inputs
stringlengths
28
112
targets
stringlengths
30
2.36k
template_id
int64
1
14
template_lang
stringclasses
1 value
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మందుబాబులకు ఇవ్వబడదు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మందుబాబులకు ఇవ్వబడదు!' ‘‘నా మిత్రుడికి ఇల్లు అద్దెకు ఇవ్వనని అన్నావట ఎందుకు?’’ ‘‘తాగుబోతులకు ఇల్లు అద్దెకు ఇవ్వను’’ ‘‘వాడు తాగుబోతన్న విషయం ఎవరు చెప్పారు నీకు?’’ ‘‘ఒకరు చెప్పక్కర్లేదు. ఇల్లు చూడ్డానికి వచ్చిన రోజే అటాచ్డ్ బారుందా అని అడిగాడు’’
11
['tel']
నేర్చుకున్న పాఠం అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'నేర్చుకున్న పాఠం' ‘‘ఎక్కువగా పెళ్లయిన మగాళ్లకే పొట్ట వస్తుంది ఎందుకురా?’’ అడిగాడు వీరబాబు. ‘‘బాధలన్నీ కడుపులోనే దాచుకుంటారు కాబట్టి’’ చెప్పాడు బుచ్చిబాబు.
2
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పిచ్చర పిడుగు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పిచ్చర పిడుగు' ‘‘అమ్మా .. ఇందాకట్నించి ఎండలో ఒక ముసలాయన అరుస్తున్నాడు. పదిరూపాయలివ్వమ్మా ..’’ ‘‘అయ్యో పాపం ... ఇదిగో ఇచ్చేసిరా నాయనా .. ఇంతకీ ఏమని అరుస్తున్నాడ్రా?’’ ‘‘ఐస్ క్రీం .. ఐస్ క్రీం .. అని’’ ‘‘ఆఁ ...!’’
10
['tel']
అమ్మ పనే! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అమ్మ పనే!' ‘‘అక్కా .. ఆకాశం చూడు ... ఎంత తళ తళ మెరుస్తోందో?’’ చెల్లెలు. ‘‘అవును .. అమ్మ surf excelతో ఉతికి ఆరేసిందనుకుంటానే ..’’ అక్క.
2
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నా అకౌంటు - నా ఇష్టం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నా అకౌంటు - నా ఇష్టం!' ‘‘ఇందులో 3 దొంగ నోట్లున్నాయి .. చెల్లవు’’ చెప్పాడు బ్యాంకు క్యాషియర్. ‘‘వీటిని నా అకౌంటులో కదా వేసేది. అవి మంచి నోట్లయితే నీకేంటి? దొంగనోట్లయితే నీకేంటి?’’ వాదించాడు కస్టమర్ కనకయ్య.
12
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మెదడుకు మేత ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మెదడుకు మేత' ‘‘ఒక పొలంలో 12 గొర్రెలున్నాయి. అందులో 6 గొర్రెలు పక్క పొలంలోకి వెళ్తే ఎన్ని గొర్రెలు మిగుల్తాయి?’’ అడిగాడు లెక్కల మాస్టారు. ‘‘ఏమీ మిగలవు సార్’’ చెప్పాడు చింటు. ‘‘అదెలా?’’ ఆశ్చర్యపోయాడు మాస్టారు. ‘‘ఒక గొర్రె వెళ్లిందంటే అన్ని గొర్రెలూ దాని వెనకే వెళతాయండి’’ చెప్పాడు చింటు.
8
['tel']
ప్రేమలేఖ అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ప్రేమలేఖ' ‘ప్రియమైన నీకు .. నీ గురించి ఏమి రాయాలో ఆలోచించి .. ఆలోచించి .. చించి .. తెలియక చివరకు నేనే జండూబామ్ రాసుకున్నాను...’ ఇట్లు - నీ కాళిదాసు
2
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఇంతకంటే సింప్లిసిటీ ఉండదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఇంతకంటే సింప్లిసిటీ ఉండదు' ‘‘సింప్లిసిటీకి నిర్వచనం చెప్పగలవా?’’ ‘‘వంద రూపాయలు పెట్టి చెప్పులు కొన్న ఆడవాళ్లు ‘షాపింగ్కు వెళ్లొచ్చామ’ని చాటింపు వేసుకుంటే, రెండు వేలు ఖర్చు చేసి మందు తాగిన మగవాళ్లు సైలెంట్గా వచ్చి పడుకుంటారు. ఇంతకంటే సింప్లిసిటీ ఏముందబ్బా!’’
13
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ముందే చెప్పలేకపోయావా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ముందే చెప్పలేకపోయావా?' ‘‘ఏమండీ .. ఇలాగే మీ జుట్టు రాలిపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతానంతే’’ కచ్చితంగా చెప్పింది కాంతం. ‘‘ఈ విషయం ముందే తెలిసుంటే బాగుండేది కాంతం. జుట్టు రాలకుండా ఉండేందుకు ఇన్నాళ్లూ నానా జాగ్రత్తలు తీసుకున్నాను అనవసరంగా’’ నెత్తి గోక్కున్నాడు జోగినాథం.
9
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బోధపడిందా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బోధపడిందా?' ‘‘ప్రజా ప్రతినిధి .. ప్రజా ప్రతినిధి అనే మాట తరచూ వినబడుతుంది ... అర్థం ఏమిటి గురూ?’’ అడిగాడు శిష్యుడు. ‘‘ఏమీలేదు నాయనా .. ప్రజలకోసం వచ్చే ప్రతి నిధిని స్వాహా చేసేవాడిని ప్రజా ప్రతినిధి అంటారు’’ చెప్పాడు గురూజీ.
14
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వాట్సప్ జోక్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వాట్సప్ జోక్' సోమనాథం: మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు?రామనాథం: ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్.సోమనాథం: అవునా! ఏఏ వస్తువులను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తుంటాడు?రామనాథం: వాట్స్పలో వచ్చినవి ఫేస్బుక్లో, ఫేస్బుక్లో వచ్చినవి వాట్స్పలో పోస్ట్ చేస్తుంటాడు.
7
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రాబోయే కాలంలో కాబోయే పరామర్శలు..!! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రాబోయే కాలంలో కాబోయే పరామర్శలు..!!' పాపం చాలా మంచి మనిషి.. ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండేవాడుఅందరి పోస్టులకీ లైక్స్ కొట్టేవాడుచాలా హుందాగా కామెంట్స్ పెట్టేవాడుపాపం తన పోస్టులకు ఎవ్వరినీ ట్యాగ్ చేసేవాడు కాదుఎవరైనా వారి పోస్ట్స్కి తనని ట్యాగ్ చేసినా పల్లెత్తు మాటా అనేవాడు కాదుఅందరి ప్రొఫైల్స్ పిక్స్కీ లైక్ కొట్టేవాడుఫేక్ ఫొటోలను ప్రొఫైల్ పిక్గా ఎనాడూ పెట్టని పెద్దమనిషి పాపం జీవితాంతం ఒక్క అకౌంట్ మీదే బతికాడు...
7
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఫన్నీ చాటింగ్.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఫన్నీ చాటింగ్..' ఇద్దరు లవర్స్ చాటింగ్ చేస్తున్నారు.గర్ల్ఫ్రెండ్: హాయ్ డియర్, చిన్న సహాయం కావాలి.బాయ్ఫ్రెండ్: ఏం సహాయం??గర్ల్ఫ్రెండ్: మై స్వీట్ డార్లింగ్! నాకు ఒక 15k కావాలి. ఇస్తావా ప్లీజ్!బాయ్ఫ్రెండ్: 15k? ఎందుకంత?గర్ల్ఫ్రెండ్: 5k నా డ్రస్సులకోసం, 7k నా హెయిర్స్టయిల్, మేక్పకిట్ కోసం, 3k నా షూస్ కోసం...బాయ్ఫ్రెండ్: ఓ ష్యూర్! ఇప్పుడే పంపిస్తున్నా, తీసుకో.kkkkkkkkkkkkkkkలెక్కపెట్టుకో డియర్, కరెక్టుగా 15k ఉన్నాయి. ఇంకో 2k కూడా పంపిస్తున్నాను. దాంతో పర్ఫ్యూమ్ కొనుక్కో!
4
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అనుభవసారం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అనుభవసారం' ‘‘బ్రహ్మచారి అంటే పెళ్లికానివాడు, సంసారి అంటే పెళ్లయినవాడు. మరి సన్యాసి అంటే ఎవరు స్వామీ?’’ అడిగాడు శిష్యుడు. ‘‘పెళ్లి వలన విరక్తి చెందినవాడు నాయనా’’ చెప్పాడు గురువు.
8
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అతిథి దేవో భవ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అతిథి దేవో భవ!' ఇంటికి అతిథి రాగానే మీరు అడగాల్సిన మొదటి ప్రశ్న- మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టమంటారా? ఈ మాటతో అతిథి ఆనందపడతాడు. రెండవ ప్రశ్న .. ఠీజీ జజీ పాస్వర్డ్ ఇమ్మంటారా? గురుడు ఆనందంతో పిచ్చెక్కి గంతులేస్తాడు.
11
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సుంకం మాఫీ చేస్తా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సుంకం మాఫీ చేస్తా!' ‘‘డాక్టరుగారూ .. పేదవాడిని. మీరు చేసిన వైద్యానికి డబ్బులు ఇచ్చుకోలేను. కాని ఏదో రకంగా మీ రుణం తీర్చుకుంటానండి’’ బతిమాలాడు వీరమల్లు. ‘‘సర్లే .. ఇంతకూ రుణం ఎలా తీర్చుకుంటావో చెప్పు?’’ ఆసక్తిగా అడిగాడు డాక్టర్ చంపారావు. ‘‘నేను కాటికాపరిని. మీ ఇంటి నుండి ఎప్పుడు శవం వచ్చినా సుంకం తీసుకోను’’ వినయంగా బదులిచ్చాడు వీమల్లు.
10
['tel']
మళ్లీ మళ్లీ దొరుకుతున్నాడు! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'మళ్లీ మళ్లీ దొరుకుతున్నాడు!' ‘‘మా అబ్బాయి తప్పిపోయిన విషయం ఫోటోతో పాటు వాట్సాప్లో పెట్టడం తప్పయిపోయిందిరా .. ’’ బాధగా అన్నాడు రత్నాకరం. ‘‘అందులో పెట్టబట్టే కదా ... వెంటనే దొరికాడు’’ బదులిచ్చాడు చిదంబరం. ‘‘నిజమే .. ఆ తర్వాత ఎక్కడ దారిలో కనిపించినా ఎవరో ఒకరు గుర్తుపట్టి వాడిని తెచ్చి నాకు అప్పగిస్తున్నారు’’ గొల్లుమన్నాడు రత్నాకరం.
2
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఓర్వలేని దేవుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఓర్వలేని దేవుడు' దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడు నిజమే. అయితే పురుషుడు ఆనందంగా ఉండడం చూసి ఓర్వలేక ఆ దేవుడే భార్యను సృష్టించాడని ఎందుకు చెప్పరు?
7
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కొత్త కాపురం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కొత్త కాపురం' ‘‘ఇదిగో నిన్నే ... స్నానానికి వేణ్ణీళ్లు మరిగించావా?’’ కేకేశాడు కోదండ రామయ్య. ‘‘లేదండి .. చన్నీళ్లే మరిగించి బాత్రూమ్లో పెట్టా’’ వంటింట్లోంచి బదులిచ్చింది అలివేలు.
10
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మరుపులో మెరుపు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మరుపులో మెరుపు' రమేష్ : ఈ మధ్య మతిమరుపు ఎక్కువయి పోయిందిరా.. మొన్న వర్షంలో గొడుగు తీసుకోకుండా వెళ్ళిపోయాను. సురేష్ : మరి ఎప్పుడు గుర్తొచ్చింది? రమేష్ : వాన తగ్గాక మడుద్దామని చూస్తే చేతిలో గొడుగు లేదు..
13
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సొల్లుగాడి పని పడదాం రా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సొల్లుగాడి పని పడదాం రా!' ‘‘సినిమా ఎలా ఉంది?’’ ‘‘ఏమో..’’ ‘‘అదేంటి.. టికెట్ బుక్ చేసుకున్నావు.. వెళ్లలేదా?’’ ‘‘వెళ్లాను.. మధ్యలో నా పక్క సీటు వాడికి అర్జెంట్ ఫోన్కాల్ వచ్చింది. 45 నిమిషాలు మాట్లాడాడు. ఫ్లిప్కార్ట్ వాడికి తన ఇంటి దారి చెప్పాడు. నేనిప్పుడు వాడి ఇంటికే బయలుదేరాను. వస్తావా? గన్ను పట్టుకొని వెనుక సీట్లో కూర్చుంటావా?’’
4
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక చూపించు - లక్ష పట్టు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చూపించు - లక్ష పట్టు' స్నేహితులు లేని వాళ్లని లక్ష మందిని చూపిస్తాను. కాని శత్రువు లేనివాడిని ఒక్కణ్ణి చూపించు. లక్ష రూపాయలిస్తాను.
4
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చెప్పే అర్హత వచ్చేసింది! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చెప్పే అర్హత వచ్చేసింది!' గంటసేపు పోరాడి చిక్కుపడ్డ నా హెడ్ ఫోన్స్ ముళ్లు విప్పాను. ఇది సాధించాక జీవితంలో ఏదీ ఛాలెంజింగ్గా అనిపించట్లేదు. రైట్ .. అయాం రెడీ. ఈ సమాజానికి ఉచిత సలహాలివ్వటానికి అర్హత సంపాదించినట్టే. ‘పడుకునేలోపు జీవితంలో గెలుపు’ అనే వ్యక్తిత్వ వికాసం పుస్తకం రాయటం మొదలుపెట్టాను.
14
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తిక్క కుదిరింది . ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తిక్క కుదిరింది .' కొత్తగా పెళ్ళైన ఒక జంట తీరికగా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. భర్త: మన పెళ్లికి ముందు నీకు ఎంత మంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారు? భార్య: ఇంట్లో నుంచి ఒక బాక్స్ తెచ్చి భర్త ముందు ఉంచింది. భర్త: ఇదేమిటి ఇందులో ఏడు బియ్యం గింజలు, రెండు వందల రూపాయలు ఉన్నాయి. భార్య: నాకు బాయ్ ఫ్రెండ్ మారినప్పుడల్లా ఒక బియ్యం గింజ ఆ డబ్బాలో వేసేదాన్ని. భర్త: ఏడుగురే కదా .. ఈకాలంలో కూడా ఇంత తక్కువ మంది ఉండటం ఆశ్చర్యంగా, సంతోషంగా ఉంది. మరి ఈ రెండు వందలు? భార్య: (అమాయకంగా) : అలా వేసిన బియ్యం అమ్మితే .. ఈ రెండు వందలు వచ్చాయి.
6
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ధర్మ సందేహం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ధర్మ సందేహం' విద్యార్థి: సార్ .. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని అందరూ అడుగుతున్నారు కానీ కట్టప్ప ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఎవరూ అడగరెందుకు? గురువు: ఆఁ ...!
8
['tel']
క్లూ పనిచేయలేదు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'క్లూ పనిచేయలేదు' టీచర్: వేమన శతకం రాసిందెవరు? విద్యార్థి: తెలీదు సార్.. టీచర్: సరే.. నీకు ఒక క్లూ ఇస్తాను. నేనడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. విద్యార్థి: శతకంగారు సార్..
1
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నమ్మకపోతే తిరిగి చూడండి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నమ్మకపోతే తిరిగి చూడండి' టీచర్: చంటీ ... భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా.. చంటి: తెలుసు టీచర్.. భూమి తన చుట్టూ తాను తిరిగి తిరిగి కళ్లు తిరిగి పడిపోయినప్పుడు టీచర్...
12
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పేరు మారింది అంతే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పేరు మారింది అంతే' ‘‘గతంలో అన్ని సుఖాలనూ త్యాగం చేసిన వారిని సర్వసంగ పరిత్యాగులని పిలిచేవారు. ఇప్పుడు అలాంటి వారు లేరా స్వామీ?’’ అడిగాడు శిష్యుడు. ‘‘లేకేం నాయనా .. ఇప్పుడు వారిని ‘ప్రైవేటు ఉద్యోగులు’ అని పిలుస్తున్నారు!’’ జవాబిచ్చాడు గురూజీ.
4
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఇది ఆ దెబ్బ కాదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఇది ఆ దెబ్బ కాదు' తల పగిలి రక్తం కారుతుండగా ఆసుపత్రికి పరిగెత్తుకొచ్చాడు ఒక వ్యక్తి. ప్రథమ చికిత్స చేశాక అడిగింది నర్సమ్మ. ‘‘మీ పేరు ..?’’ ‘‘కోదండం’’. ‘‘వయస్సు?’’ ‘‘30 ఏళ్లు ...’’ ‘‘పెళ్లయిందా?’’ ‘‘లేదండి .. ఈ దెబ్బ కారు యాక్సిడెంట్లో తగిలింది.’’
5
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నేనిప్పుడు కోటీశ్వరుడిని ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నేనిప్పుడు కోటీశ్వరుడిని' ‘‘నేనే కోటీశ్వరుడినైతే! అనే అంశంపై అందరూ వ్యాసం రాయండి’’ చెప్పింది పంతులమ్మ. క్లాసులో పిల్లలందరూ తాము కోటీశ్వరులమైపోయినట్టు ఊహించుకుని రాసేస్తున్నారు - ఒక్క కిరణ్ తప్ప. ‘‘ఏమైందిరా.. వ్యాసం మొదలుపెట్టలేదేం?’’ అడిగింది పంతులమ్మ. ‘‘నా సెక్రటరీ కోసం ఎదురుచూస్తున్నా టీచర్’’ చెప్పాడు కిరణ్.
6
['tel']
అర్థం పరమార్థం అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అర్థం పరమార్థం' ‘‘నాతో పెళ్లికి ముందు నీవంటే ఇష్టమని చాలాసార్లు అన్నారు గుర్తుందా?’’ గుర్తు చేసింది అలివేలు. ‘‘నేనెప్పుడూ మాట తప్పను డియర్. ఇప్పటికీ అదే అంటున్నాను నీ‘వంటే’ ఇష్టం’’ చెప్పాడు భీమరాజు.
2
['tel']
స్వామి ప్రసాదం అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'స్వామి ప్రసాదం' ‘‘నీకేమైనా పిచ్చా .. ’’ ఇంట్లోకి వస్తూనే గట్టిగా అరిచాడు సూరిబాబు. ‘‘అయ్యో .. నేనేం చేశానండీ’’ అమాయకంగా అడిగింది అలివేలు. ‘‘కనిపించిన వారందరితో ఆ నిత్యానంద స్వామి దయవల్లే కొడుకు పుట్టాడని చెబుతున్నావట’’ తల బాదుకున్నాడు సూరిబాబు.
2
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నీకు ఆ భయం అక్కర్లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నీకు ఆ భయం అక్కర్లేదు' ‘‘నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే .. పెళ్లిలో కట్నం ప్రసక్తి తీసుకురాకూడదు మధూ ..’’ గోముగా అంది అర్పిత. ‘‘నీకు ఆ సమస్యే ఉండదు డియర్ .. ఎందుకంటే అసలు నేను పెళ్లి ప్రస్తావనే తీసుకురాను’’ అభయమిచ్చాడు మధు.
3
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పేకాట నాన్న ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పేకాట నాన్న' ‘‘డాడీ .. సాయంత్రం పూట అయినా బయటకి కదలనివ్వవేమిటి నన్ను ... అలా బయటకెళ్లి కాసేపు ఆడుకుని వస్తాను’’ బతిమాలాడు బుజ్జిబాబు. ‘‘ఆడుకోడానికి వెళ్తావా .. కాళ్లు విరగ్గొడతా వెధవా ... ఇది ఆట కాదా .. ముందు ముక్కేయ్’’ కసిరాడు పాపారావు పేక ముక్కలు సరిచేసుకుంటూ.
8
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ జీవనాధారం అదే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'జీవనాధారం అదే' ‘‘ఏంటి నీ ప్రాబ్లమ్?’’ అడిగాడు డాక్టర్. ‘‘పదిమంది ఉన్న గుంపులోకి వెళ్లగానే చేతులు వణుకుతున్నాయి డాక్టర్’’ చెప్పాడు కోటయ్య. ‘‘గుంపులోకి వెళ్లడం మానేయండి’’ సలహా ఇచ్చాడు డాక్టర్. ‘‘పని చేయకపోతే బతకేదెలా డాక్టర్ .. నేను జేబుదొంగని’’ అసలు సంగతి చెప్పాడు కోటయ్య.
11
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సామాన్యులకు అందని భాష ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సామాన్యులకు అందని భాష' ఒక అందమైన అమ్మాయి, ఒక మెడికల్ షాప్ బయట నుంచుంది. వచ్చిన కస్టమర్లు అంతా వెళ్లిపోయాక ‘‘ఏం కావాలమ్మా? వచ్చి చాలాసేపైనట్టుంది ... మందులు అడగడానికి అంత సిగ్గుపడితే ఎలా?’’ అన్నాడు షాపు యజమాని. ‘‘ఏం లేదండి .. నా కాబోయే భర్త ఒక డాక్టర్. ఆయన మొదటిసారి లవ్లెటర్ రాశారు. ఒక్క ముక్కా అర్థం కావడం లేదు. కాస్త చదివి పెడతారా?’’ అని మళ్లీ సిగ్గుపడింది ఆ జవరాలు.
7
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ గ్లిజరిన్ వాడితే పోలా .. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'గ్లిజరిన్ వాడితే పోలా ..' ‘‘మా ఆయనలో పెళ్లయినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పొచ్చింది వదినా ..’’ చెప్పింది రాజమణి. ‘‘మార్పంటే ...?’’ ప్రశ్నించింది సుబ్బమ్మ. ‘‘పెళ్లయిన కొత్తలో నా కంట్లో కన్నీరుని చూడలేకపోయేవాడు. ఇప్పుడు నా కంట్లో కన్నీరును చూడకుండా ఉండలేకపోతున్నాడు’’ గోడు వెళ్లబోసుకుంది రాజమణి.
13
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సెగ దెబ్బ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సెగ దెబ్బ' ‘‘నువ్వు అంత స్పీడ్గా ఎందుకు వెళ్తావు?’’ అడిగింది విమానం రాకెట్ను. ‘‘నీ కింద మంట పెట్టినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో’’ చెప్పింది రాకెట్.
10
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అదే నువ్వు ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదే నువ్వు ...' యాక్సిడెంట్లో ఒకేసారి చనిపోయిన భార్యాభర్తలు కొంత కాలం తర్వాత అనుకోకుండా పైలోకాలలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. ‘‘అరె .. చాలా కాలం తర్వాత కనిపించారు. కాని పూర్తిగా మారిపోయారండి మీరు ... అచ్చం దెయ్యంలా ఉన్నారు’’ అంది భార్య. ‘‘నువ్వు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు’’ బదులిచ్చి ఎగిరిపోయాడు భర్త.
7
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పట్టుదలే నన్నిక్కడికి చేర్చింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పట్టుదలే నన్నిక్కడికి చేర్చింది' భర్త: స్వామీ.. భార్యాభర్తల గొడవలలో ఎక్కువగా భర్తలే సర్దుకుపోతారు ఎందుకు స్వామీ.. స్వామి: తప్పదు నాయనా.. లేకపోతే భార్యలు బట్టలు సర్దుకు పోతారు.. భర్త: అంటే ఈ విషయంలో పట్టుదలగా ఉండే భర్తలే ఉండరా స్వామీ..? స్వామి: నేను లేనా నాయనా.. నా లాంటి వాళ్లందరూ ఒకప్పటి పట్టుదల కలిగిన భర్తలే!
10
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సారీ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సారీ' శనివారం సాయంత్రం జ్యువెలరీషా్పకి వచ్చిందో ప్రేమజంట. అక్కడి బంగారునగల్ని చూసి చూసి ఓ నెక్లె్స సెలెక్ట్ చేసుకుంది ప్రియురాలు. దాని ఖరీదు అయిదులక్షలు. అయిదులక్షలకీ చెక్ రాసి, షాప్ ఓనర్కి ఇచ్చాడు ప్రియుడు. చెప్పాడిలా.‘‘సోమవారం చెక్ క్యాష్ కాగానే వచ్చి ఆ నెక్లెస్ తీసుకుంటాను.’’‘‘ఓకే సార్’’సోమవారం వచ్చింది. షాప్కి ప్రియుడు ఒక్కడే వచ్చాడు.‘‘మీ చెక్ బౌన్స అయిందిసార్! మీ ఎకౌంట్లో డబ్బుల్లేవట!’’ చెప్పాడు షాప్ ఓనర్.‘‘ఆ సంగతి నాకూ తెలుసు. ప్రియురాలితో వీకెండ్స్ హాయిగా గడవాలంటే ఇలాంటివి తప్పవు, సారీ’’ అన్నాడు ప్రియుడు. **** ఎంతైనా మగాడు మగాడే! జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలూ!
5
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బాంబు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బాంబు' ఓ అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు ఓ కారులో బాంబును ఫిక్స్ చేస్తున్నారు. 1వ వ్యక్తి: మనం ఫిక్స్ చేస్తున్నప్పుడే ఈ బాంబు పేలిపోతే? 2వ వ్యక్తి: నాకూ ఆ అనుమానం ఉంది. అందుకే ఇంకో బాంబు రెడీగా ఉంచాను.
11
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక టీచర్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'టీచర్' తల్లి: చింటూ పరీక్ష పాసయ్యావా?చింటూ: నేనే కాదు, మా క్లాసులో అంతా పాసయ్యాం. పాస్ కానిది టీచరొకరే!తల్లి: అవునా?చింటూ: అవును మమ్మీ! నేనిందాక చూశాను కదా, పాపం సేమ్ క్లాసులో పాఠాలు చెప్పుకుంటూ కనిపించింది టీచర్.
8
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దోమలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దోమలు' భార్య: మీరిక్కడ ఏం చేస్తున్నారు?భర్త: దోమల్ని చంపుతున్నాను.భార్య: ఎన్నిటిని చంపారేం?భర్త: మూడు మగదోమల్ని, రెండు ఆడదోమల్ని, మొత్తం అయిదు దోమల్ని చంపాను.భార్య: ఆడా మగా ఎలా తెలుసుకున్నారు? భర్త: బీరుగ్లాసు మీద వాలినవి మూడూ మగదోమలు. అందులో అనుమానం లేదు. అలాగే అద్దం మీద వాలినవి రెండూ ఆడదోమలు.
10
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆవులించి చూడు.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆవులించి చూడు..' భర్త: ఏమోయ్.. బయట వర్షం పడుతోంది.. భార్య: ఇంట్లో శనగపిండి లేదు. ఉల్లిధర కొండెక్కి కూర్చుంది. పనమ్మాయి రాలేదు.. గిన్నెలన్నీ అలానే ఉన్నాయి .. అసలు ఇప్పుడు పకోడీ చేసే ఓపిక అసలు లేదు. భర్త: హూ...సరేలే.. భార్య: ఇంకో విషయం.. ఐస్ క్యూబ్స్ ఇవ్వమని అస్సలు అడగొద్దు. పిల్లలు పెరిగారు. ఈ మందు తాగడం లాంటివన్నీ ఇంట్లో పెట్టారంటే ఒప్పుకునేది లేదు.. భర్త: అలానే (దేవుడా.. మగాడి మనసులో మాటలని వీళ్లు ఎలా కనిపెట్టేస్తారో ఏమో...!)
13
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆ రోజుల్లో... అంతేమరి.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆ రోజుల్లో... అంతేమరి..' షష్టిపూర్తి జరుపుకున్న ఒక ముసలాయనకి ఒక వింత కోరిక పుట్టింది.. భార్యను పిలిచి ‘‘హనీ.. మనం మన యంగ్ ఏజ్లో ఎంత ఆనందంగా గడిపామో కదా.. ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుంటుందో కదా.. ఒక పని చేద్దాం. మనం పెళ్లి కాకముందు ఎలా గడిపామో ఒకసారి మళ్లీ అలా చేద్దాం. సరేనా...’’ అన్నాడు. భార్య సరేనంది. తర్వాత రోజు ముసలాయన బాగా ముస్తాబై, ఒక ఎర్ర గులాబి చేతిలో పట్టుకుని.. నది ఒడ్డున కూర్చొని ఎదురుచూడసాగాడు. ఎంతసేపు అయినా భార్య రాలేదు. (ముసలాయన మొబైల్ కూడా తీసుకెళ్లలేదు.. ఎందుకంటే ఆ రోజుల్లో మొబైల్ ఉండేది కాదు కదా!) 3, 4 గంటలు వెయిట్ చేశాక ఇంటికి వెళ్లి చూసేసరికి.. ముసలామె బయట అరుగు మీద కూర్చుని, ముసిముసి నవ్వులు నవ్వుతోంది. ముసలాయనకు తిక్కరేగింది. ‘‘ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎందుకు రాలేదు?’’ కోపంగా అరిచాడు. ముసలమ్మ సిగ్గుపడుతూ ‘‘నేను వద్దామనే అనుకున్నా.. కానీ మా మమ్మీ రానీయలేదు..’’ అని బదులిచ్చింది కూల్గా.
3
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఇంతకంటే మార్పా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఇంతకంటే మార్పా?' ‘‘మీకు ఏ వ్యాధి లేదు. కేవలం కొంత మార్పు ఉంటే సరిపోతుంది’’ చెప్పాడు డాక్టర్. ‘‘మార్పా .. ఈ మూడేళ్లలో నలుగురు భార్యలను, 8 కార్లను, పదిమంది వంటవాళ్లను, 22 మంది పనిమనుషులను మార్చాను ... ఇంతకంటే ఏం మార్పు చేసుకోగలను డాక్టర్?’’ అసహనంగా ప్రశ్నించాడు హీరో చిదానందం.
13
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ భూమి గుండ్రంగా ఉండును ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'భూమి గుండ్రంగా ఉండును' ‘‘మద్రాసుకు వచ్చిన కొత్తలో బీచ్లో బఠాణీలు అమ్ముతుండేవాడిని, దాంట్లో వచ్చిన ఆదాయంతో టీ కొట్టు పెట్టాను’’ ‘‘అవునా .. ఆ తర్వాత...’’ ‘‘టీ కొట్లో వచ్చిన లాభాలతో పెద్ద హోటల్ ప్రారంభించా’’ ‘‘భేష్ ... మంచి ఇంప్రూవ్మెంట్. ఆ తర్వాత..’’ ‘‘ఆ సమయంలో ఓ ప్రొడ్యూసర్తో స్నేహం కుదిరింది..’’ ‘‘అంతా దేవుడి దయ .. తర్వాత’’ ‘‘తర్వాత ఆయనతో కలిసి స్కోప్లో బ్రహ్మాండమైన సిన్మా తీశాను’’ ‘‘అదృష్టమంటే మీదే.. తర్వాత..’’ ‘‘ఇప్పుడు మళ్లీ బీచ్లో బఠాణీలు అమ్ముతున్నా’’
12
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సెలవు సెలవే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సెలవు సెలవే!' ‘‘మమ్మీ .. ఈ రోజు పార్కులో మా టీచర్ కనిపించింది’’ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు టింకూ. ‘‘మరి హలో చెప్పావా?’’ అడిగింది అమ్మ. ‘‘లేదు ... ఈ రోజు ఆదివారం కదా .. మర్చిపోయావా?’’ మళ్లీ తుర్రుమన్నాడు టింకూ.
11
['tel']
నిజం కానందుకేమో! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'నిజం కానందుకేమో!' ‘‘నేను చనిపోయే సన్నివేశం చూసి మా ఆవిడ వెక్కి వెక్కి ఏడ్చిందిరా ..’’ గొప్పగా చెప్పాడు హీరో బుచ్చిబాబు. ‘‘బహుశా అది నిజం కాదన్న సంగతి గుర్తొచ్చి ఉంటదిరా’’ మనసులో అనుకున్నది పొరపాటున బయటకే అనేశాడు చిట్టిబాబు.
1
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ రాయడమే తరువాయి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రాయడమే తరువాయి' ‘‘ఎగ్జామ్స్ రేపటినుండే కదా .. ప్రిపేరయ్యావా?’’ అడిగాడు తండ్రి. ‘‘ప్రిపేరయ్యా నాన్నారూ .. ఎగ్జామ్ పాడ్ కొత్తది కొని దానికి హాల్ టికెట్ అతికించా. పెన్నులో కొత్త రీఫిల్ వేసా. పెన్సిల్ షార్ప్గా చెక్కి పెట్టాను. బట్టలు తెల్లగా ఉతికించి ఇస్త్రీ చేయించా’’ చెప్పాడు తనయుడు.
10
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కిటుకు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కిటుకు' అబ్బాయిలు పెన్ పోయినా ఏడవరు, కాని అమ్మాయిలు పెన్సిల్ పోయినా ఏడుస్తారు. ఎందుకంటే అబ్బాయిలకి తెలుసు ఏడిస్తే పోయినవి తిరిగిరావని. కాని అమ్మాయిలకు బాగా తెలుసు .. ఏడిస్తే ఎవడో ఒకడు పెన్సిల్ కొనిస్తాడని!
3
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక జవాబు దొరకని ప్రశ్నలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'జవాబు దొరకని ప్రశ్నలు' భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా? భర్త: కరెక్టే! ఉన్నావు. భార్య: పిచ్చిపిచ్చిగా మాట్లాడకండి! మీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. *** భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా? భర్త: నువ్వా? లావా? లేవే! భార్య: ఏయ్! అబద్ధం! మీరు పెద్ద అబద్ధాలకోరు. *** భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా? భర్త: ఉన్నావా? ఏమో.... భార్య: ఏదీ అడిగిన వెంటనే చెప్పలేరేం? మాటే చెప్పలేని మీరు ఆఫీసులో అంతంత డెసిషన్స ఎలా తీసుకుంటున్నారో! *** భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా? భర్త: తెలీదు భార్య: కనిపించడం లేదా? కళ్ళు పోయాయా? *** భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా? భర్త: అది ఎలా చెప్పను? నువ్వు ఎలా ఉన్నావంటే... భార్య: ఎవరితోనో పోల్చి చెప్పొద్దు. నాకలాంటివి నచ్చవు. మీరూ...మీ బుద్ధీ.... *** భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా? భర్త: మౌనం వహించాడు. సమాధానం లేదు అతని దగ్గర నుంచి. భార్య: ఏఁవైంది మీకు? చెఁవుడొచ్చిందా? భార్యలడిగే కొన్ని ప్రశ్నలకు భర్తల దగ్గర సరైన సమాధానాలు ఉండవు. అప్పుడు వారేం చెయ్యాలంటే... యాహూనో, గూగుల్నో ఆశ్రయించాలి. తప్పదు.
8
['tel']
ఏం చేస్తాను? అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ఏం చేస్తాను?' రాత్రి పన్నెండైంది. ప్రియురాలికి ఫోన చేశాడు ప్రేమికుడు. అడిగాడు. ‘‘ఏం చేస్తున్నావు హనీ?’’ ‘‘ఏం చేస్తాను. ఇంతవరకూ చదివి చదివి, కాళ్ళు పీకుతున్నాయంటే అమ్మకి కాళ్ళు పట్టి, ఇప్పుడే నిద్రపోదామనుకుంటున్నాను.’’ అంది ప్రియురాలు. ఆవ లింత కూడా తీసింది. ‘‘నువ్వేం చేస్తున్నావు స్వీట్హార్ట్?’’ అడిగింది. ‘‘ఏం చేస్తాను. క్లబ్బులో మధుగాడి ఒళ్ళో కూర్చుని వాణ్ణి నువ్వు కిస్ చేస్తోంటే నీ వెనకే నిలబడి చూస్తున్నాను.’’ అన్నాడు ప్రియుడు.
1
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తేలిగ్గా ఉందిప్పుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తేలిగ్గా ఉందిప్పుడు' ‘‘నెల రోజులు వ్యాయామం చేస్తే ఆరు కిలోలు తగ్గాను తెలుసా?’’ సుధ. ‘‘నెల రోజులకు ఆరు కిలోలేనా? ఒక్క రోజులో నేను 70 కిలోలు తగ్గాను తెలుసా?’’ రమ. ‘‘మైగాడ్! నిజమా .. ఎలా?’’ సుధ. ‘‘మా ఆయనకు విడాకులిచ్చా’’ రమ..
5
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ... బాగా ముదిరింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: '... బాగా ముదిరింది' ‘‘అదేంటి .. ఆరు నెలల క్రితం నీ పేరు పక్కన బి.ఏ. అని బోర్డు ఉండేది. ఇప్పుడు ఎం.ఏ. అని తగిలించారు. ఎలా సాధ్యం?’’ అడిగాడు ఈశ్వర్రావు. ‘‘నా భార్య పోయిన కొత్త కాబట్టి బి.ఏ. (బాచిలర్ ఎగైన్) అని రాసుకున్నాను. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి ఎం.ఏ. (మేరేజ్ ఎగైన్) అని రాసుకున్నాను’’ చెప్పాడు పిచ్చేశ్వర్రావు.
7
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అదీ విషయం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ విషయం!' చెడు అలవాట్లు ఎంత హానికరమో పిల్లలకు బోధిస్తోంది టీచర్. ‘‘కాబట్టి .. బ్రాందీ, విస్కీ, రమ్ము వంటి మత్తు పదార్థాల జోలికి పోరాదు .. తెలిసిందా?’’ ‘‘నాకు ముందే తెలుసు టీచర్ .. మా డాడీ చెప్పారు’’ ‘‘వెరీగుడ్. డాడీ అంటే అలా ఉండాలి. మరి ఎందుకు తాగకూడదో చెప్పాడా?’’ ‘‘చెప్పాడు టీచర్. ఇద్దరు తాగితే డబ్బులకు ఇబ్బందవుతుందని ..’’
6
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఏ ఎండకాగొడుగు పట్టా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏ ఎండకాగొడుగు పట్టా!' ‘‘మీ బాస్ ఒక పట్టాన లీవు ఇవ్వడు కదా! రేపటికి లీవు ఎలా సాంక్షన్ చేశాడు?’’ అడిగాడు ముకుందం. ‘‘మా బాస్కు రాశిఫలాల పిచ్చి. రేపు నా రాశివారి ఆరోగ్యం బాగోదని రాసున్న పేపరు కటింగ్ను లీవ్ లెటర్కు అటాచ్చేశా ...’’ చెప్పాడు వైకుంఠం.
9
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ శంక లేదింకా ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'శంక లేదింకా ...' ప్రశ్న - సెల్ఫోన్ కెమెరా వల్ల ఐదు ఉపయోగములు వ్రాయుము. జవాబు - 1. ఊరెళ్లేటప్పుడు సిలిండర్, గీజర్, లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేసిన ఫోటోలు, ఇంటికి తాళం వేసిన ఫోటోలు, కొళాయి కట్టేసిన ఫోటోలు తీసుకుంటే .. దారిలో అనుమానమొచ్చినప్పుడంతా ఫోన్ చూసుకోవచ్చు. కెమెరాఫోన్ జిందాబాద్!’’ 2. - డిటో - 3 - డిటో - 4. - డిటో - 5. - డిటో- రిజల్ట్ - 100 / 100 మార్కులు
12
['tel']
గంగ్నంగాడిని మించిపోతా అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'గంగ్నంగాడిని మించిపోతా' ‘కక్కలేక మింగలేక’ అన్న సామెత ... గతంలో ‘క్లబ్ సాండ్విచ్’ అనే తిండి పదార్థం ఆర్డర్ చేసినవాడెవడో కనిపెట్టుంటాడు. ఆ సాండ్విచ్లో కిందనున్న బ్రెడ్ ముక్క గుజరాత్లో ఉంటే.. పై ముక్క ఆఫ్ఘనిస్థాన్లో ఉంటుంది. మధ్యలో బోలెడంత చెత్త. అయినా .. పోస్ట్ గ్రాడ్యుయేట్ని కదా.. ఎలాగోలా మ్యానేజ్ చేద్దామని డెంటిస్ట్ దగ్గర తెరిచినట్టు నోరు బార్లా తెరిచి, సాండ్విచ్ నోట్లో పెట్టుకున్నాను. ఇక చూడండి. ఆ మహాకాయాన్ని మింగలేను, బయటకు తీయలేను. పది నిమిషాలు అవస్థపడుతూనే ఉన్నాను. చుట్టూ ఉన్న జనం యూట్యూబ్లో పెట్టడానికి నా వీడియోలు తీస్తున్నారు. ఇది బయటకొస్తే ఆ గంగ్నం స్టైల్గాడి రికార్డును నేను కొట్టేసినట్టే.
1
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తోముడే నా పని ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తోముడే నా పని' మా పనిమనిషి అంట్లు సిన్సియర్గా తోమట్లేదని సాక్ష్యా ధారాలతో సహా నిరూపించాలని నిన్న రాత్రి సింకులో సీక్రెట్ కెమెరా పెట్టించాను. ఇవాళ ఇంటికొచ్చేసరికి మిగిలిన అంట్లతో పాటు కడిగి బోర్లించిన కెమెరా కూడా కనబడింది. (ప్రస్తుతం దాని లెన్స్ మీద అట్టలు కట్టిన విమ్ సబ్బును కడుగుతూ ఉన్నాను.)
9
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆలూ లేదు చూలూ లేదు ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆలూ లేదు చూలూ లేదు ...' డబ్బులేని ప్రొడ్యూసర్, స్ర్కిప్టు లేని దర్శకుడు కలిసి సినిమా ఎప్పుడు మొదలుపెట్టాలో మాట్లాడుకుంటుండగా ‘‘ఈ సినిమా నేను తప్పకుండా చేస్తాను..’’ అని మాటిచ్చాడు డేట్లు లేని హీరో. ఈలోగా పెద్ద మొత్తానికి చెక్కిచ్చి వాళ్ల ఏరియా రైట్స్ కొన్నాడు అకౌంట్లో పైసాలేని డిస్ట్రిబ్యూటర్. ఈ కథని సుఖాంతం చేయాలని ఎలాగైనా వృథాప్రయాస పడుతున్నాడు పెన్నులో ఇంకులేని రచయిత!
14
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అదీ విషయం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ విషయం!' చెడు అలవాట్లు ఎంత హానికరమో పిల్లలకు బోధిస్తోంది టీచర్. ‘‘కాబట్టి .. బ్రాందీ, విస్కీ, రమ్ము వంటి మత్తు పదార్థాల జోలికి పోరాదు .. తెలిసిందా?’’ ‘‘నాకు ముందే తెలుసు టీచర్ .. మా డాడీ చెప్పారు’’ ‘‘వెరీగుడ్. డాడీ అంటే అలా ఉండాలి. మరి ఎందుకు తాగకూడదో చెప్పాడా?’’ ‘‘చెప్పాడు టీచర్. ఇద్దరు తాగితే డబ్బులకు ఇబ్బందవుతుందని ..’’
3
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక స్వేచ్ఛ కోసం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'స్వేచ్ఛ కోసం' ‘‘జైల్లోంచి తప్పించుకు పారిపోయావు దేనికి?’’ లాయర్. ‘‘పెళ్లి చేసుకోవాలనిపించింది’’ గంగులు. ‘‘చేసుకున్నావా?’’ లాయర్. ‘‘చేసుకున్నాను’’ గంగులు. ‘‘మరి మళ్లీ వచ్చి లొంగిపోయావెందుకు?’’ లాయర్. ‘‘స్వేచ్ఛ కావాలనిపించింది ..’’ చెప్పాడు గంగులు.
5
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వాళ్లెందుకు వచ్చినట్టో? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వాళ్లెందుకు వచ్చినట్టో?' ‘‘మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది ఎదుటివారికి సహాయం చేయడానికే నాయనా’’ బోధించాడు గురూజీ. ‘‘మరి అవతలివారు ఎందుకు వచ్చినట్టు గురూజీ?’’ ప్రశ్నించాడు శిష్యుడు.
12
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అమ్మచెప్పింది! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అమ్మచెప్పింది!' ‘‘పన్నెండేళ్ల లోపు పిల్లలకు మాత్రమే హాఫ్ టికెట్ .... నీ వయసెంత బుజ్జీ?’’ ‘‘పదకొండు’’ ‘‘నీకు పన్నెండేళ్లు ఎప్పుడొస్తాయి?’’ ‘‘బస్సు దిగాక’’
12
['tel']
రెండేళ్లకోమారు ... అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'రెండేళ్లకోమారు ...' ‘‘పోయినసారి వచ్చినప్పుడు నాకు క్షవరం చేసింది ఎవరయ్యా?’’ అడిగాడు జులపాల ఆసామి. ‘‘నాకు తెలియదండి ... నేను ఈ షాపులో చేరి రెండేళ్లే అయ్యింది’’ చెప్పాడు క్షవరం చేసే కుర్రాడు.
1
['tel']
యథా పంతులు .. తథా విద్యార్థులు అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'యథా పంతులు .. తథా విద్యార్థులు' ‘‘ఎందుకురా .. స్కూల్ నుండి ఇంత లేట్గా వచ్చావు?’’ తల్లి. ‘‘మా టీచర్ పడుకున్నాడమ్మా .. లేచే సరికి ఆలస్యమైంది’’ పుత్రుడు. ‘‘ఆయన నిద్రపోతే మీరు రావడానికేంరా?’’ తల్లి. ‘‘మరి మమ్మల్ని నిద్ర లేపాల్సింది ఆయనే కదా’’ పుత్రుడు.
2
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ... బాగా ముదిరింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: '... బాగా ముదిరింది' ‘‘అదేంటి .. ఆరు నెలల క్రితం నీ పేరు పక్కన బి.ఏ. అని బోర్డు ఉండేది. ఇప్పుడు ఎం.ఏ. అని తగిలించారు. ఎలా సాధ్యం?’’ అడిగాడు ఈశ్వర్రావు. ‘‘నా భార్య పోయిన కొత్త కాబట్టి బి.ఏ. (బాచిలర్ ఎగైన్) అని రాసుకున్నాను. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి ఎం.ఏ. (మేరేజ్ ఎగైన్) అని రాసుకున్నాను’’ చెప్పాడు పిచ్చేశ్వర్రావు.
6
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మా పూచీ లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మా పూచీ లేదు' మొదటి రోజు ఎల్.కె.జి. క్లాసుకు వచ్చిన చిట్టి గౌనుకు ఒక స్లిప్ అంటించి ఉండటం చూసిన టీచర్ ఆశ్చర్యపోయింది. అందులో ఇలా రాసి ఉంది. ‘గమనిక : మా చిట్టి అల్లరికి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు మేము తీసుకోము - ఇట్లు చిట్టి అె్మూనాన్న’
5
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తేలిగ్గా ఉందిప్పుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తేలిగ్గా ఉందిప్పుడు' ‘‘నెల రోజులు వ్యాయామం చేస్తే ఆరు కిలోలు తగ్గాను తెలుసా?’’ సుధ. ‘‘నెల రోజులకు ఆరు కిలోలేనా? ఒక్క రోజులో నేను 70 కిలోలు తగ్గాను తెలుసా?’’ రమ. ‘‘మైగాడ్! నిజమా .. ఎలా?’’ సుధ. ‘‘మా ఆయనకు విడాకులిచ్చా’’ రమ..
5
['tel']
మా పద్ధతిలో ... అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'మా పద్ధతిలో ...' ‘‘ఒక్క మాథ్స్లో తప్పించి మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యావు ఎందుకురా..’’ ‘‘మాథ్స్ సారు ఒక్కరే మాకు అర్థమయ్యేలా చెబుతారు డాడీ ..’’ ‘‘అంటే ...?’’ ‘‘3ష x 3ష = 9 తార .. ఇిాగన్నమాట!’’
1
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నేను సినిమా చూడాలి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నేను సినిమా చూడాలి' పెళ్లయ్యాక మొదటిసారి భార్యతో కలిసి సినిమాకు వెళ్లాడు ఘనశ్యామ్. ఇంటర్వెల్లో బయటకి వెళ్లి పావుకిలో బఠాణీల పొట్లం తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టాడు. ఆమె రెండు బఠాణీలు కటకట మనిపించి ‘‘మీరూ తీసుకోండి’’ అని పొట్లం అందించింది. ‘‘అక్కర్లేదు .. అవి నీకోసమే. నేను మాట్లాడకుండా సినిమా చూడగలను’’ మెడ తిప్పకుండా బదులిచ్చి కళ్లను తెరకప్పగించేశాడు ఘనశ్యామ్.
9
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వడియాలివ్వండి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వడియాలివ్వండి!' ‘‘శర్మా .. ఇలా రాస్తే నేను నీకు గుడ్లు ఇవ్వక తప్పదోయ్ .. ’’ ఆన్సర్ పేపర్ దిద్దుతూ అంది టీచర్. ‘‘అయ్యో ... గుడ్లు వద్దు మేడమ్. మేం శాకాహారులం’’ బతిమాలాడు శర్మ.
10
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నీ కొడుకుని నాన్నారూ .. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నీ కొడుకుని నాన్నారూ ..' ‘‘ఏరా నిన్న ఒకమ్మాయితో కలిసి రెస్టారెంట్లోకి వెళ్లడం చూశాను ... బిల్ ఎంతయ్యిందేమిటి?’’ నిలదీశాడు తండ్రి. ‘‘సుమారు ఏడువేలయింది నాన్నారూ ..’’ చెప్పాడు తనయుడు. ‘‘అమ్మో .. ’’ నోరుబాదుకున్నాడు తండ్రి. ‘‘ఆ అమ్మాయి దగ్గర అంతకంటే ఎక్కువలేవు మరి’’ చెప్పాడు తనయుడు.
5
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఏ గాన్ అయితేంటి? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏ గాన్ అయితేంటి?' చెత్త కుండీలో కొస ప్రాణంతో కొట్టుకుంటున్నాయి రెండు బొద్దింకలు. ‘‘నీది కూడా బేగాన్ దెబ్బేనా?’’ అడిగింది మొదటి బొద్దింక. ‘‘కాదు. పారగాన్’’ చెప్పింది రెండో బొద్దింక.
6
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అలా వచ్చానన్నమాట! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అలా వచ్చానన్నమాట!' ‘‘డాడీ .. మార్కెట్లోకి కొత్త రకం టీవీని మంచి ఆఫర్లో అమ్ముతున్నారు. కొనడానికి డబ్బుందా..’’ అడిగాడు పుత్రరత్నం. ‘‘ఉంది. కాని మనింట్లో ఆల్రెడీ ఒక టీవీ ఉంది కదరా .. ’’ చెప్పాడు దామోదరం. ‘‘నిజానికి నాకు డబ్బు కావాలి. డైరెక్టుగా డబ్బుందా అంటే మీరు కచ్చితంగా లేదంటారని ...’’ అసలు సంగతి చెప్పాడు పుత్రరత్నం.
6
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పిడుగు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పిడుగు' ‘‘బంగారం లాంటి పాలు .. పిల్లి పాలు చేశావు కదరా ..’’ అరిచింది తల్లి. ‘‘గేదెపాలు పిల్లిపాలు ఎలా అవుతాయమ్మా .. విడ్డూరం కాకపోతే’’ ప్రశ్నించాడు సుపుత్రుడు.
9
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సలహా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సలహా' ‘‘ఒకమ్మాయిని పడేయాలంటే ఏం మిషన్ ఉపయోగించాలో అది నేర్పించండి’’ చెప్పాడు సుధాకర్ జిమ్ మాస్టారుతో. ‘‘అలాంటి మిషన్లు ఇక్కడ లేవు. బయటకెళ్లి ఎ.టి.ఎమ్. మిషన్ ఉపయోగించు’’ సలహా ఇచ్చాడు జిమ్ మాస్టర్.
12
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సలహాల వైద్యుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సలహాల వైద్యుడు' ‘‘ఈ మధ్య కళ్లు బాగా లాగేస్తున్నాయి డాక్టర్’’ చెప్పాడు మదన్ కుమార్. కళ్లు పరీక్షించి ‘‘కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేయండి’’ సలహా ఇచ్చాడు డాక్టర్ ఏఝదంతం.
5
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రివర్స్గేర్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రివర్స్గేర్' ‘‘ఒక స్వెట్టర్ అల్లడానికి మూడు గొర్రెలు కావాలి తెలుసా?’’ చెప్పింది అనసూయ. ‘‘ఏమిటేమిటి ... గొర్రెలు కూడా స్వెట్టర్లు అల్లడం నేర్చేసుకున్నాయా ...’’ ముక్కున వేలేసుకుంది మంగతాయారు.
8
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అసరసుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అసరసుడు' అప్పుడే స్నానం చేసి వచ్చిన అలివేలుని తినేసేలా చూశాడు ఆనందరావు. ‘‘మీరలా చూడకండి బాబూ ... చచ్చేంత సిగ్గు నాకు’’ మెలికలు తిరిగింది అలివేలు. ‘‘నేను పెట్టుకున్న వేన్నీళ్లతో ఎందుకు స్నానం చేశావ్?’’ గుడ్లురిమాడు ఆనందరావు.
6
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆలోచనలో బిజీగా ఉన్నా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆలోచనలో బిజీగా ఉన్నా' ‘‘ఏరా .. గంటనుండి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు?’’ అడిగింది టీచర్. ‘‘సమయాన్ని వృథా చేయకుండా ఉండడం ఎలా అని ఆలోచిస్తున్నాను టీచర్’’ చేతులు కట్టుకుని చెప్పాడు విద్యార్థి.
12
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నాదెప్పుడూ ఒకటే మాట! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నాదెప్పుడూ ఒకటే మాట!' ‘‘అప్పు తీసుకుని ఏడాది దాటిపోయింది .. ఇంతవరకు బాకీ తీర్చే సూచనలేవీ కనిపించడం లేదు’’ నిలదీశాడు సుబ్బిశెట్టి. ‘‘మళ్లీ అడుగుతావేం? అప్పు తీసుకున్నప్పుడే చెప్పాగా ..’’ అన్నాడు కోదండరామయ్య. ‘‘ఏం చెప్పావు?’’ నొసలు చిట్లించాడు సుబ్బిశెట్టి. ‘‘నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని’’ తాపీగా బదులిచ్చాడు కోదండరామయ్య.
14
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మార్గం ఉంది నాయనా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మార్గం ఉంది నాయనా!' ‘‘డాక్టరుగారూ .. ఇంజక్షన్ అంటే నాకు భయమండి. మరో మార్గమేదైనా ఉంటే చూద్దురూ’’ భయంగా అన్నాడు గంగాధరం. ‘‘అలాగే .. ఈ మత్తుమందు పీల్చండి. మీరు మూర్ఛపోయాక ఇంజక్షన్ చేస్తాను’’ చెప్పాడు డాక్టర్ జ్ఞానానందం.
13
['tel']
స్వర్గసీమలో ... అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'స్వర్గసీమలో ...' ‘‘ఏమండీ .. స్వర్గంలో భార్యాభర్తలను ఒకే చోట ఉంచరట ...’’ టీవీలో మోక్షానంద స్వామి ప్రవచనాలు వింటూ అరిచింది సుబ్బలక్ష్మి. ‘‘అలా ఉంచితే అది స్వర్గమెలా అవుతుంది ...’’ వంటింట్లోంచి బదులు పలికాడు వీరబాబు.
2
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఇకనుండి నోట్లివ్వండి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఇకనుండి నోట్లివ్వండి!' ‘‘చిల్లర తిండి తినవద్దని నీకు ఎన్ని సార్లు చెప్పానురా’’ కసిరాడు తండ్రి. ‘‘కాని నువ్వు నాకిచ్చింది కూడా చిల్లరే కదా డాడీ’’ అమాయకంగా అడిగాడు పుత్రరత్నం.
12
['tel']
గొడవలో గోవిందం! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'గొడవలో గోవిందం!' ఏదో మిష మీద టైపిస్టు సుభద్ర, గుమాస్తా సూరిబాబు రెచ్చిపోయి తిట్టుకుంటున్నారు. ‘‘ఛీ ఛీ .. నీలాంటి కుక్క ఈ ఆఫీసులో మరొకడు లేడు’’ అరిచింది సుభద్ర. అప్పుడే ఆఫీసులోకి అడుగుపెట్టిన మేనేజరు ‘‘ఏంటా అరుపులు ... ఇక్కడ నేనున్నాను’’ అన్నాడు కోపంగా.
1
['tel']
తప్పులెన్ను మగడు అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'తప్పులెన్ను మగడు' ‘‘డార్లింగ్ మన పెళ్లయిన ఈ ఒక్కరోజులోనే నీలో లోపాలెన్ని ఉన్నాయో కనిపెట్టాను ... చెప్పమంటావా?’’ అన్నాడు శేషగిరి. ‘‘ఒప్పుకుంటానండి. నాలో లోపాలు ఉండబట్టే మంచి భర్తను పొందలేకపోయాను ..’’ అమాయకంగా అంటించింది ఆదిలక్ష్మి.
2
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నీ తాత దిగిరావాలి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నీ తాత దిగిరావాలి' ‘‘ఐ లవ్ యూ’’ ప్రపోజ్ చేసింది కోడిపుంజు. ‘‘సారీ ... ఐ కాంట్ ’’ ముఖం తిప్పుకుంది పెట్ట. ‘‘నీకోసం ఏమైనా చేస్తా ... గుండు ఎత్తమంటావా?’’ తొడకొట్టింది పుంజు. ‘‘గుడ్డు పెట్టు చాలు’’ చెప్పింది పెట్ట.
7
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తొక్కలో సూక్తి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తొక్కలో సూక్తి' ‘‘జీవితంలో మీరంతా గుర్తుపెట్టుకోవలసింది ఒకటుంది. ఏ చెట్టయినా గాలి వీస్తే ఊగుతుంది ... వీయకపోతే ఊగదు’’ - శ్రీశ్రీశ్రీ వృక్షానందగిరిస్వాములు.
3
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చావు ముందే రాకూడదా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చావు ముందే రాకూడదా!' తొంభై ఏళ్ల భద్రయ్య చచ్చి స్వర్గానికి వెళ్లిన గంటలోపే దొర్లి దొర్లి ఏడ్చాడు. కంగారు పడ్డ దేవేంద్రుడు ‘‘స్వర్గానికి వచ్చినందుకు సంతోషించక, నరకానికి పోయినట్టు ఏడుస్తావేం?’’ అని చిరాకు పడ్డాడు. తన చుట్టూ ఉన్న అప్సరసలను ఆబగా చూస్తూ‘‘ఈ దివ్యమైన చావు 60 ఏళ్ల క్రితమే ఎందుకు రాలేదని’’ కళ్లు తుడుచుకుంటూ చెప్పాడు భద్రయ్య.
10
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఏ క్లాస్ వెంగళప్ప ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏ క్లాస్ వెంగళప్ప' ‘‘అలా తిరగడం దేనికి? కుదురుగా ఒక దగ్గరుండి ఫోన్ చేసుకోవచ్చు కదా’’ సలహా ఇచ్చింది అలివేలు. ‘‘నా ఫ్రెండ్కు కాల్ చేస్తే ‘తిరిగి’ ప్రయత్నించండి అంటోంది ఎవరో అమ్మాయి - అందుకే’’ చెప్పాడు వీరభద్రం.
7
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తండ్రి తెలివి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తండ్రి తెలివి' ‘‘డాడీ ... నీటినుండి కరెంట్ ఎందుకు తీస్తారు?’’ అడిగాడు పుత్రరత్నం. ‘‘మనం స్నానం చేసినప్పుడు షాక్ కొడుతుందని’’ చెప్పాడు జనకుడు.
7
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ రేటు కనుక్కో! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రేటు కనుక్కో!' పెళ్లాం దొంగ మొగుడితో - ‘‘ఇదిగో నిన్నే ... చుట్టు పక్కలవాళ్లు మన టీవీ రేటెంతని అడుగుతుంటే చెప్పలేక సిగ్గుతో చస్తున్నా ... రేపయినా దాని రేటెంతో షాపులో కనుక్కో’’
12
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పండంటి కాపురం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పండంటి కాపురం' ‘‘నేను నిన్ను ఒక్కసారైనా చూడకుండా పెళ్లికి ఎలా ఒప్పుకున్నానో అర్థం కావడం లేదు ... ’’ భార్య. ‘‘హూఁ ... నేను నిన్ను చూసి కూడా ఎలా పెళ్లి చేసుకున్నానో నాకు అర్థం కావడం లేదు?’’ భర్త
12
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కొంప మునిగింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కొంప మునిగింది' వరుడి పేరు శేషు, వధువు పేరు కీర్తి. ఆ మార్యేజ్ హాలు ముందు వధూవరుల ఫోటోలతో పాటు ‘‘కీర్తిశేషుల వివాహానికి తరలిరండి’’ అని రాసి ఉంది.
13
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మొదటిసారి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మొదటిసారి' జంబులింగం జీవితంలో మొదటిసారి శంభులింగంతో కలిసి ఒక స్టార్ హోటల్కు వెళ్లాడు. ‘‘ఏం కావాలి సార్?’’ శంభులింగాన్ని ఉద్దేశించి అడిగాడు వెయిటర్. ‘‘మెనూ తీసుకురా’’ చెప్పాడు శంభులింగం. వెయిటర్ తనని అడక్కముందే ‘‘నేను కూడా మెనూనే తింటాను’’ చెప్పాడు జంబులింగం.
12
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కాపీ కొట్టకుండా ... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కాపీ కొట్టకుండా ...' ‘‘ఆపరేషన్కు ముందు పేషంట్కు మత్తుమందు ఎందుకు ఇస్తారో చెప్పగలవా రామూ?’’ అడిగింది టీచర్. ‘‘తాము చేసే ఆపరేషన్ పేషంటు చూసి నేర్చుకుంటాడేమోనన్న భయంతో అయ్యుంటుంది టీచర్’’ చెప్పాడు రాజు.
3
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బాధల గని ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బాధల గని' ‘‘పెళ్లయిన మగాళ్లకే ఎక్కువగా పొట్ట వస్తుంది ఎందుకురా?’’ అడిగాడు ఒకటో తాగుబోతు. ‘‘బాధలన్నీ కడుపులో దాచుకుంటారు కాబట్టి’’ చెప్పాడు రెండో తాగుబోతు.
3
['tel']