ.ఎ.ఎస్...ఆఫీసర్ గా, ఒక సి.ఎమ్ తో స్పష్టంగా ఒపీనియన్ని చెప్పుకోలేక పోవచ్చు- కానీ....చిన్నప్పట్నించీ మిమ్మల్ని ఎరిగిన, ఒక వెల్ విషర్ గా...నా అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదనుకుంటాను.          ఇవాళ మనదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం... కేవలం ఎక్సయిజ్ రెవిన్యూ ఆదాయం మీదే ఆధారపడుతున్నాయి. సారా కంట్రాక్టర్లు ఇవాళ పార్టీలకు గానీ, ప్రభుత్వాలకు గానీ అనఫీషియల్ బ్యాంకులుగా తయారు కావడానికి ఎవరు కారణం... సారా వాళ్ళకు తెస్తున్న ఆదాయమే. ప్రతీ ఏటా పెరుగుతున్న మద్యం వినియోగం.... రెవెన్యూ పెరుగుదలల్ని ఒక్కసారి గమనించండి.          1960-61లో కేవలం ఏడుకోట్ల మూడులక్షలున్న ఎక్సైజ్ రెవెన్యూ ఈ ఎక్సైజ్ సంవత్సరం నాటికి 950 కోట్ల రూపాయలకు పెరిగింది. 1970-71లో రు. 29 కోట్ల 79 లక్షలు. 1980-81లో 152 కోట్ల 40 లక్షలు, 1990-91లో 780 కోట్లు, 1991-92 లో రు. 850 కోట్లు ఎక్సయిజ్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరాయి. సారా ఐ.ఎం.ఎల్. షాపుల సంఖ్య కూడా ఈ మూడు దశాబ్ధాలలోనే అధికంగా పెరిగాయి. 1970లో 8669 సారా షాపులు, 2305 బ్రాందీ షాపులుండగా, 1980లో సారా షాపులు 14,274, బ్రాందీ షాపులు 4566కు పెరిగాయి. 1990 నాటికి 16,436 సారా షాపులు 6503 బ్రాందీ షాపుల స్థాయికి ఈ సంఖ్య చేరింది.          మనం సారాని నిషేధిస్తాం....కాని కల్తీ సారాను నిషేధించలేం. మద్యాన్ని నిషేధిస్తాం....కానీ బార్లను, వైన్ శాపుల్నీ నిషేధించలేము"" వినయంగా చెప్పాడు హేమాద్రిశర్మ.          ఆలోచనలో పడింది త్రిభువనేశ్వరీ దేవి.          ""మొత్తం మత్తును నిషేధించడం కేంద్ర ప్రభుత్వం పని... భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం.... దేశంలోని ప్రతి పౌరునికీ, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అధికారంలో కొచ్చే ప్రభుత్వం ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చెపుతున్న దేవిటి? మద్యపాన నిషేధము, రాష్ట్రాల పరిధికి చెందిందని.... కేంద్ర ప్రభుత్వం... ఏ చర్యా తీసుకోలేదని అంటోంది- రాజ్యాంగ పరంగా, మద్యపాన నిషేధాన్ని దేశమంతా అమలు చేయాల్సిన నైతిక బాధ్యత ఉన్న కారణంగా, కేంద్ర ప్రభుత్వం 12 సూత్రాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిశీలనకు పంపి, చేతులు దులుపుకుంది. ఆ పథకంలో మద్యపాన నిషేధం గురించి మహాత్మాగాంధీ జరిపిన పోరాటాల స్ఫూర్తిగా, దేశంలోని మద్యపాన నిషేధాన్ని అమలు చెయ్యాల్సి వుంది. అంచెలంచెలుగా ఈ లక్ష్యాన్ని సాధించాల్సి వుంది. మద్యం గురించి ప్రకటనలు నిషేధించడం, విద్యా సంస్థలు, మత పరమైన పవిత్ర ఆలయాలు, పారిశ్రామిక కర్మాగారాలు వంటి వాటి దగ్గర మద్యం అమ్మే దుకాణాలను బంద్ చేయడం, ఆల్కహాల్ డ్రింకుల తయారీకి కొత్త లైసెన్స్ లు జారీ చేయకపోవడం వంటి చర్యలు తీసుకోవాలని 1975 గాంధీ జయన్తి నుండీ ఈ కార్యక్రమం ప్రారంభించాలని 1978 నుంచి ఏడాదికి రెండువారాల పాటు మద్యంలేని వారాలుగా అమలుచేసి క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ 1981 నాటికి దేశమంతా మద్యపానాన్ని నిషేధించి అమలు చేయాలని కేంద్రం ఆశించింది.          కానీ ఆచరణలో ఏం జరుగుతోంది? ఒక్కసారి ఆలోచించండి.          ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ, ఎప్పుడు, ఏ కల్తీ సారాయి, నకిలీ మద్యంవంటివి తాగి వందల్లో ప్రజలు మృతులయితే చాలు- ఒకసారి ఆ పాత ఆదేశాలను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి, తన బాధ్యత పూర్తయిందని భావిస్తోంది. చట్టాలు చేసే ప్రభుత్వాలకు వాటిని అమలుచేసే అధికారులకు చిత్తశుద్ధి లేకపోతే జరిగేది ఇదే కాదంటారా...""" 13,"     లక్కతో బొట్లు పెట్టివున్న పెద్ద మండిగం దాటి మెల్లాలో అడుగు పెట్టింది. మెల్లా ఇంట్లో ఉయ్యాల బల్ల వున్నది. దాని మీద ఒక ఆరేళ్ళ పిల్ల కూర్చుని వున్నది. ఆమెను చూస్తూనే బల్లమీద నుంచి దూకి లోపలకు పరిగెత్తింది. అమూల్య దిక్కులు చూస్తూ నిల్చుంది.     అంతలో నడివయసులో వున్న ఒక స్త్రీ బయటికి వచ్చింది. గుంటూరు నేత చీర అక్కడక్కడ రంగు పోయింది. ఆమెను చూసి ఆ ఇంటి పనిమనిషి అనుకుంది.     ""కూర్చోమ్మా"" అన్నది అమూల్యను ఎగాదిగా చూస్తూ.     అమూల్యకు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు. అక్కడ ఉయ్యాల బల్ల తప్ప కూర్చోవడానికి ఇంకేమీ లేదు.     ""లక్ష్మీ ఆ చాప ఇలా తీసుకురా"" లోపలికి కేక పెట్టింది.     లోపల నుంచి ఓ ఇరవై సంవత్సరాల యువతి బయటికి వచ్చింది. వెంకటగిరి జరీ చీర కట్టింది. ఖరీదైందే- కాని బాగా నలిగి వున్నది. ఎన్నోసార్లు కట్టుకొని మళ్ళీ మళ్ళీ మడతలు పెట్టి దాచుకొని కట్టుకున్న చీర అది.     ఆ యువతీ చాప పర్చింది.     అమూల్య చాప మీద కూర్చుంది.     పని అయిపోయిందిగా? నువ్వు అమ్మాయి దగ్గర కూర్చో. మిగతా పని నేను చూసుకుంటాను."" అంటూ నడి వయస్సు స్త్రీ లోపలకు వెళ్ళిపోయింది.     ఆ యువతికి అమూల్యతో ఏం మాట్లాడాలో బోధపడటం లేదు. తనలోకి తను ముడుచుకుపోతున్నట్టు కూర్చుంది. అమూల్యకు ఆమె మీద జాలి వేసింది. కోపం కూడా వచ్చింది.     ""మీ పేరు?"" అమూల్య చొరవతీసుకొని అడిగింది.     ""సరోజిని"" కొంచెం బిడియ పడుతూ చెప్పింది.     అమూల్య ఆ హాలు కలియజూసింది. ఒక మూల భోషాణం వున్నది. దానిపైన కొన్ని గోతాలూ, ఇంకా ఏవేవో పాత సామాను వేసి వుంది. మరోవైపు కంది బస్తాలు ఉన్నాయ్. ఆ బస్తాల చుట్టూ అక్కడక్కడ కంది గింజలు ఉన్నాయ్.     సరోజని గోళ్ళు చూసుకుంటూ కూర్చుంది. అమూల్య ఆ చేతులకేసి చూసింది. ఎంతో మొరటుగా అక్కడక్కడ పగుళ్ళు వున్నాయి.     తమ ఇంటి పనిమనిషి పోచమ్మ చేతులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఎత్తుకుంటే చేతులు గుచ్చుకుంటున్నాయ్ అని ఏడ్చేది. పెద్దయ్యాక ఒకసారి ఆ చేతులు అరచేతులు తాకి చూసింది. గరుగ్గా మొరటుగా తగిలాయి.     ""పనిచేసుకొనేటోళ్ళం. మీ చేతుల్లా ఎట్టా మెత్తగా ఉంటాయ్"" అంటూ నవ్వింది పోచమ్మ.     అంటే ఇంటి పనులన్నీ సరోజ, వాళ్ళ అత్తగారే చేసుకుంటారన్నమాట.     తన ఆడబిడ్డల చేతులు అలా ఉండవ్. వంటలో తల్లికి సహాయం చేసినా వాళ్ళు అంట్లు తోమరు. పిండి రుబ్బరు.     వీళ్ళు చాలా ధనవంతులట. మరి వంటమనిషినీ, పనిమనిషినీ పెట్టుకోరా? ఇల్లు చాలా పెద్దదిగానే వున్నది. కాని ఒక తీరూ తెన్నూ లేకుండా వున్నది. గోడలనిండా పాతకాలపు నాయకుల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు, కాలెండర్లూ.     ""మీ పేరు"" సరోజిని అడిగింది జంకుగా.     ""అమూల్య.""        ""చాలా బాగుంది. మీ చీర కూడా బాగుంది. మీరూ బాగున్నారు.""     అమూల్య నవ్వింది చిన్నగా.     ""మీరు బాగున్నారు.""     ""పల్లెటూరివాళ్ళం.""     ""ఏం చదువుకున్నారు.""     ""ఎనిమిది వరకు""     అమూల్య ఆశ్చర్యంగా చూసింది.     ""మీరూ.""     ""ఏం.ఏ.""     సరోజిని కళ్ళు పెద్దవి చేసి చూసింది.     ""మీరు పుస్తకాలు చదువుతారా.""     ""తెలుగు నవలలు చదువుతుంటాను.""     ""ఒసే పిల్లా ఇలారా!""     ""ఇప్పుడే వస్తాను"" అంటూ సరోజని లోపలకు వెళ్ళింది.     అలా వెళ్ళిన సరోజిని అర్థగంట దాకా బయటికి రాలేదు.     ""పక్కగదిలో మగవారు భోజనం చేస్తున్నారు. పదినిమిషాల్లో అయిపోతుంది. మీకు బాగా ఆలస్యం అయింది. వాళ్ళు తినగానే మీకు వడ్డిస్తాను"" అన్నది సరోజిని.     అమూల్య సరోజినిని చిత్రంగా చూసింది. అంటే తనకు శ్రీధర్ తో రఘుతో భోజనం పెట్టలేదన్న మాట. ఇదేం లంచ్.     ""వస్తాను వాళ్ళకు ఏం కావాలో....""     ""మీరు వడ్డిస్తున్నారా?""     ""కాదు అత్తయ్య వడ్డిస్తున్నది. నేను వంటింట్లో అన్నీ తయారుగా ఉంచి ఆమెకు అందిస్తున్నాను"" అంటూ లోపలకు వెళ్ళింది.     మరో పదిహేను నిమిషాలకు సరోజిని అత్తగారు వచ్చింది.     ""లే తల్లీ. చాలా ఆలస్యం అయింది. కాళ్ళు కడుక్కో""     దొడ్డి వాకిలి గడప మీద సబ్బు. చెంబుతో నీళ్ళు అందించింది. అమూల్య చెయ్యి మాత్రం కడుక్కుంది. సబ్బు అందివబోతే వద్దు అంది.     గదిలోకి తీసుకెళ్ళారు. డైనింగ్ టేబుల్ పర్వాలేదు. బాగానే వుంది అనుకుంది.     ఆమె ముందు వెండి పళ్ళెం పెట్టారు.     ""మరి మీరు కూర్చోరూ?""     ""మేం తర్వాత తింటాం""" 14,"     మార్వాడీ అలంకరణలోనే వున్నాయా ఇంటి గదులు. డైనింగు రూముకీ, డ్రాయింగ్ రూమ్ కీ మధ్య తెర వుంది. అతడు ముందు ఆఫీసు గది వెతకటం మొదలుపెట్టాడు. అన్నీ సైన్సు పుస్తకాలూ, జర్నల్సూ వున్నాయి. డ్రాయరు తాళాలు గోడకి తగిలించి వున్నాయి. వాటి సాయంతో డ్రాయరుతీసి వెతికేడు. నాలుగైదు ఫైల్స్ దొరికాయి.     గోడలకు గానీ, తివాసీ క్రిందగానీ రహస్యపు అరలు ఏవైనా వున్నాయేమో అని తడిమి చూసేడు. అలాంటిదేమీ కనబడలేదు.     అతడు ఫీజు రూమ్ లోంచి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాడు. మార్వాడీల ఇల్లు అది. గది గోడలకి రకరకాల ఫోటోలు వంశంలో అందరివీ తగిలించటం అలవాటు. ఆ ఫోటో వరుసల మధ్యలో ఒక దంపతుల ఫోటో వుంది. ఇరవై సంవత్సరాల క్రితందయినా అందులో పోలికల్ని అతడి చురుకయిన కళ్ళు వెంటనే పసిగట్టినయ్. అతడు అచేతనుడయ్యాడు. తన కళ్ళనే నమ్మలేనట్టుగా అలా వుండిపోయాడు.     అందులో వున్నది ఎస్. కె. నాయుడు.     అతను ఒక్కగెంతులో దాని దగ్గిరకి వెళ్ళి దాన్నీ, దాని పక్క గ్రూపు ఫోటోనీ పరిశీలించి చూసేడు. చంపాలాల్ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళ గ్రూప్ ఫోటో అది. నాయుడు భార్య, చంపాలాల్ అక్క అని నిశ్చయమై పోయింది.     ఎస్.కె. నాయుడు ఎవరో మార్వాడీల అమ్మాయిని చేసుకున్నాడని తెలుసు కానీ, అది చంపాలాల్ అక్కయ్యనే అని తెలీదు. ఇంకెవరికయినా తెలిస్తే తెలుసేమోగానీ, కనీసం తన సర్కిల్ లో తెలీదు.     ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి అతడికి కొంత సమయం పట్టింది. ఈ విషవృక్షపు వేళ్ళు ఎంత లోతుగా పాతుకుపోయాయో అర్థం కావటానికి ఆలస్యమైంది.     ఆ ఆలోచనలో అతడు బయట అలికిడి గమనించలేదు.     ""ఎవరది?"" అని వినిపించేసరికి ఉలిక్కిపడ్డాడు.     తను వెతకటానికి ఇంట్లోకి వస్తూ లోపల తలుపు గడియ వేసుకున్నాడు. బయట తాళం లేదు. కానీ వచ్చినవాళ్ళు ఎవరు? వాళ్ళకి తెలుసా చంపాలాల్ ఊర్లో లేడని? వాళ్ళకి అనుమానం వస్తుందా? అతడు తలుపు దగ్గిరకి వెళ్ళి సందుల్లోంచి చూసేడు. అటువైపు చుట్టతో నిలబడి వున్నాడు.     ఆ నిలువెత్తు విగ్రహం నాయుడిది.     కో-ఇన్సిడెన్స్ గురించి ఆలోచించేంత టైమ్ లేదు. ఒక్క గెంతులో వెనుక గదిలోకి వచ్చాడు.     బయట అతడికి అనుమానం వచ్చినట్టుంది. తలుపు దబదబా బాదుతున్నాడు. శేఖరానికి ఏం చెయ్యాలో తోచలేదు. వెనుక వరండాలోకి వచ్చాడు. అక్కడ బాల్కనీకి నాలుగు అడుగుల ఎత్తున గోడ వుంది.     అతడు మూడో అంతస్తులో వున్నాడు.     గోడపక్కనుంచి నీళ్ళ గొట్టం వుంది. కానీ అది బాల్కనీకి ఎనిమిది అడుగుల దూరంలో ఉంది.     శేఖరం చూపు బాత్ రూము పక్కనున్న వెదురుకర్ర మీద పడింది. దాని ఆధారంతో నీళ్ళ గొట్టం చేరుకోగలిగితే, అక్కణ్నించి నెమ్మదిగా క్రిందికి పాకవచ్చు, ఎవరూ చూడకపోతే అదృష్టమే.     అతడు దాన్ని తీసుకుని బాల్కనీవైపు వస్తుంటే- బయట తలుపు గడియ వూడిపోయిన శబ్దమయింది. నాయుడు లోపలికి వస్తున్నాడు. లోపల ఎవరో వున్నట్టు అతడు పసికట్టినట్టున్నాడు.     శేఖరం బాల్కనీ గోడమీద నుంచి నీళ్ళ గొట్టానికి కర్ర ఆన్చి దాన్ని పట్టుకుని, క్రిందికి దిగే సమయానికి నాయుడు అక్కడికి చేరుకున్నాడు. శేఖరం గాలిలో వుండే తలపైకెత్తి చూసేడు. అదే సమయానికి నాయుడు క్రిందికి చూసేడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.     నాయుడు బాల్కనీ గోడమీదకు వంగి, సన్ షేడ్ ని ఆనుకుని వున్న కర్రని కాస్త కదిలించాడు.     దాంతోపాటూ శేఖరమూ గాలిలో వూగేడు.     నీళ్ళగొట్టం ఇంకా ఆరడుగుల దూరంలో వుంది. బాతులూ, తాబేలు కథలో లాగా అతడు మధ్యలో కర్రని పట్టుకుని అటు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు. నీళ్ళ గొట్టపు సందుల్లో ఇరికించిన కర్ర ఏ క్షణమైనా బయటకు జారిపోయేలా వుంది. ఈ లోపులో నాయుడు కర్రని మళ్ళీ కదిలించాడు. శేఖరం వళ్ళు జలదరించింది. అక్కణ్నుంచి జారితే....     ఆ ఆలోచన భయంకరంగా తోచింది. మరికొద్దిగా నీళ్ళ గొట్టంవైపు వెళ్ళబోయాడు. నాయుడు వంగి కర్రని తన వైపుకి లాక్కున్నాడు. ఒక క్షణం ఆలస్యమయితే కర్రతోసహా తను నేలమీదకు పడిపోతానని శేఖరం గ్రహించాడు. ఇక నీళ్ళ గొట్టాన్ని చేరటానికి టైము లేదు. తప్పనిసరిగా నాయుడు వున్నవైపే రావల్సి వచ్చింది. కర్రని పట్టుకుని కాస్త ఇటుగా వచ్చేసరికి నాయుడు దాన్ని పూర్తిగా లాగెయ్యటమూ- శేఖరం దాన్ని వదిలేసి సన్-షేడ్ ని పట్టుకోవటమూ రెప్పపాటులో జరిగిపోయాయి. కర్ర క్రిందికి జారి ఎక్కడో అఘాతంలో పడిన చప్పుడు వినిపించింది.     సన్ షేడ్ ని పట్టుకుని శేఖరం గాలిలో వేలాడసాగేడు. మూడో అంతస్తు అది. నాయుడు తనకి చెయ్యి అందిస్తాడేమో అని తలపైకెత్తి చూసేడు. బాల్కనీలో వున్న నాయుడు అటువంటి ప్రయత్నమేదీ చెయ్యకుండా ""చెప్పు, ఎవరు నువ్వు? నువ్వు దొంగతనానికి రాలేదు. ఎందుకొచ్చావ్? చెప్పు"" అని అడిగాడు. శేఖరం మట్లాడలేదు.     నాయుడు అక్కణ్నించి కదిలి లోపలికి వెళ్ళి ఫ్రిజ్ తెరిచి ఒక బీరుసీసా తీసుకుని వచ్చి బాల్కనీలో కుర్చీ వేసుకుని కూర్చుని తాపీగా తాగటం మొదలుపెట్టాడు.     నవ్వుతూ ప్రాణాలుతీసే హంతకుల్నీ, రక్తపాతం జరుగుతూ వుంటే ఆనందించే వాళ్ళనీ చూసేడు గానీ ఇంత శాడిస్టుని ఎక్కడా చూడలేదు. అతడికి అసలు నాయుడు ఉద్దేశ్యం ఏమిటో అర్థం కాలేదు.     ఒకవిపు విసిరేసినట్టున్న ప్లాట్ అది. అవతలి ప్రక్క అంతా బహిర్ ప్రదేశం. ఎవడూ చూడటానికి కూడా అవకాశం లేదు. సన్- షేడ్ పైకి రావటానికి బలం సరిపోవటం లేదు. కానీ ఎంతసేపలా?     చేతులమీద శరీరపు బరువు ఆన్చి, గాలిలో నిలబడి వుండడం క్షణక్షణానికి కష్టం అవుతూంది. చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి. పాము కప్పని మింగుతూంటే దూరం నుంచి చూసేవాడిలా బాల్కనీలో కూర్చుని నాయుడు చిత్రంగా చూస్తూ బీరు తాగుతున్నాడు- చాలా కామ్ గా.     అంతలో చేతులమీద ఏదో పాకినట్టయి తలెత్తి చూసేడు. చేతులు పైన వుండటం వల్ల ఏం పాకుతున్నదో తెలియలేదు. అతడి వెన్ను ఒక్కసారిగా జలదరించింది. అంతలో ఏదో కుట్టినట్టు చురుక్కుమంది.     చేతులు వదిలేసాడు.     దాంతో గాలి విపరీతమైన వేగంతో రివ్వున చెవుల్లోకి కొడ్తూవుండగా అతడు భూమివైపు జారిపోయాడు.     మోహన్ లాల్ కపాడియా ఇన్ స్టిట్యూట్ విశాలమైన ఆవరణలో విసిరేసినట్టున్న ఇళ్ళ వెనుక పనికిరాని చెత్తనంతా పారవేసే ఆ ప్రదేశంలో ప్రహరీకి కాస్త ఇవతల చిన్న సిమెంట్ కుండీపక్కన, చరిత్రలో ఏ ప్రాముఖ్యత లేకుండా కొన్ని వందల సంవత్సరాలనుంచీ పడివున్న ఒక రాయికి అకస్మాత్తుగా విశిష్టత లభించింది. దాంతోపాటూ అ కుండీకి కూడా. ఆ రెండూ అక్కడ లేకపోతే ఏమై వుండేదో తెలీదుగానీ, ముందు ఆ కుండీ అంచు అతని గెడ్డానికి కొట్టుకుంది." 15,"    ""ఎవరదీ?"" అంది, ద్వారం దగ్గర నిలబడిన సంధ్యని చూపు ఆననట్టుగా చూస్తూ.     ""అత్తమ్మా! నేను ..... సంధ్యని!"" డగ్గుత్తికతో అంది సంధ్య.     ""సంధ్యవా! ఇన్నాళ్ళకి ఈ అభాగ్యురాలిని చూడాలనిపించిందా?"" ఆవిడ గొంతు గాద్గదికమైంది. ""రావే! ఎలా అయిపోయానో చూద్దువు రా!""     ""అత్తమ్మా!"" సంధ్య పరుగున వచ్చి నర్సమ్మని అల్లుకుపోయి ఆవిడ గుండెలో తలదాచుకొంది.     హృదయంలో మమకారం అంతా వెల్లువలైనట్టుగా సంధ్యని గుండెల్లో పొదువుకొంది నర్సమ్మగారు. ""సింహం నన్ను అన్యాయం చేసి పోయాడే! నీ కుంకుమ గట్టిది కాబట్టి ఆ జానకమ్మ కొడుకు వచ్చి ఆ పెళ్ళితప్పించి తీసుకుపోయాడు!"" సంధ్యని తననుండి ఎడంచేసి మంచంమీద కూర్చోబెట్టింది. ""నిన్నుచూడగానే నాకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టుగా ఉందే! ఏమిటో పిచ్చిమనసు! నర్సమ్మత్త చచ్చిందో, బ్రతికిందో ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంటావు! రేపో, మాపో వెళ్లిపోతావు! అవునా?""     ""వెళ్ళిపోనత్తా! ఇహ ఎప్పటికీ నీ దగ్గరే ఉండిపోడానికి వచ్చాను!""     ""నిజమా? ఎంత చల్లనిమాట విన్నానే? అయితే, ఆ అబ్బాయి, అదే ఆ జానకమ్మ కొడుకు నిన్ను పెళ్ళి చేసుకోలేదా?""     ""ఉహుఁ ఆ కధంతా తరువాత చెబుతానుగాని, ముందు వేడివేడిగా ఒక కప్పు కాఫీ కావలత్తమ్మా!..... కాని, ఏడాదిలో ఎన్ని అనుభవాలు? తలుచుకొంటే గుండె జల్లుమంటూంది! ఎన్నిరకాల మనుషులు! ఎంత తమాషా ప్రపంచం! ఎంత స్వార్ధం! ఎంత కుశ్చితం!"" అని ఒక నిట్టూర్పు విడిచింది సంధ్య.     ""అయ్యో! ప్రయాణంచేసి వచ్చిన పిల్లని అలా ఉంచేసి మాట్లాడుతున్నాను! కూర్చోవే! క్షణంలో చేసుకువస్తాను!""     ""నేను చేసుకొంటానత్తమ్మా! నువ్వే చాతకాకుండా ఉన్నావు!""     ""నిన్ను చూశాక నాకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టుగా ఉందే! ప్రయాణంచేసి అలసివచ్చావు! కాస్సేపు విశ్రాంతి తీసుకో! తరువాత ఈ సంసారమంతా నీకు అప్పగించి నేను విశ్రాంతి తీసుకొంటాను! సంధ్యే ఉంటే నాకిన్ని కష్టాలు ఉండేవి కాదని ఎన్నిసార్లు అనుకొన్నానో!""                           *        *        *     గదిలో సంధ్యకి బదులు సంధ్య వ్రాసిన ఉత్తరం దొరికింది అరుణ్ కు.     ""అరుణ్!         నేను వెళ్ళిపోతున్నాను! నీతో పెళ్ళికి నా మనసు అంగీకరించడం లేదు! అత్త మనసు కష్టపెట్టి, ఆమె ఆశీర్వాదం లేకుండా నిన్ను చేసుకొని నేను సుఖపడలేనని నా మనసు దృఢంగా నమ్ముతూంది! అందుకే వెళ్ళిపోతున్నాను! నాకోసం వెదకొద్దు! మనసు రాయి చేసుకొంటే కొన్నాళ్ళకి అత్తమాట వింటావు! దయచేసి మీ తల్లీ కొడుకుల్ని విడదీసిన పాపం నాకు చుట్టుకొనేలా చెయొద్దు!                                                                                                                      ఇట్లు,                                                                                                        ___నీదికాలేని సంధ్య.""     గదిలో ఎక్కడి సామాను అక్కడ వదిలేసి పోయింది! సంధ్యకి తను కొనిచ్చిన చీరలు, ఇతర వస్తువులు ఏవీ తీసికెళ్ళలేదు!     సంధ్యకి ఏమొచ్చింది? వట్టి క్రాక్ లా ప్రవర్తించింది! ఎంతసేపు, అత్త ఒప్పుకోలేదన్న గొడవ తప్పితే తన గొడవ పట్టలేదు! అమ్మ కోపం కొద్దిరోజులే ఉండేది! నాన్న తాతయ్యని కలుసుకొన్నట్టే తనూ అమ్మని కలుసుకొనేవాడు! నాన్నకు పట్టినన్ని రోజులుకూడా పట్టేవికాదు, తను అమ్మ కోపం పోగొట్టి దగ్గరకావడానికి!     'సంధ్య ఎక్కడికో ఎందుకు వెళ్ళి ఉంటుంది? రాజానగరమే వెళ్ళి ఉంటుంది!' అనుకొన్న తక్షణం తను మద్రాస్ నుండి వస్తూ సంధ్యకని తెచ్చిన పట్టుచీర, ఎర్రరాళ్ళ నెక్లెస్ - అవికూడా తీసుకొని బయల్దేరాడు!                                                  *        *        *     ఇంటిముందు కాలవలో బట్టలుతుకుదామని వస్తూన్న సంధ్య దూరం నుండి అరుణ్ కారురావడం చూసి లోపలికి పరిగెత్తింది!     ""అత్తమ్మా! అరుణ్ వస్తున్నాడు! నేనిక్కడికి రాలేదని చెప్పు!""" 16,"     పది నిమిషాల తరువాత వచ్చాడు జాకీ.     ఆ వెనుకే ట్రైనర్ కూడా వచ్చాడు.     ప్రపంచంలోని అవమానం, జెలసీ, కోపం అంతా యజ్ఞభూపతి ముఖంలో కనిపించాయి ఆ ట్రైనర్ కి, జాకీకి.     అందుకే భయంగా బిక్కుబిక్కుమంటూ నిల్చుండిపోయారే తప్ప మాట్లాడలేకపోయారు.     ""ఎలా జరిగింది?"" గర్జించినట్లున్నాయి యజ్ఞభూపతి మాటలు. స్కాండ్రర్ చాల సెన్సిటివ్. దాని జాతిలక్షణం ప్రకారం గెలప్పింగ్ లోనే దాని స్పీడ్ ని పికప్ చేసుకోవాలి. కాని దాన్ని జాకీ అకారణంగా కావాలనే రాంగ్ పార్టులో హిప్ చేసుంటాడు. దాంతో స్కాండ్రర్ ఇరిటేట్ అయిపోయి 150 గజాల దగ్గర మొరాయించింది. అప్పుడు గమనించాను నేను-దాన్ని జాకీ కావాలనే బాగా పరిగెత్తుతున్న స్కాండ్రర్ కి కోపం తెప్పించాడు అవి, ఆ తరువాత దాని గేలప్పింగ్ లో మార్పు వచ్చింది. అది నేను గమనిస్తున్నంతలో శశాంక గుర్రం హఠాత్తుగా పుల్ గేలప్ అందుకుంది"" భయం భయంగానే చెప్పాడు ఆ జాకీ.     భూపతి సీరియస్ గా చూసాడు జాకీవేపు.     ""అందుకే నా గుర్రాన్ని భరత్ గుర్రం మీదకు దూకించాను.     ""ప్రయోజనం...."" వశిష్ట అడిగాడు.     ""అప్పటికి పరిస్థితి దాదాపు చేయిదాటిపోయినట్లుగా అనిపించింది.     భరత్ గుర్రం పిప్ పోస్టుకి దాదాపుగా దగ్గరయింది. పై పెచ్చు భరత్ చాలా తెలివిగలవాడు. అతని రైడింగ్ విధానాన్ని బట్టిచూస్తే చాలా గొప్ప టెక్నికల్ ట్రైనర్ దగ్గర శిక్షణ పొందినట్లుగా అనిపించింది. స్కాండ్రర్ ఎప్పుడైతే మొరాయించిందో దాన్ని క్షణంలో వెయ్యోవంతులో గమనించ గలిగాడు. ఆ వెంటనే తన గుర్రాన్ని హిప్ చేసాడు. అది మెరుపు వేగాన్ని అందుకుంది. అప్పుడిక నేను చేయగలిగింది ఒక్కటే_భరత్ ను గుర్రంమీంచి పడగొట్టడం. ఏధిక్స్ కి విరుద్ధమైనా మీ సొమ్ము తిన్నవాడ్ని కనుక ఆ పనికి సిద్ధపడ్డాను.""     ""గుర్రాన్నే అడ్డుకొనవచ్చుగా"" వశిష్ట ప్రశ్నించాడు. ఆ వేగంలో వెళ్తున్న భరత్ గుర్రాన్ని థర్డు ప్లేస్ లో ఉన్న నేను ఢీ కొట్టడం సాధ్యం కాదు. అది గెలవటం ఖాయం. అందుకే భరత్ ని దానిమీంచి పడగొడితే గుర్రం విన్ పోస్టు దాటినా ప్రయోజనం ఉండదు. అది నేను చేయగలిగితే భరత్ క్రిందపడటం, భరత్ గుర్రం విన్ పోస్టు దాటడం జరుగుతుంది. జాకీ లేకుండా గుర్రం ఫస్టులో విన్ పోస్టు దాటినా రూల్ ప్రకారం గెలిచినట్లు కాదు. అప్పుడిక కాదనుకున్నా సెకండ్ లో ఉన్న స్కాండ్రర్ గెలిచి తీరుతుంది__""     ""మరెందుకు ఆ పని చేయలేక పోయావు?""     యజ్ఞభూపతికి ఇంకా కోపం తగ్గలేదు.     ""చేసాను కాని....చెప్పానుగా భరత్ చాలా తెలివిగలవాడు. ఇలాంటిదేదో జరగవచ్చని ఊహించి ఉంటాడు. నేను కొట్టిన దెబ్బకి అతను జారిపడాలి. కాని బలవంతాన బిగబట్టి మరీ కూర్చున్నాడు. విన్ పోస్టు దాటాక ఆ విసురికి జారిపడ్డాడు.     ""నీవింకా గట్టిగా ఢీ కొట్టవలసింది.""     ""కొట్టవచ్చు కాని నలుగురు దృష్టిలో పడితే ఆ రేస్ ని క్లబ్ ఎత్తి వేయవచ్చు లేదా రూల్స్ ని అతిక్రమించినందుకుగాను నన్ను సస్పెండ్ చేసి ఉండేవారు.     ""జాకీ చెప్పే ప్రతిమాట శ్రద్ధగా వింటున్న భూపతికి జాకీ తీసుకున్న రిస్కు అర్ధమయిపోయింది.     ""వెరీగుడ్"" అంటూ వశిష్ట వేపు చూసాడు భూపతి.     ""వశిష్ట ఓ పాతికవేలు తీసి సగం సగం ఆ జాకీకి, ట్రైనర్ కి ఇచ్చాడు.     ""జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలేవీ బయటకు పొక్కకూడదు"" అన్నాడు. భూపతికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు.     ఇంకా ఆలోచనల్లోంచి, అవమానం నుంచీ తేరుకొని భూపతి వేపు చూస్తూ ఆజ్యంపోసాడు వశిష్ట__     ""దీనివెనుక శశాంక బుర్రకంటే, అతని దగ్గర ఈ మధ్యనే చేరిన యజ్ఞభూపతికి ఇంకా కోపం తగ్గలేదు. శుక్రాచార్య అనే కురువృద్ధుడు బుర్రే ఉపయోగపడినట్లు అనిపిస్తోంది. ఈ శుక్రాచార్య అనే అతను అమోఘమైన తెలివితేటలున్నవాడని. అపర చాణక్యుడని తెలిసింది. అలాంటి వాడికి చంద్రగుప్తుడు లాంటి మరో కుర్రాడు దొరికాడు. అతనే భరత్....అశ్వభరత్....శశాంక కొత్త జాకీ.     పచార్లు చేస్తూన్న భూపతి వశిష్ట చివరి మాటలు విని ఠక్కున ఆగిపోయాడు.     భరత్....అశ్వభరత్ పేరుండటం ఆశ్చర్యంకాదు. అని అశ్వభరత్ అని ఉండటం ఆశ్చర్యమనిపించింది. అప్పట్లో నాకు...."" గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడు.     ""అప్పట్లో....అంటే....ఎప్పట్లో....? ఎక్కడా? ఎలా?"" వశిష్ట అడిగాడు ఆతృతగా.     భూపతి మరలా పచార్లు మొదలెట్టాడు. ఆలోచిస్తున్నాడు. పది నిముషాలు మౌనంగా గడిచాయి. ఠక్కున ఆగిపోయాడు భూపతి.     ""అనంత్ దగ్గర....మన రాయల్ కింగ్ ని అనంత్ ట్రైనింగ్ సెంటర్ ని పంపించిన సందర్భంలో ఓసారి పూనా వెళ్ళాను. అప్పుడు అక్కడ ఈ పేరే....అశ్వభరత్ అన్నది వినిపించింది. వీటన్నిటికన్నా అనంత్ గతంలో ఎవ్వరికీ ఇవ్వనంత మంచి ట్రైనింగ్ ఆ కుర్రాడికి ఇవ్వటం కూడా ఆశ్చర్యం కలిగించింది. అతనే ఇతను అయి ఉండాలి. ఏది ఏమైనా అతని గురించి వెంటనే ఎంక్వైరీ చేయ్...."" భూపతి చెప్పటం ఆపి సోఫాలో కూర్చుని షాంపైనో బాటిల్ ఓపెన్ చేసాడు.     ""మీ వూహ కరక్టు కావచ్చు. ఎందుకంటే అతని స్కిల్ చూసిన మనకే ఆశ్చర్యమేసింది. అంటే ఆటను తప్పక అనంత్ దగ్గర ట్రైనింగ్ పొంది ఉండాలి.     ""అదే అదే కనుక్కో.""     ""కాని లాభం....శుక్రాచార్య అంటే ఇతనికి ఎనలేని గౌరవాభిమానాలు. శుక్రాచార్యకు శశాంకతో ఏవో పనులున్నాయి. అవేమిటో మనకింకా తెలియలేదు. అతను అనంత్ శిష్యుడే అయినా శుక్రాచార్యను వదలకపోవచ్చు. కనుక మీరు ఆలోచిస్తున్నట్లుగా అనంత్ ద్వారా భరత్ ని మన జాకీని చేసుకోవాలన్నా సాధ్యంకాకపోవచ్చు.     ఓ గదిలో కూర్చుని కొన్నివేల మైళ్ళు ముందుకువెళ్ళి ఆలోచించగల వశిష్ట అంటే భూపతికి గొప్ప గురి.     తనకు మాత్రమే తెల్సిన ఓ క్లూ వశిష్టకు అందిస్తే దానిమీద ఆధారపడి ఏదైనా ప్లాన్ వేయవచ్చనిపించింది భూపతికి.     ""మన రాయల కింగ్ ని చంపించే ప్రయత్నంలో సుదర్శన్ ని రంగంలోకి దింపారు శశాంక. ఆ సందర్భంలోనే ఇటీవల అనంత్ మీద ఎటాక్ కూడా జరిగింది....""     భూపతి అన్న పైమాటల మిగతా అర్ధం గ్రహించగలిగాడు వశిష్ట.     ముందు ఆశ్చర్యపోయాడు.     ""అనంతమీద శశాంక మనుష్యుల ఎటాక్ అది. అతని ప్రియశిష్యుడైన భరత్ కి తెలియకపోదు. తెలిసీ భరత్ శశాంకకే జాకీ అయ్యాడంటే....?!""     ""గురువు ద్వారా సెంట్ మెంటల్ గా భరత్ ని దెబ్బతీస్తే....     ""లాభంలేదు సార్....ఈమాత్రం మనం ఊహించగలమని వారూ ఊహించగలరు. ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తే తప్ప ఇది బయటపడదు. ఎక్కడో ఏదో పెద్ద మెలిక వుందనిపిస్తోంది.     అది పెద్ద మెలిక అయితే మాత్రం మనం ఓ పని చేయాలి. అసలు శశాంక తేజదత్త ఎక్కడివాడు? తల్లిదండ్రులు ఎవరు? మార్వాడి వంశంలో పుట్టినా తెలుగువాడిలా ఎలా కనిపిస్తున్నాడు. తెలుగు అంత సాఫీగా ఎలా మాట్లాడుతున్నాడు....? తెలుగుతనం అతనిలో ఎందుకు కనిపిస్తోంది....? ఇవి కూడా ఎంక్వయిరీ చేయించు"" అన్నాడు భూపతి దీర్ఘంగా ఆలోచిస్తూ.     వశిష్ట ఉలిక్కిపడ్డాడు ఓ క్షణం. అంతలోనే తేరుకున్నాడు. ""అవన్ని మనకనవసరమేమో....""     ""ఏవీ....?""     ""శశాంక తేజదత్త వంశ పూర్వపరాలు....మనకు కావలసింది ఈ శుక్రాచార్య ఎవరు....? అశ్వభరత్ ఎవరు....? వీరిద్దరి మధ్య వున్న సంబంధం....? వీరికి శశాంకకి వున్న సంబంధం....? అన్నిటికీమించి శశాంక కొడుకు ఎవర్నో మర్డర్ చేశాడు, ఎందుకు? అతను ఆ మర్డర్ చేసేందుకు అతన్ని ఎవరో ప్రవోక్ చేసినట్లుగా శశాంక అనుమానించాడు. మొదట ఆ అనుమానం ఎవరిమీదా రాలేదు కాని ఆ తరువాత అది మీమీదకు వచ్చింది. దానిక్కారణం__మీ గుర్రపుపిల్లల్ని తన మనిషి సుదర్శన్ కాజేసాడని, దివ్యతేజ ద్వారా రాయల్ కింగ్ ఫోటోని ఆ సుదర్శన్ కాజేసాడని, అప్పటినుండి దాన్ని షూట్ చేసేందుకు తన మనిషి ప్రయత్నిస్తున్నాడని__ఇవన్ని దృష్టిలో పెట్టుకొనే పగతో మీరే విశ్వదత్తను ప్రవోక్ చేసారని ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలకి ఈ లాజిక్ చాలు....""     విసురుగా తలెత్తాడు భూపతి.     కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా వున్నాయి.     ఆ పరిస్థితిలో భూపతిని చూసిన వశిష్ట ఒకింత కంగారుపడ్డాడు.     ""అసలు రాయల కింగ్ ని ఫోటో తీసిందెవరు...., ఆ ఫోటో మోతీ దగ్గరకు ఎలా వచ్చింది....""     ఈ వివరాలు కనుక్కునే సందర్భంలోనే మీరు మోతీని చంపించారు. అప్పుడు అక్కడ అనంత్ కూడా వున్నాడని చెప్పారు. అనంత్ ని కనుక్కుంటే ఆ ఫోటోగ్రాఫర్ ఎవరన్నది తెలియవచ్చు.""     ""నాకంతా అయోమయంగా వుంది.""     ""ప్రస్తుతానికి నాకు అంతే__ఎక్కడో ఏదో మెలిక__ఆ మెలిక అడుగున చిన్న కదలిక. ఆ కదలిక పెద్దదయ్యే సూచన కానస్తోంది. తొందరలోనే ఈ మిస్టరీని బయటకు లాగుతాను....""     ""అవి తరువాత, మోసాన్ని మోసంతోనే ఢీకొందాం, ఈ సీజన్ లో హెచ్ ఆర్.పి.కి వచ్చే__గుర్రాలు వాటి వివరాలు- విన్నింగ్ ఛాన్సెస్_వాటి ఓనర్స్_ ట్రైనర్స్_ జాకీలు_ ఈ లిస్టు వెంటనే నాకందించు. అప్పుడిక నేను మొదలెడతాను డ్రామా. అర్ధమైందా....?     అర్ధమైందన్నట్లుగా తలూపాడు వశిష్ట. వశిష్టకు చాలా ఆనందంగా వుంది_ ఈ చిన్న చిన్న డ్రామాల్ని మ్రింగేసే పెద్ద మాస్టర్ డ్రామా బాగా నడుస్తున్నందుకు, త్వరలోనే ఇది పాకాన పడేలా చేయగలిగితే చాలనుకున్నాడు మనసులో నీరసంగా. పడుకొని వున్న భరత్ దగ్గరకు వచ్చింది వచ్చింది త్రివేణి. డాక్టర్ ఎప్పుడు డిస్సార్జి చేస్తున్నారు_? అడిగాడు భుజాలు ఎగరేస్తూ భరత్.  " 17,"     తను తొందరపాటుతోనూ, పెంకితనంతోనూ ప్రవర్తించి వుంటే అతను తనకి కాకుండా పోయేవాడు. అసలా ఆలోచనే ఆమెకి బాధని కలిగిస్తోంది.     మనోహర్     మనోహర్     ఆమె మనసునిండా, గుండెనిండా, ఆలోచనలోనూ పూర్తిగా నిండిపోయాడు మనోహర్.     ప్రతిక్షణం అతని సమక్షంలో వుండిపోవాలనే కోరిక క్షణక్షణానికీ పెరిగిపోతోంది ఆమెకి.     ప్రేమంటే అదే?     ప్రేమకున్న శక్తి అదే?     ఇప్పుడు కేవలం అతను తప్పితే ఈ ప్రపంచంలేదన్న స్థితిలో ఉంది భారతి.     అలాంటి భారతికి పెద్ద హార్డిల్ లా బోసుబాబు దాపురించాడు. కిటికీ లోంచి చల్లని గాలి దూసుకొచ్చి వంటిని తాకుతూ వుంటే మత్తుగా కళ్ళు మూసుకొంది భారతి. ఆమెకి చదవాలనిపించడంలేదు.     అలాగే నిద్రలోకి జారిపోయింది.     మర్నాడు ఉదయం ఎక్స్ పెక్ట్ చేసింది భారతి బోసు మళ్ళీ ఫోన్ చేస్తాడని. టెలిఫోన్ మోగితే చాలు ఆమెచాలా కంగారుగా పరుగెత్తింది. కానీ అతను చేయలేదు. దానితో ఊపిరి తీసుకుంది. తను ఇంటిదగ్గర లేనప్పుడు కనిపెట్టి చూడమని బాలయ్యకి చెప్పింది.     భారతి మనోహర్ని ఇంచుమించుగా ప్రతిరోజూ కలుసుకుంటోంది. క్లాసులకు కూడా వెళ్ళడం మానేసి గంటల తరబరి లాండ్ స్కేప్ గార్డెన్లోనో పిక్చర్ కో వెళ్ళి కూర్చుంటుంది. ప్రేమించిన మగాడితో అలా తిరగడంలో ఎంతో థ్రిల్ వుందని భారతికి అనిపిస్తోంది. ఇంచుమించుగా తిరిగి ఆమెని ఇంటికి సమీపంలో డ్రాప్ చేసి వెళుతున్నాడు బోసుబాబు తనని గమనిస్తున్నాడని భారతికి తెలుసు కానీ అతనేమీ మాట్లాడ్డం లేదు. ఎందుకంట సైలెంట్ గా అయిపోయాడో ఆమెకి అర్థం కాలేదు. బహుశా తన మాటలకి గానీ భయపడ్డాడేమో అనుకొంది. కానీ భారతికి తెలీదు. తుఫాను వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. ఆ తర్వాత తుఫాను తాకిడి మొదలవుతుంది.     బోసు తనని దెబ్బ తీయడానికి మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడని మాత్రం ఆమెకా క్షణంలో తెలీదు. యూనివర్శిటీలో కొంతమంది ఫ్రెండ్స్ తనని జోక్ చేస్తున్నా నవ్వి వూరుకుంటోంది భారతి.     ""పెద్ద బడాయిపోయేదానివిగా, ఇప్పుడు దాన్నేమంటారే!"" అంది వేద.     ""ఎట్టకేలకి మన కథానాయికకి రాకుమారుడు దొరికాడు పాపం?"" కిరణ్ అంది.     ""మాకు మంచి పార్టీకొట్టించు. లేకపోతే గోడలనిండా నీ ప్రేమాయణాన్ని రచిస్తాను?"" అంది ధనలక్ష్మి.     ""పార్టీ ఇవ్వకపోతే గోడలన్నీ పాడు చేస్తావన్నమాట?"" అంది వేదవతి.     ""తప్పేముంది. పాపం పెళ్ళికెలాగు ఇస్తుందిగా పార్టీ?"" కిరణ్ అంది.     ""అలా వీల్లేదు. అడ్వాన్స్ గా ఇవ్వాల్సిందే"" అంది ధనలక్ష్మి.     ""ఎందుకివ్వాలి అడ్వాన్స్ గా"" అంది భారతి చిరుకోపంతో.     ""చెప్పనా?"" అంది ధనలక్ష్మి     ""ఊ?"" అంది భారతి. వాళ్ళ మాటలు సరదాగా వున్నాయి భారతికి.     ధనలక్ష్మి తియ్యగా నవ్వింది. భారతి చెంపల్ని తన చేతులతో సున్నితంగా రాస్తూ అంది.     ""అచ్చటా, ముచ్చటా తీరేది పెళ్ళి అయ్యాకనే కదా? అలాంటిది కొన్ని చిన్న చిన్న ముచ్చటలని అడ్వాన్స్ గా తీర్చుకోవడం లేదా?""     అంటే?"" అంది వేద.     ""ఓ తియ్యని ముద్దని, ఓ మత్తయిన కౌగిలనీ....."" అంది ధనలక్ష్మి.     ఛీ పోండి. సిగ్గులేని వాళ్ళయిపోతున్నారు"" అంది భారతి సిగ్గుతో.     భుజంపైన చెయ్యి పడేవరకనే సిగ్గు, ఆ తర్వాత సిగ్గుండదు. అంతా ఫ్రీ. ఇప్పుడు మేం కొన్ని ప్రశ్నలేస్తాము, నువ్వు సమాధానం చెప్పాలి"" అంది ధనలక్ష్మి.     ""పోవే పాపం అదలా సిగ్గుపడుతోంటే దాన్నెందుకు చంపుతావు. పోనీ ఆ అడిగేదేదో నన్నడుగు నేను చెబుతాను"" అంది వేదవతి.     ""నువ్వు చెబుతావా! కొంపదీసి దాని ప్రియుడు నిన్ను ముద్దు పెట్టుకున్నాడా"" అంది ధనలక్ష్మి.     ఆ మాటలకి అందరూ నవ్వుకున్నారు.     ""ఛీ పాడుముండా, ఏమిటే ఆ మాటలు"" అంది వేదవతి.     ""ఇప్పుడు చెప్పు. నీ ప్రియుడు నిన్ను ముద్దుపెట్టుకున్నాడా లేదా?"" ధనలక్ష్మి.     ""అతను నిన్ను మొదటిసారి ముద్దుపెట్టుకున్నప్పుడు నీకెలాంటి ఫీలింగ్ కలిగింది!"" కిరణ్.     ""అంతవరకేనా, లేక బిగి కౌగిలిలోకి తీసుకున్నాడా?"" వేదవతి.     వాళ్ళు ఏదో వాగేస్తున్నారు. భారతి చెంపలు ఎర్రబడుతున్నాయి.     ""ఏమిటే అది. పాపం మెడమీద గీసుకొందే!"" అడిగింది ఆశ్చర్యంగా కిరణ్.     ""ముద్దు పెట్టుకున్నప్పుడు అతని గోరు గీసుకొని ఉంటుంది"" వేదవతి నవ్వుతూ అంది.     భారతి అప్రయత్నంగా చేత్తో మెడని తడువుకుంది. అది చూసి వాళ్ళు నవ్వుతుంటే భారతికి కోపం వచ్చింది.     ""మీ మాటలన్నీ విన్నాక, ఈ విషయాల్లో మీ అందరికి బాగా ఎక్స్ పీరియన్స్ ఉన్నట్లు అర్థం అవుతోంది"" అంది భారతి చిరుకోపంతో.     ""నువ్వేం తిట్టినా ఓ.కె. మాకు కోపం రాదు. అడ్వాన్స్ గా పుచ్చుకున్న మొదటి ముద్దు ఎలా వుందో చెప్పు"" అంది వేదవతి.     ""నేనే ముద్దు పుచ్చుకోలేదు. పిచ్చిమాటలు మరోసారి మాట్లాడితే, అలాంటి ఏర్పాటు మీ అందరికి చేస్తాను?"" అంది .     ""బాబ్బాబు..... మా అయ్య ఎలాగూ కట్నం ఇచ్చుకోలేడు. ఆ పుణ్యం ఏదో కట్టుకో, లేకపోతే నీ ప్రియుడ్ని మేం కొట్టేస్తాం"" అంది కిరణ్.     అంతలో కారు వచ్చి ఆగింది.     ""అదుగో నీ ప్రియుడొచ్చాడు?"" అంది ధనలక్ష్మి.     భారతి సిగ్గుతో వాళ్ళని చూసి గబగబ కారు దగ్గరికి నడిచింది.     భారతి కారెక్కగానే మనోహర్ కారు స్టార్ట్ చేశాడు. ఆమె ఫ్రెండ్స్ అక్కడే కూర్చుని నవ్వుతున్నారు. ఆమె చెంపలు గులాబీరంగులోకి మారుతున్నాయి. మనోహర్ నవ్వుతూ చూశాడు భారతిని. అతను ఆమె భుజంపైన మెడవెనకనుంచి చేతిని వేసి దగ్గరగా లాక్కున్నాడు. భారతి గువ్వలా జరిగింది." 18,"     ""ఏమిటి! ఇందూ"" అన్నాడు కంగారుగా.     ఇంద్రసేన కళ్ళముందు చీకటి వలయంలా ఏర్పడసాగింది.     కాళ్ళు తేలిపోసాగాయి. కళ్ళకి ఏం కనిపించటం లేదు.     ""ఏమండీ నాకు... నాకు... ఏమేమో... అయిపోతుందండీ"" అంది చాలా నీర్సంగా.     ""ఏమిటి ఇందూ"" ఆమె భుజాలు పట్టి ఊపుతూ కంగారుగా అడిగాడు.     ""ఏమో"" అంటూ చెప్పింది. ఆ తరువాత ఆమెకు ఏం తెలియలేదు.     ఇంద్రసేన స్పృహతప్పి పడిపోయింది.     కృష్ణమౌళి కంగారుగా ఆమెను రెండు చేతులతో లేవనెత్తి తీసుకెళ్ళి మంచంమీద పడుకోబెట్టి ముఖంమీద నీళ్ళు జల్లాడు.     అందరూ ఆతృతగా చూడసాగారు.     అతనికి ఒకటే కంగారు గాబరాగా ఉంది. ఈ సమయంలో ఇందూకి ప్రాణంపోతే!     ఆ ఊహే భరించలేకపోయాడు.     వెంటనే కారు సిద్ధం చెయ్యమని కారులో ఇంటికి తీసుకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.     ఎక్కడనుండి అయితే గుడి దగ్గరకు వచ్చారో అక్కడికే తిరిగి కారులో బయలుదేరారు.     ఇంద్రసేన తల అతని ఒడిలో వుంది. కారు బయలుదేరింది.                                   65     కారు పోర్టికోలో ఆగింది.     కృష్ణమౌళి ఒడిలో తల పెట్టుకుని వెనకసీట్లో పడుకుని ఉంది ఇంద్రసేన.     ఆమెను లోపలకు తీసుకువెళ్ళారు.     ఇందూకి స్పృహ వచ్చి కళ్ళు విప్పి చూసింది.     తను ఒక గదిలో మంచంపై పడుకుని ఉన్నట్టు గ్రహించుకుంది. టైము చాలా అయిపోయింది అని కనురెప్పలు ఎత్తి పక్కకు చూసింది.     తల దగ్గర కృష్ణమౌళి కూర్చుని ఆమె తలపై చెయ్యివేసి ఆప్యాయంగా నిమురుతున్నాడు.     ఒక్కక్షణం కళ్ళు మూసుకుంది.     ""ఇందూ!"" అనురాగంతో పిలిచాడు.     ""ఊ"" నీరసంగా పలికింది.     ""కాఫీ తాగుతావా!""     ఆమె మాట్లాడలేదు.     ""ఇందూ ఎందుకీ పట్టుదల? మన ఇద్దరం భార్యాభర్తలం అయ్యాం. మనలో మనకి ఈ పంతాలు, పట్టింపులూ ఏమిటి చెప్పు""     ఆమె మాట్లాడలేదు.     ""నా మాటవిని భోజనం చెయ్యి. ఇన్ని రోజులా పచ్చి మంచినీళ్ళు కూడా గొంతుకలో పోసుకోలేదు. నువ్వు ఏమయినా అయిపోతే నేను అంటూ ఉంటాననే అనుకుంటున్నావా!"" అతని కంఠం గాద్గదికం అయింది.     ఇందూ ముఖంలో కోపంగాని, శాంతంగాని ఎలాంటి భావాలు కనిపించలేదు.     ఆమె మాటకు ఎదురుచూడకుండా ఒకామెను పిలిచి ఇందూకి భోజనం తెమ్మని చెప్పాడు.     పదినిముషాల్లో ఆమె భోజనం తెచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది.     ఇందూ భోజనం చెయ్యడానికి ఇష్టపడలేదు. మొదట ముఖం తిప్పేసింది.     అతను ఆమెను వదిలిపెట్టలేదు.     ""పట్టుదల వస్తే నేను మనిషిని కాదు. రాక్షసత్వం వస్తుంది నాలో, నా మాటవిను"" అంటూ బ్రతిమాలసాగాడు.     కంచంలో అన్నం కలిపి దగ్గరకు తీసుకువచ్చాడు.     ""నాకు.... నాకు... వద్దు"" నీరసంగా చెప్పింది. అతను వినలేదు.     ఆమె భుజాలచుట్టూ చెయ్యేసి అతని గుండెలకు ఆమెను జేరేసి బలవంతంగా తనే రెండుముద్దలు తినిపించసాగాడు.     ఇందూ ఇక తప్పదు అన్నట్టు బుద్ధిమంతురాలిలా తనే తినసాగింది.     ""ఆ అదీ అలా తినాలి నువ్వు చాలా మంచిదానివి"" అంటూ నవ్వి ఆమె నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు.     ఇందూ భోజనం చెయ్యటం పూర్తయింది. భోజనం చెయ్యటం అవగానే శరీరం తన స్వాధీనం తప్పినట్టు అయింది.     కడుపునిండగానే ప్రాణం తాపీ పడినట్టు అయింది.     మనసులో ఎలాటి ఆలోచనలు లేకుండా ఆ క్షణం హాయిగా అనిపించసాగింది.     కనురెప్పలు బరువుగా మూతలు పడసాగాయి. ""నిద్రవస్తుందా!"" అడిగాడు.     ""ఊ""     ""ఐతే పడుకో ఎలాటి ఆలోచనలూ మనసులో రానివ్వకు. హాయిగా పడుకో. ఈ గదిలోకి ఎవ్వరూ రారు"" అంటూ ఆమె తలక్రింద తలగడ సరిచేసి పడుకోమన్నాడు.     ఇందూ తలవూపి బుద్ధిమంతురాలిలా పడుకుంది.     ఆమెకు అప్పుడే కళ్ళమీదకి మత్తులా వచ్చేస్తుంది.     ఆమె కళ్ళకు అతను కృష్ణమౌళి అవునో కాదో కూడా తెలియటం లేదు.     అంత త్వరగా హాయిగా నిద్రపట్టేసింది.     కృష్ణమౌళి క్షణంసేపు అలాగే చూశాడు.     ""ఇందూ!"" చాలా మెల్లగా పిలిచాడు.     ఆమె పలకలేదు.     ఆమె కళ్ళు అప్పటికే నిద్రలో కూరుకుపోయాయి.     ఒంటిమీద తెలివిలేకుండా పడుకుని నిద్రపోతుంది.     ఇంద్రసేన ముఖంలోకి అలాగే చూడసాగాడు.     ఎంత సౌందర్యరాశి!" 19,"                                               అందమైన అపశృతి                                                                     -కురుమద్దాలి విజయలక్ష్మి.         ఆకాశం మేఘావృతమైవుంది. ఉండిఉండి ఒకటీ అరచినుకులు పడుతున్నాయి.     ""ఒక వురుము వురిమింది"" నవల చదువుతున్న శృతి చదవడంఆపుచేసి నవ్వుకుంది. ""బాగుంది నవలలోనేమో ఒకటీ ఆరా చినుక మాత్రమే పడుతున్నది. బైటమాత్రం ధారాపాతంగాకురుస్తుంది వర్షం. ఇంకానయం  ఈవానకి గాలితోడు కాలేదు"" అనుకుంటూ నవలను తలగడమీద పెట్టి మంచం మీంచి లేచి కిటికీ దగ్గరకు.     కిటికీ కమ్ములు పట్టుకుని బైటకి చూస్తుంటే వాన హొరు వినిపిస్తూ చీకటిలోంచి అప్పుడప్పుడు మెరుస్తూ ఆ మెరుపు వెలుగుకి కన్నులపండుగగా వుంది శృతికి.     ఎక్కడో పిడుగు పడిన శబ్దం.     శృతి వులిక్కి పడింది.     శృతికి పిడుగు శబ్దం అంటేభయం. కిటికీ తలుపుమూసి మంచంవద్ద కొచ్చి కూర్చొంది. ""ఒక వురుము వురిమింది"" నవల  చదవబుద్ధి కాలేదు.     టైమ్ పన్నెండు అయిదు నిమిషాలు.     టైమ్ పీస్ టిక్ టిక్ శబ్దం చేస్తున్నది.     పావుగంట గడిచిపోయింది.     అప్పుడే నిద్రపడుతున్నది శృతికి.     దడదడమంటూ తలుపుపై తట్టిన శబ్దం గట్టిగా వినిపించింది.     ఒక్క వుదుటున మంచం మీదనుంచి లేచివెళ్ళి తలుపు తీసింది శృతి.     శృతిని నెట్టుకుంటూ ఓ యువకుడు లోపలికొచ్చి తలుపు లోపల గడియవిగించి, తలుపుకానుకుని నుంచుని జేబులోంచి రివాల్వర్ తీశాడు. ఇదంతా చాలా క్విక్ గా జరిగిపోయింది.     హఠాత్తుగా జరిగినదానికి బిత్తర పోయింది శృతి. అతని చేతులో రివాల్వర్ సూటిగా తనవేపే వుండటం గమనించి కెవ్వున కేకేయబోయి నోరు తెరిచిందిగాని నోట్లోంచి భయంతో ఎటువంటి శబ్దం రాలేదు.     ""ఇంట్లో నువ్వేనా ఇంకెవరయినా వున్నారా?"" అడిగాడతను.     ""ఎ......ఎ.....ఎవరూలేరు"" భయంతో బిగుసుకుపోతూ ఎలాగో చెప్పింది.     అతను తేలికగా నిట్టూర్పు విడిచాడు. అది గమనించింది శృతి. వచ్చింది ఎవరని అడక్కుండా తలుపు తీసినందుకు తనను తాను తిట్టుకుంది.     ""గుడ్! నువ్వు నా గురించి భయపడే పనిలేదు. నేను దొంగనికాదు, ఆడదానిమీద అఘాయిత్యం చేసేవాడిని కాదు, ఓ ఆపద తరుముకొస్తుంటే పారిపోతూ ఇలా వచ్చాను""     అతను చెబుతుంటే కళ్ళప్పచెప్పి వింటున్నది.     ""నే చెప్పేది జాగ్రత్తగా విను. పోలీసులు వెతకుక్కల్లా నా వెంట పడ్డారు. మరి కాసేపటికి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళొచ్చి అడిగితే ఈ యింట్లోకి ఎవరూ రాలేదనే చెప్పాలి. ఈ లోపల నీవు చేయాల్సింది ఒకటుంది. అది నన్ను దాచడం""     ""నాకు పోలీసులంటే భయం. నీవు వెళ్ళిపో"" ఎలాగో ధైర్యం తెచ్చుకుని  తెగించి చెప్పేసింది శృతి.     అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం జేవురించింది. ""స్టాపిట్"" అంటూ అరిచాడు.     గతుక్కుమంది శృతి.     ""నే చెప్పేది విను. నాకు సలహాలివ్వడం, ఆజ్ఞాపించడం నీ సుకుమార శరీరానికి మంచిదికాదు. నా కన్నా నా చేతిలో రివాల్వర్ చాలా చెడ్డది. నాకైనా జాలి, దయ వున్నాయి గాని నా రివాల్వర్ కి బొత్తిగా జాలి,  దయ, మంచి, మర్యాద లేవు. దీనిపని కోపమొస్తే నిప్పులు కురిపించటమే. నీ నా అని చూడదు. సుందరమైన శరీరం తూట్లుపడితే ఏం బాగుంటుంది?"" అంటూ ఆగాడు అతను.     ""నన్నేం చేయమంటావ్!"" బొంగురుపోయినస్వరంతో అడిగింది శృతి.     గుడ్ మంచి ఆడపిల్ల లక్షణం అది. నేను దాక్కుంటాను. పోలీసులొచ్చి అడిగితే అప్పుడే నిద్రలేచినట్లు లేచి వెళ్ళి ఎవరూ రాలేదని చెప్పు. నీ మాటలుపై వాళ్ళకి నమ్మకం కలగాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. అది నీ  ప్రవర్తనలో, నీ చాకచక్యంలో వుంది. వాళ్ళకేమాత్రం అనుమానం కలిగినా నా  ప్రాణానికేకాదు, నీ ప్రాణానికికూడా ముప్పు. గుర్తుంచుకో. నీవల్లనే నేనుపోలీసులకు పట్టుబడ్డాననుకో నాకేం ఫరవాలేదు. ఎలాగోలా ఆతర్వాతయినా తప్పించుకుంటాను. తప్పించుకున్న నిమిషంనుంచీ నీకు మనశ్శాంతి వుండదు. నా రివాల్వర్ నిన్నో, నీ వాళ్ళనో ముద్దు పెట్టుకుంటుంది.""     వచ్చే ఏడ్పుని బలవంతాన బిగపట్టుకుని ""నన్ను బెదిరిస్తున్నావ్! నేను నీకేం అపకారం చెయ్యలేదు"" అంది శృతి.     ""నాకపకారం తలపెట్టినవాళ్ళు బతికి బట్టకట్టలేరులే. ఆ పని నీవు చేయవద్దని హెచ్చరిస్తున్నాను. ఈసరికి ఆ కుక్కలు వచ్చేస్తూ వుంటాయి. నావల్ల నీకుగాని నీ వాళ్ళకు గాని అపకారం జరగరాదని గుర్తుంచుకుంటే చక్కగా నటించి వాళ్ళను పంపిస్తావు. నేను ఆకనబడే వెనుకగదిలో దాక్కోనా? అవసరమయితే పారిపోవటానికి ఆ గదిలోంచి వెనుకవైపు మార్గం వుందా?""     ""ఉంది కాని.....""     ""కాని లేదు అర్థణా లేదు. ఇప్పుడు చెలామణిలో వున్నవి పైసలు. సరేనే చెప్పినట్టు చేస్తావుగా?     ""వాళ్ళు వెళ్ళింతర్వాత నీకు నాకు అపకారం చేస్తే?""     ""నేను అపకారం చెయ్యనని నమ్మాలి అంతే. ఈ పరిస్థితులలో అంతకన్నా గత్యంతరము లేదు. ఉపకారికి అపకారం చెయ్యకూడదు. నేను అపకారం చెయ్యనని మాటిస్తున్నానుకదా? నా హెచ్చరిక మాత్రం మార్చిపోకు. నీవల్లనే నేను పోలీసులకి చిక్కానో ఇది నీమీద, నీవాళ్ళమీద నిప్పులు కక్కుతుంది. ఇంక నే దాక్కుంటాను."" అంటూ వెనుదిరిగి గుమ్మందాకా వెళ్ళి ఆగాడు. గిర్రున వెనుదిరిగి శృతిని చూస్తూ ""నీ నోట్లోంచి ఓ.కె. రాలేదు"" అన్నాడు.     పచ్చి వెలక్కాయ గొంతుకడ్డంగా పడినట్లయింది శృతికి. క్రితం రాత్రి చూసొచ్చిన సినిమా కళ్ళముందు కనిపించింది. ""ఒక చీకటిరాత్రి"" అనే సినిమాలో పోలీసులు తరుముతుంటే ఓ హంతకుడు ఓ అమ్మాయి ఇంట్లో ప్రవేశిస్తాడు. పోలిసులనుంచి తన్ను రక్షించకపోతే చంపుతానని బెదిరించి లొంగదీసుకుంటాడు. ఆ అమ్మాయి, హంతకుడు భార్యభర్తలుగా ఓ పక్కమీద పడుకుని సరసాలాడుకుంటూ వుండాలి.  పోలీసులు కిటికీలోంచి చూసి వెళ్ళిపోతారు. హంతకుడలా ప్లాన్ చెపుతాడు. గత్యంతరం లేక సరేనంటుంది ఆ అమ్మాయి కిలకిలలాడటం విని భార్యాభర్తలనుకునివెళ్ళిపోతారు. పాముకి పాలుపోసినట్లు పోలీసులు వెళ్ళింతర్వాత హంతకుడు వెళ్ళిపోక ఆ అమ్మాయిని బలాత్కరిస్తాడు. ఆ తర్వాత చాలా కథ జరుగుతుంది. ఆ సీన్లన్నీ శృతి కళ్ళముందు గిరగిర తురుగుతున్నాయి.     ""ఏమిటి నీ ఉద్దేశ్యం?""  రివాల్వర్ సూటిగా శృతివైపు తిప్పి  అడిగాడు." 20,"     కరతాళధ్వనులు.     ""ఈ సహాయం అనేది కేవలం కళలకే పరిమితం చేసుకోలేదు.     జీవితంలో.... ఎవరయినా అన్యాయానికి బలయిపోతున్నట్లు, వాళ్ళకు చేయూత తీసుకునే అర్హత వున్నదని నేను నమ్మినప్పుడు, వాళ్లు నన్ను కోరనఖ్కర్లేదు. నేనే వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకెడతాను.       వెళ్ళకుండా వుండలేను.        ఇంతకన్న ఏం చెప్పలేను. ఎక్కువ చెబుతే చెయ్యలేనని భయం.     ""సెలవు.""       అంటూ కూర్చున్నాను.     రెండు మూడు నిమిషాలసేపు కరతాళధ్వనులతో ఆ స్థలమంతా మార్మోగిపోయింది.                                      41     ఆశ్రమంలో కడుగుపెట్టాను.     కొన్ని ఎకరాల స్థలంలో వ్యాపించి వున్న ఆశ్రమం.     బంగాళా పెంకులుతో, రెల్లుగడ్డి కప్పబడి దూరదూరంగా చాంబర్సు లాంటివి కట్టబడి వున్నాయి.     ఆనంద్ జీ ఎదురుగా వచ్చారు.     ""రండి"" అంటూ సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకెళ్ళారు.     నాలుగువైపులా చూస్తూ ఆయన్ననుసరిస్తున్నాను.     పెద్ద పెద్ద చెట్లు, చాలా అందంగా పెంచబడివున్న చిన్న చిన్న మొక్కలు, వాటి మధ్య కుటీరాలు.        ""ఈ ఆశ్రమంలో శాశ్వతంగా ఎవరూ వుండరు. నేనూ, భగవతిదాసులూ, కొంతమంది వాలంటీర్లూ, మేం వుంటాం. మిగతావాళ్లు ఆరురోజులపాటు జరిగే కోర్సుకు అటెండయి పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. ఈ ఆరు రోజుల్లో అరవైఏళ్ళ తపఃఫలితం వాళ్ళు పొందే ప్రయత్నం జరుగుతోంది.""     ""ఆరు రోజులు....""     నాకెందుకో ఆశ్చర్యమనిపించింది.     మనసుని చిత్రికపట్టి, మధించి మధించి నిర్వికల్ప సమాధి తీసుకెళ్ళటానికి ఆరు రోజులు చాలు.     ఒక్కొక్క కుటీరంలో పది పదిహేను మంది సాధకులున్నారు. స్త్రీలూ, పురుషులూ విడివిడిగా వున్నారు. భగవతిదాసులు వాళ్ళ కేదో బోధిస్తున్నారు. స్త్రీలకు స్త్రీ గురువులే వున్నారు.         అది గొప్ప విశేషం కాదు.     సాధకులుగా వచ్చిన వారిలో రకరకాల వయసుల వాళ్ళు, వృత్తుల వాళ్లు వున్నారు. మేధావులున్నారు. మామూలు వాళ్ళున్నారు.     కాని....     వాళ్ళు తమ తమ స్థాయిలని మరచిపోయి వున్నారు. కొందరు కళ్ళ నీళ్ళు కారుస్తున్నారు. కొందరు బయటకు బిగ్గరగా ఏడ్చేస్తున్నారు. కొందరు క్రిందపడి దొర్లుతున్నారు.     ఆ దృశ్యం నాకు అపూర్వంగా కనిపించింది.     ""థియరీలో ప్రాక్టికల్ లోకి వస్తూన్నప్పుడు మనం పొందే అనుభవం. ప్రతి మనిషిలో బ్లాక్స్ వుంటాయి. ఇక్కడ ఆ బ్లాక్స్ ను ఛేదించే లోపలకు తీసుకెళ్ళే ప్రయత్నం జరుగుతోంది. మీరు చెప్పారే డస్ట్. ఆ డస్ట్ అంతా వొదలకొడుతున్నాం. మనిషిని తాను పుట్టినప్పుడుండే దశకు తీసుకెళ్ళి ఆ దశ నుండి ఏమేమి చేశాడో అన్నీ తన మనో నేత్రానికి స్పష్టంగా కనబడే ప్రయత్నం చేస్తున్నాం. అతను తనను తాను చూసుకోగలుగుతున్నాడు. తన గతాన్ని, అందులోని భీభత్సాన్ని సందర్శించగలుగుతున్నాడు. అంటే తనని తాను పూర్తిగా వీక్షించుకోగలుగుతున్నాడన్నమాట. ఒకరు చెప్పకుండా తాను ఎంత ఛండాలుడో, ఎంతటి అసహ్యకరమైన వ్యక్తో, ఎంతటి నికృష్టుడో తెలుసుకోగలుగుతున్నాడు. అవన్నీ ఒప్పుకునే మానసిక స్థాయికి చేరుకుంటున్నాడు. అదిగో అటు చూడండి.""        తల త్రిప్పి చూశాను.     ఒక నడివయసు వ్యక్తి, చెట్టు చుట్టూ ఆవరించి వున్న అరుగు మీద కూర్చుని వున్న ఓ స్త్రీ పాదాలమీద మోకరిల్లి ఏడుస్తున్నాడు.     ""అమ్మా నన్ను క్షమించు. అప్పుడలా చేశాను. హింసలు పెట్టాను"" అంటూ ఏకరువు పెడుతూ మధ్య మధ్య తల నేలకేసి బాదుకుంటున్నాడు.       ఆ స్త్రీ మొహమాటపడుతూ ""ఊరుకోండి, ఊరుకోండి"" అంటూ తాను కూడా కన్నీళ్ళు కారుస్తున్నది.        ""అతను భర్త, ఆమె భార్య"" అన్నాడు.     ఇంకోచోట కొడుకు తండ్రి కాళ్లు పట్టుకుని బావురుమంటున్నాడు." 21,"    ఆమె ఎక్కి కూర్చోగానే అతను బైక్ స్టార్ట్ చేశాడు.     ప్రేమా పర్వతారోహణా ఒక లాంటివే! క్రిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయి. పైకి ఎక్కుతూనే వుండాలి. శిఖరాన్ని అందుకునే దాకా!                                                    *    *    *     జగన్మోహనరావు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.     ఆయన సెక్రటరీ అర్జెంట్ మెస్సేజ్ ఒకటి ఇద్దామని రెండుసార్లు వచ్చి కూడా, ఆ పరిస్థితుల్లో ఆయన్ని కదపడం ఇష్టం లేక, వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.     ఆయన తన మొహాన్ని రెండు చేతుల్లోనూ దాచుకొని కూర్చున్నాడు. 'తృప్తి' కన్ స్ట్రక్షన్స్ అధినేత, సిటీలో కెల్లా పేరున్న రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేసే పారిశ్రామిక వేత్తా అయినా జగన్మోహనరావుని ఇంత డిప్రెస్డ్ మూడ్లో ఆయన స్టాఫ్ ఎవరూ, ఎప్పుడూ చూసి వుండలేదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయించడం, దేనికీ చలించకపోవడం ఆయన ప్రత్యేకతలు.     'ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది' అనే జనవాక్యం వుంది. ఆయనకీ బిజినెస్ మేగ్నేట్ అనే పేరు వుంది. ఎంతమంది మిత్రులున్నారో అంతమంది ప్రత్యర్దులూ వున్నారు. ఆయన ప్రాపకంలో బాగు పడాలనుకునేవారు మిత్రులుగానూ, ఆయన్ని బిజినెస్ లో అదిగమించాలనుకునేవారు శత్రువులుగానూ మారారు. సామాన్యమైన తెలివితేటలే వున్నా, కష్టపడే మనస్తత్వం, రిస్క్ తీసుకునే ధైర్యం వున వ్యక్తికి ఎప్పుడూ విజయం లభించే అవకాశాలు పుష్కలంగా వుంటాయి. జగన్మోహనరావులో చివరి గుణం ఎక్కువ! 'రిస్క్' తీసుకోవడానికి ఎన్నడూ వెనుకాడలేదు. అదే అతని విజయ రహస్యం!     ఆయన సెక్రటరీ మళ్ళీ వచ్చింది. ఈసారి తిరిగి వెనక్కి వెళ్ళలేక ""సార్!"" అంటూ పిల్చింది.     ఆయన చేతులలో నుండి మొహాన్ని తియ్యకుండానే ""ఎస్!"" అన్నారు చెప్పమన్నట్లుగా.     ఆమె గొంతు సవరించుకుని ""వినోభానగర్ లో ఈవేళ భూమి పూజ. అక్కడి మార్కెటింగ్ మేనేజర్ ఫోన్ చేశాడు. మీరు బయల్దేరుతున్నారా అనీ.""     ""నో"" వెంటనే చెప్పాడాయన.     ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఇలా ఎన్నడూ జరగలేదు. ఎన్ని పనులలో వున్నా, తను స్వయంగా వెళ్ళి, కొబ్బరికాయ కొట్టటం ఆయన అలవాటు. సెంటిమెంట్ కూడా!     ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతూ, తనలో తనే బాస చాలా డిస్టర్బ్ డ్ గా వున్నాడు. బిజినెస్ పరంగా అంత నష్టమేం జరగలేదే! అనుకుంది.     ఓ మాత్రం నష్టాలు ఆయన్ని కదిలించలేవని ఆమెకి తెలుసు.     ఈ నెలలో ఇటువంటి మూడ్ లో, మూడోసారి చూడడం అనుకుంది. ఆ తరువాత వినోబానగర్ మార్కెటింగ్ మేనేజర్ కి ఫోన్ చేసి ""పూజ కానిచ్చేయండి, ఎం.డి. గారికి ఒంట్లో బాలేక రాలేకపోతున్నారు"" అని చెప్పింది.     మొదటిసారిగా జగన్మోహనరావు సెంటిమెంట్ కి భిన్నంగా ప్రవర్తించిన రోజు అది! బిజినెస్ పీపుల్ సెంటిమెంట్స్ కి ఇచ్చినంత విలువ దేనికీ ఇవ్వదు. అటువంటిది అది కూడా మరచిపోగలిగేటంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడాయన.     ఆయన సమస్య అహల్య.                                                                         *    *    *     అహల్య చాలా అందమైన స్త్రీ. ఆమె నవ్వులో సన్నజాజులు విరబూస్తాయనీ, ఆమె చూపులో వెన్నెల కురుస్తుందనీ, ఆమె చూపులో వెన్నెల కురుస్తుందనీ, ఆమె మీద కవిత్వం చెప్పేవాళ్ళు ఆమె వయసులో వున్నప్పుడు.     ఇప్పుడు ఆమె వయసు నలభై రెండు సంవత్సరాలు. చూసిన వాళ్ళు ఠక్కుమని ""ముప్పై ఏళ్ళుంటాయి"" అని పప్పులో కాలేస్తారు. తన శరీరం గురించి ఆమె తీసుకునే జాగ్రత్తలు కూడా కొంతవరకూ అందుకు కారణం. భగవంతుడు జన్మతః ఇచ్చిన సౌందర్యం వరమైతే 'కీప్ ఫిట్' లూ, 'బ్యూటీ కేర్' లూ ఆ వరాన్ని ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సాధనాలు.     ఆమె భర్తతో కలిసి వెళ్తూంటే, తండ్రీ కూతుళ్ళు అనుకుంటారు తెలియనివాళ్ళు. ఆమె జగన్మోహనరావు అర్ధాంగి.     మానవుని సాంఘిక జీవన పరిస్తితులే అతని ఆలోచనా విధానాన్ని నిర్ణయిస్తాయి అనడానికి నిదర్సనం అహల్యా, జగన్మోహనరావుల మనస్తత్వాలు!     మధ్యతరగతి నుండి కష్టపడి పైకొచ్చిన ఆయనకీ, పరబ్రహ్మ డబ్బేస్వరూపం. దానిముందు అందాలూ, భావుకతలూ అన్నీ బలాదూర్.     పుట్టుకతోటే బంగారు ఉగ్గుగిన్నెతో ఉగ్గు తాగిన అహల్యకి, డబ్బు అంటే లెక్కలేదు. ఆ యావలోపడి అతి చిన్న వయసులోనే వృద్దుడయిపోయిన భర్తని చూస్తే జాలి!     పండు వెన్నెలలో కూర్చుని భర్తకి చిలకలు మడిచి అందిస్తూ ""ఎంత బావుందో కదూ!"" అంటే,     ""ఔను! ఈపాటికి సైట్ లో స్లాబ్ వేసేసే వుంటారు. ఇంకా ఫోన్ రాలేదేమిటి చెప్మా?"" అనే అతన్ని చూస్తే తనమీద తనకే పుట్టెడు జాలి! అహల్య వూహల్లో వూహించుకున్న సహచరుడికి పూర్తిగా వ్యతిరేకం ఆమె భర్త!" 22,"          ఒక నిశ్చయానికి వచ్చినట్టు సోమయాజి లేచాడు. ""మధుసూదన్ని వెనక్కి పిలిపించండి మాస్టారు! నేను వెళతాను"" అన్నాడు. తన చెవుల్ని నమ్మలేనట్టు మాస్టారు అతడివైపు చూసి ""నువ్వా! ఈ స్థితిలోనా?"" అన్నాడు.         ""ఆలస్యం చేయకండి మాస్టారూ! సమయం మించిపోతుంది.""         అంతలో ప్రత్యర్ధి కొట్టిన బంతి గోలుకి వెంట్రుకవాసి దూరం నుంచి తప్పిపోయింది. జనం చప్పుడు కూడా చేయకుండా మర్చిపోయి చూస్తున్నారు.         బంతితోపాటే సోమయాజి కూడా ఆటస్థలంలోకి ప్రవేశించాడు. తన శరీరమూ, దాని బాధా అన్నీ ఆ క్షణంలో మర్చిపోయాడు. అతడి కనుల ముందు ముగ్గుతో మందాకిని వ్రాసిన రంగవల్లికలు - ముత్యాల్లాంటి అక్షరాలై మెరుస్తున్నాయి. 'నువ్వు....గెలవాలి.... ఒక్కో గోలూ కొట్టుకుంటూ....'         ""నాకొద్దిగా శక్తినివ్వు మందాకినీ!"" అనుకున్నాడు. అనుకుంటూ ఆటస్థలంలో అడుగుపెట్టాడు. ఆ క్షణం అతడు సోమయాజిలా లేడు. అభిమన్యుడిలా వున్నాడు. హేరంభోన్నత శూర్పకర్ణ వివరహ్రీకారియై శైలకన్యా రాజన్నవ ఫాలమండల విభుగన క్రీడయై మ్రోగపోయిన ధనువుని విరిచే శ్రీరామచంద్రుడిలా వున్నాడు.                                 *    *    *    *            ""ఎంత తెచ్చావు?""         ""అయిదువేలు.""         అక్కడున్న వారందరిలో ఒక్కసారిగా కలవరం రేగింది.         ""స్టేకు పెంచుదామా"" అన్నాడొకడు.         ""మరందుకేగా ఇంత తెచ్చింది! ఈ రోజుతో అటో ఇటో తేలిపోవాలి"" కూర్చుంటూ అన్నాడు సుబ్బారావు.                                                   *    *    *    *         ఆట పూర్తవడానికి ఇంకా రెండు నిమిషాలు వుంది.         ఈసారి రమేష్ కూడా అతడికి సాయం చేశాడు.         రెండు జట్టుల ఆటగాళ్ళు కొదమసింహాల్లా వున్నారు. కాలిన పెనం మీద గింజలా బంతి ఎగిరెగిరి పడుతోంది.         సర్వసక్తులూ కేంద్రీకరించి బంతినందుకుని పరుగెత్తసాగాడు అతడు. రాజు వెంట సైన్యం కదిలినట్లు, అతని జట్టు తాలూకు ఆటగాళ్ళందరూ అతడిని అనుసరించసాగారు. ఈ కాలునుంచి ఆ కాలుకీ - ఈ మనిషి నుంచి ఆ మనిషికీ బంతి నిర్ఘర ఝరీ ప్రవాహపు తరంగంలా కదలసాగింది. ఆట స్థలపు సగభాగానికి రాగానే ఎదుటి ఆటగాళ్ళు కోటలా నిలబడ్డారు. ప్రాణం పోయినా ఇక ముందుకు రానివ్వం అన్నట్లు. ఆట ""డ్రా"" అయితేవాళ్ళకి లాభం.         కుడికాలి క్రింద బంతిని నిలబెట్టి గుండెల్నిండా గాలి పీల్చుకున్నాడు. సోమయాజి నెలరోజుల క్రితం ఇదే స్థితిలో తన ప్రావీణ్యం నిరూపించుకోవలసి వచ్చింది.         ఆ సంఘటన గుర్తొచ్చింది.         గోలు మధ్యలో డ్రిల్లు మాస్టారు వంగొని నిల్చోవడం కనిపించింది. కాస్త దూరంగా మందాకిని నవ్వుతూ నిల్చుని వుంది. మిగతా మనుష్యులూ, ఆటగాళ్ళూ అంతా మాయమైపోయారు. తనేం చేస్తాడా అన్నట్టు మందాకిని చూస్తుంది.         మందాకిని.... మందాకిని చూస్తూ వుంది.         అతడు ఒక్క అడుగు వెనక్కి వేసి బంతిని సాచి కొట్టాడు.         తుపాకి గుండు శబ్దం వినగానే గాలిలోకి లేచిన పావురంలా బంతి గాలిలోకి లేచింది. మేఘాన్ని అందుకోవటానికా అన్నట్టు ఆకాశంలో పయనించి క్రిందికి జారసాగింది.         ""ఇతడికేమైనా మతిపోయిందా"" అనుకున్నాడు అవతలి జట్టు కెప్టెను. అంతదూరం నుంచి బథిని కొట్టిన సోమయాజిని చూస్తూ గోలుకీపరూ అలాగే అనుకుని బంతిని అందుకోవటానికి ముందుకు వచ్చాడు.         భగీరధుడి వెనుక హొయలు పోతూ నెమ్మదిగా గంగానది క్రిందికి దిగినట్టూ బంతి నేలమీద పడి, ఆ పడీపడటంతోనే మలుపు తిరిగి గోలులోకి దూసుకుపోయింది. దిగ్భ్రమ చెందిన గోలు కీపరుకు క్షణంపాటూ ఏం జరిగిందీ అర్ధంకాలేదు.         ఆట సమయం పూర్తయినట్టూ ఈల మ్రోగటం, జనం కట్టలు తెంచుకున్నట్టూ పరుగెత్తుకు రావటం ఒకేసారి జరిగాయి.                            *    *    *    *         అదే రాత్రి ఒంటిగంటకి...         తలుపు చప్పుడవగానే తీసిన మందాకిని, ఎదురుగా నిలుచున్న భర్త మొహాన్ని చూసి ఆశ్చర్యపోయి, కంగారూ భయం మిళితమయిన స్వరంతో ""ఏమైందండీ?"" అంది బేలగా.         ""అయిపోయింది మందాకినీ సర్వనాశనం అయిపోయాం డబ్బుపోయింది. రేపటినుంచీ ఉద్యోగం లేదు"" అన్నాడు సుబ్బారావు లోపలి రావటానికి కూడా శక్తి లేనట్టూ అక్కడే కూలబడిపోతూ.                                     12         అతడు దిగేసరికి రాత్రి రెండయింది. ఆ క్రితం రోజు సాయంత్రమే బహుమతి ప్రధానం జరిగింది. అతడికో ప్రత్యేక  బహుమతి నిచ్చారు కూడా.         చిన్న కప్పు.         అది కాదు ముఖ్యం. ప్రశంసలు. కళాకారుడికీ, క్రీడాకారుడికీ ఆహ్ది ముఖ్యం! తొలకరి జల్లులా అవి అతడిని తడిపాయి.         భోజనాలయ్యాక, ఆ రోజు రాత్రే తిరిగి బయల్దేరారు. వచ్చేసరికి రెండయింది. స్కూలు దగ్గర వాహనం ఆగింది. ఎవరిళ్ళకు వాళ్ళు బయల్దేరారు.         అతడు ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. చిన్నక్క నిద్రకళ్ళతో వచ్చి తీసింది. ""ఏమిరా ఏమైంది? గెల్చారా?"" అని అడిగింది. గెల్చినట్టు చెప్పాడు.         ""లోపల పడుకుంటావా? పక్క బైట వేసుకుంటావా?""         ""బైటే"" ఆవిడ పక్క తీసుకొచ్చి బయటవేసి తలుపేసుకుంది.         అతడు పంపు దగ్గర మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని పడుకున్నాడు. నిద్రరాలేదు. అర్దరాత్రి ఎవరికీ నిద్రాభంగం కలిగించకుండా తన పక్కని చూరునుంచి కాస్త బయటకు లాక్కుని మళ్ళీ పడుకున్నాడు.         వేసవికాలం అవటం వల్ల ఆకాశం నిర్మలంగా వుంది. నక్షత్రాలు ప్రకాశవంతంగా వున్నాయి. వెల్లకిలా పడుకుని చూస్తూంటే అవి మీదకు రాలుతున్నట్టూ వుంది. చాలా చిత్రమైన అనుభూతి. అతడి పెదవులమీద ఎందుకో మాటిమాటికీ చిరునవ్వు తొంగిచూస్తుంది. తలతిప్పి మూసి వున్న తలుపుల వంక చూశాడు.         ఆ తలుపులు తెరుచుకోవాలంటే ఇంకో మూడు గంటలాగాలి! తన విజయాన్ని కథలుగా వర్ణించాలంటే మరో మూడు గంటలాగాలి!! అతడి మనసు వుండబట్టటంలేదు. ఆ క్షణమే వెళ్ళి తలుపు తట్టి చెప్పాలన్న కోర్కెని బలవంతంగా అణచుకున్నాడు. ఎంతో దగ్గిరగా వుండి, ఎంతో దూరంగా వుండవలసి రావడం ఎంత దుర్లభం. క్రితం రోజు సాయంత్రమే తమ ఆటల ఆఖరి రోజు అని తెలుసు. ఆమె ఆలోచించి వుంటుందా? తమ గెలుపుని వూహించి వుంటుందా?         ఊరినుంచి తనీ అర్ధరాత్రి ఇంటికి వచ్చేస్తానంటే మేల్కొని వుండేదా? ఏమో ..... రేపు అడగాలి.         ఈ విధమైన ఆలోచనలతో అతడికి నిద్రపట్టలేదు.         అతడికి తెలీదు - ఆరుగజాల అవతల, మూసివున్న తలుపుల వెనుక ఆ దంపతులు తమ జీవితాన్ని ఎలా పునర్ నిర్మించుకోవాలా అన్న వేదనతో, ఆలోచనతో నిండా మునిగి వున్నారని.         ... ... ...         మరో గంట గడిచింది.         అతడికి ఆ రోజు నిద్ర దూరమయింది. ఎప్పుడు తెల్లవారుతుందా అన్న తొందరలో - అశాంతిగా పక్కమీద అటూ ఇటూ పొర్లసాగాడు. అంతలో లోపల్నుంచి మాటలు వినిపించసాగాయి. అయితే అవి కుడివైపు భాగంనుంచి వచ్చాయి. రంగారావు పెద్దన్న వాళ్ళ భాగంనుంచి.         ""మనం తొందరపడి వుంటే పెద్ద ప్రాణానికి మోసం వచ్చేదటండీ..."" భార్య.         ""అందుకేగదే ఎవరికీ చెప్పొద్దన్నది-"" రంగారావు పెద్దన్న.         ""నేనయితే ఎవరికీ చెప్పలేదులెండి. కానీ ఇంకో రెండు మూడు నెలలాగితే అందరికీ తెలుస్తుంది.""         ""అంతవరకూ రానిస్తామటే పిచ్చి మొహవాఁ! అనుకున్నది అనుకున్నట్టూ జరిగితే అసలు ఏ గొడవా వుండదు...""         అస్పష్టంగా బావుండి మరీ అయిదో నెలలోనో ఆరో నెలలోనే బయట పడకుండా తొందరగా తెలిసింది! నాకు అప్పుడే అనుమానం వచ్చిందండీ నిలదీసి అడిగినా చెప్పలేదు.""         ""అందుకేగా ఒళ్ళు చీరేసింది.""         ""మీరు కల్పించుకోబట్టే తెలిసింది. ఈ లోపులో ఆ చంద్రంగాడేమో గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.""         సోమయాజి స్థబ్దుడయ్యాడు. చంద్రం గురించిన వార్తతో కాదు. వైదేహి గర్భం గురించి కూడా కాదు .....మారుతున్న నైతిక విలువల పట్ల మనిషి ప్రవర్తన గురించి.         కొన్నేళ్ళక్రితం పల్లెలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. తాతయ్య స్నేహితుడే ఆయన పండు ముసలి పౌరోహిత్యం చేసేవాడు. ఆయన మనవరాలు చిట్టితల్లికి పదునాలుగేళ్ళు. ఒక అర్ధరాత్రి కబురొచ్చింది....ప్రాణాయామం ద్వారా ఆయన ప్రాణాలు వదిలాడని. ఆయన బాధ లోకం ఏమనుకుంటుందో అని కాదు. మనవరాలు తప్పు చేసిందని కూడా కాదు. తన విధి తాను నిర్వర్తించలేకపోయినందుకు! ఇది జరిగిన అయిదారు రోజులకి తెలిసింది - చిట్టితల్లి తప్పేమీలేదనీ, రావిచెట్టు దగ్గిర అల్లరి కుర్రవాడెవడో వాటేసుకుని ముద్దుపెట్టుకోగా అదే కడుపనుకొని భయపడిపోయిందని...." 23,"     వీడు నా మనసును తెరిచిన పుస్తకాన్ని చదివినంత తేలిగ్గా చదివేస్తున్నాడు. నా ఊహల్నీ భయాల్నీ ఇట్టే పసిగడ్తున్నాడు. వీడికి నిజంగానే అతీతశక్తులు ఉన్నట్టున్నాయి. సందేహం లేదు. వీడు సామాన్యుడు కాడు. అవును! దయ్యాలకు మనుషులు భయపడాలిగాని మనుషులకు దయ్యాలు భయపడటం ఏమిటి? నాన్ సెన్స్! వీడు కోతలు కోస్తున్నాడు.     ""దయ్యాలు కూడా మనుషులకు భయపడ్తాయి!""     నేను తృళ్లిపడ్డాను. మళ్లీ నా మనసులో రేగిన ప్రశ్నలకు వీడు సమాధానం ఇచ్చాడు.     ""అందరు మనుష్యులకూ కాదు. కొందరికే. అతీతశక్తుల్ని సంపాదించుకొన్న వాళ్లకు. దయ్యాలను మేము మా చెప్పుచేతుల్లో ఉంచుకొని వాటిచేత ఎన్నో పనులు చేయిస్తాం. ఆ భూతరాజుగాడ్ని నేను అలాగే ఏడిపిస్తున్నాను. ఈ ప్రాంతాల్లో తిరిగే రౌడీ దయ్యాలన్నీ నా అదుపులో ఉన్నాయి. వాటిద్వారానే వాడిని పీడిస్తున్నాను.""     ""ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది.""     ""అదేంటి బాబూ! మీరు రచయిత గదా? ఈమధ్య రచయితలు ఈ విషయాలు వివరంగా రాస్తున్నారుగా! పైగా దయ్యాలమీద రిసెర్చిచేసి, వాస్తవాలనే రాస్తున్నామని కూడా చెబుతున్నారుగా? మీరు చదవలేదా?""     ""నేను అలాంటి ట్రాష్ చదవను.""     రహమాన్ అదోలా నవ్వాడు. పిచ్చివాడ్ని చూసి తెలివైనవాడు నవ్వే నవ్వు అది. దయ్యాల కథలు రాస్తూ సరదాకు రాశానని చెప్పడం కూడా కాదు. వాస్తవాలూ, నేను చూసి అనుభవించినవని కూడా రాస్తున్నారా? ఇంతకంటే ద్రోహం మరొకటిలేదు.     ""దయ్యాలు కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి బాబూ! జీవితంలో మంచిగా బ్రతికిననాడు దయ్యం అయికూడా మంచిగానే ఉంటాడు. అలాంటివాడు విముక్తికోసం ఎదురుచూస్తూ బాధపడుతూ ఉంటాడేగాని మరొకర్ని పీడించడు. శొడీగా బతికినవాడు, ఇతర్లను పీడించి బతికినవాడు, దయ్యం అయికూడా పీడిస్తాడు.""     ""రహమాన్! ఆగు! నీవాగుడంతా నేను నమ్మను-"" అన్నాను కోపంగా.     రహమాన్ ముఖం పక్కకు తిప్పుకొన్నాడు. మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనం మరీ భయంకరంగా అన్పించింది. వీడితో తర్కించి కోపం తెప్పించడం నాకే హాని! అనవసరం చిక్కుల్లో పడ్డాను.     మళ్ళీ వీడితో వాదించి కొత్త చిక్కులు కొనితెచ్చుకోవడం మరీ బుద్ధిలేనితనమే అవుతుంది.     ఎలాగయినా వాడి కోపం తగ్గించి మళ్ళీ మాటల్లో పెట్టాలి. లేకపోతే ఏంచేసినా చెయ్యగలడు.     ""రహమాన్!""     ""అయ్యా!"" గుర్రుగా అన్నాడు.     ""కోపం వచ్చిందా?""     వాడు మాట్లాడలేదు.     ""అసలు విషయం నేను ఆత్మల్ని నమ్మను, దయ్యాల్నీ భూతాల్నే కాదు దేవుడ్ని కూడా నమ్మను. అందువల్లనే అప్పుడప్పుడు నీ మాటలకు అడ్డొస్తున్నాను. ఫర్వాలేదు చెప్పు.""     ""నమ్మనివాళ్లకు చెప్పి నమ్మించాల్సిన పని నాకేం లేదు. త్వరలోనే మీరు అనుభవించబోతున్నారు. అప్పుడు నమ్మక ఏంచేస్తారు? ఈ లోపల నాకెందుకీ కంఠ శోష!""     ""నా విషయం, నా నమ్మకాల గురించి చెప్పాను. అంతే! నేను ఓపెన్ మైండుతోనే ఉన్నాను. ఎవరైనా రుజువు చేసినా, నా అనుభవంలోకి వచ్చినా నమ్మక ఏంచేస్తాను? చెప్పు!"" మృదువుగా అడిగాను.     వాడు మాట్లాడలేదు.     ""మంచివాడు దయ్యం ఎందుకవుతాడు? మంచివాళ్లకోసం స్వర్గ ద్వారాలు బార్లాగా తెరిచి వుంటాయని మా శాస్త్రాల్లో చెప్పారుగా?"" అన్నాను ప్రశ్న వేస్తేగాని వాడు మాటల్లోకి దిగడని.     ""మంచివాడు అకాల మరణం చెందితే దయ్యం అవుతాడు. అతడి నిర్దేశించిన జీవితం పూర్తి అయేంతవరకూ అతనికి ఊర్ధ్వ లోకాల్లోకి ప్రవేశం ఉండదు. అంతవరకూ దయ్యాల రూపంలో ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటారు. ఈ విషయం కూడా రచయిత్రిగా మారిన ఓ రచయిత చెప్పాడు.""     నాకు మళ్ళీ పిచ్చికోపం వచ్చింది.     ""ఇలాంటి విషయాలు అనుభవించి రాశామనేవాళ్లను సైకియాట్రిస్టు దగ్గరకు పంపించాలి. పాపం! వాళ్లు కావాలని అబద్ధాలు రాస్తున్నారనుకోను. అలాంటి హల్యూసినేషన్స్ కు గురి అయి అది వాస్తవంగా భావించి రాస్తున్నారు. నీకూ అలాంటి పిచ్చే ఉన్నట్టుంది. భూతరాజు దయ్యంకాదు. మనిషే! నీలాంటి మనిషే!"" అన్నాను ఉద్రేకంగా.     వాడు అదోలా నా ముఖంలోకి చూశాడు.     వాడి చూపులు నావళ్ళంతా ముళ్లులా గుచ్చుకున్నాయి.     నాలో నేనే చెంపలు వేసుకున్నాను.     వెధవ బుద్ధి!     ఊరికే వినకూడదూ?     మరో గంటకు ఊళ్లోకి చేరతాం!     అంతవరకూ వాడు చెప్పేదాన్ని వింటే సరిపోలా?     బండి ఏదో చెట్టు కిందగా పోతోంది.     నేను ఉన్నట్టుండి కెవ్వున అరిచాను.     బండి టాపుమీదకు ఏదో దూకింది.     నేను అరుస్తూ బండిలోనుంచి నాకు తెలియకుండానే దూకాను. వెలికిలా పడ్డాను. నా గుండెలమీదకు ఏదో ఆకారం ఎక్కి కూర్చుంది. అంతవరకే నాకు తెలుసు.     ఇదంతా క్షణంలో సగంసేపులో జరిగింది.     ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.     కళ్ళు తెరిచాను.     పైన మబ్బుల మధ్యనుంచి చందమామ పరుగులు తీస్తున్నాడు.     నేను ఎక్కడున్నాను?     ఏమైంది నాకు?     రాత్రినుంచి జరిగిన విషయాలు గుర్తొచ్చాయి.     ఏదో బండి టాపుమీద పడటం, నేను కింద పడటం, నా గుండెల మీద ఏదో ఆకారం కూర్చోవడం లీలగా కళ్ళలో కదిలింది.     మళ్లీ భయంతో వళ్ళంతా బిగుసుకుపోయింది.     మళ్లీ కళ్లు మూసుకున్నాను.     ""బాబుగారూ!""     ""కళ్లు తెరవండి!""     ""నేనున్నాను. మీకేం భయంలేదు. కళ్లు తెరవండి.""     నేను కళ్లు తెరిచాను.     నా మీదకు వంగి ఉన్న రహమాన్ ముఖం కన్పించింది.     రహమాన్ నా చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టాడు.     నేను చుట్టూ ఉన్న పరిసరాలను తల తిప్పిచూశాను.     చెట్టు మొదట్లో క్రీనీడలో మళ్ళీ ఏదో ఆకారం కన్పించింది.     మళ్లీ పిచ్చిగా అరచి రహమాన్ ను గట్టిగా పట్టుకొన్నాను.     ""అదేం చెయ్యదు బాబూ! నేనున్నానుగా? కళ్ళు తెరవండి. ఒరే హనుమాన్ ఇలా వచ్చి బాబుగారికి దణ్ణంపెట్టి వెళ్ళిపో! మళ్లీ కన్పించకు"" అంటున్నాడు రహమాన్.     ""వద్దు! వద్దు! పిలవకు!"" అన్నాను నిలువునా వణికిపోతూ.     ""అలాగేబాబూ! ఒరేయ్ ఇక నువ్వెళ్ళిపో!"" అన్నాడు రహమాన్.     ""బాబూ కళ్ళు తెరవండి"" అన్నాడు నాతో.     కళ్ళు తెరచిచూచాను. చెట్టుకేసి భయం భయంగా చూచాను. అక్కడేమీలేదు.     రహమాన్ నీళ్ల బాటిల్ అందిస్తూ ""తాగండి బాబూ!"" అన్నాడు.     రెండు చేతులతో బాటిల్ అందుకొని గటగట తాగేశాను.     మనసు కొంత కుదటపడింది.         ఖాళీ బాటిల్ ఇస్తుండగా నాకు అంతకుముందే నీళ్ళన్నీ తాగేశానన్న విషయం గుర్తొచ్చింది. మళ్ళీ ఈ నీళ్లు ఎక్కడ్నుంచి వచ్చాయ్?     ""రహమాన్! ఈ నీళ్ళెక్కడివీ?""     రహమాన్ మర్మగర్భంగా నవ్వాడు." 24,"ఆయన శివమెత్తినవాడిలాగా, ""తెగనీలుగుతున్నావే! నాయిష్టప్రకారం ఉండకపోతే నాయింటిలో ఉండడానికి వీల్లేదు."" ""నువ్వు ఉండమన్నా ఉండను."" మావయ్య పిన్నుతో గుచ్చిన బెలూన్లాగా వేళ్ళాడిపోయాడు. ""ఎక్కడికెళతావ్?"" అన్నాడు తెచ్చిపెట్టుకున్న బింకంతో. దిక్కులేని ఆడపిల్ల. అలా తనని ఎదిరించి వెళ్ళిపోతుందని ఆయన వూహించలేదు. ఆయన్ని దహించేటట్లు, శపించేటట్లు చూస్తూ, ""నీలాంటివాళ్ళు లేని చోటికి!"" అంది. పేరంటానికెళ్ళిన అత్తయ్యావాళ్ళు తిరిగిచ్చేసరికి లత వస్తువు ఒక్కటీ ఆ ఇంట్లో లేదు - తను తొందరలో మర్చిపోయి వదిలేసిన సోప్ బాక్స్ తప్ప! లత కూడా లేదు! నోట్లో పెట్టుకోబోతున్న చాక్లెట్ జారి కింద మట్టిలో పడిపోతే దిగాలుపడిపోయిన పిల్లాడిలా కూర్చుని ఉన్న మామయ్య, కాసేపటి తరవాత లత వదిలేసిన సోపుని గమనించి దాన్ని అపురూపంగా తన పెట్టిలో, తన 'పుస్తకాల కలెక్షన్'తో బాటు భద్రం చేసుకున్నాడు.                                                                    * * *      శ్రీకాంత్ కానిస్టేబుల్ని కొట్టిన తరువాత జైలులో చాలా పెద్ద గొడవే అయింది. క్షణాలమీద విజిల్స్ వినబడ్డాయి. ప్రమాదాన్ని సూచిస్తూ సైరన్ మోగింది. హడావిడిగా కానిస్టేబుల్స్ కొంతమంది పరిగెత్తుకొచ్చి శ్రీమంత్ మీద పడి, పెడరెక్కలు విరిచిపట్టుకున్నారు. జైలు వార్డెన్ గబగబ వచ్చాడు. ""ఏమైంది"" అన్నాడు పరిశీలనగా అందరినీ చూస్తూ. ""టూనాట్ వన్ ని కొట్టాడు సార్ ఈ సైతాన్!"" ""ఏమిరా? తలగానీ తిరుగుతోందా?"" అన్నాడు వార్డెన్ కర్కశంగా. ""మళ్ళీ అదే! అలా 'రా' 'గీ' అని మాట్లాడొద్దని మీవాడికి చెబుతుంటేనే ఇంత గొడవైంది. ఎగైన్ యూ ఆర్ టాకింగ్ ఇన్ ద సేమ్ బ్లడీ రాటెన్ వే! అలా మాట్లాడడానికి మీకు హక్కు..."" వెంటనే వార్డెన్ మొహంలో చూపు మారిపోయింది. కోపం, రౌద్రం కనబడడం లేదు ఇప్పుడా కళ్ళల్లో అసహజంగా, అతిచల్లగా మారిపోయిందా చూపు. పాతకేడీలకు మంచుముక్కల్లా ఉన్న ఆ కళ్ళల్లోని భావమేమిటో తెలుసు! ఆయన అలా చూడగానే వాళ్ళ మనసు గడ్డ కట్టుకుపోతుంది. వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. ఆయన కళ్ళలోని రౌద్రాన్ని సంతోషంగా ఎదుర్కోగలరు రౌడీలు - ఒళ్ళు చల్లబడిపోయేలా చేసే ఆ చూపుకంటే. మహేష్, అతని ఇద్దరు మిత్రులూ, నోరు తెరుచుకుని జరుగుతోంది చూస్తున్నారు. ""ప్లీజ్ కమ్ ఎలాంగ్ విత్ మీ!"" అన్నాడు వార్డెన్ శ్రీమంత్ తో అతి మర్యాదగా, వినయాన్ని అభినయిస్తున్న నటుడిలా - ""దట్స్ రైట్! నౌ యూ ఆర్ బిహేవింగ్ యువర్ సెల్ఫ్! అలా మర్యాదగా మాట్లాడితే అసలు పేచీనే లేదు."" ""రండి!"" అని దారి తీశాడు వార్డెన్. చాలా నిర్దుష్ట]మైన ఇంగ్లీషు వుచ్చారణతో, మంచినీళ్ళు గడగడ తాగేసినట్లు మాట్లాడుతూ, జైల్లో ఇప్పుడున్న వాతావరణం గురించీ, ఉండవలసిన వాతావరణం గురించీ అనర్గళంగా లెక్చరిస్తూ ఆయన వెనక నడిచాడు శ్రీమంత్. సరిగ్గా పదినిముషాలతర్వాత, ఒళ్ళు జలదరించేటట్లు, చెట్టంత మొగాళ్ళకి, రాటుదేలిన రౌడీలకూ కూడా గుండె నీరయిపోయేటట్లు. ""మ్ మ్ మ్మా!"" అని కేక వినబడింది. అది శ్రీమంత్ గొంతు. దుర్భరమైన బాధని భరించడానికి విశ్వప్రయత్నం చేస్తూ, ఓడిపోయిన మనిషి ఆర్తనాదంలా వుంది. బిగించిన పళ్ళూ, కళ్ళూ, పెదిమలూ ఆ శబ్దాన్ని ఇంకా భయంకరంగా చేశాయేగానీ, ఆపలేకపోయాయని అర్ధమవుతోంది. ""మ్మ్...మ్మా!"" అతని అమ్మ ఎవరో గానీ, అతని పిలుపు వినబడనంత దూరంలో ఉంది కాబట్టి అదృష్టవంతురాలైపోయింది. కొడుకు పెట్టిన ఆ కేక వింటే ఆ తల్లి... ""మ్మా..."" తరవాత అరగంట దాకా ఆ సోలిటరీ సెల్ నుంచి, మనిషి మనిషిమీద చూపించగల క్రౌర్యానికి నిదర్శనంగా కేకలు!                                                                         * * *      నాలుగురోజుల తర్వాత శ్రీమంత్ నీ, మహేష్ నీ తన రూమ్ లోకి పిలిపించాడు వార్డెన్. కావాలనే శ్రీమంత్ ని నిర్లక్ష్యం చేసి, అసలు అతన్ని పట్టించుకోకుండా, అతని ఉనికిని గమనించకుండా మహేష్ వైపు తిరిగాడు. 'మేకపోతు గాంభీర్యం' అనుకున్నాడు శ్రీమంత్ మనసులోనే నవ్వుకుంటూ. ""ఏమిరా! ఇంకా దందాలు చేస్తున్నావా?"" అన్నాడు వార్డెన్. ""లేద్సర్! మానేసినాను"" అన్నాడు మహేష్ అతి వినయంగా. ""కవాడిగుడాలో గేంబ్లింగ్ డెన్ నడిపిస్తున్నవంటనే!"" ""లేదు సర్!"" అన్నాడు మహేష్ రాని నవ్వు తెచ్చుకుంటూ. ""మళ్ళీ డీ.సీ.పీ. సాబ్ కళ్ళబడకు! తోలు తీస్తాడు జాగ్రత్త! మంచిగా బ్రతకరా! పో!"" అన్నాడు వార్డెన్. తర్వాత శ్రీమంత్ వేపు తిరిగి, ""నువ్వు కూడ వెళ్ళొచ్చు. జాగ్రత్తగా ఉండు. మళ్ళీ పిలిచినప్పుడు వచ్చి కనబడాలి. ""తెల్సిందా!"" అన్నాడు ఉదారంగా గొంతు పెట్టి. ""మీరు' అనడం మర్యాద! మైండ్ యూ! మీ సంగతి నాకు తెలీదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ని!"" అని ""నన్ను రిలీజ్ చెయ్యమని ఆర్డర్స్ వచ్చాయా? నా బెయిల్ అప్లికేషన్ తొందరగానే కన్ సిడర్ చేశారన్నమాట!"" అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ. దొంగాటలో దొరికిపోయిన పిల్లాడిలా చూశాడు వార్డెన్. ""మీరు నన్ను దయా ధర్మంగా వదలడంలేదు. బెయిలుకి అప్లయి చేశాను. బెయిలు దొరికింది. జెయిల్లోంచి వెళ్ళిపోతున్నాను. అవునా?"" అన్నాడు శ్రీమంత్. వార్డెన్ నిశితంగా చూశాడతన్ని. ""సీ యూ!"" అని వార్డెన్ తో చెప్పి, అంతలోనే, ""సారీ! ఐ డోంట్ వాంట్ టు సీ యూ ఎగైన్."" అని బయటికి నడిచాడు. వార్డెన్ కి దండంపెట్టి మహేష్ కూడా కదిలాడు. బయటికి రాగానే ఒకసారి వెనక్కు తిరిగి చూశాడు శ్రీమంత్." 25,"     ""బాస్టర్డ్..."" గబగబా ముందుకు పరిగెత్తింది అర్పణ - పెనువేగంతో సుడిగాలిలా పరిగెడుతోంది అర్పణ.          పెట్రోలింగ్ వ్యాన్లు..... పోలీసులు..... ప్రజలు..... ఒకమ్మాయి రోడ్ మీద ఆ సమయంలో అంతవేగంగా ఎందుకు పరిగెడుతుందో అర్ధంకాలేదు. ఆ అమ్మాయిని ఆపడానికి ఒక పెట్రోలింగ్ వ్యాన్ ఆమె వెంట పడింది. వైర్ లెస్ నెట్ లో ఈ న్యూస్ ని....బహీర్ బాగ్ చౌరస్తాలోని పెట్రోలింగ్ వ్యాన్ కి అందింది....          చెమట్లు కక్కుతూ అర్పణ... కళ్ళల్లో కన్నీళ్ళు చిమ్ముతూ అర్పణ గుండెల్నిండా కసిని నింపుకున్న అర్పణ...          ""కేచ్ హిమ్... కేచ్ హిమ్... దట్ బాస్టర్డు... హి.... ఈజ్..."" ఎవరికీ ఏమీ అర్ధంకాని ఆక్రందన...          అదే సమయంలో రోడ్డు కడ్డంగా వచ్చిందో వెహికల్.... ఆ వెహికల్ ని గుద్దుకొని కింద పడిపోయి, అంతలోనే కళ్ళిప్పి చూసింది అర్పణ.              ఆ వెహికల్ హీరో హోండా -దానిమీద ఉన్నది సూర్యవంశీ.          నిలువెల్లా కన్నీటిమయమైపోయిన బాధతో చెప్పింది అర్పణ!          ""కమాన్ గెట్ బ్యాక్..."" అర్పణ బ్యాక్ సీట్లో కూర్చుంది...          ""రెడ్ కలర్ మారుతీ.... విచిత్రమైన వేషంలో ఉన్నాడు"" చెప్పింది అర్పణ.          నెమ్మదిగా కార్ల మధ్యలోంచి దూసుకు పోతున్నాడు సూర్యవంశీ. కన్పించిన ప్రతీ రెడ్ కలర్ మారుతీలోకి తొంగిచూస్తున్నాడు...                                                          *    *    *    *    *          నిజాం కాలేజీ వేదికమీద, మొదట సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి - తర్వాత గవర్నర్ ప్రతినిధి జరగబోయే కార్యక్రమం గురించి సంక్షిప్తంగా చెప్పి వెనక్కి నడిచాడు. తర్వాత గవర్నర్ గారు వేదిక నలంకరించారు.          కాబోయే చీఫ్ మినిస్టర్ ని వేదికమీదకు ఆహ్వానించారు - చిరునవ్వులు చిందిస్తూ అనుచరవర జయ జయ ధ్వానాలు చేస్తుండగా జనార్ధన్ ఠాగూర్ వేదిక నెక్కాడు.                                                         *    *    *    *    *          రెడ్ కలర్ మారుతీకారు సరిగ్గా బషీర్ బాగ్ చౌరస్తా దగ్గర ఎడమ వేపు మలుపు తిరిగింది. కారు పార్కింగ్ వేపు వెళ్తోంది. సరిగ్గా ఆ సమయంలో బబ్లూ బ్రెయిన్ లో ఒకథాట్.... లిబర్టీ చౌరస్తా దగ్గర, తనవేపు ఓ రెండు కళ్ళు సూటిగా చూసాయి - దాంతో అతనిలో అనుమానం - బబ్లూ జీనియస్.....ఎందుకయినా మంచిదని తన ఆకారం వేపు ఒకసారి చూసుకొన్నాడు..... మరుక్షణం పైనున్న శాలువాను, కిందనున్న పంచెనుతీసి, కారు వెనుక పడేసాడు....లోన - భాగీ ఫాంటు షర్టు....          క్షణంలో కాలేజీ కుర్రాడిలా మారిపోయాడు..... ఫ్యాంట్ కుడిజేబులో పవర్ ఫుల్ డెర్రింగర్ పిస్టల్.... ఫుల్ లోడెడ్ పిస్టల్ - కుడి పక్కజేబులో ప్రమాదం సంభవించినపుడు తనని తాను రక్షించుకోడానికి పవర్ ఫుల్ హేండ్ బాంబ్!          ఠీవిగా కారు దిగి డోర్ తెరవబోయాడు...          సరిగ్గా అదే సమయంలో - ఎదురుగా రెండుకళ్ళను చూసి తనను మింగడానికొచ్చిన విషజంతువును చూసినట్లు బెదిరిపోయాడు.          ఆ కళ్ళు అర్పణని - ఆ వెనుక సూర్యవంశీ-          ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు సూర్యవంశీ - అర్పణ కిందకు దిగగానే హీరో హోండాని రైజ్ చేసాడు-          వైర్ ఫటిల్లుమని తెగిపోయేవరకూ రైజ్ చేసి కారు ఫ్రంట్ డోర్ ని ఢీ కొన్నాడు......          మిర్రర్ భళ్ళున బద్దలైపోయింది.....          హీరో హోండాని వదిలేసి కారులోకి దూకాడు వంశీ.          పిస్టల్ ని అందుకోబోయిన బబ్లూ.... మెడమీద బలంగా తగిలింది సూర్యవంశీ పాదం.....          ఆ దెబ్బకి తెరచుకున్న రెండో విండోలోంచి కిందపడ్డాడు బబ్లూ పడగానే- నిజాం కాలేజీవేపు పరుగెత్తడం ప్రారంభించాడు.          బబ్లూ వెంట పడ్డాడు సూర్యవంశీ.....          కారు ఫ్రంట్ సీట్లో ఉన్న డెర్రింగర్ పిస్టల్ ని అందుకుని దానిమీద పైటను కప్పి తనూ కాలేజీ వేపు పరుగు తీసింది అర్పణ.          సూర్యవంశీని అతను వెంటాడుతున్న బబ్లూని చూడగానే - అనుమానంతో పెట్రోలింగ్ వ్యాన్లు.... చుట్టు ముట్టాయి.....          పవర్ ఫుల్ వెపన్స్ అతనికి గురిపెట్టబడ్డాయి.....                                                        *    *    *    *    *          కాబోయే సి.ఎమ్ చేతికి ఓ లెటర్ ఇచ్చారు గవర్నర్ ఆ లెటర్ లోని మొదటి వాక్యాన్నీ చదవగానే బిత్తరపోయాడు భూకబ్జా జనార్ధన్ ఠాగూర్.          ""నా పేరు జనార్ధన్ ఠాగూర్. భూకబ్జా జనార్ధన్ ఠాగూర్ నేనీ పదవికి తగను...""          ""వాట్ గవర్నర్ సాబ్.... ఏంటిది-"" కోపంగా అడిగాడు జనార్ధన్ ఠాగూర్.          ""గవర్నర్ గారిని కాదు అడగాల్సింది. నన్ను...."" భయంకరమైన అరుపుకి బెదిరిపోయి వి.ఐ.పీ గ్యాలరీలోకి చూసిన జనార్ధన్ ఠాగూర్ పై ప్రాణాలు పైనే పోయాయి.          ఎదురుగా - వంశీ వెనక సి.ఆర్.పి దళాలు ఎక్కుపెట్టిన రైఫిల్స్ మధ్య ఉన్నాడు.... బబ్లూ.          ""గవర్నర్ గార్కి ఏదైనా చెప్పవలసింది ఉంటే - నేను చెప్తాను ఆ తరువాత వీడు చెప్తాడు"" అంటూ సూర్యవంశీ బబ్లూ కాలర్ పట్టుకుని వేగంగా వేదిక మీదకి లాక్కెళ్ళాడు.          ఆ హఠాత్పరిణామానికి వేదిక మీదున్న పెద్దలే కాదు - క్రిందున్న ఎమ్.ఎల్.ఏలు - అధికారులు - రాజకీయనాయకులు - ప్రజలు కూడా షాక్ తిన్నట్లయిపోయి శిలాప్రతిమల్లా మిగిలిపోయారు.          ఇసుక వేస్తే రాలనట్లున్న లక్షలాది జనం నిశ్శబ్దంలో కూరుకుపోయారు.....అక్కడి వాతావరణంలో గంభీరమైన ఉద్విగ్నత.... ఉద్వేగం....ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ....          ""గౌరవనీయులైన గవర్నర్ గార్కి - అమాయకులైన ప్రజలకు, పచ్చి స్వార్ధపరులైన రాజకీయనాయకులకు నా నమస్కారం - నే చెప్పేది దయచేసి సావధానంగా వినండి -          మన హైదరాబాదులో జరుగుతున్నన్ని భూకబ్జాలు దేశం మొత్తం మీద మరెక్కడా జరగటంలేదు.          ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ సింహాసనం అధిష్టించిన వన్ ఇయర్ కి తన సలహాదారుడైన ఒక వ్యక్తికి షేక్ పేట విలేజ్ రెవెన్యూ పరిధిలోకొచ్చే - జూబ్లీహిల్స్ లో నాలుగొందల ఎకరాల్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇది 1912లో జరిగింది. అప్పట్లో ఆ లాండ్ కి అంతగా విలువలేదు." 26,"     ఈ విధంగా హిందూ సక్సెషన్ ఆకట్ హిందూ వారసత్వపు చట్టంలో విప్లవాత్మకమైన మార్పులను- అందునా మహిళలకు అనుకూలమ్తెన మార్పు లను తీసుకొచ్చిందని చెప్పవచ్చు.     ""హిందూ సక్సేషన్ ఆక్ట్-1956"" ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంవారు 1988వ  సంవత్సరం ఆక్ట్ 13 ప్రకారం  కొన్ని సవరణలను జోడించి కుమార్తెలకు  మరింత ప్రయిజనకంరంగా వుండేటట్లు చేశారు. ఈ సవరణం వాళ్ళ ఆడపిల్లలకు కూడా ప్రయోజనకంరంగా వుండేటట్లు చేశారు. ఈ సవరణల వల్ల ఆడపిల్లలకు కూడా మగపిల్లలతో సమానంగా ఆస్తి హక్కులు లభించాయి.     ఈ సవరణలవల్ల ఆస్తిపై ఆడపిల్లలకు మల్లేనే పుట్టుక తోనే ఆస్తి హక్కు లభించినట్లయింది. అంతేగాక సదరు ఆస్తిపై మగపిల్లలకు వుండేటటువంటి హక్కులన్నీ ఆడపిల్లలకు కూడా సంక్రమించాయి.     ఇపుడు అవిభక్త హిందూ  కుటుంబంలో ఆస్తి పంపకాలు జరుగుతున్నప్పుడు కూతుళ్ళకు కూడా కొడుకులతో  సమానంగా వాటా  ఇవ్వాల్సిందే. ఒకవేళ ఆ సమయానికి కూతురు చనిపోయివున్నట్లయితే -ఆమె సంతానానికి  ఆ ఆస్తి సంక్రమిస్తుంది. ఒక వేళ ఆమె సంతానం  కూడా చనిపోతే వారి  సంతానానికి  ఆ ఆస్తిప్తె హక్కు  లభిస్తుంది. ఈ విధంగా  అసలు  వారితో కలిపి మూడు  తరాల మహిళలకు అవిభక్త కుటుంబంలోని ఆస్తిపై హక్కు లభించినట్లయింది. ఒకవేళ  ఆస్తి సంపకంయింకా  జరగకుండానే కుమార్తె మరణించినప్పటికి  కూడా ఆస్తిపై ఆమెకు గల హక్కు చెక్కు  చెదరదు. ఆమె వాటా తాలూకు  ఆస్తి ఆమె సంతానానికి వస్తుంది. ఇదే ఈ ఏమేండు మెంటులోని విశిష్టత.     అయితే ఈ సవరణవల్ల లభించిన హక్కులు 5-9-85 నాటికి పెళ్ళికాని కుమార్తెలకు రైలకు మాత్రమే లభిస్తాయి.     మొత్తంమీద ""హిందూ సక్సేషన్ ఆకట్ 1956"" దానకి  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంవారు  జోడించారు ఈ సవరణలవల్ల స్త్రీలకు  పురుషులతో సమానమైన హక్కులు లభించాయి.     హిందూ చట్ట ప్రకారం  ఆస్తి రెండు రకాలు. ఒకటి సమిష్టి కుటుంబ ఆస్తి అంటే:     తండ్రి, తాత ముత్తాత-ఇలా  పూర్వికుల నుంచి ఒక హిందుపుకు సంక్రమించిన ఆస్తిపాస్తులు.     కుటుంబంలోని  ఇతర సభ్యులతో కలిసి, అంటే తండ్రి కొడుకులు లేదా అన్నదమ్ములు కలిసి ఉమ్మడిగా చేసిన వ్యాపారం, ఇతర కార్యకలా పాలవల్ల వచ్చ్సిన ఆదాయంతో సమకూర్చుకున్న ఆస్తులు.     సొంతంగా సంపాదించినదే  అయినప్పటికీ స్వచ్చందంగా తన ప్రత్యేక హక్కును వదులుకుని  కుటుంబమంతటి కోసం సమర్పించిన ఆస్తులు ఇటువంటి ఆస్తులను  ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఆధారంగా ఉమ్మడి ప్రయోజనం కోసం దాఖలు చేసినట్లు గుర్తించాలి.    పైన  చెప్పకున్నవన్ని సమిష్టి కుటుంబ ఆస్తులుగా సరిగానిస్తారు. ఈ ఆస్తులప్తె తండ్రి జీవించి ఉండగా  కూడా  కొడుకు, కూతుళ్ళకు  సమాన హక్కు ఉంటుంది. 1986  ఎ.పి  ఏమేండ్ టు  సక్సేషన్  యాక్ట్  13 ప్రకారం  కూతురికి కూడా కొడుకులతోపాటు ఆస్తిలో సమాన భాగం  అభిస్తుంది. అయితే 1985 సెప్టెంబర్ 5 నాటికి  ఆమె అవివాహిత కావాలి.     తండ్రి స్వార్జిత ఆస్తిలో మాత్రం  ఆయన జీవించి  ఉండగా కొడుకులకి గాని, కూతుళ్ళకు గాని  ఎటువంటి హక్కు ఉండదు. తండ్రి తన ఇష్టం ప్రకారం ఆ ఆస్తిని అమ్ముకోవచ్చు కానుకగా ఇవ్వవచ్చు లేదా ద్వారా తన అభిష్ట ప్రకారం వినియోగించవచ్చు.     ఎ విధమ్తెన విల్లూ రాయకుండా  మరణించినట్లయితే చట్టప్రకారం  అతని స్వార్జితం, పిత్రార్జితం రెంటిలోనూ హక్కు ఉంటుంది. ఇద్దరికీ చేరి సగం ఆస్తి లభిస్తుంది.     చదవటం ఆపాడు ఒక్క క్షణం సూర్యసాగర్.     అంత పండ్బందిగా  తయారయి వస్తాడని ఊహించని రవిచంద్ర వర్గం  డిఫ్ షాక్ కి  లోనయింది.     ""1985 ముందు  పెళ్ళికాని ఆడపిల్లలు-తమ పుట్టింట్లో హీనంగా- స్యూనతభావంతో బత్కనక్కర్లేదు. అన్నలకో తమ్ముళ్ళకో లొంగి ఉండనఖ్కర్లేదు.     అన్నలు తమ్ముళ్ళు వ్యాపారంచేసి సంపాదిస్తూ అక్కలముందు, చెల్లెల్లముందు ఫోజు కొట్టటం ఆహం  ప్రదర్శించటం చేస్తుంటారు- వాళ్ళ బతుకు, వీళ్ళు కోర్టుకు  వెళ్ళినంతవరకే  అని వాళ్ళకు  తెలిదు పాపం.     అన్నదమ్ములు  వ్యాపారం చేసేది ఎవరు  సంపాదించిన  ఆస్తి మీద...? తాత, తండ్రి  సంపాదించిన ఆస్తి మీదే  అయితే ఆడపిల్లలకు  సమాన హక్కు ఖచ్చితంగా ఉంది.     అన్నదమ్ములు  తమక్తే  తాము సంపాదించుకున్న  దానిమీద, వాళ్ళ భార్యలు తెచ్చిన  దానిమీద  ఆడపిల్లలకు హక్కుండదు.     అయితే  ఈ మధ్య  కొందరు అతి తెలివి   తేటలు ప్రదర్శిస్తున్నారు- తండ్రి చేసిన అప్పాలున్నాయి గదా అని, అప్పుడు  ఆస్తి- అప్ప సమానంగా  పంచుకోవాలి. ఆ అప్పాలు న్యాయంగా చేసిన నిజమ్తెన అప్పలాయి ఉండాలి. ఆడపిల్లలకు ఆస్తి హక్కుని హరించాటానికి చూపించే  దొంగ అప్పలాయి ఉండకూడదు.     అన్నదమ్ముల ఆధ్వర్యంలో కుటుంబ వ్యాపారం నడిచేప్పడు- అన్నదమ్ముల అసమర్ధతవల్ల వ్యాపారంలో నష్టం వస్తున్నా ఆడపిల్లలు  అడ్డంతిరిగి- వాళ్ళని  తప్పించవచ్చు. మా అన్నదమ్ముల అసమర్ధతకు ఆడపిల్లలమైన మేమందుకు బలికావాలని కోర్ట్ ద్వారా నే నిలదీసి అడగవచ్చు.     అప్పలు తీర్చగలిగే అవకాశం ఉందికూడా తీర్చకుండా వాటి  నాలాగే ఉంచేస్తే, ఆడపిల్లలు ఆస్తి హక్కుమీదకు రారని కొందరు ఈ మధ్య అతి తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు.  " 27,"     ""నన్ను తిట్టిన వాళ్ళు సంవత్సరం తిరక్కుండా పోతారు"" అన్నాడు పాపారావు.     ""ఛా?""     ""నేను పేకాట్లో మోసం చేశానని సుబ్బడు తగువు పెట్టుకున్నాడా?""     ""సుబ్బడెవరు?""     ""సుబ్రహ్మణ్యం. మీ వీధిలోనే ఉంటాడు. నాతో పేకాట్లో తగువు పెట్టుకున్నాడు సుబ్బడు. నా దగ్గర ఎక్స్ ట్రాగా దొంగముక్కలు ఉన్నాయన్నాడు. కొట్టబోయాడు. మర్నాడే పాము కరిచి చచ్చిపోయాడు.""     ""అలాగా!"" అన్నాడు మల్లికార్జునరావు. ఇంకేమనాలో తోచక.     ""నన్ను నిష్కారణంగా తిట్టి మీ నాన్న అకాల మృత్యువు వాత పడ్డాడు. తండ్రిలేని వాడివి. నీ మీద నాకు జాలి! నీకు ఉపకారం చెయ్యదలచుకున్నాను""     ఊరికే చూస్తూ ఉండిపోయాడు మల్లికార్జునరావు.     ""అర్జున్! నీకు రష్యాకి రైస్ ఎక్స్ పోర్ట్ చెయ్యడానికి పర్మిట్ ఇప్పించనా?""     ""రష్యాకి రైసా?"" అన్నాడు మల్లికార్జునరావు ఆశ్చర్యంగా.     ""ఆ మధ్య నేను రష్యా వెళ్ళినప్పుడు బియ్యపు అన్నం తినడం అలవాటు చేసి వచ్చాలే!""     ""నువ్వు రష్యా ఎప్పుడెళ్ళావ్?""     ""ఆ మధ్య మూడు నెలలు కనబడకుండా పోయానే! అప్పుడు.""     ""రాజమండ్రి జైల్లో ఉండి వచ్చావన్నారే!""     ""ఎవరన్నదీ! రక్తం కక్కుకు చస్తారు. నువ్వు అన్నావా?""     ""అన్లేదు - విన్నాను"" అన్నాడు అర్జున్ భయంగా.     ""అది అలా ఉండనివ్వు. లండన్ లో మనకి తెలిసిన దొర ఒకాయన ఉన్నాడు. ""పాపారావ్! లండన్ వచ్చేయ్! నిన్ను రాణిగారికి పరిచయం చేసి లార్డ్ ని చేసేస్తా"" అంటుంటాడు. కానీ ఇక్కడ పనుల్లో ఇరుక్కుపోయాను గదా! ఇదిగో! ఉన్నపళంగా ఢిల్లీ రమ్మని టెలిగ్రాం!"" అన్నాడు నలిగిన ఒక కాగితం చూపిస్తూ.     ""బావుంది!"" అన్నాడు అర్జున్.     ""మరి రైస్ ఎక్స్ పోర్ట్ చేద్దామా?""     ""మనకెందుకులే భాయ్! ఉన్నదానితో జరిగిపోతుంది కదా!"" అన్నాడు అర్జున్.     ""నీకు కట్టుకుపోయినంత ఆస్తి ఉంది! పండిన ధాన్యం రైతులచేత అమ్మిస్తావ్. వాళ్ళు సహానికి సహం తినేస్తారు. రైతుల ఎదాన కొట్టే బదులు రష్యాకి ఎగుమతి చెయ్యమంటున్నా""     ""నాకు ఇంట్రెస్టు లేదయ్యా!""     ""కనీ నీ మీద నాకు ఇంట్రెస్టు ఉంది""     ""నాకు పని ఉంది - బొంగుల బజారు వైపు వెళ్ళి రావాలి""     ""నేనూ అటే! పద!""     మొత్తానికి పాపారావు అర్జున్ ని వదలలేదు. గాదెలో ధాన్యం ఉంది. పందికొక్కు కనిపెట్టింది. కంత పెట్టింది. మూడు నెలల పాటు అర్జున్ తో తిరిగాడు పాపారావు. మూడు నెలల్లో అర్జున్ డబ్బు చాలా పోయింది. సిగరెట్లు కాల్చడం మాత్రం వచ్చింది.     ""మనం రష్యాకి రైస్ ఎగుమతి చేయడం అయ్యేపని లాగా కనిపించడం లేదయ్యా! ఇంక వదిలేద్దాం"" అన్నాడు అర్జున్ ఒకరోజున.     ""నాకూ అదే అనిపిస్తోంది"" అన్నాడు పాపారావు.     ""ఏమని?""     ""మనం రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళాం""     ""అంటే?""     ""నిన్న మధ్యాహ్నం ఆయన దిగబడ్డాడు""     ""ఎవరు?""     ""ఇంకెవరు! పరమశివుడే!""     ""ఏమిటీ?""     ""అవునయ్యా! ప్రతిరోజూ అర్థరాత్రి వస్తాడు. ఇద్దరం ఓ అరగంట హస్కేస్తాం! మొన్న నైటు కుదరలేదుట. అందుకని నిన్న మధ్యాహ్నం వచ్చాడు సరిగ్గా భోజనాల టైంలో. పండు మిరప్పళ్ళ కారం,గోంగూర పచ్చడీ, వెన్నపూసా పెట్టి భోజనం పెట్టా! తిని తేనుస్తూ అన్నాడు - ""పాపారావ్! ఇంత అనాగాడివేవయ్యా! చెప్పింది అర్థం చేసుకోవూ!"" అని.     ""మా అర్జున్ సంగతేనా?"" అన్నా.     ""ఇంపోర్టు చేసుకోమంటే ఎక్స్ పోర్టు చెయ్యడానికి చూస్తారేమయ్యా! సరిగ్గా విన్లేదా ఏం?""     ""సరిగ్గా మీరు చెప్పే టైంకి సైగలు పాట ఏదో వస్తూ ఉండి ఉంటుంది స్వామీ"" అన్నా.     ""ఈసారన్నా సరిగ్గా విని ఏడు! భూటాన్ నుంచీ బార్లీ దిగుమతి చేసుకోండి! అన్నాడయ్యా! సరే అనేశా!""     ""పాపారావ్! నన్ను వదిలేయ్! ఏదో చెప్పావు. మూడు నెలలు తిరిగా! పని కాలేదు. పాతిక వేలు వదిలాయ్! పోతేపోనీ! కానీ ఇంక డబ్బు తగలేసే ఆలోచనలు చెప్పకు!!""" 28,"     6. ఇంద్రా ! 'ఏతశు'ని కొఱకు యుద్ధమున సూర్యుని హింసించినావు. ఆ యుద్ధమున 'ఏతశు' ని రక్షించినావు.     7. ఇంద్రా ! ఆవరించిన అంధకారమును హతమార్చినావు. తదనంతరము నీవు క్రోధవంతుడవు అయినావా? ఈ అంతరిక్షమున, పట్టపగలు, నీవు దాసుపుత్రుడు వృత్రుని వధించినావు.     8. ఇంద్రా ! నీవు బలమును సమర్థయుక్తము చేసినావు. హననాభిలాషిణి, ద్యులోక దుహిత ఉషను వధించినావు.     9. ఇంద్రా ! నీవు ద్యులోక దుహిత, పూజనీయ ఉషను పిండికొట్టినావు.     10. అభీష్టవర్షీ ! ఇంద్రా ! నీవు ఉష శకటమును భగ్నపరచినావు. అప్పుడు ఉష భీతిల్లినది. విరిగిన రథమునుంచి దూకినది.     11. ఇంద్రుడు చూర్ణము చేసిన ఉష రథము 'విపాశ' నదీతీరమున కూలినది. శకటము విరిగిపడగా ఉష దూరదేశమునకు పారిపోయినది.     12. ఇంద్రా ! నీవు నీ బుద్ధిబలమున సమస్త జలములను ప్రవహించు నదులను భూమిమీద స్థాపించినావు.     13. ఇంద్రా ! నీవు వర్షకారివి. నీవు 'శుష్ణు' ని నగరములను ధ్వంసము చేసినావు. అతని ధనమును దోచినావు.     14. ఇంద్రా ! నీవు 'కులితర' పుత్రుడు దాసుడగు శంబరుని అనేకపర్వతముల మీదినుంచి బోర్లపడవేసి చంపినావు.     15. ఇంద్రా ! చక్రపు చతుర్దిక్ స్థిత శంకువలె ఉండిన 'విర్చి' దాసుని చతుర్థిక్ స్థిత అయిదువందల వేల సంఖ్యగల అనుచరులను విశేషరూపమున వధించినావు.     16. శతక్రతువగు ఇంద్రుడు 'అగ్రు' పుత్రుడు 'పరావృతు'ని స్తోత్ర భాగస్వామిని చేసినాడు.     17. యయాతి శాపమున అనభిషక్తులయిన ప్రసిద్ధరాజులు 'యదు, తుర్వసు' లను శచీపతి, విద్వాంసుడగు ఇంద్రుడు అభిషేక యోగ్యులను చేసినాడు.     18. ఇంద్రా ! నీవు 'సరయు' నదికి ఆవల ఉండు ఆర్యత్వాభిమాని 'అర్ణ', 'చిత్రరథ' నామక రాజులను వధించినావు.     (ఆర్యత్వాభిమానినౌ సన్తావపి ఇంద్ర విషయభక్తిశ్రద్ధా రహితా విద్యర్థః అని శాయణుడు. ఆర్యత్వ అభిమానులే అయినప్పటికి ఇంద్రుని విషయమున భక్తిశ్రద్ధలు లేనివారని అర్థము)     19. వృత్రహంతా ! బంధువులు సహితము వదులుకున్న గ్రుడ్డి, కుంటివానికి కళ్లు, కాళ్లు ప్రసాదించినావు. నీవు ప్రసాదించిన సుఖమును నివారించగలవాడు లేడు.     20. ఇంద్రుడు హవ్యదాత, యజమాని దివోదాసునకు శంబరుని పాషాణ నిర్మిత శతసంఖ్యాక నగరములను ఇచ్చినాడు.     21. ఇంద్రుడు దభీతికొఱకుగాను తన స్వశక్తితో ముప్పదివేల రాక్షసులను ఆయుధములతో హతమార్చినాడు.     22. ఇంద్రా ! నీవు ఈ సమస్త శత్రువులను పరాజితులను చేసినావు. శత్రుహింసక ఇంద్రా ! నీవు గోవులను పాలించువాడవు. నీవు యజమానులందరకు సమానముగ ప్రఖ్యాతుడవు.     23. ఇంద్రా ! నీవు నీ బలమును సమర్థయుక్తము చేసినావు. అందువలన నేటికిని ఎవ్వడును నీ బలమును బాధించలేడు.     (సామర్థ్యములేని బలము నిరర్థకము అనుచున్నాడు)     24. శత్రు వినాశక ఇంద్రా ! అర్యమ నీకు మనోహర ధనమును దానము చేయవలెను. దంతహీన పూష నీకు మనోహర ధనమును దానము చేయవలెను. భగుడు నీకు మనోహర ధనమును దానము చేయవలెను.                             ముప్పది ఒకటవ సూక్తము  ఋషి - వామదేవుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు -3 పాదివిచ్, మిగిలినవి గాయత్రి.     1. సర్వదా వర్థమానుడవు, పూజనీయుడవు, మిత్రభూషితుడవగు ఇంద్రా ! ఏ తర్పణము నిన్ను మాకు అభిముఖముగా తీసికొనిరాగలదు? ఎట్టి ప్రజ్ఞాయుత శ్రేష్ఠ కర్మ నిన్ను మాకు అభిముఖముగా తీసికొని వచ్చును?     2. ఇంద్రా ! పూజనీయము, సత్యభూతము, హర్షకారక సోమములందు ఏ సోమరసము నిన్ను శత్రుధనము నష్టపరచుటకు సన్నద్ధము చేయును?     3. ఇంద్రా ! నీవు స్నేహ స్వరూపులగు స్తోతలకు రక్షకుడవు. నీవు అనేక రక్షణలయుక్తుడవయి మాముందునకు విచ్చేయుము.     4. ఇంద్రా ! మేము నీ అనుయాయులము. నీవు మానవుల స్తుతులకు ప్రసన్నుడవు అగుము. మా వద్దకు వృత్తాకార చక్రమువలె విచ్చేయుము.     5. ఇంద్రా ! నీవు యజ్ఞమునకు నీ స్థానమును తెలిసి విచ్చేతువు. మేము సూర్యసహితముగ నిన్ను భజింతుము.     6. ఇంద్రా ! మేము రచించిన స్తుతులు చేసిన సత్కర్మలు ముందునీకు చెందును. అనంతరము సూర్యునకు చెందును.     7. ఇంద్రా ! నీవు కర్మపాలకుడవు. జనులు నిన్ను ధనవంతుడవు, స్తోతలకు అభీష్టప్రదుడవు, దీప్తిమంతుడవు అందురు.     8. ఇంద్రా ! స్తుతికర్తలు సోమాభిషవ కర్తలగు యజమానులకు క్షణమాత్రమున ధనప్రదానము చేతువు.     9. ఇంద్రా ! బాధక రాక్షసాదులు నీ ""శతంచనరాధః"" శతపరిమిత ధనమును నివారించజాలరు. శత్రువులను హింసించు నీ బలమును నివారించజాలరు.     10. ఇంద్రా ! నీ శతసంఖ్యాక, సహస్రసంఖ్యాక రక్షణలు నీ అభిమానము మమ్ము రక్షించవలెను.     11. ఇంద్రా ! నీవు ఈ యజ్ఞమున మమ్ము నీ మిత్రులను అవినాశ్యము, దీప్తిమంతమగు ధనమునకు భాగస్వాములను చేయుము.     12. ఇంద్రా ! నీవు నిత్యము మమ్ము మహాధనము ద్వారా రక్షింపుము. నీ సమస్త రక్షణలతో రక్షింపుము.     13. ఇంద్రా ! నీవు శూరునివలె నూతన రక్షణద్వారా మా గోవులను, గోవుల నివాస స్థానములను వర్థిల్లచేయుము.     14. శత్రునివారకము, దీప్తిమంతము, వినాశరహితము, గోయుక్తము, అశ్వయుక్తమగు ఇంద్రుని రథము సర్వత్ర సంచరించవలెను. ఆ రథ సహితముగా, ఇంద్రా ! మమ్ము రక్షింపుము.     15. సర్వప్రేరక ఆదిత్యా ! నీవు సేచన సమర్థమగు ద్యులోకమును ఉపరితలమున స్థాపించినావు. అట్లే దేవతలలో మా యశస్సును ఉన్నతము చేయుము.                          ముప్పది రెండవ సూక్తము   ఋషి - వామదేవుడు దేవత - ఇంద్రుడు, అతని అశ్వద్వయము, ఛందస్సు - గాయత్రి.     1. ఇంద్రా ! నీవు ఘనుడవు. శత్రుహింసకుడవు. నీవు త్వరత్వరగా మావద్దకు విచ్చేయుము. మహారక్షణల యుక్తుడవయి మా వద్దకు విచ్చేయుము.     2. ఇంద్రా ! నీవు పూజనీయుడవు. భ్రమణశీలుడవు. మాకు అభీష్ట ప్రదాతవు. విచిత్ర కర్మ యుక్తులు జనులు. వారి రక్షణకుగాను నీవు ధనమును ప్రసాదించుము.     3. ఇంద్రా ! నీ సాంగత్యముగల కొద్దిమంది యజమానుల ఉత్పాతకారకులు, వర్థమానులగు శత్రువులను నీ బలమున నష్టపరతువు.     4. ఇంద్రా ! మేము యజమానులము. నీ సాంగత్యముగలవారలము. మేము నిన్ను అత్యధికముగా స్తుతింతుము. నీవు మా అందరిని విశేషరూపమున రక్షింపుము.     5. వజ్రధర ఇంద్రా ! నీవు మనోహరము, అనిందితము, అప్రతిహతమగు రక్షణలతో మావద్దకు విచ్చేయుము.     6. ఇంద్రా ! మేము నీవంటి గోయుక్త దేవతల సఖులము. విశేష అన్నమునకుగాను నీతో కూడుదుము.     7. ఇంద్రా ! నీవు ఒక్కడవే గోయుక్త అన్నమునకు స్వామివి. కావున మాకు అశేష అన్నము ప్రసాదించుము.     8. స్తుతియోగ్యుడవగు ఇంద్రా ! నీవు స్తుతుడవు అగుదువు. స్తోతలకు ధనము ప్రసాదించవలెను అనుకొందువు. అప్పుడు ఏ ఒక్కడు దానిని అడ్డజాలడు.     9. ఇంద్రా ! నీవే లక్ష్యముగా గోతమ నామక ఋషి-తనకు విశేష అన్నము, ధనమునకుగాను స్తుతివాక్యముల ద్వారా నిన్ను స్తుతించినాడు.     10. ఇంద్రా ! నీవు సోమపానము చేతువు. హృష్టుడవగుదువు. అసురుల సమస్త నగరములకు చేరుదువు. వానిని భగ్నము చేయుదువు. ఇంద్రా ! స్తోతలమగు మేము అదిగో అదే నీ వీర్యమును కీర్తింతుము.     11. ఇంద్రా ! నీవు స్తుతియోగ్యుడవు. నీవు విశేష బలమును ప్రదర్శించినావు. ప్రాజ్ఞులు సోమాభిషవానంతరము అట్టి నీయొక్క విశేషబలములను సంకీర్తన చేయుదురు.     12. ఇంద్రా ! గోతమగణములు స్తోత్రవాహకులు. వారు స్తోత్రముల ద్వారా నిన్ను వర్థిల్లసేతురు. వారికి పుత్ర, పౌత్రాదియుక్తమగు అన్నమును దానము చేయుము.     13. ఇంద్రా ! నీవు సర్వ యజమానులకు సామాన్య దేవతవు. అయినను స్తోతలము నిన్ను ఆహ్వానింతుము.     14. నివాసప్రద ఇంద్రా ! మాయజమానుల అభిముఖముగా విచ్చేయుము. నీవు సోమరూప అన్నమున హృష్టుడవగుము.     15. ఇంద్రా ! మేము నీ స్తోతలము. మా స్తోత్రములు నిన్ను మా వద్దకు తేవలెను. నీ అశ్వద్వయమును మాకు అభిముఖముగా తిప్పుము.     16. ఇంద్రా ! నీవు మా పురోడాశమును భక్షింపుము. స్త్రీ లోలుడు స్త్రీల మాటలనే సేవించును. అట్లే నీవు మా స్తుతి వాక్యములను సేవింపుము.     17. మేము స్తోతలము. ఇంద్రుని వద్దకు చేరినాము. శిక్షితములు, శీఘ్రగాములు, సహస్రసంఖ్యాక అశ్వములను యాచించుచున్నాము. శతసంఖ్యాక సోమకలశములను యాచించుచున్నాము. అపరిమిత కలశ యజ్ఞమును యాచించుచున్నాము.     18. ఇంద్రా ! మేము నీ శత-సహస్ర సంఖ్యాక గోవులను మావైపు మళ్లింతుము. మాకు ధనము నీవద్ద నుంచే రావలెను.     19. ఇంద్రా ! మేము నీనుంచి నూరుకుండల బంగారము తీసికొందుము. శత్రుహింసక ఇంద్రా ! నీవు సహస్రప్రదుడవు అగుదువు.     20. ఇంద్రా ! నీవు బహుప్రదుడవు. నీవు మాకు మరింత ధనము దానము చేయుము. అల్పధనము ఇవ్వకుము. నీవు మాకు విశేష ధనము ఇవ్వ ఇచ్చగింతువు. కావున నీవు విశేష ధనము తీసికొని రమ్ము.     21. వృత్రహంత ఇంద్రా ! నీవు బహుప్రదుడవు. అనేకమంది యజమానులలో విఖ్యాతుడవు. నీవు మమ్ము ధనభాగస్వాములను చేయుము.     22. ప్రాజ్ఞుడవగు ఇంద్రా ! మేము నీ పింగళ వర్ణ అశ్వద్వయమును ప్రశంసింతుము. గోప్రదా ! నీవు స్తోతలను నష్టపరచవు. నీవు నీ అశ్వద్వయమున మా గోవులను నష్టపరచకుము.     23. ఇంద్రా ! నీ అశ్వద్వయము దృఢము, నవము, క్షుద్రద్రుమాఖ్య స్థానమున నిలిచిన అందమయిన సాలభంజికలవంటిది. నీ పింగళవర్ణ అశ్వద్వయము యజ్ఞమున శోభిల్లును.     24. ఇంద్రా ! మేము ఎద్దులబండి మీద వెళ్లినను, పాదచారులమయినను నీ అహింసక పింగళవర్ణ అశ్వద్వయము మాకు శుభంకరము కావలెను.     (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత మూడవ అష్టకము, నాల్గవ మండలమున ఆరవ అధ్యాయము సమాప్తము)" 29,"    ""ఒరేయ్ బుచ్చిబాబూ అంకుల్.... మరో రెండు చాక్లెట్లివ్వరా"" అంటూ బుజ్జిపండు అరిచాడు.     వాడికి మరో రెండు చాక్లెట్లిచ్చాను.     ""ఇలా వీడిని సంవత్సరాల తరబడి పోషించడం కాదుగానీ ఓ లవ్ లెటర్ రాసి వీడిచేత వాళ్ళక్కకి పంపించు..."" అన్నాడు చంచల్రావు.     ఆ ఆలోచన నాకు నచ్చింది.     వెంటనే లవ్ లెటర్ రాసి చంచల్రావుకి వినిపించాను.     ""డియర్ సుందరీ... నీ బుగ్గలు బందరు లడ్డూలు, పెదాలు రసగుల్లాలు, నవ్వు తీపి తీపి జాంగ్రీలు. నువ్వంటే నాకెంతో లవ్వు. నేనంటే నీకేంటో వెంటనే జవాబివ్వు... నీ బుచ్చిబాబు!!...""     చంచల్రావు ముఖం చిట్లించుకున్నాడు.     ఈ ఉత్తరం చూసి ఆ అమ్మాయి ఆ సెంటర్ లోని మిఠాయి కొట్టువాడు వ్రాశాడని అనుకుంటదేమో!!...""     ""ఏం కాదులే. బుజ్జిపండుగాడు నేనే ఆ ఉత్తరం ఇచ్చానని చెప్తాడుగా"" అన్నాను.     బుజ్జిపండు గాడిని పిలిచి ఆ ఉత్తరం వాళ్ళక్కకి ఇచ్చిరమ్మని చెప్పాను. వాడు తుర్రుమని బయటకి పరుగుతీశాడు. మేం యిద్దరం బుజ్జిపండు రాకకోసం గదిలో కాలిగాలిన పిల్లలా అటుఇటూ తిరుగుతున్నాం. ఇంతలో బుజ్జిపండుగాడు రయ్యిన ఇంట్లోకి వచ్చాడు.     ""ఏరా ఇచ్చావా?"" ఇద్దరం కోరస్ గా అడిగాం వాడిని.     ""ఓ... మా అక్కయ్య బజారుకెళ్ళింది. అది వచ్చాక దానికివ్వమని మా అన్నయ్యకి ఇచ్చాను"" అన్నాడు.     వాడిమాట ఇంకా పూర్తి కాలేదు నా గది గుమ్మంలో అడ్డచారాల బనీనుతో సుందరి వాళ్ళ అన్నయ్య కనిపించాడు.     ""అబ్బే... నాకేం తెలీదుసార్... వట్టిదే హిహిహి... గమ్మత్తు అన్నమాట... హబ్బే... ఏమిటి? ఓహో?... అది మా మిఠాయి కొట్టువాడే రాసుంటాడు. పాపం వాడు మంచాడే... ఈ ఒక్కసారికి వదిలెయ్యండి సార్ హిహిహి"" అన్నాను కంగారుగా నవ్వుతూ.     సుందరి అన్నయ్య ఓసారి తన కండలు పరీక్షగా చూసుకుని నావైపు అడుగులు వేశాడు.                                               ***                                            నేను కళ్ళు తెరిచేసరికి మంచం మీద ఉన్నాను. కదులుదామని అనుకుంటే కదల లేకపోయాను. ఒంటినిండా కట్లు ఉన్నాయి. ఎదురుగా చంచల్రావు కనిపించాడు.     ""నేను ఎక్కడున్నాను?""     ""గవర్నమెంటు ఆసుపత్రిలో""     ""ఎందుకూ?"" ఆశ్చర్యంగా చూశాడు,     ""అదే.. సుందరికి ఉత్తరం రాశావుగా... ఆ తరువాత చారల బనీను వాడొచ్చు...""     నాకు ఒక్కో సీను గుర్తుకు వచ్చింది.     ""వాడు నిన్నేమీచేయలేదా?"" ఈర్ష్యంగా అడిగాను.     ""చేసేవాడేమో నిన్ను తంతుండగా నేను పారిపోయా... మరేం బాధపడకురా. ఈ సుందరి కాకపోతే మరో అమ్మాయి.ఎప్పటికైనా నీ ప్రేమ ఫలించకపోదు"" అన్నాడు నన్ను ఓదారుస్తూ.     ఇంతలో బుజ్జిపండువాళ్ళ పనిమనిషి వచ్చింది.     మీకెంత కష్టం వచ్చిందండీ"" అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ.     ""అవును... అదే నేనూ అనుకుంటున్నా"" అన్నాను.     ""అంతా నా వల్లే"" అంది.     ""నీవల్లేమిటి?"" ఆశ్చర్యంగా చూశాను.     ""మీరు నాకు ఉత్తరం రాయడం వల్లేగా ఇలా అయింది.""     ""నీకు ఉత్తరం రాయడమేమిటి? నేను సుందరికి ఉత్తరం రాశాను"" కంగారు పడ్డాను.     ""నేనే సుందరిని.""     ""మరి మీ యింట్లో సన్నగా, తెల్లగా, పొడుగ్గా ఉంటుంది. ఆ అమ్మాయి?"" అయోమయంగా అడిగాను.     ""ఆ అమ్మాయిపేరు రూప... మా చుట్టాలమ్మాయి. హైదరాబాదు చూడడానికి మాతో వచ్చింది. మొన్ననే వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది"" అంది.     ""వా...""                                             నా ఏడుపు విని నర్సు, డాక్టరు పరుగెత్తుకు వచ్చారు. ""డాక్టర్! రోగి బాధతో ఏడుస్తున్నారు ఇంజక్షనివ్వనా?""     ""ఇవ్వు"" అన్నాడు డాక్టరు.     నా జబ్బలో మత్తు ఇంజక్షను దిగబడింది.     నా ఎదురుగా ఉన్న సుందరి రూపం మసక మసకగా మారింది... మెల్లమెల్లగా నేను మత్తులోకి వెళ్ళిపోసాగాను." 30,"    అలా అపూర్వతో అనగలిగాడు కానీ...అతనికి ఈ కేసు జటిలంగా తోస్తోంది.     ఏదో ఒకటి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.  ఈ సారి హంతకుడు ఫోన్ చేస్తే వెంటనే ట్రేస్ చేయగలగాలి.     అందుకు తగిన ఏర్పట్లు చేసుకోవాలి.  ఆ హంతకుడిని సజీవంగా కుదరకపోతే  చంపివేయాలి.     ఒక ధృడ నిశ్చయానికి వచ్చాడు కృపాల్     జేమ్స్ డేవిడ్ సోఫాలో  కూర్చుని ఎదురుగా ఉన్న టివి వైపు చూస్తున్నాడు.     టివిలో ఏదో హారర్ షో  వస్తోంది. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.  సోఫా చివర   చాందిని కూర్చుంది.     ""చాందినీ డియర్...ఆ పార్ధసారధి బాగా ఎంజాయ్ చేసినట్లు ఉన్నాడు కదూ!...""     ఏం  చెప్పాలో తోచలేదు చాందినికి.     ఊహ తెలియక ముందు తనని  తీసుకొచ్చాడు జేమ్స్ డేవిడ్.  అప్పట్నుంచి వికృతి భావాలు నింపాడు. రక్తం తాగించాడు. విస్కీ తాగించాడు. నైతిక విలువలు కాలాసేలా చేసాడు.     జీవితమంటే ఏమిటో అర్ధం కాకుండా చేసాడు.  జేమ్స్ డేవిడ్  చెప్పినట్టు చేయడం తప్ప మరొకటి తెలియదు. ఆమె ఒంటి మీద పింక్ కలర్ ట్రాన్స్ పరేంట్ నైటీ వుంది.     ""ఈ నైటీలో  నుంచి నీ  అందాలు సృష్టంగా కనిపిస్తున్నాయి కదూ""!   అంటూ నైటిని సర్రున చించేసాడు.     కంగారుపడలేదు చాందిని.     ఇది ఆమెకు కొత్తకాదు.  అతని రాక్షస రతిని అనుభవించింది. అయినా ఆమెలో బాధ, భయం వుండవు. అలా తయారుచేసాడు.     ఎక్కడో...ఎప్పుడో విషకన్యలు  వుంటారని తెలుసుకానీ, యిప్పుడు చాందినీని మీదికి లాక్కుని ఆమె పెదవుల్ని గట్టిగా కొరికాడు.     చిన్నకేక...ఆమె గొంతులోంచి..     రక్తం చివ్వున చిమ్మింది.     ""వెరీ టేస్టీ...నీ రక్తం బావుంటుంది""  అన్నాడు మరోసారి ఆమె పెదవిని కొరకడానికి సిద్ధపడుతూ.     బలవంతగా కళ్లు  మూసుకుంది చాందిని.  అతనికి అడ్డు చెబితే మరింత రెచ్చిపోతాడు.     ఒసారిలా అడ్డు చెప్పినందుకు గాజు పెంకులు పరుపులో పరిచి తనని వాటిమీద పడుకోబెట్టి తనమీద అతను పడుకున్నాడు.     ఆ రాత్రంతా ఆ నరకం అనుభవించింది. తను అరిస్తే అతనికి ఆనందం...తను బాధపడితే అతనికి సంతోషం.     అందుకే అన్ని భావాలను చంపుకుంటుంది. ఒక్కసారి తప్పుదారిలోకి వెళ్లాక, వెనక్కి  రావడం ఎంత కష్టమో...ఆమెకు అనుభవ పూర్వకంగా తెలిసింది.     జేమ్స్ డేవిడ్ లేచి ఫ్రిజ్ దగ్గరికి వెళ్లాడు.  ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసాడు.     లోపల మనిషి  గుండె ఊపిరితిత్తులు, కిడ్నీలు వున్నాయి.     మరో మనిషి అలా...ఆ క్షణంలో వాటిని  చూసివుంటే స్పృహ కోల్పోవలసిందే.     ఫోర్క్ స్పూన్ తో  గుండెలోకి గుచ్చాడు.  దాన్ని ప్లేట్ లోకి  తీసుకున్నాడు.     టీపాయ్ మీద వున్న బ్రాంది సీసాను పైకెత్తి అలాగే తాగాడు.     గుండెని పెదవుల మధ్యకు తోసాడు.     చాందినికి  వామ్టింగ్ సెన్స్ షన్  కలిగింది.     ఎన్నోసార్లు  చాందినీ యిలాంటి పరిస్ధితుల్లో చావాలనుకుంది.     ఎంతగా అలవాటైనా ఈ  నరకం, జమ్స్ డేవిడ్ ప్రవర్తన ఆమెను వణికిస్తోంది.     ""ఏయ్ చాందినీ...నువ్వు యిప్పుడు బట్టలు విప్పి డాన్సు చేయి"" అన్నాడు.     చాందిని చిరిగిన నైటీని విప్పేసింది. నగ్నంగా అతని ముందు డ్యాన్స్  చేయడానికి సిద్ధపడింది.     నీరసంగా కళ్లు  తెరిచాడు భార్గవ.     పొత్తి కడుపుకింద నొప్పిగా అనిపించింది. చేయి పోట్టమీదకి వెళ్లింది. కుట్లు  కనిపించాయి.     ""అమ్మ"" నీరసంగా అన్నాడు.     ""నీళ్లు కావాలా?"" ఆ గొంతు విని అటువైపు చూసాడు.     ఎదురుగా డాక్టర్ పార్ధసారధి.  అతని గడ్డం పెరిగి వుంది.   మొహంలో కళ తగ్గింది.  తను పెద్ద నేరంచేసినట్టు ఫీలవుతున్నాడు.  కూతురి మీద ప్రేమతో తప్పు చేస్తున్నాడు.     చాందిని మీద కోపం పీకల్దాక వచ్చింది. ఇదంతా అమెవల్లే వచ్చింది.  తన  వీక్నెస్ యింతవరకు తనని తీసుకువచ్చింది.     ""మీరు"" నీరసంగా అడిగాడు భార్గవ.     ""నా పేరు పార్ధసారధి...డాక్టర్ పార్ధసారధి""     ""నాకు...నాకేమైంది  డాక్టర్""     తల వంచుకున్నాడు డాక్టర్ పార్ధసారధి.     ఏమని చెప్పాలి?  నీ కిడ్నిల్లో ఒక కిడ్నీ తొలగించామని చెప్పాలా?     ఆ రోజు  జేమ్స్ డేవిడ్ యితని కళ్లు, కాలేయం, అన్నీ తొలగించమని చెప్పినప్పుడు, అతని పరిస్ధితి చూసి కొంత,  అతన్ని కాపాడాలని మరికొంత ఉద్దేశంతో, యిప్పడప్పడే ఆపరేషన్ చేయడం కుదర్దని ఒక కిడ్నీ మాత్రం తొలగించాడు.     ""చెప్పండి డాక్టర్...నాకేమైంది?""     ""నీ కిడ్నీల్లో ఒక కిడ్నీ తొలగించాం""     ""డా...క్టర్""  భార్గవ గొంతులో బాధ, భయం.     ""మరేం ఫర్వాలేదు...మీ ప్రాణానికి వచ్చిన  భయం ఏమీలేదు...""     విరక్తిగా నవ్వాడు డాక్టర్.     ""నేనిప్పుడు బ్రతికి వున్న, చచ్చినట్టే డాక్టర్...యిక్కడ్నుంచి తప్పించుకునే  మార్గంలేదు...నాకోసం నా భార్య"" అతని కళ్లు కన్నీళ్లు ను వర్షిస్తున్నాయి.     ""ముందు   మనం ఈ నరకంలో నుంచి బయటపడాలి""  అన్నాడు పార్ధసారధి.     ""ఎలా...ఎలా డాక్టర్ గారూ... వాడొక రాక్షసుడు...వాడి కన్ను కప్పి పోవడం మనవల్లకాదేమో""     ""ఏదో ఒకటి చేయాలి...వాడివల్ల నేను నా వృత్తికే  కళంకం తెచ్చిపెట్టాను""  బాధతో నుదురు కొట్టుకున్నాడు పార్ధసారధి.     అక్కడ ఎవరు ఎవర్ని ఓదార్చాలో అర్ధంకావడంలేదు.     ఇక్కడిలా జరుగుతుంటే...మరో గదిలో వున్న జేమ్స్ డేవిడ్ మాత్రం...చాందిని చేసే నగ్న నృత్యాన్ని చూస్తూ అప్పుడప్పుడు ఆమె శరీరాన్నిబ్లేడుతో గాయపరుస్తూ.....రక్తసిక్తమైన ఆమె నగ్న దేహాన్ని చూస్తూ పైశాచికానందం  పొందుతున్నాడు.                                                   *    *    *     కృపాల్ పొలీసు స్టేషన్ లోకి  అడుగుపెట్టగానే ఫోన్ మోగింది.  రిసీవర్ ఎత్తి ""ఇన్స్ పెక్టర్ కృపాల్ స్పీకింగ్""  అన్నాడు.     ""సార్...నేను కానిస్టేబుల్ శివరావును  మాట్లాడుతున్నాను.  మార్కెట్ నుంచి వస్తుంటే యిక్కడో యాక్సిడెంట్  జరిగింది. నా కళ్లముందే ఓ లారి ఆటోని గుద్దేసి పైకి  ఎక్కించి మరీ చంపారు. ఆ లారి సిటీ వదిలి దూరంగా వెళ్లింది. వెంటనే దగ్ర్లో వున్న పొలీసుస్టేషన్ కు  కూడా ఇన్ ఫామ్  చేసాను. ఆ లారి గుద్దేసింది. యాదగిరి ఆటోని.  అందులో యాదగిరి డెడ్ బాడీ నుజ్జు నుజ్జుయింది. యిదంతా కావాలని చేసినట్టుంది సార్.""     కృపాల్ పిడికిళ్లు  బిగుసున్నాయి.     ""యాక్సిడెంట్  జరిగింది ఎక్కడా?""     ""మార్కెట్ కు  ఆనుకుని వున్న వన్ వే రోడ్ పై  సార్...""     ""నేను వస్తున్నాను.  నువ్వు అక్కడే వుండు""  చెప్పేసి వెంటనే బయటకు వచ్చాడు.                                         *    *    *    మార్కెట్ దగ్గర జనం గుమికూడారు.  యాక్సిడెంట్ అయిందన్న వార్త గుప్పుమంది.  అందరూ యాంగ్జయిటీ గా  చూస్తుండిపోయారు.     కృపాల్ జీపు దిగి జనాన్ని తోసుకొని లోపలికి వెళ్లాడు.     ఆటో నుజ్జునుజ్జుయింది.  యాదగిరి శవం గుర్తుపట్టడానికి వీల్లేకుండా వుంది. అతను వేసుకున్న కాకిరంగు చొక్కా రక్తంతో తడిసిపోయింది.     అతని జేబులో నుంచి వంద రూపాయల నోటు బయటకు వచ్చింది....     కొత్త  నొటు...తను అతని నిజాయితీకి బహుమతిగా  యిచ్చిన నోటు.     దాన్ని అతి భద్రంగా దాచుకున్నాడు.  అతనికి నిజాయితీగా తను బహుమానంగా వంద  రూపాయలిస్తే అదే నిజాయితీ అతని ప్రాణాలను బహుమతిగా అతని నుంచి తీసుకుంది.                                       *    *    *     మధ్యాహ్నం  అన్నం కూడా తినలేదు కృపాల్.  అతనికి పదే పదే యాదగిరి శవం కళ్లముందు కదలాడుతోంది. ఆరోజు అతను మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి.     పెద్దగా చదువుకోలేకపోయినా,  అతని నిజాయితీ అతని సంస్కారం...అప్పడే ఫోన్ మోగింది.     రిసీవర్ ఎత్తి ""హలో""  అన్నాడు కృపాల్.     ""హలో...పాపం షాక్ తిన్నావా  మిస్టర్ కృపాల్...చూశావా...నీకు షాక్ మీద షాక్ ఎలా యిస్తున్ననో...ఏం చేయను...నువ్వు బుద్ధిగా కూచుని నా ఫైల్  క్లోజ్ చేస్తే ఈ బాధ వుండేది కాదు...పెద్ద సిన్సియర్ డ్యూటి అంటూ నన్ను పట్టుకోవాలని చూస్తున్నావు.   అలాంటప్పుడు నీ సిన్సియారిటీకి చిన్న చిన్న  బహుమతులు యివ్వకపోతే ఎల వుంటుంది.యాదగిరి చచ్చిపోయాడుకదు... నా గురించి ఇన్పర్మేషన్  యిచ్చాడు  కదు...పోనీలే చచ్చాడుగా!""     కోపంలో ఏం  మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు కృపాల్ కు..     ""నా ఫోన్  ట్రేస్ చేయమని చెప్పావుగా...అందుకే యింకా మాట్లాడి నికా చాన్సు యివ్వ దలచుకోలేదు. బై..."" ఫోన్ డిస్ కనెక్టు అయింది.     కాసేపట్లో ఆ ఫోన్ అబిడ్స్ నుంచి అని తెలిసింది. అదీ పబ్లిక్ టెలిఫోన్  బూత్ నుంచి,  అక్కడికి వెళ్లేసరికి అతను  ఉడాయిస్తాడు.     కృపాల్ ఫోన్ పెట్టేసి తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు.     యాదగిరి చెప్పిన     మాటలు గుర్తొచ్చాయి.     ఆ నలుగురు కుర్రాళ్లని మిథిలానగర్ కు   తీసుకెళ్లాడు.  ఇంటి  నెంబరు పదహారు ముందే ఆటో ఆపాడు.  ఆ కుర్రాళ్లు గేటు లోపలికి దూకారు.     అయినా అక్కడ తను మొత్తం చూసాడు,  తనకేమి కనిపించలేదు.     సమ్  థింగ్  ఈజ్ రాంగ్.  ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది.     అప్పడే అపూర్వ స్టేషన్ లోకి  అడుగు పెట్టింది.     ""సార్...నాన్నగారు తీసుకెళ్లిన  కారు సిటీ అవుట్ స్కర్ట్స్ దాటాక రోడ్డు పక్కన చెట్ల మధ్య వుందట"" చెప్పింది  అపూర్వ రావడంతోనే.     ""అది మనకు పెద్దగా ఉపయోగాపడకపోవచ్చు అపూర్వ గారు...కారు ఎవరో డ్రైవ్ చేసి,  ఆ పొదల్లో వదిలేయవచ్చు...మనక్కావలసింది అది  కాదు... డాడీని  కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి...అసలు కిటుకు అంతా  ఆ మిథిలానగర్ లోని యింటి నెంబర్ పదహరులోనే వుంది.  అసలు యిదంతా ఎందుకు జరుగుతుందో అనే విషయం దగ్గరే మన పరిశోధన  మొదంతా ఎందుకు జరుగుతుందో అనే విషయం దగ్గరే మన పరిశోధన  మొదలవ్వాలి. సిటీలో అవయవాలు అమ్మే వ్యాపారం జరగడంలేదు.  అలాంటి రాకెట్ ఏదీ లేదు.     సిటీలో వున్న క్రిమినల్స్ ఎవరూ ఈ పని చేయడంలేదు.  ఫోటోలో వున్న వ్యక్తుల  గురించి మనం ఎంక్వయిరీ చేయాలి.     అన్ని రాష్ట్రాల నుంచి ఇన్  ఫర్మేషన్  వస్తుంది.  పత్రికలో కనబడుటలేదు అనే ప్రకటన కేవలం ఉద్దేశపూర్వకంగానే యిచ్చాడు.     చాందినీ అనే అమ్మాయి పేరు అసలో,  నకిలీనో అలాగే జేమ్స్ డేవిడ్.     వీళ్లిద్ధారే  ఈ నేరాలకు ప్రధాన  సూత్రధారులు.  ఇదంతా పధకం ప్రకారం చేసి వుండొచ్చు.  ఇప్పుడు మనం ఓ సైకాలజిస్టుని   కలవాలి.""     ""సైకాలజిస్టా?  అతనవసరమేమిటి?""     ""కొన్ని నేరాలు  డబ్బుకోసం మరికొన్ని నేరాలు సెక్స్ కోసం జరుగుతాయి. యినికాక,  మానసికమైన  ఉన్మాదం లో  వుండే మానియాక్ లు  వుంటారు. అలాంటి లక్షణాలు బహుశ ఈ నేరస్తుల్లో వుండొచ్చు.     అలాంటప్పుడే సాధారణంగా యిలాంటి హత్యలకు, దారుణాలకు మోటివ్ వుండదు.  నిజంగా ఆ నేరస్ధుడు అవయవాల వ్యాపారమే చేసే వాడయితే,  ఆ శవాలను మనకు పార్శిల్ చేయడు.  మనుల్ని భయ పెట్టడం కూడా అతని పైశాచిత్వానికి పరాకాష్ట...మనం ఆ కోణంలో ప్రొసీడవుదాం"" చెప్పాడు కృపాల్.     అపూర్వ కృపాల్ వైపే చూస్తుండిపోయాడు.ఎంత విశ్లేషణ...పొలీసు లంటే కేవలం ఫిజికల్ ఫోర్స్ మాత్రమే ఉపయోగిస్తారనుకుంది. ఇంతటి విశ్లేషణ మరొకరికి అసాధ్యం అనిపించింది. " 31,"    మాదల వెంకట్రామయ్యకి తేరుకోవడానికి రెండు నిమిషాల పట్టింది.       ""యస్ డాడీ.... నా కొచ్చిన ఇన్ ఫర్మేషన్ కరెక్ట్"" తండ్రి ముఖంలోకి తదేకంగా చూస్తూ అన్నాడు మనోహర్.     జీరో వాల్డు బెడ్ లైటు నీలు వెలుతురు అతడి ఆరోగ్యమయినచెంప మీద అందంతో విషాదం మిలితమైనట్టు జీరాడుతోంది. ఇప్పుడు మాదల వెంకట్రామయ్య తమన ఎదురుగావున్న మనోహర్ గురించిగాని, అతడు చెప్పిన విషయం గురించిగాని ఆలోచించకు లేదు.     అతడి ఆలోచనలోని వ్యక్తీ కావ్య.     ఆడపిల్ల ఒంటరిగా సముద్రంమీదకు వెళ్ళిందంటే ఎన్ని గట్స్ వుండి తీరాలి.     ఆమె సముద్రం మీదకు వెళ్ళి ఏదో అద్భుతం సాదిస్తుందన్న నమ్మకం అతడికి లేదు. కాని అంతటి ధైర్యసాహసాలున్న అమ్మాయి రేపటిరోజున చేతులు కట్టుకుని కూర్చోదు__ మేడలో మూడుముళ్ళు వేయించుకొని జీవితంలో రాజీ పడదు. తనకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఆమె జీవితం ఓ అందమైన కధగా మారకుండా ఓ ముగింపు ఇవ్వాలి.     ఆ ముగింపు ఎలా వుండాలి? అని ఆలోచించసాగాడు ఏం.వి.అయ్య.     సరిగ్గా అదే సమయంలో__     పూజామందిరంలో విగ్రహం ముందు వెండిప్రమిదలో దీపం ఉజ్వలంగా వెలుగుతోంది. వడయారు కంఠం నెమ్మదిగా మంత్రాలు గొణుగుతోంది.     తన ఒక్కగానొక్క కూతురు ఇమ్తరిగా సముద్రం మీదకి వెళ్ళిందన్న భయంలేదుగాని, మాదాల వెంకట్రామయ్య ఆమెకు ఏ అపకారం చేస్తాడోనన్న భీతిమాత్రం లేకపోలేదు. దేవుని సాన్నిధ్యంలో వున్నా, జపమాలలోని పూసలు తిరుగుతున్నా మనసంతా ఎక్కడో వుండి_ అశాంతితో అలమటిస్తోంది.                                    *    *    *    *     సముద్రం తీరానికి ఎంత అల్లకల్లోలంగా వుందో, తీరంనుంచి పది కిలోమీటర్లు లోపలకి వెళ్ళేసరికి అంత ప్రశాంతంగా వుండి. ఇంజన్ ఆఫ్ చేశారు. గాలిపాటుకి తేరచాప ఎత్తండంతో బోటు ముందుకు దూసుకుపోతుంది. చుట్టూ ఎటు చూసినా నీటిమయం. పైన ఆకాశం, బోటులో క్రింది దుప్పటి పరుచుకుని వెల్లకిలా పడుకున్న తంబికి ఏమీ తోచలేదు కాబోలు మౌత్ హిర్మోనిమీద ఓ పాట పాడుతున్నాడు. అతడిలో కూడా వచ్చిన వారిద్దరూ ఆ బోటులోనే ఓ మూలచేరి విస్కీబాటిల్ ఓపెన్ చేశారు. ఆ బోటులో తాము ముగ్గురు కాక ఓ ఆడపిల్ల కూడా వున్నదని మర్చిపోయి నట్ట్లున్నారు.తంబి. తన్మయత్వంతో పాటలు పాడుకుంటున్నాడు.     ఓ  కిరాయిగుండా__     డబ్బుకోసం ఏ పనయినా చేసే ఓ మానావాకారం__      ఆ విధంగా అంత చక్కగా పాటలు పడటం ఆమెను విస్మయపరిచింది. ఆ ప్రయత్నంగా అతడివైపు అడుగులేసింది.     పొడవాటి నీడమీదకు పాకడంతో అతడి పాట ఆగింది.     నెమ్మదిగా కళ్ళు విప్పాడు.     కళ్ళమీదనుంచి రెప్పలు నెమ్మదిగా పైకి వెళుతూవుంటే, రంగా స్థలంమీద తేరపైకి లేచినట్లు ఆమె ధరించిన పాదాలు, ఆపైన పొడవాటి తెల్లని కాళ్ళు, ఆపైన అరటి బోదెంల్లాంటి తోడలు, ఆ తొడలపై తాటి జీబుల్లాంటి హాఫ్ ఫ్యమ్టు, ఆపైన ఫ్యాంటులోకి జొప్పించిన బనియను_ వంపు తిరిగిన నడుము, ఆపైన గాండీవంలా ముందుకీ చొచ్చు కొచ్చినఛాతి _ఇవి కాదు అతడు చూస్తున్నది, చల్లటిగాలి సున్నిత స్పర్శకి రిలాక్సింగ్ గా వున్నా ఆమె మొహాన్ని చూస్తున్నాడు.     గుండ్రని ఆ మొహంలో అమాయకత్వం తోనికిసలాడుతోంది, ఆమె కళ్ళు అరవచ్చిన ముద్దా మందారాల్ల వున్నాయి. పెదవులు లోటస్ స్పురణకు తెస్తున్నాయి. ఆమెలో ఏదో కనిపించని నాజూకుతనం, మృదుత్వం అతడ్ని ఆకట్టుకుంటోంది.     ఆమె విద్యాధికురాలు_ అంతకు మించిన ఐశ్వర్యవంతురాలు, అయితే అయివుండవచ్చు గాని అవేమీ అతడ్ని ఆకట్టుకోలేదు. ఆమెలో అన్నిటిమించిన పెద్ద అలంకారం 'స్రీత్వం' అతడ్ని ఆకట్టుకుంది.     ఆమె ముఖం స్వచ్చంగా అమాయకంగా కనబడుతోంది.     అతడి జీవితానికి మరణమే చివరది_ ఆఖరి అధ్యాయంలో వుందికాని ఆమెకి దఎయమే జీవితం. ఆమె జీవితానికి కమాలేగాని పిల్ స్టాపు లేవు.     ఆ నిశబ్దంలోనుంచి ఓ సంనతిస్వరం వినిపించింది_ అది కావ్యాది     తన కాళ్ళ ముందు కదలాడుతున్న మెరుపుతీగే వంపు సొంపుల్నుంచి సంస్కారయుతంగా దృష్టిని ప్రక్కకి మరల్చాడు.     ఆమె తెల్లటి శరీరంమీద మరింత తెల్లగా మెరుస్తున్న వెన్నెలను చూసే స్థితిలో లేడతను. అంతకు కొద్ది క్షణాల క్రితం గొప్పగా అనిపించిన భావాలు ఇప్పుడు ఏమీ అనిపించడంలేదు.     ""అపెశారేం..."" గాలికి ఎగురుతున్న ముంగురుల్ని సవరించుకుంటూ అతడి ప్రక్కనే కూర్చుందామె!       అదే మరొకరయితే, మరొక సందర్బంలో ఆమె అయినాసరే పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కాని చాలా తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని స్పురించెట్టు ఆమె మాట్లాడిన మాట, చివరకి ఆమె కూర్చున్న భంగిమలో నున్నఅవునూ ఠీవి అతడ్ని అదోరకమైన సంభ్రంలో పడేసింది.     పులికన్నా ప్రమాదకరమైన వ్యక్తితో తాను ఒంటరిగా పరాయణ చేస్తున్నానన్న భావన ఆమెకు లేదు.     ""అవునూ... నేను పని చెప్పగానే 'ఓ.కే.' అన్నావు నాకు ప్రత్యర్దులు ఎవరయినా వున్నారేమోనని ఎందుకు అడగలేదు?"" తిరిగి రెట్టించిందామె." 32,"     తను జైలుకి వెళ్ళవలసి వస్తే తన భార్య, కూతురు ఉరిపోసుకు చావడం ఖాయం...     ఇప్పుడతని కళ్ళముందు తన అపార వ్యాపార అనుభవం, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల దిగుమతిలో తను చూపించే ప్రజ్ఞాపాటవాలు ఎదుట నిలిచి పరిహసిస్తున్నట్టుగా వుంది.     ఆ పరిహారపు పద ఘట్టన ముందు తన ముద్దుల కూతురు, పెళ్లిచేయలేని తన తండ్రి నిస్సహాయతకు గుండె పగిలి చనిపోతుంది. పాతికేళ్ళుగా ప్రేమను, అనురాగాన్ని పంచి ఇచ్చిన తన సహధర్మచారిణి తన భర్తకు పట్టిన దుర్గతికి తట్టుకోలేక ప్రాణాలు వదుల్తుంది.     ఓరి... దుర్మార్గుడా... ? ఎంత సేవ చేయించుకున్నావురా నాతో... లక్ష రూపాయిలకు నా కుటుంబాన్నే రోడ్డుకీడ్చావు గదరా?... కోట్లు ఆర్జించి పెట్టే విదేశీ పారిశ్రామిక పథకాల్ని నీ సొంతం చేసి పెట్టాను నీకు...     ఇప్పుడతనికి కళ్ళముందు కనిపిస్తున్న దారి ఒక్కటే- మనస్సు చంపుకొని సుదర్శన్ రావుకి సరెండర్ అయిపోవడం.     సుదీర్ఘమైన మానసిక సంఘర్షణ తర్వాత, బాధ్యతల బందీగా మనస్సు చంపుకోవడానికే సిద్ధపడ్డాడు గుప్తా.     ఆ నిర్ణయానికొచ్చాక మరొక్క క్షణం ఆలస్యం చేయలేకపోయాడు.     శిలాప్రతిమల్లా కూర్చున్న భార్య, బిడ్డలవేపు దిగులుగా చూస్తూ రోడ్డెక్కాడు.     సరీగ్గా అప్పుడే అతని పక్కన ఒక జీప్ వచ్చి ఆగింది.     జీప్ ఆగిన శబ్దానికి ఉలికిపాటుగా ఆలోచనల్నుంచి తేరుకుని జీప్ లోకి చూసి ఆశ్చర్యపోయాడు గుప్తా. జీప్ లో త్రినాధ్ వున్నాడు.     ఓ పావుగంట తర్వాత వసుంధర ఇండస్ట్రీస్ ఆఫీసులో త్రినాధ్ కి ఎదురుగా కూర్చున్నాడు గుప్తా.     ""ఎక్కడికి బయలుదేరారు...?"" త్రినాధ్ సౌమ్యంగా అడిగాడు.     వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు గుప్తా. త్రినాధ్ టేబుల్ సొరుగులోంచి ఒక రిసీప్ట్ తీసి గుప్తాకి అందించాడు.     దాన్ని చూస్తూనే ఆశ్చర్యపోయాడు గుప్తా. నమ్మలేనట్లుగా ఒకటికి రెండుసార్లు ఆ రిసీప్ట్ వేపు, త్రినాధ్ వేపు చూశాడు అయోమయంగా.     త్రినాధ్ ముఖం మామూలుగానే వుంది. క్రమంగా గుప్తా ముఖంలో విషాద ఛాయలు తొలగిపోయాయి.          ఆనందోద్వేగంతో చటుక్కున సీట్ లోంచి లేచి త్రినాధ్ రెండుచేతుల్ని పుచ్చుకుని కృతజ్ఞతతో ఏదో అనబోయి గొంతు పూడుకుపోవడంతో ఏం అనలేకపోయాడు. అతని కళ్ళల్లో నీళ్ళు.     గుప్తాని అనునయించి కూర్చోబెట్టాడు త్రినాధ్. బాయ్ ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పి సాభిప్రాయంగా గుప్తావేపు చూశాడు. ఇప్పుడతని కళ్ళముందు కనిపిస్తున్నది గుప్తా కాదు, మాలిని.     అప్పుడతను మాట్లాడడం ప్రారంభించాడు. ""ఆధునిక వ్యాపార ప్రపంచ నీతి సూత్రాల్ని నేనింకా నేర్చుకోలేదు. నిరామయమయిన నిస్పృహ నుంచి హఠాత్తుగా కళ్ళు తెరిచి ఆవలించిన వాడ్ని, ప్రస్తుతానికింకా ఆకళింపులోనే వున్నాను. మీ అవసరాన్ని అతను గుర్తించాడు కాని మీ సామర్ధ్యాన్ని మీరే గ్రహింపులోకి తెచ్చుకోలేకపోయారు. అతని అవసరానికి వానపాములా ఉపయోగపడ్డారే తప్ప మీ అవసరం అంటూ వస్తే ఎలా తీర్చుకోవాలో తెల్సుకోలేకపోయారు...""     అంతలో కాఫీ వచ్చింది. దాన్ని గుప్తాకి స్వయంగా అందించి మరలా ప్రారంభించాడు- ""అతను చట్టరీత్యా అప్రోచ్ అయ్యాడు...""     సడన్ గా త్రినాధ్ మాటల్ని కట్ చేస్తూ ఆవేశంగా అన్నాడు గుప్తా.     ""ఎంత చాకిరి చేశాను? కనీసం కొద్దిపాటి విశ్వాసం కూడా లేకపోయింది...""     త్రినాధ్ నిశ్శబ్దంగా నవ్వాడు.     ""గతం గురించి ఎక్కువ వర్తమానాన్ని వృథా చేయడం మంచిదికాదు. మీరు కోర్టులో కట్టవలసిన మొదటి వాయిదాని నేను కట్టాను. ఆత్మవంచన నా కిష్టం లేదు. మీకు ఒక అత్యవసరం వుంది. దాన్ని నేను తీర్చాను..."" త్రినాధ్ ఓ క్షణం ఆగిపోయాడు.     ఇప్పుడతని స్మృతిపథంలో మాలినిదేవి చెప్పిన ఆధునిక వ్యాపార మంత్రం-     'అవసరాన్ని గుర్తించి పూర్తిచేయ్.'     'FIND A NEED AND FILLIT' మెదిలినట్లయింది.     ""నాకు ఓ అవసరం వుంది. అది మీ ద్వారా పూర్తవుతుంది. మీరు కట్టవల్సిన లక్ష నేను కడతాను కోర్టులో. నా పని పూర్తిచేసి పెట్టండి. అదీ యుద్ధప్రాతిపదికపై..."" అంటూ ఓ ఫైల్ అందించాడు త్రినాధ్.     నిజాయితీగా, మనస్సులో ఏదీ దాచుకోకుండా నిర్మొహమాటంగా మాట్లాడుతున్న త్రినాధ్ వేపు వింతగా చూస్తూ ఆ ఫైల్ ని అందుకొని చూడడం ప్రారంభించాడు - గుప్తా.     సరీగ్గా ఇదే సమయంలో సుదర్శనరావు వాయిదా కట్టలేని గుప్తా భయపడి తన కాళ్ళ దగ్గరకే వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నాడు.                                              *    *    *    *     ఉదయం పదిన్నర అవుతోంది.     ఛటర్జీ తన సీట్లో కూర్చుని ఒక్కో ఫైల్ తిరగేస్తూ వెళ్తున్నాడు.     సరీగ్గా ఏదో అప్లికేషన్ వసుంధరా ఇండస్ట్రీస్ ది. మెరుస్తున్న కళ్ళతో దాన్ని పరిశీలిస్తూ ఇమ్మీడియట్ గా లైసెన్స్ ఆర్డర్స్ పాస్ చేశాడు.     చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి.     గుప్తా త్రినాధ్ మీద కృతజ్ఞతతో, సుదర్శన్ రావు మీద కోపంతో వాయిదా కొనుగోలు పద్ధతిలో నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఢిల్లీ) ద్వారా జెకొస్లవేకియా నుంచి లూబ్రికేటింగ్ మెషిన్ ని అతి తక్కువ కాలంలో తెప్పించగలిగాడు.     ఈలోపు బోస్, హిందూ రాత్రింబవళ్ళు శ్రమించి కూలిపోవడానికి సిద్ధంగా వున్న ఓ షెడ్ ని అద్దెకు తీసుకొని దాన్ని బాగుచేసి సిద్ధంగా వుంచారు.     ఓ శుభోదయాన మెషిన్ ని అందుకున్నాడు త్రినాధ్. అందుకున్నానన్న తృప్తికన్నా దాన్ని నడిపించగల సాంకేతిక నిపుణుడికోసం శోధన ఎక్కువయింది.     అప్పటికే నాలుగు వందల డ్రమ్ములు వుపయోగించిన లూబ్రికెంట్ ఆయిల్ ని నిల్వ చేయించాడు త్రినాధ్.     ఇప్పుడతనికి అన్నీ సమకూరాయి కానీ ఆపరేటర్ మాత్రం దొరకలేదు.     రాత్రి పదకొండు గంటలవుతోంది సమయం, ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. త్రినాధ్ మాత్రం బాహ్యప్రపంచంతో సంబంధం లేనట్లుగా టేబుల్ మీదకు తలవాల్చి నిస్త్రాణగా వున్నాడు.     లైసెన్స్ దొరికింది-     మెషిన్ దొరికింది-     షెడ్ దొరికింది-     ముడిపదార్ధం వుంది-     తయారయిన ఉత్పత్తి క్వాలిటీ బావుంటే ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. కొనేందుకు సిద్ధంగా వుంది.     అన్నీ సవ్యంగానే జరిగిపోయాయి. కాని ఆ అత్యాధునిక యంత్రాన్ని కదిలించగల వ్యక్తి ఎక్కడ...?     అర్దరాత్రి కావడానికి మరొక్క నిమిషమే వుందనగా గుప్తా హడావుడిగా వచ్చాడు. అతని ముఖంలో లీలామాత్రంగా ఆనందం కనిపిస్తోంది.     త్రినాధ్ కి ఒకింత ఆశ చిగురించింది.     ""దొరికారా గుప్తాగారు--?""     త్రినాధ్ కంఠంలో తొంగి చూసిన నిరాశకు గుప్తా కదిలిపోయాడు.     దొరికాడు. బెంగుళూర్ లో మైక్ ఇండస్ట్రీస్ లో మన యంత్రాన్ని రన్ చేయగల వ్యక్తి వున్నాడు. అయితే అతను అంత మంచి కంపెనీని వదులుకొని ఇక్కడకు రావడానికి సిద్ధపడతాడా-""     గుప్తా సందేహాన్ని మధ్యలోనే కట్ చేశాడు అప్పుడే వచ్చిన బోస్.     ""రాకుంటే ఎముకలు విరిచేస్తాను - "" అన్నాడు ఆనందోద్రేకంతో బోస్.     బోస్ ని ఆగమన్నట్లు కళ్ళతోనే సైగ చేసి ""అతని వివరాలు?"" అడిగాడు త్రినాధ్.     గుప్తా చెప్పుకుపోతున్నాడు.     నిశ్శబ్దంగా వున్న ఆ నీరవ వాతావరణంలో గుప్తా కంఠమే వినిపిస్తోంది స్పష్టంగా.     సరీగ్గా అప్పుడే ఆ గది తలుపు ముందు నుంచుని చెవులు రిక్కించి వింటున్నాడు సైంటిస్ట్.     గుప్తా చెప్పుకుపోతూనే వున్నాడు.     త్రినాధ్ సీట్లోంచి లేచి పచార్లు చేయసాగాడు. ఆ ముగ్గురూ అలా రాత్రి ఒంటిగంటయ్యేవరకు మాట్లాడుకుంటూనే వుండిపోయారు.                                               *    *    *    *     ఆ రోజు ఉదయమే వసుంధరా ఇండస్ట్రీస్ ఆఫీసు లోనికి టెలిఫోన్ కనెక్షన్ ఇచ్చారు.     త్రినాధ్ ఫోన్ వేపే చూస్తూ కూర్చున్నాడు. ఆ ఫోన్ పని చేయడం ప్రారంభించిన రెండో నిమిషంలోనే ఫోన్ రింగయింది.     త్రినాధ్ ఆశ్చర్యపోతూ ఫోన్ ఎత్తాడు.     ""హలో - "" మృదువుగా వుంది కంఠం.     చటుక్కున గుర్తుపట్టేశాడు త్రినాధ్. క్షణాల్లో అతని పెదవులమీద చిరునవ్వు ప్రత్యక్షమయింది.     ""శుభం... ఫోన్ ఓపెనింగ్ ఓ ఆడపిల్ల కంఠంతో- థాంక్యూ..."" అన్నాడు చిరునవ్వుతో త్రినాధ్.     ఫోన్ కి ఆవల వున్న ప్రియాంక ఉక్రోషపడింది.     ""నీకు జరగబోయే ఒక అశుభం తెలియపర్చడానికే ఫోన్ చేశాను"" కసిగా అంది.     ""అశుభమా? నాకా? అప్పటికే త్రినాధ్ కి అనుమానం వచ్చింది. అదేదో తెల్సుకొనేందుకే ఇలా రెచ్చగొట్టాడామెను.     ""నిజంగానే నేను చెప్పే న్యూస్ నీపట్ల షేక్ అవుతుంది. లూబ్రికెంట్ స్పెషలిస్ట్- ఫ్రమ్ మైకో బెంగుళూరు మార్గమధ్యంలోనే అదృశ్యమైపోతాడు... బీ రెడీ ఫర్ ది ఫీట్..."" ఫోన్ కట్ చేసింది ప్రియాంక.     ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు త్రినాధ్. అప్పుడే అంత దూరం ఆ వార్త ఎలా వెళ్ళిపోయింది... ""     అతని మెదడు చురుకుగా పనిచేసుకుపోతోంది.                     *    *    *    *     ""నాన్నగారూ- మీరింతకాలం నేనతని గురించి చెబుతుంటే ఉపేక్షిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు-"" ప్రియాంక ఒకింత కోపంగా అంది.     అది సుదర్శన్ రావు ఆఫీసు గది.     ఆరంతస్థుల ఆ అత్యాధునిక భవనం నుంచే సుదర్శన్ రావు కార్యకలాపాలు నిర్వహించబడు తుంటాయి. ఏడుగురు డైరక్టర్స్ తో వ్యవస్థాపిత మయిన ఆ వ్యాపారసంస్థలకు సుదర్శన్ రావు చైర్ మన్.     ఫైవ్ స్టార్ హోటల్ సూట్ లా అత్యంత విలాసవంతంగా వున్న ఆ పెద్ద గదిలో ఇప్పుడు సుదర్శన్ రావు, ప్రియాంక, సుదర్శన్ రావు కొడుకు యోగేష్ వున్నారు.     ""డాడీ మీరు వూ... అనండి... వాడి అంతు తేల్చిపడేస్తాను"" యోగేష్ ఆవేశపడుతున్నాడు.     అయినా సుదర్శన్ రావు మౌనంగా వున్నాడు.     ""నేనెన్నిసార్లు చెప్పినా ఆ... వాడేం చేయగలడన్నారు. ఇప్పుడు చూడండి- ఆరు వేల స్థలాన్ని పన్నెండు వేలకు కొనిపించాడు మీతోనే. యాదవ్ లాంటి భయంకరమైన గూండాని మట్టికరిపించి ఫ్రీగా ఆ బిల్డింగ్ నే తన ఆఫీసుగా మార్చుకున్నాడు.    " 33,"                                                                                                         2         వన్ టౌన్ పోలీస్ స్టేషన్. ఉదయం ఎనిమిదిగంటలకే పోలీస్ స్టేషన్ లోంచి ఏడుపులు వినిపిస్తున్నాయి.ఆ దారినపోయే జనం స్టేషన్ ముందు క్షణం ఆగి కళ్ళు చిట్లించి చూసి ముందుకు కదులుతున్నారు.     ""ఈ పోలీసోళ్ళకి ఏం మాయరోగం వచ్చిందో ఏమో....లాకప్ లో వున్నవాళ్ళని పొద్దున్నే చింతకాయపచ్చడిలా దంచుతున్నారు. రేపు న్యూస్ పేపర్లలో వన్ టౌన్ పోలీస్  స్టేషన్ లో లాకప్ డెత్ అని  వార్త పడుతుందో ఏంటో""ఒక ముసలాయన వణుక్కుంటూ ముందుకు కదిలాడు.     కానీ పోలీస్ స్టేషన్ లోపలి పరిస్థితి అందరూ ఊహిస్తున్న దానికి భిన్నంగా వుంది. స్టేషన్ లోపల....     సెల్ లోని క్రిమినల్స్ ఒకటే నవ్వుతున్నారు తమ ఎదురుగా జరుగుతున్న సీన్ ని చూస్తూ.     గది మధ్యలో ఇన్స్ పెక్టర్ అప్పారావ్ సీరియస్ గా నిలబడి వున్నాడు. అతని ముక్కు నల్లగా కమిలి వుంది. అతను నెత్తిమీద క్యాప్ పెట్టుకోలేదు....ఎందుచేతనంటే అతని తలమీద అయిదారు బొడిపెలు వున్నాయి. అవి బాగా నెప్పి పుడుతున్నాయి....క్యాప్ పెడితే బోడిపెలకి ఒరుసుకుని మరింత నోప్పి పుడ్తాయని అతను క్యాప్ పెట్టుకోలేదు.     అతని కాళ్ళ దగ్గర బోర్లా పడుకుని, సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తూ, బోరున ఏడుస్తున్నాడు హెడ్ కానిస్టేబుల్ రాంబాబు, కానిస్టేబుల్ చిన్నారావ్. వీళ్ళిద్దరి ఏడుపులే స్టేషన్ బయట జనాలకి వినిపిస్తున్నది.     ""ఏడ్చింది చాల్లే....ఇక లేవండి...."" అరుస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.     రాంబాబు, చిన్నారావులు ముక్కుతూ, మూలుగుతూ, ముక్కులు చీదుతూ నేలమీంచి లేచి నిలబడ్డారు.     ""సార్....అయితే మీరు మామీద ఏ రకమైన యాక్షన్ తీసుకోరు కదా!"" మెల్లగా అడిగాడు రాంబాబు.     ""తీసుకోనులే...."" చిరాకుగా సమాధానం చెప్పాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.     ""నిజంగానా సార్....? తల్లి తోడు"" అడిగాడు చిన్నారావ్.     ""ఒరేయ్....ఈగోలలోకి నా తల్లిని కూడా లాక్కొస్తున్నార్రా"" కోపంతో  ఊగిపోతూ అన్నాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.     ""యాక్షన్ తీసుకోనని అన్నారు కదా....తల్లి తోడూ, బామ్మ తోడూ అంటూ విసిగిస్తావేం?"" అంటూ చిన్నారావ్ ని మందలించాడు రాంబాబు.     ""నో....తీస్కుంటాను....మరోసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే మిమ్మల్ని డిస్మిస్ చేస్తాను"" ఆవేశంతో వూగిపోతూ అని నేలనేద దబ్బున పడ్డాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.     రాంబాబు, చిన్నారావ్ లు గబుక్కున చెరోరెక్కా పట్టుకుని ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని లేవదీశారు.     ""మీరు ఆవేశంతో కాస్త ఎక్కువగా ఊగినట్టున్నారు సార్....అందుకే బ్యాలెన్స్ అవుటయి పడ్డారు...."" జాలిగా చూస్తూ  అన్నాడు రాంబాబు.     ఇంతలో ఫోన్ మోగింది. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రిసీవర్ ఎత్తి  ""హలో ఇన్స్ పెక్టర్ అప్పారావ్ స్పీకింగ్ అన్నాడు.     ""హలో ...."" అవతలి గొంతు పలికింది.          ""నేను ది చిల్లర డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్ ని మాట్లాడుతున్నా - మీ ఏరియా నుండి మాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. మీ పోలిస్ స్టేషన్లో ఏదో లాకప్ డెత్ జరగబోతుందటగా....అదేదో జరిగింతర్వాత మాకు తెలియజేస్తే మేం విలేఖర్లవి పంపిస్తాం న్యూస్ కవర్ చెయ్యడానికి ....మీరు కూడా కలర్ ఫుల్  డ్రస్ వేసుకోండి....మీ ఫోటోలు తీసుకుంటాం.""     ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి చిర్రెత్తుకొచ్చింది.     ""ఇక్కడే లాకప్ డెత్ లూ జరగబోవడం లేదు....మాలో మేం కొట్టుకు చస్తున్నాం. అంతే....""విసుగ్గా  నెత్తిమీద మొట్టుకుని  ""హబ్బా"" అని బాధగా అరిచాడు ఇన్స్ పెక్టర్.     ""లాకప్ డెత్ జరగ బోవడంలేదని అన్నారు మరి 'అబ్బా!' అని బాధగా అరిచిందెవరు?"" ఎడిటర్ అనుమానంగా ప్రశ్నించాడు.     ""ఆ అరిచింది నేనెనయ్యా  బాబూ....నెత్తిన మొట్టుకుని, బోడిపలు నెప్పెట్టి బాధగా అరిచా"" అని విసుగ్గా ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు.     ఆ తర్వాత క్రూరంగా రాంబాబు, చిన్నారావ్ లని చూశాడు.     ""ఇదంతా మీవల్లే జరిగింది"" అన్నాడు.     ""నిజమే ననుకోండి....కానీ మీది కూడా కాస్త తప్పుంది సార్....మీరు దొంగలా మారువేషం వేస్కుని ఉండాల్సింది కాద్సార్"" మెల్లగా అన్నాడు రాంబాబు.     ""దొంగలా కాకుండా మీలా పోలీస్ యూనిఫాంలో ఉంటే దొంగలు దగ్గరి కొస్తారా....? అందుకే  దొంగ గెటప్ లో దొంగల్ని పట్టుకోవాలనుకున్నా"" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.     ""అది సరేగానీ అందరూ దొంగ దొంగ అని వెంటపడినప్పుడు మీరు పరుగు తియ్యకుండా నేను దొంగని కాను....ఇన్స్ పెక్టర్ ని అని చెప్పి వుండాల్సింది సార్"" అన్నాడు చిన్నారావ్.     ""నేను చెప్తే జనం నమ్ముతారా? నా దగ్గర ఐడెంటిటీ కార్డ్ కూడా పెట్టుకోలేదు! అయినా ఆ టైంలో నేను దొంగ గెటప్ లో వుండి నాకు నేను దొంగలా కూడా ఫీలయిపోయా ఎందుకో"" కాస్త సిగ్గుపడ్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.     రాంబాబు, చిన్నారావ్ కిసుక్కున నవ్వారు.     ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి ఎక్కడో మండింది.     ""మీరు ఈ డ్యూటీలు చెయ్యడానికి పనికిరారుగానీ....నాతో పదండి!"" అన్నాడు కోపంగా.     ""ఎక్కడికి సార్?"" అడిగాడు చిన్నారావ్.     ""నోర్మూస్కుని నాతో రండి...."" అని  ""ఏయ్ ఫోర్ ట్వంటీ...."" అంటూ పిలిచాడు.    కానిస్టేబుల్ 420 వరండాలోంచి  లోపలికొచ్చి  ""యస్సార్!"" అంటూ సెల్యూట్ చేశాడు.     ""మీరు స్టేషన్ జాగ్రత్తగా చూస్కోండి....నేనో అరగంటలో వస్తాను!"" అని చెప్పి ""మీరు పదండి"" అన్నాడు రాంబాబు, చిన్నారావ్ ల వంక చూస్తూ." 34,"అతను నీరసంగా  ఇంటివేపు  నడిచాడు. అక్కడ ఫ్లాట్ ఫారం మిద నించుని చేతులూపుకుంటూ మాటాడిన పెద్ద మనుషులు ఆఫ్ ది సిటీ కారుల్లో శరీరాలు పారేసుకుని దూసుకుపోయేరు. సుబ్బారావు తన దుర్విధిని తిట్టేసుకున్నాడు. ఇంటికొచ్చేసరికి చంద్ర డ్రెస్తై రెడీగా వుంది నైట్ డ్యూటీకి వెళ్ళేందుకు. ఆమె నా దుస్తుల్లో చూచింతర్వాత సుబ్బారావు మనసు చివుక్కుమన్నది. రోగులకు సేవచేసే  నిమిత్తం వెళ్ళబోతున్నచంద్రం తన మనుసులోని రోగాన్ని అనుణక్షణం పెద్దదిగా చేస్తోంది. సుబ్బారావు తలొంమచుకు ఇంట్లో అడుగుపెట్టాడు. ఇంట్లోకి వెడుతున్న సుబ్బారావుని చూచి చంద్ర అన్నది. "" బుజ్జి జాగ్రత్త, మిరు త్వరగా నిద్రపొండి. ప్లాస్కులో పాలుకాచిపోశాను."" "" వెళ్ళిరా చంద్రా! నాపనులు నేను చూచుకుంటాను  ఇంకా నాకు ఏమవుతుంది . పోలేదు నువ్వెళ్ళిరా. బుజ్జీ, నువ్వే డవమాకొరేయ్. మి అమ్మ ఉద్యోగానికెళ్లొస్తుంది. నాప్రాణం తీయకు నాన్నా!"" "" భగవంతుడా"" అన్నది చంద్ర. "" నేనేం మాటాడను చంద్రా , ఏంమాటాడను నోరు మూసుక్కూర్చుంటాను వెళ్ళిరా"" చంద్ర వెళ్ళిపోయింది.                                                      *    *    *    *బాగా రాత్రివేళ బుజ్జిగాడు నిద్రలో కదలడం గమనించి బుర్రలోని ఆలోచనలని తాత్కాలికంగా తోలేశాడు సుబ్బారావు. గోడగడియారం తాలూకు  క్లిక్  క్లిక్ శబ్దం సుతిమెత్తగా   వినిపిస్తూన్న వేళ బుజ్డిగాడు కదిలి తన  ఏకాగ్రతనీ ఆలోచననీ.  ఖూనీచేసేశాడు. నిద్రలో బుజ్జిగాడు అందంగా వున్నాడు. అలనాడు మండిపోతున్న నొసటమీద చల్లటి చేతినుంచి "" మికేం పర్లేదు మిరు బాగుపడతారు, నిజం.  మిరు ఆరోగ్యంగా వుంటారు. దేముడు మియందుంటాడు"" అన్నప్పటి చంద్ర నిశ్ఛలమైన చూపూ నిర్మలమైన మొహాన్ని పుణికి పుచ్చుకున్నాడు బుజ్జి. ""బుజ్జీ! నీకు సుకంలేదురా తండ్రీ!"" అనుకున్నాడు సుబ్బారావు. వెంటనే అతనిమనసు హాస్పిటల్లో ఓ వార్డుపైన లగ్న మైంది. ఎవరో రోగి బాధలోమూలిగేడు, చంద్రావతి అటు వేపు వెళ్ళిపోయింది.అతని తమని మంచంపక్కన నించుని మెత్తగా నవ్వింది. "" మిరు బాగా నవ్వగలరు. అలాగేనవ్వండి. మిరు నవ్వకపోతే నాకేం తోచదసలు. నవ్వండి. ప్లీజు"" రోగి  పిచ్చిగా అనేస్తున్నట్లున్నాడు. చంద్రావతి  నవ్వుతున్నట్టేవుంది. రోగి  ఆవేశంతో మాటాడేస్తున్నట్టే వున్నాడు. ఆనాడు అలాగే మాటాడి చంద్రావతి హృదయంలో స్థానం సంపాయించుకున్నాడు సుబ్బారావు  ఈనాడు  నాలుగురోజుల్లో నే కన్నుమూసే  ఆ ఫలానాగాడు ఆశగా, వెర్రిగా మాటాడేస్తున్నాడు. చంద్రా వతిని  మరో మగడి మత్తులో తోసేయకు భగవంతుడా! చంద్రావతి నాభార్య. ఒక నిరుద్యోగికిభార్య. ఆమొగుడ్తో విసిగిపోయిన యిల్లాలు. ఈసముయాన ఆమెమనసు మరో మనిషిని, మరో రోగినీ కోరుకోవచ్చు. అలాచేయకు. నన్న న్యాయం చేయకు. ఎవరో కుర్రడాక్టరు కళ్ళల్లో కోరికనింపుకుని చంద్రావతివేపు విసురుగా వొస్తున్నట్టూ. చంద్రావతి రోగిమంచం వొదిలి ఆకుర్రడాక్టరువేపు మెల్లిగా హంసలా నడిచినట్టూ మరొకొత్త  "" ఊహాగానం"" చేసి గుండెల్లో పోటుతెచ్చే సుకున్నాడు సుబ్బారావు. అలాగే ఆయాసంతో కళ్లు గట్టిగా మూసేసుకున్నాడు. ఆ ఉదయం చంద్రవావతి పెందరాళే వొచ్చేసింది ఆ మెమొహంలో ఆర్నెల్లనుంచి లేని తృప్తీ వెల్తురూ నిండుకున్నాయి. సుబ్బారావు కి ఆమె మొహం చూడాగా నేదడకలిగింది. "" మంచి వార్త చెప్పేదా?"" "" చెప్పు చంద్రా!  నీకైనా  ""మంచి"" జరగనివ్వు"" "" ఇది నాగురించి కాదు."" "" మరి?"" "" మి గురించి."" "" చంద్రా! ఉదయమే వేళాకోళం చెయ్యకు  నువ్వు. చచ్చిబతుకుతూనన్న మనిషి న్నే కనునాకింకామంచేమిటివల్లకాడు"" "" మికు డాక్టర్ సుదర్శనరావు బాగా తెలుసుగా."" సుబ్బారావుకి డాక్టర్ సుదర్శనరావు  బాగా తెలుసు. తెల్లవారుతూండగా చంద్రావతి నైతిక పరిధుల్ని కించపరిచే నిమిత్తం చేసిన ఊహాగానంలోని కుర్రడాక్టరతనే! అంచేత తెలుసునన్నట్టు సిగ్గుగా, చెదురుగా తలూపేడు. ""ఆయనో, మాటాడేను."" మాటలే ఆడిందో లేక అతని మనసులోనే అడిందో!""చంద్రా  ఇక చెప్పకు""  అందామనుకుని నోరు తడిచేసుకు వూరుకున్నాడు. ""కాకినాడలో మికు ఉద్యోగం వేయిస్తాననన్నారాయన"" అన్నది చంద్ర ఉత్సాహంగా. సుబ్బారావు నెత్తిన పిడుగుపడినట్లయింది. వొద్దు చంద్రా! నన్నింకా చేతకానివాడిగా తయారు చేయకు. నీ ప్రయెజకత్వంతో నన్నుద్ధరించకు. ఆ డాక్టరుకీ నీకు వెయ్యి నమస్కారాలు. నన్నిలా బతకనివ్వు. మరో మాట. నన్నుగురించీ , నా చేతగానితనం గురించీ నువ్వేవ్వ రికీ చెప్పనక్కరలేదు. నీకా  అధికారంలేదు. తెలిసిందా?అయినా చంద్రా! నువ్వు కరుణించి నాకు వేయంచబోయే ఉద్యోగం నేనెలా  చేస్తాననుకున్నావసలు, నీకు తెలీదేమో నువ్వంటే నాకుభయంగా వుందిప్పుడు. దైవసాక్షిగా నువ్వు నన్ను భయపెట్టేస్తున్నావ్.... ""చివర్ని  మాటాడబోయేది ఆపికళ్ళు తుడుచుకున్నాడు పిరికి. వి. సుబ్బారావు. ""భగవంతుడా! మళ్ళా భగవంతుడ్ని తలిచింది చంద్రావతి.                                                              - జయశ్రీ మాసపత్రికనుండి" 35,"    ""నీకా?""     ""అవును నాకే...చెప్పానుగా నా స్టాండర్డ్. రేపు ఎగ్జామ్స్ లో ఖాళీ పేపర్ పెట్టేయకుండా కొంచమైనా రాయందే డాడీ ఎలా పాసు చేయిస్తారు? ఎంత సిండికేట్ మెంబరయినా అది సాధ్యం అవుతుందా?""     నవ్వేడు శ్రీకర్.     ""నవ్వకు శ్రీ...రోజూ గంట చెప్పు నెలకి రెండొందలు యిస్తారు డాడీ! ఆయనకదో లెక్క కాదు. అసలు నేచెబితే స్కాలర్ షిప్ కూడా ఏర్పాటు చేస్తారనుకో...కానీ నీకు ముక్కుమీదే ఉంటుందిగా కోపం...వినవుగా...""     ""శ్రీకర్ సమాధానం యివ్వలేదు.     ""అదిగో! అప్పుడే నీకు కోపం వచ్చేస్తోంది. ప్లీజ్! నా మాట వినవూ - కనీసం ఓ గంట అయినా నిన్ను చూస్తూ గడిపే అవకాశం యివ్వు.""     ""జ్యోతీ!""     ""ఏం-""     ""ఓ పనిచెయ్!""     ""ఏమిటో అది -"" ఆందోళనగా అడిగింది.     ""నన్ను నీ సెక్రట్రీగా వేసుకో ... నెలనెలా మీ డాడీ ఇచ్చే అయిదొందలూ యిచ్చెయ్_"" యే భావం బయటపడకుండా అన్నాడు.     ఆ మాటలకే ఆమె ముఖం వికసించింది. ""రియల్లీ! అలాగయితే యిప్పుడే ఎపాయింట్ మెంట్ యిచ్చేస్తా. ఒక మంత్ శాలరీ ఎడ్వాన్స్ తీసుకో"" బ్యాగ్ తెరవబోయింది.     ""డోంట్! డోంట్ బీ హర్రీ! మైడియర్ జ్యోతీ! నీవెంత అమాయకురాలివి? నేకాక మరెవరయినా అయితే?""     అతని మాట పూర్తి కాకుండానే ""ఇంకొకరా? వాడ్డూయూ మీన్ - మరో మగాడు నా ఎదురుగా యిలా కూచుని కబుర్లు చెప్పగలడా? జ్యోతి అంటే ఏంటనుకున్నావ్? ఫైర్ బ్రాండ్ తెలుసా?"" అంది రోషంగా.     ""థాంక్యూ! థాంక్యూ మై లేడీ. థాంక్యూ ఫర్ ది ఫాస్ట్ స్టాప్ కార్నర్ ...కానీ ఓ విషయం విను"" అన్నాడు లేస్తూ.     ""టైమయిందా?""     ""ఆఁ తప్పదు వెళ్ళాలి. చూడు జ్యోతీ! మేం మధ్య తరగతి మనుషులం. మా ధనం అభిమానధనం అంతే! మేం అభిమానిస్తాం. అంతేకానీ అభిమానాన్ని అమ్ముకోలేం. నీ ఆరాటం అర్ధమైంది. ఎడారిలో ఒంటరిగా మిగిలిన వ్యక్తికి తోడు దొరికినట్లుగా ఉంది. ఈ జనారణ్యంలో నీకు నచ్చిన దోస్తీ కావాలి అంతేకదా - దానికోసం నా ట్యూషన్ వద్దు, నీ సెక్రటరీ పనీ వద్దు.     కేవలం ఫ్రెండ్ షిప్ చాలు.     ఏది ఏమయినా రోజూ నీకోసం ఒక గంటయినా వ్యయిస్తాను. దట్సాల్! కానీ జ్యోతీ! దైవ సాన్నిధ్యంలో గడపాలనీ భక్తుడికీ ఉంటుందని తెలుసు. కేవలం దేవత కరుణిస్తే ఇంకేం చెప్పాలి?""     వేసవి కాలంలో తొలకరి చినుకుల్లాంటి అతని మాటలకి ఆమె పులకరించిపోయింది. ఉద్వేగంతో అతని చేయి అందుకుని ""హౌ లక్కీ అయాం! థాంక్యూ శ్రీ...థాంక్యూ"" అని తర్వాత చప్పున అతని చేతిని పెదాలకి ఆనించుకుని మృదువుగా చప్పుడు చేసింది.     చిలిపిగా నవ్వాడు శ్రీకర్.     సిగ్గుపడిపోయింది జ్యోతి. జీవితంలో తొలిసారిగా     ""జీ బేగం సాహెబ్ సెలవు.""     హుందాగా సెలవు తీసుకుని వెళ్ళాడు శ్రీకర్.     'హాయ్' గిర్రున తిరిగింది జ్యోతి. ఆమెకి యెంతో ఆనందంగా ఉంది. వెంటనే యింటికి వెళ్ళి రికార్డు పెట్టుకుని డాన్స్ చేయాలనిపించింది. పార్క్ నుంచి యిల్లు వేలమైళ్ళ దూరం వున్నట్టనిపించిందామెకి.                                                                         12     ""శ్రీమద్రమారరణ గోవిందో హరి!""     ముఖంనిండా పెల్లుబుకుతున్న ఆనందంతో అంది జ్యోతి. అల్మారాకి తాళం పెట్టేస్తూ...నవ్వొచ్చింది శ్రీకర్ కి జ్యోతిని ఆ భంగిమలో చూసేసరికి...     ""ఎందుకూ?""     ""నవ్వడమా? పరీక్షలయిపోయాయని యెంత సంబరపడిపోతున్నావా"" అని నవ్వొచ్చింది. సారీ జ్యోతీ! ఈ మూడు నెలలూ నిన్ను చాలా బాధపెట్టాను. అయాం రియల్లీ సారీ! ఏమిటో నా పిచ్చిగానీ నువ్వు ఎలాగూ పాసయ్యేదానివి. అలాంటి నిన్ను అనవసరంగా బాధపెట్టాను.     ""నథింగ్ శ్రీకర్...ఇందులో యింత ఆనందం వుందంటే నేను మొదటినుంచీ శ్రద్ధగానే చదివేదాన్ని. మా నాన్న చెడగొట్టాడు. మొదటినుంచీ ఫస్టుక్లాసులో కాన్వెంట్ స్కూల్లో చేరింది మొదలు ఇంటర్ పూర్తయ్యేదాకా నాపాలిట శనిలాగా ట్యూషన్ కి తయారయింది ప్రిన్సిపాల్ మేరీ బ్లెస్సీనా...ట్యూషన్ యిస్తూంది. కాబట్టి నే బాగా చదివినా, చదవకపోయినా ఎప్పుడు ఫిఫ్త్ రాంక్ కి తగ్గించేదికాదు. ఇక డిగ్రీలో చేరాక నేను ట్యూషన్ కి గుడ్ బై కొట్టింది.""     శ్రీకర్ కి జాలేసింది ఆమెను చూస్తే. ""చాలామంది అంతే జ్యోతీ! ఎదిగీ యెదగని వయస్సులో వున్న వ్యక్తుల్ని తమ ప్రిన్సిపల్స్ కి, తమ ఆదర్శాలకు యిన్ స్ట్రుమెంట్స్ లాగా వాడుకుంటాడు. అది చాలా తప్పు. ఎవరంతకివాళ్ళని వదిలెయ్యాలి. ఆఖరికి పిచ్చి మొక్కయినా అలాగే వదిలేస్తే చక్కగా ఎదుగుతుంది. కానీ అల వదిలెయ్యం. మన బౌండరీస్ లో, మనకంటికి రూల్సులా పెంచుతాం. అది ఒక్కసారి అవతల వ్యక్తిత్వాన్ని ఎదగనీక నాశనం చేస్తూంది. ఇంత తెలిసీ నేనూ అదే తప్పు చేశాను అన్నాడు సానుభూతిగా.     ""శ్రీమద్ జ్యోతీరమణ శ్రీకరో శ్రీకరం !"" తమాషాగా అతనిచుట్టూ తిరిగింది. దండం పెట్టింది. ఆమె చిలిపితనం అతనిలో ఆనందాన్ని సృష్టించింది.     ""అర్ధం తెలుసా?"" అన్నాడు కొంటెగా చూస్తూ.     చప్పున భావం అర్ధమై సిగ్గుపడిపోయింది జ్యోతి.     ""వండర్ ఫుల్ జ్యోతీ!"" అతనికి మాటలు పెగలలేదు. నిండుపున్నమి జాబిలిని చూసి సంపూర్ణంగా విచ్చుకున్న కలువలా ఉన్న జ్యోతి ముఖం చూసి అన్నాడా మాటలు.     కొన్ని క్షణాలు గడిచాయి.     టేప్ లో పాప్ మ్యూజిక్ వినిపిస్తోంది. జ్యోతి మనస్సు తృప్తితో, ఆనందంతో గంతులేస్తోంది...అంతలో టేప్ అయిపోయింది. మార్చాడు శ్రీకర్...యం.ఎస్ పాడిన విష్ణు సహస్రనామం రాసాగింది. ఠక్కున ఆపేశాడు శ్రీకర్.     ""ఏం ఆపేశావ్?"" అర్ధంకాక అడిగింది.     ""బోర్! ఎలా వింటాం...ఇది మీ నాయనమ్మ కోసం రికార్డు చేశావా?"" అడిగాడు.     ""నో! నాకోసమే! ఉదయం నిద్రలేవగానే అది వింటూవుంటే ఎంతో ఆనందంగా వుంటుందని! అదో అలౌకమైన ప్రపంచంలో కెళ్ళిపోయినట్లుగా ఉంటుంది!"" అరమోడ్పు కన్నులతో అంది ఆమె.     జ్యోతీ! నీలో ద్వంద్వ వ్యక్తిత్వం వుందే?""     ""అంటే?""     ""నీ కత్తికి రెండు వైపులా పదునుందే?""     ""ఊహు ప్లీస్ బిక్లియర్ ...""     ""పోనీలే దాని గొడవెందుకుగానీ...ఇక నేను మా వూరు వెళ్ళిపోతాను."" " 36,"కృష్ణుడు ఆమె దగ్గరికి నడిచివస్తున్నాడు అతనామెను సమీపించే కొద్దీ రాధికలోజీవచైతన్యం మొదలయింది. రతాంతసుఖ నిర్రుతి పొందిన నవోఢలా నిలబడిపోయింది. సూర్యకిరణాలు సోకీ సోకగానే పద్మినీ పుష్పభామ సహస్రకరాగ్రాల స్పర్శకు పులకించి పోయినట్లుగావేవేల కిరణాలు తనని ముగ్ధంచేస్తున్న అనుభూతి.    ఆయన సమీపించాడు. నిస్తేజంగా నిలబడి ఉందా అన్నట్టు ఆ రసచైతన్యను సమీపించి గడ్డం పట్టిమోము పైకెత్తాడు.    ఆ స్పర్స ఆమెలో విధ్యున్మాలికలమూల భూతాన్ని చైతన్యం చేసింది. 'రాధీ.....రాధికా!"" వేయి వేణువులు ఒక్కసారి మోహనరాగాన్ని పలికించినట్లైపులకించి పోయిందామె. హిమగిరి శీతలవాయువులు సోకినట్టుగా సంచలించిపోయింది.    'రా....రాధీ..... రాధికా! రాధికా! రాధీ ...... రా! ఒక్కసారిగా ఆ నల్లనయ్య ఎదుర్రొమ్ము మీద వాలిపోయిందామె. 'వెర్రిపిల్లఅనుకుని రాధ పడమటింటినుంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది.    కరిఏనుగు లీలగా హేలగాతామరపూవుని అందుకున్నట్టు శ్రీ కృష్ణుడు ఆమెను తనచేతుల్లోకి తీసుకున్నాడు. 'కృష్ణా...... కృష్ణా అంటోంది రాధిక అతని చేయి ఆమె వెన్ను వెంటసవరింపుగా సాగింది.    స్మృతికి స్మృతికీ మధ్య రాధకి కొన్ని క్షణాల అనంతరం మైమరచిన రాధికని మంచంమీద పవళింపచేసి తనపైపంచె వీవనగా చేసివిసరసాగాడు. అమ్న్చు బిందువుల్లా నిలిచిన సేద బిందువులు ఆమె ముఖ కమలంమీద నుంచి మాయమైనాయి.    రాధికకళ్ళు తెరిచింది. 'సామీ!' అంది ఆరాధనగా.    'రాధీ....ధీరచిత్తపుకావే బేలా! ఏలా ఆ తొందర? ఏమి ఆ ఆరాటం.    'ప్రభూ! ప్రభూ!    తీగలాచుట్టుకు పోయింది రాధిక' నన్ను నీతోపాటే దారకకు తీసుకుపోసామీ! నిను విడిచి నిముసమైనావేగలేను. విరహాగ్నిలోనిలవలేను.....""    'రాధీ!' సమాశాసించాడు కృష్ణుడు ఆమె కనులు తుడిచాడు. శిరోజాలు సవరించాడు. శిరస్సునిమిరాడు మృదువుగా ఆమె మనస్సు తేటపడింది. చేతులు జోడించింది ""గోవర్ధనగిరి ధారీ! నన్ను ఉద్దరించడం నీకు యింత సులువే?'    చిరునవ్వే ఆయన సమాధానమైంది.    'నీ స్మరణ ఆజీవం వరంగా ప్రసాదించు ప్రభూ!' కృష్ణుడు చిరుదరహాసంతోతధాస్తన్నాడు.    'గోగోప గోపీజన వల్లభా! నన్నూ నీ దానిని చేసుకో!' కృష్ణుడు ఆమె వామహస్తాన్ని అందుకున్నాడు.    నిండునూరేళ్ళు భర్తతో సంసారిక యజ్ఞం చేసిపుత్ర పౌత్ర సంపదతో వర్ధిల్లి ముత్తైదువుగా భర్త చేతుల్లో విశ్రాంతి నందిన పరమ పతివ్రతాతిలకంలా అతనిపాదాలు స్ప్రుసించింది రాధికకృష్ణుడు జగన్మోహనమైన దరహాసంతో ఆమెను కటాక్షించి అనుకున్నాడు    ""పదహారువేలఒకటి!""                                               రసలోలితబస్టాండ్ జనసముద్రంలా వుంది.    సముద్రమధ్యంలో దీపంలో వుంది ఒక్కతే - రుక్మిణి.    ఆమె సెమినార్ లో పాల్గొనాలని వచ్చిందక్కడికి మూడు రోజులూ మూడు యుగాల్లా గే గడిచిపోయాయి అఖిలభారత స్థాయిలో ఒక్కో ప్రాంతానికి ఒకరిద్దరుగా ఎన్నికచేసి గృహిణుల సెమినార్ అది.    ఆ జిల్లా కలెక్టర్ కొత్తగా రిక్రూట్ అయి వచ్చింది.    ఆమె జీవిత చెలికాడూ కలెక్టరే.    వాళ్ళదాంపత్యం పున్నమి వెన్నెల్లుపరిమళించి పారిజాతంలా వుంది కాబోలు - అందుకే గృహిణులు సెమినార్ ఏర్పాటు చేసింది. ఉద్యోగినులు, వ్యాపారులు, పల్లెపడుచులురకరకాల జీవనస్థాయిలోవున్న భార్యలని ఓ కప్పు క్రిందకి చేర్చింది ఆమె. చర్చ-ఈనాటి సాంఘిక వ్యవస్థలో దృఢ పడవలసిన భార్యా భర్తలు సహృద సంబంధాలు.....   ఇక్కడికిరుక్మిణి రావడమే విశేషం.  ఆ వూరి చైర్మన్ గారి భార్య ఈ లేడీ కలెక్టరుగారికి బాగా పరిచయం. ఆమె రుక్మిణి పేరు సూచించింది.    ముందు రుక్మిణి యిష్టపడలేదు.    పరమశివానకి యివంటే బొత్తిగా యిష్టం లేదు.    అప్పుడే పూచిన మామిరెమ్మ పైవాలి కొసరి కొసరి కుహూనినాదాలు పలికే కోకిల్లాగా, తొలిసారిగా పూసి తలెత్తిలోకాన్ని పాలిస్తోన్నంత గర్వంగా చూసే కేతకిలా, శ్రావణ మేఘమాలికల కదలికకే కదిలిపోయినర్తించే కేకిలావుండే రుక్మిణి - తన సంతం.    తానైమూడు ముళ్ళూ బిగించి తనకోసం తన యింటికి తెచ్చుకున్న ఇంటి యిల్లాలు. ఆమె చదువు - సంస్కారం, భావుకత, సౌందర్యా సౌకుమార్యాలు, అందచందాలు అన్నీ- అన్నీ - తనకే - తనకే సంతం....     ఇంకెవరూ చూడకూడదు- అనేది అతని మనస్తత్వం అయితే రుక్మిణికి తప్పించుకునే వీల్లేకపోయింది.    పదిహేనుపదహారు సంవత్సరాలు కాపురం చేశాక కూడా పదహారుపందొమ్మిది మధ్యఉన్నట్టుండే రుక్మిణి అన్నా, ఆమెతీయని గొంతు విన్నా చైర్మన్ గారి భార్యకి అపురూపమైన ఆరాధన.    భూలోకానికిషికారొచ్చినట్లు ఎప్పుడూ తాజాగా వుండే రుక్మిణిలోని దైవతంలాటి లావణ్యం అంటే ఆమెకి ఆరాధన అందుకే ఆమెని బలవంతం చేసింది. పరమశివంకాదన లేకపోయాడు.    వెళ్ళేది అందరూ ఆడవాళ్ళే వుండేది అంతా ఆడవాళ్లే.    పూలవనంలా బృందావనంలా వుండే స్త్రీలమధ్య తనభార్య పారిజాతంలా పరిమళించటం అతనికి మాత్రం అయిష్టమా!    అదిగో అలా వచ్చిందక్కడికి రుక్మిణి.    అందంవేరు ఆత్మవేరు.    సౌందర్యం వేరు సౌకుమార్యం వేరు.    చదువొకతీరు సంస్కారం ఒక తెన్ను వచ్చిన ఆడవాళ్ళు వచ్చిన పనే మర్చిపోయారు.    స్త్రీసహజమైన యీర్ష్యాసూయలు కోపతాపాలమధ్య చర్చనీయాంశం మరుగునపడి పోయింది.    ముగ్గురాడ వాళ్ళు కలిస్తేనే పట్టపగలుచుక్కలు రాల్తాయనుకుంటే మూడొందలు మంది.....వివిధ ప్రాంతాలు.... మతాలు.....భాషలు .....సంస్కృతి ఒకచోట కలిస్తే!" 37,"    ఈ విషయాలన్నీ నలభై ఏళ్ళు వచ్చిన తనకే గందరగోళంగా వుంటాయి ఏది కరెక్టో  తెలియని తను కూతురికైనా సరే నీతి బోధలు చేయడం అపహాస్యంగా అనిపించింది. అలాగని కూతురు రాత్రిపూట  ఎవరో అబ్బాయిని అంకాళమ్మ గుడిదగ్గర కలుసుకుంటూ వుందంటే ఊరకనే వుండడం కూడా అంత మంచిపనిగా తోచడంలేదు. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి?     శతరూప అలా ఆలోచనలతోనే కిందామీదా పడుతుండగా సాయం కాలం అయిపోయింది.     మామూలుగా అయితే తల్లి అలా నిస్తేజంగా వుంటే ఇందుమతి ఒప్పుకునేది కాదు.  జోక్ లు వేసో, ధైర్య వచనాలు చెప్పో, మామూలు మూడ్ లోకి తెచ్చేది. అయితే ఇప్పుడామె పరిస్థితి లేదు. భరణి తప్ప మరో ఆలోచన రావడంలేదు.     చీకట్లపడెకొద్దీ ఇందుమతి  ఒళ్ళు  అదురుతోంది. అతనితో వెళ్ళి పోవాలన్న ఆలోచన చేసినప్పుడు  కాళ్ళు వణుకుతున్నాయి. కళ్లు బెదురుతున్నాయి. చల్లగాలి శరీరానికి తగులుతున్నా చెమటలు పడుతున్నాయి. ఏదో తెలియని దిగులు కాళ్ళకు అడ్డంపడుతోంది.     తన తల్లి గురించి ఎక్కువసేపు ఆలోచించడంవల్లే తనకు ఉత్సాహం రావడంలేదని ఇందుమతికి తెలుసు. అందుకే తను వెళ్లిపోయినా  తల్లికి ఏంకాదని ఆలోచిస్తే మాత్రం భరణితో వెళ్లిపోవడం తన ఒక్క దానికే పట్టిన అదృష్టంలా అనిపిస్తోంది. ఈ పేదరికం నుంచి తనను ఐశ్వర్యంలోకి గిరవాటేసేందుకు స్వయంగా భరణిని పంపించినట్టు తోస్తోంది.     ఆమె అలా అటూ ఇటూ ఎటూ తేల్చుకోలేక సతమతమవుతుండగానే సాయంకాలం కరిగిపోయి వెన్నెల ప్రవేశించింది. చందమామ లోకమంతా మల్లెపూలని పరిచినట్టు అనిపిస్తోంది.     ఏదిఏమైనా భరణితో వెళ్లిపోవాలని ఇందుమతి నిశ్చయించుకుంది. అలా ఓ నిర్ణయానికి రావడంతో అంతకుముందున్న టెన్షన్ అంతా ఎగిరిపోయింది. భరణితో కలిసి తను  కాలానికి నగిషీలు  కుట్టడం గురించి ఊహిస్తుంటే గుండె రక్తపుపువ్వులా విచ్చుకుంటోంది. తనతోపాటు ఏమైనా తీసుకెళ్లాలా అని ఆలోచించింది. ""బట్టల్లాంటివి ఎత్తుకురాకు. మనం టౌన్ కు వెళ్లగానే నీకు కావాల్సినన్ని బట్టలు కొనుక్కోవచ్చు"" అని భరణి చెప్పడం గుర్తొచ్చింది.     ""నీ అందాలు మాత్రం పదిలంగా తీసుకురా చాలు"" అని అతను చెప్పేవాడు. ఆ మాటలు గుర్తుకు రాగానే అనాలోచితంగా ఇందుమతి తన గుండెలకేసి చూసుకుంది. వెన్నెలంతా కప్పుపోసినట్లుగా ఎత్తుగా కనిపిస్తున్న తన ఎదకేసి సంతృప్తిగా చూసుకుంది. భరణి అల్లరి కళ్ళల్లో మెదిలి చిన్న నవ్వు పెదవుల్ని సాగదీసింది. మరిక ఏం ఎత్తుకెళ్లాలి?     బంగారం కనీసం ఒక గ్రాముకూడా లేదు. బంగారు కమ్మలు వుండేవి. వాటిని ఈ మధ్యే ఓ చీటికి డబ్బులు కట్టాల్సి రావడంతో మోతుబరి రైతు భార్య వాణిశ్రీ దగ్గర కుదువపెట్టేసింది అమ్మ. కాబట్టి తను ఉత్తి చేతులతోనే వెళ్లాలి. తను ఎలా వెళ్ళినా భరణి ఏమీ అనుకోడు. అతను ప్రేమిస్తోంది తననుగానీ తన బంగారాన్నో తన డబ్బునో కాదు.       సో -  తను ఎలావుందో అలా వెళ్లిపోవాలి.     ఈ రోజురాత్రి నుంచి అమావాస్య వరకు ప్రతిరాత్రి తొమ్మిది గంటలనుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు నిరీక్షిస్తూ వుంటాడు.     వెళ్లిపోవాలనుకున్నప్పుడు వాయిదా వేయడం ఎందుకు? రాత్రి తొమ్మిది కాగానే పిన్నీవాళ్ల ఇంటికెళ్లి టీ. వీ. చూసివస్తానని బయట పడడం మంచిది. పిన్ని ఇంటికంటే తల్లికి అనుమానంరాదు. అలా బయల్దేరి పిన్ని ఇంటికి వెళ్లకుండా అంకాళమ్మ గుడిదగ్గరి కెళ్లిపోతే భరణి వుంటాడు. అతనితో వెళ్లిపోతుంది.     ""వాకాడులో నాకు తెలిసిన  మిత్రుడు బ్యాంక్ లో మేనేజర్ గా వుంటున్నాడు. వారి దగ్గరికెళ్లిపోతే మన పెళ్లిజరిపిస్తాడు. ఇక ఇటునుంచి ఎటైనా వెళ్లిపోయి హాయిగా బతికెద్దాం"" అదీ భరణీ తనకు చెప్పిన ప్లాన్.     సినిమా అయిపోగానే ఇంటికి రాని తనకోసం తల్లి వెదుక్కుంటూ తన పిన్ని ఇంటికి వెళుతుంది. ఇక అక్కడ తను లేకపోతే ఏమనుకుంటుంది? వెంటనే ఊహిస్తుందా? ఆ రాత్రి తెలియకపోయినా తెల్లవారేటప్పటికి తెలిసిపోతుంది.     అప్పుడు ఏమవుతుంది అమ్మా? ఇక అమ్మ గురించి ఆలోచించకూడదని ఒట్టు పెట్టుకుంది.       తల పైకెత్తి గోడకు అతుక్కుపోయినట్లు కనిపించే గడియారం వంక చూసింది.     టైమ్ ఎనిమిదైంది. 'ఇంకొక్క గంట' అనుకుంటూ భోజనం  చేయడానికి పళ్లెంముందు కూర్చుంది ఇందుమతి.     ఎనిమిది గంటలు అవడంతోనే తయారైపోయాడు భరణి. తెల్లటి ప్యాంట్ మీద నల్లటి గళ్లున్న వైట్ షర్ట్ టక్ చేసుకున్నాడు బ్రీఫ్ కేసులో అదనంగా  మరో రెండు డ్రస్సులు సర్దుకున్నాడు. ఇందుమతి వస్తే లేచిపోవడానికి ఏమేం కావాలో అన్నీ అమర్చుకున్నాడు.     చివరగా జేబు తడుముకున్నాడు. రెండు వందలకు మించిలేవు. నెల  చివరిరోజులు. అందులోనూ పల్లెటూరు కాబట్టి కలెక్షన్లు సరిగా జరగవు. ఏదో బొటాబొటీగా బండిని లాక్కొస్తున్నాడు.     జేబులోంచి  డబ్బు తీసి లెక్క పెట్టుకున్నాక  చిత్రను కేకేశాడు. అప్పుడే భోజనం ముగించి లేచివచ్చింది చిత్ర. ""ఎనిమిదే గదా. మరో అరగంటాగి బయల్దేరు"" అంది గడియారం వంక చూస్తూ. " 38,"         దొరలూ దొరసాన్లూ చక్కగా పెద్దవాళ్ళయినాక వాళ్ళంతట వాళ్ళే పెళ్ళి చేసుకుంటారు. చిన్నతనంలోనే పెళ్ళి చెయ్యటం తప్పు. పెద్దయిన తరువాత మొగుడు పెళ్ళాలు ఒకరికొకరు నచ్చక పోతే ఏం కావాలి? వెధవముండల పెళ్ళిళ్ళుకూడా చెయ్యాలిసిందే. వెధవముండలకి జుట్టుగొరిగికి నెత్తిన ముసుగేసి కూచోబెట్టటం చాలా ఘోరం... ఆడవాళ్ళంతా జుట్టూ, నగలూ, చీరెలూ ఉండి తిరుగుతుంటే చూడటానికి ఎంత బాగుంటుంది!....     అయితే సుందరానికి సందేహాలు లేకపోలేదు. చాలా ఏళ్ళు వచ్చినతరువాత వెధవముండలకి   పెళ్ళి చెయ్యాలా. వద్దా? పిల్లలున్న వాళ్ళు పెళ్ళిచేసుకుంటే ఏమవుతుందీ? ఛా, ఛా! వాళ్ళనెవరు చేసుకుంటారు?     ఇంతలో ఇంకో భయంకరమైన ఆలోచన కలిగింది: తన తల్లికి మళ్ళీ పెళ్ళిచెయ్యటమా? సుందరానికి ఒళ్ళంతా ఒక్కసారి భగ్గునమండిపోయింది. అది ఎంతమాత్రం వీల్లేదనుకున్నాడు. ఆవిడ జుట్టు పెంచి, చీరెలుకట్టి, నగలు పెట్టుకోవటంకూడా వాడికి సమ్మతం కాలేదు. ఆవిడలో కాస్త మార్పుకూడా వాడు సహించలేడు....                                                                       *    *    *    *        పాపం, శేషగిరి చాలా చిత్రమైన ఆవేదనకు గురి అవుతున్నాడు. సంజీవిలాటి ఔషథం దగ్గర ఉండికూడా అనుపానం తెలియని వైద్యుడల్లే ఆయన ఎంతో ఉన్నతాశయాలు కలిగి ఉండిన్నీ వాటిని ఎట్లా అమలులోకి తేవాలో తెలియక కొట్టుకుంటూ. అడుగడుగునా సంఘం తనకు అడ్డంవస్తున్నట్టు భావిస్తున్నాడు. ఆదర్శవాదుల కందరకీ ఈ గతి ఎప్పుడో ఒకప్పుడు కలగక తప్పదు. వారు సంఘంమీద కొన్ని సంస్కరణలు పడ వెయ్యటానికి ప్రయత్నంచి విఫలులై, చిట్టచివరకు ప్రాణం విసిగి, ""ఈ పాడు సంఘానికి బాగుపడటం ఇష్టంలేదు. దీనికి బాగుపడే గీతలేదేమో"" అనుకుని వైరాగ్యంలో పడతారు.     శేషగిరి వైరాగ్యంలో పడటమేగాక, తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక కృష్ణవేణికి పదకొండో ఏడు వెళ్ళుతుందనగా పెళ్ళిఏర్పాటు చేశాడు. జాతీయ విద్యాలయంలో అస్పృశ్యుల పిల్లలను ప్రవేశ పెడతానన్నందుకే వెలివేసినంతపని చేసిన వాళ్ళున్నారు. కూతురుకి రజస్వలానంతర వివాహం కూడా చేస్తే ఊళ్ళోఉండే ఆస్కారం లేకుండాపోతుందని శేషగిరి భయపడ్డాడు.     కృష్ణవేణికి నిర్ణయించిన వరుడు ఉద్యమంలో చదువు చాలించుకుని ఆరుమాసాలు శ్రీ కృష్ణ జన్మస్థానం సందర్శించిన వాడు, అతనికి విశేషం ఆస్తిలేదు, కట్నమూ, లాంఛనాలూ లేకుండా పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఖద్దరు బట్టలతో పెళ్ళిఅయింది. శేషగిరి బంధువులకీ పెళ్ళి చాలా వేళాకోళంగా ఉన్నది.       ""ఇదేం పెళ్ళి? నా మొహం పెళ్ళి! అలాగాజనం కూడా ఇంతకన్న బాగా చేసుకుంటారు. బాజా లేవి, ఊరేగింపులేవి, మేజువాణీ ఏది, దండాడింపేది, బూజంబంతి ఏది, కట్నాలేవి, కానుకలేవి?"" అని ఉభయ పక్షాలవారు కూడా చప్పరించారు.     ""ఇది స్వరాజ్యంపెళ్ళి కాబోలు"" అన్నారు మరికొందరు వెటకారంగా.     ఎవరేమన్నప్పటికీ సుందరానికి రంగారావు__ కృష్ణవేణి భర్త__ వచ్చాడు. అతను పెళ్ళికొడుకుపోజు పెట్టనేలేదు. పెళ్ళితానే చేయిస్తున్నవాడల్లే తానుకూడా ప్రతిపనిలోనూ తోడవుతూ. అందర్నీ పలకరిస్తూ, ఎక్కడబడితే అక్కడ ఎవరితో బడితే వాళ్ళతో కూచుని ఏదిపడితే అది మాట్లాడాడు.     చీకటిపడేవేళ రంగారావూ, సరుసూ, సుందరమూ, ఇంకా ఒకరిద్దరు పిల్లలూ కలసి చెరువు అవతలి గట్టుమీద కూచున్నారు. రంగారావు స్వరాజ్యం గురించి కబుర్లు చెప్పాడు.     ఆ రోజు పౌర్ణమి కావటంచేత ఎప్పుడు  సూర్యకాంతిపోయి వెన్నెల వచ్చిందీకూడా తెలియరాలేదు. చెరువుగట్టుమీద చెట్ల నీడలు దీర్ఖంగా పడుకుని ఉన్నాయి. వాటి మధ్య కూచుని రంగారావు ఉద్యమంగురించి మాట్లాడాడు,         స్వాతంత్య్రోద్యమం అయిపోయిందనుకోవటం పొరపాటు. ఇది ఆగదు. కొండమీదినుంచి మైదానాలు ప్రవేశించే నదిలాగావడితగ్గింది. ఇప్పుడిది విస్తరించాలి. నిజంగా ఇవాళ బ్రిటిషువాళ్ళు వెళ్ళిపోతే మనం స్వరాజ్యం సాగించటానికి సిద్దంగా వున్నామా? లేము. ప్రతి రాష్ట్రంలో, ప్రతీ జిల్లాలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలోనూ స్వరాజ్యవాదం వేళ్ళుతన్నాలి. జీవితం  అన్ని రంగాలలోనూ చైతన్యం కలగాలి. మనం రాజకీయాలు ఓనమాల దగ్గిర్నుంచీ నేరవాలి. కాంగ్రెసుసంస్థను నిర్మించాలి. దానిద్వారా విద్యార్దులలో, ఉద్యోగులలో, ఆఖరుకు పొలాలు దున్నుకునే రైతుల్లోనూ, ఫాక్టరీ కార్మికుల్లోనూ చైతన్యం కలగాలి. ఇదంతా ఒక్కరోజులో జరగాలంటే సాధ్యంకాదు. కాని, ప్రతి కాంగ్రెస్ వాడూ స్వార్ధరహితంగా పనిచేస్తే ఇవాళ ఒకడున్నచోట రేపు పదిమంది కాంగ్రెస్ వాళ్ళుంటారు. ఎల్లుండి నూరుమంది వుంటారు. ఆ విధంగా ఉద్యమం వ్యాప్తిచెందితే స్వరాజ్యం రాక ఏంచేస్తుంది?     రంగారావు ఖద్దరుగురించి చాలా ఉద్రేకంతో మాట్లాడాడు. అతను శేషగిరి మామయ్యంత ఆదర్శవాదీకాదు, నిరాశావాదీకాదు.     ఈ సంగతులు రంగారావునోట వింటుంటే సుందరానికి మరింత నమ్మదగినట్టుగా కనపడ్డాయి. వాడు ఇక ఖద్దరుతప్ప కట్ట రాదనుకున్నాడు.     దీనికోసంవేరే ప్రయత్నం చెయ్యనక్కర్లేకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు శేషగిరి తన మేనల్లుడికీ మేనకోడలికీ కలిసి పది గజాల ఖద్దరుగుడ్డ పెట్టాడు.                                                   *      *        *        *     రోజులూ, మసాలూ గడిచిపోతున్నాయి. జానకి ఆడపిల్లల బడికిపోయి చదువుకుంటున్నది. దాన్ని మగపిల్లలబడిలో చదివించవచ్చునని ఎవరో సూచించారు. సీతమ్మగారు ఈ ఆలోచనకు సుతరామూ ఒప్పుకోలేదు. సుందరం ఒక్క నిట్టూర్పు నిట్టూర్చాడు. తన చెల్లెలు తనతోకూడా రోజూబడికి వచ్చి చదువుకుంటుందేమోనని వాడు చాలా భయపడ్డాడు.     చిక్కేమిటంటే సుందరం క్లాసులోనే__ మరొక సెక్షనులో __ కొత్త మునసబుగా రమ్మాయి చదువుకుంటున్నది. మునసబుగారి గుర్రబ్బండీలో రోజూ ఆ పిల్ల బడిముందు దిగేది. ఆమెకు ముందుగా డవాలీ బంట్రోతుదిగి ఆమె పుస్తాకాలు పట్టుకుని ఆమె క్లాసుదాకావచ్చి పుస్తకా లామెకిచ్చి వెళ్ళిపొయ్యేవాడు. స్కూలు ప్రారంభమైన ఒకటి రెండు నిమిషాల కామె సరిగా ఎట్లా హాజరయ్యేదో అందరికీ వింతగా ఉండేది. ఈ పిల్లను గురించి తన తోటివిద్యార్ధులు మాట్లాడుకునే మాటలు సుందరం వినేవాడు. ఈ మాటలకు సుందరం బాధపడేవాడు కాడు__ ఎప్పుడైనా ఆ పిల్లనుగురించి కాస్త జాలిపడేవాడేమో. తన చెల్లెలు స్కూలుకువస్తే దాన్నికూడా అటువంటిమాటలే అంటారనీ, పైపెచ్చు తను ఎదటలేనప్పుడు అంటారేమోననీ అనిపించగానే సుందరానికి చలవలు కమ్మినంతపని అయింది......." 39,"     ""నేను అందర్నీ రాత్రిపూట చదువుకోమని పిలిచేది యిందుకే మనకే చదువు వచ్చి వుంటే యింత గొడవరాదు ఎప్పుడూ?"" జానయ్య మాటాళ్ళేదు. సోము మాట విన్లేదు.     లేచాడు సోము.     ""ఏం?""     ""పోదాం పద!""     భార్యవైపు చూశాడు జానయ్య.     ఆమె కళ్ళల్లో మెరుపు! అది ప్రోత్సహిస్తూ వుంది.     విధిలేక లేచాడు జానయ్య.     ఉత్సాహంతో కదిలారు ఇద్దరూ జానయ్య అనుసరించాడు.                                                                           6          మొండివాడు రాజు కన్నా బలవంతుడు.     మరి రాజో, రాజస్థానీయుడో, అలాటి వుద్యోగో, వాళ్ళ అండ దండలున్నవాడో మొండి వాడయితే? అప్పుడు వాడి బలం మరీ యినుమడిస్తుంది.     చదువరి అలాటి వాడే!     ఎప్పుడయితే జానయ్య యింట్లో తిరుగుబాటనే ముసలం పుట్టిందో అది అందర్నీ నశింప చేస్తుందని తెల్సుకున్నాడు అతను దానికీ విరుగుడు ఒక్కటే? దాన్ని వ్యాపింపకుండా చేయటం లేదా నిర్లక్ష్యం వహించటం.     అందుకే జానయ్య జయన్న సోమూ రాగానే అతను బిగుసుకుపోలేదు. చిరునవ్వుతో ఆహ్వానించాడు.     ఆ చిరునవ్వులు వెనక వుండే తతంగం తెలుసుకున్న జానయ్య గుండె బేజారైపోయింది. ఏదో ఎత్తువేశాడు అనుకున్నాడు?     సోము మాత్రం అవేవీ ఆలోచించలేదు.     జయన్న నేరుగా వ్యవహారంలోకి దిగాడు.     దానికి సమాధానంగా తీరుస్తావా అని అడిగాడు చౌదరి మామూలుగా.     ""వివరం తెలుసుకుని ఆలోచిద్దామని వచ్చామని ఎంత అప్పు? ఎప్పుడు తీసుకున్నారు? వడ్డీ రేటెంత?"" అని వివరాలు అడిగేడు జయన్న.     చౌదరికి చిర్రెత్తుకొచ్చింది. అయినా తమాయించుకున్నాడు. శాంతంగా సౌమ్యంగా వివరాలు చెప్పేడు ఆరు నెలల నాడు బాండు రాశాడు. వెయ్యిరూపాయలు అసలు,  వడ్డీ దేమిటి? ఎప్పుడెలా యిస్తే అలా తీసుకుంటాను.""     ""మొదట అప్పు తీసుకున్న దెంత? వడ్డీ ఎంత! చెల్లెంత, ఎప్పుడెప్పుడు చెల్లువేశారు?"" వివరాలడిగేడు మళ్ళీ.     జయన్న ప్రశ్నకి ""అవన్నీ ఎందుకు? లెక్కలు ఎక్కడుంటాయ్? బాండు ఎప్పటి కప్పుడు చింపేస్తాను. కొత్తది రాస్తున్నాం కదాని!"" అన్నాడు చౌదరి.     ఇలా కాలికేస్తే వేలికే, వేలికేస్తే కాలికి తిప్పి తిప్పి సమాధానాలు చెప్పేడు. ఆఖరికి ""నా డబ్బు మాటేం చేశారు అని అడిగేడు.     ""తీరుస్తాం?""     ""ఎప్పుడు?""     ""ఉన్నప్పుడు?""     ""అది సమాధానం కాదు ప్రొనోటులో ఏం రాశాడో మీ నాన్న నడుగు. అడిగిన తక్షణం చెల్లించగలవాడను అని రాశాడు.""     ""అది అన్ని ప్రోనోట్లలోనూ రాస్తారు. అది మామూలు మాట!""     ""సరే! అప్పు తీరేదాకా మీరు మాకు పనిలో రావాలి పశువులు - మనుషులు-""     ""ఆ మాట కడ్డొస్తూ! ఉహూ!"" అన్నాడు.     ""అలా అంటే ఎలా?""     ""మాకు కుదర్దు మేం బ్రతకాలి!""     ""మేం చెడిపోవాలా!""     ""మీకే మవుతుంది? అప్పు తీరుస్తాం కదా!""     ""తీరుస్తావ్ తీరుస్తావ్? అసలూ వడ్డీ తీసుకుని తృప్తి పడ్డానికి యిదేం బ్యాంకా? మేం అప్పిచ్చేది సానుభూతితో దయతో....మా అవసరానికి పనికొస్తారనే ఆశతో, అంతే కాని డబ్బు ఎక్కువై మీకు అప్పు యివ్వలేదు.""   " 40,"     అప్పుడే ఫోన్ లో ఏవో శబ్దాలు వినిపించాయి. ఠంగ్...ఠంగ్ మని.     ""నాకు ఇక్కడినుండి ఏమీ కనిపించటంలేదు. ఏదైనా పురుగుపట్టిందేమో? ఏదైనా మందు చల్లు"" చెప్పింది పూజ.     తను పూలకుండీ జరిపిన దృశ్యాన్ని మదర్ మాథ్యూస్ చూసుకుంటుందా? ఒక్క క్షణం ఆలోచించాడు శ్రీధర్.     ఆమె మాటలతో పాటు, అపశృతుల హార్మోనియం శబ్దాలు వినిపించ సాగాయి ఫోన్ లో.     శ్రీధర్ ఏదో మాట్లాడబోయేలోపే ఫోన్ కట్ అయిపొయింది.     ఆ శబ్దాలు పలికించిన పిచ్చివాడిమీద విపరీతమైన కోపం వచ్చింది శ్రీధర్ కి. గంటా గంటన్నర వరకైనా ఆమెను మాటల్లో పెట్టాలనుకున్నాడు శ్రీధర్. ఆ అవకాశం పోయినందుకు నుదురు కొట్టుకున్నాడు.     ఆ ధ్వనులే తన ఫ్లాట్ ఆచూకీకి ఆధారం కావొచ్చని పూజ ఫోన్ కట్ చేసింది.                                                     *    *    *    *     ఆ రాత్రి మరి అపరిచితురాలు నుంచి ఫోన్ రాలేదు.     శ్రీధర్, యోగి, మాథ్యూస్ ముగ్గురూ దాంతో నిరుత్సాహానికి లోనయ్యారు.                                *    *    *    *     శ్రీధర్ తో కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్ళాలనుకుంది పూజ. అక్కడ తను శ్రీధర్ ఈ లోకానికి దూరంగా, ప్రశాంతంగా వుండవచ్చని అనుకుంది.     శ్రీధర్ స్వచ్చమైన ప్రేమను చూసి పూజకి ఒక పక్క సంతోషంగావున్నా, మరోపక్క తను ఆడే ఈ నాటకాలన్నీ తలచుకొని బాధపడింది. అన్ని విషయాలు అతనితో చెప్పి అతని ఒడిలో వొదిగిపోవాలనుకుంది. కానీ దానికి సరైన సమయం రావాలి. ఆ ఆలోచన వచ్చింది మరుసటిరోజు నుంచే. పూజలా వేరేచోట ఫ్లాట్ వెదకటం మొదలుపెట్టింది. అతని కంట పడకుండా రావటం, పోవటం కూడా అసాధ్యం అనుకుంది.     ఈమధ్య శ్రీధర్ పనిచేసే కంపెనీలో ఏదో గొడవ జరిగి కొన్నాళ్ళు ఆఫీసుని మూసేయటం జరిగింది.     దాంతో అతను ఈ మధ్య ఎప్పుడూ ఫ్లాట్ లోనే వుంటున్నాడు. ఆకలైనప్పుడు కిందికొచ్చి రెస్టారెంట్ లో భోంచేసి పైకెళుతున్నాడు. వస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు పరిసరాల్ని నిశితంగా గమనిస్తున్నాడు.     తను ఫ్లాట్ కి రావటం, పోవటం ఎప్పుడైనా పసిగట్టవచ్చు అన్న ఆలోచన రావటంతో, ముందుజాగ్రత్తగా ఆమె ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా, ఒక కుర్రాడి ద్వారా ఆటోని తన బ్లాక్ వరకు పిలిపించుకుని చటుక్కున అందులోకి దూరి వెళ్ళిపోవటం- వచ్చేప్పుడు కూడా ఆటోని తనుండే బ్లాక్ వరకు తీసుకువచ్చి, అటూ ఇటూ చూసి చటుక్కున ఆటోదిగి లోపలకు వెళుతోంది.     ఇన్ని చేస్తున్నా ఈ మధ్య పూజలా ఫోన్ చేయటంలేదు. పూజ అనే పాత్ర శ్రీధర్ జ్ఞాపకాల పొరల్లో మరుగున పడిపోవాలని ఆమె కోరిక.     అందుకే మాళవికలా దగ్గరవుతూ, పూజలా దూరం కావాలనే స్థిరమైన నిర్ణయానికొచ్చేసింది.                                                        *    *    *    *     మరుసటిరోజే మాళవికలా రంగప్రవేశం చేసి శ్రీధర్ ని బెంగుళూరు టూర్ కి ఒప్పించగలిగింది పూజ.     పూజ అంతకాలం తనతో ఫోన్ లో ఆడుకుందే తప్ప తనని ప్రేమించటం లేదేమోనన్న అనుమానం బాగావచ్చింది శ్రీధర్ కి.     అందుకు పూజ అమెరికా స్టడీస్ గురించి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చి అతడ్ని మొండివాడ్ని చేశాయి.     ఆ రోజు సాయంత్రమే శ్రీధర్, మాళవికతో బెంగుళూరు ప్రయాణమయ్యాడు.     బెంగుళూరు వెళ్ళిన మరుసటిరోజు షాపర్స్ స్టాఫ్ కాంప్లెక్స్ వెళ్ళారిద్దరూ, శ్రీధర్ మెన్స్ సెక్షన్ దగ్గర వదలేసి, తను ఫస్ట్ ఫ్లోర్లోకెళ్ళి అక్కడున్న ఫోన్ నుంచి కిందున్న అతనికి ఫోన్ చేయాలనుకుని సేల్స్ గర్ల్ ని ఫోనడిగి దానికి వాయిస్ ఛేంజింగ్ మెషిన్ అటాచ్ చేసి, గ్రౌండ్ ఫ్లోర్లో వున్న మెన్స్ సెక్షన్ కి ఫోన్ చేసి శ్రీధర్ కావాలని అడిగింది. అతను ఆశ్చర్యపోతూ ఫోన్ ఎత్తగానే ""హలో...హాయ్...నేనే... మాళవికతో బెంగుళూరులో ఎంజాయ్ చేస్తున్నావా?"" అంది నవ్వును దాచుకుంటూ.     ""అవును... ఈ సమయంలో నేనిక్కడుంటానని హైద్రాబాద్ లో వున్న నీకెలా తెలిసింది?"" అడిగాడు శ్రీధర్ షాక్ తింటూ.     ""మీరుండే హోటల్ కి ఫోన్ చేస్తే మీరు షాపర్స్ స్టాఫ్ కి వెళ్ళారని తెలిసింది. గో...ఏ...హెడ్...విత్...మోస్ట్ బ్యూటిఫుల్ మాళవికా... బై..."" అంటూ ఫోన్ కట్ చేసి దానికి అటాచ్ చేసిన వాయిస్ ఛేంజింగ్ మెషిన్ ని డిటాచ్ చేసి వేనిటీ బ్యాగ్ లో వేసుకుని, సేల్స్ గరల్ కి థ్యాంక్స్ చెప్పి, గ్రౌండ్ ఫ్లోర్ కేసి నడిచింది పూజ.     అదంతా ఏమిటో అర్థంకాని సేల్స్ గర్ల్ బిత్తరపోయి అలాగే బిగుసుకుపోయింది.                                *    *    *    *     వారం రోజులకి ఇద్దరూ బెంగుళూరు నుంచి తిరిగొచ్చారు. మాళవిక జూబ్లిహిల్స్ అని చెప్పి, అతని ముందే ఆటో ఎక్కి, ఒక కిలోమీటరు దూరం వెళ్ళి, అదే ఆటోని రివర్స్ వెళ్ళమని చెప్పి తిరిగి ఫ్లాట్స్ దగ్గర ఆగి, పరిసరాల్ని శ్రద్ధగా గమనిస్తూ, కొద్ది నిమిషాల్లోనే తన ఫ్లాట్ లోకి దూరి తలుపేసుకుంది.                                                       *    *    *    *     ""నాకు తెలిసినంతవరకు పూజ కురూపి. అందుకే నీకు ఎదురుపడలేదు ఇంతకాలం. లేదంటే దాగుడుమూతలకైనా ఒక లిమిట్ వుంటుందిగా... ఇంకా అమ్మాయిని మర్చిపో! నిన్ను కోరుకుని, నీతో ధైర్యంగా నీమీద నమ్మకంతో బెంగుళూరు వచ్చిన మాళవికే నీకు సరైన జోడి..."" తెగేసి చెప్పాడు యోగి.     మదర్ మాథ్యూస్ కూడా అదే అనిపించింది.     శ్రీధర్ లో క్రమంగా మాళవిక పట్ల మొగ్గుపొడచూపసాగింది. అయినా వుండుండి పూజ కంఠం గుర్తుకొస్తూనే వుంది.                                 *    *    *    *     శ్రీధర్ క్రమంగా తన పూజ పాత్రని మరిచిపోతుండగా, తనెక్కువరోజులు అక్కడుండటం మంచిది కాదనిపించిందామెకు.     టెలిఫోన్ పాత్రని శాశ్వతంగా చంపేయాలనుకుంది కూడా." 41,"    "" ఇదీ ఆలవా... ఆ... ఏంటిరా వాగావ్?""     "" ఆ జిడ్డు వదిలింది. నువ్వు జిడ్డులా దాపురించావ్.""     ఇంకేం మాట్లాడటానికి టాపిక్ లేక నవ్వి నోరు మూసుకున్నారు.     బామ్మాగారింట్లో అబ్బులు వ్యాకర్ణ చేరి వారం అయింది.     ఈ వారంలో ఆ కాంపౌండ్ లో వున్న అన్ని కుటుంబాల ఫార్స్ చూశారు.     కాకాకీమం వుపయోగించి బామ్మాగారి వద్ద మరింత చనువు సంపాదించి మరింత బుద్దిమంతు లనిపించుకున్నారు. బామ్మాగారి కధాకమామిషూ తెల్సుకున్నారు.     బామ్మాగారికి ఒక్కడే కొడుకు. ఆ కొడుక్కి ఒక్కతే కూతురు. ఆ కూతురే బామ్మగారి మనుమరాలు జయచిత్ర.     బామ్మగారికి  పల్లెటూరిలో ఓ యిల్లుంది.     యిక్కడిది కాక జయచిత్ర తల్లి తండ్రి పల్లెటూరిలో ఆ యింట్లో వుంటే జయచిత్ర చదువుకోసం తోడుగా బామ్మగారు ఈ బస్తీలో యీ యింట్లో వుంది.     బామ్మగారికి తోడుకోసం- బ్రతుకు తెరువు సాధనాలలో కొంపని ముక్కలు ముక్కలుచేసి అద్దెల కివ్వటం మామూలుగా జరుగుతున్న కధే కాబట్టి బామ్మగారు ఉన్న కొంపని ముక్కలు చేసి అద్దెల కిచ్చారు, ఇదీ కధ.     ఓ రోజు జయచిత్ర పుట్టినరోజు వచ్చింది.     జయచిత్ర అన్ని వాటాల్లో వాళ్ళకి స్వీట్లు పంచి పెట్టింది. జయచిత్ర కిష్టం లేదు. బామ్మగారు బాధపడతారని స్వీట్స్ పంచిపెట్టడం వరకే పరిమితి చేసింది.     స్వీట్స్ తీసుకుని వ్యాకర్ణ అబ్బులు వున్న గదిలోకి వచ్చింది.     బస్ కీలు, దండేలు కట్ డ్రాయిరు ధరించి తీస్తున్న వ్యాకర్ణ, అబ్బులు జయచిత్రను చూస్తూనే గబుక్కున లుంగీ కట్టుకొచ్చారు.     రాణి సమయంలో వాచానేమో అని నిజంగా సిగ్గు పడింది. జయచిత్ర అడుగులో అడుగేసుకుంటూ లోపలికొచ్చిచెరి రెండు స్వీట్స్ యిచ్చింది.     "" స్వీట్స్ ఎదుకు పంచిపెడతారో కనుక్కోండి"" అంది జయచిత్ర.     అబ్బులు కాసేపు అఆలోచించి కనుక్కున్నానన్నట్లు గాలిలో ఓ చిటికేసి, "" ఆ... తెలిసింది. తెలిసింది. పెద్ద మనిషయినప్పుడు, పేరంటమప్పుడు, పెళ్ళికూతుర్ని చేసినప్పుడు..."" అంటూ యింకా ఏదో గుర్తుచేసుకు చెప్పబోయాడు అబ్బులు.     వ్యాకర్ణ అబ్బుల్ని జబ్బ గిల్లాడు "" ఇంకా వేసేయ్యి. శీర్షాసనం వద్దురా అంటే రెండుసార్లు వేసావు. తెలివి మితిమించిపోయింది"" అంటూ కోప్పడ్డాడు.     "" నీవేం ఆసనం అఘెరించలేదుగా! నీ తెలివి చూపి స్వత్స్ ఎందుకిచ్చారో చెప్పు"" అన్నాడు అబ్బులు.     "" జయచిత్రగారినే అడిగితే పోలా?"" అన్నాడు వ్యాకర్ణ తెలివిగా.     "" ఇదా నీ తెలివి నీ మొఖంలా వుంది"" కసురుకున్నాడు అబ్బులు.     "" నా ముఖానికేం కవచకుండలాలు తప్ప దేనికి లోటు లేదు"" ఎన్. టి. రామారావు చక్రధారి సినిమా తీసేటప్పుడు కాకిచేత కబురంపినా కర్ణుని పాత్ర వెయ్యడానికి పరుగేతుకెళ్ళే వాడిని.     ఈ అబ్బునాధానికి మూతిమిద పళ్ళున్నాయి. మాటకు ముందు పళ్ళికిలిస్తాడు. మిరు నమ్మండి నమ్మక పొండి జయచిత్రగారూ! నా చిన్నప్పుడు మా వూళ్ళో హరిశ్చంద్ర నాటకం వేశారు.     నాటకంలో బాలకర్ణుడిగా నన్నే పెట్టుకున్నారు. అదేంటి మిరూ నవ్వూతున్నారు?"" అన్నాడు వ్యాకర్ణ.     "" శీర్షాసనం వేసి అబ్బుగారు, శీర్షాసనం వెయ్యక మిరు, ఎందుకులెండి చెపితే మిరు బాధపడతారు"" అంటూ నవ్వింది జయచిత్ర.      " 42,"     ఇష్టపడి పెళ్ళి చేసుకున్న భర్త అడ్డుచెపితే అతనితో వాదించి ఒప్పిస్తుంది.     మామగారి పట్ల గౌరవం వుంది. ఆయన అడ్డుచెపితే సమాధానమియ్యదు. అనుకున్న పని మాత్రం చేసేస్తుంది. ఆయన రెట్టించి అడిగితే ఆయన మనస్సుకి వచ్చేలా తన వాదనని వినిపిస్తుంది.     వారుణికి వచ్చిన చిక్కల్లా అత్తగారితో తోడికోడలితోనూ. వాళ్ళిద్దరికీ వారుణి ధోరణి నచ్చలేదు. ఏం చేయటానికీ తోచలేదు కోడలు వినేట్టుగా కొడుకుతో భర్తతో ఆమెని తక్కువ చేసి మాట్లాడేది సుబ్బరత్నమ్మ.     అయినా వారుణి ఏనాడూ అత్తగారితో పోట్లాటకి దిగలేదు. తొలినాడు కాపురానికి వచ్చిన రోజునే ఆమె తన వేషభాషలని భోగం దానితో పోల్చినప్పుడే ఆమె సంస్కారమెంతో అంచనా వేసుకుంది. అలాంటి వాళ్ళిక అంతే. వాళ్ళని సంస్కరించలేం. పోట్లాడాలి లేదా నిర్లక్ష్యం వహించాలి అనుకుంది.     పోట్లాడటం యిష్టంలేని వారుణి అత్తని, సావిత్రిని నిర్లక్ష్యం చేయసాగింది.                          *    *    *    *     సావిత్రి కూతురు సరోజ వారుణికి దగ్గరై చనువుగా మెలుగుతూంది. సరోజ గొంతు, నడక వారుణికి ముచ్చటగా అన్పించాయి. ఆ అమ్మాయికి సంగీతం, నృత్యం నేర్పించాలనుకుంది.     మొదటగా తోడికోడలుతో ఆ ప్రస్తావన తెచ్చింది వారుణి.     ""నా కిష్టం లేదు!"" మొండిగా అంది సావిత్రి.     నిజానికి సావిత్రికి యిష్టంలేక కాదు. వారుణి ప్రతిపాదన తను ఒప్పుకుంటానికి ఆమె మనస్కరించలేదు. అదే అత్తగారుగానీ, భర్తగాని అని వుంటే ఒప్పుకునేదే.     ఇలాంటి విషయాల్లో ఆమెకి తెలియనితనంగానీ, అమాయకతగానీ లేవు. వున్నదల్లా మూర్ఖత్వం. వారుణి అంటే గిట్టకపోవడం వల్ల వచ్చిన మొండితనం.     సావిత్రికి ఎలా నచ్చచెప్పాలో తెలియలేదు వారుణికి. నిస్పృహతో నిట్టూర్చింది. ఆఖరి ప్రయత్నంగా అంది.     ""అక్కయ్యా! నా మాట విను. రొజాని డాన్స్, మ్యూజిక్ స్కూల్లో చేర్పించటం వల్ల నష్టం లేదు. దాని గొంతు అద్భుతంగా వుంది.""     ""నా కూతురు సంగీత కచ్చేరీలు చేయనక్కరలేదు. సినిమాలకి పాడనక్కరలేదు."" కఠినంగా జవాబిచ్చింది సావిత్రి.     ""సరే అక్కయ్యా! అవేవీ అవసరం లేదు. కాని చదువు చదివిన ప్రతివారూ ఆ చదువుతో సంపాదించాలనే రూలు లేదు. అసలు చదువు ధ్యేయం ఉద్యోగం కాదు. మానసిక వికాసం, చిత్త సంస్కారం. సంగీతమూ అంతే! అది తనకై తను, తన భర్త కోసమూ పాడుకోగలిగితే చాలు. మనం రేడియోలు టేప్ రికార్డర్లు ఎందుకు వింటున్నాం? కాస్త రిలాక్సేషన్ కోసం, అవునా?""     ""అయితే ?""     ""శాస్త్రీయ సంగీతం అంతకంటే హాయినిస్తుంది. మానసిక శాంతినిస్తుంది. మనస్సులోని టెన్షన్ ని తగ్గిస్తుంది. లలితకళలు మామూలు మనిషిని మహోన్నత స్థాయికి తీసుకెళతాయి. మానసికంగా ఎదుగుదల చూపుతాయి.""     ఆమె మాటలకు అడొచ్చింది సావిత్రి.     ""నా కూతురు మహోన్నత స్థాయి చేరుకోనక్కర లేదు. ఎంత చదువుకొన్నా ఆడదాని స్థానం వంటిల్లే. నీలాంటి అదృష్టం అందరికీ రావద్దూ?""     ""అదికాదక్కయ్యా ?""     ""బట్టలుతుక్కొని, నీళ్ళు తోడుకొని, అంట్లు తోముకోవటానికి సంగీతమూ సింగినాథమూనూ.""     రైలుపట్టాలు కలియవు. ఉత్తరదక్షిణ ధృవాలు కలుసుకోవు అనుకుంది వారుణి. అయినా సావిత్రి పట్టుదల రెట్టింపు తనకూ వుందనుకొంది.     ""అక్కయ్యా!""     ""మాటిమాటికి అక్కయ్యా అంటావేమిటి ? నేన్నీకంటే ఎన్నేళ్ళో పెద్దనుకుంటున్నావ్. పదా, యిరవయ్యా? ఇద్దరిదీ దాదాపు ఒకటే వయసు. కాదంటే నాకు పద్దెనిమిదేళ్ళకే పెళ్ళయింది. నీకు పాతికేళ్ళు వచ్చేదాక కాలేదు. నాకు ఏడాది తిరక్కుండానే కూతురు పుట్టింది."" విసురుగా అంది సావిత్రి." 43,"    సరిగ్గా రెండు నిమిషాల క్రితం మధురిమను కాశీచరణ్ అక్కున చేర్చుకుని పెదవుల మీద ముద్దుపెట్టుకుంటున్న సమయంలో...     తను కాశీచరణ్ ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి అక్కడకు వచ్చిన కల్యాణి...     చెట్ల చాటునుండి వాళ్ళ మాటల్ని విని, గుండెల్లోకి బాకు దిగుతునట్టుగా బాధపడింది.     కాశీచరణ్, మధురిమను ముద్దుపెట్టుకుంటున్న దృశ్యాన్ని చూసి,దారంతా వెళ్తూ కుమిలి కుమిలి ఏడ్చింది. సరిగ్గా నలభై నిమిషాల తర్వాత చాలా విషయాల గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత చెయీ, చేయీ కలుపుకుని కొండ చివరివరకూ వచ్చాక మెట్లెక్కుతున్న సమయంలో మధురిమ చేతిని వదిలేశాడు కాశీచరణ్.     ""వారం రోజుల తర్వాత మీరు మామూలు మనిషయ్యాక నేనే మా అక్కతో మన విషయం చెప్తాను"" నవ్వుతూ అంది మధురిమ చిన్నగా.     ""మీ యిష్టం"" అన్నాడు చరణ్ ఆనందంగా.     ""ఇక్కడెవరూ లేరుగా.... నువ్వు అని అనోచ్చు ..."" అంది మధురిమ.     ""అలవాటు కావడానికి కొంత టై మ్ పడుతుంది డాక్టర్ గారూ "" నవ్వూతూ అన్నాడు కాశీచరణ్        ""ఎటేల్లిపోయారు మీరు? మీ కోసం కళ్యాణి వెతికి వెతికి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని ఇప్పుడే వచ్చి కూర్చుంది"" దగ్గరగా వచ్చిన మధురిమ వైపు చూస్తూ అంది ప్రమద్వర.     ""కొండమీదున్నా వాగు దగ్గరకెళ్ళాం"" అంది మధురిమ.     ""సినిమా పోగ్రాం వుందికదా... కల్యాణి ఇందాకట్నుంఛీ తెగవర్రి అయిపోతుంది"" శ్రీగారు అన్నాడు.     పావుగంట తర్వాత అందరూ మెట్లు డిగి జెపు దగ్గరకొచ్చారు. జీఫ్ స్టార్ట్ య్యింది.     ఎవరితో మాట్లాడకుండా మ్ముఖభావంగా కూర్చుంది కల్యాణి. ఆమెకు ఎదురు సీట్లో కాశేచరణ్, మధురిమ పక్కపక్కనే కూర్చోవడంతో చూపుల్ని రోడ్డువైపు మరల్చింది కల్యాణి.     ""అట్నుంచి వచ్చినప్పుడు అంతగా అల్లరి చేశావ్. ఇప్పుడేమిటి మౌనవ్రతం పట్టినదానిలా అయిపోయావ్?"" శ్రీగారు అడిగారు.     ""ఏంలేదు... తలనొప్పిగా వుంది"" అంది కల్యాణి.     ""నీకు తలనొప్పా.... రాగూడదే! వస్తే గిస్తే నీ మూలంగా ఇతరులకు రవళిగానీ, నీకు రావటమేమిటి?"" అన్నారు శ్రీగారు తన సహజధోరణిలో.     అయిన మాట్లాడలేదు కల్యాణి.     ""తలనొప్పి తల వున్నవాళ్ళకు రావలిగానీ లేనివాళ్ళకు వస్తుందా?"" తిరిగి అన్నారు శ్రీగారు.     మదురిమ నవ్వింది తండ్రి మాటలకు. అప్పటికే కళ్యాణి హృదయం భగ్గుమని మండిపోతొంది.     జీపు రాజమండ్రి పొలిమేరల్లోకివచ్చాక అంది కల్యాణి ""డ్రైవర్! నమ్మిశ్రమగూడెం వెళ్ళిపోదాం... సినిమా థియేటర్ కి వద్దు.""     ""ఏం?"" అడిగింది ప్రమద్వర ఆశ్చర్యపోతూ.     ""ఎందుకో సినిమా చూసే మూడ్ లేదు మమ్మీ.""     అందరూ కల్యాణి వైపే చోశారు విస్మయంగా.     కల్యాణి తల దించుకుని కూర్చుంది.     ""సడన్ గా మూడ్ పోయిందంటే అదో అయివుంటుంది"" అన్నారు శ్రీగారు.     ""ఏం కాలేదు తాతయ్యా! నువ్వు జోక్స్ వేస్తె నేను జీపు దిగిపోతా"" కళ్యాణి కోపంగా అనడంతో జీపులో గంభీర్యమైన వాతావరణం ఏర్పడింది.                               *    *    *    *        మర్నాడు ఉదయాన్నే మధురిమ హైదరాబాద్ వెళ్లేందుకు సిద్దమైంది.     ""అక్కా! జాగ్రత్త... కాశీచరణ్ జాగ్రత్తగా చూస్కో, ప్రతి రోజూ నీకు పొన్ చేస్తా"" అంది మధురిమ తన వస్తువేదో అక్కడ వదలిపోతున్నంట బాధగా.     ""ఇవాళనుంచి అతని రూమ్ లోనే మీ బావగారిక్కూడా మంచం వేస్తా. అతనిలో ఏ రకమైన మార్పు కనిపించినా నీకు వెంటనే ఫోన్ చేస్తా. సరేనా?"" మధురిమతోపాటు గుమ్మం వరకూ వస్తూ అంది ప్రమద్వర.     ""వస్తా కాశీచరణ్, శ్రీగారు, రాములు అందరూ వీడ్కోలు పలికారు_ ఒక్క కల్యాణి తప్ప.     ఆ రోజు ఉదయం తప్ప.     ఆ రోజు ఉదయం నుంచి కల్యాణి కలివిడిగా లేకపోవడం, రూమ్ లోనే ఎక్కువసేపు గడపడం వెనుక కారణం ఏమై వుంటుందో విశ్లేషించడానికి ప్రయత్నింస్తోంది ప్రమద్వర. మధురిమ వెళ్ళిపోయాక నేరుగా కళ్యాణి రూమ్ కొచ్చింది ఆమె.     ""ఎంటమ్మా అలగున్నావ్?"" నిర్లిప్తంగా మ్యాగజైన్ చూస్తున్నా కళ్యాణి ని అడిగింది ప్రమద్వర.     ""ఏం లేదు....తలనొప్పి"" అంది కల్యాణి ముభావంగా.     ""మధురిమ నిన్ను కొండమీదుకు తీసికెళ్ళలేదనేకదా నీకోపం? చిన్నపిల్లల్లా ఎవరైనా అలుగుతారా? అంతమాత్రంచేత పిన్నితో మాట్ల్దాడడం మానేస్తారా?"" నవ్వుతూ అంది ప్రమద్వర.     ""నేనేం అలగలేదు"" అంది కళ్యాణి అసహనంగా.                                                           *    *    *    *              రెస్టారేంట్లో కూల్ డ్రింక్ఆర్డర్ చేసి ""ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో"" అని అడిగాడు రణదీఫ్.     ""చాల జరిగాయి... చాలా జరగబోతున్నాయి. మధురిమ హైదరాబాదు నుంచి స్పెషలిస్టు ను తీసుకొచ్చిందట. కాశీచరణ్ కి టెస్టులు చేశారట. వారం రోజుల్లో మామూలు మనిషైపోతాడా?!""" 44,"                                                       అయిదవ ఖండము     ఋషులు :- 1,4. శ్రుత కక్షి 2. వసిష్ఠుడు. 3. మేధాతిథి 5. ఇరిమిఠి. 6,10 మధుచ్చందుడు. 7. త్రిశోక కణ్వుడు. 8. కుసీదుడు. 9. శునశ్శేపుడు.     1.    ఇంద్రుడు శత్రు తిరస్కర్త శతక్రతు నరులకు ధనదాత. సోమపాయి. ఋత్విజులారా! అట్టి ఇంద్రుని విశేషముగ స్తుతించండి.     2.    మిత్రులారా! హర్యశ్వుడు, సోమపాయి అగు ఇంద్రుని ప్రసన్నుని చేయు స్తోత్రములను గొప్పగా గానము చేయండి - ""ప్రగాయత""     3.    ఇంద్రా! మేము నీ మిత్రులము. నీకు అంతేవాసులము కాదలచి నిన్ను మాత్రమే స్తుతించుచున్నాము. కణ్వగోత్రజులు సహితము నిన్నే నుతింతురు.     4.    ఇంద్రుడు ప్రసన్నస్వభావి. అతని కొరకు అభిషుత సోమమును, మా స్తుతులను సమర్పించుచున్నాము. తదుపరి స్తోతలు సోమమును పూజించుచున్నారు.     5.    ఇంద్రదేవా! నీ కొరకు సోమము సిద్దమైనది. పవిత్ర కుశలపై ఉంచబడినది. రమ్ము. అచటికి చేరుము. సోమపానము చేయుము.     6.    ఇంద్రుడు చక్కని రూపము వాడు. చక్కని పనుల వాడు. పాలు పితుకుటకని గోవును పిలుతుము కదా! అట్లే రక్షించుమని ఇంద్రుని నిత్యము ఆహ్వానించుచున్నాము.     7.    వరదా! ఇంద్రా! సోమము అభిషుత మైనది. విచ్చేయుము. సేవించుము. ఆనందించుము.     8.    ఇంద్రా! నీవు ఈశ్వరుడవు. సోమము సిద్దమైనది. చమస, గ్రహ పాత్రలందు నింపి ఉంచినాను. దానిని నీవు తప్పక సేవించుము.     9.    ప్రతి ఆరంభమునకు, ప్రతి యుద్దమునకు బలశాలియగు ఇంద్రుని మమ్ము రక్షించు మని మిత్రులముగా ఆహ్వానించుచున్నాము.     10.    స్తోతలగు ఋత్విజులారా! రండి రండి. త్వరగా రండి. కూర్చోండి. ఇంద్రుని గొప్పగా స్తుతించండి.                                                  ఆరవ ఖండము     ఋషులు :- 1. విశ్వామిత్రుడు. 2. మధుచ్చందుడు. 3. కుసీదుడు 4. ప్రియమేధ 5,8. వామదేవుడు 6,9. శ్రుత కక్షి 7. మేధాతిథి 10. బిందుఋషి.     1.    ఇంద్రా! నీవు ధనస్వామివి. స్తుతి యోగ్యుడవు. బలశాలివి. బలమున పిండిన సోమమును వెంటనే పానము చేయుము.     3.    ఇంద్రుడు మావాడు. అతడు బలవంతుడు. గుణవంతుడు. వజ్రవంతుడు. అతనికి మహిమలు కలుగును గాత. అతని ద్యులోక సేవ ప్రసిద్దమగును గాక     4.    గోపతి, యజ్ఞపుత్రుడు, పరిపాలకుడగు ఇంద్రుని అతనికి తెలియనట్లుగా గొప్పగా స్తుతించండి.     5.    ఇంద్రుడు నిత్యము వర్ధిల్లువాడు. విచిత్ర గుణవంతడు. మిత్రుడు అతడు ప్రత్యక్షమగుటకు ఎట్టి కర్మలు ఆచరించవలెను? ఏ రీతిగా ప్రవర్తిల్లవలెను?     6.    స్తోతలారా! ఎందరినో లెక్కచేయని వాడు, సకల స్తుతులందు వ్యాపించి ఉన్నవాడగు ఇంద్రుని మమ్ము రక్షించుటకు మాకు అభిముఖునిగ పంపండి.     7.    మేధావి, అద్భుతుడగు ఇంద్రునాకు ప్రీతిపాత్రుడు, ఇంద్రుని అభిలషించు వాడగు సదసత్పతి దేవతను చేరుకున్నాను.     8.    ఇంద్రా! ద్యులోకపు దిగువున ఉన్న దారులను తెలిసికొన్నాను. ఆ దారుల సకల లోకములను చేరుకున్నాను. ఆ మార్గమును, మేము ఉన్న చోటును యజమానులు తెలిసి కొందురు గాక.     9.    ఇంద్రదేవా! శతక్రతూ! మాకు శుభములు, శుభములే కలిగించుము. బలము కలిగించు అన్నము ప్రసాదించుము. మాకు సుఖముల నిచ్చు ధనము నిమ్ము.     10.    ఇది సోమము. దీనిని మేము సంస్కరించినాము. దీనిని స్వయంప్రకాశకులగు మరుత్తులు ప్రాతః కాలమున సేవింతురు. అశ్వినులు సహితము అప్పుడే సేవింతురు.                                                ఏడవ ఖండము ఋషులు :- 1. ఇంద్రమాతలు దేవజామయ ఋషికలు 2. గోధుడు. 3. దధ్యంగుడు. 4. ప్రస్కణ్వుడు. 5. గోతముడు. 6. మధుచ్చందుడు. 7. వామదేవుడు. 8. వత్సుడు. 9. శునశ్శేపుడు. 10. వాతాయనుడు.     1.    ఇంద్రుని స్తుతించు వారును, తమ కర్మఫలమును కోరువారును అగు ఇంద్రమాతలు ప్రత్యక్షమైనారు. వారు ఇంద్రుని ఉపాసింతురు. శౌర్య ధనమును పొందుదురు.     2.    దేవతలారా! మీకు మేము ఎటువంటి హానియు తలపెట్టము. అతిగా పొగడి విసిగించము. మంత్రములందు ఉన్నట్లే కీర్తింతుము. కర్మలను ఆచరింతుము. 3.    బృహద్గాయకుల వలనను, వెలుగు నడకల దధ్యంగ అధర్వణఋషి వలనను లోపము జరిగి ఉండవచ్చును. వాని నివారణార్ధము సవితా దేవుని స్తుతించుచున్నాము.     4.    ఈమె ఉష. అందరిని అలరించునది. రాత్రులందు కనిపించినది. ఆమె దివి నుండి దిగి వచ్చినది. చీకట్లను తరిమినది. అశ్వినులారా! మిమ్ము మరింత స్తుతించుచున్నాను.     5.    ఇంద్రుడు ఎదురు లేని వాడు. అతడు దధీచి వెన్నెముకతో అనేకమంది వృత్రులను వధించినాడు.     6.    ఇంద్రా! ఈ కర్మకు విచ్చేయుము. సమస్త సోమములను సేవించుము. అన్నములను ఆరగించుము. ఆ బలముచే శత్రువులను తిరస్కరించుము.     7.    వృత్రహంత ఇంద్రా! వడివడిగా మావద్దకు రమ్ము. మహా బలశాలుడవు అగుము. మాకు రక్షణ కలిగించుము.     8.    ఇంద్రుని బలము ప్రఖ్యాతము. అతడు తేజస్వి. ఇంద్రుడు తోలు తిత్తిని వలె ద్యావాపృథ్వులను తనచేత పట్టినాడు.     9.    ఇంద్రా! ఇదిగో సోమము. ఇది నీ కొరకు సిద్దమైనది. కపోతము గర్భము ధరించు కపోతిని కలుసు కొనునట్లు ఆ సోమమును, మా స్తుతులను కలసి కొనుము.     10.    వాయువు మాకు రోగశాంతి కలిగించునట్టియు, సుఖములు ప్రసాదించునట్టి ఓషధులను ప్రసాదించును గాత. మా ఆయుష్యములను పొడిగించును గాక.                                                    ఎనిమిదవ ఖండము         ఋషులు :- 1. కణ్వుడు. 2,3,9 వత్సుడు. 4. శ్రుత కక్షి 5. మధుచ్చందుడు. 6. వామదేవుడు 7. ఇరిమిఠి 8. సత్య ధృతి.     1.    జ్ఞానియగు వరుణుడు, మిత్రుడు, ఆర్యమ రక్షణలుకల వానిని ఎంతటి వాడును హింసించజాలడు.     2.    ఇంద్రదేవా! నీవు ఇంతకు ముందు వలెనే మాకు గోవులను ఇచ్చుటకు, అశ్వములను ఇచ్చుటకు, రథములు ఇచ్చుటకు, కీర్తి కరమగు ధనము ఇచ్చుటకు విచ్చేయుము.     3.    ఇంద్రా! గోవులు నీకు సంబంధించినవి. యజ్ఞమును వర్ధిల్లచేయునవి. అవి పాలను చుక్కలుగా రాల్చుచు ధారలుగా ఈ బిందెను నింపును.     4.    ఇంద్రదేవా! నీ పేర్లు అనేకములు. నిన్ను స్తుతించువారు అనేకులు. నీవు మేము చేఇస్న ప్రతి సోమయాగమునకు వచ్చినావు కదా! అప్పుడు మేము గోవులను ఇమ్మని కోరినాము.    5.    సరస్వతి పావక. అన్నదాయక శక్తి. ధనదాత్రి. ఆ తల్లి అన్న సహితమై మా యజ్ఞములకు విచ్చేయును గాత.     6.    ఏ మానవుడు ఈ ఇంద్రుని సంతృప్తుని చేయగలడు? అట్టి ఇంద్రుడు మా యజ్ఞమున సంతృప్తుడు అగును గాత. మాకు ధనములను అందించును గాక.     7.    ఇంద్రా! రమ్ము రారమ్ము నీ కొరకు సోమమును అభిషనించినాము. నీ కొరకు కుశాసనము పరచినాము. ఆసీనుడవగుము. సోమపానము చేయుము.     8.    మిత్రుడు, వరుణుడు, ఆర్యమ ఈ ముగ్గురి రక్షణలు ఎదురు లేనివి. మాకు వారి రక్షణలు లభించును గాక.     9.    బహు ధనవంత, కర్మప్రేరక, హర్యశ్వవంత ఇంద్రా! మేము నీ వారలము అగుదుము గాక.                                                  తొమ్మిదవ ఖండము     ఋషులు :- 1. ప్రగాథుడు. 2. విశ్వామిత్రుడు. 3,10. వామదేవుడు. 4,6. శ్రుతకక్షి. 5. మధుచ్చంధుడు. 7. గృత్సమదుడు. 8,9 భరద్వాజుడు.     1.    ఇంద్రా! సోమము నీకు మహదానందము కలిగించును గాక. వజ్రధరా! మాకు ధనము లను ప్రసాదించుము. బ్రహ్మ ద్వేషులను హతమార్చుము.     2.    ఇంద్రా! నీవు స్తవనీయుడవు. మేము సమకూర్చిన సోమమును సేవింపుము. నీవు మాదక సోమధారలచే తడుపబడువాడవు కదా! నీవు శుద్ది చేసిన అన్నమే మమ్ము చేరుచున్నది.     3.    ఋత్విగ్యజమానులారా! ఇంద్రుడు సర్వదా మీ వద్ద ఉండును. మీచే యజ్ఞకర్మలు చేయించును. మేము అర్చించు ఇంద్రుడు దేవతలందు శూరుడు అగుచున్నాడు." 45,"     ""ఇక నీకు నచ్చే చీరలే వుండవా? వచ్చేనెల నేను తీసుకులస్తాను చీర! పుష్ప ముఖంలో మళ్ళీ ఆశ తలెత్తింది! ""ఆవిడ ఇప్పుడే డబ్బివ్వక్కర్లేదు, ఉన్నప్పుడు ఇమ్మంది.""     ""పుష్పా! నువ్వునాతో కాపురం చేయబట్టి ఇన్ని రోజులైంది! నన్ను అర్దంచేసుకోలేదా? చేసుకొన్నా నాకు అనుకూలంగా నడుచుకోవడం ఇష్టంలేదా?"" సీరియస్ గా అడిగాడు. ""అరువు బేరాలు, అడుక్కుతినడాలు నాకు సరిపడవు! ఈ చీరధర ఏ నూటయాభై రూపాయలో వుంటుంది! నా జీవితం సగం నీ చీరకు  పెడితే ఆ నెల మనం ఏం తింటాం?""     ""ఈ అజ్ఞాతవాసం ఈ దరిద్రపు బ్రతుకూ ఎన్నాళ్లు?""భగ్గుమంటున్నట్టుగా అడిగింది.     ""నీతో నేను కలసి జీవించినన్నాళ్లు!""     ""అంటే ఏమిటి దీనర్దం? వుంచుకున్న దానితో మాట్లిడినట్టు మాట్లాడుతున్నారే?""     ""నిన్ను నేను నిజంగా వుంచుకోదలిస్తే కన్నవాళ్లని ఎదిరించాల్సిన అవసరం వుండేదికాదు. ఈ చిన్న వుద్యోగం చూచుకొని ఇలా వచ్చేసే అవసరం వుండేదికాదు. నా పెద్దలు సంపాదించిన ఆస్తి రాసులకొద్దీ మూలుగుతూంది.  అందులో ఏ కాస్త విదిలించినా నీలాంటి వెయ్యిమందిని వుంచుకోగలను?"" కోపాన్ని నిగ్రహించుకొంటూ, మళ్లీ అన్నాడు. ""ప్లీజ్! అనవసరంగా నిప్పువేసి మనమధ్య చిచ్చు రగిలించకు!""     ""నీలాంటి వెయ్యిమందిని వుంచుకోగలను!""     ""అంటే డబ్బు పారేస్తే చాలు, తన ఉంపుడుగత్తెగా వుండే రకమనా అర్దం?"" నల్లబడిపోయింది పుష్ప ముఖం.     పెళ్లిలో ఒకే ఒక్క చీర తెచ్చాడు రజనీ. పెళ్లయ్యి కాపురం పెట్టిన ఇన్ని రోజుల్లో ఒకచీర కాదు. జాకెట్ గుడ్డ కూడా కొనలేదు. పెళ్ళికి తండ్రి తీసుకొన్న నాలుగుచీరలు పాతబడి పోతున్నాయి. పెట్టెలో ఒక్కచీరకూడా లేదు. కనీసం ఒక చీరకోరినా,  ఒక సినిమాకు తీసికెళ్లమని కోరినా అది వుంపుడుగత్తెలు కోరే కోరికల్లా కనిపిస్తాయా ఈయనకు?   ఈ భాగ్యానికేనా ఈయన తనని ప్రేమించి పెళ్లి చేసుకొంది? - పుష్పకి దుఃఖం కోపం రెండూ పోటీపడి వచ్చేస్తున్నాయి.     చీరమడత పెట్టి రుక్మిణమ్మకొడుకుని బయటినుండే పిలిచి ఇచ్చేసి ముసుగుదన్ని పడుకొంది పుష్ప.       ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం అలుముకొంది.     పుష్ప అలా ముడుచుకు పడుకుంటే రజనీకి ఎలాగో వుంది.     పుష్పకి కోపం తెప్పించకూడదనుకొంటే పుష్పకోరిక లెన్నని తీర్చగలడు?ఈ రోజు నూట యాభైరూపాయల చీరకొనమంటుంది. రేపు మరొకటి... మరొకటి.... ఆమెకి పుట్టే కోరికలు  తీర్చడానికి తనకి పెద్ద జీతం లేదు. అలాగని భార్యకి చీరలు తేకుండా వుంచుతాడా?  వసతి కొద్దీ ఒక్కొక్కటీ తెస్తాడు!  ఆ మాత్రం అర్దం చేసుకోదేం పుష్ప తనను?ఆమె తనను అర్దం చేసుకొని తనతో సహకరిస్తే కదా ఈ సంసారాన్ని శాంతివంతంగా తీర్చిదిద్దగలిగేది?     పుష్పకి తను శాంతంగా నచ్చజెప్పాల్సింది అంత పరుషంగా మాట్లాడి నొప్పించాల్సింది కాదేమో!     ""పుష్పా!"" మృదువుగా ఆమెమీద చెయ్యి వేశాడు. ""నువ్విలా కోపం తెచ్చుకుంటే నాకెలాగో వుంది. నీకు చీరలు కావాలని నాకు తెలియదా? కొద్దిగా ఓపిక పట్టు. సంసారానికి అవసరమైన సామాను కొనడంతోనే సరిపోతుంది నా జీతం! ఇప్పుడంత అర్జంటుగా కావలసిన సామానులేదు. వచ్చే నెల నీకొక చీర తీసుకొంటాను. కాని, ఇంతింత డబ్బు పెట్టి  చీరలు తీసుకోగల తాహతు నాకులేదు పరిగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్లు తాగాలన్నది నా అభిమతం. నాకీ బడిపంతులు ఉద్యోగం ప్రశాంతంగా, నేను చదివిన చదువు  కాక అర్దం ఇచ్చేదిగా వుంది. కాబట్టి తక్కువ జీతమైనా ఈ ఉద్యోగమే  చేస్ాతను. ఈ ఉద్యోగంలో వుండి రెండు చేతులా సంపాదించడం అసంభవం కాబట్టి నీకు అలాంటి ఆశలు చెప్పలేను. సంతృప్తి ఎక్కడిది పుష్ప? అది మనం తెచ్చుకోవడంలో వుంది!""     ""నిజమే! సంతృప్తి ఎక్కడికి? మానం చాటు చేసుకోవడానికి ఏ గోసెపాతరో, ఏ చిన్న గోచిగుడ్డో సరిపోతుంది! మూణ్నాళ్ల ముచ్చట ఈ దేహం! దీనికెందుకీ సింగారాలన్నీ?'     ""వికటంగా మాట్లాడుతున్నావు!అలా వికటంగా మాట్లాడితే ఏం చెప్పేది?""     ""ఏం చెప్పక్కరలేదు! నన్ను మా  పుట్టింటికి పంపేయండి! మీ చిన్న జీవితానికి నేనెందుకు గుదిబండలా?""     ""నిన్ను పుట్టింటికి  పంపేసి నేను సన్యాసుల్లో కలసి పోనా!"" కొంటెగా నవ్వి ఆమె బుగ్గ గిల్లాడు ! చూడు! నువ్విలా పడుకుంటే నాకేం తోచడంలేదు. లే! టీ తాగాక అలా ఊరవతలకి షైర్ వెడదాం""     ""అదే సినిమా అనుకోమంటారు! అదే స్వర్గ విహారమనుకోమంటారు. అనుకోవడంలో వుందంతా అంటారు.""     ""కరెక్టు. ఆ మాత్రం అర్దం చేసుకొన్నావా నేను ధన్యుడిని అవుతాను. నవ్వినవాళ్ల ముందు నవ్వుల పాలు కాకుండా మర్యాదగా కాపురం చేసుకొంటాం. తల్లిదండ్రులను ఎదిరించి, కులాలు విడిచి ఏం బావుకొన్నారు? అని వెటకారం చేసే అవకాశం ఇవ్వకూడదు ఎవరికీ.""     ""అబ్బ! మీ నీతులు విని విని బోర్ కొడుతూంది?"" విసురుగా మరో ప్రక్కకి తిరిగింది పుష్ప.      ""నా చేతగానితనంలో నీ మనసు నొప్పించాను. క్షమించు పుష్పా! క్షమించమన్నాగా! ఇకలే! ఈ సాయంకాలాన్ని మనం అందంగా మలుచుకుందాం. లేచి ముఖం కడుక్కురా! ఈలోగా నేను టీ పెడతాను.""  పుష్పని బలవంతంగా లేపి పెరట్లోకి పంపించి రజనీ వంటింటివేపు బయల్దేరాడు.     మరునాడు రజనీ బడికివెళ్లాక ఇంటికి తాళం పెట్టి ఎదురింటికి వెళ్లింది పుష్ప రుక్మిణమ్మ లోపలెక్కడో వున్నట్టుంది. పిలుద్దామనుకొనేంతలో వెనుక ఎవరో గొంతు వినిపించింది.     ""నిన్న చీర వాపస్ చేశావేం?""     ఉలికిపడ్డట్టుగా వెనుదిరిగి చూసింది పుష్ప. ద్వారబంధాలమీద చేతులు వేసి గుమ్మం మధ్యగా నిలబడి వున్నాడు వెంగల్ రెడ్డి. అతడు పట్టిపట్టి తనని ఎంత చూసినా మాట్లాడడం మాత్రం ఇదే మొదలు. జవాబు ఏం చెప్పాలో  తోచనట్టుగా కళ్లు దించుకుంది.     ""మీ ఆయన వద్దన్నాడా?""     ""ఉహుఁ""     ""మరి?""     ""ఇప్పుడు అవసరంలేదు. పండక్కి ఆయన కొంటానన్నారు.""     ""నువ్వేమనుకోనంటే అసలు నిజం చెప్పనా?""     పుష్పగుండె దడదడలాడుతూంటే అతడికేసి  ప్రశ్నార్దకంగా చూసింది.     ""మొన్న సిటీకి వెళ్ళినప్పుడు సూట్ బట్టలకని వెళ్లాను. షాపులో ఆ చీర షోకేస్  బొమ్మకి కట్టించారు ఆ చీరలో నువ్వు ఆ బొమ్మకంటే అందంగా వుంటావనిపించింది. చప్పున కొనేశాను.""     ఆ మాటల్లో అతడు తీసుకొంటున్న చనువు, అతడు తనమీద ఏర్పరచుకొన్న అభిప్రాయం వెల్లడి అవుతూంటే మండిపోవాల్సింది పుష్ప. కాని, అలా జరగలేదు రజనీ సాహచర్యంలో అణచివేయబడుతున్న కోరికలకు అతడు ప్రాణం పోస్తున్నట్టుగా అనిపించింది. అతడు తనమీద చూపుతున్న శ్రద్దకు ఆమె కృతజ్ఞతగా చూసింది.     "".........""     ""మాటలు రావా?""     ""వచ్చావా, పుష్పవల్లీ?"" అంటూ లోపలినుండి వచ్చిన రుక్మిణమ్మ ఇందాకా వెంగల్ వేసిన  ప్రస్నే వేసింది. ""చీరను తీసుకొంటావనుకొన్నాను. ఎందుకు వాపస్ చేశావ్?""     తల్లి వచ్చినా వెంగల్ అక్కడినుండి కదలలేదు. వాళ్ల సంభాషణలో పాలు పంచుకోవాలన్నట్టుగా అక్కడే నిలబడ్డాడు.     ""మా ఆయనకి అంతంత ఖరీదుచేసే బట్టలు తీసుకోవడం ఇష్టంలేదు. తన జీతం చిన్నదట...."" కళ్లు చెమ్మగిల్లగా, కడుపులో బాధ చెప్పుకొన్నట్టుగా అంది.     ""నేను ఒక్కసారే డబ్బిమ్మిమనలేదుగా? వీలున్నట్టు... ""అసలు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఆ చీర తీసికెళ్లు పుష్పా, నేనది తెచ్చిందే నీకోసం."" తనమనసు దాచుకోలేనట్టుగా అన్నాడు వెంగల్. తల్లిముందు బయటపడిపోవడానికి అతడు సంకోచించలేదంటే వెంగల్ ఆంతర్యం ఆ తల్లికి తెలిసేవుండాలి. ఆమె వెంగల్ ని ప్రోత్సహిస్తున్నట్టా?     పుష్ప ఆలోచనలకు అంతరాయం కలగజేస్తూ అంది రుక్మిణమ్మ. ""పంతులుగారు ఏం మనిషో నాకు అర్దంకాదు. అసలు ఈ కాలంలో పుట్టాల్సినవాడు కాదు, మా చిన్నాడికి ట్యూషన్ చెప్పమంటే, ""ఫీజు వద్దు, ఊరికే కాస్సేపు చెప్పమంటే చెబుతాను"" అన్నాడట. తోటలో కాసిన కాయో, కూరోపంపితే  తీసుకోడు. పాలు, పెరుగు అసలే తీసుకోడు! ఇదేం మనిషో అనుకొంటాడు. ఈ కాలంలో మరీ ఇంత సత్యవ్రతం  పనికిరాదు.""     "" అభిమానం కాబోలు!"" వెంగల్ వెటకారంగా అన్నాడు.     ""జీపు తీసుకొని రేపు మేం సినిమాకు వెడుతున్నాం. పంతులుగారు నిన్ను  పంపిస్తారా లేదా? ఇదివరలో ఓసారి పిలిస్తే రానన్నావు.""     ఆయన వద్దన్నాడని  చెప్పలేక తనకే ఇష్టం లేనట్టుగా చెప్పింది. ఆయన తీసికెళ్లడు. తనని ఒకరితో పంపడు. ఏం చెయ్యాలి? ఎంతసేపూ ఆయన్ని అర్దం చేసుకోమంటాడు తప్ప తనని, తన ఆశల్నీ అర్దం చేసుకోడెందుకని?     ""పుష్పవల్లీ! నువ్వీమధ్య సంతోషంగా  వుండడంలేదెందుకని?"" కుతూహలంగా అడిగింది రుక్మిణమ్మ.      ""మరలా అడిగితే నాకు ఏడుపువస్తుంది. ఏం చేస్తాను? చేసుకొన్నది అనుభవిస్తున్నాను."" డగ్గుత్తికతో అంది పుష్ప.     ""పంతులుగారొచ్చారు! పిలుస్తున్నారు"" అంటూ కబురు రాకపోతే కడుపులో బాధంతా కక్కివేసేదేమో పుష్ప.                       *    *    *    *" 46,"        ""అంటే అప్పటికే నీ బుర్రని పురుగులు తొలుస్తూ  వుండాలి. సరస్వతి ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకొని వుండాలి."" అంది ఉక్రోషంగా.     ""న్నో న్నో న్నో"" అరిచాడు.     "" అరవకు పరుశురాం. ఇది రోడ్డు. లేకపోతే నేను సీషోర్ కివెళ్దాం రమ్మని అడిగితే మీ మామయ్య ఏదో పని చెప్పాడని నాతో అబద్ధం చెప్పవలసిన అవసరం నీకు  లేదు.""     పరశురాం దోషిలా తల దించుకున్నాడు.     ""సరస్వతి పుస్తకం కావాలని  అడిగింది.సాయంత్రం ఇంటికి తెచ్చి స్తానని చెప్పాను. అందుకని వెళ్ళాను.""     అనూష నవ్వింది. ఆ నవ్వులో అతనంటే ఎక్కడలేని అసహ్యం కనిపించింది.     ""మామయ్య చెప్పిన పని మానేసి సరస్వతి ఇంటికి వెళ్ళానంటావు?""     ""సరస్వతి ఇంటికి వెళుతున్నానని  చెపితే నీకు కోపం వస్తుందని నీకలా చెప్పాను"" మెల్లగా అన్నాడు.     ""నువ్వు కల్పనవెంత  రంగు పులుముతున్నావో అర్థం అవుతోంది. రామ్. తోటి క్లాస్ మేట్ ఇంటికి నువ్వెళ్లితే  నేను ఎందుకు వద్దంటాను. ఆ విషయాన్ని దాయడంలోనే నీ ప్లాన్ అర్థం అవుతోంది నాకు.""     ""అనూ!"" పిచ్చిగా అరవాలనిపించిందతనికి.     ""అవును రామ్! పుస్తకం కావాలని ఆమె అడిగితే ఇచ్చి రావడానికి ఎంత సేపు పడుతుంది. నీకు నిజంగా  ఏ విధమైన దుర్భుద్ధి లేకపోతే పుస్తకం ఇచ్చి వెంటనే దగ్గరను వచ్చేవాడివి. నాకు వేరే ఏదో పనుందనీ రానని చెప్పడం చూస్తే జరిగింది యదార్థం అని నేను నమ్మడంలో తప్పులేదు కదూ!""     ""నీకెలా చెబితే నమ్ముతావో తెలీడంలేదు  అనూ!     నన్ను సరస్వతి ప్రాక్టికల్ నోట్స్ అడిగిన మాట నిజం. నా దగ్గర లేదని చెబితే సాయంత్రం ఇంటికి తెచ్చివ్వమని అడిగింది. టీకి ఇన్త్వైట్ చేసింది. అక్కడికి వెళ్ళాక ఆలస్యం అవుతుందనే నీకు అలా చెప్పాను"" అన్నాడు పరుశురాం.     అనూష పెదవులపై విషాదమైన నవ్వు కదిలింది.     ""తప్పుని కప్పిపుచ్చుకోవడానికి  ఎంత సిల్లీగా కథ అల్లుతున్నావో తెలుసా రామ్!""     ఎక్కడలేని విరక్తి ఆమె మాటల్లో ధ్వనించింది.     ""నువ్వే నన్ను మోసం చేస్తే నేనింకెవర్ని నమ్మను?""     అనే వైరాగ్యం ఆమెలో కనిపిస్తోంది.     పరుశురాంకి తన పరిస్థితి ఏమిటో పూర్తిగా అర్థం అయ్యింది.     ప్రియురాలినే కన్విన్స్ చేయలేని తను న్యాయస్థానం ఎదుట తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలడా?     ఆమె అంతరాంతరాల్లో ఇప్పుడు తనకి గల స్థానం ఏమిటో తెలుసుకున్నాడు.      ద్వేషిస్తే పరవాలేదు.      కానీ అసహ్యించుకుంటేనే భరించలేడు.     తనని అరెస్ట్ చేశారని తెలసేక కాలేజీ నుంచి ఏ ఒక్క స్నేహితుడు వచ్చి పలకరించలేదు. ఆఖరికి మేనమామ కూడా రాలేదు. తనని విడిపించుకెళ్ళవలసి రక్త సంబంధీకుడు ఆయనే వదులుకున్నాడు.      అనూష వచ్చిందని  సంతోషించాడేగానీ ఆమె మనసులో తను దోషి గానే మిగిలాడు. అయితే అతనికి ఒక్కటే అర్థం కాలేదు.     ఆమె తనని బెయిల్ పైన ఎందుకు విడుదల చేయించినట్టు?     ""నువ్వు నాకు బెయిల్ ఇవ్వకుండా వుండాల్సింది అనూ!"" లేకపోతే పోలీసు దెబ్బల్తో చచ్చిపోయేవాడిని."" అన్నాడు జాలిగా పరుశురాం.     ఆమె మొహం ఎర్రగా కందిపోయింది.     పెదిమలు అదురుతున్నాయి. ముక్కుపుటాలు ఎగిరెగిరి పడుతున్నాయి.     ""నిన్నెవరూ పట్టించుకోకుండా నీ మానాన నిన్ను విడిచిపెట్టేశారు. ఆఖరికీ నీమేనమామ కూడా.""?     కానీ నేను అలా ఊరుకోలేకపోయాను.     అందరిలా నేనూ మొహం చాటేస్తేనా ప్రేమకి అర్థం ఏముంది రామ్.""     ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. పరుశురాం క్షణంపాటు కళ్ళు మూసుకున్నాడు.     ""అయితే నువ్వు నన్నింకా ప్రేమిస్తున్నావా అనూ!""అడిగాడు పరుశురాం ఆర్తితో.     కళ్ళెత్తి అతనికేసి అరక్షణం పాటు చూసింది.     దెబ్బతిన్న నాగులా వుందామె చూపు.      ""అదే నాకు తెలీడం లేదు"" అని బ్యాగ్ లోంచి పేకని తీసి అతనికి అందిస్తూ-     "" నాల్రో జుల క్రితం వీటిని నా  బ్యాగ్ లో పెట్టావు"" అంది.     పరుశురాం పేకముక్కల్ని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు.     ఆమె జీపులో కూర్చుంది.      ""వెళ్ళిపోతున్నావా?"" అడిగాడు  దిగులుగా.     ""అవును"" ముక్తసరిగా ఎటో చూస్తూ అంది అనూష.     ""నేనూ వస్తాను"" చిన్న పిల్లాడిలా అడిగాడు.     ""డ్రయివర్ జీపు పోనియ్!""అంది అనూష.     షాక్ తిన్నట్లు నిలబడిపోయాడు. జీపులో ఆమె వెళ్ళి పోయింది.     పరుశురాం విషాదంగా  చూస్తూ నిలబడిపోయాడు.     ఆవేశంలోనూ,ఉక్రోషంలోనూ వున్న అనూష ఇప్పుడు తనేం చెప్పినా వినే స్థితిలో లేదు.      ఆరోజు శనివారం.      ఆమె నాగేంద్రస్వామి గుడికి వస్తుంది.      సాయంత్రం గుడిలో ఆమెని కలుసుకోడానికి నిశ్చయించుకున్నాడు పరుశురాం.      అనుకున్నట్లుగానే ఆమెని అదే రోజు సాయంత్రం కలిశాడు." 47,"     భజగోవిందం బుర్ర గోక్కుంటూ ""నీ నవ్వుని నేనెప్పుడు ఆలకించలేదురా"" అని చెప్పాడు.     ఆ మాటలకి సుందర సుకుమారి, రాణి కిల కిల నవ్వారు. వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టటానికే అలా నవ్వారు.     వాళ్ళ నవ్వులు చూసి భీమారావ్ కి మరింతగా ఒళ్ళు మండింది.     ""ఏంటిరోయ్! రోజూ నా మొహం చూస్తున్నావు... నా నవ్వు వింటున్నావు. ఇప్పుడేమో ఈ ఆడాళ్ళ ముందు నీ నవ్వు నేనెప్పుడు వినలేదంటావా! గురూగారు రాణీ... నీపని అప్పుడు చెబుతాను.""     ""నవ్వులాటకి అన్నానులేరా౧ నీవు నవ్వావో ఏడ్చావో ఆమాత్రం నాకు తెలీదంట్రా. నీవు నవ్వావ్ ఎందుకంటే నీ నోట్లో పళ్ళన్నీ తీరికగా లెక్కపెట్టేలా కనబడ్డాయి గందా! నవ్వితేనే పళ్ళు కనబడతాయి గందా! అందుకని నువ్వు నవ్వావని నేను గ్యారంటీగా చెబుతున్నాను.""     ""అద్గదీ మాట. వీళ్ళ మాటలు విని నా బుర్ర తిరిగిపోయింది. నీ బుర్రకాయ కూడా గిర్రున తిరిగిందేమోనని భయపడ్డాననుకో!""     ""చుక్క పడకపోతేనే మనకి బుర్రకాయ తిరుగుతుందిరా భీముడూ! సీసాకాయ ఖాళీచేసి వచ్చాం కదా! తిరుగుతున్నది మన బుర్రలు కాదు... వీళ్ళ బుర్రకాయలు.""     వీళ్ళు మామూలు మాటలతో దారికి రారు. వాళ్ళ గురువుగారి మాట కాదని అపకారం చేసే రకాలు కూడా కాదు. మరో మార్గం ఆలోచించి వీళ్ళ పనిపట్టాలి. అంతకు మించిన దారి లేదు"" అనుకున్న రాణి ""మీ గురూగారు వచ్చిందాకా మేం బ్రతికుండాలా! అక్కర్లేదా!"" వాళ్ళవైపు తీక్షణంగా చూస్తూ అడిగింది.     ""మీరు చచ్చిపోతే మా గురూగారు మమ్మల్ని చంపేస్తారు. అయినా ఇప్పుడెందుకు చచ్చిపోతారు? అసలెలా చచ్చిపోతారు?"" అయోమయంగా అడిగాడు భీమారావ్.     ""మా సుందర సుకుమారికి ఉదయం పూట డజను ఇడ్లీ...అరడజను అట్లు... నాలుగు గ్లాసులు కాఫీ కావాలి. నాకు దాంట్లో సగం చాలు. మధ్యాహ్నం భోజనం పెద్ద కారియర్ నిండుగా తీసుకురావాలి. పెరుగన్నంలో తింటానికి అరడజను అరటిపళ్ళు కూడా తీసుకురావాలి. నాలుగు గంటలకి కాఫీ, టిఫిన్ లు కూడా మేం చెప్పిన లిస్ట్ ప్రకారం తీసుకురావాలి. రాత్రికి మళ్ళీ పెద్ద క్యారేజీతో ఫుల్ భోజనం తీసుకురావాలి. ఇవన్నీ తెచ్చినా...మేమిక్కడ ఖాళీగా ఉంటాం కాబట్టి కాలక్షేపంగా తింటానికి బఠానీలు...వేయించిన వేరుశెనక్కాయలు... కిలో కిలో చప్పున తెచ్చి రెడీగా ఉంచాలి."" రాణి ఇంత పొడుగు లిస్ట్ చదివింది.       దాకలాగా నోరు తెరిచి రాణి చెప్పిందంతా పూర్తిగా విని ""ఏంటీ?"" అంటూ రాగం తీశారు.     ""మీరేం ఆశ్చర్యపోనక్కరలేదు. మా సుందరికి తిండి లేకపోతే కోమాలో పడిపోతుంది. కోమా అంటే మరేంలేదు... మాటా పలుకూ లేకుండా కళ్ళూ, నోరూ ఏదీ తెరవకుండా అలా వుండిపోవడమన్నమాట. ఆ తరవాత నోట్లో నీళ్ళు పోయాలన్నా కుదరదు. అలా ఉండీ ఉండీ గంటకో... రెండు గంటలకో... నాలుగు గంటలకో హరీ అంటుంది. ఇది హరీ అన్న తర్వాత నేను అది చూసి భరించలేక నేను కూడా హరీ అంటాను. ఆ తరవాత మీ గురూగారొచ్చి మిమ్మల్ని కూడా హరీ చేస్తాడు"" రాణి చెప్పింది.     హరీ చేయడమంటే ఏంటీ తల్లీ?"" భీమారావ్ అడిగాడు.     ""హరీ అంటే ఆ మాత్రం తెలీదా! చచ్చిపోవడమన్న మాట. మా సుందరికి తిండి లేకపోతే హరీమనే జబ్బు ఉంది. డాక్టర్ ముందు జాగ్రత్తగా ఎప్పుడో చెప్పాడు. ""తిండి విషయంలో వెనకాడకుండా... వెనకా ముందు చూడకుండా ఈ అమ్మాయి అడిగినవన్నీ తెచ్చిపెట్టండి. ఎంత తినగలిగితే అంతా తిననివ్వండి. తిండి విషయంలో లోపం చేశావనుకో హరీ మనటం ఖాయం అని.     అప్పట్నించి కోమాలోకి వెళ్ళకుండా ఇది అడగటం ఆలశ్యం తిండి పెడుతున్నాం"" అంటూ చిన్న సైజు కథ చెప్పింది రాణి.     ""హరీ అంటే ఇదా!"" ఆశ్చర్యపోతూ సుందర సుకుమారి వైపు చూశాడు భీమారావ్.     సుందర సుకుమారి ఊరుకోలేదు. తన వంతుపని తను చేసింది. అదే...కవిత్వంతో చావగొట్టి చెవులు మూయడం.     ""ఆకలి మంటలు బాబూ     ఇవి ఆరని మంటలు బాబూ     అరడజను అట్లయినా కావాలి బాబూ     ఆపై కాఫీ కావాలి బాబూ""     సుందర సుకుమారి అంతవరకు పాకి ఈ తఫా చప్పట్లు కొడుతూ మరో పాట ఎత్తుకుంది.     ""హరి హరి నారాయణో     ఆది నారాయణో     ఆకలికి తాళలేక     ఆహుతై పోతున్నానురో...     ... ... ...     గోవిందం! భాజ గోవిందం!     భీమయ్యా! భీమయ్యా!     వినండి...     ఇది కర కర ఆకలి     కలి కలి ఆకలి     చలిలో ఆకలి గిలిలో ఆకలి     ""వద్దు తల్లీ! వద్దు. అదేదో చదువుతున్నావ్...అది ఆపేసేయ్. ఇప్పుడే ఉన్న ఫళాన వెళ్ళి హోటల్లో ఏముంటే అవి అన్నీ పొట్లం కట్టించుకొస్తాం."" భీమారావ్ చెప్పాడు.     ""ఊ...తొందరగా వెళ్ళండి. కోమా వచ్చేముందే మా సుందరి ఇలా అదేపనిగా పాటలు పాడేస్తూంటుంది. కోమాలో పడ్డదంటే ఇంక దాని పని హరి. ఇంక ఆపై నా పని హరి. ఆ తర్వాత మీ గురూగారి చేతిలో మీ పని కూడా హరి హరి..."" అంటూ తొందర చేసింది రాణి." 48,"                             నిశీథి నియంత                                                                            __ సూర్యదేవర రామ్ మోహన్ రావు       నిశీథి- నిశ్శబ్దతతో, నిస్తబ్దతతో పెనవేసుకున్న వేళ...     మౌనంగా నాట్యం చేసే మృత్యువు నిద్రలేచే వేళ...     ఆ జైలు గంట- అందులో వున్న వేలాది ఖైదీల ఆశల అనంత దిగంతాలు భ్రాంతిల్లుతున్న వేళ. పదిసార్లు మృత్యునాదంలా ప్రతిధ్వనించి విశ్రాంతిలోకి జారుకుంది.     దాదాపు పదిహేను ఎకరాల పరిధిలో విస్తరించుకొని వున్న ఆ కోట వయస్సు దాదాపు నూట పాతిక సంవత్సరాలు.     ఆ కోట చుట్టూ ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో ఉండే గోడ, ఆ కోటను అనుక్షణం పహరా కాస్తున్నట్లుగా వుంటుంది. ఎండకు ఎండి, వానకు తడిసిన గోడ కళాహీనంగా తయారయినా, ఇంకా పటిష్టంగానే వుంది.     ఆ గోడపై మరో మూడడుగుల ఎత్తులో ఎలక్ట్రిక్ వైర్లు గోడ పైభాగంలో దిగవేసిన ఐరన్ పోల్స్ కి మెలికలు వేసుకొని, ఏ క్షణాన్నయిన కాటేసే మిన్నాగుల్లా ఆ పల్చటి వెన్నెల్లో అస్పష్టంగా కనిపిస్తున్నాయి.     ఆ కోటగోడకు తూరుపు దిక్కున ఉంది పెద్ద సింహద్వారం. ఐదారుగురు మనుసులు ఒకేసారి తమ శక్తినంతా వుపయోగించి నెడితే తప్ప అవి పూర్తిగా తెరచుకోవు.     నల్ల మద్ది, ఎబోనీతో కలిపి తయారు చేసిన కొన్ని దశాబ్దాలనాటి రెండడుగుల మందం తలుపులు కూడా ఒకింత రంగు వెలిశాయే తప్ప పటిష్టత విషయంలో చెక్కు చెదరలేదు.     పదడుగుల వెడల్పుతో, ఇరవై అడుగుల ఎత్తులో వున్న ఆ రెండు తలుపుల్లో కుడివేపు దానికి మూడడుగుల వెడల్పు, ఐదడుగుల ఎత్తులో మరో చిన్న (తలుపులో) తలుపు ఏర్పాటు చేయబడింది.     ఆ పదిహేను ఎకరాల కోటకు అదొక్కటే ద్వారం. వాహనాలు వచ్చిపోయేటప్పుడు తప్ప మామూలు సమయాల్లో పెద్ద తలుపుల్ని తెరవరు. మనుషుల రాకపోకలు ఆ చిన్న ద్వారం గుండానే సాగుతుంటాయి.     ఆ కోటలోనే ఉంది సెంట్రల్ జైలు....     ఆ జైలు లోపల ఏం జరిగినా, ఎవరు అరిచినా, ఏ ఖైదీ ఏ హింసకు గురయినా, అతనెంతగా గొంతెత్తి ఘోషించినా బయట ప్రపంచానికి ఏమాత్రం వినరావు - కనరావు.     మృత్యుదేవత గర్భగుడి అది....     ఆర్తనాదాల నైవేద్యం సర్వసాధారణం అక్కడ. కొత్త ఖైదీలు ఆ జైలుకి వస్తే-వస్తూనే ఆ కోటను, ఆ కోటకున్న భద్రతా ఏర్పాట్లను చూసి వణికిపోతారు. తప్పించుకోవాలనే ఆలోచనలకు స్వస్తి పలుకుతారు.     ఆ కోట ప్రహరీ గోడపై నాలుగు మూలలా నవాబు టైంలోనే భద్రత కోసం కట్టించిన బురుజుల గదులు, ఇప్పుడా జైలుకి సెక్యూరిటీ చెక్ పోస్ట్ ల్లా వుపయోగపడుతున్నాయి. వాటిల్లో ప్రతిదానిలో వుండే నలుగురు సెంట్రీలు సాయంత్రం అయిదవుతూనే కళ్ళల్లో వత్తులు వేసుకుంటారు.        ఆ చెక్ పోస్టుల్ని చేరుకోటానికి ఇనుప నిచ్చెనలే మార్గం. సాయంత్రం అయిదవుతూనే నలుగురు సెంట్రీలు గన్స్ పవర్ ఫుల్ టార్చ్ లైట్స్ చేతబూని, రెండు ప్లాస్కులనిండా టీ నింపుకొని ఆ ఎత్తైన నిచ్చెనగుండా చెక్ పోస్టుల్ని చేరుకుంటారు.     అలా జైలుకి నాలుగు మూలలా ఉన్న చెక్ పోస్టుల్లోకి సెంట్రీలు చేరుకోగానే నాలుగు నిచ్చెనల్ని పటిష్టమైన భద్రత వున్న ప్రాంతానికి తరలిస్తారు.     సాయంత్రం ఐదింటికి ప్రారంభమయ్యే చెక్ పోస్టుల పహరా తెల్లవారి- ఆరున్నర గంటలయ్యేదాకా కొనసాగుతుంది. ఆ చెక్ పోస్టుల్లో శక్తివంతమైన సెర్చ్ లైట్స్ వృత్తాకారంలో విర్విరామంగా తిరుగుతూ ఆ ప్రాంతంపై నైట్ సెంట్రీలకు పట్టును కలిగిస్తాయి.     ఆ పోస్టుల్లో రాత్రిళ్ళు నలుగురేసి చొప్పున డ్యూటీలో వుంటే- పగలు ఇద్దరేసి చొప్పున వుంటారు.     టోటల్ గా ఇరవైనాలుగు గంటలూ 25 అడుగుల ఎత్తు నుంచి సెంట్రీల పహరా జైలు ఆవరణపై వుంటుంది.     ఆ కోట చుట్టూ ఔరంగాబాద్ లోని దౌలతాబాద్ పోర్ట్ కి ఉన్నట్లు పెద్ద కందకం వుంది. దాని లోతు దాదాపు పాతికడుగులుంటుంది. దానిలో ఎప్పుడూ నీళ్ళుంటాయి. ఆ నీళ్ళలో భయంకరమైన విషసర్పాలు, మొసళ్లు కేరింతలు కొడుతుంటాయి. ఆయుధాలు పూని వుండే సెంట్రీల్ని తప్పించుకుని సెర్చ్ నుంచి బయటపడ్డా, పాతికడుగుల ఎత్తులో దర్శనమిచ్చే పటిష్టమైన ప్రహరీ గోడ వారిని అడ్డుకుంటుంది.     ఒకవేళ దానిని ఎక్కగలిగినా, గోడపై అమర్చిన ఎలక్ట్రిక్ వైర్ లలో ప్రవహించే హై వోల్టేజీ ఎలక్ట్రిసిటీ వారిని మసి చేసేస్తుంది. ఆపైన లైట్ పోస్టుల పహరా- ఇవేమీ అడ్డు కాదనుకున్నా, ప్రహరీగోడని ఆనుకుని బయటవైపు వున్న నీళ్ళతో నిండివుండే కందకంలో పడటం ఖాయం.     ప్రహరీగోడను చుట్టివచ్చే నీళ్ళ కందకం. తూరుపు వైపు వున్న జైలు సింహద్వారం ముందు కూడా వుంటుంది. దీర్ఘ చతురస్రాకారంలో వుండే ఆ కందకంపై సింహద్వారం ముందు చెక్కలవంతెన నిర్మించబడింది. అనవసరమనుకుంటే ఆ చెక్కలవంతెనని నిమిషాల్లో జైలు సిబ్బంది తొలగించి వేయగలదు - (అవసరమనుకున్నప్పుడు కందకంపై వాల్చగలదు) అక్కడితో జైలు ఒక ద్వీపంలా తయారవుతుంది.     ఆ జైలుకి వెనుకవైపున అర కిలోమీటరు దూరంలో ఒక గ్రామం వుంది. ఆ గ్రామంలో వాళ్ళు అప్పుడప్పుడు రోజు కూలీకి జైలుకి పంపించబడుతుంటారు.     ఎందరో నరహంతకుల్ని, కొన్ని పావురాళ్ళని తన గర్భంలో దాచుకున్న జైలు నివురుగప్పిన నిప్పులా ఇప్పుడు నిశీథిలో కలిసిపోయి వుంది.     ఆ ప్రాంతంలో దుప్పటిలా పర్చుకున్న చీకటిని చీల్చుతూ లేసర్ బీమ్స్ లాంటి కాంతికిరణాలు లైట్ పోస్టుల నుంచి వెలువడుతున్నాయి.     జైలు లోపలకు వెళితే__     విశాలమైన దర్బారులా ఉన్న పెద్ద వరండాకు ఇరువైపులా వరుసగా గదులు....వాటికి స్టీల్ బార్స్ తో తయారుచేసిన బలిష్టమైన తలుపులు, వాటికి పెద్ద పెద్ద తాళంకప్పలు వేలాడుతున్నాయి.     ఆ వరండాలో ఇప్పుడు నలుగురు సెంట్రీలు చేతుల్లో తుపాకుల్తో నిశ్శబ్దంగా పహరా కాస్తున్నారు.     అది డిసెంబర్ నెల....     శరీరాన్ని గడ్డకట్టించే చలి....     ఆపైన దట్టమైన పొగమంచు....     క్రమంగా తమ సాంద్రతని పెంచుకుంటూ నడిజాముకు సంసిద్ధమవుతున్నాయి.     జైలు గదుల్లో ఉన్న ఖైదీలు చింకిపాతల్లాంటి గొంగళ్ళతో చలిని ఎదుర్కొనే ప్రయత్నంలో కడుపులోకి కాళ్ళు దూర్చుకుని మూటల్లా ముడుచుకుపోయున్నారు.     ఇంకా నిద్రపట్టని ఖైదీలు ఆ పాత గొంగళ్ళ మురికివాసన భరించలేక తలను మాత్రం బయటకు పెట్టి కునికిపాట్లు పడుతున్నారు.                                  *    *    *    *     జూబ్లీ వ్యాలీ ఎన్ క్లేవ్.... జూబ్లీహిల్స్ ఎక్స్ టెన్షన్ లో వెలిసిన అందమైన కాలనీ.... అపోలో మెడికల్ కాలేజీ దారిలో వారగా ఉన్న చిన్న ఇల్లు.... ఆ అర్దరాత్రివేళ పాలపుంత నుంచి విడిపోయిన ఒంటరి నక్షత్రములా వుంది- బిక్కుబిక్కుమంటూ.     కాలీ అంతా నిశీథి నిశ్శబ్దంలో మునిగి వుంది.     అక్కడ కూడా వీధిలైట్లు మినుకు మినుకుమంటూ వెలుగుతున్నాయి.     ఆ ఇంటికి దగ్గరలో ఉన్న స్టెల్లా మేరీస్ ఉమెన్స్ కాలేజీ బిల్దిగ్ పైన వెలిగే లైట్ కేసి ఆమె చూస్తోంది. ఆమె వయస్సు సుమారు అరవై అయిదు వుంటుంది. జుట్టంతా నెరసిపోయి- బుగ్గలు, కళ్ళు లోతుకుపోయి పుట్టెడు దుఃఖాన్ని, మరో పుట్టెడు బాధల్ని మోస్తున్నదానిలా- సర్వస్వాన్నీ కోల్పోయినదానిలా- పిచ్చిదానిలా- విరాగినిలా వుంది.     ఒకింత దూరంలో శిలలపై వెలిసిన శిల్పాల్లాంటి జూబ్లీజిల్స్ కాలనీ ఇళ్ళు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటికేసి ఆమె చూపులు చలిస్తున్నాయి.     మూడు వైపులా కొండలు....కొండలపై లైట్ల తోరణం.... కొండల దిగువున తను ఒంటరిగా.... తన ఇల్లు అంతకంటే ఒంటరిగా.... చల్లని ఈదురు గాలులు వుండుండి వీస్తున్నాయి.     అయినా ఆమె శరీరం స్పర్శని కోల్పోయినట్లుగా వుంది. మనసు, ఆశలు, ఆశయాలు అన్నీ స్పర్శని కోల్పోయాయి ఆమె విషయంలో.     ""ఎంతసేపిలా పిచ్చిదానిలా చూస్తూ వుండిపోతావాక్కా...."" ఆమె వెనగ్గా వచ్చిన వ్యక్తి నోటినుంచి వచ్చాయా మాటలు.     ఆమెకవి వినిపించినట్లు లేవు.       ఆరుబయట, అంత చలిలో పల్చటి చీరతో ఎలా నిలబడగలుగుతోంది తన అక్క....?! స్వెట్టర్ వేసుకొని, తలకు మఫ్లర్ చుట్టుకున్న అతను ఆశ్చర్యపోయాడు. అతనికి బాధేసింది- భయమేసింది- జాలి కలిగింది.     ""అక్కా...."" అంటూ ఆమెని భుజం పట్టుకొని కదిలించాడు.     అప్పుడు ఈ లోకంలోకొచ్చిందామె. జీవంలేని గాజుకళ్ళతో ఆమె తన తమ్ముడ్ని చూసింది.     ""ఇంకెన్నిరోజులుంది మరణముహూర్తం?"" గంభీరంగా వుందామె కంఠం.     ఉలిక్కిపడ్డాడతను.     సమాధానం తెలిసినా చెప్పడానికి భయపడ్డాడు.     ""చాలా దగ్గరకొచ్చినట్లుందికదూ?"" తిరిగి ఆమే గొణుక్కుంటున్నట్లుగా వుంది. ఆమె కంఠంలో జీర స్పష్టంగా తొంగిచూసింది.     ఆమె పేరు వేదవతి!     అతనామె తమ్ముడు- సత్యమూర్తి!     అతని వయస్సు సుమారు అరవైదాకా వుంటుంది.     అవునన్నట్లుగా అతను తలదించుకున్నాడు.     ""ఆ ముహూర్తాన్ని పొడిగించలేమా?"" సత్యమూర్తిని అనుసరించి ఇంట్లోకొస్తూ అడిగిందామె.     సత్యమూర్తి తన అక్కకేసి నిస్సహాయంగా చూశాడు. అతని కనుకొలకుల్లో అప్రయత్నంగా తడి....     ""కొన్ని ముహూర్తాల్ని ఎవరూ మార్చలేరక్కా....! విధి చేతిలో యిరుక్కుపోయిన ముహూర్తాన్ని అసలే మార్చలేరు...."" అతను నెమ్మదిగా అన్నాడు తలుపేసి లోపల గడియపెడుతూ.     ఆ మరుక్షణం అతడి దవడ పేలిపోయింది.     ముందు ఏం జరిగిందో అర్ధంకాలేదు.     తన మాటలు ఎప్పుడు పూర్తయ్యాయో- తనకి నాలుగయిదు అడుగుల దూరంలో వున్న తన అక్క - ఎప్పుడు తన దరిచేరిందో, ఎప్పుడు కొట్టిందో కూడా అర్ధంకాలేదతనికి." 49,"      మీ వంటి నర్తకీరుణి మా ఊరు రావడం మా అందరి అదృష్టం ...."" అన్నాడు రమాకాంతం, తన తన మామూలు ధోరణీలో.     ""అలా అనకూడదు. మీ వంటి పెద్దలున్న యిటువంటి గ్రామానికి రావడం నాదే అదృష్టం __"" అంది లీలాసుందరి.     రమాకాంతం యాభై సంవత్సరాల ముఖంలో _ పాతికేళ్ళ పడుచు సిగ్గు అరుణిమ కనబడింది. అయన గంభీరంగా ఉండాలని ప్రయత్నించినా ఆ అరుణిమ దాగలేదు. తను చేతిలోని కాగితాన్ని మరోసారి చూసి అక్కడ తనపేరు రాసుక ఇవ్వాళానుకున్న డబ్బు వేయబోతూ _ ఆ ప్రయత్నంగా అందులో రాజారావు పేరుకోసం వెతికాడు.  అక్కడ నూటపదహార్లు చూసి _ అరె _ అనుకున్నాడు తర్వాత నర్సన్న పేరు చూశాడు. అక్కడా నూటపదహార్లు రాస్తూ _ ""నర్సన్నే అనుకున్నాను, రాజరావూ రసికుడే !"" అనుకున్నాడు అలా తట్టలేదు.     కాగితం రమాకాంతం నుంచి అందుకుని __ థాంక్స్ !"" అని ఆయనవైపు కృతజ్ఞతతో కూడిన చిరునవ్వొకటి విసిరి వెళ్ళిపోయింది లీలాసుందరి.     ఆ నవ్వు రమాకాంతంలో కొత్త జ్యోతి ని వెలిగించింది. కానీ అది తాత్కాలికానుభూతి. వయసు ముదిరినా, అనుభవం పెరిగినా _ అందమయిన చిన్నది కనబడితే మగవాడి మనసు చెదరడం అసహజం కాదు. ఎటొచ్చీ ఆ చెదిరిన మనసు చిన్నదానిపై తదేఅధ్యానానికి దారితీస్తే ఇబ్బంది.     లీలాసుందరి వెళ్ళిపోగానే _ ""ఈ ఊళ్ళో _ మీ ఎరికలో స్వార్ధం కోసం ప్రజల్ని పీడించే భూస్వాములు పేర్లేమయినా ఉంటే చెప్పండి . ముందు మనం వాళ్ళకు రక్షణ ఏర్పాట్లు చేయాలి....."" అన్నాడు రవి.     ఎందుకూ అని ఆడగబోయి ఆగిపోయాడు రమాకాంతం. నక్సలైట్ల దృష్టి అటువంటి వారిమీదే నన్న విషయమాయనకు గుర్తుంది. అయన తడబడుతూ - ""ఏమో _ ఎం చెప్పగలం ..... నేను మాత్రం కాదు ...."" అన్నాడు.     ""రవి నవ్వి __ "" ఆలో౦చించండి. రాజారావుని దోషిగా పట్టించడానికి మీ రివ్వబోయే జాబితా సహకరిస్తుంది....."" అన్నాడు.     రమాకాంతం సాలోచనగా తలపకించి ఉలిక్కిపడ్డాడు. అప్పుడాయన కళ్ళలో స్పష్టమయిన, నిజమయిన భయం గోచరించింది.     సందేహం లేదు, రాజరావు నక్సలైటు ......!     ఊళ్ళో కమతగాళ్ళను బాధపెట్టి , కౌలు దారుల బాధలను లెక్కచేయకుండా , ప్రజల్లో చాలామంది దృష్టిలో కూరడయినవాడు చలమయ్య! ఈ విషయంలో ఇంకెవరి పేరు చెప్పాలన్నా చలమయ్య తర్వాతే!     ఎలాగో ప్రయత్నించి రాజరావా చలమయ్యఇంట్లోనే మకాం పెట్టాడు.     అంటే చలమయ్య తనకు తెలియకుండానే పక్కలో బల్లెన్ని తెచ్చుకున్నాడు.     ""చలమయ్య ....."" అంటూ అస్పష్టంగా గోణికాడు రమాకాంతం.     రవి ఉత్సాహంగా __ ""మంచి క్లూ యిచ్చారు. చలమయ్యంటే __ రాజారావుగారు౦టున్న ఇంటి యజమాని ...."" అన్నాడు.     ""ఊం"" అన్నాడు రమాకాంతం అన్యమనస్కంగా.     ""ఇంకా ఏమయినా పేర్లు చెప్పగలరా?""     రమాకాంతం మరికొన్ని పేర్లు చెప్పాడు కానీ, అయన ముఖంలో గాంభీర్యం వెలసింది. నిజంగా చలమయ్యనూ, మరి కొందర్ని పొట్టనబెట్టుకోవదానికే రాజరావీ ఊళ్ళో అడుగు పెట్టాడా? మేకవన్నె వాక్యానికి సార్ధకత కల్పించడాని కింతకంటే] సరయిన వ్యక్తి దొరకడు. పాపం.... చలమయ్య.....     రమాకాంతానికి చలమయ్య మీద జాలి కలిగింది. చలమయ్య  గురించే ఆలోచిస్తూ _ అలా కూర్చుండిపోయాడాయన. ఆఅనేదావు ఆలోచనలో పడ్డాడని గుర్తించి, రవి అక్కణ్ణుంచి లేచి వెళ్ళిపోయాడు.     రమాకాంతానికి మనసు మనసులో లేదు. నక్సలైట్ల దురంతాల గురించి అయన పేపర్లలో చదివాడు. అయితే ఆయనిప్పుడు నక్సలైట్ల దురంతాల గురించి కాక __ చలమయ్య దురంతాల గురించి ఆలోచిస్తున్నాడు     ""చలమయ్య అంతం సమీపించింది. ...."" అనుకున్నాడాయన.     స్వర్గ నరకాలు వేరే లేవనీ _ మనిషి తమ చేసిన కర్మకు ప్రతిఫలం జీవితకాలంలోనే అనుభవిస్తాడనీ పెద్దలంటారు. ఇప్పుడు చలమయ్య విషయంలో అదే జరుగుతో౦దా? అతడు చేసిన ఘాతుకాలకు ప్రతిఫలం అనుభవించబోతున్నాడా?     చలమయ్య చేసే వడ్డీవ్యాపారం ఊళ్ళో చాలామంది కొంపలు కూల్చింది. దొంగతనం చేశారన్న అనుమానంతో అతడనేకసార్లు పాలేళ్ళను స్థంభాలకు కట్టేసి, కొరడాలతో బాదాడు. ఆ బాధ భరించలేక . చేయని నేరాన్ని కూడా ఎందరో ఒప్పుకున్నారు. చలమయ్య మనిషి కాదు __ రాక్షసుడని చాటుగా ఎందరో అనుకున్నారు.     అయితే, ఊరిమొత్తానికి చలమయ్యేక్కడేనా అలాంటి వాడు? అటువంటి వారు మరికొందరున్నారు. కానీ, చలమయ్య గురించి రమాకాంతానికి బాగా తెలుసు. మిగతా వారి గురించి చూచాయగా వింటే _ చలమయ్య ఘాతుకాల నాయన కళ్ళారా చూశాడు. అలా కళ్ళారా చూసిన ఘాతుకాల్లో _ ఒక వ్యవహారంలో ఆయనకూ భాగముంది.     అప్పుడున్నట్లుండి రమాకాంత౦ శరీరంలో వణుకు పుట్టుకొచ్చింది. తరచి తరచి ఆలోచిస్తూ _ తన మెదడులో అట్టడుగున దాగిన జ్ఞాపకాల పూతలనాయన ఇప్పుడు _ అనుకోకుండా బయటకు తీశాడు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలని గానీ, తన్ను తాను విమర్శించుకోవాలని గానీ అయన అనుకోలేదు. అనుకోకుండా జరిగే అనేక విషయల్లాగే ఇదీ జరిగింది.     ఆ విషయం ఈనాటికి సుమారు ముప్ఫై ఏళ్ళకు పైగా క్రితం నాటిది. అయినా రమాకాంతనికి అంతా ఇప్పుడు కళ్ళముందు జరుగుతున్నట్లే ఉంది.                                                      18     అప్పుడు రమాకాంతానిది పాతికేళ్ళ ప్రాయం హుషారయినా యువకుడిగా గ్రామంలో మంచిపేరు సంపాదించుకున్నాడు. ఉన్నవాళ్ళలో కాస్త చదువుకున్నవాడు కావడంవల్ల అతడంటే చాలామందికి గౌరవభావం కూడా ఉండేది.     అప్పుడు రమాకాంతానికి తెలివుంది. సంస్కారముంది, సమయస్పూర్తి ఉంది, పాపాభీతి ఉంది. వీటన్నింటినీ మించి పదవీ వ్యామోహం కూడా ఉమ్దడంవల్ల అతడు చలమయ్య స్నేహం పట్టాడు.     చలమయ్యంటే గౌరవభావం కలవారా ఊళ్ళో బాగా తక్కువ. అయితే ఇంచుమించు ఊరు ఊరంతా అతడికి భయపడుతుంది.     చలమయ్య ధనసహాయం పేరిట చాలామందికి అప్పులిచ్చి _ ఇచ్చిమ్డానికి రెట్టింపుకి తక్కువకాకుండా వసూలు చేస్తూ౦టాడు. డబ్బు అవసరమున్న వాళ్ళూ, బాకీ ఉన్న వాళ్ళు కూడా అతడికి భయపడుతూ౦టారు. అప్పులివ్వగల స్తోమతుడీ, ఇస్తే వసూలు చేసుకోలేమనే భయం గలవాళ్ళు తమ వ్యవహారాలు చలమయ్య ద్వారా చేయించుకునేవారు. అందువల్ల వాళ్ళకూ అతడి అవసరముంది ఈ విధంగా ఇంచుమించు ఊరు ఊర్నంతా తన గుప్పిట్లో ఉంచుకున్న చలమయ్యకు ఒకే ఒకవ్యక్తి కోరకరాణికొయ్యగా మిగిలిపోయాడు. అతడి పేరు ఆనందమూర్తి. " 50,"                                                       ప్రేమా - పెళ్ళి     పార్వతి నవ్వుతోంది.     అందంగా, విరగబడి పెనుగాలిని ధైర్యంగా ఎదుర్కొంటున్న సన్నని మొక్కలా సముద్రం ముందు నుంచొని ప్రకాశం వంక చూస్తూ నవ్వుతోంది. ఆమె పైట చీరకుచ్చెళ్ళు  సముద్రం గాలికి రెపరెప కొట్టుకుంటున్నాయి. మోకాళ్ళ వరకూ లేస్తోన్న చీరను అదిమి ఉంచిందామె.     ""భలేవాడివే నువ్వు! ఇంకా ఏం చేద్దామని అడుగుతున్నావా? అసలు మనం చేయగలిగిందేముందనీ? ఇటు మా వాళ్ళకూ, అటు మీ వాళ్ళకూ ఎవరికీ ఇష్టం లేదు- అటువంటప్పుడు ఇంకా ఆలోచనలకవకాశం ఎక్కడుందీ? నీ దారి నీదే, నా దారి నాదే"" తెరలు తెరలుగా వస్తోన్న నవ్వుని బలవంతంగా ఆపుకొంటూ అంది.     ప్రకాశం తెల్లబోయాడు ఆమె జవాబుకి.     ఆమె అలా పరిహాసాని కంటోందో, నిజంగానే అంటోందో అవగాహన కాలేదు. ఓ వేళ పరిహాసాని కన్నట్లయితే, అలాంటి పరిహాసం ససేమిరా నచ్చలేదతనికి. తమ ఇరువురి భావిజీవితం గురించి తీవ్రంగా, తెలివిగా, నిదానంగా ఆలోచించుకోవాల్సిన ఈ సమయంలో పరిహాసమేమిటి? తేలిగ్గా, హాయిగా ఆ నవ్వేమిటి?     ""ఇది పరిహాసానికి సమయం కాదు పార్వతీ. ఇప్పుడు మనం ఓ ముఖ్యమయిన నిర్ణయం తీసుకోవాల్సుంది. నీకీ విషయం ఎందుకింత తేలిగ్గా కనిపిస్తోందో నా కర్థం కావటం లేదు.""     కొంచెం కోపంగానే అన్నాడు ప్రకాశం.     పార్వతి నవ్వడం ఆపేసి అతని ప్రక్కనే ఇసుకలో కూలబడింది. రెండు క్షణాలు ఇసుకలో పిచ్చిగీతలు గీసి మోకాళ్ళమధ్య తలొంచుకొని అంది-"" సరిగ్గానే మాట్లాడుతున్నా ప్రకాశం! నేను పరిహాసమాడటం లేదు""     ""అంటే! మీ నాన్న కుదిర్చిన ఆ పెళ్ళి చేసుకుంటావన్నమాట.""     పార్వతి తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. కోపంగా, అసహనంగా, ఉక్రోషంగా చూస్తున్నాడతను.     ""సరే, పోనీ! ఆ పెళ్ళి వద్దంటాను. తరువాత ఏం చేయాలో నువ్వే చెప్పు!"" ప్రకాశానికి కోపం తగ్గింది. పార్వతి చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమిరాడు.     ""నువ్వొట్టి పిచ్చిదానివి! మన పెద్దాళ్ళు వద్దన్నంత మాత్రాన వూరుకుండి పోవడమేంటి? ఇక మనకి ఇష్టాఇష్టాలు లేవా? వాటితో వాళ్ళకి సంబంధం లేదా? మనం వాళ్ళమాటకెంత విలువ, గౌరవం ఇస్తున్నామో, వాళ్ళు మాత్రం మనకంత గౌరవం ఇవ్వద్దూ? ఇదీ కేవలం వాళ్ల పట్టుదలలూ- ఆచారాలకీ, సంప్రదాయాలకూ సంబంధించిన వ్యవహారంగా పరిగణిస్తే ఎలా? ఇవతల మనకు ఆశయాలూ, అభిరుచులూ, అభిప్రాయాలూ- ఇలాంటివేమీ ఉండవా? వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలంటే ఒక్కటే మార్గం ఉంది. మనిద్దరం సరాసరి తిరుపతి వెళ్ళిపోయి, పెళ్ళి చేసుకొని ఎక్కడోచోట హాయిగా గడుపుదాం. అంతే! మరో మార్గం లేదు..."" ఉత్సాహంగా, ఉద్రేకంగా అన్నాడతను.     పార్వతికి అతని మాటలు వింటోంటే మళ్లీ నవ్వు వస్తోంది.     'ఊ! ఆ తరువాత?"" అంది నవ్వాపుకొంటూ.     ""ఆ తరువాత ఇంకేముంది? నేనెక్కడోచోట ఉద్యోగం సంపాదిస్తాను. దర్జాగా బ్రతకొచ్చు మనం""     ""అయిపోయిందా? ఇంకేమయినా మిగిలిందా?"" కిలకిల నవ్వేస్తూ అంది పార్వతి.     ""అయితే నీకింకా వేళాకోళం వదల్లేదన్నమాట!"" ఉడికిపోతూ ఆమెవంక చూశాడతను.     ""లేకపోతే ఏమిటి? నువ్వు చెప్పిందంతా ఓ సినిమా కథలాగుంది. అసలేదో సినిమా చూసే నువ్విలా మాట్లాడుతున్నావేమోనని అనుమానంగా ఉంది నాకు. నువ్వు చెప్పిన కథ వల్ల నష్టాలున్నాయో నువ్వు ఆలోచించలేదు. ముందు మనం తిరుపతి వెళ్ళి పెళ్ళాడ్డానికిగాను డబ్బు కావాల్సుంటుంది. ఈలోగా మా నాన్న పోలీస్ రిపోర్టిచ్చారంటే ఇద్దరం పోలీసులకి దొరికిపోతాం! పోనీ అదలా వదిలేయ్! నువ్వు ఇప్పుడు బి. యెస్సీ ఫైనలియర్ వదిలేస్తే ఎప్పటికీ నీ చేతికి డిగ్రీరాదు. డిగ్రీలేందే నీకు సర్వరుద్యోగం కూడా దొరకటం కష్టం. అలాంటిదేదయినా దొరికేవరకూ మనిద్దరికీ బ్రతకడానికయ్యే కనీసపు ఖర్చుకి ఎక్కడనుంచి డబ్బు తేగలం? ఈ విషయంలో నువ్వెంత గొప్పాడివో, నేనూ అంత గొప్పదాన్నే! తిండికీ, బట్టకూ మాత్రమే లోటు లేకుండా నెగ్గుకొస్తున్న మధ్యతరగతి కుటుంబాలు మనవి. మనం చేయబోయే ఈ ఘనకార్యం వల్ల- అటు నీ చెల్లాయికీ, యిటు నా చెల్లాయిలకీ చాలా నష్టం ఉంది. దీనర్థం మనని పెంచి పెద్దచేసినందుకు మనం మన కుటుంబానికి ఓ పెద్ద మచ్చ సంపాదించిపెట్టి మన ఋణం తీర్చుకొంటున్నా మన్నమాట. ఇదేమయినా బావుందీ?""     ప్రకాశం దెబ్బతిన్నట్లు ఆమె వంక చూశాడు.     ""కానీ- కాని పార్వతీ"" ఏదో అనబోయాడతను రోషంగా. కానీ మాటలు దొరకలేదు.     ""అయితే ఇప్పుడేం చేయాలో నువ్వే చెప్పు"" అన్నాడు మరో వేపుకి చూస్తూ.     పార్వతి కాసేపటివరకూ మాట్లాడలేదు. అప్పటికే మసక చీకటులు వ్యాపిస్తున్నాయి. సముద్రం ఘోష ఎక్కువయిపోయింది.     ""నాకు మన వివాహం ముఖ్యంకాదు ప్రకాశం. మన ప్రేమ పవిత్రమైనది. కనీసం నేనలా భావిస్తున్నాను. దాన్ని మనం శారీరకంగా పొందలేకపోయినా నాకు విచారంలేదు. పరిస్థితులు అనుకూలించక నాకు మరొకరితో వివాహం అయినా నా కభ్యంతరంలేదు. నా హృదయంలో ఎప్పుడూ నువ్వే నిలిచి వుంటావు. నాక్కావలసిందల్లా ఎక్కడో చోట నువ్వు క్షేమంగా ఉండటమే. నా ఆఖరిరోజు వరకూ నీ గురించే భగవంతుణ్ణి ప్రార్థిస్తూంటాను... ఇంతే! ఇంతే ప్రకాశం! ఇదే నేననుకొంది. నీకు నచ్చలేదా?""     ప్రకాశం హేఠనగా ఆమెవంక చూశాడు.     ""నేను చెప్పిందంతా సినిమా అన్నావ్. మరి నువ్వు చెప్పిందేమిటి ఇప్పుడు? సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో! అసలు నువ్వు నన్ను ప్రేమించలేదు. నాకు తెలుసు, కాలక్షేపం కోసం బొమ్మను చూసి ఆడుకున్నావు! నీ అవసరం తీరింది. విసిరి పారేస్తున్నావు! అందుకు కారణంగా వేదాంతాలు వల్లిస్తున్నాయ్! అసలు నిన్ను గుడ్డిగా ఆరాధించటం నాదే బుద్ధి తక్కువ""       లేచి నుంచున్నాడతను.     పార్వతి కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినాయి. తనూ కూడా లేచి నుంచుంది.     ""నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నన్నో హృదయం లేనిదానిగా చేసి మాట్లాడుతున్నావ్."" అంతని గుండెలమీదకి ఒరిగిపోయి వెక్కి వెక్కి ఏడవసాగిందామె.     ప్రకాశం ఆమెలోని ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయాడు. పార్వతి కళ్లవెంబడి నీరు చూసేసరికి అతనికి దుఃఖం ఆగలేదు. ఆమెని గాఢంగా తన గుండెలకి హత్తుకున్నాడు.     ""వూరుకో పార్వతీ! నిన్నేమన్నాననీ ఇప్పుడు ఏడవకు... ప్లీజ్! బ్రతిమాలుకుంటాను!"" ఆమె కన్నీరు తన రుమాలుతో తుడుస్తూ వణికే కంఠస్వరంతో అన్నాడతను.     కాసేపటికి పార్వతి తేరుకుని విడివిడి అతనికి దూరంగా జరిగి నుంచుంది.     ""పోనీ! నీ కిష్టం లేకపోతే నాన్నగారితో పెళ్ళివద్దని చెప్పేస్తాను. కాని ఇంత విషం తెచ్చియ్యి! రెండో మార్గం అదే వుంది""     ఆమె రెండు భుజాలూ గట్టిగా పట్టుకొని కోపంగా అన్నాడతను.     ""నీకు న్యాయం లేదు. అంత క్రూరంగా మాట్లాడకు!""     ఇద్దరూ రోడ్డువేపుకి నడవసాగేరు. చీకటి అలుముకుపోయింది. నక్షత్రాల వెలుగులో ఇసుక తెల్లగా కనబడుతోంది.     ""నేను నిన్ను బలవంతపెట్టను పార్వతీ! నీ ఇష్టం వచ్చినట్లు చెయ్! నువ్వేది చేసినా నాకిష్టమే అంతే!""     బస్ కోసం ఎదురుచూస్తూ నుంచున్నారిద్దరూ.     పార్వతి ఏమీ మాట్లాడలేదు. చీకట్లో దూరంగా భయంకరంగా ఘోషిస్తున్న సముద్రం వేపు చూస్తూండిపోయింది. ఆమె కళ్ళనిండుగా నీరు నిండివుంది." 51,"""అవును అమ్మమ్మా- అవును డాడీ- అవును మామ్! వంశీ లేకుండా నేనూ బ్రతకలేను. హి ఈజ్ హాండ్ సమ్ యంగ్ మాన్! నాకోసం ఏమయినా చేస్తాడు. మామ్! ఒక స్త్రీ జీవితంలో కోరుకునేది తన మనసుకు నచ్చినవాడ్ని అయితే నేను అదే కోరుకున్నాను. అంతకుమించిన ప్రేమ నేనంటే అతని హృదయంలో వుంది. జీవితంలో నేనెవరినీ కోరను మామ్! నా వంశీనే కోరుకుంటాను"" అంటూ అతనికి దగ్గరగా జరిగింది. అలా ప్రక్కకు వచ్చి నిలబడిన నళినిని కుడిచేత్తో తనకు మరింత దగ్గరగా పొదుముకుని.....ఎడం చేత్తో చిటికెలు వేస్తూ వంశీ ఆవేశంగా పెద్దగా అన్నాడు. ""ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ క్షణమే మేము బయటికి పోయి రిజిస్ట్రార్ ఆఫ్ మారేజెస్ ని కలిసి నిర్ణయం చెప్పి మారేజ్ చేసుకుని మరీ వస్తాం. రా నళినీ!"" అంటూ వారు ఆగమని బ్రతిమలాడుకున్నా ఆలస్యం చేయకుండా బయటకు బయలుదేరారు. వసుంధర ఒక్కసారిగా వారికెదురుగా వచ్చి పెద్దగా అరిచి ముఖంమీద చేతులు పెట్టుకుని ఒక భావోద్వేగానికి గురయి నేలమీద అలా కుప్పగా కూర్చుండి ఏడవటం మొదలెట్టింది. తమ సమస్య ఎవరికీ చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు? ఇలాంటిది ఎవరు ఎదుర్కొన్నారు గనుక! అలా కుప్పగా కూర్చుండిపోయిన వసుంధర దగ్గరకు మధు, గీతిక పరిగెత్తుకు వచ్చారు."" బయలుదేరిన వంశీ, నళిని ఆగిపోయారు. ఆ యువజంటకు అయోమయమయింది.                     *    *    *    * కథ మొత్తం చదివి పావని కొంచెం షాక్ తిని అలాగే కూర్చుండిపోయింది. ఆమె ముఖంలోని అస్పష్టమైన భావాల్ని చదివి.... పావనీ! మధు, గీతిక ప్రాబ్లెమ్ కూడా దగ్గరదగ్గరగా నీకు అర్ధమయ్యే వుంటుంది. ఇక్కడ వసుంధర ముగ్గురికి తల్లి. ఒకరు తన కుమార్తె. రెండు తన కొడుకు. మూడు తనకు కోడలుగా రాబోయే పిల్ల. ముగ్గురూ ఒకే రక్తం పంచుకుంటున్నారు. ఒకే గర్భసంచిలోని వెచ్చదనాన్ని అనుభవిస్తూ కణ విభజనకు గురయ్యారు. ఒకే తల్లి కడుపులో ప్రాణం పోసుకున్నారు. సోదరత్వానికి ఒక స్త్రీ మాతృగర్భంలోంచి బయటికి రావటమే కొలబద్ద అయితే....వారు ముగ్గురూ ఏకోదరులవుతారు. కానీ జైగోట్ పరంగా ఆలోచిస్తే....ఆ పిల్లను వంశీ ప్రేమించటానికి అర్హత పొందుతాడు. వివరంగా నేను చెప్పటం కాదు. ఈ ఉదంతాన్ని కూడా కంప్యూటర్ కెక్కించి, నీ సమాధానం దాని క్రింద ఫీడ్ చేయి"" సాజిత్ అన్నాడు. పావని కాసేపు ఆలోచించి చివర్లో అడిగింది. ""డియర్! ఈ సమస్యలన్నీ నీ కల్పితాలా? నిజంగా మన దేశంలో జరిగాయా?"" అందులో ఆశ్చర్యమేముంది పావనీ! అవన్నీ మన దేశంలో సంభవాలే! మా ఆసుపత్రిలో జరిగినవే! మా సీనియర్స్ ఏర్పాటుచేసినవే! కాకుంటే ఆ సమయంలో వారు ముందు జరుగబోయే ఈ ఎథికల్ ప్రాబ్లమ్ నూ వూహించలేదు. కానీ తిరిగి తాము ప్రారంభించిన ఈ సైంటిఫిక్ ప్రాజెక్టుల్లో, అనూహ్యంగా తలెత్తిన ఈ సమస్యలకు వారే ఒక సొల్యూషన్ కూడా. ప్రతి సమస్యకూ చివర ఫీడ్ చేశారు"" సాజిత్ చెప్పటంతో పావని వెంటనే రియాక్టయి- ""ఏమని ఫీడ్ చేశారు?"" ""అబ్బ! ఏం ఆశరా- ఈ అందాల చిన్నదానికి! అవి చూపిస్తే ఇంకా నువ్వు చెప్పేదేముంటుంది? నీవుగా ఏం చెప్తావో అని కదా నా తపన."" ""మిస్టర్ సాజిత్! ఈ ప్రాబ్లమ్ కు మీరు చెప్పిన సొల్యూషన్స్ సెంట్ పర్సెంట్ కరెక్టు అని మీరు నమ్ముకుంటే నాకభ్యంతరం వుండదు. కాని....అవి చూసి నేను కాపీ చేసి తిరిగి చెప్పేంత వీక్ మైండెడ్ మెయిడెన్నంటి మాత్రం నాకు బోలెడంత అభ్యంతరముంది. ఏది చెప్పినా మనకో శైలి, పద్దతీ వుంది. అందుకు డీవియేట్ అయి నేను నీకే కాదు, మరెక్కడా చెప్పను. కాకుంటే తమరు శాస్త్రవేత్తలు కదా!ఒక రకంగా ఈ గాడ్ క్రియేషన్ లో స్మాల్ క్రియేటర్స్! తమరి సమాధానాలు ఏవిధంగా వుంటాయో పరిశీలిద్దామని మాత్రమే అడిగాను. తమరికి చెప్పటానికి అభ్యంతరం అయితే....నో ప్రాబ్లెమ్!"" అంటూ ఒక దరిని కూర్చుంది. సాజిత్ ఆమెకు దగ్గరగా జరిగి- ""డియర్! నువ్వు చెప్పేది నువ్వు చెప్పేయి. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఏం చెప్పారో కూడా నీకు తరువాత నీ సమాధానాలతో కంపేర్ చేసి మరీ చెప్తాను. అప్పటివరకూ తమరు ఫీడ్ చేసింది కూడా మనసులోనే వుంచుకుంటాను"" అన్నాడు. పావని లేచి ఓ.కె! అని అతని మెడచుట్టూ చేతులువేసి అతని ముఖంలో ముఖంపెట్టి అతని పెదాల్ని గట్టిగా ముద్దెట్టుకుంది. తను గదిలో ఒంటరిగా వున్నప్పుడు తనమీద అప్లై చేసిన హైటెక్ లవ్ ఇప్పటికీ తన శరీరంలో మైమరపు తరంగాల్ని తీయగా కదుపుతూనే వుంది. ఈ ముద్దు వాటిని మరింతగా కదిపి.....అతన్ని గట్టిగా హత్తుకుపోయేట్టు చేసింది. ప్రేమ ఒక మత్తు అయితే.... ఇప్పుడు తనా మత్తులో వుంది. ""సాజిత్!"" ఆమె మరింత మత్తుగా అంది. ""వాట్ డియర్"" సాజిత్ కూడా తీయగా పిలిచాడు.. ""నీ మధు-గీతిక ప్రాబ్లమ్ నేను సమాధానం ఫీడ్ చేస్తే ఏమవుతుంది?"" మరలా నా శరీరంలోంచి బయలుదేరిన ""లవ్ వేవ్స్"" అసంఖ్యాలయిన సాజిత్ లను మేసుకుని అంతటా ప్రసరిస్తూ నీలో మాత్రమే మరోసారి ధ్వనిస్తాయి."" ""వెరీఫైన్ సాజిత్! అవి తెలుసుకోవాలనే ఆసక్తి నాకీ మధ్య మరీ ఎక్కువగా వుంటోంది. ఎందుకంటే ఈ హైటెక్ సొసైటీలో అవి ప్రపంచానికి సరిక్రొత్త అనుభూతులు కదా!"" అంది. సాజిత్ మెల్లిగా నవ్వాడు. తరువాత వారు మరోసారి ముద్దెట్టుకుని విడిపోయారు.                     *    *    *    * అది ముఖ్యమంత్రిగారి హైటెక్ చాంబర్! గది గోడలు గ్రీనిష్ ఫైబర్ షీట్స్ తో నిర్మించబడ్డాయి. లోపల అంతా ఏ.సి. చేయబడి వుంది. నేల మొత్తం మెత్తటి తివాచీ పరుచబడి వుంది. ముఖ్యమంత్రిగారు తన ఖరీదయిన హైటెక్ చైర్లో కూర్చున్నారు. దానికి బటన్ సిస్టమ్ వుంది. అది ఎత్తుకు లేవాలన్నా, వెడల్పుకావాలన్నా, ఈజీగా పడుకోవటానికి, కాస్తంత ప్లాట్ గా వెనక్కి పరచుకోవాలన్నా, స్లోగా రొటేషన్ పద్దతిలో అటూ ఇటూ తిరగాలన్నా అన్ని పద్దతులూ వున్నాయి. ఆ సమయంలో ముఖ్యమంత్రిగారు రొటేషన్ పద్దతిలో స్లోగా ఫ్యాన్ తిరిగినట్టు కుర్చీలో కూర్చుని తిరుగుతున్నారు. ఆయన ముందు విశాలమైన టేబుల్ వుంది. ఆ టేబుల్ నలుచదరంగా లేదు. అర్ధచంద్రాకారంగా కోయబడి వుంది. దానిమీద రక-రకాల మైక్రో కంప్యూటర్స్ వున్నాయి. ఓ జెయింట్ కంప్యూటర్ కూడా ముఖ్యమంత్రిగారి అర్ధచంద్రాకారపు టేబుల్ ప్రక్కనే వుంది, అదీ ఆయనకు అందుబాటులో వుంది. ఆయనకు ఏ కంప్యూటర్ అందకపోయినా తను కూర్చున్న హైటెక్ చైర్ బటన్ నొక్కుతారు. అది స్లోగా ముందుకూ, ప్రక్కకూ మూవ్ అవుతుంది. తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం ఆయన ఆయా కంప్యూటర్స్ కీ బోర్డుమీది కమాండ్స్ ప్రెస్ చేస్తారు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ స్క్రీన్ మీద పడుతుంది. అవసరమైతే అనుసంధానంగా వున్న ప్రింటర్ కూడా ఆయన వాడుకుంటారు. ఆయన గది తలుపులు ఆయన నడుస్తూంటే వాడంతటవే తెరుచుకుంటాయి. ఆయన లోనికి వెళుతుంటే వాటంతటవే మూసుకుంటాయి. ఆయన లోపలికి వెళ్లటంతోనే గదిలోని లైట్సన్నీ వాటంతటవే వెలుగుతాయి. ఆ రోజు ముఖ్యమంత్రిగారు కాస్తంత ఆగ్రహంగా తన హైటెక్ చైర్ మీద కూర్చుని వున్నారు. ఆయన కళ్ళు కొద్దిగా ఎరుపెక్కాయి. ఆయన ముఖం గంభీరంగా వుంది. ఆయన ఎప్పుడూ గడ్డం ట్రిమ్ చేసుకుంటారు. జుట్టు ప్రక్కకు దువ్వుకుంటారు. తెల్లగా వుండే ఫాంటూ, షర్టూ ధరిస్తారు. కళ్ళకు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలుంటాయి. ఆయన ముందు అర్ధచంద్రాకారం టేబుల్ కు అవతల ఓ హైటెక్ కుర్చీమీద అంబరీషుడు కూర్చుని పన్నాడు. అంబరీషుడి ముఖంలో నెత్తురుచుక్కలేదు. అంతకుముందు ఆయనకూ, ముఖ్యమంత్రిగారికీ ఏం సంభాషణ జరిగిందో తెలీదు. ముఖ్యమంత్రిగారు అంబరీషుడి ముఖంలోకి మరింత సూటిగా చూస్తూ__ ""ఏమయ్యా! ఇది మామూలు యుగం  కాదయ్యా! కంప్యూటర్ యుగం. హైటెక్ యుగం. ప్రెస్ మీడియా, టి.వి., మీడియా, ఎఫెక్టివ్ గా పనిచేస్తున్న యుగం. మనం మన ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తే-ఎక్కడో ఒకచోట ఓ మైక్రో కంప్యూటర్ లో అది రిజిస్టరు అవుతుంది. దాని స్టోరేజీలో మన జాతకాలుంటాయి." 52,"ముద్దాయిని ప్రశ్నిస్తున్నట్టు ప్రశ్నించినందుకు చిరాకుగా వుంది ఆమెకు. సంజీవి జవాబు ఇవ్వకుండా మౌనం వహించింది. ""దిక్కులేని వాళ్ళకు రాజశేఖర్ అన్నే దేవుడు.....దగాపడిన తమ్ముళ్ళను ఆదుకునే ఆశాజ్యోతి. సర్వస్వం కోల్పోయిన అనాధలకు దేవుడు ఇచ్చిన వారం...అలాంటి మహానుభావుని ఇంటికి వచ్చి నీకు ఏం కావాలో చెప్పకుండా నిలబడితే నీకు సహాయం ఎలా జరుగుతుందమ్మా?"" సంజీవి అప్పటికి పెదవి విప్పింది. ""రాజశేఖర్ అన్నాను కలుసుకోవాలని వచ్చాను.....ఆయనతోనే మాట్లాడాలి..."" ""అన్న ఊర్లో లేరు....మీకు ఏం సహాయం కావాలో చెప్పండి. ఒదినమ్మ వుంది. ఆమె సహాయం చేస్తారు."" ""సరే వారినే అడుగుతాను....ఒకసారి పిలువు"" పైకి వెళ్ళింది పనిఅమ్మాయి. కొద్దిసేపటికి ఆమె వెంట చందన క్రిందకు వచ్చింది. ""ఎవరండీ మీరు...ఏం కావాలి మీకు?"" ఆమెనే నఖశిఖ పర్యంతం పరీక్షగా చూస్తున్న సంజీవి ఆమె మాటలకు ఉలిక్కిపడింది. చందన అజంతా శిల్పంలా ఉంది. ఆమె అద్భుత సౌందర్యరాశి అనుకుంది సంజీవి. ""నేను మిసెస్ రాజశేఖర్ ను. ఏం పనిమీద వచ్చారో నాతో చెప్పండి."" ""మీకు అధికారి తెలుసా?"" ""ఎవరా అధికారి?"" ఎదురు ప్రశ్న వేసింది చందన. తన తొందరపాటుకి నాలుక కరుచుకుంది సంజీవి. ఎవరితో ఏ విషయం మాట్టాడాలో....ఎలా మాట్టాడాలో తనకు అసలు బొత్తిగా తెలియదని ఈ సంఘటన రుజువు చేసింది. ""రాజశేఖర్ గారితో మాట్టాడాలని వచ్చాను. వారు ఎప్పుడు వస్తారో చెబితే నేనూ అప్పుడే వస్తాను."" పదే పదే రాజశేఖర్ కావాలని అడగడంతో చందన భ్రుకుటి ముడివడింది. ఆమెలో స్త్రీ సహజమయిన అనుమానం తొంగిచూస్తుంది. తన భర్తకోసం ఒక అమ్మాయి రావడమే కాకుండా...ఆయనతోనే మాట్లాడాలంటుంది. తనకు తెలిసినంతవరకు ఈమెను ఎప్పుడూ చూసిన గుర్తులేదు. పైపెచ్చు తెలుగమ్మాయి. అదీ కాకుండా తన భర్త చేతికి ఉన్న ఉంగరంలాంటిదే ఈమె చేతికి కూడా ఉందేమిటి? రెండూ ఒక్కటేనా? లేక అలాంటి ఉంగరమే పెట్టుకుందా? అలాంటిదే అయి ఉంటుందనుకున్నా....అంత ఖరీదయిన ఉంగరం పెట్టే యువతిలా లేదు. తన భర్త తెలుసు అంటూ వచ్చిన ఈమెకూ తన భర్తకు ఎలాంటి పరిచయం ఉందో... ఆమె ఆలోచనలు రకరకాలుగా....సాగుతున్నాయి.... సరిగ్గా ఆ సమయంలోనే ఇన్ స్పెక్టర్ ధీరజ్ వచ్చాడక్కడకు. అతనిని చూసిన సంజీవి గతుక్కుమంది. పైటచెంగు తలపైకి లాక్కుంటూ ప్రక్కకు తప్పుకుంది. ""మేడమ్ రాజశేఖర్ గారు ఉన్నారా"" వచ్చీ రావడంతోటే ప్రశ్నించాడతను. ""లేరు.....కేరళ వెళ్ళారు....టీ ఎస్టేట్స్ చూడడానికి వెళ్ళారానుకుంటాను"" అంతలోనే పైనుంచి క్రిందకు వచ్చాడు మురుగన్. ""హలో మిస్టర్ ధీరజ్....ఎన్న సౌఖ్యమా...ఎన్నప్పా ఇట్లా వచ్చారు"" ""మీ అన్నతో పనుండి..."" ""లేరు. క్యాంప్ కి వెళ్ళారు."" ""ఏ వూరు వెళ్ళారో తెలుసా?"" మురుగన్ మనసులో సందేహం. ""పర్సనల్ సెక్రటరీవి నువ్వే అయినప్పుడు వారి ప్రోగ్రామ్ నీకు తెలియకుండా ఎలా ఉంటుంది."" ""నో....నో....అలాంటిదేమీ లేదు. సెక్యూరిటీ ప్రోబ్లమ్స్ వల్ల చెప్పడానికి తటపటాయించానే తప్ప చెప్పడానికేముంది. బొంబాయి వెళ్ళారు"" ఠక్కున చెప్పాడు మురుగన్. ""ఉదయమే నాకు మద్రాసు నుంచి ఫోన్ కాల వచ్చింది. మేము వెదుకుతున్న నేరస్థులు ప్రస్తుతం మద్రాసులోనే ఉన్నారనీ, వెంటనే వెళ్ళినట్లయితే దొరుకుతారని ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. అందుకే ఇలా వచ్చాను."" మురుగన్ ముఖంలో రంగులు మారాయి. ""ఇన్ స్పెక్టర్...పేరూ, అడ్రస్ లేని ఎవరో వ్యక్తి ఫోన్ చేసి చెప్పగానే నమ్మారా....?"" వాళ్ళ సంభాషణ వింటున్నకొద్దీ రకరకాల అనుమానాలు పుట్టుకొచ్చాయి సంజీవికి. గోడకు తగిలించివున్న ఫోటోవైపు యధాలాపంగా చూసిన సంజీవి త్రుళ్ళిపడింది. కాళ్ళక్రింద భూమి రెండుగా చీలి తాను అందులో కూరుకుపోతున్న భావన. అతి కష్టంమీద తనను తను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. రాజశేఖర్, చందనల పెళ్ళి ఫోటో అది. తాను ఎందుకొచ్చిందో...ఏం చేయాలని వచ్చిందో అన్నీ మరచిపోయి శూన్యంలోకి చూస్తుండిపోయింది సంజీవి. ""మిస్టర్ మురుగన్ ఐయాం కమింగ్ స్ట్రెయిట్ టు ది పాయింట్. నో మోర్ డిస్కషన్స్. ఇదిగో సెర్చ్ వారంట్....ఈ భవనాన్ని చెక్ చేయబోతున్నాను. దయచేసి మాకు అడ్డుతగలకుండా సహకరించండి"" ధీరజ్ స్వరం స్థిరంగా వుంది. అప్పటికే పోలీసు సిబ్బంది ఆ భవంతికి ఉన్న అన్నీ ద్వారాలవద్ద కావలి వున్నారు. మరో వేపు ఆ బిల్డింగ్ అణువు అణువులోనూ సెర్చ్ జరుగుతోంది.                                               *    *    * ""నీ పేరేమిటమ్మాయ్..."" ఇన్ స్పెక్టర్ ధీరజ్ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ""సంజీవి"" తడబడుతూనే చెప్పింది. ""నిన్ను ఎక్కడో చూసినట్టుందే! పోనీ నువ్వు నన్ను ఎప్పుడయినా చూశావా?"" క్షణం ఆలోచించి తెలివిగా, చూడలేదన్నట్టు తల ఊపింది." 53,"     ""ఇప్పుడా?!"" ఆశ్చర్యపోతూ అడిగింది పూజ.     ఆమె ఫోన్ లో నిర్మలతో మాట్లాడుతూనే, ఒపేరా గ్లాసెస్ లోంచి శ్రీధర్ ఫ్లాట్ ని చూస్తోంది.     ""ఏమయింది? ఈ వీక్ నీ డ్యూటీ ఆఫ్టర్ నూన్ కదా? మనిద్దరమేకాదు- నా డార్లింగ్ యోగి కూడా వున్నాడు"" అంది ఫోన్ లో ఆ వేపు నుంచి నిర్మల.     ఒక్కసారి ఆమెమీద పెనువేగంతో కోపం వచ్చింది పూజకి.     క్షణాల్లో తనని తాను నిగ్రహించుకుంది.     ""నీకు బుద్ధుందా? నీ ఫ్రెండ్ యోగి, అతని ఫ్రెండ్ శ్రీధర్ నుంచి నేను కొన్ని నిజాల్ని దాచాలనుకుంటున్నానని నీకు తెలుసు. తెలిసి కూడా ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి క్రిందకి రమ్మంటే ఏమిటర్థం? ఇంకా నయం- నా పేరు ఉచ్చరించలేదు.     నువ్వు మాట్లాడకు. నేను చెప్పేది విను. నేనిప్పుడు రాను. నువ్విప్పుడు ఫోన్ చేసింది ఎవరికని నీ ఫ్రెండ్ యోగి అడిగితే ఏదో వేరే పేరు చెప్పేయ్. ఆ పేకాట గోలేదో మీరిద్దరే చూసుకోండి. ఉంటా..."" అంటూ పూజ అదురుతున్న గుండెని అదుపులో పెట్టుకుంటూ ఫోన్ పెట్టేసింది విసురుగా.     కొద్ది క్షణాల్లోనే ఆ ఉద్రిక్తత నించి తేరుకుని శ్రీధర్ ఫ్లాట్ కేసి చూసింది.     అప్పుడే శ్రీధర్ ఫ్లాట్ లోంచి బయటకెళుతూ కనిపించాడు.     తన ఫ్లాట్ లో తను ప్రశాంతంగా వుండలేని శ్రీధర్ స్థితిని తలుచుకుని బాధపడింది పూజ.     ఈ రాత్రివేళ ఎక్కడికి వెళతాడు?     ఎక్కడ నిద్రపోతాడు?     పోనీ తనెళ్ళి తీసుకొస్తే? తనని మాళవికగానే గుర్తించవచ్చు. ఫోన్స్ చేసే పూజగా ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించలేడు. కానీ తర్వాత తన ఫ్లాట్ కి రావటం మొదలెడితే...     పూజగా తనెక్కడి నించి ఫోన్ చేయాలి? అదో పెద్ద సమస్య...మామూలు టైంలో అయితే ఎదురురెళ్ళి మాళవికగానే రిసీవ్ చేసుకుని నిర్మల ఫ్లాట్ కి తీసుకురావచ్చు. ఇది బాడ్ టైం. ఈ టైంలో సహాయం చేయాలని ఎదురెళితే జూబ్లీహిల్స్ లో వుంటున్న మీరు యీ టైమ్ లో ఇక్కడ ప్రత్యక్షమయ్యారేమిటని అడిగితే?     రెండే జరుగుతాయి....     ఒకటి: అపార్థమన్నా చేసుకుంటాడు.     రెండు: ఫోన్స్ చేసే పూజ, ఎదురుపడిన మాళవిక ఒకటేనేమోనన్న అనుమానం రావచ్చు.     మరిప్పుడెలా...?     ఇప్పుడేమాత్రం ఆలస్యం చేసినా మేన్ ఈటర్ లాంటి జయారెడ్డి చేతుల్లో ఇరుక్కు పోవచ్చు. అది మరింత నష్టం.     అందుకే పెద్దలు ఎప్పుడూ అంటుంటారేమో...     Always set a place for the unexpected guest...     అనుకోని అతిథికి ఆతిధ్యమివ్వగలిగే అవకాశం ఎప్పుడూ మన చేతుల్లో వుంచుకోవాలి.     ఎప్పుడు ఏంజరుగుతుందో? ఎప్పుడు ఎవరు ఎలా మన జీవితంలోకి ప్రవేశిస్తారో? వాళ్ళు మనమీద, మన మనసుమీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారో, ఆ ప్రభావంతోనే వాళ్ళు ఎన్నాళ్ళు మన మనసుల్లో తిష్టవేసుకుని వుండిపోతారో, ఎవరూ వూహించలేని విషయం.     ఏది ఏమయినా ఒక ఒంటరి స్త్రీ జీవితంలోకి ఒక ప్రియుడు ప్రవేశించవచ్చు. భర్త ప్రవేశించవచ్చు... ఆ తరువాత కూతురో...కొడుకో... ప్రవేశించవచ్చు.     ఆ ప్రియుడు ఎన్నాళ్ళుంటాడు?     భర్త ఎన్నాళ్ళుంటాడు? కడదాకానా? చెప్పలేం.     పిల్లలు... వాళ్ళు ఎన్నాళ్ళు? రెక్కలొచ్చి ఎగిరెళ్ళిపోతే... మిగిలేది ఎవరు?     ఆ తర్వాత మనుమళ్ళు, మనుమరాండ్రో... వాళ్ళు ఎన్నాళ్ళు? ఆ తర్వాత ముది మనుమళ్ళు.     ఒకే ఒక ఒంటరి జీవితానికి మరెన్ని జీవితాలు ముడిపడిపోతాయి?     మానవ జీవిత ప్రయాణమే ఒక సంక్లిష్టమైన యాత్ర... ఏ మజిలీ వద్ద ఎవరు మనతో కలుస్తారో...? తిరిగి ఏ మజిలీ దగ్గర విడిపోతారో తెలీని స్థితి మనిషిది.     You cannot plan everything that is going to happen to you, but you should be prepared for it. Because if you don't, you are going to be hurt badly in this world.     ఒక బిడ్డ పుట్టాక, మూడు నెలలకి ఒక స్త్రీ మెడికల్ చెకప్ కి డాక్టర్ దగ్గరకెళితే-ఆ డాక్టర్ చెకప్ చేసి-     of course, you are pregnant again you know అని. అంటే ఏంచెయ్యాలి?     ఆమె ప్రణాళికలో రెండో బిడ్డ గురించి ఆలోచన ఆమెకులేదు.     But he wonderful surprise guest....     పరిపరి విధాల ఆలోచిస్తూనే, నిర్మలకి ఫోన్ చేసింది పూజ.     ""నేను పూజని-నువ్వేం మాట్లాడకు-నారెండు పేర్లలో దేన్నీ ఉచ్ఛరించకు. శ్రీధర్ చాలా ఇబ్బందుల్లో పడిపోయాడు. తన ఫ్లాట్ ని ఈ రాత్రికి మరొకరికి వదిలి బయటకెళ్ళిపోతున్నాడు-ఈ రాత్రి గడపటానికి. ప్రస్థుతం అతనికి బసలేదు. నువ్వు, యోగి త్వరగా 'ఏ' బ్లాక్ వద్దకెళ్ళి అతడ్ని నీ ఫ్లాట్ కి తీసుకురా! ఈ రాత్రికి తనకి నీ ఫ్లాట్ లోనే ఆశ్రయం కల్పించు. ఇది నా అభ్యర్థన. ఎందుకు...? ఏమిటి...? లాంటి ఇరిటేటింగ్ క్వశ్చన్స్ యిప్పుడేయకు. ఆ తర్వాత నువ్వు అడక్కపోయినా నేనే చెపుతాను. కమాన్ క్విక్... ప్లీజ్...మరో విషయం మర్చిపోకు... అతడికే మాత్రం అనుమానం రాకూడదు. అటు పనున్నట్లు వెళితే శ్రీధరే మీకు ఎదురుపడతాడు... అతన్ని మీరు మాటల్లో పెడతారు.     అతని సమస్యని తెలుసుకుంటారు. ఆపైన అర్థం చేసుకుంటారు.     ఈ రాత్రికి నువ్వు శ్రీధర్ కి బస ఏర్పాటు చేయాలనుకున్నావు. ఎందుకనుకున్నావంటే...యోగికి శ్రీధర్ మంచి ఫ్రెండ్ గనుక. అర్థమైందా... మూవ్ ఫాస్ట్"" అని ఫోన్ పెట్టేసింది పూజ.                                                      *    *    *    *     మరో రెండు నిమిషాల్లో నిర్మల, యోగిని తీసుకుని 'ఏ' బ్లాక్ కేసి దూసుకుపోయింది." 54,"        చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. అరుంధతి పరిస్థితి కాస్త మెరుగయింది కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి ఆమెది. ఉన్నట్టుండి కడుపు నొప్పితో విలవిల లాడిపోతుంది. మందువేసి దానికది తగ్గేవరకు చూస్తూ ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదు.         బాల్యం అమాయకత్వానికి ప్రతిరూపం కావచ్చు. కాని కొన్ని సంఘటనలు, అభిప్రాయాలు జీవితాంతం గుర్తుండేలా ఆ సమయంలోనే హృదయంలో ముద్రించుకుపోతాయి. తండ్రి ఔన్నత్యాన్ని చూపే అలాటి సంఘటన ఒకటి పావనికి జరిగింది.         విశ్వపతి ఊరినుంచి వచ్చిన మర్నాడే అరుంధతికి విపరీతమైన కడుపునెప్పి వచ్చి అప్పటికప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. కనీసం రెండు నెలలపాటు అక్కడే ఉండి ట్రీట్ మెంట్ తీసుకోవాలన్నారు. ఆ రెండు నెలలు విశ్వపతి పడ్డ ఆరాటం అందర్నీ కదిలించింది. అరుంధతికి కాస్త నెమ్మదించాక మళ్ళీ ఇంటికి తీసుకువచ్చారు.         అంత హడావిడిలో అమ్మమ్మ, తాతయ్య, అమ్మతో చాలా సేపు గదిలో మాట్లాడారు. తర్వాత వాళ్ళిద్దరూ నాన్నను లోపలకు పిలవడం గమనించి ఆశ్చర్యపోయింది పావని. కుతూహలంగా గుమ్మం దగ్గర నిలబడింది.         ""పావనికి చదువు పాడయిపోతోంది. అక్కడకు వెళ్ళాక వయసుకి మించిన భారం నెత్తిన వేసుకోవాల్సి వస్తోంది. ఇటేమో దీని పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది. కనిపెట్టుకుని ఉండే వాళ్ళు లేకపోయారు"" అన్నాడు తాతయ్య ఉపోద్ఘాతంగా.         ""మాది పరిష్కారం లేని సమస్య మామయ్యా చెయ్యగలిగిందేముంది?""         ""ఇంత చిన్న వయసులోనే నీకు అన్ని విధాలుగా సుఖంలేకుండా పోయింది. నువ్వు మరో వివాహం చేసుకో బాబూ అది చెప్పడానికే పిలిచాను. నువ్వు ఊ అంటే నా తమ్ముడి కూతురు సుందరి నీకు తెలుసుగా వాళ్ళు సంతోషంగా ఒప్పుకుంటారు"".         ""ఏమిటి మామయ్యా మీరంటున్నది....?"" విశ్వపతి కోపంగా అన్నాడు.         ""కోపం వద్దు! నేను చెప్పేది పూర్తిగా విని నిదానంగా ఆలోచించు. అరుంధతిని చూసుకుంటూ, పిల్లలకు నీకు అండగా అన్ని అమర్చి చేసి పెట్టె వాళ్ళ అవసరం నీకు చాలా వుంది. పోనీ మన బంధువుల్లో అలాంటి వాళ్ళున్నారా  అంటే ఎవరూ లేరు. సుందరికి ముఫ్ఫయి ఏళ్ల వయసు వచ్చింది. పెళ్ళి చేయగల తాహతు వాళ్ళన్నయ్యకు లేదు. తండ్రి లేడు. తల్లి ఇవ్వాళో, రేపో అన్నట్టుంది. అందరికీ భారం అయిపోయింది. అలాంటి అమ్మాయయితే కృతజ్ఞతాభావంతో పిల్లలను బాగా చూసుకుంటుంది. దానికి అరుంధతన్నా పిల్లలన్నా చాలా ఇష్టం కూడా. ఇది మా నిర్ణయం మాత్రమే కాదు. అరుంధతిది కూడా.""         ""మీరు చెప్పడం పూర్తయితే నా ఉద్దేశ్యం చెపుతా మామయ్యా! సుందరి అరుంధతికి చెల్లెలు. నాకూ చెల్లెలిగానే అనిపిస్తుంది. అభ్యంతరం లేకపోతే సుందరిని మాతో తీసుకెళతాను. ఓ చెల్లెలిగా చూసుకుంటాను. ఉన్నదాంట్లో ఇంత పెడతాను. ఆమె మాకు భారం అన్న భావం ఎప్పుడూ కలగదు. మరో పెళ్ళి చేసే ఉద్దేశ్యం ఉంటే మంచిదే. సంబంధం సెటిలయితే పంపించి వేస్తాను. నాకు చేతనయిన సహాయం చేస్తాను"". అతడు అరుంధతివైపు తిరిగి అన్నాడు. ""నీ కిలాంటి ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్ధం కావడంలేదు. నేనెప్పుడయినా సుఖంగా లేనట్లు ప్రవర్తించానా?""         ""అదికాదండీ? ప్రొద్దునే లేచి మీరు వంట చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం అన్నీ చేస్తుంటే చూస్తూ వూరుకోలేక అమ్మతో చెప్పాను. నేను నిజంగా ఎంత అదృష్టవంతురాలనో ఇప్పుడు బాగా అర్ధం అవుతోంది.""         ""భర్త మరో పెళ్ళి చేసుకోననడం అదృష్టంగా భావించే స్థితినుంచి మీరింకా ఎదగాలి అరుంధతీ. వాళ్ళు నా పిల్లలు! నా బాధ్యత నాది!! నేను వంట చేసినా, వొళ్ళు కడిగినా అది తప్పుగా అనుకోకు. వాళ్ళు ఎప్పటికి ఎవరికీ భారం కాకూడదు. అందుకే పిల్లలను ఇక్కడ వదిలి వెళ్ళడం గూడా నాకు ఇష్టం లేదు. ఇకముందు ఇలాంటి విషయాలు ఎప్పుడూ ప్రస్తావించకండి.""         విశ్వపతి బయటకు వస్తున్న శబ్దం వినిపించి పావని పక్కకు తప్పుకుంది.         ""నాన్న దేవుడు చాలా అరుదయిన మనిషి అతను మాకు నాన్న అవడం అదృష్టం. ఆయన ఎప్పుడూ మనసు కష్టపెట్టుకోకుండా చూసుకోవాలి. ఆయన బాధ్యతలో తనూ భాగం పంచుకోవాలి"" అనుకుంది.         తండ్రి మీద గౌరవంతోపాటు తనకు కాబోయే భర్త ఎలా వుండాలన్న ఆలోచనకు అప్పుడే బీజం పడిపోయినట్లు ఆమెకు తెలియదు.         ఆమె జీవితంలో మొట్టమొదటి స్నేహితుడు ఆమె తండ్రి. మొగవాడంటే ఇలా వుండాలి- అన్న అభిప్రాయం కల్గించినవాడు- గౌరవం పెంచినవాడు....         ఆమె జీవితంలో రెండో మొగవాడు భర్త. అతడేం అభిప్రాయం మిగులుస్తాడో కాలమే నిర్ణయించాలి.                                 *    *    *         విశ్వపతి రెండో భార్యగా కాకుండా, కేవలం భార్య చెల్లెలుగా సుందరి ఆ ఇంట్లో ప్రవేశించింది.         త్వరలోనే సుందరి ఆ ఇంట్లో ఇమిడిపోయింది. అక్కకు నర్స్ లా సపర్యలు చేసేది. ఇంటిపని, వంటపని అంతా తనే చేసుకుపోయేది.         మొదట్లో విశ్వపతి ఉదయమే లేచి ఇంట్లో ఆడపనులన్నీ చేస్తుంటే సుందరి సిగ్గుపడేది. మెల్లిగా ఒక్కో పనిలో చేతులు కలుపుతూ, యింటి పనుల్లో అతడి జోక్యం లేకుండా చేయడానికి చాలా కృషి చేయవలసి వచ్చిందామెకు. అతడిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగానూ, సంతోషంగానూ అనిపించేది.         పుట్టింట్లో స్వంత అన్నయ్య దగ్గర పరాయిదానిలా మెదులుతూ, ఓ పీడగా ఎత్తి చూపబడుతూ ఇన్నాళ్ళు ఆమె నరకం అనుభవించింది. ఈ గౌరవం ఇక్కడ లభించడం ఆమె కలలో కూడా వూహించనంత గొప్ప అనుభవం!         పావని అంటే ఆమెకు ప్రత్యేక అభిమానం.         ""పావనీ! పరీక్షలు దగ్గర కొస్తున్నాయి. ఇలా దిగులుగా కూర్చుంటే ఎలా?"" దగ్గరగా వచ్చి కూర్చుంది సుందరి. అప్పటికి పావని తొమ్మిదో తరగతిలోకి వచ్చింది.         ""ఏమిటి పిన్నీ! నాన్న ఇంకా రాలేదు. తొమ్మిదికల్లా వస్తానన్నాడు. పదకొండవుతోంది.""         ""పనిమీద వెళుతున్నానని చెప్పారు కదా. ఆలస్యమవుతుందని గూడా చెప్పారు.""         ""నీకు అర్ధంకాదులే పిన్నీ! నాన్న రావడం కాస్త ఆలస్యమైనా నాకు చాలా గాభరాగా, దిగులుగా వుంటుంది"" అంది పావని. ఆ అమ్మాయి మాటల్లో 'నీకీ ప్రేమ అర్ధంకావటం లేదా?' అన్న మందలింపు కూడా కనపడింది.         సుందరి పావని వైపు ఓ క్షణం కన్నార్పకుండా చూసింది. ఆమె కూడా వయసులో మరీ పెద్దదేమీ కాదు. కానీ మంచి లోకజ్ఞానం వుంది. పుస్తకాలు బాగా చదువుతుంది.         తండ్రిమీద అభిమానం వుండడంలో తప్పులేదు. కానీ పావని అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది తండ్రిని! ఈ 'అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రేమించటం' అనేది చాలా మందిలో ఆమె చూసింది. ముఖ్యంగా హాస్టల్ లో చదువుకొనే అమ్మాయిలు- ఒకరిని తన 'ఐడియల్ షి'గా ఎన్నుకుని ఇక ఆ మూడు సంవత్సరాలు ఆమె మెప్పుపొందాలని అనుకుంటూ వుంటారు. అది రూమ్ మేట్ అవ్వొచ్చు, బోటనీ లెక్చరర్ అవ్వొచ్చు. 'తను లేకుండా నేను వుండలేను' వగైరా వాక్యాలు డైరీల్లో వ్రాసుకోవటం- తన జీవితం అంతా అవతలి వారి మీదే ఆధారపడి వుందనుకోవటం ఆమె చూసింది! ఆత్మన్యూనతాభావం, ప్రేమలేని, ఆధారపడే గుణం- ఇవన్నీ కలిసి బహుశా ఇలాంటి వ్యక్తుల్ని తయారుచేస్తాయేమో అనుకుంది సుందరి.         కొంత వయస్సు వచ్చేవరకు ఎదుటి వ్యక్తులవల్ల ప్రేరణ పొందవచ్చేమోగానీ, ఆ తరువాతైనా తనంతట తను వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోలేని వ్యక్తులు జీవితంలో చాలా విలువైన 16-24 మధ్య వయస్సుని ఈ ఆరాధనా భావంతో గడిపేస్తారు.         పావని పట్ల సుందరికి భయంగా వుంది. ఆ అమ్మాయికి నిర్దుష్టమైన అభిప్రాయాలంటూ ఏమీ లేవు. సగటు తెలుగు ఆడపిల్ల. కాలంతోపాటు ఆమె మారలేదు. ఏదో రోజులు మామూలుగా గడిచిపోతున్నాయికదా చాలు - అన్న ఆలోచనే ఆమెకి సంతృప్తినిస్తుంటుంది. అది సుందరికి నచ్చదు. పూర్వకాలంలా కాదిప్పుడు. మునుపులేని సమస్యలెన్నో ప్రతుతపు ఆడపిల్ల ఎదుర్కోవాలని ఆమె వుద్దేశ్యం. అయితే ఇవేమీ చెప్పకుండా తన ఆలోచన్లని తనలోనే దాచుకుని ""పిచ్చి ఆలోచనలు మానేసి దృష్టి చదువుమీదకు మళ్లిస్తే మంచిది"" అంది క్లుప్తంగా.         ""పాసయిపోతాలే పిన్నీ"" తేలిగ్గా అంది పావని.     ""కేవలం పాసవడం కాదు పావనీ! బాగా చదవాలి! పట్టుదలగా చదవాలి!! మంచి మార్కులతో పాసవ్వాలి. చదువు స్త్రీలకెంత ముఖ్యమో నీకు అర్ధంకావడంలేదు. ఆ చదువే పూర్తికాక నేనెన్ని కష్టాలుపడ్డానో నీకు తెలియదు. ఆర్ధిక స్వాతంత్ర్యం లేని స్త్రీకి స్వేచ్చ లేదు పావనీ.""         ""అంటే నువ్వు మా ఇంట్లో గూడా సంతోషంగా లేవా? ఇక్కడ స్వేచ్చ లేదా?""         ""అలా అని నేననలేదు. అది అదృష్టం. అన్ని చోట్లా  అది దొరకదు. ఒక్క మనింటినే ప్రపంచం అనుకోకు. ఎల్లకాలం ఈ నాల్గుగోడల మధ్య వుండేదానివి కావు. ఉద్యోగం లేకపోయినా, కనీసం చడువైనా వుంటే ఎప్పటికయినా అవసరానికి ఆదుకుంటుంది. అనుభవంతో చెపుతున్నాను.""" 55,"    ""రోజూ ఒక్కొక్క ప్లేస్ లో వున్న ఒక స్థాయి హోటల్స్ లో చెక్ చేయవలసి వుంటుంది. ఈ వర్క్ కాస్త రిస్క్ గానూ, బోర్ గానూ వున్నా ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంతకంటే చేయగలిగే ప్రోసెస్ మరొకటిలేదు. ఏదయినా చిన్న క్లూ దొరికితే తప్ప మనం ప్రొసీడ్ కాలేం""         ""అవును మేడమ్...అలాగే చేద్దాం. ముందు ఈ రోజంతా ఈ కన్నాట్ ప్లేస్ లో వున్న హోటల్స్ లో ఎంక్వయిరీ చేద్దాం..."" అన్నాడు అన్వేష్.         అతని మాటలకు ధీరజ పకపకా నవ్వింది.         ఎందుకు నవ్విందో అర్ధం కానట్టు ముఖం పెట్టాడతను.         ""ఈ ఏరియాలో ఒక మాదిరి హోటల్స్ ఎన్ని వున్నాయని మీ ఉద్దేశం?""         ""మహా అయితే పది వుండొచ్చేమో...."" అన్నాడు అన్వేష్.         ""భలేవారే.....ముప్పయ్ నలభై వరకూ వున్నాయి. ఈ సెంటర్ ఎంత పెద్దదో, ఎంత దూరం విస్తరించి వున్నదో మీరే తెలుసుకుంటారుగా..."" చెప్పి అశోకా ఇంటర్నేషనల్ లోకి నడిచింది.         ఆశ్చర్యపోతూ ఆమెను అనుసరించాడు అన్వేష్.         మిస్ ధీరజ నేరుగా రిసెప్షన్ కౌంటర్ వైపు నడిచి ఇన్స్ పెక్టర్ అన్వేష్ తన దగ్గరున్న ఫోటోలను బయటకు తీసి కౌంటర్లో వున్న ఇద్దరు వ్యక్తులను చూపించాడు.         ""ఆ ఫోటోలలో వున్న వ్యక్తులు మీ హోటల్ లో దిగారేమో చూసి చెప్పండి""         వాళ్ళు ఆ ఫోటోలను రెండు మూడు నిమిషాలు పరిశీలించిన తరువాత.... పెదవి విరిచారు.         ""సరిగ్గా చూడండి...."" రెట్టించాడు అన్వేష్.         ""లేరు సార్...అయినా ఎంతో మంది కస్టమర్లు వస్తుంటారు....వెళుతుంటారు. వాళ్ళందరినీ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం...."" అన్నాడొకడు నిర్మొహమాటంగా.         ""అసలింతకూ మీరెవరు?"" రెండవవాడి ప్రశ్న....         ""ఉయ్ ఆర్ పోలీసు..."" అన్వేష్ సీరియస్ గా చెప్పాడు.         ధీరజ ఒక పక్కన నిలిచి మౌనంగా చూస్తుండిపోయింది.         రిసెప్షన్ కౌంటర్ లోని వాళ్ళు మరొక రెండు నిమిషాలు సిన్సియర్ గా ఫోటోలు పరిశీలించి ఎవరూ లేరని చెప్పడంతో నిరుత్సాహంగా వెనుదిరిగాడు అన్వేష్.         ధీరజ అక్కడకు దగ్గరలో వున్న 'జైన్ ఇంటర్నేషనల్' హోటల్ వైపు అడుగులు వేస్తున్నది.                                            *    *    *         ""ఒక పని చేద్దాం....""         అంటున్న జాజిబాలవైపు ప్రశ్నార్ధకంగా చూసాడు రాంగో.         ""కేంద్ర మంత్రులందరూ వుండేది ఢిల్లీలోనే కాబట్టి కేంద్ర హోం మంత్రి సుందరయ్యగారిని కలిసి విషయమంతా వివరించి విగ్రహాలను స్వాధీనం చేస్తే ఎలా వుంటుంది?""         జాజిబాల చెప్పింది.         రాంగో చురుగ్గా చూసాడు.         జాజిబాల మాటలను అంత తేలిగ్గా తీసిపారేయదానికి వీల్లేదు. అయితే చిన్న చిక్కూ ఒకటి వున్నది. ఎటొచ్చీ తమంతట తామే ఎక్కడ వున్నదీ తెలియ చేసుకుంటున్నాం కాబట్టి జజైబాల తండ్రికీ తెలియ చేసుకుంటున్నాం కాబట్టి జాజిబాల తండ్రికీ తెలుస్తుంది..తన బాసుకూ తెలుస్తుంది. బాస్ విషయం ఎలా వున్నప్పటికీ ఇంత జరిగాక జాజిబాల నుంచి తనను దూరంగా నెట్టివేయరని గ్యారంటీ ఏమిటి?         రాంగో మనసంతా చికాగ్గా వుంది.         అతను ఏమీ మాట్లాడకపోయేసరికి ఆమె మరోలా భావించింది.         ""నీకు నా మాటలు నచ్చకపోతే అట్టే ఆలోచించి తలనొప్పి తెచ్చుకోవద్దు. ఆ విషయం వదిలేసి ఇంకేదయినా మార్గం చూడు....""         అప్పటికే రాంగో ఒక నిశ్చయానికొచ్చాడు.         ఏదో అవుతుందని చెప్పి ఆ విగ్రహాలను తమ దగ్గరే వుంచుకోవడం ఎంత ప్రమాదమో తెలుసు కాబట్టి ఏదయితే అది అవుతుందనే మొండితనంతో ఆ విగ్రహాలను అప్పజెప్పడానికే నిర్ణయించుకున్నాడతను.            ""అది కాదు బాలా.....నువ్వు చెప్పినట్టుగానే కేంద్ర మంత్రి సుందరయ్య గారికే అందజేద్దాం. కానీ హోం మంత్రిని కలుసుకోవడమంటే అంత సులువు కాదు. ఆయన ఎంత తెలుగువాడయినప్పటికీ ఆ విగ్రహాలతో ఆయన్ను కలవడం చాలా కష్టం. ఒకవేళ ఏదయినా పబ్లిక్ మీటింగ్ జరగబోయేటప్పుడు వెళ్ళి కలుద్దామంటే విపరీతమైన సెక్యూరిటీ వుంటుంది. అసలే ఈ మధ్య టెర్రరిస్టు కార్యకలాపాలు ఎక్కువవడంతో కొత్త వ్యక్తి ఎవరు కనిపించినా సోడా చేసి కానీ వదలడం లేదు. అలాంటప్పుడు ఈ విగ్రహాలనూ చూడటమంటూ తటస్థిస్తే మనమే ఆ దొంగతనం చేసామంటూ అరెస్టు చేస్తారు. మనకేమీ తెలియదు మొర్రో అన్నా వినిపించుకోరు....నిజం చెప్పడానికి అసలు విగ్రహాల దొంగలు వచ్చి చెప్పరు కాబట్టి చివరకు ఆ విగ్రహాల దొంగలు మనమే అని భావించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి...అందుకే తెలిసి తెలిసి ప్రమాదంలో అడుగుపెట్టడం ఎలా అని ఆలోచిస్తున్నాను....""         తన ముందున్న పరిస్థితినీ ఎనలైజ్ చేసి మరీ చెప్పాడతను.         ""రాంగో....నువ్వన్నదీ కరెక్టే...మరయితే ఈ విలువైన విగ్రహాలనూ ప్రభుత్వానికి అప్పజెప్పేదెలా? అంతేకాదు....మన కోసం ఇంకో ప్రమాదం పొంచివుందని నా అనుమానం""         ""ఏమిటది...."" బెదురుతున్న కళ్ళతో ప్రశ్నించింది జాజిబాల.         ""ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి ఈ విగ్రహాలను సంపాదించిన ఆ దొంగలు తాము విగ్రహాలను చేజార్చుకున్నామని తెలిసిన మరుక్షణంలో నుంచే మనకోసం ఈ ఢిల్లీ నగరంలో వేట ప్రారంభం అవుతుంది...."" అన్నాడు రాంగో.         ""అవును....నువ్వు చెప్పింది నిజమే...మరేం చేద్దాం"" భయంతో నోరు తెరిచిందామె.         ""అబ్బ....ప్రతిదీ నేనె ఆలోచించాలా?....ఆ సలహా ఏదో నువ్వే చెప్పొచ్చుగా""         రాంగో విసుక్కోవడంతో జాజిబాల బుంగమూతి పెట్టింది.         అది గమనించిన రాంగో చటుక్కున ఆమె దగ్గరకు జరిగి ఆ పెదవులను తన పెదవులతో కలిపి ముద్దు పెట్టుకున్నాడు." 56,"     ఇలా ఆలోచించే కొద్దీ శ్రీహరిమీద ఆమెకి అనుమానం బలపడసాగింది.     ""మరి నే వస్తా"" అని శ్రీహరి బయల్దేరాడు.     అప్పటికప్పుడు ఓ నిర్ణయానికి వచ్చిన స్నేహలత ""ఓపెన్ యూనివర్సిటీకి బి.ఎ.కి కట్టారన్నారుగా. మా తమ్ముడు ఒకడు దానికే కట్టాడు. మీ పుస్తకాలు ఏం చదువుతున్నారో చూపిస్తే నేనూ అవే వాడికి కొంటాను. మీ రూము వరకూ వస్తాను. పుస్తకాలు చూపిస్తారా?"" అని అడిగింది స్నేహలత.     ఆ మాటలకి షాక్ తిన్నట్టు వుండిపోయాడు శ్రీహరి. ఇప్పుడేం చెప్పాలో, ఆమె రాకుండా ఎలా ఆపాలో తెలియలేదు. అయినా ఈ మధ్య కొంత గుండె దిటవు అలవరుచుకున్నాడు.     అందుకే క్షణంలో సర్దుకుని-     ""ఎందుకండీ మీకు శ్రమ? రేపు నేనొచ్చినపుడు పుస్తకాల లిస్ట్ తెచ్చిస్తాను"" అన్నాడు.     స్నేహలత ఒప్పుకోలేదు. విధిలేని పరిస్థితులలో ""సరే రండి"" అని ముందుకు అడుగులు వేశాడు.     అదే వీధిలో ఉత్తరంవేపు నాలుగడుగులు వేస్తే ఆ ఇల్లు వచ్చింది. వీధి ఎడమపక్క వుందది. ముందు వీధి కనపడకుండా పెద్ద గేటుంది.     ఆమె రాఘవానంద, తన తండ్రిని చూస్తే కొంప మునుగుతుందని అతనికి తెలుసు.     వాళ్ళిద్దరూ కనపడకుండా ఎలాగయినా మేనేజ్ చెయ్యాలి. అందుకే గేటు తీసుకుని లోపలికి వడివడిగా అడుగులేశాడు శ్రీహరి.     కపూర్ వంటగదిలో టిఫిన్ చేస్తున్నాడు.     ""మా నాన్న, రాఘవానంద ఎక్కడున్నారు?"" మెల్లగా అడిగాడు.     ""ఇప్పుడే బయటికెళ్ళారు సాబ్""     ఆ మాట వింటూనే సగం టెన్షన్ తగ్గింది శ్రీహరికి. ఇక పెద్దగా భయపడవలసింది ఏమీ లేదనుకుని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.     స్నేహలత అతనితో అవీ ఇవీ మాట్లాడుతూ సందేహించాల్సిన వస్తువులుగానీ వ్యక్తులుగానీ కనిపిస్తాయేమోనని పరిశీలిస్తోంది.     కానీ అలాంటివేమీ కనపడడం లేదు.     ""పుస్తకాలేవీ?"" అని అడిగింది తను ఏ సాకుతో ఇక్కడికి వచ్చిందీ గుర్తొచ్చి.     ""పుస్తకాలా!"" ఆమె మరిచిపోయిందేమోననుకున్న శ్రీహరికి మళ్ళీ ఆమె పుస్తకాలు అడగడంతో ఏం చెప్పాలో తోచలేదు.     ""అవీ... ఇవీ.... ఓ ఫ్రెండ్ నిన్ననే ఎత్తుకెళ్ళాడు"" అప్పటికి తోచిన అబద్ధం చెప్పాడు.     ""పోనీ పుస్తకాల పేర్లయినా చెబుతారా?""     దానికి సమాధానం తెలియదు అతనికి.     ""పెద్దగా గుర్తులేదు! మా నాన్న పోరుకు ఇక్కడకు వచ్చానుగానీ నాకయితే ఈ బి.ఏ.లు, ఎం.ఎ.లు చదవాలని లేదు"" అన్నాడు శ్రీహరి.     పుస్తకాలు ఏం వున్నాయో తెలియకపోవడంతో ఆమె తన అనుమానం నిజమని భావిస్తోంది.     చదువంటే బొత్తిగా ఇంట్రెస్టు అయినా లేకుండా వుండాలి. లేకుంటే చదువు పేరుతో ఇక్కడ తిష్ట అయినా వేసి వుండాలి.     అతను ఏ ఉద్దేశ్యంతో ఇక్కడ వున్నాడో ఆమె కనిపెట్టలేకపోతోంది.     మరి కాసేపు కబుర్లు ప్రారంభించింది.     మర్యాద కోసం శ్రీహరి కాఫీ ఇచ్చాడు.     అది తాగాక అక్కడుంటే తనమీద సందేహం రావచ్చని అక్కడి నుంచి వచ్చెయ్యడానికి లేచింది.     వస్తూ- వస్తూ అటూ- ఇటూ చూస్తున్న ఆమె దృష్టి ఓ దగ్గర ఆగిపోయింది.     లోపలున్న గదిలో స్టాండ్ కు వేలాడుతున్న ఎర్రటి అంగవస్త్రం ఆమె కళ్ళ పడింది.     ఎర్రటి అంగవస్త్రాన్ని ఎవరు వేసుకుంటారు? స్వాములా? మంత్రగాళ్ళా? మరి దానిని చూస్తూ వున్న ఆమె శ్రీహరి తన వెనుక వస్తున్నాడనిపించగానే దృష్టి మరల్చుకుంది. శ్రీహరి గేటుదాకా వచ్చి సాగనంపాడు.     ఇంటికి వచ్చినా ఆమె దృష్టి నుంచి అంగవస్త్రం పోలేదు. ఆ ఇంటిలోంచే ఏదో జరుగుతోంది. శ్రీహరి, కపూర్ కాక మరెవరో ఆ యింట్లో వున్నారు. వారే అనూహ్యమీద దుష్టశక్తుల్ని ప్రయోగిస్తున్నారు.     ఇదంతా మాయాదేవికి చెప్పాలన్నంత ఎగ్జయిట్ మెంట్ కి గురయింది. కానీ ఇప్పుడే చెప్పకూడదు. ఇదంతా తన అనుమానమే.     తన సందేహాలతో వాళ్ళ బంధుత్వాన్ని తెంచేయకూడదు. ఏది ఏమైనా తను అనూహ్యను రక్షించుకోవాలి. ఇందుకోసం తను ఎంతటి రిస్క్ అయినా భరించాలనుకుందామె.     మాయాదేవి ఇంటిపనులన్నిటినీ పూర్తి చేసుకున్నాక ఇద్దరూ పూర్ణానందస్వామి దగ్గరికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళేటప్పటికి మాధ్యాహ్నమైంది.     స్వామి తీరిగ్గా వున్నాడు.     ఆయన మధ్యాహ్న భోజనానికి ఇంకా గంట టైము వుండడంతో మాయాదేవితో నింపాదిగా ముచ్చటించడం ప్రారంభించాడు.     ""ఇప్పుడు ఎలా వుంది మీ ఆడపడుచుకి?"" ఆయన మొదటి ప్రశ్న అదే.     అంతమంది భక్తుల మధ్య తమను గుర్తుపెట్టుకోవడం అంటే గొప్ప విషయమే. మరింత భక్తి పొంగడంతో ఆమె వినయంతో తల వొంచుతూ ""అలానే వుంది స్వామీ"" అని చెప్పింది బాధగా.     ఆయన భృకుటి ముడిపడింది.     ""అలానే వుందా?""     ""అవును స్వామీ!""     ""నేనిచ్చిన దండ వేశారు కదా!""     ""వేశాను స్వామీ""     ""అయితే ఇదంతా దుష్టశక్తుల పని కాదన్న మాట"" ఆయన సాలోచనగా అన్నాడు.     ""లేదు స్వామీ! దుష్టశక్తులే ఆమెలో దూరి అల్లరి పెడుతున్నాయి"" స్నేహలత మధ్యలో కల్పించుకుంటూ అంది.     ఆమె ఎవరు అన్నట్టు చూశాడు పూర్ణానందస్వామి మాయాదేవి వైపు ""మా ఆడపడుచు అనూహ్య స్నేహితురాలు- పేరు స్నేహలత"" చెప్పింది మాయాదేవి.     అలాగా అన్నట్టు తల వూపాడాయన.     ""దుష్టశక్తులని ఎలా చెప్పగలవు?"" ఆమెవరో తెలిసిన తరువాత అడిగాడు పూర్ణానందస్వామి.     ""రోజూ రాత్రి పన్నెండుగంటలకే ఆమెకు మెలకువ వస్తుంది. పిచ్చి పిచ్చి చేష్టలన్నీ అప్పుడు మొదలు. ఆ చేష్టలు కూడా మరీ భయంకరం. అంతా సెక్స్ తో కూడుకున్నవే"" అన్నది స్నేహలత.     ""మొదటి రోజునుంచీ ఇప్పటివరకు ఎలా ప్రవర్తించిందో చెప్పగలవా?"" అనడిగాడు స్వామి.     ""ఆఁ"" అంటూ మొదట్నుంచీ ఒక్కోరోజు ఎలా తన కోరికను బయటపెట్టిందీ స్వామికి వివరించింది స్నేహలత.     ""మొత్తం దీనికంతా కారణం ఆ శ్రీహరి అనే నా అనుమానమంతా"" అని ముగించింది.     ఆరోజు ఉదయం తను శ్రీహరి ఇంటికి వెళ్ళిందీ, అక్కడి ఎర్రటి అంగవస్త్రం కనిపించిన విషయం చెప్పింది స్నేహలత.     ""రోజూ తన ఇంటికి వస్తాడు. నుదుటిమీద ఏదో గోధుమరంగులో బొట్టు పెట్టుకుంటాడు. అతన్ని బాగా అసహ్యించుకునేది అనూహ్య. కానీ ఇటీవల అంటే ఈ వికారాలు మొదలయినప్పట్నుంచీ అతనంటే బాగా ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తోంది.""" 57,"     తను ముక్కూ మొహం తెలియనివాణ్ణి ఈ వయసులో చేసుకోవడం ఏమిటి?     సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవడం కాదా ఇది? తను ఈ వయసులో రాజీపడి జీవితాన్ని గడపగలదా?     నో, నో.     తను పెళ్ళి చేసుకోదు.     సీతాలక్ష్మికి ఆమాటే చెప్పేస్తుంది.     ఇంటికి వెళ్ళగానే ఫోన్ లో ఒక ఆ ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పేయాలి.     రేణుక గుండెల నిండుగా గాలి పీల్చుకుంది.     రేణుక ఇంటికి వచ్చేసరికి రాధ, రాధ భర్త కూర్చుని ఉన్నారు. టీపాయ్ మీద జరీ ముద్దలా ఉన్న పట్టుచీర పడేసి ఉన్నది.     ""వదినగారు ఇవాళ త్వరగా వచ్చేశారే"" అన్నాడు సుధీర్.     రేణుక మాట్లాడలేదు.     ""ఆ చీర ఎవరిది""     ""ఎవరో పేషెంట్సు నువ్వు ఆపరేషన్ చేశావట, తెచ్చి ఇచ్చాడే అమ్మాయి. ఒక బుట్ట మామిడి పళ్ళు కూడా తెచ్చారు""     రేణుక తల్లి ముఖంలోకి చిరచిర లాడుతూ చూసింది.     ""అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను. నేను లేనప్పుడు పేషెంట్స్ ఏమైనా తెస్తే తీసుకోవద్దని. ఛ. నా పరువు తీసేస్తున్నారు""     ""అదేమిటే అంత విసుక్కుంటావ్. నేను వద్దంటూనే ఉన్నాను. అయినా వాళ్ళ సంతృప్తి కోసం వాళ్ళు బలవంతంగా ఇచ్చారు. ఊరికే ఇచ్చారా ఏమిటి! నువ్వు ఆపరేషన్ చెయ్యలేదూ?"" సాగదీసింది సుందరమ్మ.     రేణుక తల్లిముఖంలోకి ఓ క్షణం చూసింది.     ""అత్తగారన్నది కరెక్ట్""     ""ఏమిటి కరెక్ట్, ఆపరేషన్ చేస్తేదానికి వాళ్ళు డబ్బు చెల్లిస్తారు. అమ్మా ఇప్పుడే చెబుతున్నాను. నేను లేకుండా పేషెంట్స్ తెచ్చే బహుమతులు తీసుకోకు""     ""ఒకవేళ తీసుకున్నా వదినగారికి చెప్పకండి"" పళ్ళు ఇకిలించాడు సుధీర్.     రేణుకకు వళ్ళు మండిపోయింది.     ""నోర్ముయ్!"" అని అరవాలనిపించింది.     రాధ ఆ చీర తీసి భుజం మీద వేసుకుంటూ ""అక్కయ్యా! ఈ చీర నాకు ఎలా ఉంది?"" అన్నది సంభాషణ మరోవైపు తిప్పుతూ.     రేణుక చురచుర చూసింది.     రాధ చీర తీసి టేబుల్ మీద పడేసింది. ""నాకు కావాలని కాదు ఊరికే ఎలా ఉందని అడిగాను""     ""చూడక్కా! ఆ చీర నాకు కావాలన్నాను. రాధ కూడా తనకు కావాలంటున్నది"" ఇప్పుడిప్పుడే చీరలు కడుతున్న చిన్న చెల్లెలు సరళ చదువుతున్న పుస్తకం చేతిలోనే పట్టుకొని స్టడీ రూం నుంచి బయటికి వచ్చి అన్నది.     ""మరదలు పిల్లకు అప్పుడే చీరలు మోజు ఎక్కువైంది?"" అన్నాడు సుధీర్.         ""ఆగండి వెధవ"" తిట్టుకుంది రేణుక మనసులోనే.     ""పో బావా"" మెలికలు తిరిగిపోతూ అన్నది సరళ.     ""తిన్నగా నిల్చోలేవూ? ఏమిటా మెలికలు తిరగడం"" ఎవర్ని ఏమీ అనలేక సరళను విసుక్కుంది రేణుక.     సరళ కళ్ళలో నీరు తిరిగింది.     గిర్రున తిరిగి తనగదిలోకి వెళ్ళిపోయింది.     ""వెళ్ళొస్తానమ్మా"" రాధ లేచి నిలబడిపోయింది.     ""ఆ చీర తీసుకెళ్ళు. సరళ చిన్నపిల్ల రేణు ఎలాగూ కట్టుకోదు"" అన్నది తల్లి.     రాధ చీరకేసి ఆశగా చూసింది.     ""తీసుకో"" అన్నాడు సుధీర్.     రాధ అక్క ముఖంలోకి చూసింది.     ""తీసుకో రాధా"" అన్నది రేణుక.     రాధ గబుక్కున చీర తీసుకుంది. ఆలస్యం అయితే మళ్ళీ ఎవరైనా లాగేసుకుంటారన్నట్టు రేణుకకు నవ్వు వచ్చింది. కాని నవ్వలేదు.     రాధ తల్లిముఖంలోకి చూసింది.     ""వద్దులే! అక్కయ్యనే కట్టుకోమను"" మళ్ళీ చీర అక్కడే పెట్టింది.     ""దానికి అంత పెద్ద చీరలు ఎందుకే? అది కడుతుందా ఏమన్నానా? తీసుకో"" అన్నది తల్లి.     ""తీసుకో రాధ! అమ్మ చెప్పినట్టు అలాంటి చీరెలు నాకెందుకే!"" అన్నది రేణుక.     ""తీసుకోమంటుంటే పెద్ద బెట్టు చేస్తున్నావేమేవ్"" అన్నాడు సుధీర్.     ""వస్తాను"" అంటూ రాధ చీర తీసుకుని వెళ్ళిపోయింది.     తను ఎటూ ఆ చీర కట్టుకోదు. కాని తల్లి ముందుగానే ఆమాట అనడం ఎందుకో బాధ అనిపించింది.     ""దానికంటే పెద్దవాళ్ళు కట్టుకోవడం లేదూ. నెక్లెస్ లూ, జార్జెట్లూ? పట్టుచీరకట్టుకోవడానికేం"" అని ఒక్కమాట అమ్మ ఎందుకు అనలేకపోయింది.     రేణుక ఫోన్ దగ్గిరకు వెళ్ళింది.     ""సీతా! నేనే రేణుకను. నాకు అభ్యంతరం లేదు. అతనికి ఉత్తరం రాయండి"" అనేసింది.     ఎవరిమీదో కసి తీర్చుకున్నట్లుగా మనసు తేలికపడినట్టుగా అనిపించింది.                                            28     రేణుక ఫోటో రామచంద్రానికి పంపించారు.     రామచంద్రం తనకు ఆమెను చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాశాడు. తన బ్యాంకు అకౌంటు గుంటూరుకు మారిపించుకున్నాడు. అన్నీ సెటిల్ చేసుకున్నాడు. పదిహేను రోజుల్లో వస్తున్నట్టు రాశాడు. సీతాలక్ష్మి ఆ విషయం రేణుకకు చెప్పింది.     రేణుక అన్యమనస్కంగా ఉంటున్నది. తను తొందరపడ్డానేమో అనే అనుమానం పీడించసాగింది.     ఆరోజు మధ్యాహ్నం జ్వరంగా అనిపించి రేణుక ఇంట్లో పడుకుంది.     సీతాలక్ష్మి వచ్చింది. సీతాలక్ష్మి అప్పుడప్పుడు రేణుక ఇంటికి వస్తూ ఉంటుంది. కాని రేణుక వివాహం విషయం మాత్రం ఆమె తల్లికి చెప్పలేదు." 58,"    మరో భావం లేకుండా డాక్టర్ మధుకిరణ్ వైపే సూటిగా చూస్తోంది మదురిమ.     ""తర్వాత ఏమైంది?"" యాంగ్జయిటీగా అడిగాడు సి.కే.నాయుడు.     ""పది నిమిషాలు గడిచాయి. కాశీచరణ్ లేచి టాయ్ లేట్ లోకేళ్ళాడు. అతని సీట్లో వున్న మ్యాగజైన్ ని నేను చేతుల్లోకి తీసుకోబోతుండగా మొదట పెద్ద శబ్దం వినిపించింది.     అరుపులు, భోగీలో ఒక్కసారిగా చీకటి అలుముకోవడంతోపాటు, భోగీ అంత ఎత్తుకు పరుగెత్తుకుని వస్తున్న చప్పుడు. అంత... నాకు జ్ఞాపకమున్నదంతే..."" దీర్ఘ్గంగా విశ్వశించి, మధురిమ మొహంలోకి చూశాడు మధుకిరణ్.     ఆమె మోము పాలిపోయింది. యాత్రికంగా, నిరాసక్తంగా వింటుందే తప్ప ఎలాంటి ఫీలింగ్ ని వ్యక్తం చేయలేకపోతుంది.     ""తర్వాత....నాకు మెలుకువ వచ్చాక మొదటిసారి నేను చూసింది...డాక్టర్ మధురిమనే...."" తిరిగి చెప్పాడు మధుకిరణ్.     ""మరిప్పుడు?"" ప్రశ్నించాడు సి.కే.నాయుడు.     ""నా జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశం చిన్నప్పట్నుంఛీ చెప్పగలను. ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుందోముందు మీరు చెప్పగలరా?"" అడిగాడు మధుకిరణ్.     సి.కే.నాయుడు చెప్పడం ప్రారంభించాడు.     ""ఆ రోజు ట్రైన్ యాక్సిడెంట్ లో నువున్న ఫస్ట్ క్లాస్ భోగితప్ప వెనుకనున్న అన్ని భోగీలు పట్టాలు తప్పాయి. రెండు భోగీలు మంటలకు ఆహుతి అయ్యాయి. మీ భోగి కూడా పాక్షికంగా మంటలకు గురైంది. రైల్వేగేటు వేసి వుండటం_  ఆ గేటును దూసుకుని వచ్చిన ఆయిల్ టాంకర్ భావుగీలకు ఢీకొనటం మూలంగా యాక్సిడెంట్ జరిగింది.     ప్రమాదంలో మొత్తం 200మండి చనిపోయారు. బహుశా టాయిలేట్ కు వెళ్ళిన కాశీచరణ్ ఆ మంటల్లో బూడిదైపోయి వుంటాడు. కనీసం అస్థిపంజరం కూడా మిగలకపోవడంవల్లే మిస్సింగ్ కేసుల్లో అతనున్నాడు. మిస్టరీ ని క్రియేట్ చేశాడు. దారుణమైనా ట్రాజెడీ....     తల్లి పుట్టిన ఊరుని చూడాలని, తాతల ఆస్తికి తనే వారసుడినని ఎన్నో ఆశలతో వచ్స్తున్న అతని జీవితం... అలా దారుణంగా ముగిసి పోవడం దారుణం..."" నాయుడు గొంతులో బాధ ద్వనించింది.     మధురిమ_ నీలకంఠన్ లా మానసిక స్థితి తీవ్రమైన ఒత్తిడికి లోనయిపోయింది.     ఆ గదిలో నలుగురున్నా, ఏమాత్రం శబ్దంలేదు. మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు నాయుడు.""నా ఊహే నిజమని తెల్సికున్నాను. గంటక్రితం వరకు సీనియర్ ఇంటేలిజేన్స్ ఆఫీసర్స్ తో డిస్కస్ చేశాను. ఇంతవరకు నా అవగాహనలోకొచ్చిన విషయాలన్నింటినీ కంప్యూటర్ కి ఫీడ్ చేసి_ ఒక దానికొకటి పోల్చిచూశాం. దాంతో మిస్ రామ్ కిషన్ మనుషుల దాడి ప్రారంభమయింది.     ఆ దాడి నుంచి తప్పించుకొనేందుకు నువ్వు అనుకోకుండా వరంగల్ రైల్వేస్టేషన్ కి చేరుకున్నావ్. వాళ్ళు అక్కడికీ ఎక్కేశావ్. అది చూసిన రామ్కిషన్ మనుషులు కూడా అదే ట్రైన్ ఎక్కారు.     నీకోసం వాళ్ళు ఒక్కొక్క బోగీని వెతుక్కుంటూవచ్చే సమయానికి రైల్ బీబీనగర్ క్రాసింగ్ సమీపించింది. అప్పుడే ఏక్సిడెంట్ జరిగింది. ఆ ఏక్సిడెంట్ షాక్ కి అపస్మారకస్థితికి చేరుకున్నావ్.     అంత ప్రమాదకరమైనా స్థితిలో కూడా రామ్ కిషన్ మనుషులు  నిన్ను గుర్తించి, నిన్ను ట్రైన్ నుంచి బయటకు తీసి మారుతీవ్యాన్ సంపాదించి దానిలోకి నిన్ను చేర్చి, ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి బ్బగా కొట్టి నువ్వు చనిపోయుంటావనిభావించి, తిరిగి రైల్ ఏక్సిడెంట్ జరిగిన బీబీనగర్ రైల్వేక్రాసింగ్ దగ్గరకు తీసుకొచ్చి పడేస్తే నువ్వు ఏక్సిడెంట్ లోనే పోయావని అందరూ భవిస్తారని ప్లాన్ చేసి వెళుతుండగా ఆ వ్యాన్,, దాని వెనుకే వస్తున్నా మేడికోస ఫియేట్ కారు రైల్వేక్రాసింగ్ గెట్ పడిపోవటంతో ఆగిపోక తప్పలేదు.     ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఎందుకని, నీ శరీరాన్ని పక్కనే వున్న తుప్పుల్లోకి విసిరేసి వెళ్ళిపోయారు రామ్ కిషన్ మనుషులు.     ఆ దృశ్యాన్ని ఫియేట్ కారు నడుపుతున్న మెడికో చూశాడు. అతను మిగతా ముగ్గురికా విషయం చెప్పటం మంచిదికాదని భావించాడు. నిన్ను రక్షించేందుకు నలుగురు మేడికోస్ కలసి కారులోకి చేర్చారు నిన్ను.     కొన్ని గంటల క్రితం అదే ప్రాతంలో ఏ.పి.ఎక్స్ ప్రెస్ ఎక్సిడెంట్ కి గురికావడం జరిగింది కదా_ విధి ఎంతో విచిత్రమైందనటానికి సాక్ష్యంగా, ఒరిజనల్ కాశీచరణ్ సూట్ కేస్ ఏక్సిడెంట్ లో ఎగిరి ఒక తుప్పులో పడిపోయింది. అదే తుప్పులోకి నిన్నూ విసిరేశారు రామ్ కిషన్ మనుషులు. మేడికోస్ లో ఒకరు అది నీ సూట్ కేసేనని, నీతోపాటు ఆ సూట్ కేస్ ని శుశ్రుత హస్పిటల్లోకి చేర్చారు.     నీ బట్టలు మార్చటం కోసం జూనియర్ వార్డ్ బోయ్ దిలీఫ్ నీ సూట్ కేస్ ఓపెన్ చేసి అందులో వున్న కాగితాల ఆధారంగా నువ్వే కాశీచరణ్ అని భావించి అదే విషయాన్నీ నర్స్ మేరీకి, శివనందానికీ చెప్పాడు. అప్పటినుంచి నువ్వే కాశీచరణ్ అని భావించి, అన్ని హాస్పిటల్ కీ ఫోన్ చేస్తున్నా ప్రయత్నంలో దిలీఫ్ ఆయనకి ఫోన్ లో దారికాడు.     కాశీచరణ్ అనే వ్యక్తి మీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నాడా అని అయన అడగటం_ పొందుతున్నాడని దిలీఫ్ చెప్పటమే ఇంత గందరగోళానికి కారణమైంది.     నేనిక్కడికి వస్తూ అ నలుగురు మేడికోస్ ని కలిపి రావటం మంచిదయింది. లేదంటే ఏ.పి.ఎక్స్ప్రెస్ ఎక్కినా నువ్వు గాయపడి బీబీనగర్ రైల్వే క్రాసింగ్ దగ్గరున్నా తుప్పుల్లోకి ఎలా చేరావన్న మిస్టరీ సమాధానం దొరికేది కాదు.   " 59,"    అది కూడా తన పరిశోధనలకు అడ్డు తగలవచ్చు. కనుక తప్పయినా, అన్ ఎథికల్ అయినా తను రహస్యంగానే ఆ ఫైల్స్ ని తిరగేయాలి.     బీరువాని లాగి చూసాడు __ రాలేదు.     లాక్ చేసి వుంది __ వుంటుంది.     కీస్ రూల్స్ ప్రకారం డి.ఐ. జి. కస్టడీలో వుంచి వెళ్ళాలి.     అంటే ... ఆ బీరువా కీస్ చూడప్పగారిఛాంబర్ లో ఉండి వుండాలి.     ఆ కీస్ ని చూడప్పగార్కి కూడా తెలీకుండా సంగ్రహించాలి.     లేదా.... ఆ బీరువాని దొంగా తాళం చెవులతో తెరవాలి.....     ఎలా ...? ఏం చేయాలి ....? ఆలోచిస్తూ రిషి పెస్ టార్చ్ ని బీరువా పైకి తిప్పాడు.     అదో చెక్క బీరువా ......      రెండు తలుపులున్నాయి.     మధ్యభాగంలో కుడివేపు తలుపు కొక్కెం ఎడంవేపు తలుపుకున్న రింగ్ కి వేసి, ఆపైన లాక్ వేసి వుంది.     అది వాటి మీదకే టార్చ్ ఫోకస్ చేసి చూస్తున్నంతలో మెరుపులా ఒక ఆలోచన తట్టింది.     కొక్కెం ఐరెన్ బెస స్క్రూస్ తో తలుపుకి బిగించి వుంది.     ఆ స్క్రూని ఊడదీయగలిగితే చాలు.....     వెంటనే జేబులోంచి కొత్తగా వచ్చిన పదిపైసల నాణేన్ని తీసి దాన్ని స్క్రూడైవర్ గా ఉపయోగించి కొద్ది క్షణాల్లోనే దానికున్న రెండు స్క్రూస్ ని ఊడదీయగలిగాడు.     దాన్ని పైకి ఎడంవేపుకి నుంచి తలుపుని తెరిచాడు.     ఆపైన మెషిన్ కన్న వేగంగా ఫైల్స్ ని తిరగవేసి గోవిందరాజులు ఫిల్ ని బయటకు తీశాడు.     ఫ్లోర్ మీద కూర్చుని ఆ ఫైల్ లోని ఒక్కో పేజీని తిరగవేయ సాగాడు.     పది నిమిషాలకు అతని ప్రయత్నం ఫలించింది.     గోవిందరాజులకు ఆప్తుడు ... అత్యంత సన్నిహితుడు ..... కుడి, ఎడం భుజం. కాకపోయినా ముఖ్యమైన మనిషి పేరు కనిపించింది అతని ఫోటో కూడా అక్కడ  అతికించి వుంది.     పేరు : అలాక్ నిరంజన్     వయస్సు : ఇరవైఆరు     అడ్రస్ : 1-1-10, గన్ రాక్ ఎంక్లేవ్ , సికింద్రాబాద్.     ఎత్తు : 5.10     రంగు ఎరుపు     బరువు : 75 కిలోలు.     అలాక నిరంజన్ కి సంబంధించిన వివరాల్ని తన ఫోటోగ్రాఫిక్ మేమేరీలో నిక్షిప్తం చేసుకున్నాడు. టార్చ్ లైట్ ని అతని ఫోటో మీదనే కొద్దిక్షణాలు కేంద్రీకరించి అతని మొఖాన్ని తన జ్ఞాపకాల అరల్లో రికార్డ్ చేసుకుని ఫిల్ ని మూసివేసి . యధాస్థానంలో వుంచి, కొక్కేన్ని యదాస్థానంలో బిగించివేసాడు.     చక చకా వెనక్కీ తిరిగి వచ్చి సీట్లో కూర్చున్నాడు.     చర్చ్ గంట మూడుసార్లు మ్రోగింది.....     ఉలిక్కిపడి లేచి నించున్నాడు రిషి......                                                                    *    *    *    *        ""ఏం కావాలో కోరుకో ...."" తల్లవారుఝామున మూడు గంటలకు బాగా అలసిపోయి రాగలతా బిజ లనీ ప్రక్కన సేద తీరుతూ అన్నాడు నందకిషోర్ .     ""మీ ఇష్టం.... ఏదైనా "" నందకిషోర్ లోకి ఒదిగిపోతూ అందామె.     ""సిటీలో రోడ్డ్లు వేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తాను . మెనేజ్ చేసుకోగలవా?""     ""నాకేం మిగిలుతుంది.అందులో.""     ""రోడ్లేస్తే మిగలదు.... నిజమే . రోడ్డ్లు ఎవరేయ మన్నారు? పేపర్ మీ దవేస్తావంతే "" తాఫీగా అన్నాడు నందకిషోర్.     బిజ్ లానీ నవ్వింది.     ""కాని... అంతా మీరు పదవిలో ఎక్కువకాలం ఉండరని అంటున్నారు...."" సందేహంగా అందామె.     ఈసారి నందకిషోర్ నవ్వాడు.     ""అందరూ అనుకునేదాన్ని కాకుండా చేయటమే నాకు సరదా __""     ""మీరుండలనే నేను కోరుకుంటున్నాను నాకో సినిమాలో హీరోయిన్ గా వేషం ఇప్పించగలరా?"" అతని గుండెల మీది వెంట్రుకలతో ఆడుకుంటూ గోముగా ఇప్పించగలరా?"" అతని అదృష్టం ...."" ఆవలిస్తూ, నిద్రలోకి జారుకుంటూ అన్నాడు. నందకిషోర్.     ఆమె లేచి బట్టలు కట్టుకుంది.                                *    *    *    *        ""రిషి ఏమిటి ఇంకా రాలేదు....?"" తెల్లవారు ఝామున మెలుకువ వచ్చిన చూడప్ప భార్య భర్తని కుదుపుతూ అడిగింది.     ఆయన మత్తుగా మరో ప్రక్కకు ఒరుగుతూ ""ఇంకా నీకు మా డిపార్ట్ మెంట్ సంగతి భోధపడలేదో .....! తనేదో పనిమీద రెస్ట్ లేస గా తిరుగుతున్నాడు. కుర్రాడు తెలివిగలవాడు __  మంచి చురుకైనవాడు ఏదో స్కూఫ్ ని డిగ్ చేసే ప్రయత్నంలో వున్నాడు. అలాంటివి చేస్తేనే గదా హీరో.... ప్రమోషన్ ... నేనూ అందుకే చూసీ, చూడనట్లుగా వుంటున్నాను. వయస్సులో వున్నవాడు __ బాగా కష్టపడాలి __ పైకి రావాలి. నువ్వు పడుకో"" అన్నాడు చూడప్ప ఆవలిస్తూ.     ""నిజమే అనుకోండి .... కాని పాపం అవంతి కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటుంది. అదే నా బాధ"" ఆమె మాటలు పూర్తవుతూనే చూడప్ప లేచి కూర్చున్నాడు బెడ్ మీద .     కొద్దిక్షణాలు తరువాత బెడ్ దిగి, తలుపు తీసుకుని వెళ్ళి అవంతి రూమ్ ముందాగాడు.     ఆ గది తలుపులు  దగ్గరకు వేసున్నాయి.     లోపల ఇంకా లైట్ వెలుగుతోంది.     ఆయనకు ఒక్క క్షానం బాధనిపించింది.     చిన్నగా తలుపుని నెట్టి చూసాడు.     అవంతి కుర్చీలో కూర్చుని టేబుల్ మీద తల వాల్చుకుని నిద్రపోతూ కనిపించింది.     శబ్దం కాకుండా లోపలకు నడిచాడు.     ఆమె తర్వాత కూడా కదలలేదు.     గాఢ నిద్రలో ఉందని అర్ధం చేసుకుని __ అంతరాయం కలిగించటం ఇష్టంలేక వెనక్కీ వచ్చి , తలుపులు దగ్గరకు వేసాడు.                                                                *    *    *    *        ఎప్పుడో తెల్లవారుతుండగా ఇంటికి చేరుకున్న రిషి పిల్లి లాగా లోపలకు ప్రవేశించి నిద్రలోకి జారుకున్నాడు.                                *    *    *    *        గోవిందరాజులకు ఎదురుగా షానవాజ్ , అలక్ నిరంజన్ కూర్చుని వున్నారు.     అప్పటికే వాళ్ళొక విషయాన్ని చర్చించుకున్నట్లు __ సరైన పరిష్కారం లభించక మనసికమయిన అలసటకు గురయినట్ట్లుగా వున్నాయి వాళ్ళ ముఖాలు అంతలో మరి వ్యక్తి లోపలకు ప్రవేశించాడు.     అతను ... అనూస్....     ""ఏమైంది.....?"" అనూస్ కంఠం వింటూనే షానవాజ్ , అలక్ నిరంజన్ లేచి నించున్నారు.         గోవిందరాజులు మాత్రం అలాగే కూర్చుని, కళ్ళతో విష్ చేసాడు.     ""చేప గాలానికి తగిలింది. ఒకటి రెండు రోజుల్లో కథ రాక్తి కట్టబోతోంది....."" అన్నాడు షానవాజ్ వినయంగా.     ""మరిక ఆలస్యం మంచింది కాదు.... అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి __ మీదే ఆలస్యం "" అనూస్ కూర్చుంటూ అన్నాడు.     గోవిందరాజులు మందహాసం చేసాడు.                                 *    *    *    *        ఆదమరచి నిద్రపోతున్న రిషిని లేపాలని అనిపించలేదు. అవంతికి .     ఆమెకు తెలుసు .... రిషికి ఏ దుర్వసనాలు లేవని, ఒక పని అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోడని            అప్పుడు ఉదయం తొమ్మిది గంటలు... కాళ్ళ దగ్గర అస్తవ్యస్తంగా పడున్న బ్లాంకేట్ ని రిషి మీద కప్పి తను క్లినిక్ ని ఓపెన్ చేసేందుకు వెళ్ళి పోయింది.     ఏదో పనిమీద నిమగ్నమయి వున్నాడు రిషి......     ఏమిటా పని?     రాష్ట్ర రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరగబోతున్నాయని అన్నాడు ..... ముఖ్యమంత్రి నందకిషోర్ వేయబోయే ఎత్తు ఎంతో ప్రమాద కరమై౦ది కావచ్చని కూడా అన్నాడు.     ఒకవేళ ఆ పని మీద వున్నాడా?     పొరపాటున రిషి తీగని కదిలిస్తే?     తను ఎవరయింది తెలీకుండా వుంటుందా? అవంతి అన్యమస్కంగానే వెళ్ళి క్లినిక్ ని ఓపెన్ చేసి అప్పటికే వచ్చి ఉన్న పెష్మేత్స్ ని పరీక్షించటంలో మునిగిపోయింది.                                *    *    *    *        పదకొండు గంటలకు నిద్రలేచిన రిషి హడావుడిగా తయారయిక్లినిక్ దగ్గరకు వచ్చాడు.         పేషంట్స్ తో క్లినిక్ లోని ముందు భాగం నిండిపోయి వుంది.     ఏ డాక్టర్స్ అయితే యాభైశాంతం  ట్రీట్ మెంట్ కి... మరో యాభైశతం రోగులకు మానసికమైన స్వాంతన చేకూర్చటానికి తమ కాలన్ని వినియోగిస్తారో ..... వారి ప్రాక్టీ సే బాగుంటుందేమో అని స్వగతంలో అనుకుంటూ తన పనిమీద బయలుదేరి వెళ్ళిపోయాడు.                                                                        *    *    *    *" 60,"     హృదయం మంచు ముద్దల్లో కూరుకుపోయినట్లు నలిగిపోయింది!     ఊపిరి పీల్చుకొనే ప్రయత్నం తాలూకు సంఘర్షణలోని రాపిడికి మంచుముద్ద వెచ్చని కన్నీరై బయటికొచ్చింది!     పిల్లలనుండి మొహం చాటుచేసుకొంటూ వంటింట్లోకి పరిగెట్టింది!     ఘనీభవించిన మంచుపర్వతం కరిగినట్లు ధారాపాతంగా ప్రవహిస్తున్న కన్నీటికి పైటకొంగు అడ్డం వచ్చి, గోడనానుకుని వెక్కి వెక్కి ఏడ్చింది!                                                *    *    *    *     ఖాదర్ ఏడుస్తున్నాడు. డొక్కలు ఎగెరిగిరి పడేలా పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు.     అరచేత్తో కండువా కళ్ళకి అడ్డం పెట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు.     మంచంమ్మీద నిద్రిస్తున్న బాబు.... పరామర్శకు పరలోకానికి వచ్చి ప్రమాదంలో చిక్కిన దేవదూతలా ఉన్నాడు.     అతని పసిమొహం బాధని భరించ... భరించీ అలసిపోయి విశ్రాంతి తీసికొంటున్నట్లు వడలిపోయి ఉంది! బాబు ప్రక్కనే మంచంలో కూర్చున్న తల్లి పరిస్థితి దయనీయముగా ఉంది!     అప్పుడు సమయం సాయంత్రి అయిదున్నర దాటింది బాబు ఎలా ఉన్నాడో.... డాక్టర్స్ ఏమన్నారో..... చూద్దామని అప్పుడే గదిలోకొచ్చింది చలపతిరావు భార్య సత్యవతి, ఆమె ఆమె భర్త బావున్నాడని అప్పుడప్పుడే ఆమెకు నమ్మకం కలుగుతోంది! ఆ గదిలో పరిస్థితి చూసి కంగారుపడిపోయి.     ""ఏ జరిగింది ఖాదర్ బాబాయ్?"" అంటూ ఖాదర్ ప్రక్కకొచ్చి నిలబడింది.     అతను మాట్లాడలేదు! దుఃఖం మాట్లాడనివ్వడం లేదు. ఆమె కెందుకో భయమేసింది.     అతని భుజమ్మీద చెయ్యివేసి ఆప్యాయంగా నొక్కుతూ ""ఏం జరిగింది బాబాయ్?"" అని మళ్ళీ అడిగింది. బలవంతంగా దుఃఖాన్ని మింగి కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.     ""బాబుకి ఆపరేషన్ చెయ్యాలని ప్రొద్దున చెప్పారమ్మా డాక్టర్లు. ఉన్నదంతా తాకట్టు పెట్టయినా వాణ్ణి బ్రతికించుకోడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు.... ఇప్పుడు.... ఏం జరిగిందో మరి ఆపరేషన్ చెయ్యడం లేదు. ఇంటికి వెళ్ళిపోయి రెండేళ్ళు ఆగిరమ్మని డాక్టరొచ్చి చెప్పాడమ్మా!     ""రెండేళ్ళు.... రెండేళ్ళు ఆగే పరిస్థితా వాడిది? ఆ నరకం అనుభవిస్తూ ఇంకా రెండేళ్ళు బ్రతుకుతాడంటావా వాడు? అంటుండగానే మళ్ళీ దుఃఖపు పొర అడ్డొచ్చింది.     అసలు చెయ్యడం కుదరదని ముందు చెప్పివుంటే ఎలా వుండేదో అతని పరిస్థితి? కానీ, చేస్తానని ఒకసారి చెప్పిన తర్వాత.... చావో, బ్రతుకో.... ఈ ఊపిరాడని నరకంనుండీ మనవడు విముక్తమవుతాడని ఆశ కలిగింతర్వాత.... కుదరదనడం అతన్ని మరీ బాధిస్తోంది!     పదే పదే.... ఊపిరాడక గిల గిల కొట్టుకుంటున్న మనవడి మొహం కళ్ళముందు కదిలి.... ఆ నరకయాతన యింకా రెండేళ్ళు కొనసాగాలన్న విషయం తట్టుకోలేకపోతున్నాడు.     ""ముందు చేస్తానని తర్వాత కుదరదన్నారా బాబాయ్? ఏమైందట?"" ఓదారుస్తున్నట్లున్న గొంతుతోనే కుతూహలంగా అడిగింది.     ""తెలియదు తల్లీ! మాకేమీ చెప్పలేదు, హాస్పిటల్ ఫీజెంతవుతుందో చెప్పారు. సరేనన్నాను. సాయంత్రానికి.... ఆపరేషన్ కుదరదు. వెళ్ళిపొమ్మంటే నేనేమైపోను?     డాక్టరుకేమైనా డబ్బు కావాలేమో? నా మొహం చూస్తే ఇచ్చుకోలేనివాడిలా కనబడుతున్నానేమో....? కానీ దానిక్కూడా నేను సిద్ధమే తల్లీ! నా మనవడిని ఆ నరకంనుండీ తప్పించడంకన్నా నాకేదీ ఎక్కువ కాదు"" అన్నాడు. అతని బాధ చూసి సత్యవతికి కడుపులో మెలితిప్పింది. కానీ, డాక్టర్ని గురించి అన్నమాట ఆమెకి నమ్మబుద్ధి కాలేదు.     ""ఆ డాక్టరు అట్లా అనిపించలేదు బాబాయ్!"" అంటూ అక్కడి నుండి కదిలింది.                             *    *    *    *     సాయంత్రం అయిదున్నర అవుతోంది.     థోరాసిక్ రికవరీ రూమ్ లో ఆ నిశ్శబ్దం తమాషాగా ఉంది. మానిటర్ల ""కీక్....కీక్...."" మనే సన్నని శబ్దం..... అర్ధరాత్రి నిశ్శబ్ధంలో అక్కడొక్కటీ, అక్కడొక్కటీ అరుస్తున్న కీచురాళ్ళ శబ్దంలా వుంది.     అటూ ఇటూ తిరుగుతున్న నర్సుల కాన్వాస్ మాస్ మెత్తని కదలికలు..... మబ్బుల్లో దేవకన్యలు నడుస్తున్నట్లు మృదువుగా, హాయిగా అనిపిస్తున్నాయి!     ఆరోజు ఆపరేషన్ చేసిన రోగి బెడ్ ప్రక్కన కుర్చీలో రిలాక్స్ డుగా కూర్చుని భగవంతం! అతనింకా థియేటర్ డ్రస్ లోనే వున్నాడు.     ""సార్! శరత్ చంద్ర సార్ బేబీకి ఆపరేషన్ చెయ్యడం లేదట!"" రహస్యం చెబుతున్నట్లు చెప్పాడు అక్కడే తచ్చాడుతున్న శంకరం. అతడా విషయం ఎవరికి వినిపించనంత రహస్యంగా చెప్పాలనేం అనుకోలేదు.     ఈ గది వాతావరణం అలాంటిది. ఉచ్ఛస్వరంతో మాట్లాడుతూ ఆ గదిలోకి అడుగుపెట్టిన కొత్తవాళ్ళు కూడా, ఒక్కసారిగా టి.వి. వాల్యూమ్ తగ్గించేసినట్లు తగ్గించి మాట్లాడుతారు.     ఆ గది నిశ్శబ్ధానికి తమకి తెలియకుండానే అడాప్టయిపోతారు. శంకర్ మాట వింటూనే సన్నని నవ్వు కదిలింది. భగవంతం మొహంలో.     ""ఏం?"" అన్నాడు మామూలుగా.     ""డైరెక్టర్ వద్దన్నారట సార్!"" వినయాన్ని సూచిస్తున్నట్లు కొద్దిగా వంగి అన్నాడు.     కుర్చీలో కొద్దిగా కదిలాడు భగవంతం. అతనికది పెద్ద విషయమే! మొహంలో కదిలిన సంతోషాన్ని కప్పిపుచ్చుకుంటూ -     ""చెయ్యమని ఎవడంటాడయా? 'కత్తిపిచ్చి' ఒక్కటే ఉంటే సరపోదు. తల్లో కాస్త మెదడుకూడా ఉండాలి!"" అన్నాడు. అతని గొంతులో 'నామాట నిజమైంది చూడు' అన్న గర్వం తొణికిసలాడింది.     ప్రొఫెసర్ ని సంతోషపెట్టాలనే తప్ప శరత్ చంద్రని కించపరచాలని శంకర్ కి లేదు  అసాధారణమైన శరత్ చంద్ర తెలివినీ, ధైర్యాన్నీ భగవంతం తేలిగ్గా మాట్లాడటం అతనికి బాధనిపించింది.     ""శరత్ చంద్ర సార్ బాగా తెలివైనవాడు సార్! కాకపోతే కొంచెం తొందర అంతే!"" అన్నాడు సమర్ధిస్తున్నట్లు.     ""ఆహా.... అలాగా!"" అంటూ అదోలా అతన్ని చూశాడు భగవంతం. నాలుక్కరుచుకున్నాడు శంకర్?     ""సార్! మీకు నోటీసు వచ్చింది. సైన్ చెయ్యాలి!"" అంటూ మల్లెపువ్వు కదిలినట్లు వచ్చింది నర్సు.     ఆమె చేతిలో ఫైల్ అందుకొని చదువుతూనే ఉలిక్కిపడ్డాడతను.     ""వ్వాట్?"" అంటూ అతని నోటినుండి వచ్చినమాట అతనికొక్కడికే వినిపించింది." 61,"గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఇద్దర్నీ కూర్చమంటూ సైగచేశాడు ఇంద్రమిత్ర. అందులోంచి ఎల్లో కవర్, రెయిన్ కోటు తీసి ఇంద్రమిత్ర టేబుల్ మీద వుంచి అడిగాడు_ ""ఇది ఎవరిదో మీరు గుర్తించగలరా?"" అది తనదేనన్న విషయం గుర్తించిన ఇంద్రమిత్ర ఆశ్చర్యంగా అడిగాడు_ ""అరే!ఇది నాదే! మీ దగ్గరకి ఎలా వచ్చింది?"" ఫెర్నాండెజ్ అడిగాడు. ""మేం అడిగుతావుమ్ది కూడా అదే! ఈ కోటు హతుడి శరీరం మీదకి ఎలా వచ్చింది?"" ఇంద్ర మిత్ర ఆశ్చర్యంగా అడిగాడు_ ""అంతే సాదూరాం హత్య చేయబడ్డాడా?"" చిదంబరం ఇంద్రమిత్ర కళ్ళలోకి చూస్తూ సీరియస్ గా అడిగాడు_ ""మేం సాదూరాం చనిపోయాడని చెప్పాం అంతేకాని హత్యచేయబడ్డాడు అనలేదే! ఏం అతడిని మర్డర్ చేస్తారని మీకు ముందే తెలుసా?"" ఆ మాటతో ఇంద్రమిత్రకు కోపం ముంచుకొచ్చింది. అయినా తమాయించుకుని చెప్పాడు_ ""రెయిన్ కోట్ మీదరక్తం మరకులున్నాయి. పైగా మీరు హతుడి శశ్రీరం మీద ఆ కోటు చూసామంటున్నారు. సాదూరాం నా పేషెంట్. నిన్న సాయత్రం అతడు నా దగ్గరకి వచ్చాడు. తిరిగి వెళ్లేముందు వాన ప్రారంభమవడంతో అతడికి నా రెయిన్ కోట్ యిచ్చాను. కనక సాదూరాం హత్యకి గురై వుంటాడనుకుంటున్నాను"" సర్కిల ఫెర్నాండెజ్ జేబులోంచి ఓ కలర్ ఫోటో బయటకి తీశాడు. దాన్ని ఇంద్రమిత్రకు అందించి చెప్పాడు_ ""మీరు చెప్పే సదూరాం యితడేనా?"" అది సాదూరాం మరణించిన తర్వాత తీసిన ఫోటో. ఫోటోలో అతను కళ్ళు మూసుకుని వున్నాడు. కింద పడడంవల్ల నుదుటికి దెబ్బ తగిలిన చోట రక్తంగడ్డకట్టింది. ఫోటోవైపు చూస్తూనే ఇంద్రమిత్ర అతడే సదూరాం అన్నట్లు తల వూపాడు. పెర్నామ్దేజ్ వరసగా ప్రశ్నలు వేయసాగాడు. ""సాదూరాం మేకు ఎలా తెల్సు?"" ""అతడు న పేషెంట్.. దాదాపు సంవత్సరం క్రితం అతను నా దగ్గరకి ఒక ప్రాబ్లం తో వచ్చాడు. నేను అతనికి ట్రీట్ మెంట్ చేయడం ప్రారంభించాను. అతనికి వ్యాధి పూర్తిగా నాయమతిమ్ది. నిన్న నా దగ్గరకి వచ్చినప్పుడు ఇక అతడు రావలసిన అవసరం లేదనీ, అతడి మనస్సు యిప్పుడు పూర్తిగా నార్మల్ స్టేజిలో వుందని చెప్పాను."" ""ఇంతకూ అతడి ప్రాబ్లం ఏంటీ?"" ""సారీ! నేను ఒక మానసిక వైద్యుణ్ణి. నా దగ్గరికి రకరకాల పేషెంట్స్ వస్తారు. తన స్వంత తల్లితండ్రులకు, భార్యకు, స్నేహితులకు కూడా చెప్పుకోలేని సమస్యలు నకు తెలియచేస్తుంటారు. వాటిని కాపాడటం వైద్యుడిగా నా ధర్మం. పైగా న దగ్గరకి వచ్చిన ప్రతి పేషెంట్ కూ అలా అని నేను మాటకూడా యిస్తుంటాను. దయచేసి ఈ విషయంలో నన్ను వత్తిడి చేయకండి."" ఫెర్నాండెజ్ పట్టు విడవకుండా అడిగాడు_ ""ప్లీజ్ డాక్టర్! మమ్మల్ని అర్ధం చేసుకోండి.మీరు చెప్పే ప్రతి విషయం మా పరిశోధనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పడానికి నిరాకరించే వివరాలలో కేసును మలుపులు తిప్పడానికి, అసలు హంతుకుడిని పట్టుకోవడానికి వుపయోగించే క్లూ మాకు దొరకవచ్చు."" ""పరిశోధనకు ఉపకరించే విషయం తెలిసీ దాచి పెట్టడం నేరమనే విషయం గుర్తించుకోండి."" ఆ మాటతో ఓ నిశ్చయానికి వచ్చినట్లు చెప్పాడు ఇంద్రమిత్ర_ ""సాదూరాం హొమోసేక్స్ వల్. పెళ్ళికి ముందు అతడకి అనేక మంది మగవాళ్ళతో సంభందం వుంది. పెళ్ళయిన తర్వాత కూడా అతడు సంబంధాల్ని కొనసాగించాడు. తాను హొమోసెక్స్ వల్ నుంచి హిట్రో సెక్స్ వల్ _ అంటే ఆడవాళ్ళతో  మాత్రమే సెక్స్ సంభందాలు కొనసాగించే మనిషిగా మరెందుగా ట్రీట్ మెంట్ కోసం నాదగ్గరకి వచ్చాడు."" ఫెర్నాండెజ్ అడిగాడు_ ""అసలు సాదూరాం హొమోలా ఎందుకు మారాడు?"" తనకు సాదూరాం చెప్పే విషయాలు గుర్తుకు తెచ్చుకుంటూ కొనసాగించాడు ఇంద్రమిత్ర. సాదూరాంని అతడి తల్లితండ్రులు హాస్టల్ లో చదివించారు. అతను పదో తరగతిలో వుండగా అతడి హాస్టల్ వార్డెన్ తో హొమో సెక్స్ అలవాటయింది. బ్రహ్మచారి అయినా వార్డెన్ హాస్టల్ లో చదువుకునే పిల్లలతో సెక్స్ సంభందాలు కొనసాగించేవాడు. అలా అయిన అలవాటు పెళ్ళి అయి పిల్లలు పుట్టేవరకూ సదూరం మానలేదు."" ఫెర్నాండెజ్ అన్నాడు_ ""పోనీ అతడి హొమో ఫ్రండ్స్ వల్ల అతడికి ప్రాణ ప్రమాదం జరిగే అవకాశం వుందా?"" ఇంద్రమిత్ర అర్డంకానట్టు చూశాడు. ""ఐమీన్... మీ దగ్గరకి వచ్చిన తర్వాత సాదూరాం పూర్తిగా మారిపోయాడు. అతడు హొమోలకు దూరమయ్యాడు. ఈ కారణంగా అతనిమీద కక్ష పెంచుకుని,అతని స్నేహితులు అతడ్ని హత్య చేసే అవకాశం లేదా?"" ఇంద్రమిత్ర తల అడ్డంగా వూపుతూచెప్పాడు_ ""ఏమాత్రంలేదు. సాధూ తన అలవాట్లు మానుకుని ఆర్నెల్లకు పైగా అయిపోయింది.ఏదన్నా హత్యాప్రయత్నం జరిగితే అర్నేల్లల్లోనే జరిగి వుండేది అంతేకాక అతడు తన స్నేహితుల గురించి కూడా వివరించాడు. అతడు వివరించిన వివరాల్ని బట్టి క్రిమినల్ బి హేవియర్ వున్న స్నేహితులెవరూ అతనికిలేరు. పైగా అతడు బాగా డబ్బున్న వ్యక్తి కూడా కాదు. అతడిని డబ్బుకోసం హత్య చేశారనుకోవడానికి.""" 62,"     ""మీ కర్తవ్యాన్ని నేను ప్రశ్నించడం లేదు మిస్టర్ రణధీర్. దోషి ఎవరో తెలిశాక కూడా ఎందుకు నిర్బంధించడం లేదు? ఎందుకు తాత్సారం చేస్తున్నారూ అని అడుగుతున్నాను.     ""బుల్ షిట్. ఇదేం రివాల్వర్ కాదు. ట్రిగ్గర్ నొక్కగానే బుల్లెట్ లా దూసుకుపోవడానికి...""     అదిగో సరిగ్గా అక్కడే శశాంక సహనాన్ని పూర్తిగా కోల్పోయింది రణధీర్. అక్కడ పరిహాసంగా ఉదాహరించిన శశాంక కేపబులిటీని మాత్రమే కాక అతడి అహాన్ని గాయపరిచాడు.     ""అదేం అంత సులభమని మీరనుకుంటే మీ నడుంకి వేలాడే ఆ రివాల్వర్ కేవలం అలంకారప్రాయంగా మారి తుప్పు పట్టేదికాదు. నేరస్థులు ఇంత విచ్చలవిడిగా మీ ముందే మారణహోమానికి కారణమయ్యేవారూ కాదు.""     ""డోంట్ డిస్టర్బ్ మి"" రణధీర్ ఉద్రేకంగా లేచి ""ప్లీజ్ గెటప్"" అన్నాడు చాలా సమీపంగా వచ్చి.     ""నాకు జవాబు కావాలి"" రెట్టించాడు.     ""చెప్పను.""     ""నాకు జవాబు కావాలి.""     ""చెప్పాల్సిన అగత్యం నాకు లేదు.""     ""నాకు జవాబు కావాలి.""     ""మిస్టర్ శశాంకా"" రోషంగా రెండడుగులు ముందుకేసిన రణధీర్ ఠక్కున ఆగాడు. అప్పటికే శశాంక కూడా ఒక అడుగు ముందుకు రావడంతో.     రణధీర్ ఊహించివుండడు అతడి ప్రవర్తన శశాంకనెంత రెచ్చగొట్టిందీ...     ఒక్క అర క్షణంపాటు శశాంక తనను తాను మరిచిపోయి వుంటే రణధీర్ శరీరం గాలిలోకి లేచి స్టేషన్ గుమ్మంపై నిర్జీవంగా పడడంతోపాటు అడ్డొచ్చిన పోలీసు బలగాన్ని కూడా ఎదుర్కొని ఆ స్టేషన్ ని చిందరవందర చేసేవాడు.     కాని శశాంకని పరోక్షంగానైనా కట్టిపడేసింది మామయ్యకిచ్చిన మాట.     శశాంక ఆవేశంగా బయటికి నడిచాడు.     ఒక నేరస్థుడికి కొమ్ము కాస్తున్న పోలీసు వర్గంపై తొలిసారి ఎంత జుగుప్స ఏర్పడిందీ అంటే అతడి పై ఆఫీసర్స్ ని కాక సరాసరి హోం మినిష్టర్ నే కలవాలని వెళ్ళాడు.       ప్రజాస్వామిక విధానాలపై ఇంకా చావని విశ్వాసంతో నిన్నగాక మొన్న జాతీయస్తాయి షూటింగ్ కాంపిటీషన్లో మొదటివాడిగా స్థానం సంపాదించిన తొలి తెలుగువాడిగా తన ఐడెంటిటీతో సులభంగానే హోం మినిస్టర్ సదాశివయ్యతో ఇంటర్వ్యూ సంపాదించగలిగాడు.     గెలుపుకి అభినందన, భార్య మరణానికి సంతాపం ప్రకటించిన హోం మినిస్టర్ ""మావాడు అలాంటివాడు కాదంటే కాడు"" అంటూ ధనుష్కోటి గురించి తనే ఓ అద్భుతమైన సర్టిఫికెట్ ఇవ్వడంతో తొలిసారి తత్తరపడ్డాడు.     ""మా వాడు"" అన్న పదంతో పరోక్షంగా తను ధనుష్కోటిని ఎంతగా షిల్డ్ చేస్తున్నదీ అర్థమైపోయింది.     మీ వాడు 'ఎలా అయ్యాడు' అంటూ నిలదీయలేదు...     న్యాయం జరిగే అవకాశం కోల్పోతున్న వాస్తవాన్ని గ్రహించి ఈ దేశపు రాజకీయాల అవినీతి అంచుల్ని అస్పష్టంగానైనా దర్శించే అవకాశం దక్కిన ఆ క్షణాలను ఇక జీవితంలో మరిచిపోకూడదన్నంత ఆవేశంగా బయటికి వచ్చాడు.     ఈ వార్త పొక్కిన వెంటనే ప్రతిపక్షాలు ఎంత ముమ్మరంగా పనిచేయడం మొదలుపెట్టాయీ అంటే స్వతంత్రం వచ్చిన నలభయ్యేళ్ళుగా బంద్ లకీ, హర్తాళ్ళకీ పరిమితమైన వారి రాజకీయ చరిత్రకి మరో పేజీ అలంకార ప్రాయంగా కూర్చుకోవాలని ఉబలాటపడి శశాంకని చుట్టుముట్టారు.     తమ అస్తిత్వాన్ని అప్పుడప్పుడూ ప్రజలకు తెలియపరిచే పద్ధతిలోనే శశాంకతో ఫోటోలు దిగి పత్రికా విలేకర్లతో ""ఈ దేశం ఏమైపోతూంది... ఎక్కడ శాంతిభద్రతలు... శశాంక లాంటి గౌరవనీయుడికే న్యాయం జరగనినాడు ఇక సామాన్యుడి మాటేమిటి? త్వరలోనే రాష్ట్ర స్థాయి బంద్ నేర్పాటు చేస్తాం. ప్రభుత్వం బర్తరఫ్ కావాలని కేకలు పెడతాం_ అసెంబ్లీ దుమ్ము లేపుతాం"" అనే పడికట్టు పదాల హోరుతో చాలా ఆవేశాన్ని ప్రకటించేశారు.     ఇదంతా జరగటానికి పట్టింది కేవలం మూడు గంటలు మాత్రమే.     అప్పుడు శశాంకని కలిసింది వినీల. బలవంతంగా ఓ రెస్టారెంట్ కి తీసుకువెళ్ళింది.     ""ఎందుకు శశాంకా... ఇంకా ఏం న్యాయం జరుగుతుందని ఆశించి ఇంత ఆవేశపడుతున్నారు?""     ""ఒకనాటి అర్ధరాత్రి స్వతంత్ర్యానికి నిదర్శనంగా అన్ని కోణాలలోనూ చీకటిని మాత్రమే దక్కించుకున్న ఈ సమాజంలో మీకు మీరై వెలుగురేఖగా మారే ప్రయత్నం చేయక అవకాశవాదుల చేతుల్లోకి ఎందుకు జారిపోతున్నారు..."" బాధగా అడిగింది. ""మీకు తెలీదు శశాంకా... మీరు నమ్మిన న్యాయాన్ని ఏ పోలీసాఫీసరూ, ఏ రాజకీయ నాయకుడూ' మీ కంత వేగంగా అందించలేడు...""     ""నిశ్శబ్దంగా వూరుకోమంటారా వినీలా"" నిస్సహాయత ధ్వనించిందతడి గొంతులో... ఏదో చేయాలన్న ఉద్విగ్నత స్పష్టంగా వినబడింది.     'అంటే శబ్దంతో లక్ష్యాన్ని చేరి మీకున్న గురి తప్పని ఆత్మవిశ్వాసాన్ని శబ్ద భేరి విద్యగా మార్చుకుని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నారా? మీకు తెలీదు శశాంకా... ఈ దేశం చాలా కలుషితమై పోయింది. కరప్షన్ అనే పదం ఈ ప్రపంచాన్ని నిర్విఘ్నంగా ఏలుతూంది. మనుషుల మధ్య మానవత అనే బంధం ఏనాడో తెగిపోయి ఇప్పుడు కరప్షన్ పాశంగా మారి అదే కావాలనుకునేవాళ్ళ పబ్బం గడుపుకునే ఓ అస్త్రమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మీకేదో ఒరగబెడతామన్న ఆ ప్రతిపక్షాలూ మిమ్మల్ని కరప్ట్ చేయడానికి ప్రయత్నించాయి.""" 63,"   ఆ క్షణంలో నాకా పేరుపెట్టిన  అమ్మమ్మమీద గౌరవం పెరిగిపోయింది.     ""అ...నూ...హ్య!"" ఒక్కొక్క అక్షరమే ఒత్తిపలికాడు.     నేను అప్పుడు గమనించాను, అతని చేయి ఇంకా  నా చేతిలోనే వుంది! గభాల్న వదిలేశాను.     ""అ...మళ్ళీ నెప్పి మొదలైంది"" అన్నాడు గట్టిగా. అతని కళ్ళల్లో. గొంతులో  అల్లరి కనిపించింది.     చిత్రంగా నాకు  కోపానికి బదులు నవ్వొచ్చింది. మగపిల్లలు చాల అల్లరి చేస్తారు.     నాకు అల్లరంటే చాల ఇష్టం!     నేను అక్కడినుండి కదలబోతూవుంటే , అతను సంభాషణని పొడిగిస్తూ ""పెయింటింగ్ లో మీకు  ప్రవేశం వుందా?"" అన్నాడు.     నేను తల అడ్డంగా  ఊపాను.     ""అభిరుచుందా?"" అడిగాడు.     నేను మళ్ళీ తల అడ్డంగా ఊపాను.     ""భారతన్యాటంలో?"" అడిగాడు.     నేను తల అడ్డంగా ఊపాను.     ""అబద్దం చెప్పకండి డ్యాన్సర్ మాత్రమే ఇలా తల ఊపగలరు!"" అన్నాడు.     నేను ఈసారి బయటికే ఫక్కున నవ్వేశాను.     ఇద్దరం జనంలోంచి కాస్త  దూరంగా నడిచాం.     అతను నా వెంట వస్తూవుండటం చూసి ""పాపం  మీ ఫ్రెండ్స్..."" అని అసంపూర్తిగా ఆపేశాను.     అతను విచారంగా మొహంపెట్టి ""నేను ఒక ఫ్రెండ్ తో వచ్చాను. వాడికి తీరా ఇక్కడికి వచ్చాక ఓ గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఇంక నా మొహం ఎందుకు చూస్తాడూ?"" అన్నాడు.     నేను విచారం అభినయిస్తూ ""సో సారీ!"" అన్నాను.     ""నో....సారీ కాదు ఐ యామ్ హేపీ! వాడు  లేక పోబట్టే మీతో పరిచయం  భాగ్యం లభించింది"" అన్నాడు.     నేను సన్నగా నవ్వి, కళ్ళతోటే వివేక్ కోసం గాలించసాగాను.     దూరంగా థన్మయీ, వివేక్ కలిసి నడుస్తూ కనిపించారు. వివేక్ ఏదో అంటూవుంటే తన్మయి అతని భుజంమీద పడి నవ్వుతోంది.     నా మనసు  భగ్గున మండింది.     సమీర్ ఏదో మాట్లాడుతున్నాడు నాకు వినిపించడంలేదు. నా మనసంతా తన్మయీ, వివేక్ ల చుట్టూ  పరిభ్రమిస్తోంది.     ""టీ తాగుదామా?"" సమీర్ అడిగాడు.     ""వద్దు... ఇప్పుడే తీసుకున్నాను"" చూపుమరల్చుకాకుండానే చెప్పాను.     ""ప్లీజ్.... నా కోసం "" అన్నాడు.     ""వద్దు!"" కరకుగా అనేశాను.     అంతలోనే సర్దుకుని  ""నాకు పడదు! వికారం"" అన్నాను.     ""ఓ.కే!"" అతను భుజాలు ఎగురవేసి టి కోసం కౌంటర్ వైపు వెళ్ళాడు.     నేను వివేక్ వాళ్ళవైపు గబగబా  అడుగుల వేస్తుండగా నా భుజాన్ని  పట్టుకుని ఎవరో ఆపారు. నేను కోపంగా చూసేసరికి ఈసారి విజయ! నాకు ఆనందం వేసింది. ""హాయ్! ఎప్పుడోచ్చావ్?"" అన్నాను.      ""నీ సెలక్షన్ ని!"" అని ఫక్కున నవ్వింది.      నేను ఇంకా కోపంగా  ""ఏం తక్కువైంది నా సెలక్షన్ కీ?"" అన్నాను.     ""అబ్బే! ఏం తక్కువ కాలేదు. ఒకడు తాతయ్యాలా వుంటే ఇంకోడు మేనల్లుడిలా వున్నాడు"" అంది.     నేను కావాలనే విజయ కాలు తొక్కాను.     ""అబ్బా!"" అని అరిచి వెంటనే ""రాక్షసి"" అంది.     ""నీతో ఓ విషయం మాట్లాడాలే!"" అన్నాను.     విజయ సీరియస్ గా ""ఇద్దరిలో ఎవరైతే బాగుంటుందన్న విషయమా?"" అంది.     నేను చురుగ్గా చూస్తూ ""ఔనూ!"" అన్నాను.     ""ఇద్దరిలో మూసలాడే బెటర్.... ఓల్డ్ ఈజ్ గోల్డ్!"" అంది.     ""నీ సలహాకీ థాంక్స్ నమస్కారం పెడ్తూ అన్నాను.     ఇంతలో సమీర్ వస్తూ కనిపించాడు.     ""నీ కుర్రాడోస్తున్నాడు నే పోతాగానీ... రేపు మన  కాలేజిలో   ఓల్డ్  స్టూడెంట్స్  మీట్ వుంది. సాయంత్రం  నేనే మీ ఇంటికి  వస్తా.... రెడీగా  వుండు కలిసి వెళ్దాం... బై ""అంటూ  తూనీగలా  వెళ్ళి జనంలో కలిసి పోయింది.     నేనింకా సంభ్రమంలోంచి తేరుకోలేదు. ఎంత యాదృచ్చికం! నిన్నరాత్రే అనుకున్నాను నా ఓల్డ్  ఫ్రెండ్స్  ఏమై పోయరోననీ! అప్పుడే వాళ్ళని  కలిసే అవకాశం వచ్చింది. అంటే.... ఈ వ్యవహారంలో దైవకృప వుందన్నమాట!     థాంక్ గాడ్! మీరుకూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయరేమోనని కంగారుపడ్తూ వచ్చాను"" అన్నాడు సమీర్.     నా దృష్టి సడెన్ గా ఆడిటోరియంలోకి వెళ్తున్న  వివేక్, తన్మయిల మీద  పడింది.     ""సమీర్.... పెయింటింగ్ గురించి నాకు  కాస్త వివరిస్తారా? అర్థింపుగా అడిగాను.     ""ఓ ఘ్యార్!"" అతను ఆనందంగా దారితీశాడు.     వివేక్ తన్మయిలు వస్తుంటే  వాళ్లకి అభిముఖంగా మేం నడిచాం.     సమీర్ మధ్యలో ఆగిపోయి ఏదో వర్ణిస్తూవుంటే, నేను అతని భుజంమీద కొట్టి ""అటు వెళ్దాం"" అని ముందుకి చూపించాను.     వివేక్ కళ్ళు ఈ దృశ్యాన్ని ఓ సెకన్ పాటు  వీక్షించి, వెంటనే కదిలిపోయాయి!     సమీర్  నా చెయ్యిపట్టి లాగుతూ ""ఈ కలర్ కాంబినేషన్  చూశారా? ఆరెంజ్ లో  ఎల్లోకలర్ మిక్స్ చేస్తే  ...సంధ్యకాంతులు!"" అని వర్ణిస్తున్నాడు.     నేను అతని చేతిని  విడిపించుకుని, చిరాగ్గా  చూస్తూ ""ఇంక  పోదాం...బోర్ గా వుంది"" అన్నాను.     అతని కళ్ళు వెంటనే  ఉత్సాహంతో మెరిశాయి! తను  ఇంజనీరింగ్ స్టూడెంట్ ననీ, ఏక్టింగ్ అంటే   ఇంట్రెస్ట్ అనీ, బొమ్మలంటే అభిరుచనీ, ఇంకా  తన  హబీలూ, ఆశయాలూ, ఆశలూ అన్నీ చెప్తూనే వున్నాడు. ఆ వయసు  అలాంటిదేమో! వినేవాళ్ళుంటే చాలు విశేషాలు  పురుడుపోసుకుంటాయి.     నేను నవ్వుతూ ఓపిగ్గా  అతను  చెప్పేవన్నీ విన్నాను.     ""మరి మీ  గురించో?"" అన్నాడు.         నేను నా బ్యాగ్ లోంచి కాయితం తీసి నా ఫోన్  నెంబర్ వ్రాసిచ్చాను. అతని మొహం వెలిగిపోయింది. ""నేను  నా ఫోన్ నెంబర్ మీకు  ఫోన్ చేసి చెప్తాను"" అన్నాడు చిన్నపిల్లాడిలా.     నేను ""బై"" అని కదులుతుంటే ఠక్కున  నా చేతిని అందుకుని ""సి యూ!"" అని  నొక్కి వదిలాడు.     నేను అవాక్క యిచూశాను అతని మొహంలో అదే  చిరునవ్వు. ""నా ఫోన్ కోసం  వెయిట్ చేస్తుండండి""అన్నాడు. నేను అతన్ని ఏమీఅనలేక వడివడిగా వచ్చేశాను. ఇంటికి వస్తూవుండగా  కార్లో వివేక్ అన్నాడు- ""నీ బోయ్ ఫ్రెండ్ నాకు నచ్చాడు""     ""నాకు కూడా ...."" అనేశాను. ఔను... నిజంగానే నాకు నచ్చాడు నన్ను 'ఆంటి' అని పిలవనందుకు!                                                         *        *        *     స్కూల్లో  మూడోరోజు దిగ్విజయంగా జరగబోతోంది అని నేను  అనుకుంటూవుండగానే ఈ  అవాంతరం ముంచుకువచ్చేసింది. స్కూల్లో ఇలాంటివి జరగవచ్చని  నేను అస్సలు  ఊహించలేదు!     నేను ఎనిమిదో తరగతిలో హిస్టరీ  పాఠం   చెప్తున్నాను. హిస్టరీ  నాకు ప్రియమైన  సబ్జెక్ట్!     తాంతియాతోసే, రాణీలక్ష్మీబాయిలు బ్రిటీషువారి మీద ఎలా  తిరుగుబాటుచేశారో చాలా  ఉత్సాహంగా వివరిస్తున్నాను. పిల్లలు కూడా అల్లరిచెయ్యకుండా బుద్దిగా వింటున్నారు దేశం గురించీ, దేశభక్తుల గుంరిచీ చెప్తూవుంటే నాకు తెలియకుండానే కళ్ళు తడిగా మార్తయి! అదేనేమో ఆర్ద్రత అంటే!     అంతా  నిశ్శబ్దంగా వింటున్నారు. కేవలం నా గొంతు  మాత్రం  క్లాసులో  అందరికన్నా  పొడుగ్గావుండే పోకిరీ పిల్లాడు లేచి  నిలబడి, అదోలా నవ్వుతూ ""చోళీకే పీచే క్యాహై ....చున్ రీకే నీచే క్యాహై?"" అన్నాడు     నేను  ఒక్కనిమిషం కట్రాటలా బిగిసి  నిలబడ్డాను. వాడు అడిగేదేమిటో నాకు అర్ధంకాలేదు. అంతలోనే తేరుకుని  ""ఏమన్నావు?"" అన్నాను.     వాడు అంత  ఆవేశం ఎప్పుడూ కలగాలేదు.     కర్ర తీసుకుని  వాడి దగ్గరకు  వెళ్ళి ""చెప్తాను చేతులు పట్టు!"" అన్నాను.     వాడొకసారి ఎగతాళిగా చూసి, విలాసంగా చేతులు జాపి నిలబడ్డాడు. ఆ భంగిమ మరీ అసహ్యంగా అనిపించింది. కర్ర ఎత్తి  విసురుగా వాడి అరచేతుల్లో కొట్టడం ప్రారంభంచాను. అది హిస్టరీక్లాసు కాకపోయినా, దేశం గురించి నేను  ఎమోషనల్  గా  పాఠం చెప్తుండగా వాడలా అడగకపోయినా అంతగా  కొట్టేదాన్నికాదేమో!     వాడు  కాసేపటికి పొగరంతా పోయి  వలవలా ఏడవడం ప్రారంభించాడు.     ""జాగ్రత్త! ఇంకోసారి పెద్దాచిన్నాలేకుండా ప్రవర్తించకు"" అని చెప్పి క్లాసులోంచి వచ్చేశాను.     స్టాప్ రూమ్ లోకి చిగురుటాకులా వణకసాగింది. నేను  పుట్టి బుద్దేరిగాక ఎవ్వరిమీదా  చేయి చేసుకోలేదు!     ప్యూన్ వచ్చి ""అనూహ్య మేడమ్ ని సార్  పిలుస్తున్నారు""  అని చెప్పాడు.     నేను లేచి నడుస్తుంటే ఒళ్ళు తూలిపోసాగింది. ఎలాగో అధీనం చేసుకుని  ప్రిన్సిపాల్ రూమ్ లోకి అడుగు పెట్టాను. అక్కడ నేను ఇందాక కొట్టిన పిల్లవాడున్నాడు! వాడి వెనకాల ఓ మాంత్రికుడు లాంటి వ్యక్తి, పెద్ద కుంకుమబొట్టుతో, ఖద్దరు బట్టల్లో కుర్చీలో కూర్చునివున్నాడు.     సార్ నన్ను  చూడగానే మండిపడ్తూ ""ఏంటిది? పిల్లాడ్ని అట్లానా కొట్టడం? ఎవరనుకున్నావ్? కౌన్సిలర్ గారి అబ్బాయి!"" అన్నాడు.     నేను కోపాన్ని దిగమింగి, సహనాన్ని  అరువుదెచ్చుకుని ""అసలేం జరిగిందో మీకు తెలుసా?"" అన్నాను.     ""సర్లే.... ముందు ఆయనకీ,  ఆ పిల్లవాడికీ సారీ చెప్పు"" అన్నాడు పురుగుని విదిలిస్తున్నట్లుగా.     నాకు  మతి పోయింది. చెప్పేది వినిపించుకోడేం? నేను ప్రిన్సిపాల్ వైపు తిరిగాను. ఆవిడ తనకేం పట్టనట్లు కొన తో అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటోంది.     ""అసలు  అతను ఎలాంటి అసభ్యకరమైన ప్రశ్న వేశాడో తెలుసా  మేడమ్?"" అని అడిగాను.     ఆవిడ ఓసారి బ్లాంక్ గా చూసి మళ్లీ తన పని  తను చేసుకోసాగింది.     ఖద్దరు బట్టలు ఆసామి లేచి కిటికీలోంచి పాన్ తుపుక్కున ఉమ్మి నోరువిప్పాడు. పెల్లగాళ్ళకి పాఠలు చెప్పునీకి వచ్చినావా  లేకుంటే తన్నుడు తన్ననీకి వచ్చిన్నావా? నా పోరాగాడే దొరికిండా నీకు? నేనే అడుగుతున్న ఇప్పుడు....చోళీకే ఫీచే క్యాహై? చెప్పు! చెప్పనీకి సమజ్ చేయనీకి కాదా నీకు తనఖా ఇస్తున్నది? చెప్పు? చునురీకీ నీచే క్యాహై.... అంటే  అర్ధం  ఏంది?"" అభినయంచేస్తూ అడిగాడు.     నా శరీరంలోని రక్తం అంతా మొహంలోకి తను కొచ్చినట్లుగా ఫీలయ్యాను. అలవాటు లేని అవమాన భారంతో, దుఃఖం నా శరీరం కంపించసాగింది.     ""ఏం సారీ  చెప్తే నీ సామ్మేం పోతుంది?"" కోపంగా అడిగాడు సార్.      ఖద్దరు లాల్చీ మాంత్రికుడు మరోసారి కిటికీలోంచి తుపుక్కున ఉమ్మాడు తెల్లని గచ్చుమీద అసహాయుల రక్తం చారల్లా పడింది అతడి లాలాజలం!     ""పోన్లే ఆడది ఇడిసేయ్... అయిదువందల కోసం  కొలువుచేసే దానికి గింత పకరుంటే మంచిది కాదు! పో....పోయి నీ పని సూస్కో ""అన్నాడు.     సార్ అందుకుని ""చూశావా అన్న ఎంత పెద్దమనిషో? సారీ చెప్తే నీ సొమ్మేం పోతుందీ?"" అన్నాడు.     ""నోర్ముయ్!"" నేను  అంత గట్టిగా అరవగలనని అప్పటిదాకా నాకే తెలీదు!     నా అరుపుకి ప్రిన్సిపాల్ చేతిలోని కొన్ ఆకస్మాత్తుగా జారిపోయింది.                  " 64,"         ""జనవరినాటికి....""         ""మన ప్రొడక్టు సక్సెస్ కావాలంటే.... రైవల్ గ్రూప్స్ ని కూడా ఓ కంట కనిపెడుతుండాలి. అర్ధమైందా.....బిజినెస్ అంటే మనదారిలో మనం వెళ్ళడమే కాకుండా, మన దారికి ఎవడూ అడ్డు రాకుండా కూడా చూసుకోవడంలోనే వుంది."" వ్యాపార సూత్రం చెప్తున్నట్లుగా అన్నాడు కుమార్.         ఏట్లో, తేట నీటిలో హాయిగా తిరిగే చేపపిల్ల, ఆకస్మాత్తుగా 'ఎక్వీరియం'లో చిక్కుకుపోయినట్లుగా అయిపోయింది వికాస్ కి.         వ్యాపారమంటే ఇన్ని మడత పేచీలా? ఆశ్చర్యంగా వుంది!                                            *    *    *    *    *         ""ఇదిగో బ్లాంక్ చెక్.... ఎంత ఎమౌంట్ వేసుకుంటావో నీ ఇష్టం..."" చెక్ బుక్ లోంచి 'చెక్'ని చింపి ముందుకు తోశాడు భానోజీరావు.         ""నువ్వు డబ్బు చేతిలో పడందే.... ఏ పనీ చెయ్యవని నాకు తెలుసు కాబట్టి...."" మళ్ళీ  అన్నాడాయన.         ఇద్దరిదీ సరి సమాన వయస్సు.         ""ఏంటండీ బాబూ.... చూస్తుంటే ఇదేదో పెద్ద పనిలా వుంది. మీ లాంటివారు డైరెక్ట్ గా రంగంలోకి దిగిపోతున్నారంటే... చెప్పండి.....చెప్పండి...."" ఆసక్తిగా అన్నాడు జగన్నాధమిశ్రా.         ""అదే.... మీ ఏరియాలోంచి ఒక కారొస్తోందట విన్నావా...."" చెప్పబోయాడు.         ""ఆగండాగండి.... కోడిపిల్లని గెద్ద ఎంత దూరం నుంచి చూస్తుందో మీకు తెలుసా.... అంతెత్తు నుంచి చూస్తుంది. అప్పుడే ఎప్పుడో కనిపెట్టేస్సేను నేను. అసలోడితో మాట్లాడలేదు కానీ వివరాలన్నీ తెల్సు.... వికాస్ అని... మన కంపెనీలోంచి వెళ్ళినోడే..... హైపవర్ ఎలక్ట్రిక్ కారట.... పెట్రోలు, డీజిలూ ఏమీ అక్కర్లేదట- బాడీ అద్భుతమట... ఇంజన్ అద్భుతమట... చెప్పగా విన్నాను. భారీ ఎత్తున లాంచ్ చేస్తున్నారట."" ఆపాడు జగన్నాధమిశ్రా.         ""ఆ కారు మార్కెట్ లోకి రాగూడదు. నువ్వేం చేస్తావో చెయ్యి.... ఆ కంపెనీ అక్కడుండగూడదు. అదే సమయానికి మన కారొస్తుంది. ఎక్కడ చూసినా రోడ్డుమీద మన కార్ కన్పించాలి.... తెల్సిందా....""             ""కారు తయారుచెయ్యడమంటే మనవల్ల కాదు గానీ, ధ్వంసం చెయ్యడమంటే రెండు నిమిషాల్లో పని...""         ""ఎక్కడా మన పేరు బైటికి రాగూడదు. అర్ధమైందా...""         ""మన ప్రతాపం అప్పుడే మరిచిపోయారు మీరు...""  అని గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేశాడు జగన్నాధమిశ్రా.         ఒకసారి కలకత్తాకు చెందిన ఒక గ్రూప్ కొత్తగా మోపెడ్ ని తయారు చేసింది. ఆంద్రప్రదేశ్ లో ఒక డీలర్ ని ఏర్పాటు చేసుకుంది. బొంబాయిలోని ఒక గ్రూప్ కూడా ఇంకోరకం మోపెడ్ ని తయారుచేసింది. దానికి మెయిన్ డీలర్ భానోజీరావు. భానోజీరావు కొత్తగా ఆటోమోబైల్ వ్యాపారంలోకి దిగిన సమయం అది.         కలకత్తా కంపెనీ మోపెడ్ లు ఆంధ్రాలోకి అసలు రాగూడదు- అదీ భానోజీరావు పంతం.         లక్ష మోపెడ్ల లారీలు దారిలో తప్పిపోయాయి.         ఎక్కడకెళ్ళిపోయాయో, ఎటెళ్ళిపోయాయో తెలీదు.         ఆటోమోబైల్ ఇండస్ట్రీలో ఒక సంచలనమైన కధ అది.         బొంబాయి గ్రూపు మోపెడ్ లు రెండింతలు అమ్ముడుపోయాయి. చాలా రోజుల తర్వాత-కలకత్తా కంపెనీ లారీలొచ్చాయి.         ఆ లారీలు ఒరిస్సా అడవుల్లో వున్నాయట- పోలీసులకు కన్పించాయి.         డ్రైవర్లు లేరు- ఎటెళ్ళిపోయారో తెలీదు.         ఆరోజుకీ, ఈ రోజుకీ ఆ డ్రైవర్ల జాడ ఎవరికీ తెలీదు. ఇద్దరికి తప్ప ఒకరు భానోజీరావు- రెండవవారు జగన్నాధమిశ్రా.         పట్టుదల వస్తే భానోజీరావు ఎంతటివాడో జగన్నాధమిశ్రాకు బాగా తెలుసు.         ""ఎప్పటికప్పుడు నాకు ప్రోగ్రెస్ తెలియాలి..."" చెప్పాడు భానోజీరావు.         చైర్మెన్ ఛాంబర్ లోంచి జగన్నాధమిశ్రా బయటికొస్తున్న సమయంలోనే లోనికి అడుగుపెట్టాడు మధుకుమార్.         ""ఎప్పుడొచ్చావ్.... రా.... ఏమిటీ విశేషాలు...."" అడిగాడు భానోజీరావు.         ""మీకొచ్చింది రాంగ్ ఇన్ ఫర్ మేషనండి. శివానీ గ్రూపు వాళ్ళేం చేస్తారు? సరయిన ఫైనాన్స్ లేదు. ఏమీ లేదు. దాని గురించి వర్రీ కావలసిన పనేం లేదు.... ఇంధనం అవసరంలేని కారు కానుక విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని ఆర్ధికమంత్రి మన్ మోహన్ సింగ్ పర్సనల్ ఇంట్రస్ట్ తో వెంటనే లైసెన్స్ ఇచ్చారట- కనీసం ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేయకుండా కాని సక్సెస్ కావొద్దు...."" అన్నాడు మధుకుమార్.         ""అంతేనంటావా....?""         అదే సమయంలో ఫోన్ మ్రోగింది.         ""వైజాగ్ నుంచి సార్...."" పి.ఏ. చెప్పాడు.             ""హలో!""         ""గుడ్ మాణింగ్ సర్..... మధుకుమార్ ఇక్కడ కొచ్చారు సార్.... ఆ వికాస్.... మధూ.... కలుసుకున్నారు సర్.... ఏం మాట్లాడుకున్నారో తెలీదు సర్.... ఉంటాను సార్!""         ఫోన్ పెట్టేశాడు భానోజీరావు.         భానోజీరావు ముఖంలో ఏ మార్పూలేదు. ఇందాక 'అంతేనంటావా' అన్న ముఖమే ఉంది. ఇప్పుడు కూడా.         ""అయినా సరే.... మనం జాగ్రత్తగా ఉండాలి.... మళ్ళెప్పుడెళ్తున్నావ్?"" అన్నాడాయన.         ""రెండ్రోజుల్లో... చెప్పాడు"" మధుకుమార్. తర్వాత మధుకుమార్ వెళ్ళిపోయాడు.         తన అంచనా ఎప్పుడూ తప్పదని సాక్ష్యాలతో రుజువైనందుకు మరోసారి ఆత్మ విశ్వాసం పెరిగిందాయనకు.         పులి మెడకు గుర్రపు కళ్ళెం కట్టొచ్చని పిచ్చిగా ప్రయత్నాలు చేసే వాళ్ళెందరో!                                             *    *    *    *    *         వికాస్ నిద్రాహారాలు మానేశాడు. పెయింటింగ్ దగ్గర్నుంచి, అప్ హోలస్టరీ వరకు... గాలి ఒత్తిడిని తగ్గించుకుంటూ ముందుకు దూసుకెళ్ళగల బాడీ రూపకల్పన... డిస్క్ బ్రేక్స్... డ్యూటీలో సర్క్యూట్ బ్రేకింగ్ సిస్టమ్... ఎంత వేగంలోనైనా బ్రేక్ వేస్తే ఎలాంటి వైబ్రేషన్స్ లేకుండా ఆగిపోయే శక్తిగల బ్రేక్స్... హైలీ సోఫిస్టికేటేడ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్... ఫెంటాస్టిక్ సస్ పెన్షన్.....పవర్ ఫుల్ వాటర్ కూల్డ్ ఇంజన్.... క్షణాల్లో పికప్ తీసుకోగల 40.5 BHP/5600 RPM.....2,00,000 కిలోమీటర్ల వరకు ఓవర్ హాలింగ్ లేకుండా పనిచేయగల అతిశక్తివంతమైన ఇంజన్ అక్కడ పనిచేస్తున్న సీనియర్ ఇంజనీర్లు, వర్కర్స్ ఒకప్పుడు హిందూస్తాన్ ప్రీమియర్, మారుతీలో పనిచేసి రిజైన్ చేసి వచ్చినవాళ్ళే, వాళ్ళు సయితం వికాస్ లోని పట్టుదలకు, తెలివితేటలకు విస్మయం చెందుతున్నారు.         వాళ్ళు సయితం నిద్రాహారాలు మానేశారు. పని... పని... పని....ఒక సంచలనానికి ఊపిరిపోసే పని... పని... 'STREET RIDER' కారు బాడీ నిర్మాణం పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అమేజింగ్ స్పేషియస్ ఇంటీరియర్, డ్రైవర్ కి, ప్యాసింజర్స్ కి కావలసినంత లెగ్ రూమ్, లగేజీకి స్పేస్, కౌంటర్డ్ బకెట్ సీట్స్, విండ్ స్క్రీన్, విండోస్ ఆల్ రౌండ్ విజబిలిటీకి డిజైన్ చేయటం జరిగింది. కంప్రెస్ట్ పోలీ ప్రొఫైలైన్ డాష్ బోర్డ్, గ్లేర్ ఫ్రీ ఇన్ స్టృమెంట్ ప్యానల్, ఎయిరో డైనమిక్ డిజైన్ తో స్ట్రీట్ రైడర్.... అంతవరకూ ఇంజనీరింగ్ విభాగం ఓపెన్ గా ఉండేది. దానిచుట్టూ గోడ కట్టించేశాడు వికాస్. లోపల ఏం జరుగుతున్నది బయట వాళ్ళకెవరికీ తెలీదు.         స్ట్రీట్ డ్రైవర్ కారు.... గంటకి నూట ముఫ్ఫై కిలోమీటర్ల గరిష్ట వేగం ఇంధనం అవసరం లేదు.... హైఓల్టేజి బ్యాటరీ సహాయంతో నడుస్తుంది. చార్జింగ్ పూర్తి చేసుకుని పరుగెత్తడానికి సిద్దమౌతుంది.... మూడు సంవత్సరాల గ్యారంటీ!         అరవింద నాయర్ వచ్చి తగిన సలహాలిచ్చి వెళ్ళాడు.         పదిహేను రోజుల్లో కార్లన్నీ రెడీ అవుతాయి.... ముందు అనుకున్న ప్రకారం పాతిక కార్లు కాకుండా, యాభై కార్లను ఉత్పత్తి చేస్తోంది శివానీ కంపెనీ.         'టెస్ట్ ఫీల్డ్'ని నిర్ణయించి, కార్లన్నిటినీ 'టెస్ట్' చెయ్యాలి ఇంజనీర్లు చేసిన టెస్ట్ లు తర్వాత-         యూత్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి ఏదైనా పధకం ఆలోచించాలి....దాని ద్వారా పెద్ద పేపర్ పబ్లిసిటీ వస్తుంది. అది ముఖ్యం.                                                         *    *    *    *    *         ఆ సమయంలో జగన్నాధ మిశ్రా శివానీ మోటార్స్ ఆఫీసులోకి అడుగు పెట్టాడు.         అక్కడొక అద్భుతమైన వాతావరణం కన్పిస్తోందతనికి.         శ్రమైక శక్తితో రూపుదిద్దుకుంటున్న ఒక యాంత్రిక స్వర్గంలా కనిపించిందతనికి.         ""నా పేరు జగన్నాధ మిశ్రా... చాలా రోజుల్నుంచి మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన సమయంలో కలిస్తేనే బావుంటుందని ఇప్పుడొచ్చాను. సీనియర్ డీలర్ ని నేను.... ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ లో కూడా మాకు బ్రాంచీలున్నాయి. మొదటి బ్యాచీగా మీరెన్ని కార్లను రిలీజ్ చేస్తున్నారు..."" అడిగాడు జగన్నాధమిశ్రా." 65,"     ది ఫాదర్ ఆఫ్ ది గేంబ్లింగ్.          గ్రేట్ గేంబ్లర్...          బెట్టింగ్, గేంబ్లింగ్.          చైనీస్ రక్తంలో ఇప్పటికీ మిగిలి ఉన్న జూదం.          హీ హేజ్ బిల్డ్ హిమ్ సెల్ఫ్ కి మేఘా ఫైనాన్షియల్ ఎంపైర్ కాన్ స్టెంట్లీ ఎక్స్ పేండింగ్ ఫర్ మోర్ దేన్ ఫార్టీ ఇయర్స్.          వెన్ టైమ్స్ ఆర్ బేడ్          ది చైనీస్ గేంబుల్.          వెన్ టైమ్స్ ఆర్ గుడ్ ది చైనీస్ ఆల్ సో గేంబుల్.          జూదాన్ని ఆరోప్రాణంగా చేసుకున్న తండ్రి రక్తం.          దేవుడు, దెయ్యం, భక్తి, ముక్తి, సంస్కృతి, సాంప్రదాయాల్ని నరనరాన జీర్ణించుకున్న తల్లి జీనియాలజీ మాస్టరు రక్తంలో కలిసిపోయి ఉన్నాయి.          అతను ఓ కోణంలో చైనీస్ లా మరో కోణంలో ఇండియన్ లా కనిపిస్తాడు.          ఇండో చైనీస్ ఫీచర్స్.          తండ్రి చనిపోయేవరకు హాంగ్ కాంగ్ లో వున్న మాస్టర్ తల్లి కోరిక మేరకు ఆ తరువాత వచ్చి బొంబాయిలో స్థిరనివాస మేర్పరచుకున్నాడు.          మరి అలాంటి వ్యక్తి ప్రాణరక్షణకు సంవత్సరానికి రెండుకోట్లంటే పెద్ద మొత్తమే అవుతుంది?          కొన్ని చిన్న దేశాల ఆర్ధిక వ్యవస్థలే అతనిచ్చే విరాళాల మీద ఆధారపడి నడుస్తుంటాయి.          మనిషిలో ఈజీయనీ గురించి మొలకెత్తే ఆశలు.          జూదవ్యసనం అతని వ్యాపారానికి ఆయువుపట్టు అతనేం ఫెయిర్ బిజినెస్ మెన్ కాదు.          అంతర్జాతీయ స్థాయి జూదగృహాలన్నీ అతడివే.          మనిషి బలహీనతలపై సొమ్ము చేసుకుంటుంటాడు.          అదే అతన్ని అడిగితే నేనేం దొంగతనం చేయటం లేదు. దోపిడీ చేయటం లేదు.          జూదం ఆడాలనుకొనే వ్యక్తులకు అవకాశం కలిపిస్తున్నారు. జూదం ఆడేందుకు వచ్చే జూదరులకు తెలీదా జూదంలో సర్వం ఓడే ప్రమాదం వుందని.          నేను ఇటీవలే టీవీలో మహాభారతం చూశాను.          నేను చూసిన ఎపిసోడ్ లో ధర్మరాజు, దుర్యోధనుడు జూదం ఆడారు ఆ ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. ఆ జూదాన్నే మా ఫాదర్ మోడర్నైజ్ చేశారు.          గాంధారరాజు వెన్నుపూస ఎముకలు అతని కొడుకైన శకుని చేతిలో పాచికలయ్యాయి.          వ్యాసుడి గ్రాండ్ కాన్వాస్...          గుఫీసైంధాల్ నటన అద్భుతం.          అసలు చోప్రా నన్ను కలిసుంటే ఆ ఎపిసోడ్ తీసేందుకు కోటి రూపాయలు ఇచ్చి వుండేవాడ్ని.          మాస్టరు ఆలోచనలు ఎవరికీ అర్ధంకావు.          అతని మాటలు ఇన్ స్క్రూటబుల్.          అతనికి పెద్ద సైకలాజికల్ ఏంకర్. అతని చిన్నక్క కూతురు. ఆపైన అతని తల్లి యశోధర. ఈ ప్రపంచంలో అతనికి వున్న ముఖ్యమైన వాళ్ళు ఆ ఇద్దరే.          చిన్నక్క కూతురు సోహ్ని...          ఆ పాపకు పదేండ్లుంటాయి.          తన తల్లి అసాసినేట్ కాబడినప్పుడు ఆ పాప తన తల్లి గర్భంలో ప్రశాంతంగా నిద్రిస్తోంది.          తల్లి రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ఒక పసికందుకి ప్రిమెచ్యూర్ బర్త్ ని ప్రసాదించింది.          ఆ పసిగుడ్డు ప్రాణాలనయితే కాపాడుకుంది. కాని, అంగవైకల్యం నుంచి దూరం కాలేకపోయింది. స్టేన్ ల్లీ హో కొన్ని మిలియన్స్ ఖర్చు పెట్టి దేశదేశాలు తిరిగి చివరకు ఒక కృత్రిమమయిన కాలును మాత్రమే తన మనుమరాలికి సంపాదించి పెట్టగలిగాడు. ప్రపంచవ్యాప్తంగా అతను అందరికీ స్నేహపాత్రుడే అలాగే ప్రపంచంలోని ప్రతిమూల అతన్ని హత్య చేసేందుకు హంతకులకు స్థానం కల్పిస్తుంటుంది.          అదే వారసత్వం అతని చిన్న కొడుక్కి కూడా వచ్చింది.          బొంబాయిలో లార్స్ న్ అండ్ టూబ్రో కంపెనీ దాటి విక్రోలికేసి వెళ్ళే దారిలో కుడివేపు వున్న చిన్న చిన్న కొండలలోని ఒక కొండపై మాస్టర్ బంగ్లా వుంది.          దాని ఖరీదు మూడున్నర కోట్లు.          సాధారణంగా కొత్తిల్లు కొనేప్పుడు వాస్తు చూస్తారు.          కాని మాస్టర్ ఇంటిని కొనే ముందు, మిల్లర్ హాంగ్ కాంగ్ నుంచి ప్రత్యేకంగా వచ్చి సెక్యూరిటీ ఛాన్సెస్ గురించి చూసాడు. అన్ని విధాల ఆ ఇల్లు మాస్టర్ ప్రాణాల్ని కాపాడగలుగుతుందని, చిన్న చిన్న మార్పులతో దుర్భేధ్యమయిన నివాసంగా, దుర్నిరీక్ష్యమయిన నివాస్మగా మారిపోగలదని నమ్మాకే దాన్ని కొనటం జరిగింది.          రెండు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఆరేడు దశాబ్దాల క్రితం ఒక ఫ్రెంచ్ బిజినెస్ మెన్ నిర్మించిన అత్యద్భుతమయిన ఆ బంగ్లా రాజప్రాసాదంలా కనిపిస్తుంటుంది. చుట్టూ గార్డెన్.... ఫ్లవర్ బోర్డర్స్, ఫౌంటెన్స్, సన్నటి పచ్చిక రహదారులతో శోభాయమానంగా ఉంటుంది.          వాటన్నింటిని బయట ప్రపంచం నుంచి దూరం చేసే మహోన్నతమయిన సుదృఢ ప్రాకారం చుట్టూ పహరా కాస్తున్నట్లుంది.          సుశిక్షితులయిన మాస్టర్ కమెండోస్ అనుక్షణం, అప్రమత్తంగా ఆ బంగ్లాను పహరా కాస్తుంటారు.          మాస్టర్ రక్షణ ఏర్పాట్లకు, ప్రోటోకోల్ ని చూసి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ వింగ్స్ కూడా ఈర్ష్య పడటం ఖాయం.          నారీమన్ పాయింట్ వ్యాపార వేత్తలు సయితం మాస్టర్ స్టేన్ ల్లీ జీవన విధానాన్ని చూసి అసూయ చెందుతుంటారు.          ఆ బంగ్లాలోనే రెండు హెలీపేడ్స్ ఉన్నాయి. 259 ప్రయాణికుల కోసం డిజైన్ చేసిన డిసి ఎయిర్ ఫ్లయిట్స్ రెండు మాస్టర్ తండ్రి కలల్ని, మాస్టర్ వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకొనేందుకు అనుకూలంగా మార్చబడ్డాయి. వాటిల్లో ఒకటి సాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇంధనాన్ని నింపుకొని మాస్టర్ కోసం సర్వసన్నద్ధంగా ఉంటాయి. వాటి ఖరీదు ఒక్కొక్కటి 49 కోట్ల అరవై లక్షలు. రెండూ కలిపి సుమారు వందకోట్ల ఖరీదుంటాయి." 66,"     అంతలో ఓ వృద్ధుడు అక్కడికి వచ్చి ""మిమ్మల్ని అమ్మగారు రమ్మంటున్నారు"" అని చెప్పాడు.     అమ్మాయిలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రమ్మంటూ వుందంటే దీనిమీద క్లాస్ తీసుకుంటుందని అర్థమైంది.     ""మీరు గదిలో వుండండి. ఇప్పుడే వచ్చేస్తాం"" అని చెప్పి మౌనిక బయల్దేరింది. మిగిలిన వాళ్ళు ఆమెను అనుసరించారు.     వీళ్ళు వెళ్ళేటప్పటికి విమలాబాయి తన ఆసనంలో కూర్చుని వుంది. అందరూ చాపల మీద కూర్చున్నారు. అందర్నీ పరిశీలించి చూస్తోంది ఆమె. వాళ్ళ ముఖాల్లో ఏదో ప్రత్యేకత వుంది. అది ఇదీ అని తేల్చుకోలేక పోయింది. ఇంతకు ముందున్న అమాయకత్వం మాత్రం లేదు. ప్రపంచం తాలూకు జ్ఞానం లాంటిది వాళ్ళ ముఖాల్లో ప్రవేశిస్తోంది.       ""ఇప్పుడు ఈ ఆశ్రమంలో జరిగిందానికి నేను ఎంతో బాధపడుతున్నాను. అసలిదంతా ఎలా జరిగిందో నాకర్థం కావడంలేదు. మీ మధ్య నున్న అతను ఎవరు? కొత్తగా వున్నాడు. నేనెప్పుడూ చూసినట్టులేదు"" అని ఆగి అందరివంకా చూసింది.     అమ్మాయిలంతా తలలు వంచుకున్నారు.      మౌనిక మాత్రం తలెత్తి చెప్పింది.     ""అతని పేరు తరుణ్. అతన్ని చంపడానికే గణపతిరాజు బాంబులు పేలినట్లు సృష్టించాడు.""       ""తరుణ్ ఎవరు?""     మౌనిక క్లుప్తంగా చెప్పింది. అయితే ఇన్ని రోజులు అతను అనాథ మహిళా సదన్ లో వున్నట్లు మాత్రం చెప్పలేదు.     ""తరుణ్ ఇన్ని రోజులూ ఇక్కడే వున్నాడా?""     ""ఆఁ""     ""ఎక్కడ?""     ఇక చెప్పక తప్పదు. ""అనాథ మహిళా సదన్ లో - మాతోపాటే వున్నాడు.""     విమలాబాయి తన పక్కనే బాంబు ఏదో పేలినట్లు జడుసుకుంది.     ""మీతోపాటా!"" ఆమె నమ్మలేకపోతోంది.     ""అవును. ప్రాణగండం వున్న అతన్ని బయటికి పొమ్మనలేక పోయాం.""     ""కానీ...."" ఆ తరువాత ఏం మాట్లాడాలో తెలియక విమలాబాయి గుడ్లప్పగించి చూస్తుండిపోయింది.     అమ్మాయిలు యిలా తయారుకావడానికి తనలోనే ఏదో లోపం వున్నట్లు భావించింది ఆమె.     తన ఉపన్యాసాల్లో పస తగ్గిపోయిందా? తను చెబుతున్న ధర్మాలకు కాలం చెల్లిపోయిందా? లేక అమ్మాయిలు ప్రపంచానికి దూరంగా వుండలేక పోయారా?     లేకుంటే ఒక మగవాడు తమ సదన్ లో వుండడంవల్ల వశం తప్పారా?     చాలాసేపటివరకు ఆమె అలానే వుండిపోయింది. ఇక మాట్లాడవలసింది కూడా ఏమీ లేదనిపించింది.     ""జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఒక బృహత్తర కార్యం కోసం వినియోగింపబడ్డ మహిళలు. మీరు యిలా విషయ వాసనల విషవలయంలో చిక్కుకోవద్దు. వెంటనే అతన్ని పంపించేయండి"" అని లేచి వెళ్లడానికి ఉపక్రమిస్తోంది విమలాబాయి.     అప్పుడు పడింది ఆమె చూపు అమ్మాయిల వేళ్ళమీద. నైల్ పాలిష్ తో మెరుస్తున్న వేళ్ళను చూడగానే ఆమెకు తను ఓడిపోయినట్లు నమ్మకంగా అనిపించింది. కానీ ఓటమిని ఒప్పుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. తరుణ్ ఇన్ ఫ్లుయన్స్ ను వాళ్ళలో తొలగించి, తిరిగి వాళ్ళను తన దారిలో పెట్టడానికి ఏం చేయాలో అని ఆలోచిస్తూ అక్కణ్ణుంచి కదిలింది.                              *    *    *    *    *     గణపతిరాజు సరితాదేవి మనిషి అని తెలియగానే ఎస్.ఐ. ముకుందం భయపడ్డాడు. ఆమె గురించి అతనికి బాగా తెలుసు. లేని భీకరాన్ని నటించాలన్నా వీలుపడడం లేదు. అందుకే అయన భయపడుతున్నాడని అందరూ ఈజీగానే కనిపెట్టారు.     ఎస్.ఐ. అలా చేష్టలుడిపోయి చూస్తూ వుండిపోవడంతో కానిస్టేబుళ్ళు కూడా గణపతిరాజు దగ్గరికి వెళ్ళలేకపోయారు.     ""కావాలంటే ఆమెకి ఫోన్ చేసుకోండి"" గణపతిరాజు మరింత ధీమాగా అన్నాడు.     ""నువ్వు నిజంగా సరితాదేవి మనిషివేనా?"" ముకుందం మరో మారు ప్రశ్నించాడు.     ""కావాలంటే తేల్చుకోండి""     ముకుందానికి కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. నిజానికి అతను పోలీసు ఉద్యోగానికి పనికిరాడు. మనిషి చాలా సున్నితుడు. కష్టపడి పనిచేయాలన్న యావ వుంది తప్ప పనెలా చేయాలో తెలియదు.     కానిస్టేబుళ్ళు కూడా అప్పుడప్పుడు తిరగబడుతుంటారు. అందుకే ఆయన్ని ఎప్పుడూ పల్లెటూళ్ళకే వేస్తుంటారు. టౌన్ లలో అయితే ఎందుకూ పనికిరాడని పై అధికారులకి తెలుసు.     ముకుందం ఫోన్ డైరెక్టరీ చూసి సరితాదేవి ఫోన్ నెంబరు పట్టుకున్నాడు. ఫోన్ నెంబర్ రాసుకున్నాడు.     వణుకుతున్న చేతుల్ని కంట్రోల్ లో వుంచుకుని నెంబర్ డయల్ చేశాడు.     అవతల వ్యక్తి లైన్ లో కొచ్చింది.     స్త్రీ కంఠం వినపడగానే ఆయన కుర్చీలోంచి లేచినంత పనిచేశాడు.     ""నమస్తే మేడమ్! నేను అన్నావారి సత్రం ఎస్.ఐ. ముకుందాన్ని మాట్లాడుతున్నాను.""     ""చెప్పండి""     ""గణపతిరాజు అనే వ్యక్తిని ఇప్పుడే ఓ గలాటా సందర్భంగా అదుపులోకి తీసుకున్నాం. అతను మీ మనిషని చెబుతున్నాడు. అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఫోన్ చేస్తున్నాను"" అన్నాడు.     సరితాదేవి క్షణంలో అన్నీ ఆలోచించింది.     గణపతిరాజు తరుణ్ ని ట్రేస్ చేసిన విషయం గుర్తొచ్చింది. తరుణ్ ని చంపడానికి గణపతిరాజు ప్రయత్నించి వుంటాడు. అది వీలై వుండదు.     ఆ సమయంలో ఏదో జరిగుంటుంది. గణపతిరాజుని పోలీసులు పట్టుకుని వుంటారు. ఇప్పుడు అతన్ని తన మనిషి అని చెప్పడం వల్ల అనవసరంగా ఈ ఊబిలో తను యిరుక్కునే ప్రమాదముంది. ఇప్పటికే పేపర్ల కళ్ళన్నీ తనమీదే వున్నాయి.            ""గణపతిరాజా! నాకు తెలియదే!""     ముకుందం చేయి వణుకు అప్పటికి తగ్గింది.     ""నేనూ అదే అనుకున్నాను మేడమ్! ఇలాంటి గూండాలందరూ యింతే. పట్టుకోగానే ఎవరో ఒకరి పేరు చెబుతారు"" ఫోన్ డిస కనెక్ట్ అయింది.     మళ్ళీ ముకుందం పులి అయిపోయాడు." 67,"     మమ్మల్ని చూడగానే గుడిసెల వాళ్ళంతా మళ్ళీ గుమికూడారు. ఈసారి మా పక్కన పోలీసుల్ని చూసేసరికి వాళ్ళ మొహాల్లో ఆందోళన కనిపించింది. మేము వాళ్ళ ముందు గర్వంగా, ధీమాగా నిలబడ్డాం. కాసేపట్లో వాళ్ళు మా కాళ్ళమీద పడిపోతారని మాకు తెలుసు!     ""వాళ్లు క్షమించమంటూ మనకాళ్ళ మీదపడినా మనం వాళ్ళను చూసి జాలి పడకూడదు"" అన్నాడు రంగారెడ్డి.     ""అవునవును! ఇలాంటి దురాక్రమణ సన్నాసులకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే పోలీసులతో బాగా తోమించాలి"" అన్నాడు గోపాల్రావ్.     ""చూస్తుండండి ఆళ్ళందరి కాళ్ళూ చేతులూ ఇరగ్గొడతారు"" అన్నాడు యాదగిరి.     ""వాళ్ళ సంగతెలా ఉన్నా వాళ్ళ లీడర్ ని మాత్రం వదలకూడదు"" అన్నాడు శాయిరామ్.     ""అవునవును! వాడిని వారం దినాలకు తక్కువ కాకుండా లాకప్ లో ఉంచి దినాము బొక్కలిరగ్గొడితే గానీ సుధరాయించడు""     లావుపాటి పోలీస్ కానిస్టేబుల్ వాళ్ల మధ్యకు వెళ్ళాడు.     ""ఏయ్! ఈ జాగాలు ఎవళ్ళవిరా?"" అడిగాడు లాఠీ భయంకరంగా తిప్పుతూ.     వాళ్ళు కంగారుపడిపోయారు.     ""మావే దొరా!""     ""అంటే మీరు కొన్నారు బే?""     ""అవ్ దొరా?""     ""ఏయి? రిజిష్ట్రేషన్ పేపర్స్ తేండ్రా?""     ""లేవు దొరా! అయన్నీ మా లీడర్ దగ్గరున్నాయ్!""     ""ఎవళ్ళు రా మీ లీడర్! ఆడిని రమ్మను జల్దీ""     నలుగురు లీడర్ కోసం పరుగెత్తారు.     కానిస్టేబుల్ మళ్ళీ మాదగ్గర కొచ్చాడు.     ""చూశారా! మనమంటే ఈ ట్విన్ సిటీ లోనే అందరికీ హడల్. మీకెరుకనో లేదో నలుగురు దాదాలను లాకప్ లో వేసి కాళ్ళూ చేతులూ నా చేతుల్తోటే ఇరిచినా!""     అందరం ఆశ్చర్యపోయాం.     ""నలుగురినా?"" అనుమానంగా అడిగాడు వెంకట్రావ్.     ""అవ్! ఏమనుకున్నావ్ మళ్ళా? నలుగురికీ కాళ్ళూ చేతులూ ఇరిచేసినా! కొడుకులు పరేషానయి పోయిన్రు! ఇప్పుడేం జేస్తున్రో ఎరుకనా వాళ్ళు?""     ""ఏం జేస్తన్రు సార్?""     ""దెబ్బకు దాదాగిరి బంద్ జేసి మంచిగ ఇజ్జత్ తోటి బ్రతుకుతున్రు!""     ""అంటే మంచిగా ఉద్యోగాలు చేసుకుని పెళ్లాం బిడ్డల్ని బాగా చూసుకుంటూ జీవితం గడుపుతున్నారా సార్?""     ""ఉద్యోగం గిట్టా కాదు గానీ నాంపల్లి స్టేషన్ లో రైల్వే సీట్లు బ్లాకులో అమ్ముకుంటున్రు! మంచి మనుషులంటే గట్లుండాలి! దాదాగిరి చేస్తే ఏమొస్తది వయా! ఏదొక కొలువు జేసుకోవాలె! బతకాలె!""     అప్పుడె గుడిసెల నాయకుడు వచ్చాడు.     కానిస్టేబుల్ వాడిని వస్తూనే చొక్కా పట్టుకుని నేలమీద పడేసి తనని బయటకు గెంటుతాడని మాకు తెలుసు.     కాని ఎందుకో కానిస్టేబుల్ అలా చేయలేదు.     ""ఎవళ్ళురా ఈడ గుడిసెలేయించిన్రు?"" అనరిచాడు ఠీవిగా. వాళ్ళ నాయకుడు తాపీగా నడిచి కానిస్టేబుల్ దగ్గరకు చేరుకున్నాడు.     అతనిని సమీపంగా చూస్తూనే ఉలిక్కిపడ్డాడు కానిస్టేబుల్ అతనితో పాటు మిగతా వారందరూ కూడా నిశ్చేష్టులయిపోయారు.     ""నేనే గుడిసె లేయించాన్రా! ఏమ్ సంగతి?"" కానిస్టేబుల్ వంక క్రూరంగా చూస్తూ అన్నాడు ఆ లీడర్.     కానిస్టేబుల్ అమాంతం ఎగిరి సెల్యూట్ కొట్టాడు.     ""హలో! నువ్వా అన్నా! నేనింకా ఎవళ్ళో అనుకుంటున్నానే!""     ""నేనే తంబీ! ఏమిటి సంగతి ఇంతమంది వచ్చిన్రు?""     ""అదే! ఈ గుడిసెలన్నీ వీళ్ళ జాగాల్లో వేసిన్రని కంప్లెయింట్ ఇచ్చిన్రు! దాని దిక్కుకెళ్ళి వచ్చినాం! నువ్వని ఎరుకలేదన్నా""     ""వీళ్ళంతా మావాండ్లేరా! అంతా గరీబోళ్ళున్నారు. ఒక్కసారి ఆళ్ళను సూడు! తిండీ, బత్తా ఏమున్నదివయ్యా వాండ్లకు?""     పోలీసులు వాళ్ళవేపు చూశారు.     అందరూ మంచి బట్టలతో లావుగా దున్నల్లాగున్నారు. ఒకో గుడిసె ముందూ వాళ్ళు ఖాళీ చేసిన బాటిల్స్ నాలుగయిదు కనిపిస్తున్నాయ్. బయటున్న మంచాల మీద ట్రాన్సిస్టర్లో సినిమా పాటలు వినిపిస్తున్నాయ్. కొన్ని గుడిసెల ముందు మోపెడ్లు, సైకిళ్ళు, స్కూటర్లు ఉన్నాయి.     పోలీసు మొఖంలో జాలి కనిపించింది.     ""అవ్ భయ్! ఇస్కీమాకీ- మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలాయెగానీ గరిబోండ్లు గిట్లనే ఉన్నారు"" జలైపడ్డారు వాళ్ళు. మాకు మతిపోయినట్లయింది.     పోలీసులు వాళ్ళందర్నీ చీల్చి చెండాడేస్తారనుకుంటే వాళ్ళు ఆ దాదాకే సలాం కొడుతున్నారు. దాదా మా వంక కోపంగా చూసి పోలీసులతో మాట్లాడ సాగాడు.     ""ఇగో సూడండి భయ్యా! వాళ్ళంతా పాగల్ గాళ్ళున్నారు! గరీబోండ్లతో జిద్ చేస్తారు వయ్యా? ఈళ్ళకేమయినా అకల్ ఉన్నదా? మనమందరం కలిసి వాండ్లకు మదద్ చేయాలె! మనమే గుడిసెలు కట్టించి ఇయ్యాలే! అదిపోయి ఉన్నది పీకేస్తానంటే ఏమ్మాటది?""     పోలీసులు మావేపు అసహ్యంగా చూశారు.     మాకు వళ్ళు మండిపోయింది.          ""ఏయ్! మీకు పైసిలిచ్చింది ఈడకెళ్ళి గుడిసెలు తీయించమని౧ నీతులు చెప్పమని కాదు"" అన్నాడు యాదగిరి మండిపడుతూ.     పావుపాటి కానిస్టేబుల్ మావేపు క్రూరంగా చూశాడు.     ""ఏయ్! జర సంబాల్ కే బాత్ కరో! పైసలిచ్చినం అంటున్నావేం సంగతి? నీయవ్వ మీరిచ్చిన వెయ్యిరూపాయలు మాకు ఒక్క నిముషం ఖర్చు! సమజయింది? లక్షల ఇచ్చినట్లు లొల్లి పెడుతున్రు! నడవండ్రి ఈడకెళ్ళి! గరీబోళ్ల తోటేందివయ్యా కిరికిరి!"" మాకు నవ్వాలో ఏడవాలో తెలీలేదు. నిశ్శబ్దంగా వెనక్కు తిరిగి మా కాలనీ వేపు బయల్దేరాం.          అందరం మా ఏరియా కౌన్సిలర్ ని కలుసుకున్నాం.     ఆయన్తో సంగతంతా జెప్పాం.     ""ఆ గుడిసెలు ఏడున్నాయ్?""     ""మా జగాల్లో సార్?""     ""మీ జగాలేడున్నయ్ వయా?""     చెప్పాం.     ""ఆ పాండూదాదాతోటి కిరికిరి భాయ్. వానికి మస్తు పైసలిస్తేగానీ జగాలు ఖాళీ చేయడు""     ""ఎన్ని పైసలవుతయ్ సార్?""     ""పాండుదాదాకి పదివేలు! నాకు పాతికవేలు!""     అందరం షాకయ్యాం.     ""అదేంటి సార్! అంత డబ్బు ఖర్చయ్యేట్లుంటే ఆ జగాలు వదులుకోవటమే మంచిది కద్సార్""" 68,"     ఇంతకుముందు బొంబాయి నుంచి అష్టకష్టాలుపడి తిరిగొచ్చిన అమ్మాయిలు ఇప్పుడేమయ్యారు?     రైల్వేస్టేషన్ లో, బస్టాండులో ఒళ్ళమ్ముకుని కుళ్ళిపోతున్నారు.     తన బ్రతుకు అలాగే... అలాగే దిగజారుతుందా?     నో...     తన బ్రతుకు అలా దిగజారడానికి వీల్లేదు. ఇక్కడే... ఇక్కడే ఎన్ని కష్టాలొచ్చినా వాటికెదురీది తను బ్రతగ్గలదు.     ఒక అనామకురాలిగా తను గంగిరెడ్డిపల్లి వెళ్ళదు.     మరి...?     ఏం చేస్తుంది తను? ఏం చేయగలదు తను?     ఆలోచిస్తోంది నిశాంత.     క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా గడుస్తున్నాయి.     కాటుక కంటినీరులా చిక్కటి చీకటి...     తెరువు వెతుక్కుంటున్న దీర్ఘరాత్రి...     పల్లెటూళ్ళో సుబ్బారెడ్డి మాస్టారిచ్చిన కండువా తీసుకుని గుండెల మీద కప్పుకుంది. తన గుండెలవైపు చూసుకుంది.     అప్పుడర్ధమైంది ఆ కండువాను ఆయనెందుకిచ్చాడో!     బాధగా కళ్ళు మూసుకుంది నిశాంత. రెండు కన్నీటి చుక్కలు ఆ కండువా మీద పడ్డాయి.     ఆ కండువా తల్లి ప్రేమలా చల్లగా వుంది. తండ్రి గుండెలకు హత్తుకున్నట్లుగా వెచ్చగా వుంది. ఒక్కసారామెకు బాల్యం గుర్తుకు వచ్చింది.     ఎన్నెన్నో దృశ్యాలు...     ఆ ఊరు పేదరికం గుర్తుకు రాగానే నిశాంత మనసు భోగిమంట ప్రక్కన కూర్చున్నట్లుగా అయిపోయింది.     పదినిమిషాల తర్వాత-     ""మా ఊరిని నేను మార్చలేనా? మా ఊళ్ళో పేదరికం లేకుండా చేయలేనా?"" అని అనుకుంది.     ఆ ఆలోచన చాలా చిత్రంగా వుందామెకు.     ఆ ఆలోచనలతోనే బెడ్ మీద వాలిపోయింది.     మగతగా నిద్ర ముంచుకొచ్చిందామెకు.                               *    *    *    *     రూమ్ లో పచార్లు చేస్తున్న సిద్దార్ధకు బోర్ గా వుంది.     టేబుల్ మీదున్న వీడియో కేసెట్ ని తీసి వి.సి.ఆర్.లో ఇన్ సెట్ చేసి ఆన్ చేశాడు.     టీవీ స్క్రీన్ మీద జోక్రిబ్ ప్రత్యక్షమయ్యాడు.     రెండు రోజుల క్రితం జోక్రిబ్ తన అనుభవాలను లెక్చర్ గా చెప్పి ఈ కేసెట్ యిచ్చి వెళ్ళిపోయాడు. ప్రసంగం మొదలయింది.     It is difficult to imagine a world without money...     డబ్బులేని ప్రపంచాన్ని మనం వూహించగలమా...? ప్రస్తుతం మానవ వ్యవస్థకు మూలకేంద్రం మనీ! ప్రతి దేశానికీ తనదైన కరెన్సీ వుంది. మానవజాతి పుట్టిన దగ్గర్నుంచి ఏదో ఒక రూపంలో డబ్బు ప్రధాన పాత్ర వహిస్తూనే వుంది.     డబ్బు... మనీ... కరెన్సీ....     డబ్బు అంటే ఏమిటి? కొంతమందికి నాణాలు, మరికొంతమందికి బ్యాంక్ నోటులు, ప్లాస్టిక్ కార్డులు, బ్యాంక్ లోని కరెన్సీ! కానీ చరిత్రలో డబ్బు ఎప్పుడు పుట్టింది? డబ్బుకు విలువ ఎప్పుడొచ్చింది...? ఒకప్పుడు డబ్బు రూపంలో, రాళ్ళ రూపంలో, రాగిరేకుల రూపంలో, ఆల్చిప్పల రూపంలో ఇంకా ఎన్నో రకాలుగా నమ్మలేని విధంగా చలామణిలో వుండేదని తెలిస్తే ఆశ్చర్యపోతాం.     ఈ శతాబ్దంలో డబ్బు కరెన్సీగానూ, నాణాలుగానూ వుంటే, రేపటి శతాబ్దంలో డబ్బు తన రూపాన్ని కంప్యూటర్ ద్వారా పూర్తిగా మార్చుకోవడం మనం నమ్మగలమా?     అసలు డబ్బు ఎప్పుడు పుట్టింది? అన్నదానికి నిర్దుష్టమయిన ఆధారాలు లేవు 4,500 సంవత్సరాల ప్రాచీన మెసపొటామియా (ఇరాన్)లో దొరికిన శాసనాల ప్రకారం వెండి ద్రవ్యంగా వుండేది! వెండిని తూకం వేసి ఆ తూకపు భారానికి తగ్గట్టుగా వస్తువుల మారకం వుండేది. ప్రపంచ వ్యాప్తంగా రకరకాల లోహాలు ఆ కాలంలో ద్రవ్యంగా చెలామణీలో ఉండేదని చరిత్ర చెప్తోంది.     వెండిని, ఇతర లోహాలను షెకెల్స్ రూపంలో తూచేవారు. అరవై షెకెల్స్ వెండి ఒక మీనా అని భావించేవారు క్రీస్తుపూర్వం 1865-1804లో ఉరుక్ దేశాన్ని పరిపాలించిన మహారాజు షిన్ కాసిద్ కాలంలో పన్నెండు మీనాలకు వస్తువులు, మూడు మీనాలకు నూనె, తదితర పదార్ధాల్ని యిచ్చే వారని చారిత్రక ఆధారం వుంది.     ప్రాచీన ఈజిప్టియన్లు కూడా బంగారం, వెండి, రాగి లోహాలను డబ్బుగా వాడేవారు.     ఆరవ శతాబ్దం నుంచి 1930 వరకూ చైనాలో వివిధ లోహాలతో తయారుచేసిన నాణాలున్నా, ఆ నాణాల విలువను గుర్తించడానికి తూకంలో బంగారాన్ని, వెండిని వుపయోగించేవారు.     బర్మాలో, 18వ శతాబ్దంలో అధికారికంగా వెండి డబ్బుగా మారింది. మన రూపాయి సైజుకన్నా కొంచెం పెద్దవిగా, రకరకాల డిజైన్లతో పువ్వుల ఆకారంలో వెండి బిళ్ళల్ని తయారుచేసేవారు. వీటిని ఫ్లవర్ సిల్వర్ అనేవారు. అలాగే రాజరికానికి చెందిన ద్రవ్య వినిమయానికి వస్తువుల తూకానికి యిత్తడితో తయారుచేసిన జంతువుల బొమ్మలను వుపయోగించేవారు.     ప్రాచీన కాలంలో రాళ్ళు, రప్పలు, ఆల్చిప్పలు మన మనీగా చెలామణీ అయ్యాయంటే మనం నమ్మగలమా?     నమ్మలేం కానీ నమ్మక తప్పదు. పసిఫిక్ సముద్ర ప్రాంతానికి చెందిన యాప్ తెగ ప్రజలు రాళ్ళ ముక్కల్ని డబ్బుగా వుపయోగించేవారు. మెక్సికోలో చిన్న రాగి గొడ్డల్ని మనీగా వుపయోగిస్తే, 19వ శతాబ్దంలో ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోను, ప్రాచీన చైనాలోను యినప పారల్లాంటి వస్తువులు మనీగా చెలామణీ అయ్యాయి.     చైనా అక్షరాలు మనకు చాలా వింతగా కనిపిస్తాయి. ఆ అక్షరాలు పుట్టుకకు మూలం, సముద్రంలో దొరికే గవ్వలని తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అవును చైనా లిపి, గవ్వల ఆకారంలోంచే డెవలప్ చేశారు. దానికి కారణం 3500 క్రితం చైనా ప్రజల డబ్బు గవ్వలు కావడమే, అలాగే పదవ శతాబ్దం దగ్గర్నించి 18వ శతాబ్దం వరకూ ఆఫ్రికా, థాయ్ లాండ్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో గవ్వల్నే డబ్బుగా వాడేవారని తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం.     15వ శతాబ్దం నుంచి 1948 వరకూ దక్షిణాఫ్రికాలో రాగి రింగులు డబ్బుగా చెలామణీ అయితే, పసిఫిక్ సముద్ర ప్రాంతంలోని శాంతాక్రజ్ ప్రజలు పక్షి ఈకల్ని డబ్బుగా వాడేవారు. పక్షి ఈకలు ఎంత పెద్దవైతే అంత విలువ వుండేది. అలాగే నార్త్ అమెరికాలోను, ఇండియాలోనూ కొన్ని ప్రాంతాల్లో పూసల్ని డబ్బుగా వాడేవారు." 69,"     ""సడెన్ గా బుద్ధిమంతుడవైపోతే ఎలారా... ఏదో ఉద్యోగంలో చేరావంట"" సుబ్రహ్మణ్యం ప్రశ్నించాడు.     ""ఏమిట్రా... ఇంత బ్రతుకూ బ్రతికి, కిరాణా కొట్లో చింతపండు ఉల్లిపాయలు అమ్మే సీన్ లో ఊహించుకోలేకపోతున్నాంరా.""     ""అందులో పర్మనెంటుగా సెటిల్ అయిపోయినట్లే గురవా?"" రమణరావు సందేహం వదిలాడు.     ""గొప్ప వాళ్ళందరూ అంతేరా... ఎన్నో యుద్ధాలు చేసిన అశోకుడు సడెన్ గా మారిపోయి శాంతి, శాంతి అనలేదు. బుద్ధి మాటేంటి? అంతే... మనవాడు అదే లెవిల్ అన్నట్లు ఫీల్ అవుతున్నాడు కాబోలు.""     ""ఎప్పుడూ నోరు విప్పితే టాటాలు, బిర్లాలు... జపాన్ లు, కొరియాలు... చివరకు వీడు చేసేది మాత్రం కిరాణాకొట్లో కందిపప్పు లెక్కలు వ్రాసుకోవటం"" హేళనగా అన్నారు మిగతావారు.     ""టాటాలు, బిర్లాలు ఇవాళ ఇలా ఉన్నార్రా... ఒకప్పటి వాళ్ళ స్టార్టింగ్ చిన్నదిగానే ఉంటుంది... రోడ్డుమీది చిత్తు కాగితాలు అమ్ముకునే వాళ్ళు కోటేశ్వరులయ్యారు..."" శక్తి ఆవేశంగా అన్నాడు.     ""అయ్యారు... అవుతారు... అదే న్యాయంగా కాదురా... అన్యాయంగా, అక్రమంగా- రోజూ పేపర్లు చూస్తున్నావు గదా... హర్షద్ మెహతా కోటీశ్వరుడే... కాని ఏంటి లాభం... ఎన్ని బ్యాంకుల్ని మోసం చేసాడు... పాపం పండినప్పుడు కానీ... ఆ విషయం మనకు తెలీలేదు.""     ""యువార్ రాంగ్ రా జగ్గూ... నా దృష్టిలో హర్షద్ మెహతా ఒక జీనియస్... అతను కేవలం బిజినెస్ మాగ్నెట్ లా కేవలం తన పని ఏదో తను చూసుకుంటే కింగ్ లా, కింగ్ మేకర్ లా ఉండేవాడు... పొలిటికల్ విషస్ సర్కిల్స్ వల్ల బలైపోయాడు. వ్యాపారానికి కానీ, వ్యాపారస్థునికి కానీ రాజకీయాలు వుండాలి కానీ, రాజకీయాలే వ్యాపారమైపోకూడదు. రాజకీయ కొండ చిలువలాంటిది. అది దేన్నయినా మింగేస్తుంది. అలా బలైపోయినవాడు హర్షద్ మెహతా... హర్షద్ మెహతాకు కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చిందనుకున్నావు... అతప్పు అతనిది ఒక్కడిదే కాదు కాబట్టి"" చెప్పాడు శక్తి.     ""నువ్వు ఆ లైన్లో వెళ్తావా... కిరాణా కొట్లో పనిచేస్తే నువ్వు ఆ లైన్ లో వెళ్ళలేవు"" జోక్ గా అన్నాడు రమణరావు.     రమణరావు జోక్కి మిత్రబృందం, పడీ పడీ నవ్వారు.     ""అలాగే జపాన్ కూ వెళ్ళలేవు..."" జగపతి నవ్వుతూ అన్నాడు.     ""చూద్దాం..."" సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు శక్తి.     ""ఒరేయ్ శక్తీ... మనం సినిమాకెళుతున్నాంరా... మణిరత్నం రోజా వచ్చిందిరా"" ప్రపోజ్ చేసాడు రమణరావు.     ఇరవై నిమిషాల తర్వాత విజయవాడ వెళ్ళే బస్సులో వున్నారంతా.                                              *    *    *    *     బస్ విజయవాడ బస్ స్టేషన్ కి చేరుకుంది.     అప్పటికి సమయం సరిగ్గా తొమ్మిది గంటలు.     సిటీ బస్సు మీద సినిమాహాలు చేసేసరికి మరో పావుగంట పట్టింది.     సెకండ్ షో వదిలేసరికి పన్నెండు అయ్యింది.     దారిలో టీ త్రాగి, సిగరెట్లు కాల్చుకుంటూ, నడుచుకుంటూ బస్టాండ్ వరకూ వచ్చారు.     అరగంట వెయిట్ చేసాక ఓ లారీ దొరికింది.     మరో గంటన్నర తర్వాత రైతుపేటలో దిగారు.     కబుర్లు, నవ్వులు, జోకులు, చల్లటి చలిలో సిగరెట్లు...     ""సతీష్ చంద్ర థియేటర్ లో ఇంకా లైట్లు వెలుగుతున్నాయిరా- ఇంకా సినిమా షోకాలేదా?"" అడిగాడు సుబ్రహ్మణ్యం.     ""థియేటర్ లైట్లు కావని, పర్సనల్ రూమ్ లో లైట్లు"" చెప్పాడు రమణరావు అనుమానంగా.     జగపతి నీడల్లోంచి పాక్కుంటూ వెళ్ళిన కాసేపటికి గోడకు కొట్టిన బంతిలా పరుగు పరుగున ఒగర్చుకుంటూ వచ్చాడు.     ""ఓరేయ్ శక్తీ... ఘోరం జరిగి పోతోందిరా... అర్జంటుగా రండి"" అల్లంత దూరం నుంచే గొంతు తగ్గించి అరిచాడు.     మరేమాత్రం ఆలస్యం చేయలేదు శక్తి. మిగిలిన వాళ్ళు శక్తిని అనుసరించారు.     థియేటర్ పైన-     మేడమీద, కేబిన్ కు కుడివైపున ఉన్న పర్సనల్ రూమ్ లో-     బాలచంద్ర ఫుల్ బాటిల్ పూర్తిచేసి తూలుతూ వున్నాడు. మత్తులో స్నానం చేసినవాడిలాగా వున్నాడు.     ఎదురుగా....     ఓ అమ్మాయి... ఆ అమ్మాయికి చెరొకవైపు ఇద్దరు గూండాలు.     ""చూడు నాగమణీ- అంతర్జాతీయ సమస్య లెవిల్లో ఫీలైపోతావేంటి? మర్యాదగా ఒప్పుకో... ఈ రోజుల్లో ఇట్సాల్ కామన్ పైకి రావటానికి ఇవన్నీ పట్టించుకోకూడదు..."" అన్నాడు మత్తుగా.     ""నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మాట్లాడాలని పిలిపించి... ఇంత నీచమైన పని చేయాలని ప్రయత్నిస్తావా?"" నాగమణి నాగుపాములా బుసలు కొడుతోంది.     ""నీచం అనుకుంటే నీచం... రొమాన్స్ అనుకుంటే రొమాన్స్- కొంపదీసి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అనే లెవిల్లో ఆలోచించుకున్నావా? పిచ్చిదానా... టైం వేస్ట్ చేయమాకు. నిన్ను ఎక్కడికో తీసుకుపోతాను..."" అంటూ తూలుతున్నాడు బాలచంద్ర. మాటలు తడబడుతున్నా- శరీరం తూలుతున్నా- అతని కళ్ళల్లో కాంక్ష జ్వలిస్తోంది.     ""నా కంఠంలో ప్రాణం వుండగా అది జరగదు-"" నిస్సహాయంగా అరిచింది నాగమణి.     ""రెచ్చిపోకు నాగమణీ... నీ జీవితంలో రేప్ జరగాలని ఆ బ్రహ్మ రాస్తే నువ్వు ఇళా మాట్లాడక ఎలా మాట్లాడుతావు- ఐ యామ్ సారీ... బ్రహ్మరాతను తారుమారు చేయలేను-"" అంటూ బాలచంద్ర పశువులా ఆమెమీద పడ్డాడు.     నాగమణిని గట్టిగా పట్టుకుని ఆమె జాకెట్ చించే ప్రయత్నంలో వున్న బాలచంద్రకు జరగబోయేదేమిటో అర్థం కాలేదు.     ఫట్... ఫట్...     బాలచంద్ర గూండాలిద్దరూ ఆర్తనాదం చేస్తూ బాలచంద్ర మీద పడ్డారు.     బాలచంద్ర కళ్ళముందు మెరుపులు కన్పించాయి. విసురుగా వెళ్ళి గోడకు గుద్దుకున్నాడు.         ముందు లోపలకు వచ్చింది శక్తి.     అతని వెనుకగా అతని మిత్ర బృందం." 70,"     ""మీరు ఫోన్ చేస్తారని..... నేను రాత్రంతా ఇలాగే.... ఈ ఫోన్  ప్రక్కనే కూర్చుని వున్నాను తెలుసా....""     తాను ఆ ప్రయత్నంగా అడిగి ప్రశ్న.....""ఎందుకు?""     ""........మీరెప్పుడయినా ఎవరినయినా ప్రేమించి వుంటే తెలిసేది..... రాత్రంతా నిద్రలేని నా కనురెప్పల మీద ఒట్టు.....""     ఏమిటిది? నేనెందుకిలా అయిపోతున్నాను? నాకేమయింది? అనుకుంది ఆమె. కళ్ళ వెంబడి నీళ్ళు మాత్రం ధారాపాతంగా కారిపోతున్నాయి అది విషాదమో, ఉద్వేగమో తెలియటం లేదు.     ఆమె తేరుకోవటానికి అరగంట పట్టింది. కళ్ళు తుడుచుకుని, మంగళసూత్రం కళ్ళు కుద్దుకుని కిటికీ దగ్గర్నుంచి లేచి ముందుగదిలోకి వచ్చింది.     రాత్రి సగం వ్రాసిన కాగితాలు బల్లమీద అలాగే వున్నాయి. ఆ రచన పూర్తి చేయటం ప్రారంభించింది కనీసం  రెండు మూడు అధ్యాయాలు పూర్తిచేసి పత్రికకి పంపి వారికి  నచ్చితే మిగతాది పూర్తి చేయాలన్న ఆశ.     'మొదటి రచన అవటం వలన వాక్య నిర్మాణం, శైలి సరిగ్గా కుదరటం లేదు. అయినా భావం 'జల' లాగా ఉబుకుతోంది. పది సంవత్సరాల ఒంటరితనం, వ్యధ రూపంలో కాలం నుంచి జాలువారుతోంది.  ఆమె తలెత్తకుండా వ్రాసుకుపోతోంది.     అలా ఎంతసేపు గడిచిందో గుర్తులేదు.     లోపల విష్ణు నిద్ర లేచినట్టున్నాడు. రేడియో పెట్టాడు. వార్తలోస్తున్నాయి.      ఆ అధ్యాయపు చివరివాక్యం వ్రాస్తున్నదల్లా......వార్తల్లో ముఖ్యాంశాలు విని.....షాక్ తగిలినట్టు ఆగిపోయింది.     వార్తలు చదువుతూన్న వ్యక్తి చెప్పుకుపోతున్నాడు.     ఆమె అలాగే  చిత్తరువులా కదలకుండా వుండిపోయింది. మోహంలో రక్తం ఇంకిపోయింది. కలాన్ని పట్టుకున్న చేతివేళ్ళు సన్నగా కంపించసాగాయి.     సరీగ్గా కొన్ని గంటల క్రితం ప్రహసిత్ తనతో చెప్పిన మాట.....అప్పుడే ప్రెస్ కి వెళ్ళిపోయింది.     అనౌన్సర్  చెపుతున్నాడు.     ""డేవిస్ కప్ లో భారతదేశం తరపున ప్రతినిత్యం వహించిన ప్రహసిత్, ఫైనల్స్ లో తాను ఆడే అవకాశం బహుశ లేదని ఈ రోజు ఉదయమే ప్రకటించారు. ఏ నిర్ణయమూ కొద్దిరోజుల్లో తీసుకుంటానని పత్రికా ప్రతినిధులకు చెప్పారు. కారణాలు వెల్లడించటానికి ప్రహసిత్ నిరాకరించారు.....""     ఆమె చేతిలో కలం  జారిపోయింది.     ఫోన్ లో ప్రహసిత్ మాట్లాడిన మాటలు ఇంకా చెవిలో మ్రోగుతూనే వున్నాయి....."".....నా ప్రేమ చిన్న పిల్లల వ్యవహారం కాదనీ, అందులో సీరియస్ నెస్ వుందనీ మీకు తెలియజెప్పటం కోసం.....ఇక  డేవిస్ కప్ ఫైనల్స్ ఆడను......'ఒకసారి దూరం నుంచి చూసి ప్రేమలో పడ్డాడు. ఇతనిదేం ప్రేమ?' అని మీరనుకుంటే- ఇంతకాలం నా ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన టెన్నీస్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను......""     ఆమె స్తబ్దుగా కూర్చుండిపోయింది.     సంవత్సరాల తరబడి యుద్ధంచేసి ఒక సామ్రాజ్యాన్ని గెలవొచ్చు. పోరాటం సాగించి మహారాజ్యాన్ని స్థాపించవచ్చు. పట్టుదల పెట్టుబడిగా పెట్టి పర్వతారోహణ చేయవచ్చు. విస్ఫోటనం కావించి  పర్వతాన్ని నేలమట్టం  చేయవచ్చు. మహాసముద్రాల ఆవలితీరం చేరుకోవచ్చు. ఆనకట్టతో నదీ ప్రవాహాన్నీ నిర్దేశించవచ్చు. మనిషి దేన్నైనా సాధించగలడు. కానీ బలవంతంగా  ఒక పువ్వుని వికసింపజేయలేడు.     అది కేవలం ప్రకృతికే సాధ్యం.                                        రెండో అధ్యాయం     తనని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్టు వున్న ఆ ఉత్తర్వని చూడగానే మధూహకి భూమి గిర్రున  తిరగలేదు. ఆకాశం విరిగి మీద పడలేదు.     మూడు వాక్యాలున్నాయి. ""........మీ పని సంతృప్తికరంగా లేని కారణంగా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించటమైనది. ఒక నెల జీతం అడ్వాన్సుగా ఇచ్చి మీ సర్వీసు మాకిక అవసరం లేదని ఇందుమూలముగా తెలియజేస్తున్నాము""     అదికాదు అసలు కారణం......ఆమెకు తెలుసు. పత్రిక నష్టాల్లో నడుస్తూంది. వీలైనంత మందిని తొలగించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అదీ కారణం.     కళ్ళలో తిరుగుతూన్న నీరు చెంపల మీదకు జారకుండా గట్టిగా రెప్పలు మూసుకుంది. ఒక స్టిల్ ఫోటోగ్రాఫ్ లా తన కుటుంబ చిత్రం కళ్ళముందు కదలాడింది. పత్రికాఫీసులో ఇస్తూన్న ఈ ఎనిమిదొందలే తమ జీవనాధారం.......ఇప్పుడిది పోతే......     ఆ తరువాత ఆమె ఆలోచించలేకపోయింది. అనారోగ్యపు తల్లి, చదువుకుంటున్న చెల్లి గుర్తొచ్చారు. '....ఇప్పుడేం చెయ్యాలి? సంసారాన్నెలా గడపాలి?' అన్న ప్రశ్నలే కళ్ళముందు భయంకరంగా నృత్యం చేస్తున్నాయి.     ఆ ఉత్తరం పట్టుకుని ఎడిటర్ రూమ్ కొచ్చింది. ఎడిటర్ శాస్త్రి వృద్ధుడు ఇంకో ఆర్నెల్లలో రిటైర్ అవబోతున్నాడు. ఆ ఉత్తరం చూసి చాలా  బాధపడ్డాడు. 'ఇదేమితమ్మా. అనుకోకుండా ఇలా జరిగింది' అన్నాడు.     ""సర్క్యూలేషన్ లేడు కాబట్టి నిన్ను తీసేస్తున్నాం, అని వుంటే నేను కాస్త సంతోషించేదాన్ని సార్.  నా పని సంతృప్తికరంగా లేదన్నారు. అదీ బాధ.....""     శాస్త్రి సమాధానం చెప్పటానికి ఏమీ లేనట్టు కొద్దిసేపు మవునంగా ఉండిపోయాడు. ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టటం మధూహకి ఇష్టం లేకపోయింది. నమస్కరిస్తూ ""వెళ్ళొస్తాను సార్. టేబుల్ సర్దుకుని నా వస్తువులు ఏమైనా వుంటే తీసుకువెళ్తాను. అప్పుడే ఆరయింది"" అంది.     ఎడిటర్  ఆమెవైపు చూడకుండానే, ""మంచిదమ్మా"" అన్నాడు. ఆమె వెళ్ళిపోవటం అడుగుల చప్పుడు ద్వారా తెలుస్తోంది. ఆయన మనసు వికలమైంది.     మధూహ చాలా తెలివైన అమ్మాయి. అంతేకాదు. చేస్తున్న పనిపట్ల అంకితభావం వున్న అమ్మాయి. అలాటివాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువమంది వుంటారు. ఆమెని కోల్పోవాటం పత్రికకి ఎలావున్నా తనకి మాత్రం నష్టం!     యాజమాన్యం కూడా ఏమీ  చేయలేదు. ఇప్పుడున్న సర్క్యులేషన్ దృష్ట్యా తన ఉద్యోగమె సందిగ్ధంలో పడేలా వుంది. పత్రిక మూసేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.     స్వింగ్ డోర్ చప్పుడయితే తలెత్తి చూసేడు. మధూహ లోపలికి వచ్చింది. ఆమె చేతిలో కాగితాలున్నాయి.     ""కొన్ని రోజులక్రితం స్కిప్టు పోస్టులో వచ్చింది సార్.  రచయిత్రి ఎవరో లక్ష్మి. ఆట. ఇది మన పత్రికకు సరిపోదని నాలెవల్లోనే తీసి పక్కన  పెట్టేసాను. కానీ రచన చాలా బావుంది. సర్"".     ""నన్కొకసారి చదవనీ....""     ఆమె తటపటాయించి ""చదువుతే మీరు వేయరు"" అంది. అతడు విపరీతమైన ఆశ్చర్యంతో ఆమె వంక చూశాడు. 'అవునండీ. ఇందులో కథ లేదు కామెడి....ట్విస్టులు....సెక్స్..హింస....ఏమీ లేవు. ఒక స్త్రీ మనసుంది. అంతే'     ఎడిటర్ పేపర్ల వ్రాతప్రతి తీసుకుని పక్కన పెట్టుకున్నాడు. ఇలాటి మాటల మీద ఆయన ఆధారపడడని మధూహకి తెలుసు. అయినా అన్నది- 'సర్'      ఆయన తలెత్తాడు.     ""ఇన్నాళ్ళు పనిచేసినా నేను మిమ్మల్ని ఏమీ  అడగలేదు. ఇలా నేను మీకు చెప్పటం కూడా సాహసమే....."" అని అగి, "".....వీలైతే ఆ రచన వేయండి సార్"" అంది.     ""ఇది వ్రాసిన వాళ్ళు నీకు తెలుసా?""     'లేదండీ. పోస్టులో వచ్చింది. వ్రాత ఎక్కడో చూసినట్టు వుంది. కానీ ఎవరో తెలియటం లేదు. అయినా నేను దీన్ని ప్రచురించమంటోంది......రచయిత్రి ఎవరో తెలిసి కాదు.....""     ""ఛా.... ఛా.... నా ఉద్దేశం అది కాదు......"" అని ఆగి, ""......నేను చదువుతాన్లే అమ్మా"" అన్నాడు.     ఆమె నమస్కరించి , వెళ్ళొస్తానని చెప్పి బయటకు నడిచింది.     ఎడిటర్ శాస్త్రి ఆ రోజు పత్రికలో వెళ్ళవలసిన అడ్వర్టయిజ్ మెంట్స్ చూసాడు. రకరకాల ప్రకటనలు....                                      ""మైండ్ హిప్నో మాగ్నో థెరపీ""     మీరు పరీక్షలో మార్కులు సరీగ్గా రావటం లేదా! నిద్రలేమితో బాధపడుతున్నారా? కాంప్లెక్సులు మిమ్మల్ని సతాయిస్తున్నాయా? మీలో అంతర్గతమైన శక్తి బయటపడటం లేదని  భావిస్తున్నారా? నత్తి, నరాల బలహీనత, జ్ఞాపకశక్తిని పెంచి మీలో వ్యక్తిత్వాన్ని నింపుతుంది. కాన్సర్ నుంచి కాలేయవ్యాధుల వరకూ తగ్గిస్తుంది.... మైండ్ హిప్నో మాగ్నో థెరపీ..... స్టేజి ఫియర్ పోగొట్టుకోవాలనుకున్న. నలుగురితో మాట్లాడటానికి భయపడుతున్నా, మీ శ్రీమతి మీకు పూర్తి సుఖం ఇవ్వటానికి, మీ శ్రీవారికి పరస్త్రీ సంబంధాలు తగ్గించటానికి మమ్మల్ని సంప్రదించండి. మా థెరపీ మీ 'ఏకాగ్రత' పెంచటానికి తోడ్పడుతుంది. మీ శత్రువుల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాదు. వ్యాపారంలో నష్టాల్ని తగ్గిస్తుంది. మీరు ప్రేమించిన అమ్మాయితో ధైర్యంగా మాట్లాడే శక్తిని అందజేస్తుంది మీ గతం బాధాకరమైనదయితే దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. మీరు గతంలో ఏదైనా మర్చిపోతే దాన్ని గుర్తు తెచ్చుకునేలా  చేస్తుంది. వెంటనే సంప్రదించండి.                                డాక్టర్ విశాల్స్ హిప్నో థెరపీ     ఎడిటర్ శాస్త్రి గాఢంగా నిశ్వసించి అడ్వర్టయిజ్ మెంట్ కి ఫోన్ చేసి ""ఈ  మైండ్ హిప్నో మాగ్నో థెరపీ క్లినిక్ ఏమిటి?"" అన్నాడు.     ""ఏమైంది?""     ""వీళ్ళు ప్రపంచంలో చేయలేనిదంటూ లేదా?""     ""డబ్బిచ్చారు. మనం వేస్తాం. అంతవరకే.""     ""ఇందులో తప్పులున్నాయి""     ""ఆ క్లినిక్ తాలూకు మనిషి ఇక్కడే వున్నాడు. ఇంకో ప్రకటన తీసుకొచ్చాడు. పంపిస్తానతన్ని. మాట్లాడండి....""     .....రెండు నిమిషాల తరువాత ఒక బక్కపలచటి వ్యక్తి లోపలికి వచ్చాడు. కాస్త మాసిన 'టీ షర్టు' వేసుకున్నాడు. అతడిని చూడగానే అంత మంచి అభిప్రాయం కలుగలేదు శాస్త్రికి.     ""నా పేరు రాజు. ఏవో తప్పులున్నాయన్నార్ట""     శాస్త్రి, కాగితాన్ని ముందుకుతోస్తూ""....నత్తి నరాల బలహీనత, జ్ఞాపకశక్తిని పెంచి.....అని వ్రాసారు. నత్తినీ, నరాల బలహీనతని కూడా పెంచుతుందా మీ క్లినిక్ ?"" అని అడిగాడు.     రాజు నాలిక్కర్చుకుని, ""తప్పయిపోయింది. మీరే కాస్త మార్చండి"" అన్నాడు.  శాస్త్రి దాన్ని మారుస్తూ ""ఎలా  వుందీ బిజినెస్?"" అని అడిగాడు.     ""ఇప్పుడే ప్రారంభం అయింది కదండీ. ఇంకా చెప్పలేం"" అంటూ రెండో ప్రకటన ఇచ్చి ""ఇది కూడా చూడండి"" అన్నాడు వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ.     శాస్త్రి దాన్ని అందుకుంటూ ""నిన్న రాత్రి మా ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు. చీకట్లో అతడిని గుర్తుపట్టులేకపోయాను. నేను అరిచి కేకపెట్టేసరికి పారిపోయాడనుకో. వెళ్తూ వెళ్తూ టేబిల్ మీదున్న వాచీ తీసుకుపోయాడు"" అంటూ ఇంకా చెప్పబోతూ వుండగా.....'మీరు మా క్లినిక్ కి రండి. అతడిని పట్టుకోవచ్చు' అన్నాడు రాజు.     శాస్త్రి అదిరిపడి ""ఎలా?"" అన్నాడు.     ""నిద్రలో కూడా మీ కనుపాపల మీద ఆ దొంగ రూపం ముద్రించబడి వుంటుంది. మీ మైండ్ ని మేము హిప్నటైజ్ చేస్తాం. అది మీలో శక్తిని బయటకు తీసుకువస్తుంది. ఆ దొంగని చూడగానే మీరు గుర్తుపట్టగలరు....దాన్నే ఏజ్....రిగ్రెషన్ అంటారు"".     " 71,"     కొండ అంచుమీంచి గౌతమి ముందుకి లోయలోకి తూలింది.     ఆమె పెదాల్లోంచి కెవ్వునకేక వెలువడబోయేటంతలో,     ఆ లోయ నాలుగు పక్కలా-     ఆ కొండ నాలుగు గోడల్లో-     ఒక భయానక ఆర్తనాదం ప్రతిధ్వనించింది.     గౌతమి గాల్లో తేలుతోంది-గాల్లో బొమ్మలా తేలుతోంది.     అప్పటివరకూ కంటికి కనిపించని లోతుల్ని వెతుక్కుంటూ గాలిలో సుడులు తిరుగుతూ, పెనువేగంతో గిరగిరా తిరుగుతోంది.     కింద పచ్చని పచ్చిక-ముళ్ళ కుంపలు-బండరాళ్ళు-     ఇంకా రెండు క్షణాల్లో అందమైన గౌతమి-పచ్చ గన్నేరులాంటి గౌతమి     శవమై పోతుంది.     పెద్దగా, బిగ్గరగా, గుండెలు అవిసిపోయేలా, శక్తినంతా కూడదీసుకుంటూ అరిచింది.     అరుస్తూ కళ్ళు తెరిచింది.     కనురెప్పలు బరువుగా లేచాయి. మత్తులోంచి తెప్పరిల్లాయి.     తన వేపు చూసుకుంది.     మంచమ్మీద నగ్నంగా-!     పక్కకు తప్పుకున్న దుప్పటి.     కాటేజ్ లో నలువేపులా చూసింది. ఎక్కడా ఏ అలికిడీలేదు.     గబుక్కున లేచి మంచం కిందనున్న చీర, జాకెట్టు తీసుకుంటూ-     ""అవినాష్"" అంటూ పిలిచింది.     జవాబు లేదు.     ఇంతవరకూ కల భయపెట్టిన గౌతమిని ప్రస్తుతం వాస్తవం భయపెడుతోంది.     పన్నెండు గంటలసేపు, తను నగ్నంగా, మత్తులోపడి ఉందని ఆమెకు అర్ధం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.     ""అవినాష్-అవినాష్-"" అంటూ ఆ గదిలోంచి బయటికొచ్చి వరండాలో చూసింది. లోనకెళ్ళి బాత్ రూం, టాయ్ లెట్ వెతికింది.     గౌతమి మదిలో పెనుతుఫాను సృష్టిస్తున్న అలజడి ఆమె శరీరంలో ప్రతి అణువునీ కుదిపేస్తోంది. ఆగి, ఆగి కొట్టుకుంటోన్న గుండెచప్పుడు ఆమె చెవులకు స్పష్టంగా విన్పిస్తోంది.     నుదుటి మీద చెమట బొట్లు బొట్లుగా కారుతోంది.     ఎక్కడికెళ్ళాడు అవినాష్?     గోడకున్న గడియారం వేపు చూసిందామె.     పన్నెండు దాటింది.     వెంటనే ఏదో ఆలోచన ఆమెలో కదిలింది. ఆ ఆలోచన ఆమెలో కలిగిన మరుక్షణం ఆమె గుండె వేగం మరింత రెట్టింపయింది.     పన్నెండు గంటలు-     పన్నెండు గంటలు-     ఈ సమయంలో తను అవినాష్ తో పెళ్ళిపీటల మీద ఉండాలి. అవినాష్ తన మెడలో తాళి కడుతూ ఉండాలి.     మరి అవినాష్ ఏమయ్యాడు?     ఇంత మత్తులో తనెలా పడిపోయింది?     గబాగబా ప్రశ్నల పరంపర. జవాబులు లేని ప్రశ్నల చిచ్చు.     అవినాష్-అవినాష్-అవినాష్-     ఆమె మనసు ఏమీ ఆలోచించలేకపోతోంది.     ఆమె మనసు ఏదో కీడుని శంకిస్తోంది-జరగరానిదేదో జరిగినట్లుగా పిచ్చిగా అటూ ఇటూ తిరిగింది.       అప్పుడు-     సరిగ్గా అప్పుడు-     ఆమె చూపులు-ఎదురుగా ఉన్న టేబిల్ మీద పడ్డాయి.     అక్కడ అవినాష్ సూట్ కేస్ లేదు.     బట్టల స్టాండుకి అవినాష్ బట్టలు లేవు-     స్టూలుమీద ఫ్లాస్కులేదు. ఒక కాఫీ కప్పులేదు-     ఏదో జరిగింది.     ఆ క్షణంలో-     ఆమె చూపులు టేబిల్ మీదున్న అవినాష్ మరిచిపోయి వదిలేసినా 'ఆంటీమనీ' సీసామీద పడ్డాయి.     పరుగులాంటి నడకతో వెళ్ళి ఆ సీసాను చేతుల్లోకి తీసుకుంది.     ఆ సీసా మీదున్న నల్లటి అక్షరాలు 'ఆంటీమనీ' ఆమెను వెక్కిరించాయి.     ఆ సీసాను, ఆ అక్షరాల్ని చూడగానే ఆమె భయపడింది. కెమిస్ట్రీలో పోస్టుగ్రాడ్యుయేట్ అయిన గౌతమికి ఆంటీమనీ గురించి బాగా తెల్సు.     సీసా మూత విప్పి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసింది.     అది 'ఆంటీమనీ' వాసనకాదు. మార్ఫిన్ వాసన.     ఆంటీమనీ సీసాలో మార్ఫిన్.     అంటే-     అవినాష్ తనని చంపడానికి ప్రయత్నించాడు.     అంటే-     అవినాష్ తన అడ్డు తొలగించుకోడానికి ప్రయత్నించాడు.     గౌతమికి ఒక్క క్షణంలో మొత్తం అంతా అర్ధమైంది.     'ఆంటీమనీ' సీసాలోకి వచ్చిన 'మార్ఫిన్' తనను రక్షించిందని-     మరి 'ఆంటీమనీ' ఏమైంది?     ఆ ప్రశ్నకు జవాబు దొరకలేదు.     రెండు రోజుల గతాన్ని ఆమె ఒక్కసారి నెమరువేసుకుంది.     తండ్రిని తీసుకొస్తానని విజయవాడలో దిగిపోయిన అవినాష్ తండ్రి లేకుండా ఒక్కడే వచ్చాడు.     అంటే-     భీమా లాడ్జిలో తనకు రెండుసార్లు వచ్చిన ఫోన్లు అకస్మాత్తుగా 'కట్' అయ్యాయి.     తనని కొండ మీదకు తీసికెళ్ళాడు-తను వెనక కాసేపు నిలబడిన సమయంలో-తనను అక్కడ నుంచి తోసేద్దామనుకున్నాడా అవినాష్-!     ఫ్లాస్కులోని కాఫీ-తనకు మాత్రమే ఇచ్చాడు.     అంటే-     అన్నీ ప్రశ్నలే. జవాబులు లేని ప్రశ్నలు-     అలిసి, సొలసిన మత్తులో తను తాగిన కాఫీ ఏదో వాసన వస్తోంది. అవినాష్-అన్న తనతో ""ఫ్లాస్కు సరిగ్గా కడిగుండడు-"" అని అవినాష్ అన్న మాటలు జ్ఞాపకానికొచ్చాయి. " 72,"""మా పాప!"" అంది అనామిక నునుసిగ్గు దొంతరల మధ్య. అనామిక వైపూ, పాప వైపూ ఇష్టంగా చూస్తున్నాడు టామ్ థంబ్. అందరూ అటు చూశారు. పాప చిన్న పిప్పరమెంట్ సైజులో ఎంతో ముద్దుగా వుంది.                               *    *    *    * ఆ విధంగా- భూగోళం మీద ప్రళయం తర్వాత ప్రశాంతత నెలకొన్న తరువాత మళ్ళీ నాగరికత వృద్ధి పొందాక ఒకరోజున - సినిమా ఫీల్డులో అదొక సెట్టు. అందులో షూటింగ్ జరుగుతోంది. అక్కడొక ప్రొడ్యూసర్ కూర్చుని వున్నాడు. ఆ ప్రొడ్యూసర్ కి రెండు వైపులా రెండు కుర్చీలు. రెండు కుర్చీలలోను ఇద్దరు మనుషులు కూర్చుని వున్నారు. ఒకే శరీరంలో నుంచి విడివడిన రెండు ముక్కల్లా అచ్చు గుద్దినట్లు ఒకే రకంగా వున్నారు వాళ్ళిద్దరూ కూడా. ఎందుకు ఉండరూ? వాళ్ళిద్దరూ కూడా బ్రెయిన్ శరీరం తాలూకు రెండు ముక్కలే. బ్రెయిన్ ని కూకూ లేసర్ గన్ తో చీల్చేశాక ముక్కలయి రోదసీలోకి వెళ్ళిపోయిన బ్రెయిన్ శరీరం ఇద్దరు మనుషులుగా మారింది. వాళ్ళ పేరు ఇప్పుడు బ్రెయిన్ బ్రదర్స్. వాళ్ళు భూలోకంలో సెటిలయ్యారు. సినీ ఫీల్డులోకి వచ్చారు. వాళ్ళిద్దరూ కలసి ముక్తకంఠంతో ప్రొడ్యూసర్ గారి రెండు చెవుల్లోనూ జోరీగల్లా చెబుతున్నారు. ""అదేమిటి? ఆ కొత్త రైటర్ ని బుక్ చేశాను? మేము వుండగా మరొకడు ఈ బానర్ లో అడుగుపెట్టడానికి వీల్లేదు. మా మాట కాదంటే మీ పిక్చర్ రిలీజు కాదు"" అంటున్నారు బెదిరింపుగా. అవును. సైతాన్ చావడు. నిజమే! కానీ- దేవుడు వున్నాడు కూడా. ఒక ప్రళయం ముగిసింది. ప్రక్షాళన జరిగింది. ఆ వెనువెంటనే కొత్త ప్రళయానికి నాందిగా కల్మషం! ఇది సహజం. ఇది సృష్టి. ఇది నిరంతరం!                                                           * సమాప్తం *" 73,"          ""మొగుడు కేంప్ కెళ్ళగానే మరోమగాడ్ని రప్పించుకునే పెళ్ళాం మొగుడు తిరిగిరాగానే మహాసాధ్విలాగ ప్రేమను ప్రకటిస్తున్నట్టుంది.""          ఉలికిపడింది శ్రీమతి. ""ఇవాళేటో అదోలాగా మాట్లాడుతున్నారు.""          ""నిన్ను చాలా నమ్మేను శ్రీమతీ...... అందుకే నువ్వు చేపల్దానివని తెలిసినా నీ ఒళ్ళంతా నీచు కంపు కొడుతున్నా రాజకీయాల్లో అవకాశమిచ్చాను.""         ""ఇప్పుడు నానేటి సేనానని"" భాషలో ఒరిజినాలిటీధ్వనించడమే కాదు.              ముసలాడ్నిమాటల నుంచి చేతుల్లోకి రప్పించాలని తన బరువైన గుండెల్ని అతని పెదవులకి అనించింది.          ""జర్దాపాన్ వాసనొస్తోంది"" అన్నాడు టక్కున.          ""అదేటి"" బ్రహ్మాజీకి జర్దాపాన్ అలవాటున్న విషయం గుర్తుకొచ్చిన శ్రీమతి గభాల్న ప్రక్కకు జరిగి కంటనీరు పెట్టుకుంటున్నట్టు కళ్ళొత్తుకుంది.          ""నిప్పులాంటిదాన్ని నన్నిలగంటేనేనేం గావాల.""          ""చేపలమంత్రివి కావాల ....."" తిరుగులేని హామీలా అన్నాడు అబద్దం కాదు ఖచ్చితంగా నిజంచెబుతున్నట్టుగా చూశాడు.          ""ఇప్పటికే వున్నాడు గదా""          ""పిచ్చిపిల్ల ......""          ఈ సంబోధన చాలా నచ్చింది శ్రీమతికి. ఇంకా తనుపిల్లనే అనుకోవడం ఆనందంగానూ అనిపించింది.          ""చేపలమంత్రి వున్నాడు నిజమే, అయితేనేం చేపల్లో ఎన్ని రకాలులేవు.          కొర్రమీనలు, జింజరాలు, బొమ్మిడాలు, రొయ్యలు ఇలా చాలా రకాలుంటాయిగా. ఆలాంటప్పుడు మీసాల రాజుకి రొయ్యలశాఖ ఇస్తే అద్భుతంగా వుండదూ.""          ""అంటే నేను జింజరాలశాఖ మంత్రి నన్నమాట.""          ""మరేం......""          ""కాని....."" బ్రహ్మాజీ అన్న మాటలు గుర్తుకొచ్చాయేమో నెమ్మదిగా చేతుల్లో చెంపల్నితాకుతూ అంది 'ఇప్పుడంతా గగ్గోలుగా వుంది గదా అదే ఎటు చూసినా అల్లర్లు, గొడవలు, చావడాలూ.""          ""అభయం నీకు అక్కర్లేదు రెండు మూడు రోజుల్లో అంతా సద్దుమణిగిపోతుంది.""          త్యాగి ఉపయోగించనున్న అస్త్రాన్ని ఇప్పుడు సంధించడం మొదలు పెట్టాడు. ""బ్రహ్మాజీ నీకు తెలుసుగా ....""          ""ఎవరూ! ఆ ఎత్తుగా కోరచూపులు చూస్తూ మీమీద పళ్ళునూరుతూంటాడే-ఆడేనా""          ""అవునవును వాడే....... ఈ గొడవలన్నిటికీ మూలకారకుడు. రేపోమాపోనన్ను దించాలనిగవర్నరుకి తన బలాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నవాడు""          ""యెదవసచ్చినోడు""          ""మరేం....... వాడికి తెలీదు""          ""ఎదవసచ్చినోడ్ననా""          ""కాదు....... ఇందాకే దేశ ప్రధానికో హామీ ఇచ్చాడు ""శ్రీమతి మొహంలో రంగులు మారేయి.          ""ఇది చాలా రహస్యంగా జరిగిన చర్చ శ్రీమతీ ఈ గొడవలన్నిటికీ మూలం బ్రిటిష్ వాళ్ళు మనదేశం వచ్చి సీతారామరాజువిషయంలో క్షమార్పణలు చెప్పమనేగా."" అంతాకాకపోయినా అలాంటి దానికోసమే గొడవ జరుగుతున్నట్టు ఆమెకు తెలుసు.          ""ప్రధాని బ్రిటీష్ విదేశాంగ శాఖ అధికారుల్ని ఒప్పించాడు. వాళ్ళు వస్తామన్నారు. ఇక్కడ రక్తపాతానికి చలించని బ్రిటిష్ వాళ్ళు సీతారామ రాజు సమాధిదగ్గర ఒకనాడు బ్రిటిష్ జాతి చేసిన అన్యాయానికి పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తామన్నారు. అంటే ఇక నా ముఖ్యమంత్రి పదవికి ఏ ఢోకా వుండనట్టేగా.""          శ్రీమతి చాలా ఆనందపడిపోయింది. ఇంతకాలమూ బ్రహ్మాజీప్రక్కన చేరినతనింక అతడి నుంచి దూరంగా వుండాలని ఆక్షణమే తీర్మానించేసుకుంది.          ""అలా బ్రహ్మాజీకి బుద్ది చెప్పిన నేను వెంటనే నీకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే"" సాలోచనగా అన్నాడు ""జింజరాలశాఖా మంత్రిగా నువ్వు మరో వారం పదిరోజుల్లో ప్రమాణ స్వీకారం చేయొచ్చు.""          ఉద్వేగంగా చుట్టేసింది శ్రీమతి.          ""నాకుతెలుసు శ్రీమతి నువ్వు నా మనిషివి కాబట్టి అందరిలాగా నువ్వు నాకు అన్నాయం చేయవు.""          ఆ రాత్రి అక్కడ మంత్రి వర్గసహచరులతో ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందీ శ్రీమతి ద్వారా తెలుసుకోవాలనుకున్న బ్రహ్మాజీకి విఘాతం ఏర్పడిందిక్కడే.                                                                    * * * *          ""డేమిట్"" పరమహంస మండిపడుతున్నాడు బ్రహ్మాజీని చూస్తూ.          ఆ రోజు దినపత్రికలో ""ప్రస్తుత ముఖ్యమంత్రి రాజారాం పై అసమ్మతి వర్గపు తిరుగుబాటు వారంలోగా బ్రహ్మాజీ బల నిరూపణ చేసుకోవచ్చని గవర్నర్ ఆదేశం"" అన్న వార్త వుంది. ఒకటిరెండు కాదు మొత్తం అన్ని పత్రికలూ పతాకశీర్షికల్లో ప్రకటించాయి.          కాని సంతకాలు చేసిన మంత్రులంతా బ్రహ్మాజీకి ప్రతికూలంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. అసలు మేముగవర్నరుకి అందజేసిన మెమొరాండంలో సంతకాలుచేయలేదన్నారు బ్రహ్మాజీతో ఫోన్ లో.          చాలా ఆందోళన పడ్డాడు బ్రహ్మాజీ.          నిన్నటిదాకా తన ప్రక్క నిలబడతానన్నవాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా మొండికేసే అవసరం ఏమొచ్చిందో అర్ధం కాలేదు.          రాత్రికి రాత్రే ఏం జరిగింది?          అదీ చెప్పేసే వారే. కాని ముఖ్యమంత్రి తమపై బిల్డప్ చేసిన ఫైలు సంగతి బ్రహ్మాజీకి తెలియడం వారికిష్టం లేదు. పత్రికలవాళ్ళ ముందు బ్రహ్మాజీకక్కేడూ అంటే తామంతా నిజంగా బ్రహ్మాజీకి సపోర్టు చేసిన వాళ్ళమనిషని సి.ఎం.కి తెలిసిపోతుంది. అదికాదు-ముందు ప్రజలూ పత్రికలూ క్షమించరు.          ఎక్కడో ఏదో జరిగింది! అదేమిటి? వారం రోజులు గడువు పెట్టిన గవర్నరు ముందు తనువెర్రివెంగళాయిలానిలబడాలా.          లాభంలేదు.          ఎమ్మెల్యే క్వార్టర్సుకి ఫోన్ చేశాడు బ్రహ్మాజీ.          శ్రీమతిదొరికిందిగాని తను ఏమీ చెప్పలేనంది. అది మాత్రమే కాదుఇక ఈ రోజునుంచి తను అతడి దగ్గరకు రాలేనంది.          ""నువ్వువట్టి ఫూల్ వి మాత్రమే కాదు. పరమ వాజమ్మవి కూడా"" పరమహంస ఈ మధ్య బ్రహ్మాజీని ఈ టైపు తిట్లతో చాలా హింసిస్తున్నాడు.          ""ఇంతకాలమూ సాగించిన మహోద్యమం ఇప్పుడు అర్ధం లేని ధైపోతోందీ అంటే కారణంనువ్వు! అటు విల్సన్ గాడు తప్పించుకుపోయాడు. ఇటుత్యాగి చెలరేగిపోతున్నాడు. నీ మనిషి అని చెప్పిన శ్రీమతి ఇప్పుడు హఠాత్తుగా ప్లేటు మార్చింది. అంటే శ్రీమతి ఇప్పుడు నీకు సహకరించదనేగా. ఒక కారెక్టరు లేని ఆడదాన్ని నీ కనుకూలంగా మార్చుకోలేని వాడివి నువ్వేం మగాడివి. ఛఛ"" విసుగ్గా కొన్ని ఫోటోలు బ్రహ్మాజీముందుకి విసిరాడు పరమహంస.          జవగారి పోయాడు బ్రహ్మాజీ అవి చూడగానే.          తనూ శ్రీమతి నగ్నంగా వున్న ఫోటోలు.          ""ఇవన్నీ......"" తడబడిపోయాడు బ్రహ్మాజీ.          ""నేను తీయించినవే......""          ""ఎందుకు""          ""నీతోకాదు-శ్రీమతితో అవసరంపడుతుందనే ముందుచూపు""          ""అసహ్యంగా వున్నాయి"" తల పట్టుకున్నాడు బ్రహ్మాజీ.          ""నీకంటే శ్రీమతిని మరింత అసహ్యకరమైనపరిస్థితుల్లోకి నెడతాయి, కంగారుపడకుగాలివాటుగా తిరిగే శ్రీమతితో ఎప్పటికైనా మనకి అవసరం వుంటుందని ఇది నేనే ఆర్గనైజ్ చేశాను. చూడు బ్రహ్మాజీ - ముఖ్యమంత్రికి చాలా ఆప్తురాలైన శ్రీమతి నుంచి నువ్వు రాత్రి జరిగిన విషయాలు సేకరించాలి అంటే ఈ ఫోటోలు అవసరం కదూ! మగాడివి నువ్వలా దేభ్యం మొహం వేసుకుచూడకు.""" 74,"      ఓ మహా పరీక్షకు నిలబడి, ప్యాస్ మార్కులు తెచ్చుకున్నట్లు గౌతం నిట్టూర్పు విడిచి అక్కడ్నుంచి బయటకు కదలాడు.                           *    *    *    *        రెండు రోజులు గడిచేసరికి విరాజి కాస్త కోలుకుంది. ముఖంలోకి కొద్దికొద్దిగా కాంతి ప్రవేశించింది.     ఆరిపోతున్న ఆశ మనస్సులో రహస్యంగా చిగురించసాగింది.     మూడోరోజు మధ్యాహ్నం డాక్టరుగారు చూడటానికి వచ్చినప్పుడు వుండబట్టలేక అడిగేసింది.     ""డాక్టరు గారూ ఇప్పుడు నా అరోగ్యమేలా వుంది?""     ""బావుందమ్మా చాలా తొందరగా యింప్రూవ్ అవుతున్నావు.""     ""నా స్టిచేస్  ఎప్పుడు విప్పుతారు""     డాక్టరు లెక్కవేసి ""ఎనిమిదోరోజున అంటే వచ్చే బుధవారమవుతుంది"" అని చెప్పాడు.     ""అంటే, అప్పటికింకా మూడురోజులు టైముంటుంది ?"" అన్నది విరాజి సాలోచనగా.     దగ్గరలోనో నిలబడివున్న గౌతమ్ ఉలిక్కిపడ్డాడు. ""దేనికి ?"" అనడిగాడు డాక్టరుగారు అర్ధంగాక.     ""నా నృత్య ప్రదర్శనకు""     డాక్టరుగారు కూడా అదిరిపడ్డారు ""ఆపరేషన్ చేసిన పదకొండో రోజుకు, కుట్లువిప్పిన మూడోరోజున డ్వాన్స్ చేస్తారా?"" ఇంపాజిబుల్ ""అన్నాడు.     విరాజి నవ్వింది. ""డాక్టరుగారూ!"" ప్రపంచ చరిత్రలో అలా జరిగిన సంఘటనలు ఒకటి రెండయినా వు౦డి వు౦డవా?"" అనడిగింది.     ""ఆ సంగతి నాకు తెలీదు . కాని మీరు మాత్రం చెయ్యటమనేది యింపాజిబుల్.""     ""ఒకవేళ చేస్తే ఏమవుతుంది?""     ""ఏమయినా జరగవచ్చు.""     ""అంటే?""     డాక్టరు కొంచెం ఆలోచించాడు . రిస్కు తీసుకోవడం ఇష్టంలేక ఆమెను ధైర్యపరచడానికలా అన్నాడు. గాని సైంటిఫి క్ గా ఎక్స్ ప్లనేషన్ చెప్పడానికి పూర్తిగా కుదరలేదు.     ""స్కీన్ మీద స్యూచర్స్ వారం రోజులకు తీసివేస్తాము. అది పరవాలేదు. కాని లోపల క్యాట్ గట్ వేసిన భాగాలు  హిల్   అవటానికి మూడు వారాలు పడుతుంది వారం పదిరోజులకే ఒత్తిడికి గురిచేస్తే ఆ భాగాలు రఫ్ చరయిపోవచ్చు.     ""రఫ్ చరయితే ఏం జరుగుతుంది?""     ""షాక్ వచ్చి పేషంట్ కు ప్రమాదమేర్పడవచ్చు. తిరిగి ఎమర్జన్సీ అపరేస్జన్ అవసరం రావచ్చు./. షాక్ నుంచి రికవర్ కాకపోతే ఆపరేషన్ చెయ్యలేని పరిస్థితి ఏర్పడవచ్చు.""     ""ఒకవేళ యివన్నీ జరక్కుండా వుండదనిక్కూడా అవకాశముంది కదా?""     ""అంటే?""     ""ఆపరేషన్ చెయ్యబడ్డ భాగం డ్వాన్స్ కదలికలవల్ల వత్తిడికి లోనయినా ఏ ప్రమాదం జరక్కుండా వుండటానిక్కూడా అవకాశం వుందికదా.""     ""అవకాశం లేకపోలేదు "" అన్నాడు డాక్టర్ విధిలేక.                               *    *    *    *        హాస్పిటల్ నుంచి డిస్చార్జి అయివచ్చాక విరాజి గౌతమ్ చెప్పినా, వారించ ప్రయత్నించినా వినిపించుకోలేదు. నేను పోగ్రాం యిచ్చి తీరతాను. అని పట్టుబట్టి నిముషాలమీద ఆర్టిస్టులందరినీ ప్రోపుచేసి సాధన మొదలు పెట్టింది.     ఆమె చిన్న యిల్లు, ఆ పేదరికపు చిన్నారి యిల్లు ఆ క్షణం నుంచీ నిర్విరామంగా ఉప్పెనలాంటి కలా నిలయమై విజ్రుభణలాంటి కళావిన్యాసాల తరంగా భరితమై ఒప్పారింది.     అటు ఆమె శ్రమను చూస్తూ యిటు యిచ్చిన కమిట్ మెంట్ కు లొంగిపోతూ గౌతమ్ నలిగిపోతున్నాడు?     విరాజికింతవరకూ ఈ రహస్యం తెలియదు. తెలిస్తే ఏ పెను తుఫానులు చెలరేగుతాయో, ఏ అగ్ని పర్వతాలు బ్రద్దలవుతాయో తెలియదు.     తాను నాదమునిగారి స్కిప్ట్ పూర్తీ చేస్తున్నా సంగతి అయిన సీరియల్స్ వేస్తోన్న మిగతా పత్రికలవారికి కూడా తెలిసింది. వాళ్ళంతా రెక్కలు కట్టుకుని వచ్చివాలి, అతన్ని వత్తిడికి గురిచేసి డబ్బు విరజిమ్మి తనంగీకరించేలా చేశారు.     చెయ్యాలా, వొద్దా  అన్న మీ మాంసనుండి చేసెయ్యాలి అన్న నిర్ణయానికి వచ్చేశాడు. గౌతమ్.     తన ప్రపంచంలో తానువుండి గవుతమ్ కోసం వచ్చిపోయే యీ నూతన వ్యక్తులను గురిమ్ని పట్టించుకోలేదు విరాజి.                                                         *    *    *    *        ఆ రోజు వచ్చేసింది. ఇచ్చిన పభ్లిసితీ మూలంగా అయితేనేమి, ఆహ్వానాలు విరివిగా పంచిబెట్టబడడం వల్లగాని జనం బాగా వచ్చారు. రవీంద్ర భారతి నిండిపోయింది.     ప్రదర్శనకుముందు సభనేర్పాటు చేయడంగాని, ముఖ్య అతిథిని పిలవటంలాంటి తతగంగాని ఏమీ చెయ్యలేదు.     లోపలనుంచి మైక్ లో నృత్య , ప్రదర్శన లక్ష్యం , దాని యితివృత్తం __ గవుతమ్ ఐదునిముషాలుపాటు వివరించారు. అతని కంఠస్వరం ఉచ్చారణ పెక్షకులని బాగా అలరించింది.     ఎందుకయినా మంచిదని విరాజికి ఆపరేషన్ చేసిన డాక్టర్ని ఆహ్వానించడమేగాకబలవంతముచేసి తీసుకువచ్చి ముందు వరసలో కూర్చోబెట్టాడు.     ప్రదర్శన మొదలయింది.     చాలామంది విధ్యపకులూ , మేధావులూ కళాకారులు జర్నలిస్టులూ ప్రేక్షకుల్లో వున్నారు. ప్రదర్శన ఎత్తుగడ, ఆరంభంనుంచీ తీసుకున్న శ్రద్ధ కదలికల్లో హావ భావాల్లో కొత్తదనం యితివృత్త లోని బిగువు అందరినీ ఆకర్షించింది.     ఒక రొటీన్ నుంచి, ఏదో పాత ""రుబ్బుడు"" నే కొత్తరంగులో చూసి విసుగెత్తి పోయిన అరుగులనుంచి గొప్ప రిలీఫ్ .     మనుషులని ఆహ్లాదపరచే ఓ విభ్రాంతి.     గవుతమ్ లోపల ఓ పక్కగా నిలబడి నిశ్చేష్టుడై చూస్తున్నాడు ఈ విరాజి తన విరాజియేనా! మేకఫ్ లో , పాత్రలో ఎంత మహొన్నత౦గా కళాత్మకంగా ఎదిగింది! ఆమె రూపం , అభినయం , ముఖంలో క్షణ క్షణం మారే మహాభావాలు ఎంత అపూర్వంగా వున్నాయి.     అలా ద్రిగ్భాంతికి లోనవుతున్న ఆమె శరీర స్థితిని మరచిపోలేదు. ఆమె యాక్టివ్ గా కడులూతున్నప్పుడు, ఏదయినా మార్పు సంభవిస్తూ దేమోనని చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు.     రానూ రానూ ప్రేక్షకులు బుగువైన మూడ లోకి వెళ్ళిపోయి అద్భుతానుభూతిని లోనవుతున్నారు.     ఆడిటోరియంలో ఏదో అమృత రసాన్ని గ్రోలుతూన్న నిషా.     ప్రదర్శన చివరకు వస్తోంది. క్లయిమాక్స్ సమీపిస్తోంది.     ఈ క్లయిమాక్స్ గురించే గవుతమ్ భయపడుతున్నాడు. ఈ ఘట్టంలో సమాజపు వికృత చేష్టలకు ఆవేశానికి గురైన విరాజి పాత్ర ఆ మానిసికంగా ఉద్రేకాన్ని ప్రదర్శిస్తూ రకరకాల విన్యాసాలు ఆరుస్తూ యించు మించు పదినిముషాల పాటు నాట్యం చేయాల్సి వుంది.     ఆ ఘట్టానికి ముందు కొంతసేపు ఆమె స్టేజిమీద వుండవలసినంత అవసరం లేదు. మిగతా ఆర్టిస్టులతో కథనడుస్తూ వుంటుంది.     గ్రీన్ రూంలో ఓ ప్రక్కన నిలబడి రాబోయే దృశ్యాన్ని మానం చేసుకుంటూ విరాజి నిలబడి వుంది.     గ్రీన్ రూంలోనే వున్న ఫోన్ రింగయింది.     మే పట్టించుకోలేదు. అసలీ ప్రపంచములో లేదు.     కాని మిగతా అర్టిస్థలంతా స్టేజిమీద జరుగుతోన్న సన్నీవేశంలో అభినయిస్తూ దిమగ్నులై వుండటము చేత ఫోన్ ఎవరూ రిసీవ్ చేసుకోలేదు.      ఫోన్ రింగవుతూనే వుంది.                 చివరకు విరాజికి వినిపించి అటూ ఇటూ చూసింది. ఎవరూ కనబడలేదు. డిస్టర్బ్ అవుతానని తెలుస్తావున్న విధిలేక రిసీవ్ చేసుకుంది.     ""హలో! గవుతమ్ గారున్నారా?""  అంది అవతలనుంచి ఓ గొంతు.     గవుతమ్ ఆమెకు అభిముఖంగా వున్నవైపు నిలబడివున్నాడు. కనుకోసలనుంచి ఆ విషయాన్ని నిమనించింది విరాజి.     ""స్టేజికి అటువైపు వున్నారు. ఏం కావాలో చెప్పండి"" అంది విరాజి.     ""నేను .... పత్రిక సంపాదుకుడ్ని. ఈ సాయంత్రంలోగా సీరియల్ కి మేటర్ పంపిస్తానన్నారు. రాలేదు""     ""మేతరేమిటి ? కొత్తగా ఏమీ రాయటం లేదుగా?""     ""నాదమునిగారు షాక్ లో వుండి రాయలేకపొతే గవుతమ్ గారు పూర్తీ చేస్తున్నారు. ""     విరాజి కాళ్ళ క్రింద భూమి కదిలినట్లయింది.   " 75,"          ఆ మాటల్లో కొంత కసికూడా లేకపోలేదు.          ఆమెని బయటపెట్టి లోపల మేం సుఖపడడం నాకు ఎబ్బెట్టుగా వుంది. కానీ నేనేం చేయగలను? ఆమె పెళ్ళికి డబ్బు ఎలా తేవడం? ఎంత ఆలోచించినా నాకేమీ తోచేదికాదు.          ఓ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక నేనూ, మధుమతి విస్తర్లు కుట్టడానికి కూర్చున్నాం.          మా సంభాషణ పెళ్ళిమీదికి మళ్ళింది.          ""ఇన్నేళ్ళయింది కదా. పెళ్ళి సంబంధాలే చూడలేదా నీకు?"" అని అడిగాను.          ""రెండు సంవత్సరాల ముందు, అంటే పెళ్ళికి సంవత్సరం ముందున్న మాట. హరికి నన్నిచ్చి చేయాలనుకున్నారు. హరి అంటే తెలుసా? మన ఇంటికి నాలుగు ఇళ్ళకవతల. అతనికి అమ్మ వుంది. నాన్న లేడు. ఉన్నది అన్న ఒక్కడే దినకర్ అతని భార్య సువర్చల""          ""సువర్చలంటే ఆ సన్నటి అమ్మాయి కదా బావి దగ్గర చూస్తుంటాం- ఆమే కదా""          ""ఆఁ అంతా అయ్యాక కట్నం దగ్గర, బంగారం దగ్గర గొడవొచ్చింది. పాతికవేలూ, పదిహేను సవర్ల బంగారం కావాలన్నాడు దినకర్. అది నావల్ల కాదు. పెళ్ళి జరిపిస్తానన్నాడు అన్న దాంతో సంబంధం బెడిసి కొట్టింది. ఆ తరువాత ఇంట్లో నా పెళ్ళి చేయాలన్న ఆలోచన ఎవరికీ వున్నట్లు అనిపించడం లేదు""          ఆమె మాటల్లో బాధ సుళ్ళు తిరుగుతోంది.          ""పోనీలే- పెళ్ళి లేకుండా ఇలానే వుండిపోతాను. లేదంటే ఏర్పేడు ఆశ్రమంలో చేరిపోతాను""          ""ఛీఛీ! అలనాటి మాటలెందుకులే"" అని ఆమెకు కాసేపు ధైర్యం చెప్పాను.          ఈ మాటలు విన్నాక హరిని చూశాను. వీధిలో పోతుంటే గమనించాను. పిల్లాడు బాగానే వున్నాడు. వెంకటగిరిలోని ఓ ఐస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అతని అన్నయ్య దినకర్ ఎప్పుడూ తారసపడలేదు. ఉదయం పొలం వెళితే ఇక సాయంకాలమే ఇంటికి రావడం. దాంతో అతన్ని చూడలేకపోయాను.          మరోపదిరోజుల కనుకుంటాను. హరి, దినకర్ తల్లి చనిపోయింది. అప్పుడు నేను ఊర్లోలేను. వ్యవసాయం చేయడానికి మూడువేల రూపాయలు కావాల్సొచ్చాయి. వాటికోసం మా పుట్టింటికి వెళ్ళాను. అక్కడ పరిస్థిథీ బాగా లేదు. నానా తంటాలుపడి నాన్న ఆ డబ్బు ఇచ్చాడు. నేను వచ్చేటప్పటికి చాలా రోజులైంది.          ""హరి అమ్మ చనిపోయింది. నిన్ననే కర్మకాండ అయింది"" అని చెప్పింది మధుమతి.          ఆ సాయంకాలం ఒంటరిగా వున్నాను. మధుమతి దేవాలయం దగ్గరికి వెళ్ళింది. వంటంతా ముగించి వీధి వరండా మెట్లమీద కూర్చున్నాను.          లోకం మీద రాత్రి వలను విరిసినట్లు చీకట్లు దిగుతున్నాయి. కడుపులోని ఆకలి ఎలుకను తరిమెయ్యడానికి ముంత పొగను పెట్టినట్లు అక్కడక్కడా ఇళ్ళ నుంచి పొగపైకి లేస్తోంది. ఊరకుక్కలు ఇంకా భోజనం టైమ్ కానట్లు అటూ ఇటూ తిరుగుతున్నాయి.          చీర కాస్తంత వదులైనట్లు అనిపించడంతో సరిగా కట్టుకుందామని ఇంట్లోకి వెళ్ళాను. హాల్లో తలుపు కవతలున్న రూమ్ లోకి దూరి చీర విప్పాను.          తిరిగి కట్టుకోవడానికి కొంగును లంగాలోపలికి దోపి కుచ్చిళ్ళు పోసుకుంటున్నాను.          ఏదో అలికిడైతే చివుక్కున తల పైకెత్తాను.          హాల్లో దినకర్.          సిగ్గుతో ఒళ్ళంతా కుంచించుకు పోయింది. అ కంగారులో చీరనంతా ఎదపైకి వేసుకున్నాను. సిల్కుచీర నిలబడలేదు. మళ్ళీ కిందకు జారింది.          దినకర్ అలానే గుడ్లప్పగించి చూస్తున్నాడు.          యుద్ధం ప్రారంభానికి ముందు మ్రోగించే నగరాల్లా వుండే నా పాలిండ్లు అతని కనురెప్పల మధ్య అద్దం పడుతున్నట్లు కళ్ళు ఆర్పడం మానేశాడు.          ఠక్కున గదిమూలకు పరుగెత్తి చీర కట్టుకున్నాను. అతనికి ఎదురు పడాలంటే ఏదోగా వుంది. కానీ నేను తప్ప ఎవరూ ఇంట్లో లేకపోవడం వల్ల తప్పింది కాదు.          ఇబ్బందిగా నవ్వుతూ హాల్లోకి వచ్చాను.          ""మా అమ్మ చనిపోయింది నిన్ననే కర్మకాండ తీరింది. అందుకే వచ్చాను"" అన్నాడు.          చాలా అందంగా వున్నాడతను. వయసు ముఫ్ఫై పైమాటే. మీసాలు లేకపోవడం వల్ల ఏ గంధర్వుడో భూమిమీదికి దిగినట్లున్నాడు. 'చక్కెర' అన్నాడు.          అప్పుడు గుర్తొచ్చింది నాకు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, చనిపోయిన రోజునుంచి కొరివి పెట్టిన పెద్ద కొడుకు ఊర్లో ఎవరింటికి రాకూడదు. కర్మకాండ తీరిన మరుసటిరోజు అందరి ఇళ్ళకూ వచ్చి, ఏదో తీపి తినిపోతాడు. అదీ ఆచారం. అందుకే అతనొచ్చాడు. లోపలికెళ్ళి చక్కెర డబ్బాతో వచ్చాను.          అతను చేయి చాచాడు. రెండు స్పూన్లు పోశాడు.          ""మిమ్మల్ని ఇదే మొదటిసారి చూడడం"" అంటూ నోట్లో చక్కెర పోసుకున్నాడు.          అంతకుముందు అలా జరక్కుండా వుంటే బాగానే మాట్లాడేదాన్ని ఇప్పుడు ఏదో అడ్డం పడుతోంది. అందుకే చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయాను.          చక్కెర డబ్బా పెట్టి తిరిగి వచ్చేటప్పటికి అతను వెళ్ళిపోయాడు. రెండో రోజు యధాప్రకారం నేనూ, మధుమతీ కలిసి బావికి నీళ్ళకెళ్ళాం.          ఆ బావి దినకర్ ఇంటికి ఎదురుగ్గా వుంది.          ఎప్పుడూ లేంది ఆ సాయంకాలం దినకర్ వరండాలో తచ్చాడుతూ కనిపించాడు.          నాకోసమే పొలం నుంచి త్వరగా వచ్చేడేమోనన్న సందేహం మొదలైంది. ఇలాంటి సందేహాలు రావడం వీటిల్లో మొదటి మెట్టు అనుకుంటాను.          రెండోరోజు ఉదయం నీళ్ళకు వెళ్ళినప్పుడు కూడా వున్నాడు. నా సందేహం నిజమేననిపించింది.          ఇక అప్పటినుంచి బావి దగ్గరికి వెళ్ళడం దినకర్ వున్నాడో లేడోనని నా కళ్ళు అతని వరండాలో పెంపుడు పావురాయిల్లా వాలేవి. బెదురు బెదురుగా చూసేవి. పావురాళ్ళు కూడా అంతే. ఎవరైనా వస్తారేమోనని అదేపనిగా కంగారు పడుతుంటాయి.          నేను చూడగానే దినకర్ ఏదో ఒకటి చేయడం ప్రారంభించాడు. చేయెత్తడమో, టాటా కొట్టినట్లు చేయి అలా వూపుతూ తలమీద పెట్టుకోవడమో, నమస్కారం పెట్టినట్లు రెండు చేతులూ జోడించడమో చేస్తున్నాడు. నావైపు నుంచి సిగ్నల్స్ పోవడంలేదు.          అంతవరకు పెద్దమనిషిగా వున్నవాడు చిన్నపిల్లాడైపోయాడు. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి వేషాలు వేయలేదని తెలిసింది ఎవరైనా ఎదురుపడ్డా తలవంచుకుని వెళ్ళిపోయేరకం. మరి ఆరోజు నన్నలా చూడడంతో మనసు చలించిందా?          అంతలో ఊర్లో కొంతమంది మైరావణ నాటకాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టారు." 76,"     ""మంచిది, నాయనా! ఆరోగ్యం జాగ్రత్తగా  చూసుకొంటూ  బుద్ధిగా చదువుకో."" అంతకన్న అధికంగా  తను చెప్పవలసిన  అవసరం దాటిపోయిందనుకొంది  మీనాక్షి.     అన్నకు నమస్కరించి  పూర్ణని ఎత్తుకొని ముద్దులాడి  బండిలో కూర్చున్నాడు వరదరాజు.     ""చిన్నాన్నా, నేనూ పట్నం వస్తాను. నేనూ  నీతో వస్తాను.""     వరదరాజు  ఎప్పుడు వచ్చి వెళ్ళినా  పూర్ణ  తననికూడా  పట్నం  తీసుకువెళ్ళమని ఏడుస్తూనే వుంటుంది.     ""ఈసారి వచ్చినప్పుడు  తప్పక  తీసుకు  వెళతానమ్మా!"" పూర్ణమో ఒకసారి చేతుల్లోకి  తీసుకొని  ఓదార్చి  వదినకి అందించేడు  వరదరాజు.     బండి పట్నం దిక్కుగా  పోతూ వుంటే వరదరాజుకి  వెనుతిరిగి  గ్రామం వైపు చూడాలన్న  బుద్ధి కలగలేదు. 'ఏటికి ఆవలిగట్టున, బజారు వీథికి అటుగా, చక్కని  పూలమొక్కల మధ్య లేత నీలం రంగులో ధాటీగా  నిలిచివున్న మేడ, అందులో  తనకోసం  నిర్దేశింపబడిన  గది ....ఆ గదిలో  తనూ....' అలా సాగిపోయేయి రాజు ఆలోచనలు.     వాళ్ళు ఎంతగా  ఆహ్వానించినా  సామానులు  పట్టుకొని  తిన్నగా  వెళ్ళబుద్ధికాలేదు  రాజుకి. ఒక చిన్న హోటలు గదిలో తన వస్తువులు పెట్టుకొని భోజనం వగైరాలు  కానిచ్చి సాయంకాలం  నాలుగు గంటల  సమయంలో  రాఘవయ్యగారి ఇంటికి  వెళ్లేడు.     ""నీ మాటే  అనుకొంటున్నాము....రా"" అంటూ  ఆహ్వానించేడు  రాఘవయ్య.     ""సామానులు  ఏవీ?"" చేతులు ఊపుకొంటూ  వచ్చిన  రాజుని  ప్రశ్నించింది  రాజమ్మ.     ""వెనక నుంచి  ఎడ్లబళ్ళ  మీద వస్తున్నాయి  లాగుంది"" అంది అనూరాధ.     ""లేదండీ. నేను ఈ ఉదయమే  వచ్చేను. సామాన్లు  గదిలో వున్నాయి.""     అది హోటలు గదో, హాస్టలు గదో  తెలియనీకుండా  తమాషాగా తప్పుకొన్నాడు  రాజు.     వరదరాజు  హాస్టల్లో  చేరేడనుకొన్నాడు  రాఘవయ్య. 'డబ్బుకి, భోగలాలసతకు  దాసులు  కానివారు  ఈ కాలంలో కూడా  కొంద రున్నారు' అనుకొన్నాడు  ఆశ్చర్యంగా.     ""ఏం, మీ అన్నయ్యా, వదినా  మా ఇంట  వుండ వీలులేదన్నారా?"" రాజమ్మ ప్రశ్నించింది.     ""వాళ్లలా  అనలేదండీ. నీ ఇష్టం  అన్నారు.""     ""మరి, నీకు ఇష్టం  లేదా?""     ""ముందుగా  మీతో ఒకసారి  చెప్పి సామానులు  తెచ్చుకుందామని  హోటలు గదిలో  పెట్టి వచ్చేను"" అన్నాడు రాజు.     ""నువ్వేదో అమాయికుడివి  అనుకొంటున్నాను. గడుసువాడివే!"" పకపక నవ్వేడు రాఘవయ్య.     ""ఆనాటి ఆహ్వానం  ఇంకా నిలిచివుందో, లేదో  తేల్చుకోందే  ఎలా వస్తాడు! ....నడుచుకోవలసిన  విధంగానే  నడుచుకొన్నావు."" రాజమ్మ  ఆమోదముద్ర  వేసింది.     అయ్యగారి ఆజ్ఞ  అందుకొంటూనే కారు  డ్రయివరు  వెంకటనాయుడు కారు తెచ్చి  పోర్టికోలో  పెట్టేడు.     ""సరే....నువ్వు వెళ్ళి  నీ సామానులు  తెచ్చుకురా. మేడమీద  గది నీకోసం  సిద్ధంగా  ఉంది."" చేతిలోకి పైపు  తీసుకొంటూ  అన్నాడు రాఘవయ్య.     వరదరాజుకి  ఆ కారులోని  మెత్తని  కుషన్లమీద  ఎలా కూర్చోవాలో తెలియదు. కారు మలుపు తిరుగుతున్నా, బ్రేకుపడినా  ముందుకీ వెనక్కీ తూలిపోతూ, తన కంగారు డ్రయివరు ఎదటఉన్న  అద్దంలో  చూస్తున్నాడేమో అని గాభరాపడుతూ  మెల్లిగా  హోటలు గది చేరేడు.     చవకరకం హోటలులో  ఒక చిన్న  గదిలో  సామాన్లు పెట్టుకొని  వెళ్ళిన కుర్రాడు సరికొత్త  కారులోంచి  దిగడం  చూసి హోటలు ప్రొప్రయిటరు ఆశ్చర్యపోయేడు. 'ఈ కుర్రాడు ఏ నక్కతోక  తొక్కి వచ్చేడు? ఇంతలో  ఇంత గొప్ప  బంధువుల్ని  ఎలా కలుసుకొన్నాడు?' అనుకొన్నాడు.     హోటలు  గదికి  అద్దె చెల్లించి  తన పెట్టె, పక్కచుట్ట కారులో  పెట్టుకొని  గంటలోపునే  తనకోసం  కేటాయించిన  గదిలో  ప్రవేశించేడు  వరదరాజు.     పల్చని  కిటికీతెరలలో  నించి  సన్నని  సంధ్యకాంతి కొబ్బరి ఆకుల సందుల్లోంచి  గదిలోని  పాలపిట్టరంగు గోడలపై  పడి  ఇటు అటు చెదురుతున్నది. తెరిచిఉన్న  కిటికీలోంచి  తేలిపోతూ  వస్తున్న  గాలి  విరబూచిన  గులాబుల  పరిమళాన్ని  గదినిండా  నింపుతున్నది.     గదిమధ్యలో  మెత్తని పక్క, మంచం, ఒకవైపుగా  బట్టల బీరువా, ఇంకొకవైపు  రైటింగు  టేబులు, కుర్చీ, దానికి అందుబాటులోనే  పుస్తకాల  షెల్ఫు!     తన పాత జంబుఖానా  చుట్ట, వార్నీసు ఊడిపోయిన  సొట్టల ట్రంకు పెట్టె  ఎక్కడ పెట్టనా అని క్షణకాలం  తత్తరపాటుతో  ఇటు అటు చూసేడు వరదరాజు.     రాఘవయ్యగారి ఇంట్లో  వుండాలనుకొని వస్తున్నప్పుడు  పెట్టె, పక్క చుట్ట కొత్తవి కొనుక్కోవలసింది. వీటిని  కారులో  పెడుతూంటే  ఆ డ్రయివరు చూసి నవ్వుకొని  వుంటాడు. ఇంకా ఈ గదిలో  ఎవరు కాలు పెడతారో, వారంతా  వీటి రూపురేఖల్ని  చూసి  నవ్వుకోక  మానరు. వీటిని  తీసుకురాకపోయినా  బాగుండిపోను, పోనీ, ఏ నవుకరుకయినా  ఇచ్చివేద్దామనుకొంటే  ఆ పెట్టె  వదినకి ఆమె పుట్టినింటివారు  సారెగా  పెట్టిందిట. ఆ జంబుఖానా  అమ్మకి గుర్తుగా  ఇంట్లో  వుంటున్నది. వాటి రెండింటినీ  ఎవరికో  దానంచేసి, తిరిగి  తను  వదిన  ముఖం చూడలేడు.  " 77,"          మరో ఇరవై నిమిషాల తర్వాత రెడ్ కలర్ మారుతీ హోటల్ అశోకా కాంపౌండులో ప్రవేశించింది.          కారు దిగి అటూఇటూ చూసి, ఆ షాపువేపు నడిచాడు బబ్లూ.          షాపులో సేల్స్ మేన్ ఉన్నాడు.          ""జపాన్ లైటర్ విత్ నైఫ్.....ఉందా?""          ""నో స్టాక్ సార్.....రెండురోజుల క్రితం మీరే అది కొన్నారు కదా సర్...."" గతుక్కుమన్నాడు బబ్లూ సేల్స్ మేన్ మాటలకు-జ్ఞాపకశక్తికి.          ""సడన్ గా రిపేర్ వచ్చింది. రిపేర్ కోసం ఓ ఫ్రెండ్ కిచ్చి మీ దగ్గరకు పంపాను.....""          ""ఇక్కడ రిపేర్ సర్వీస్ లేదు..... జపాన్ లైటర్సు రిపేరు చేసినా పనిచెయ్యవు సార్..... అందుకే నైఫ్ ని యాడ్ చేసింది - నైఫ్ అయినా ఉపయోగపడుతుంది కదా....?"" చాలా క్యాజువల్ గా అన్నాడు ఆ సేల్స్ మేన్.          ""అలాంటివి ఇంకెక్కడైనా దొరుకుతాయా...."" దొరకాలని కోరుకుంటూ అడిగాడు బబ్లూ.          ""నో.....సర్.....""ఓల్డ్ మోడల్ అది...."" ఆ జవాబు విని, ఇంకేదో చెప్పబోయి ఆగిపోయాడు.          అప్పుడే అతని దృష్టి మిర్రర్ మీద పడింది....          ఆ మిర్రర్ లో అశోకా మెయిన్ గేట్ పక్కన, రోడ్ మీద హేండ్ స్టిక్ పట్టుకుని నడిచెల్తున్న వ్యక్తి మిర్రర్ లో అస్పష్టంగా చూసి తల తిప్పాడు బబ్లూ.          అప్పటికే ఆ వ్యక్తి గేటుదాటి ముందు కెళ్ళిపోయాడు.          బబ్లూ-          గబగబా వెనక్కి పరుగెత్తుకొని రోడ్డుమీదకొచ్చాడు.....          అప్పుడే సెంట్రల్ కోర్ట్ హోటల్లోకి అడుగుపెట్టాడతను- హోటల్ గేటువరకూ గబగబా నడిచాడు బబ్లూ.          నెమ్మదిగా మెట్లెక్కి లోనికి అడుగుపెట్టాడు ఆ వ్యక్తి.          ఆ వ్యక్తి నిరంజనరావు.....          ""మిస్టర్ నిరంజనరావు దొరికిపోయావ్....."" కసిగా అనుకున్నాడు బబ్లూ.          చేతి వాచీ వేపు చూసుకున్నాడు.          సరిగ్గా సాయంత్రం ఆరుగంటలైంది.          సరిగ్గా ఏడు గంటలకు హోటల్ సెంట్రల్ కోర్ట్ లో థర్డ్ ఫ్లోర్లో.....మొదటి రూమ్ లో మారుపేరుతో ఉన్నాడు బబ్లూ.          అదే వరసలో ఆఖరి రూమ్ లో ఉన్నాడు నిరంజనరావు.                                                             *    *    *    *    *          ప్రెస్ విజిటర్స్ రూమ్....          ""గోవా ఎందుకెళ్ళావ్....?"" అడిగింది ఊహ.          ఆమె అడుగుతున్న మాటల్ని వినడంలేదు సూర్యవంశీ-ఆమె అందంవేపు ఆరాధనగా చూస్తున్నాడు.          ""ఒక రెస్పాన్స్ బులిటీని టేకప్ చేశాను- నీకు రెండు, మూడు సార్లు బెంగుళూరుకు ఫోన్ చేసాను...."" అన్నాడతను ఒకింత సేపటికి.          ""నేన్నమ్మను...."" వెంటనే అలకగా అంది ఊహ.          ""ఇది చదువు....""          ఊహకు బబ్లూ చేసిన హెచ్చరిక అది. ఒక్కొక్కలైనూ చదువుతున్నకొద్దీ సూర్యవంశీ కళ్ళు ఎరుపెక్కుతున్నాయి.          ""ఎనిమీ...."" పళ్ళు పట పట కొరికాడు సూర్యవంశీ.          ""ఉస్మానియా హాస్పిటల్లో బాంబ్ బ్లాస్ట్.... విన్నావా..... రబ్ జానీ దారుణంగా చనిపోయాడు...."" జాలిగా అంది ఊహ.          ""లేదు....చంపబడ్డాడు.....అంబులెన్స్ కూడా మాడి మసైపోయింది......మర్డరర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు...."" కాసేపు కళ్ళు మూసుకుని, ""నిరంజనరావు వైజాగ్ లో లేరు..... ఇక్కడికే వచ్చారని నా అనుమానం,...."" ఆ మాటకు ఆశ్చర్యపడింది ఊహ...          ""నాకు ఆయన గోవాకి ఫోన్ చేసి, షీలా గురించి అడిగాడు..... మర్నాడే షీలా చచ్చిపోయింది.... ఆ తర్వాత ఓల్డ్ సిటీలోని ఓ ముస్లిం హత్యకు గురయ్యాడు.....సిటీలో ఈ మర్డర్స్, యాదృచ్చికంగా జరిగినవా లేదా మోటివ్ ఏదైనా ఉందో తేల్చుకోవాలి....ఇందుకు ముందుగా నిరంజనరావు ఎక్కడున్నాడో కనుక్కోవాలి....""          అతను చెప్తున్న మాటల్ని విస్మయంగా వింటోంది ఊహ.          ""రేపొకసారి మనం రబ్ జానీ ఇంటికెళ్ళాలి. అతని భార్యను ఓదార్చాలి.""          ""కొన్నాళ్ళపాటు రబ్ జానీ భార్య గౌసియా మాఇంట్లో పని చేసింది...."" చెప్పింది ఊహ.          ప్రెస్ లోంచి ఇద్దరూ బయటకు వచ్చారు- హీరో హోండా స్టార్ట్ చేసాడు సూర్యవంశీ.          ఊహను రూమ్ దగ్గర డ్రాప్ చేసి-          ""ఎప్పుడు అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి.....టెన్నోక్లాక్ కి లకడీకాపూల్ ద్వారకాలో కలుద్దాం....""          ""అవసరమైతే నేను నీ రూమ్ కి షిఫ్టయిపోతాను...."" అంది ఊహ.          వెంటనే బదులివ్వలేదు సూర్యవంశీ.          ప్రస్తుతం తన రూమ్ లో అర్పణ ఉంటోంది!          ""ఏం జవాబు చెప్పవ్....."" అడిగింది ఊహ.          ""నువ్వు పిరికిదానివని నేననుకోలేదు.....""          ఆ మాటలకు విస్తుపోయింది ఊహ.          ""గుడ్ నైట్...."" చటుక్కున చెప్పి వెనక్కి తిరిగిందామె.                                                            *    *    *    *    *          రాత్రి ఒంటిగంట దాటింది.          మెయిన్ రోడ్ మీద సందడి తగ్గింది.....సెంట్రల్ కోర్ట్ హోటల్లో.....ఒక్కొక్క రూమ్ లోనూ పూర్తిగా చీకటి పరుచుకుంటోంది.          అప్పటికే రెండుసార్లు అతని రూమ్ లోంచి బయటికొచ్చి, కారిడార్లో తచ్చాడాడు.          ఎవరూ లేరు.....ఎక్కడా ఏ మనిషి అలికిడీ లేదు.          ముందు జాగ్రత్త చర్యగా, కారిడార్లోని లైట్లన్నిటినీ ఆర్పేసాడు.....          థర్డ్ ఫ్లోరంతా....చీకటి.....గాడాంధకారం....          చప్పున ఆ టైమ్ లోనే ఆ చివర రూమ్ లో ఉన్న నిరంజనరావుకి మెలుకువ వచ్చింది.          బబ్లూ ఒక్కొక్కలైట్ స్విచ్ ను ప్రెస్ చేస్తున్నపుదు, ఆ సున్నిత శబ్దాన్ని అతని శ్రవణేంద్రియాలు గ్రహిస్తున్నాయి." 78,"     ఆఖరి కిరోసిన్ బొట్టు! అయిపోయేవరకు వెలిగిన స్టవ్ తన వత్తుల్ని తనే తినేయటం మొదలెట్టింది. నీళ్ళు మరిగాయి......మొత్తానికి కాఫీ కలర్ కే వచ్చాయి నీళ్ళు.     ""హమ్మయ్య! బెడ్ కాఫీ అయిపోయింది"" అన్నాడు నారాయణ్ కొండంత ఆనందంతో.     ఒరేయ్ అనిల్ ఇల్లు ఊడవరా. ఈ రోజువంతు నీదే కదా?"" అన్నాడు టాగూర్ ఆఖరి చుక్కను నాలికపై వంపుకుంటూ.                          *    *    *     వెల్ కమ్ కింగ్ రిసార్ట్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ లో నిలబడి బైనాక్యులర్ లో చూస్తున్న ఓ వ్యక్తి హంపి కెమేరా దూరంగానే ఉన్నా అభిముఖంగా ఉంది గనుక...... ఒక వేళ అనుకోకుండా జూమ్ తో ముందుకెళ్ళి ఉంటే.....? అమ్మో కొంప మునిగిపోతుంది.     మరోసారి బైనాక్యులర్స్ లోంచి కెమెరా వైపుకు చూసాడు.     ఒక యువతితోపాటు ఐదుగురు మగవాళ్లు కనిపించారు. ఎవరు వాళ్లు......? ఏం చేస్తున్నట్లు... పరిశీలించి చూస్తుంటే అదేదో టెలివిజన్ కెమెరాలా వుంది. ఒకవేళ వాళ్లు షూట్ చేసిన క్యాసెట్ ని టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తే.....?     ఊహు......అలా జరగకూడదు.     వార్ని చంపైనా వారినుంచి ఆ క్యాసెట్ ని వశం చేసుకోవాలి. తప్పదు.... కొన్నాళ్ళయినా ప్రశాంతంగా  ఉందామనుకున్నాడు. కాని పరిస్థితులు అలా ఉండనిచ్చేలా లేవు..... ఆలోచిస్తూనే బయటకు వచ్చేశాడు. ఇప్పుడతను వార్ని నీడలా వెంటాడే ప్రయత్నంలో ఉన్నాడు.     అతని పేరు దాదాగంజ్.     వయస్సు సుమారు 28 ఉంటాయి.     జయధీర్ ఇండియా రాబోతున్నట్లు ముందుగా దాదాగంజ్ కే తెలుస్తుంది అదీ చిత్రమైన పద్దతిలో.     న్యూయార్క్ లో జె ఎఫ్ కె ఎయిర్ పోర్ట్ ఇన్ గేట్ దగ్గర ఒక వ్యక్తి నిలబడతాడు.     ఇండియాన్ అని అనిపించగానే ఈ వ్యక్తి ఎంతో వినయంగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ""సార్! అర్జెంట్ లెటర్ ఒకటి ఇండియా చేరాలి. ఇక్కడ పోస్ట్ చేస్తే అది ఇండియా చేరడానికి వారం పైగా పడుతుంది. దయచేసి బొంబాయి ఎయిర్ పోర్ట్ లో పోస్ట్ చేస్తారా...... అని అడుగుతాడు.     అతని చేతిలో ఓ కవర్ ఉంటుంది. దానిమీద ఇండియన్ పోస్టల్ స్టాంప్సే అతికించి ఉంటాయి. ఏ  ప్యాసింజరైనా అనుమానించడానికి పెద్దగా ఏం కనిపించదు.     అతనలాగే అని దాన్ని తీసుకొని ప్యాకెట్ లో పెట్టుకుంటాడు. 24గంటల తర్వాత అది ఆటోమేటిగ్గాబొంబాయి ఎయిర్ పోర్ట్ లో పోస్ట్ అవుతుంది. అది మరో రెండు రోజులకు దాదాగంజ్ కి మరోవ్యక్తి  ద్వారా అందుతుంది.     ఒక వేళ అది మరొకరి చేతిలో పడినా తెరిచి చూస్తే కాళికాదేవిని 14సార్లు ధ్యానించాలి. ఆ తరువాత మరో ఏడుగురికి ఇలాగే మీరు ఉత్తరాలు వ్రాయాలి. 16 మందికి సముద్రపోడ్డున అన్నదానం చేస్తే  మీకు  మేలు జరుగుతుంది. అని మాత్రమే ఉంటుంది. భక్తిముదిరి తలకెక్కిన భక్తుడు ఎవరో  వ్రాసిన పిచ్చి ఉత్తరంగానే కనిపిస్తుంది. కాని దాదాగంజ్ కి ఉత్తరంలోని మొదటి అంకెలు 14 పధ్నాల్గవ తారీకున అని- రెండవ అంకె '7' ఏడవ నెలలో అని తెలియజేస్తుంది. జయధీర్ బొంబాయి ఎయిర్ పోర్ట్ లో దిగితే సముద్రపోడ్డున అన్నదానం  అని వ్రాయడం జరుగుతుంది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అయితే దేశరాజధాని వరకు నీ భక్తిరసం పొంగి పోరలాలి అని రాసుంటుంది ఉత్తరంలో.     ఆ పద్ధతిలోనే నాలుగురోజుల క్రితం ఒక ఉత్తరం అందింది. దానిప్రకారమే జయధీర్ ఢిల్లీలో దిగాడు. ఆ తరువాత అక్కడినుండి ఫోన్ కాల్  ఒకటి  దాదాగంజ్ కి వస్తుంది. ఇండియాలో ఎక్కడ? ఎలా? కలుసుకోవాలన్న వివరాలు సైతం కోడ్ లో అందించబడతాయి ఆ ఫోన్ కాల్ లో.     వర్షం క్రమంగా ఎక్కువైంది.     సాయం సూర్యుడ్ని మేఘాల కమ్మేశాయి. వెలుతురు క్రమంగా తగ్గిపోతోంది. ఆమె కెమేరా ఆఫ్ చేసి భవానీకి అందించింది.     వర్షం ఉధృతమైంది.     'హంపి' కి వర్షంలో తడవటం సరదా.     ఆమె అలాగే అక్కడే నుంచొని తలపైకి ఎత్తి నాలికను  బయటకు చాపి పైనుండి రాలిపడే చిరుచినుకుల్ని ఆర్తిగా సృజిస్తోంది. మిగతా వాళ్ళు కాటేజ్ లోకి వచ్చేశారు హడావుడిగా.     దాదాగంజ్ కాటేజ్ ని గుర్తుపెట్టుకున్నాడు.     ఆమె అలాగే తడిసి ముద్దయిపోయింది.     అప్పుడప్పుడు విల్సన్ ఆలోచిస్తుంటాడు- ఏమిటి మేడమ్ కి ప్రకృతి అంటే అంతిష్టం........?. అని.     వర్షం అన్నా..... పూలన్నా..... చిన్న పిల్లలన్నా తనూ చిన్నపిల్లలా మారిపోతుంది. తనో పడ్డ కెమేరా వుమన్ అనిగాని..... తను తలుచుకుంటే అద్భుతాల్ని సృష్టించగలదని గాని..... రోజుకి కొన్ని వేలు ఛార్జ్ చేసే గ్రేట్ ఇండియన్ క్రియేటర్ అనిగాని అప్పుడామెకు గుర్తుండదేమో?     దూరదర్శన్ ప్రేక్షక ప్రపంచంలో ఆమెదో విశిష్టమైన స్థానం. స్పాన్సర్ల ప్రపంచంలో ఆమె అంటే అమితమైన క్రేజ్....... ఎడ్వర్ టైజింగ్ ఏజెన్సీవాళ్ళు ఆమె ఆఫీస్ ముందు పడిగాపులు గాస్తుంటారు.     పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు సైతం ఆమె టేకప్ చేసిన టెలివిజన్ ప్రోగ్రామ్స్ అంటే స్పాన్సర్ చేసేందుకు ఉత్సాహపడుతుంటాయి.     అలాంటి అద్భుతమైన ఆమె..... ఇప్పుడు చిన్నపిల్లలా తడిసి కాటేజ్ కేసి వస్తోంది.     ""మిస్టర్ విల్సన్...... షూటింగ్ పార్ట్ పూర్తయినట్లేనా?"" గోవా టూరిజమ్ పి.ఆర్.ఓ.అడిగాడు హంపీని అడిగేందుకు ధైర్యం లేక.     ""తెలీదు....మేడమ్ నే అడగండి"" అన్నాడు కెమేరాను కిట్ లో సర్దుతూ.     సరిగ్గా అప్పుడే దాదా ఓబరాయ్ రిసెప్షన్ కి ఫోన్ చేశాడు.     ""హలో....ప్రిన్సెస్ గెస్ట్ హౌస్ లో ఉన్నదెవరో చెప్పగలరా?""     ""విత్ ప్లజర్......కెమేరా వుమెన్ మిస్ హంపి.....""     ""ఆ కాటేజ్  ఎవరి పేరుమీద బుక్ అయింది? ఎవరు బుక్ చేశారు?""     ""ఆమె  పేరుమీదే బుక్ అయింది. బుక్ చేసింది మాత్రం గోవా టూరిజమ్ పి.ఆర్.ఓ.....""     ""థాంక్యూ"" దాదా ఫోన్ పెట్టేశాడు.     అంటే టూరిజమ్ డవలప్ మెంట్ వాళ్ళు యాత్రికుల్ని ఆకర్షించేందుకు ఏదో ప్రోగ్రామ్ షూట్ చేయిస్తుండాలి. ఆ క్యాసెట్ ని రాత్రికి రాత్రి లేపేయటం మంచిదా లేక అదెందుకు తయారుచేస్తున్నారో పూర్తిగా తెలుసుకొని అప్పుడు రంగంలోకి దిగడం మంచిదా?     టూరిజమ్ డిపార్ట్ మెంట్ కి ఫోన్ చేశాడు వెంటనే.     ""గోవా టూరిస్ట్ ట్రాక్షన్స్ మీద వీడియో ఫిల్మ్ ఏదైనా తయారు చేస్తున్నారా?"" దాదా కేజువల్ గా అడిగాడు.     ""ఎస్...  పూర్తి వివరాలు కావాలంటే పి.ఆర్. ఓ గార్నే కస్సల్ట్ చేయాలి. నేను ఆయన పి.ఏని. ఆ వైపు నుంచి వినిపించింది.     ""షెడ్యూల్ ఎన్నాళ్ళు?""     'ఇంకో రెండురోజులుంటుంది"" దాదా ఫోన్ పెట్టేశాడు.     ప్రభు ఆ సాయంత్రమే ఢిల్లీ నుంచి గోవా  బయల్దేరాడు. ఆమెను కలిస్తే ఏదో గొప్ప ప్రయోజనం ఉంటుందని, జయధీర్ ని పట్టుకోవడం సులభం అవుతుందని అతనికేమాత్రం  ఆశలేదు. అయితే ఏదో  ఒక ఆధారం లేందే పరిశోధనలో ఒక అడుగైనా ముందుకేయడం కష్టం కానుక హంపీని కల్సేందుకు బయల్దేరాడు.     ఇప్పుడు ఆమె దగ్గరున్న క్యాసెట్ ని దొంగిలించినా, లేదా మరేదైనా ప్రయత్నం చేసినా అనవసరమైన ప్రాముఖ్యం ఇచ్చినట్లై ఆమెకు అనుమానం వస్తే.....?     ఏదైనా చాలా కేజువల్ గా జరిగిపోవాలి. లేదంటే మొత్తానికి వాళ్ళందర్ని లేపేయాలి. ఆమెకు జయధీర్ తెలీదు. అతనెలాటివాడో అంతకంటే తెలీదు  సో...... ఆమెనుంచి పెద్ద ప్రమాదం లేకపోవచ్చు. సీన్ రొమాంటిక్ గా కనిపించడంతో ఉత్సాహంగా షూట్ చేసివుండవచ్చు.     అసలింతకీ ఆమె జయధీర్ సాబ్ ని. ఆమెను తన కెమేరాలోకి ఎక్స్ పోజ్ చేసుకుందీ లేనిదీ తెలియాలి. అప్పుడే తనేం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు.     అప్పుడు సమయం సాయంత్రం 5.30 అయింది.     కాని చీకటి పడినట్లుగా ఉంది వాతావరణమంతా.     జయధీర్ సాబ్ ఇంకా కాటేజ్ లోకి రాలేదు. అతను చురుగ్గా ఆలోచిస్తూ కారిడార్లో పచార్లు చేస్తున్నాడు.                            *    *    *     హైదరాబాద్ మహానగరంలో లైట్స్ వెలిగాయి.     కాంతి ప్రవాహంలో నగర ప్రధాన రహదారులు వింత శోభను సంతరించుకున్నాయి.     ""ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్"" ఎయిర్  హొస్టెస్ కంఠం సున్నితంగా  వినిపించింది.     దశరథ ఆలోచనల్నుంచి తేరుకొని నడుముకి బెల్ట్ బిగించుకున్నాడు.     నలభై ఐదేండ్ల దశరథ టెలివిజన్ నిర్మాతల ప్రపంచంలో మకుటంలేని మహారాజు.     ది ఆన్ క్రౌన్డ్ కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్ వరల్డ్. ది నెంబర్ వన్  టెలీ సీరియల్ ప్రొడ్యూసర్.     బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఐ.సి 439 ఎయిర్ బస్ సున్నితంగా లాండ్  అయింది. 'సేఫ్ లాండింగ్' అనుకున్నాడు మనస్సులో దశరథ. తాను ఎ రంగంలోకి ప్రవేశించినా సేఫ్ గా లాండ్ అవ్వాలన్నదే దశరథ అభీష్టం.     ఎయిర్ పోర్ట్ విజిటర్స్  లాంజ్ లో తన  కోసం  ఎదురుచూస్తున్న ప్రొడక్షన్ మేనేజర్ ని గుర్తించి చిరునవ్వు నవ్వాడు.     కొందరు నవ్వితే చాలా బావుంటుంది. ఎదుటివాళ్ళు, అలాంటి వాళ్ళు నవ్వాలనే కోరుకుంటారు.     డ్రైవర్  పరిగెత్తుకుంటూ వచ్చి సెల్యూట్ చేసి బ్యాగేజ్ స్లిప్స్ తీసుకొని కన్వేయర్ బెల్ట్ వైపుకు వెళ్ళాడు.     దశరథ ముందు, ప్రొడక్షన్ మేనేజర్ వెనుకగా నడుస్తూ ఎయిర్ పోర్ట్  బయటకొచ్చి కారు దగ్గరకు నడిచారు. దశరథ కారులో కూర్చున్నాడు. అతను బయటే నించుని వివరాలందించసాగాడు.     ""అందరూ వస్తున్నారు సార్. కృష్ణా ఓబరాయ్ లో భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తిచేశాం సార్....""     ""అందర్నీ ఇన్ వైట్ చేశారా?""     ""చేశాం సార్""     ""ఎంతవుతుందేమిటి?"" " 79,"     ""ఓయ్! నీ పేరేంటో నాకు తెలీదు గానీ... నాగ్గూడా కరాటే వచ్చు. మా అసిస్టెంట్ కి కూడా వచ్చు. మర్యాదగా వెళ్ళిపో.""     తలుపేసేయ్యబోయాడు జిగురుమూర్తి.     అప్పటికే ఒక గాఢమైన నిర్ణయానికి వచ్చేశాడు అమ్రేష్ పురి.     'జాకీచాన్'ని జ్ఞాపకం తెచ్చుకుని జిగురుమూర్తి మెడమీద ఒక్కటివ్వగా, కోడిపిల్లలా జిగురుమూర్తి నేలమీదకు వాలిపోయాడు.     ""చచ్చూరుకున్నాడా పీనుగు...?"" అని కంగారుపడి ముక్కు మీద చెయ్యిపెట్టి చూసి, పర్వాలేదని నిర్ణయించుకుని, జిగురుమూర్తిని బరబరా లాక్కువెళ్ళి తన గదిలో పడుకోబెట్టి, డ్రెసింగ్ టేబుల్ దగ్గరకెళ్ళి-     ముఖానికి రంగు వేసుకోవడం మొదలుపెట్టాడు అమ్రేష్ పురి.     అప్పటికి సరిగ్గా పదింపావయింది.     తలుపు చప్పుడు కావడంతో తలుపు తీశాడు అమ్రేష్ పురి.     అతడిని చూడగానే కెవ్వుమన్నాడు సుబ్రమణ్యం.     ""గురువుగారూ! మీరెలా మారిపోయారండీ! మొత్తం ముఖం కూడా మారిపోయే 'డిటెక్టివ్ విద్య'ను ఎక్కడ సంపాదించారు సార్? ఇన్నాళ్ళ నుంచి మీ దగ్గరున్నా ఏ విద్యా నాకు ఎందుచేత చెప్పలేదు సార్?"" జిగురుమూర్తి అనుకుని, అమ్రేష్ పురి మీద అలుగుతూ అన్నాడు సుబ్రమణ్యం.     ""చూడు మణ్యం! నేను శరీరం దగ్గర్నించి గొంతు వరకూ అన్నీ మార్చేశాను చూశావా... దీనినే మాయాజాల తాంత్రిక విద్య అంటారు... ఎప్పుడయినా తీరుబడిగా వున్నప్పుడు నీకు చెప్తానుగానీ ముందు పద.""     ఇంట్లోంచి బయటికొచ్చాడు అమ్రేష్ పురి. అతని వెనుక ఎందుకైనా మంచిదని తెచ్చుకున్న దుప్పటిని ముఖం మీదుగా కప్పుకుని వెనక నడిచాడు సుబ్రమణ్యం.     ముందు జిగురుమూర్తి చెప్పిన ప్రకారమే అవుట్ హౌస్ గోడ దూకి లోనకెళ్ళి పెరడు తలుపు తీశాడు మణ్యం.     అమ్రేష్ పురి లోనకి ప్రవేశించాడు.     బాత్రూమ్ ప్రక్కనున్న తలుపును తట్టాడు. లోననుంచి ఏ శబ్దమూ వినబడలేదు.     లోన గెడ ఊడదీయడానికి ప్రయత్నించాడు. రావడంలేదు.     ""రావడం లేదు బాస్... ఎలా...""     అతను శక్తినంతా ఉపయోగించి తలుపును బద్దలుకొట్టాడు.     భళ్ళున తలుపు తెరుచుకోగానే-     లోనకెళ్ళారిద్దరూ.     కానీ లోన గదుల్లో ఎవరూ లేరు. ఎక్కడా ఫోటో కూడా కనబడలేదు.     ""ఎక్కడికి పోయారు వీళ్ళందరూ?""     ""రోజూ తొమ్మిది గంటలకల్లా అందరూ పడుకుండిపోతారు బాస్! వాళ్ళు వుంటారని మనం ప్లాన్ వేశాం. ఏమైపోయారు?"" ఆశ్చర్యంగా అన్నాడు సుబ్రమణ్యం.     అమ్రేష్ పురి ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు.     తను జిగురుమూర్తి కాదని పోల్చేశాడా వీడు? పోల్చేసి ఆటలాడుతున్నడా? అసలు... ఆ అమ్మాయీ, వాళ్ళు వుండేది యిక్కడేనా? అదీ తేల్చుకుందాం అని నిర్ణయించుకుని...     ""ఒరేయ్ మణ్యం!"" కోపంగా పిలిచాడు అతను.     ""నేను నీ బాస్ ని కాదని తెలిసిపోయింది కదూ?""     ""లేదు బాస్! మీరు నా బాసే బాస్... ఈ ప్లాన్ ఫెయిలయినా కాక పోయినా మీరు నా బాసే బాస్... ప్లాన్ ఫెయిలయిందని మీరు అప్ సెట్ కాకండి బాస్"" వినయంగా అన్నాడు సుబ్రమణ్యం.     ""ఒరే సుబ్రమణ్యం! నాకు తెలుసు... ఆ లాయరుగాడు, నువ్వూ నన్ను సిటీ బస్ లోనే గమనించారు. మిమ్మల్ని నేను ఫాలో అయ్యానన్న విషయంకూడా మీరు గమనించారు. ఇక్కడ ఫోటో వుందని చెప్పి నాకు టోకరాయిచ్చారు. అవునా? చెప్పు..."" అని కోపంగా ఆ సుబ్రమణ్యాన్ని పీక పట్టుకుని, పైకెత్తి కిందకు కుదేశాడు.     అసలే భయస్తుడు... ఒంటి పీక మనిషి... భయంతో స్పృహతప్పి పోవడం, అదే సమయంలో బయట తలుపు దగ్గర చప్పుడు కావడంతో అమ్రేష్ పురి గబగబా పరుగెత్తి అవుట్ హౌస్ గోడ దూకేశాడు.     ఎవరో గోడ దూకిన విషయం-     అప్పుడే సినిమాకెళ్ళి వస్తున్న ఆంజనేయులు, ఆనందం గమనించారు.     తరణిని బంధువులెవరిదో నల్గొండలో పెళ్లుందని చెప్పి ఉదయాన్నే భువనేశ్వరీదేవి పెళ్ళికి తీసికెళ్ళింది.     ""ఒరేయ్... అంజిగా! మనింట్లో దొంగలు పడ్డార్రా..."" అరుస్తూ పెరడు వేపు దూసుకుపోయాడు ఆనందం.     అప్పుడే గోడ దూకి గెంతుతున్న వ్యక్తిని చూసి-     ""గూర్ఖా... గూర్ఖా..."" అని అరిచాడు.     ఆ అరుపులకి గూర్ఖా పరుగెత్తుకుని వచ్చాడు.     భుజంగరావు కూడా లేచొచ్చాడు.     అందరూ-     తాళం తీసి లోనకెళ్ళారు.     ఆంజనేయులు లైటు వేశాడు.     గది మధ్యలో నేల మీద స్పృహ తప్పి పడిపోయిన సుబ్రమణ్యం కనిపించాడు.                             *    *    *    *     ఫోటో స్టూడియోలోకి నడిచాడు కాశీబాబు.     ""ఏందయ్యో! పెద్ద ఫోటోలోడు లేడా?"" శక్తికపూర్ని అడిగాడు.     ""పెద్ద ఫోటోలోడు ఎవడయ్యా?"" విసుగ్గా అడిగాడు శక్తికపూర్.     ""అదేనయ్యా! పట్టపగలు లోపలకెళ్ళిపోయి చీకటి గదిలో ఒక్కడూ కూర్చుంటాడు. ఆడేనయ్యా...""     ""ఆడూ, ఈడూ ఏంటయ్యా! మర్యాద... మర్యాద... మా ఓనర్ని పట్టుకుని ఫోటో లోడంటావా?""     ""మర్యాద మాకూ తెలుసులేవయ్యా౧ ఇరవై నాలుగ్గంటలూ చీకట్లో కూర్చున్నోడికి మర్యాదేంటిగానీ, ఆ ఫోటోలోడ్ని పిలువు. నా ఫోటో సంగతి యివాళ తేలిపోవాల...""     ""మళ్ళీ ఫోటో లోడూ, ఫోటో లోడూ అని అన్నావంటే నీ ఫోటో దొరికినా సరే చింపేస్తాను. జాగ్రత్త..."" హెచ్చరించాడు శక్తికపూర్.     ""చింపేస్తావా? చింపు చూస్తాను. ఒరేయ్ చిన్న ఫోటోలోడా... మాటలు జాగ్రత్తగా రానీవోయ్... వేషం చూసి పల్లెటూరి వాడ్ననుకుంటున్నా వేమో! నిన్ను, నీ స్టూడియోనీ అయిదు మినిట్స్... ఐదు మినిట్స్ లో అగ్గెట్టి కాల్చేస్తాను"" అంటూ జేబులోంచి అగ్గిపెట్టె తీశాడు కాశీబాబు." 80,"    ""బాబుగారూ! నాదో మాట వినండి. చెప్పుతున్నానని కోపగించుకోకండి. మీ దయవల్ల నాకు ఇళ్ళస్థలం ఇప్పించేరు. కొట్టం వేసుకుని బ్రతుకుతున్నాను. మీరూ రండి. రాములు వారంటే అడవుల పాలైనపుడు కొట్టాల్లో తల దాచుకున్నాడు. మళ్ళీ మంచి రోజులు రాకపోవు...""     ""వెంకన్నా!""     ""బాబుగారూ! ఋణం తీర్చుకోనివ్వండి నన్ను... మీ వుప్పు తిన్నందుకు మేలు చెయ్యనివ్వండి""     ""పూర్ణా! భగవంతుడు దయామయుడు పూర్ణా! వెంకన్నా సరిగా సమయానికి వచ్చాడు. తాత్కాలికంగా తలదాచుకోటానికి దారి చూపుతున్నాడు""     ఆ మాటలోనే సుధాకర్ వచ్చాడు నిరుత్సాహంగా.     ""ఎక్కడా ఖాళీ లేదంటున్నారునాన్నా! ఎలా చేయాలో ఏం చేయాలో?-""     ""హుఁ భగవంతుడు కరుణామయుడు సుధా! ఇప్పటికి దిగులు పడనవసరం లేకుండా చేసాడు. ఇదిగో వెంకన్న వచ్చాడు. పద సామానంతా రెండుబళ్ళకి ఎత్తించు. వెంకన్న ఇంటికి వెళదాం""     ""బాగుందయ్యా సుందరయ్యా! పెద్దమనిషివే. కొడుక్కి భాగం పంచకుండా వెళుదమనుకుంటున్నావా? నోట్లో నాలికలేని వాడిని చేసి ఆడిద్దామనుకున్నా నేను బ్రతికే వున్నాను. దించు దించు! సామాను సరిగా పంచి ఇచ్చి నీ భాగం తీసికెళ్ళు"" అన్నాడు పాపయ్య.     ""పాపయ్యా!""     ""మరియాద! మరియాద! గౌరవించటం నేర్చుకోరా కుర్రాడా?""     ""నీకు మరియాద నేర్పాలిగా ముందు? చెప్పుతో నలుగు బాదితే బుద్ధివస్తుంది. మరియాద నేర్చుకుంటావ్, అంతే.""     ""ఆఁ ఆఁ పెద్దా చిన్నా లేకుండా నోటి నోటి కెంత వస్తే అంత మాట అనటమేనా? న నీకు నాలుగు పడితే కానీ బుద్ధిరాదు""     ""ఇదిగో ఇప్పుడు నీకు బుద్ధి చెప్పి-""     ""సుధా!"" అన్నపూర్ణ కేకకి ఆగిపోయడతను.     ""తప్పుబాబూ?"" అతన్ని మనం కొట్టకూడదు. ఆరోజు వస్తే అతన్ని కొట్టే వాళ్ళు తంతారు. ఊఁ వెనక్కి రా! ఆ సామాను దింపు. పాత్ర సామానంతా రెండు భాగాలు చెయ్""     ఆజ్ఞాపించినట్టుగా అంది అన్నపూర్ణ.     ""నీవు దేవతవి అన్నపూర్ణమ్మ తల్లీ! మనిషి ఏది తప్పినా ధర్మం తప్పకూడదు. మీకు ఇద్దరు కొడుకులూ సమానమే... ఒకరెక్కువా ఒకరు తక్కువా అంటూ లేదు...""     మనస్సులో అసహ్యించుకుందతన్ని... జవాబు చెప్పలేదు.     పంచారంతా.     భాగం సామాను బండ్లకెత్తారు. మధు భాగం  మళ్ళీ ఇల్లు చేరింది.     దిగులుతో, బ్రతుకుపై భవిష్యత్తుపై ఆశతో కదిలారు నలుగురూ!     ఇల్లు దాటుతూ అన్నపూర్ణ చూసిన చూపు బల్లెంలా దిగింది పాపయ్య గుండెలో...     ఊరు చివరగా వుంది వెంకన్న పాక.     బండి ఇంటిముందుకి రాగానే ""నిన్నటిదాకా మేం యీ పాకలో వున్నాం. ఈరోజే ఆ వెనుక భాగానికి మారాం. ఇక ఇదంతా మీకే మాదేవుంది. నేనూ నా భార్య అంతే!"" అన్నాడు వెంకన్న.     వాకిటికి నమస్కరించి కుడికాలు ముందుపెట్టి ఇంట్లో ప్రవేశించారు.     సామానంతా సర్దుబాటు చేసుకునేసరికి సాయంకాలమైంది!     ""అదిగో ఆ కాంపౌడ్ లో కుళాయి వుంది. ఇరవై నాలుగు గంటలూ నీళ్ళు వస్తూ వుంటాయి. బంగారు తల్లి ఎవర్నీ ఏమీ అనదు ఆ ఇంటావిడ. వాడుకకి మా పాక వెనుక బావి వుంది"" వెంకన్న అన్నీ పరిచయం చేయసాగాడు.     ""రోజూ ప్రొద్దున్నే కూరగాయలు వస్తాయి. కానీ మేం ఏం కొంటాం తల్లీ ఆ పెరట్లో కాసేవే మాకు చాలు... వంగ, బెండ, మిరప, అనప, చిక్కుడు, పొట్ల, కాలం వారిగా పండుతాయ్. దొండ పాదుంది. కరివేపాకు మొక్క వుంది.""     ""చాలా బావుంది వెంకన్నా! ఈ రోజుకి మా పాలిట దేవుడివి నీవే!"" అంది అన్నపూర్ణ కృతజ్ఞత వెల్లివిరిస్తున్న కళ్ళతో.                            *        *        *     నిజంగా ఆ రోజు సుధాకర్ జీవితంలో చాలా చెడ్డ రోజు." 81,"    ఆమె చూస్తూనే వుంది.....         నేలపై స్పృహతప్పి పడిపోయిన స్వామి గుండెల్లో గోళ్ళు గుచ్చబోతుంటే ..... తోచని సందిగ్ధతతోఅనేసింది ""మొవ్వా""         ఆగిపోయిన ఫేరల్ చైల్డ్ వెనక్కీ చూశాడు.....         వెంటనే మరో ఆదేశం అందించాలి....... ఎలాగో అమెకి తెలీడం లేదు......         చేతులు సాచింది అమ్మంత అప్యాయతతో......         అతడిలో చలనం లేదు......         రెప్పలార్చకుండా చూస్తున్నాడు.......         అప్పుడు వినిపించింది రేస్ హౌస్ సమీపంలో ఓ పులి గాండ్రింపు __-                           *    *    *    *            చైతన్య స్థానంలో మరో వ్యక్తి వుంటే ఆ గాండ్రింపు తో కర్మేంద్రియాలన్నీ చచ్చుబడిపోయేవే ......         చార్జి చేయడానికి చెరువుగా వచ్చిన పెద్దపులి మొదట చేసేది గాండ్రించడం...... వేటగాడి ఆలోచనాశక్తిని హరింపచేసే ఆ సైట్ సెకండ్స్ పులి అవకశంగా  తీసుకునేది........         పులిని మించిన వేగంతో పక్కకు దొర్లిన చైతన్య దభ్ మన్న చప్పుడు విన్నాడు.... వెనువెంటనే చీకటిలోని ఆకారాన్ని చూస్తూ గుండెలనే తాకిందో ముందు అర్ధం కాలేదు ......         సమీపంలోని పొదల్లో గుండెలార్చెట్టు అలజడి .....         మరుక్షణం నిశ్శబ్దం.....            ఊపిరి బిగపెట్టి కళ్ళు చిట్లించి చూస్తున్నాడు చైతన్య.....         అతిప్రమడాభూయిష్టమైన  స్తబ్దత అది......         మేనీటర్ గాయపడిందో లేదో తెలీదు.....కానియా చీకటిలో ఎక్కడో పొంచి తన కడలికని గమనిస్తూందని అర్ధమైపోయింది.            ప్రత్యర్ధి స్థావరంలో వున్న వేటగాడిక, అందులోనూ నెలపై నిలబడి వున్న వ్యక్తి శక్తిని, సహనాన్ని పరీక్షించే క్షణాలు అవే......         జ్ఞానేంద్రయాలకి   గట్టి పని కల్పించి, అడుగులో అడుగు వేసుకుంటూ వెనకకు నడుస్తున్నాడు చైతన్య.         ముందున్న మేనీటర్  తనపై లఘించే అవకాశ మివ్వకుండా సాధ్యమైనంత  గేఫ్ కోసం ప్రయత్నిస్తున్నా డిప్పుడు .         ఆ సమయంలో కూడా  చైతన్య  ఆ చీకటిలోనే మరో చిరుతపులి సంచారిస్తుందన్న విషయాన్ని మరచిపోలేదు.         నిజానికి అసాధరణమైన కన్నింగ్ నేస్ తో వేటగాడ్ని దెబ్బ తీయగల చిరుత కదలికల్ని వూహించడం ఎంతటి  వేటగాడి మేధస్సుకైనా సాధ్యం నిశ్సబ్దంగా నక్కి రెప్పపాటుతో పైకి లఘించి ప్రాణాలు తీయగలదు....         రెల్లు పాదాలవేసే దృష్టిని సారిస్తూ నేలపై రేఖలా పడుతున్న వెన్నెల కిరణాల్ని అనుసరిస్తూ ఓఅరఫర్లాంగు దూరం నడిచి  ఓ మద్ది చెట్టును సమీపించాడో  లేదో......         గుండెలదిరేట్టు గాండ్రింపు వినబడింది.         ఎక్కడో కాదు.... కొన్ని అంగుళాల దూరంలో......         గభాలున వెనక్కి తిరిగాడు......         అది కాదు...... అంత స్వల్పదూరంలో తప్పించుకోవడం సాధ్యం కాదని తెలిసిన మొండితనంతో ముఖాముఖీ పోరాటానికే సిద్ధపడ్డాడు....         సందర్భోచితమైన  అలాంటి తెగునే అతను ప్రదర్శించనివాడు చైతన్య కధ ఇప్పుడు కాదు పాడేరు లోనే ముగిసిపోయేది.         చిత్రం.... సమీపంలో మేనీటర్ జాడలేదు.....          కాని మరోమారు పులి గాండ్రించిన శబ్దం.....         ఈసారి అది ముందు చెట్టుతోరల్లో వినిపించి వెనువెంటనే చెట్టు కొమ్మలదాకా ప్రాకింది.         అంతే __ అప్రతిభడయ్యాడు.....         ఇంతసేపూ నిజంగా వినిపించింది పులి గాండ్రింపే అయినా అది పులి నుంచిగాక తీగకు వెళ్ళాడుతున్న టేప్ రికార్డ్ ర్ లో నుంచి అన్నది బోధపడింది. కొమ్మల్లో ఓ ఆకారం కదిలింది.....         కేవలం రెండు మేనీటర్స్  మాత్రమే తిరుగుతున్నా దుర్గమారణ్యంలో అన్నిదిక్కులనుంచి ఒకేసారి వినిపించిన పులుల గాండ్రింపులకి అప్పటికి అర్ధం తెలిసిన చైతన్య ప్రత్యర్ధలేవరన్నా కనీ వారి తెగువని, తెలివినీ అభినందించకుండా వుండలేకపోయాడు.         అతను తేరుకునేలోగానే చేట్టుపైనుంచి క్రిందకి దూకిన ఆకారం వేగంగా దక్షణంవేపు పరుగైత్తింది.         వ్యవధి లేదు..... ఇన్ని రోజుల తర్వాత ప్రత్యర్ధుల ఉనికి తెలుసుకోగలిగే ఒకేఒక్క అవకాశం.....         ఇప్పుడు చైతన్య ఏ మూలనో నక్కిన మేనీటర్ గురించి ఆలోచించలేదు.......     మేనీటర్ ఉనికిని అవకాశంగా వాడుకుని తనను మానసికంగా బలహీనుడ్ని చేయాబోయిన ఆ వ్యక్తిని అదుపు చేయలనుకున్నాడు.         కసి.....క్రోధం.......         వెంటబడ్డాడు.......         పొదల మధ్యగా గోర్జిలా నుంచి గజాలు దూసుకుపోయాడో లేదో పదిగజాల దూరంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే విస్పోటం ......         అడవి గర్జించినట్లు పేలిన హేండ్  గ్రెనేడ్ ......         కళ్ళు భైర్లు కమ్మగా అయిదడుగులు వెనక్కి తూలిన చైతన్య చేష్టలుదిగినట్టు వుండిపోయాడు.         చాలా పటిష్టమైన ఏర్పాట్లుతో తనపై దాడి జరుగుతున్నది.         ఎంత సాహసంగలవాడైనా పొరపోయేదక్కడే......... కానీ చైతన్యలో మొండితనం ఉద్రుతమై పోయిందిఈ సంఘటన తర్వాతనే......         ""బాస్టర్స్ ""         రిట్టార్టయిన రైఫిల్లా  రెండడుగుల వెనక్కివేసి ప్రత్యర్ధి వూహించని వేగంతో వెనక్కిమరలి మిస్సైల్లా రెల్లుపొదల్లోకి దూసుకుపోయిన చైతన్య కేవలం రెండు నిముషాల వ్యవధిలో వృత్తంలాంటి మార్గంలోకి పరుగెత్తి ప్రత్యర్ధిని అభిముఖంగా వచ్చాడు......." 82,"    ""ఇది వట్టి స్వార్ధపు ఆలోచనకదూ? ఏ హాస్పిటల్ కో, ఏ విద్యా సంస్థకో విరాళంగా ఇస్తే ఉదాత్తంగా ఉండదూ?""     ""అదే మంచిదనిపిస్తే నీ చేతులమీదుగా జరుగనీ, తల్లీ! అలా జరిగినా నేను సంతోషిస్తాను!""     ""ప్రేమికా! నేనొకమాట చెప్పనా?"" రఘురామయ్యగారు కల్పించుకొంటూ అన్నారు. ఆయన గొంతులో పెద్దరికం ప్రతిధ్వనించింది. ""ఆయన భార్య ఆయన్ని తండ్రిని చేయలేకపోయింది! కాని, ప్రేయసి అతడిని తండ్రిని చేసింది! ఈ ప్రపంచంలో ప్రతి తండ్రికీ కలిగే పితృవాత్సల్యం ఆయనకు నీ మీద కలిగింది! ఆ తండ్రి మమకారానికి సంఘపు ఆమోదం లభించకపోయినా సృష్టికర్త ఆమోదం తప్పకుండా ఉంటుంది! ఎందుకంటే తల్లికీ, పిల్లకీ మధ్య ఉంటే మమకారమే తండ్రికీ పిల్లకీ ఉంటుంది! ఆయన ప్రేమను నువ్వు అవహేళన చేయడం బాగాలేదు! ఆయన మీద నాకేమీ ద్వేషం లేకపోతే ఆయన కోరిక తీర్చు! ఇహపోతే, ఆయన మృత్యుముఖంలో ఉండి నిన్ను అర్ధించడానికి వచ్చాడు. భగవంతుడి దయవల్ల ఆయన బ్రతికి బయటపడితే సంతోషమే. తిరిగి రానిచోటికే ఆయనపోతే నువ్వు ఎంత పశ్చాత్తాపపడాలి? నీ కోసం ఒప్పుకోకు! నీ దీనజన సేవలో ఆయన ఒక దుఃఖితుడు. ఆయన కోసం ఒప్పుకో. గతాన్ని సమాధిచేసి ప్రస్తుతం ఉదాత్తంగా ప్రవర్తించు.""     ""కాని, అంకుల్...""     ""నువ్వింకేం మాట్లాడకు! ఏం చెప్పకు. మృత్యు ముఖంలో ఉన్న ఆమనిషికి ప్రశాంతత నీయి.""     రాజశేఖరం లేచి ప్రేమీ దగ్గరికి వచ్చాడు. వంగి ఆమె నుదురు చుంబించాడు. ""బేబీ! నేను బ్రతికి బయట పడితే వచ్చి నీ దగ్గరే ఉంటాను. నువ్వు నా దగ్గరికి రావుగా? నీ దగ్గర కూడా ఉండనివ్వకపోతే రోజుకొకసారి నిన్ను చూచుకొనేలా ఇక్కడే కాపురం పెట్టుకొంటాను."" అతడి గొంతు గాద్గదికంకాగా కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి.                                           36     ""ఏమిటి, ఉన్నపళంగా రమ్మని వ్రాశావు? ఎందుకంత అర్జంట్?""     ""పెద్ద ఆపదలో చిక్కుకొన్నాను రామూ! రక్షించడానికి నువ్వు తప్ప నాకెవరూ కనిపించలేదు.""     ""ఆపదా?""     ""ఆఁ. ఆపదే. నాదికాని సొమ్ము ఉప్పెనలా, పర్వతంలా వచ్చిమీద పడింది. ఈ బరువును నువ్వు తప్ప ఇంకెవరూ ధించలేరు.""     ""వివరంగా చెప్పమ్మా.""     ప్రేమీ బీరువాలోంచి బ్రీఫ్ కేస్ తెచ్చి రామచంద్ర ముందుంచింది. ""తెరిచి చూడు.""     రామచంద్ర బ్రీఫ్ కేస్ తెరిచాడు. అందులో రాజశేఖరం వ్రాసిన వీలునామా కాగితాలు, ప్రేమీ పేరు మీద బాంక్ చెక్కులూ ఉన్నాయి. ""నా దత్తపుత్రికయగు ప్రేమికా రాణి..."" రామచంద్ర కుతూహలంగా గబ గబా చదివి క్రింద సంతకం చూసి, ""ఎవరీ రాజశేఖరం ప్రేమికా?"" అనడిగాడు ఆశ్చర్యంగా.     ""నీ జన్మకారకుడు నీకేమౌతాడో, అతడూ నా కంతే.""     ""ఓ. మీ నాన్నగారా? ఆయన ఎలా వచ్చాడు? ఎలా జరిగింది? ఆ కధంతా చెప్పు."" ఆత్రం పట్టలేనట్టుగా అడిగాడు.     ""చెప్పడానికేగా పిలిచాను. ముందు కొంచెం టీ తీసుకో."" లోపలికి వెళ్ళి టీ తో తిరిగి వచ్చింది.     ""ఆఁ. ఇక చెప్పు.""     ప్రేమీ మొదటినుండీ చివరి వరకూ చెప్పింది. చెప్పాక అంది. ""అందులో ఒక్కపైసా కూడా నేను వాడుకోలేను. అదంతా నీకు ఇచ్చి వేస్తాను. తృప్తిగా ప్రజాసేవకు ఖర్చుపెట్టు.""     ""నాకు చేతనైన సేవ నేను చేస్తే నాకు తృప్తిగా ఉంటుందిగాని ఇలా ఎవరిడబ్బో ఖర్చుపెట్టి చేసేదాంట్లో నాకేం తృప్తి ఉంటుంది చెప్పు?""     ""ఈ డబ్బు ఉంటే నువ్వు ఇంకా చాలా మంచిపనులు చేయగలవు, రామూ.""     డబ్బులేకపోవడంవల్ల తను ఎన్నో మంచి పనులు చేయలేక పోతున్న మాట నిజమే. ఎన్నోసార్లు 'డబ్బుంటే ఎంత బాగుండేది.' అనుకొన్నమాట కూడా నిజం.     ""నీకు ప్రజాసేవలో కావలసిన ఆసక్తి ఉంది. నువ్వే చేయవచ్చుగా ఈ డబ్బుతో ఏ పనైనా?""     ""చేయవచ్చు, రామూ. ప్రజాసేవలోనే జీవితం గడపాలని కూడా అనుకొన్నాను ఒకప్పుడు. కాని, దానికి నేను తగను. వివాహిత న్యాక ప్రజాసేవలో గడపడం కొంచెం ఇబ్బంది ఆంటీకి వచ్చిన కష్టాలు కాక పోయినా ఏవో కష్టాల్ని ఎదుర్కోవాల్సే వస్తుంది! పూర్తిగా సంసారానికి న్యాయంచేయకా, అటూ ఎన్నుకొన్న ఆదర్సానికీ న్యాయం చేయకా అన్నట్టు అవుతుంది. అయితే పూర్తిగా ప్రజాసేవకు అంకితంకావాలి. లేదా మంచి గృహిణిని కావాలి. నేను మంచి గృహిణినే కాదలుచుకొన్నాను. బ్రహ్మచర్యానికి నా మనసు సరిపోదు. ఒకరిని కాదు! ఇద్దరిని ప్రేమించాను. ఈ మనసును అదుపులో ఉంచుకోగలిగినరోజు నేను నిశ్చింతగా ప్రజాసేవలో అడుగు పెట్టగలను. కాని, ఈ మనసును అదుపులోకి తీసుకోవడంఎలాగో తెలియడం లేదు.""     రామచంద్ర నమ్మలేనట్టుగా చూశాడు. ""నువ్వు ఇద్దరిని ప్రేమించావా?""     " 83,"     అండర్ వరల్డు తాలూకా అసలయిన అధిపతి ఎవరో ఇంతవరకు ఎవరో ఎవరికి తెలియదు. అదో లింకులున్న గొలుసు ఒక లింకునుంచి మరో లింకు యంత్రంలా పనిచేస్తూ కదులుతుంటాయి. పొరపాటు చేసిన మనిషి చావటం వుంటుంది కాని లింకుమాత్రం తెగదు. గొలుసు కదలదు.     ఆ నిర్జీవ ప్రదేశంలో     నాలుగు వైపులా ఏదో వాసనగల పోగతప్ప శబ్దం లేదు. రాత్రి పన్నెండు గంటల టైము అమావాస్య పూర్తి చీకటి రాత్రి కొద్దిపాటి వెలుగుకోసం చిన్న దివిటి మాత్రం వెలిగించి వుంది.     లీలగా శబ్దం వినపడుతు పన్నెండు గంటలు కొట్టాయి. ఆ వెంటనే నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వాళ్ళని చూస్తూనే ఇరవై మంది లేచి నుంచున్నారు.     ఆ ఉదయమే ఆ ఇరవై మందికి కబురు అందింది. ముద్ర వేసే తతంగం ఇదివరకే జరగాల్సింది. కొన్ని కారణాలవల్ల ఆరోజు ఆగిపోయింది. ఈరోజు పవిత్ర పాపిగా తయారుచేసి ముద్రవేస్తారు. కబురు అందగానే ఇరవైమంది వచ్చారు.     వచ్చిన నలుగురు వ్యక్తుల్లోంచి ఒకవ్యక్తి గంభీర స్వరంతో మాట్లాడటం మొదలుపెట్టింది.     ""మైబ్లడ్! మీరంతా ఉత్సాహంగా కబురందగానే వచ్చినందుకు, మీకిదే రక్తభినంధనం. ముందుగ ఒక హెచ్చరిక. అండర్ వరల్డ్ లో గౌరవప్రదమైన సభ్యులుగా చేరాలంటే ముద్ర వేయించుకోవాలి. ముద్ర వేయించుకోవటం అంటే ప్రమోషన్ అంతే కాదు, వాళ్ళకి పైస్థానం అవలీలగా అందుతుంది. మికింద చాలామంది పనిచేస్తుంటారు. ఈ వరల్డ్ ని మిరే నడిపిస్తారు. అవన్నీ చెప్పి మిలో ఆశలు కల్పించటం లేదు. చేయి అందిస్తున్నాము. చేయి చేయి కలపదల్చుకున్నవారు చేతులెత్తండి.""     ఆ వ్యక్తీ అనంగానే ఆ యిరవై మంది తాలూకా చేతులు పైకి లేచాయి.     ""చాలా సంతోషం. ముద్రకి ముందుగా ఒక్కమాట ముద్ర వేయించుకున్న వాళ్ళు నీనా భేదాలు పాటించకూడదు. చావు అని అజ్ఞ ఇవ్వంగానే చనిపోవాలి. చంపు అనంగానే అది ఎవరు ఏమిటి అని చూడకుండా చంపేయాలి. తల్లిని రేప్ చేయమన్న చెల్లిని రేప్ చేయమన్నా వెనక ముందు చూడకుండా రేప్ చేయాలి. ఇందుకు యిస్తాపడ్డవాళ్ళు చేతులెత్తండి.""     ఆ వ్యక్తీ అనంగానే పద్దేనిమిమంది చేతులు పైకి ఎత్తారు.     ""మీ యిద్దరి సంగతి ఏమిటి?""     ""చవమంటే చస్తాం. చంపమంటే చంపుతాము, తల్లిని రేప్ చేయటం ఏమిటి? పరమ కిరాతకుడు కూడా ఇంతటి దారుణానికి వడిగట్టడు. తల్లి విషయంలో ఆ వుహే నీచం భయంకరం.....""     ""చాలు, ఆపండి. ప్రస్తుతానికి మీ యిరువురిని వెనక్కి తిప్పి పంపిస్తున్నాను. ఆలోచించుకుని మీ ఆమోదం తెలపండి.""     ""మాకు ముద్ర వద్దు ప్రమోషన్ వద్దు. ఇప్పుడు చేస్తున్న పనే చేస్తుంటాము. మాకది చాలు.""     ""మంచిది. మీ మనసులో మాట ముక్కుసూటిగా చెప్పారు. అలాగే కనివ్వంది. ఇంత దూరం వచ్చి వెను తిరిగి వెళ్ళటం....సరే మీ యిష్టం"" ఆ వ్యక్తీ ఆ మాట అని పక్క నున్న అతనితో ""ఒకరికి రెడ్ బటన్ రెండో వారికీ బ్లూ బటన్ యిచ్చి క్షేమంగా పంపించి రా!"" అన్నాడు.     పక్కనున్న తను వాళ్ళిద్దరిని వెంటబెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.     వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు.     రెడ్ బటన్ అంటే కరెంట్ షాక్ యిచ్చి చంపటం అని అక్కడ ఎవరికి తెలియదు.     ఆ తర్వాత మళ్ళి కార్యక్రమం మొదలయింది.     ""మీ దేహం మీద నూలుపోగు వుండకూడదు. మీ దుస్తులు విడిచి పులి రక్తం కలిసిన నీటితో కాళ్ళు చేతులు కడుక్కుని అదే నీటితో నోటిని శుభ్రపరుచుకుని ఆపై శరీరమంతా బూడిద పూసుకుని సిద్దంకండి. బూడిద అంటే మామూలు పిడకలు కాల్చిన బూడిద కాదిది. నిండు యవ్వనంలో వున్న అమ్మాయిల.....కాల్చిన బూడిద. ఈ బూడిద రాచుకుంటే అద్భుత శక్తి వస్తుంది. ఆ తర్వాత ముద్ర వేయబడుతుంది. ఆ వెంటనే తాగటానికి రెడ్ సూప్ ఇవ్వబడుతుంది. అయిదు రకాల రక్తం మరిగించి నాటుసారాలో కలిపి పులియబెట్టి జంతువుల మదజలాన్ని కలిపి కొన్ని గంటలు చిలకరిస్తే రెడ్ సూప్ తయారవుతుంది. డ్రాకులాకి కూడా లభ్యంకాని రెడ్ సూప్ అద్భుతశక్తి కలది. అమృతాన్ని మించినది. రెడ్ సూప్ తాగితే...." 84,"     నాకు తెలిసే నీకు సాయం చేశానే తప్ప  అపకారం చేయలేదు.      నువ్వు నన్ను గురించి చెడ్డగా అనుకున్నా అది నా దురదృష్టం గానే భావిస్తాను.      నువ్వు  త్వరగా ఇంటికెళ్లు"" అన్నాడు  ప్రశాంత్.      అప్పుడు... అప్పుడు గమనించాడు సూరిబాబు అతని గొంతులో ఏదో అపశృతిని.     .... త్వరగా ఇంటికెళ్లు!     అవును.      ఇన్నాళ్లూలేని తొందర ఇప్పుడెందుకు?      ప్రశాంత్ మొహంలోకి తీవ్రంగా చూశాడు సూరిబాబు.      పెరిగిన గెడ్డం, మాసిన తల, ఎర్రని కళ్లు జేవురించిన మొహం....      సూరిబాబు చూడ్డానికే భయంకరంగా వున్నాడు.      ""ప్రశాంత్!"" సూరిబాబు గొంతు ఖంగుమంది.      ""ఏమిటి?""     ""మా అమ్మ ఎలా వుంది?"" అడిగా డతను.      ప్రశాంత్ కిటికీ దగ్గరగా నడిచాడు.      ""మీ ఇంటికి వెళ్లాను. అప్పుడు గుడికి వెళ్లింది. ""      ""నా చెల్లెలు . కామినీ....?""     ప్రశాంత్ వెనక్కి తిరిగాడు.      బోలెడు నటించాల్సిన సమయం ఆసన్నమైంది.      ""నిన్నే తార వచ్చింది....""     ""దాని సంగతి కాదు అడుగుతున్నది!......""     ""నన్ను చెప్పనీ.,.. తారతో కేసు సెటిల్ చేశాను. అది నిజంగా దొందముండు. ఇరవైవేలు అడిగింది. డబ్బుకోసమే ఇంత నాటకం ఆడిందని నాకిప్పటికి అర్దం అయింది. ఇచ్చేసాను. నీకంటే ఎక్కువా డబ్బు?""     నాకీ భవిష్యత్తుని ప్రసాదించిన దేవుడివిరా నువ్వు!     అహంకారంతో నిన్ను ఎన్నో మాట లన్నాను. అది పోనీ! జరిగిందేదో  జరిగిపోయింది.      నిన్ను ఈ రోజు ఇంటికి పంపిస్తున్నట్టు చెప్పడానికి మీ ఇంటికి వెళ్లాను. అమ్మ గుడి కెళ్లింది.      ఆ సమయంలో ... ""ప్రశాంత్ బుర్ర పాదరసంలా పనిచేస్తోంది.     ""ఉ...... చెప్పరా!""      సూరిబాబు ప్రశాంత్ భుజాలని నొక్కి పట్టుకొన్నాడు.      ""చెప్తాను రా!చెప్పాల్సిన సమయం కూడా ఇది. అమ్మ లేదని చెప్పాను కదా!""      ఇంట్లో కామినీ... బహుశా ఆమె ప్రియు డనుకొంటాను...""     ""ప్రశాంత్"" పళ్లు పటపట కొరికాడు సూరిబాబు....     ""ఆవేశం వద్దు. జరిగింది చెప్తున్నాను. అతనితో కాస్త క్లోజ్ గా కనిపించింది.      నన్ను చూడగానే గబగబ బయటికి వెళ్లిపోయాడు.      వాడ్ని చూస్తే నాకు సదభిప్రాయం కలగలేదు. కామినికి నీ రాక గురించి కూడా చెప్పకుండా వాడెవడని అడిగాను.      ముందు చెప్పడానికి సందేహించింది.      తర్వాత దడబడింది.      చివరికి అతను తనని పెళ్లి చేసుకొంటానన్నాడని చెప్పింది.""      నాకా మాటలు నచ్చలేదు. ఎవడో  పెళ్ళి చేసుకొంటానంటే మాట కలిపేయడమూ, క్లోజ్ గా వుండడమేనా?     నేను  దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తున్నాను కదా!     అందుకే కామినీని మందలించాను.      మరోసారి ఇలాంటివి నా కళ్ళబడకూడదని హెచ్చరించాను.     అఫ్ కోర్స్.. .ఈ రోజునుంచటీ నువ్వు ఎలాగూ ఇంటి దగ్గరే వుంటావు కదా! అన్నీ విషయాలు చూసుకొంటావనుకున్నాను.      కామినీ నేనొచ్చేస్తుంటే కళ్ల నీళ్లు పెట్టుకుని ఈ విషయం 'అన్నయ్యకి' చెప్పకండి "" అని వేడుకొంది రా!      నాకు జాలేసి 'అలాగే' అన్నాను.      ఇవ్వాళ నువ్వు వస్తున్నావి చెప్పి వచ్చేశాను. చీరలు పాతవై పోయినయంటే వెయ్యి రూపాయలు కూడా ఇచ్చి వచ్చాన్రా?.....""      కానీ....""     ""ఉ..... చెప్పరా... చెప్పు... కామినీకి ఏమైంది?"" సూరిబాబు ఉద్రేకంగా అడుగుతున్నాడు.      ""నాకు ఇప్పుడే తెలిసింది. కామినీ ఆత్మహత్య చేసుకొంది.""     సూరిబాబు పక్కనే బాంబుపడినట్లు అదిరిపడ్డాడు.      ""కామినీ!"" అని గుండె తెగిపోయేలా అరిచాడు.  చేతుల్లో మొహాన్ని దాచుకొని బోరుమని ఏడుస్తున్నాడు.      ""పాపం! నువ్వు వస్తున్నావంటే ఎంతో ఆనందపడిందిరా! కానీ ఇంతలోనే ఇంత విషాదం.      ఎవడో కిరాతకుడు కామినీపై అత్యాచారం చేశాడట. ఆ అవమానాన్ని భరించలేక కామినీ చనిపోయిందని అంటున్నారు""     సూరిబాబు మెల్లగా తలెత్తాడు.      ""ఇదంతా నిజమేనా?"" అడిగాడు.      ప్రశాంత్ నటన సఫలమైంది. అతని కళ్లల్లో నీరు నిలిచింది.      ""నాకు ఎంతో బాధగా వుంది రా!""      ఇలాంటి దారుణాలని నేను కళ్ళతో చూడలేను. నేను నీతో రాలేను.      క్షమించరా సూరీ!" 85,"    ""ఇప్పుడు ఇక్కడ నిన్నేమీ ఎవరూ రేప్ చేయటం లేదు. నీ వంటిమీద ఆయుధాలు ఏమన్నా దాచుకున్నావేమోనని తడిమి చూస్తున్నాను. నా జాగ్రత్తలో నేను వుండాలి కదా!"" అన్నాడు అతను.     ""నేను అబద్ధం చెప్పాను. నా వాచీలో కూడా ఏం లేదు. అబ్బ అలా తడమకు. చక్కలిగింతలు పుడుతున్నాయి"" మెలికలు తిరుగుతు అంది పద్మిని.     నీ వాచీలోను ఏం లేదు. నీ బుర్రలోను ఏం లేదు."" ఆ మాట పైకి అని ""ఈ పిల్ల కేసు అర్ధంకాక నా బుర్ర ఖాళీ అవుతున్నది"" అనుకున్నాడు అతను.     ఆ తర్వాత విజయ్ కిరణ్ ముందు గదిలోకి వెళ్ళిపోయాడు.     ""అనవసరంగా ఆలోచిస్తే బుర్ర వేడెక్కుతుంది. తీరుబడిగా రేపు ఆలోచించవచ్చు."" అనుకున్న పద్మిని ప్రియదర్శిని కాళ్ళు నిగడతన్ని ఏ భయం లేకుండా అప్పటికప్పుడే నిద్రాదేవి వడిలోకి జారిపోయింది.                                   28     తెల్లవారింది.     అంతేకాదు అలా అలా ఉదయం పది గంటలు అయింది.     ఉదయాన్నే విజయ్ కిరణ్ వకసారి అరగంటసేపు బైటికి వెళ్ళి వచ్చాడు. వస్తూ వస్తూ బజారునుంచి రెండు పెట్టెలతో సరుకులో ఏవేవో మరీ తెచ్చాడు.     పద్మిని ప్రియదర్శిని కాలికి పొడుగాటి గొలుసు కట్టాడు. అలాగే ఇల్లంతా తిరుగుతున్నది.     మాటల మధ్యలో వకసారి పద్మిని ""చూడుఅబ్బాయ్!"" అంది.     ""నేను నీకు అబ్బాయిలాగా కనిపిస్తున్నానా. కనిపిస్తే మంచిదేగాని ""అబ్బాయ్ దబ్బాయ్"" అని మాత్రం పిలవకు. విజయ్ అని పిలువు లేకపోతే ఏమండీ! అని పిలువు"" అన్నాడు అతను.     ""ఏమండీ అని భర్తను పిలిచినట్లు పిలవడం నాకు రాదు. విజయ్ అని పిలుస్తాను. నన్ను పిల్లాగిల్లా అని మాత్రం పిలవకు. నా పేరు పద్మిని ప్రియదర్శిని. ముద్దుపేరు పప్పి!"" చెప్పింది పద్మిని.     ""ఈ గొలుసు తీసేయకూడదూ! జైల్లో వున్నట్లు వుంది"" పద్మిని ప్రాధేయ పూర్వకంగా అడిగింది.     ""అమ్మా! ఆశ. పారిపోదామనా!"" విజయ్ కిరణ్ అన్నాడు.     ""పారిపోను.మాటిస్తున్నాను!"" అంది పద్మిని.     ""అదేం కుదరదు. నీ నోట్లోంచి నిజమన్నా రావాలి. నీ ప్రవర్తన మీద అనుమానం రాకుండానైనా వుండాలి. అంతవరకూ యింతే!""     ""అయితే యిలా ఎన్నాళ్ళు?""     ""నాకేం తెలుసు!""     ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఉదయం అంతా మాటలు జరిగాయి. అంతేగాని పద్మిని కాళ్ళకి గొలుసు మాత్రం తప్పలేదు.     ఆ ఇంటికి పని మనిషి రాదు. విజయ్ కిరణే ఇంట్లో అన్ని పనులు చేసుకొంటాడు. ఆ ఉదయం టిఫెన్ గా అల్లం పర్చిమిర్చి, బంగాళాదుంపలు, కారెట్ ,టమాటా, ఉల్లిపాయలు, జీడిపప్పు అన్నీ చేర్చి రంగురంగులుగా కానరావటమే కాక తినటానికి మహా రుచికరంగా వున్న ఉప్మా తయారు చేశాడు.     పెసరట్టులోకి ఉప్మా తప్పించి విడిగా ఉప్మా అనే పదార్ధాన్ని పద్మిని వాళ్ళింట్లో ఎప్పుడూ చేయరు. ఈ రకమైన కలర్ ఫుల్ ఉప్మాని చూడటం ఇదే మొదటిసారి ఆమెకి.     ""దీని పేరేంటి?"" పద్మిని అడిగింది ప్లేటులో ఉన్న ఉప్మాని స్పూన్ తో కదులుతూ.     ""ఇదేమిటో తెలీదా!"" అడిగాడు విజయ్ కిరణ్.     ""ఉహు. నేనెప్పుడూ చూడలేదు."" అంది పద్మిని.     ""దీని పేరు ఉప్మా. దీని మొహం కూడా నీవు ఎరగవంటే నీవు రోజూ ఏం తింటున్నావో, అసలు నీవు ఏమిటో? చచ్చినా నాకు అర్ధం కావటం లేదు. ఉప్మా కూడా తెలీదా? లేక ఇదో నాటకమా?"" కోపంగా అడిగాడు అతను.     ""మా యింట్లో పెసరట్టులోకి మాత్రమే ఉప్మా చేస్తారు. అదిట్లా ఇంద్ర ధనుస్సు రంగులతో ఉండదు. తెల్లగా ఉంటుంది. దీన్ని ఉప్మా అంటే నేను ఛస్తేనమ్మను"" అంది పద్మిని.         ఒళ్ళు చిర్రెత్తుకొచ్చింది విజయ్ కిరణ్ కి. ""మీ యింట్లో ... నువ్వు చేస్తావా తల్లీ! మీ వంటవాడు చేస్తాడా! పెసరట్టులోకి ఉప్మా..."" ఉప్మా అనే మాటని నొక్కి పలుకుతూ అన్నాడు.     ""ఛీ... తను అనవసరంగా నోరు జారింది."" అనుకొన్న పద్మిని మారు మాట్లాడకుండా తలకాయొంచుకొని ఉప్మా తింటూ కూర్చుంది. రూపానికి తోడు తినడానికి కూడా మహా రుచిగా ఉంది. ""రంగుల ఉప్మా చాలా బాగుంది"" మెచ్చుకోలుగా అంది పద్మిని.     ""నీ మెచ్చుకోలు నాకేం అక్కరలేదు అన్నట్టు అటు తిరిగి చూడకుండానే 'ఊ' కూడా కొట్టకుండానే కాఫీ కలుపుతూ వుండిపోయాడు అతను.     ఊరుకున్నది ఊరుకోవచ్చుకదా. అలా ఊరుకునే రకం కాదు పద్మిని. 'ఇంత బాగా వంటచేయడం ఎక్కడ నేర్చుకున్నావ్?"" అంది.     ""నేను వంట ఎక్కడ నేర్చుకుంటేనేమిలే! నాకు వంట చేయటం వచ్చు. వంట చేయించటంకూడా వచ్చు"" కాఫీ కప్పు అందిస్తూ చెప్పాడు అతను.     అతనన్న మాటకి అర్ధం అప్పుడు తెలీలేదు పద్మిని ప్రియదర్శినికి.     ఉదయం పదిన్నర వేళ.     ""ఈపూట నీవు వంట చేస్తున్నావ్"" అన్నాడు విజయ్ కిరణ్.     ""నేను వంట చేయటమా! మా యింట్లో చేయలేదు. అచ్చెమ్మ దగ్గర చేయలేదు. ఆంటీ దగ్గరా చేయలేదు. నేనసలెప్పుడూ కిచెన్ ఛాయలకే వెళ్ళలేదు"" పద్మిని చెప్పింది.     ""అచ్చెమ్మెవరు? ఆంటీ ఎవరు?"" టక్కున అడిగాడు అతను.     ""నీకనవసరం"" అంది పద్మిని.     ""అంతేలే. అవన్నీ నాకనవసరమే. నీ చేత వంట చేయించటం మాత్రమే ప్రస్తుతం అత్యవసరం. నన్ను రివాల్వర్ తో బెదిరించి నా యింటిదాకా నా కారులోనే తీసుకొచ్చి కాలుమీద కాలేసుకుని దర్జాగా కూర్చుని నా చేత వంట చేయించి సర్వం పీకలదాకా పట్టించి 'ఏ చెత్తయినా తింటాను' అని రాత్రి ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడావ్? ఆ చెత్తనే ఇప్పుడు నీచేత చేయిస్తాను చూద్దువుగాని.""     ""నాకు వంట చేయటం రాదంటూంటే"" దీర్ఘం తీసింది పద్మిని.     ""నే చేయిస్తానుగా"" అంతకన్నా దీర్ఘంతీస్తూ చెప్పాడు అతను.     అతనిముందు పద్మిని ఆటలు సాగలేదు. కూరకోసం వంకాయల్ని ముక్కలుగా తరిగించాడు. పప్పులుసులోకి ఉల్లిపాయల్ని తరిగించాడు. దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగించాడు. అన్నీ దగ్గరుండి చేయించాడు. అది నాటకమో! నిజమో! విజయ్ కిరణ్ కి అర్ధంకాలేదు. 'కూర తరగటం అనేది మహా అవస్థ పడిపోతూ చేసింది. ఉల్లిపాయ తరిగేటప్పుడు కళ్ళ వెంబటి నీళ్ళు వస్తుంటే ఆ చేతులతోనే తుడుచుకుంది. దాంతో మరింత భగ్గున మండాయి కళ్ళు. మూతీ ముక్కు తుడుచుకుంటూ, చేతులకి చిన్న చిన్న గాయాలు చేసుకుంటూ పది నిమిషాలలో చేయాల్సిన పనిని సరీగ గంటసేపు కష్టపడి చేసింది పద్మిని." 86,"     ""కాదనకు చంద్రం, వెళ్ళు. పెద్దవాళ్ళను చిన్నబుచ్చకు. అది నీకు మంచిది కాదు."" ప్రకాశం అన్నాడు.     కాంతమ్మా, కృష్ణారావూ, ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతకాలం వాళ్ళు ప్రకాశమే చంద్రాన్ని ఇంటికి రానివ్వటంలేదనే అపోహలో ఉన్నారు. వారి అపోహకు లోలోనే సిగ్గుపడ్డారు.     ""ప్రకాశం! ఇకనుంచి నువ్వుకూడా మాతోనే ఉండిపోవాలి."" కృష్ణారావు అన్నాడు.     చంద్రం ఆశ్చర్యంగా అన్నవైపూ, ఆశగా ప్రకాశం వేపూ చూశాడు. చంద్రం దృష్టిలో కృష్ణారావు ఆ ఒక్క మాటతో ఎంతో ఎత్తు పెరిగాడు.     ""మీ సహృదయతకు కృతజ్ఞుణ్ణి, రాకుండా ఎక్కడకు వెళతాను? రోజూ చంద్రం కోసం వస్తూనే ఉంటాను"" అన్నాడు ప్రకాశం సవినయంగా.     ""మరి బయలుదేరదామా?"" చంద్రాన్ని ప్రశ్నించాడు కృష్ణారావు.     ""ఇవ్వాళకాదు, రేపు వస్తాను. ఇప్పుడు ప్రకాశం విజయవాడ వెళుతున్నాడు. రేపు మూడుగంటలకు వస్తాడు. రేపు