sloka
stringlengths
77
449
verse
int64
1
78
chapter
int64
1
18
audio
stringlengths
59
63
w2w_meaning
stringlengths
213
1.29k
te_translation
stringlengths
127
741
commentry
stringlengths
0
11.1k
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః । జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమచిరేణాధిగచ్ఛతి ।। 39 ।।
39
4
https://www.holy-bhagava…udio/004_039.mp3
శ్రద్ధావాన్ — శ్రద్ధగల వ్యక్తి; లభతే — సాధించును (పొందును); జ్ఞానం — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం; తత్పరః — దాని యందే లగ్నమై; సంయత — నియంత్రణ కలిగి; ఇంద్రియః — ఇంద్రియములు; జ్ఞానం — అలౌకిక జ్ఞానం; లబ్ధ్వా — పొందిన తరువాత; పరాం — అత్యున్నత; శాంతిం — శాంతి; అచిరేణ — తక్షణమే; అధిగచ్ఛతి — పొందును
BG 4.39: గాఢమైన శ్రద్ధావిశ్వాసాలు కలవారు మరియు తమ మనో-ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసినవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్ఠమైన అలౌకిక జ్ఞానంతో వారు అతిత్వరగా శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు.
శ్రీ కృష్ణుడు ఇప్పుడు జ్ఞాన విషయంలో, శ్రద్ధావిశ్వాసాలను పరిచయం చేస్తున్నాడు. అన్ని ఆధ్యాత్మిక సత్యాలూ తక్షణమే అర్థం కావు; కొన్నింటిని ఆధ్యాత్మిక పథంలో ఉన్నతమైన స్థాయి చేరుకున్న తరువాతే అనుభవించగలము. మనం ప్రస్తుతం అర్థం చేసుకోగలిగే లేదా పరీక్షించగలిగే విషయాలనే ఒప్పుకుంటే, ఉన్నతమైన ఆధ్యాత్మిక రహస్యాలను అందుకోలేము. మనం ప్రస్తుత సమయంలో అర్థం చేసుకోలేనివాటిని ఒప్పుకోవటానికి విశ్వాసము/నమ్మకము అనేవి చాలా సహకరిస్తాయి. జగద్గురు శంకరాచార్యులు, శ్రద్ధ అన్న పదాన్ని ఈ క్రింది విధంగా నిర్వచించారు:గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాసః శ్రద్ధాః‘గురువు మరియు శాస్త్రముల పట్ల దృఢ విశ్వాసమునే శ్రద్ధ అంటారు.’ ఒకవేళ ఇలాంటి శ్రద్ధ తప్పుడు వ్యక్తి మీద పెడితే, అది భయానక పరిణామాలకు దారితీయవచ్చు. కానీ అదే శ్రద్ధ ఒక నిజమైన గురువు మీద పెడితే అది శాశ్వత సంక్షేమం దిశగా మనలను తీస్కువెళుతుంది.అదే సమయంలో, గుడ్డి విశ్వాసం మంచిది కాదు. ఏదో ఒక గురువు మీద అటువంటి శ్రద్ధ ఉంచే ముందు, మన బుద్ధిని ఉపయోగించి ఆ గురువు పరమ సత్యాన్ని ఎఱిఁగినవాడని, మరియు దానిని ఆయన వేద ప్రమాణంగా ఉపదేశిస్తున్నాడని నిర్ధారణ చేసుకోవాలి. దీనిని నిశ్చయించుకున్న తరువాత, ఇటువంటి గురువు మీద మన నమ్మకాన్ని పెంచుకోవటానికి కృషిచేయాలి మరియు వారి మార్గదర్శకత్వంలో భగవంతునికి శరణాగతి చేయాలి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటుంది:యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా గురౌ,తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః (6.23)‘గురువు మరియు భగవంతుని పట్ల భక్తిపై నిస్సంకోచమైన దృఢమైన విశ్వాసం కలవారికి వేదముల జ్ఞాన సారం, వారి హృదయంలో తెలియచేయబడుతుంది.’
అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి । నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః ।। 40 ।।
40
4
https://www.holy-bhagava…udio/004_040.mp3
అజ్ఞః — అజ్ఞానులు; చ — మరియు; అశ్రద్ధధానః — శ్రద్ధ/విశ్వాసం లేని వారు; సంశయ ఆత్మా — సంశయము కలవాడు; వినశ్యతి — పతనమగును; న — కాదు; అయం — ఈ యొక్క; లోకః — లోకము; అస్తి — ఉండుట; న — లేదు; పరః — తరువాతి; న – కాదు; సుఖం — సుఖసంతోషాలు; సంశయ-ఆత్మనః — సంశయాత్మునకు (అనుమానం కలవానికి).
BG 4.40: జ్ఞానము, విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు, పతనమైపోతారు. విశ్వాసములేక, సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పర లోకంలో కూడా సుఖం ఉండదు.
భక్తి రసామృత సింధు - సాధకులను వారి విశ్వాసం మరియు జ్ఞాన స్థాయిలను బట్టి మూడు రకాలుగా వర్గీకరించింది.శాస్త్రే యుక్తౌ చ నిపుణః సర్వథా దృఢ-నిశ్చయఃప్రౌఢ-శ్రద్ధో ఽధికారీ యః స భక్తావుత్తమో మతఃయః శాస్త్రాదిష్వనిపుణః శ్రద్ధావాన్ స తు మధ్యమఃయో భవేత్ కోమల శ్రద్ధః స కనిష్ఠో నిగద్యతే(1.2.17-19)‘శాస్త్ర పరిజ్ఞానం కలిగిఉండి మరియు దృఢ విశ్వాసం కూడా ఉన్న వ్యక్తి అత్యున్నత సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా గురువు మరియు భగవంతునిపై విశ్వాసం/నమ్మకం ఉన్న వ్యక్తి మధ్యమ స్థాయి సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకుండా మరియు విశ్వాసం కూడా లేనివాడు నిమ్న స్థాయి సాధకుడు.’ శ్రీ కృష్ణుడు, ఈ మూడవ రకం వారు ఈ జన్మలో గాని లేదా ఆ పై జన్మలలో గాని సుఖము పొందలేరు అని వివరిస్తున్నాడు.ప్రాపంచిక కార్యకలాపాలకు కూడా నమ్మకం అవసరం. ఉదాహరణకి, ఒక మహిళ హోటల్‌కి వెళ్లి, భోజనం ఆర్డర్ చేసింది అనుకుందాం, ఆమెకి ఆ హోటల్ వాళ్ళు ఆమె ఆహారంలో విషం కలపరు అన్న నమ్మకం ఉందన్నమాట. కానీ ఒకవేళ, ఆమెకి అన్నీ అనుమానాలే ఉండి, అన్నీ ఆహార పదార్థాలని మొదట రసాయన పరీక్ష చేయదలిస్తే, ఆమె తన భోజనాన్ని ఆస్వాదిస్తూ దాన్ని భుజించేదెప్పుడు? అదే విధంగా, ఒక వ్యక్తి గడ్డం చేసుకోవటానికి క్షురకుని కొట్టుకి వెళ్లి, అక్కడ కుర్చీలో కూర్చున్నాడనుకోండి. క్షురకుడు తన పదునైన కత్తిని ఆయన మెడ మీద తిప్పుతాడు. ఇప్పుడు ఆ వ్యక్తి క్షురకునిపై, తనను హత్య చేస్తాడేమో అన్న అనుమానం ఉంటే, క్షురకుడు గడ్డం గీయటానికి ఆ వ్యక్తి కుర్చీలో నిలకడగా కూర్చోలేడు. కాబట్టి, అనుమానపు వ్యక్తులకు ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖం లేదు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ । ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ।। 41 ।।
41
4
https://www.holy-bhagava…udio/004_041.mp3
యోగ-సన్న్యస్త-కర్మాణం — కర్మ కాండలను త్యజించి, శరీరము-మనస్సు-ఆత్మ ను భగవత్ సేవకే ఉపయోగించే వారు; జ్ఞాన — జ్ఞానముచే; సంఛిన్న — పోగొట్టబడి; సంశయమ్ — సంశయములు (సందేహాలు); ఆత్మ-వంతం — ఆత్మ జ్ఞానంలో స్థితులై; న — కాదు; కర్మాణి — కర్మలు; నిబధ్నంతి — బంధించును; ధనంజయ — అర్జునా, సంపదను జయించేవాడా.
BG 4.41: ఓ అర్జునా, యోగాగ్నిలో కర్మలను త్యజించి, జ్ఞానంతో తమ అన్ని సందేహాల నివృత్తి చేయబడి, ఆత్మ జ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు.
‘కర్మ’ అంటే విహిత ఆచారములు మరియు సామాజిక విధులు నిర్వర్తించటంలో ఉన్న అన్ని క్రియాకలాపములు; ‘సన్యాసం’ అంటే ‘త్యజించుట/విడిచిపెట్టుట’; ‘యోగ్’ అంటే ‘భగవంతునితో ఐక్యత’. ఇక్కడ శ్రీ కృష్ణుడు యోగసన్న్యస్త కర్మాణం అన్న పదం వాడాడు, అంటే ‘పూజాది అన్ని కర్మకాండలను త్యజించి, తమ శరీర-మనస్సు-ఆత్మలను భగవంతునికే అంకితం చేసేవారు’ అని. అలాంటి వారు తమ అన్ని క్రియలను భగవత్ సేవగా చేస్తారు. భక్తి యుక్తముగా వారు చేసే పనులు వారిని కర్మ బంధములలో పెనవేయవు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. తన స్వార్థ ప్రయోజనం కోసం చేసే కర్మలే వ్యక్తిని కర్మ బంధములలో కట్టివేస్తాయి. ఎప్పుడైతే పనులను కేవలం భగవత్ ప్రీతి కోసం మాత్రమే చేసినప్పుడు, వాటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు. అంటే సంఖ్యలను 0 (సున్నా) తో గుణించినట్టే. పదిని సున్నాతో గుణిస్తే ఫలితం సున్నా; వెయ్యిని సున్నాతో గుణిస్తే ఫలితం సున్నాయే; లక్షను సున్నాతో గుణిస్తే, ఫలితం ఇంకా సున్నాగానే ఉంటుంది. అదే విధంగా, జ్ఞానోదయమైన జీవాత్మలు ఈ లోకంలో చేసే పనులు, వారిని కర్మ బంధములలో పడవేయవు, ఎందుకంటే వాటిని యోగాగ్నిలో భగవత్ అర్పితము చేస్తారు, అంటే భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. ఈ విధంగా, అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా, మహాత్ములు కర్మ బంధములలో చిక్కుకోరు.
తస్మాదజ్ఞానసంభూతం హృత్-స్థం జ్ఞానాసినాత్మనః । ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ।। 42 ।।
42
4
https://www.holy-bhagava…udio/004_042.mp3
తస్మాత్ — కాబట్టి; అజ్ఞాన-సంభూతం — అజ్ఞానము చే జనించిన; హృత్-స్థం — హృదయంలో ఉన్న; జ్ఞాన — జ్ఞానమనే; అసినా — ఖడ్గముతో; ఆత్మనః — ఆత్మ యొక్క; ఛిత్త్వా — ముక్కలు చేయుము; ఏనం — ఈ యొక్క; సంశయం — సందేహమును; యోగం — కర్మ యోగంలో; ఆతిష్ఠ — ఆశ్రయించి; ఉత్తిష్ఠ — లెమ్ము; భారతః — ఓ, భరత వంశీయుడా.
BG 4.42: కాబట్టి, జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము. ఓ భరత వంశీయుడా, కర్మ యోగంలో స్థితుడవై ఉండుము. లెమ్ము, నీ కర్తవ్య నిర్వహణ చేయుము.
ఇక్కడ 'హృదయం' అన్న పదం ఛాతీలో ఉన్న రక్తాన్ని పంప్ చేసే భౌతిక పరికరాన్ని సూచించేది కాదు. వేదముల ప్రకారం భౌతిక మెదడు అనేది శిరస్సులో ఉంటుంది కానీ సూక్ష్మమైన మనస్సు హృదయ ప్రాంతంలో ఉంటుంది. అందుకే ప్రేమ, ద్వేషాలలో హృదయంలో నొప్పి అనుభవిస్తారు. ఈ లెక్కలో, కరుణ, ప్రేమ, జాలి వంటి మంచి భావనలకు హృదయమే మూల స్థానం. కాబట్టి శ్రీ కృష్ణుడు 'హృదయంలో జనించిన సందేహాలు' అన్నప్పుడు నిజానికి 'మనస్సులో జనించిన సందేహాలు' అని అర్థం; మనస్సు అనేది హృదయ ప్రాంతంలో ఉండే సూక్ష్మ ఉపకరణము. అర్జునుడి ఆధ్యాత్మిక గురువు స్థానంలో ఉన్న శ్రీ కృష్ణుడు, తన శిష్యునికి కర్మ యోగ అభ్యాసం ద్వారా లోతైన విజ్ఞానం ఎలా తెలుసుకోవాలో ఉపదేశించాడు. ఇప్పుడు ఈ విజ్ఞానాన్ని మరియు విశ్వాసాన్ని ఉపయోగించుకొని తన మనస్సులో ఉన్న సందేహాలను పెకిలివేయమని ఉపదేశిస్తున్నాడు. తదుపరి, అర్జునుడిని తన కర్తవ్య నిర్వహణ కోసం, లేచి, తన విధిని, కర్మయోగ దృక్పథంలో నిర్వర్తించమని పిలుపునిస్తున్నాడు. అయితే, కర్మ చేయకుండుము మరియు కర్మలో నిమగ్నమవ్వుము అన్న ద్వంద్వ ఉపదేశం అర్జునుడి మనస్సుని ఇంకా తికమక పెడుతూనే ఉంది, దీనినే తదుపరి అధ్యాయం మొదట్లో వ్యక్త పరుస్తున్నాడు.
అర్జున ఉవాచ । సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి । యఛ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ।। 1 ।।
1
5
https://www.holy-bhagava…udio/005_001.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; సన్న్యాసం — సన్యాసము; కర్మణాం — కర్మల యొక్క; కృష్ణ — శ్రీ కృష్ణ; పునః — మరల; యోగం — కర్మ యోగం గురించి; చ — మరియు; శంససి — ప్రశంసించావు; యత్ — ఏదైతే; శ్రేయః — ఎక్కువ శేయస్కరమో; ఏతయో — ఈ రెంటిలో; ఏకం — ఒకటి; తత్ — అది; మే — నాకు; బ్రూహి — దయచేసి చెప్పుము; సు-నిశ్చితమ్ — నిర్ణయాత్మకముగా.
BG 5.1: అర్జునుడు అన్నాడు : ఓ శ్రీ కృష్ణా, నీవు కర్మ సన్యాసమును (పనులను త్యజించుట) ప్రశంసించావు మరియు కర్మ యోగమును (భక్తితో పనిచేయుట) కూడా చేయమన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము?
అర్జునుడు అడిగిన పదహారు ప్రశ్నలలో ఇది ఐదవది. శ్రీ కృష్ణుడు పనులను త్యజించటమును మరియు భక్తితో పని చేయటమును రెంటినీ ప్రశంసించాడు. పైకి విరుద్ధంగా అనిపించే ఈ రెండు ఉపదేశములతో అర్జునుడు తికమక పడి, ఈ రెంటిలో ఏది తనకు ఎక్కువ శ్రేయస్సుని కలుగచేసేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ ప్రశ్న ఏ సందర్భంలో వచ్చిందో ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం, అర్జునుడి శోకం యొక్క తీరు వివరించి, శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించటానికి ఒక చక్కటి వాతావరణం కలిగించింది. రెండవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఆత్మ జ్ఞానాన్ని తెలియపరిచాడు; ఆత్మ నిత్యమైనది, నాశము లేనిది కాబట్టి, ఎవరూ నిజానికి యుద్ధంలో చనిపోరు, కాబట్టి శోకించటం తెలివితక్కువ పని అని చెప్పాడు. తదుపరి, అర్జునుడికి ఒక వీరుడిగా తన కర్మ (సామాజిక విధి), యుద్ధంలో ధర్మ పక్షం వైపు పోరాడటమే అని చెప్పాడు. కానీ, కర్మ అనేది వ్యక్తులను కర్మ-ఫల బంధములకు కట్టివేస్తుంది కాబట్టి అర్జునుడిని తన కర్మ ఫలములను భగవత్ అర్పితము చేయమన్నాడు, శ్రీ కృష్ణుడు. అప్పుడు అతని పనులు కర్మ యోగమవుతాయి, అంటే ‘పనుల ద్వారా భగవత్ సంయోగము.’ మూడవ అధ్యాయంలో, కర్తవ్య నిర్వహణ చేయటం అవశ్యకమైనది ఎందుకంటే అది మన అంతఃకరణ శుద్ధికి చాలా దోహద పడుతుంది అని ఆ పరమాత్మ చెప్పాడు. కానీ, అంతఃకరణ శుద్ధి సాధించిన వ్యక్తి ఎలాంటి సామాజిక విధులను నిర్వర్తించే అవసరం లేదు అని కూడా చెప్పాడు (శ్లోకం 3.17). నాలుగవ అధ్యాయంలో భగవంతుడు చాల రకాల యజ్ఞముల (భగవత్ ప్రీతి కొరకు చేసే కార్యములు) గురించి విశదీకరించాడు. యాంత్రికమైన కర్మకాండలతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానముతో కూడిన యజ్ఞము శ్రేయస్కరమైనదని చెప్పాడు. అన్ని యజ్ఞములు కూడా చివరకి మనకు భగవంతునితో ఉన్న సంబంధము యొక్క జ్ఞానాన్ని తెలియజేయుటకే దారి తీస్తాయి అని చెప్పాడు. చివరికి 4.41వ శ్లోకంలో, కర్మ సన్యాస విషయాన్ని పరిచయం చేసాడు; దీనిలో కర్మకాండలు మరియు సామాజిక విధులు త్యజించి వ్యక్తి పూర్తిగా శరీరము, మనస్సు, మరియు ఆత్మతో భక్తి పూరిత సేవలోనే నిమగ్నమౌతాడు. ఈ ఉపదేశాలన్నీ అర్జునుడిని అయోమయానికి గురి చేసాయి. అతను కర్మ సన్యాసము మరియు కర్మ యోగము రెండూ విరుద్ధ స్వభావాలతో కూడినవి అనుకున్నాడు, మరియు ఈ రెంటినీ ఒకేసారి చేయలేమనుకున్నాడు. కాబట్టి, తన సందేహాన్ని శ్రీ కృష్ణుని దగ్గర వ్యక్తం చేస్తున్నాడు.
శ్రీ భగవానువాచ । సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ । తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ।। 2 ।।
2
5
https://www.holy-bhagava…udio/005_002.mp3
శ్రీ భగవానువాచ — భగవంతుడు ఇలా పలికెను; సన్యాసః — సన్యాసము; కర్మ-యోగః — భక్తితో పని చేయటము; చ — మరియు; నిఃశ్రేయస-కరౌ — అత్యున్నత లక్ష్యం వైపు తీసుకెళ్లును; ఉభౌ — రెండూ; తయో — ఈ రెంటిలో; తు — కానీ; కర్మ-సన్యాసాత్ — కర్మ సన్యాసము కంటే; కర్మ-యోగః — భక్తితో పనిచేయటం; విషిశ్యతే — ఉన్నతమైనది.
BG 5.2: భగవానుడు పలికెను: కర్మ సన్యాస (పనులను త్యజించుట) మార్గము మరియు కర్మ యోగ (భక్తితో పనిచేయుట) మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి. కానీ, కర్మ యోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్ఠమైనది.
ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాసమును మరియు కర్మ యోగమును పోల్చి చూపిస్తున్నాడు. ఇది చాలా నిగూఢమైన/గంభీరమైన శ్లోకం; కాబట్టి దీనిని ఒక్కొక్క పదాన్ని విడదీసి అర్థం చేసుకుందాం.ఒక కర్మ యోగి, ఆధ్యాత్మిక మరియు సామాజిక ధర్మాలని రెంటినీ చేస్తాడు. మనస్సుని భగవంతుని యందే నిలిపి, కేవలం శరీరంతో సామాజిక ధర్మాలు చేయబడుతాయి. జగద్గురు కృపాలుజీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు:సోచు మన యహ కర్మ మమ సబ లఖత హరి గురు ప్యారే(సాధన భక్తి తత్త్వ)‘ఓ ప్రియ సాధకుడా! ఎల్లప్పుడూ నీ యొక్క అన్ని పనులను, గురువు మరియు భగవంతుడు గమనిస్తున్నారని భావించుము.’ ఇదే కర్మ యోగ సాధన, దీనితో మనల్ని మనం క్రమక్రమముగా శారీరక దృక్పథం నుండి ఆధ్యాత్మిక దృక్పథం వైపు ఉద్ధరించుకోవచ్చు.కర్మ సన్యాసము అనేది శారీరక దృక్పథానికి అతీతంగా వెళ్ళిన ఉన్నత స్థాయి జీవుల కోసము. పూర్తి స్థాయిలో భగవత్ భావనలో ఐక్యమగుట వలన, సామాజిక బాధ్యతలను త్యజించి, సంపూర్ణంగా ఆధ్యాత్మిక విధులనే (భగవత్ సేవ) నిర్వర్తించే మనిషి కర్మ సన్యాసి. శ్రీ రామ చంద్రుడు లక్ష్మణుడిని ప్రాపంచిక విధులను నిర్వర్తించమన్నప్పుడు, ఈ కర్మ సన్యాస భావము లక్ష్మణుడిచే చక్కగా వ్యక్తపరచబడింది:మోరె సబఇ ఏక తుమ్హ స్వామీ, దీనబంధు ఉర అంతరయామీ(రామచరితమానన్) లక్ష్మణుడు రామునితో అన్నాడు, ‘నీవే నా స్వామివి, తండ్రివి, తల్లివి, స్నేహితునివి, మరియు నా సర్వస్వమూ నీవే. నీ పట్ల ఉన్న ధర్మాన్నే నేను శాయాశక్తులా నిర్వర్తిస్తాను. కాబట్టి దయచేసి నా శారీరక ధర్మాల్ని నాకు చెప్పవద్దు.’కర్మ సన్యాసం అభ్యాసం చేసే వారు తమని తాము శరీరము అనుకోరు, తత్ఫలితంగా వారు తమ శారీరక ధర్మాల్ని నిర్వర్తించే అవసరం లేదు అని భావిస్తారు. ఇటువంటి కర్మ సన్యాసులు తమ పూర్తి సమయాన్ని ఆధ్యాత్మికత కోసమే కేటాయిస్తారు. అదే సమయంలో, కర్మ యోగులు తమకున్న సమయాన్ని ప్రాపంచిక విధులకు, ఆధ్యాత్మిక విధులకు మధ్య విభజించాల్సి ఉంటుంది. అందుకే కర్మ సన్యాసులు భగవంతుని దిశగా వేగంగా వెళ్ళగలుగుతారు, కానీ కర్మ యోగులు సామాజిక విధుల భారంతో నెమ్మదిగా సాగుతారు.కానీ, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాసం కంటే, కర్మ యోగాన్నే ప్రశంసిస్తున్నాడు మరియు అర్జునుడికి దానినే అనుసరించమని సిఫారసు చేస్తున్నాడు. ఎందుకంటే కర్మ సన్యాసులు ఒక ప్రమాదంలో చిక్కుకోవచ్చు. ఒకవేళ తమ కర్తవ్యములను త్యజించిన పిదప తమ మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేయలేకపోతే వారు అటూ ఇటూ కాకుండా పోతారు. భారత దేశంలో, ఇటువంటి, ఎన్నోవేల మంది సాధువులు, తమకు వైరాగ్యం కలిగింది అనుకుంటూ, ప్రపంచాన్ని త్యజించారు, కానీ వారి మనస్సు భగవంతుని పట్ల పూర్తిగా లగ్నం కాలేదు. దీని వలన వారు ఆధ్యాత్మిక పథంలో దివ్య ఆనందాన్ని అనుభవించలేకపోయారు. కాబట్టి, ఏదో బైరాగులు ధరించే కాషాయి వస్త్రాలు ధరించినా, గంజాయి పీల్చటం వంటి అత్యంత పాపభూయిష్ట పనులు చేస్తుంటారు. కేవలం అజ్ఞానులు మాత్రమే తమ సోమరిపోతుతనాన్ని, వైరాగ్యమని తప్పుగా అర్థం చేసుకుంటారు.మరో పక్క, కర్మ యోగులు, ప్రాపంచక విధులు మరియు ఆధ్యాత్మిక విధులను రెండూ చేస్తుంటారు. కాబట్టి ఒకవేళ వారి మనస్సు ఆధ్యాత్మికత నుండి పక్కకి తప్పితే, కనీసం వారి వృత్తి/పని మీద ఆధార పడవచ్చు. ఈ విధంగా కర్మ యోగము అనేది అత్యధిక జనులకు సురక్షితమైన మార్గము; అదే సమయంలో, సమర్థుడైన గురువు గారి పర్యవేక్షణ లోనే కర్మ సన్యాస మార్గమును అవలంబించాలి.
జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి । నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే ।। 3 ।।
3
5
https://www.holy-bhagava…udio/005_003.mp3
జ్ఞేయః — పరిగణించవలెను; సః — అతను; నిత్య — ఎల్లప్పుడూ; సంన్యాసీ — సన్యాస దీక్షను ఆచరిస్తూ; యః — ఎవరైతే; న, ద్వేష్టి — దేనినీ ద్వేషింపక; న, కాంక్షతి — దేనినీ ఆశించక; నిర్ద్వంద్వః — అన్ని ద్వంద్వములకు అతీతంగా; హి — నిజముగా; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; సుఖం — సునాయాసముగానే; బంధాత్ — బంధము నుండి; ప్రముచ్యతే — విముక్తి చేయబడును.
BG 5.3: దేనినీ ద్వేషింపక, దేనినీ ఆశించక ఉన్న కర్మ యోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి, వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులౌతారు.
బాహ్యంగా ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే, కర్మ యోగులు, అంతర్గతంగా అనాసక్తత/వైరాగ్యాన్ని అభ్యాసము చేస్తుంటారు. అనుకూల, ప్రతికూల ఫలితాలని రెంటినీ సమదృష్టితో, ఈశ్వర అనుగ్రహంగా స్వీకరిస్తారు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా రచించాడంటే అది మన క్రమానుసార ఉన్నతి కొరకు సంతోషాన్ని, దుఃఖాన్ని అనుభవింప చేస్తుంటుంది. మనం సాధారణ జీవితాన్ని గడుపుతూ మన దరికి వచ్చే దేనినైనా సహిస్తూ, సంతోషంగా మన ధర్మ మనం చేస్తూ ఉంటే ఈ ప్రపంచం సహజంగానే క్రమక్రమంగా మనల్ని ఆధ్యాత్మిక పురోగతి వైపు తీసుకువెళ్తుంది. దీనిని వివరించటానికి ఒక చక్కటి కథ ఉంది: ఒకప్పుడు ఒక కొయ్య ముక్క ఉండేది. అది ఒక కొయ్యబొమ్మలు చేసే శిల్పి దగ్గరికి వెళ్లి, ‘నన్ను దయచేసి అందంగా చేయవా?’ అని అడిగింది. శిల్పి అన్నాడు, ‘నేను ఆ పనికి సిద్ధంగా ఉన్నాను. కానీ, నీవు దానికి సిద్ధమేనా?’ ఆ చెక్క అన్నది, ‘అవును, నేను కూడా సిద్ధమే.’ ఆ శిల్పి తన పనిముట్లు తీసుకుని దానిని చెక్కటం మొదలుపెట్టాడు. ఈ కొయ్య “అయ్యో, ఏం చేస్తున్నావు? దయచేసి ఆపు, చాలా నొప్పిగా ఉంది’ అని అరిచింది. అప్పుడు ఆ శిల్పి తెలివిగా అన్నాడు, ‘నీవు అందంగా అవ్వాలనుకుంటే, నీవు బాధని సహించాలి.’ ‘సరే’, అన్నది కొయ్య. ‘అయితే చెక్కండి, కానీ దయచేసి కాస్త నెమ్మదిగా, సున్నితంగా చేయండి’. ఆ శిల్పి తన పని మళ్ళీ ప్రారంభించాడు. ఈ కొయ్య అరుస్తూనే ఉంది, ‘ఇక ఈ రోజుకు చాలు; ఇంకా సహించలేను. దయచేసి మళ్ళీ రేపు తిరిగి ప్రారంభించండి.’ అని. ఆ శిల్పి తన పని యందే శ్రద్ధతో ముందుకెళ్ళాడు, మరియు కొద్ది రోజుల్లోనే ఆ కొయ్య, గుడిలో ఉంచతగిన, ఒక అందమైన విగ్రహంగా తయారయ్యింది. ఇదే విధముగా, అనంతమైన జన్మలలో ప్రపంచంతో మమకారం వలన మన హృదయములు మొరటుగా, మలినముతో ఉన్నాయి. మనం అంతర్గత సౌదర్యంతో ఉండాలంటే మనం బాధని సహించి, ఈ ప్రపంచాన్ని మనలని పరిశుద్దం చేసే తన పనిని చేసుకోనివ్వాలి. కాబట్టి, కర్మ యోగులు భక్తితో పని చేస్తూ, ఫలితముల పట్ల సమదృష్టితో ఉంటారు, మరియు భగవంతుని యందే తమ మనస్సుని లగ్నం చేయటానికి అభ్యాసం చేస్తుంటారు.
సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః । ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలమ్ ।। 4 ।।
4
5
https://www.holy-bhagava…udio/005_004.mp3
సాంఖ్య — కర్మ సన్యాసము; యోగౌ — కర్మ యోగము; పృథక్ — వేరువేరు; బాలాః — అజ్ఞానులు; ప్రవదంతి — అంటారు; న — కాదు; పండితాః — పండితులు; ఏకం — ఒక్క దానిలో; అపి — అయినా; ఆస్థితః — స్థితులై ఉండి; సమ్యక్ — సంపూర్ణముగా; ఉభయోః — రెంటి యొక్క; విందతే — పొందుతారు; ఫలం — ఫలమును.
BG 5.4: అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము (కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసము) మరియు కర్మ యోగము (భక్తితో పని చేయటము) భిన్నమైనవి అని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమునూ పొందవచ్చు అని యదార్థముగా తెలిసినవారు చెప్తారు.
ఇక్కడ, శ్రీ కృష్ణుడు, 'సాంఖ్య' అన్న పదాన్ని కర్మ సన్యాసమును సూచించటానికి వాడుతున్నాడు, అంటే జ్ఞానమును పెంపొందించుకొని కర్మలను త్యజించటం అన్నమాట. సన్యాసము అనేది రెండు రకాలుగా ఉంటుంది అని ఇక్కడ అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం, అవి: ఫాల్గు వైరాగ్యము, యుక్త వైరాగ్యము. ఈ ప్రపంచాన్ని భారమైనదిగా తలచి, జనులు, కష్టాలను, బాధ్యతలను వదిలిచ్చుకోవటం కోసము దానిని త్యజించటాన్ని ఫాల్గు వైరాగ్యం అంటారు. ఇటువంటి ఫాల్గు వైరాగ్యం, పలాయనవాద దృక్పథంలో ఉన్నది మరియు అస్థిరమైనది. ఇటువంటి వారి సన్యాసం కష్టాలు ఎదురైనప్పుడు పారిపోయే మనస్తత్వంతో కూడి ఉంటుంది. ఆధ్యాత్మిక పథంలో వీరికి కష్టాలు ఎదురైనప్పుడు, దాన్ని కూడా మరల వదిలేసి తిరిగి ప్రాపంచిక జీవితం వైపు పరుగు పెట్టడానికి ఆశిస్తారు. యుక్త వైరాగ్యంలో, జనులు ఈ ప్రపంచాన్నంతా భగవంతుని శక్తిగా చూస్తారు. వారికి ఉన్న దానిని వారికి చెందినదిగా పరిగణించరు మరియు తమ విలాసం కోసం అనుభవించాలని ప్రయత్నించరు. బదులుగా, దేవుడు తమకు ఇచ్చిన దానితో ఆ భగవంతుని సేవ చేయటానికే ప్రయత్నిస్తారు. యుక్త వైరాగ్యము స్థిరమైనది మరియు కష్టాలకు చలించనిది.కర్మ యోగులు బాహ్యంగా తమ విధులను నిర్వర్తిస్తూనే, యుక్త వైరాగ్య భావాలు (స్థిరమైన వైరాగ్యం) పెంపొందించుకుంటారు. తమని తాము సేవకులగా మరియు భగవంతుడిని భోక్తగా పరిగణిస్తారు; అందుకే ప్రతీదీ భగవత్ ప్రీతి కోసమే చేస్తున్నామనే భావనలో స్థితులౌతారు. ఈ విధంగా, వారి అంతర్గత స్థితి ఎల్లప్పుడూ భగవత్ ధ్యాసలో ఉండే కర్మ సన్యాసుల స్థితితో సమానంగా ఉంటుంది. బాహ్యంగా వారు ప్రాపంచిక మనుష్యుల లాగ కనిపించినా అంతర్గతంగా సన్యాసుల కు ఏమాత్రం తీసిపోరు.పురాణములు మరియు ఇతిహాసములు భారత చరిత్రలలో మహోన్నతమైన రాజుల గురించి చెపుతూ, బాహ్యంగా వారు రాజ ధర్మాలను నిక్ఖచ్చిగా నిర్వర్తిస్తూనే రాజ విలాసాలలో నివసిస్తున్నా, వారు మానసికంగా పూర్తిగా భగవత్ భావన లోనే స్థితులై ఉన్నారని పేర్కొన్నాయి. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, పృథువు, విభీషణుడు, యుధిష్ఠిరుడు మొదలగువారంతా అత్యుత్తమ కర్మ యోగులే. శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంటున్నది:గృహీత్వాపీంద్రియైరర్థాన్ యో న ద్వేష్టి న హృష్యతివిష్ణోర్మాయామిదం పశ్యన్ స వై భాగవతోత్తమః (11.2.48)‘ఇంద్రియ వస్తు విషయములను, వాటి కోసం ప్రాకులాడకుండా మరియు వాటి నుండి పారిపోకుండా, భగవత్ దృక్పథంతో, సమస్తము భగవంతుని శక్తి స్వరూపమే, అన్ని ఆయన సేవకే, అన్న దృక్పథంలో స్వీకరించే వాడు అత్యున్నత భక్తుడు.’ ఈ విధంగా, కర్మ యోగికి, కర్మ సన్యాసికి మధ్య, నిజమైన జ్ఞానికి, తేడా ఏమీ కనపడదు. వీటిలో ఏ ఒక్కటి పాటించినా, ఈ రెంటి యొక్క ఫలితములు లభించును.
యత్సాంఖ్యై: ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే । ఏకం సాఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ।। 5 ।।
5
5
https://www.holy-bhagava…udio/005_005.mp3
యత్ — ఏదైతే; సాంఖ్యైః — కర్మ సన్యాసము ద్వారా; ప్రాప్యతే — పొందబడునో; స్థానం — స్థానము; తత్ — అది; యోగైః — భక్తితో పని చేయటం ద్వారా; అపి — కూడా; గమ్యతే — పొందవచ్చు; ఏకం — ఒకటే; సాంఖ్యం — కర్మ సన్యాసము; చ — మరియు; యోగం — కర్మ యోగము; చ — మరియు; యః — ఎవరైతే; పశ్యతి — చూస్తారో; సః — ఆ వ్యకి; పశ్యతి — నిజముగా చూచినట్టు.
BG 5.5: కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి, కర్మ సన్యాసము మరియు కర్మ యోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు.
ఆధ్యాత్మిక సాధనలో, మనస్సు యొక్క ఉద్దేశమే (అభిమతం) ప్రధానమైనది, బాహ్యమైన క్రియలు కావు. ఒక వ్యక్తి పవిత్ర బృందావన ధామములో నివసిస్తున్నా అతని మనస్సు కొలకత్తాలో రసగుల్లాలు తినటం కోసం భావన చేస్తే అతను కొలకత్తాలో నివసిస్తున్నట్టే లెక్క. దీనికి విరుద్ధంగా, ఒకడు కొలకత్తా నగర హడావిడి మధ్య నివసిస్తున్నా, బృందావన పుణ్యక్షేత్రం పైనే మనస్సు నిమగ్నం చేస్తే, అతనికి ఆ బృందావనంలో నివసించే ఫలితం దక్కుతుంది. మన మానసిక స్థితిని బట్టి, మన ఆత్మ ఉద్ధరణ స్థాయి ఉంటుంది అని సమస్త వైదిక శాస్త్రాలు పేర్కొంటున్నాయి:మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః(పంచదశీ) ‘బంధమునకు మరియు మోక్షమునకు కారణము మనస్సే.’ జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు ఇదే సూత్రమును పేర్కొన్నారు:బంధన్ ఔర్ మోక్ష కా, కారణ్ మన హి బఖాన్యాతే కౌనిఉ భక్తి కరు, కరు మన తే హరిధ్యాన్(భక్తి శతకము, 19వ శ్లోకం) ‘బంధము మరియు మోక్షము అనేవి మనస్సు యొక్క స్థితి మీద అధారపడుతాయి. ఏవిధమైన రూపంలో భక్తి చేసినా, మనస్సుని మాత్రం భగవంతుని ధ్యానంలోనే నిమగ్నం చేయుము.’ఆధ్యాత్మిక దృష్టి లేనివారు, కర్మ సన్యాసికి, కర్మ యోగికి ఉన్న బాహ్యమైన తేడాలను చూసి, కర్మ సన్యాసి యే ఉన్నతమైనవాడు అని ప్రకటిస్తారు. కర్మ సన్యాసులు మరియు కర్మ యోగులు కూడా తమ మనస్సులను భగవంతుని యందే నిమగ్నం చేసినట్టు చూసి, జ్ఞానులు, వారిద్దరూ ఒకే సరిసమాన అంతర్గత స్థితిలో ఉన్నట్టు గమనిస్తారు.
సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః । యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేణాధిగచ్ఛతి ।। 6 ।।
6
5
https://www.holy-bhagava…udio/005_006.mp3
సన్యాసః — సన్యాసము; తు — కానీ; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; దుఃఖమ్ — దుఃఖము; ఆప్తుమ్ — పొందును; అయోగతః — కర్మ యోగము లేకుండా; యోగ-యుక్తః — కర్మ యోగములో ప్రవీణుడు; మునిః — ముని; బ్రహ్మ — బ్రహ్మన్; న చిరేణ — త్వరితముగా; అధిగచ్ఛతి — చేరును.
BG 5.6: భక్తి యుక్తముగా పని చేయకుండా (కర్మ యోగము) పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట చాలా కష్టము, ఓ గొప్ప బాహువులు కలవాడా, కానీ, కర్మ యోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును.
హిమాలయాల గుహలలో నివసించే ఓ యోగి, తాను జగత్తునుండి సన్యసించినట్టు భావించవచ్చు, కానీ, అతను పట్టణానికి తిరిగి వచ్చినప్పుడు అతని సన్యాసము యొక్క నిజమైన పరీక్ష చేయబడుతుంది. ఉదాహరణకి, ఒక సాధువు పన్నెండు సంవత్సరాలు గర్హ్వాల్ పర్వతాలలో నియమనిష్ఠలను అభ్యాసం చేసాడు. ఒకసారి అతను కుంభమేళాలో పాల్గొనటానికి హరిద్వార్ వచ్చాడు. ఆ కుంభమేళా హడావిడిలో ఎవరో ఒక అతను పొరపాటున తన చెప్పుతో ఉన్న కాలిని ఆ యోగి పాదాలపై ఉంచాడు. ఆ సాధువు కోపంతో ఊగిపోయి, ఇలా అరిచాడు ‘ఏంటి గుడ్డి వాడివా? ఎక్కడకి పోతున్నావో చూసుకోలేవా?’ అని. తరువాత కోపానికి తాను వశమైపోయినందుకు ఇలా చింతించాడు, ‘పన్నెండేళ్లు కొండలలో నియమనిష్ఠలతో చేసిన అభ్యాసం, ఒక్క రోజు నగరంలో ఉండటం వలన వృధా అయిపోయింది’ అని. ఈ ప్రపంచమే, మన సన్యాసం పరీక్షించబడే రంగ స్థలం. ఈ లోకంలో తన ధర్మములు నిర్వర్తిస్తూ ఉండి, వ్యక్తి క్రమక్రమంగా కోపము, లోభము, మరియు కామములకు అతీతంగా ఎదగటానికి ప్రయత్నించాలి, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇలాకాక, ఎవరైనా తన విధులను త్యజిస్తే, మనస్సును పరిశుద్దం చేసుకోవటం చాలా కష్టం; మరియు పరిశుద్ధమైన మనస్సు లేకుండా నిజమైన వైరాగ్యం సుదూరపు స్వప్నంగానే మిగిలిపోతుంది. మనమందరమూ మన సహజ స్వభావంచే పని చేయటానికి ప్రేరేపింపబడుతాము. అర్జునుడు ఒక యోధుడు, కానీ, కృత్తిమంగా తన ధర్మమును త్యజించి, అడవులకు పారిపోతే, అతని స్వభావం అక్కడ కూడా పనిచేపిస్తుంది. బహుశా ఎవరో కొంత మంది గిరిజనులను పోగుచేసి వారికి తానే రాజును అని ప్రకటించుకుంటాడేమో. బదులుగా, తన సహజ గుణాలని, ప్రతిభని భగవంతుని సేవలోనే ఉపయోగిస్తే అది ఏంతో ఫలదాయకంగా ఉంటుంది. కాబట్టి, భగవంతుడు అతనికి ఇలా ఉపదేశిస్తున్నాడు, ‘యుద్ధం కొనసాగిస్తూనే ఉండు, కానీ ఒక్క మార్పు చేయుము. మొదట్లో నీవు రాజ్య కాంక్షతో ఈ యుద్ధ భూమికి వచ్చావు. ఇప్పుడు దానికి బదులుగా నీ సేవని నిస్వార్థముగా ఆ భగవంతుకే అర్పించుము. ఈ విధముగా, నీవు సహజంగానే నీ మనస్సుని పవిత్రం చేసుకుని, నిజమైన అంతర్గత సన్యాసమును సాధించవచ్చు.’ పిందెగా మరియు కచ్చగా ఉన్న పండు, తనను మోసి, పోషించే చెట్టుకి గట్టిగా అతుక్కుని ఉంటుంది. అదే పండు, పూర్తిగా పండినప్పుడు, తనకు ఆధారంగా ఉన్న దాని నుండి విడిపోతుంది. అదే విధంగా, సంపూర్ణ విజ్ఞానంగా పరిపక్వత చెందే అనుభవం, కర్మ యోగికి, ఈ భౌతిక జగత్తు నుండి అందుతుంది. ఎలాగైతే కష్టపడి పనిచేసినవారికే గాఢ నిద్ర పడుతుందో, కర్మ యోగము ద్వారా మనస్సుని పరిశుద్ధమొనర్చుకున్నవారికే గాఢమైన ధ్యానం సాధ్యమవుతుంది.
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః । సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ।। 7 ।।
7
5
https://www.holy-bhagava…udio/005_007.mp3
యోగ-యుక్తః — మనస్సు ద్వారా భగవంతునితో కూడియుండి; విశుద్ధ-ఆత్మా — పవిత్రమైన బుద్ధితో; విజిత-ఆత్మా — మనస్సుని జయించినవారు; జిత-ఇంద్రియః — ఇంద్రియములను జయించినవారు; సర్వ-భూత-ఆత్మ-భూత-ఆత్మా — అన్ని ఆత్మల పరమాత్మను ప్రతి ప్రాణిలో దర్శిస్తూ; కుర్వన్ — (కర్మలను) చేస్తూ; అపి — కూడా; న, లిప్యతే — చిక్కుకొనరు.
BG 5.7: పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతిప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు.
వైదిక వాఙ్మయంలో 'ఆత్మ' అనే పదం ఎన్నో రకాల అర్థాలలో వాడబడింది: భగవంతుడు అనే అర్థంలో, ఆత్మ అనే అర్థంలో, మనస్సు అనే అర్థంలో, బుద్ధి అనే అర్థంలో వాడబడినది. ఈ శ్లోకం, వీటన్నిటికీ ఉదాహరణ చూపిస్తున్నది. శ్రీ కృష్ణుడు, ఇక్కడ కర్మ యోగి అంటే యోగ యుక్తుడు (భగవంతునితో ఏకమై ఉన్నవాడు) అని విశదీకరిస్తున్నాడు. అటువంటి మహాత్ముడు 1) విశుద్ధాత్మ - పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు 2) విజితాత్మా - మనస్సుని జయించినవాడు, మరియు 3) జితేంద్రియ - ఇంద్రియములను నియంత్రించినవాడు. ఇటువంటి కర్మ యోగులు, పరిశుద్ధమైన బుద్ధితో, సమస్త ప్రాణుల యందు భగవంతుడినే దర్శిస్తారు మరియు అందరితో గౌరవప్రదంగా మెలుగుతూ, ఎవరితో సంగం లేకుండా ఉంటారు. తమ కార్యకలాపాలు వారి స్వార్థ-ప్రయోజనం కోసం కాదు కాబట్టి వారికి జ్ఞానం క్రమక్రమంగా స్పష్టమగుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి, ఇంతకు పూర్వం భౌతిక భోగములకోసం తాపత్రయ పడ్డ ఇంద్రియములు, మనస్సు, మరియు బుద్ధి, ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. ఈ పరికరములు ఇక ఇప్పుడు భగవత్ సేవకు అందుబాటులోకి వచ్చాయి. భక్తి యుక్త సేవ అంతర్గత విజ్ఞానం వైపు దారి తీస్తుంది. ఈ విధంగా, కర్మ యోగము, సహజ పద్ధతిలో జ్ఞానోదయ దిశగా ఒక్కొక్క మెట్టు పైకి తీస్కువెళుతుంది, కాబట్టి ఇది కర్మ సన్యాసము కంటే భిన్నమైనది కాదు.
నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ।। 8 ।। ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషన్నపి । ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ।। 9 ।।
8
5
https://www.holy-bhagava…/005_008-009.mp3
న — కాదు/లేదు; ఏవ — నిజముగా; కించిత్ — ఏ కొంచము కూడా; కరోమి — నేను చేస్తున్నాను; ఇతి — అని; యుక్తః — కర్మ యోగములో స్థితులైన వారు; మన్యేత — భావించును; తత్త్వ-విత్ — సత్యమును ఎరిగినవాడు; పశ్యన్ — చూచుతూ; శృణ్వన్ — వినుచూ; స్పృశన్ — స్పర్శిస్తూ; జిఘ్రన్ — వాసన చూస్తూ; అశ్నన్ — తినుచూ; గచ్ఛన్ — కదులుతూ; స్వపన్ — నిద్రపోతూ; శ్వసన్ — శ్వాస తీసుకుంటూ; ప్రలపన్ — మాట్లాడుతూ; విసృజన్ — త్యజిస్తూ; గృహ్ణన్ — స్వీకరిస్తూ; ఉన్మిషన్ — కనులను తెరుస్తూ; నిమిషన్ — కనులు మూస్తూ; అపి — అయినా; ఇంద్రియాణి — ఇంద్రియములు; ఇంద్రియార్థేషు — ఇంద్రియ విషయములతో; వర్తంతే — కదులుతున్నాయి; ఇతి — ఈ విధంగా; ధారయన్ — భావించును.
BG 5.8-9: కర్మ యోగములో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్న వారు - చూస్తున్నప్పుడూ, వింటున్నప్పుడూ, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడూ, కదులుతున్నప్పుడూ, నిద్రిస్తున్నప్పుడూ, శ్వాస క్రియలప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ, విసర్జిస్తున్నప్పుడూ, స్వీకరిస్తున్నప్పుడూ, కన్నులు తెరుస్తున్నప్పుడూ, మూస్తున్నప్పుడూ – ‘చేసేది నేను కాదు’ అన్ని ఎల్లప్పుడూ భావింతురు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు.
మనం ఎప్పుడైనా గొప్ప విషయం సాధిస్తే, మనమే ఏదో గొప్ప పని చేసినట్టు గర్వపడుతాము. ఈ కర్తృత్వ భావనతో వచ్చే గర్వము, ప్రాపంచిక దృక్పథాన్ని దాటి పోవటానికి ఉన్న పెద్ద అడ్డంకి. కానీ, భగవత్ దృక్పథంలో ఉన్న కర్మయోగులు ఈ అడ్డంకిని సునాయాసముగా అధిగమిస్తారు. పరిశుద్ధమొనర్చుకున్న బుద్ధితో వారు తమని తాము శరీరం కంటే వేరుగా చూస్తారు, కాబట్టి తమ శారీరక క్రియలను తమకు ఆపాదించుకోరు. శరీరము, భగవంతుని యొక్క భౌతిక/ప్రాకృతిక శక్తితో తయారు చేయబడినది. కాబట్టి వారు చేసే అన్ని పనులు భగవత్ శక్తి ద్వారా చేయబడినట్లు భావిస్తారు. వారు ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసారు కాబట్టి తమ మనోబుద్ధులకు, ఆయన దివ్య సంకల్పం అనుగుణంగా ప్రేరణ పొందటానికి భగవంతునిపైనే ఆధార పడతారు. ఈ విధంగా, భగవంతుడే అన్ని పనులు చేస్తున్నాడనే భావనలో దృఢంగా స్థితులై ఉంటారు.ఈ ప్రకారంగా, వసిష్ఠ మహాముని శ్రీ రామచంద్ర ప్రభువుకి ఇలా ఉపదేశించాడు:కర్తా బహిర్కర్తాంతర్లోకే విహర రాఘవ (యోగ వసిష్ఠ)‘ఓ రామా, బాహ్యంగా కర్మలను శ్రద్ధతో ఆచరించుము, కానీ లోన మాత్రం నిన్ను నీవు అకర్తగా మరియు భగవంతుడే నీ చర్యలకు ప్రధాన కర్తగా భావించుట అభ్యాసం చేయుము.’ ఈ భగవత్ దృక్పథంలో, కర్మ యోగులు తమని తాము భగవంతుని చేతిలో పనిముట్లగా భావిస్తారు. ఈ దృక్పథంలో పని చేయటం వలన కలిగే పరిణామాలను శ్రీ కృష్ణుడు తదుపరి విశదీకరిస్తున్నాడు.
నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ।। 8 ।। ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషన్నపి । ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ।। 9 ।।
9
5
https://www.holy-bhagava…/005_008-009.mp3
న — కాదు/లేదు; ఏవ — నిజముగా; కించిత్ — ఏ కొంచము కూడా; కరోమి — నేను చేస్తున్నాను; ఇతి — అని; యుక్తః — కర్మ యోగములో స్థితులైన వారు; మన్యేత — భావించును; తత్త్వ-విత్ — సత్యమును ఎరిగినవాడు; పశ్యన్ — చూచుతూ; శృణ్వన్ — వినుచూ; స్పృశన్ — స్పర్శిస్తూ; జిఘ్రన్ — వాసన చూస్తూ; అశ్నన్ — తినుచూ; గచ్ఛన్ — కదులుతూ; స్వపన్ — నిద్రపోతూ; శ్వసన్ — శ్వాస తీసుకుంటూ; ప్రలపన్ — మాట్లాడుతూ; విసృజన్ — త్యజిస్తూ; గృహ్ణన్ — స్వీకరిస్తూ; ఉన్మిషన్ — కనులను తెరుస్తూ; నిమిషన్ — కనులు మూస్తూ; అపి — అయినా; ఇంద్రియాణి — ఇంద్రియములు; ఇంద్రియార్థేషు — ఇంద్రియ విషయములతో; వర్తంతే — కదులుతున్నాయి; ఇతి — ఈ విధంగా; ధారయన్ — భావించును.
BG 5.8-9: కర్మ యోగములో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్న వారు - చూస్తున్నప్పుడూ, వింటున్నప్పుడూ, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడూ, కదులుతున్నప్పుడూ, నిద్రిస్తున్నప్పుడూ, శ్వాస క్రియలప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ, విసర్జిస్తున్నప్పుడూ, స్వీకరిస్తున్నప్పుడూ, కన్నులు తెరుస్తున్నప్పుడూ, మూస్తున్నప్పుడూ – ‘చేసేది నేను కాదు’ అన్ని ఎల్లప్పుడూ భావింతురు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు.
మనం ఎప్పుడైనా గొప్ప విషయం సాధిస్తే, మనమే ఏదో గొప్ప పని చేసినట్టు గర్వపడుతాము. ఈ కర్తృత్వ భావనతో వచ్చే గర్వము, ప్రాపంచిక దృక్పథాన్ని దాటి పోవటానికి ఉన్న పెద్ద అడ్డంకి. కానీ, భగవత్ దృక్పథంలో ఉన్న కర్మయోగులు ఈ అడ్డంకిని సునాయాసముగా అధిగమిస్తారు. పరిశుద్ధమొనర్చుకున్న బుద్ధితో వారు తమని తాము శరీరం కంటే వేరుగా చూస్తారు, కాబట్టి తమ శారీరక క్రియలను తమకు ఆపాదించుకోరు. శరీరము, భగవంతుని యొక్క భౌతిక/ప్రాకృతిక శక్తితో తయారు చేయబడినది. కాబట్టి వారు చేసే అన్ని పనులు భగవత్ శక్తి ద్వారా చేయబడినట్లు భావిస్తారు. వారు ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసారు కాబట్టి తమ మనోబుద్ధులకు, ఆయన దివ్య సంకల్పం అనుగుణంగా ప్రేరణ పొందటానికి భగవంతునిపైనే ఆధార పడతారు. ఈ విధంగా, భగవంతుడే అన్ని పనులు చేస్తున్నాడనే భావనలో దృఢంగా స్థితులై ఉంటారు.ఈ ప్రకారంగా, వసిష్ఠ మహాముని శ్రీ రామచంద్ర ప్రభువుకి ఇలా ఉపదేశించాడు:కర్తా బహిర్కర్తాంతర్లోకే విహర రాఘవ (యోగ వసిష్ఠ)‘ఓ రామా, బాహ్యంగా కర్మలను శ్రద్ధతో ఆచరించుము, కానీ లోన మాత్రం నిన్ను నీవు అకర్తగా మరియు భగవంతుడే నీ చర్యలకు ప్రధాన కర్తగా భావించుట అభ్యాసం చేయుము.’ ఈ భగవత్ దృక్పథంలో, కర్మ యోగులు తమని తాము భగవంతుని చేతిలో పనిముట్లగా భావిస్తారు. ఈ దృక్పథంలో పని చేయటం వలన కలిగే పరిణామాలను శ్రీ కృష్ణుడు తదుపరి విశదీకరిస్తున్నాడు.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః । లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ।। 10 ।।
10
5
https://www.holy-bhagava…udio/005_010.mp3
బ్రహ్మణి — భగవంతునికి; ఆధాయ — సమర్పిస్తూ; కర్మాణి — సర్వ కర్మలు; సంగం — మమకారం/అనుబంధం; త్యక్త్వా — త్యజించి; కరోతి — చేస్తారో; యః — ఎవరైతే; లిప్యతే, న — అంటదు (ప్రభావితులు కారు); సః — ఆ వ్యక్తి; పాపేన — పాపము చేత; పద్మ-పత్రమ్ — తామర ఆకు; ఇవ — లాగా; అంభసా — నీటి చేత.
BG 5.10: సమస్త మమకారాసక్తులు త్యజించి, భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు, తామరాకు నీటిచే తడి అవ్వనట్టు, పాపముచే తాకబడరు.
హైందవ మరియు బౌద్ధ వాఙ్మయంలో తామర పూవుతో ఎన్నో ఉపమానాలు కలవు. భగవంతుని దివ్య శరీరఅంగములని వర్ణించేటప్పుడు దీనిని ఒక గౌరవ ప్రదమైన ఉపమానంగా వాడతారు. ఇందువల్ల, 'చరణ-కమలములు' అంటే ‘తామర పూవు వంటి పాదములు’, 'కమలేక్షణ' అంటే ‘పద్మము వంటి కన్నులు’, 'కర-కమలములు' అంటే ‘పద్మము వంటి చేతులు’ మొదలైనవి. తామర పూవుకే ఇంకొక పేరు 'పంకజము' అంటే ‘బురద నుండి జన్మించినది’ అని. కొలను అడుగున ఉండే బురద నుండి తామర పూవు జనిస్తుంది, అయినా నీటి ఉపరితలం పైకి పెరిగి, సూర్యుని వైపు పుష్పిస్తుంది. ఈవిధంగా, మట్టిలో పుట్టినా, తన అందమైన స్వచ్ఛతను కాపాడుకుంటూ, దానికి అతీతంగా పెరిగే దానిని ఉదహరించటానికి తామర పూవును సంస్కృత వాఙ్మయంలో తరచుగా వాడతారు. అంతేకాక, తామర మొక్కకి కొలను నీటి ఉపరితలంపై తేలియాడే పెద్ద ఆకులు ఉంటాయి. తామరాకులకు తడి అంటదు కాబట్టి వాటిని భారతీయ గ్రామాల్లో కంచం (ప్లేటు) లాగ వాడతారు, వాటిలో నీరు ఇంకదు మరియు వాటి మీద పోసే ద్రవాలు పీల్చబడవు సరికదా జారిపోతాయి. తామరాకుకున్న అద్భుతమైన గుణం ఏమిటంటే, తామర తన జన్మ, పెరుగుదల, పోషణ అన్నీ నీటి ద్వారానే జరిగినా, ఆకు మాత్రం తనను తాను తడి అవనివ్వదు. తామరాకు మీద పోసిన నీరు, దానిపై పెరిగే సూక్ష్మ రోమాల వలన పక్కకి జారి పోతుంది. తామరాకుతో అందమైన ఉపమానం సహాయంతో, అది ఎట్లయితే నీటి ఉపరితలంపై తేలియాడుతున్నా, తనను తాను తడి చేసుకోదో, అదేవిధంగా, కర్మ యోగులు, అన్ని పనులు చేస్తున్నా, వారు భగవత్ దృక్పథం లో పని చేయటం వలన వారికి పాపము వారికి అంటదు, అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి । యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే ।। 11 ।।
11
5
https://www.holy-bhagava…udio/005_011.mp3
కాయేన — శరీరంతో; మనసా — మనస్సుతో; బుద్ధ్యా — బుద్ధితో; కేవలైః — కేవలము; ఇంద్రియైః — ఇంద్రియములతో; అపి — కూడా; యోగినః — యోగులు; కర్మ — కర్మలు; కుర్వంతి — చేయుదురు; సంగం — సంగము (మమకార ఆసక్తులు); త్యక్త్వా — విడిచిపెట్టి; ఆత్మ— ఆత్మ; శుద్ధయే — శుద్ధి కొరకు.
BG 5.11: యోగులు, మమకారాసక్తిని విడిచిపెట్టి, కేవలం ఆత్మ శుద్ధి కోసం మాత్రమే, శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధిలతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు.
ఆనందాన్ని అన్వేషిస్తూ భౌతిక ప్రాపంచిక కోరికల వెంటపడటం అనేది, ఎడారిలో ఎండమావి వెంట పడటం లాంటి వృధా ప్రయాసే అని యోగులు అర్థం చేసుకుంటారు. దీనిని వాస్తవంగా ఎఱింగి, వారు స్వార్థ కోరికలను త్యజించి, అన్ని కర్మలూ భగవత్ ప్రీతి కోసమే చేస్తారు, కేవలం ఆయనే 'భోక్తారం యజ్ఞ తపసాం' (అన్ని కర్మల యొక్క సర్వోన్నత భోక్త). కానీ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, సమర్పణ (భగవంతునికి అంకితం చేయటం) అంటే ఒక కొత్త దృక్కోణం చూపిస్తున్నాడు. జ్ఞానోదయమైన యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసము మాత్రమే కర్మలు చేస్తుంటారు అంటున్నాడు. మరి ఇక ఏ విధంగా కర్మలు భగవంతునికి అంకితం చేసినట్టు?నిజానికి భగవంతునికి మన నుండి ఏమీ అక్కరలేదు. ఆయనే సర్వలోక నాయకుడు, సమస్త లోకాలకు ప్రభువు, దోషరహితుడు, తనకు తానే పరిపూర్ణుడు. ఒక అత్యల్ప జీవాత్మ, భగవంతునికి, ఆయన దగ్గర లేనిది, ఇచ్చేది ఏముంది? కాబట్టి, ఏదైనా భగవంతునికి నివేదన చేస్తున్నప్పుడు, ఇలా చెప్పే సాంప్రదాయం ఉంది: త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పితం; ‘ఓ భగవంతుడా, నీ వస్తువునే నీకు తిరిగి సమర్పిస్తున్నాను.’ ఇటువంటి భావనే వ్యక్తం చేస్తూ యోగి యమునాచార్య ఇలా పేర్కొన్నాడు :మమ నాథ యద్ అస్తి యో ఽస్మ్యహంసకలం తద్ధీ తవైవ మాధవనియత-స్వం ఇతి ప్రబుద్ధ-ధైర్ అథ వాకిం ను సమర్పయామి తే (శ్రీ స్తోత్ర రత్న, 50) ‘లక్ష్మీ దేవి నాథుడైన ఓ విష్ణుమూర్తి, నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు, నేను నీకు చాలా ఇద్దామనుకున్నాను. కానీ, జ్ఞానం పెంపొందించుకున్న తరువాత నా దగ్గర ఉన్నదంతా నీదే అని తెలుసుకున్నాను. నేను నీకు ఇక ఏమి ఇవ్వగలను?’కానీ, ఒక వ్యవహారం మాత్రం భగవంతుని చేతిలో లేదు, మన చేతిలోనే ఉంది; అదే మన అంతఃకరణ శుద్ది (మనస్సు-బుద్ధిలను పవిత్రమొనర్చు కోవటం). మన హృదయాన్ని శుద్ధి చేసుకుని, దానిని భక్తిలో నిమగ్నం చేస్తే, అదే భగవంతునికి ఏ ఇతర దానికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. దీనిని అర్థం చేసుకున్న గొప్ప యోగులు, తమ అంతఃకరణ శుద్ధిని అతిముఖ్యమైన లక్ష్యంగా చేసుకుంటారు; దీనిని స్వార్థం కోసం కాకుండా, భగవత్ ప్రీతి కోసమే చేస్తారు.ఈ విధంగా యోగులు, భగవంతునికి తాము ఇవ్వగలిగే అత్యంత విలువైనది తమ హృదయ పవిత్రతయే అని అర్థం చేసుకుని, ఆ దిశగా దాన్ని సాధించటానికి ప్రయత్నిస్తారు. రామాయణంలో ఈ సూత్రాన్ని విశదీకరిస్తూ ఒక అందమైన దృష్టాంతము ఉంది.లంకా యుద్ధానికి ముందు సుగ్రీవుడు ఏదో భయపడుతున్నట్టు రామచంద్ర ప్రభువుకి అనిపించింది, అందుకు అతనిని ఇలా ఆ ప్రభువు ఊరడించాడు:పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్అంగుళ్యగ్రేణ తాన్ హన్యామిచ్చాన్ హరిగణేశ్వరః(వాల్మీకి రామాయణం) శ్రీ రామ చంద్ర ప్రభువు ఇలా అన్నాడు, ‘నేనే గనక నా ఎడమ చేతి చిటికిన వ్రేలిని కొద్దిగా వంచితే, రావణుడు, కుంభకర్ణుడు ఏమిటి, లోకంలో సమస్త రాక్షసులు మరణిస్తారు.’సుగ్రీవుడు ఇలా బదులిచ్చాడు, ‘అలాగైతే ప్రభూ, రావణాసురిడిని చంపటానికి ఈ సైన్యాన్ని అంతా పోగు చేయటం ఏం అవసరం?’ అని.శ్రీ రామచంద్రుడు ఇలా బదులిచ్చాడు, ‘అది కేవలం మీ చిత్త శుద్ధి కోసం, మీకందరికీ భక్తియుక్త సేవ చేసుకోవటం కోసం ఒక అవకాశం ఇవ్వటం కోసమే. అందుకే, ఈ రాక్షసులని సంహరించటం కోసం మీ సహాయం నాకు అవసరం అని అనుకోవద్దు.’మనకు శాశ్వతంగా ఉండే ఒకే ఒక సంపద మనం సాధించే చిత్తశుద్ది/పవిత్రత మాత్రమే. అది మనతో పాటు తదుపరి జన్మకు వెళుతుంది, అదే సమయంలో భౌతిక సంపదలు అన్నీ ఇక్కడే విడిచిపెట్టబడుతాయి. కాబట్టి అంతిమ పరీక్షలో జీవితంలో గెలుపు, ఓటమి అనేవి మనం ఎంత అంతఃకరణ శుద్ధి సాధించామా అన్న దాని చేత నిర్ణయింపబడుతాయి. ఈ దృక్పథంలో ఉన్నతమైన యోగులు, ప్రతికూల పరిస్థితులను కూడా ఆహ్వానిస్తారు, ఎందుకంటే అవి తమ అంతఃకరణ శుద్ధి కోసం వచ్చే అవకాశాలుగా పరిగణిస్తారు. సంత్ కబీర్ ఇలా అన్నాడు:నిందక్ నియరే రాఖియే ఆంగన్ కుటి ఛబాయనిత సాబున్ పానీ బినా నిర్మల కరే సుభాయ‘నీవు నీ మనస్సుని త్వరగా శుద్ధి చేసుకోవాలనుకుంటే, ఒక విమర్శకున్ని దగ్గరే ఉంచుకో. అతని పరుషమైన మాటలు సహించినప్పుడు, నీ హృదయం సబ్బు, నీరు లేకుండానే శుద్ధి చేయబడుతుంది.’ ఈ విధంగా, అంతఃకరణ శుద్ధియే మన కర్మల ప్రధాన ఉద్దేశం అయినప్పుడు, ప్రతికూల పరిస్థితులు, మన పురోగతికోసం, భగవంతుడే పంపించిన అవకాశాలని స్వీకరించబడుతాయి; మరియు జయము, అపజయములలో సమత్వ భావనతో ఉంటాము. మనం భగవంతుని ప్రీతి కోసమే పనులు చేస్తాము కాబట్టి, మనస్సు పరిశుద్ధమౌతుంది, మనస్సు పరిశుద్ధమయిన కొద్దీ సహజంగానే మన కర్మ ఫలితములను భగవత్ అర్పితము చేస్తాము.
యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ । అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ।। 12 ।।
12
5
https://www.holy-bhagava…udio/005_012.mp3
యుక్తః — అంతఃకరణలో భగవంతునితో ఏకమై ఉన్నవాడు; కర్మ-ఫలం — అన్ని పనుల ఫలితములను, ఫలములను; త్యక్త్వా — త్యజించి; శాంతిం — శాంతి; ఆప్నోతి — పొందును; నైష్ఠికీమ్ — శాశ్వతమైన; అయుక్తః — భగవంతునితో ఏకమై లేని వాడు; కామ-కారేణ — కోరికల చే ప్రభావితుడై; ఫలే — ఫలముల యందు; సక్తః — ఆసక్తి/మమకారంతో; నిబధ్యతే — చిక్కుకొనును.
BG 5.12: అన్ని క్రియాకలాపముల ఫలములను భగవంతునికే అర్పితము చేసి, కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే సమయంలో, తమ కామముచే (కోరికలచే) ప్రేరేపింపబడి, స్వార్థ ప్రయోజనం కోసం పని చేసే వారు, కర్మ బంధములలో చిక్కుకుంటారు ఎందుకంటే వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు.
చేసే పని ఒక్కటే అయినా, కొందరు భౌతిక బంధాలలో చిక్కుకుంటారు, అదే సమయంలో మరి కొందరు భౌతిక బంధాలనుండి విముక్తి పొందుతారు, అన్న విషయం గమనిస్తే, ఇదెలా సాధ్యం? అనిపించవచ్చు. శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో జవాబు ఇస్తున్నాడు. భౌతిక ఫలాలపై ఆసక్తి లేకుండా, వాటిచే ప్రేరేపింపబడకుండా, ఉన్న వారు కర్మ బంధాలలో చిక్కుకోరు. కానీ, ప్రతిఫలము కోసం ప్రాకులాడుతూ మరియు భౌతిక సుఖాలు అనుభవించాలనే కామానికి వశమైపోతే, వారు, కర్మబంధ ప్రతి క్రియలలో చిక్కుకుంటారు. 'యుక్త' అంటే ‘భగవంతునితో మానసిక అంతర్గతంగా ఏకమై పోవటం.’ ‘అంతఃకరణ శుద్ధి తప్ప మరే ఏ ఇతర ప్రతిఫలమూ కోరుకోకపోవుట.’ అని కూడా చెప్పవచ్చు. 'యుక్త' పురుషులు తమ కర్మలకు ప్రతిఫలాన్ని ఆశించకుండా, ప్రతిగా, అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే కర్మలు చేస్తుంటారు. కాబట్టి, వారు త్వరలోనే దివ్య జ్ఞానాన్ని మరియు శాశ్వతమైన ముక్తిని పొందుతారు. మరో పక్క, 'అయుక్త' అంటే, ‘భగవంతునితో ఏకమవ్వకుండా’ అని అర్థం. మరో విధంగా, ‘ఆత్మకు శ్రేయస్సు కలిగించని ప్రాపంచిక ప్రతిఫలాలు ఆశించటం’ అని కూడా చెప్పవచ్చు. ఇటువంటి వారు, అత్యాశచే ఉసికొల్పబడి, వ్యామోహంతో కర్మ ఫలములను ఆశిస్తారు. ఇటువంటి దృక్పథంలో చేయబడిన పనులు ఆ 'అయుక్త' వ్యక్తులను జన్మ-మృత్యు సంసార చక్రంలో బంధించివేయును.
సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ । నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ।। 13 ।।
13
5
https://www.holy-bhagava…udio/005_013.mp3
సర్వ — సమస్తమైన; కర్మాణి — కర్మలు; మనసా — మనస్సు చే; సన్న్యస్య — త్యజించి; ఆస్తే — ఉండును; సుఖం — సుఖముగా; వశీ — ఆత్మ-నిగ్రహం కలవారు; నవ-ద్వారే — తొమ్మిది ద్వారములు కల; పురే — నగరములో; దేహీ — దేహములొఉన్న జీవాత్మ; న — కాదు; ఏవ — నిజముగా; కుర్వన్ — చేయునది; న — కాదు; కారయన్ — కారణము కాదు.
BG 5.13: ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు, తాము దేనికీ కర్త కాదని, దేనికీ కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క తొమ్మిది ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు.
నవ రంధ్రాలు గల శరీరమును, తొమ్మిది ద్వారాలు గల పట్టణంతో పోల్చుతున్నాడు శ్రీ కృష్ణుడు. జీవాత్మ ఆ పట్టణానికి రాజు, దాని పరిపాలన అంతా అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు మరియు జీవ-శక్తి అనే మంత్రిత్వ శాఖల ద్వారా నడిపింపబడుతాయి. కాలము, మృత్యు రూపంలో, శరీరాన్ని తీసివేసే వరకూ, ఈ శరీరంపై రాజ్యపాలన కొనసాగుతుంది. కానీ, పాలన కొనసాగుతున్నప్పుడు కూడా, జ్ఞానోదయమైన యోగులు తమను తాము శరీరంగా భావించరు, అంతేకాక, తమను తాము ఈ శరీరానికి అధిపతులము అనుకోరు. సరికదా, శరీరమును, దానిచే చేయబడిన అన్ని క్రియలను భగవంతునికే చెందినవని భావిస్తారు. అన్ని కర్మలను మానసికంగా త్యజించి, ఇటువంటి జ్ఞానోదయమైన యోగులు సంతోషంగా ఈ శరీరంలో స్థితులై ఉంటారు. దీనినే, 'సాక్షీ భావము' అంటారు, అంటే, తన చుట్టూ జరిగే అన్ని విషయములకు ఆసక్తిరహిత పరిశీలకుడిగా (సాక్షిగా) నిలిచిపోవటం. ఈ శ్లోకంలో ఉన్న ఉపమానము, శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా పేర్కొనబడినది:నవద్వారే పురే దేహీ హంసో లీలాయతే బహి:వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ (3.18)‘శరీరము తొమ్మిది ద్వారాలను కలిగి ఉంటుంది - రెండు చెవులు, ఒక నోరు, రెండు నాసికారంధ్రాలు, రెండు కళ్ళు, అపానము, జననేంద్రియము. భౌతిక దృక్పథంలో, ఈ దేహంలో ఉండే జీవాత్మ తనను తాను ఈ నవ ద్వార పట్టణంతో అనుసంధానం చేసుకుంటుంది. (తను శరీరమే అనుకుంటుంది). లోకంలోని సమస్త భూతములను నియంత్రించే పరమేశ్వరుడు కూడా, ఈ దేహములో స్థితమై ఉంటాడు. ఎప్పుడైతే జీవాత్మ, భగవంతునితో అనుసంధానం అవుతుందో, ఈ శరీరంలో వసిస్తున్నా, అది ఆయన లాగే స్వేచ్ఛను పొందుతుంది.’ఈ క్రితం శ్లోకంలో జీవాత్మ దేనికీ కూడా కర్త కాదు, కారణం కాదు అని ప్రకటించాడు, శ్రీ కృష్ణుడు. మరైతే, ఈ లోకంలో అన్ని కర్మలకు భగవంతుడే కారణమా? అన్న ప్రశ్న పుడుతుంది. దీనికి తదుపరి శ్లోకంలో జవాబిచ్చాడు శ్రీ కృష్ణుడు.
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః । న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ।। 14 ।।
14
5
https://www.holy-bhagava…udio/005_014.mp3
న — కాదు; కర్తృత్వం — చేసేది నేనే అన్న అహంకారము; న — కాదు; కర్మాణి — కర్మలు; లోకస్య — జనుల యొక్క; సృజతి — సృష్టించును; ప్రభుః — భగవంతుడు; న — కాదు; కర్మ-ఫల — కర్మ ఫలముల; సంయోగం — కలయిక; స్వభావః — వ్యక్తియొక్క స్వభావము; తు — కానీ; ప్రవర్తతే — ప్రవర్తిల్లును.
BG 5.14: కర్తృత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు; కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటిని ప్రవర్తిల్లచేయును.
ఈ శ్లోకంలో, భగవంతుడే సర్వలోక నాయకుడు అని సూచించటానికి, 'ప్రభు' అన్న పదం భగవంతునికి వాడబడింది. ఆయన సర్వశక్తిమంతుడు మరియు సమస్త విశ్వమును నియంత్రణ చేసేవాడు. అయినా సరే, ఈ విశ్వం యొక్క కార్యకలాపాలు ఆయనే నిర్వహించినా, ఆయన అకర్తగా ఉంటాడు. మన క్రియలను నిర్దేశించే వాడు కాదు, లేదా మనం ఏదైనా మంచి పని లేదా చెడు పని చేయాలా/వద్దా అని శాసించే వాడూ కాదు. ఒకవేళ ఆయనే నిర్వాహకుడు అయి ఉంటే, ఏది మంచి లేదా ఏది చెడు అనే దాని మీద ఇంత విస్తారమైన ఉపదేశాలు అవసరం లేదు. సమస్త శాస్త్రాలు ఓ మూడు చిన్న వాక్యాలతో సరిపోయేవి: ‘ఓ జీవాత్మలారా, నేనే, మీ యొక్క సమస్త కర్మలకు నిర్వాహకుడిని. కాబట్టి ఏది మంచో, ఏది చెడో తెలుసుకొనే అవసరం మీకు లేదు. నా ఇష్టప్రకారంగా మీతో పనులు చేపిస్తాను.’ అని. అదే విధంగా, మనం కర్తృత్వ భావనలో ఇరుక్కుపోవటానికి భగవంతుడు కారణం కాదు. ఆయనే కావాలని ఆ గర్వాన్ని మనలో కలుగ చేసి ఉంటే, మళ్ళీ మన తప్పుడు చేష్టలకు ఆయననే దోషుడిగా చేసేవాళ్ళం. నిజానికి, జీవాత్మనే తన అజ్ఞానంచే ఆ కర్తృత్వ భావనని తనకు కలుగచేసుకుంటుంది. ఒకవేళ, జీవాత్మ ఆ అజ్ఞానాన్ని వదిలించుకోవాలని చూస్తే, అప్పుడు భగవంతుడు తన కృపతో దానిని నిర్మూలించటానికి సహాయపడుతాడు. ఈ విధంగా, కర్తృత్వ భావనను త్యజించటం అనేది జీవాత్మ యొక్క బాధ్యత. ఈ శరీరము ప్రకృతి యొక్క త్రిగుణములచే కూడి ఉన్నది మరియు అన్ని కర్మలు కూడా ఆ త్రిగుణములచే చేయబడతాయి. కానీ అజ్ఞానంలో ఉన్న జీవాత్మ, తను ఈ శరీరమే అనుకోని, కర్మల యొక్క కర్తగా ఇరుక్కుపోతుంది, నిజానికి అవి ప్రకృతి గుణములచే చేయబడుతాయి. (శ్లోకం 3.27)
నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః । అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ।। 15 ।।
15
5
https://www.holy-bhagava…udio/005_015.mp3
న, ఆదత్తే — స్వీకరించడు; కస్యచిత్ — ఏ ఒక్కని యొక్క; పాపం — పాపము; న — కాదు; చ — మరియు; ఏవ — తప్పకుండా; సు-కృతం — పుణ్య కర్మలను; విభుః — సర్వవ్యాపియైన భగవంతుడు; అజ్ఞానేన — అజ్ఞానముచే; ఆవృతం — ఆవరింపబడి; జ్ఞానం — వివేకము/జ్ఞానము; తేన — దానిచే; ముహ్యంతి — మోహితులై భ్రమకు లోనగుచున్నారు; జంతవః — జీవులు.
BG 5.15: సర్వాంతర్యామియైన భగవంతుడు, ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు.
భగవంతుడు ఏ ఒక్కని పుణ్య, పాప పనులకు భాధ్యుడు కాడు. ఈ విషయంలో భగవానుని యొక్క పని మూడు అంచెలుగా ఉంటుంది: 1) ఆయన జీవాత్మకు కర్మలు చేసే శక్తి ఇస్తాడు 2) మనకు ఇవ్వబడిన శక్తితో, మనం పనులు చేయగానే మనం చేసినదాన్ని నోట్ చేసుకుంటాడు. 3) మనం చేసిన పనుల కర్మఫలములను అందజేస్తాడు. ప్రతి జీవాత్మకు తన స్వంత నిర్ణయం ద్వారా మంచి లేదా చెడు పనులు చేయటానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ స్వతంత్రచిత్తమే సృష్టి కేళికి మూలాధారము మరియు ఎన్నో జీవాత్మల మధ్య ఉన్న వైవిధ్యానికి మూల కారణం. ఒక క్రికెట్ మ్యాచ్ లో అంపైర్‌లా ఉంటుంది భగవంతుని పని. ఫలితములను ఇస్తూనే ఉంటాడు, ‘నాలుగు పరుగులు!’, ‘ఆరు పరుగులు!’, ‘అతను ఔట్!’ అలా. నిర్ణయాలకు అంపైర్‌ని దోషుడిగా చేయలేము, ఎందుకంటే అవి ఆటగాడి ఆట తీరుని బట్టి ఉంటాయి. భగవంతుడు, జీవులకు స్వతంత్ర-చిత్తమును (free-will) ఎందుకు ఇచ్చాడు అన్న సందేహము రావచ్చు. ఇది ఎందుకంటే, భగవంతుడు అభిజ్ఞ స్వరాట్ (సర్వ స్వతంత్రుడు), కాబట్టి జీవాత్మ కూడా, తన ఇంద్రియమనోబుద్ధులను తన ఇష్టానుకూలంగా ఉపయోగించుకోవటంలో అణుమాత్ర స్వతంత్రత కలిగి ఉంటుంది. అంతేకాక, స్వతంత్ర చిత్తము లేకుండా ప్రేమ ఉండదు. ఒక యంత్రము ప్రేమించలేదు ఎందుకంటే దానికి నిర్ణయించుకునే స్వతంత్రత ఉండదు. స్వతంత్రంగా నిర్ణయించుకునే వ్యక్తిత్వానికే ప్రేమించగలిగే అవకాశం ఉంటుంది. ఆయనను మనం ప్రేమించాలానే ఉద్దేశంతోనే మనలను ఆ భగవంతుడు సృష్టించాడు కాబట్టి మనకు స్వతంత్ర చిత్తమును ప్రసాదించాడు. మన స్వతంత్ర చిత్తమును వాడుకోవటం వలన మంచి లేదా చెడు కర్మలు చేయబడుతాయి, అంతేకాని ఎప్పుడూ కూడా భగవంతుడిని తప్పు పట్టరాదు. అజ్ఞానంతో కొందరు జీవులు, వారికి తమ కార్యకలాపములు చేసుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలుసుకోక, తమ తప్పులకు భగవంతుడిని బాధ్యుడిని చేస్తారు. మరికొందరు, స్వేచ్ఛాచిత్తము ఉందని తెలుసుకుంటారు, కానీ, శారీరక అహంకారం లో కర్తృత్వభావన కలిగి ఉంటారు (చేసేది నేనే అన్న భావన). ఇది కూడా అజ్ఞానానికి చిహ్నమే. ఈ అజ్ఞానాన్ని ఎట్లా నిర్మూలించుకోవాలో తదుపరి శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః । తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ।। 16 ।।
16
5
https://www.holy-bhagava…udio/005_016.mp3
జ్ఞానేన — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము చే; తు — కానీ; తత్ — అది; అజ్ఞానం — అజ్ఞానము; యేషాం — ఎవరిదైతే; నాశితమ్ — నాశనం చేయబడునో; ఆత్మనః — ఆత్మ యొక్క; తేషామ్ — వారికి; ఆదిత్య-వత్ — సూర్యుని వలె; జ్ఞానం — జ్ఞానము; ప్రకాశయతి — ప్రకాశించును; తత్ — అది; పరమ్ — పరమాత్మ తత్త్వము.
BG 5.16: కానీ, ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే, అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు, వారికి ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయును.
రాత్రి యొక్క చీకటిని తొలగించటంలో సూర్యునికి ఉన్న శక్తి సాటిలేనిది. రామచరితమానస్ (తులసీదాసు రామాయణం) ఇలా పేర్కొంటున్నది:రాకాపతి షోరస ఉఅహిఁ తారాగన సముదాఇసకల గిరిన్హ దవ లాఇఅ బిను రబి రాతి న జాఇ ‘మబ్బులు లేని ఆకాశంలో ఉన్న పౌర్ణమి చంద్రుని వెలుగు, ఇంకా అన్ని కనిపించే నక్షత్రాల యొక్క వెలుగు కలిసినా, చీకటి నిర్మూలించబడదు. కానీ, సూర్యోదయమైన మరుక్షణం, రాత్రి హడావిడిగా పారిపోతుంది.’ సూర్యుని వెలుగు ఎంత మహోన్నతమైనదంటే, చీకటి దాని ముందు నిలబడలేదు. భగవంతుని జ్ఞానం యొక్క వెలుగు కూడా అజ్ఞానపు చీకటిని తొలగించటానికి అదే మాదిరి ప్రభావం కలిగి ఉంటుంది.చీకటి అనేది భ్రమలను కలుగచేస్తుంది. సినిమా హాల్లో చీకట్లో తెర మీద పడే కాంతి, నిజంగా అనిపించే ఒక భ్రాంతిని కలుగ చేస్తుంది, జనులు దీనిని చూడటంలో నిమగ్నమైపోతారు. కానీ, సినిమా హల్లో మెయిన్ లైట్లు వేసిన తరువాత, ఆ భ్రాంతి తొలిగి, జనులు వారి ఊహాప్రపంచం నుండి బయటపడి, వారు ఇప్పటి వరకూ ఒక సినిమాను మాత్రమే చూస్తున్నారనే నిజాన్ని తెలుసుకుంటారు. ఇదే విధంగా, అజ్ఞానమనే చీకటిలో, మనము ఈ శరీరమే అని భావించి, మనమే కర్తలమని మనమే మన కర్మ ఫలముల భోక్తలమని అనుకుంటాము. భగవంతుని దివ్య ఆధ్యాత్మిక జ్ఞాన వెలుగు ఎప్పుడైతే ప్రకాశించటం ప్రారంభమవుతుందో, మన భ్రమ త్వరితగతిన పారిపోతుంది మరియు జీవాత్మ, తొమ్మిది ద్వారాల పురము (శరీరంలో) వసిస్తున్నా, తన నిజ ఆధ్యాత్మిక స్వరూపాన్ని తెలుసుకుంటుంది. భగవంతుని భౌతిక శక్తి (అవిద్యా శక్తి), జీవాత్మను చీకటితో ఆవరింపటం చేత అది ఈ మాయలో పడిపోయింది. భగవంతుని దివ్య ఆధ్యాత్మిక శక్తి (విద్యా శక్తి) జ్ఞాన వెలుగును ప్రసరించినప్పుడు ఈ మాయ నిర్మూలించబడుతుంది.
తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః । గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ।। 17 ।।
17
5
https://www.holy-bhagava…udio/005_017.mp3
తత్-బుద్ధయః — బుద్ధి ఈశ్వర పరం అయినవారు; తత్-ఆత్మానః — హృదయము (మనస్సు, బుద్ధి) భగవంతుని యందే నిమగ్నమైన వారు; తత్-నిష్ఠాః — భగవంతుని యందే దృఢ విశ్వాసం కలవారు; తత్-పరాయణాః — భగవంతుడే తమ ఆశ్రయము, లక్ష్యము అని శ్రమించు వారు; గచ్చంతి — వెళ్లేదరు; అపునః-ఆవృత్తిం — తిరిగిరాని; జ్ఞాన — జ్ఞానముచే; నిర్ధూత — నిర్మూలించబడి; కల్మషాః — పాపములు
BG 5.17: తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైనవారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు - వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి, త్వరిత గతిన, మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు.
ఎలాగైతే అజ్ఞానము వ్యక్తిని 'సంసారములో', అంటే నిరంతర జనన-మరణ చక్రంలో, దుఃఖములకు గురిచేయునో, అలాగే, జ్ఞానమునకు వ్యక్తిని భౌతిక బంధము నుండి విడిపించే శక్తి ఉంది. ఇటువంటి జ్ఞానము ఎప్పుడూ కూడా భగవంతునిపై భక్తితో కూడి ఉంటుంది. ఈ శ్లోకం, సంపూర్ణ భగవత్ ధ్యాసను సూచించటానికి చాలా బలమైన పద ప్రయోగం చేస్తున్నది.తత్-బుద్దయః అంటే బుద్ధి భగవంతుని దిశగా నిర్దేశించబడి, అని.తదాత్మనః అంటే హృదయము (మనస్సు,బుద్ధి) కేవలం భగవంతుని యందే నిమగ్నమవుట, అని.తన్నిష్ఠా అంటే బుద్ధిలో భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసముండుట, అని.తత్పరాయణాః అంటే భగవంతుడే పరమ లక్ష్యము మరియు ఆశ్రయము అని శ్రమిస్తూ, అని.ఈ విధంగా, నిజమైన జ్ఞానము యొక్క సంకేతం ఏమిటంటే అది భగవంతునిపై ప్రేమకు దారి తీస్తుంది. ఈ విధమైన ప్రేమచే భక్తులు సర్వత్రా ఆయననే దర్శిస్తారు. తదుపరి శ్లోకంలో ఇటువంటి దివ్య దృష్టి విశదీకరించబడింది.
విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని । శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ।। 18 ।।
18
5
https://www.holy-bhagava…udio/005_018.mp3
విద్యా — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము; వినయ — వినయము; సంపన్నే — కలిగి ఉన్నవారు; బ్రాహ్మణే — ఓ బ్రాహ్మణుడు; గవి — ఓ ఆవు; హస్తిని — ఓ ఏనుగు; శుని — ఓ కుక్క; చ — మరియు; ఏవ — ఖచ్చితంగా; శ్వ-పాకే — ఓ చండాలుడు; చ — మరియు; పండితాః — పండితులు; సమ-దర్శినః — ఒకే దృష్టితో చూస్తారు.
BG 5.18: నిజమైన పండితులు, దివ్య జ్ఞాన చక్షువులతో - ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమ-దృష్టితో చూస్తారు.
మనం జ్ఞాన దృక్పథంతో చూసినప్పుడు దానిని 'ప్రజ్ఞా చక్షు' అంటారు, అంటే, 'జ్ఞానమనే కళ్ళతో చూడటం' అని. శ్రీ కృష్ణుడు 'విద్యా సంపన్నే' అన్న పదాలని ఇదే అర్థంలో వాడుతున్నాడు, అంతే కాక 'వినయ' అన్న పదం కూడా వాడుతున్నాడు, అంటే, 'అణకువ/నమ్రత'. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క సంకేతం ఏమిటంటే, అది వినయ విధేయతలతో కూడి ఉంటుంది, కానీ, పైపైని పుస్తక జ్ఞానం అనేది, చదువుకున్నామనే గర్వంతో కూడిఉంటుంది. భౌతిక దృష్టి కన్నా, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించే దృష్టి ఎంత విభిన్నమైనదో శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. జ్ఞాన సంపన్నులైన భక్తులు అన్ని ప్రాణులను భగవత్ అంశము అయిన ఆత్మలుగా, దివ్యమైనవిగా చూస్తారు. శ్రీ కృష్ణుడు చూపించిన ఉదాహరణలు పూర్తి విభిన్నమైన జీవ జాతులు. పూజాది కార్యక్రమాలు చేసే వేద బ్రాహ్మణుడు గౌరవింపబడుతాడు, అదే సమయంలో, ఒక ఛండాలుడు అందరిచే సాధారణంగా వెలివేయబడి చిన్న చూపు చూడబడుతాడు; ఆవు మానవ ఉపయోగార్థం పాలు పితకబడుతుంది; కాని కుక్క కాదు; ఏనుగు శుభ-కార్యాల ఊరేగింపులో వాడబడుతుంది, కానీ ఆవుని, కుక్కని వాడరు. భౌతిక దృక్పథంలో ఈ జీవ జాతులు, భూమిపై ఉన్న వైవిధ్య జీవ రాశులలో, పూర్తి విభిన్నమైనవి. కానీ, నిజమైన జ్ఞానం కలిగి, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనవాడు, వీటన్నిటినీ నిత్యమైన ఆత్మలుగా దర్శిస్తాడు, కాబట్టి సమ దృష్టి తో చూస్తాడు. బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారు అన్న దృక్పథాన్ని వేదములు అంగీకరించవు. జ్ఞాన దృక్పథం ఏమిటంటే, బ్రాహ్మణులు పూజలు చేసినా, క్షత్రియులు పరిపాలన చేసినా, వైశ్యులు వ్యాపారాది పనులు చేసినా, శూద్రులు శ్రమ చేసినా, వీరంతా, భగవంతుని అణు అంశములైన నిత్య జీవాత్మలే, అందుకే అందరూ సమానమే.
ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః । నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ।। 19 ।।
19
5
https://www.holy-bhagava…udio/005_019.mp3
ఇహ-ఏవ — ఈ జన్మ లోనే; తైః — వారిచే; జితః — జయింపబడును; సర్గః — సృష్టి (జగత్తు); యేషాం — ఎవరైతే; సామ్యే — సమభావము నందు; స్థితం — ఉందురో; మనః — మనస్సు; నిర్దోషం — దోషరహితమై; హి — నిజముగా; సమం — సమ దృష్టి యందు; బ్రహ్మ — భగవంతుడు; తస్మాత్ — కాబట్టి ; బ్రహ్మణి — పరమ సత్యము నందు; తే — వారు; స్థితాః — స్థితులై ఉందురు.
BG 5.19: సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు, ఈ జన్మలోనే జనన-మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగిఉంటారు కాబట్టి పరమ సత్యము నందే స్థితులై ఉంటారు.
శ్రీ కృష్ణుడు 'సామ్యే' అన్న పదం వాడాడు, అంటే, ఇంతకు క్రితం శ్లోకం లో చెప్పినట్టు, అన్ని ప్రాణుల యందు సమ భావమును కలిగినవాడు, అని. అంతేకాక, సమ-దృష్టి అంటే, ఇష్టాయిష్టాలకు, సుఖ-దుఃఖాలకు, కీర్తి-అపకీర్తిలకు అతీతంగా ఉండటం కూడా. ఈ విధంగా ఉండగలిగిన వారు, పదేపదే వచ్చే జనన-మరణ సంసారాన్ని దాటేస్తారు.మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంతవరకు, ఈ సమత్వ దృష్టి అనేదాన్ని పొందలేము, ఎందుకంటే, శారీరక ఆహ్లాదము మరియు కష్టముల పరంగా కోరికలు, ద్వేషాలు అనుభవంలోనికి వస్తూనే ఉంటాయి. యోగులు శారీరక దృక్పథానికి అతీతంగా ఎదిగి, ప్రాపంచిక బంధాలని త్యజించి, మనస్సుని భగవంతుని యందే లగ్నం చేస్తారు. రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది: సేవహిఁ లఖను సీయ రఘుబీరహి, జిమి అబిబెకీ పురుష సరీరహి‘ఒక అజ్ఞాని తన శరీరానికి సేవ చేసినట్టుగా, లక్ష్మణుడు సీతారాములకు సేవ చేసాడు.’ ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనస్సు ఈ ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంటుందో, శారీరక సుఖ-దుఃఖాలపై మమకారాసక్తులకు అతీతుడై, సమత్వ బుద్ధి స్థితిని చేరుకుంటాడు. స్వార్థ పూరిత శారీరక కోరికలని త్యజించటం ద్వారా వచ్చే ఈ నిశ్చలతత్త్వం, వ్యక్తిని ప్రవర్తనలో భగవంతునిలా చేస్తుంది. మహాభారతం ఇలా పేర్కొంటున్నది: యో న కామయతే కించిత్ బ్రహ్మ భూయాయ కల్పతే, ‘కోరికలను త్యజించిన వాడు ఈశ్వరుడిలా అవుతాడు.’
న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ । స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః ।। 20 ।।
20
5
https://www.holy-bhagava…udio/005_020.mp3
న, ప్రహృష్యేత్ — పొంగిపోరు; ప్రియం — ప్రియమైనది; ప్రాప్య — పొందినప్పుడు; న, ఉద్విజేత్ — కలత నొందరు; ప్రాప్య — పొందినప్పుడు; చ — మరియు; అప్రియం — అప్రియమైనది; స్థిర-బుద్ధిః — నిశ్చలమైన బుద్ధి; అసమ్మూఢాః — ధృఢంగా ఉండి (భ్రమకు లోనుకాక); బ్రహ్మ-విత్ — దివ్య జ్ఞానము పై గట్టి అవగాహన తో; బ్రహ్మణి — భగవంతుని యందు; స్థితః — స్థితులై.
BG 5.20: భగవంతుని యందే స్థితులై, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోనుకాకుండా ఉన్నవారు, ప్రియమైనవి జరిగితే/లభిస్తే పొంగిపోరు లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే క్రుంగిపోరు.
ఈ శ్లోకంలో ఉన్న ఈ భాగం - సుఖాలలో పొంగిపోరు, దుఃఖాలకు క్రుంగిపోరు - అనేది బౌద్ధ మతంలో ఉన్న 'విపాసన' ధ్యాన ఆచారంలో ఉన్న అత్యున్నత ఆదర్శం. ఈ రకమైన స్పష్టత మరియు ఖచ్చితత్వం కలిగిన స్థితికి చేరుకోవటానికి కఠినమైన శిక్షణ తీసుకుంటారు; ఇది అంతిమంగా, సమత్వ భావన స్థితికి చేర్చి, అహంకారాన్ని అంతం చేస్తుంది. కానీ, భక్తిలో, మన చిత్తమును శరణాగతిగా భగవత్ అర్పితము చేసినప్పుడు, ఇదే స్థితిని సహజంగానే చేరుకుంటాము. 5.17వ శ్లోకం ప్రకారం, మన చిత్తమును భగవంతుని చిత్తముతో ఐక్యం చేసినప్పుడు, సంతోషాన్ని, బాధని భగవంతుని అనుగ్రహంగా స్వీకరిస్తాము. ఒక చక్కటి కథ ఈ వైఖరిని విశదీకరిస్తుంది. ఒకసారి ఓ అడవి గుర్రం ఒక రైతు పొలంలోకి వచ్చింది. ఆ ఊరి జనులు ఆ రైతుని అభినందించారు. అతను అన్నాడు, ‘అదృష్టమో, దురదృష్టమో ఎవరికి తెలుసు? అంతా ఆ భగవంతుని సంకల్పం.’ కొద్ది రోజులయిన తరువాత, ఆ గుర్రం మళ్లీ అడవిలోకి పారిపోయింది. చుట్టుపక్కల వాళ్లు అతని దురదృష్టానికి జాలి పడ్డారు. అతను అన్నాడు, ‘అదృష్టమో, దురదృష్టమో ఎవరికి తెలుసు? అంతా ఆ భగవంతుని సంకల్పం.’ మరికొద్ది రోజులు గడిచాయి, ఒకరోజు ఆ గుర్రం తనతో పాటు ఇంకా ఇరవై గుర్రాలను తీస్కొని వచ్చింది. మళ్లీ ఊరి జనులు అతని అదృష్టానికి అబ్బురపడి అభినందించారు, అతను వివేకముతో అనుకున్నాడు ‘అదృష్టమో, దురదృష్టమో ఎవరికి తెలుసు? ఇదంతా ఆ భగవంతుని సంకల్పం.’ కొన్ని రోజుల తరువాత ఆ రైతు కొడుకు ఒక గుర్రంపై స్వారీ చేస్తూ కింద పడి కాలు విరగగొట్టుకున్నాడు. చుట్టుపక్కల వారు తమ సానుభూతి చెప్పటానికి వచ్చారు. తెలివైన రైతు ఇలా చెప్పాడు, ‘మంచో, చెడో - ఇది భగవత్ సంకల్పమే.’ మరి కొన్ని రోజులు గడిచాయి, రాజుగారి సైనికులు వచ్చి, అప్పుడే మొదలైన యుద్ధం కోసం, ఆ ఊరిలో ఉన్న యువకులందరినీ సైన్యంలో చేర్చుకోవటానికి తీసుకెళ్ళిపొయారు. ఊరిలో ఉన్న యువకులందరినీ తీసుకెళ్ళారు కానీ, ఆ రైతు కొడుకుని మాత్రం, వాడి కాలు విరిగిందని వదిలేసి వెళ్ళిపోయారు. ఆధ్యాత్మిక జ్ఞానం మనకు కలిగించే అవగాహన ఎమిటంటే, భగవంతునికి ప్రీతి కలిగించటంలోనే మన స్వీయ-ప్రయోజనం ఉంది అని. ఇది ఈశ్వర శరణాగతి దిశగా తీసుకెళ్తుంది, ఎప్పుడైతే మన స్వీయ-చిత్తం, భగవంతుని చిత్తముతో ఏకమైపోతుందో, అప్పుడు, సంతోషాలని, దుఃఖాలని కూడా ఈశ్వర అనుగ్రహంలా ప్రశాంతంగా స్వీకరించే సమత్వబుద్ధి పెంపొందుతుంది. ఇదే సర్వోత్కృష్ట స్థితిలో ఉన్నవాని లక్షణం.
బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్ । స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ।। 21 ।।
21
5
https://www.holy-bhagava…udio/005_021.mp3
బాహ్య-స్పర్శేషు — బాహ్యమైన ఇంద్రియ సుఖము; అసక్త-ఆత్మా — ఆసక్తి/మమకారం లేని వారు; విందతి — తెలుసుకుంటారు; ఆత్మని — ఆత్మ యందే; యత్ — ఏదైతే; సుఖమ్ — ఆనందము; సః — ఆ వ్యక్తి; బ్రహ్మ-యోగ-యుక్త-ఆత్మా — యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై; సుఖం — సుఖము; అక్షయం — తరిగిపోని; అశ్నుతే — అనుభవించును.
BG 5.21: బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు, ఆత్మ యందే దివ్యానందాన్ని అనుభవిస్తారు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై, అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు.
వైదిక శాస్త్రాలు అనేక పర్యాయములు భగవంతుడిని అనంతమైన దివ్య ఆనంద సాగరంగా అభివర్ణించాయి:ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ (తైత్తిరీయ ఉపనిషత్తు 3.6)"భగవంతుడంటే ఆనందమే అని తెలుసుకో."కేవలానుభవానంద స్వరూపః పరమేశ్వరః(భాగవతం 7.6.23)‘భగవంతుని స్వరూపము స్వచ్ఛమైన ఆనందముచే తయారుచేయబడినది.’ ఆనంద మాత్ర కర పాద ముఖోదరాది (పద్మ పురాణం)‘దేవుని చేతులు, పాదాలు, ముఖము, ఉదరము మొదలగునవన్నీ ఆనందముచే తయారు చేయబడినవి’జో ఆనంద్ సింధు సుఖరాసి (రామచరితమానస్)‘భగవంతుడు సంతోష-ఆనందముల మహాసాగరము’ఈ శాస్త్రాల్లో ఉన్న మంత్రములు మరియు శ్లోకములు అన్నీ, దివ్య ఆనందమే భగవంతుని వ్యక్తిత్వ స్వభావమని వక్కాణిస్తున్నాయి. తన ఇంద్రియములు, మనస్సు, మరియు బుద్ధి భగవంతుని యందే నిమగ్నం చేసిన యోగి, తనలోనే ఉన్న భగవంతుని యొక్క దివ్య ఆనందాన్ని అనుభవించటం ప్రారంభిస్తాడు.
యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే । ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ।। 22 ।।
22
5
https://www.holy-bhagava…udio/005_022.mp3
యే — ఏదైతే; హి — నిజముగా; సంస్పర్శ-జాః — ఇంద్రియ వస్తు-విషయముల సంపర్కంచే జనించిన; భోగాః — భోగములు; దుఃఖా — దుఃఖములు; యోనయః — మూలము; ఏవ — నిజముగా; తే — వారు; ఆద్య-అంతవంతః — మొదలు మరియు తుది కలిగిన; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; న — ఎప్పటికీ కాదు; తేషు — వాటిలో; రమతే — రమించరు; బుధః — తెలివైనవారు.
BG 5.22: ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం (మొదలు-చివర) ఉంటాయి, కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు.
ఇంద్రియ వస్తు-విషయ సంపర్కంచే ఇంద్రియములు సుఖానుభూతులను కలుగచేస్తాయి. మనస్సు ఒక ఆరవ ఇంద్రియము లాగా, గౌరవము, పొగడ్త, పరిస్థితులు, విజయము మొదలైన అగ్రాహ్యమైన వాటి నుండి ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. ఈ యొక్క శారీరక, మానసిక సుఖాలన్నిటినీ భోగాలు (భౌతిక సుఖానుభవము) అంటారు. ఇటువంటి ప్రాపంచిక భోగాలు, ఈ క్రింది కారణాల వలన ఆత్మను సంతృప్తి పరచలేవు: ప్రాపంచిక ఆనందాలు పరిమితమైనవి, కాబట్టి ఏదో లోపించిన భావన వాటిలో అంతర్గతంగా ఉంటుంది. ఒక వ్యక్తికి లక్షాధికారి అయ్యాననే సంతోషం ఉండవచ్చు, కానీ అదే లక్షాధికారి ఒక కోటీశ్వరున్ని చూసినప్పుడు అసంతృప్తికి లోనై ఇలా అనుకుంటాడు, ‘నాకు కూడా ఒక కోటి రూపాయలు ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేవాడిని.’ అని. దీనికి విరుద్ధంగా, భగవంతుని ఆనందం అనంతమైనది, కాబట్టి పరిపూర్ణ సంతృప్తిని ఇస్తుంది. ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమైనవి. ఒకసారి అయిపోయిన తరువాత, వ్యక్తిని మరల అసంతృప్తితో వదిలిపెడతాయి. ఉదాహరణకి ఒక తాగుబోతు, రాత్రి పూట మద్యం తాగటాన్ని ఎంజాయ్ చేయవచ్చు. కానీ మరుసటి రోజు పొద్దున్న దాని దుష్ప్రభావం, అతనికి తీవ్రమైన తలనొప్పి ఇస్తుంది. కానీ, భగవంతుని ఆనందం నిత్యమైనది, ఒకసారి పొందిన తరువాత అది ఎప్పటికీ ఉంటుంది. ప్రాపంచిక సుఖాలు అస్థిరమైనవి మరియు త్వరితగతిన వీగిపోతాయి. జనులు ఒక గొప్ప అవార్డు పొందిన సినిమాను చూసినప్పుడు, ఏంతో ఆనందిస్తారు, కానీ అదే సినిమాని రెండవ సారి స్నేహితుడికి తోడు కోసం చూడవలసి వస్తే, ఆ ఆనందం ఉండదు. ఇంకొక స్నేహితుడు మూడో సారి చూడటానికి ఒత్తిడి చేస్తే, వారంటారు , ‘ఏదైనా శిక్ష వేయండి కానీ, మరల ఆ సినిమా చూడమని అడగవద్దు.’ అని. భౌతిక వస్తువుల నుండి కలిగే సుఖం మనం దానిని ఆనందించే కొద్దీ తగ్గిపోతుంది. ఆర్థికశాస్త్రంలో దీనిని ‘లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్’ (Law of Diminishing Returns) అంటారు. కానీ, భగవంతుని ఆనందం చైతన్యవంతమైనది; అది సత్-చిత్-ఆనందం (శాశ్వతమైన నిత్య నూతనమైన దివ్య ఆనందము). కాబట్టి, ఒక వ్యక్తి అదే భగవత్ నామాన్ని నిరంతరం రోజంతా జపిస్తూ ఉన్నా, నిత్య నూతనమైన ఆధ్యాత్మిక తృప్తిని దానిలో పొందుతాడు. ఒక స్వస్థచిత్తంగల మనిషి, రుచికరమైన స్వీటుని అస్వాదిస్తునప్పుడు, దానిని వదిలి బురదని తినమంటే తినడు. అదేవిధంగా, ఒక వ్యక్తి దివ్య ఆధ్యాత్మిక ఆనందాన్ని అస్వాదిస్తున్నప్పుడు, మనస్సు అన్ని భౌతిక సుఖాల యందు రుచిని కోల్పోతుంది. విచక్షణా జ్ఞానం ప్రసాదించబడిన వారు ఈ పైన చెప్పబడిన భౌతిక సుఖాల లోపాలను అవగతం చేసుకుని, తమ ఇంద్రియములను వాటినుండి నిగ్రహిస్తారు. శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకంలో దీనిని ఉద్ఘాటిస్తున్నాడు.
శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ । కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ।। 23 ।।
23
5
https://www.holy-bhagava…udio/005_023.mp3
శక్నోతి — చేయగలడు; ఇహ ఏవ — ఈ ప్రస్తుత శరీరం లోనే; యః — ఎవరైతే; సోఢుమ్ — నిగ్రహించి/తట్టుకోని; ప్రాక్ — పూర్వమే; శరీర — శరీరము; విమోక్షణాత్ — త్యజించుట; కామ — కోరిక; క్రోధ — కోపము; ఉద్భవం — (నుండి) జనించిన; వేగం — ఉద్వేగమును; సః — ఆ వ్యక్తి; యుక్తః — యోగి; సః — ఆ వ్యక్తి; సుఖీ — సంతోషము కల; నరః — మనిషి.
BG 5.23: ఈ శరీరమును విడిచి పెట్టక ముందే ఎవరైతే కామ-క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖసంతోషములు గలవారు.
మానవ శరీరం అనేది, ఆత్మకి, అత్యున్నత లక్ష్యం అయిన భగవత్ ప్రాప్తిని సాధించేందుకు ఉన్న ఒక అద్భుతమైన అవకాశం. ఈ శరీరంలో, మనకు వివేచనా శక్తి ఉంటుంది, కానీ జంతువులు తమ సహజ స్వభావంచే ప్రవర్తిస్తాయి. శ్రీ కృష్ణుడు ఈ విచక్షణా శక్తిని వాడుకోవటం ద్వారా కామ-క్రోధముల యొక్క ఉద్వేగమును నియంత్రించాలి అని ఉద్ఘాటిస్తున్నాడు.'కామము' అంటే ఒక అర్థం స్త్రీ-పురుషుల మధ్య ఉండే వాంఛ, కానీ ఈ శ్లోకంలో, 'కామము' అన్న పదానికి అర్థం, 'భౌతిక సుఖాల కోసం ఉన్న అన్ని రకాల శారీరక, మానసిక కోరికలు' అని. తనకు కావలసిన వస్తువు ఎప్పుడైతే దొరకదో, అప్పుడు మనస్సు తన స్థితిని క్రోధము వ్యక్తం చేయటానికి మార్చుకుంటుంది. కామ-క్రోధముల ఆవేశం, నది ప్రవాహంలా చాలా ప్రబలంగా ఉంటుంది. జంతువులు కూడా ఈ ఆవేశాలకు లోనగుతాయి, కానీ మనుష్యుల లాగ కాకుండా, ఆయా ఆవేశాలను నియంత్రించే విచక్షణా శక్తి వాటికి లేదు. కానీ, మనుష్య బుద్ధికి వివేచనా శక్తి ప్రసాదించబడింది. 'సోఢుం' అన్న పదానికి అర్థం 'తట్టుకొని నిలబడటం'. ఈ శ్లోకం మనకు కామ-క్రోధ ఉద్వేగాలని అదుపులో ఉంచుకొని తట్టుకొని ఉండమని ఉపదేశిస్తున్నది. కొన్ని సార్లు మనం, సిగ్గుపడి మనస్సుని నియంత్రిస్తాము. ఒక ఆసామి విమానాశ్రయంలో కూర్చొని ఉన్నాడు అనుకోండి. ఒక అందమైన ఆవిడ వచ్చి ఆయన పక్కన కూర్చుంది. అతని మనస్సు, ఆమె చుట్టూ చేయి వేసే సుఖాన్ని కోరుకుంటుంది, కానీ అతని బుద్ధి ఈ తలంపుతో దానిని నియంత్రిస్తుంది, ‘ఇది మంచి ప్రవర్తన కాదు. ఆవిడ నా చెంపఛెళ్ళు మనిపించవచ్చు కూడా.’ ఆ అవమానం పొందకుండా, తనను తాను నిగ్రహించుకుంటాడు. ఇక్కడ సిగ్గుపడో, అవమానానికో, భయానికో మనస్సుని నియంత్రణ చేయమనటం లేదు, జ్ఞానంచే కలిగిన విచక్షణచే మనస్సుని నిగ్రహించమంటున్నాడు, శ్రీ కృష్ణుడు.మనస్సుని నియంత్రించటానికి దృఢమైన బుద్ధిని వాడుకోవాలి. ఏదైనా భౌతిక సుఖాన్ని ఆస్వాదించాలనే తలంపు రాగానే, వెంటనే బుద్ధికి, అవి దుఃఖహేతువులు అని గుర్తురావాలి. శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంటున్నది:నాయం దేహో దేహ-భాజాం నృలోకేకష్టాన్ కామాన్ అర్హతే విద్-భుజాం యేతపో దివ్యం పుత్రకా యేన సత్త్వంశుద్ధ్యేద్ యస్మాద్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం (5.5.1)‘మానవ శరీరంలో, ప్రాపంచిక సుఖాల కోసం ఎంతో కష్ట పడనవసరం లేదు, ఇవి మలమును భక్షించే జీవులకు (సూకరములు) కూడా లభించును. బదులుగా, ఈ విశిష్ట శరీరంతో తపస్సుని ఆచరించి, అంతఃకరణ శుద్ధి సాధించి, అనంతమైన బ్రహ్మానందమును అనుభవింపవలెను.’ ఈ వివేకముతో కూడిన విచక్షణ కేవలం మానవ శరీరంలోనే లభిస్తుంది మరియు ఈ దేహంలో ఉన్నప్పుడే కామ-క్రోధ ఆవేశాలను నియంత్రణలో ఉంచినవాడే యోగి అవుతాడు. అటువంటి వాడు మాత్రమే, దివ్యానందాన్ని రుచి చూసి సుఖంగా ఉంటాడు.
యోఽoతః సుఖోఽoతరారామః తథాంతర్జ్యోతిరేవ యః । స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ।। 24 ।।
24
5
https://www.holy-bhagava…udio/005_024.mp3
యః — ఎవరైతే; అంతః-సుఖాః — అంతరాత్మ యందు సుఖముగా ఉన్నవాడు; అంతః-ఆరామః — తనయందే రమిస్తూ; తథా — అట్లే; అంతః-జ్యోతి: — ఆంతరంగిక వెలుగుచే ప్రకాశిస్తూ; ఏవ — నిజముగా; యః — ఎవరైతే; సః — వారు; యోగీ — యోగి; బ్రహ్మ-నిర్వాణం — భౌతిక జగత్తు నుండి విముక్తిని; బ్రహ్మ-భూతః — భగవంతునితో ఏకమై; అధిగచ్ఛతి — పొందును.
BG 5.24: ఎవరైతే తమలో తాము ఆనందంగా (రమిస్తూ) ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి, అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో, అటువంటి యోగులు, భగవంతునితో ఏకమై, భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు.
‘ఆంతర వెలుగు’ అంటే, మనం భగవత్ శరణాగతి చేసినప్పుడు, ఈశ్వర అనుగ్రహంచే, మన లోనుండే అందచేయబడిన అనుభవంలోకి వచ్చిన దివ్య ఆధ్యాత్మిక విజ్ఞానం. యోగ దర్శనం ఇలా పేర్కొంటుంది:రితంభరా తత్ర ప్రజ్ఞా (1.48)' సమాధి స్థితిలో, వ్యక్తి యొక్క బుద్ధి పరమ సత్యపు సాక్షాత్కారంతో నిండి ఉంటుంది ’ అర్జునుడికి, కామక్రోధ ఉద్విగ్నతలను తట్టుకొని నిలబడటం యొక్క ఆవశ్యకత వివరించిన తరువాత, శ్రీ కృష్ణుడు దీనిని అభ్యాసం చేయటానికి ఉన్న రహస్యాన్ని వివరిస్తున్నాడు. 'యోఽoతః సుఖో' అంటే, 'అంతర్గతంగా సుఖంగా ఉన్నవాడు', అని అర్థం. మనకు బాహ్య విషయ-వస్తువుల నుండి ఒక లాంటి సుఖం లభిస్తుంది, మరియు, మనం మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేసినప్పుడు, ఇంకొక లాంటి సుఖం, మనలోనుండే అనుభవంలోనికి వస్తుంది. మనకు అంతర్గతంగా ఆనందం అనుభవంలోకి రానప్పుడు, బాహ్యమైన దురాకర్షణలని శాశ్వతంగా నిరోధించలేము. కానీ, ఎప్పుడైతే భగవత్ ఆనందం హృదయంలో ప్రవహించటం మొదలవుతుందో, క్షణభంగురమైన బాహ్య సుఖాలు అల్పమైనవిగా అనిపించి, త్యజించటానికి సునాయాసంగా ఉంటాయి.యమునాచార్య మహాముని ఈ విధంగా పేర్కొన్నాడు:యదావధి మమ చేతః కృష్ణ-పదారవిందేనవ-నవ-రస-ధామనుద్యత రంతుమ్ ఆసీత్తదావధి బత నారీ-సంగమే స్మర్యమానేభవతి ముఖ-వికారః సుష్టు నిష్థీవనమ్ చ‘శ్రీ కృష్ణుని పాదారవిందాలపై ధ్యానం చేస్తున్నప్పటి నుండీ, నేను నిత్య నూతన ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. ఒకవేళ గానీ, స్త్రీ సంగమ సుఖం గుర్తుకు వస్తే, ఆ తలంపు పట్ల ఉమ్మేసి, పెదాలను వికారంతో తిప్పుకుంటాను.’
లభంతే బ్రహ్మనిర్వాణమ్ ఋషయః క్షీణకల్మషాః । ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ।। 25 ।।
25
5
https://www.holy-bhagava…udio/005_025.mp3
లభంతే — లభించును; బ్రహ్మ-నిర్వాణమ్ — భౌతిక జగత్తు నుండి విముక్తి; ఋషయః — పవిత్రమైన వ్యక్తులు; క్షీణ-కల్మషాః — పాపములన్ని నాశనం అయినవారు; ఛిన్న — నిర్మూలింపబడి; ద్వైధాః — సందేహములు; యత-ఆత్మానః — ఎవరి మనస్సులు నిగ్రహింపబడినవో; సర్వ-భూత — సమస్త ప్రాణుల కోసము; హితే — సంక్షేమం కోసం; రతాః — పరితపించేవారు.
BG 5.25: ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో, ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమౌతారో, అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది, భగవంతుడిని పొందుతారు.
ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, భగవంతుని దివ్యానందమును తమ యందే అనుభవించే మునుల స్థితిని గూర్చి చెప్పి ఉన్నాడు. ఈ శ్లోకంలో, సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే ఋషుల గురించి వివరిస్తున్నాడు. రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది:పర ఉపకార బచన మన కాయా,సంత సహజ సుభాఉ ఖగరాయా ‘కరుణా స్వభావము అనేది ఋషులకున్న స్వాభావిక గుణము. దానిచే స్ఫూర్తినొంది, వారు తమ వాక్కు, మనస్సు, మరియు శరీరములను పరుల సంక్షేమం కోసమే ఉపయోగిస్తారు.’మానవ జాతి సంక్షేమం అనేది మెచ్చదగిన ప్రయత్నం. కానీ, శారీరక స్థాయి సంక్షేమ పథకాలు, కేవలం తాత్కాలిక ఉపశమనాన్నే కలిగిస్తాయి. ఒక ఆకలి గొన్న వ్యక్తికి అన్నం పెట్టినప్పుడు అతని ఆకలి తీరిపోతుంది. కానీ, ఓ నాలుగు గంటల తరువాత అతనికి మళ్లీ ఆకలి వేస్తుంది. ఆధ్యాత్మిక సంక్షేమం భౌతిక దుఃఖాల మూల కారణాన్ని ఉపశమింపజేస్తుంది, మరియు ఆత్మ యొక్క భగవత్ స్పృహని మేల్కొలుపటానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి, అత్యున్నత సంక్షేమ కార్యం ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క ఆత్మని భగవంతునితో ఏకం చేయటమే. పవిత్రమైన మనసున్న మహోన్నత జీవులు, ఈ రకమైన సంక్షేమ పనులే చేస్తుంటారు. ఈ రకమైన సంక్షేమ కార్యాలు మరింత భగవత్ కృపని ఆకర్షిస్తాయి, దీనితో వీరు ఈ మార్గంలో మరింత ఉన్నతమైన దశకు చేరుకుంటారు. చివరికి, వారు సంపూర్ణ అంతఃకరణ శుద్ది సాధించిన తరువాత మరియు పరిపూర్ణమైన శరణాగతి చేసిన తరువాత, మోక్షము పొంది, పరమ పదమును పొందెదరు.ఈ అధ్యాయంలో, ఇప్పటి వరకు శ్రీ కృష్ణుడు, కర్మ యోగ మార్గమును కీర్తించాడు. ఇప్పుడు మిగిలిన శ్లోకములను, కర్మ సన్యాసుల కొరకు చెప్తాడు, వారు కూడా అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటారని తెలియచేస్తున్నాడు.
కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ । అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ।। 26 ।।
26
5
https://www.holy-bhagava…udio/005_026.mp3
కామ — కోరికలు; క్రోధ — కోపము; వియుక్తానాం — విముక్తులైన వారు; యతీనాం — సాధువులు; యత-చేతసాం — ఆత్మజ్ఞానం పొంది, మనస్సుని నిగ్రహించిన వారు; అభితః — అన్ని దిక్కులలో ; బ్రహ్మ — ఆధ్యాత్మిక; నిర్వాణం — భౌతిక అస్తిత్వం నుండి విముక్తి; వర్తతే — ఉండును; విదిత-ఆత్మానం — ఆత్మ జ్ఞానం తెలుసుకున్నవారు.
BG 5.26: నిరంతర ప్రయాస ద్వారా కామ-క్రోధముల నుండి బయట పడిన వారు, మనస్సుని నిగ్రహించిన వారు, ఆత్మ-జ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహ పర లోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది.
5.2వ శ్లోకంలో ఇంతకు పూర్వం చెప్పినట్టు, కర్మయోగము అనేదే అత్యధిక జనులకు సరిపోయే సురక్షిత మార్గము, అందుకే శ్రీ కృష్ణుడు దానిని అర్జునుడికి గట్టిగా సూచించాడు. కానీ, ప్రాపంచిక జగత్తు నుండి నిజముగా వైరాగ్యం కలిగిన వానికి, 'కర్మ సన్యాసం' కూడా సరిపోతుంది. దీనిలో ఉన్న అనుకూలత ఏమిటంటే, ప్రాపంచిక విధుల వైపు, వ్యక్తి సమయము, శక్తి ఖర్చు కావు, ఆ వ్యక్తి పూర్తిగా ఆధ్యాత్మిక సాధన యందు నిమగ్నమవ్వచ్చు. చరిత్రలో ఏంతో మంది మహాత్ములైన సన్యాసులు ఉన్నారు. ఇటువంటి కర్మ సన్యాసులు కూడా అత్యంత త్వరితంగా పురోగతి సాధించి సర్వత్రా శాంతిని పొందుతారు అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నారు. కామ-క్రోధముల నుండి వచ్చే ఉద్వేగాలను నిర్మూలించి మరియు మనస్సుని వశపరుచుకున్న ఇటువంటి వారు, ఈ జన్మలో, ఇంకా, పై జన్మలలో, సంపూర్ణ శాంతిని పొందుతారు. మనం తరచుగా, మన జీవితంలో శాంతి లోపించటానికి కారణం, బాహ్య పరిస్థితులు అనే తప్పుడు దృక్పథంలో ఉంటాము; మరియు పరిస్థితులు ఎప్పుడు మారతాయా, ఎప్పుడు ప్రశాంతత లభిస్తుందా అని ఎదురు చూస్తాము. కానీ, శాంతి అనేది బాహ్య పరిస్థితులపై ఆధార పడి ఉండదు; అది పరిశుద్ధమైన ఇంద్రియమనోబుద్ధుల వల్ల ఉత్పన్నమయ్యే ఫలితము. సన్యాసులు, తమ మనస్సు, ఆలోచనలను తమలో అంతర్లీనగా తిప్పుకోవటం వలన, బాహ్య పరిస్థితులకు అతీతంగా, అపారమైన శాంతిని పొందుతారు. ఈ విధంగా, తమ అంతర్గత యంత్రాంగం అంతా సరియైన ప్రకారంగా ఉండటం వలన వారు అంతటా శాంతినే అనుభవిస్తారు, మరియు ఇక్కడే విముక్తి పొందుతారు.
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః । ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ।। 27 ।। యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః । విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ।। 28 ।।
27
5
https://www.holy-bhagava…/005_027-028.mp3
స్పర్శాన్ — ఇంద్రియ స్పర్శ సంపర్కంచే; కృత్వా — నిలిపి; బహిః — బయట; బాహ్యాన్ — బాహ్యమైన; చక్షుః — కళ్ళు; చ — మరియు; ఏవ — తప్పకుండా; అంతరే — మధ్యలో; భ్రువోః — కనుబొమల యొక్క; ప్రాణ-అపానౌ — లోనికి వచ్చే, బయటకు వెళ్ళే శ్వాసను; సమౌ — సమానముగా; కృత్వా — నిలిపి; నాస-అభ్యంతర — నాసికా రంధ్రములలో; చారిణౌ — కదులుతున్న; యత — నియంత్రించి; ఇంద్రియ — ఇంద్రియములు; మనః — మనస్సు; బుద్ధిః — బుద్ధి; మునిః — మునులు; మోక్ష — మోక్షము; పరాయణః — పరాయణులై; విగత — త్యజించి; ఇచ్ఛా— కోరికలు; భయ — భయము; క్రోధః — కోపము; యః — ఎవరైతే; సదా — ఎల్లప్పుడూ; ముక్తః — ముక్తి నొంది; ఏవ — నిజముగా; సః — ఆ వ్యక్తి.
BG 5.27-28: అన్నిబాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి, దృష్టి కనుబొమల మధ్యే కేంద్రీకరించి, నాసికా రంధ్రములలో లోనికి వచ్చే, బయటకు వెళ్ళే గాలిని సమముగా నియంత్రించి, ఈ విధంగా ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి, కామ-క్రోధ-భయ రహితుడైన ముని సర్వదా మోక్ష స్థితి యందే వసించును.
తరచుగా సన్యాసులు, తమ నిష్ఠలతో పాటుగా, అష్టాంగయోగ లేదా హఠయోగ వైపు మొగ్గు చూపుతారు. వారి యొక్క తీవ్ర మైన వైరాగ్యం వారిని భక్తి మార్గము వైపు అంతగా పోనివ్వదు. దానికి, భగవంతుని నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు, మరియు భగవత్-భక్తులపై పై ధ్యానం అవసరం. ఇక్కడ శ్రీ కృష్ణుడు సన్యాసులు తీసుకునే మార్గాన్ని వివరిస్తున్నాడు. ఇటువంటి సన్యాసులు తమ దృష్టి, శ్వాసలను నియంత్రించటం ద్వారా ఇంద్రియ వస్తువుల తలంపులని దగ్గరికి రానివ్వరు. తమ దృష్టిని కనుబొమల మధ్యే కేంద్రీకరిస్తారు. ఒకవేళ కళ్ళు పూర్తిగా మూస్తే, నిద్ర రావచ్చు; ఒకవేళ కళ్ళు పూర్తిగా తెరిస్తే, చుట్టూ ఉన్నవాటి వలన ధ్యానంలో మనస్సు నిలబడలేకపోవచ్చు. ఈ రెండు దోషాలనూ నివారించటానికి, సన్యాసులు కళ్ళు సగమే తెరిచి, తమ దృష్టిని, కను బొమల మధ్యన లేదా నాసికాగ్రాన నిలుపుతారు. ఇంకా, తమ ప్రాణము (బయటకు వెళ్ళే శ్వాస) ను, అపానము (లోనికి వచ్చే శ్వాస) తో , అవి రెండూ యోగ సమాధిలో నిలిచి పోయేవరకు, అనుసంధానం చేస్తారు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధిలను నియంత్రించటానికి ఈ యోగ పద్ధతి చాలా సహకరిస్తుంది. ఇటువంటి వ్యక్తులు భౌతిక ప్రాపంచిక మాయ నుండి విముక్తి పొందటమే తమ ఒకేఒక లక్ష్యంగా ఉంటారు. ఇటువంటి సన్యాస నిష్ఠల అభ్యాసం ఆత్మ-జ్ఞానానికి దారి తీస్తుంది, కానీ బ్రహ్మ-జ్ఞానానికి కాదు. కాబట్టి, తదుపరి శ్లోకంలో చెప్పినట్టుగా, ఇటువంటి సన్యాస మార్గము కూడా భగవత్ భక్తి ద్వారానే పరిపూర్ణత నొందాలి.
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః । ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ।। 27 ।। యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః । విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ।। 28 ।।
28
5
https://www.holy-bhagava…/005_027-028.mp3
స్పర్శాన్ — ఇంద్రియ స్పర్శ సంపర్కంచే; కృత్వా — నిలిపి; బహిః — బయట; బాహ్యాన్ — బాహ్యమైన; చక్షుః — కళ్ళు; చ — మరియు; ఏవ — తప్పకుండా; అంతరే — మధ్యలో; భ్రువోః — కనుబొమల యొక్క; ప్రాణ-అపానౌ — లోనికి వచ్చే, బయటకు వెళ్ళే శ్వాసను; సమౌ — సమానముగా; కృత్వా — నిలిపి; నాస-అభ్యంతర — నాసికా రంధ్రములలో; చారిణౌ — కదులుతున్న; యత — నియంత్రించి; ఇంద్రియ — ఇంద్రియములు; మనః — మనస్సు; బుద్ధిః — బుద్ధి; మునిః — మునులు; మోక్ష — మోక్షము; పరాయణః — పరాయణులై; విగత — త్యజించి; ఇచ్ఛా— కోరికలు; భయ — భయము; క్రోధః — కోపము; యః — ఎవరైతే; సదా — ఎల్లప్పుడూ; ముక్తః — ముక్తి నొంది; ఏవ — నిజముగా; సః — ఆ వ్యక్తి.
BG 5.27-28: అన్నిబాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి, దృష్టి కనుబొమల మధ్యే కేంద్రీకరించి, నాసికా రంధ్రములలో లోనికి వచ్చే, బయటకు వెళ్ళే గాలిని సమముగా నియంత్రించి, ఈ విధంగా ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి, కామ-క్రోధ-భయ రహితుడైన ముని సర్వదా మోక్ష స్థితి యందే వసించును.
తరచుగా సన్యాసులు, తమ నిష్ఠలతో పాటుగా, అష్టాంగయోగ లేదా హఠయోగ వైపు మొగ్గు చూపుతారు. వారి యొక్క తీవ్ర మైన వైరాగ్యం వారిని భక్తి మార్గము వైపు అంతగా పోనివ్వదు. దానికి, భగవంతుని నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు, మరియు భగవత్-భక్తులపై పై ధ్యానం అవసరం. ఇక్కడ శ్రీ కృష్ణుడు సన్యాసులు తీసుకునే మార్గాన్ని వివరిస్తున్నాడు. ఇటువంటి సన్యాసులు తమ దృష్టి, శ్వాసలను నియంత్రించటం ద్వారా ఇంద్రియ వస్తువుల తలంపులని దగ్గరికి రానివ్వరు. తమ దృష్టిని కనుబొమల మధ్యే కేంద్రీకరిస్తారు. ఒకవేళ కళ్ళు పూర్తిగా మూస్తే, నిద్ర రావచ్చు; ఒకవేళ కళ్ళు పూర్తిగా తెరిస్తే, చుట్టూ ఉన్నవాటి వలన ధ్యానంలో మనస్సు నిలబడలేకపోవచ్చు. ఈ రెండు దోషాలనూ నివారించటానికి, సన్యాసులు కళ్ళు సగమే తెరిచి, తమ దృష్టిని, కను బొమల మధ్యన లేదా నాసికాగ్రాన నిలుపుతారు. ఇంకా, తమ ప్రాణము (బయటకు వెళ్ళే శ్వాస) ను, అపానము (లోనికి వచ్చే శ్వాస) తో , అవి రెండూ యోగ సమాధిలో నిలిచి పోయేవరకు, అనుసంధానం చేస్తారు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధిలను నియంత్రించటానికి ఈ యోగ పద్ధతి చాలా సహకరిస్తుంది. ఇటువంటి వ్యక్తులు భౌతిక ప్రాపంచిక మాయ నుండి విముక్తి పొందటమే తమ ఒకేఒక లక్ష్యంగా ఉంటారు. ఇటువంటి సన్యాస నిష్ఠల అభ్యాసం ఆత్మ-జ్ఞానానికి దారి తీస్తుంది, కానీ బ్రహ్మ-జ్ఞానానికి కాదు. కాబట్టి, తదుపరి శ్లోకంలో చెప్పినట్టుగా, ఇటువంటి సన్యాస మార్గము కూడా భగవత్ భక్తి ద్వారానే పరిపూర్ణత నొందాలి.
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ । సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ।। 29 ।।
29
5
https://www.holy-bhagava…udio/005_029.mp3
భోక్తారం — భోక్త; యజ్ఞ — యజ్ఞములు; తపసాం — తపస్సులు; సర్వ-లోక — సమస్త లోకముల యొక్క; మహా-ఈశ్వరమ్ — సర్వోన్నత ప్రభువు; సు-హృదం — నిస్వార్థ మిత్రుడు; సర్వ — సమస్త; భూతానాం — ప్రాణుల యొక్క; జ్ఞాత్వా — తెలుసుకొన్న పిదప; మాం — నన్ను (శ్రీ కృష్ణ పరమాత్మ); శాంతిం — శాంతి; ఋచ్ఛతి — పొందును.
BG 5.29: సమస్త యజ్ఞములకు, తపస్సులకు భోక్తని నేనే అని, సమస్త లోకములకు అధిపతిని అని మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకొనిన పిదప, నా భక్తుడు శాంతిని పొందును.
ఇంతకు క్రితం రెండు శ్లోకాలలో వివరించబడ్డ సన్యాస సాధన, ఆత్మ-జ్ఞానానికి దారి తీయవచ్చు. కానీ, బ్రహ్మ- జ్ఞానము (భగవత్ జ్ఞానము) పొందాలంటే, భగవంతుని కృప ఉండాలి, అది భక్తి ద్వారా సాధ్యం. 'సర్వలోక మహేశ్వరం' అంటే ‘సమస్త జగత్తులకూ ప్రభువు’ (Sovereign Lord of all the worlds), మరియు, 'సుహృదం సర్వ భూతానాం' అంటే ‘సమస్త ప్రాణులకు మంచి చేసే శ్రేయోభిలాషి.’ అని. ఈ విధంగా, సన్యాస మార్గం కూడా - అన్ని తపస్సులకు, నియమ నిష్ఠలకు భగవంతుడే భోక్త అన్న జ్ఞానంతో - ఈశ్వర శరణాగతి ద్వారానే పరిపూర్ణత పొందుతుంది అని ఉద్ఘాటిస్తున్నాడు. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ దీనిని చాలా చక్కగా వివరించారు:హరి కా వియోగీ జీవ గోవింద రాధే,సాంచో యొగ్ సోఇ జో హరి సే మిలాదే (రాధా గోవింద గీతము) ‘అనాది నుండి జీవాత్మ, భగవంతుని నుండి విడిపోయి ఉంది. జీవాత్మను పరమాత్మతో ఏకం చేసేదే నిజమైన యోగం.’ కాబట్టి, భక్తి చేర్చుకోకుండా, ఏ ఒక్క యోగ విధానం కూడా సంపూర్ణం అవ్వదు.’తన ‘భగవంతుని గీత’లో శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక సాధనకున్న అన్ని నిఖార్సయిన మార్గాలను అద్భుతంగా పొందుపరిచాడు, కానీ ప్రతిసారీ, లక్ష్యం సాధించటానికి, భక్తి అనేది ఈ అన్ని మార్గాలలో కూడా అవసరం అని చెప్పి వాటికి పరిపూర్ణతను తెస్తాడు. ఉదాహరణకి, ఈ రకమైన విశదీకరణ పద్ధతిని, 6.46-47, 8.22, 11.53-54, 18.54-55 మొదలుగు శ్లోకాలలో ఉపయోగించాడు. ఇక్కడ కూడా, శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయ విషయాన్ని భక్తి యొక్క ఆవశ్యకతని తెలియచేయటంతో ముగిస్తున్నాడు.
శ్రీ భగవానువాచ । అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః । స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ।। 1 ।।
1
6
https://www.holy-bhagava…udio/006_001.mp3
శ్రీ భగవానువాచ — భగవంతుడు పలికెను; అనాశ్రితః — ఆశించకుండా; కర్మఫలం — పనుల యొక్క ఫలితములు; కార్యం — చేయవలసిన; కర్మ — పని; కరోతి — నిర్వర్తించుట; యః — ఎవరైతే; సః — ఆ మనిషి; సంన్యాసీ — సన్యసించిన; చ — మరియు; యోగీ — యోగి; చ — మరియు; న — కాదు; నిః — లేకుండా; అగ్ని — అగ్ని; న — కాదు; చ — మరియు; అక్రియః — క్రియా రహితంగా
BG 6.1: భగవంతుడు పలికెను: ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను (చేయవలసిన విధులను), చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరిక క్రియలు త్యజించిన వారు కాదు.
వేదాలలో అగ్ని హోత్ర యజ్ఞముల వంటి కర్మ కాండలు చెప్పబడినవి. సన్యాసాశ్రమంలో ప్రవేశించిన వారు కర్మ కాండలు చేయకూడదనే నియమాలు ఉన్నాయి, నిజానికి వారు అగ్నిని తాకరాదు, వంట కోసంకూడా తాకరాదు. భిక్ష అన్నాన్ని మాత్రమే స్వీకరించాలి. కానీ, కేవలం అగ్నిని విడిచిపెట్టినంత మాత్రాన, వ్యక్తి సన్యాసి అయిపోడు, అని అంటున్నాడు శ్రీ కృష్ణుడు. నిజమైన యోగులు ఎవరు, మరియు నిజమైన సన్యాసులు ఎవరు? ఈ విషయంపై చాలా అయోమయం ఉంది. జనులు అనుకుంటారు, ‘ఈ స్వామీజీ, ఫలాహారి (అంటే పండ్లు తప్ప ఇంకా ఏమీ తిననివాడు), కాబట్టి ఈయన ఒక ఉన్నతమైన యోగి.’ ‘ఈ బాబాజీ, దూధాహారి (పాల మీదనే బ్రతుకుతాడు), కాబట్టి ఇంకా ఉన్నతమైన యోగి.’ ‘ఈ గురూజీ, పవనాహారి (ఏమీ తినరు, కేవలం శ్వాస మీదనే జీవిస్తాడు), కాబట్టి తప్పకుండా భగవత్ ప్రాప్తి నొంది ఉండాలి.’ ‘ఈ సాధువు నాగాబాబా (వస్త్రములు కట్టుకోని సాధువు), కాబట్టి సంపూర్ణంగా సన్యాసం స్వీకరించినట్టే.’ కానీ, శ్రీ కృష్ణుడు ఈ అన్ని దృక్పథాలని ఖండిస్తున్నాడు. కేవలం బాహ్యమైన సన్యాస శకలు ఎవరినీ సన్యాసిని కానీ యోగిని కానీ చేయవు. ఎవరైతే తమ కర్మ ఫలములను భగవంతుకే అర్పిస్తారో వారే నిజమైన సన్యాసులు, యోగులు. ఈ మధ్య కాలంలో, 'యోగా' అనేది పాశ్చ్యాత్య దేశాల్లో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎన్నెన్నో యోగా స్టూడియోస్ ప్రతి దేశంలో, ప్రతి ఊర్లో వచ్చేసాయి. గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి పది మందిలో ఒకరు యోగాభ్యాసము చేయుచున్నారు. కానీ, ఈ 'యోగా' అన్న పదం సంస్కృత వాఙ్మయంలో లేదు; అసలైన పదం ఏమిటంటే అది 'యోగ్', అంటే ఏకమవ్వటం. ఇది జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వటాన్ని సూచిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, యోగి అంటే మనస్సు పూర్తిగా భగవంతునితో ఏకమయినవాడు అని అర్థం. అంటే, అటువంటి యోగి మనస్సు సహజంగానే ఈ ప్రపంచం నుండి ఉపసంహరించబడి ఉంటుంది. కాబట్టి, ఒక నిజమైన యోగి ఒక నిజమైన సన్యాసి కూడా. కర్మ యోగమును పాటించే వారు తమ అన్ని కార్యములను, ఫలాపేక్ష లేకుండా, భగవంతుని పట్ల వినయ విధేయ సేవా దృక్పథంతోనే చేస్తారు. వారు గృహస్థులైనా అటువంటి వ్యక్తులు నిజమైన యోగులు మరియు అసలైన సన్యాసులు.
యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ । న హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ।। 2 ।।
2
6
https://www.holy-bhagava…udio/006_002.mp3
యం — ఏమిటి; సన్న్యాసం — సన్యాసము; ఇతి — ఈ విధంగా; ప్రాహుః — అంటారు; యోగం — యోగము; తం — అది; విద్ధి — తెలుసుకొనుము; పాండవ — అర్జునా, పాండు పుత్రుడా; న — కాదు; హి — నిజముగా; అసన్న్యస్త — త్యజించకుండా; సంకల్పః — కోరిక; యోగీ — ఒక యోగి; భవతి — అగుట; కశ్చన — ఎవరైనా.
BG 6.2: సన్యాసము అని అందరూ అనుకునేది, యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే, ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు.
సన్యాసి అంటే మనో-ఇంద్రియముల సుఖాలను త్యజించిన వాడు అని. కానీ కేవలం సన్యసించటమే లక్ష్యం కాదు, ఇంకా, సన్యసించటం మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవటానికి సరిపోదు. సన్యాసమంటే మనం తప్పు దిశలో పరిగెత్తటం ఆగినట్టు. మనం ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఆనందాన్ని వెతుకుతూ ఉండే వాళ్ళం, కానీ భౌతిక సుఖాలలో ఆనందం లేదని అర్థం చేసుకున్నాము, కాబట్టి మనం ప్రపంచం దిశగా పరిగెత్తటం ఆపివేసాము. కానీ, ఆగిపోయినంత మాత్రాన లక్ష్యం చేరుకోలేము. ఆత్మ పొందవలసిన లక్ష్యం భగవత్-ప్రాప్తి. భగవంతుని దిశగా వెళ్ళటం - మనస్సుని ఆయన దిశగా తీసుకెళ్లటం – ఇదే యోగ మార్గము. జీవిత లక్ష్యం పట్ల అసంపూర్ణ జ్ఞానం కలవారు, సన్యాసం తీసుకోవటమే అత్యున్నత లక్ష్యంగా అనుకుంటారు. నిజమైన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్నవారు, భగవత్ ప్రాప్తియే తమ ఆధ్యాత్మిక ప్రయాణ అంతిమ లక్ష్యంగా తెలుసుకుంటారు. 5.4వ శ్లోకం యొక్క వివరణలో, రెండు రకాల సన్యాసం ఉంటాయి అని చెప్పబడింది - ఫాల్గు వైరాగ్యం మరియు యుక్త వైగాగ్యం అని. ఫాల్గు వైరాగ్యం అంటే ప్రాపంచిక వస్తువులను మాయకు చెందిన (భౌతిక శక్తి) వస్తువులగా పరిగణించి, ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా ఉంటాయి కాబట్టి వాటిని త్యజించటం. యుక్త వైరాగ్యం అంటే సర్వమూ భగవంతునికి చెందినవనే భావించి, కాబట్టి అవన్నీ భగవత్ సేవకి ఉపయోగించబడేవే అని అనుకోవటం. మొదటి రకం సన్యాసంలో, ఇలా అంటారు, ‘డబ్బుని విడిచిపెట్టు. దానిని ముట్టుకోవద్దు. అదొక మాయా స్వరూపము, మరియు అది ఆధ్యాత్మిక పథానికి అవరోధం కలిగిస్తుంది.’ అని. రెండవ రకం సన్యాసంలో, ఇలా అంటారు, ‘డబ్బు కూడా ఆ భగవత్ శక్తి స్వరూపమే, దానిని వృథా చేయవద్దు లేదా పారేయొద్దు; నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే దాన్ని భగవత్ సేవలో ఉపయోగించుము’ అని. ఫాల్గు వైరాగ్యమనేది అస్థిర మైనది, మరల ఈ ప్రపంచంతో మమకారం ఏర్పరుచుకోవటానికి సులభంగా మారిపోతుంది. 'ఫాల్గు' అన్న పదం, బీహార్ రాష్ట్రంలోని గయ పట్టణంలో ఉన్న ఒక నది నుండి వచ్చింది. ఫాల్గు నది భూమి క్రింది పొరల్లో ప్రవహిస్తుంది. పై నుండి చూస్తే అక్కడేమీ నది ఉన్నట్టు ఉండదు, కానీ కొన్ని అడుగులు తవ్వితే, క్రింద ప్రవాహం కనపడుతుంది. ఇదే విధంగా ఏంతో మంది జనులు ప్రపంచాన్ని వదిలి ఆశ్రమంలో జీవించటానికి వెళ్తుంటారు, కానీ కొద్ది సంవత్సరాల్లోనే వైరాగ్యం మాయమై, మనస్సు తిరిగి ప్రపంచం యందే ఆసక్తి ఏర్పరుచుకుంటుంది. వారి వైరాగ్యం ఫాల్గు వైరాగ్యం. ఈ ప్రపంచం కఠినమైనది, కష్టాలతో కూడుకున్నది అని తెలుసుకొని, దాని నుండి తప్పించుకోవటానికి ఆశ్రమంలో ఉంటారు. కానీ, ఆధ్యాత్మిక జీవితం కూడా కష్టతరమైనది మరియు భారమైనది అని గ్రహించిన తరువాత వారు ఆధ్యాత్మికత నుండి కూడా విడిపోతారు. కానీ, మరికొందరుంటారు, వారు భగవంతునితో ప్రేమ పూర్వక సంబంధం ఎర్పరుచుకుంటారు. ఆయనకు సేవ చేయాలనే ప్రేరణతోనే, ప్రపంచాన్ని త్యజించి ఆశ్రమం చేరుకుంటారు. వారి సన్యాసం యుక్త వైరాగ్యము. వారు సాధారణంగా, ఎటువంటి కష్టాలు ఎదురైనా, తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ శ్లోకం యొక్క మొదటి పాదంలో, నిజమైన సన్యాసి అంటే ఒక యోగి అని - మనస్సుని ప్రేమ పూర్వక సేవలో భగవంతునితో ఏకం చేసేవాడు - అని, శ్రీ కృష్ణుడు చెప్పాడు. రెండవ పాదంలో, ప్రాపంచిక కోరికలను త్యజించకుండా వ్యక్తి యోగి కాలేడు, అని శ్రీ కృష్ణుడు చెప్పాడు. మనస్సులో భౌతిక ప్రాపంచిక కోరికలు ఉన్నప్పుడు అది సహజంగానే ప్రపంచం వైపు పరుగులు తీస్తుంది. భగవంతునితో ఏకమవ్వాల్సింది మనస్సే కాబట్టి, మనస్సులో ఎటువంటి ప్రాపంచిక కోరికలు లేనప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఓ వ్యక్తి, యోగి కావాలంటే అంతర్గతంగా సన్యాసి అవ్వాలి; మరియు యోగిగా ఉంటేనే, సన్యాసి అవ్వగలడు.
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే । యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ।। 3 ।।
3
6
https://www.holy-bhagava…udio/006_003.mp3
ఆరురుక్షోః — ప్రారంభదశలో ఉన్నవారు; మునేః — మునికి; యోగం — యోగమునకు; కర్మ — ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయటం; కారణం — కారణము; ఉచ్యతే — అందురు; యోగ-ఆరూఢస్య — యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్నవారు; తస్య — వారి; ఏవ — నిజముగా; శమః — ధ్యానము; కారణం — కారణము; ఉచ్యతే — అంటారు.
BG 6.3: యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న (ప్రారంభ-దశ) జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనం అంటారు; యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు.
3వ అధ్యాయ 3వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, శ్రేయస్సు కోసం రెండు మార్గాలు - జ్ఞాన యోగము, కర్మ యోగము - ఉన్నాయని, చెప్పిఉన్నాడు. ఈ రెంటిలో కర్మ-యోగ మార్గమునే అనుసరించమని అర్జునుడికి సిఫారసు చేసాడు. మరల 5వ అధ్యాయ 2వ శ్లోకంలో, అదే సరియైన మార్గమని ఉద్ఘాటించాడు. అంటే మనం ఈ జీవితాంతం పనులు చేస్తూనే ఉండాలా? ఇలాంటి ప్రశ్న వస్తుందని ముందే ఊహించిన శ్రీ కృష్ణుడు, దీనికి పరిమితి విధించాడు. కర్మ యోగము ఆచరించినప్పుడు, అది అంతఃకరణ శుద్ధికి మరియు ఆధ్యాత్మిక జ్ఞాన పరిపక్వతకి దారి తీస్తుంది. కానీ, మనస్సు పవిత్రమైన తరువాత మరియు యోగంలో పురోగతి సాధించిన తరువాత మనము కర్మ యోగము విడిచి పెట్టి కర్మ సన్యాసము తీసుకోవచ్చు. ఇక భౌతిక ప్రాపంచిక కార్య కలాపాలతో ఏ ప్రయోజనం ఉండదు, మరియు ధ్యానమే సాధనమవుతుంది. కాబట్టి, మనం అనుసరించే మార్గం మన అర్హతను బట్టే ఉంటుంది. శ్రీ కృష్ణుడు ఈ అర్హతకి కావలసిన యోగ్యతని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. యోగ సాధనకి అకాక్షించే వారికి కర్మ యోగమే యుక్తమైనది; మరియు యోగసాధనలో ఉన్నతమైన స్థాయి చేరుకున్నవారికి, కర్మ సన్యాసమే ఎక్కువ అనుగుణమైనది. 'యోగం' అన్న పదం, లక్ష్యాన్ని మరియు లక్ష్యాన్ని చేరుకునే విధానానికి రెంటినీ సూచిస్తుంది. దాన్ని లక్ష్యము అని సూచించటానికి వాడినప్పుడు, యోగం అంటే ‘భగవంతునితో ఏకమవ్వటం.’ దాన్ని ఒక ప్రక్రియా విధానము అని సూచించటానికి వాడినప్పుడు, యోగం అంటే భగవంతునితో ఎకమవ్వటానికి 'మార్గము' అని అర్థం. ఈ రెండవ సందర్భంలో, యోగం అంటే భగవంతుని చేరుకోవటానికి ఎక్కే నిచ్చెన. అన్నిటి కన్నా క్రింద మెట్టులో, జీవాత్మ ప్రాపంచికత్వంలో చిక్కుకొని, లౌకిక విషయాల పట్ల నిమగ్నమై ఉంటుంది. యోగమనే నిచ్చెన జీవాత్మను ఆ నిమ్నస్థాయి నుండి భగవంతునిలోనే ఎప్పుడూ స్థితమై ఉండే స్థాయికి తీసుకెళ్తుంది. ఆ నిచ్చెనకుండే మెట్లకు వేరువేరు పేర్లు ఉన్నాయి, కానీ యోగం అన్న పదం అన్నిటికీ వర్తిస్తుంది. 'యోగ-ఆరురుక్షు' అంటే అప్పుడే నిచ్చెన ఎక్కటం మొదలు పెట్టిన, భగవంతునితో సంయోగానికి కృషి చేస్తున్న సాధకులు. యోగ-ఆరూఢ అంటే నిచ్చెనపై ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు అని. మరైతే, యోగ శాస్త్రములో ఉన్నతమైన స్థాయిలో వ్యక్తి ఉన్నాడా లేదా అని తెలుసుకోవటం ఎలా? శ్రీ కృష్ణుడు తదుపరి వివరిస్తున్నాడు.
యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే । సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే ।। 4 ।।
4
6
https://www.holy-bhagava…udio/006_004.mp3
యదా — ఎప్పుడైతే; హి — నిజముగా; న — కాదు; ఇంద్రియ-అర్థేషు — ఇంద్రియ విషయముల కోసం; న — కాదు; కర్మసు — కర్మల పట్ల; అనుషజ్జతే — ఆసక్తుడు; సర్వ-సంకల్ప — కర్మ ఫలముల సమస్త కోరికలు; సన్న్యాసీ — త్యజించిన వాడు; యోగ-ఆరూఢా — యోగ శాస్త్రములో ఉన్నతమైన వాడు; తదా — అప్పుడు; ఉచ్యతే — అందురు.
BG 6.4: ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు-విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు; ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కావున.
మనస్సు భగవంతునితో యోగములో ఏకమవుతున్న కొలదీ, సహజంగానే జగత్తు నుండి దూరమైపోతుంది. కాబట్టి, మనస్సు యొక్క స్థితిని బేరీజు వేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే, అది అన్ని ప్రాపంచిక కోరికల నుండి స్వేచ్ఛ పొందిందో లేదో చూసుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఇంద్రియ విషయముల కోసం ప్రాకులాడడో, మరియు వాటిని పొందటం కోసం ఏ పనీ చేయడో, అప్పుడు వ్యక్తి ప్రాపంచికత నుండి దూరమైనట్టు. ఇటువంటి వ్యక్తి, ఇంద్రియ భోగాలను అనుభవించటం కోసం పరిస్థితులను సృష్టించే అవకాశాలను చూడటం మానేస్తాడు; అంతిమంగా ఇంద్రియ భోగాలను అనుభవించాలనే అన్ని కోరికలను భస్మం చేస్తాడు; మరియు, పూర్వపు ఇంద్రియ భోగ స్మృతులను నిర్మూలిస్తాడు. మనస్సు ఇక ఇంద్రియ ఉద్వేగాల వలన జనించే స్వార్థ పూరిత క్రియల కోసం పరుగులు తీయదు. మనం మనస్సుపై ఈ స్థాయి నియంత్రణ సాధించినప్పుడు, యోగములో ఉన్నతమైన స్థాయిని చేరుకున్నట్టు పరిగణించబడుతాము.
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ । ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।। 5 ।।
5
6
https://www.holy-bhagava…udio/006_005.mp3
ఉద్ధరేత్ — ఉద్ధరించుకోనుము; ఆత్మనా — మనస్సు ద్వారా; ఆత్మానం — నిన్ను నీవే; న — కాదు; ఆత్మానం — నిన్ను; అవసాదయేత్ — పతనం చేసుకొనుట; ఆత్మా — మనస్సు; ఏవ — ఖచ్చితంగా; హి — నిజముగా; ఆత్మనః — మన యొక్క; బంధు: — మిత్రుడు; ఆత్మా — మనస్సు; ఏవ — నిజముగా; రిపుః — శత్రువు; ఆత్మనః — మన యొక్క.
BG 6.5: నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకోనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు.
మన ఉన్నతికి లేదా పతనానికి మనమే కారణం. మన కోసం వేరెవ్వరూ భగవత్ ప్రాప్తి మార్గాన్ని ప్రయాణించటం కుదరదు. గురువులు, మహాత్ములు మనకు మార్గం చూపుతారు, కానీ మనమే స్వయంగా ఆ పథంలో ప్రయాణించాలి. హిందీలో ఒక నానుడి ఉంది. ‘ఏక్ పేడా దో పక్షీ బైఠే, ఏక్ గురు ఏక్ చేలా, అపనీ కరనీ గురు ఉతరే, అపనీ కరనీ చేలా’, అంటే, ఒక చెట్టు మీద రెండు పక్షులున్నాయి- ఒకటి గురువు మరియు ఇంకోటి శిష్యుడు. గురువు తన ప్రయత్నంతో తానే దిగివస్తాడు, శిష్యుడు కూడా తన స్వంత కర్మల వల్లనే దిగి రాగలుగుతాడు.’ఈ జన్మకు ముందు మనకు అనంతమైన జన్మలు గడిచిపోయాయి, మరియు భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఈ భూమిపై ఎల్లప్పుడూ ఉన్నారు. ఏ సమయంలో అయినా ఈ లోకంలో అటువంటి మహాత్ములు లేకపోతే, ఆ సమయపు జీవులు భగవత్ ప్రాప్తి పొందలేరు. మరైతే వారు భగవంతుడిని పొందే తమ జీవిత లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు? అందుకే, దేవుడు, చిత్తశుద్ధిగల సాధకులకు దిశానిర్దేశం చేయటానికి, మానవ జాతికి స్ఫూర్తినివ్వటానికి, భగవత్-ప్రాప్తి నొందిన మహాత్ములు ప్రతి కాలంలో ఉండేట్టుగా చూసుకుంటాడు. కాబట్టి అనంతమైన పూర్వ జన్మలలో చాలాసార్లు భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములను కలినే ఉంటాము, అయినా భగవత్ ప్రాప్తి పొందలేక పోయాము. అంటే సరియైన మార్గదర్శకత్వం లేకపోవటం సమస్య కాదు, దానిని స్వీకరించటం పోవటం లేదా దానిని ఆచరించక పోవటమే సమస్య. మనం పురోగతి సాధించే ముందు, మన ప్రస్తుత ఉన్న అధ్యాత్మిక స్థాయికి, లేదా అది లేకపోవటానికి మనమే బాధ్యులం అని ఒప్పుకోవాలి. అప్పుడే మనకు, మన ప్రస్తుత పురోగతి స్థాయి మన ప్రయంత్నం ద్వారానే సాధించాము, కాబట్టి మరింత పరిశ్రమ ద్వారా మనలను ఇంకా ఉద్ధరించుకోవచ్చు, అన్న ధైర్యం వస్తుంది.ఆధ్యాత్మిక పురోగతి పథంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు, ఇతరులు మనకు తీవ్ర అన్యాయం చేసారు అని, వారే మనకు శత్రువులని ఫిర్యాదు చేస్తాము. కానీ, మన మనస్సే మన ప్రధాన శత్రువు. పరిపూర్ణ సిద్ధి కోసం మనం చేసే ప్రయత్నాలకు అవరోధం కల్పించే వినాశకారి అదే. ఒక పక్క, జీవాత్మ యొక్క గొప్ప శ్రేయిభిలాషిలా, మనకు అత్యంత శ్రేయస్సుని కలుగ చేసే శక్తి, మనస్సుకి, ఉంది; మరో పక్క, మన ప్రగాఢ శత్రువుగా, మనకు తీవ్ర హాని చేసే శక్తి కూడా దానికి ఉంది. నియంత్రించబడిన మనస్సు ఏంతో మేలు కలుగ చేయవచ్చు, అదేవిధంగా, నిగ్రహింపబడని మనస్సు తుచ్ఛమైన తలంపులతో జీవాత్మను పతనానికి గురి చేయవచ్చు.ఒక మిత్రునిగా ఉపయోగించుకోవటానికి, మనస్సు యొక్క పనితీరుని అర్థం చేసుకోవటం ముఖ్యం. మన మనస్సు నాలుగు స్థాయిల్లో పని చేస్తుంది.మనస్సు: అది ఆలోచనలు, భావోద్వేగాలు, కోరికలు, ఇష్టాలు, మరియు ద్వేషాలను సృష్టిస్తుంది.బుద్ధి: ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం దీని పని. ఇది అర్థం చేసుకుంటుంది, నిర్ణయిస్తుంది, మరియు ఏది మంచి ఏది చెడు అని వివేచిస్తుంది.చిత్తము: ఇది జ్ఞాపకాల మరియు అనుభవాల నిక్షేప స్థానం. ఏదేని ఒక వస్తువు లేదా వ్యక్తితో అనుబంధం ఏర్పరుచుకునేట్టు చేస్తుంది.అహంకారము: ‘నేను’ అన్న భావన ఇది. శరీరానికి సంబంధించిన వాటితో స్వీయ-గుర్తింపును కలుగచేసి, గర్వాన్ని సృష్టిస్తుంది.ఇవన్నీ నాలుగు వేర్వేరు అస్థిత్వాలు కావు. ఇవి ఒకే మనస్సు యొక్క నాలుగు నిర్వహణా స్థాయిలు. కాబట్టి వీటన్నిటినీ కలిపి మనస్సు అని చెప్పవచ్చు లేదా మనస్సు-బుద్ధి, లేదా మనస్సు-బుద్ధి-అహంకారము, లేదా మనస్సు-బుద్ధి-చిత్తము-అహంకారము అనవచ్చు. ఇవన్నీ ఒకే దానిని సూచిస్తాయి.'అహంకారము' (ఇగో , ego) అన్న పదం ఇక్కడ ఫ్రూడియన్ మనస్తత్వశాస్త్రం (Freudian psychology) లో చెప్పిన దానికన్నా వేరైనది. సిగ్మండ్ ఫ్రాయిడ్ (1856 – 1939), అనే ఆస్ట్రియాకు చెందిన నాడీశాస్త్ర నిపుణుడు, మనస్సు ఏ విధంగా పని చేస్తుందో అన్న విషయంపై, మనస్తత్వశాస్త్రం యొక్క మొదటి సూత్రాన్ని, ప్రతిపాదించాడు. ఆయన సిద్ధాంతం ప్రకారం, అహంకారము అనేది 'నిజమైన నేను'; అది వశములోలేని/తీరని కోరికలకు (Id), బాల్యంలో నేర్చుకున్న విలువలకు (Superego) మధ్య ఉన్న అంతరాన్ని పూర్తిస్తుంది.వైదిక వాఙ్మయంలో చాలా చోట్ల, సందర్భాన్ని బట్టి మనస్సుని ఈ నాలుగు రకాల అర్థాల్లో వాడుతారు. ఇవన్నీ ఒకే అంతర్గత ఉపకరణాన్ని సూచిస్తున్నాయి, వీటిని కలిపి అంతఃకరణ లేదా మనస్సు అంటారు. ఉదాహరణకి:పంచదశీ, ఈనాలుగింటిని కలిపి మనస్సు అంటుంది, ఇదే భౌతిక బంధానికి మూల కారణం అని పేర్కొంటుంది.భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు ఎన్నో సార్లు మనస్సు, బుద్ధి రెండు భిన్నమైనవని అని, మరియు ఆ రెండింటినీ కూడా భగవంతునికి శరణాగతి చేయాలి అని అంటున్నాడు.యోగ దర్శనములో, ప్రకృతి యొక్క వివిధ మూలతత్త్వములను విశ్లేషించేటప్పుడు, అది మూడు అస్తిత్వాలను పేర్కొంటుంది: మనస్సు, బుద్ధి, మరియు అహంకారము.శంకరాచార్యులు, ఆత్మకు అందుబాటులో ఉన్న సూక్ష్మ ఉపకరణాలను విశదీకరిస్తూ, మనస్సుని నాలుగు రకాలుగా విభజించారు - మనస్సు, బుద్ధి, చిత్తము, మరియు అహంకారము. కాబట్టి, శ్రీ కృష్ణుడు, మనము మనస్సుని ఉపయోగించుకొని ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలి అన్నప్పుడు, దాని అర్థం ఏమిటంటే, ఉన్నత మనస్సుని ఉపయోగించుకొని, నిమ్న మనస్సుని ఉద్ధరించుకోవాలి, అని. వేరే మాటల్లో చెప్పాలంటే, బుద్ధిని ఉపయోగించుకొని మనస్సుని నియంత్రించాలి. ఇది ఎలా చేయాలి అన్న విషయాన్ని 2.41 నుండి 2.44 శ్లోకాలలో మరియు 3.43 శ్లోకంలో విశదంగా వివరింపబడింది.
బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః । అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ।। 6 ।।
6
6
https://www.holy-bhagava…udio/006_006.mp3
బంధుః — మిత్రుడు; ఆత్మా — మనస్సు; ఆత్మనః — వ్యక్తికి; తస్య — అతని; యేన — ఎవరి చేత నైతే; ఆత్మా — మనస్సు; ఏవ — ఖచ్చితంగా; ఆత్మనా — ఆ వ్యక్తికి; జితః — జయించి; అనాత్మనః — నిగ్రహింపబడని మనస్సు కల వారికి; తు — కానీ; శత్రుత్వే — శత్రువుకి; వర్తేత — ఉండును; ఆత్మా, ఏవ —మనస్సే ; శత్రు-వత్ — శత్రువు లాగ.
BG 6.6: మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వారికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది.
మనకు శత్రువులుగా అనిపించి, మనకు హాని చేయగలరేమో అన్న వారిని ఎదుర్కోవటానికి, మన ఆలోచనా శక్తిలో చాలా భాగాన్ని వెచ్చిస్తాము. వైదిక శాస్త్రాలు, అతి పెద్ద శత్రువులైన - కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, భ్రాంతి మరియు ఇతర నకారాత్మక భావోద్వేగాలు - మనలోనే ఉంటాయి, అని చెప్తున్నాయి. ఈ అంతర్గత శత్రువులు బాహ్యమైన వాటి కన్నా ఏంతో హానికరమైనవి. బయటి రాక్షసులు మనను కొంత సమయం వరకు బాధించవచ్చు, కానీ, మన మనస్సులోనే ఉన్న రాక్షసులు మనం నిరంతరం దౌర్భాగ్యస్థితిలోనే ఉండేటట్టు చేయగలవు. సర్వమూ అనుకూలంగా ఉండి కూడా, తమ స్వంత మనస్సు వలన మానసిక కుంగు, ద్వేషము, ఆందోళన, వ్యాకులత, మరియు ఒత్తిడి వంటి వాటితో దౌర్భాగ్యమైన జీవితం గడిపిన ఎందరో మనకు తెలుసు.వైదిక తత్వశాస్త్రం, మన తలంపుల/ఆలోచనల యొక్క పరిణామాల మీద చాలా ప్రాధాన్యతనిచ్చింది. వ్యాధులు అనేవి వైరస్, బ్యాక్టీరియా వల్ల మాత్రమే రావు, మన మనస్సులో ఉన్న చెడు ఆలోచనల (negativities) వల్ల కూడా వస్తాయి. ఎవరైనా పొరపాటుగా మీ మీద రాయి విసిరితే, అది కొద్ది సేపు మనలను బాధించవచ్చు, కానీ తరువాతి రోజు దాని గురించి మీరు మర్చి పోవచ్చు. కానీ, ఎవరైనా అప్రియమైన మాట అంటే, అది మిమ్ములను ఎన్నో సంవత్సరాల వరకు బాధించవచ్చు. ఇదే, ఆలోచనల యొక్క గొప్ప శక్తి. బౌద్ధ శాస్త్రంలో, ధమ్మపద (1.3) బుద్ధుడు కూడా ఈ నిజాన్ని స్పష్టంగా తెలియపరిచాడు.నేను అవమానించబడ్డాను! నేను నిందింపబడ్డాను! నేను దండింపబడ్డాను! నేను దోచుకోబడ్డాను! ఈ ఆలోచనల తో నే ఉన్నవారికి దుఃఖం అంతము కాదు.నేను అవమానించబడ్డాను! నేను నిందింపబడ్డాను! నేను దండింపబడ్డాను! నేను దోచుకోబడ్డాను! ఈ ఆలోచనలతో లేని వానికి కోపం తగ్గిపోతుంది.మనలో ద్వేషమే పెంపొందించుకుంటే, మన నకారాత్మక (negative) ఆలోచనలు, మనం ద్వేషించే వస్తువుకి కాకుండా, మనకే ఎక్కువ నష్టం కలుగ చేస్తాయి. చాలా తెలివిగా ఇలా చెప్పబడింది : ‘ద్వేషం/ఆగ్రహం అనేది, మనం విషం తాగి ఎదుటి వాడు చనిపోవాలని కోరుకోవటం లాంటిది’. సమస్య ఏమిటంటే చాలా మంది జనులు తమ యొక్క నియంత్రణలేని మనస్సే తమకు ఎంతో హాని కలుగచేస్తోందని తెలుసుకోరు. కాబట్టి, జగద్గురు శ్రీ కృపాలు మహారాజ్ గారు ఇలా ఉపదేశిస్తారు.మన కో మానో శత్రు ఉసకీ సునహు జని కఛు ప్యారే(సాధన భక్తి తత్త్వం) ‘ ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు.’కానీ, ఆధ్యాత్మిక సాధన ద్వారా, మనస్సుని బుద్ధి యొక్క నియంత్రణ లోనికి తెచ్చినప్పుడు, దానికి మన ఉత్తమ స్నేహితుడుగా అయ్యే సామర్ధ్యం ఉంది. ఏదేని వస్తువు శక్తి ఎక్కువున్న కొద్దీ దాని దురుపయోగ ప్రమాదం కూడా ఎక్కువుంటుంది, మరియు సద్వినియోగ అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మనస్సు అనేది మన శరీరంలో అమర్చబడిన ఉన్న ఒక అత్యంత శక్తి వంతమైన ఉపకరణం కాబట్టి అది రెండు పక్కల పదునుగా ఉన్న కత్తి లాంటిది. ఈ విధంగా, రాక్షసత్వ స్థాయికి దిగజారిన వారు కూడా తమ మనస్సు వలననే అలా అవుతారు; అదే సమయంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారు కూడా తమ పవిత్రమైన మనస్సు వలననే అలా అవుతారు. ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు, ఈ విషయాన్ని చాలా చక్కగా వ్యక్తం చేశారు: ‘వ్యక్తులు తమ తలరాతకి బందీలు కాదు, కానీ, వారి స్వంత మనస్సు యొక్క ఖైదీలు మాత్రమే.’ (‘Men are not prisoners of fate, but only prisoners of their own minds.’). ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడుకి, మనస్సు యొక్క హాని కలిగించే మరియు శ్రేయస్సు కలిగించే శక్తి గురించి, జ్ఞానోపదేశం చేస్తున్నాడు.తదుపరి మూడు శ్లోకాలలో, యోగారూఢుని (యోగములో పురోగతి సాధించినవాని) యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో శ్రీ కృష్ణుడు వివరిస్తాడు.
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః । శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ।। 7 ।।
7
6
https://www.holy-bhagava…udio/006_007.mp3
జిత-ఆత్మనః — మనస్సుని జయించిన వాడు; ప్రశాంతస్య — ప్రశాంత చిత్తముతో; పరమ-ఆత్మా — భగవంతుడు; సమాహితః — నిశ్చలమై; శీత — చల్లదనంలో; ఉష్ణ — వేడిమిలో; సుఖ — సుఖాలలో; దుఃఖేషు — దుఃఖాలలో; తథా — మరియు; మాన — కీర్తి; అపమానయోః — అపకీర్తి.
BG 6.7: మనస్సుని జయించిన యోగులు - శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు - ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు.
2.14వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు - ఇంద్రియములకు ఇంద్రియ-వస్తువిషయ సంపర్కంచే, మనస్సుకి శీతోష్ణములు, సుఖదుఃఖాలు అనుభవంలోనికి వస్తాయి - అని చెప్పి ఉన్నాడు. మనస్సు నిగ్రహింపబడని వరకు, వ్యక్తి ఇంద్రియ భోగ-సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు మరియు కష్టాలనే అనుభూతులను అనుభవిస్తూనే ఉంటాడు. మనస్సుని జయించిన యోగి, ఈ క్షణభంగురమైన తాత్కాలికమైన పరిణామాలను శారీరిక ఇంద్రియ పనులుగా గుర్తించి, అవి నిత్యశాశ్వతమైన ఆత్మ కంటే వేరుగా తెలుసుకొని, వాటిచే ప్రభావితుడు కాడు. అటువంటి ఉన్నత స్థాయి యోగి శీతోష్ణములు, సుఖ-దుఃఖాలు, మాన-అపమానములు వంటి వాటికి అతీతంగా ఉంటాడు. మనస్సు వసించేందుకు రెండే ప్రదేశాలు ఉన్నాయి - ఒకటి మాయాలోకం, మరొకటి భగవత్ లోకం. ఒకవేళ మనస్సు ప్రాపంచిక ఇంద్రియ ద్వందములకు అతీతంగా ఎదగగలిగితే అది సునాయాసముగా భగవంతుని యందు నిమగ్నమౌతుంది. ఈ విధంగా, పురోగమించిన యోగి యొక్క మనస్సు భగవంతుని ధ్యాసలో సమాధి (గాఢమైన ధ్యానం) యందు స్థితమగును అని, శ్రీ కృష్ణుడు పేర్కొన్నాడు.
జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః । యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః ।। 8 ।।
8
6
https://www.holy-bhagava…udio/006_008.mp3
జ్ఞాన — జ్ఞానము; విజ్ఞాన — అనుభవైక విజ్ఞానము, అంతర్గతమైన జ్ఞానము; తృప్త-ఆత్మా — సంపూర్ణ తృప్తితో ఉన్నవాడు; కూట-స్థః — చలించకుండా; విజిత-ఇంద్రియః — ఇంద్రియములను జయించినవాడు; యుక్త — ఎల్లపుడూ ఆ పరమాత్మతో ఏకమై ఉండేవాడు; ఇతి — ఈ విధంగా; ఉచ్యతే — అందురు; యోగీ — ఓ యోగి; సమ — సమత్వ దృష్టితో; లోష్టా — గులక రాళ్ళు; అశ్మ— రాయి; కాంచనః — బంగారము.
BG 6.8: జ్ఞానవిజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తినొందిన యోగులు, ఇంద్రియములను జయించిన వారై, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు – మట్టి, రాళ్ళు, మరియు బంగారము – వీటన్నిటిని ఒకే దృష్టితో చూస్తారు.
జ్ఞానము అంటే, గురువు గారి దగ్గర వినుత, శాస్త్ర గ్రంధముల పఠన ద్వారా, సిద్ధాంతపరంగా తెలుసుకున్న విషయం. విజ్ఞానము అంటే అంతర్గతంగా అనుభవవేద్యమైన జ్ఞానము, ఇది అంతర్గంతంగా విచ్చుకున్నది మరియు ఆంతర వివేకము. ఉన్నత స్థాయి యోగి యొక్క బుద్ధి ఈ జ్ఞానము, విజ్ఞానముల రెంటిచే ప్రకాశితమవుతుంది. ఈ వివేకము కలిగిఉన్న యోగి, అన్ని భౌతిక వస్తువులు కూడా భౌతిక శక్తి యొక్క రూపాంతరములే అని చూస్తాడు. తనకు ఆకర్షణీయంగా ఉన్నవా లేవా అన్న దాన్ని బట్టి ఇటువంటి యోగి వస్తువుల మధ్య తేడాను చూడడు. జ్ఞానోదయమైన యోగి అన్ని వస్తువులను భగవత్ సంబంధంగా చూస్తాడు. భౌతిక శక్తి భగవంతునిదే కాబట్టి, అన్ని వస్తువులు అతని సేవ కొరకే ఉన్నాయి. కూటస్థ అంటే, భౌతిక శక్తితో సంపర్కం వలన వచ్చే చంచలమైన ఇంద్రియ అనుభూతుల నుండి మనస్సుని దూరంగా ఉంచి, సుఖమైన/అనుకూల పరిస్థితుల కోసం చూసుకోకుండా, లేదా, అప్రియమైన/ప్రతికూల పరిస్థితులను తప్పించుకోకుండా ఉండే వాడు అని అర్థం. విజితేంద్రియ అంటే ఇంద్రియములను నిగ్రహించిన వాడు అని అర్థం. యుక్త అంటే పరమాత్మతో నిరంతరం అనుసంధానమై ఉండేవాడు అని అర్థం. ఇటువంటి వ్యక్తి భగవంతుని దివ్య ఆనందాన్ని రుచి చూడటం మొదలిడుతాడు, కాబట్టి తృప్తాత్మా అవుతాడు, అంటే, అంతర్గతంగా అనుభవంలోనికి వచ్చిన విజ్ఞానంచే సంపూర్ణ తృప్తి పొందినవాడు అని అర్థం.
సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు । సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ।। 9 ।।
9
6
https://www.holy-bhagava…udio/006_009.mp3
సుహృత్ — శ్రేయోభిలాషుల పట్ల; మిత్రా — మిత్రులు; అరి — శత్రువులు; ఉదాసీన — తటస్థుల యందు; మధ్య-స్థ — మధ్యస్థులు; ద్వేష్య — ఈర్శాపరులు; బంధుషు — బంధువులు; సాధుషు — సాధువులు; అపి — కూడా; చ — మరియు; పాపేషు — పాపులు; సమ-బుద్ధిః — సమానమైన భావము (ఒక్క లాగే చూసే); విశిష్యతే — సర్వశ్రేష్ఠమైనవాడు.
BG 6.9: శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను - యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ, శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా, మరియు, పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా - ఉన్న యోగి మానవులలో సర్వ శ్రేష్ఠుడుగా పరిగణించబడుతాడు.
మిత్రుల పట్ల, శత్రువుల పట్ల వేరే వేరే విధంగా స్పందించటం మానవ సహజ స్వభావం. కానీ, ఒక ఉన్నత స్థాయి యోగి యొక్క స్వభావము వేరుగా ఉంటుంది. భగవంతుని విజ్ఞానము కలిగున్న, ఉన్నతమైన యోగి, ఈ సమస్త సృష్టిని భగవంతుని కన్నా అబేధముగా చూస్తాడు. ఈ విధంగా, వారు అన్ని ప్రాణులను సమ దృష్టితో చూడగలుగుతారు. ఈ సమత్వ దృష్టి కూడా చాల స్థాయిల్లో ఉంటుంది: ఒక స్థాయి దృష్టి ఇలా ఉంటుంది: ‘అన్ని ప్రాణులు దివ్య ఆత్మలు, కాబట్టి భగవంతుని అంశలే.’ అందుకే వారందరూ సమానమే. ఈ ప్రకారంగా చాణక్య పండితుడు అన్నాడు, ‘ఆత్మవత్ సర్వ భూతేషు యః పశ్యతి స పండితః’ ‘నిజమైన పండితుడు అందరినీ జీవాత్మలుగా చూస్తాడు, కాబట్టి తనలాంటి వారిగానే చూస్తాడు.’ అంతకన్నా ఉన్నతమైన దృష్టి ఇది: ‘భగవంతుడు అందరిలో ఉన్నాడు, కాబట్టి అందరూ గౌరవింపబడతగిన వారే.’ అత్యున్నత స్థాయిలో, యోగి ఈ విధమైన దృష్టిని పెంపొందించుకుంటాడు: ‘ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపాలే.’ జగత్తు అంతా యదార్థంగా భగవంతుని స్వరూపమే అని వైదిక వాఙ్మయం పదే పదే పేర్కొంటున్నది: ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ (ఈశోపనిషత్తు 1) ‘చరాచర భూతములతో కూడి ఉన్న ఈ సమస్త విశ్వము, ఆ భగవంతుని ప్రాదుర్భావమే (manifestation), దాని అంతటా ఆయన నిండి ఉంటాడు.’ ‘పురుష ఏవేదం సర్వం’ (పురుష సూక్తం, ఋగ్వేదం), ‘భగవంతుడు ఈ ప్రపంచంలో ప్రతిచోటా నిండి ఉన్నాడు, ప్రతిదీ ఆయన శక్తి స్వరూపమే.’ కాబట్టి, అత్యున్నత యోగి, ప్రతివారినీ భగవత్ సాక్షాత్కారముగా చూస్తాడు. ఈ విధమైన జ్ఞానదృష్టి కలిగిఉండి, హనుమంతుడు అంటాడు: ‘సీయా రామ మయ సబ జగ జానీ’ (రామచరితమానస్), ‘నేను ప్రతివారిలో సీతా రాముల ముఖాన్నే చూస్తాను.’ అని. 6.31వ శ్లోక వ్యాఖ్యానంలో ఈ వర్గాలు మరింత విశదంగా వివరించబడ్డాయి. ఈ మూడు వర్గాలను సూచిస్తూ, అందరు వ్యక్తుల పట్ల సమత్వ దృష్టి కలిగిన యోగి, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పబడిన యోగి కన్నా ఉన్నతమైనవాడు అని అంటున్నాడు శ్రీ కృష్ణుడు. యోగ స్థితిని గురించి వివరించిన శ్రీ కృష్ణుడు, తదుపరి శ్లోకం నుండి మొదలిడి, ఈ స్థాయిని చేరుకోగలిగే అభ్యాస విధానాన్ని వివరిస్తున్నాడు.
యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః । ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ।। 10 ।।
10
6
https://www.holy-bhagava…udio/006_010.mp3
యోగీ — ఒక యోగి; యుంజీత — ధ్యానములో నిమగ్నమై ఉండవలెను; సతతం — ఎల్లప్పుడూ; ఆత్మానం — ఆత్మ; రహసి — ఏకాంతములో; స్థితః — ఉంటూ; ఏకాకీ — ఒక్కడే; యత-చిత్త-ఆత్మా — మనస్సు-శరీరము నియంత్రణలో ఉంచుకొని; నిరాశీ: — కోరికలు లేకుండా; అపరిగ్రహః — భోగ వస్తువులను సమకూర్చుకోవాలనే వాంఛ లేకుండా.
BG 6.10: యోగ స్థితిని పొందగోరే వారు ఏకాంతంలో ఉండాలి, నియంత్రించబడిన మనస్సు-శరీరంతో, కోరికలను, భోగవస్తువులను త్యజించి, నిత్యమూ భగవత్ ధ్యానంలో నిమగ్నమైఉండాలి.
యోగ స్థితిని సాధించిన వాని లక్షణములు చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు దాని కోసం కావలసిన సాధన గురించి చెప్తున్నాడు. ఏదేనీ విషయంలో నైపుణ్యత సాధించాలంటే ప్రతిరోజూ సాధన అవసరం. కేవలం కాలనీలో ఉన్న ఈత కొలనుకి వారానికోసారి ప్రతి శనివారం సాయంత్రం వెళ్ళినవాడు, ఒలింపిక్ ఈత పోటీలో విజయుడు కాలేడు. ప్రతిరోజూ చాలా గంటలు అభ్యాసం చేసిన వ్యక్తే ఒలింపిక్ విజేత అవ్వగలిగే ప్రావీణ్యత సాధిస్తాడు. అభ్యాసం అనేది ఆధ్యాత్మిక ప్రావీణ్యతకి కూడా చాలా అవసరం. ప్రతిరోజూ ధ్యాన అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక ప్రావీణ్యత సాధించే పద్ధతిని, వివరిస్తున్నాడు, ఇప్పుడు శ్రీ కృష్ణుడు. శ్రీ కృష్ణుడు చెప్పే మొదటి విషయం ఏకాంత ప్రదేశం యొక్క అవసరం. రోజంతా మనం ప్రాపంచిక వాతావరణంచే చుట్టుముట్టబడి ఉంటాము; ఈ ప్రాపంచిక కార్యక్రమాలు, జనులు, మరియు మాటలు, మన మనస్సుని ఇంకా ఇంకా ప్రాపంచికంగా చేస్తాయి. మనస్సుని భగవంతుని వైపు ఉద్ధరించటానికి, కొంత సమయాన్ని ప్రతిరోజూ ఏకాంత సాధనకు ఉపయోగించాలి. పాలు మరియు నీళ్ళ ఉదాహరణ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పటానికి సహాయపడచ్చు. పాలను నీళ్ళలో పోస్తే అది తన స్వీయ-అస్తిత్వాన్ని నిలుపుకోలేదు, ఎందుకంటే నీరు దానితో కలిసి పోతుంది. కానీ, అదే పాలను నీటి నుండి వేరుగా ఉంచి, దాన్ని పెరుగు చేసి, పెరుగునుండి వెన్న తీస్తే, ఆ వెన్న కలిసిపోదు (నీటిలో). అది ఇప్పుడు నీటిని సవాలు చేయవచ్చు – ‘నీ నెత్తి మీద కూర్చొని తేలుతాను; నీవు ఏమీ చేయలేవు ఎందుకంటే నేను ఇప్పుడు వెన్న అయిపోయాను.’ అని. మన మనస్సు పాల వంటిది మరియు ఈ ప్రపంచం నీళ్ళ వంటిది. ఈ ప్రపంచంతో సాన్నిహిత్యం వలన మనస్సు దానిచే ప్రభావితమై, ప్రాపంచికంగా అవుతుంది. కానీ, ఇంద్రియ వస్తువిషయములతో అతితక్కువ సంబంధం కలిగిఉండే, ఏకాంత వాతావరణం, మనస్సుని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి, భగవంతునిపై కేంద్ర్రీకరించటానికి అనుకూలంగా ఉంటుంది. ఒకసారి, భగవంతునితో తగినంత అనుబంధం ఏర్పడిన తరువాత, ఈ ప్రపంచాన్ని సవాలు చేయవచ్చు, ‘నేను ఈ మాయా ద్వందముల మధ్యనే నివసిస్తాను, కానీ వాటిని నాకు అంటనివ్వను’ అని. ఈ ఏకాంతంగా ఉండమనే ఉపదేశం శ్రీ కృష్ణుడిచే మరల 18.52వ శ్లోకంలో చెప్పబడింది. ‘వివిక్తసేవీ లఘ్వాశీ’ ‘ ఏకాంత ప్రదేశంలో ఉండుము; ఆహారాన్ని మితంగా భుజించుము.’ మన వృత్తిపరమైన, సామాజిక పనులకు ఎలాంటి భంగం కలుగకుండా, ఈ ఉపదేశాన్ని ఆచరించటానికి ఒక చక్కటి పద్ధతి ఉంది. మన రోజువారీ దిన చర్యలో, కొంత సమయాన్ని సాధన అంటే ఆధ్యాత్మిక అభ్యాసానికి కేటాయించవచ్చు; అంటే మనం ప్రాపంచిక గందరగోళం లేని ఒక ఏకాంత ప్రదేశంలో ఉండాలి. ప్రాపంచికత్వం నుండి పూర్తిగా విడివడి, మన మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి మరియు భగవంతునిపై కేంద్రీకరించటానికి 'సాధన' చేయాలి. ఈ విధంగా రోజుకి ఒకటి లేదా రెండు గంటలు అభ్యాసం చేస్తే, ప్రాపంచిక పనులలో నిమగ్నమై ఉన్నా, దాని ఫలం రోజంతా ఉంటుంది. ఈ విధంగా, ఏకాంతంలో రోజువారీ సాధనా ద్వారా సంపాదించుకున్న ఉన్నతమైన ఆధ్యాత్మిక స్పృహని కాపాడుకోవచ్చు.
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః । నాత్యుఛ్చ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ।। 11 ।।
11
6
https://www.holy-bhagava…udio/006_011.mp3
శుచౌ — పరిశుభ్రమైన; దేశే — ప్రదేశమున; ప్రతిష్ఠాప్య — స్థానం ఏర్పరుచుకొని; స్థిరం — స్థిరమైన; ఆసనం — ఆసనము; ఆత్మనః — తన యొక్క; న — వద్దు; అతి — ఎక్కువ; ఉఛ్చ్రితం — ఎత్తుగా; న — వద్దు; అతి — చాలా; నీచం — తక్కువ ఎత్తులో; చైల — బట్ట ; అజిన — ఒక జింక చర్మం; కుశ — కుశ గడ్డి (దర్భలు); ఉత్తరం — ఒక దాని మీద ఒకటి.
BG 6.11: యోగాభ్యాసము చేయటానికి, పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారుచేసుకోవాలి; దీనిని కుశ గడ్డి, జింక చర్మము, మరియు ఒక వస్త్రమును ఒక దానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు.
ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు బాహ్య సాధన గురించి చెప్తున్నాడు. 'శుచౌ దేశే' అంటే ఒక పవిత్రమైన లేదా పరిశుద్ధమైన ప్రదేశం. ప్రారంభిక దశలో బాహ్య వాతావరణం మనస్సుని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. 'సాధన' యొక్క తరువాతి దశలలో, అపరిశుభ్రమైన మురికి ప్రదేశాలలో కూడా అంతర్గత పవిత్రత సాధించవచ్చు. కానీ ప్రారంభ దశలో వారికి మనస్సుని పవిత్రంగా ఉంచుకోవటానికి పరిశుభ్రమైన ప్రదేశము సహకరిస్తుంది. కుశగడ్డితో చేసిన చాప, నేలలో వేడిమి/చలి నుండి రక్షణ ఇస్తుంది, ఇది ఈ కాలపు యోగా-మాట్ లాగా పనిచేస్తుంది. వ్యక్తి ధ్యానములో నిమగ్నమై ఉన్నప్పుడు, పైనున్న జింక చర్మం, విషపూరిత ప్రాణులైన పాములు, తేళ్ళు వంటి వాటిని దరిచేరనీయదు. ఒకవేళ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులో ఉంటే, పడిపోయే అవకాశం ఉంది; ఒకవేళ ఆసనం మరీ తక్కువ ఎత్తులో ఉంటే, నేలపై పురుగులు/కీటకములు వంటి వాటితో ఇబ్బంది కలుగవచ్చు. ఈ శ్లోకంలో బాహ్యమైన ఆసనం గురించి చెప్పబడిన కొన్ని విషయాలు ఇప్పకి కాలానికి కొంత అన్వయంకాకపోవచ్చు, కానీ ఇక్కడ భావార్థం ఏమిటంటే, మనస్సు భగవంతుని పట్ల ప్రేమయుక్త భక్తి భవాల్లో నిమగ్నమవ్వాలి.
తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః । ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే ।। 12 ।। సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః । సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ।। 13 ।।
12
6
https://www.holy-bhagava…/006_012-013.mp3
తత్ర — అక్కడ; ఏక-అగ్రం — ఏకాగ్రతతో; మనః — మనస్సు; కృత్వా — చేసి; యత-చిత్త — మనస్సుని నియంత్రణలో ఉంచుకొని; ఇంద్రియ — ఇంద్రియములు; క్రియః — పనులు; ఉపవిశ్య — కూర్చొని; ఆసనే — ఆసనము పై; యుంజ్యాత్ యోగం — యోగ అభ్యాసము కొరకు పరిశ్రమించవలెను; ఆత్మ విశుద్ధయే — మనస్సు యొక్క పరిశుద్ధి కొరకు; సమం — సమముగా; కాయ — శరీరము; శిరః — శిరస్సు (తల); గ్రీవం — మెడ; ధారయన్ — నిలిపివుంచి; అచలం — నిశ్చలముగా; స్థిరః — స్థిరముగా; సంప్రేక్ష్య — దృష్టి పెడుతూ; నాసిక-అగ్రం — ముక్కు చివరి యందు; స్వం — తనయొక్క ; దిశః — దిక్కుల వైపు; చ — మరియు; అనవలోకయన్ — చూడకుండా.
BG 6.12-13: దానిపై స్థిరముగా కూర్చొని, ఒకే ఏకాగ్రత గల ధ్యానములో, అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి - యోగి తన మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి పరిశ్రమించాలి. అతను శరీరమును, మెడను, మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి.
ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీకృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సుకి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానంలో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూచేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు. ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:ఆసీనః సంభవాత్ (4.1.7)‘సాధన చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి.’అచలత్వం చాపేక్ష్య (4.1.9)‘నిశ్చలంగా మరియు నిటారుగా కూర్చోండి’ధ్యానాచ్చ (4.1.8)‘ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి.’హఠ యోగ ప్రదీపికలో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం, మరియు సుఖాసనం వంటివి. ధ్యానంలో అటూయిటూ కదలకుండా, మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:‘స్థిర సుఖమాసనం’ (పతంజలి యోగ సూత్రములు 2.46)’‘ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఏదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.’ కొందరు మోకాలు నొప్పుల వలన, లేదా వేరేఇతర ఆరోగ్య కారణాల వలన, నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.దృష్టిని నాసికాగ్రము మీద కేంద్రీకరించాలి మరియు అది అటూఇటూ పోకుండా చూసుకోవాలి అని ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు పేర్కొన్నాడు. దీనికి రూపాంతరంగా, కనులను మూసి ఉంచవచ్చు. ఈ రెండు పద్దతులు కూడా ప్రాపంచిక వ్యగ్రతని నిరోధించటంలో సహకరిస్తాయి.బాహ్యమైన ఆసనం మరియు శరీరాన్ని ఉంచిన తీరు, ధ్యానమునకు తగినట్టుగా ఉండాలి, కానీ ధ్యానం అనేది యదార్థంగా ఒక అంతర్గత ప్రయాణం. ధ్యానం ద్వారా, మనల్ని మనమే లోతుగా పరిశీలించుకోవచ్చు మరియు మనస్సుని అనంత జన్మల మలినముల నుండి పరిశుద్ధి చేసుకోవచ్చు. మనస్సుని ఏకాగ్రతతో నిలిపి ఉంచే అభ్యాసం వలన, దాని యొక్క గుప్తమైన శక్తిని వెలికితీయవచ్చు. ధ్యానం యొక్క అభ్యాసం మన వ్యక్తిత్వాన్ని వ్యవస్థీకరించుకోవటానికి, అంతర్గత చైతన్యాన్ని మేలుకోలుపటానికి, స్వీయ అవగాహన పెంపొందించు కోవటానికి, చాలా దోహద పడుతుంది. ధ్యానం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలు 6.15వ శ్లోకంలో తదుపరి వివరించబడుతాయి. కొన్ని ఆనుషంగిక ప్రయోజనాలు ఏమిటంటే, ధ్యానం అనేది :– చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.– ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.– జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.– చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలను పెంపొందిచుకోవటానికి దోహదపడుతుందిమనస్సుని భగవంతునిపై కేంద్రీకరించటమే అత్యుత్తమమైన ధ్యాన పద్దతి. ఈ విషయం తదుపరి రెండు శ్లోకాలలో వివరించబడింది.
తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః । ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే ।। 12 ।। సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః । సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ।। 13 ।।
13
6
https://www.holy-bhagava…/006_012-013.mp3
తత్ర — అక్కడ; ఏక-అగ్రం — ఏకాగ్రతతో; మనః — మనస్సు; కృత్వా — చేసి; యత-చిత్త — మనస్సుని నియంత్రణలో ఉంచుకొని; ఇంద్రియ — ఇంద్రియములు; క్రియః — పనులు; ఉపవిశ్య — కూర్చొని; ఆసనే — ఆసనము పై; యుంజ్యాత్ యోగం — యోగ అభ్యాసము కొరకు పరిశ్రమించవలెను; ఆత్మ విశుద్ధయే — మనస్సు యొక్క పరిశుద్ధి కొరకు; సమం — సమముగా; కాయ — శరీరము; శిరః — శిరస్సు (తల); గ్రీవం — మెడ; ధారయన్ — నిలిపివుంచి; అచలం — నిశ్చలముగా; స్థిరః — స్థిరముగా; సంప్రేక్ష్య — దృష్టి పెడుతూ; నాసిక-అగ్రం — ముక్కు చివరి యందు; స్వం — తనయొక్క ; దిశః — దిక్కుల వైపు; చ — మరియు; అనవలోకయన్ — చూడకుండా.
BG 6.12-13: దానిపై స్థిరముగా కూర్చొని, ఒకే ఏకాగ్రత గల ధ్యానములో, అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి - యోగి తన మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి పరిశ్రమించాలి. అతను శరీరమును, మెడను, మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి.
ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీకృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సుకి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానంలో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూచేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు. ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:ఆసీనః సంభవాత్ (4.1.7)‘సాధన చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి.’అచలత్వం చాపేక్ష్య (4.1.9)‘నిశ్చలంగా మరియు నిటారుగా కూర్చోండి’ధ్యానాచ్చ (4.1.8)‘ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి.’హఠ యోగ ప్రదీపికలో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం, మరియు సుఖాసనం వంటివి. ధ్యానంలో అటూయిటూ కదలకుండా, మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:‘స్థిర సుఖమాసనం’ (పతంజలి యోగ సూత్రములు 2.46)’‘ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఏదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.’ కొందరు మోకాలు నొప్పుల వలన, లేదా వేరేఇతర ఆరోగ్య కారణాల వలన, నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.దృష్టిని నాసికాగ్రము మీద కేంద్రీకరించాలి మరియు అది అటూఇటూ పోకుండా చూసుకోవాలి అని ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు పేర్కొన్నాడు. దీనికి రూపాంతరంగా, కనులను మూసి ఉంచవచ్చు. ఈ రెండు పద్దతులు కూడా ప్రాపంచిక వ్యగ్రతని నిరోధించటంలో సహకరిస్తాయి.బాహ్యమైన ఆసనం మరియు శరీరాన్ని ఉంచిన తీరు, ధ్యానమునకు తగినట్టుగా ఉండాలి, కానీ ధ్యానం అనేది యదార్థంగా ఒక అంతర్గత ప్రయాణం. ధ్యానం ద్వారా, మనల్ని మనమే లోతుగా పరిశీలించుకోవచ్చు మరియు మనస్సుని అనంత జన్మల మలినముల నుండి పరిశుద్ధి చేసుకోవచ్చు. మనస్సుని ఏకాగ్రతతో నిలిపి ఉంచే అభ్యాసం వలన, దాని యొక్క గుప్తమైన శక్తిని వెలికితీయవచ్చు. ధ్యానం యొక్క అభ్యాసం మన వ్యక్తిత్వాన్ని వ్యవస్థీకరించుకోవటానికి, అంతర్గత చైతన్యాన్ని మేలుకోలుపటానికి, స్వీయ అవగాహన పెంపొందించు కోవటానికి, చాలా దోహద పడుతుంది. ధ్యానం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలు 6.15వ శ్లోకంలో తదుపరి వివరించబడుతాయి. కొన్ని ఆనుషంగిక ప్రయోజనాలు ఏమిటంటే, ధ్యానం అనేది :– చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.– ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.– జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.– చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలను పెంపొందిచుకోవటానికి దోహదపడుతుందిమనస్సుని భగవంతునిపై కేంద్రీకరించటమే అత్యుత్తమమైన ధ్యాన పద్దతి. ఈ విషయం తదుపరి రెండు శ్లోకాలలో వివరించబడింది.
ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః । మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ।। 14 ।।
14
6
https://www.holy-bhagava…udio/006_014.mp3
ప్రశాంత — ప్రశాంతమైన; ఆత్మా — మనస్సు; విగత-భీః — నిర్భయముగా; బ్రహ్మచారి-వ్రతే — బ్రహ్మచర్య వ్రతములో; స్థితః — స్థితుడై; మనః — మనస్సు; సంయమ్య — నియంత్రణలో ఉంచుకొని; మత్-చిత్తః — నా పై ధ్యానం చేయుము; యుక్తః — నిమగ్నమై; ఆసీత — కూర్చుని; మత్-పరః — నన్నే పరమ లక్ష్యంగా చేసుకుని.
BG 6.14: ఈ విధంగా, ప్రశాంతతతో, భయరహితంగా, మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో, సావధానుడైన యోగి, నేనే పరమ లక్ష్యంగా, నా పై ధ్యానం చేయాలి.
ధ్యానంలో సాఫల్యము సాధించటానికి బ్రహ్మచర్యం పాటించటం యొక్క ఆవశ్యకతని శ్రీ కృష్ణుడు ఉద్ఘాటిస్తున్నాడు. జంతువులలో, సంతానోత్పత్తి కోసం, లైంగిక కోరికలు దోహదపడుతాయి, మరియు జంతువులు ప్రధానంగా ఈ ప్రయోజనం కోసమే ఆ చర్యలో పాల్గొంటాయి. చాలా వరకు జీవజాతుల్లో, సంభోగానికి ఒక నిర్దుష్ట కాలం ఉంటుంది; జంతువులు ఈ క్రియలో యథేచ్చగా పాల్గొనవు. మనుష్యులకు ఉన్నతమైన బుద్ధి ఉండటం చేత, యథేచ్చగా ప్రవర్తించే స్వేచ్ఛ ఉండటం చేత, సంతానోత్పత్తి కోసం ఉన్న క్రియ ఒక విచ్చలవిడి భోగంగా మార్చివేయబడింది. కానీ, వేద శాస్త్రాలు బ్రహ్మచర్య ఆచరణకు చాలా ప్రాధాన్యతనిచ్చాయి. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:బ్రహ్మచర్యప్రతిష్ఠాయామ్ వీర్య లాభః (యోగ సూత్రములు 2.38)‘బ్రహ్మచర్యం పాటించటం వలన శక్తి చాలా వృద్ధి చెందుతుంది.’ఆయుర్వేదం, భారతీయ వైద్య శాస్త్రం, దాని యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వలన, బ్రహ్మచర్యాన్ని ఏంతో కీర్తించింది. ధన్వంతరి యొక్క శిష్యులలో ఒకరు, తన సంపూర్ణ ఆయుర్వేద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తన గురువు గారి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు: ‘ఓ మహర్షీ, దయచేసి ఇప్పుడు నాకు ఆరోగ్య రహస్యాన్ని తెలియచేయుము.’ ధన్వంతరి ఇలా బదులిచ్చాడు: ‘ఈ వీర్యశక్తి నిశ్చయంగా ఆత్మయే. ఈ శక్తిని కాపాడుకోవటంలోనే ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఎవరైతే ఈ ముఖ్యమైన, అమూల్యమైన శక్తిని వృధా చేస్తారో, వారికి భౌతిక, మానసిక, నైతిక, మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదు.’ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, తమ వీర్యాన్ని (రేతస్సు) వృధా చేసుకునేవారు స్థిమితంలేని మరియు ఉద్విగ్నమైన 'ప్ర్రాణం' కలిగి ఉంటారు. వారు శారీరిక, మానసిక శక్తిని కోల్పోయి, తమ జ్ఞాపక శక్తిని, మనస్సుని మరియు బుద్ధిని బలహీనపరుచుకుంటారు. బ్రహ్మచర్యం పాటించటం వలన శారీరిక శక్తి పెరగటం, బుద్ధిలో స్పష్టత, మహోన్నత సంకల్పబలం, చక్కటి జ్ఞాపకశక్తి, మరియు చురుకైన ఆధ్యాత్మిక బుద్ధి కలుగుతాయి. అది కళ్ళలో తళుకు, బుగ్గల్లో మెరుపు కలుగచేస్తుంది.బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరిక భోగక్రియనే ఆపటం అని కాదు. 'అగ్ని పురాణం' ప్రకారం సంభోగానికి సంభందించిన ఈ ఎనిమిది రకాల క్రియలను నియంత్రించాలి: 1) దాని గురించి ఆలోచించటం. 2) దాని గురించి మాట్లాడటం, 3) దాని గురించి జోకులు వేయటం. 4) దానిని ఊహించటం. 5) దానిని కోరుకోవటం. 6) ఎవరినైనా దాని గురించి ప్రలోభ పెట్టటం. 7) దాని మీద ఆసక్తి ఉన్నవారిని ఆకర్షించటం. 8) దానిలో పాల్గొనటం. ఎవరినైనా బ్రహ్మచారి అనాలంటే వారు ఇవన్నిటినీ త్యజించాలి. ఈ విధంగా, బ్రహ్మచర్యం అంటే కేవలం లైంగిక మైథునం నుండి దూరంగా ఉండటమే కాకుండా, హస్తప్రయోగము, మరియు ఇంకా అన్ని లైంగిక వ్యవహారాల నుండి దూరంగా ఉండటం కూడా.ఇంకా, ధ్యాన విషయం కేవలం భగవంతుడే ఉండాలి అని అంటున్నాడు శ్రీ కృష్ణుడు. ఈ విషయం మళ్ళీ వచ్చే శ్లోకంలో ఇంకోమారు చెప్పబడింది.
యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః । శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగఛ్చతి ।। 15 ।।
15
6
https://www.holy-bhagava…udio/006_015.mp3
యుంజన్ — మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేసి; ఏవం — ఈ విధంగా; సదా — ఎల్లప్పుడూ; ఆత్మానం — మనస్సు; యోగీ — ఒక యోగి; నియత-మానసః — క్రమశిక్షణ కలిగిన మనస్సు కల వాడు; శాంతిం — శాంతి; నిర్వాణ — భౌతిక బంధాల నుండి విముక్తి; పరమాం — అత్యున్నత; మత్-సంస్థామ్ — నాయందే స్థితమై ఉండి; అధిగఛ్చతి — పొందును.
BG 6.15: ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపిఉంచుతూ, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నా యందే పరమ శాంతితో స్థితుడై ఉండును.
ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యాన పద్దతులు ఉన్నాయి. జెన్ పద్దతులు, బౌద్ధ పద్దతులు, తాంత్రిక పద్దతులు, టావో పద్దతులు, వైదిక పద్దతులు మొదలగునవి. వీటన్నిట్లో మరల ఉప-శాఖలు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని పాటించేవారిలోనే అనేకానేక రకాల పద్దతులు పాటిస్తున్నారు. క్లిష్టమైన సమస్యేమిటంటే, మన వ్యక్తిగత అభ్యాసం కోసము వీటిలో మనం ఏది పాటించాలి? అని నిర్ణయించుకోవటం. శ్రీ కృష్ణుడు ఈ చిక్కు ప్రశ్నకు సులువైన సమాధానం సూచిస్తున్నాడు. ధ్యాన విషయం భగవంతుడే ఉండాలి మరియు భగవంతుడు మాత్రమే ఉండాలని చెప్తున్నాడు.ధ్యానము యొక్క లక్ష్యము కేవలం ఏకాగ్రతను పెంపొందించుకోవటమే కాదు, మనస్సుని పరిశుద్ధి చేసుకోవటం కూడా. శ్వాస, చక్రాలు, శూన్యం, దీపం వంటి వాటిపై ధ్యానం ఎకాగ్రతను పెంచుకోవటానికి దోహదపడవచ్చు. కానీ, మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి ఖచ్చితంగా మనస్సుని సంపూర్ణ పరిశుద్దుడైన భగవంతును యందు నిలిపితేనే సాధ్యం. భగవంతుడు ప్రకృతి త్రిగుణముల కన్నా అతీతుడని 14.26వ శ్లోకంలో పేర్కొనబడినది, కాబట్టి, ఎవరైతే ఆయనపై మనస్సుని నిమగ్నం చేస్తారో వారి మనస్సు కూడా త్రిగుణముల కంటే అతీతంగా అవుతుంది. ఈ విధంగా, 'ప్రాణము' లపై ధ్యానం అలౌకికమైనదని అభ్యాసకులు అనవచ్చు కానీ నిజమైన అలౌకిక ధ్యానం అనేది భగవంతుని పట్ల చేసేదే ఉంటుంది.మరైతే, భగవంతునిపైనే మనస్సు నిలిపే మార్గం ఏమిటి? మనము భగవంతుని దివ్య లక్షణములైన అన్ని - నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, పరివారము - వీటిపై ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ భగవంతుని కన్నా అభేదము మరియు ఆయన సర్వ శక్తులను కలిగి ఉన్నాయి. కాబట్టి, భక్తులు వీటిలో దేనిపైనైనా ధ్యానం చేసుకుని, భగవంతునిపై ధ్యానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. భారతదేశంలో, చాలా భక్తి మార్గాల్లో భగవన్నామమే ధ్యానానికి ఆధారంగా చేయబడింది. ఈ విధంగా రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది:బ్రహ్మ రామ తేఁ నాము బడ, బర దాయక బర దాని‘జీవాత్మలకు ప్రయోజనకారిగా ఉండటంలో, భగవంతుని నామము భగవంతుని కన్నా గొప్పది.’ నామ ఉచ్చారణ అనేది భగవంతున్ని గుర్తుంచుకోవటానికి అత్యంత అనుకూలమైన పద్దతి, ఎందుకంటే దీనిని ఎక్కడైనా, ఎప్పుడైనా చేయవచ్చు - నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కూర్చున్నప్పుడు, తినేటప్పుడు, ఇంకా ఏ ఇతర పని చేస్తున్నప్పుడైనా.కానీ, చాలామంది సాధకులకు, కేవలం భగవత్ నామము మాత్రమే, మనస్సుని రంజిల్ల చేయటానికి తగినంత ఆకర్షణ కలుగచేయదు. అనంతమైన జన్మల సంస్కారముల వలన మనస్సు సహజంగానే స్వరూపముల వైపు ఆకర్షితమవుతుంది. భగవత్ రూపము ఆధారంగా చేసుకుంటే, ధ్యానమనేది సహజంగా, సులువుగా ఉంటుంది. దీనినే 'రూప ధ్యానము' అంటారు.ఒకసారి మనస్సు భగవత్ రూపంపై కేంద్రీకృతమయితే, మనము దాన్ని, దేవుని గుణముల పై - అయన దయ, ఆయన సౌందర్యం, ఆయన జ్ఞానం, ఆయన ప్రేమ, ఆయన ఉదారత, ఆయన కృప, ఇంకా ఎన్నో... – వీటిపై చింతన చేయటం ద్వారా - మరింత ఇనుమడింపచేయవచ్చు. ఆ తర్వాత మానసిక సేవ చేయటం ద్వారా ధ్యానంలో మరింత పురోగతి సాధించవచ్చు. ఆయనకు ఆహార పదార్థములు సమర్పించినట్టు, అర్చన చేసినట్టు, ఆయనకు పాటలు పాడినట్టు, పాద సేవ చేసినట్టు, విసనకర్ర వీచినట్టు, స్నానం చేపించినట్టు, ఆయనకై వంట చేసినట్టు ఇలా భావన చేయవచ్చు. దీనిని 'మానసీ సేవా' (మనసులో భగవంతుని సేవ చేయటం) అంటారు. ఈ రకంగా, మనం భగవంతుని నామాలు, రూపాలు, గుణములు, లీలలు మొదలైన వాటిపై ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ భగవంతుని యందే మనస్సుని నిమగ్నం చేయటానికి, శ్రీ కృష్ణుడు చెప్పిన ఉపదేశం పాటించటానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఉపకరణములే.ఈ శ్లోకం చివరన, శ్రీ కృష్ణుడు, ధ్యానం యొక్క అత్యున్నత ప్రయోజనం ఇస్తున్నాడు, అవే, మాయా నివృత్తి, మరియు శాశ్వత ఆనందాన్ని ఇచ్చే భగవత్ ప్రాప్తి.
నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః । న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ।। 16 ।।
16
6
https://www.holy-bhagava…udio/006_016.mp3
న — కాదు; అతి — అతిగా; అశ్నతః — తినేవాడు; తు — కానీ; యోగః — యోగము; అస్తి — ఉండును; న — కాదు; చ — మరియు; ఏకాంతం — ఏ మాత్రమూ; అనశ్నతః — తినకుండా ఉండేవాడు; న — కాదు; చ — మరియు; అతి — అతిగా; స్వప్న-శీలస్య — అతిగా నిద్ర పోయేవాడు; జాగ్రతః — అస్సలు నిద్రపోని వాడు; న — కాదు; ఏవ — ఖచ్చితముగా; చ — మరియు; అర్జున — అర్జునా.
BG 6.16: ఓ అర్జునా, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో; మరీ ఎక్కువ నిద్ర పోతారో లేదా మరీ తక్కువ నిద్ర పోతారో, వారు యోగములో విజయం సాధించలేరు.
ధ్యానము యొక్క విషయాన్ని మరియు దాని అంతిమ లక్ష్యాన్ని వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు కొన్ని నియమాలను చెప్తున్నాడు. శారీరిక నిర్వహణ నియమాలను అతిక్రమించినవారు యోగములో సాఫల్యం సాధించలేరు అంటున్నాడు. తరచుగా, ఆధ్యాత్మిక పథంలో కొత్తగా ఆరంభించినవారు, తమ అసంపూర్ణ జ్ఞానంతో ఇలా చెప్తారు: ‘నీవు ఆత్మవు, శరీరానివి కావు. కాబట్టి శరీర నిర్వహణ మర్చిపోయి, ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమవ్వుము.’కానీ, ఇటువంటి సిద్ధాంతం మనిషిని ఎక్కువ దూరం తీస్కువెళ్ళలేదు. మనము ఈ శరీరము కాదు అన్న విషయం నిజమే అయినా, ఈ శరీరమే మన జీవించి ఉన్నతకాలం మన వాహనం, మరియు దానిని చక్కగా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. ఆయుర్వేద పుస్తకమైన చరక్ సంహిత ఇలా పేర్కొంటున్నది: ‘శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం’; ‘ఈ శరీరమే ధర్మ కార్యములు చేయటానికి వాహకము.’ ఒకవేళ శరీరం అనారోగ్యంపాలైతే ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా కుంటు పడుతాయి. రామచరితమానస్ ఇలా పేర్కొంటున్నది: ‘తను బిను భజన వేద నహీఁ వరనా’, ‘ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమై ఉన్నా శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని వేదములు చెప్పలేదు.’ నిజానికి, భౌతిక ప్రాపంచిక శాస్త్ర సహాయంతో మన శరీరాన్ని చక్కగా చూసుకొమ్మని ఉపదేశిస్తున్నాయి. ఈశోపనిషత్తు ప్రకారం:అంధం తమః ప్రవిశంతి యే ఽవిద్యాం ఉపాసతేతతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాం రతాః (9)‘భౌతిక విద్యను మాత్రమే పెంపొందించుకునేవారు నరకానికి పోతారు. కానీ, కేవలం ఆధ్యాత్మిక విద్యనే పెంపొందించుకునేవారు అంతకంటే ఘోరమైన నరకానికి పోతారు.’ భౌతిక విద్య అనేది మన శారీరిక నిర్వహణకు చాలా అవసరం, అదే సమయంలో ఆధ్యాత్మిక శాస్త్రము అనేది మనలో అంతర్గత దివ్యత్వం ప్రకటితమవ్వటానికి చాలా అవసరం. మనం ఈ రెంటినీ జీవితంలో సమతుల్యంగా ఉంచుకోవాలి. కాబట్టి, యోగాసనాలు, ప్రాణాయామం, మరియు సమతుల్య ఆహారం అనేవి వైదిక జ్ఞానంలో భాగమే.నాలుగు వేదాలలో ప్రతిదానికీ భౌతిక జ్ఞానాన్ని ఇచ్చే అనుబంధ వేదము ఉంది. అథర్వ వేదము యొక్క అనుబంధ వేదము ఆయుర్వేదము, ఇది ప్రాచీనమైన ఆరోగ్య, వైద్య శాస్త్రము. వేదములు శారీరిక స్వస్థత పట్ల కూడా చాల శ్రద్ధ చూపిస్తున్నాయనటానికి ఇది ఒక నిదర్శనం. అందుకే, మరీ ఎక్కువ తినటం లేదా అసలు తినక పోవటం, తీవ్ర పరిశ్రమ లేదా పూర్తి జడత్వం వంటివి యోగమునకు అవరోధాలు. ఆధ్యాత్మిక సాధకులు - తాజా పోషకాలతో కూడిన ఆహారం భుజిస్తూ, ప్రతి రోజూ వ్యాయామం చేస్తూ, రాత్రి పూట తగినంత నిద్ర పోతూ - తమ శరీరాన్ని చక్కగా నిర్వహించుకోవాలి.
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు । యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ।। 17 ।।
17
6
https://www.holy-bhagava…udio/006_017.mp3
యుక్త — మితమైన; ఆహార — భుజించటం; విహారస్య — వినోదము; యుక్త చేష్టస్య కర్మసు — పనిలో సమతుల్యత; యుక్త — నియంత్రణతో ; స్వప్న-అవబోధస్య — నిద్ర మరియు మేల్కొని ఉండుట; యోగః — యోగము; భవతి — అగును; దుఃఖ-హా — దుఖముల వినాశకారి.
BG 6.17: కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు.
యోగం అంటే ఆత్మ భగవంతునితో ఎకమవ్వటమే. యోగమునకు వ్యతిరేకమైనది భోగము, అంటే ఇంద్రియ సుఖాలలో నిమగ్నమవ్వటం. భోగాలలో నిమగ్నమవ్వటం శరీరం యొక్క సహజ సూత్రాలను ఉల్లంఘిస్తుంది, మరియు అది రోగాలకి దారి తీస్తుంది. ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు, శరీరం రోగగ్రస్త మయితే, అది యోగాభ్యాసాన్ని కుంటుపడేస్తుంది. ఈ విధంగా, శారీరిక కార్యకలాపాలలో మితంగా ఉండి, యోగాభ్యాసము చేయటం వలన మనము అన్ని శారీరిక, మానసిక దుఃఖాల నుండి విముక్తి పొందవచ్చు, అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. ఇదే ఉపదేశం, శ్రీ కృష్ణుడి తరువాత రెండున్నర వేల సంవత్సరముల అనతరం, గౌతమ బుద్ధుడిచే మళ్లీ చెప్పబడింది; ఆయన తీవ్ర నిష్ఠలు మరియు ఇంద్రియ భోగముల మధ్య ఒక చక్కటి మధ్యేమార్గాన్ని సూచించాడు. ఈ విషయంపై ఒక అధ్బుతమైన కథ ఉంది: జ్ఞానోదయం కాకముందు గౌతమ బుద్ధుడు ఓసారి తినటం, త్రాగటం మానివేసి, ధ్యానంలో కూర్చున్నాడు అని చెప్తారు. కానీ, కొద్ది రోజులు ఇలా అభ్యాసం చేసిన తరువాత, పోషణ లేకపోవటం అతనిని బలహీనంగా మరియు తలతిరుగుతున్నట్లుగా చేసింది, దీనితో ఆయనికి ధ్యానంలో మనస్సుని నిలకడగా ఉంచటం అసాధ్యమయింది. అదే సమయంలో, కొంతమంది గ్రామీణ మహిళలు అటుగా వెళ్ళటం జరిగింది. వారు దగ్గరి నదిలో నీటిని కుండల్లో నింపుకొని తమ తలపై కుండలను మోసుకెల్తూ, పాట పాడుకుంటూ వెళ్తున్నారు. ఆ పాటకి అర్థం ఇలా ఉంది: ‘తాన్పురా (తంబూరా) యొక్క తీగలను బిగించుము. కానీ, మరీ తీగలు తెగేట్టుగా బిగించకు.’ వారి మాటలు గౌతమ బుద్ధుడి చెవులలో ప్రవేశించాయి, మరియు బుద్ధుడు ఇలా ఆశ్చర్యపడ్డాడు, ‘ఈ ఏమీ చదువుకోని గ్రామీణ మహిళలు ఇంత పాండిత్యముతో కూడిన మాటలు పాడుతున్నారు. వాటిలో మానవ జాతికి అంతా ఒక చక్కటి సందేశం ఉంది. మనం కూడా మన శరీరాలని బిగించాలి (నిష్ఠగా అభ్యసించి), కానీ మరీ శరీరం పాడైపోయేంతగా కాదు.’ బెంజమిన్ ఫ్రాంక్లిన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతి పితలలో ఒకరు, స్వయం కృషితో ఎదిగినాడని ఎంతో గౌరవింపబడ్డాడు. తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటానికి, ఇరవైవ ఏట నుండే, ఒక డయరీ రాసుకునేవాడు. పదమూడు విషయాలలో తను వృద్ధి చెందుతూ ఉండాలని తన పనితీరుని ఆ డయరీలో రాసుకునేవాడు. అందులో మొదటి విషయం ‘పరిమితంగా ఉండాలి: మరీ బద్దకంగా అయ్యేంతవరకూ తినకు; మరీ నిశాఎక్కే వరకూ తాగకు.’ (Temperance: Eat not to dullness; drink not to elevation).
యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే । నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ।। 18 ।।
18
6
https://www.holy-bhagava…udio/006_018.mp3
యదా — ఎప్పుడైతే; వినియతం — పూర్తిగా నియంత్రించబడి; చిత్తం — మనస్సు; ఆత్మని — ఆత్మ యొక్క; ఏవ — ఖచ్చితంగా; అవతిష్ఠతే — ఉండును; నిఃస్పృహః — తృష్ణ (కోరికలు) లేకుండా; సర్వ — సమస్త; కామేభ్యః — ఇంద్రియ వాంఛల కోసం; యుక్త — పరిపూర్ణ యోగములో స్థితుడై ఉండి; ఇతి — ఈ విధంగా; ఉచ్యతే — అంటారు; తదా — అప్పుడు.
BG 6.18: వారు సంపూర్ణ క్రమశిక్షణతో, మనస్సుని అన్ని స్వార్థ పూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి, పరమశ్రేష్ఠమైన ఆత్మ శ్రేయస్సుయందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు, మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు.
ఒక మనిషి యోగ సాధనమును ఎప్పుడు పూర్తి చేసినట్టు? దీనికి సమాధానం ఏమిటంటే, నిగ్రహింపబడిన చిత్తము (మనస్సు) ఎప్పుడైతే కేవలం భగవంతుని యందు మాత్రమే నిలిచి స్థితమై పోతుందో అప్పుడు. ఆ సమయంలో, మనస్సు దానంతట అదే ఇంద్రియ లౌల్యముల నుండి మరియు ప్రాపంచిక భోగాల నుండి వీగిపోయి దూరమైపోతుంది. ఆ సమయంలో వ్యక్తిని 'యుక్తుడు'గా పరిగణించవచ్చు లేదా పరిపూర్ణ యోగములో ఉన్నట్టు. ఈ అధ్యాయం చివరలో ఆయన ఇంకా ఇలా అన్నాడు: ‘యోగులందరిలో కెల్లా ఎవరి మనస్సులైతే ఎప్పుడూ నా యందే స్థితమై ఉండునో, మరియు ఎవరైతే దృఢ విశ్వాసంతో నా పట్ల భక్తిలో నిమగ్నమై ఉందురో, వారిని నేను అత్యున్నతులుగా పరిగణిస్తాను. (శ్లోకం 6.47).’
యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా । యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ।। 19 ।।
19
6
https://www.holy-bhagava…udio/006_019.mp3
యథా — ఏ విధంగా నయితే; దీపః — దీపము; నివాత-స్థః — వీచేగాలి లేని ప్రదేశంలో; న, ఇంగతే — చలించకుండా ఉంటుందో; సా — ఈ యొక్క; ఉపమా — ఉపమానము; స్మృతా — చెప్పబడినది; యోగినః — యోగి యొక్క; యత-చిత్తస్య — నిగ్రహింపబడిన మనస్సు కల; యుంజతః — మార్గము తప్పకుండా అభ్యాసము చేయుచున్న; యోగమ్ — ధ్యానములో; ఆత్మనః — పరమేశ్వరుని యందు.
BG 6.19: గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును.
ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు దీపజ్యోతి యొక్క ఉపమానమును చూపిస్తున్నాడు. వీచేగాలిలో, దీపజ్యోతి సహజంగానే చంచలంగా ఉంటుంది, దాన్ని నియంత్రించటం అసాధ్యం. కానీ, గాలిలేని చోట, దీపం ఒక బొమ్మలా నిలకడగా ఉంటుంది. అదే ప్రకారంగా, మనస్సు అనేది సహజంగా చంచలమైనది, మరియు నిగ్రహించటానికి చాలా క్లిష్టమైనది. కానీ, ఎప్పుడైతే యోగి యొక్క మనస్సు సంపూర్ణంగా భగవంతునితో ఏకమై ఉండునో, అది కోరికలనే గాలి నుండి కాపాడబడుతుంది. ఇటువంటి యోగి, భక్తి యొక్క బలంచే నిలకడగా తన మనస్సుని వశమునందు ఉంచుకుంటాడు.
యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా । యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ।। 20 ।।
20
6
https://www.holy-bhagava…udio/006_020.mp3
యత్ర — ఎప్పుడైతే; ఉపరమతే — ఆంతర సుఖాన్ని రమించునో; చిత్తం — మనస్సు; నిరుద్ధం — నియంత్రించబడిన; యోగ-సేవయా — యోగ అభ్యాసము చేత; యత్ర — ఎప్పుడు; చ — మరియు; ఏవ — నిజముగా; ఆత్మనా — పవిత్రమైన మనస్సు ద్వారా; ఆత్మానం — ఆత్మ; పశ్యన్ — దర్శించుచూ; ఆత్మని — ఆత్మ యందే; తుష్యతి — సంతృప్తి గా ఉండును.
BG 6.20: ఎప్పుడైతే, మనస్సు, ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో, అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు ఆంతర ఆనందంలో రమించును.
ధ్యానం చేసే పద్ధతిని మరియు ధ్యానం యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిని వివరించిన పిదప, శ్రీకృష్ణుడు ఇక ఇప్పుడు, దాని పరిశ్రమ యొక్క ఫలితాలను తెలియపరుస్తున్నాడు. మనస్సు ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో, అప్పుడు వ్యక్తి ఆత్మను శరీర-మనో-బుద్దుల కంటే వేరుగా తెలుసుకోగలుగుతాడు. ఉదాహరణకి, గ్లాసులో మురికి నీరు ఉంటే, దానిగుండా మనము చూడలేము. కానీ, ఆ నీటిలో పటిక వేస్తే, మురికి వేరైపోయి క్రిందికి దిగి, నీరు స్వచ్ఛంగా అయిపోతుంది. అదే ప్రకారంగా, మనస్సు మురికిగా ఉన్నప్పుడు, అది ఆత్మ దర్శనాన్ని తెలియకుండా చేస్తుంది; మరియు ఆత్మ యొక్క శాస్త్ర పరిజ్ఞానం, పుస్తకజ్ఞాన స్థాయిలోనే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే, మనస్సు పవిత్రం అవుతుందో ఆత్మ అనేది అంతర్గత విజ్ఞానం ద్వారా నేరుగా అనుభవం లోనికి వస్తుంది.
సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ । వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ।। 21 ।।
21
6
https://www.holy-bhagava…udio/006_021.mp3
సుఖం — ఆనందము; ఆత్యంతికం — అంతములేని; యత్ — ఏదైతే; తత్ — అది; బుద్ధి — బుద్ధి; గ్రాహ్యం — గ్రహింపబడును; అతీంద్రియం — ఇంద్రియములకు అతీతమైనది; వేత్తి — తెలుసుకొని; యత్ర — ఈ స్థితిలో; న — కాదు; చ — మరియు; ఏవ — ఖచ్చితంగా; అయం — అతను; స్థితః — స్థితుడై ఉండును; చలతి — చలించుట; తత్త్వతః — పరమ సత్యము నుండి.
BG 6.21: సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో, వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి, నిత్య పరమసత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు.
ఆనందము కోసం అన్వేషణ అనేది ఆత్మకున్న అంతర్గత సహజ స్వభావం. మనము ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు-అంశలము అన్న వాస్తవం నుండి ఇది జనించింది. ఈ విషయం ధ్రువీకరించటానికి , 5.21వ శ్లోకంలో ఎన్నో వేద శాస్త్రాలనుండి వాక్యాలను పేర్కొనటం జరిగింది. భగవంతుడిని అనంతమైన ఆనంద స్వరూపంగా పేర్కొంటూ ఇంకా కొన్నివాక్యాలను ఇక్కడ చూడండి:రసో వై సః రసం హ్యేవాయం లబ్ధ్వానందీ భవతి(తైత్తిరీయ ఉపనిషత్తు 2.7) ‘భగవంతుడు స్వయంగా ఆనందమే; జీవాత్మ ఆయనను పొందగానే ఆనందమయం అయిపోతుంది.’ఆనందమయో ఽభ్యాసాత్ (బ్రహ్మ సూత్రములు 1.1.12)‘యదార్థమైన ఆనంద స్వరూపమే భగవంతుడు’సత్య జ్ఞానానంతానంద మాత్రైక రస మూర్తయః(భాగవతం 10.13.54) ‘నిత్యత్వము, జ్ఞానము, మరియు ఆనందముల సమ్మేళనముతో భగవంతుని దివ్య మంగళ స్వరూపము తయారు చేయబడినది.’ఆనంద సింధు మధ్య తవ వాసా, బిను జానే కట మరసి పియాసా(రామచరితమానస్) ‘ఆనంద సింధువు అయిన భగవంతుడు మీ యందే స్థితుడై ఉన్నాడు. ఆయనను తెలుసుకోకుండా మీ యొక్క ఆనందం కోసం ఉన్న తృష్ణ ఎలా తీరుతుంది?’మనము పరిపూర్ణ ఆనందం కోసం ఎన్నో యుగాల నుండి అన్వేశిస్తున్నాము మరియు మనం చేసే ప్రతి పని ఆ ఆనందం కోసమే. కానీ, భౌతిక సుఖాలనిచ్చే వస్తు-విషయముల నుండి మనస్సు, మరియు ఇంద్రియములు, కేవలం నిజమైన ఆనందం యొక్క ప్రతిబింబ నీడను మాత్రమే అనుభవిస్తాయి. ఇంద్రియ తృప్తి అనేది, భగవంతుని పరమానందం కోసం పరితపించే లోనున్న ఆత్మ యొక్క వాంఛను, తీర్చడంలో విఫలమౌతుంది.మనస్సు భగవంతుని యందే ఏకమై ఉన్నప్పుడు, ఆత్మ, వర్ణింపశక్యముకాని, ఉత్కృష్టమైన, ఇంద్రియాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. వైదిక వాఙ్మయంలో ఈ స్థితినే 'సమాధి' అంటారు. పతంజలి మహర్షి ఇలా పేర్కొన్నాడు:సమాధిసిద్ధిరీశ్వర ప్రణిధానాత్(పతంజలి యోగ దర్శనం 2.45) ‘సమాధిలో సాఫల్యం కోసం, పరమేశ్వరునికి శరణాగతి చేయుము.’సమాధి స్థితిలో, సంపూర్ణ సంతృప్తిని మరియు సంతుష్టి అనుభవిస్తూ, ఆత్మకు కోరుకోవడానికి ఇంకా ఏమీ మిగిలి ఉండవు; తద్వారా, ఒక్క క్షణం కూడా వైదొలగకుండా, ఆత్మ పరమ సత్యము నందే ధృడముగా స్థితమై ఉండును.
యం లబ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః । యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ।। 22 ।।
22
6
https://www.holy-bhagava…udio/006_022.mp3
యం — ఏదైతే; లబ్ద్వా — లభించిన తర్వాత; చ — మరియు; అపరం — మరి ఇంకేదీ; లాభం — లాభము; మన్యతే — భావించును; న — కాదు; అధికం — గొప్పది; తతః — దాని కంటే; యస్మిన్ — దేనిలో అయితే; స్థితః — స్థితుడై ఉండునో; న — ఎన్నటికీ కాడు; దుఃఖేన — దుఃఖము చేత; గురుణా — మిక్కిలి; అపి — అయినా కూడా; విచాల్యతే — చలించుట.
BG 6.22: ఆ స్థితిని పొందిన తరువాత, వ్యక్తి, మరింక ఏదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉండి, వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చలింపడు.
భౌతిక జగత్తులో ఎంత మేర సాధించినా, వ్యక్తి సంపూర్ణ తృప్తి పొందలేడు. ఓ పేద వాడు, ధనవంతుడు కావటానికి ఎంతో కష్ట పడతాడు, మరియు తను లక్షాధికారి కాగానే తృప్తి పడ్డ భావన పొందుతాడు. కానీ, అదే లక్షాధికారికి ఒక కోటీశ్వరున్ని చూడగానే, అసంతృప్తి మొదలౌతుంది. ఆ కోటీశ్వరుడు కూడా ఇంకా ఎక్కువ ఐశ్వర్యం కలవాడిని చూసినప్పుడు అసంతృప్తి చెందుతాడు. మనకు ఎంత సంతోషం లభించినా, అంత కన్నా ఎక్కువ సంతోషం ఉంది అనుకున్నప్పుడు, ఎదో అసంతృప్తి భావన ఉంటుంది. కానీ, యోగ స్థితి యందు పొందిన ఆనందం అనేది ఆ భగవంతుని యొక్క అనంతమైన ఆనందం. దాని కంటే ఇంకా ఏదీ ఉన్నతమైనది లేదు కాబట్టి, ఆ అనంతమైన ఆనందాన్ని అనుభవించినప్పుడు, ఆత్మ సహజంగానే తన లక్ష్యాన్ని చేరుకున్నట్టు గ్రహిస్తుంది. భగవంతుని దివ్యానందము నిత్య శాశ్వతమైనది కూడా, దానిని ఒకసారి సాధించిన యోగి నుండి దాన్ని ఎప్పటికీ తీసివేయలేరు. ఇటువంటి భగవత్-ప్రాప్తి నొందిన జీవి, భౌతిక శరీరంలోనే వసించి ఉన్నా, భగవత్ భావనలోనే స్థితుడై ఉంటాడు. ఒక్కోసారి, బాహ్యంగా చూస్తే - అనారోగ్యం, వ్యతిరేకతతో ఉండే జనం, అణచివేసే వాతావరణం వంటి వాటితో ఆ మహాత్ముడు కష్టాల్లో ఉన్నట్టు అగుపించవచ్చు, కానీ, అంతర్లీనంగా ఆ మహాత్ముడు భగవత్ సాన్నిధ్యం లోనే ఉండి, దివ్యానందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి, ఎంత తీవ్రమైన విపత్తు అయినా అటువంటి మహాత్ముడిని చలింపచేయలేదు. భగవంతుని తోనే ఏకమైన స్థితిలో ఉండి, ఆ మహాత్ముడు శారీరిక దృక్పథం నుండి అతీతంగా ఎదుగుతాడు, మరియు భౌతిక హానిచే ప్రభావితం కాడు. ఈ ప్రకారంగా, మన పురాణాలలో, ప్రహ్లాదుడి అంతర్గత స్థితి ఎలాగుందంటే - పాముల గుంటలో వేయబడినా, ఆయుధాలతో హింసించబడినా, అగ్నిలో ఉంచబడినా, మరియు కొండపై నుండి విసిరివేయబడినా - ఇవేవీ కూడా ప్రహ్లాదునికి భగవంతునితో ఉన్న భక్తియుక్త ఏకత్వాన్ని భంగం చేయలేకపోయాయి.
తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ । స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ।। 23 ।।
23
6
https://www.holy-bhagava…udio/006_023.mp3
తం — అది; విద్యాత్ — తెలుసుకొనుము; దుఃఖ-సంయోగ-వియోగం — దుఃఖముల సంయోగం నుండి విముక్తి; యోగ-సంజ్ఞితమ్ — యోగము అని చెప్పబడును; సః — అది; నిశ్చయేన — ధృఢ నిశ్చయముగా; యోక్తవ్యః — ఆచరింపబడవలెను; యోగః — యోగము; అనిర్విణ్ణ-చేతసా — అచంచలమైన మనస్సుతో.
BG 6.23: దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు. ఈ యోగమును ధృడ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదం/అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను.
భౌతిక జగత్తు మాయ యొక్క పరిధిలో ఉన్నది, మరియు ఇది శ్రీ కృష్ణుడిచే, 8.15వ శ్లోకంలో దుఃఖాలయమ్ అశాశ్వతమ్, తాత్కాలికమైనది మరియు దుఃఖములతో నిండి ఉన్నది అని చెప్పబడింది. ఈ విధంగా భౌతిక శక్తి అయిన మాయ, చీకటితో పోల్చబడింది. అది మనలను అజ్ఞానం అనే చీకటిలో ఉంచి, మనలను ఈ లోకంలో దుఃఖాలను అనుభవింపజేస్తున్నది. కానీ, భగవంతుడనే వెలుగుని మన హృదయం లోనికి తెచ్చినప్పుడు మాయా రూప చీకటి సహజంగానే నిర్మూలించబడుతుంది. చైతన్య మహాప్రభు దీనిని చాలా అద్భుతంగా పేర్కొన్నాడు :కృష్ణ సూర్య-సమ, మాయా హయ అంధకారయాహా( కృష్ణ, తాహా( నాహి మాయార అధికార(చైతన్య చరితామృతము, మధ్య లీల 22.31)‘భగవంతుడు వెలుగు వంటి వాడు మరియు మాయ చీకటి వంటిది. ఎలాగైతే చీకటి అనేది వెలుగుని ఓడించలేదో, అదేవిధంగా మాయ అనేది ఎన్నటికీ భగవంతుణ్ణి జయించలేదు.’ ఇక, భగవంతుని సహజ-స్వభావం దివ్య ఆనందం, అదే సమయంలో, మాయ యొక్క పరిణామం దుఃఖము. అందుకే, భగవంతుని దివ్య ఆనందాన్ని పొందినవాడు మాయ కలిగించే దుఃఖములకు ఎన్నటికీ ఇక లోనుకాడు.ఈ విధంగా, యోగ స్థితి అంటే ఈ రెండూ ఉన్నట్టే 1) ఆనంద ప్రాప్తి, మరియు 2) దుఃఖ నివృత్తి. ఈ రెంటినీ శ్రీ కృష్ణుడు ఒక దాని తరువాత ఒకదాన్ని పేర్కొంటున్నాడు. ఇంతకు క్రితం శ్లోకం లో యోగ-ఫలముగా, ఆనంద ప్రాప్తి అనేది వక్కాణించబడినది; ఈ శ్లోకంలో దుఃఖ నివృత్తి అనేది చెప్పబడుతున్నది.ఈ శ్లోకం యొక్క రెండవ పాదంలో, ఈ దృఢ సంకల్ప అభ్యాసంతో పరిపూర్ణ యోగ సిద్ది స్థాయి చేరుకోవాలి అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. ఇక తదుపరి, ధ్యానమును ఎలా అభ్యాసం చేయాలో వివరిస్తాడు.
సంకల్పప్రభవాన్కామాన్ త్యక్త్వా సర్వానశేషతః । మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ।। 24 ।। శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా । ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ।। 25 ।।
24
6
https://www.holy-bhagava…/006_024-025.mp3
సంకల్ప — సంకల్పముతో; ప్రభవాన్ — జనించిన; కామాన్ — కోరికలు; త్యక్త్వా — విడిచిపెట్టిన పిదప; సర్వాన్ — అన్నీ; అశేషతః — సంపూర్ణముగా; మనసా — మనస్సు ద్వారా; ఏవ — నిజముగా; ఇంద్రియ-గ్రామం — ఇంద్రియ సముదాయము; వినియమ్య — నిగ్రహించి; సమంతతః — అన్ని వైపులనుండీ; శనైః — క్రమముగా;శనైః — క్రమముగా; ఉపరమేత్ — శాంతిని పొందును; బుద్ధ్యా — బుద్ధి చేత; ధృతి-గృహీతయా — శాస్త్ర సమ్మతమైన పద్దతిలో దృఢ సంకల్పంచే సాధించి; ఆత్మ-సంస్థం — భగవంతుని యందే నిలిపి; మనః — మనస్సు; కృత్వా — చేసిన తర్వాత; న, కించిత్, అపి, చింతయేత్ — వేటినీ కూడా స్మరింపరాదు.
BG 6.24-25: ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి, ఇంద్రియములను అన్ని వైపులనుండీ మనస్సుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా మరియు నిశ్చయముగా, బుద్ధియందు దృఢవిశ్వాసంతో మనస్సు భగవంతుని యందే స్థితమగును, మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు.
ధ్యానానికి రెండు ప్రక్రియలు అవసరం – మనస్సుని ప్రాపంచిక జగత్తు నుండి వేరుచేయటం, మరియు దాన్నిభగవంతుని యందే స్థిరపరచటం. ఇక్కడ, శ్రీ కృష్ణుడు మొదటి భాగాన్ని వివరించంతో మొదలు పెడుతున్నాడు – అంటే మనస్సుని ప్రపంచం నుండి దూరం చేయటం. మనస్సుకి ప్రపంచం పట్ల మమకారాసక్తి ఉన్నప్పుడు, ప్రాపంచిక వస్తువులు, మనుష్యులు, సంఘటనలు వంటివాటి తలంపులు మనస్సులోకి వస్తూనే ఉంటాయి. ప్రారంభంలో, తలంపులు ‘స్ఫూర్ణా’ రూపంలో ఉంటాయి (అప్పుడప్పుడూ వచ్చిపోయే అనుభూతులు మరియు ఆలోచనలు). మనము ఈ యొక్క ‘స్ఫూర్ణా’ ములను జరగాలి/కావాలి అని గట్టిగా కోరుకున్నప్పుడు, అది ‘సంకల్పము’ అవుతుంది. ఈ విధంగా, ఆలోచనలు, అవి అనుకూలమైనవో లేదా ప్రతికూలమైనవో అన్నదాన్ని బట్టి, సంకల్పముగా (ఆయా వస్తు విషయాల కోసం పాటు పడటం) మరియు వికల్పములగా (వాటిని ద్వేషించటం) మారతాయి. ఈ సంకల్ప వికల్ప బీజములు, కోరికలనే మొక్కగా మారతాయి, ‘ఇలా అవ్వాలి. ఇలా అవ్వకూడదు’ అని. కెమెరా ఫిల్ము పై కాంతి పడ్డప్పుడు అయినట్టు, ఈ రెండూ సంకల్ప వికల్పములు మనస్సు పై తక్షణమే వాటి ముద్ర వేస్తాయి. ఈ విధంగా అవి నేరుగా భగవంతునిపై ధ్యానానికి అవరోధం కలిగిస్తాయి. వాటికి ఆకస్మికంగా ఎగిసిపడే స్వభావం కూడా ఉంటుంది, ఈనాటి చిన్న కోరికే కాలక్రమంలో మహా జ్వాలగా పరిణమించే అవకాశం ఉంది. ఈ విధంగా, ధ్యానంలో విజయం/సాఫల్యత పొందాలనే అభిలాష ఉంటే భౌతిక వస్తు-విషయముల పట్ల ఆసక్తి విడిచిపెట్టాలి. ధ్యానం యొక్క మొదటి భాగం – ప్రాపంచికత నుండి మనస్సుని తీసివేయమని - వివరించిన శ్రీ కృష్ణుడు, ఇక రెండవ భాగం గురించి వివరిస్తున్నాడు. మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయాలి. ఇది దానంతట అదే అయిపోదు, ధృడ సంకల్పముతో శ్రమిస్తే, విజయం నెమ్మదిగా చేకూరుతుంది, అని అంటున్నాడు. వేద శాస్త్రాలకు అనుగుణంగా ఉన్న ధృడ సంకల్పాన్ని ‘ధృతి’ అంటారు. ఈ దృఢ సంకల్పము, బుద్ధి యొక్క గట్టి విశ్వాసం ద్వారా వస్తుంది. చాలా మంది ప్రజలు, ఆత్మతత్త్వం గురించి, ప్రాపంచిక పరుగుల నిరర్థకత్వము గురించి వేదశాస్త్రాల పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కానీ, వారి దైనందిన జీవితం వారి జ్ఞానానికి అనుగుణంగా ఉండదు, అంతేకాక పాపిష్ఠి పనులు, లైంగిక వాంఛలు, మరియు మత్తుపదార్థాల సేవనం లాంటి పనులు చేస్తుంటారు. ఇది ఎందుకంటే వారి బుద్ధి, ఈ శాస్త్ర విషయాల మీద నమ్మకం/విశ్వాసం కలిగి ఉండదు. ఈ ప్రపంచం యొక్క అశాశ్వతత్వం మరియు భగవంతునితో తనకు ఉన్న శాశ్వత సంబధముల మీద బుద్ధి దృఢవిశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఈ విచక్షణా శక్తి వస్తుంది. ఈ విధంగా బుద్ధిని ఉపయోగించుకుని క్రమక్రమంగా ఇంద్రియ భోగములను త్యజించాలి. దీనినే ప్రత్యాహారము అంటారు, అంటే ఇంద్రియ వస్తు-విషయముల వైపు మనస్సు పరుగు తీయటాన్ని నిగ్రహించటం. ప్రత్యాహరములో సాఫల్యం తక్షణమే రాదు. అది పదే పదే అభ్యాసం చేయటం ద్వారా క్రమక్రమంగా సాధించబడుతుంది. శ్రీ కృష్ణుడు తదుపరి ఈ అభ్యాసం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు.
సంకల్పప్రభవాన్కామాన్ త్యక్త్వా సర్వానశేషతః । మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ।। 24 ।। శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా । ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ।। 25 ।।
25
6
https://www.holy-bhagava…/006_024-025.mp3
సంకల్ప — సంకల్పముతో; ప్రభవాన్ — జనించిన; కామాన్ — కోరికలు; త్యక్త్వా — విడిచిపెట్టిన పిదప; సర్వాన్ — అన్నీ; అశేషతః — సంపూర్ణముగా; మనసా — మనస్సు ద్వారా; ఏవ — నిజముగా; ఇంద్రియ-గ్రామం — ఇంద్రియ సముదాయము; వినియమ్య — నిగ్రహించి; సమంతతః — అన్ని వైపులనుండీ; శనైః — క్రమముగా;శనైః — క్రమముగా; ఉపరమేత్ — శాంతిని పొందును; బుద్ధ్యా — బుద్ధి చేత; ధృతి-గృహీతయా — శాస్త్ర సమ్మతమైన పద్దతిలో దృఢ సంకల్పంచే సాధించి; ఆత్మ-సంస్థం — భగవంతుని యందే నిలిపి; మనః — మనస్సు; కృత్వా — చేసిన తర్వాత; న, కించిత్, అపి, చింతయేత్ — వేటినీ కూడా స్మరింపరాదు.
BG 6.24-25: ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి, ఇంద్రియములను అన్ని వైపులనుండీ మనస్సుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా మరియు నిశ్చయముగా, బుద్ధియందు దృఢవిశ్వాసంతో మనస్సు భగవంతుని యందే స్థితమగును, మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు.
ధ్యానానికి రెండు ప్రక్రియలు అవసరం – మనస్సుని ప్రాపంచిక జగత్తు నుండి వేరుచేయటం, మరియు దాన్నిభగవంతుని యందే స్థిరపరచటం. ఇక్కడ, శ్రీ కృష్ణుడు మొదటి భాగాన్ని వివరించంతో మొదలు పెడుతున్నాడు – అంటే మనస్సుని ప్రపంచం నుండి దూరం చేయటం. మనస్సుకి ప్రపంచం పట్ల మమకారాసక్తి ఉన్నప్పుడు, ప్రాపంచిక వస్తువులు, మనుష్యులు, సంఘటనలు వంటివాటి తలంపులు మనస్సులోకి వస్తూనే ఉంటాయి. ప్రారంభంలో, తలంపులు ‘స్ఫూర్ణా’ రూపంలో ఉంటాయి (అప్పుడప్పుడూ వచ్చిపోయే అనుభూతులు మరియు ఆలోచనలు). మనము ఈ యొక్క ‘స్ఫూర్ణా’ ములను జరగాలి/కావాలి అని గట్టిగా కోరుకున్నప్పుడు, అది ‘సంకల్పము’ అవుతుంది. ఈ విధంగా, ఆలోచనలు, అవి అనుకూలమైనవో లేదా ప్రతికూలమైనవో అన్నదాన్ని బట్టి, సంకల్పముగా (ఆయా వస్తు విషయాల కోసం పాటు పడటం) మరియు వికల్పములగా (వాటిని ద్వేషించటం) మారతాయి. ఈ సంకల్ప వికల్ప బీజములు, కోరికలనే మొక్కగా మారతాయి, ‘ఇలా అవ్వాలి. ఇలా అవ్వకూడదు’ అని. కెమెరా ఫిల్ము పై కాంతి పడ్డప్పుడు అయినట్టు, ఈ రెండూ సంకల్ప వికల్పములు మనస్సు పై తక్షణమే వాటి ముద్ర వేస్తాయి. ఈ విధంగా అవి నేరుగా భగవంతునిపై ధ్యానానికి అవరోధం కలిగిస్తాయి. వాటికి ఆకస్మికంగా ఎగిసిపడే స్వభావం కూడా ఉంటుంది, ఈనాటి చిన్న కోరికే కాలక్రమంలో మహా జ్వాలగా పరిణమించే అవకాశం ఉంది. ఈ విధంగా, ధ్యానంలో విజయం/సాఫల్యత పొందాలనే అభిలాష ఉంటే భౌతిక వస్తు-విషయముల పట్ల ఆసక్తి విడిచిపెట్టాలి. ధ్యానం యొక్క మొదటి భాగం – ప్రాపంచికత నుండి మనస్సుని తీసివేయమని - వివరించిన శ్రీ కృష్ణుడు, ఇక రెండవ భాగం గురించి వివరిస్తున్నాడు. మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయాలి. ఇది దానంతట అదే అయిపోదు, ధృడ సంకల్పముతో శ్రమిస్తే, విజయం నెమ్మదిగా చేకూరుతుంది, అని అంటున్నాడు. వేద శాస్త్రాలకు అనుగుణంగా ఉన్న ధృడ సంకల్పాన్ని ‘ధృతి’ అంటారు. ఈ దృఢ సంకల్పము, బుద్ధి యొక్క గట్టి విశ్వాసం ద్వారా వస్తుంది. చాలా మంది ప్రజలు, ఆత్మతత్త్వం గురించి, ప్రాపంచిక పరుగుల నిరర్థకత్వము గురించి వేదశాస్త్రాల పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కానీ, వారి దైనందిన జీవితం వారి జ్ఞానానికి అనుగుణంగా ఉండదు, అంతేకాక పాపిష్ఠి పనులు, లైంగిక వాంఛలు, మరియు మత్తుపదార్థాల సేవనం లాంటి పనులు చేస్తుంటారు. ఇది ఎందుకంటే వారి బుద్ధి, ఈ శాస్త్ర విషయాల మీద నమ్మకం/విశ్వాసం కలిగి ఉండదు. ఈ ప్రపంచం యొక్క అశాశ్వతత్వం మరియు భగవంతునితో తనకు ఉన్న శాశ్వత సంబధముల మీద బుద్ధి దృఢవిశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఈ విచక్షణా శక్తి వస్తుంది. ఈ విధంగా బుద్ధిని ఉపయోగించుకుని క్రమక్రమంగా ఇంద్రియ భోగములను త్యజించాలి. దీనినే ప్రత్యాహారము అంటారు, అంటే ఇంద్రియ వస్తు-విషయముల వైపు మనస్సు పరుగు తీయటాన్ని నిగ్రహించటం. ప్రత్యాహరములో సాఫల్యం తక్షణమే రాదు. అది పదే పదే అభ్యాసం చేయటం ద్వారా క్రమక్రమంగా సాధించబడుతుంది. శ్రీ కృష్ణుడు తదుపరి ఈ అభ్యాసం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు.
యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ । తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ।। 26 ।।
26
6
https://www.holy-bhagava…udio/006_026.mp3
యతః యతః — ఎప్పుడెప్పుడైతే, ఎక్కడెక్కడికైతే; నిశ్చరతి — సంచరించునో; మనః — మనస్సు; చంచలం — చంచలమైన; అస్థిరం — నిలకడ లేని; తతః తతః — అక్కడ నుండి; నియమ్య — నిగ్రహింపబడి; ఏతత్ — ఇది; ఆత్మని — భగవంతునిపై; ఏవ — తప్పకుండా; వశం — వశములోనికి; నయేత్ — తీస్కురావలెను.
BG 6.26: ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి.
ధ్యానంలో విజయం ఒక్క రోజులో రాదు; పరిపూర్ణ సిద్ధి పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది. భగవంతునిపై మనస్సు కేంద్రీకరించాలని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, మనకు చాలా సార్లు తెలిసేదేమిటంటే, మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో భ్రమించిపోతుంది. దీన్ని ఎదుర్కోవటానికి, ధ్యాన ప్రక్రియలో ఉన్న మూడు అంచెలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది:- బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం ఈ ప్రపంచం మన లక్ష్యం కాదు అని నిర్ణయించుకోవాలి. కాబట్టి, మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. దీనికి పరిశ్రమ అవసరం.- మరల, బుద్ధి యొక్క విచక్షణా శక్తిచే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని, మరియు భగవంతుడిని పొందటమే మన లక్ష్యంగా చేసుకోవాలి. కాబట్టి, మనస్సుని తిరిగి తెచ్చి భగవంతునిపైనే కేంద్రీకరించాలి. దీనికి కూడా పరిశ్రమ అవసరం.- మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది. దీనికి శ్రమ అవసరం లేదు, దానికదే అనాయాసముగా అయిపోతుంది.       ఎప్పుడైతే ఈ మూడవది దానికదే అయిపోతుందో, సాధకులు తరచుగా నిరాశ పడతారు, ‘భగవంతుని పై మనస్సు కేంద్రీకరించటానికి నేను చాలా ప్రయత్నించాను కానీ మనస్సు తిరిగి ఈ ప్రపంచంలోకి వెళ్లి పోయింది.’ అని. శ్రీ కృష్ణుడు మనలను ఇలా నిరాశ పడవద్దు అంటున్నాడు. మనస్సు బహు చంచలమైనది, మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే, తన ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుంది. కానీ, అది చంచలమైపోయినప్పుడు, తిరిగి మరోసారి, 1వ, 2వ ఉపాయం అవలంబించాలి – మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసివేయాలి మరియు తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి. మరల 3వ పని దానికదే అయిపోతుంది, అని మనకు అనుభవంలోకివస్తుంది. మనం నిరాశ చెందకుండా, మరల 1వ, 2వ ఉపాయాలు ఉపయోగించుకోవాలి.ఈ సాధనని మరల మరల చేయాలి. అప్పుడు క్రమక్రమంగా భగవంతుని పట్ల, మనస్సు యొక్క మమకారాసక్తి పెరగటం మొదలవుతుంది. అదే సమయంలో, ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. ఇది జరిగే క్రమంలో, ధ్యానం చేయటం ఇంకా ఇంకా సులువుగా అవుతుంది. కానీ, ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణ లోనికి తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి.
ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ । ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ।। 27 ।।
27
6
https://www.holy-bhagava…udio/006_027.mp3
ప్రశాంత — ప్రశాంతమైన; మనసం — మనస్సు; హి — వాస్తవముగా; ఏనం — ఇది; యోగినం — యోగి; సుఖం ఉత్తమమ్ — అత్యున్నతమైన ఆనందము; ఉపైతి — పొందును; శాంత-రజసం — ఎవరి వ్యాకులతలు/ఉద్రేకాలు తగ్గిపోయినవో; బ్రహ్మ-భూతమ్ — భగవత్ ప్రాప్తి నొంది; అకల్మషమ్ — పాప రహితుడై.
BG 6.27: మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ-ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు, మరియు అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు – అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది.
మనస్సుని ఇంద్రియ విషయముల నుండి ఉపసంహారం చేసి, భగవంతుని యందే స్థితం చేయటానికి అభ్యాసం చేయటాన్ని సాధించిన యోగికి ఆవేశ-ఉద్వేగాలు శాంతిస్తాయి మరియు మనస్సు పరమ శాంతిని పొందుతుంది. ఇంతకు ముందు, భగవంతుని యందు నిలపటానికి పరిశ్రమించవలసి వచ్చేది, కానీ ఇప్పుడు సహజంగానే ఆయన వద్దకు పరుగు తీస్తుంది. ఈ స్థితిలో, ఉన్నతమైన ధ్యానపరుడు అన్నింటినీ భగవత్ సంబంధముగా చూస్తాడు. నారద మహర్షి ఇలా పేర్కొన్నాడు:తత్ ప్రాప్ర్య తద్ ఏవావలోకయతి తద్ ఏవ శృణోతితద్ ఏవ భాషయతి తద్ ఏవ చింతయతి(నారద భక్తి దర్శన్, 55వ సూత్రము)‘ఎల్లప్పుడూ భగవంతుని యందే ప్రేమతో మనస్సుని ఏకం చేసిన భక్తుని అంతఃకరణ ఆయన యందే నిమగ్నమైఉంటుంది. అటువంటి భక్తుడు ఎల్లప్పుడూ ఆయననే చూస్తుంటాడు, ఆయన గురించే మాట్లాడుతాడు మరియు ఆలోచిస్తుంటాడు.’ ఎప్పుడైతే మనస్సు ఈ విధంగా భగవంతుని యందే నిమగ్నమవుతుందో, ఆత్మ తనలో కూర్చుని ఉన్న భగవంతుని అనంతమైన ఆనందాన్ని రుచి చూడటం ప్రారంభిస్తుంది.సాధకులు తరచుగా అడుగుతుంటారు, తాము ఎంత పురోగమిస్తున్నామో ఎలా తెలుసు కోవాలి అని. దీనికి సమాధానం ఈ శ్లోకం లోనే నిక్షిప్తమై ఉంది. మన అంతర్గత అలౌకిక ఆనందం పెరుగుతూ ఉన్నప్పుడు, అది, మన మనస్సు నియంత్రించబడుతుండటానికి మరియు మన అంతఃకరణ ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నదనుకోవటానికి ఒక నిదర్శనం. ఇక్కడ, మనము 'శాంత-రాజసం' (free from passion) మరియు 'అకల్మశం' (పాప రహితం) అయినప్పుడు మనము 'బ్రహ్మ-భూతం' (భగవత్ ప్రాప్తి) పొందుతాము అని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఆ స్థితిలో, మనము ‘సుఖం ఉత్తమం’ (అత్యున్నత ఆనందము) ను అనుభవిస్తాము.
యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః । సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే ।। 28 ।।
28
6
https://www.holy-bhagava…udio/006_028.mp3
యుంజన్ — ఏకమై (ఆత్మ భగవంతునితో); ఏవం — ఈ విధంగా; సదా — ఎల్లప్పుడూ; ఆత్మానాం — ఆత్మ; యోగీ — ఓ యోగి; విగత — మిముక్తి నొంది; కల్మషః — పాపములు; సుఖేన — సునాయాసముగా; బ్రహ్మ-సంస్పర్శమ్ — నిత్యము పరమాత్మతో ఉండి; అత్యంతం — అత్యున్నతమైన; సుఖమ్ — ఆనందము; అశ్నుతే — పొందును.
BG 6.28: స్వీయ-నిగ్రహం కలిగిన యోగి, ఆత్మను భగవంతునితో ఏకం చేసి, భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు, మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే, సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు.
ఆనందము అనేదాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు:సాత్త్వికం సుఖమాత్మోత్థం విషయోత్థం తు రాజసంతామసం మోహదైన్యోత్థం నిర్గుణం మదపాశ్రయాం(భాగవతం 11.25.29)తామసిక ఆనందం : మాదకద్రవ్యాలు, మద్యము, ధూమపానము, మాంసాహారము, హింస, నిద్ర, మొదలైన వాటి నుండి వచ్చే ఆనందం, ఇది.రాజసిక ఆనందం : మనస్సు మరియు ఐదు ఇంద్రియముల తృప్తి నుండి వచ్చే ఆనందం, ఇది.సాత్త్విక ఆనందం : కరుణ, క్షమ, ఇతరులకు సేవ, జ్ఞాన సముపార్జన, మరియు మనోనిగ్రహము వంటి సద్గుణములు ఆచరించటంతో వచ్చే ఆనందం, ఇది. జ్ఞానులు తమ మనస్సుని ఆత్మ యందే నిమగ్నం చేసినప్పుడు అనుభవించే ఆత్మ సాక్షాత్కార ఆనందం ఈ కోవకు చెందినదే.నిర్గుణ ఆనందం : ఇది భగవంతుని దివ్య ఆనందము, ఇది పరిమాణంలో అనంతమైనది. ప్రాపంచిక భౌతిక మాలిన్యం నుండి స్వేచ్ఛ పొంది మరియు భగవంతునితో ఏకమైన యోగి, సంపూర్ణ ఆనందం యొక్క ఈ అత్యున్నత స్థాయిని పొందుతాడు అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. దీనినే ఆయన అనంతమైన ఆనందము అని 5.21వ శ్లోకంలో మరియు సర్వోత్కృష్ట ఆనందము అని 6.21వ శ్లోకంలో అన్నాడు.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని । ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ।। 29 ।।
29
6
https://www.holy-bhagava…udio/006_029.mp3
సర్వ-భూత-స్థం — సర్వ భూతముల యందు స్థితుడై ఉండి; ఆత్మానం — పరమాత్మ; సర్వ — సమస్త; భూతాని — ప్రాణులు; చ — మరియు; ఆత్మని — భగవంతుని యందు; ఈక్షతే — దర్శించును; యోగ-యుక్త-ఆత్మా — అంతఃకరణలో భగవంతుని తోనే ఏకమై; సర్వత్ర — అన్ని చోట్లా; సమ-దర్శనః — సమత్వ దృష్టి.
BG 6.29: నిజమైన యోగులు, అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి, సమత్వ దృష్టితో సర్వ భూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వ భూతములయందు దర్శిస్తారు.
భారతదేశంలో, దీపావళి పండుగ సమయంలో, పంచదార బిళ్ళలను వేర్వేరు రూపాల్లో తయారుచేసి దుకాణాల్లో అమ్ముతారు - కార్లు, విమానాలు, అబ్బాయిలు, అమ్మాయిలు, జంతువులు, బంతులు, మరియు టోపీలు - మొదలైన ఆకృతులలో. పిల్లలు తమ తల్లిదండ్రులతో కారు కావాలని, ఏనుగు కావాలని, మారాము చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల అమాయకత్వానికి నవ్వుకుంటారు, వారికి తెలుసు, అవన్నీ ఒకే పంచదార నుండి తయారయ్యాయని, అవన్నీ ఒకే రకం తీపిగా ఉంటాయని.అదే రీతిగా, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో, తన వేర్వేరు శక్తుల రూపంలో ఉన్నది స్వయంగా భగవంతుడే.ఏక దేశస్థితస్యాగ్నిర్జ్యోత్స్నా విస్తారిణీ యథాపరస్య బ్రహ్మణః శక్తిస్తథేదమఖిలం జగత్ (నారద పంచరాత్రం)‘ఎలాగైతే సూర్యుడు ఒకేచోట ఉండి, తన వెలుగుని అన్ని దిక్కులా ప్రసరిస్తాడో, అదే విధంగా, భగవంతుడు తన ఎన్నో శక్తుల ద్వారా సృష్టిలో అన్నిటియందు నిండి నిబిడీకృతమై వాటిని నిలిపి నిర్వహిస్తుంటాడు.’ పరిపూర్ణత సాధించిన యోగులు, అంతర్గతంగా విచ్చుకున్న విజ్ఞాన ప్రకాశంలో, ప్రతిదాన్నీ భగవత్ సంబంధముగా చూస్తారు.
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి । తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ।। 30 ।।
30
6
https://www.holy-bhagava…udio/006_030.mp3
యః — ఎవరైతే; మాం — నన్ను; పశ్యతి — చూచేదరో; సర్వత్ర — అంతటా; సర్వం — సర్వమూ; చ — మరియు; మయి — నా యందు; పశ్యతి — చూచేదరో; తస్య — అతనికి; అహం — నేను; న ప్రణశ్యామి — దూరమవను; సః — ఆ వ్యక్తి; చ — మరియు; మే — నాకు; న ప్రణశ్యతి — దూరమవడు.
BG 6.30: ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు.
భగవంతుడిని వీడటం అంటే మనస్సుని అయన నుండి దూరంగా తిరగనీయటం, మరియు ఆయనతో ఉండటం అంటే మనస్సుని ఆయనతో ఏకం చేయటం. మనస్సుని భగవంతునితో ఏకం చేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే ప్రతి విషయాన్ని ఆయన సంబంధంగా చూడటమే. ఉదాహరణకి, మనల్ని ఎవరైనా బాధపెట్టారు అనుకుందాం. మనస్సు యొక్క స్వభావం ఏమిటంటే, మనకు హాని చేసిన వారి పట్ల, అది, ద్వేషము, కోపము వంటి వాటిని పెంచుకుంటుంది. కానీ, అలా కానిస్తే, మన మనస్సు భగవత్ స్పృహ నుండి బయటకు రావటంతో, భగవంతునితో మన మనస్సు యొక్క భక్తి యుక్త సంయోగం ఆగిపోతుంది. దానికి బదులుగా, ఆ వ్యక్తిలోనే కూర్చొని ఉన్న పరమాత్మను దర్శిస్తే, మనం ఇలా అనుకుంటాము, ‘భగవంతుడు నన్ను ఈ వ్యక్తి ద్వారా పరీక్షిస్తున్నాడు, ఆయన నా సహన శీలతను పెంచుకోమని ఉపదేశిస్తున్నాడు, అందుకే ఆ వ్యక్తిని నాతో కఠినంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్నాడు. కానీ, నేను ఈ సంఘటన నన్ను కలచివేయకుండా చూసుకుంటాను.’ ఈ విధంగా ఆలోచిస్తే, మన మనస్సుని ప్రతికూల/నకారాత్మక ఆలోచనలు బాధించకుండా కాపాడుకోవచ్చు.అదే విధంగా, మిత్రునితో కానీ లేదా బంధువుతో కానీ అనుబంధం ఏర్పడినప్పుడు, మనస్సు భగవంతుని నుండి దూరమైపోతుంది. ఇప్పుడు, మనం మనస్సుకు ఆ మనిషిలో భగవంతుడిని దర్శించే శిక్షణ ఇస్తే, ప్రతిసారీ మనస్సు వారి మీదకు పోయినప్పుడు, మనం ఇలా అనుకుంటాము, ‘శ్రీ కృష్ణుడు ఈ వ్యక్తిలో ఉన్నాడు, అందుకే నేను వారి పట్ల ఆకర్షితుడను అవుతున్నాను’ అని. ఈ ప్రకారంగా, మనస్సు పరమాత్మ పట్ల భక్తిభావనలు నిలుపుకోవటం కొనసాగిస్తూనే ఉంటుంది.కొన్నిసార్లు, మనస్సు పాత విషయాలపై చింతిస్తూ (శోకిస్తూ) ఉంటుంది. ఇది కూడా మనస్సుని భగవత్ సన్నిధి నుండి వేరు చేస్తుంది, ఎందుకంటే ఈ శోకము మనస్సుని భూతకాలము లోనికి తీస్కువెళ్ళటం వలన వర్తమాన కాలంలో చేయవలసిన హరి, గురు చింతన ఆగిపోతుంది. ఇప్పుడు, ఆయా సంఘటనని భగవత్ సంబంధముగా చూసినప్పుడు, మనము ఇలా అనుకుంటాము, ‘భగవంతుడు, కావాలనే, నా కోసం, నేను వైరాగ్యం పెంపొందిచుకోవాలని, కష్టాన్ని లోకంలో ఏర్పాటు చేసాడు, ఆయనకు నా సంక్షేమం మీద ఎంత ఆసక్తి అంటే, తన కృపచేత నా ఆధ్యాత్మిక పురోగతి కోసం సరైన పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు.’ ఈ విధంగా ఆలోచించటం వల్ల మనం భక్తి యుక్త ధ్యాసను కాపాడుకోవచ్చును. నారద మహర్షి ఇలా అంటున్నాడు:లోక హానౌ చింతా న కార్యా నివేదితాత్మ లోక వేదత్వాత్(నారద భక్తి దర్శన్, 61వ సూత్రం)‘లోకంలో ప్రతికూలత/వ్యతిరేక పరిస్థితి ఎదురైనప్పుడు, దాని గూర్చి శోకించకు, చింతించకు. దానిలో భగవత్ అనుగ్రహాన్ని గుర్తించుము.’ మన స్వార్థ ప్రయోజనం ఎందులో ఉందంటే, ఎదో రకంగా మనస్సుని భగవంతుని యందే నిలపటం లోనే, మరియు దీనికి ఒక సులువైన ఉపాయం ఏమిటంటే ప్రతిదానిలో, ప్రతివ్యక్తిలో భగవంతున్ని చూడటమే. ఇది అభ్యాస స్థాయి, ఇది, ఈ శ్లోకంలో చెప్పబడిన పరిపూర్ణ స్థాయి దిశగా నెమ్మదిగా తీసుకువెళుతుంది, ఇక అప్పుడు మనం భగవంతుడికి దూరంకాము, మరియు భగవంతుడు మనకు దూరం కాడు.
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః । సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ।। 31 ।।
31
6
https://www.holy-bhagava…udio/006_031.mp3
సర్వ-భూత-స్థితం — అన్ని ప్రాణుల యందు స్థితుడనై ఉన్న; యః — ఎవరైతే; మాం — నన్ను; భజతి — ఆరాధించునో; ఏకత్వం — ఏకమై ఉండి; ఆస్థితః — స్థితుడై; సర్వథా — అన్ని రకాలలో; వర్త-మానః — ఉండినా; అపి — కూడా; సః — అతను; యోగీ — ఒక యోగి; మయి — నాయందే; వర్తతే — నివసించును.
BG 6.31: నా యందే ఏకత్వంలో స్థితుడై ఉండి, మరియు నన్నే సర్వ భూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి, అన్ని రకాల కార్య కలాపములు చేస్తునే ఉన్నా, నా యందే నివసించును.
భగవంతుడు ఈ జగత్తులో సర్వ వ్యాపి. ఆయన సర్వభూతముల హృదయములలో పరమాత్మ రూపంలో కూర్చుని ఉన్నాడు. 18.61వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొంటున్నాడు: ‘నేను సమస్త ప్రాణుల హృదయములలో కూర్చుని ఉన్నాను.’ ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాణి శరీరంలో, రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి - ఆత్మ మరియు పరమాత్మ.వ్యక్తుల ఆధ్యాత్మిక పరిణితి బట్టి ఇది ప్రధానంగా నాలుగు స్థాయిల దృష్టికోణానికి దారితీస్తుంది1. భౌతిక దృక్పథంతో ఉన్నవారు, ప్రతి వారినీ శరీరముగా చూస్తారు, మరియు జాతి, కులము, లింగము, వయస్సు, సామాజిక స్థాయి, దేశపౌరసత్వం వంటి వాటి ఆధారంగా భిన్నముగా చూస్తారు.2. అంతకన్నా ఉన్నతమైన దృక్పథం కలవారు, ప్రతి వారినీ ఆత్మగా చూస్తారు, అందుకే 5.18వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొన్నాడు: ‘దివ్య జ్ఞాన చక్షువులుకల నిజమైన పండితులు - ఒక బ్రాహ్మణుడిని, ఒక ఆవుని, ఒక ఏనుగుని, ఒక కుక్కని, మరియు ఒక చండాలుడిని అందరినీ ఒకే దృష్టితో చూస్తారు’3. ఉన్నతమైన యోగులు, ఇంకా పై స్థాయిలో ఉన్న దృక్పథంతో, అందరిలో పరమాత్మగా స్థితుడై ఉన్న భగవంతుడినే చూస్తారు. వారు కూడా భౌతిక జగత్తుని గ్రహిస్తారు, కానీ దాని పట్ల ఉదాసీనంగా ఉంటారు. వారు హంస లాంటి వారు, అవి పాలు-నీరు మిశ్రమంలో, పాలనే తీసుకుని, నీటిని విడిచి పెడతాయి.4. అత్యునత స్థాయి యోగులని 'పరమహంస' లు అంటారు. వారు భగవంతుడినే దర్శిస్తారు, వారికి ఈ ప్రపంచం స్పృహ ఉండదు. భాగవతంలో చెప్పబడిన విధంగా వేదవ్యాస తనయుడైన శుకదేవుని విజ్ఞాన స్థాయి ఇదే.యం ప్రవ్రజంతమనుపేతమ్ అపేత కృత్యం,ద్వైపాయనో విరహ-కాతర ఆజుహావపుత్రేతి, తన్-మయతయా తరవో ఽభినేదుస్తం సర్వ-భూత-హృదయం మునిమానతోఽస్మి (1.2.2)చిన్నతనంలోనే తన ఇంటి నుండి వెళ్ళిపోతూ, శుకదేవుడు సన్యాసాశ్రమము స్వీకరించినప్పుడు, ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడంటే ఆయనకు ఈ ప్రపంచంపు స్పృహే లేదు. ఆయన అటుగా వెళ్తూ, కొలనులో నగ్నంగా స్నానం చేస్తున్న అందమైన యువతులను గమనించనేలేదు. ఆయన చూసినది అంతా భగవంతుడినే; ఆయన విన్నది అంతా భగవంతుడినే; ఆయన తలచినది అంతా భగవంతుడినే, అని ఈ శ్లోకం పేర్కొంటున్నది.ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, పైన పేర్కొనబడిన స్థాయిల్లో, మూడవ, నాలుగవ స్థాయిలో ఉన్న పరిపూర్ణ సిద్ది సాధించిన యోగుల గురించి మాట్లాడుతున్నాడు.
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున । సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ।। 32 ।।
32
6
https://www.holy-bhagava…udio/006_032.mp3
ఆత్మ-ఔపమ్యేన — తన లాగానే; సర్వత్ర — అంతటా; సమం — సమానముగా; పశ్యతి — చూచుట; యః — ఎవరైతే; అర్జున — అర్జునా; సుఖం — సుఖములు; వా — లేదా; యది — ఒకవేళ; వా — లేదా; దుఃఖం — దుఃఖములు; సః — అటువంటి; యోగీ — ఓ యోగి; పరమః — అత్యున్నతమైన; మతః — పరిగణించబడును.
BG 6.32: సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ, మరియు ఇతరుల సుఖాలకు, దుఃఖాలకు, అవి తనకే అయినట్టు స్పందించేవారిని, పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను.
మన శరీర అవయవాలన్నీ మనవే అనుకుంటాము మరియు వాటిలో ఏ ఒక్కటి పాడయినా సమానంగా విచారిస్తాము. మన అంగములలో ఏ ఒక్కదానికి హాని జరిగినా అది మనకు హాని జరిగినట్టే అన్న ధృడ విశ్వాసం కలిగి ఉంటాము. అదే విధంగా, అన్ని ప్రాణులలో భగవంతుడిని దర్శించే వారు, ఇతరుల సుఖ-దుఃఖాలను కూడా తమవాటిగానే భావిస్తారు. కాబట్టి, అటువంటి యోగులు, ఎల్లప్పుడూ సమస్త జీవాత్మల శ్రేయోభిలాశులే మరియు వారు జీవుల శాశ్వత సంక్షేమం కోసం పాటు పడుతారు. ఇదే పరిపూర్ణ యోగుల సమ-దర్శనము. (సమానమైన దృష్టి)
అర్జున ఉవాచ । యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన । ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ।। 33 ।।
33
6
https://www.holy-bhagava…udio/006_033.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; యః — ఏదైతే; అయం — ఈ యొక్క; యోగః — యోగ విధానము; త్వయా — నీ చేత; ప్రోక్తః — చెప్పబడెనో ; సామ్యేన — సమత్వము చే; మధు-సూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడిని సంహరించిన వాడా; ఏతస్య — ఈ యొక్క; అహం — నేను; న పశ్యామి — చూడలేకున్నాను; చంచలత్వాత్ — చంచలమైనది కావున; స్థితిం — పరిస్థితి; స్థిరామ్ — నిలకడగా.
BG 6.33: అర్జునుడు పలికెను: ఓ మధుసూదనా, నీవు చెప్పిన ఈ యోగ విధానము, ఈ చంచలమైన మనస్సు వలన, నాకు ఆచరింపశక్యముకానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది.
అర్జునుడు ఈ శ్లోకాన్ని 'యోఽయం' , అంటే ‘ఈ యోగ విధానము’, అంటే 6.10వ శ్లోకం నుండి చెప్పిన పద్దతిని సూచిస్తూ, మాట్లాడుతున్నాడు. యోగములో పరిపూర్ణసిద్ధి కొరకు మనము తప్పకుండా ఈ క్రిందివి ఖచ్చితంగా చేయాలని శ్రీ కృష్ణుడు చెప్పి ఉన్నాడు:– ఇంద్రియములను నిగ్రహించుము– అన్ని కోరికలను త్యజించుము– మనస్సుని భగవంతుని పైనే నిమగ్నం చేయుము– ఆయననే అచంచలమైన మనస్సుతో స్మరించుము– అందరినీ సమ దృష్టితో చూడుముఅర్జునుడు, తాను విన్న దాని గురించి నిర్మొహమాటముగా, అది ఆచరింపశక్యము కాదేమో అని, తన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ పైన చెప్పినవేవీ మనస్సుని నియంత్రించకుండా సాధ్యము కావు. మనస్సు చంచలముగా ఉంటే, ఈ యోగ విషయాలన్నీ కూడా అసాధ్యమే అవుతాయి.
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ । తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ।। 34 ।।
34
6
https://www.holy-bhagava…udio/006_034.mp3
చంచలం — చంచలమైనది; హి — ఖచ్చితముగా; మనః — మనస్సు; కృష్ణ — శ్రీ కృష్ణ; ప్రమాథి — అల్లకల్లోలమైన; బలవత్ — బలవంతమైన; దృఢం — మూర్ఖపు పట్టుగలది; తస్య — దానిని; అహం — నేను; నిగ్రహం — నిగ్రహించుట; మన్యే — అనుకుంటాను; వాయోః — గాలిని; ఇవ — లాగా; సు-దుష్కరం — కష్టతరమైనది.
BG 6.34: ఓ కృష్ణా, ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది, మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది.
చికాకు పెట్టే మనస్సు గురించి వివరించేటప్పుడు అర్జునుడు మన అందరి తరఫున మాట్లాడుతున్నాడు. అది చంచలమైనది ఎందుకంటే అది ఒక విషయం నుండి మరో విషయానికి ఎన్నో దిశలలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. అది అల్లకల్లోలమైనది ఎందుకంటే, ద్వేషము, కోపము, కామము, లోభం, ఈర్ష, ఆందోళన, భయం, మమకారాసక్తి వంటి వాటితో ఒక వ్యక్తి అంతఃకరణలో ఉపద్రవాలు సృష్టిస్తుంది. అది బలమైనది ఎందుకంటే, తన శక్తివంతమైన అలలచే బుద్ధిని వశపరుచుకుని విచక్షణా శక్తిని నాశనం చేస్తుంది. మనస్సు అనేది మొండిది/మూర్ఖమైనది కూడా, ఎందుకంటే, బుద్దికే వ్యాకులత కలిగేటట్టు, అది ఒకసారి హానికర ఆలోచనను పట్టుకుంటే, దానిని వదిలి వేయటానికి ఒప్పుకోదు, దానినే పదే పదే చింతన చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా దాని యొక్క హానికరమైన లక్షణాలను వివరిస్తూ, అర్జునుడు, మనస్సును నిగ్రహించటం అనేది వీచేగాలిని నిగ్రహించటం కన్నా కష్టమైనది అని ప్రకటిస్తున్నాడు. ఇది ఒక బలమైన ఉపమానం ఎందుకంటే ఎవరూ కూడా ఆకాశంలోని బ్రహ్మాండమైన గాలిని నిగ్రహించటాన్ని ఊహించలేరు. ఈ శ్లోకంలో అర్జునుడు భగవంతుణ్ణి కృష్ణా అని సంబోధించాడు. 'కృష్ణ' అన్న పదానికి అర్థం: కర్షతి యోగినాం పరమహంసానాం చేతాంసి ఇతి కృష్ణః’ - ‘దృఢ చిత్తముగల యోగుల, పరమహంసల మనస్సులను కూడా బలవంతంగానైనా ఆకర్షించే వాడే కృష్ణుడు అంటే.’ అర్జునుడు ఈ విధంగా తన చంచలమైన, అల్లకల్లోలమైన, బలమైన మరియు మూర్ఖపు పట్టుగల మనస్సును కూడా, శ్రీ కృష్ణ పరమాత్మ ఆకర్షించాలని సూచిస్తున్నాడు.
శ్రీ భగవానువాచ । అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ । అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 35 ।।
35
6
https://www.holy-bhagava…udio/006_035.mp3
శ్రీ భగవాన్ ఉవాచ — శ్రీ కృష్ణ పరమాత్మ పలికెను; అసంశయం — నిస్సందేహముగా; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; మనః — మనస్సు; దుర్నిగ్రహం — నిగ్రహించుటకు కష్టమైనది; చలం — చంచలమైనది; అభ్యాసేన — అభ్యాసం చేత; తు — కానీ; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; వైరాగ్యేణ — వైరాగ్యముచే; చ — మరియు; గృహ్యతే — నియంత్రించవచ్చు.
BG 6.35: శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.
శ్రీ కృష్ణుడు అర్జునుడి మాటలకు జవాబు చెప్తూ, అతన్ని 'మహాబాహో' అంటే ‘గొప్ప బాహువులు కలవాడా.’ అని అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే, ‘ఓ అర్జునా, నీవు యుద్ధములో అత్యంత సాహాసోపేత వీరులను ఓడగోట్టావు, ఈ మనస్సుని ఓడించలేవా?’ అని.శ్రీ కృష్ణుడు, ఇలా, ‘అర్జునా, ఏంటి అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మనస్సుని సునాయాసముగా నియంత్రించవచ్చు.’ అని చెప్పి ఈ సమస్యను ఖండించలేదు. పైగా, నియంత్రించటానికి మనస్సు నిజంగా క్లిష్టతరమైనది అన్న అర్జునుడి మాటలతో ఏకీభవించాడు. కానీ, ప్రపంచంలో కష్టతరమైన పనులు ఎన్నో ఉన్నాయి, అయినా మనం అధైర్య పడకుండా ముందుకు సాగుతాము. ఉదాహరణకి, సముద్రం ప్రమాదకరమైనది మరియు భయంకర తుఫానులు వచ్చే అవకాశం ఉంటుంది అని నావికులకు తెలుసు. అయినా, ఒడ్డునే ఉండిపోయేలా చేయటానికి ఈ కారణాలు వారికి తగినట్టు ఎప్పుడూ అనిపించలేదు. కాబట్టి, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి, వైరాగ్యము మరియు అభ్యాసము ద్వారా మనస్సుని నియంత్రించవచ్చు అని హామీ ఇస్తున్నాడు.వైరాగ్యము అంటే ఆంగ్లములో డిటాచ్మెంట్ (detachment). అనంతమైన పూర్వ జన్మల నుండీ ఉన్న మమకారాసక్తుల చేత, మనస్సుకు, తనకు అనురక్తి ఉన్న వస్తువిషయముల దిశలో పరుగులు పెట్టడం అలవాటైపోయింది. ఈ మమకార-ఆసక్తిని తీసివేయటం అనేది మనస్సు యొక్క అనవసరమైన పరిభ్రమణాన్ని నిర్మూలిస్తుంది.అభ్యాసము అంటే ఆంగ్లములో ప్రాక్టీసు (practice). అంటే, పాత అలవాట్లను మార్చి, కొత్త వాటిని పెంపొందించుకునే ఏకాగ్రతతో కూడిన పరిశ్రమ. అభ్యాసము అనేది సాధకులకు ఒక ముఖ్యమైన పదం. సమస్త మానవ పరిశ్రమలలో, నైపుణ్యానికి, ప్రావీణ్యతకి, శ్రేష్ఠతకి దారితీసే ప్రముఖ విషయం ఈ అభ్యాసమే. ఉదాహరణకి ఒక అతి సామాన్య విషయమైన టైపింగ్ తీసుకోండి. మొదటి సారి టైపింగ్ ప్రారంభిస్తున్నప్పుడు, ఒక నిమిషానికి ఒక పదమే టైపు చేయగలుగుతారు. కానీ, ఒక సంవత్సరం టైపు చేసిన తరువాత, వారి చేతివేళ్లు సునాయాసంగా తిప్పుతూ నిమిషానికి ఎనభై పదాలు టైపు చేయగలుగుతారు. ఈ నైపుణ్యం కేవలం అభ్యాసం ద్వారానే సాధ్యము. ఇదే విధంగా, మూర్ఖమైన మరియు అల్లకల్లోలమైన మనస్సుని అభ్యాసము ద్వారా ఆ భగవంతుని చరణారవిందముల పైనే నిలుపాలి. మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీయాలి - ఇదే వైరాగ్యము - మరియు - మనస్సుని భగవంతుని మీదే నిలుపాలి - ఇది అభ్యాసము. పతంజలి మహర్షి ఇదే ఉపదేశం చెప్పాడు:అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః (యోగ దర్శనం 1.12)‘నిరంతర అభ్యాసము, వైరాగ్యముల ద్వారా మనస్సు యొక్క ఆందోళనలను నియంత్రించవచ్చు.’
అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః । వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః ।। 36 ।।
36
6
https://www.holy-bhagava…udio/006_036.mp3
అసంయత-ఆత్మనా — మనస్సు అదుపులో లేనివానికి; యోగః — యోగము; దుష్ప్రాపః — కష్టతరమైనది; ఇతి — ఈ విధంగా; మే — నా యొక్క; మతిః — అభిప్రాయము; వశ్య-ఆత్మనా — మనస్సు నియంత్రణలో ఉన్నవానికి; తు — కానీ; యతతా — గట్టిగా ప్రయత్నించే వాడు; శక్యః — సాధ్యమే; అవాప్తుం — సాధించటానికి; ఉపాయతః — సరియైన పద్దతి ద్వారా.
BG 6.36: మనస్సు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది. కానీ, మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు, మరియు సరియైన పద్దతిలో పరిశ్రమ చేసేవారు, యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము.
శ్రీ కృష్ణ పరమాత్మ ఇప్పుడు మనోనిగ్రహానికి మరియు యోగంలో సాఫల్యానికి ఉన్న సంబంధాన్ని తెలియచెప్తున్నాడు. అభ్యాసము మరియు వైరాగ్యముల ద్వారా మనస్సుకి కళ్ళెం వేయటం నేర్చుకోనివారు యోగాభ్యాసములో చాలా కష్టాలని ఎదుర్కుంటారు, అని అంటున్నాడు. కానీ, మనస్సుని నిరంతర ప్రయత్నం ద్వారా తమ నియంత్రణలోకి తెచ్చుకున్న వారు సరియైన పద్దతిని అవలంబించటం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. ఈ నిర్దుష్ట పద్దతి 6.10వ శ్లోకం నుండి 6.32వ శ్లోకం వరకు ఆయనచే విశదీకరించబడింది. ఇంద్రియములను నిగ్రహించటం, కోరికలను త్యజించటం, మనస్సుని భగవంతునిపైన మాత్రమే కేంద్రీకరించటం, అచంచలమైన మనస్సుతో ఆయన గురించే తలంచటం, మరియు అందరినీ సమదృష్టి తో చూడటం అనే విషయములతో 6.33వ శ్లోకంలో ఇది సంక్షిప్తముగా చెప్పబడింది. ఈ ఉపదేశం, మనస్సుని అదుపు చేయలేని సాధకుని గురించి ఒక సందేహాన్ని అర్జునుడి మనస్సులో సృష్టించింది; అదే విషయాన్ని ఇప్పుడు శ్రీ కృష్ణుడిని అడుగుతున్నాడు.
అర్జున ఉవాచ । అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః । అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ।। 37 ।।
37
6
https://www.holy-bhagava…udio/006_037.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; అయతిః — నిర్లక్షం; శ్రద్ధయా — శ్రద్ధతో; ఉపేతః — కలిగిఉండి; యోగాత్ — యోగము నుండి; చలిత-మానసః — మనస్సు చంలించిపోయి; అప్రాప్య — పొందకుండానే; యోగ-సంసిద్ధిం — యోగములో పరిపూర్ణత; కాం — ఏమి; గతిం — గతి; కృష్ణ — శ్రీ కృష్ణ; గచ్ఛతి — వెళ్ళును.
BG 6.37: అర్జునుడు పలికెను : ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా, చంచలమైన మనస్సు కారణంచే, తగినంతగా పరిశ్రమించక, యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేక పోయిన యోగి యొక్క గతి ఏమిటి?
భగవత్ ప్రాప్తి దిశగా ప్రయాణం 'శ్రద్ధ' తోనే మొదలౌతుంది. చాలా మంది విశ్వాసంగల జీవాత్మలు, పూర్వ జన్మ సంస్కారాల వలన, లేదా, సాధు పురుషుల సాంగత్యం వలన, లేదా, ప్రపంచంలోని ప్రతికూలతల వంటి ఎన్నో కారణాల చేత, వేదశాస్త్రాల ఆధ్యాత్మిక జ్ఞానంపై విశ్వాసం పెంపొందించుకుంటారు. ఈ ప్రయాణం ప్రారంభించటానికి కావలసిన శ్రద్ధని కలిగించేవి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ, ఈ సాధకులు ఆ తరువాత తగినంత పరిశ్రమ చేయక, నిర్లక్షం చేస్తే (అయతిః), మనస్సు చంచలంగానే ఉండిపోతుంది. ఇటువంటి సాధకులు తమ ప్రయాణాన్ని ఈ జన్మలో పూర్తి చేయలేరు. ఇటువంటి సాధకుల గతి ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు.
కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి । అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ।। 38 ।।
38
6
https://www.holy-bhagava…udio/006_038.mp3
కచ్చిత్ — ఒకవేళ; న — కాదు; ఉభయ — రెండు; విభ్రష్టః — భ్రష్టుడై; ఛిన్న — చెదిరిపోయిన/విడిపోయిన; అభ్రమ్ — మేఘము; ఇవ — లాగా; నశ్యతి — నిశించిన; అప్రతిష్ఠః — ఎటువంటి ఆధారం లేకుండా; మహా-బాహో — గొప్ప బాహువులు కల, కృష్ణా; విమూఢః — దిగ్భ్రమచెందిన; బ్రహ్మణః — భగవత్ ప్రాప్తి యొక్క; పథి — మార్గములో ఉన్న వ్యక్తి.
BG 6.38: యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడై పోడా? ఓ మహా బాహువులు గల కృష్ణా, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూకాకుండా పోడా?
విజయం సాధించాలనే కోరిక జీవులకి సహజమైనది. భగవంతుని అంశలే కాబట్టి దానికి అది సహజం; భగవంతుడు సర్వ-పరిపూర్ణుడు కాబట్టి ఆత్మ కూడా తన మూలము లాగే పరిపూర్ణంగా, విజేతగా ఉండాలనే కోరికతో ఉంటుంది. విజయము/కార్యసిధ్ధి రెండు రంగాలలో ఉంటుంది - భౌతిక మైనది మరియు ఆధ్యాత్మికమైనది. ఈ భౌతికప్రపంచం లో సుఖాలు లభిస్తాయి అని అనుకునేవారు భౌతిక అభ్యున్నతి కోసం పాటుపడుతారు. ఆధ్యాత్మిక సంపదయే నిజంగా ఉండవలసిన నిధి అనుకునేవారు, భౌతిక ప్రయాసలని విడిచి ఆధ్యాత్మిక పురోగతి కోసమే పాటుపడతారు. కానీ, ఇంటువంటి ఆధ్యాత్మిక వాదులు తమ ప్రయత్నంలో విఫలం అయితే వారు అటు భౌతిక సంపద లేక ఇటు ఆధ్యాత్మిక సంపత్తి లేకుండా అయిపోవటం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తూ, వారి స్థితి ఒక విడిపోయి చెదిరిపోయిన మేఘము మాదిరి అయిపోతుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక మేఘము, తన గుంపు నుండి విడిపోతే, అది నిరర్థకమైపోతుంది. అది తగినంత నీడను ఇవ్వలేదు, దాని బరువును పెంచుకుని వర్షం కురిపించేదిగా అవలేదు. అది ఉత్తగా గాలిలో తేలుతూ ఆకాశంలో హరించుకుపోతుంది. సాఫల్యం పొందలేని యోగి పరిస్థితి కూడా ఈ విధంగానే, ఏ రంగంలో కూడా విలువ లేకుండా ఉంటుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.
ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః । త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ।। 39 ।।
39
6
https://www.holy-bhagava…udio/006_039.mp3
ఏతత్ — ఇది; మే — నా యొక్క; సంశయం — సందేహము; కృష్ణ — కృష్ణా; ఛేత్తుం — నివృత్తిచేయుటకు; అర్హసి — చేయగలవు; అశేషతః — పూర్తిగా; త్వత్ — నీ కంటే; అన్యః — వేరెవరూ; సంశయస్య — సంశయమును; అస్య — ఈ యొక్క; ఛేత్తా — నివృత్తి చేసేవారు; న —లేరు; హి — నిజముగా; ఉపపద్యతే —యోగ్యమైన.
BG 6.39: ఓ కృష్ణా, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము, మరిక నీ కన్నా ఇది చేయగలవారు ఎవరున్నారు?
అజ్ఞానం నుండి సందేహాలు పుడతాయి, మరియు సందేహాలను నివృత్తి చేసుకోనే శక్తి, జ్ఞానం నుండి వస్తుంది. వేద శాస్త్ర పండితులు పుస్తక జ్ఞానం కలిగి ఉంటారు, ఇది సందేహాలను నివృత్తి చేయటానికి సరిపోదు, ఎందుకంటే శాస్త్రాలు ఎన్నో కనిపించే విరుద్ధమైన విషయాలని కలిగి ఉంటాయి, వీటిని నిజమైన అంతర్గత విజ్ఞానం వల్లనే సమన్వయం చేసుకోవచ్చు. భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఇటువంటి విజ్ఞానాన్ని కొంతమేర కలిగి ఉంటారు. వారు సర్వజ్ఞులు కారు. ఇటువంటి జ్ఞానోదయమైనవారు, సందేహ నివృత్తి చేయగలిగే శక్తి కలిగి ఉంటారు, కానీ వారు సర్వజ్ఞుడైన భగవంతునితో పోటీ పడలేరు. భగవంతుడు మాత్రమే ఏకైక సర్వజ్ఞుడు (అన్నీ తెలిసినవాడు) మరియు సర్వ-శక్తిమంతుడు (అన్ని రకాల శక్తులను కలిగినవాడు), అందుకే, ఎలాగైతే సూర్యుడే చీకటిని ప్రారదోలే సమర్థుడో, ఆ భగవంతుడే సమస్త అజ్ఞానాన్ని నిర్మూలించగలిగే అత్యున్నత సమర్థుడు.
శ్రీ భగవానువాచ । పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే । న హి కల్యాణకృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ।। 40 ।।
40
6
https://www.holy-bhagava…udio/006_040.mp3
శ్రీ భగవాన్ ఉవాచ — శ్రీ భగవానుడు పలికెను; పార్థ — అర్జున, ప్రిథ పుత్రుడా; న ఏవ — ఎప్పటికి కాదు; ఇహ — ఈ లోకంలో; న — కాదు; అముత్ర — పరలోకమున; వినాశః — నాశనము; తస్య — అతని; విద్యతే — ఉండును; న — కాదు; హి — నిజముగా; కల్యాణ-క్రిత్ — భగవత్ ప్రాప్తికి ప్రయత్నించే వాడు; కశ్చిత్ — ఎవరైనా; దుర్గతిం — చెడు గతి; తాత — నా మిత్రమా; గచ్ఛతి — పోవును.
BG 6.40: శ్రీ భగవానుడు ఇలా పలికెను: ఓ పార్థా, ఆధ్యాత్మిక పథంలో ఉన్న వాడు ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ చెడిపోడు. ప్రియ మిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాడు ఎన్నటికీ దుర్గతి పాలుకాడు.
తాత అన్న పదం అనురాగాన్ని సూచిస్తున్నది, దీనర్థం ‘పుత్రుడా’ అని. అర్జునుడిని తాత అని సంబోధించి, శ్రీ కృష్ణుడు అతనిపై ఉన్న వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. గురువు తన శిష్యుడికి తండ్రి లాంటి వాడు, కాబట్టి గురువు కూడా ఒక్కోసారి తన శిష్యుడిని ప్రేమతో 'తాత' అని సంభోదిస్తాడు. ఇక్కడ అర్జునుడి పట్ల తన వాత్సల్యాన్ని మరియు కృపని చూపిస్తూ, ఆయన మార్గంలో ఉన్న వారి బాగోగులని తనే చూసుకుంటాడు, అని చెప్పటానికి శ్రీ కృష్ణుడు సంకల్పించాడు. వారు భగవంతునికి ప్రియమైన వారు ఎందుకంటే వారు అత్యంత పవిత్రమైన కార్యంలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి, మరియు ‘మంచి చేసే వారు ఎప్పుడూ కూడా కష్టాలపాలు కారు.’ ఈ లోకంలో మరియు పరలోకంలో భక్తుడిని భగవంతుడే కాపాడుకుంటాడు, అని ఈ శ్లోకం వక్కాణిస్తున్నది. ఈ ప్రకటన ఆధ్యాత్మిక అభిలాషులకు ఒక గొప్ప భరోసా. ఇక తదుపరి, ఈ జన్మలోనే ప్రయాణం పూర్తి చేయలేకపోయిన యోగి యొక్క సాధనని భగవంతుడు ఎలా భద్రపరుస్తాడో, శ్రీ కృష్ణుడు వివరిస్తాడు.
ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః । శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ।। 41 ।। అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ । ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ।। 42 ।।
41
6
https://www.holy-bhagava…/006_041-042.mp3
ప్రాప్య — పొందును; పుణ్య-కృతాం — పుణ్యాత్ముల; లోకాన్ — లోకాలు; ఉషిత్వా — నివసించిన పిదప; శాశ్వతీః — చాలా; సమాః — యుగాలు; శుచీనాం — ధర్మపరాయణుల; శ్రీ-మతాం — సంపన్నుల; గేహే — ఇంటియందు; యోగ-భ్రష్టః — యోగములో సాఫల్యము పొందలేక పోయినవారు; అభిజాయతే — పుట్టెదరు; అథవా — లేదా; యోగినాం — దివ్య జ్ఞానము ప్రసాదించబడ్డ వారి; ఏవ — ఖచ్చితముగా; కులే — కుటుంబములో; భవతి — జన్మించెదరు; ధీ-మతాం — వివేకవంతుల; ఏతత్ — ఇది; హి — నిజముగా; దుర్లభ-తరం — చాలా దుర్లభము; లోకే — ఈ లోకంలో; జన్మ — పుట్టుక; యత్ — ఏదైతే; ఈదృశమ్ — ఇటువంటి.
BG 6.41-42: యోగ భ్రష్టులైన వారు (ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు), పుణ్య లోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప, వారు తిరిగి భూలోకంలో, ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా, ఏంతో కాలం యోగ అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారయితే, దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా లోకంలో చాలా దుర్లభము.
ప్రాపంచిక పుణ్య కార్యాలు చేసినవారికి, వేదాలలో చెప్పబడిన సకామ కర్మ కాండలు చేసిన వారికి స్వర్గలోక నివాసం ప్రసాదించబడుతుంది. మరైతే, యోగభ్రష్టుడు ఈ స్వర్గ లోకాలకు ఎందుకు పోవాలి? దీనికి కారణం ఏమిటంటే, యోగమునకు (భగవంతునితో సంయోగం) వ్యతిరేకమైనది భోగము (భౌతిక అనుభూతులు). భోగముల మీద ఆసక్తి వలన వ్యక్తి యోగము నుండి భ్రష్టుడై పోతాడు. కాబట్టి భగవంతుడు, దయాళువైన తండ్రి లాగా, ఓ పడిపోయిన యోగికి, భోగ విలాసాల కోసం ఒక అవకాశం ఇచ్చి, అవన్నీ వ్యర్థమైనవి, అవి ఆత్మ కోరుకునే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకునేలాగా చేస్తాడు. కాబట్టి, భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు చాలా కాలం పాటు స్వర్గ లోకాలకు పంపబడి, తిరిగి ఈ భూలోకానికి పంపబడుతాడు. ఇటువంటి జీవులకు తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించటానికి అవకాశం ఉండే కుటుంబంలో జన్మ ఇవ్వబడుతుంది. శుచీ అంటే పవిత్రమైన మరియు మంచి నడవడిక కలవారు అని అర్థం; శ్రీ అంటే సంపన్నులు అని అర్థం. యోగ భ్రష్టులైన వారు, పవిత్రమైన కుటుంబంలో చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికత నేర్పించే వారికి జన్మిస్తారు లేదా సంపన్నుల కుటుంబంలో, భౌతిక అవసరాలు అన్నీ తీరి, బతుకు తెరువు కోసం రోజూ ప్రయాస పడే అవసరం లేని వారికి జన్మిస్తారు. ఇటువంటి కుటుంబ వాతావరణం ఆధ్యాత్మిక పరిశ్రమలో నిమగ్నమవటానికి, అటువంటి ఆసక్తి కల జీవులకు అనుకూలంగా ఉంటుంది. మనం పుట్టిన పరిస్థితులు, స్థానము, మరియు కుటుంబము అనేవి మన జీవితంపై ఎంతో ప్రభావం కలిగి ఉంటాయి. మన శారీరిక తల్లిదండ్రుల నుండి మనం వంశపారంపర్యమైన గుణాలను పొందుతాము. ఇది జన్యు సంబంధమైన వంశపారంపర్య పద్దతి. కానీ, సామాజిక వారసత్వ పద్దతి కూడా ఉంటుంది. మనం చాలా ఆచారాలని మనం పెరిగిన వాతావరం వలన గుడ్డిగా పాటిస్తుంటాము. మనం భారతీయులమా, అమెరికన్లమా, బ్రిటిష్ వారిమా అని, మనకు మనం ఎంచుకోము. మన జన్మ ప్రకారం మనం ఎదో ఒక జాతీయతను ఆపాదించుకొనటమే కాకుండా వేరే దేశీయులతో శతృత్వం కూడా పెంచుకునేంత వరకు పోతాము. ఖచ్చితంగా మనం, సామాజిక వారసత్వంలో భాగంగా మన తల్లిదండ్రుల మతాన్నే అనుసరిస్తాము. ఈ విధంగా, మనం పుట్టిన స్థలం మరియు కుటుంబం మన జీవిత గమనం మరియు పురోగతిపై చాలా చాలా ప్రభావం కలిగి ఉంటాయి. ఒకవేళ, ప్రతి జన్మలో, పుట్టే స్థలం మరియు కుటుంబం ఎదో కాకతాళీయంగా నిర్ణయించబడితే ఈ ప్రపంచంలో న్యాయం లేనట్టే. కానీ, మన యొక్క అనంతమైన జన్మల తలంపులు, పనుల చిట్టా భగవంతుని దగ్గర ఉంది. కర్మ సిద్ధాంత శాసనముని అనుసరించి, యోగంలో సాఫల్యం పొందలేకపోయిన యోగి యొక్క పూర్వ జన్మ ఆధ్యాత్మిక సంపద, దాని ఫలములను ఇస్తుంది. ఆ ప్రకారంగానే, ఎంతో పురోగతి సాధించి మరియు వైరాగ్యం పెంపొందించుకున్న యోగులు, స్వర్గ/పుణ్య లోకాలకు పంపబడరు. వారికి, తమ ప్రయాణం ముందుకు తీసుకువెళటానికి అనుకూలముగా, ఆధ్యాత్మికతలో ఉన్నతమైన దశలో ఉన్న కుటుంబంలో ఇక్కడే జన్మ ఇవ్వబడుతుంది. అటువంటి జన్మ అత్యంత భాగ్యవంతమైనది ఎందుకంటే, ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకి చిన్నతనం నుండే ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని బోధిస్తుంటారు.
ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః । శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ।। 41 ।। అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ । ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ।। 42 ।।
42
6
https://www.holy-bhagava…/006_041-042.mp3
ప్రాప్య — పొందును; పుణ్య-కృతాం — పుణ్యాత్ముల; లోకాన్ — లోకాలు; ఉషిత్వా — నివసించిన పిదప; శాశ్వతీః — చాలా; సమాః — యుగాలు; శుచీనాం — ధర్మపరాయణుల; శ్రీ-మతాం — సంపన్నుల; గేహే — ఇంటియందు; యోగ-భ్రష్టః — యోగములో సాఫల్యము పొందలేక పోయినవారు; అభిజాయతే — పుట్టెదరు; అథవా — లేదా; యోగినాం — దివ్య జ్ఞానము ప్రసాదించబడ్డ వారి; ఏవ — ఖచ్చితముగా; కులే — కుటుంబములో; భవతి — జన్మించెదరు; ధీ-మతాం — వివేకవంతుల; ఏతత్ — ఇది; హి — నిజముగా; దుర్లభ-తరం — చాలా దుర్లభము; లోకే — ఈ లోకంలో; జన్మ — పుట్టుక; యత్ — ఏదైతే; ఈదృశమ్ — ఇటువంటి.
BG 6.41-42: యోగ భ్రష్టులైన వారు (ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు), పుణ్య లోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప, వారు తిరిగి భూలోకంలో, ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా, ఏంతో కాలం యోగ అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారయితే, దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా లోకంలో చాలా దుర్లభము.
ప్రాపంచిక పుణ్య కార్యాలు చేసినవారికి, వేదాలలో చెప్పబడిన సకామ కర్మ కాండలు చేసిన వారికి స్వర్గలోక నివాసం ప్రసాదించబడుతుంది. మరైతే, యోగభ్రష్టుడు ఈ స్వర్గ లోకాలకు ఎందుకు పోవాలి? దీనికి కారణం ఏమిటంటే, యోగమునకు (భగవంతునితో సంయోగం) వ్యతిరేకమైనది భోగము (భౌతిక అనుభూతులు). భోగముల మీద ఆసక్తి వలన వ్యక్తి యోగము నుండి భ్రష్టుడై పోతాడు. కాబట్టి భగవంతుడు, దయాళువైన తండ్రి లాగా, ఓ పడిపోయిన యోగికి, భోగ విలాసాల కోసం ఒక అవకాశం ఇచ్చి, అవన్నీ వ్యర్థమైనవి, అవి ఆత్మ కోరుకునే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకునేలాగా చేస్తాడు. కాబట్టి, భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు చాలా కాలం పాటు స్వర్గ లోకాలకు పంపబడి, తిరిగి ఈ భూలోకానికి పంపబడుతాడు. ఇటువంటి జీవులకు తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించటానికి అవకాశం ఉండే కుటుంబంలో జన్మ ఇవ్వబడుతుంది. శుచీ అంటే పవిత్రమైన మరియు మంచి నడవడిక కలవారు అని అర్థం; శ్రీ అంటే సంపన్నులు అని అర్థం. యోగ భ్రష్టులైన వారు, పవిత్రమైన కుటుంబంలో చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికత నేర్పించే వారికి జన్మిస్తారు లేదా సంపన్నుల కుటుంబంలో, భౌతిక అవసరాలు అన్నీ తీరి, బతుకు తెరువు కోసం రోజూ ప్రయాస పడే అవసరం లేని వారికి జన్మిస్తారు. ఇటువంటి కుటుంబ వాతావరణం ఆధ్యాత్మిక పరిశ్రమలో నిమగ్నమవటానికి, అటువంటి ఆసక్తి కల జీవులకు అనుకూలంగా ఉంటుంది. మనం పుట్టిన పరిస్థితులు, స్థానము, మరియు కుటుంబము అనేవి మన జీవితంపై ఎంతో ప్రభావం కలిగి ఉంటాయి. మన శారీరిక తల్లిదండ్రుల నుండి మనం వంశపారంపర్యమైన గుణాలను పొందుతాము. ఇది జన్యు సంబంధమైన వంశపారంపర్య పద్దతి. కానీ, సామాజిక వారసత్వ పద్దతి కూడా ఉంటుంది. మనం చాలా ఆచారాలని మనం పెరిగిన వాతావరం వలన గుడ్డిగా పాటిస్తుంటాము. మనం భారతీయులమా, అమెరికన్లమా, బ్రిటిష్ వారిమా అని, మనకు మనం ఎంచుకోము. మన జన్మ ప్రకారం మనం ఎదో ఒక జాతీయతను ఆపాదించుకొనటమే కాకుండా వేరే దేశీయులతో శతృత్వం కూడా పెంచుకునేంత వరకు పోతాము. ఖచ్చితంగా మనం, సామాజిక వారసత్వంలో భాగంగా మన తల్లిదండ్రుల మతాన్నే అనుసరిస్తాము. ఈ విధంగా, మనం పుట్టిన స్థలం మరియు కుటుంబం మన జీవిత గమనం మరియు పురోగతిపై చాలా చాలా ప్రభావం కలిగి ఉంటాయి. ఒకవేళ, ప్రతి జన్మలో, పుట్టే స్థలం మరియు కుటుంబం ఎదో కాకతాళీయంగా నిర్ణయించబడితే ఈ ప్రపంచంలో న్యాయం లేనట్టే. కానీ, మన యొక్క అనంతమైన జన్మల తలంపులు, పనుల చిట్టా భగవంతుని దగ్గర ఉంది. కర్మ సిద్ధాంత శాసనముని అనుసరించి, యోగంలో సాఫల్యం పొందలేకపోయిన యోగి యొక్క పూర్వ జన్మ ఆధ్యాత్మిక సంపద, దాని ఫలములను ఇస్తుంది. ఆ ప్రకారంగానే, ఎంతో పురోగతి సాధించి మరియు వైరాగ్యం పెంపొందించుకున్న యోగులు, స్వర్గ/పుణ్య లోకాలకు పంపబడరు. వారికి, తమ ప్రయాణం ముందుకు తీసుకువెళటానికి అనుకూలముగా, ఆధ్యాత్మికతలో ఉన్నతమైన దశలో ఉన్న కుటుంబంలో ఇక్కడే జన్మ ఇవ్వబడుతుంది. అటువంటి జన్మ అత్యంత భాగ్యవంతమైనది ఎందుకంటే, ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకి చిన్నతనం నుండే ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని బోధిస్తుంటారు.
తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ । యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ।। 43 ।।
43
6
https://www.holy-bhagava…udio/006_043.mp3
తత్ర — అక్కడ; తం — అది; బుద్ధి-సంయోగం — జ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి; లభతే — పొందును; పౌర్వ-దేహికమ్ — పూర్వ జన్మల నుండి; యతతే — పరిశ్రమించును; చ — మరియు; తతః — ఆ తరువాత; భూయః — మరల; సంసిద్ధౌ — పరిపూర్ణత కొరకు; కురు-నందన — అర్జునా, కురు వంశస్తుడా.
BG 6.43: ఇటువంటి జన్మ పొందిన తరువాత, ఓ కురు వంశస్తుడా, వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి, యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు.
ప్రతి ఒక్క ప్రాణి హృదయంలో స్థితుడై ఉన్న భగవంతుడు, వారికి పరిపూర్ణమైన న్యాయం చేస్తాడు. మనం పూర్వ జన్మలలో సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదలు ఏవైనా ఉన్నా – వైరాగ్యము, జ్ఞానము, భక్తి, విశ్వాసము, సహనము, ధృఢ సంకల్పము, మరియు ఇతర దైవీ గుణములు అన్నీ – ఆయనకు తెలుసు. కాబట్టి సరైన సమయంలో మన పూర్వ జన్మల పరిశ్రమ ఫలితాన్ని, ఆయా సంపాదన అనుగుణంగా, తిరిగి ఇస్తాడు మరియు మన ఆధ్యాత్మికతను లోనుండి తిరిగి పెంపొందిస్తాడు. భౌతిక ప్రాపంచిక ధృక్పథంలోనే ఉన్న కొందరు అకస్మాత్తుగా పూర్తి ఆధ్యాత్మికతలో ఎందుకు అయిపోతారో, ఇది మనకు తెలియచేస్తున్నది. వారి యొక్క ఆధ్యాత్మిక సంస్కారములు మేల్కొన్నప్పుడు, వారికి పూర్వ జన్మల సాధన ఫలితం లభిస్తుంది.ఒక యాత్రికుడు విరామం కోసం దారిలో ఉన్న ఒక హోటల్లో రాత్రిపూట బస చేయవచ్చు. కానీ, తను లేచినప్పుడు, తను ఇప్పటికే వచ్చిన దూరాన్ని తిరిగి ప్రయాణం చేయనవసరం లేదు. కేవలం మిగిలిన దూరాన్ని మాత్రమే ప్రయాణించవలసి ఉంటుంది. అదే విధంగా, భగవంతుని కృప వలన, పూర్వ జన్మలలో తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపాడో, అక్కడి నుండి పురోగమించటానికి, తాను ఇంతకు క్రితమే సాధించుకున్న ఆధ్యాత్మిక సంపత్తిని, వ్యక్తి నిద్ర లేచినట్టుగా, యోగి తిరిగి పొందుతాడు. అందుకే ఇటువంటి యోగి ఎన్నటికీ దారితప్పడు.
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః । జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ।। 44 ।।
44
6
https://www.holy-bhagava…udio/006_044.mp3
పూర్వ — గత; అభ్యాసేన — అభ్యాసము (క్రమశిక్షణ); తేన — దానిచే; ఏవ — ఖచ్చితంగా; హ్రియతే — ఆకర్షించబడును; హి — తప్పకుండా; అవశః — తన ప్రమేయం లేకుండానే (అనాయాసముగానే); అపి — అయినా సరే; సః — ఆ వ్యక్తి; జిజ్ఞాసుః — జిజ్ఞాసువై; అపి — అయి ఉండి; యోగస్య — యోగం గురించి; శబ్ద-బ్రహ్మా — వేదములలో చెప్పబడిన సకామ కర్మలు; అతివర్తతే — అధిగమించును.
BG 6.44: వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా, పూర్వ జన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్శించబడుతారు. ఇటువంటి సాధకులు సహజంగానే, వేదములలో చెప్పబడిన కర్మ కాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు.
ఒకసారి ఆధ్యాత్మిక భావనలు చిగురించిన తరువాత, వాటిని నిర్మూలించలేము. భక్తి యుక్త మైన పూర్వ, ప్రస్తుత జన్మ సంస్కారములు (వాసనా బలం) కలిగి ఉన్న జీవాత్మ సహజంగానే ఆధ్యాత్మికత వైపు ప్రేరేపింపబడుతుంది. అటువంటి వ్యక్తి భగవంతుని దిశగా ఆకర్శించబడుతాడు; ఈ ఆకర్షణ (లాగుట) నే ‘భగవంతుని పిలుపు’ అని కూడా అంటారు. పూర్వ సంస్కారముల ఆధారంగా వచ్చే ఈ భగవంతుని పిలుపు ఒక్కోసారి ఎంత బలంగా ఉంటుందంటే, ‘వ్యక్తి జీవితంలో వచ్చే అత్యంత బలమైన పిలుపు ఈ భగవంతుని పిలుపే’ అని అంటారు. దీనిని అనుభవించిన వారు, తమ మనస్సు చెప్పిన మార్గంలోనే ప్రయాణించటానికి సమస్త ప్రపంచాన్ని మరియు తమ స్నేహితుల-బంధువుల సలహాని తిరస్కరిస్తారు. ఈ విధంగానే, చరిత్రలో, గొప్ప రాకుమారులు, ఉన్నతమైన హోదాలో ఉన్నవారు, మరియు ధనవంతులైన వ్యాపారవేత్తలు, వంటి వారు, తమ ప్రాపంచిక సుఖాలని త్యజించి మునులు, యోగులు, సన్యాసులు, ఆధ్యాత్మికవేత్తలు, మరియు స్వామీజీలు అయ్యారు. మరియు, వారికి ఉన్న ఆత్రుత (తృష్ణ) భగవంతుని కోసం మాత్రమే కావున, వారు సహజంగానే, భౌతిక పురోగతి కొరకు, వేదములలో చెప్పబడిన సకామ కర్మ కాండలకు అతీతంగా ఎదుగుతారు.
ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః । అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ।। 45 ।।
45
6
https://www.holy-bhagava…udio/006_045.mp3
ప్రయత్నాత్ — కఠిన కృషితో; యతమానః — పరిశ్రమిస్తూ; తు — మరియు; యోగీ — ఒక యోగి; సంశుద్ధ — పరిశుద్ధుడై; కిల్బిషః — ప్రాపంచిక కోరికల నుండి; అనేక జన్మ — చాలా చాలా జన్మల అనంతరం; సంసిద్ధః —పరిపూర్ణ సిద్ధిని సాధించును; తతః — అప్పుడు; యాతి — పొందును; పరాం — అత్యున్నత; గతిమ్ — గతి.
BG 6.45: అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై (స్వేచ్ఛ పొంది), ఈ జన్మ లోనే సిద్ధి (పరిపూర్ణత) పొందుతారు.
ఎన్నో పూర్వ జన్మలలో ఆర్జించిన అభ్యాసం, ఆధ్యాత్మిక పురోగతి కొరకు, చక్కటి వీచేగాలిలా సహకరిస్తుంది. పూర్వజన్మ నుండి కొనసాగిస్తూ, ఈ జన్మలో యోగులు, ఈ వీచేగాలిలో, తమ పరిశ్రమ రూపంలోని, తెరచాపని ఎగిరేస్తారు. శ్రీ కృష్ణుడు ‘ప్రయత్నాద్ యతమానస్తు’ అన్న పదాలు వాడుతున్నాడు, అంటే, ‘ఇంతకు పూర్వం కంటే ఎక్కువ పరిశ్రమ చేయటం.’ 'తు' అన్న పదం - వారి ప్రస్తుత పరిశ్రమ, ఇంతకు క్రితం, వారు ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయిన జన్మల పరిశ్రమ కంటే తీవ్రంగా ఉంటుంది - అని సూచిస్తుంది. ఈ విధంగా, వారు పూర్వ జన్మల నుండీ వచ్చిన ఉరవడిని సహాయంగా తీసుకుంటూ, ఈ అనుకూల పవనాలతో లక్ష్యం వైపుగా తీసుకు వెళ్ళబడుతారు. చూసేవారికి, మెత్తం ప్రయాణాన్ని వీరు ఈ జన్మలోనే పూర్తి చేసినట్టు ఉంటుంది, కానీ శ్రీ కృష్ణుడు అంటున్నాడు: 'అనేకజన్మసంసిద్ధః', ‘యోగములో పరిపూర్ణ సిద్ధి అనేది అనేక జన్మల అభ్యాసంతో ఆర్జించిన ఫలితము.’ అని.
తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః । కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ।। 46 ।।
46
6
https://www.holy-bhagava…udio/006_046.mp3
తపస్విభ్యః — తపస్విల కన్నా; అధికః — ఉన్నతమైన వాడు; యోగీ — ఒక యోగి; జ్ఞానిభ్యః — జ్ఞానవంతుల కన్నా; అపి — కూడా; మతః — పరిగణించబడును; అధికః — ఉన్నతమైనది; కర్మిభ్యః — కర్మ కాండలు చేసే వారి కన్నా; చ — మరియు; అధికః — ఉన్నతమైనది; యోగీ — ఒక యోగి; తస్మాత్ — కాబట్టి; యోగీ — ఒక యోగి; భవ — అయిపో; అర్జున — అర్జునా.
BG 6.46: ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి, ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము.
తపస్వి అంటే, మోక్ష ప్రాప్తి సాధనకి సహాయంగా, తనకు తానే శారీరిక నిష్ఠలు విధించుకొని, తీవ్ర కఠిన జీవన విధానాన్ని అవలంబిస్తూ, ఇంద్రియ సుఖాలకు దూరంగా, భౌతిక సంపత్తి ఏమీ కూడబెట్టక ఉండే వాడు. జ్ఞాని, అంటే చురుకుగా ప్రయత్నపూర్వకంగా జ్ఞాన సముపార్జన చేసే ఒక చదువుకున్న వ్యక్తి. కర్మీ అంటే, భౌతిక సంపత్తి కోసం, స్వర్గాది లోక ప్రాప్తి కోసం వైదిక కర్మకాండలు ఆచరించే వాడు. వీరందరి కన్నా యోగియే శ్రేష్ఠుడు అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. దీనికి కారణం చాలా సరళమైనది. కర్మీ, జ్ఞాని, మరియు తపస్విల యొక్క లక్ష్యం భౌతిక వస్తువిషయ ప్రాప్తి; వారు ఇప్పటికీ శారీరిక దృక్పథంలోనే ఉన్నట్టు. యోగి, భౌతిక పురోగతి కోసం పాటు పడట్లేదు, భగవత్ ప్రాప్తి కోసం శ్రమిస్తున్నాడు. అందుకే యోగి సాధించేది ఆధ్యాత్మికమైనది మరియు యోగి వీరందరి కన్నా ఉన్నతమైనవాడు.
యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా । శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః ।। 47 ।।
47
6
https://www.holy-bhagava…udio/006_047.mp3
యోగినాం — అందరి యోగుల కెల్లా; అపి — కూడా; సర్వేషాం — అన్ని రకాల; మత్-గతేన — నాయందే నిమగ్నమై ఉండి (భగవంతుని యందు); అంతః — లోనున్న; ఆత్మనా — మనస్సుతో; శ్రద్ధా-వాన్ — గాఢ విశ్వాసం తో; భజతే — భక్తిలో నిమగ్నమై; యః — ఎవరైతే; మాం — నా పట్ల; సః — అతడు; మే — నా చేత; యుక్త-తమః — అత్యున్నత యోగి; మతః — పరిగణించబడును.
BG 6.47: అందరి యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు ధృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను.
యోగులలో కూడా, కర్మ యోగులు, భక్తి యోగులు, జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు మొదలైన వారు ఉంటారు. ఏ రకమైన యోగులు శ్రేష్ఠమైనవారో అన్న వివాదానికి ఈశ్లోకం ముగింపు ఇస్తున్నది. 'భక్తి యోగి' యే పరమ శ్రేష్ఠుడు, మరియు, సర్వోత్తమమైన అష్టాంగ యోగి మరియు హఠ యోగుల కన్నా ఉన్నతమైన వాడు, అని శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఇది ఎందుకంటే, భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. అది ఎంత బలీయమైనదంటే, అది భగవంతుణ్ణి కట్టి పడేసి, ఆయనను భక్తునికి బానిసగా చేస్తుంది. అందుకే, భాగవతంలో ఆయన ఇలా చెప్పాడు:అహం భక్త-పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజసాధుబిర్ గ్రస్త-హృదయో భక్తైర్ భక్త-జన-ప్రియః(9.4.63)‘నేను సర్వ-స్వతంత్రుడనైనా, నా భక్తులకు బానిసై పోతాను. వారు నా హృదయాన్ని జయిస్తారు. నా భక్తులే కాదు, నా భక్తుల భక్తులు కూడా నాకు చాలా ప్రియమైనవారు.’ భక్తి యోగి దివ్య ప్రేమ శక్తి కలిగి ఉంటాడు, అందుకే భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు మరియు ఆయనచే అందరి కంటే అత్యున్నతంగా పరిగణించబడుతాడు.ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు 'భజతే' అన్న పదం వాడాడు. అది 'భజ్' అనే మూల పదం నుండి వచ్చింది, అంటే 'సేవ చేయటం' అని అర్థం. ఇది భక్తిని సూచించే చాలా ప్రభావవంతమైన పదం, 'ఆరాధన' అని అనటం కన్నా ప్రభావితమైనది. ఇక్కడ శ్రీ కృష్ణుడు కేవలం ఆరాధించే/పూజించే వారి గురించి కాకుండా, భక్తి యుక్త ప్రేమతో సేవ చేసే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా వారు తమ ఆత్మ సహజ స్థితియైన భగవంతుని సేవకులుగా ఉంటారు; అదే సమయంలో ఇతర రకాల యోగులు తమ విజ్ఞానంలో అసంపూర్ణంగా ఉంటారు. వారు తమని తాము భగవంతునితో అనుసంధానం చేసుకున్నారు కానీ, వారు భగవంతుని నిత్య సేవకులమని ఇంకా అర్థం చేసుకోలేదు.ముక్తానాం అపి సిద్ధానాం నారాయణ-పరాయణఃసు-దుర్లభః ప్రశాంతాత్మా కోటిష్వపి మహా-మునే(భాగవతం 6.14.5)"కోట్ల మంది పరిపూర్ణ సిద్ది సాధించి ముక్తి పొందిన మహాత్ములలో కూడా, సర్వోన్నత భగవానుడు అయిన శ్రీమన్నారాయణుడి పట్ల భక్తికల, ప్రశాంత చిత్తులు, చాలా అరుదు.’ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ఇంకొక విధానం ఏమిటంటే - భక్తి యోగము, అతి సమీపమైన మరియు పరిపూర్ణ భగవత్ అనుభూతిని, విజ్ఞానాన్ని అందిస్తుంది - అని. 18.55వ శ్లోకంలో ఇది వివరించబడింది, ఇక్కడ శ్రీ కృష్ణుడు కేవలం భక్తి యోగి మాత్రమే యదార్థమైన భగవత్ తత్త్వాన్ని అర్థం చేసుకుంటాడు, అని వివరించాడు.
శ్రీ భగవానువాచ । మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః । అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ।। 1 ।।
1
7
https://www.holy-bhagava…udio/007_001.mp3
శ్రీ భగవాన్ ఉవాచ — భగవంతుడు ఇలా పలికెను; మయి — నా పట్ల; ఆసక్త-మనాః — ఆసక్తి కలిగిన మనస్సు తో; పార్థ — అర్జున, ప్రిథ పుత్రుడా; యోగం — భక్తి యోగము; యుంజన్ — అభ్యాసము చేస్తూ; మద్-ఆశ్రయః — నన్ను శరణుజొచ్చి ; అసంశయం — సందేహము లేకుండా; సమగ్రం — పూర్తిగా; మాం — నన్ను; యథా — ఎట్లా; జ్ఞాస్యసి — నీవు తెలుసుకొనగలవో; తత్ — అది; శృణు — వినుము.
BG 7.1: భగవంతుడు పలికెను: ఓ అర్జునా, నాయందు మాత్రమే మనస్సు నిలిపి, భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా, సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో, ఇప్పుడు వినుము.
మనస్సు తన యందు అనన్య భక్తితో లగ్నం చేసి భక్తితో తనను సేవించువారు, యోగులలో శ్రేష్ఠులు అని 6వ అధ్యాయం ముగింపులో, శ్రీ కృష్ణుడు చెప్పి ఉన్నాడు. సహజంగా ఈ ప్రతిపాదన కొన్ని ప్రశ్నలకు దారితీయవచ్చు: భగవంతుడిని గూర్చి తెలుసుకునే మార్గం ఏమిటి? ఆయనపై ధ్యానం చేయటం ఎలా? భక్తుడు భగవత్ ఆరాధన ఎలా చేయాలి? అర్జునుడు ఈ ప్రశ్నలను అడగకపోయినా, తన కరుణచే, భగవంతుడు ముందే ఊహించి చెప్పటం ప్రారంభిస్తున్నాడు. ఆయన 'శృణు' అన్న పదం వాడాడు, అంటే ‘వినుము’ అని అర్థం, అంతేకాక మద్-ఆశ్రయః అని కూడా లక్షణం చేర్చాడు అంటే ‘నీ మనస్సు నాయందే లగ్నంచేసి’ అని అర్థం.
జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః । యజ్జ్ఞాత్వా నేహ భూయోఽన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే ।। 2 ।।
2
7
https://www.holy-bhagava…udio/007_002.mp3
జ్ఞానం — జ్ఞానము; తే — నీకు; అహం — నేను; స — తో; విజ్ఞానం — విజ్ఞానము; ఇదం — ఇది; వక్ష్యామి — తెలియ చెప్పెదను; అశేషతః — సంపూర్ణముగా; యత్ — ఏదైతే; జ్ఞాత్వా — తెలుసుకున్న పిదప; న — ఉండదు; ఇహ — ఈ లోకంలో; భూయః — మరింక; అన్యత్ — వేరే ఏది; జ్ఞాతవ్యం — తెలుసుకోవలసినది; అవశిష్యతే — మిగులును.
BG 7.2: ఏ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో, దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియచేస్తాను.
ఇంద్రియమనోబుద్ధులచేత తెలుసుకున్న దానిని జ్ఞానము అంటారు. ఆధ్యాత్మిక సాధన వలన అంతర్గతంగా, లో-నుండి తెలియవచ్చిన దానిని విజ్ఞానము అంటారు. విజ్ఞానము అనేది బుద్ధిచే నేర్చుకున్నది కాదు; నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. ఉదాహరణకి, మనం ఒక సీసాలో ఉన్న తేనే యొక్క తియ్యదనం గురించి గొప్పగా వింటూ ఉండవచ్చు, కానీ అది పుస్తక/సిద్ధాంతపరమైన జ్ఞానం గానే మిగిలిపోతుంది. కానీ, ఈ బాటిల్ మూత తీసి దాంట్లో ఉన్న తేనె రుచి చూస్తే, దాని యొక్క తియ్యదనం యొక్క అనుభవపూర్వక జ్ఞానం వస్తుంది. అదే విధంగా, గురువు మరియు శాస్త్రముల నుండి మనకు తెలిసేది జ్ఞానము, మరియు ఆ జ్ఞానం అనుసరించి మనం సాధనా అభ్యాసం చేసి, అంతఃకరణ శుద్ది చేసుకున్నప్పుడు, మనలోనుండే ఉదయించిన వివేకమునే, విజ్ఞానము అంటారు.వేద వ్యాస మహర్షి - భక్తి యొక్క స్వభావము, మహిమలు, మరియు భక్తి విశేషము విశదీకరిస్తూ - శ్రీమద్ భాగవతం వ్రాయాలని సంకల్పించినప్పుడు, ఆయన జ్ఞానంపై ఆధారమై వ్రాయటంలో సంతృప్తి చెందలేదు; అందుకే మొదట భగవంతుని పట్ల అనుభవపూర్వక విజ్ఞానం కోసం భక్తిలో నిమగ్నమైనాడు:భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే ఽమలేఅపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తద్-అపాశ్రయాం (భాగవతం 1.7.4)‘భక్తి యోగము ద్వారా, ప్రాపంచిక తలంపులు ఏమీ లేకుండా, వేద వ్యాసుడు తన మనస్సుని భగవంతుని పైనే నిమగ్నం చేసాడు; దీనితో, భగవంతుని అధీనంలో ఉండే ఆయనకే చెందిన బాహ్య శక్తి మాయ సమేతంగా, వేద వ్యాసునికి, సర్వోత్కృష్టుఁడైన దివ్య భగవంతుని దర్శనం కలిగింది.’ ఈ అంతర్గత విజ్ఞానం కలిగిఉండి, అటు పిమ్మట ఆయన ఈ ప్రసిద్ధ పురాణాన్ని వ్రాసాడు.సర్వోత్క్రుష్ట పరమాత్మ యొక్క సిద్ధాంత జ్ఞానం చే అర్జునుడిని ప్రకాశితం చేస్తానని మరియు అతనికి దాని అంతర్గత విజ్ఞాన వికాసానికి తోడ్పడతానని, శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఈ విజ్ఞానం తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోవటానికి ఇంకేమీ మిగలదు.
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే । యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ।। 3 ।।
3
7
https://www.holy-bhagava…udio/007_003.mp3
మనుష్యాణాం — మనుష్యులలో; సహస్రేషు — వేల మందిలో; కశ్చిత్ — ఎవరో ఒకరు; యతతి — పరిశ్రమిస్తారు; సిద్ధయే — పరిపూర్ణ సిద్ధి కొరకు; యతతామ్ — ఈ ప్రయత్నించేవారిలో; అపి — కూడా; సిద్ధానాం — పరిపూర్ణ సిద్ధి సాధించినవారిలో; కశ్చిత్ — ఎవరో ఒకరు; మాం — నన్ను; వేత్తి — తెలుసుకోనును; తత్త్వతః — యదార్థముగా.
BG 7.3: వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు; మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు.
ఈ శ్లోకంలో 'సిద్ధి' అన్న పదం పరిపూర్ణత కోసం వాడబడింది. ఈ పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సిద్ధి అన్న పదానికి సంస్కృత నిఘంటువు నుండి కొన్ని అర్థాలు ఇక్కడ చూడండి : అలౌకికమైన శక్తుల సంపాదన, పనిలో సాఫల్యము, విజయము, నిపుణత, నెరవేర్చుట, ఏదేని సమస్యకి పరిష్కారం, వంట లేదా ఏదేని పని పూర్తి, స్వస్థత, లక్ష్యాన్ని చేరుకొనుట, పక్వమునకు వచ్చుట, అత్యున్నత సుఖము, మోక్షము, అసాధారణ మైన నైపుణ్యం, పరిపూర్ణత. శ్రీ కృష్ణుడు 'సిద్ధి' అన్న పదాన్ని ఆధ్యాత్మికతలో పరిపూర్ణత అన్న అర్థంలో వాడుతున్నాడు, ఇంకా అంటున్నాడు, ‘అర్జునా, అసంఖ్యాకమైన ఆత్మలలో అతి కొద్ది వాటికి మాత్రమే మానవ దేహం లభించింది. మానవ జన్మ పొందిన వారిలో, కొద్ది మంది మాత్రమే పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు. పరిపూర్ణత సాధించిన ఆ జీవాత్మలలో కూడానూ, నా సర్వశ్రేష్ఠమైన స్థాయిని మరియు దివ్య మహిమలను ఎఱిఁగిన వారు చాలా అరుదు’ అని. ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణత సాధించిన జీవులు, ఎందుకు భగవంతుడిని గూర్చి యదార్థముగా తెలుసుకోలేరు? ఇది ఎందుకంటే, భగవంతునిపై భక్తి లేకుండా ఆయన గురించి తెలుసుకోవటం కానీ, ఆయన్ని గ్రహించటం కానీ సాధ్యం కాదు. కర్మ, జ్ఞాన, హఠ యోగులు, లేదా ఇతర మార్గ ఆధ్యాత్మిక సాధకులు, ఆయా సాధనతో పాటుగా భక్తిని కూడా జోడించకపోతే, భగవంతుడి గురించి తెలుసుకోలేరు. భగవద్గీతలో, ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు పదే పదే చెప్తున్నాడు: ‘ఆయన సర్వాంతర్యామి మరియు సర్వ భూతములు ఆయన యందే స్థితమై ఉన్నా సరే, ఆయన భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడుతాడు.’ 8.22. ‘ఓ అర్జునా, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చుని ఉన్న నన్నుగా యదార్థముగా తెలుసుకోబడుతాను. ఓ పరంతపా, అందువలన నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు.’ 11.54. ‘కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో (ఎంతటి వాడనో) తెలుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును.’ 18.55. ఈ విధంగా, భక్తి రహితంగా ఆధ్యాత్మిక పురోగతి కోసం పాటుపడే వారు భగవంతునిపై సిద్ధాంత పరమైన జ్ఞానానికే పరిమితమై పోతారు. వారికి పరమ సత్యము యొక్క వాస్తవిక అనుభవపూర్వక విజ్ఞానం లభించదు. చాలా మంది మనుష్యులలో కొద్ది మందికి మాత్రమే తాను యదార్థముగా తెలియును అని చెప్పిన పిదప శ్రీ కృష్ణుడు ఇక తన ప్రాకృతిక (భౌతిక) మరియు దివ్య శక్తుల గురించి చెప్పబోతున్నాడు. మొదట 'అపరా ప్రకృతి', అంటే భౌతిక శక్తి క్షేత్రము, గురించి పరిచయం చేస్తున్నాడు; ఇది నిమ్న స్థాయి శక్తి అయినా భగవంతుని యొక్క శక్తి స్వరూపమే.
భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ । అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ।। 4 ।।
4
7
https://www.holy-bhagava…udio/007_004.mp3
భూమిః — భూమి (నేల); ఆపః — నీరు; అనలః — అగ్ని; వాయుః — గాలి; ఖం — ఆకాశం (ఖాళీ స్థలము); మనః — మనస్సు; బుద్ధిః — బుద్ధి; ఏవ — నిజముగా; చ — మరియు; అహంకారః — అహంకారము; ఇతి — ఇవి; యం — ఇవన్నీ; మే — నా యొక్క; భిన్నా — వివిధములైన; ప్రకృతిః — భౌతిక ప్రాకృతిక శక్తి; అష్టధా — ఎనిమిది రకములు.
BG 7.4: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మరియు అహంకారము - ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు.
ఈ జగత్తుని కూర్చిన భౌతిక శక్తి, అద్భుతమైన వైవిధ్యం కలది మరియు నిగూఢమైనది. దీనిని వర్గీకరణ చేస్కుంటే, మన పరిమితమైన బుద్ధులకి కాస్త అర్థం అవుతుంది. కానీ, ఈ ప్రతి ఒక్క వర్గంలో కూడా అసంఖ్యాకమైన ఉప-వర్గాలు ఉన్నాయి. ఆధునిక శాస్త్రంలో అనుసరించే వర్గీకరణ ఏమిటంటే, అక్కడ పదార్థాన్ని మూలకముల సమ్మేళనముగా పరిగణిస్తారు. ప్రస్తుతం, 118 మూలకాలు కనుగొనబడి పీరియాడిక్ టేబుల్‌లో పొందుపరచబడ్డాయి. భగవద్గీతలో మరియు సాధారణంగా వైదిక తత్త్వజ్ఞానంలో, సమూలమైన వేరే పద్ధతి వాడబడింది. పదార్థాన్ని ప్రకృతి అంటారు, అంటే భగవంతుని శక్తి, మరియు ఈ శక్తి యొక్క ఎనిమిది అంగాలని ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది. ఆధునిక శాస్త్ర పద్ధతి యొక్క సహాయంతో ఇది ఎంత అద్భుతమైన పరిజ్ఞానమో మనం అర్థం చేసుకోవచ్చు.1905లో, తన ఆనస్ మరాబులస్ (Annus Mirabilis) సంకలనంలో, ఆల్బర్ట్ ఐన్-స్టీన్, మొదటిసారి ద్రవ్యరాశి-శక్తి యొక్క సమత్వాన్ని ప్రతిపాదించాడు. ద్రవ్యాన్ని శక్తిగా మార్చుకోగలిగే అవకాశం ఉంది అని చెప్పాడు; ఇది E = MC2 అన్న సూత్రం ప్రకారం జరుగుతుంది. ఈ దృక్పథం, అంతకు క్రితం వరకూ న్యూటన్ పరంగా, విశ్వమంతా ఘన పదార్థము తోనే ఉంది అన్న అవగాహనని సమూలంగా మార్చివేసింది. తర్వాత 1920 దశకంలో నీల్స్ బోర్ (Neils Bohr) మరియు ఇతర శాస్త్రవేత్తలు క్వాంటం థియరీ ప్రతిపాదించారు, దీనిలో ‘ద డ్యూయల్ పార్టికల్-వేవ్ నేచర్ అఫ్ మేటర్’ (the dual particle-wave nature of matter) ను ప్రతిపాదించారు. అప్పటి నుండి, శాస్త్రవేత్తలు, అన్ని పదార్థాలను, శక్తులను కలిపి ఒకే పరం గా అర్థం చేసుకోవటానికి వీలుగా ఒక ‘యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ’ (Unified Field Theory) కోసం అన్వేషిస్తున్నారు.శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఐదువేల సంవత్సరముల క్రితం, ఆధునిక శాస్త్రం అభివృద్ధి చెందక ముందే చెప్పిన విషయం, ఒక సంపూర్ణ ‘యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ’ (Unified Field Theory). ఆయన అన్నాడు, ‘అర్జునా, ఈ విశ్వంలో ఉన్నదంతా నా భౌతిక శక్తి యొక్క స్వరూపమే.’ కేవలం ఈ ఒక్క ప్రకృతి శక్తి యే ఇన్ని వివిధ రకాల ఆకారములు, స్వరూపములు, మరియు పదార్థములుగా రూపాంతరం చెందింది. ఇదే విషయం తైత్తిరీయ ఉపనిషత్తులో విస్తారంగా వివరించబడింది.తస్మద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృధివీ పృధివ్యా ఔషధయః ఔషధీభ్యోరన్నమ్ అన్నాత్పురుషః స వా ఏషః పురుషః పురుషో అన్నరసమయః (2.1.2)భౌతికశక్తి యొక్క ప్రప్రథమ మూల స్వరూపము 'ప్రకృతి'. భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించాలని సంకల్పించినప్పుడు, ఆయన అలా దాని వంక చూస్తాడు, దీనితో అది కదిలించబడి, మహాన్ గా వికసిస్తుంది. ఈ మహాన్ మరింత వికసించి అహంకారముగా వ్యక్తమౌతుంది. ఈ మహాన్, అహంకారము రెండూ కూడా ఆధునిక శాస్త్రము కన్నా సూక్ష్మమైనవి. అహంకారము నుండి పంచ-తన్మాత్రలు, అంటే ఐదు గ్రాహ్యతలు — రుచి, స్పర్శ, వాసన, దృష్టి, మరియు శబ్దములు వస్తాయి, వాటి నుండి (ఐదు) పంచ మహా-భూతములు జనిస్తాయి — ఆకాశం, గాలి, అగ్ని, నీరు, మరియు భూమి.ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, పంచ మహా భూతములను తన శక్తి యొక్క రూపాంతరములగా పేర్కొనటమే గాక, మనస్సు, బుద్ధి, మరియు అహంకారములను కూడా తన విశిష్ట శక్తి స్వరూపాలుగా ఇందులో జోడించాడు. ఇవన్నీ కేవలం తన భౌతిక శక్తి, మాయ, యొక్క విభాగాలే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. వీటన్నిటి కన్నా అతీతమైనది 'జీవ శక్తి' (ఆత్మ శక్తి), లేదా భగవంతుని ఉన్నతమైన శక్తి - దీనిని తదుపరి శ్లోకంలో కృష్ణుడు వివరిస్తున్నాడు.
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ । జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ।। 5 ।।
5
7
https://www.holy-bhagava…udio/007_005.mp3
అపరా — నిమ్నమైన; ఇయం — ఈ యొక్క; ఇతః — దీనికంటే; తు — కానీ; అన్యాం — వేరైన; ప్రకృతిం — శక్తి; విద్ధి — తెలుసుకొనుము; మే — నా యొక్క; పరామ్ — ఉన్నతమైనది; జీవ-భూతాం — ప్రాణులు; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; యయా — ఎవరిచే; ఇదం — ఈ యొక్క; ధార్యతే — ఆధారము; జగత్ — భౌతిక జగత్తు.
BG 7.5: ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, ఓ గొప్ప బాహువులు కల అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ శక్తి (ఆత్మ శక్తి), అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది.
శ్రీకృష్ణుడు ఇక ఇప్పుడు పూర్తిగా భౌతిక శాస్త్ర పరిధి దాటి పోతున్నాడు. ఇంతకు క్రితం శ్లోకంలో పేర్కొన్న ఎనిమిది అంగముల ప్రకృతి తన తక్కువ స్థాయి భౌతిక శక్తి అని వివరిస్తున్నాడు. కానీ, ఉన్నది అది మాత్రమే కాదు. ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి ఇంకోటి కూడా ఉంది, ఇది జడ పదార్థం కంటే పూర్తిగా అతీతమైనది. ఈ శక్తియే 'జీవ శక్తి', ఇది జగత్తు లోని సమస్త ఆత్మలను కలిగి ఉంటుంది.జీవుడికి (జీవాత్మ), మరియు భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం భారత దేశం యొక్క మహోన్నత తత్త్వవేత్తలచే ఎన్నో రకాల దృక్పథాల ద్వారా వివరించబడింది. అద్వైత తత్త్వవేత్తలు ఇలా పేర్కొంటారు : జీవో బ్రహ్మైవ నాపరః , ‘ఆత్మయే భగవంతుడు.’ కానీ, ఈ వాదన ఎన్నో జవాబు ఇవ్వలేని ప్రశ్నలను కలిగిస్తుంది:– భగవంతుడు సర్వ శక్తిమంతుడు మరియు మాయ ఆయన అధీనంలో ఉండే శక్తి. జీవాత్మయే భగవంతుడయితే, అది మాయకి ఎలా వశం అయిపోయింది? మాయ అనేది భగవంతుని కంటే శక్తివంతమయినదా?– మనందరికీ, ఆత్మ అజ్ఞానంచే బాధించబడుతున్నదని తెలుసు. కాబట్టి, దానికి భగవద్గీత వంటి శాస్త్రముల మరియు సత్పురుషుల ఉపదేశం యొక్క అవసరాన్ని అది గ్రహిస్తుంది. ఈ అజ్ఞానపూరితంగా ఉండే ఆత్మ సర్వజ్ఞుడైన భగవంతునిలా ఎలా అవుతుంది?– భగవంతుడు జగత్తులో సర్వ వ్యాపి. ఇది వేదాల్లో పదే పదే చెప్పబడింది. ఒకవేళ ఆత్మయే భగవంతుడైతే ఆత్మ అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఉండాలి; కాబట్టి మరణించిన పిదప స్వర్గానికి పోవటం లేదా నరకానికి పోవటం అన్న ప్రశ్న ఎక్కడిది?– ఆత్మలు అసంఖ్యాకముగా ఉంటాయి, మరియు వాటన్నిటికీ తమతమ వ్యక్తిగత అస్తిత్వం ఉంది. కానీ, భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు, ఆత్మయే దేవుడయితే, మరి ఎన్నెన్నో దేవుళ్ళు ఉండాలి.ఈ విధంగా, ఆత్మయే భగవంతుడు అన్న అద్వైత తత్త్వవేత్తల ప్రతిపాదన, అర్థరహితమైనదిగా మనం గ్రహించవచ్చు. అదే సమయంలో, ద్వైత తత్త్వవేత్తలు ఆత్మ భగవంతుని కంటే వేరైనదిగా చెప్తారు. ఇది పైనున్న వాటిల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది, కానీ, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్న దానితో పోలిస్తే, అది అసంపూర్ణ అవగాహనే అవుతుంది. ఆత్మ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తిలో భాగమే అని ఆయన అంటున్నాడు.వేద శాస్త్రములు మనకు ఉపదేశించేది ఏంటంటే, భగవంతుడు సర్వోన్నత శక్తిమంతుడు, మరియు ఉన్నదంతా - ఆధ్యాత్మికమైనా, భౌతికమైనా - ఆయన నిమ్న స్థాయి లేదా ఆయన ఉన్నత స్థాయి శక్తులతో కూడుకున్నదే.ఏక-దేశ-స్థితస్యాగ్నే:జ్యోత్స్నా విస్తారిణీ యథాపరస్య బ్రహ్మణః శక్తి: తథేదమ్ అఖిలం జగత్‌(విష్ణు పురాణం 1.22.53)‘ఎలాగైతే సూర్యుడు ఒక చోటే ఉన్నా, కానీ, తన సూర్య కిరణములచే ఈ సౌర కుటుంబమంతా ఎలా వ్యాపిస్తాడో, అదే విధంగా ఉన్నది ఒక్కడే భగవంతుడు, తన అనంతమైన శక్తులచే ఈ మూడు లోకాలలో వ్యాపించి ఉంటాడు.’ చైతన్య మహాప్రభు అన్నాడు:జీవ-తత్త్వ శక్తి, కృష్ణ-తత్త్వ శక్తిమాన్గీతా-విష్ణుపురాణాది తాహాతే ప్రమాణ(చైతన్య చరితామృతము, ఆది లీల, 7.117)‘ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపము, మరియు ఆయనే సర్వోన్నత శక్తిమంతుడు.’ఒక్కసారి, మనం ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపమని ఒప్పుకున్నప్పుడు, ఆ తదుపరి, సమస్త సృష్టి యొక్క అద్వైతం అవగతమవుతుంది. ఏదేని శక్తి, ఏకకాలంలో శక్తివంతుని కన్నా భేదమే మరియు అభేదమే. ఉదాహరణకి, అగ్ని మరియు దాని వేడిమి, వెలుగులను - అగ్ని కంటే వేరుగా చూడవచ్చు లేదా ఈ రెంటినీ ఒకటిగానే చూడవచ్చు. ఈ విధంగా మనం ఆత్మను, భగవంతుడిని - శక్తి, శక్తిమంతుడు అన్న దృక్పథం తో ఒక్కటి గానే చూడవచ్చు, కానీ, ఆత్మ, భగవంతుడు - లను వేరువేరుగా కూడా చూడవచ్చు, ఎందుకంటే శక్తి, శక్తిమంతుడు విభిన్న అస్తిత్వములే కాబట్టి.శ్రీ కృష్ణుడు 7.4వ మరియు 7.5వ శ్లోకాలలో చెప్పినమాటని పొందుపరుస్తూ, జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు, తన భక్తి శతకంలో, ఈ విషయాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచారు:జీవు, మాయా దుఇ శక్తి హైఁ, శక్తిమాన్ భగవాన్శక్తిహిఁ భేద్ అభేద్ భీ, శక్తిమాన్ తే జాన్(భక్తి శతకము, 42వ శ్లోకము)‘జీవాత్మ మరియు మాయ రెండూ కూడా భగవంతుని శక్తులే. కాబట్టి, అవి రెండూ భగవంతునికి అభేదమే మరియు భగవంతుని కంటే వేరు కూడా.’శక్తులు మరియు శక్తిమంతుడు ఒకటే అన్న దృక్పథంతో, సమస్త జగత్తు కూడా భగవంతుని కంటే అభేదమే. ఈ విధంగా, సమస్త జగత్తు యదార్థ భగవత్ స్వరూపమే అని చెప్పబడింది.సర్వం ఖల్విదం బ్రహ్మ (ఛాందోగ్య ఉపనిషత్తు 3.14.1)‘సర్వం బ్రహ్మమే.’ఈశావాస్యం ఇదం సర్వం (ఈశోపనిషత్తు 1)‘ఈ జగత్తులో ఉన్నదంతా బ్రహ్మమే.’పురుష ఏవేదం సర్వం (శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.15)‘ఉన్నదంతా ఆ సర్వోన్నతమైన దివ్య మంగళ స్వరూపమే’ఇవన్నీ వేద మంత్రములు కూడా, ఉన్నది ఒక్కడే భగవంతుడు, మరివేరే ఇతరమైనది ఏదీ లోకంలో లేదు అని పేర్కొంటున్నాయి. అదే సమయంలో, శక్తి మరియు శక్తిమంతుడుకి ఉన్న భిన్నత్వం పరంగా, ఈ ఏకత్వం లోనే బ్రహ్మాండమైన వైవిధ్యం కూడా ఉంది, అని మనం అర్థం చేసుకోవచ్చు. జీవాత్మ వేరు; పదార్థం వేరు; భగవంతుడు వేరు. పదార్థం అచేతనమైనది (జడమైనది), అదే సమయంలో ఆత్మ చైతన్యవంతమయినది, కానీ భగవంతుడు సర్వోత్కృష్ట చైతన్యవంతమై ఉండి, ఆయనే సమస్త పదార్థద్రవ్యములకు, ఆత్మలకు రెంటికీ మూల ఉత్పత్తిస్థానము. సృష్టిలో ఉన్న మూడు అస్తిత్వాల గురించి చాలా వేద మంత్రములు చెప్తున్నాయి:క్షరం ప్రధానమమృతాక్షరం హరఃక్షరాత్మానావీషతే దేవ ఏకఃతస్యాభిధ్యానాద్ యోజనాత్ తత్త్వభావద్భూయశ్చాంతే విశ్వమాయానివృత్తిః(శ్వేతాశ్వతర ఉపనిషత్తు 1.10) ‘మూడు అస్తిత్వాలు ఉన్నాయి: 1) పదార్థము/ద్రవ్యము, ఇది నశించేది. 2) జీవాత్మలు, ఇవి నాశము లేనివి. 3) భగవంతుడు, ఈయన పదార్థము మరియు ఆత్మ లను కూడా నియంత్రించే వాడు. భగవంతుని పై ధ్యానం చేయటం వలన, ఆయనతో ఏకమవటం వలన మరియు ఆయనలా అవటం వలన, ఆత్మ, ఈ ప్రపంచపు మాయ నుండి స్వేచ్ఛ పొందుతుంది.’అద్వైత మరియు ద్వైత మంత్రముల రెంటినీ కూడా వేదములు అర్థవివరణచేయటం మనం గమనించవచ్చు. జగద్గురు శ్రీ క్రుపాలు జీ మహారాజ్, ఈ ఆత్మ-పరమాత్మల ఏకకాల అచింత్య భేదాభేద వాదననే బలపరిచాడు.
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ । అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ।। 6 ।।
6
7
https://www.holy-bhagava…udio/007_006.mp3
ఏతత్ యోనీని — ఈ రెండు (శక్తులు) మూలాధారము; భూతాని — ప్రాణులు; సర్వాణి — సమస్త; ఇతి — అది; ఉపధారయ — తెలుసుకొనుము; అహం — నేను; కృత్స్నస్య — సమస్త; జగతః — సృష్టి (జగత్తు); ప్రభవః — ఉత్పత్తిస్థానము; ప్రలయ — లయము; తథా — కూడా.
BG 7.6: సమస్త జీవ రాశులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తిస్థానము మరియు నా లోనికే ఇది అంతా లయమై పోతుంది.
ఈ జడపదార్థము మరియు జీవశక్తుల సంయోగం వలనే, భౌతిక జగత్తులో ఉన్న సమస్త జీవరాశి ఉద్భవిస్తుంది. తనంతట తానుగా అయితే, పదార్థము జడమైనది; ఆత్మకి శరీరం రూపంలో ఒక వాహనం అవసరం. ఈ రెండు శక్తుల సంయోగం వలన, ప్రాణులు వ్యక్తమవుతాయి. భగవంతుడే ఈ రెండు శక్తులకి మూల స్థానం; సమస్త సృష్టి ఆయన నుండే వ్యక్తమౌతుంది. బ్రహ్మగారి యొక్క నూరు సంవత్సరములు పూర్తయినప్పుడు, ఈ సృష్టి చక్రం ముగింపు దశ చేరుకున్నప్పుడు, భగవంతుడు ఈ సృష్టిని లయము చేస్తాడు. ఐదు స్థూల మూలకాలు, ఐదు సూక్ష్మతత్త్వాలలో విలీనమౌతాయి; ఐదు సూక్ష్మతత్త్వాలు అహంకారంలో విలీనమౌతాయి; అహంకారము మహాత్తులోనికి లీనమవుతుంది. మహత్తు అనేది ప్రకృతి లోనికి విలీనమవుతుంది. ప్రకృతి, శ్రీ మహా విష్ణువు శరీరం లోనికి వెళ్లి కూర్చుంటుంది. ఈ ప్రస్తుత సృష్టి చక్రంలో మోక్షము పొందలేక పోయిన జీవులు (ఆత్మలు) కూడా భగవంతుని శరీరంలో అవ్యక్త రూపంలో, తదుపరి సృష్టి చక్రం కోసం వేచి ఉంటారు. మరొకసారి, భగవంతుడు సృష్టి చేయటం సంకల్పించినప్పుడు, ఈ చక్రం మొదలౌతుంది (7.4వ శ్లోక వ్యాఖ్యానంలో చెప్పినట్టుగా) మరియు ఈ జగత్తు వ్యక్తమవుతుంది. కాబట్టి, సమస్త సృష్టికి, సర్వ-భూతములకూ, భగవంతుడే జన్మ స్థానము, ఆధారము మరియు అంతిమ శాంతి స్థానం.
మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ । మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ।। 7 ।।
7
7
https://www.holy-bhagava…udio/007_007.mp3
మత్తః — నా కంటే; పర-తరం — ఉన్నతమైనది; న అన్యత్ కించిత్ అస్తి — వేరైనది ఏదియునూ లేదు; ధనంజయ — అర్జునా, ధనమును జయించేవాడా; మయి — నా యందే; సర్వం — సమస్తము; ఇదం — మనకు కనిపించే ఇవి; ప్రోతం — ఆధారపడి (దూర్చబడి) ఉన్నవి; సూత్రే — దారం పై; మణి-గణాః — పూసలు; ఇవ — లాగా.
BG 7.7: నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.
సర్వోత్కృష్ట భగవానుడు శ్రీ కృష్ణుడు ఇక అన్నిటికన్నా ఉత్కృష్టమైన తన అత్యున్నత స్థానం గురించి మరియు తన ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనే విశ్వానికి సృష్టికర్త, స్థితికర్త, మరియు లయకర్త. ఆయనే అన్నింటి అస్తిత్వానికి మూలాధారము. దారంలో గుచ్చిన పూసల యొక్క ఉపమానం ఇక్కడ వాడబడింది. అదే విధంగా, జీవాత్మలు తమకు నచ్చినట్టుగా చేసుకునే స్వేచ్ఛ ఉన్నా, దానిని వారికి ప్రసాదించినది భగవంతుడే, అందరిని నిలబెట్టి సంరక్షించేది ఆయనే, మరియు ఆయన యందే అందరూ ఉంటారు. కాబట్టి, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్యశక్తిర్వివిధైవ శ్రూయతే (6.8)‘భగవంతునితో సమానమైనది ఏదీ లేదు, ఆయన కన్నా ఉన్నతమైనది ఏమీ లేదు’భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకం, చాలా మంది మనస్సులో ఉన్న సందేహాన్ని నివృత్తి చేస్తుంది, వారు శ్రీ కృష్ణుడు పరమ సత్యము కాదని, కృష్ణుడికే మూలాధారమైన ఇంకేదో నిరాకార తత్త్వం ఉందని అనుకుంటారు. కానీ, ఈ శ్లోకంలో ఆయన, అర్జునుడి ముందు నిల్చొని ఉన్న తన యొక్క ఈ శ్రీకృష్ణ సాకార రూపంలో ఉన్న అతనే, సర్వోన్నత సర్వోత్కృష్ట పరమ సత్యమని స్పష్టంగా చెప్తున్నాడు. ఆ ప్రకారంగా, ప్ర-ప్రథమంగా జన్మించిన బ్రహ్మ, శ్రీ కృష్ణుడిని ఈ క్రింది విధంగా స్తుతించాడు.ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహఃఅనాదిరాదిర్ గోవిందః సర్వ కారణకారణమ్(బ్రహ్మ సంహిత 5.1)‘శ్రీ కృష్ణుడే పరమేశ్వరుడు; ఆయన సనాతనుడు (నిత్యుడు), సర్వజ్ఞుడు, మరియు అనంతమైన ఆనంద స్వరూపుడు. ఆయన ఆది, అంతము లేనివాడు, అన్నిటికి మూలహేతువు, సర్వ కారణ కారకుడు’
రసోఽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః । ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ।। 8 ।।
8
7
https://www.holy-bhagava…udio/007_008.mp3
రసః — రుచి; అహం — నేను; అప్సు — నీటిలో; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; ప్రభా — తేజస్సు; అస్మి — నేను; శశి-సూర్యయోః — సూర్య చంద్రులలో; ప్రణవః — పవిత్రమైన 'ఓం' కారము; సర్వ — సమస్త; వేదేషు — వేదములు; శబ్దః — శబ్దము; ఖే — ఆకాశంలో; పౌరుషం — సామర్థ్యము; నృషు — మనుష్యులలో.
BG 7.8: నీటి యందు రుచిని నేను, ఓ కుంతీ పుత్రుడా, మరియు సూర్య చంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములలో నేను పవిత్ర 'ఓం' కారమును (ప్రణవము); ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును.
తానే అన్నిటికీ మూలము మరియు ఆధారము అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు తను చెప్పిన దానిలో ఉన్న యదార్థమును ఈ నాలుగు శ్లోకాలలో చెప్తున్నాడు. మనం పండ్లు తిన్నప్పుడు, ఆ రుచిలో ఉన్న తియ్యదనం, అందులో చక్కెర ఉంది అన్న విషయాన్ని సూచిస్తుంది. అదే విధంగా, శ్రీ కృష్ణుడు తన శక్తి యొక్క సమస్త రూపాంతరాలలో తన ఉనికిని ప్రకటిస్తున్నాడు. అందుకే, నీటి యందు ఉన్న రుచి తనే అంటున్నాడు, అది దాని ప్రత్యేక సహజ స్వభావము. ఎవరైనా నీటి యొక్క రుచిని నీటి నుండి వేరు చేయగలరా? మిగతా అన్ని భౌతిక శక్తి స్వరూపాలు - వాయువులు, అగ్ని, ఘన పదార్థములు – వీటికి తమ రుచిని వ్యక్తీకరించటానికి నీరు కావాలి. తేమ లేని (ఎండిన) నాలుకపై ఎదైనా ఘనపదార్థమును పెట్టి ప్రయత్నించండి, మీకేమీ రుచి తెలియదు. కానీ, ఘన పదార్థములు నోటిలోని లాలాజలములో కరిగినప్పుడు, వాటి యొక్క రుచి నాలిక పైనున్న రసాంకురములకు (taste buds) తెలుస్తుంది. అదే విధంగా, ఆకాశము శబ్దమునకు వాహకం లాగా పని చేస్తుంది. శబ్దమే ఎన్నో రకాల భాషలుగా రూపాంతరం చెందుతుంది, మరియు శ్రీ కృష్ణుడు తనే వీటన్నిటికి మూలాధారము అని వివరిస్తున్నాడు, ఎందుకంటే ఆకాశంలో ఉండే శబ్దము తన శక్తి స్వరూపమే. ఇంకా, తనే వేద మంత్రాలకు ముఖ్యమైన 'ఓం' కారమును (ప్రణవము) అని అంటున్నాడు. సమస్త మానవులలో వ్యక్తమయ్యే సామర్థ్యానికి కూడా శ్రీ కృష్ణుడే మూల శక్తి.
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ । జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ।। 9 ।।
9
7
https://www.holy-bhagava…udio/007_009.mp3
పుణ్యః — స్వచ్ఛమైన; గంధ: — సువాసన; పృథివ్యాం — భూమి యొక్క; చ — మరియు; తేజః — తేజస్సు; చ — మరియు; అస్మి — నేను; విభావసౌ — అగ్నిలో; జీవనం — ప్రాణ శక్తి; సర్వ — అన్నిటిలో; భూతేషు — ప్రాణులు; తపః — తపస్సు; చ — మరియు; అస్మి — నేను; తపస్విషు — తపస్విలలో.
BG 7.9: భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను మరియు అగ్నిలోని తేజస్సును నేనే. సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపసులలో తపస్సును నేనే.
అన్నిటికీ మూల సూత్రము తానే అని శ్రీ కృష్ణుడు చెప్పటం కొనసాగిస్తూనే ఉన్నాడు. శారీరక సుఖాలని త్యజించి, బుద్ధి పూర్వకంగా చిత్తశుద్ధి కోసం నియమ-నిష్ఠలను పాటించటమే తాపసుల ప్రత్యేకత. తానే వారి తపస్సు చేసే సామర్థ్యము అని భగవంతుడు అంటున్నాడు. భూమిలో ఉన్న సుగంధము ఆయనే, అదే దాని ప్రధానమైన గుణము; అగ్నిలో, జ్వాల యొక్క వెలుగు ఆయనే.
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ । బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।। 10 ।।
10
7
https://www.holy-bhagava…udio/007_010.mp3
బీజం — విత్తనము; మాం — నేను; సర్వ-భూతానాం — సమస్త ప్రాణులకు; విద్ధి — తెలుసుకొనుము; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; సనాతనమ్ — నిత్య శాశ్వతమైన; బుద్ధిః — బుద్ధి; బుద్ధి-మతాం — తెలివైనవారిలో (బుద్ధిమంతులలో); అస్మి — నేను; తేజః — తేజస్సు; తేజస్వినామ్ — తేజోవంతులలో; అహమ్ — నేను.
BG 7.10: ఓ అర్జునా, సమస్త ప్రాణులకూ సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే.
కారణమే కార్యమునకు బీజము అని చెప్పబడుతుంది. కాబట్టి, సముద్రమే మేఘములకు బీజం అని చెప్పవచ్చును; మేఘములే వర్షానికి బీజము. సమస్త ప్రాణుల సృష్టికి తానే బీజము అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.జగత్తులో ఉన్న సమస్త పదార్థమూ భగవంతుని శక్తి స్వరూపమే కాబట్టి, మహోన్నత వ్యక్తులలో కనిపించే అద్భుతమైన గుణాలు, వారిలో వ్యక్తమైన భగవంతుని శక్తులే. తెలివికలవారు తమ ఆలోచన మరియు ఉపాయములలో ఉన్నతమైన ప్రజ్ఞ ప్రదర్శిస్తారు. వారి ఆలోచనలు తేజోవంతముగా, విశ్లేషణాత్మకంగా చేసే సూక్ష్మ శక్తి, తనే అని భగవంతుడు అంటున్నాడు.ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రపంచాన్ని మెరుగుపరిచే విధంగా అత్యద్భుతమైన ప్రతిభా పాటవాలని ప్రదర్శించినప్పుడు, భగవంతుని శక్తి వారి ద్వారా ఆవిధంగా పనిచేస్తున్నట్టు మనం తెలుసుకోవాలి. విలియం షేక్స్పియర్ ఆంగ్ల సాహిత్యంలో తిరుగులేని తేజోవంతమైన ప్రజ్ఞని ప్రదర్శించాడు, ఈ నాటికి కూడా అంతగొప్ప సాహిత్యం లేదు. బహుశా, ప్రపంచంలో ఒక ప్రధాన భాషైన ఆంగ్ల భాష సాహిత్యాన్ని మరింత ఇనుమడింపచేయటానికి భగవంతుడే ఆయన బుద్ధిని ప్రేరేపించి ఉండవచ్చు. బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క ప్రయోజనం ఏమిటంటే ప్రపంచాన్ని ఒక్క భాషతో ఏకీకృతం చేయటమే, అని స్వామీ వివేకానంద అన్నాడు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంని, విపణిలో తొంభై శాతం వాటాతో అగ్రగామిగా చేయటానికి బిల్ గేట్స్ ఏంతో వ్యాపార తెలివిని ప్రదర్శించాడు. ఇదే గనక జరగక ఉండి ఉంటే, ప్రపంచం మొత్తం ఉన్న కంప్యూటర్స్ లో ఎన్నెన్నో ఆపరేటింగ్ సిస్టంలు ఉండి ఉండేవి; దీనితో చాలా గందర గోళం అయిఉండేది. బహుశా, సునాయాస సమాచార మార్పిడి కోసం, ప్రపంచంలో ఒక ప్రధాన ఆపరేటింగ్ సిస్టం ఉండాలని భగవంతుడు సంకల్పించాడో ఏమిటో, ఆయన ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞని ఈ పని కోసం పెంపొందించాడు.మహాత్ములు, సహజంగానే, తమ పని యొక్క అందాన్ని, ప్రజ్ఞను మరియు జ్ఞానాన్ని భగవత్ కృపకే ఆపాదించారు. మహర్షి తులసీదాసు ఇలా అన్నాడు:న మైఁ కియా న కరి సకూఁ, సహిబ కర్తా మోర్కరత కరావత ఆప హైఁ, తులసీ తులసీ శోర్‘నేను కాదు రామాయణం రాసినది, నాకు రాసే శక్తి కూడా లేదు. ఇది చేసేవాడు భగవంతుడే. ఆయనే నా పనులు నిర్దేశిస్తాడు, నా ద్వారా పనిచేస్తాడు, కానీ, ప్రపంచం తులసీదాసు చేస్తున్నాడు అనుకుంటుంది.’ ఇక్కడ, శ్రీ కృష్ణుడు స్పష్టంగా చెప్పేదేమిటంటే, ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞ తనే మరియు తెలివికలవారిలో తెలివి తానే, అని.
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ । ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ।। 11 ।।
11
7
https://www.holy-bhagava…udio/007_011.mp3
బలం — బలము; బల-వతాం — బలవంతులలో; చ — మరియు; అహం — నేను; కామ — కోరిక; రాగ — మోహము; వివర్జితమ్ — లేకుండా; ధర్మ-అవిరుద్ధః — ధర్మ విరుద్ధము కాని; భూతేషు — సర్వ భూతములలో; కామః — లైంగిక క్రియలు; అస్మి — నేను; భరత-ఋషభ — అర్జునా, భరతులలో శ్రేష్ఠుడా.
BG 7.11: భరత వంశీయులలో శ్రేష్ఠుడా, బలవంతులలో కామరాగరహితమైన బలము నేను. ధర్మ విరుద్ధముకాని, శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలను నేనే.
రాగము (మోహము) అనేది ఇంకా పొందని వస్తువుల కోసం ఉన్న కోరిక. అనురాగము/మమకారాసక్తి అంటే, ఒకసారి అనుభవించిన తరువాత, కోరుకున్న వస్తువు మరింత కావాలనే ఉద్వేగాన్ని రగిల్చే స్తబ్దముగా ఉండే మానసిక భావము. కాబట్టి శ్రీ కృష్ణుడు కామ-రాగ-వివర్జితం అంటే, ‘మోహము-అనురాగము లేకుండా’ అని అన్నప్పుడు, తన బలము యొక్క స్వభావం గురించి చెప్తున్నాడు. మనుష్యులకు తమ క్రమం తప్పకుండా, విరామం లేకుండా, తమ ధర్మములని ఆచరించటానికి కావలసిన బలాన్ని ఇచ్చే నిర్మలమైన, మహనీయమైన శక్తి స్వరూపం శ్రీ కృష్ణుడే. నియమానుసార రహితంగా ఇంద్రియ సుఖాలకోసం చేసే లైంగిక కార్యకలాపాలు మృగప్రాయమైనవి. కానీ, గృహస్థాశ్రమంలో భాగంగా, ధర్మ విరుద్ధం కాకుండా, సంతానం కోసమే అయితే అది శాస్త్ర అనుగుణంగా ఉన్నట్టే. ఇటువంటి ధర్మబద్ధమైన, నియంత్రణ లో ఉన్న, వైవాహిక సంబంధం లోబడి ఉన్న లైంగిక కార్యము, తానే అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే। మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ।। 12 ।।
12
7
https://www.holy-bhagava…udio/007_012.mp3
యే — ఏదైతే; చ — మరియు; ఏవ — నిజముగా; సాత్త్వికాః — సత్త్వగుణములో; భావాః — భౌతిక అస్తిత్వంలో ఉన్న దశలు; రాజసాః — రజోగుణములో; తామసాః — తమస్సు; చ — మరియు; యే — ఏదైనా; మత్తః — నా నుండి; ఏవ — నిజముగా; ఇతి — ఈ విధముగా; తాన్ — అవి; విద్ధి — తెలుసుకొనుము; న — లేదు; తు — కానీ; అహం — నేను; తేషు — వాటిలో; తే — అవి; మయి — నా యందు.
BG 7.12: భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు — సత్త్వము, రజస్సు, తమస్సు — నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నా యందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను.
తన యొక్క మహిమలను ఇంతకు క్రితం నాలుగు శ్లోకాలలో వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు వాటి సారాంశం ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ‘అర్జునా, నేనే సమస్త వస్తువిషయములలో ఉన్న మూల సారము ఎలాగో చెప్పి ఉన్నాను. కానీ, ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్లి లాభం లేదు. అన్నీ మంచి, చెడు, మరియు వికృత వస్తువులు మరియు స్థితిగతులు నా శక్తి ద్వారానే సాధ్యమవుతున్నాయి.’ సమస్త వస్తువులు భగవంతుని నుండే ఉద్భవించినా, ఆయన మాత్రం వాటికంటే స్వతంత్రుడు మరియు వాటికి అతీతుడు. ఆల్ఫ్రెడ్ టెన్నీసన్ ఇదే విషయాన్ని తన ప్రఖ్యాత కవిత ‘ఇన్ మెమోరియం’ (In Memorium) లో ఇలా వ్యక్తపరిచాడు: Our little systems have their day; They have their day and cease to be. They are but broken lights of thee, And thou, O Lord, art more than they.
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ । మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ।। 13 ।।
13
7
https://www.holy-bhagava…udio/007_013.mp3
త్రిభిః — మూడింటి; గుణ-మయైః — ప్రకృతి గుణములతో కూడియున్న; భావైః — దశలు; ఏభిః — ఇవి అన్ని; సర్వం — సర్వము; ఇదం — ఈ యొక్క; జగత్ — జగత్తు; మోహితం — మోహామునకు గురై; న అభిజానాతి — తెలుసుకొనలేక; మాం — నన్ను; ఏభ్యః — ఈ; పరం — సర్వోన్నత; అవ్యయం — అనశ్వరమైన/నిత్యమైన.
BG 7.13: మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై (మోహితులై), ఈ లోకంలోని జనులు, అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు.
ఇంతకు క్రితం శ్లోకాలు విన్న తరువాత, అర్జునుడు ఇలా అనుకునే అవకాశం ఉంది, ‘ఓ ప్రభూ, ఇవన్నీ గనక నీ విభూతులే అయి ఉంటే, శ్రీ కృష్ణా, నీవే సర్వేశ్వరుడవని, సమస్త సృష్టికి మూలమని కోట్ల మంది మనుష్యలు నిన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు?’ అని. దీనికి జవాబుగా, శ్రీ కృష్ణుడు అంటున్నాడు, సత్త్వము, రజస్సు, తమస్సు లతో కూడిఉన్న ప్రకృతి త్రిగుణములచే జనులు మోహితులై పోతున్నారు అని అంటున్నాడు. మాయ యొక్క ఈ మూడు గుణములు వారి యొక్క బుద్ధిని కప్పివేయటం వలన, వారు క్షణభంగురమైన శారీరక సుఖాలకు ఆకర్షితులౌతారు. ‘మాయ’ అన్న పదానికి ఉన్న అర్థాలలో ఒకటి, ‘మా’ (కాదు) మరియు ‘యా’ (ఉన్నది). కాబట్టి, మాయ అంటే, ‘మనకు అనిపించినట్టుగా ఉన్నది కాదు’ అని. భగవంతుని శక్తి స్వరూపంగా మాయ అనేది ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటుంది. ఇంకా భగవత్ ప్రాప్తికి అర్హత సాధించని జీవాత్మల నుండి, పరమేశ్వరుని నిజమైన స్వభావాన్ని కప్పివేసి ఉంచటమే, అది చేసే సేవ. మాయ అనేది, ఈశ్వర విముఖంగా ఉన్న జీవాత్మలకు ఎర వేసి, మోహమునకు గురి చేస్తుంది. అదే సమయంలో, మాయ, జీవాత్మలను, మూడు రకాల భౌతిక బాధలకు గురిచేస్తూ ఎన్నోరకాల కష్టాలతో దుఃఖాన్ని కలుగచేస్తుంది. ఈ విధంగా, ఈశ్వర సన్ముఖంగా అయ్యేంతవరకూ వారికి సంతోషము లేదు అన్న విజ్ఞానాన్ని జీవాత్మలకు తెలియచేసేటానికి ప్రయత్నిస్తుంది.
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా । మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ।। 14 ।।
14
7
https://www.holy-bhagava…udio/007_014.mp3
దైవీ — దివ్యమైన; హి — నిజముగా; ఏషా — ఈ యొక్క; గుణ-మయీ — ప్రకృతి త్రి గుణములతో కూడిన; మమ — నా యొక్క; మాయా — మాయ, భగవంతుని బాహ్య శక్తి; దురత్యయా — అధిగమించటానికి చాలా కష్టతరమైనది; మాం — నాకు; ఏవ — ఖచ్చితంగా; యే — ఎవరైతే; ప్రపద్యంతే — శరణాగతి చేసెదరో; మాయాం ఏతాం — ఈ మాయ; తరంతి — దాటిపోవురు; తే — వారు.
BG 7.14: ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, 'మాయ', అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ, నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు.
భౌతిక శక్తి అనేది మిథ్య (లేనిది) అని కొంత మంది అంటారు. మనం అజ్ఞానంలో ఉన్నాము కాబట్టి మనకు మాయ గోచరిస్తున్నది అంటారు, కానీ ఒకవేళ మనం జ్ఞానంలో స్థితులమై ఉంటే మాయ అనేది ఉండదు, అని అంటారు. భ్రాంతి తొలిగిపోయి, ఆత్మయే పరమ సత్యమని తెలుసుకుంటామని అంటారు. కానీ, భగవద్గీత యొక్క ఈ శ్లోకం, ఈ సిద్ధాంతాన్ని కొట్టివేస్తున్నది. మాయ అనేది మిథ్య కాదు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు; అది భగవంతుని యొక్క శక్తి స్వరూపం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా ఇలా పేర్కొంటున్నది:మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌ (4.10)“మాయ అనేది శక్తి (ప్రకృతి), భగవంతుడు శక్తిమంతుడు.”రామచరితమానస్ ఇలా పేర్కొంటున్నది:సో దాసీ రఘుబీర కి సముఝేం మిథ్యా సోపి‘మాయ అనేది మిథ్య (లేనిది) అని కొంతమంది అనుకుంటారు, కానీ నిజానికి అది భగవత్ సేవలో నిమగ్నమయిన శక్తి స్వరూపం.’ఇక్కడ, శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, మాయ అనేది అధిగమించటానికి చాలా కష్టమైనది, అని. ఎవరైనా మాయను వశపరుచుకున్నారంటే, దాని అర్థం, ఆ వ్యక్తి భగవంతుడిని జయించినట్టే. ఎవ్వరూ కూడా భగవంతుడిని జయించలేరు కాబట్టి ఎవ్వరూ కూడా మాయని కూడా జయించలేరు. మరియు, మనస్సు అనేది మాయతో తయారయినదే కాబట్టి, ఏ యోగి, జ్ఞాని, తపస్వీ, లేదా కర్మి కూడా కేవలం స్వీయశక్తిచే మనస్సుని విజయవంతంగా నియత్రించలేరు.అప్పుడు అర్జునుడు ఇలా అడగవచ్చు, ‘నేను మరి ఎలా ఈ మాయను అధిగమించవచ్చు?’ అని. దీనికి సమాధానాన్ని శ్రీ కృష్ణుడు ఈ శ్లోక రెండవ పాదంలో ఇస్తున్నాడు. ‘అర్జునా, పరమేశ్వరుడినైన నాకు, నీవు శరణాగతి చేస్తే, అప్పుడు నా కృపచే, నేను నిన్ను ఈ భౌతిక జగత్తు అనే సాగరాన్ని దాటింపచేస్తాను. ఈ జీవాత్మ నాదై పోయింది (నన్ను ఆశ్రయం పొందింది) అని, దయచేసి దీన్ని విడిచిపెట్టు అని, మాయకు సూచిస్తాను.’ అని అంటున్నాడు. ఎప్పుడైతే ఈ భౌతిక శక్తికి భగవంతుని నుండి సూచన వస్తుందో, అది ఆత్మను తన బంధము నుండి వెంటనే విడిచిపెడుతుంది. మాయ ఇలా అంటుంది, ‘నా పని ఇంతే — భగవంతుని చరణములను చేరుకునేంత వరకూ జీవాత్మను బాధలకు గురి చేస్తూ ఉండటమే. ఈ జీవాత్మ ఈశ్వర శరణాగతి చేసింది కాబట్టి ఇక నా పని అయిపోయింది.’ఈ విషయాన్ని ఒక రోజువారి సాధారణ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోండి. మీరు మీ స్నేహితుడిని కలవటానికి వెళ్లి, అతని ఇంటి గేటు వద్దకు చేరుకున్నారనుకోండి. ఆయన గేటుకి ‘కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు ఉంది. అతని పెంపుడు జర్మన్ షెపర్డ్ కుక్క లోపల నిలబడి ఉంది మరియు ఒక సుశిక్షితమైన కుక్కలా, మీవైపు కోపంతో గుర్రుమంటుంది. మీరు వెనక గేటు నుండి లోనికి వెళ్ల ప్రయత్నిద్దామని గోడ చుట్టూ వెళ్తారు. కానీ, ఆ కుక్క కూడా చుట్టు తిరిగి వచ్చి అదే విధంగా కోపంతో ‘దమ్ముంటే లోపలికి అడుగుపెట్టు’ అన్నట్టుగ్గా గుర్రు మంటుంది. ఇక వేరే ఏమీ ఉపాయం లేక మీరు మీ స్నేహితుడుని గట్టిగా పిలుస్తారు. అతను తన ఇంట్లోంచి బయటకు వచ్చి, తన కుక్క మిమ్ములను ఇబ్బంది పెడుతున్నదని చూస్తాడు. అతను ఇలా అరుస్తాడు, ‘వద్దు స్మోకీ! ఇటొచ్చి కూర్చో’ అని. వెంటనే ఆ కుక్క శాంతించి, వచ్చి తన యజమాని చెంతనే కూర్చుంటుంది. ఇక ఇప్పుడు మీరు భయం లేకుండా గేటు తెరిచి లోపలి నడిచి వెళ్తారు.ఇదే విధంగా, మనలను బాధించే భౌతిక మాయా శక్తి కూడా భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే. ఈ శ్లోకంలో, ఈ విషయం శ్రీ కృష్ణుడిచే బలంగా ధ్రువీకరించబడింది. మనం ఇంత సునాయాసంగా, కేవలం శరణాగతి చేసి మాయని దాటిపోగలిగితే, మరి ఎందుకు మనుష్యులు ఈశ్వరునికి శరణాగతి చేయరు? శ్రీ కృష్ణుడు దీనిని తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు.
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః । మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః ।। 15 ।।
15
7
https://www.holy-bhagava…udio/007_015.mp3
న — కాదు; మాం — నాకు; దుష్కృతినః — పాపపు పనులు చేసేవారు; మూఢాః — మూఢులు; ప్రపద్యంతే— శరణాగతి చేసెదరు; నర-అధమాః — సోమరితనంతో తన నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించే వాడు; (అధములు); మాయయా — భగవంతుని భౌతిక శక్తి చే; అపహృత జ్ఞానాః — మోహము/భ్రమకు లోనైన బుద్ధి తో; ఆసురం — ఆసుర (రాక్షస); భావం — స్వభావము; ఆశ్రితాః — ఆశ్రయించెదరు.
BG 7.15: నాలుగు రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు — జ్ఞానము లేని వారు, నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్నా సోమరితనంతో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైనవారు, మరియు ఆసురీ ప్రవృత్తి కలవారు.
భగవంతునికి శరణాగతి చేయని నాలుగు రకాల మనుష్యుల గురించి శ్రీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు:1) అజ్ఞానులు. వీరు ఆధ్యాత్మిక జ్ఞానం లేని వారు. వారు తాము నిత్యసనాతన ఆత్మలము, అన్న నిజ స్వరూపాన్ని ఎరుగరు, జీవిత లక్ష్యం, భగవత్ ప్రాప్తి అని ఎరుగరు, ప్రేమయుక్త భక్తితో ఈశ్వరునికి శరణాగతి చేసే ప్రక్రియ ఎరుగరు. జ్ఞానం లేకపోవటమే వారిని శరణాగతి చేయనివ్వదు.2) సోమరితనంతో తమ నీచ స్థాయి స్వభావాన్నే అనుసరించేవారు. వీరు సాధారణ ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటారు మరియు ఏమి చేయ్యాలో వారికి తెలుసు. కానీ, వారు నిమ్న స్థాయి జడత్వంచే శరణాగతి చేయటానికి తగినంత పరిశ్రమ చెయ్యరు. ఆధ్యాత్మిక సూత్రాలను పాటించటం కోసం పరిశ్రమించటానికి అవరోధంగా ఉన్న ఈ సోమరితనం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న పెద్ద అవరోధం. ఒక సంస్కృత నానుడి ఇలా పేర్కొంటున్నది:ఆలస్య హి మనుష్యాణాం శరీరస్థో మహాన్ రిపుఃనాస్త్యుద్యమసమో బంధుః కృత్వా యం నావసీదతి‘సోమరితనం/బద్దకము అనేది ఒక పెద్ద శత్రువు, అది మన శరీరంలోనే ఉంటుంది. పని అనేది మానవులకు మంచి స్నేహితుడు వంటిది, అది ఎన్నటికీ మనలని అధోగతి పాలుకానివ్వదు.’3) బుద్ధి భ్రమకు లోనయినవారు. వీరు తమ బుద్ధి పట్ల ఎంతో గర్వంతో ఉంటారు. వీరు మహాత్ముల మరియు శాస్త్రాల ఉపదేశాలను విన్నా సరే వాటిని విశ్వాసంతో ఒప్పుకోవటానికి అంగీకరించరు. ఏదేమైనా, అన్ని ఆధ్యాత్మిక సత్యాలు వెంటనే అర్థం కావు. ప్రారంభంలో మనం ఈ మార్గంపై విశ్వాసం కలిగి ఉండాలి మరియు అభ్యాసం మొదలెట్టాలి, అప్పుడే మనం అంతర్గత విజ్ఞానం ద్వారా ఆ ఉపదేశాలను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కనిపించే వాటిని తప్ప వేరే వాటిని ఎవరైతే నమ్మరో, వారు ఇంద్రియములకు గోచరించని భగవంతునికి శరణాగతి చేయరు. శ్రీ కృష్ణుడు వీరిని మూడవ కోవలోని వారిగా పరిగణించాడు.4) ఆసురీ స్వభావము కలవారు. ఈ కోవకు చెందిన వారికి భగవంతుడు ఉన్నాడని తెలుసు, కానీ దుర్మార్గంగా, ఈ లోకంలో భగవంతుని సంకల్పానికి పూర్తి విరుద్ధంగా పని చేస్తుంటారు. తెలియపరచబడిన భగవంతుని వ్యక్తిత్వాన్ని, తమ రాక్షస ప్రవృత్తి కారణంగా అసహ్యించుకుంటారు. ఎవరైనా ఆయన కీర్తిని పాడుతున్నా లేక ఆయన పట్ల భక్తిలో నిమగ్నమై ఉన్నా, వారు తట్టుకోలేరు. స్పష్టంగానే, ఇలాంటి వారు భగవంతునికి శరణాగతి చేయరు.
చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున । ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ।। 16 ।।
16
7
https://www.holy-bhagava…udio/007_016.mp3
చతుః-విధా — నాలుగు రకాల; భజంతే — భజింతురు; మాం — నన్ను; జనాః — జనులు; సు-కృతినః — ధర్మ పరాయణులు; అర్జున — అర్జునా; ఆర్తః — ఆపద/దుఃఖం లో ఉన్నవారు; జిజ్ఞాసుః — జ్ఞానాన్ని అన్వేషించేవారు; అర్థ-అర్థీ — భౌతిక సంపత్తి ఆశించేవారు; జ్ఞానీ — జ్ఞానములో స్థితులై ఉన్నవారు; చ — మరియు; భరత-ఋషభ — భరత వంశీయులలో శ్రేష్ఠుడా, అర్జునా.
BG 7.16: ఓ భరతశ్రేష్ఠుడా, నాలుగు రకముల ధర్మ-పరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమౌతారు — ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానము నందు స్థితులై ఉన్న వారు.
తనకు శరణాగతి చేయని నాలుగు రకాల జనుల గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇక ఇప్పుడు తనను ఆశ్రయించే వారి వర్గీకరణ చేస్తున్నాడు.1) ఆపదల్లో/కష్టాల్లో ఉన్నవారు. కొంతమంది జనులకు, ప్రాపంచిక కష్టాలు ఎక్కువై పోయినప్పుడు, ఈ ప్రాపంచికత్వం వెంట పడి పరుగులు పెట్టటం వ్యర్థమనే నిశ్చయానికి వచ్చి, భగవంతుడినే ఆశ్రయించటం మేలు అని అనుకుంటారు. అదే ప్రకారంగా, ప్రాపంచిక ఆధారాలేవీ వారిని రక్షించలేకపోయినప్పుడు, వారు రక్షణ కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. శ్రీ కృష్ణుడికి ద్రౌపది చేసిన శరణాగతి ఇటువంటి కోవకు చెందిన శరణాగతియే. కౌరవ సభలో ద్రౌపది వివస్త్ర చేయబడుతున్నప్పుడు, ఆమె మొదట తన భర్తలు రక్షిస్తారనుకున్నది. వారు ఎప్పుడైతే ఏమీ చేయలేక ఉత్తగా ఉండిపోయారో, సభలో ఉన్న ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు, మరియు విదురుడు వంటి పుణ్యాత్ములైన పెద్దల మీద, వారు కాపాడుతారని ఆశ పెట్టుకుంది. వారు కూడా రక్షించలేకపోయినప్పుడు, తన పళ్ళ మధ్యలో చీరను గట్టిగా పట్టుకుంది. ఈ స్థితి వరకు శ్రీ కృష్ణుడు ద్రౌపది రక్షణకు రాలేదు. చివరగా, దుశ్శాసనుడు ఆమె చీరను ఒక్కసారిగా గుంజినప్పుడు, అది ఆమె పంటి పట్టు నుండి జారి పోయింది. ఆ సమయంలో, ఆమెకు ఇక ఇతరుల రక్షణ మీద నమ్మకం పోయింది, ఇంకా తన సొంత బలాన్ని కూడా నమ్ముకోలేదు. ఆమె సంపూర్ణముగా శ్రీ కృష్ణుడికి శరణాగతి చేసింది, వెనువెంటనే ఆయన సంపూర్ణ రక్షణ అందించాడు. ఆమె చీరను ఇంకా ఇంకా పొడుగు పెంచటం ద్వారా అడ్డుకున్నాడు. దుశ్శాసనుడు ఎంత గుంజినా, ద్రౌపదిని వివస్త్రను చేయలేక పోయాడు.2) జిజ్ఞాసువులు. (జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు) కొంత మంది ఆధ్యాత్మికత, దేవుడి గురించి తెలుసుకోవాలనుకునే ఉత్సుకతతో భగవంతుడిని ఆశ్రయిస్తారు. కొందరు ఆధ్యాత్మిక క్షేత్రంలో మోక్షము/పరమానందము సాధించారు అని విని ఉండటం వలన, అదేంటో తెలుసుకోవాలని కుతూహలముతో ఉంటారు. కాబట్టి, వారి కుతూహలాన్ని తీర్చుకోవటం కోసం వారు భగవంతుడిని ఆశ్రయిస్తారు.3) ప్రాపంచిక సంపత్తిని కోరేవారు. ఇంకొంత మంది తమకు ఏమి కావాలో స్పష్టతతో ఉంటారు, కానీ, భగవంతుడు మాత్రమే తమకు అవి ఇవ్వగలడని నమ్మకంతో ఉంటారు, అందుకే ఆయనను ఆశ్రయిస్తారు. ఉదాహరణకి, ధృవుడు, తన తండ్రి, మహారాజు ఉత్తానపాదుని కంటే ఉన్నతుడు అవ్వాలనే కోరికతో తన భక్తిని ప్రారంభించాడు. కానీ, అతని భక్తి పరిపక్వమై, భగవంతుని దర్శనం అయినతరువాత, అమూల్యమైన దివ్య ప్రేమ వైఢూర్యాలు ఉన్నవాని నుండి, తాను కోరుకున్నది, ఒక ముక్కలైన గాజు వక్కల వంటిది అని తెలుసుకున్నాడు. తదుపరి, భగవంతుడిని తనకు పవిత్రమైన నిస్వార్థ భక్తిని ప్రసాదించమని కోరాడు.4) జ్ఞానులు. చివరగా కొందరు జీవులు, తాము భగవంతుని అణు-అంశములమని, తమ సనాతనమైన శాశ్వతమైన ధర్మం, భగవంతుడిని ప్రేమించి, సేవించటమే అన్న నిశ్చయానికి చేరుకుంటారు. వీరు నాల్గవ కోవకి చెందిన తన భక్తులని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే । ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ।। 17 ।।
17
7
https://www.holy-bhagava…udio/007_017.mp3
తేషాం — వీరందరిలో; జ్ఞానీ — జ్ఞానములో స్థితమై ఉన్నవారు; నిత్య-యుక్తః — ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో; ఏక — అనన్యముగా; భక్తిః — భక్తి; విశిష్యతే — శ్రేష్ఠమైన; ప్రియః — ప్రియమైన; హి — ఖచ్చితంగా; జ్ఞానినః — జ్ఞానములో స్థితమైనవారు; అత్యర్థం — గొప్పగా; అహం — నేను; సః — అతను; చ — మరియు; మమ — నాకు; ప్రియః — ప్రియమైన వాడు.
BG 7.17: వీరందరిలో కెల్లా, జ్ఞానంతో నన్ను పూజించే వారు, మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని, అందరి కంటే, శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైనవాడిని మరియు వారు నాకు ప్రియమైనవారు.
ఆపదలో, ప్రాపంచిక వస్తువుల కోసం, లేదా కుతూహలంతో - భగవంతుడిని ఆశ్రయించే వారికి ఇంకా నిస్వార్థ భక్తి లేనట్టే. నెమ్మదిగా, క్రమక్రమంగా భక్తి ప్రక్రియలో, వారి మనస్సు పవిత్రమై వారికి భగవంతునితో తమకున్న నిత్య-శాశ్వత అనుబంధ జ్ఞానం పెంపొందుతుంది. అప్పుడు వారి భక్తి అనన్యమైనదిగా, ఏక చిత్తముతో, నిరంతరం భగవత్ పరంగా కొనసాగుతునే ఉంటుంది. ఈ ప్రపంచం వారిది కాదనే జ్ఞానం పొందటం వలన మరియు ఇక్కడ సంతోషమనేది దొరకదు అని తెలియటం వలన, వారు అనుకూల పరిస్థితుల కోసం తపించరు లేదా ప్రతికూల పరిస్థితుల పట్ల శోకించరు. ఈ విధంగా, వారు నిస్వార్థ భక్తిలో స్థితమై ఉంటారు. సంపూర్ణ ఆత్మ సమర్పణ శరణాగతి దృక్పథంలో, దివ్య సఖుడి కోసం ప్రేమాగ్నిలో తమని తాము సమర్పించుకుంటారు. కాబట్టి, అటువంటి జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు, తనకు అత్యంత ప్రియమైన వారని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ । ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ।। 18 ।।
18
7
https://www.holy-bhagava…udio/007_018.mp3
ఉదారాః — మహనీయులు; సర్వే — వీరందరూ; ఏవ — నిజముగా; ఏతే — వీరు; జ్ఞానీ — జ్ఞానులు; తు — కానీ; ఆత్మా-ఏవ — స్వయముగా నేనే; మే — నా యొక్క; మతం — అభిప్రాయము; ఆస్థితః — స్థితుడై ఉండి; సః — ఆ వ్యక్తి; హి — ఖచ్చితంగా; యుక్త-ఆత్మా — ఏకీకృత మైనవారు; మాం — నా యందు; ఏవ — నిజముగా; అనుత్తమాం — సర్వోన్నత; గతిం — లక్ష్యము.
BG 7.18: నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే. కానీ, జ్ఞానముతో ఉండి, దృఢనిశ్చయము కలిగి, బుద్ధి నా యందు ఐక్యమై, మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగిఉన్నవారు, స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను.
7.17వ శ్లోకంలో జ్ఞానయుక్తుడైన భక్తుడే ఉన్నతమైన వాడు, అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు, మిగతా మూడు రకాల భక్తులు కూడా ఆయనకి ప్రియమైన వారే అని వివరణ ఇస్తున్నాడు. ఏ కారణంతో అయితేనేమి, భక్తిలో నిమగ్నమై ఉన్నవారు అందరూ గొప్పవారే అని చెప్తున్నాడు. అయినా, జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు, భౌతిక వస్తు సంపద కారణాల కోసం భగవంతుడిని పూజించరు. అందుకే, భక్తుల యొక్క ఈ యొక్క నిస్వార్థ, బేషరతుగా ఉన్న ప్రేమకి భగవంతుడు బద్ధుడై పోతాడు.పరా భక్తి, లేదా దివ్య ప్రేమ, అనేది, ప్రాపంచిక ప్రేమ కంటే చాలా విభిన్నమైనది. దివ్య ప్రేమ అనేది దివ్య సఖుని సంతోషం కోసం పరితపించే స్వభావంతో ఉంటుంది; ప్రాపంచిక ప్రేమ అనేది సొంత-ప్రయోజనం కోసం కోరికచే ప్రేరేపితమైనది. దివ్య ప్రేమ అనేది, సమర్పణ స్వభావంతో మరియు ఇష్టసఖుని సేవలో త్యాగంతో నిండి ఉంటుంది; ప్రాపంచిక ప్రేమ అనేది తీసుకునే దృక్పథంతో ఉంటుంది, దాని అంతిమ లక్ష్యం ప్రేమించిన వారి నుండి ఏదో పొందటమే. చైతన్య మహాప్రభు ఇలా వివరించాడు:కామేర తాత్పర్య నిజ-సంభోగ కేవలకృష్ణ-సుఖ-తాత్పర్య-మాత్ర ప్రేమ తా’ ప్రబలఅతఏవ కామ-ప్రేమే బహుత అంతరకామ అంధ-తమః, ప్రేమ నిర్మల భాస్కర(చైతన్య చరితామృతము, ఆది లీల 4.166 & 171)‘కామము (ప్రాపంచిక ప్రేమ) స్వీయ-సంతోషం కోసము ఉంటుంది; దివ్య ప్రేమ శ్రీ కృష్ణుడి సంతోషం కోసం పెంపొందించుకోబడి ఉంటుంది. వీటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది - కామము అనేది చీకటి మరియు అజ్ఞానము వంటిది, అదే సమయంలో దివ్య ప్రేమ అనేది స్వచ్ఛమైనది మరియు ప్రకాశవంతమయినది.’ జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ దీనిని చాలా అద్భుతంగా పేర్కొన్నాడు:బ్రహ్మ లోక్ పర్యంత సుఖ్, అరు ముక్తిహుఁ త్యాగ్,తబఇ ధరహు పగ ప్రేమ పథ, నహిఁ లగి జైహైఁ దాగ్(భక్తి శతకము, 45వ శ్లోకం)‘భక్తి మార్గంలో ప్రయాణించాలంటే, ప్రాపంచిక భౌతిక సుఖాల కోరికలను మరియు మోక్షము కోసం ఉన్న వాంఛను విడిచిపెట్టాలి. లేదా, అలాకాకపొతే దివ్య ప్రేమ అనే స్వచ్ఛమైన నీరు స్వార్థంతో మలినమైపోతుంది.’ నారద మహర్షి స్వచ్ఛమైన ప్రేమను ఈ విధంగా నిర్వచించారు:తత్ సుఖ సుఖిత్వం (నారద భక్తి దర్శన్, 24వ సూత్రము)‘నిజమైన ప్రేమ అంటే ఇష్ట సఖుని సంతోషం కోసం ఉన్నదే.’ భౌతిక ప్రాపంచికత్వంతో ప్రేరేపితమైన భక్తులు ఇటువంటి భక్తిలో నిమగ్నం కాలేరు, కానీ జ్ఞానంతో ఉన్న భక్తుడు ఈ నిస్వార్థ స్థాయికి ఎదుగుతాడు. ఎప్పుడైతే ఎవరైనా భగవంతుడిని ఈ విధంగా ప్రేమించటం నేర్చుకుంటారో, ఆయన ఆ భక్తునికి బానిసై పోతాడు. భగవంతుని యొక్క అత్యుత్తమ లక్షణం ఏమిటంటే, 'భక్త వత్సలుడు' (తన భక్తులపై ఆయనకు ఉన్న ప్రేమ). పురాణాలు ఇలా పేర్కొంటున్నాయి:గీత్వా చ మమ నామాని విచరేన్మమ సన్నిధౌఇతి బ్రవీమి తే సత్యమ్ క్రీతోహం తస్య చార్జున(ఆది పురాణం 1.2.231)శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు: ‘నా నామములు జపం చేస్తూ, తలంపులలో నన్ను తమ దగ్గరగా ఉంచుకున్న వారికి నేను బానిసనై పోతాను. ఇది నిజము ఓ అర్జునా.’ భగవంతుడు తన నిస్వార్థ భక్తుల పట్ల ఎంత ఋణపడి ఉంటాడంటే, వారిని తన స్వ-స్వరూపంగానే చూసుకుంటాను అన్న స్థాయి వరకు ఈ శ్లోకంలో చెప్తున్నాడు.
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే । వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ।। 19 ।।
19
7
https://www.holy-bhagava…udio/007_019.mp3
బహూనాం — అనేకమైన; జన్మనాం — జన్మలు; అంతే — తరువాత; జ్ఞాన-వాన్ — జ్ఞాన వంతులు; మాం — నాకు; ప్రపద్యతే — శరణాగతి చేస్తారు; వాసుదేవః — శ్రీ కృష్ణుడు, వసుదేవుని కుమారుడు; సర్వం — సర్వమూ; ఇతి — అది; సః — అటువంటి; మహా-ఆత్మా — మహాత్ముడు; సు-దుర్లభః — ఏంతో అరుదు.
BG 7.19: ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత, జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి, ఉన్నదంతా నేనే అని తెలుసుకొని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు.
ఈ శ్లోకం ఒక సాధారణ అపార్థాన్ని నివృత్తి చేస్తున్నది. తరచుగా అధికమైన ప్రజ్ఞ కలవారు, భక్తి అనేది జ్ఞానము కంటే తక్కువ స్థాయిది అని అపహాస్యము చేస్తారు. జ్ఞాన సముపార్జనలో నిమగ్నమై ఉన్నారనే గర్వంతో ఉండి, భక్తిలో నిమగ్నమైన వారిని తక్కువగా చూస్తారు. కానీ, ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు దానికి పూర్తి విరుద్ధంగా చెప్తున్నాడు. చాలా జన్మలలో జ్ఞానం పెంపొందించుకున్న తరువాత జ్ఞాని యొక్క జ్ఞానము పరిపక్వ దశకు చేరిన పిదప, ఆవ్యక్తి భగవంతునికి శరణాగతి చేస్తాడు.వాస్తవానికి, యదార్థమైన జ్ఞానం సహజంగానే భక్తికి దారి తీస్తుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి బీచ్ పై నడుస్తూ ఇసుకలో ఒక ఉంగరాన్ని కనుగోన్నాడనుకోండి. దానిని పైకి తీస్కున్నాడు కానీ దాని విలువ పై ఏ మాత్రం అవగాహన లేదు అనుకోండి. దాన్ని, ఈ మధ్య సాధారణంగా వాడుకలో ఉన్న ఏదో గిల్టు నగ, అనుకోని, దాని విలువ ఓ 300 రూపాయలు అనుకుంటాడు.మరుసటి రోజు, ఆ ఉంగరాన్ని ఒక స్వర్ణకారుడికి చూపించి ఇలా అడిగాడు, ‘ఈ ఉంగరం యొక్క విలువ ఎంత ఉంటుందో చెప్పగలరా?’ అని.ఆ కంసాలి దానిని పరిశీలించి ఇలా సమాధానం చెప్పాడు, ‘ఇది 22-కారట్ బంగారం, దీని విలువ ముప్పైవేల రూపాయలు ఉంటుంది.’ఇది విన్న తరువాత ఆ వ్యక్తి కి ఆ ఉంగరం మీద ప్రేమ ఎక్కువయింది. ఇప్పుడు ఆ ఉంగరం చూసినప్పుడు, ఒక ముప్పైవేల రూపాయలు విలువైన బహుమానం పొందిన ఆనందం అనుభవించాడు.ఇంకొన్ని రోజులు గడిచాయి, నగల వ్యాపారి అయిన అతని మామ, పక్క ఊరి నుండి వచ్చాడు. తన మామని ఇలా అడిగాడు, ‘ఈ ఉంగరాన్ని మరియు దీనిలో ఉన్న రాయిని విలువ కట్టి చెప్పగలరా?’ అని.అతని మామ దాన్ని చూసి, ఇలా ఆశ్చర్యముతో అరిచాడు, ‘ఇదెక్కడిది నీకు? ఇది అసలు సిసలు వజ్రం. దీని విలువ ఒక లక్ష రూపాయలు ఉంటుంది.’అతను ఉబ్బుతబ్బిబై పోయి ఇలా అన్నాడు. ‘మామా, నాతో పరిహాసం చేయవద్దు.’‘నేను పరిహాసం చేయటం లేదు, నేను చెప్పేది నమ్మకపోతే, దీనిని నాకు యాభైవేల రూపాయలకి అమ్మేయి.’ అన్నాడు.ఇక ఇప్పుడు అతనికి ఆ ఉంగరం విలువ గురించి నిస్సందేహమైన జ్ఞానం లభించింది. వెనువెంటనే, ఆ ఉంగరం మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఒక పెద్ద లాటరీ గెలిచినట్టు సంతోషం వేసి, అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.చూడండి, ఆ ఉంగరం పట్ల వ్యక్తి యొక్క ప్రేమ, దాని గురించి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఎలా పెరుగుతూ ఉన్నదో? ఆ ఉంగరం యొక్క విలువ మూడు వందల రూపాయలు అన్న జ్ఞానం ఉన్నప్పుడు దాని పట్ల ఉన్న ప్రేమ కూడా అంత మాత్రం గానే ఉంది. ఈ ఉంగరం విలువ ముప్పైవేల రూపాయలు అని తెలిసినప్పుడు దాని మీద ప్రేమ అంతే నిష్పత్తిలో పెరిగింది. వంద రెట్లు. ఆ ఉంగరం విలువ నిజంగా లక్ష రూపాయలు అని అతనికి తెలిసినప్పుడు, దానిపై అతని ప్రేమ ఆ మేరగా విశేషంగా పెరిగి పోయింది.ఈ పై ఉదాహరణ మనకు, జ్ఞానానికి, ప్రేమకు ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని తెలియచేప్తున్నది. రామచరితమానస్ ఇలా పేర్కొంటున్నది:జానేఁ బిను న హోఇ పరతీతీ. బిను పరతీతి హోఇ నహిఁ ప్రీతీ‘జ్ఞానం లేకుండా విశ్వాసం ఉండలేదు; విశ్వాసం లేకుండా ప్రేమ పెరుగదు.’ ఈ విధంగా, యదార్థమైన జ్ఞానం సహజంగానే ప్రేమతో కూడి ఉంటుంది. మనకు బ్రహ్మన్ గురించి నిజమైన జ్ఞానం ఉంది అని అనుకుని, కానీ, ఆయన మీద ఎటువంటి ప్రేమ లేకపోతే, మన జ్ఞానం ఉత్తగా సిద్ధాంత పరంగానే ఉన్నట్టు.ఇక్కడ శ్రీ కృష్ణుడు వివరించేది ఏమిటంటే, ఎన్నో జన్మల జ్ఞాన సముపార్జన తరువాత ఆ జ్ఞాని యొక్క జ్ఞానము నిజమైన విజ్ఞానముగా పరిపక్వం చెందితే, అతను, ఉన్నదంతా ఆ భగవంతుడే అని తెలుసుకొని, పరమేశ్వరుడికి శరణాగతి చేస్తాడు. ఇటువంటి మహాత్ముడు చాలా అరుదు అని ఈ శ్లోకం పేర్కొంటున్నది. దీనిని జ్ఞానులకి, కర్మిలకి, హఠ యోగులకి, తపస్విలకి చెప్పలేదు. దీనిని భక్తులకే చెప్పాడు, మరియు ‘సర్వమూ భగవంతుడే’ అని సంపూర్ణముగా తెలుసుకొని ఆయనకు శరణాగతి చేసిన, ఇటువంటి మహోన్నతమైన జీవాత్మ చాల దుర్లభము (అరుదు) అని అంటున్నాడు.
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః । తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ।। 20 ।।
20
7
https://www.holy-bhagava…udio/007_020.mp3
కామైః — ప్రాపంచిక కోరికలతో; తైః తైః — ఎన్నెన్నో; హృత-జ్ఞానాః — జ్ఞానము కొట్టుకొని పోయినవారు; ప్రపద్యంతే — శరణాగతి చేసెదరు; అన్య — ఇతర; దేవతాః — దేవతలకు; తం తం — వారి వారి ఆయా; నియమం — నియమములు; ఆస్థాయ — పాటిస్తూ; ప్రకృత్యా — స్వభావము చే; నియతాః — నియంత్రించబడి; స్వయా — వారి యొక్క స్వీయ.
BG 7.20: భౌతిక ప్రాపంచిక కోరికలచేత జ్ఞానం కొట్టుకొని పోయినవారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు; దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మ కాండలను ఆచరిస్తారు.
శ్రీ కృష్ణుడే (పరమేశ్వరుడు) సృష్టిలో సమస్తానికి ఆధారమైనప్పుడు, ఏ ఇతర అన్య దేవతలు కూడా ఆయన కంటే స్వతంత్రులు కాజాలరు. ఏ విధంగా అయితే ఒక దేశ రాష్ట్రపతి, ఏంతో మంది అధికారుల సహాయంతో ప్రభుత్వ పరిపాలన చేస్తాడో, అదే విధంగా దేవతలు అందరూ కూడా భగవంతుని ప్రభుత్వంలో చిన్న అధికారులు. మన లాంటి జీవాత్మలే అయినా వారు ఉన్నతులు, మరియు వారి పూర్వ జన్మల పుణ్య కార్యముల ఫలితంగా వారు భౌతిక జగత్తు యొక్క పరిపాలనలో ఉన్నత మైన స్థానం సంపాదించుకున్నారు. వారు, ఎవ్వరికీ కూడా మాయా బంధనము నుండి విముక్తి ప్రసాదించలేరు ఎందుకంటే వారే ఇంకా విముక్తి పొందలేదు. కానీ, వారు తమ పరిధిలోని భౌతిక వస్తువులను ప్రసాదించగలరు. ఈ భౌతిక ప్రాపంచిక కోరికలచే ప్రేరితులై, జనులు దేవతలను పూజిస్తూ, వారి ఆరాధనకు చెప్పబడ్డ నియమాలను పాటిస్తుంటారు. ప్రాపంచిక కోరికలచే, జ్ఞానం కప్పబడిపోయిన ఇటువంటి జనులు దేవతలని ఆరాధిస్తారు, అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.