inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పండుగ సీజన్ తర్వాత మొదటిసారిగా భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపించినప్పటికీ.థర్డ్ వేవ్ మొదలైనప్పటినుంచి మొదటిసారి దేశంలో రోజు వారీ పాజిటివ్ కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. దేశంలో 24గంటల్లో 3,17,532 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 491 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ లో తెలిపింది.ఇండియాలో జనవరి 19 నాటికి 19,24,051 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 5.03గా ఉందని కేంద్రం తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.41 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 82 లక్షల 18వేల 773 కేసులు నమోదయ్యాయి. 4లక్షల 87వేల 693 కరోనా మరణాలు సంభవించాయి.దేశంలో ప్రస్తుతం 93.69 శాతంగా కరోన రికవరీ రేటు ఉన్నట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 2,23,990 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 3కోట్ల 58లక్షల 7వేల 29 మంది రికవరీ అయ్యారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'మొదటిసారిగా భారీగా పాజిటివ్ కేసులు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్లో ఇండియాకు మరో జలక్ తగిలింది. 69-75 కిలోల మహిళల బాక్సింగ్ బౌట్లో. పూజా రాణి ఓటమి పాలైంది. క్వార్టర్స్లో చైనా బాక్సర్ లీ క్వియాన్ చేతిలో 5-0 తేడాతో మ్యాచ్ను చేజార్చుకున్నది. పూజా రాణి ఓటమి భారత్కు నిరాశనే మిగ్చిలింది. చైనా బాక్సర్ లీ. మూడు రౌండ్లలోనూ దూకుడు ఆటను ప్రదర్శించింది. భారీ పంచ్లతో పూజాను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో అయిదుగురు జడ్జీలు చైనా బాక్సర్కే మొగ్గు చూపారు. పూజా రాణి చాలా పేలవమైన ఆటను ఆడింది. ఎక్కడా అటాక్ చేసినట్లు కనిపించలేదు. దీంతో ఆమె మెడల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'టోక్యో ఒలింపిక్స్: బాక్సర్ పూజా రాణి ఔట్'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: మధ్యప్రదేశ్ కరోనా అప్డేట్
మధ్యప్రదేశ్లో 108 కొత్త కేసులను గుర్తించిన తర్వాత గురువారం నాటికి కోవిడ్-19 సంఖ్య 10,52,558కి పెరిగిందని, అయితే రాష్ట్రంలో ఇన్ఫెక్షన్తో సంబంధం ఉన్న తాజా మరణాలు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.రాష్ట్రంలోని 100 పరీక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు 1.8 శాతంగా నమోదయ్యాయి.రికవరీ సంఖ్య 107 పెరిగి 10,41,095కి చేరుకుంది, రాష్ట్రవ్యాప్తంగా 699 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారిక సమాచారం.5,906 శుభ్రముపరచు నమూనాలను పరిశీలించగా, రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 2,98,26,717 కు చేరుకుందని ఆయన తెలిపారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ఢిల్లీ, ముంబైలకు ఒకేసారి నైరుతి,1961 తర్వాత ఇలా మరోసారి
దేశంలో తాజాగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే కాస్త ఆలస్యమైనా నైరుతి రుతుపవనాలు దేశమంతటా క్రమంగా విస్తరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబయిలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ రెండు నగరాలను రుతుపవనాలు ఏకకాలంలో తాకడం అరుదుగా జరుగుతుంది. షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందు ఢిల్లీని. రెండు వారాల ఆలస్యంగా ముంబయిను నైరుతి రుతుపవనాలు తాక్కినట్టు భారత వాతావరణ విభాగం ఆదివారం వెల్లడించింది. ఆరు దశాబ్దాల కిందట ఇలా జరిగిందని, చివరి సారిగా 1961 జూన్ 21న ఢిల్లీ, ముంబయి నగరాల్లోకి ఒకే రోజున రుతుపవనాలు ప్రవేశించినట్టు పేర్కొంది. ‘నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి. ముంబయి సహా మహారాష్ట్ర మొత్తం విస్తరించాయి. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీతో పాటు హరియాణా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లోనూ విస్తరించాయి. వచ్చే రెండు రోజుల్లో మరింత ముందుకు కదలి మిగతా ప్రాంతాలకు చేరుకుంటాయి’ అని ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర అన్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో ఎండ వేడిమి నుంచి వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ, గురుగ్రామ్లోని వివిధ ప్రాంతాలలో వర్షం నీరు నిలిచిపోయింది. గత 24 గంటల్లో ముంబయి, చుట్టపక్కల ఏకధాటిగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం వరకూ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి అంధేరీ, మలద్, దాషిర్లు ముంపు బారినపడ్డాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, పాల్ఘర్, ముంబయి, థానే, సింధుదుర్గ్లకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంగళవారం గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కుక్క కాటుతో బాలుడు మృతిచెందడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు. కుక్కల బెడద నుంచి హైదరాబాద్ ప్రజలను, పిల్లలను కాపాడాలని కోరారు. దీనిపై మినిస్టర్ కేటీఆర్, హైదరాబాద్ కమిషనర్ స్పందించాలని ఆయన కోరారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇకనైనా స్పందించి కుక్కలను అడవుల్లో వదిలేయాలన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'కుక్కల దాడి ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: 8న శిల్పారామంలో హోలీ వేడుకలు
తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో 8న హోలి సంబరాలను నిర్వహించనున్నట్టు ఏఓ ఖాదర్ వలి ఆదివారం సాయంత్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇందులో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆహ్లాదం కలిగించేలా వివిధ సాంస్కృతిక, ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రసాయనాలు లేని రంగుల ద్వారా నిర్వహించే సంబరాల్లో అందరూ పాల్గొనాలని కోరారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: డిగ్రీ కోర్సును నాలుగేళ్లకు పెంచి సరైన ప్రమాణాలు పాటించకుండా డిగ్రీ వ్యవస్థను ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్చంద్ర శేషు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం ఏదైనా ఒక నూతన విధానాన్ని ప్రవేశపెడితే అది సమాజానికి ఉపయోగపడుతూ ఒక అడుగు ముందుకు వేసేలా ఉండాలి కానీ ఒక తరం వెనక్కి పోయే మాదిరిగా ఉండకూడదని హితవుపలికారు. గతంలో జూన్, జూలైలో సీట్లను భర్తీ చేసి. విద్యాసంవత్సరాన్ని మరల ఏప్రిల్, మే కి పూర్తి చేసేవారు. కానీ ఈ ప్రభుత్వం అక్టోబర్లో కౌన్సిలింగ్ నిర్వహించడం అంటే అకడమిక్ ఇయర్ను పూర్తిగా నాశనం చేయడమే అని మండిపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి అయితే ప్రభుత్వ కళాశాలలో కేవలం 36% సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'డిగ్రీ కోర్సు ని నిర్వీర్యం చెయ్యకండి'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గత నెల 21వ తేదీ నుంచి చేపట్టిన ఓటర్లు జాబితా ఇంటింటి సర్వే ప్రక్రియ ఇప్పటివరకు 91. 84 శాతం పూర్తయింది. మరో మూడు రోజుల్లో 100% పూర్తవుతుంది అని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షన్మోహన్ అన్నారు. శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు జేసీలు వీఆర్వోలతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'వందశాతం ఓటర్ సర్వే పూర్తి: కలెక్టర్'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: మలయాళ రచయిత్రి మరియు సామాజిక కార్యకర్త దేవకీ నిలయంగోడ్ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో గురువారం మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆమె వయసు 95. సమాజంలోని సనాతన ఆచారాలకు వ్యతిరేకంగా ఆమె అలుపెరగని పోరాటానికి పేరుగాంచిన నిలయంగోడ్ తోటి బ్రాహ్మణ మహిళల హక్కుల కోసం ఎల్లప్పుడూ నిలబడింది.ఆమె 1928లో ఉత్తర మలప్పురం జిల్లాలో సంప్రదాయ నంబూతిరి కుటుంబంలో జన్మించింది.అనేక అసమానతలతో పోరాడిన తర్వాత ఆమె తన జీవితంలోని తరువాతి సంవత్సరాలలో రచయితగా ప్రాముఖ్యతను పొందింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'మలయాళ రచయిత్రి దేవకీ నిలయంగోడ్ కన్నుమూత'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: పెరిగిన చలి తీవ్రతతో తెలంగాణలో విద్యుత్ రోజువారీ డిమాండ్ భారీగా పడిపోయింది. గత సంవత్సరం డిసెంబర్ లో గరిష్ఠంగా 8,508 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, ఈ సంవత్సరం అది 8,502 మెగావాట్లకు తగ్గింది. వ్యవసాయానికి 24 గంటలూ కరెంట్ ఇవ్వడం ప్రారంభించిన తరువాత, గతేడాది డిమాండ్ ను మించకపోవడం ఇదే తొలిసారి. పెరిగిన చలి, అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా, ఏసీల వాడకం దాదాపు నిలిచిపోగా, గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా తగ్గింది. భూగర్భ జలాలు తగ్గడం వల్ల కూడా విద్యుత్ వినియోగం తగ్గిందని, దీని కారణంగా యాసంగి పంటల సాగు సంతృప్తికరంగా సాగడం లేదని అధికారులు అంచనా వేశారు. విద్యుత్ కు డిమాండ్ తగ్గడంతో డిస్కంలకు ఆర్థికంగానూ వెసులుబాటు కలుగుతోందని తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. ఛత్తీస్ గఢ్ లోని మార్వా ప్లాంట్ల నుంచి తెలంగాణకు రోజుకు 1000 మెగావాట్ల విద్యుత్ రావాల్సి వుండగా, బొగ్గు కొరత కారణంగా 500 మెగావాట్లలోపే వస్తున్నా, విద్యుత్ కు కొరతలేదని అన్నారు. కాగా, నిన్న ఆదిలాబాద్ లో 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరిగి 19 డిగ్రీలకు చేరింది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'తెలంగాణలో వణికిస్తున్న చలి'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఆగస్టు 7 నుంచి ఆకాశ ఎయిర్ సర్వీసులు ప్రారంభం
దేశవ్యాప్తంగా విమాన సేవలు అందించేందుకు మరో కొత్త సంస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్టాక్ మార్కెట్ మదుపరి రాకేశ్ ఝున్ఝున్వాలా మద్దతు ఉన్న ఆకాశ ఎయిర్ (Akasa Air) ఆగస్టు 7నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.తమ తొలి సర్వీసును ముంబయి-అహ్మదాబాద్ మధ్య నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే టికెట్ బుకింగ్లు ప్రారంభించినట్లు తెలిపింది. ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య కూడా సేవలు ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్ (Akasa Air) ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి కూడా టికెట్లు ఇప్పటి నుంచే బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో తమ వాణిజ్య కార్యకలాపాలకు కంపెనీ శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఒక విమానం భారత్కు చేరుకుంది. మరొకటి ఈ నెలాఖరు వరకు కంపెనీ చేతికి అందనుంది. దశలవారీగా ఇతర నగరాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తామని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. ఈ ఏడాది ప్రతినెలా తమ కంపెనీకి రెండు కొత్త విమానాలు అందుతాయని పేర్కొన్నారు. విమానయాన నియంత్రణా సంస్థ డీజీసీఏ నుంచి ఈ నెల 7న ఆకాశ ఎయిర్ (Akasa Air) 'ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్' (AOC) అందుకుంది. మొత్తం 72 మ్యాక్స్ విమానాల కోసం కంపెనీ గత ఏడాది నవంబరులో బోయింగ్తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొంది.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
బిజెపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సివిల్స్ పరీక్షలు రద్దు చేయడం పట్ల నిరుద్యోగులకు మద్దతుగా శనివారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల బిజెపి నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో మహ్మదాబాద్ మండల బిజెపి అధ్యక్షుడు కృష్ణ, నారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: న్యూఢిల్లి : సభను వాయిదా వేసే అధికారం సభాపతికి ఉంటుందని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. నిన్న సభలో అస్సాం ఎన్ఆర్సి అంశంపై చర్చ సందర్భంగా అమిత్షా చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీయడంతో సభను నేటికి వాయిదా వేశారు. దీనిపై నేడు రాజ్యసభలో వెంకయ్య మాట్లాడుతూ సభను వాయిదా వేసే హక్కు సభాపతికి ఉంటుందన్నారు. దీనికి సంబంధించి అనేక ఉదాహరణలున్నాయని ఆయన చెప్పారు. సభను వాయిదా వేయడంలో సభాపతికి విచక్షణాధికారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సభను నిర్వహించడంలో సభ్యుల సహకారం అవసరమన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'సభను వాయిదా వేసే అధికారం సభాపతిదే : వెంకయ్యనాయుడు'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు మొత్తం 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైంస్లాట్, సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.
1
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: తిత్లి తుపాన్ తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రధానికి, గవర్నర్కు తుపాన్ తీవ్రతను తెలియజేస్తామని ఆయన అన్నారు. కేంద్రాన్ని సహాయం అడగడంలో కూడా ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆయన అన్నారు. ప్రచారానికి ఇది సమయం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతులందరికీ రుణ మాఫీ చేయాలని ఆయన కోరారు. తుపాన్ వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని, అప్రమత్తంగా వ్యవహరించలేదని, కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించుకోలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'తిత్లి తుపాన్ తీవ్రతపై ప్రధానికి లేఖ రాస్తా : పవన్ కల్యాణ్'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సోదరుడు జలగం రామారావు (94) మంగళవారం హైదరాబాద్ లో కన్నుమూశారు. నేవీలో కెప్టెన్ గా విధులు నిర్వర్తించిన ఆయన ఉమ్మడి జిల్లా వాసులకు సుపరిచితులు. ఆల్ ఇండియా వెలమ సంఘం అధ్యక్షుడిగా, పర్యావరణ సంఘం సభ్యుడిగా గతంలో సేవలందించారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం అంకంపాలెం, పట్వారి గూడెంల్లో భూములు కోల్పోయిన గిరిజనుల పక్షాన పోరాడి తిరిగి ఇప్పించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'కెప్టెన్ జలగం రామారావు మృతి'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: తాడిపత్రి మండల పరిధిలో ఊరిచింతల గ్రామంలో విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆదినారాయణ (32) గురువారం మృతిచెందాడు. తాడిపత్రి గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపిన వివరాల మేరకు. ఆదినారాయణ ఆర్థిక ఇబ్బందుల వల్ల విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించగా. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్పై భారత్ 3-1తో విజయం
శుక్రవారం జరిగిన పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు శత్రువైన పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 3-1 తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. మ్యాచ్ 9వ నిమిషంలో వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా 1-0 ఆధిక్యం సాధించారు. హర్మన్ప్రీత్ సింగ్ (9', 53') మరియు అనుభవజ్ఞుడైన స్ట్రైకర్ ఆకాశ్దీప్ సింగ్ (42') చేసిన గోల్స్ 2016లో ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ను గెలుచుకుని, ఉమ్మడి విజేతలుగా నిలిచిన భారత్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో టైటిల్ కోసం పోటీలో కొనసాగేలా చేసింది.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: జగిత్యాలలోని వాసవి ఫంక్షన్ హాల్ లో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవార్ల నామములతో 18 శక్తి రూపంలో ప్రతిష్ట, దుర్గా చండిక అమ్మవారి ప్రతిష్ట మహాదేవ్ శక్తి సంస్థాన్ నిర్వహణలో శివరాజయోగి కృష్ణ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగింది. అష్టాదశ శక్తి పీఠాలు అనేది ఇక్కడి ప్రత్యేకత. ఈ తొమ్మిది రోజులు కూడా నిత్య చండీ హోమం, పారాయణం, అన్నదానం, కుండలినీ ధ్యానం, సంకీర్తన, కుంకుమార్చన మరియు పుష్పార్చన క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. 9 రోజుల దుర్గా భవాని దీక్ష తీసుకున్న వారికి శివరాజ యోగి కృష్ణ స్వామిజీ వారి దివ్య కర కమలముల చేత మాల ధారణ జరిగింది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'అష్టాదశ శక్తి పీఠాలతో దుర్గా చండిక అమ్మవారి ప్రతిష్ట'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో కామన్ వెల్త్ గేమ్స్ లో మహిళా అధ్లెట్ల ప్రదర్శన గొప్పగా ఉందని ప్రశంసించడం గర్వంగా ఉందని కామన్ వెల్త్ గేమ్స్-2018 రెజ్లింగ్ సిల్వర్ మెడలిస్ట్ బబితా పోగట్ పేర్కొంది. గతంలో ఏ ప్రధానీ ఇలా మాట్లాడలేదని ఆమె పేర్కొంది. మోడీ ప్రశంసించడం మహిళా అధ్లెట్లకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని బబితా పోగట్ పేర్కొంది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'మహిళా అథ్లెట్ల గురించి మోడీ మాట్లాడటం గర్వంగా ఉంది : బబితా పోగట్'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి: శ్రీకాకుళం జిల్లాలో వర్షాలపై హై అలర్ట్ ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'శ్రీకాకుళం జిల్లాలో హై అలర్ట్!'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఢిల్లీలో చాలా పేలవంగా గాలి నాణ్యత !
ఢిల్లీ NCR యొక్క ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేటిక్స్ (AQI) గత కొన్ని రోజులుగా పేద విభాగంలోనే ఉంది. పొగమంచు కారణంగా రాజధానిలో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఘజియాబాద్లోని AQI చాలా రోజులుగా రెడ్ జోన్లో ఉంది, ఈ ఉదయం ఆరెంజ్ జోన్లోకి వచ్చింది. మేము నేటి AQI గురించి మాట్లాడినట్లయితే, ఢిల్లీ యొక్క AQI 350 రెడ్ జోన్లో వస్తుంది. గ్రేటర్ నోయిడాలో 298, ఘజియాబాద్లో 277, నోయిడాలో 289 ఉన్నాయి.నిరంతర పేలవమైన AQI గురించి ABP UPPCB అధికారులతో మాట్లాడినప్పుడు, ఒక అధికారి శీతాకాలంలో గాలి ప్రవాహం ఆగిపోతుందని మరియు దీని కారణంగా ఒక చోట స్తబ్దత కారణంగా గాలి భారీగా మారుతుందని చెప్పారు. దీని కారణంగా AQI పెరుగుతుంది. సాధారణంగా, గాలి యొక్క స్వచ్ఛతను AQI ద్వారా కొలుస్తారు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: పొట్ట ఉబ్బర సమస్యలను తగ్గించే పోషకాహార చిట్కాలు
పోషకాహార నిపుణులు పాటించే చిట్కాలు ఆరోగ్యంగా మరియు బరువు తగ్గించే విధంగా ఉంటాయి. పొట్టలో కలిగే ఉబ్బారాన్ని తగ్గించే సూచనల గురించి కింద పేర్కొనబడ్డాయి.వేటికి దూరంగా ఉండాలి?శరీరంలో నీటిని నిల్వ ఉంచే ఆహార పదార్థాలకు అనగా- సంవిధానపరచిన ఆహారాలు, సాల్ట్ షేక్స్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, చక్కెర అధికంగా గల లేదా ఆల్కహాల్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండాలి. వీటితో పాటుగా వాయువులతో నిండి ఉండే కార్బోనేటేడ్ ద్రావణాలు పొట్ట ఉబ్బినట్టుగా అనిపించేలా చేస్తాయి. కావున ఇలాంటి ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.అల్పాహారం తరువాత తీసుకోవలసిన ఆహారాలురోజులో ఉదయం కలిగిన నీటిని తాగటం వలన మంచి అనుభవానికి లోనవటమే కాకుండా, పొట్ట ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఎక్కువగా నీటిని తాగటం వలన శరీర వ్యవస్థలో ఉండే హానికర మరియు విష పదార్థాలు భయటకు పంపబడతాయి. అల్పాహారం చేసే అలవాటు ఉంటే, అల్పాహార సేకరణ తరువాత ప్రోటీన్ అధికంగా గల ద్రావణాలను తీసుకోండి. ఉదాహరణకు- ఉదయాన ఉడికించిన గుడ్లతో పాటు ఒక గ్లాసు నారింజ రసాన్ని తాగండి. ఉదయాన గ్రీన్ టీ తాగటం వలన వీటిలో ఉండే కెఫిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీర జీవక్రియ వేగంగా మారేలా సహాయపడతాయి.మధ్యాన్న భోజనానికి ముందు స్నాక్స్ విత్తనాలు మరియు గింజలు పొట్ట చదునుగా మారుటకు సహాయపడతాయి. పెకాన్ కాయలు అధిక మొత్తంలో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటాయి. తాజా అల్లం ముక్కలను నీటిని కలిపి తాగటం వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడి, వ్యర్థ పదార్థాలు భయటకి పంపబడతాయి.మధ్యాన్న భోజనలో తినాల్సినవి & తినకూడనివిఉడికించిన ఆకుకూరలలో ఉండే వివిధ రకాల సమ్మేళనాలు ప్రోబయాటిక్ గుణాలను కలిగి ఉండి, జీర్ణాశయ వ్యవస్థను సజావుగా జరిగేలా చేస్తాయి. సాల్మాన్ చేపలలో ఉండే అధిక ప్రోటీన్ మరియు ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు, శరీర బరువు తగ్గించుటలో సహాయపడతాయి.ఉబ్బరాన్ని తగ్గించే రాత్రి భోజనాలుడాండలియన్ శరీరానికి డై యూరేటిక్ గా పని చేసి, శరీరంలో ఉండే అదనపు నీటిని భయటకు పంపుతాయి. ఆకుపచ్చని కూరగాయలను తినటం వలన శరీరం నిర్విశీకరణకు గురవుతుందని ఆధారాలున్నాయి. వీటితో పాటుగా, ప్రోటీన్ లను ఎక్కువగా తినటం వలన పొట్టలో కలిగే ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: హెల్మెట్ కు సీసీటీవీ కెమెరా
బైక్ పై వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆ సమాచారాన్ని లోకేషన్ సహా కుటుంబ సభ్యులకు చేర వేసేలా రిధిమా ఠాకుర్ అనే పదో తరగతి విద్యార్థిని స్మార్ట్ హెల్మెట్ రూపొందించింది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఈమె ఈ హెల్మెట్ ను రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శనకు ఉంచింది. హెల్మెట్ మర్చిపోయినా, ధరించకపోయినా బీప్ అనే శబ్దం వస్తుంది. ఇందులో లొకేషన్ ట్రాకర్, ట్రాన్స్ మీటర్ వంటి ఫీచర్లూ ఉన్నాయి.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: దేవరపాళెం శివారు నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర
నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 80వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 80వ రోజు పాదయాత్రను దేవరపాళెం శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర జొన్నవాడ, పెనుబల్లి, సాల్మాన్పురం, బుచ్చిరెడ్డిపాళెం మీదుగా అన్నారెడ్డిపాళెం క్రాస్ వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా బుచ్చిరెడ్డిపాళెంలో జగన్ బహిరంగసభ నిర్వహించనున్నారు.
1
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: ఏ భాషనూ బలవంతంగా రుద్దలేరని ప్రముఖ నటుడు రజనీకాంత్ అన్నారు. దేశ భాషగా హిందీని అమలు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చేసిన ప్రకటనపై గళమెత్తిన వారితో రజనీకాంత్ తన గొంతు కూడా కలిపారు. ”ఏ భాషను బలవంతంగా రుద్దలేరు. దక్షిణ భారతదేశం, ఉత్తర్ భారత దేశం కూడా ఒక కామన్ లాంగ్వేజిని అంగీకరించవు” అని రజనీకాంత్ అన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ఏ భాషనూ బలవంతంగా రుద్దలేరు : రజనీకాంత్'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ఏపీలో విస్తారంగా వర్షాలు...కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం
ఏపీలో మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ రాయలసీమలో వర్షాలు పడతాయని, నేటి రాత్రి, రేపు వేకువజామున కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించారు. అత్యధిక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇదిలావుంటే విజయవాడలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. అటు తెలంగాణలో కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసు
శుక్రవారం నాడు రైతు జేఏసీ కామారెడ్డి జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్ లో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడికి యత్నించిన బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 8 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి బండి సంజయ్ ను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. సంజయ్ అరెస్టు పట్ల తరుణ్ చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
బనగానపల్లె ట్టణంలోని ఈద్గా నగర్ కాలనీకి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆదృశ్యమైనట్లు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంకర్నాయక్ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు బుధవారం పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థి తిరిగి ఇంటికి రాలేదనీ చెప్పారు. స్నేహితులు, బంధువుల వద్ద విచారిం చిన ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: (అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి) : రాజధాని నలుమూలలనూ పరస్పరం అనుసంధానించి, అమరావతి అభివద్ధికి చోదకశక్తులుగా విరాజిల్లబోతున్న ఫేజ్-1 రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇందులోని సీడ్ యాక్సెస్, 7 ప్రాధాన్య రోడ్ల ఏర్పాటు పనులు ప్రస్తుతం సాగుతున్న తీరునుబట్టి చూస్తే కొద్ది నెలల్లోనే ఈ 8 రహదారులూ పూర్తయి, తమ సేవలను అందించేందుకు సిద్ధమవుతాయని భావిస్తున్నారు. అమరావతి అభివ ద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయించేందుకు దాని అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీల సిబ్బంది కృషి చేస్తున్నారు. సాధ్యమైనంత వరకూ నేరుగా మొత్తం పొడవు 84.49 కి.మీ., నిర్మాణ వ్యయం రూ.1306.50 కోట్లుగా ఉన్న ఈ ఫేజ్-1 రోడ్లను ప్రధానంగా 2 విభాగాలుగా విభజించవచ్చు. ఇవి- సీడ్గ యాక్సెస్ రోడ్డు, 7 సబ్ ఆర్టీరియల్ రోడ్లు. వీటిల్లో సీడ్ యాక్సెస్ రోడ్డును 8 వరుసలతో నిర్మించనుండగా, సబ్ ఆర్టీరియల్ రోడ్లలోని ఈ-8, ఎన్-9లను 6 లేన్లు (వీటిల్లో 2 బీఆర్టీఎస్ కోసం), మిగిలిన ఎన్-4, ఎన్- 14, ఎన్-16, ఈ - 10, ఈ-14లను 4 వరుసలతో ఏర్పాటు చేస్తున్నారు. తదనుగుణంగా వీటి వెడల్పు 60 మీటర్ల నుంచి 40 మీటర్ల మధ్య ఉంటుంది. ఇవన్నీ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సాధ్యమైనంత వరకూ మలుపులు లేకుండా రూపుదిద్దుకుని, ఎక్స్ప్రెస్ వేలను తలపించనున్నాయి. మధ్యలోనూ, ఇరుపక్కలా అలరించే పచ్చదనం, సైక్లింగ్ ట్రాక్లతోపాటు కొన్నింటికి బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (బీఆర్టీఎస్) కోసం ప్రత్యేక లేన్లు ఉంటాయి. రాజధానికి వెన్నుముక సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ ఫేజ్- 1 రోడ్లన్నింట్లో అత్యంత ప్రధానమైనదిగానూ, రాజధానికి జీవనాడిగానూ అభివర్ణించబడుతున్న సీడ్గ యాక్సెస్ రోడ్డును వాస్తవానికి కనకదుర్గమ్మ వారధి నుంచి దొండపాడు వరకూ నిర్మించాల్సి ఉండగా, భూసేకరణ ఇత్యాది సమస్యల కారణంగా ప్రస్తుతం వెంకటపాలెం- దొండపాడుల మధ్య 18.27 కిలోమీటర్ల మేర మాత్రమే నిర్మిస్తున్నారు. వారధి- వెంకటపాలెం మధ్య భాగాన్ని (3.03 కి.మీ.) భూసేకరణ పూర్తయిన అనంతరం చేపట్టనున్నారు. ప్రఖ్యాత ఇంజినీరింగ్ సంస్థ ఎన్.సి.సి. ఈ 18.27 కిలోమీటర్ల పొడవున రోడ్డును నిర్మిస్తోంది. దీని అంచనా వ్యయం రూ.215.15 కోట్లు. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన దీని నిర్మాణం వివిధ కారణాల ద ష్ట్యా మొదట్లో కొంత ఆలస్యమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హెచ్చరికలు, ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి నిరంతర పర్యవేక్షణతో ఈ మధ్యకాలంలో ఊపందుకుంది. ఒక్క లేయర్ మినహా దీని నిర్మాణం పూర్తయిందని రాష్ర్ట పురపాలక శాఖ మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ తెలిపారు. అయితే కొద్ది చోట్ల భూసమీకరణ జరగనందున పనులు ఆగాయని, 45 రోజుల్లో ఆ సమస్యలను పరిష్కరించి, కొద్ది నెలల్లోనే వెంకటపాలెం- దొండపాడుల మధ్య సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేయనున్నామని చెప్పారు. వారధి నుంచి వెంకటపాలెం మధ్య నిర్మించాల్సిన ఈ రహదారి 2వ భాగపు పనులను కూడా సాధ్యమైనంత త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. పాపిట రేఖలా ప్రాధాన్య రహదారులు. ఈ 7 ప్రయారిటీ రోడ్లు (సబ్ ఆర్టీరియల్) సైతం చురుగ్గా నిర్మితమవుతున్నాయి. రాజధానిలోని వివిధ ప్రదేశాలను ఒకదానికొకటిని కలుపుతూ, అదుేత అంతర్గత రవాణా వ్యవస్థ ఏర్పాటవడంలో వీటిదే ప్రధాన ప్త్రా. వీటిల్లో 3 తూర్పు- పడమరల మధ్య, మిగిలిన 4 ఉత్తరం- దక్షిణ దిశల మధ్య సాగనున్నాయి. వీటన్నింటి మొత్తం పొడవు 66.22 కిలోమీటర్లు, నిర్మాణ వ్యయం రూ. 1091.35 కోట్లు. వీటిని 4 ప్యాకేజీలుగా విడగొట్టి, టెండర్లు పిలవగా వేర్వేరు సంస్థలు దక్కించుకున్నాయి. ప్యాకేజీ-1లో ఉన్న ఈ- 8 వెంకటపాలెం నుంచి నెక్కల్లు వరకు వెళ్తుంది. దీని పొడవు 13.65 కి.మీ. ఖర్చు రూ.272.19 కోట్లు. ప్యాకేజీ- 2లోని ఎన్-9 (ఉద్ధండరాయునిపాలెం- నిడమర్రు) పొడవు 13.16 కి.మీ., నిర్మాణ వ్యయం రూ.214.94 కోట్లు. ప్యాకేజీ-3 లోని ఎన్-4 (వెంకటపాలెం- నవులూరు, 7.23 కి.మీ.), ఎన్-14 (అబ్బరాజుపాలెం- శాఖమూరు, 8.27 కి.మీ.)ల మొత్తం వ్యయం రూ.266.25 కోట్లు. ప్యాకేజీ-4లోని ఈ-10 (పెనుమాక- నీరుకొండ, 7.81 కి.మీ.), ఈ-14 (నీరుకొండ- మంగళగిరి, 7.33 కి.మీ.), ఎన్-16 (దొండపాడు- నెక్కల్లు, 8.77 కి.మీ.)ల మొత్తం నిర్మాణ వ్యయం రూ.337.97 కోట్లు. ఫేజ్-2 రోడ్ల పనులపైనా దృష్టి. మొత్తం 11 రోడ్లున్న అమరావతి ఫేజ్-2 రోడ్ల నిర్మాణాన్ని కూడా సత్వరమే చేపట్టేందుకు ఏడీసీ సమాయత్తమవుతోంది. ఈ-2, ఈ-4, ఈ-6, ఈ-12, ఈ-15 అనే తూర్పు- పడమర ప్రదేశాలను కలిపే వాటితోపాటు ఎన్-1, ఎన్-2, ఎన్-5, ఎన్-7, ఎన్-11, ఎన్-18 పేర్లతో రాజధానిలోని ఉత్తర- దక్షిణ దిశలను అనుసంధానించే రహదారుల ఏర్పాటుకు వడివడిగా చర్యలు తీసుకుంటోంది. వీటిల్లో ఈ-6, ఈ-12, ఎన్-11 అనే 3 రహదారులకు రూ.510 కోట్ల అంచనా వ్యయంతో త్వరలో టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ బ్యాంక్ నిధులు సమకూర్చనున్న ఈ రోడ్లకు టెండర్ల ప్రక్రియ ముగుస్తూండగానే మిగిలిన 8 రోడ్లకు కూడా టెండర్లు పిలవాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతోంది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఏపీ రాజధానిలో రాచబాటలు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ. బుధవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడయ్యే అవకాశం ఉంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణకూడా వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఇంఛార్జ్ జడ్జి వెల్లడించారు. బెయిల్ పిటిషన్పై ఇవాళ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా. ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమన్నారు న్యాయమూర్తి. బుధవారం నుంచి తాను సెలవుపై వెళ్లనున్నట్లు తెలిపారు. బుధవారం రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని జడ్జి సూచించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఈరోజు సెలవులో ఉండటంతో ఇంఛార్జ్గా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వ్యవహరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2 వరకు కోర్టులకు వరుస సెలవులు ఉన్నాయి. ఒకవేళ బుధవారం పిటిషన్లపై విచారణ వాయిదా పడితే మళ్లీ వచ్చే మంగళవారం (అక్టోబర్) 3న విచారణ జరగనుంది. అప్పటి వరకు చంద్రబాబు విచారణ వాయిదా పడినట్లే. అప్పటి వరకు చంద్రబాబు జైల్లో ఉండాల్సిందే. అంతేకాదు ఆయన రిమాండ్ను కూడా సీబీఐ కోర్టు వచ్చే నెల 5 వరకు పొడిగించిన సంగత తెలిసిందే.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై,విచారణ చేపట్టేందుకు అంగీకరించిన సీజేఐ'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ప్రేయసి ఇంట్లో చనిపోయిన ప్రియుడు
ప్రేయసి ఇంట్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. చిత్తూరు జిల్లాకు చెందిన సురేష్(23) పలమనేరులో కోళ్లఫారంలో పని చేసేవాడు. అక్కడ 50 ఏళ్ల రామకుమారితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అనంతపురం జిల్లా గోరంట్ల మండలం చింతలపల్లిలోని రామకుమారి ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ వారిద్దరూ సహజీవనం చేయసాగారు. ఇక ఆదివారం సురేష్ చనిపోయాడు. అతడి మృతికి ప్రియురాలే కారణమని సురేష్ తల్లిదండ్రులు కేసు పెట్టారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: పోలీసుల భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించడం నేరమా...?
పోలీసుల భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పై కేసు పెడతారా? అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి విపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. కుప్పంలో జరిగిన సభలో అచ్చెన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. పోలీసుల ఏకపక్ష వైఖరిని ప్రశ్నించడం నేరమా? అని నిలదీశారు. లోకేష్కు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత కాదా?. ఇటువంటి కేసులు టీడీపీ నేతల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని, ప్రజా సమ్యలపై తమ పోరాటాన్ని ఆపలేరని యనమల రామకృష్ణుడు అన్నారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న భట్టి
తెలంగాణాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేడు 107వ రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తల్లంపాడు ప్రస్తుతం భట్టి పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని మరోసారి హామీ ఇచ్చారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: హైదరాబాద్-రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ)-డిప్లొమా ప్రోగ్రామ్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విభాగాలున్నాయి. జనరల్ అభ్యర్థులు రూ.1,100, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 రిజిస్ట్రేషన్ ఫీజును జూన్ 24వ తేదీలోపు diploma.pjtsau.ac.inలో చెల్లించాలి.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'అగ్రికల్చరల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐ.ఎం.డి)అంచనా వేసింది. ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ విభాగం తెలిపిన సమాచారం మేరకు 17 వతేదీ తెల్లవారు జాము నుంచే వర్షాలు ప్రారంభయ్యాయి. డెల్టా ప్రాంతంలో మినుము, పెసర పంటలు కొన్ని చోట్ల పీకుడు దశలో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఓదెల దశలో ఉన్నాయి. పీకి ఓదే మీద ఉన్న పంట ఓదేలు తిప్పు కోవచ్చు అని, పీకుడు దశలో ఉన్న పంట కాయ రాలిపోతుందేమోననే బయాందొళనలో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం వర్షం నాలుగు రోజులు కురిస్తే అధిక ముప్పు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. యంత్రాల ద్వారా మినుము, పెసర పంటలు నూర్పిడి చేసిన రైతులు చేతికొచ్చిన పంట నీటిపాలవకుండా పరదాలు కప్పి దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ప్రారంభమైన వర్షాలు... అయోమయంలో రైతులు'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: బాదంను ఎందుకు ఇలానే తినాలి: ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు
ఒక ఫలం ఒకోలా తినాల్సివుంటుంది. బాదం గింజల విషయంలో అంతే. బాదం గింజలను రాత్రి పడుకునే ముందు నీళ్లలో వేసి, మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత పొట్టు తీసి తినాలని చాలా మంది సూచిస్తుంటారు. గతంలో అంతగా అవగాహన లేదు కానీ, ఇటీవలి కాలంలో బాదాన్ని ఈ విధంగా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందన్న అవగాహన అయితే విస్తృతమైంది. ఇందులో ఉండే సానుకూలతలను ఆయుర్వేద డాక్టర్ గీతా వర తెలిపారు. ‘‘బాదాన్ని నేరుగా తీసుకుంటే మన శరీరం జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టం. అందుకనే వాటిని నానబెట్టి తీసుకోవాలని సూచిస్తుంటారు. బాదం గింజల పైపొట్టులో టానిన్స్, ఫైటిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి పోషకాలను మన శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీంతో రక్తంలో పిత్త గుణం పెరుగుతుంది. అందుకుని నానబెట్టుకుని, పొట్టు తీసేసి తీసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. తేలిగ్గా జీర్ణం అవుతాయి’’ అని డాక్టర్ గీతా వివరించారు. బాదంలో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఎల్ డీఎల్ కొలెస్టరాల్ ను తగ్గించేందుకు సాయపడతాయి. బాదంలోని ప్రొటీన్లు రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు నియంత్రణకు సాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, విటమ్ ఇ, ఒమెగా-3, ఒమెగా-6, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్. వంటివి బాదం నుంచి లభిస్తాయి. శరీరంలో అన్ని ధాతువులకు బాదంతో ఉపయోగకరమని గీత తెలిపారు. కండరాల బలహీనత సమస్యను తగ్గిస్తాయని, జ్ఞాపకశక్తిని పెంచుతాయని తెలిపారు. కనీసం 5 నుంచి 10 వరకు బాదం గింజలను ప్రతిరోజు రాత్రి నీళ్లలో నానవేసి, మర్నాడు ఉదయం పొట్టు తీసి తీసుకోవాలని గీత సూచించారు. వంటకాల్లోనూ కలిపి తీసుకోవచ్చన్నారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: జగన్ కు భయం పట్టుకుంది!: రఘువీరా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ తన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపడానికి భయపడుతున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను సభకు పంపిస్తే ఎక్కడ అమ్ముడుపోతారోనన్న భయం జగన్ లో నెలకొందనీ, అందుకే వారందరినీ వెంటపెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా గుడిబండలో రఘువీరా మీడియాతో మాట్లాడారు. ప్రజాసమస్యలపై వాణిని వినిపిస్తారని ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించారని రఘువీరా గుర్తుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు పెద్దయెత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మమతా బెనర్జీ'.
2
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: జ్వరమొస్తేనే కరోనా కాదు... ఎయిమ్సు స్టడీలో షాకింగ్ విషయాలు...!
విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్. ఇలా ప్రతి చోటా థెర్మో మీటర్లతో శరీర ఉష్ణోగ్రతలను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. జ్వరంతో శరీరం వేడెక్కితే కరోనా అనే అనుమానంతో వారికి ప్రవేశం కల్పించడం లేదు. అక్కడి నుంచి అటే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. దీనిపై ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నిర్వహించిన స్టడీలో షాకింగ్ విషయాలు తెలిశాయి. టిఇఐ కథనం మేరకు. కరోనా వైరస్కు జ్వరాన్ని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదని ఎయిమ్సు స్పష్టం చేసింది. వాస్తవానికి కరోనా వైరస్ సోకితే. జ్వరం, పొడి దగ్గు, అలసట, గొంతు నొప్పి వస్తాయనే సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల అలాంటి లక్షణాలు లేనివారిలో కూడా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. ఫలితంగా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా వైరస్ లక్షణాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం మార్చి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు స్టడీ నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు చెందిన ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (IJMR)లో ప్రచురించారు. ఎయిమ్స్లో చేరిన 144 మంది వైరస్ బాధితుల్లో లక్షణాలను పరిశీలించగా. కేవలం 17 శాతం మందికి మాత్రమే జ్వరం వచ్చిందని తేలింది. వీరిలో ఎక్కువ మందికి స్వల్పంగా శ్వాస సంబంధ సమస్యలు, గొంత నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో. థెర్మో టెస్టులతో బాడీ హీట్ను పరిశీలించడం వల్ల ఫలితం ఉండదని అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: మంగళవారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్లిఫ్టింగ్లో భారత్ రజతం సాధించింది. మంగళవారం జరిగిన పురుషుల 96 కేజీల ఫైనల్లో భారత వెయిట్లిఫ్టర్ వికాస్ ఠాకూర్ మొత్తం 346 కేజీలు (స్నాచ్ 155 కేజీలు + క్లీన్ అండర్ జెర్క్ 191 కేజీలు) ఎత్తాడు. దీంతో ఒక్క వెయిట్ లిఫ్టింగ్ లోనే భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 8 పతకాలు సాధించింది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'వెయిట్లిఫ్టింగ్లో భారత్కు రజతం'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: మదనపల్లి సబ్ కలెక్టర్​గా జాహ్నవి బాధ్యతలు స్వీకరణ
చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్​గా జాహ్నవి బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న ఈమె మదనపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటల 20 నిమిషాలకు సబ్ కలెక్టర్​గా బాధ్యతలు తీసుకున్నారు.ఈ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలందరికీ చేరే విధంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు మదనపల్లి డివిజన్ పరిధిలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: త్రివేణి కంపెనీ ట్రిప్పర్ బోల్తా, తప్పిన ప్రమాదం
ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండిసి తవ్వకాల కాంట్రాక్టర్ త్రివేణి కంపెనీట్రిప్పర్ సోమవారం రాత్రి ప్రొడక్షన్ వే బ్రిడ్జిల వద్ద అన్లోడ్ చేసి తగ్గులో నీరు ఎక్కువగా ఉండటం వల్ల బ్రేక్ వేసినా బ్రేకులు పడక టైర్లు జారడం, ముందు బండిని తప్పించబోయి సైడ్ మళ్ళించడంతో నెమ్మదిగా వాలిపోయినది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. త్రివేణి కంపెనీ యాజమాన్యం బండ్లను మైంటైన్ చేసి కండిషన్లో ఉంచి భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా జాగ్రత్తగా పడాలని కార్మికులు కోరుతున్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: సూర్యాపేటలో బాలికా ఆరోగ్య రక్ష కిట్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యనభ్యసిస్తున్న బాలికలకు ఉచిత ఆరోగ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జేసి సంజీవ రెడ్డి ,ఆర్డీవో మోహన్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'ఆరోగ్య రక్ష కిట్లను పంపిణీ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: పెద్దపల్లి మండలంలోని భోజన్నపేట గ్రామంలో ఆదివారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ- పల్లె పల్లెకు విజ్జన్న పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రతీ గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిదులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'గడప గడపకు కాంగ్రెస్ పార్టీ'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: శ్రీలంక యువ సంచలన స్పిన్నర్ దునిత్ వెల్లలగే అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్లో టాప్-10 ర్యాంకింగ్స్లో ఉన్న నాలుగురు బ్యాటర్లను ఔట్ చేశాడు.వరల్డ్ నంబర్ వన్ వన్డే బ్యాటర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్తో పాటు వరల్డ్ నంబర్ 2 బ్యాటర్, టీమిండియా యంగ్ గన్ శుభ్మన్ గిల్. వరల్డ్ నంబర్ 8, 9 బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను పెవిలియన్కు పం​పాడు.సెప్టెంబర్ 12న భారత్తో జరిగిన మ్యాచ్లో రోహిత్, గిల్, కోహ్లిలతో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాల వికెట్లు కూడా తీసిన వెల్లలగే. ఇవాళ (సెప్టెంబర్ 14) పాకిస్తాన్తో జరుగుతున్న కీలక పోరులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ భరతం​ పట్టాడు. వెల్లలగే సంధించిన బంతికి బోల్తా కొట్టిన బాబర్ స్టంపౌటయ్యాడు. వెల్లలగే కేవలం​ 3 రోజుల వ్యవధిలో వరల్డ్ టాప్ బ్యాటర్లనంతా ఔట్ చేయడంతో అతనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్, పాక్ మ్యాచ్లలో 6 వికెట్లు పడగొట్టిన వెల్లలగే, గ్రూప్ దశలో బంగ్లాదేశ్పై ఓ వికెట్. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్పై మరో 2 వికెట్లు. దీని తర్వాత సూపర్-4లో బంగ్లాదేశ్పై మరో వికెట్. ఇలా మొత్తంగా ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. వెల్లలగే బంతితో మ్యాజిక్ చేయడమే కాకుండా, బ్యాట్తోనూ మెరుపులు మెరిపించగలడు. టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో ఓ పక్క అతని సహచరులు, స్పెషలిస్ట్ బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కడుతున్నా అతను మాత్రం చివరివరకు ఒంటరిపోరాటం (42 నాటౌట్) చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక పట్టుబిగించింది. లంక బౌలర్లు 130 పరుగులకే (27.4 ఓవర్లలో) సగం మంది పాక్ ఆటగాళ్లను పెవిలియన్కు పంపారు. ఈ దశలో వర్షం ప్రారంభమైంది. మ్యాచ్కు ముందు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ను 45 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పాక్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా, మెరుగైన రన్రేట్ ఆధారంగా శ్రీలంక ఫైనల్కు చేరుకుంటుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో టీమిండియాతో తలపడుతుంది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'శ్రీలంక యువ సంచలనం అరుదైన ఘనత'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: జహీరాబాద్ పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో గురువారం ఎయిడ్స్ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రధాన రహదారి గుండా ఎయిడ్స్ అవగాహన కల్పిస్తూ సాగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అస్లాం ఫారోకి మాట్లాడుతూ విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచి, ఎయిడ్స్ నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ప్రోగ్రాం ఆఫీసర్స్ ఎస్. రాములు, ముజఫర్ అలీ. లెక్చరర్లు నాగరాజు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ'.
2
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీపడలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగా, మరో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా యూపీలోని బహ్రెయిచ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీపడలేదని అన్నారు అమిత్ షా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను సక్రమంగా నిర్వహించారని, గూండాలు, మాఫియాలను లేకుండా చేశారని ప్రశంసించారు. ఇప్పుడు రాష్ట్రంలో బాహుబలలు లేరని. ఎక్కడైనా భజరంగభళి మాత్రమే ఉన్నారని సమాజ్వాదీ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెరుగైన పరిస్థితిని నల్ల కద్దాలు పెట్టుకున్న అఖిలేష్ యాదవ్ చూడలేకపోతున్నారని అమిత్ షా చురకలంటించారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే బీజేపీ. లా అండ్ ఆర్డర్ను గాడిలో పెడతామని చెప్పిందని, ఆ హామిన తూ.చ తప్పకుండా నెరవేర్చిందన్నారు అమిత్ షా. రాష్ట్రంలో మాఫియాను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదంతో అణిచివేశారని ప్రశంసించారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో టెలిస్కోప్ పెట్టి చూసినా. బాహుబలులు కనిపించరని. ఒక్క భజరంగభళి మాత్రమే ఎక్కడ చూసిన కనిపిస్తారని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు. ఆజంఖాన్, అతిఖ్ అన్సారీ, ముక్తార్ అన్సారీలు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రజలను ప్రశ్నించగా. వారంతా జైల్లో ఉన్నారనే స్పందన వచ్చింది. ఒకవేళ మీరు ఇప్పుడు తప్పుచేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసిని ఎస్పీని గెలిపించారంటే. మాఫియా నాయకులు జైల్ల నుంచి బయటికి వచ్చి మరింత ఇబ్బందులకు గురిచేస్తారని ప్రజలను హెచ్చరించారు. మరోసారి బీజేపీకి అధికారం ఇచ్చారంటే నేరస్తులంతా జైల్లో ఉంటారని. ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారని అమిత్ షా స్పష్టం చేశారు. యోగి ఆదిత్యనాథ్, బీజేపీ మాత్రమే ఈ పనిచేయగలుగుతుందని అన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'శాంతిభద్రతలపై యోగి రాజీపడటంలేదు: అమిత్ షా'.
2
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: ఆగ్నేయ బంగాళాఖాతం ఉత్తర అండమాన్ సముద్రాలను ఆనుకుని మరో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈ నెల 19 నాటికి వాయుగుండంగా బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతుందని, ఆపై మూడ్రోజుల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 21న ఏపీ దక్షిణ కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'బంగాళాఖాతంలో మరో అల్పపీడనం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్టీసీ బస్సు డిపో వద్ద నడుచుకుంటూ వెళుతున్న కండక్టర్ ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కండక్టర్ కు ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనదారుడికి కాలుకు గాయం కాగా కండక్టర్ కు తలకు చిన్నపాటి గాయం అయిందని వైద్యులు తెలిపారు. ఉరవకొండ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలను సేకరించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ కండక్టర్ కు గాయాలు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామానికి చెందిన తీగల బుచ్చి రెడ్డి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు చికిత్స నిమిత్తం ముందస్తు సీఎం రిలీఫ్ ఫండ్ 1, 50, 000 రూపాయలు దరఖాస్తు చేసుకోగా చెక్కును ని తన కుటుంబ సభ్యులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అంకం కుమార్ గౌడ్ , మున్సిపల్ బీసీ సెల్ అధ్యక్షులు కోటగిరి జంగయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పన్నాల కృష్ణారెడ్డి , ముద్దం వెంకట్ రెడ్డి, కొండ విజయకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని రకాల ఆదాయ మార్గాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఆదాయ మార్గాల పెంపునకు సంబంధించి ఇప్పటికే సంస్థ ఉన్నతాధికారులు అవసరమైన కసరత్తును ప్రారంభించారు. ఇందులో భాగంగా బస్భవన్లో ఆర్టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్థిక), సంస్థ కార్యదర్శి పురుషోత్తం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సంస్థకు చెందిన ఇతర అధికారులతో పాటు హెచ్పిసిఎల్, ఐఒసిఎల్ అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. సంస్థ ఖాళీ స్థలాల వినియోగంపై చర్చించారు. ఇందులో ప్రధానంగా ఖాళీ స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు, వాటి నిర్వహణతో పాటు ఆదాయం పెంపుదలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పాటు ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించారు. అయిల్ అవుట్లెట్ ప్రదేశాల్లో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా సేల్స్ రూమ్లు, టాయ్లెట్లు, పెడ్లు వంటి వాటిని సమకూర్చాలని ఇడి సూచించారు. ఇంధన అవుట్లెట్స్ నిర్వహణ వల్ల ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని సత్వరమే పరిష్కరించాల ని ఆయన సూచించారు. అప్పుడే అనుకున్న లక్షాలను చేరే అవకాశముంటుందనే అభిప్రాయాన్ని ఇడి పురుషోత్తం వ్యక్తం చేశారు. సంస్థ లక్షాలను సాధనకు అధికారులతో పాటు అయిల్ కంపెనీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందుకోసం ప్రొవైడర్లు, అకౌంట్స్ అధికారులు, డిపో మేనేజర్లతో కలిసి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా ఇడి పురుషోత్తం ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. దీంతో పాటు సంస్థను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఎక్కడె క్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకోవాలనే దానిపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. సంస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన ఆదాయ మార్గాల పెంపునకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'తెలంగాణా ఆర్టీసీ బలోపేతంపై దృష్టి'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ లకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే హోటళ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారనే కేసులో లాలాకూ సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 11న లాలూ ప్రసాద్ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. ఆయన కుమారుడిని మరుసటి రోజు విచారించనున్నారు. 2006లో రైల్వే శాఖలో నిర్వహించిన టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ లాలూపై ఆరోపణలు ఉన్నాయి. రాంచి, పూరీలోని రైల్వే హోటళ్లను ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా లాలూ టెండర్లను కేటాయించినట్టు సీబీఐ వాదిస్తోంది. ఈ నేపథ్యలో రెండు నెలల క్రితం ఆయన ఇళ్లలో కూడా సీబీఐ అధికారులు సోదాలు జరిపారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'లాలూ ప్రసాద్, తేజస్వీలకు సమన్లు జారీ చేసిన సీబీఐ కోర్టు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సతీమణి మీనా స్వామినాథన్(88) చెన్నైలో కన్నుమూశారు. టీచర్గా, ఎడ్యుకేటర్గా, రచయితగా గుర్తింపు పొందిన ఆమె. చిన్నపిల్లల విద్య కోసం విశేష కృషి చేశారు. పిల్లల విద్యకు సంబంధించి అనేక పుస్తకాలు రాశారు. కేంద్ర విద్యాబోర్డు అడ్వైజర్గా పనిచేసిన ఆమె. 1975లో ఐసీడీఎస్కు రూపకల్పన చేశారు. స్వామినాథన్, మీనా దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సతీమణి మృతి'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: పలు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్ల నుంచి బీసీలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఏ ఒక్కరూ బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. కానీ, సీఎం వైయస్ జగన్ మాత్రం బీసీల పక్షపాతిగా. వాళ్ల తలరాతలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం వైయస్ జగన్ సామాజిక విప్లవకారుడు. ప్రతీ ఒక్క బీసీ మంచి చదవులు దిశగా అడుగులు వేయాలని కలలు కంటున్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకి అధికారంలో, బడ్జెట్లో కూడా వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్దే. బీసీ కులాల గౌరవాన్ని ఆయన పెంచారు. బీసీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన సీఎం వైయస్ జగన్ గొప్ప విజనరీ. ఈ సంక్షేమ ఫలాలని ఎప్పటికీ గుర్తించుకోవాలి.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'బీసీ కులాల గౌరవాన్ని జగన్ పెంచారు'.
2
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వార 12 రకాల నిత్యావసర సరుకులు అందించాలని చేపట్టిన అభిప్రాయం సేకరణ వాల్ పోస్టర్ ను గురువారం నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో పిఓడబ్ల్యూ, పీవైఎల్ నాయకులు వాల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ. పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వార 12 రకాల నిత్యావసర సరుకులు అందించాలని ఈనెల 15 వరకు సంతకాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్కువ ధరకు సరుకులు అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సరళ, పీవైఎల్ నాయకులు హన్మంతు, రవి, తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'సంతకాల సేకరణ గోడ పత్రిక విడుదల చేసిన నాయకులు'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: అర్ అర్ అర్ నిర్మాత దానయ్య కు ఘన సన్మానం
ఆర్ఆర్ఆర్ సృష్టికర్త, నిర్మాత డివివి దానయ్యకు ఘన సన్మానం చేసిన బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గంటా అంజిబాబుసోమవారం హైదరాబాద్ జింఖానా క్లబ్బులో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డివివి దానయ్య సన్మాన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేయించి ఘనంగా సన్మానించిన బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గంటా అంజిబాబు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ భవిష్యత్తులో దానయ్య మరిన్ని ఉన్నత విలువ గల సినిమాలు నిర్మించి తెలుగు వారి ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ సినిమాలు లాగా ప్రపంచవ్యాప్తంగా నిలుపుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జింఖానా క్లబ్ కార్యదర్శి కిషోర్, మాజీ ఎమ్మెల్సీ సత్యన్న, మరియు పలువురు ప్రముఖులు పాల్గొని దానయ్యకు అభినందనలు అందజేశారు.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: యువ హుంకార్ ర్యాలీ సందర్భంగా భారీ బందోబస్తు
న్యూఢిల్లి : ఢిల్లిలోని పార్లమెంటు స్ట్రీట్లో నిర్వహించనున్న యువ హుంకార్ ర్యాలీ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. కాగా ఈ ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: ప్రభుత్వ ఆసుపు్తల్ల్రో మెరుగైన వైద్య సేవలు
అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో మెరుగైన వైద్యసేవలను అందిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్ మెషిన్ను మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ ప్రభుత్వ ఆస పత్రిలో సీటీ స్కాన్ మెషిన్ పీపీపీ విధానంలో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని స్కానింగ్ పరిక్షలు ఉచితంగా చేస్తున్నట్లు మంత్రి తెలిపా రు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సీటీ స్కాన్ మెషిన్లు పీపీపీ విధా నంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో మరో మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో సీటీ స్కాన్ మెషిన్లు ప్రారంభి స్తామని చెప్పారు. త్వరలో ప్రభుత్వ ఆసుపత్రులలో స్కాన్ కూడ ఏర్పాటు చేస్తాం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో ఓపి 1500 ఉండగా ప్రస్తుతం 2500 కు పెరిగి ందని, ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెట్రిక్ పెట్టడంవల్ల డాక్టర్ల అటెండెన్స పెరిగిందనిచెప్పారు. ప్రభుత్వ ఆసు పత్రులలో ప్రసవాలు గతంలో కన్నా ఇప్పుడు బాగా పెరిగా యని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన వారికి రూ. 1,000, బేబికిట్స, జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, తల్లిబిడ్డ ఎక్సప్రెస్తో పాటు త్వరలో మదర్ కిట్ ఇసు ్తన్నా మని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుప త్రులకు బాలింతలకు పౌష్టికాహారం అంద డంలేదన్న వస్తు న్న వార్తలపై మంత్రి స్పందించారు. దీనిపై దర్యాప్తు చేసి సంబ ంధించిన వారిపై చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: ప్రజాస్వామ్యంలో తన గొంతునెవరూ ఆపలేరని కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ చౌబే అన్నారు. బీహార్లోని బుక్సార్ జిల్లాలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డిఎం) కెకె ఉపాధ్యాయ్ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన చౌబే తనను తాను సమర్థించుకున్నారు. తనది చాలా పెద్ద కంఠస్వరమని, మైకు లేకుండా కూడా చాలా దూరం వినిపించేలా మాట్లాడగలనని ఆయన చెప్పారు. తనకు కోపం రాదని ఆయన అన్నారు. బుక్సార్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చౌబే కాన్వాయ్ను ఉపాధ్యాయ్ ఆపేశారు. మోడీల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉండగా లెక్కకు మించిన వాహనాలను కాన్వాయ్లో ఉపయోగించడంపై ఉపాధ్యాయ్ అభ్యంతరం చెప్పారు. ఆ సమయంలో ఉపాధ్యాయ్పై చౌబే విరుచుకుపడ్డారు. తీవ్ర స్వరంతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చౌబే వివరణ ఇచ్చుకున్నారు. తాను పెద్దగా మాట్లాడుతానని, కొంతమంది కావాలనే తనకు కోపం వచ్చిందని ప్రచారం చేశారని ఆయన అన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ప్రజాస్వామ్యంలో నా గొంతునాపలేరు : కేంద్రమంత్రి'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఇంటర్ విద్యార్ధి సమయస్ఫూర్తితో ఎన్నో ప్రాణాలు మిగిలాయి
ఊహించని పరిస్థితుల్లో సైతం సమయస్పూర్తి ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి ఘటనే ఇటీవల చోటు చేసుకొంది. విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తోన్న బస్సు డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో బస్సు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ సమయంలో సయస్ఫూర్తి ప్రదర్శించిన ఓ విద్యార్ధిని. పెను ప్రమాదం నుంచి బస్సులోని విద్యార్థులను బటయపడేసింది. బాలిక తెలివిగా వ్యవహరించి స్తంభానికి ఢీకొట్టి బస్సును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో బస్సులోని విద్యార్థులంతా బతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన గుజరాత్లోని రాజ్కోట్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నగరంలోని ట్రాంబా వద్ద ఉన్న భరద్ పాఠశాలకు చెందిన బస్సు. శనివారం సాయంత్రం విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తోంది. పాఠశాల వార్షికోత్సవం కావడంతో సాయంత్రం 6.30 గంటలకు బస్సులో విద్యార్థులకు బయలుదేరారు. ఈ బస్సు గొండాల్ రోడ్డు వద్దకు చేరుకోగానే డ్రైవరు హరున్భాయ్ ఖిమానీ గుండెపోటుకు గురయ్యాడు. మెలికలు తిరిగిపోయిన డ్రైవర్. బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో అదుపుతప్పిన వాహనం. డివైడర్ దాటిన ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంటూ పోయింది. దీనిని గమనించిన డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న భార్గవి వ్యాస్ అనే విద్యార్థిని (17). భయపడిపోయింది. వెంటనే తేరుకుని స్టీరింగు పట్టుకుని బస్సును నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. ‘‘నేను డ్రైవరు పక్కనే ఉన్న సీట్లో కూర్చున్నాను. బస్సు గొండాల్ రోడ్డులోని మక్కమ్ కూడలి వద్దకు చేరుకోగానే. డ్రైవర్ మాటలు తడబడ్డాయి. ఆయన నోరు ఒకవైపునకు వచ్చేసి. ముక్కు నుంచి రక్తం కారింది. స్టీరింగు వదిలేసి ఒక పక్కకు కూలబడిపోయారు. ఆయన పరిస్థితిని గమనించి నేను వెంటనే స్టీరింగు తిప్పి బస్సును కరెంటు స్తంభానికి ఢీకొట్టి ఆపాను’ అని భార్గవి వివరించింది. గుండెపోటుకు గురైన డ్రైవర్ హారున్భాయ్ను అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం రాజ్కోట్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్గవి సమయస్ఫూర్తిని జనం కొనియాడుతున్నారు. చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలు కాపాడిందని అంటున్నారు. భార్గవి తల్లి మాట్లాడుతూ. మాకు ఒక కుమార్తె ఉంది, కానీ మేము ఆమెను కొడుకుగానే భావిస్తాం. ఆడపిల్ల, అబ్బాయి అనే బేధం చూపొద్దని అన్నారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామం లో దుబ్బ రాజేశ్వరస్వామి ఆలయం జిల్లా కేంద్రానికి 8కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం లో ఏటా జరిగే జాతర మహోత్సవానికి సారంగాపూర్, ధర్మపురి, రాయికల్, మెట్పెల్లి, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. శివరాత్రి సందర్భంగా జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి తేదీ నుంచి 4వ తేదీ వరకు మహాశివరాత్రి ఉ త్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకరయ్య, ఆలయ కార్యనిర్వాహణ అధికారి ధనుంజయ్ శర్మ తెలిపారు. 1న సాయంత్రం స్వస్తి పుణ్యహవచనం, అంకురార్పణ, 2న రాత్రి స్వామి కల్యాణం, 3న మహా శివరాత్రి లింగోద్భావ కాలమున నిషి పూజ, రుద్రాభిషేకం, జాగరణ,4న పారణ, అన్నపూజ, 26న ఉద యం 10:25కు రథోత్సవం ఉంటుందన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం అమలులోకి వచ్చిన పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. నేడు నిన్నఅనంతపురం ₹ 78.23 ₹ 77.64 చిత్తూరు ₹ 77.58 ₹ 77.58 కడప ₹ 77.26 ₹ 76.75తూ.గో.జి ₹ 77.40 ₹ 77.03 గుంటూరు ₹ 77.65 ₹ 77.95 కృష్ణా ₹ 77.14 ₹ 77.80 కర్నూలు ₹ 77.59 ₹ 77.97 నెల్లూరు ₹ 78.49 ₹ 77.24ప్రకాశం ₹ 77.06 ₹ 76.93 శ్రీకాకుళం ₹ 77.77 ₹ 77.58 |విశాఖపట్నం ₹ 76.84 ₹ 76.55 విజయనగరం ₹ 76.95 ₹ 77.41 ప.గోజి. ₹ 77.17 ₹ 77.65
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ఏపిలో కాస్త తగ్గిన పెట్రోల్ ధరలు'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఆరిలోవ ప్రాంత అభివృద్ధికి కృషి
ఆరిలోవ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె రెండవ జోన్ 11వ వార్డు పరిధిలోని ఆరిలోవ, బాలాజీ నగర్, శ్రీకాంత్ నగర్, పెదగదిలి జంక్షన్ తదితర ప్రాంతాలలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని సమస్యలను మేయర్ కమిషనర్ తో చర్చించారు. ముఖ్యంగా ఆర్లవ కళ్యాణమండపం పునర్ధర్మ పనులు వేగవంతం చేయాలని, ఆరులోవ జంక్షన్ అభివృద్ధి పరచాలని, ఆరిలోవ ప్రధాన రోడ్డుపై ఉన్న దుకాణాలను తొలగించి వాటిని ఒక క్రమ పద్ధతిలో నిర్మించి తిరిగి వారికే ఇవ్వాలని , కేర్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేయాలని, పలుచోట్ల బీటీ రోడ్డు నిర్మించవలసి ఉందని మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా కమిషనర్ స్పందిస్తూ పనులు అంచలంచలుగా అభివృద్ధి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పట్టణ ప్రణాళిక అధికారి సునీత, డి డి హెచ్ దామోదరావు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, ఏ ఎం ఓ హెచ్ కిషోర్, ఏ ఈ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: పోడు భూములకు 3903 దరఖాస్తులు: కలెక్టర్
సంగారెడ్డి జిల్లాలో పోడు భూముల కోసం 3903 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ వివారాలు పంపించినట్టు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ. పోడు భూముల కోసం 3903 మంది 3479 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. అందులో గిరిజనులు 2161 కాగా, మిగితా భూములకు గిరిజనేతర్లు ధరకాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ దరఖాస్తుల కోసం ఈ 15లోగా డివిజన్ కమిటీ స్థాయి సమావేశం నిర్వహించి, 17వ తారీకు వరకు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంలో నగదుకు బదులుగా ల్యాప్ టాప్ తీసుకునే సదుపాయాన్ని కూడా కల్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్ పెంచడంతో పాటు వారు ఆన్ లైన్ క్లాసులు వినడం కోసం వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అప్పుడు ప్రకటించారు. అయితే అమ్మఒడి ల్యాప్టాప్లు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే ఈ ల్యాప్ టాప్ ఫీచర్లను కూడా ప్రకటించారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 512 జీబీ హార్డ్ డిస్క్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. వీటి ధర కూడా రూ.25,000 నుంచి రూ.27,000 మధ్య ఉండనుంది. దీంతోపాటు ఈ ల్యాప్టాప్లకు మూడు సంవత్సరాల పాటు వారంటీ కూడా ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.8వ తరగతి పైబడిన విద్యార్థులందరికీ వారి పాఠ్యాంశాల్లో కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రాంను కూడా చేర్చనున్నారు. అంటే 8వ తరగతి నుంచే కంప్యూటర్ ఉపయోగించడాన్ని నేర్పిస్తారన్న మాట. దీని వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నేటి కంప్యూటర్ యుగంలో వెనకబడకుండా ఉంటారు. రూ.25,000 నుంచి రూ.27,000 ఖరీదైన ల్యాప్టాప్లను కేవలం రూ.18,500కే అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రివర్స్ టెండరింగ్ దీని ఖరీదును మరింత తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నారు. దీంతోపాటు డిగ్రీ విద్యార్థులకు కూడా ఈ ల్యాప్టాప్లు అందించనున్నట్లు తెలిపారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'అమ్మఒడి ల్యాప్ టాప్ ఫీచర్లు ఇవే...'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: అల్వార్ జిల్లాలోని షాజహాన్పూర్ నీమ్రానా బెహ్రోడ్లో వాతావరణ మార్పు కారణంగా బలమైన గాలి మరియు వడగళ్లతో కూడిన భారీ వర్షం ఈ ప్రాంతంలోని పంటలను దెబ్బతీయడంతో స్థానిక రైతుల సమస్యలను పెంచింది. స్థానిక నివాసి ముకుల్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, “గతంలో కూడా మినుము సాగులో నష్టం జరిగింది, కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి పరిహారం అందలేదు, మరియు ఈ రోజు మరోసారి వర్షం కారణంగా, ఆందోళన చెందుతోంది. రైతులు పెరిగారు.‘‘వాతావరణ మార్పుల వల్ల గోధుమలు, ఆవాలు సాగులో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పంట పండింది మరియు రైతులు ఇప్పుడే పంటను పండించారు మరియు గోధుమ మరియు ఆవాలు వంటి కొన్ని పంటలు నిలబడి ఉన్నాయి. ఇప్పుడు మేము ఈ పంటకు నష్టపరిహారం ఇవ్వాలని మాత్రమే ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము అని అన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'రాజస్థాన్లో వర్షంతో దెబ్బతిన్నా పంటలు'.
2
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: A 2 పారిపోయే ప్రమాదముంది , పట్టుకోండి
గెడ్డం తాతకి వయసుతోపాటు మెదడు కూడా ముసలై మతి గతి తప్పింది. దొంగల్లుడు సొంత బాబాయ్ ని గొడ్డలితో నరికి సీబీఐకి అడ్డంగా దొరికిపోవడంతో గుండెపోటు కథలల్లిన విషపు విజయ్ సాయి రెడ్డి తేలుకుట్టిన దొంగలా దొరక్కుండా తిరుగుతున్నాడు. ఏ2 విషపు సాయిరెడ్డి పాస్పోర్ట్ సీజ్ చేయకపోతే విదేశాలకి పారిపోయే ప్రమాదం ఉంది. అంటూ టీడీపీ నాయకులూ అయ్యన్న పాత్రుడు తన ట్విట్టర్ వేదికగా తెలియచేసారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: నల్లగొండ పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు అలిసారి నిఖిల్ కుమార్ ప్రతిష్టాత్మక అవార్డు అయిన మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ ఫెల్లోషిప్-2022కి ఎంపికయ్యారు. డిసెంబర్ 11న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోనున్నారు. భారతీయ దళిత సాహిత్య అకాడమీ సౌత్ జోన్ ఆర్గనైజర్ కార్యదర్శి జితేందర్ మను ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగర మోచి సామాజిక వర్గానికి చెందిన అలిసారి నిఖిల్ కుమార్ విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అనాథలు, వృద్ధులకు చేయూనివ్వడంతోపాటు కరోనా విపత్కార పరిస్థితుల్లో సామాజిక బాధ్యతగా ముందుకువచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టినందుకుగానూ ఈ అవార్డుకు ఎంపికైనట్లు జితేందర్ తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఫెలోషిప్ అవార్డుకు నల్లగొండ యువకుడి ఎంపిక'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: ఇంట్లో బట్టలు, వస్తువులు ఎక్కడబడితే అక్కడ ఉంటే చికాకుగా ఉంటుంది. ఎక్కడబడితే అక్కడ పేరుకుపోయే బట్టలతో ఇల్లు సరిగ్గా క్లీన్ చేయడానికి అవకాశం ఉండదు. దీంతో బొద్దింకలు, పురుగులు చేరి అనారోగ్యాలకు కారణమవుతాయి.ఈ కొవిడ్ కాలంలో ఇల్లు నీట్గా ఉండడం చాలా అవసరం. వైరస్, బ్యాక్టీరియాలు పేరుకుపోకుండా చూసుకోవడం చాలా అవసరం. అయితే చిన్న చిన్న ఐడియాలతో గదుల్లో పరుపులు, దుప్పట్లు, దుస్తులను మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇంట్లో పెద్దగా వాడనివి, అవసరం లేనివి తీసేయ్యాలి. అలా తీసేసిన తర్వాత మిగిలిన వాటిని పరిశీలించి అవసరమైనవి మాత్రం జాబితా రాసుకోవాలి. ఆ జాబితా ప్రకారం ఇంట్లో సర్ధుకోవాలి. ఎక్కువ స్థలం పట్టని హ్యాంగర్లు, సెల్ఫ్ డివైడర్లను ఎంచుకోవాలి. ఇంట్లో డోర్స్ వెనకాల హుక్స్ పెట్టుకుని బట్టలు తగిలించుకునేందుకు యూజ్ చేసుకోవడం వల్ల చూడ్డానికి నీట్గా ఉంటుంది.ఐరన్ చేసుకున్న బట్టలు పెట్టుకోవడానికి ఫోల్డ్బుల్ క్లాత్ ఆర్గనైజర్లను యూజ్ చేయడం మంచింది. దీనికోసం ఎక్కువ శ్రమ పడనక్కర్లేదు Cloth Organizer - Non Woven Foldable Cloth Organizer ఆన్లైన్లో అందుబాటులో ఉంది. దీనిని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఇందులో నీట్గా ఐరన్ చేసుకున్న బట్టలను సర్దుకోవచ్చు. దీని అసలు ధర రూ. 846 లు ఆన్లైన్లో రూ.626 లకే వస్తుంది. ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేయడానికి ఈ కింది లింక్ను క్లిక్ చేయండి. లింక్ : bit.ly/C849191newవార్డ్రోబ్లో ఎక్కువ బట్టలు నిల్వ చేయడానికి ఈ క్లాత్ ఆర్గనైజర్ చాలా ఉపయోగపడుతుంది. షర్టులు, కవర్లు, సాక్స్, దుస్తులు, టవల్స్ను ఇందులో పెట్టుకోవచ్చు. షెల్ఫ్ల్లో, వార్డ్ రోబ్ల్లో బట్టల స్టోరేజ్కు ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'అతి తక్కువ ధరకే అందుబాటులో క్లాత్ ఆర్గనైజర్'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: నకిలీ కేబుల్ వైర్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
నకిలీ కేబుల్ వైర్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం. కాచిగూడకు చెందిన ముకుల్ దుర్గర్ (24) సుల్తాన్ బజార్ లో శ్రీ బాలాజీ ఎంటర్ప్రైజెస్ పేరిట ఫినోలెక్స్ నకిలీ కేబుల్ ను విక్రయిస్తున్నట్లు సమాచారంతో శనివారం షాప్ పై దాడి చేసి 1. 50 లక్షల విలువైన 100 మీటర్ల కేబుల్ వైర్లు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: గడువులోగా పోలవరం పూర్తికావడం కష్టమేనని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు అంశంపై స్పందించింది. షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి నాటికి పోలవరం పూర్తి కావాల్సి ఉందని తెలిపింది. వివిధ కారణాలతో నిర్ణీత సమయానికి పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదని వివరించింది. వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అటు, పోలవరంపై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్ర్రశ్నకు కూడా ఆయన బదులిచ్చారు. పోలవరానికి 2019 నుంచి రూ.6,461 కోట్లు విడుదల చేశామని బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. 2013-14 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణ ఖర్చు రూ.29,027 కోట్లు అని వెల్లడించారు. 2017-18 అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.47,725 కోట్లకు పెరిగిందని వివరించారు. ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులు పూర్తిగా కేంద్రమే చెల్లిస్తుందని తెలిపారు. రూ.15,667 కోట్లకు గాను రూ.13,226 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం కాంపోనెంట్ నిధుల రూపంలో ఇంకా రూ.2,441 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'గడువులోగా పూర్తికావడం కష్టమే: కేంద్రం స్పష్టీకరణ'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: దారుణం... అఫైర్ బయట పెడతామంటూ...!
హైదరాబాద్: బోరబండలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను యువకులు బెదిరించి అత్యాచారం చేశారు. వివాహేతర సంబంధం బయటకు చెప్పాలని హెచ్చరించి. తమ కోరిక తీర్చేందుకు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది భయంకరమైన సంఘటన. చెప్పలేని బాధితుడు, ప్రియుడు వెంకట్ ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ అడవుల్లో పురుగుల మందు తాగారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడిన ఇద్దరు తమకు న్యాయం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: రష్యాతో యుద్ధంలో తలపడుతోన్న ఉక్రెయిన్ కు అగ్రరాజ్యం అమెరికా భారీ సహాయం ప్రకటించింది. 3.75 బిలియన్ డాలర్ల మిలిటరీ సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటివరకూ 24.9 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ఉక్రెయిన్ కు అమెరికా భారీ సహాయం'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: ఉప్పల్లో కొత్తగా నిర్మించిన శిల్పారామాన్ని మంత్రులు తలసాని, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి ఇవాళ సాయంత్రం ప్రారంభించారు.గత సంవత్సరం పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ ఈ ప్రాంతంలో శిల్పారామం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పురపాలక శాఖ నుంచి వెంటనే నిధులు విడుదల అవడంతో పాటు పనులు కూడా చకచకా జరిగి ఉప్పల్లోని శిల్పారామం రూపుదిద్దుకున్నది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించడానికి ఇది మంచి వేదికని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ఉండాలని, ప్రతి జిల్లాకు ఓ శిల్పారామం రావాలని ఆయన అన్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉప్పల్ మినీ శిల్పారామానికి కుటుంబంతో వచ్చి ఆహ్లాదకరంగా గడపవచ్చు. చేతి వృత్తుల వారికి ఉపాధి కల్పించడమే శిల్పారామం ప్రత్యేకత. శిల్పారామం పక్కనే ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల మూసీ నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టవచ్చని అన్నారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఉప్పల్లో ప్రారంభమయిన శిల్పారామం!'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకొంది. అనుమానాస్పద స్థితిలో ఒక డాన్సర్ మృతిచెందడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫలక్ నుమా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముస్తఫా నగర్ లో నివాసముంటున్న షరీఫ్ ఫాతిమా(30) ఆర్కెస్ట్రా గ్రూప్ లో డాన్సర్ గా పనిచేస్తోంది. ఇటీవలే భర్త చనిపోవడంతో తన పిల్లల్తో కలిసి నివసిస్తోంది. ఇక ఇటీవలే ఆమె ఫలక్ నుమా పరిధిలో కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకోవడానికి పిల్లలను ఆమె తల్లి వద్ద వదిలి సోమవారం కొత్త ఇంటికి వచ్చింది. సాయంత్రమైన ఫాతిమా ఇంటికి రాకపోవడంతో భయపడిన ఆమె తల్లి ఆమెను వెతుక్కుంటూ కొత్తింటికి వెళ్లి చూడగా అర్ధనగ్నంగా, రక్తపు మడుగులో కూతురు కనిపించింది.ఒక్కసారిగా ఆ ఘటనను చూసి షాకయ్యిన తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం పై బట్టలు లేకపోవడం,. పక్కనే బీరు బాటిల్స్ ఉండడంతో ఈ ఇంట్లో ఫాతిమాతో పాటు ఇంకా ఎవరో వచ్చి ఉంటారని, ఏదో విషయమై గొడవజరిగి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'పక్కనే బీరు బాటిల్స్ తో ఇంట్లో నగ్నంగా డాన్సర్ మృతి... అసలేం జరిగింది...?'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన స్థలాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ , రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మంగళవారం ఉదయం పరిశీలించారు. వెనక్కి పంపిన జాకీ పరిశ్రమని ప్రభుత్వం చొరవ తీసుకుని ఇక్కడే స్థాపించాలని డిమాండ్ చేశారు. జాకీ పరిశ్రమ ఇక్కడే స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రాప్తాడుకు వచ్చిన జాకీ పరిశ్రమ వెనక్కి పంపిన రాప్తాడు ఎమ్మెల్యే నిర్లక్ష్యం నశించాలని అన్నారు. ఎమ్మెల్యే బెదిరింపు ధోరణి మానుకొని పరిశ్రమ ఇక్కడే స్థాపించడానికి కృషి చేయాలంటూ సీపీఐ నేతలు నినాదాలు చేశారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'జాకీ పరిశ్రమ ఇక్కడే స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే నీ గుండె గూగుల్ అనిపిస్తున్నా ఈ సమయంలో తక్కువ ధరకు స్మార్ట్ టీవీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎర్టెక్ బ్రాండ్కు చెందిన స్మార్ట్ టీవీ ఇది. ధర రూ. 8 వేల లోపే ఉంటుంది. ఇందులో అనేక గొప్ప ఫీచర్లు ఇవ్వబడ్డాయి. తక్కువ ధర అయినప్పటికీ సరికొత్త డిజైన్, ఫీచర్లు ఉండటం వల్ల వినియోగ దారులు ఎక్కువగా ఎర్టెక్ హెచ్డి లీడ్ టీవీ కె ప్రజలు ఓటు వేస్తున్నారు. 32 ఇంచుల డిస్ప్లే, 1366 x 768 పిక్సెల్ రెజల్యూషన్తో పని చేస్తుంది. 20 వాట్ ఆడియో అవుట్పుట్ ఉంటుంది. ఇది 32 ఇంచుల పరిమాణం కలిగిన స్మార్ట్ టీవీ. 4కే ఆల్ట్రా హెచ్డీ క్వాలిటీ కలిగి బొమ్మను ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. ఈ 32 ఇంచుల టీవీ అనేది 2021లో డిజైన్ చేసిన స్మార్ట్ టీవీ. దీనికి కూడా వాయిస్ కంట్రోల్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్, జీ5, గూగుల్ ప్లే స్టోర్, ప్రైమ్ వీడియో, టీసీఎల్ ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, సన్ ఎన్ఎక్స్టీ, యూట్యూబ్ వంటి ఇంటర్నెట్ సర్వీసుల్ని సపోర్ట్ చేస్తుంది. వై ఫై, యూఎస్బీ, హెచ్డీఎమ్ఐ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఈ 32 Inches TV 30 వాట్స్ అవుట్పుట్ కలిగి ఉంటుంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'రూ. 8వేల లోపేస్మార్ట్ టీవీ'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ఓ మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నిన్న తెల్లవారుజామున మున్సిపాలిటీ డ్రైవర్ మధు. దేవరకొండ రోడ్డులో ఉన్న ప్రసన్న పెట్రోల్ బంక్ ఎదుట చెత్తను శుభ్రపరిచే పనిలో భాగంగా రోడ్డు పక్కన ట్రాక్టర్ను ఆపాడు. అదే సమయంలో దేవరకొండ నుంచి నల్లగొండ పట్టణంలోకి వస్తున్న ఏపీ 07 టీహెచ్ 2357 నెంబరు గల లారీ వెనుక నుంచి ఆగిఉన్న మున్సిపాలిటీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ సీట్లో కూర్చున్న డ్రైవర్ మధు (22) ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్రమైన గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు తమ కళ్లముందే ఉన్న మధు చనిపోవడంతో, శానిటేషన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీ, ట్రాక్టర్లను జేసీబీ సహాయంతో తొలగించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఘోర రోడ్డు ప్రమాదం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద దేశంలోనే అతి తక్కువ గృహ నిర్మాణాలను చేపట్టిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి 1,80,715 ఇళ్ళు మంజూరయితే. కేవలం 2,167 ఇళ్లను మాత్రమే నిర్మించారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 1,80,000 ఆర్థిక సహాయాన్ని చేస్తుందని, అయినా దేశంలోనే అతి తక్కువ ఇళ్ల నిర్మాణం చేపట్టిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల కంటే అద్వాన పరిస్థితుల్లో ఇళ్ళ నిర్మాణంలో రాష్ట్రం ఉందన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఆర్ 5 జోన్ లో 50,790 ఇండ్ల నిర్మాణాన్ని మాత్రం ఆగమేఘాల మీద చేపడతామని సీఎం జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమరావతి పరిధిలోని ఇళ్లను శరవేగంగా నిర్మిస్తే, ఇళ్ళ స్థలాల లబ్ధిదారులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. 'రాష్ట్రంలో ఇళ్ళు మీరు కట్టుకుంటారా?, మమ్మల్ని కట్టించమంటారా?? అని ప్రభుత్వ పెద్దలు లబ్ధిదారులను ప్రశ్నించారని, ప్రభుత్వమే తమకు ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని లబ్ధిదారులు కోరగా, ఇళ్ళ నిర్మాణాన్ని చేయించి ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇళ్ళు కట్టుకుంటారా?, ఇంటి స్థలం పట్టాను క్యాన్సిల్ చేయమంటారా??' అని బెదిరిస్తున్నారని అన్నారు. రాజధాని ప్రాంతంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణం ద్వారా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా నారా లోకేష్ను ఓడించాలని కుట్ర చేస్తున్నారన్నారు. పద్మ వ్యూహంలో అభిమన్యుడిని ఒంటరి చేసి ఓడించినట్లుగా లోకేష్ను ఓడించాలని అనుకుంటున్నారని. కానీ పద్మవ్యూహం కుట్రలను లోకేష్ చేదించగలరన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి తమ పార్టీ పెను ఓటమికి నాంది కాబోతున్నాయన్నది స్పష్టమవుతోందన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకు దోహదపడిన రెండు సంఘటనల్లో ఒకటి కోడి కత్తి కేసు, రెండో వైఎస్ వివేకానందరెడ్డి హత్య అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించలేదని. అయినా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రుణం ఎలా మంజూరు చేశారని రఘురామ ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపర భగీరధుడిలా మొదలు పెట్టానని చెప్పిన జగన్. కేంద్రం అనుమతుల కోసం అవసరమైన పత్రాలను మాత్రం సమర్పించలేదన్నారు. జల్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ప్రతి ఏటా రూ.50 వేల కోట్లు కేటాయించేందుకు కేంద్రం సంసిద్ధతను వ్యక్తం చేసిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి షెకావత్ స్వయంగా తనతోనే చెప్పారన్నారు. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులను మంజూరు చేస్తే. 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ అమలు ద్వారా సర్వనాశనం చేశారని. వెలిగొండ ప్రాజెక్టుకు మోక్షం లభించేది ఎప్పుడో అన్నారు. గృహ నిర్మాణ రంగంలో, సాగు, తాగు నీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'ఆ ఘనత జగన్ సర్కార్కే దక్కుతుంది,నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: చంద్రబాబుకు ఐటీ మినిస్టర్ బహిరంగ సవాల్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ బహిరంగ సవాల్ విసిరారు. విస్సన్నపేట పట్టణంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. 609 ఎకరాల్లో ఒక సెంటు భూమి అమర్నాథ్ పేరు మీద కానీ, తన కుటుంబ సభ్యుల పేరిట కానీ ఉన్నా. రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. చంద్రబాబు నిరూపించకపోతే లోకేశ్ను రాజకీయాలు నుంచి తప్పిస్తారా? అంటూ సవాల్ విసిరారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఎగసిపడుతున్న అలలతో,ఉప్పాడ బీచ్ లో అలజడి
ఎగసిపడుతున్న అలలతో,ఉప్పాడ బీచ్ లో అలజడి నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను కొనసాగుతోంది. గంటకు 12 కిమీ వేగంతో మాండూస్ తీరం దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలోని కాకినాడ జిల్లాలో ఉప్పాడ బీచ్ వద్ద అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ సముద్ర తీరంలో నీటిమట్టం పెరిగింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలు బీచ్ రోడ్డు వరకు దూసుకొస్తున్నాయి. తీరంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలలు, ఈదురుగాలుల ఉద్ధృతి పెరగడంతో కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలను నిషేధించారు. తిమ్మాపురం పోలీసులు, మెరైన్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు, అలల తాకిడి భారీగా పెరగడంతో మత్స్యకారులు బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
1
['tel']

Summary

aya-telugu-news-articles is an open source dataset of instruct-style records generated by webscraping a Telugu news articles website. This was created as part of Aya Open Science Initiative from Cohere For AI.

This dataset can be used for any purpose, whether academic or commercial, under the terms of the Apache 2.0 License.

Supported Tasks:

  • Training LLMs
  • Synthetic Data Generation
  • Data Augmentation

Languages: Telugu Version: 1.0

Dataset Overview

aya-telugu-news-articles is a corpus of more than 467k records generated by webscraping of the Telugu News articles website. This Dataset can be used for the following two tasks:

  • Given Title/Headline of the article, generate the article with that Title/Headline.
  • Given the article, generate the Title/Headline for the article.

Intended Uses

While immediately valuable for instruction fine tuning large language models, as a corpus of instruction prompts, this dataset also presents a valuable opportunity for synthetic data generation in the methods. For example, prompt-completions could be submitted as few-shot examples to a large open language model to generate additional articles and their respective titles.

Dataset

Load with Datasets

To load this dataset with Datasets, you'll just need to install Datasets as pip install datasets --upgrade and then use the following code:

from datasets import load_dataset
ds = load_dataset('SuryaKrishna02/aya-telugu-news-articles')

Purpose of Collection

Telugu is a low-resource language where there no title and article generation instruct-style dataset to the best of my knowledge. This was created as a part of Aya Open Science Initiative from Cohere For AI to make sure Telugu is well represented in the space of AI/ML. Unlike other datasets that are limited to non-commercial use, this dataset can be used, modified, and extended for any purpose, including academic or commercial applications.

Sources

  • Suryaa Newsarticles Website: Performed webscraping from Suryaa Website which is a famous news articles website in Telugu States. Next, performed some pre-processing of the data like removing unwanted characters, removing too lengthy or too short articles from the scraped data. Finally, converted the scraped data into Instruct-style prompts and completions.

Data Fields

  • inputs : Prompt or input to the language model.
  • targets : Completion or output of the language model.
  • template_id : Id of the template used in inputs and targets.
  • template_lang: ISO code of the language used in the inputs and targets where tel refers to Telugu.

Templates

For the creation of instruct-style prompts and completions from the scraped data, the following two templates categories with two templates were used:

  1. Given Title/Headline of the article, generate the article with that Title/Headline.

    template_id inputs targets
    1 [క్రింది | కింది | ఇవ్వబడిన | ఇచ్చిన] [శీర్షికతో | టైటిల్ తో | హెడ్లైన్ తో] [వార్తా కథనాన్ని | న్యూస్ ఆర్టికల్ ని | న్యూస్ కథనాన్ని] [వ్రాయండి | రాయండి]:\n{{Title}} {{Article}}
  2. Given the article, generate the Title/Headline for the article.

    template_id inputs targets
    2 [క్రింది | కింది | ఇవ్వబడిన | ఇచ్చిన] [వార్తా కథనానికి | న్యూస్ ఆర్టికల్ కి | న్యూస్ కథనానికి] [శీర్షికను | టైటిల్ ను | హెడ్లైన్ ను] [వ్రాయండి | ఇవ్వండి | రాయండి]:\n{{Article}} [ఇచ్చిన | ఇవ్వబడిన] [వార్తా కథనానికి | న్యూస్ ఆర్టికల్ కి | న్యూస్ కథనానికి] [సరిపోయే | తగిన | అనువైన] [శీర్షిక | టైటిల్ | హెడ్లైన్] '{{Title}}'.

Personal or Sensitive Data

This dataset contains public information. To our knowledge, there are no private person’s personal identifiers or sensitive information.

Language

Telugu

Known Limitations

  • The Dataset is scraped from the News Website and the contents of this dataset may reflect the bias, factual errors, politicial affiliations and sensitive matters.
  • Although there is utmost care taken to keep the dataset as monolingual, there might be some records that may contain English Language along with Telugu.

Contributors

SuryaKrishna02 and Desik98

Downloads last month
36