link
stringlengths
41
231
text
stringlengths
28
5k
https://www.telugupost.com/movie-news/bheemla-nayak-release-date-confirmed-the-movie-releasing-in-theatres-on-february-25th-1354785
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా విడుదల చేయాలనుకున్నప్పుడల్లా ఏదొక అవాంతరం ఎదురవుతూనే ఉంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఫైనల్ షెడ్యూల్ పూర్తి కాకపోవడం, కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మేకర్స్ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఫిబ్రవరి 25న, లేకపోతే ఏప్రిల్ 1న సినిమా విడుదల చేస్తామని రెండు రిలీజ్ డేట్లు ప్రకటించారు. దాంతో సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో అర్థంకాక అయోమయంలో పడ్డారు అభిమానులు.Also Read : ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూతతాజాగా ఈ సినిమా తుది విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. ముందుగా అనుకున్నట్లే ఫిబ్రవరి 25నే సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన చేసింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. ఫిబ్రవరి 25న థియేటర్లలో పవర్ తుఫాను చూస్తారంటూ ట్వీట్ చేసింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ నటించగా.. విలన్ గా రానా నటించారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.25 - 02 - 2022!! The date is set for the POWER STORM to hit the screens🔥#BheemlaNayakOn25thFeb 🤩#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @sitharaents @adityamusic pic.twitter.com/voUWsLJfy4— Sithara Entertainments (@SitharaEnts) February 15, 2022
https://www.telugupost.com/movie-news/director-mehar-ramesh-and-dance-master-sekhar-birthday-celebrations-in-waltair-veerayya-set-1446972
టాలీవుడ్ మెగాస్టార్.. గాడ్ ఫాదర్ సినిమాతో.. తెలుగు ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా మారారు. తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న మరో సినిమా వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తుండగా.. రవితేజ ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు టాక్. ఇటీవలే మూవీ టైటిల్ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. దాంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.కాగా.. ఈ సినిమాలో ఓ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. నేడు (నవంబర్ 6) శేఖర్ మాస్టర్, మెహర్ రమేశ్ ల పుట్టినరోజు కావడంతో.. వీరయ్య సెట్ లో ఆ ఇద్దరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిరంజీవితో పాటు దర్శకుడు బాబీ, యాక్టర్ సత్యదేవ్, గెటప్ శీను, సప్తగిరి తదితరులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మూవీ టీంకి కృతజ్ఞతలు తెలిపాడు డైరెక్టర్ మెహర్ రమేష్.చిరంజీవి నటిస్తోన్న మరో సినిమా భోళాశంకర్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో అజిత్ నటించిన వేదాళం మూవీకి ఇది రీమేక్. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరుకి చెల్లిగా కనిపించబోతుంది. మణిశర్మ తనయుడు 'మహతి స్వర సాగర్' ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి భోళాశంకర్, సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో మెగాస్టార్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.Sharing my birthday with Dear @Sekharmasteroff and celebrated in the presence of Dear Boss ANNAYYA 😍 #MegaStar @KChiruTweets in the sets of #WaltairVeerayya @dirbobby @MythriOfficial @ActorSatyaDev pic.twitter.com/aCrlnPFyRi— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) November 5, 2022
https://www.telugupost.com/andhra-pradesh/about-two-months-since-chandrababu-assumed-office-as-the-chief-minister-of-andhra-pradesh-he-are-not-able-to-fulfill-the-promises-1547276
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలను చేపట్టి సుమారు రెండు నెలలవుతుంది. అయితే ఆయన పదే పదే ఖజానా ఖాళీగా ఉందని చెబుతుండటంతో ఆయన ఇచ్చిన హామీల మాటేమిటన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. సూపర్ సిక్స్ హామీలు మాత్రమే కాదు.. మ్యానిఫేస్టోలోనూ అనేక అంశాలను జోడించారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు లెక్కకు మించి.. శక్తికి మించి ప్రజలకు హామీ ఇచ్చారంటున్నారు. ఒకటా? రెండా? ఎన్ని వాగ్దానాలు.. ప్రతి సభలో తాను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలంటే సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ఇబ్బడి ముబ్బడిగా ప్రామిస్ లు చేశారు.కొన్ని హామీలను...తాను అధికారంలోకి వస్తే పింఛను నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పారు. అంత వరకూ చేయగలిగారు. ఇక అన్నా క్యాంటిన్లు ఆయనకు ఇష్టమైన ప్రాజెక్టు కనుక ఆగస్టు 15వ తేదీ నుంచి దానిని అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా అన్నా క్యాంటిన్లను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమయింది. అన్నా క్యాంటిన్లలో పది రూపాయలకే భోజనం పెట్టాలని నిర్ణయించారు. ఇది మంచి నిర్ణయమే. దీంతో పాటు మెగా డీఎస్సీని ప్రకటించారు. దాదాపు పదిహేను వేల పోస్టులన భర్తీ చేయడానికి సిద్ధం చేశారు ఇందుకోసం టెట్ పరీక్షను కూడా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. వీటి సంగతి ఏంటి?కానీ అసలు విషయం ఏంటంటే? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్న హామీల ఊసు మాత్రం ఎత్తడం లేదు. ఇక పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు 1500 రూపాయలు నెలకు ఇస్తామని ప్రకటించారు. దాని సంగతి కూడా లేదు. ఇక యాభై ఏళ్లు నిండిన బీసీలందరికీ పింఛను మంజూరు చేస్తామన్నారు. దాని ప్రస్తావనే లేదు. రైతు భరోసా నిధులు జమ కాలేదు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులకు శుభవార్త చెప్పానని అనకోవడం మినహా వారికి సకాలంలో రైతు భరోసా అందలేదు. ఇక తల్లికి వందనం కార్యక్రమం కింద నెలకు ఒక్కో విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామన్న చంద్రబాబు ఆ హామీని కూడా అటకెక్కించారు. వచ్చే ఏడాది అంతా బాగుంటే దానిని అమలు చేస్తారట.వైసీపీ ప్రచారం...ఇలా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఖజానా డొల్ల అంటూ కాలం నెట్టుకొస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖజానా బోసి పోయి ఉంటే ఆ సంగతి ముందు తెలియదా? అని విపక్షాలు నిలదీస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేంత వరకూ ఒకలా? వచ్చిన తర్వాత మరొకలా వ్యవహరించడం కొత్తేమీ కాదని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ నేతలు గ్రామ స్థాయిలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు సాధించుకుందామనుకుంటే.. మ్యానిఫేస్టో విడుదల సమయంలో బీజేపీ దూరంగా ఉండటం కూడా ఒక ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
https://www.telugupost.com/movie-news/ntr-video-call-with-kaushik-fan-of-jr-ntr-who-is-suffering-with-blood-cancer-1551405
జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న దేవ‌ర సినిమా చూసే వ‌ర‌కు తనను బ‌తికించాలని ఓ క్యాన్స‌ర్ పేషెంట్ కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన కౌశిక్(19) అనే యువ‌కుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. కౌశిక్ ప్ర‌స్తుతం బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్నాడు. బెంగ‌ళూరులోని కిడ్‌వై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను కొన్ని రోజులే బ్ర‌తుకుతాన‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారని, చ‌నిపోయే లోగా ఎన్టీఆర్ దేవ‌ర సినిమా చూడాలని వేడుకున్నాడు. త‌మ బిడ్డ చివ‌రి కోరిక తీర్చాలని కౌశిక్ తల్లిదండ్రులు కూడా కోరారు. అయితే కౌశిక్ విషయం జూనియర్ ఎన్టీఆర్ దాకా చేరింది. అండగా ఉంటానని, అధైర్యపడకుండా ఉండాలని ఎన్టీఆర్ వీడియో కాల్ లో మాట్లాడారు. కౌశిక్‌ను చూసి నువ్వు న‌వ్వుతూ ఉండాలి. దేవ‌ర సినిమా త‌ర్వాత చూస్తావు, ఫ‌స్ట్ నువ్వు కోలుకోవాలని ఎన్టీఆర్ కౌశిక్ కు చెప్పారు. నువ్వు ధైర్యంగా ఉండాలంటూ కౌశిక్‌కు భ‌రోసా ఇచ్చారు. కౌశిక్ అమ్మ‌తో మీరు ధైర్యంగా ఉండాలి, మీరు ధైర్యంగా ఉంటే కౌశిక్ కి కొండంత బ‌లం వ‌స్తుందన్నారు. కౌశిక్ చికిత్స‌కు సంబంధించి అవ‌స‌ర‌మైనవ‌న్ని ద‌గ్గ‌రుండి చూసుకుంటానని తారక్ కౌశిక్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.https://t.co/RfExyVdBJV pic.twitter.com/aKAuXTG8bZ— Vamsi Kaka (@vamsikaka) September 14, 2024
https://www.telugupost.com/movie-news/priya-prakash-lovers-day-110096/
కేవలం కన్నుగీటే దృశ్యంతో ఇండియా వైడ్ పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఓరు అదార్ లవ్ గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రియాకి వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంది టీం. ఆమె కోసం మళ్లీ రీషూట్ చేసారు. అదనంగా ఆమె సీన్స్ కొన్ని యాడ్ చేసారు. అందుకే సినిమా రిలీజ్ లేట్ అయ్యింది. ఇక నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా చాలా భాషల్లో అనువాదం అయ్యి రిలీజ్ అయింది. తెలుగులో లవర్స్ డే అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సినిమా చూసి బయటకి వచ్చిన వాళ్లు హాహాకారాలు చేస్తున్నారు. అసలు ఆమె హీరోయిన్ కాదు… సౌత్ లోనే ఇదొక డిజాస్టర్ చిత్రమని… ఏదో ఊహించుకుని వెళ్తే సినిమాలో ఇంకేదో ఉందని అంటున్నారు. అసలు ప్రియాది చిత్రంలో లీడ్ రోల్ కాదని… సైడ్ క్యారెక్టర్లా ఉన్న అమ్మాయిని ప్రధాన కథానాయికను చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కన్నుగీటే దృశ్యాలు ఆల్రెడీ చూశాం. అంతకుమించి సినిమాలో ఏమీ లేదు అంటున్నారు. నిర్మాతలు ఆమె ముఖం పెట్టుకుని బిజినెస్ చేసుకున్నారని చెబుతున్నారు. మొత్తానికి ప్రేక్షకుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి
https://www.telugupost.com/movie-news/overseas-top-five-movies-in-2018-103479/
ఈ ఏడాది చాలా సినిమాలే విడుదలయ్యాయి. కానీ చాలా తక్కువ సినిమాలే కోట్లు కొల్లకొట్టాయి కానీ…. హిట్ అయిన సినిమాల కన్నా.. ప్లాప్ అయిన సినిమా లిస్ట్ చాంతాడంత ఉంది. అయితే ఈ ఏడాది భారీ అంచనాలతో బరిలోకి దిగిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. కొన్ని సినిమాలు అస్సలు అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసుని దడ దడ లాడించాయి. అజ్ఞాతవాసి లాటి సినిమాలు భారీ అంచనాలతో బరిలోకి దిగితే భారీగా డిజాస్టర్ అయ్యాయి. ఇక మహానటి, గీత గోవిందం లాంటి సినిమాలైతే ఎటువంటి అంచనాలు లేకుండా ఇండియా తో పాటుగా ఓవర్సీస్ బాక్సాఫీసుకి వణుకు పుట్టించాయి. కోట్లు కొల్లగొట్టి…. ఇక మార్చి 30 న విడుదలైన రామ్ చరణ్ – సుకుమార్ ల రంగస్థలం కోట్లు కొల్లగొట్టింది. ఓవర్సీస్ లోను రంగస్థలం అలాంటి ఇలాంటి హిట్ కాదు. ఓవర్సీస్ బాక్సాఫీసుని రంగస్థలం గడగడలాడించింది. ఇక మహానటి మూవీ కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… ఓవర్సీస్ లోను ప్రతాపం చూపించింది. ఇక మహేష్ భరత్ అనే నేను కలెక్షన్స్ వైజ్ గా ఇండియాలో పర్వాలేదనిపించింది… ఓవర్సీస్ లో మాత్రం కొరటాల , మహేష్ క్రేజ్ తో దున్నేసింది. ఇక విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా ఇక్కడ , అటు ఓవర్సీస్ లోను స్టార్ హీరోల రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. దసరాకి భారీ అంచనాలతో బరిలోకి దిగిన అరవింద సమేత కూడా ఈ ఏడాది ఓవర్సీస్ లో త్రివిక్రమ్ క్రేజ్ తో కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది. 2018 ఓవర్సీస్ బాక్సాఫీసు టాప్ మూవీస్ లిస్ట్ రంగస్థలం 3,513,450 భరత్ అనే నేను 3,416,451 మహానటి 2,543,515 గీత గోవిందం 2,465,367 అరవింద సమేత 2,181,943 మిలియన్స్
https://www.telugupost.com/movie-news/allu-arjun-at-kuntala-168807/
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శత్వంలో పుష్ప సినిమా చెయ్యాలి. అందులోను అది పాన్ ఇండియా మూవీ కావడంతో పుష్ప సినిమాపై అందరిలోనూ అంచనాలు. అలాగే అల్లు అర్జున్ లుక్ పైన కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ కల్డ్ మాస్ లుక్ పుష్ప ఫస్ట్ లుక్ లోనే అదిరింది. లాక్ డౌన్ తో పుష్ప సినిమా పట్టాలెక్కకపోయినా అల్లు అర్జున్ మాత్రం పుష్ప లుక్ లోనే కంటిన్యూ అవుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఆదిలాబాద్ లోని కుంటాల జ‌ల‌పాతాన్ని తన ఫ్యామిలీతో కలిసి సందర్శించాడు. తెలంగాణ‌లో వ‌ర్షాలు బాగా ప‌డుతుండ‌డంతో ఆదిలాబాద్ లోను కుంటాల జ‌ల‌పాతం చూడ ముచ్చ‌ట‌గా.. చాల అందంగా.. ర‌మ‌ణీయంగా ఉంది. దీంతో ఆ జ‌ల‌పాతం అందాల‌ను అల్లు అర్జున్ త‌న కుటుంబంతో సంద‌ర్శించి హాట్ టాపిక్ అయ్యాడు. అయితే అల్లు అర్జున్ ఆ కుంటాల జలపాతాన్ని ఊరికే ఆస్వాదించడానికి వెళ్లలేదని.. సుకుమార్ తో తానూ చెయ్యబోయే పుష్ప సినిమాలో ఇలాంటి జలపాతమే కావాలని, గతంలో సుకుమర్ కేరళ లోని ఓ జలపాతం దగ్గర పుష్ప ట్రయిల్ షూట్ నిర్వహించాడు. ప్రస్తుతం కరోనా టైం లో కేరళకి అడవులకి వెళ్లడం సేఫ్ కాదని భావించే అల్లు అర్జున్ అండ్ టీం కుంటాల జ‌ల‌పాతం దగ్గర షూటింగ్ చేస్తే ఎలా ఉంటుందో.. ఆ లొకేషన్ షూటింగ్ కి అనుకూలమా? ప్రతికూలమా? అని చూడడానికే ఆటను ఫ్యామిలీని వెంటేసుకుని ఓ విహార యాత్రల అక్కడికి వెళ్లాడని టాక్ వినిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ ఈ విహార యాత్ర ఎంతగా హైలెట్ అయ్యిందో.. అందులోను అల్లు అర్జున్ లుక్ హైలెట్ అయ్యింది.
https://www.telugupost.com/movie-news/ntr-31-movie-153819/
కరోనా కారణంగా ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తున్న హీరోలంతా ఖాళీ సమయంలో కొంతమంది దర్శకుల కాంటాక్ట్ లోకి వెళ్లి ఫోన్ లో కథలు వింటున్నారట. ప్రస్తుతం RRR షూటింగ్ కి బ్రేకిచ్చి కరోనా లాక్ డౌన్ కి బందీ అయినా ఎన్టీఆర్… రామ్ చరణ్ పూర్తియిన రోజు స్పెషల్ వీడియో కోసం ఇంట్లో నుండే డబ్బింగ్ చెప్పాడు. అయితే RRR పనులు రాజమౌళి ఇంటి నుండే చూసుకుంటున్నాడు.. ఇక హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్రీ అయ్యారు. అయితే ఎన్టీఆర్ RRR తర్వాత సినిమాని త్రివిక్రమ్ తో కమిట్ అవగా.. తదుపరి సినిమా కోసం ఇప్పుడు కథలు వింటున్నాడనే టాక్ వినబడుతుంది. ఎన్టీఆర్ తన 31 వ సినిమా కోసం దర్శకులకు కథలు చెప్పమని అడిగాడని.. దానికోసం కన్నడనుండి ప్రశాంత్ నీల్, ఇటు తెలుగు నుండి కొరటాల, తమిళం నుండి అట్లీ లైన్ లోకొచ్చారనే టాక్ వినబడుతుంది. అయితే ఎన్టీఆర్ తనకి చెప్పే కథకి పాన్ ఇండియా అప్పీల్ ఉండాలని.. ఈ సినిమా ఇండియా వైడ్ గా తెరకెక్కాలనే కండీషన్స్ పెడుతున్నాడట. ఇక ఏ దర్శకుడు తన ఇమేజ్ కి తగ్గట్టుగా పాన్ ఇండియా కథ వినిపిస్తే ఆ డైరెక్టర్ కే ఎన్టీఆర్ కమిట్ అవుతాడట. మరి ప్రస్తుతం ఫ్యామిలీ తో ఎన్టీఆర్ టైం స్పెండ్ చేస్తూనే ఇటు తదుపరి సినిమా కోసం కథలు వింటున్నాడనే కహాని ఎంతవరకు నిజమనేది తెలియదు.
https://www.telugupost.com/movie-news/ఇతని-వల్ల-అవుతుందా-57255/
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుసగా హారిక హాసిని క్రియేషన్స్ వారి సంస్థలోనే సినిమాలు చేస్తూ ఆ నిర్మాణ సంస్థని తన హోమ్ ప్రొడక్షన్ హౌస్ గా మార్చేసుకున్నాడు. వీరి కాంబినేషన్ లో పలు విజయాలు తద్వారా కాసులు బాగానే వచ్చాయి కానీ ఒక్క డిసాస్టర్ ఈ లెక్కలన్నిటిని మార్చేసింది. ప్రొమోషన్స్ విషయంలో హారిక హాసిని క్రియేషన్స్ వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు దారి తీస్తుంది. అయితే ఒకవేళ అజ్ఞ్యాతవాసి చిత్రం ఆడి వుండి ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులే తమ హీరో చిత్రానికి పబ్లిసిటీ అవసరమే లేదు, తమ హీరో పేరే పెద్ద పబ్లిసిటీ అని చెప్పుకునే వారు. కానీ సినిమా ఆడక పోయేసరికి వారే ఇప్పుడు ప్రొమోషన్స్ సరిగ్గా చేయలేదని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ పై ఆగ్రహంగా వున్నారు.సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ ఆరోపణలు హారిక హాసిని క్రియేషన్స్ పై చెరగని మచ్చగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన అధినేత రాధా కృష్ణ చిత్ర పంపిణీదారులతో మీటింగ్ ఏర్పాటు చేసి వచ్చిన నష్టాలలో 20 కోట్ల రూపాయల నష్టం తాను భరించేటట్టు ఒప్పందం చేసుకున్నారట. అయితే అజ్ఞ్యాతవాసి వలన వచ్చే నష్టం 60 కోట్ల రూపాయలకి పైమాటే. అందుకోసం ఈ 20 కోట్ల రూపాయలతో పాటు తమ సంస్థ లో రాబోయే తారక్ మరియు విక్టరీ వెంకటేష్ ల చిత్రాలని అందుబాటు రేట్లకి ఇచ్చి, తదుపరి చిత్రాల ప్రొమోషన్స్ విషయం లో కూడా తగు జాగ్రత్తలు వహించి తమ ప్రొడక్షన్ హౌస్ పై పడ్డ మచ్చ చెరిపేసుకునేలా తగు హామీలని పంపిణీదారులకి ఇచ్చి పంపారట నిర్మాత రాధా కృష్ణ.
https://www.telugupost.com/movie-news/kushbu-on-mahesh-babu-74715/
తమిళ నటి ఖుష్బూ మహేష్ బాబు నాకు తెలియదు అని అన్నారు. తన అభిమాన నటుడు మహేష్ బాబు గురించి ఖుష్బూ చేసిన కామెంట్స్ పై ఫ్యాన్స్ కొంచం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మహేష్ గురించే కాదు... మరింత మంది స్టార్ల గురించి మనసులోని అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. పాలిటిక్స్ పరంగా.. సినిమాలు పరంగా ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆన్సర్స్ ఇచ్చారు ఖుష్బూ.చిరంజీవి బంగారం లాంటి మనసున్న మనిషని.. పవన్ కళ్యాణ్ తో పని చేస్తే సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. అలానే వెంకటేష్ నాకు సెంటిమెంట్ హీరో అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనకు ఇష్టమైన వ్యక్తని అన్నారు. మహేష్ బాబు గురించి అడగా మహేష్ బాబు గురించి నాకు అంతగా తెలియదు అన్నారు. కాకపోతే మంచి మనిషి అని ప్రశంసించారు.అలానే రాజకీయాలు గురించి మాట్లాడుతూ.. ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని.. బీజేపీ వాళ్లు కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. తన రాజకీయ గురువు కరుణానిధి మాత్రమేనన్నారు. ఇలా ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం బెదురూ లేకుండా ముక్కుసూటిగా జవాబులు చెప్పారు ఖుష్బూ.
https://www.telugupost.com/movie-news/pawan-in-syeraa-sets-86171/
మెగా ఫ్యామిలీతో ఎపుడు పవన్ కళ్యాణ్ కలిసినా అది మెగా ఫాన్స్ కి మాత్రమే కాదు మిగతా వారికీ పండుగగా ఉంటుంది. మెగా ఫ్యామిలీ తో పవన్ కళ్యాణ్ కాస్త ఎడంగా ఉంటాడు. గత ఏడాది వరకు పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి దూరంగానే గడిపాడు. కానీ గత ఏడాది నుండి పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీలోని అందరికీ అంటే చిరంజీవి దగ్గర నుండి అల్లు అర్జున్ వరకు అందరికీ దగ్గరవుతున్నారు. పొలిటికల్ కెరీర్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అవకాశం ఉన్నప్పుడల్లా చిరజీవి ఇంటికెళ్లి వస్తున్నాడు. అనేక అకేషన్స్ కి పవన్ భార్యతో పాటుగా హాజరవుతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ కి ఇంతకన్నా ఏం కావాలి. ఇక రామ్ చరణ్ ఎప్పుడూ బాబయ్ పవన్ కళ్యాణ్ కి దగ్గరగానే ఉంటున్నాడు.సై రా సెట్ కి వచ్చిన పవన్ కళ్యాణ్మొన్నటికి మొన్న చిరు పుట్టిన రోజుకి పవన్ కళ్యాణ్ సతీసమేతంగా అన్న ఇంటికి వెళ్లాడు. ఇక ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్ ఒకే ఫ్రెమ్ లో ఒకే చోట కలిసి కనబడితే మెగా ఫ్యాన్స్ ఆనందనడానికి హద్దులే ఉండవు. మరి ఇప్పుడు నిజంగానే అలాంటి హ్యాపీ మూమెంట్ ఒకటి సై రా నరసింహారెడ్డి సెట్స్ లో చోటు చేసుకుంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న సై రా మూవీ షూటింగ్ లో బిజీగా ఉంటున్న చిరంజీవిని కలిసేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సై రా సెట్స్ కి విచ్చేయడం... సై రా షూటింగ్ కోసం బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఉండడం... నిర్మాతగా రామ్ చరణ్ అక్కడే ఉండడం తో చిరు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్ కలిసి ఒక ఫోటోకి ఫోజిచ్చారు. అయితే ఆ ఫోటోలో రైటర్ సత్యానంద్ కూడా ఉన్నాడు.కానుకగా ఇచ్చిన చిరంజీవి...మరి ఆ ఫోటోని సత్యానంద్ కోసం చిరంజీవి ఫోటో ఫ్రెమ్ కట్టించి పంపినట్లుగా.. అందుకే అంత అపురూపమైన ఫోటోని సత్యానంద్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఆ ఫొటోలో చిరంజీవి సై రా నరసింహారెడ్డి గెటప్ లో అదరగొడుతుంటే.. రామ్ చరణ్, పవన్ లాల్చీ పైజామాతో.. అమితాబ్ బచ్చన్ సై రా గురువు గెటప్ లో ఉన్నారు. మరి ఆ ఫోటో చూస్తుంటే నిజంగా మెగా ఫాన్స్ కి మాత్రమే అందరికీ పండగ లాంటిదే. ఒకే ఫ్రెమ్ లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ ఉంటే మరి చూసేవారికి పండగేగా. ఈ ఫోటో ఎప్పుడు తీసింది అనేది ఇంపార్టెంట్ కాదుగానీ.. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సత్యానంద్ ని అందరూ తెగ మెచ్చేసుకుంటున్నారు.
https://www.telugupost.com/crime/seven-months-pregnant-woman-brutally-murdered-in-brazil-1441038
ఓ గర్భిణీ దారుణ హత్యకు గురైంది. అందుకు గల కారణం తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. సెప్టెంబర్ 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బ్రెజిల్ లోని సావో పాలోలోని పోర్టల్ డాస్ లాగోస్ లో ఒహానా కరోలిన్ అనే 24 ఏళ్ల మహిళ మృతదేహం కనిపించింది. ఆమె పేరు ఒహానా. ముగ్గురు పిల్లలకు తల్లైన ఆమె.. చనిపోయే సమయానికి ఏడు నెలల గర్భిణీగా ఉంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతురాలిని చంపి, ఆమె పొట్టను చీల్చి కడుపులోని బిడ్డను దుండగులు ఎత్తుకెళ్లినట్లు గురించారు.మతపరమైన ఆచారాలను నెరవేర్చేందుకే మహిళను హత్యచేసి, బిడ్డను ఎత్తుకెళ్లి బలిచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒహానా మృతదేహం దగ్గర కొన్ని డబ్బులు కూడా పడి ఉన్నాయని తెలిపారు. మృతదేహం దొరికిన ప్రాంతంలో చాలా చర్చిలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఒహానా తన భర్త నుంచి విడిపోయి ప్రియుడితో ఉంటోంది. అయితే ఇది ఆమె మాజీ భర్త పనా ? లేక బిడ్డకోసం ఎవరైనా కావాలని చేసిన పనా అన్న విషయం తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/vakeel-saab-168418/
పవన్ కళ్యాణ్ రెండేళ్ల తర్వాత మొహానికి మేకప్ వేసుకుని బాలీవుడ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కరోనా రాకపోతే ఎప్పుడో షూటింగ్ పూర్తయ్యి సినిమా విడుదలయ్యేది. అయితే పవన్ కళ్యాణ్ ని హైలెట్ చేస్తూ వకీల్ సాబ్ తెరకేక్కిన్చారని… ఈ సినిమా మహిళా ప్రాధాన్యత మూవీ, కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని పెంచేందుకు ఫైట్స్, పాటలు అంటూ చిత్ర బృందం హడావిడి చేస్తుంది అని ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు వేణు శ్రీరామ్ ఆ ప్రచారంపై స్పందించాడు. పవన్ కళ్యణ్ ఫాన్స్ కోసం ఫస్ట్ లుక్ ని పవన్ కళ్యాణ్ మీదే చేసాం. కానీ ఈ సినిమాలో మహిళా ప్రాధాన్యతే ఎక్కువ. అందుకే మగువ సాంగ్ ని కనీసం పవన్ ఫోటో లేకుండా మహిళలకు అంకితమిచ్చాం. అయినా అలాంటి ఓ సాంగ్ పింక్ లో కానీ, అజిత్ చేసిన తమిళ రీమేక్ లో కానీ లేదు. కానీ మేము చేసాం. ఇక టీజర్ కూడా పవన్ ఫాన్స్ ని దృష్టిలో ఉంచుకునే కట్ చేసాం. ఆయనని ఆలా చూడడానికే పవన్ ఫాన్స్ ఇష్టపడతారు అంటూ వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టాడు. ఇక ఈ సినిమాలో పవన్ మీద డాన్స్ లు కూడా ఊహించుకోవద్దు.. ఆయన ఆలా నడిచొస్తేనే ఫాన్స్ కి పూనకలొచ్చేస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో ఒకటి కాదు చాలా గెటప్స్ లో కనిపిస్తారంటూ వకీల్ సాబ్ పై వేణు శ్రీరామ్ అందరికి క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఓ 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని.. పవన్ పై చిత్రీకరించాల్సిన సన్నివేశలు కొన్ని ఉన్నాయని.. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టి చిత్రీకరణ పూర్తి చేస్తామని చెప్పాడు.
https://www.telugupost.com/movie-news/హీరోయిన్-ప్రవర్తనతో-అవాక-56904/
వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వాటి పై పడే పన్ను తగ్గించుకోవటం కోసం ఒకరి సొమ్ముతో కొనుగోలు చేసే వాహనానికి ఇంకెవరి పేరునో రిజిస్టర్ చేసుకుని డెలివరీ పొందటం, ఫేక్ చిరునామాలు, ఫేక్ డాక్క్యూమెంట్స్ తో మభ్య పెట్టటం సహజంగా అందరూ చేసే తంతే కానీ ఈ వ్యవహారం చేసి దొరికింది ఒక సినిమా సెలబ్రిటీ కావటంతో ఆ వార్త చాలా ప్రత్యేకమై చానెల్స్ కి ఫీడింగ్ ఐయింది. ఈ పరిణామం లో దోషిగా చిక్కుకుని బలి ఐన కథానాయిక అమల పాల్ కేరళ ప్రత్యేక క్రైమ్ సిబ్బంది విచారణలో నేరం అంగీకరించిన సంగతి సర్వత్రా చర్చనీయాంశం ఐయింది.అలా కేరళ ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది విచారణలో ఇచ్చిన వివరణ అనంతరం సామాజిక మాంద్యమాలలో అమల పాల్ తన అభిమానులతో తన అభిప్రాయం పంచుకుంటూ "మీ గురించి ఎవరు ఏమనుకున్నా, అపార్ధం చేసుకున్నా అది వారి వ్యక్తిగతానికే వదిలేయండి. మీ పని మీరు చేసుకుపోతూ మీ ప్రతిభని మీరు చాటుకుంటూ వుండండి. అదే మిమ్మల్ని శిఖరాలని చేరుస్తుంది." అంటూ నీతి బోధనలు చేస్తూ క్రైమ్ బ్రాంచ్ వారి విచారణ వ్యవాహారం పై పరోక్ష కామెంట్స్ చేస్తూ అమల ధ్వంధ్వ వైఖరి తో ఆశ్చర్యపరిచింది.
https://www.telugupost.com/movie-news/shriya-husband-coronavirus-154247/
ప్రస్తుతం దగ్గొచ్చిన… జ్వరమొచ్చింది, తుమ్మినా కరోనా అని భయపడల్సి వస్తుంది. అందులోను విదేశాలకు వెళ్లొచ్చిన వారు, విదేశాల్లో ఉంటున్న వారికీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా అని ఫిక్స్ అవడమే. అయితే తాజాగా ఓ హీరోయిన్ తన భర్త కి కరోనా లక్షణులుంటే.. హాస్పిటల్ సిబ్బంది తమని బలవంతంగా పంపేశారని అంటుంది. ఆమె ఎవరో కాదు. ఒకప్పుడు గ్లామర్ గర్ల్..ప్రస్తుతం పెళ్లి చేసుకుని.. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీయ శరణ్, రష్యాకి చెందిన ఆటగాడు ఆండ్రిని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న శ్రియ శరణ్ ప్రస్తుతం స్పెయిన్ లో భర్తతో కలిసి ఉంటుంది అయితే ప్రస్తుతం ఆండ్రీ పొడి దగ్గుతోను, జ్వరంతోను భాధపడుతున్నాడట. అయితే స్పెయిన్ లో కరోనా విజృంభిస్తుండడంతో… హాస్పిటల్ కి వెళ్లిన శ్రీయ దంపతులను టెస్ట్ చేసి కరోనా లేదని.. ఇంటికి పంపేసారట. అయితే కరోనా లేకుండా హాస్పిటల్ లో ఉంటె కరోనా త్వరగా వస్తుంది అని… తమని ఇంటికి పంపేశారని చెబుతుంది శ్రీయ. ఇక ఇంటికొచ్చాక కూడా తాము ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నామని చెబుతుంది శ్రియ. ఇక తామిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ….. వేరు వేరు గదుల్లో పడుకుంటున్నామని… ఆండ్రీ కి ఇంకా దగ్గు వస్తుంది అని, భౌతికంగా దూరం పాటిస్తున్నాం దేవుడి దయవల్ల ఆండ్రీ ఆరోగ్యం కుదురుపడుతుంది అని చెప్పుకొచ్చింది శ్రీయ.
https://www.telugupost.com/gossip/nandamuri-balakrishna-son-mokshagnya-entry-138986/
ఎప్పటినుండో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై వార్తలొస్తున్నాయి. 2018 లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య హింట్ ఇచ్చినా.. మోక్షజ్ఞ ఎంట్రీ జరగలేదు. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఇప్పుడు సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అది కూడా బోయపాటి – బాలయ్య సినిమా ద్వారా అని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య.. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమా చేస్తున్నాడు. రూలర్ ని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసి.. తర్వాత జనవరి నెలాఖరు నుండి బాలకృష్ణ బోయపాటి సినిమాని మొదలెట్టబోతున్నాడు. ఓన్ బ్యానేర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలకృష్ణ కేరెక్టర్ ని బాగా పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నాడట బోయపాటి. వినయ విధేయరామ తర్వాత బోయపాటి కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. తాజాగా బాలయ్య సినిమాతో వార్తల్లకొచ్చిన బోయపాటి.. ఇప్పుడు బాలకృష్ణ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా వున్నాడు. మరి మోక్షజ్ఞ బోయపాటి సినిమా తో సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని న్యూస్ లో ఎంత నిజముందో తెలియదు కానీ.. నందమూరి అభిమానులు మాత్రం మోక్షుజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడనే న్యూస్ తో సంబరాలు చేసుకుంటున్నారు.
https://www.telugupost.com/movie-news/tejasvi-mudivada-marriage-with-big-boss-samrat-reddy-86467/
బిగ్ బాస్ సీజన్ 2 లో పార్టిసిపెంట్‌గా వెళ్లిన తేజస్వి మదివాడ చాలా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌ చేస్తూ కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. రామ్ గోపాల్ వర్మ తీసిన ఐస్ క్రీం సినిమాలో హాట్ హాట్ గా కనిపించిన తేజు బిగ్ బాస్ వెళ్ళాక హాట్ టాపిక్ గా మారింది.చాన్నాళ్ల పాటు హౌస్‌లో కొనసాగిన తేజు హౌస్‌లో ఆమె మరో క్యారెక్టర్ నటుడు సామ్రాట్‌తో చాలా సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశమైంది. అయితే ఆ షో అయ్యాక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని వార్తలు వచ్చాయి. దీనిపై తేజు తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది.నేను అందరితో సరదాగా ఉంటాను..మొదటి నుండి ఒంటరి జీవితానికి అలవాటు పడ్డానని..కానీ సామ్రాట్ విషయంలో ఇంకొంచం సన్నిహితుడిగా అనిపించాడని తేజస్వి చెప్పింది. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు..కష్టాలన్నీ సామ్రాట్ తో పంచుకోవాలనిపించిందని అంతే తప్ప తమ ఇద్దరి మధ్య అటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది తేజు. హౌస్ నుండి బయటికి రాగానే అందరు సామ్రాట్ తో పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంటే కోపం వస్తుందని అందుకే మరోసారి క్లారిటీ ఇస్తున్న అని చెప్పింది.
https://www.telugupost.com/crime/hemant-kumar-lohia-director-general-of-jammu-and-kashmir-prisons-department-was-brutally-murdered-1441805
జమ్ము కాశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. తన ఇంట్లో పనిమనిషే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పనిమనిషి పరారీలో ఉన్నాడు. అయితే ఈ హత్యకు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ ప్రకటించింది. డీజీపీ లోహియాను హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. హత్య జరగడానికి ముందు ఏం జరిగిందన్న దానిపై లోతుగా విచారిస్తున్నామని జమ్ము జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ముకేష్ సింగ్ తెలిపారు.హత్యకు ముందు...హత్యకు గురి కావడానికి ముందు హేమంత్ కుమార్ లోహియా పాదం వాచిందన్నారు. ఇందుకోసం ఆయన ఏదో నూనె రాసుకున్నట్లుగా అర్థమవుతుందన్నారు. లోహియాకు ఊపిరి ఆడకుండా చేసి సీసాతో నిందితుడు గొంతు కోశాడని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు కారణాలు మాత్రం ఏమై ఉంటాయన్న దానిపై విచారణ జరుపుతున్నారు. హేమంత్ కుమార్ లోహియా 1992 బ్యాచ్ కు చెందిన అధికారి. ఈ ఏడాది ఆగస్టు నెలలో జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలను చేపట్టారు.
https://www.telugupost.com/movie-news/జై-లవ-కుశ-ఫస్ట్-డే-కలెక్షన-44349/
ఏపీ తెలంగాణ ఏరియా వైజ్ షేర్:నైజాం: 5 .05 కోట్లుసీడెడ్: 3 .77 కోట్లువైజాగ్: 1 .89 కోట్లుపశ్చిమ గోదావరి: 1 .89 కోట్లుతూర్పు గోదావరి: 2 .96 కోట్లుకృష్ణ: 1 .71 కోట్లుగుంటూరు: 3 .05 కోట్లునెల్లూరు: 1 .08 కోట్లుఏపీ, తెలంగాణ జై లవ కుశ మొదటి రోజు లెక్కలు మొత్తంగా - 21 .40 కోట్లు
https://www.telugupost.com/movie-news/kalavathi-full-song-lyrical-video-out-from-sarkaruvari-pata-1354333
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం సర్కారువారి పాట. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. అలాగే కళావతి సాంగ్ ప్రోమో కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ స్వరపరిచిన ఆ పాట ఒరిజినల్ లిరికల్ వీడియో విడుదలైంది.Also Read : మూడు రోజులపాటు సీఎం జన్మదిన వేడుకలు : మంత్రి కేటీఆర్ఈ వీడియోలో మహేష్ - కీర్తి ల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. వందో.. ఒక వెయ్యో అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. చాలా సింపుల్ గా ఉండే మహేష్.. ఈ పాటలో మాత్రం చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అనంత శ్రీరామ్ రచించిన ఈ పాటను ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ ఆలపించారు. సిధ్ పాట పాడాడు అంటే.. అది ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. కాగా.. తొలుత ఈ పాటను ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఆ మేరకే ప్రకటన చేసింది. కానీ.. అనూహ్యంగా శనివారం సాయంత్రం కళావతి ఫుల్ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయి.. చిత్ర యూనిట్ కు షాకిచ్చింది. దాంతో ఒకరోజు ముందుగానే పాటను విడుదల చేశారు మేకర్స్. మే 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతోంది.
https://www.telugupost.com/movie-news/డీజే-తో-స‌రికొత్త-రికార్-34110/
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైన‌మిక్ డైర‌క్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమా 'డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న 25వ సినిమా కావ‌డం విశేషం. ఈ చిత్రం ట్రైల‌ర్‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ట్రైల‌ర్ విడుద‌లైన 24గంట‌ల్లోనే యూట్యూబ్‌, ఫేస్‌బుక్ లో క‌లిపి 7.4 మిలియ‌న్ల మంది చూడ‌టం విశేషం.యూత్ ఐకాన్‌గా త‌న స్టైల్స్ తో కుర్ర‌కారును ఆక‌ట్టుకునే అల్లు అర్జున్ ఈ చిత్రంలో బ్రాహ్మ‌ణ కుర్రాడిగానూ, స్టైలిష్ ఆఫీస‌ర్‌గానూ రెండు లుక్కుల్లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దానికి తోడు ట్రైల‌ర్‌లో హ‌రీశ్ శంక‌ర్ రాసిన పంచ్ డైలాగుల‌కు విప‌రీత‌మైన స్పందన వ‌స్తోంది. అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట కూడా చూడ్డానికి క‌నువిందుగా ఉంది. దిల్‌రాజు బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో మేకింగ్ వేల్యూస్ కూడా అదే రేంజ్‌లో క‌నిపిస్తున్నాయి. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి ఈ సినిమాకు అన్ని వ్యూస్‌ని తెచ్చిపెట్టాయి. ద‌క్షిణాదిన బాహుబ‌లి: ది కంక్లూజ‌న్ త‌ర్వాత ఇంత భారీ స్థాయిలో వ్యూస్‌ను తెచ్చుకున్న చిత్రం ఇదే కావ‌డం విశేషం. ట్రైల‌ర్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. పాజిటివ్ రివ్యూల‌ను అందిస్తున్నారు. అల్లు అర్జున్ రెండు గెట‌ప్పుల్లో చాలా వైవిధ్య‌త‌ను క‌న‌బ‌రిచార‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. డైలాగ్ డెలివరీలోనూ అల్లు అర్జున్ గ‌త చిత్రాల‌కు ఈ సినిమాకూ తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. జూన్ 23న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత దిల్‌రాజు స‌న్నాహాలు చేస్తున్నారు. అంత‌కు ముందే ఆడియో విడుద‌ల వేడుక‌ను భారీగా నిర్వ‌హించ‌డానికి కూడా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే పాట‌ల పండుగ తేదీని ప్ర‌క‌టిస్తారు. దేవిశ్రీ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌ల‌కు ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. ప్ర‌తినాయ‌కుడిగా రావు ర‌మేశ్ కు కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
https://www.telugupost.com/movie-news/స్వీటీ-మిల్కీ-మరొక-సారి-క-25213/
శ్రీ చిత్రంతో తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్న, సూపర్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన కథానాయిక స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి లు ఇద్దరు తమ నట జీవితాలలో దశాబ్ద కాలం పూర్తి చేసుకుని ఇంకా కథానాయికలుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఒకే చిత్రంలో కనిపించింది మాత్రం 2015 లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ లో మాత్రమే. ఇక ఆ భాగానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి ది కంక్లూషన్ ఏప్రిల్ 28 న విడుదలకు సిద్ధం అవుతుండగా మరొక క్రేజీ ప్రాజెక్ట్ తో ఈ ఇరువురు భామలు కలిసి పనిచేయనున్నారు.తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఇలా నాలుగు దక్షిణాది భాషలలోనూ ఏకకాలంలో చిత్రాన్ని తెరక్కేకించటానికి గత కొంత కాలంగా దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ శ్రమిస్తున్నాడు. ఇప్పటికే పునీత్ రాజ్ కుమార్ మరియు పృథ్వి రాజ్ లను ఫైనల్ చేసిన గౌతమ్ మీనన్ మరో ఇద్దరు హీరోల పాత్రలకు కూడా పలువురు స్టార్ హీరోస్ తో చర్చలు జరుపుతున్నాడు. నలుగురు స్నేహితులు అమెరికా టూర్ కి వెళ్లే ప్రయాణమే కథాంశం గా తీసుకున్న గౌతమ్ మీనన్ ముగ్గురు కథానాయికలకు చోటున్న ఈ కథలో ఇద్దరు కథానాయికలుగా అనుష్క మరియు తమన్నా లను ఖరారు చేసినట్టు సమాచారం. మరో కథానాయిక కోసం అన్వేషణ సాగుతుంది.గౌతమ్ వాసుదేవ్ మీనన్ గత చిత్రాలలో ఒకటైన ఎంతవాడు కానీ చిత్రంలో కూడా ఇద్దరు కథానాయికలకు చోటుండగా త్రిష ఒక కథానాయికగా నటించగా ఆ చిత్రంలో కూడా మరో కథానాయిక అవకాశం అనుష్క కి దక్కిన విషయం విదితమే.
https://www.telugupost.com/movie-news/gabbar-singh-movie-song-singer-vaddepalli-srinivas-demise-news-1523118
ప్రముఖ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్ లోని 'గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల' గీతాన్ని ఆలపించి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఆయన పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వడ్డేపల్లి శ్రీనివాస్ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కొన్ని రోజుల కిందటే డిశ్చార్జి అయ్యారు. ఇంతలోనే ఆయన ప్రాణాలు వదిలారు.వడ్డేపల్లి శ్రీనివాస్ జానపద గాయకుడిగా ఎంతో గుర్తింపు పొందారు. 100కి పైగా ప్రైవేట్ సాంగ్స్ తో అలరించారు. గబ్బర్ సింగ్ చిత్రంలోని పాటకు ఆయన ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. వడ్డేపల్లి శ్రీనివాస్‌ మృతిపై పలువురు సినీ ప్రముఖులు, జానపద కళాకారులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
https://www.telugupost.com/andhra-pradesh/chief-minister-chandrababu-naidu-is-a-leader-with-five-decades-of-political-experience-he-doesnt-need-to-be-taught-strategies-1547056
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు పదుల రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయనకు ఒకరు వ్యూహాలను నేర్పాల్సిన పనిలేదు. ఆయనకు స్ట్రాటజిస్ట్ అవసరం లేదు. ఎప్పుడు ఏది చేయాలో రాజకీయంగా ఆయనకు తెలిసినంత మరే నేతకు తెలియదు. అందులో నూటికి నూరుపాళ్లు వాస్తవం ఉంది. చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళతారు. ఎప్పుడూ ఆయన బిజీగానే ఉంటారు. కేవలం కార్యాలయానికే పరిమితం కారు. జనం మధ్యకు అధికారంలో ఉన్నా, లేకున్నా వెళ్లడం ఆయనకు అలవాటు. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనను ఇబ్బంది తెచ్చి పెడుతుంది.కేంద్ర ప్రభుత్వాన్ని....కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరలేని పరిస్థిితి. నిధులు ఇవ్వమని ఢిల్లీ చుట్టూ తిరగలేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయదన్న సంగతి ఆయనకు తెలియంది కాదు. పోలవరం, అమరావతి నిర్మాణం వంటివి చంద్రబాబుకు ప్రధమ ప్రాధాన్యాలు. ఖజానా చూస్తే బోసిపోయికనిపిస్తుంది. ఎటూ చేయలేని పరిస్థితి. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగువేల రూపాయల పింఛను అయితే ఇచ్చారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించి వారిలో సానుకూలత సంపాదించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఈ రెండు ముఖ్యమైన అంశాలుగా ఆయన తీసుకున్నారు.అమలు చేయాలంటే...?ఇక సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ఖజానా వెక్కిరిస్తుంది. దీంతో తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను వాయిదా వేయడమే మంచిదని ఆయన భావిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు, యాభై ఏళ్లు దాటిన బీసీలకు పింఛను ఇస్తామనడం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం, రైతు భరోసా, తల్లికి వందనం వంటి కార్యక్రమాలను వాయిదా వేయడమే మంచిదని ఆయన భావనలో ఉన్నట్లు కనపడుతుంది. లేదంటే అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. సంపద సృష్టిపైనే...చంద్రబాబు ఆలోచన తీరుకు అది విరుద్ధం. అప్పులు చేసి అభివృద్ధి చేయాలనుకుంటారు కానీ, సంక్షేమ పథకాలను అమలు చేసి చేతులు కాల్చుకునే పని చేయరు. ఎందుకంటే అభివృద్ధి జరిగితే సంపద పెరుగుతుంది. తద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడు కొంత సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి సంక్షేమ పథకాలను అమలు చేసినా ఆయన గెలిచింది లేదు. అందుకే .. ఈ పథకాలను, తాను ఇచ్చిన హామీలను ఎన్నికలకు రెండు, మూడేళ్ల ముందు వరసగా అమలు చేస్తే జనం గుర్తు పెట్టుకుంటారని, అది మరోసారి కూటమి విజయానికి దోహదపడుతుందని ఆయన అంచనాలో ఉన్నట్లుంది. మరి చంద్రబాబు ఆలోచన నిజమైతే ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకాలు ఏపీలో అమలయ్యేది కష్టమేనంటున్నాయి అధికార వర్గాలు.
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-chance-to-new-director-108964/
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చిన్న డైరెక్టర్స్ నుండి పెద్ద డైరెక్టర్స్ వరకు అందరితో సినిమాలు చేయనున్నాడు విజయ్. చిన్న డైరెక్టర్స్ కి కూడా విజయ్ ఆఫర్ ఇస్తున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ…“నేను కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడం కాదు, వాళ్లు నా దగ్గరకి వచ్చి కథ చెప్పడం నా అదృష్టం” అని చెప్పాడు. అలా అన్నాడో లేదో వెంటనే ఓ కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చేసాడు. రీసెంట్ గా ‘హుషారు’ అనే సినిమాతో యూత్ ని ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్ హర్షతో విజయ్ ఓ సినిమా చేయనున్నాడు. రెండు సినిమాల తర్వాత… అతని టాలెంట్ నచ్చి వెంటనే ఓ కథ రెడీ చేయి మనం సినిమా చేద్దాం అని చెప్పాడట. అంతా సెట్ అయితే నా నెక్స్ట్ సినిమా నీతోనే అని చెప్పాడట. డైరెక్టర్ శ్రీహర్ష ఈ విషయాన్ని ఇటీవలే ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ చేసే పనిలో ఉన్నాడు. ఇక విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ ముగించుకుని క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత హర్షతో సినిమా ఉండే అవకాశముంది.
https://www.telugupost.com/movie-news/ram-charan-introduce-his-new-friend-by-sharing-a-photos-1497905
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటూ పరిశ్రమలో ఒక ఫ్రెండ్లీ నేచర్ ని తీసుకు వస్తున్నాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్రెండ్ లిస్టులోకి మరో కొత్త ఫ్రెండ్ వచ్చాడంట. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు..?రామ్ చరణ్ మంచి 'హార్స్ రైడర్' అని అందరికి తెలిసిన విషయమే. చాలా చిన్న వయసు నుండే గుర్రాల పై సవారీ చేస్తూ వాటితో స్నేహం చేస్తూ వచ్చాడు. టైం దొరికినప్పుడు ఆ గుర్రాలతోనే సమయం గడుపుతుంటాడు. ఇక గుర్రాలు పై ఉన్న ఇష్టంతో.. కొత్త గుర్రాలను కూడా కొనుగోలు చేసి తన ఫార్మ్ లోకి తెచ్చుకుంటాడు. ఈక్రమంలోనే చరణ్ దగ్గర ఇప్పటికే కొన్ని గుర్రాలు ఉన్నాయి. తాజాగా మరో గుర్రాన్ని రామ్ చరణ్ తెచ్చుకున్నాడు.'మై న్యూ ఫ్రెండ్ బ్లేజ్' అంటూ ఆ గుర్రంతో ఉన్న పిక్ ని షేర్ చేసి తన అభిమానులకు పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమాలో కూడా హార్స్ రైడింగ్ సీన్ ఉంది. ఈ సినిమాలోని ఒక సాంగ్ చిత్రీకరణ సీన్.. ఈమధ్య లీక్ అయ్యి నెట్టింట వైరల్ అయ్యింది. ఆ లీక్ అయిన వీడియోలో రామ్ చరణ్ బ్లాక్ గుర్రం మీదనే సవారీ చేస్తున్నాడు.దీంతో ఇప్పుడు ఈ 'బ్లేజ్' ఆ గుర్రమే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మగధీర సినిమాలో కనిపించిన గుర్రాన్ని కూడా రామ్ చరణ్ కొనుగోలు చేసి తన దగ్గరకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో గేమ్ ఛేంజర్ లోని గుర్రాన్ని కూడా ఇష్టపడి కొనుగోలు చేసి ఉంటాడని కామెంట్స్ వస్తున్నాయి. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)
https://www.telugupost.com/movie-news/mahesh-babu-in-alluri-role-rrr-movie-114004/
రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుంది కానీ ఎప్పుడో క్లారిటీ లేదు. మరి రాజమౌళి బాహుబలి తర్వాత మహేష్ తో సినిమా చేస్తాడనుకున్నవారికి మాములుగా షాకివ్వలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మహేష్ ని పక్కనబెట్టేసి రాజమౌళి ఈ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మొదలుపెట్టాడు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో మహేష్ తో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేయిస్తే బాగుండేది… ఎలాగూ మహేష్ తండ్రి కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా చేసి సక్సెస్ సాధించారు. అందుకే ఈ సినిమాలో ఆ పాత్రకి మహేష్ ని పెట్టి ఉంటే కృష్ణ అభిమానులు ఆనందపడేవారు కదా అని రాజమౌళిని అడిగారు. ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో… అయితే, ఒకసారి ఏదో ఈవెంట్ లో మహేష్ ఫాన్స్ ని కలిసినప్పుడు మహేష్ ని అల్లూరి పాత్రలో చూడాలనుకుంటున్నారా లేదంటే జేమ్స్ బాండ్ తరహా పాత్రలోనా అని అడగగా.. వారు అల్లూరి కంటే ఎక్కువగా జేమ్స్ బాండ్ తరహా పాత్రకి రెస్సాన్స్ ఇచ్చారని రాజమౌళి చెప్పాడు. అందుకే మహేష్ ని ఈ #RRRలో తీసుకోలేదని చెప్పాడు. మరి మాములుగా జక్కన్న మనసులో అల్లూరి పాత్రని మహేష్ తోనే చేయించాలని అనుకున్నట్టుగా అనిపించలేదు. ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ సరిగా లేకపోవడంతో #RRR మల్టీస్టారర్ కి మహేష్ ని తీసుకోకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ ని తీసుకున్నాడన్న మాట.
https://www.telugupost.com/movie-news/ఫిల్మ్-ఛాంబర్-పై-ఫైర్-అయి-39975/
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఫైర్ అయ్యారు. ఈసారి ఆయన ఫిల్మ్ ఛాంబర్ మీద తన మండిపాటును ప్రదర్శించారు. రామ్ గోపాల్ వర్మ బహిరంగ లేఖలో ఇలా రాశారు. ‘సినీ పరిశ్రమ నిజంగా సిగ్గు పడాల్సిన విషయం డ్రగ్ స్కాండల్ కాదు..ఆ డ్రగ్ స్కాండల్ కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగలేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చే విధంగా అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం. ఫిల్మ్ ఛాంబర్ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేసామని బహిరంగంగా చెప్పడం కానీ, వారిలో ఫలానా వారి తప్పు నిరూపించబడింది అని అధికారులు చెప్పడం గాని ఇంతవరకు జరగలేదు. ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి క్షమాపణ ఎందుకు చెప్పినట్టు?’క్షమాపణ లేఖలో అర్థమేంటి?‘క్షమాపణ లేఖ లో ఒక వాక్యం "అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం"- ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేసారో? అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో కూడా చెప్పకుండా వాళ్లు అప్పుడే ఏదో మహా నేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి ఆల్రెడీ నేరం రుజువైందనే ధోరణిలో క్షమాపణలేఖ పంపించడంలో అర్థం ఏమిటి? అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం "మీలో ఏ మాత్రం -పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసికవేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా,జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగ లేఖలు రాయాలి. విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైనది కావచ్చేమో కానీ, అసలు ఛార్జెస్ కూడా ఫైల్ అవ్వని ఇలాంటి సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ వుంది. ఒకవేళ అలా మాట్లాడడం వల్ల చెయ్యని తప్పులని నిజం చేసి, అన్యాయంగా కేసులు బనాయించి చట్టం చట్రంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు. అది ప్రజాస్వామ్యానికే అవమానం"’.నిర్దోషులని తేలితే....‘అలాగే రేపు ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్ కి ఏ మాత్రం విచక్షణ వున్నా అధికారులకి బహిరంగ క్షమాపణలేఖ రాసినట్టే ఆరోపణలు ఎదుర్కున్న వాళ్లందరికీ బహిరంగ లెఖ ద్వారా క్షమాపణ చెప్పాలి. ఇలా చెయ్యని పక్షంలో భావి చరిత్రలొ వీళ్లందరూ నిజంగా నేరస్థులేనని ముద్రపడుతుంది. కాని ఫిల్మ్ ఛాంబర్ చెప్పిన క్షమాపణ మూలానే క్షమించి వదిలేసారనే అబద్ధం నిజంగా నిలిచిపోతుంది..ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కి ఉందని గౌరవపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను.’ అని రామ్ గోపాల్ వర్మ బహిరంగ లేఖ రాశారు.
https://www.telugupost.com/movie-news/bheemla-nayak-pre-release-event-1355833
పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ నెల 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాడు భీమ్లా నాయక్. ఫిబ్రవరి 21న సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగాల్సింది. కానీ.. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో.. ప్రీ రిలీజ్ వేడుకను ఆపివేశారు. ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్, పవన్ కల్యాణ్ అధికారిక ప్రకటనలు కూడా చేశారు. ఇక ముందుగా చెప్పినట్లే.. ఫ్యాన్స్ ను నిరాశ పరచకుండా.. నిన్న సాయంత్రమే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమా పై హైప్ ను పెంచేశాయి.Also Read : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయంవిద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం"నాయక్ .. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ" అని రానా చెప్పిన డైలాగ్.. ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. ట్రైలర్ ఓకే.. మరి ప్రీ రిలీజ్ సంగతేంటి ? ఇప్పుడిదే అభిమానుల్లో తలెత్తుతోన్న ప్రశ్న. సినిమా విడుదలకు ఇంకా మూడ్రోజులే సమయం ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో చెప్పండంటూ అభిమానులు నెట్టింట ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీ సెట్ వేశారు. అనుకున్న సమయానికి ఈవెంట్ జరిగి ఉంటే.. మంత్రులు కేటీఆర్, తలసాని చీఫ్ గెస్ట్ లుగా వచ్చేవారు. తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23, బుధవారం సాయంత్రం జరుగుతుందంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తే గానీ.. ఒక స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.
https://www.telugupost.com/movie-news/తొలి-సారి-ఆ-ప్రయోగం-చేస్త-31821/
తెలుగు, తమిళ్, మళయాళ ప్రేక్షకులకి సినిమా కథానాయికగా పరిచయమున్న యువ భామ కాథరిన్ ట్రెస్సా తెలుగు తో పాటు ఇతర భాషలలో కూడా అగ్ర కథానాయకులతో పని చేసినప్పటికీ టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరలేకపోయింది. తెలుగులో అల్లు అర్జున్ సరసన ఇద్దరు అమ్మాయిలతో చిత్రంతో ప్రేక్షకుల నుంచి గుర్తింపు పొందిన కాథరిన్ విజయాపజయాలకి అతీతం కాదు కాబట్టి అమ్మడికి అవకాశాలు తగ్గిపోతున్నాయి అని అనుకునే వారు వున్నారు, అలానే ప్రతిభ కనపరచకుండా గ్లామర్ పాత్రలకి పరిమితం కావటం పైగా ఆ గ్లామర్ డోస్ లో కూడా కళ్ళు చెదిరే అందాల ఆరబోతకు సాహసించకపోవటంతో కాథరిన్ కెరీర్ చాలా ప్లైన్ గా సాగుతుంది అనుకునే వారు వున్నారు.గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సరైనోడు లో ఎం.ఎల్.ఏ పాత్రలో మెప్పించిన కాథరిన్ ట్రెస్సా ప్రస్తుతం గోపి చంద్ హీరోగా నటిస్తున్న గౌతమ్ నంద చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో కాథరిన్ ఒక కొత్త ఫీట్ చేయబోతుంది. దుబాయ్ లో పెరిగిన కాథరిన్ కి భారత దేశంలో మాట్లాడే భాషలపై కానీ, ఇక్కడి భాషలలో యాసలతో మారే ఉచ్ఛరణ కానీ అలవాటు లేకపోవటంతో అందరి భామలలానే ఇంతకాలం డబ్బింగ్ ఆర్టిస్ట్ లపై ఆధారపడిన కాథరిన్ గౌతమ్ నంద లో తన పాత్రకి మాత్రం తానే డబ్బింగ్ చెప్పుకోటానికి ఫిక్స్ ఐయి బాగా శ్రమించి ఇప్పుడు తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటోంది. తొలి సారి డబ్బింగ్ చెప్తున్నా కాథరిన్ గొంతు తో తన పాత్రకి ఏం మాయ తోడవుతుందో చూడాలి.
https://www.telugupost.com/movie-news/adhugo-ravibabu-86842/
ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా ‘అదుగో’. ఈ సినిమాలో పంది పిల్ల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్పుడు ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో పిగ్ లెట్ బంటిని ప‌రిచ‌యం చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. చెక్క కంచెకు వేలాడుతూ న‌వ్వుతూ ఉన్న పందిపిల్ల చాలా క్యూట్ గా అంద‌ర్నీ అల‌రిస్తుంది. ర‌విబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భారత సినిమా చ‌రిత్ర‌లోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా ఇది. ఇందులో పంది పిల్‌ిను చాలా రియ‌ల్ గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు గ్రాఫిక్స్ టీం. దీనికోసం చాలా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు ర‌విబాబు. షూటింగ్ తో పాటు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ద‌స‌రా సెల‌వుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది అదుగో చిత్రం.అన్ని భాషల్లో...సురేష్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లో ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తుండ‌గా.. ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యాన‌ర్ లో ర‌విబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అదుగో’ అన్ని భార‌తీయ భాష‌ల్లో విడుద‌ల అవుతుండ‌టం విశేషం. కుటుంబ ప్రేక్ష‌కుల‌ను.. ముఖ్యంగా పిల్ల‌ల‌ను బాగా ఆక‌ట్టుకునే కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు ర‌విబాబు. అందుకే ఈ చిత్రాన్ని వీలైన‌న్ని భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు. తెలుగులో అదుగో అనే టైటిల్ తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాష‌ల్లో మాత్రం బంటి పేరుతో విడుద‌ల కానుంది.న‌టీన‌టులు:అభిషేక్ వ‌ర్మ‌, న‌భా, ర‌విబాబు, ఉద‌య్ భాస్క‌ర్, ఆర్కే, వీరేంద‌ర్ చౌద‌రి.
https://www.telugupost.com/movie-news/nagababu-making-double-the-money-from-zee-after-exiting-from-jabardast-142663/
జబర్దస్త్ నుండి మెల్లగా బయటి కెళ్ళిపోయి.. జీ తెలుగులో రెండు షోస్ కి జడ్జ్ గా మారిన నాగబాబు జబర్దస్త్ వలన నష్టపోయింది, కలిసొచ్చిన విషయాలను వీడియోస్ రూపంలో ఏకరువు పెట్టాడు. తనని ఆపదలో ఉన్నప్పుడు మల్లెమాల టీం ఆర్ధికంగా ఆదుకున్నదని చెబుతూనే.. తన స్థాయికి తగిన పారితోషికం కాకపోయినప్పటికీ… జబర్దస్త్ కామెడీ షోలో జడ్జ్ గా పని చేశానని చెప్పడమే కాదు.. క్రియేటివిటీని మల్లెమాల టీం ప్రోత్సహించకుండా తొక్కేస్తున్నారని మల్లెమాల టీంని మాములుగా విమర్శించలేదు నాగబాబు. అయితే నాగబాబు జబర్దస్త్ లో పారితోషికం కారణంగానే షో నుంచి మానేశాడనే ప్రచారానికి నాగబాబు అడ్డుకట్ట వేస్తున్న అనుకుని.. తనకి తగిన పారితోషకం మల్లెమాల టీం ఇవ్వలేదంటూ దొరికిపోయాడు. అయితే జబర్దస్త్ లో నాగబాబుకు నెలలో జరిగే నాలుగైదు ఎపిసోడ్స్ కి కలిపి 15 లక్షలు పారితోషకం ఇచ్చేవారని అన్నారు. ఇక జీ తెలుగులో అదిరింది కి జేడ్జ్ గా చేస్తున్నందుకుగాను జీ తెలుగు వారు నాగబాబుకు ఈటీవీలో వచ్చిన దానికన్నా డబుల్ పేమెంట్ ఇస్తున్నారని అంటే… ఈటీవీలో జడ్జ్ గా చేసినప్పుడు 15 లక్షలు వస్తే.. ఇప్పుడు దానికి డబుల్ జీ ఛానల్ కి 30 లక్షల చొప్పున నాగబాబు పారితోషకం అందుకుంటున్నాడనే టాక్ వినబడుతుంది. మరి జబర్దస్త్ నుండి వచ్చేసిన నాగబాబు లోకల్ గ్యాంగ్స్ కి జేడ్జ్ గా చేస్తున్నాడు. మరి ఇక్కడ ఎంత పారితోషకం అంటే తన స్థాయికి తగిన పారితోషకం అందుకుంటున్నాడో లేదో అనే దానిపై పెద్ద చర్చే నడిచింది. తాజాగా నాగబాబు జీ ఛానల్ నుండి నెలకి 30 లక్షలు పారితోషకం కింద అందుకుంటున్నాడనే టాక్ వినబడుతుంది.
https://www.telugupost.com/crime/minor-girl-gang-raped-in-telangana-peddapalli-dies-1490176
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బ్రతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ మైనర్ బాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ దారుణ ఘటన తర్వాత ఆ చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.మధ్యప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అప్పన్నపేట శివారులో ఉన్న ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక పరిస్థితిని గమనించిన నిందితులు ఓ ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్ కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే బాధిత బాలిక చనిపోయింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రియల్ఎస్టేట్ వెంచర్ లో పనిచేస్తున్న పెద్దపల్లి చెందిన వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఈ అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
https://www.telugupost.com/crime/mother-and-daughter-murdered-in-chennamma-circle-kurnool-district-1466990
కర్నూల్ లో దారుణ ఘటన జరిగింది. జంట హత్యలతో కర్నూల్ నగరం ఉలిక్కిపడింది. పెళ్లైన రెండు వారాలకే కొత్త అల్లుడు భార్య, అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య, అత్త మరణించగా.. మామకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని ఓ బ్యాంక్ లో పనిచేస్తున్న శ్రావణ్ కు కర్నూల్ కు చెందిన రుక్మిణితో రెండువారాల క్రితం వివాహం జరిగింది. పెళ్లన్నాక గొడవలు, మనస్ఫర్థలు రాకుండా లేకుండా ఉండవు కదా.ఇక్కడ కూడా రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్ఫర్థలు వచ్చాయి. దాంతో ఆవేశానికి గురైన శ్రావణ్ కర్నూల్ పట్టణం సుబ్బలక్ష్మీనగర్ లో నివాసం ఉంటోన్న అత్తింటివారిపై మంగళవారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య రుక్మిణీ, అత్త రమాదేవి మరణించారు. అడ్డొచ్చిన మామపై కూడా కత్తితో దాడి చేయడంతో ఆయన తీవ్రగాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. శ్రావణ్ పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/mahesh-nannu-dochukunduvate-sucess-meet-90437/
సుధీర్ బాబు - నభా నటేష్ జంటగా నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమా గత వారం రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ దక్కిచుకుంది. టాక్ అయితే పర్లేదు అని వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం డల్ అయ్యాయి. ఫస్ట్ వీకెండ్ అంతంత మాత్రమే వచ్చిన కలెక్షన్స్ ను మరింత పెంచాలని నిర్మాత సుధీర్ బాబు ఓ ప్లాన్ వేస్తున్నాడు. అందుకుగాను అతను ఈ సినిమాకు సంబంధించి ఓ సక్సెస్ మీట్ ను భారీ లెవెల్ లో ప్లాన్ చేయనున్నాడు.మహేష్ రాకతో వసూళ్లు పెరుగుతాయని...సుధీర్ బాబు సినిమా ప్రమోషన్స్ కి ముందుగానే మహేష్ బాబు రావడం కామన్. అయితే ఈ సినిమాకు మహేష్ బాబు కొన్ని కారణాలు వల్ల రాలేకపోయాడు. అయితే ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ చీఫ్ గెస్ట్ గా రానున్నాడు మహేష్. ఆల్రెడీ మహేష్ ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో వెల్లడించాడు. అంతేకాదు సుధీర్ బాబుని మెచ్చుకున్నాడు. మళ్లీ ఇప్పుడు సక్సెస్ మీట్ కి వస్తే సినిమాకి బజ్ ఉంటుంది. సినిమాకు ఎలాగో పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి మహేష్ వచ్చి కొంచం బూస్ట్ అప్ చేస్తే సెకండ్ వీక్ కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశముందని సుధీర్ ఆశపడుతున్నాడు. మరో రెండు మూడు రోజుల్లో ఈ మీట్ ఉండొచ్చని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నభాకు మంచి పేరు రావడమే కాదు పెద్దపెద్ద సినిమా నుండి ఆఫర్స్ వస్తున్నాయి.
https://www.telugupost.com/movie-news/no-interest-on-bollywood-163280/
ఏ సౌత్ హీరోయిన్ కైనా బాలీవుడ్ మీద ఉండే మోజు మరే భాష మీద ఉండదు. ఇక్కడ సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ లో అవకాశం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే తెలుగులో సమంత కోలీవుడ్ లో నయనతార మాత్రం బాలీవుడ్ వైపు కనెత్తి కూడా చూడరు. సమంత అయినా బాలీవుడ్ వెబ్ సీరీస్ కి వెళ్ళింది కానీ.. నయనతార మాత్రం బాలీవుడ్ లో ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఒప్పుకోకుండా కాలదన్నుతుంది. అదే తమన్నా, కాజల్, త్రిష, రకుల్ ప్రీత్, ఇలియానా వంటి భామలు చిన్న అవకాశం బాలీవుడ్ లో వచ్చిన వదలరు. అదే స్టార్ హీరో అవకాశం అయితే ఎగిరి గంతేస్తారు. అయితే ఇప్పుడు నయనతార గతంలో ఓ స్టార్ హీరో నటించిన టాప్ సూపర్ హిట్ మూవీ అవకాశం కాలదన్నింది అనే న్యూస్ కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లోను, టాలీవుడ్ మీడియా లోనూ తెగ చక్కర్లు కొడుతోంది. అది కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ సినిమా అంట. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చెన్నై ఎక్స్ప్రెస్ బ్లాక్ బస్టర్ మూవీ. అందులో దీపికా పదుకొనే హీరోయిన్. షారుఖ్ ఖాన్ పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉందొ.. ఆ సినిమాలో దీపికా పాత్రకి అంటే ఇంపోర్టన్స్ ఉంది. అలాంటి సినిమాలో నయనతారకి ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందట. భారీ పారితోషకం ఇస్తాం అన్నా నయనతార ఆ ఐటెం ఆఫర్ ని కాలదన్నిందట. మరి షారుఖ్ సినిమా లో వచ్చిన ఆ అవకాశాన్ని నయనతార ఎంత డేర్ గా కాదందో. అంటే అమ్మడుకి బాలీవడో అంటే చిన్న చూపా.. లేదంటే ఐటెం సాంగ్ అంటే చిన్న చూపా? ఏది ఏమైనా నయనతార మాత్రం బాలీవడో కి వెళ్లేలా కనిపించడం లేదు.
https://www.telugupost.com/movie-news/sukumar-maheshbabu-combo-66638/
ప్రస్తుతం 'రంగస్థలం' హిట్ తో సుకుమార్ ఫుల్ ఖుషీగా వున్నాడు. 'రంగస్థలం' సినిమా విడుదలై రేపు శుక్రవారానికి 15 రోజులు పూర్తి కావొస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ 'మగధీర' చిత్రం రికార్డులను తుడిచేసి చిరు కామ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150 ' రికార్డులు తుడిచెయ్యడానికి రెడీ అవుతుంది. చాలా చోట్ల నాన్ 'బాహుబలి' రికార్డులు సృష్టిస్తున్న 'రంగస్థలం' దర్శకుడు సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. కానీ సుకుమార్ దగ్గర రెండు మూడు కథలున్నాయని.. కానీ ఇంతవరకు వాటిని ఎవ్వరికీ వినిపించలేదని... కానీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా 'రంగస్థలం' నిర్మాతలయిన మైత్రి మూవీస్ వారికే చేస్తానని సుకుమార్ చెప్పాడు.చిరుతోనా.... బన్నీతోనా?కానీ సుకుమార్ నెక్స్ట్ హీరోలు వీరేనంటూ అనేకమంది పేర్లు వినబడుతున్నాయి. అందులో మొదటగా మెగాస్టార్ చిరుతో సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నారు. కానీ ఆ వార్తలను సుకుమార్ ఖండించాడు. తర్వాత 'రంగస్థలం' హీరో రామ్ చరణ్ తోనే మళ్ళీ అన్నారు. అలాగే 'ఆర్య' తో తనకి లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్ తో సుకుమార్ నెక్స్ట్ మూవీ అన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మహేష్ వచ్చి చేరాడు. సుకుమార్ - మహేష్ కలయికలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమా యావరేజ్ టాక్ తో అయినా చివరికి ప్లాప్ అయ్యింది. అయితే చాలా ఇంటర్వూస్ లో మహేష్ తో తాను చేసిన సినిమా ప్లాప్ అయ్యింది కాబట్టి.. మహేష్ తో మరో సినిమా చేసి హిట్ ఇవ్వాలనుకున్నట్టుగా చెప్పాడు సుకుమార్.ఈ టాక్ కరెక్టే అయితే....అయితే ఇప్పుడు మహేష్ బాబు 'రంగస్థలం' హిట్ తో ఉన్న సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ... మహేష్, వంశి పైడి పల్లి తో తన 25 వ సినిమాని కంప్లీట్ చేసాక సుక్కు తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తాడని టాక్ వినబడుతుంది. ఇక ఎలాగూ మైత్రి మూవీస్ లో 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు ఇపుడు సుకుమార్ డైరెక్షన్ లోనే మైత్రి మూవీస్ లో సినిమా చేయబోతున్నాడట. ఎలాగూ వంశీ సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో కమిట్ అవ్వలేదు.ఆ అందుకే సుకుమార్ - మహేష్ కాంబోలో మూవీ వార్తలకు కాస్త బలం వచ్చింది. ఇకపోతే 'రంగస్థలం' సక్సెస్ మీట్ పూర్తి చేసుకుని సుకుమార్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్ వెళ్లనున్నాడట. ఇక అక్కడినుండి వచ్చాకే సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరో ఎవరనేది ప్రకటిస్తాడని తెలుస్తుంది.
https://www.telugupost.com/movie-news/trivikram-srinivas-ntr-movie-for-next-sankranthi-145723/
ఈ సంక్రాంతికి మహేష్ సరిలేరు నీకెవ్వరూ, రజిని దర్బార్ సినిమాల్తో పెట్టుకుని త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా తో హిట్ కొట్టాడు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అల వైకుంఠపురములోతో అందుకున్నాడు. ఈ సినిమా కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ అన్ని కలిపి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కడంతో.. ఈ సినిమాకి ఫ్యామీలీస్ కనెక్ట్ కావడంతో.. కలెక్షన్స్ కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ లో దోసుకుపోయి.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్సీస్ లో త్రివిక్రమ్ అదరగొట్టేసాడు. అయితే త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడనే టాక్ ఉంది. ఎన్టీఆర్ తో చక్కటి కామెడీ ఎంటెర్టైనెర్ అంటే జంధ్యాల సినిమాలను గుర్తుచేసేలా ఓ కథని తయారు చేసి తెరకెక్కిస్తాడని, ప్రస్తుతం తన మూస ని పక్కనబెట్టి.. ఎన్టీఆర్ కోసం కొత్తగా సినిమా చేస్తాడని అంటున్నారు. ఎన్టీఆర్ కూడా #RRR షూటింగ్ తో ఈ మే కల్లా ఫ్రీ అయిపోతాడని, ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టి.. చక చకా సినిమా చేసి వచ్చే సంక్రాతి బరిలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో కలిసి బరిలోకి దిగాలని ప్లాన్ లో ఉన్నట్లుగా టాక్. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి.. నటీనటుల ఎంపిక చేపట్టి…. ఎన్టీఆర్ తో మే కల్లా సినిమాని పట్టాలెక్కించడం ఖాయమంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్
https://www.telugupost.com/movie-news/samantha-ruth-prabhu-shocking-decision-samantha-not-doing-cinemas-1483531
చిత్ర పరిశ్రమలో భారీ పాపులారిటీ ఉన్న నటి సమంతా రూత్ ప్రభు. ఆమె చేసే సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే సామ్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. సమంత తన కమిట్మెంట్లను పూర్తీ చేసి.. సినిమాలకు దూరమవ్వాలని అనుకుంటూ ఉందట..! సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి నుంచి ఆమె కోలుకుంది. అయితే ఆమె తీసుకునే బ్రేక్ సమయంలో తన ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించనుంది. దాదాపు ఒక సంవత్సరం సమంతా సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంది.విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఖుషి' సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. 'సిటాడెల్' కూడా పూర్తయితే ఆమె తన కమిట్ మెంట్ల నుంచి దూరమైనట్లే..! ఇవి కాకుండా టాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ కొత్తగా ఆమె ఏ ప్రాజెక్టులపై సంతకం చేయలేదు. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. గతంలో తీసుకున్న అడ్వాన్సులను కూడా ఆమె నిర్మాతలకు తిరిగి ఇచ్చేసిందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఖుషీ సినిమా 1 సెప్టెంబర్ 2023 న దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. సిటాడెల్ ఇండియా సెప్టెంబర్ 2023లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.సెర్బియాలో వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ చివరి షెడ్యూల్‌ను ముగించిన తర్వాత, సమంత ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాకు షూటింగ్ చేస్తోంది. ఇంకొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ పూర్తవుతుంది.
https://www.telugupost.com/movie-news/బాలయ్య-100-వ-చిత్రం-తనకి-750-వ-చి-19955/
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలై విజయం దిశగా పరుగులు తీస్తుంది. ఈ చిత్రం పై నందమూరి బాల కృష్ణ అభిమానులు అంతగా ఆశలు పెట్టుకోవటానికి, అంచనాలు పెంచుకోవటానికి ముఖ్య కారణాలు బాలయ్య చాలా కాలం తరువాత చేస్తున్న చారిత్రాత్మక పాత్ర పైగా బాలయ్య కెరీర్ ల్యాండ్ మార్క్ 100 వ చిత్రం కావటమే. అన్నీ అంచనాలు దాటుకుంటూ చిత్ర ప్రదర్శనలు విజయవంతంగా జరుగుతున్న వేళ మరో విశేషం వెలుగు చూసింది. గౌతమీపుత్ర శాతకర్ణి కథానాయకుడు నందమూరి బాల కృష్ణ తో పాటు ఈ చిత్రం గాయని మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీతకి కూడా ల్యాండ్ మార్క్ చిత్రమే కావటం గమనార్హం.ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశి కలిపించిన తొలి అవకాశం తోనే గాయని గా స్థిరపడిపోయే అంతటి పేరు ప్రఖ్యాతలని సంపాదించేసుకుంది సునీత. గులాబీ చిత్రంలో 'ఈ వేళలో నువ్వు ఏమి చేస్తూ ఉంటావో' అనే పాట తో ప్లే బ్యాక్ సింగర్ గా ప్రారంభం ఐన సునీత సినిమా కెరీర్, తరువాతి కాలంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ వరుస అవకాశాలు అంది పుచ్చుకుంటూ ప్రముఖ కథానాయికలు సౌందర్య దగ్గర నుంచి అనేకమంది కథానాయికలకు తన గొంతు ని అరువు ఇచ్చిన సునీత తాజాగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో కథానాయిక శ్రీయ శరన్ పోషించిన వాసిస్టి పాత్రకి చెప్పిన డబ్బింగ్ తో సునీత ఇప్పటివరకు పనిచేసిన చిత్రాల సంఖ్య 750 కు చేరిందట. బాలయ్య ల్యాండ్ మార్క్ చిత్రమే తనకి కూడా ల్యాండ్ మార్క్ చిత్రం కావటం పైగా ఆ చిత్రం విజయం సాధించటం తో సునీత ఆనందాన్ని పట్టలేకపోతుంది.
https://www.telugupost.com/movie-news/భలే-సెటైర్స్-వేశాడే-49405/
తాజాగా విడుదల చేసిన నంది అవార్డ్స్ అనౌన్స్ మెంట్ మీద వచ్చినన్ని విమర్శలు ఎప్పుడూ రాలేదు. ఈ నంది అవార్డ్స్ లో కావాలనే మెగా ఫామిలీని పక్కన పెట్టారని మెగా క్యాంపులోని బండ్ల గణేష్, బన్నీ వాసు బహిరంగంగానే వాళ్ల అభిప్రాయాలని బయట పెట్టారు. ఇక డైరెక్టర్ గుణ శేఖర్ కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రేశ్నిస్తు ఒక ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.సెటైరికల్ గా...సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుండే రామ్ గోపాల్ వర్మ కూడా ఈ నంది అవార్డ్స్ పై తనదైన శైలిలో విమర్శిచాడు. ''నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇచ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్' అంటూ సెటైరికల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.ఇంకా కెలికాడు....ఇంతటితో ఆగకుండా డైరెక్టర్ బోయపాటి శ్రీను పై కూడా తనదైన మార్క్ పంచెస్ వేసాడు. ‘నిజానికి జేమ్స్ కెమరూన్ గాని లెజెండ్ చూస్తే టైటానిక్ కి తన కొచ్చిన 11 ఆస్కార్ అవార్డుల్ని బోయపాటి శ్రీను కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం పెడతాడని' అని పంచ్ వేసాడు. అసలే అవార్డులపై విమర్శలు వస్తున్న తరుణంలో ఆర్.జి.వి. తన పోస్టులతో దానిని మరికాస్త కెలికినట్లయింది.
https://www.telugupost.com/movie-news/మే-26న-ప్రపంచ-వ్యాప్తంగా-నా-31631/
యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ.శే. శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన 30 సెకన్ల టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ను విడుదల చేశారు. 'బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ.. కంటి నిండ ఆశలతో మా సీతమ్మ... తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య.. సీత చెయ్యి పట్ట వచ్చె మా రామయ్య' అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. త్వరలోనే ఈ టైటిల్‌ సాంగ్‌ 90 సెకన్ల వీడియోను రిలీజ్‌ చేస్తారు. అలాగే చిత్రాన్ని మే 26న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యువసామ్రాట్‌ నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.
https://www.telugupost.com/movie-news/senior-actress-lakshmi-appearing-in-more-than-one-movie-127335/
ఒకప్పుడు హీరోయిన్స్గా చలామణి అయిన చాలామంది కథానాయికలు ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే రెండో ఇన్నింగ్స్ లో వారు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. అక్క, అమ్మ, పిన్ని, వదిన లాంటి సపోర్టింగ్ రోల్స్ లో నెట్టుకొస్తున్నారు. అదికూడా కొంత వయసు వరకు చేస్తారు కానీ 60 ఏళ్ళ తరువాత సినిమా లకు పూర్తిగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు. కానీ నటి లక్ష్మి అలా కాదు. 66 ఏళ్ల వయసులో థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. త్వరలో వచ్చే పెద్ద సినిమాల్లో ఆమె కనిపించనున్నారు. ఒకప్పుడు కథానాయకిగా అలరించిన ఆమె ఆ తరవాత అమ్మ లాంటి చాలా సపోర్టింగ్ రోల్స్ చాలా చేశారు. ఆ తరువాత కొంత గ్యాప్ ఇచ్చి తల్లి పాత్రలు చేసారు. మల్లి కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఫుల్ బిజీగా అయిపోయారు. లేటెస్ట్ గా ఈమె ఓ బేబీ చిత్రం లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే రిలీజ్ కానున్న నాగార్జున యొక్క ‘మన్మథుడు 2’లో ఆయనకు తల్లిగా నటించారు. అలానే నాని నెక్స్ట్ మూవీ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఆమె బామ్మగా ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారు. అలా ఫుల్ బిజీగా ఉన్నారు లక్ష్మి. ఈ వయసులో కూడా ఆమెకు ఇన్ని ఆఫర్స్ రావడం అంటే మాములు విషయం కాదు.
https://www.telugupost.com/top-stories/paytm-founder-arrested-later-granted-bail-after-ramming-car-into-dcps-vehicle-in-delhi-1359265
న్యూ ఢిల్లీ : పేటీఎం వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే.. అరెస్ట్ చేసిన రోజే ఆయనను బెయిల్ పై విడుదల చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన ఢిల్లీలోని అరబిందో మార్గ్ లో మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద శర్మ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారు ఢిల్లీ సౌత్ డీసీపీ బెనితా మేరీ జైకర్ కారును ఢీ కొట్టినట్లు పోలీసులు చెప్పారు. ఆ సమయంలో కారులో డీసీపీ లేరు.కారు నడిపిన కానిస్టేబుల్ దీపక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, శర్మను అరెస్ట్ చేశారు. ఈ విషయంపై కానిస్టేబుల్ దీపక్ కుమార్ మాట్లాడుతూ.. నాడు మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఓ కారు వేగంగా వచ్చి డ్యాష్ ఇచ్చి వెళ్లింది. దాంతో మా కారు డ్యామేజ్ అయింది. అదే విషయాన్ని డీసీపీ జైకర్ కు చెప్పాం. ఆమె సూచనల మేరకు కారు నెంబర్ ఆధారంగా మాలవీయ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేశాం అని తెలిపారు.కారు నెంబర్ ఆధారంగా ఢీకొట్టిన కారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఐపీసీ సెక్షన్ 279 కింద విజయ్ శర్మను పోలీసులు అదే రోజు అరెస్ట్ చేసి, కొద్దిసేపటికే బెయిల్ పై విడుదల చేశారు.
https://www.telugupost.com/movie-news/telugu-film-free-show-77541/
తెలుగు ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటిచాడు ఓ నిర్మాత. తన సినిమాని మొదటి రోజు, మొదటి ఆట ఉచితంగా చూడవచ్చని ఆఫర్ ఇచ్చాడు. ఐపీసీలోని ఓ సెక్షన్ ఆధారంగా తెరకెక్కిన ‘ఐపీసీ సెక్షన్ భార్యా బంధు’ చిత్రం రేపు విడుదలవుతోంది. భార్యల చేతిలో ఇబ్బందులు పడే భర్తలపై కథతో ఈ సినిమాను తీశారు. చిత్ర విడుదలకు సందర్భంగా ఓ విబిన్న పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమామొదటి షోను ఉచితంగా చూసి నచ్చితే పదిమందికి చెప్పండి అని చిత్ర నిర్మాతలు కోరుతున్నారు. ఈ చిత్రానికి ఆలూరి సాంబశివరావు నిర్మాతగా ఉండగా, రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి ఆమని ముఖ్య పాత్ర పోషించింది.
https://www.telugupost.com/movie-news/gaddala-konda-ganesh-first-weekend-collections-134527/
గద్దల కొండ గణేష్ ఫస్ట్ వీకెండ్ కలెక్సన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏరియా షేర్ (కోట్లలో) నైజాం 4.54 సీడెడ్ 2.05 నెల్లూరు 0.55 కృష్ణ 1.07 గుంటూరు 1.23 వైజాగ్ 1.64 ఈస్ట్ గోదావరి 1.03 వెస్ట్ గోదావరి 0.97 టోటల్ ఏపీ & టీస్ షేర్ 13.08 ఇతర ప్రాంతాలు 1.00 ఓవర్సీస్ 1.35 టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 15.43
https://www.telugupost.com/movie-news/ram-pothinenni-red-movie-story-is-similar-to-ismart-shankar-177321/
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ లోని మాస్ కోణాన్ని పూరి బయట పెట్టిన విధానం కన్నా రామ్ పెరఫార్మెన్స్ ఇంకా అదిరింది అనే చెప్పాలి. సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనబడే హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ తో మాస్ గా కాదు ఊర మాస్ గా భారీ హిట్ కొట్టాడు. మరి కిషోర్ తిరుమల కూడా ఎప్పుడూ సింపుల్ లవ్ స్టోరీస్ జోనర్ నుండి బయటికి వచ్చి రామ్ ని మాస్ గాను అటు క్లాస్ గాను చూపించాలని డిసైడ్ అయ్యాడు. రామ్ – కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కిన రెడ్ ఎప్పుడో ఎనిమిది నెలల క్రితమే తయారైన సినిమా. సంక్రాంతికి రామ్ రెడ్ విడుదల సన్నాహాలు చేస్తూ ప్రమోషన్స్ లో వేగం పెంచాడు. తాజాగా రామ్ రెడ్ ట్రైలర్ ని విడుదల చేసింది టీం. రెడ్ ట్రైలర్ చూడగానే రామ్ మాస్ లుక్ vs క్లాస్ లుక్ లో అదరగొట్టేసాడు అంటారు. రెడ్ ట్రైలర్ లో రామ్ మాస్ పాత్రలోనూ, క్లాస్ పాత్రలోనూ రెండు రకాల షేడ్స్ తో చెలరేగిపోయాడు. సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకునే ఆదిత్య ఓ అమ్మాయితో కొంతకాలం ట్రావెల్ అయ్యాక ఆ అమ్మాయి మనకి కరెక్టా కాదా అనేది ఓ డెసిషన్ కి వస్తాం. కానీ ఓ అందమైన అమ్మాయిని చూసి తానే తన డెస్టినీ అని ఫిక్స్ అవుతాడు ఆదిత్య. ప్రొఫెషనల్ గా లైఫ్ లో అంతా సెట్ అయ్యింది అనుకున్న టైం లో ఆదిత్య లా ఉండే మరో రామ్ మాస్ ఎంట్రీ కనిపిస్తుంది రెడ్ ట్రైలర్ లో. లైఫ్ లో సెటిల్ అనుకున్న హీరో లైఫ్ లోకి అచ్చంగా అలానే ఉన్న మ‌రో క్రిమిన‌ల్ ప్ర‌వేశిస్తే ఏం జ‌రుగుతుంద‌న్న‌ది రెడ్ క‌థ లా అనిపిస్తుంది. అయితే ఈ ట్రైలర్ లో క్లాస్ రామ్ కన్నా మాస రామ్ నే ఎలివేట్ చేసారు. అంటే సినిమాలో క్లాస్ vs మాస్ అనేది ఓ క్లారిటీ ఇచ్చేసారు. మాస్ కోణంలో హీరో పాత్ర చూస్తే ఇస్మార్ట్ శంకరే గుర్తొస్తాడు. అలాగే ఓ సాంగ్ లో రామ్ డాన్స్ స్టెప్స్ ఇస్మార్ట్ డాన్స్ గుర్తు చేస్తుంది.
https://www.telugupost.com/movie-news/disco-raja-could-not-support-ala-vaikuntapuramlo-collections-146275/
సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ఏ రేంజ్ లో దూసుకెళుతుందో అనేది ఈ వీకెండ్ వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది. రెండు వారాలుగా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న అల వైకుంఠాపురానికి రవితేజ డిస్కో రాజా కూడా అడ్డుకట్ట వెయ్యలేకపోయింది. మూడో వారంలోను అల హావ ఇంకా ఆగలేదు. రవితేజ డిస్కో రాజాకి ప్లాప్ టాక్ పడడంతో.. అల్లు అర్జున్ అల వైకుంఠానికి మూడో వారం కూడా లైన్ క్లియర్ అయ్యింది. నిన్న శనివారం, ఈరోజు ఆదివారం కూడా అల వైకుంఠపురములో మల్టిప్లెక్స్ థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. డిస్కో రాజా కి థియేటర్స్ కొరత ఉన్నప్పటికీ… అల వైకుంఠపురములో సినిమాకి డిస్కో రాజా కన్నా ఎక్కువ థియేటర్స్ ఉండడంతో ఈ వీకెండ్ తాజాగా అల వైకుంఠమే ఉండబోతుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా సర్దుకోవడంతో అల వైకుంఠపురములో ఊపందుకుంది. ఇక డిస్కో రాజా పడుకోవడం అలా కి అల కలిసొచ్చింది. మరి మూడో వీకెండ్ లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో అంటూ అదరగొట్టడం ఖాయం.
https://www.telugupost.com/movie-news/samantha-in-nandini-reddy-movie-94475/
సమంత హాట్ అండ్ గ్లామర్ పాత్రలకు నో చెప్పకపోయినా... తాను ఒప్పుకునే పాత్రలో మాత్రం ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంది. సమంతలో పెళ్లి తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనబడుతుంది. రంగస్థలంలో రామలక్ష్మి కానివ్వండి, మహానటి లో మధురవాణి కానివ్వండి. యు- టర్న్ లో రచన కేరెక్టర్ కానివ్వండి. వేటికవి ప్రత్యేకమైన పాత్రలే. అయితే పెళ్ళైనా గ్లామర్ పరంగా కొద్దిగా కూడా తగ్గని సమంత స్టార్ హీరోల సినిమాలకు మాత్రం ఓకె చెప్పడం లేదు. ప్రస్తుతం నాగ చైతన్య తో శివ నిర్వాణ సినిమాతో పాటు నందిని రెడ్డి సినిమాని సమంత ఓకె చేసింది. సమంత ఓకె చేసిన నందిని రెడ్డి సినిమా కూడా లేడి ఓరియెంటెడ్ గానే ఉండబోతుంది.కొరియన్ సినిమా ఆధారంగా...రెండు మూడు సినిమాలు చేసిన నందిని రెడ్డి చాలా రోజుల నుండి సినిమాలు డైరెక్ట్ చేయడం లేదు. అయితే ప్రస్తుతం సమంత కీలక పాత్రలో ఒక కొరియన్ మూవీని ఆధారంగా చేసుకుని ఒక కథ రాసుకుంది. ఆ కథ ప్రకారం సమంత 60 ఏళ్ల బామ్మ పాత్రలో కనబడబోతుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ కేరెక్టర్ లో సమంత ముఖం యవ్వనంగా అందంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం ముసలి తనపు ఛాయలతో ఉండబోతుందట. ఇక ఈ సినిమాలో సమంత కీలకపాత్ర కాగా... మరో రెండు హీరో పాత్రలు కూడా ఉన్నాయట. ఇప్పటికే నాగ శౌర్య ని ఒక హీరో పాత్రకి నందిని రెడ్డి ఎంపిక చేసిన సమాచారం ఉంది.
https://www.telugupost.com/movie-news/sumanth-new-movie-103827/
‘మళ్లీ రావా’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు అనుకున్న సుమంత్ కు ఈమధ్య వరస ఫ్లాపు వస్తున్నాయి. ఈ ఏడాది రెండు డిజాస్టర్స్ ను అందుకున్నాడు. ‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’, ఇప్ప‌డు ‘ఇదం జ‌గ‌త్’ రెండూ ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. ఈ రెండు సినిమాల్లో ‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’కి కాస్తో కూస్తో ఓపెనింగ్స్ అన్న వచ్చాయి. కానీ ‘ఇదం జ‌గ‌త్’ కి అయితే మ‌రీ దారుణం. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. సుమంత్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా ఓపెనింగ్స్ వచ్చాయి. విడుదల అయినా అన్ని థియేటర్స్ లో 20 నుండి 30 వరకే ప్రేక్షకులు ఉంటున్నారంటే ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అసలు ఈసినిమా వస్తుందని మీడియా వారికి తెలియలేదు అంటే ఎంత దారుణమో అర్ధం చేసుకోవచ్చు. మెయిన్ కారణం ప‌బ్లిసిటీ అసలు లేకపోవడం. అందుకే సుమంత్ ప్రొడ్యూసర్ ని చెడమెడ తిట్టేశాడట. తన కెరీర్ లో ఎన్నడూ ఇంత దారుణమైన ఓపెనింగ్స్ రాలేదని.. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు కూడా మంచి ఓపెనింగ్సే ద‌క్కాయ‌ని..ప్రమోషన్స్ చేయడం ఇష్టం లేకపోతే నాకన్నా చేబితే నేను ఏదోకటి చేసుకునే వాడని అని ఒక లేఖ రాసి ప్రొడ్యూసర్ కి పంపాడట. ఈసినిమాపై సుమంత్ మొదటినుండి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇటువంటి పాత్ర ఎప్పుడూ చేయ‌లేద‌ని జనాలు దీన్ని కచ్చితంగా యాక్సప్ట్ చేస్తారని ధీమా వ్యక్తం చేసాడు కానీ రిజల్టే నెగటివ్ గా వచ్చింది.
https://www.telugupost.com/movie-news/6-accused-arrested-in-chikkamangaluru-theater-attacks-case-1431677
కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన విక్రాంత్ రోణ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. సినిమాకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. అయితే కర్ణాటక రాష్ట్రం చిక్ మగలూరులో ఓ అసహ్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. విక్రాంత్ రోణ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. మిలన్ థియేటర్‌లో విక్రాంత్ రోనా సినిమా ప్రదర్శింపబడుతోంది. ఈ సమయంలో థియేటర్ వెలుపల యువకుల సమూహం ఉంది. సినిమా చూసేందుకు వచ్చిన భరత్‌ బృందంపై ఓ వర్గం దాడి చేసింది. థియేటర్ బయట గొడవలో భరత్ ఒక్కసారిగా నేలకూలాడు. అయినా వదలకుండా భరత్ పై దాడికి పాల్పడ్డారు. థియేటర్ బయట ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. కొందరు గొడవ పడుతున్న వారిని విడిపించే ప్రయత్నం చేశారు. దాడిలో భరత్‌కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం హాసన్‌కు తరలించారు. భరత్‌ హసన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.యువకులు ఏకంగా కొడవళ్లతో దాడులు చేసుకోవడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీసులు నాలుగు రోజుల్లో 6 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు నిందితులను 11 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
https://www.telugupost.com/movie-news/ntr-comments-on-his-son-wife-74690/
ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా సినిమాలను ఒంటి చేత్తో దున్నేస్తున్నాడు. గత నాలుగు సినిమాలు హిట్ అవడంతో మాంచి జోరుమీదున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సామెత - వీర రాఘవ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అటు రియల్ లైఫ్ లోను బిజినే. ఇక తన ఫ్యామిలీకి సంబందించిన హ్యాపీ మూమెంట్స్ ను అభిమానులతో తెగ షేర్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి తో పాటుగా తన కొడుకు అభయ్ రామ్ తో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు. తన కొడుకు అభయ్ రామ్ కి అస్సలు భయం లేదని.. ఇంట్లో వాడు అల్లరి భరించడం కష్టమని.. అందరూ వాడిని అంటే తన తల్లి ఇలా అందరూ వాడ్ని గారాభం చేస్తాడని ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పాడు.అయితే ఒక విషయంలో మాత్రం అభయ్ రామ్ పిల్లి అట. ఎందుకంటే అభయ్ రోజు తాగాల్సిన పాల కోటాకు సంబందించిన విషయంలో అభయ్ ను వాళ్ల అమ్మ ప్రణతి నుంచి ఎవ్వరూ కాపాడలేరంట. ఈ విషయాన్నీ స్వయాన ఎన్టీఆర్ చెబుతున్నాడు. ఎన్టీఆర్ సరదాగా ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దానికింద క్యాప్షన్ గా వాళ్ళమ్మ నుండి పాలు తాగే విషయంలో అభయ్ ని ఎవరు కాపాడలేరనే క్యాప్షన్ పెట్టాడు. ఇక ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఫోటో లో అభయ్ రామ్ భయపడుతూ పెద్ద గ్లాస్ లో పాలుతాగుతూ ఉంటె.. లక్ష్మి ప్రణతి కొడుకు అభయ్ ముందు నుంచుని ఉంది. మరి తల్లికి భయపడుతూ అభయ్ పాలు తాగే ఆ ఫోటో భలే ఉంది.మరి ఎన్టీఆర్ అలా ఫోటో తో పాటుగా ఫన్నీగా క్యాప్షన్ పెడితే... దానికి కమెడియన్ వెన్నెల కిషోర్ క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడెడ్‌ అంటూ ట్వీట్‌ రీ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పోస్ట్ చేసిన అభయ్ భయపడే ఆ పిక్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-failed-as-a-producer-with-meku-matrame-chepta-139456/
విజయ్ దేవరకొండ హీరో గా ఈఏడాది డియర్ కామ్రేడ్ తో బాగా దెబ్బతిన్నాడు. డియర్ కామ్రేడ్ మీద నమ్మకంతో విజయ్ రెచ్చిపోయి ప్రమోషన్స్ లో గ్రెస్ చూపించి బాగా హడావిడి చేసాడు. అయితే ఆ సినిమా విజయ్ అనుకున్నంత హిట్ కాలేదు. ఆ దెబ్బకి పూరి లాంటి డైరెక్టర్ కి కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ… నిర్మాతగా మారి తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తా సినిమా చేసాడు. ఆ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఈ ఏడాది హీరోగా.. నిర్మాతగా సక్సెస్ చూడలేని విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాల విషయంలో తెగ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మీకు మాత్రమే చెప్తా సినిమా ప్లాప్ మెయిన్ గా విజయ్ దేవరకొండ మీదే పడింది. నిర్మాణ విలువల్లో క్వాలిటీ లేదని అన్నారు. కానీ విజయ్ దేవరకొండ తండ్రి మాత్రం విజయ్ మీకు మాత్రమే చెప్తా సినిమాకి బడ్జెట్ పెట్టాడని, నిర్మాణ విలువల్లో లోపాలేం లేవని కవర్ చేస్తున్నాడు కానీ.. విజయ్ నిర్మాణ విలువల విషయంలో బాగా పిసినారి తనం మైంటైన్ చేసాడని అన్నారు. మరి విజయ్ తదుపరి చిత్రం వరల్డ్ ఫెమస్ లవర్ చిత్రం పై ఈ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్త పడినా.. విజయ్ కి ఆ సెగ తగలక మానదని, ఇక విజయ్ తో సినిమాలు తీసే నిర్మాతలు కూడా అలోచించి నిర్మాణ విలువల్లో కోత పెడితే మాత్రం కష్టమే అంటున్నారు
https://www.telugupost.com/movie-news/shankar-lyka-188324/
రామ్ చరణ్ – శంకర్ కాంబోలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించబోయే పాన్ ఇండియా ఫిలిం సమస్యల్లో పడింది.. శంకర్ తాను చెయ్యాల్సిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ ఫినిష్ చేసేవరకు రామ్ చరణ్ తో సినిమా చెయ్యడానికి వీలు లేదని కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ వారు కోర్టులో కేసు వేశారు. ముందుగా మాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇండియన్ 2 మూవీ ఫినిష్ చేశాకే శంకర్ మరో ప్రాజెక్ట్ చెయ్యాలని వారు కోర్టుకెక్కారు. ముందు ఈ సినిమాకి 150 కోట్లు అనుకున్నామని.. కానీ అది కాస్తా 235 కోట్లకి చేరింది అని, మధ్యలో యాక్సిడెంట్ అవడంతో సినిమా ఆగిపోయింది అని.. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తయిన సినిమాని వదిలి ఆయన వేరే ప్రాజెక్ట్ ఎలా వెళతారు అంటూ లైకా వారు కోర్టులో వాదిస్తున్నారు. ఇండియన్ 2 కి శంకర్ కి 40 కోట్ల పారితోషకం కి కాను 14 కోట్లు ఇచ్చేశామని, మిగతా 26 కోట్లని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని లైకా వారు వాదిస్తున్నారు. వాళ్ళు శంకర్ ముందుగా మా సినిమా కంప్లీట్ చేశాకే వేరే ప్రాజెక్ట్ చేసుకోవాలని కోర్టుని కోరుతున్నారు. మరోపక్క శంకర్ న్యాయవాది తమకి లైకా వారితో ఉన్న ఇబ్బందులను కోర్టు ముందు వివరించగా.. లైకా వారు అడిగినట్లుగా స్టే విధించలేమని, అసలు శంకర్ ఇండియన్ 2 మూవీ చెయ్యకుండా మరో మూవీ ఎందుకు ఒప్పుకున్నారో వివరణ ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. శంకర్ న్యాయవాది వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి. అయితే కోర్టు తీర్పుపై మెగా ఫాన్స్ ఉత్కంఠ తో ఉన్నారు. చరణ్ ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ ఫినిష్ కాగానే జూన్ నుండి శంకర్ పాన్ ఇండియా మూవీకి షిఫ్ట్ అవుతారని ఆశపడుతుంటే.. ఇప్పుడు ఈ అడ్డంకి ఏమిటో అని.
https://www.telugupost.com/movie-news/vamshi-paidipalli-reveals-his-weight-loss-secret-122097/
ప్రస్తుతం మహర్షి సినిమా విజయం సాధించడంతో బాగా హుషారుగా ఉన్న వంశీ పైడిపల్లి.. మహర్షి ప్రమోషన్స్ లో తెగ హల్చల్ చేస్తున్నాడు. మహేష్ ఇచ్చే పార్టీలకు, మహేష్ తో పాటు పలు కాలేజ్ లకు తిరుగుతున్న వంశీ పైడిపల్లి గతంలో 120 కేజీల బరువు ఉండేవాడట. ఏది చూసినా కంట్రోల్ లేకుండా లాగించేసే సరికి అలా బాగా బరువు పెరిగిపోయాడట. అయితే మహర్హి ప్రమోషన్స్ లో జోరుగా హుషారుగా పాల్గొంటున్న వంశీ పైడిపల్లి తన బరువు విషయమై మాట్లాడాడు. తాను స్వతహాగా భోజన ప్రియుడినని, ఏదైనా బాగా లాగించేసేవాడినని, దీంతో నేను 120 కేజీల బరువు పెరిగిపోయానన్నారు. మహేష్ కు రుణపడి ఉంటా… అయితే ఒక రోజు తన కూతురు తన దగ్గరికి వచ్చి నానా నువ్వు చాలా లావైపోతున్నావు అని అనగానే అప్పటి నుండి తాను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానని చెబుతున్నాడు వంశీ పైడిపల్లి. అలా బోలెడన్ని కసరత్తులు చేసిన తరవాత తాను 83 కేజీల బరువు వద్ద ఆగానని చెప్పాడు. ఇక మహర్షి విజయం తనకి సంతోషాన్ని ఇచ్చిందని.. మహేష్ సర్ తనను నమ్మి ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ తనకి అప్పగించినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నాడు వంశీ.
https://www.telugupost.com/movie-news/junior-actress-dolly-alias-gayathri-died-in-gachibowli-road-accident-1360362
హైదరాబాద్ : శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూ ట్యూబర్, నటి డాలీ (గాయత్రి) మృతి చెందింది. ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖావాణి వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఇలా రాశారు. "డాలీ ఇది చాలా అన్యాయం. ఇది నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలున్నాయి. అసలు మాటలు రావట్లేదు. టోటల్లీ బ్లాంక్" అని పోస్ట్ చేశారు. గచ్చిబౌలి రోడ్డుప్రమాదంలో నటి డాలీ చనిపోయిందని తెలిసిన వారు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.డాలీ అసలు పేరు గాయత్రి. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న ఆమె నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ప్రమాద సమయంలో కారులో రోహిత్ అనే యువకుడితో పాటు మరో యువతి, డాలీ ఉన్నట్లు సమాచారం. మద్యంసేవించి కారు నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎల్లా హోటల్ లో పనిచేస్తున్న మహేశ్వరి అనే మరో మహిళ కూడా మృతి చెందింది. నిన్న హోలీ పండగ సందర్భంగా గాయత్రి, రోహిత్ లు ప్రిసంపబ్ లో పార్టీ చేసుకుని, ఇంటిరి తిరుగుపయనమైన సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయత్రి మరణించగా, రోహిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను AIG లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
https://www.telugupost.com/movie-news/movies-releasing-on-october-21st-list-here-1444339
దసరా ముగిసి.. దీపావళి హంగామా మొదలైంది. దసరాకి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో పాటు స్వాతిముత్యం కూడా విడుదలై.. సూపర్ హిట్ అందుకున్నాయి. గతవారం చిన్న చిన్న సినిమాలు థియేటర్లలో విడదలయ్యాయి. ఈ వారం దీపావళికి ముందుగానే.. కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మంచు విష్ణు హీరోగా, పాయల్ రాజ్ పుత్, సన్నిలియోన్ ప్రధాన పాత్రల్లో ఇషాన్ సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ 'జిన్నా'. సునీల్, రఘుబాబు, నరేశ్, సురేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 21న థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.ఈ నెల 21న విడుదలవుతున్న మరో సినిమా ఓరి దేవుడా ! యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జోడీగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో రూపొందిన సోషియో ఫాంటసీగా తెరకెక్కిన మూవీ ఇది. విక్టరీ వెంకటేశ్ మోడ్రన్ దేవుడిగా ఎంటర్ టైన్ చేయబోతున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ 'ఓ మై కడవుళే' కు రీమేక్. ఈ సినిమాపై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.ఈ శుక్రవారం విడుదలకు రెడీ అయిన మరో సినిమా సర్దార్. తమిళహీరో కార్తి డ్యూయల్ రోల్ లో యాక్షన్ సినిమాగా తెరకెక్కిందీ మూవీ. కార్తి తండ్రీకొడుకులుగా డిఫెరెంట్ గెటప్స్ తో అదరగొట్టబోతున్న ఈ సినిమాలో రజిషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్స్. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో లైలా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. తమిళ హీరో శివకార్తికేయన్ డైరెక్ట్ గా తెలుగులో నటిస్తు్న్న ఫస్ట్ మూవీ 'ప్రిన్స్'. ఈ మూవీతో మరియా ర్యాబోషెప్కా అనే ఉక్రెయిన్ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. శివకార్తికేయన్ స్కూల్ టీచర్ గా నటించగా.. సత్యరాజ్ కీలకపాత్ర పోషించారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవీ డైరెక్ట్ చేస్తున్న ఈ తెలుగు, తమిళ బైలింగువల్ మూవీ ఈ నెల 21న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయబోతోంది.బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, నుష్రత్ బరుచా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మన సత్యదేవ్ నటించిన రామ్ సేతు సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ కానుంది. ఈ దీపావళి కానుకగా మొత్తం 5 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. మరి వీటిలో ఏయే సినిమాలు పేలుతాయి.. ఏయే సినిమా తుస్సుమంటాయో తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే.
https://www.telugupost.com/movie-news/ఆ-భూములు-గ్రీన్-బెల్ట్-లో-25607/
అమరావతిలో చేపడుతున్న రహదారులను అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. తొలిదశలో నిర్మించబోయే 7 రహదారులకు సంబంధించి టెండర్ ప్రకియ ముగిసిందని, ప్రాజెక్టులను నిర్మాణ సంస్థలను ఎంపిక పూర్తయిందని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి ముఖ్యమంత్రికి తెలిపారు. రూ.187 కోట్లతో తలపెట్టిన సీడ్ యాక్సెస్ రోడ్ల ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ రహదారుల నిర్మాణాలకు అవసరమైన ఇసుక, గ్రావెల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రిని పూర్తిగా అందుబాటులోకి తెచ్చుకోవాలని సీయం సూచించారు. రహదారుల నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడ రాదని చెప్పారు.ఇవ్వని వాళ్ళ గతి అంతేరాజధాని భూ సమీకరణకు ముందుకురాని రైతుల భూములను గ్రీన్ బెల్ట్ కింద ప్రకటించాలని, అక్కడ వ్యవసాయం మినహా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు వీలులేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. విజయవాడలో కొత్త రహదారులు, ఫ్లయ్ వోవర్ల నిర్మాణాల పనులు ఆరంభం అవుతున్న దృష్ట్యా రెగ్యులర్ ట్రాఫిక్ కు అవరోధం లేకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, మార్గాలను సత్వరం సిద్ధం చేయాలని సీయం అధికారులను కోరారు.
https://www.telugupost.com/movie-news/సన్నీ-కూడా-మొదలెట్టేసింద-51338/
ఈ మధ్య కాలంలో హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు కాస్త తగ్గాయనే చెప్పాలి.తమిళ భాష నుండి డబ్ అయిన చిత్రాలు తప్పితే తెలుగు చిత్రాల్లో లేడీ ఓరియెంటెడ్ వంటి చిత్రాలు తగ్గాయి. అనుష్క చేసిన ‘రుద్రమదేవి’ తరువాత అంతగా ప్రభావం చూపే చిత్రాలు రాలేదు. ఇప్పుడు తాజాగా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం దక్షణాది భాషల్లో తెరకెక్కబోతుంది.. సుమారు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.విసి వడివుడయాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టివ్స్ కార్నర్ పతాకం పై ఫోన్స్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఎంపికైంది. దక్షణాది రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి – సంప్రదాయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర కథను విన్న సన్నీ లియోన్ ఆ కథ నచ్చి ఈ చిత్రాన్ని చేయడానికి అంగీకరించినట్లు తెలిసింది. ఈ చిత్రం కోసం సన్నీ లియోన్ ఏకంగా 150రోజుల కాల్షీట్లు ఇచ్చినట్లు సమాచారం.చరిత్రకు సంబంధించిన చిత్రం కాబట్టి ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి సన్నీ లియోన్ ఇప్పటికే గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి వాటిల్లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఉండే గ్రాఫిక్స్ వర్క్ ని అంతర్జాతీయ సంస్థలకు అప్పగించారట. ఫిబ్రవరి నుండి ఈ చిత్రం చిత్రీకరణ మొదలవుతుందంటున్నారు.
https://www.telugupost.com/andhra-pradesh/ap-government-that-came-to-power-after-a-gap-of-five-years-continues-to-implement-the-promises-made-in-the-elections-1542024
ఐదేళ్ల విరామం అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతుంది. బాధ్యతలను స్వీకరించిన తొలి రోజే చంద్రబాబు ఐదుఫైళ్లపై సంతకాలు చేశారు. నాలుగు వేల రూపాయలు పింఛను జులై నెల నుంచి అందరికీ మంజూరు చేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన పింఛను 65 లక్షల మందికి ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయింది. జులై నెల నాలుగువేల రూపాయలు, ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి వెయ్యిరూపాయల చొప్పున కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జులై ఒకటో తేదీ నుంచి పింఛనుదారులకు విడుదల చేయాలని, సచివాలయం సిబ్బంది చేత ఇంటింటికి జులై ఒకటోతేదీన పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్నికల సందర్భంగా...అయితే ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీని కూడా త్వరలోనే నెరవేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల మ్యానిఫేస్టోలో యాభై ఏళ్లు నిండిన బీసీలందరికీ నెలకు నాలుగు వేల రూపాయలు పింఛను మంజూరు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలకు ముందు మంగళగిరలో జరిగిన జయహో బీసీ సభలో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. దీంతో పాటు బీసీ ఉప ప్రణాళిక అమలులో భాగంగా సంవత్సరానికి ముప్పయివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని, ఐదేళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమయింది. పార్టీ ఆవిర్భావంనుంచి...తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు ఎక్కువ శాతం ఆ పార్టీ వెంటనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల విజయానికి బీసీలు అండగా నిలిచారు. బీసీలు తమ పార్టీకి వెన్నుముక అని చంద్రబాబు అనేక సార్లు ప్రకటించారు. ఈసారి తన మంత్రివర్గంలో ఎనిమిది మంది బీసీలకు స్థానం కల్పించారు. బీసీ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకునే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ అని చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. యాభై ఏళ్ల వయసు దాటిన బీసీలకు నాలుగు వేల రూపాయల పింఛను ఇచ్చేందుకు ఫైలును సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిసింది.దసరా కానుకగా...అయితే బీసీలు, వయసు నిబంధనతోనే అర్హతగా నిర్ణయించున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డులో వయసుతో పాటు బీసీ సర్టిఫికేట్ ను చూసి లబ్దిదారులను ఎంపిక చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశముందని, కొద్ది నెలల్లోనే యాభై ఏళ్లు నిండిన బీసీలందరికీ పింఛను అందించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇది ఎప్పుడు అనే ముహూర్తం నిర్ణయించనప్పటికీ దసరా కానుకగా అందించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఆర్థిక పరిస్థితిని బీసీలకు యాభై ఏళ్లునిండిన వారికి పింఛను ను మంజూరు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిజంగా ఇది బీసీలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.
https://www.telugupost.com/movie-news/rashmika-mandanna-on-her-acting-121898/
ఛలో లాంటి యూత్ ఫుల్ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన రష్మిక ఆ తరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం చేసి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేస్తుంది. యాక్టింగ్ కూడా చాలా సహజంగా ఉంటుందని మంచి కంప్లీమెంట్స్ అందుకుంటుంది. తాను బయట ఎలాగైతే ఉంటానో కెమెరా ముందు కూడా అలానే ఉంటాను కాబట్టి తన నటన చాలా సహజంగా అనిపిస్తూ ఉంటుందని రష్మిక చెప్పింది. తెలుగు మాట్లాడుతున్నా… ఈ మధ్యే తనకు తెలుగు మాట్లాడడం వస్తుందని ఇంతకు ముందు వచ్చేది కాదని, అందుకే సెట్స్ లో ఉన్నప్పుడు అందరికీ తెలుగులోనే మాట్లాడమని చెప్పేదాన్ని అని దాంతో తనకి కూడా తెలుగు మాట్లాడడం అలవాటు అయిందని చెప్పింది. తన స్థాయికి తగ్గ పాత్రలే సెలెక్ట్ చేసుకుంటున్నాని చెప్పింది. ప్రస్తుతం ఈమె డియర్ కామ్రేడ్ తో పాటు మహేష్ – అనిల్ రావిపూడి సినిమాలో నటించనుంది. రష్మికది కన్నడ పరిశ్రమ అయినా తెలుగులో టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది.
https://www.telugupost.com/crime/sc-st-atrocity-case-registered-against-ongole-ysrcp-leader-subbarao-gupta-1360106
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తా మరోమారు వార్తల్లో నిలిచారు. ఒంగోలు పోలీసులు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత.. తనను సుబ్బారావు కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సుబ్బారావు పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు వన్ టౌన్ పోలీసులు వెల్లడించారు.అసలేమైందంటే.. ఒంగోలులోని మంగమూరు సెంటర్ లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నగరానికి చెందిన ఆర్యవైశ్యులు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలో విగ్రహ ఏర్పాటుకై అనుమతి కోరేందుకు పలువురు వైశ్యులతో కలిసి సుబ్బారావు గుప్తా మేయర్ వద్దకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మేయర్ గంగాడ సుజాతను కులంపేరుతో దూషించారు. దాంతో మేయర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుబ్బారావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
https://www.telugupost.com/movie-news/శింబు-సిల్లీ-రీజన్-43959/
కోలీవుడ్ లవర్ బాయ్ శింబు కెరీర్ ఇపుడు ఆగమ్యగోచరంగా వుంది. ప్రస్తుతం శింబు ఏ సినిమా చేస్తే ఆ సినిమా ప్లాప్ బాట పడుతుంది. శింబు తాజా చిత్రం సరసుడు కూడా శింబు ప్లాపుల లిస్ట్ లో చేరిపోయింది. ఇక ఈ సినిమాని తెలుగులో ఎవరు తీసుకోకపోయేసరికి శింబు తండ్రి టి. రాజేంద్ర స్వయంగా తెలుగులో విడుదల చేసుకున్నాడు. అసలు కోలీవుడ్ లో శింబుకి మార్కెట్ లేకుండాపోయింది. ఇకపోతే శింబు కెరీర్ లో ఉన్న ప్రేమ కథలు మరే హీరో కెరీర్ లో లేవు. ముందు నయనతారని పీకల్లోతు ప్రేమించిన శింబు.... ఇద్దరి మధ్యలో ఏం పొరపొచ్ఛాలొచ్చాయో తెలియదు కానీ... ఇద్దరు ప్రేమకు బ్రేకప్ చెప్పేసి విడిపోయారు. అప్పట్లో శింబు, నయనతార ప్రేమ వ్యవహారం దాదాపు పెళ్లి పీటలవరకు వచ్చి ముగిసింది. తర్వాత శింబు, హన్సికతో.... నయనతార, ప్రభుదేవాతో ఫ్రెష్ గా ప్రేమాయణం స్టార్ట్ చేశారు.కండిషన్ వల్లనే....అయితే శింబు ప్రేమ వ్యవహారం హన్సికతో కూడా పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. కారణాలు తెలియవు గాని శింబు, హన్సికలు మాత్రం విడిపోయారు. అయితే ఇప్పుడు శింబు తండ్రి రాజేంద్ర శింబు - హన్సిక ల ప్రేమ వ్యవహారంపై స్పందించాడు. నయన్ విషయం మాట్లాడలేదు గాని హన్సికతో తన కొడుకు ప్రేమ ఎందుకు బ్రేకప్ అయ్యిందో మాత్రం చెప్పాడు. శింబు, హన్సికని పెళ్లి చేసుకోవాలనుకునే తన ఇంట్లో విషయం చెప్పాడట. అయితే శింబు ఫ్యామిలిలో పెళ్లి తర్వాత అమ్మాయిలు సినిమాల్లో నటించకూడదనే కండీషన్ ఉందట. శింబు తల్లి రాజేందర్ భార్య కూడా పెళ్లికి ముందు సినిమాల్లో నటించినా... పెళ్లితర్వాత ఆమె మళ్ళీ నటించలేదట. అలాగే హన్సికకి కూడా శింబు పెళ్లి తర్వాత నటించకూడదనే కండీషన్ పెట్టాడట. కానీ హన్సిక మాత్రం కుదరదని చెప్పేవారికి ఆ ప్రేమ పెళ్లి పెటాకులైందట. శింబు కేవలం తల్లితండ్రులకు గౌరవం ఇచ్చే ఈ పెళ్లిని వదులుకున్నాడని రాజేందర్ చెబుతున్న వెర్షన్.విడ్డూరం కాదా?మరి ఇప్పటికాలంలో హీరోయిన్స్ పెళ్ళై పిల్లలున్నా నటనకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. ఇలాంటి టైం లో శింబు, హన్సిక కు ఇలాంటి కండీషన్స్ పెట్టడం కాస్త విడ్డురంగానే ఉంది. మరి శింబు తల్లితండ్రులకు అంత గౌరవం ఇచ్చేవాడు ఇలా హీరోయిన్స్ తో ప్రేమ వ్యవహారాలు లెక్కకు మించి అయితే నడపడు. మరి రాజేంద్ర ఇన్నాళ్లకు ఇప్పుడు ఈ శింబు ప్రేమ, పెళ్లి వ్యవహారం ఎందుకు బయటికి తీసాడో ఆయనకే తెలియాలి.
https://www.telugupost.com/movie-news/కింగ్-చేసిన-ట్వీట్-లోని-అ-25444/
కింగ్ అక్కినేని నాగార్జున తన తనయులు కథానాయకులుగా నిలదొక్కుకుంటున్న కాలంలో కూడా కథానాయకుడిగా నటిస్తూ మెప్పిస్తున్నాడు. హీరో గా ఆయన చేసే చిత్రాలతోపాటు నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా ఆయన నిత్యం సినిమా యాక్టివిటీస్ లో మునిగిపోయి ఉంటుంటారు. ప్రస్తుతం ఆయన రాజు గారి గది 2 చిత్రంలో యాక్ట్ చేస్తూ, మరో వైపు యువ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రంజిత అనే లేడీ డైరెక్టర్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నారు నాగ్. నాగార్జున కెరీర్ ప్రారంభం ఐన నాటి నుంచి నేటి వరకు సినిమా లతో ఆయనకీ గ్యాప్ వచ్చిందని ప్రేక్షకులైతే భావించరు. కానీ నాగ్ అలా భావిస్తున్నట్టు తన తాజా ట్వీట్ పేర్కొంటోంది.👍Back in business with Raju gari gadhi 2/#RGG2 బ్యాక్ ఇన్ బిజినెస్ విత్ రాజు గారి గది 2 అంటూ నాగ్ చేసిన ట్వీట్ అందరిని ఆలోచజనాల్లో పడేస్తోంది. గత ఆరేడు సంవత్సరాల వెనక్కి వెళ్లి చూస్తే నాగార్జున కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పుడే నాగ్ అభిరుచికి తగ్గ కథలకి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన దక్కుతుంది. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి చిత్రాల ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ మీటర్ లో లేకపోయినప్పటికీ విజయం సాధించటానికి ఇదే ప్రధానమైన కారణం. అయితే గత నెలలో నాగార్జున బాగా నమ్మకం పెట్టుకున్న ఓం నమో వెంకటేశాయ చిత్ర ఫలితం మాత్రం ఆయనని నిరాశ పరిచింది. అయితే ఒక్క పరాజయానికి నాగ్ ఇంత బలమైన స్టేట్మెంట్స్ ఇస్తాడా? ఓం నమో వెంకటేశాయ ఫలితం నాగ్ పై అంతటి ప్రభావం చూపిందా అంటే సమాధానం ఆయనకే తెలియాలి.రాజు గారి గది తో హారర్ కామెడీ జోనర్ లో అద్భుతమైన విజయం అందుకున్న దర్శకుడు ఓంకార్, ఈ సీక్వెల్ తో కూడా నాగ్ కి అనూహ్యమైన విజయాన్ని ఇస్తాడని ఆశిద్దాం.
https://www.telugupost.com/movie-news/jaya-bachchan-says-she-has-no-problem-if-navya-has-child-without-marriage-1445621
రిలేషన్ షిప్ ఎక్కువ కాలం కొనసాగాలంటే 'శారీరక ఆకర్షణ' చాలా ముఖ్యమని ప్రముఖ నటి జయ బచ్చన్ అన్నారు. ఆమె మనవరాలు నవ్య నవేలి నందతో కలిసి 'వాట్ ది హెల్ నవ్య' అనే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. నవ్య నవేలి నందకు పెళ్లి కాకుండా బిడ్డకు జన్మనిచ్చినా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పింది.ప్రజలు నా నుండి ఇలాంటి కామెంట్లు రావడాన్ని అభ్యంతరకరంగా భావిస్తారు.. కానీ శారీరక ఆకర్షణ చాలా ముఖ్యమైనదని అన్నారు జయ. మా కాలంలో మేము ప్రయోగాలు చేయలేకపోయాము.. కానీ నేటి తరం వారు ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నించారు. శారీరక సంబంధం లేకుంటే ప్రేమ-బంధం అనేవి చాలా కాలం కొనసాగవు. అడ్జెస్ట్మెంట్స్ చేసుకుంటూనే జీవితాంతం బతకలేరని నేను భావిస్తున్నానని అన్నారు జయ బచ్చన్. ఇప్పటి జెనరేషన్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ను పెళ్లి చేసుకుంటే చాలా బెటర్ అని కూడా జయ బచ్చన్ సలహాలు ఇచ్చారు. బెస్ట్ ఫ్రెండ్ తో బిడ్డను కనడంలో కూడా తప్పులేదని అన్నారు. ఈ జెనరేషన్ పిల్లలు మీ బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదని జయ అన్నారు. జయ తన అభిప్రాయాన్ని నవ్యతోనూ, ఆమె కుమార్తె శ్వేతా బచ్చన్‌తో కూడా పంచుకున్నారు. జయ బచ్చన్ అమితాబ్ బచ్చన్‌ ను 1973లో వివాహం చేసుకుంది. కుమార్తె శ్వేత (1974), కొడుకు అభిషేక్ బచ్చన్ (1976) జన్మించారు. ఇక కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో జయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలియా భట్, ధర్మేంద్ర, షబానా అజ్మీ కూడా నటించారు. ఈ సినిమా 2023లో విడుదల కానుంది.
https://www.telugupost.com/movie-news/బన్నీ-అనుల-రొమాన్స్-ఎక్క-51445/
రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు. సినిమా మొదలెట్టినప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ నా పేరు సూర్య షూటింగ్ ని చక చకా కానిచ్చేస్తున్నాడు. ఊటీ లో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న నా పేరు సూర్య షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం గోవాలో ప్రారంభమైంది. ఇక ఈ షెడ్యూల్ లో హీరోయిన్ అను ఎమాన్యూల్, బన్నీ మధ్య గోవా బీచ్ లో ఓ రొమాంటిక్ సీన్ తీస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ గోవాలోనే కొనసాగుతుంది.ఇకపోతే.. ఈ నెలాఖరు కల్లా నా పేరు సూర్య సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ టాకీ పూర్తిచేయాలని నిర్ణయించార. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్, ఊటీలో భారీ షెడ్యూల్స్ నిర్వహించారు. అలాగే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉత్తరాదిలో ఓ భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి నా పేరు సూర్య లో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉండబోతుందో అనేది ఇప్పటికే అభిమానుల్లో ఒక ఐడియా వుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఆర్మీ లుక్ లో ఈ మధ్యన బయట మంచి ఫిట్ గా నీట్ హెయిర్ కట్ తో కనబడుతున్నాడు.సరైనోడు, డీజే సినిమాల సక్సెస్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. విశాళ్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే కీలకపాత్రల్లో శరత్ కుమార్, అర్జున్ కనిపించనున్నారు.
https://www.telugupost.com/movie-news/ram-charan-in-3-shades-in-rrr-110254/
#RRR షూటింగ్ చాలా సీక్రెట్ గా జరుపుతున్నాడు రాజమౌళి. ఎక్కడ ఏ విషయం లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించి రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారట రాజమౌళి. ఇప్పటివరకు రామ్ చరణ్ ఎప్పుడూ ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రను పోషించలేదట. ఇందులో చరణ్ మూడు డిఫరెంట్ పాత్రలతో కనిపించనున్నాడట. నెగటీవ్ షేడ్స్ లో కూడా… ఒకటి బ్రిటిష్ ఆఫీసర్ గా.. రెండోది ఫ్రీడమ్ ఫైటర్ గా…మూడోది మాస్ నాయకుడుగా ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రలను పోషిస్తున్నాడట. చరణ్ పాత్రలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి అని టాక్. పాజిటివ్ షేడ్స్ తో పాటు నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. ఎన్టీఆర్ లేకుండా చరణ్ పైనే షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే హీరోయిన్స్ ని ఫైనల్ చేయనున్నాడు జక్కన్న.
https://www.telugupost.com/movie-news/good-news-for-allu-arjun-fans-103928/
స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’, మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాలలో, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు చాలా ఉన్నాయి. జనవరిలోనే ప్రారంభం వీటిని నిజం చేసే దిశగా ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతా ఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. 2019 జనవరిలో చిత్రం ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు.
https://www.telugupost.com/crime/27-year-old-woman-killed-by-lover-in-kandivli-accused-held-case-cracked-in-12-hours-1431036
27 సంవత్సరాల యువతి హత్యను పోలీసులు 12 గంటల్లో చేధించారు. 27 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు అంతమొందించాడు. ఆమెకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని అనుమానించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు అఖిలేష్ ప్యారేలాల్ గౌతమ్ (24)ని సబర్బన్ మన్‌ఖుర్డ్‌లో మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గౌతమ్ హత్యకు గురైన మనీషా జైస్వర్ (27) తో అనుబంధం కలిగి ఉన్నాడు. వివాహం చేసుకోవాలని అనుకున్నారు.అయితే మనీషా మీద గౌతమ్ అనుమానం పెంచుకున్నాడు. గౌతమ్ తన ప్రియురాలికి వేరే వ్యక్తితో సంబంధం ఉందని అనుమానిస్తూ వచ్చాడు. ఆ తర్వాత వేధించడం మొదలు పెట్టాడు. గురువారం తెల్లవారుజామున కందివలి శివారులోని ఆమె నివాసానికి వెళ్లి వాగ్వాదం పెట్టుకున్నాడు. గొడవ పెద్దదై ఆమె గొంతు కోశాడు. మహిళను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని ప్రకటించారు. ఇక ఆమె తలపై కూడా రెండు పెద్ద గాయాలు ఉన్నాయని.. హత్య కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. కేసును విచారించేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి.. మృతుడిని వెతికేపనిని ప్రారంభించారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ గురించిన వివరాలు సేకరించిన తర్వాత, పోలీసులు అతన్ని ట్రేస్ చేశారు. పోలీసుల విచారణలో.. హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
https://www.telugupost.com/movie-news/rakul-vaishnav-167821/
నిన్నమొన్నటివరకు కరోనా తో స్తబ్దుగా ఉన్న సినిమా షూటింగ్స్ నెమ్మదిగా మొదలవుతున్నాయి. ఇప్పటికే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బెటర్ సో బ్రతుకు తో సెట్స్ మీదకెళ్ళగా సందీప్ కిషన్ కూడా A1 ఎక్స్ప్రెస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. తాజాగా క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ మూవీ ని పక్కనబెట్టి అయన మేనల్లుడు వైష్ణవ తేజ్ తో మరో మూవీ మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ని తీసుకున్నారు. రకుల్ ప్రీత్ కి అవకాశాలు లేవనుకున్న ప్రతిసారి ఏదో ఒక అవకాశం రకుల్ ప్రీత్ ని నిలబెడుతుంది. మరి వైష్ణవ తేజ్ తో క్రిష్ మూవీ చాలా త్వరగా పూర్తి కాబోతుందట. ఇప్పటికే రకుల్ ప్రీత్ క్రిష్ మూవీ కోసం వికారాబాద్ అడవులకి వెళ్ళింది. వైష్ణవ తేజ్ తో రకుల్ కాంబో సీన్స్ ని క్రిష్ ఆఘమేఘాల మీద పూర్తి చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని క్రిష్ సింగిల్ షెడ్యూల్ లో కేవలం 40 రోజుల్లో పూర్తి చేయబోతున్నాడట. అంటే రకుల్ ప్రీత్ ఏకధాటిగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది. అంటే చాలా తక్కువ డేట్స్ కోసమే రకుల్ ఈ సినిమాకి తీసుకున్నారు. మరి క్రిష్ కేవలం 40 రోజుల్లోనే ఈ సినిమా తీసి విడుదలకు ప్లాన్ చేస్తాడట. అంటే సింగిల్ షెడ్యూల్ కే రకుల్ తో క్రిష్ ముగించేస్తాడన్నమాట.
https://www.telugupost.com/movie-news/anushka-shetty-birthday-139481/
అది 2005.. అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఆర్తి అగ‌ర్వాల్, త్రిష‌, శ్రీయ లాంటి హీరోయిన్లు చ‌క్రం తిప్పుతున్నారు. అప్పుడు కొత్త వాళ్లు వ‌చ్చినా కూడా అంత ఈజీగా కుదురుకునే రోజులు కావ‌వి. అలాంటి సమయంలో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఓ మెరుపుతీగ.. ఆమె పేరు అనుష్క శెట్టి.. నాగార్జున అక్కినేని హీరోగా నటించిన సూప‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు అనుష్క. ఆ సినిమాలో అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూగా నామినేట్ అయ్యారు అనుష్క. ఆ వెంటనే అక్కినేని మేనల్లుడు మ‌హానంది సినిమాలో సుమంత్‌తో న‌టించారు. ఇక 2006లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన విక్ర‌మార్కుడుతో అనుష్క జాతకం మారిపోయింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపోవ‌డం వెంటవెంటనే జ‌రిగిపోయాయి. విక్రమార్కుడు సినిమా తర్వాత అనుష్కకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత 2009లో అనుష్క కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ ఏడాది కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధ‌తితో జేజమ్మ నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయారు. ఈ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్, సినీ మా అవార్డ్, సంతోషం అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వేదం సినిమాతో తన నటనలోని మరో కోణాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసారు ఈమె. సింగం, మిర్చి, సింగం 2, బాహుబలి లాంటి ఎన్నో సినిమాలతో తిరుగులేని హీరోయిన్ అయిపోయారు అనుష్క.14 ఏళ్ల కెరీర్‌లో ఒక్క‌సారి కూడా పెద్ద‌గా అవ‌కాశం కోసం ఇబ్బందిప‌డిన సంద‌ర్భాలు అనుష్క‌కు రాలేదు. అంతగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఈ దశాబ్ధ కాలంలో దక్షిణాది ఇండస్ట్రీలో మరొకరు లేరంటే ఆశ్చర్యం లేదు.. అతిశయోక్తి కాదు. వ‌ర‌స సినిమాలు చేస్తూ సౌత్ ఇండ‌స్ట్రీలోనే నెం.1 హీరోయిన్ గా మారిపోయారు అనుష్క‌. తెలుగులో ఎన్నో సంచ‌ల‌న సినిమాల్లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు జేజ‌మ్మ‌. పంచాక్ష‌రి నిరాశ పరిచినా రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి లాంటి సినిమాల‌తో త‌న స్థాయి నిరూపించుకున్నారు ఈమె. రుద్రమదేవి సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్‌తో పాటు సైమా అవార్డును సొంతం చేసుకున్నారు అనుష్క. ఇక బాహుబలి సినిమా ఈమె కెరీర్‌లో కలుకితురాయి. దేవసేన పాత్రకు ప్రాణం పోసిన తీరు అద్భుతమే. బాహుబలి, భల్లాలదేవుడి పాత్రలకు ఎంత పేరొచ్చిందో.. వాళ్లతో సమానంగా తన నటనకు మార్కులు వేయించుకున్నారు అనుష్క. ప్రస్తుతం నిశ్శబ్ధం సినిమాతో చాలా రోజుల తర్వాత తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాలం, కన్నడ ప్రేక్షకులను పలకరించబోతున్నారు అనుష్క శెట్టి. ఈమె ఇలాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయాలని.. ఇలాగే సినీ ప్రేక్షకుల మనసు దోచుకుంటూ ఉండాలని ఆశిద్దాం..
https://www.telugupost.com/movie-news/heroine-shopping-74638/
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, రణవీర్ సింగ్ లు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే వీరి పెళ్లిపై అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, తాజాగా ముంబైలోని బాంద్రాలో ఆమె తన తల్లి ఉజాలా పదుకొనేతో కలిసి సంప్రదాయ ఆభరణాలు కొనుగోలు చేసిందంట. అయితే, ఈ ఆభరణాలు ఆమె పెళ్లి కోసమే అనే ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లిపై ఓ రేంజ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరీలో దీపిక, రణవీర్ తల్లిదండ్రులు కలిసి ఇప్పటికే పెళ్లి సంబంధం సెట్ చేశారని వినిపిస్తోంది. దీపిక 32వ పుట్టిన రోజు సందర్భంగా జనవరీలో ఆమె ఇంటికి వెళ్లిన రణవీర్ కుటుంబం కలిసి పార్టీ చేసుకున్నారట. అంతేకాదు, దీపికకు పుట్టినరోజు కానుకగా ఖరీదైన డైమెండ్ సెట్, చీర ఇచ్చారు. దీంతో వీరి పెళ్లిపై వార్తలు నిజమేనని స్పష్టమవుతోంది.
https://www.telugupost.com/movie-news/sekhar-with-ali-188745/
వరుణ్ తేజ్ – సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల మ్యాజిక్ లవ్ స్టోరీ ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్టో.. అందులో సాయి పల్లవి నటన, ఆమె డాన్స్ అన్ని ఓ ఆణిముత్యలే. తెలంగాణ అమ్మాయికి అమెరికా అబ్బాయికి ప్రేమతో ముడిపెట్టి ఓ అద్భుతమైన లవ్ స్టోరీలా ఫిదా సినిమాని తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. అలాంటి స్రిప్ట్ ని ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన విషయం రీసెంట్ గా శేఖర్ కమ్ముల ఓ షో లో రివీల్ చేసారు. అలీ తో సరదాగా ప్రోగ్రాం కి గెస్ట్ గా వచ్చిన శేఖర్ ఖమ్ములని అలీ.. మీరెందుకు స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యరు, వాళ్లతో కంఫర్ట్ గా ఉండదనా? లేదంటే మీరు వాళ్ళని హ్యాండిల్ చెయ్యలేరనా? అలాంటిదేం లేదు.. నా ఫిదా స్టోరీని ఇద్దరు స్టార్ హీరోలకి వినిపించాను.మహేష్, రామ్ చరణ్ ఇద్దరికి ఫిదా స్టోరీ ని వినిపించాను. కానీ వాళ్ళు లైట్ తీసుకున్నారు. వాళ్ళు రిజెక్ట్ చేసారని నేనేం ఫీల్ అవ్వలేదు అంటూ శేఖర్ కమ్ముల ఫిదా స్టోరీని మహేష్, రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన విషయాన్ని ఆ షోలో బయట పెట్టారు. ఇక మీ పిల్లలు మీ సినిమాలను చూసి జేడ్జ్ చేస్తారా అంటే.. అసలు మా పిల్లలకి నా సినిమాలు నచ్చవు. మీ సినిమాల్లో అలీ, బ్రహ్మానందం గార్లు ఎందుకు ఉండరు అని అడుగుతుంటారు అనగానే అలీ అందుకుని అవును మీకు కామెడీ నచ్చదా? కామెడీ అంటే వామిటింగ్స్ అవుతాయా? దానికి శేఖర్ కమ్ముల అదేం లేదండి.. మా వైఫ్ కూడాబ్రహ్మానందం అలీ గార్లని ఎందుకు పెట్టరు అని అడుగుతుంది అనగానే అలీ మీ పిల్లలకి, మీ వైఫ్ కి బొకే పంపిస్తాను మమ్మల్ని అడిగినందుకు అంటూ నవ్వేసాడు. జస్ట్ అలీ తో సరదాగా ప్రోమోలోనే ఇదంతా ఉంటే.. ఆ ఎపిసోడ్ చూస్తే ఇంకెన్ని విషయాలు శేఖర్ కమ్ముల బయట పెడతారో.. చూడాలంటే మండే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.
https://www.telugupost.com/crime/tragedy-happened-in-kerala-nine-students-were-killed-in-a-fatal-road-accident-on-the-festival-day-1442053
కేరళలో విషాదం చోటు చేసుకుంది. పండగ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు మరణించారు. 36 మంది వరకూ గాయాలపాలయ్యారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పాలక్కడ్ జిల్లా వడక్కంచేరి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళుతున్న బస్సు కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎర్నాకులం జిల్లాల మూలంతురుతిలోని పాఠశాలకు చెందిన విద్యార్థులు ఊటికీ విహారయాత్రకు వెళ్లారు.ఊటీకి వెళ్లి....బస్సులో 42 మంది విద్యార్థులతో పాటు ఐదుగురు టీచర్లు కలసి ఊటీకి ప్రయివేటు బస్సులో వెళ్లారు. అయితే గురువారం అర్థరాత్రి విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు వడక్కం చేరి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి పడింది. ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. కేరళ ఆర్టీసీ బస్సు కొట్టరక్కర నుంచి కోయంబత్తూరు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో విద్యార్థులతో పాటు ఒక టీచర్ కూడా ఉన్నారని తెలిసింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/aravinda-teser-youtube-84511/
త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న అరవింద సమేత టీజర్ ఈ రోజు బుధవారం ఉదయం విడుదలయ్యింది. హారిక - హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ హీరోగా అదరగొడుతున్నాడు. త్రివిక్రమ్ కామెడీని వదిలేసాడో... లేదంటే టీజర్ లో కామెడీని తప్పించాడో తెలియదు గానీ.. త్రివిక్రమ్ మార్క్ కాకుండా ఎన్టీఆర్ మార్క్ లో అరవింద సమేత టీజర్ కనబడుతుంది. మాటల మాంత్రికుడు కామెడీ సమేత డైలాగ్స్ కాకుండా ఎన్టీఆర్ సమేత మాస్ డైలాగ్స్ తో కట్ చేసిన అరవింద సమేత టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేస్తోంది.సీమ యాసలో చించేశాడు...బ్యాగ్రౌండ్ లో జగపతిబాబు చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్.. మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా..అంటూ చెబుతుంటే.. ఎన్టీఆర్ నిజంగానే యంగ్ టైగర్ మాదిరిగానే విలన్స్ ని ఉతికి ఆరేస్తూ.. కత్తితో కస కస కోసేస్తూ.. రౌడీలను వేటాడుతుంటే.. నిజంగానే మచ్చల పులి లేడిని వేటాడినట్టుగా వుంది. అలాగే ఎన్టీఆర్ చెప్పిన రాయలసీమ పవర్ ఫుల్ యాస డైలాగ్ కంటపడ్డవా కనికరిస్తానేమో… వెంటపడ్డానా నరికేస్తా కేక పుట్టించేలా ఉంది. ఇక ఇంత పవర్ ఫుల్ టీజర్ ని యూట్యూబ్ లో వదిలింది మొదలు ఎన్టీఆర్ ఫాన్స్ షేర్స్, లైక్స్ తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.మూడు గంటల్లో 30 లక్షలు...మరి ఈ అరవింద సమేత టీజర్ విడుదలైన మూడు గంటల్లోపే.. 30లక్షల డిజిటల్ వ్యూస్ ను రాబట్టి యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. మరి ఇదే రేంజ్ లో ఈ టీజర్ యూట్యూబ్ లో చెలరేగిపోతే... ఒక 24 గంటల్లోపే కోటి వ్యూస్ ను సొంతం చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. మరి ఈ టీజర్లో అరవింద అదేనండి.. పూజ హెగ్డే కానీ.. ఏ ఇతర ఫ్యామిలీ ఆడియెన్ కి కనెక్ట్ అయ్యే డైలాగ్ కానీ, సీన్ కానీ లేకపోయినా.. ఈ మాస్ టీజర్ కి ఈ రేంజ్ క్రేజ్ రావడం మాములు విషయం కాదు. ఎన్టీఆర్ స్టామినా.. త్రివిక్రమ్ కున్న క్రేజ్ ఈ అరవింద సామెతపై ఈ హైప్ రావడానికి కారణమని చెప్పొచ్చు.
https://www.telugupost.com/movie-news/ram-charan-as-alluri-in-rrr-varun-tej-as-gaddalkonda-ganesh-in-valmiki-134423/
మెగా హీరో రామ్ చరణ్ #RRR లో అల్లూరి సీతారామరాజు కేరెక్టర్ చేస్తున్నాడు. దానికోసం మరీ ఎక్కువగా మేకోవర్ కాకపోయినా.. మీసాలు పెంచి అల్లూరి లుక్ లోకి మారాడు. ఇక మరో మెగా హీరో వరుణ్ తేజ్ వాల్మీకి లుక్ లో నుండి బయటికొచ్చాడు. గద్దలకొండ గణేష్ గా గెడ్డం పెంచి.. రఫ్ గా మేకోవర్ అయ్యాడు వరుణ్ తేజ్. అచ్చం విలన్ అవతారంలో వరుణ్ మాస్ మేకోవర్ కి మెగా ఫాన్స్ ఫిదా అయ్యారు. లేటెస్ట్ గా వాల్మీకి గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ ఇరగదీసాడు. మరి #RRR అల్లూరి సీతారామరాజు, వాల్మీకి లో గద్దలకొండ గణేష్ లు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనబడితే.. ఆ బాండింగ్ కి మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేస్తాయి . తాజాగా వాల్మీకి విడుదలైన తర్వాత వరుణ్ తేజ్ అన్న రామ్ చరణ్ తో దిగిన ఫోటో ని షేర్ చెయ్యగానే… మెగా ఫాన్స్ అంతా అన్న అల్లూరి – తమ్ముడు వాల్మీకి అంటూ ముద్దుగా క్యాప్షన్ పెట్టి మరీ ఆ ఫోటో ని షేర్స్ తోనూ లైక్స్ తోనూ హోరెత్తిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/sammohanam-sudheer-babu-movie-76121/
సుధీర్ బాబు - అదితి రావు జంటగా ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన సమ్మోహనం సినిమా గత శుక్రవారమే థియేటర్స్ లోకొచ్చింది. ఈ సినిమా మొదటి షోకే డీసెంట్ టాక్ తెచ్చుకుని సాయంత్రానికల్లా పాజిటివ్ అండ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సుధీర్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తో పాటుగా ఈ సినిమా హైయ్యెస్ట్ గ్రాస్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా క్లాస్ మూవీ గా తెరకెక్కినప్పటికీ.. ప్రస్తుతం థియేటర్స్ లో సరైన సినిమా లేకపోవడంతో.. బిసి సెంటర్స్ లోను మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక సమ్మోహనం మూవీ ఓవర్సీస్ లోను సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ.. మంచి కలెక్షన్స్ రాబడుతుంది. సమ్మోహనం 3 డేస్ వరల్డ్ వైడ్ షేర్ మీ కోసం.ఏరియా: మూడు రోజుల షేర్స్ (కోట్లలో)నిజాం 0.88సీడెడ్ 0.28నెల్లూరు 0.10కృష్ణ 0.20గుంటూరు 0.21వైజాగ్ 0.30ఈస్ట్ గోదావరి 0.21వెస్ట్ గోదావరి 0.153 డేస్ ఏపీ & టీస్ షేర్ : 2.33యుఎస్ఏ 1.08ఇతర ప్రాంతాలు 0.383 డేస్ వరల్డ్ వైడ్ షేర్: 3.79
https://www.telugupost.com/movie-news/big-boss-telugu-season-4-updates-6-177215/
బిగ్ బాస్ గ్రాండ్ టైటిల్ ని గెలవకపోయినా, ప్రేక్షక హృదయాలనే కాదు.. సెలబ్రిటీస్ మనసులను గెలుచుకున్నాడు సోహెల్. తాను బిగ్ బాస్ విన్నర్ కానని తెలిసిన సోహైల్ 25 లక్షలు తీసేసుకుని మూడో స్థానంలో నిలబడ్డాడు. ఆ విషయంలో నాగ్ ఫిదా అయ్యి సోహైల్ ని ఎత్తేసుకున్నాడు. ఇక చిరు అయితే సోహైల్ ని తెగ పొగిడేసాడు. అసలు విన్నర్ కన్నా సోహైల్ హైప్ ఎక్కువగా కనబడింది ఆ స్టేజ్ మీద. విన్నర్ కాకపోయినా.. సోహైల్ ని విన్నర్ ని చేసింది బిగ్ బాస్ టీం. అలాగే చిరు, నాగ్ లు సోహైల్ ని అలా హైప్ చెయ్యడంతో సోహైల్ కూడా గాల్లో తేలిపోతున్నాడు. చిరు అయితే నీ సినిమాకి సపోర్ట్ చెయ్యడమేకాదు..ఏకంగా ఓ గెస్ట్ రోల్ కూడా చేస్తా అంటూ మాటిచ్చేసాడు. చిరు ఆలా సోహెల్ కి మాటివ్వడం, నాగార్జున అనాధాశ్రమానికి డబ్బు ఇవ్వడమే కాదు.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా సోహైల్ బిగ్ బాస్ గేమ్ కి ముగ్దుడై నీ సినిమాలో నాకో వేషం ఇవ్వు ఫ్రీగా చేస్తా అంటూ సోహెల్ కి ఫోన్ చేసాడట. మరి హాస్య బ్రహ్మ బ్రహ్మ ఫోన్ చెయ్యడం అంటే సోహెల్ రేంజ్ ఎంత ఎత్తుకి పెరిగిందో అనిపిస్తుంది. అయినా ఓ సీరియల్ ఆర్టిస్ట్ గా బిగ్ బాస్ కి పరిచయం అయిన సోహెల్ సినిమా ఎప్పుడు తీయాలి, ఆ సినిమాలో మెగాస్టార్ రేంజ్ పాత్ర ఎప్పుడు సిద్ధం చెయ్యాలి.. అలాగే బ్రహ్మి కి సరిపోయే రోల్ ని ఎలా పెట్టాలి.. ఇంత పెద్ద స్టార్స్ ని సోహెల్ హ్యాండిల్ చేయగలడా..నరాలు తెగే కోపం, అదరగొట్టే డాన్స్ చేసే సోహెల్ లో మెగాస్టార్ ని, హాస్య బ్రహ్మ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో మొదలైనాయి. మరి సోహెల్ బిగ్ బాస్ ఆట కాదు.. చిరు – బ్రహ్మి లని వాడుకుని గెలువు అంటున్నారు సోహెల్ ఫాన్స్.
https://www.telugupost.com/movie-news/kajal-aggarwal-comments-on-chiranjeevi-66316/
హీరోలపై తన అభిప్రాయాన్ని చెప్పడం కాజల్ అగర్వాల్ స్టైల్. గతంలో తమిళ్ హీరో విజయ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసి అందరి దృష్టిలో పడింది. విజయ్ కు అసలు టేస్ట్ ఉండదని.. అతను ట్రెండ్ ఫాలో అవ్వటంతో చాలా వీక్ అని చెప్పడంతో ఆ మాటలు దుమారం రేపాయి. అయితే లేటెస్ట్ గా కొంతమంది తెలుగు హీరోలపై తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది.నా తెలిసినంత వరకు చిరంజీవి గారు మోస్ట్ రొమాంటిక్ హీరో అని అంది. నేను చాలా మంది హీరోస్ తో యాక్ట్ చేశా కానీ చిరంజీవి అంత రొమాంటిక్ గా నాకు ఎవరూ కనిపించలేదు. ఇక నేను వర్క్ చేసిన హీరోల్లో మహేష్ బాబు చాలా సైలెంట్ గా ఉంటారు. మ్యాగ్జిమమ్ కామ్ గా ఉండడానికి ట్రై చేస్తాడు. మాట్లాడితే మాత్రం జోకులు పేలుస్తుంటాడు.రీసెంట్ గా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో కాజల్ మన తెలుగు హీరోస్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అయితే ఇదే ఫంక్షన్ లో ఫ్యాషన్ ని ఫాలో అవ్వడంతో అల్లు అర్జున్ ని మించినోడు లేదని చెప్పింది. టాలీవుడ్ లో నన్ను లవ్ లో పడేయాలి అని ఎవరు ట్రై చేయలేదు.. కానీ రెండుమూడు సార్లు నవదీప్ ట్రై చేశాడని చెప్పుకొచ్చింది మిల్క్ బ్యూటీ కాజల్.
https://www.telugupost.com/movie-news/anjali-new-look-173527/
ఈమధ్యన అంజలి లుక్స్ పై చాలా కామెంట్స్ సోషల్ మీడియాలో రేజ్ అవుతున్నాయి. అవకాశాలు పెద్దగా లేని అంజలి బరువు తగ్గడంపై బాగా శ్రద్ద పెట్టినట్టుగా ఉంది. అందుకే బాగా బరువు తగ్గి సన్నగా తయారైంది. చక్కగా బొద్దుగా ఉండే అంజలి అలా బరువు తగ్గడంతో ఆమె ఫేస్ లో గ్లో మొత్తం పోయింది. మొన్నామధ్యన అంజలి నటించిన నిశ్శబ్దం సినిమా విడుదల అయినప్పుడు అనుష్క కన్నా ఎక్కువగా అంజలినే అన్నారు. అంజలి స్క్రీన్ స్పెస్ తీసుకుంది కానీ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర చెయ్యడంతో.. విమర్శలపాలయ్యింది. నిశ్శబ్దం లో అంజలి నటనకు మైనస్ మార్కులు పడ్డాయి. అదలా ఉంటే తాజాగా అంజలి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ లో అంజలి లుక్స్ చూస్తే ఆమ్మో అంజలి ఏమిటి ఇలా తయారైంది అంటారు. నిజంగా అంజలి సన్నగా నాజూగ్గా అయితే ఉండొచ్చు కానీ.. మోహంలో కళా కాంతులు లేవు. రెడ్ కలర్ లెహంగా లో అంజలి.. గ్రీన్ కలర్ ఓని వేసుకుని చక్కటి తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తుంది. కానీ ఆమె ఫేస్ విషయంలోనే అసలు లుక్ బయటకి కనబడుతుంది. సన్నబడినా ఫేస్ విషయంలో అంజలి తగిన జాగ్రత్త పడి ఉంటె.. ఇప్పుడు ఇన్ని కామెంట్స్, ఇన్ని విమర్శలు ఉండేవి కాదు. ఫిజిక్ పర్ఫెక్ట్ గా ఉన్నా మొహంలో గ్లో ఉంటేనే అవకాశాలు వస్తాయి.. మరి సన్నబడే క్రమంలో హీరోయిన్స్ అందవిహీనంగా తయారవడం చూస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. మరి అంజలి కొత్త లుక్ ని మీరు ఓ లుక్కెయ్యండి.
https://www.telugupost.com/movie-news/tollywood-producer-passed-away-94598/
కామాక్షి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి (62) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. 1987వ సంవత్సరంలో కామాక్షి మూవీస్ బ్యానర్ ప్రారంభించిన శివ ప్రసాద్ రెడ్డి.. శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, నేనున్నాను, కింగ్, కేడీ, రగడ, బాస్, దడ, గ్రీకు వీరుడు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు.
https://www.telugupost.com/movie-news/raviteja-tiger-nageswara-rao-is-releasing-in-sign-language-also-1498320
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ నెల అక్టోబర్ 20న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఈక్రమంలోనే సాంగ్స్ అండ్ ట్రైలర్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇది ఇలా ఉంటే, రవితేజ ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనే కాకుండా మరో లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. ఇక రవితేజ తీసుకున్న ఆ నిర్ణయానికి నెటిజన్స్ రియాక్ట్ అవుతూ.. 'రవితేజ ది గ్రేట్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ రవితేజ ఏ భాషలో రిలీజ్ చేయబోతున్నాడు..? గ్రేట్ అనాల్సినంత విషయం అందులో ఏముంది..?గ్రేట్ అనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే రవితేజ ఈ సినిమాని.. మాటలురాని, వినిపించని వారి కోసం కూడా రెడీ చేస్తున్నాడు. తెలుగు టు హిందీ మొత్తం ఐదు లాంగ్వేజ్స్ తో పాటు సైన్ లాంగ్వేజ్‌లో కూడా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నిర్ణయం పట్ల.. మాటలు వినిపించని వికలాంగులు, జనరల్ ఆడియన్స్, అభిమానులు రవితేజని అభినందిస్తూ వస్తున్నారు. కాగా సైన్ లాంగ్వేజ్ లో సినిమా రిలీజ్ అంటే.. అది ఎలా ఉండబోతుందని అందరిలో ఆసక్తి నెలకుంది.స్క్రీన్ లో ఒక పక్క.. సినిమాలోని సీన్స్ అన్ని మాటలు లేకుండా ముందుకు సాగుతూ వెళ్తుంటాయి. మరో పక్క.. వచ్చే ప్రతి సీన్ ని సైన్ లాంగ్వేజ్ లో చేసి చూపిస్తూ ఉంటారు. కాగా ఈ సినిమా 19వ శతాబ్దంలోని ఆంధ్రప్రదేశ్ స్టూవర్టుపురం ప్రాంతంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లైఫ్ స్టోరీ నేపథ్యంతో రాబోతుంది. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.A sweet interaction between @RaviTeja_offl and a specially abled fan at the #TNRTrailer launch event ❤️#TigerNageswaraRao trailer is now available in Indian Sign Language. The movie will also release in the ISH version.- https://t.co/qV5t1p24teIn cinemas on October 20th 🔥… pic.twitter.com/QCjsaQ4hJw— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 5, 2023 RAVI TEJA’S FIRST PAN-INDIA FILM: ‘TIGER NAGESWARA RAO’ TO *ALSO* RELEASE IN SIGN LANGUAGE… Arrives in *cinemas* on 20 Oct 2023 [#Dussehra2023]… OFFICIAL POSTER…#TigerNageswaraRao #RaviTeja #Vamsee #AbhishekAgarwal pic.twitter.com/GiUxx2nPEw— taran adarsh (@taran_adarsh) October 6, 2023
https://www.telugupost.com/movie-news/శతమానం-భవతి-ఫస్ట్-వీకెండ-19860/
ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 1 .98సీడెడ్ 0 .66వైజాగ్ 0 .89ఈస్ట్ గోదావరి 0 .71వెస్ట్ గోదావరి 0 .53క్రిష్ణ 0 .34గుంటూరు 0 .47నెల్లూరు 0 .16యూ.ఎస్.ఏ 1.10రెస్ట్ ఆఫ్ ఇండియా &రెస్ట్ ఆఫ్ వరల్డ్ 0 .351st వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 7 .19
https://www.telugupost.com/movie-news/hollywood-to-tollywood-movies-and-web-series-releasing-on-ott-plaforms-on-july-7th-1483792
వీకెండ్ వస్తే .. కరోనాకు ముందు థియేటర్లలో ఏయే సినిమాలు విడుదలవుతున్నాయా అని ఎదురుచూసేవారు సినీ ప్రియులు. కానీ ఇప్పుడు వీకెండ్ వస్తే.. ఓటీటీల్లో వచ్చే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఓటీటీలు కూడా థియేటర్ల మాదిరి.. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. థియేటర్లలో సినిమాలు విడుదల చేయడం సాధ్యం కానప్పుడు ప్రైమ్ వీడియో, ఆహా, జీ 5, నెట్ ఫ్లిక్స్.. ఈ ఓటీటీలు మాత్రమే ఎక్కువగా తెలుసు. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో ఓటీటీ ప్లాట్ ఫాంలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక ఈవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. శుక్రవారం (జులై7) ఒక్కరోజే ఏకంగా 36 సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి.అమెజాన్ ప్రైమ్ లో..బాబీలోన్ (హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది)స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)అదూరా (తెలుగు డబ్బింగ్ సిరీస్)చక్రవ్యూహం (తెలుగు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది)ద హారర్ ఆఫ్ డోలేరస్ రోచ్ (ఇంగ్లీష్ సిరీస్)ఫిట్ చెక్: కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ యూకే క్వీన్ (ఫిలిప్పీన్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)డిస్నీ+హాట్‌స్టార్ లో..గుడ్‌నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది)కిజాజీ మోటో : జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)ఐబీ 71 (హిందీ సినిమా)రుద్రమాంబపురం (తెలుగు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది)నెట్‌ఫ్లిక్స్ లో..అన్‌నోన్ : ద లాస్ట్ పిరమిడ్ (ఇంగ్లీష్ ఫిలిం స్ట్రీమింగ్ అవుతుంది)ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుంది)హోమ్ రెకర్ (ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది)ద లింకన్ లాయర్ సీజన్ 2 : పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)ఫేటల్ సెడెక్సన్ (ఇంగ్లీష్ సిరీస్)ద ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ)హ్యాక్ మై హోమ్ (ఇంగ్లీష్ సిరీస్)ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్)డీప్ ఫేక్ లవ్ (పోర్చుగీస్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)టక్కర్ (తెలుగు, తమిళ్)65 మూవీ (ఇంగ్లీష్ మూవీ)ది ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ)గోల్డ్ బ్రిక్ (ఫ్రెంచ్ ఫిలిం స్ట్రీమింగ్ అవుతుంది)జీ5 లో..తర్లా (హిందీ మూవీ)అర్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా)కాథర్‌ బాషా ఎండ్ర ముత్తు రామలింగం (తమిళ్)ఆహా లో 3:33 తమిళ్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.సోనీలివ్ లో..ఫర్హానా (తమిళ్/తెలుగు)హవా (బంగ్లాదేశీ మూవీ)జియో సినిమాలో..ఇష్క్ నెక్స్ట్ డోర్ (స్ట్రీమింగ్ అవుతుంది)బ్లైండ్ (హిందీ)ఉనాద్ (మరాఠీ సినిమా)ది మ్యాజిక్ ఆఫ్ సిరి (హిందీ మూవీ)HR ఓటీటీలో..అనురాగం (మలయాళం మూవీ)బీఎస్ఎమ్ లో..జాయ్ లాండ్ (పాకిస్థానీ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)అడ్డా టైమ్స్ లో..భూత్ చక్ర ప్రైవేట్ లిమిటెడ్ (బెంగాలీ)ముబీ లో..రిటర్న్ టు సియోల్ (ఇంగ్లీష్ మూవీ)
https://www.telugupost.com/movie-news/పవన్-నిజంగానే-అజ్ఞాతవాసా-48941/
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అంటే జనాలలో భారీ ఎక్సపెక్టషన్స్ ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ గా ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాకి అజ్ఞాతవాసి టైటిల్ అని ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను అఫీషియల్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆ ఫొటోస్ కనపడుతున్నాయి. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసిన ఈ ఫొటోలే. అయితే ఈ ఫొటోస్ ని కావాలనే చిత్ర బృందం ఇలా విడుదల చేసినట్టు తెలుస్తుంది. సినిమా పై భారీ హైప్ పెంచేందుకే ఈ ఫొటోస్ సోషల్ మీడియా లోకి వదిలారు. విడుదల చేసిన ఫొటోస్ కు పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటారు. మరి అజ్ఞాతవాసి టైటిల్ విడుదల చెయ్యకుండానే జనాల్లోకి ఎలా చొచ్చుకు పోయిందో... ఇప్పుడు తాజా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల PSPK 25 వర్కింగ్ స్టిల్స్ కూడా అభిమానులకే కాకుండా సగటు ప్రేక్షకుడికి ఎక్కడ తాగాలలో అక్కడ తగిలి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి.ఇక ఈ స్టిల్స్ లో పవన్ కళ్యాణ్ చాల స్టైలిష్ పైగా... కూల్ గా అందంగా కనబడుతున్నాడు. అజ్ఞాతవాసి టైటిల్ కి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఒంటరిగా కూర్చుని ఆలోచించడం మొదలు.... స్నేహితుడు త్రివిక్రమ్ తో పవన్ ముచ్చట్లు ఇలా... అన్నిరకాలుగా ఆ స్టిల్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం యూరోప్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ 14న ఆడియో రిలీజ్ చేసి, జనవరి 10న సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/case-filed-on-bollywood-director-and-actor-mahesh-manjrekar-1356633
ముంబై : బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు మహేశ్ మంజ్రేకర్ పై కేసు నమోదైంది. ఇటీవల మహేశ్ మంజ్రేకర్ "నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నై కొంచా" అనే మరాఠి సినిమాను తీశారు. ఈ సినిమా ఎక్కువగా పిల్లలపైనే చిత్రీకరించారు. పిల్లలపై జరిగే అకృత్యాలు, వాళ్లని బానిసలుగా చూసే అంశాలపై ఈ సినిమా రూపుదిద్దుకుంది. కాగా.. సినిమాలో మైనర్ పిల్లలపై అభ్యంతరకర సన్నివేశాలను చూపించారన్న ఆరోపణలు వచ్చాయి. ముంబైలోని మహిమ్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైందని, కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.Also Read : భీమ్లా నాయక్ ఫస్ట్ డే కలెక్షన్స్.. వసూళ్ల సునామీసినిమాలోని కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మహరాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీమ దేశ్‌పాండే ముంబై సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. సినిమాలో నటించిన పిల్లలంతా మైనర్లని, అలాంటి వారితో అభ్యంతకర దృశ్యాలను చిత్రీకరించడం పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. సీమ దేశ్‌పాండే ఫిర్యాదు మేరకు మహేశ్‌ మంజ్రేకర్‌పై ఐపీసీ 292, 34 సెక్ష‌న్ల‌తో పాటు పోక్సో సెక్ష‌న్ 14, ఐటీ యాక్ట్ 67, 67బీ కింద కేసు న‌మోదు చేశారు. కాగా.. మహేశ్ మంజ్రేకర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అదుర్స్, డాన్ శీను, అఖిల్, గుంటూరు టాకీస్, సాహో లాంటి సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు.
https://www.telugupost.com/movie-news/ravi-teja-new-movie-rx-100-director-127250/
ఆర్ఎక్స్ 100 తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి ఆ సినిమా తరువాత ఇంతవరకు నెక్స్ట్ సినిమా ఏంటో బయటకు చెప్పలేదు. అంత సక్సెస్ వచ్చిన కానీ అజయ్ తన నెక్స్ట్ మూవీ విషయంలో ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కానీ గత కొంత కాలం నుండి అతను చేయబోయే సినిమా టైటిల్ మాత్రం వైరల్ అవుతుంది. మహాసముద్రం అనే టైటిల్ తో అజయ్ నెక్స్ట్ రానున్నాడు. గతంలో నాగ చైతన్య కి ఈ సబ్జెక్ట్ చెప్పాడు అజయ్. కానీ చైతు కి అది నచ్చకపోవడంతో వెంటనే ఆ కథను రవితేజ కు వినిపించాడు. ఆయన అంగీకరించడంతో వర్క్ కూడా స్టార్ట్ చేసాడు. మొదటి నుండి మనసుకు నచ్చే సినిమాలే చేస్తా అంటున్న బాలీవడ్ బ్యూటీ అదితి రావు ఈ కథ విని లేటెస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా అజయ్ కు హీరో అండ్ హీరోయిన్ దొరికేశారు. కానీ ఈమూవీని నిర్మించేందుకు నిర్మాత ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇది కొంచం భారీ బడ్జెట్ తో చేయాల్సిన సినిమా కాబట్టి. మరి రవితేజ మార్కెట్ ఏమో చాలా డల్ గా ఉంది. ఇటువంటి టైములో రవితేజ సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందు వస్తాడు చెప్పండి? దాదాపు గా ఈమూవీ కి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారు. రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా చిత్రం తో బిజీగా ఉన్నాడు. దీని తరువాత మహాసముద్రం ఉండే అవకాశముంది
https://www.telugupost.com/crime/two-womens-died-due-to-cat-bite-after-two-months-1357981
మొవ్వ : రెండు నెలల క్రితం ఓ పిల్లి ఇద్దరు మహిళలను కరవగా.. వారిద్దరూ శనివారం మరణించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కృష్ణాజిల్లా మొవ్వ మండలం వేములమడలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దళితవాడలో నివసించే రిటైర్డ్ కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమలమ్మ, ప్రైవేటు డాక్టరైన బొడ్డు బాబూరావు భార్య నాగమణిని రెండు నెలల క్రితం ఓ పిల్లి కరిచింది. ఇద్దరు ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ టీటీ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేశారు. కొంతకాలానికి పిల్లి కరిచిన గాయాలు మానిపోయాయి.Also Read : పెళ్లిలో విషాదం.. భోజనం చేసిన 1200 మంది ఆస్పత్రి పాలుకానీ.. నాలుగు రోజుల క్రితం ఇద్దరిలోనూ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో కమల మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో, నాగమణి విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నాగమణి నిన్న తెల్లవారుజామున మృతి చెందగా.. కమల నిన్న ఉదయం 10 గంటల సమయంలో మరణించింది. వారిద్దరినీ కరిచిన పిల్లిని కుక్క కరిచి ఉంటుందని, దానికి రేబిస్ సోకడంతో వీరిద్దరూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. కమల, నాగమణిని కరిచిన పిల్లి ఆ తర్వాత మరణించినట్టు స్థానికులు చెప్పారు.
https://www.telugupost.com/movie-news/varun-tej-venkatesh-dil-raju-fun-and-frustration-movie-104749/
మొన్నామధ్యన ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. అయితే ఫిదా సినిమాలో సాయి పల్లవి నటనకు, ఆమె డాన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో వరుణ్ మీద సాయి పల్లవి డామినేషన్ అడుగడుగునా కనబడింది. ఫిదా సినిమా క్రెడిట్ మొత్తం సాయి పల్లవికి దర్శకుడు శేఖర్ ఖమ్ములకే పోయింది. ఇక తొలిప్రేమ సినిమా లో వరుణ్ నటన,లుక్స్ కి మంచి పేరొచ్చినా.. ఆ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం కొత్త దర్శకుడు వెంకీ అట్లూరికే పోయింది. తొలిప్రేమ హిట్ లో మేజర్ క్రెడిట్ వెంకీ అట్లూరి పొందగా…. వరుణ్ తేజ్ కి పర్వాలేదనిపించే మార్కులు పడ్డాయి. ఇక అంతరిక్షం సినిమా బావున్నప్పటికీ.. ఆ సినిమా కి కలెక్షన్స్ సో సో గా రావడం.. సినిమా కి వచ్చిన కాస్తో కూస్తో పేరు దర్శకుడు సంకల్ప్ కి పోవడం జరిగాయి. ఇక తాజాగా వరుణ్ తేజ్ వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ టు అనే మల్టి స్టారర్ లో నటించాడు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 12 న అంటే వచ్చే శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న వరుణ్ కి వెంకీ తో కాస్త గండమే ఉంటుంది. ఎందుకంటే వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలతో ప్రస్తుతం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. మరి ఎఫ్ టు లో కూడా వెంకటేష్ డామినేషన్ కి ఈ మెగా హీరో వరుణ్ నలిగిపోవడం ఖాయమనే మాట సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. వెంకటేష్ కామెడీ టైమింగ్ నటన ముందు వరుణ్ ఎంతవరకు నిలబడగలడని అంటున్నారు. మరి దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్ టు సినిమా ఒకవేళ హిట్ అయినా క్రెడిట్ మొత్తం వెంకటేష్ ఖాతాలోకే వెళుతుంది కానీ…. వరుణ్ తేజ్ కి ఎలాంటి పేరు రాదంటున్నారు. మరోపక్క అనిల్ రావిపూడి వెంకీ కేరెక్టర్ కి రాసినంత కామెడీ వరుణ్ కేరెక్టర్ కి రాయలేదంటున్నారు. మరి ఎఫ్ టు ఫన్ ఫ్రస్టేషన్ లో వెంకటేష్ తో పూర్తిగా వరుణ్ కామెడీ చేసి మెప్పించాడో లేదో అనేది జనవరి 12 కి తేలిపోతుంది. చూద్దాం ఈ సినిమాతో అయినా వరుణ్ తన క్రేజ్ ని పెంచుకుంటాడో.. లేదో.. అనేది.
https://www.telugupost.com/movie-news/ఎన్టీఆర్-అన్నిటిలో-వేలెడ-42407/
'జై లవ కుశ' విడుదలకు సిద్దమవుతుంది. సెప్టెంబర్ 21 న సినిమా విడుదల అని రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. సినిమా విడుదలకు కేవలం 21 రోజులు మాత్రమే వుంది. ఇప్పటికే కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ గా వున్న 'జై లవ కుశ' గురించి ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే డైరెక్టర్ బాబీ తీసిన 'జై లవ కుశ' ఫైనల్ అవుట్ ఫుట్ చూసిన ఎన్టీఆర్ సంతృప్తి చెందడంలేదంట. అందుకే 'జై లవ కుశ' ఎడిటింగ్ ని ఎన్టీఆర్ పర్యవేక్షణలోనే చేపిస్తున్నాడట. ఎందుకంటే ఎన్టీఆర్ నటన, డాన్స్ లోనే కాదు ఒక స్టోరీ రైటర్ గా, డైరెక్టర్ గా అన్ని కళల్లో ప్రావిణ్యం ఉన్నవాడని చాలామంది మొదటినుండి చెబుతూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు 'జై లవ కుశ' విషయంలో ఎన్టీఆర్ తన కళలను బయటికి తీస్తున్నాడనే టాక్ వినబడుతుంది. టోటల్ గా 'జై లవ కుశ' సినిమా చూసాక సంతృప్తి పడని ఎన్టీఆర్ లూజ్ ఎండ్స్ వుంటే సరి చేసి, ఫస్ట్ హాఫ్ లాక్ చేసి ఇప్పటికే ఆర్ ఆర్ కు పంపించేసినట్లు సమాచారం అందుతుంది. ఇప్పడు సెకండాఫ్ విషయంలో కూడా ఎన్టీఆర్ ఆవిధమైన కేరే తీసుకుంటున్నాడట. రెండు మూడు రోజుల్లో సెకండ్ హాఫ్ ని కూడా ఫైనల్ చేసి లాక్ చేసి ఆర్ ఆర్ కి పంపుతారని చెబుతున్నారు.ఇక 'జై లవకుశ' సినిమా చివర 15 నిముషాలు తారక్ తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని చెబుతున్నారు. అయితే 'జై లవ కుశ' విడుదల డేట్ దగ్గర పడుతున్నా కానీ సిజి వర్క్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో పనులను ముక్కలు ముక్కలు గా చేసి, హైదరాబాద్ లోని కొన్ని కంపెనీలకు ఇచ్చి, చకచకా పూర్తి చేయిస్తున్నట్లు తెలుస్తుంది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'జై లవ కుశ' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎన్టీఆర్ వేలు పెట్టాకే సినిమా మీద కాన్ఫిడెన్స్ పెరిగిందని... ఈ చిత్రం తో తమ్ముడు మంచి హిట్ కొడతాడని.. అలాగే అన్నకళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా ఫుల్ శాటిస్ఫై అవుతాడంటున్నారు.
https://www.telugupost.com/politics/with-bjp-leader-jitender-reddys-tweet-tremors-started-in-telangana-bjp-1482894
తెలంగాణ బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ఓ ట్వీట్ కమలం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి దున్నపోతులను ట్రాలీలోకి ఎక్కిస్తూ.. ముందుకు కదలని ఒక దున్నపోతుని కాలితో తన్నుతాడు. ఆ వీడియోను ట్వీట్‌ చేస్తూ “బీజేపీ తెలంగాణ నాయకత్వానికి ఈ ట్రీట్మెంట్‌ అవసరం” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, బీజేపీని జితేందర్ రెడ్డి ట్యాగ్ చేశారు. అయితే అతని ట్వీట్ వైరల్ కావడంతో, మాజీ ఎంపీ దానిని తొలగించారు. మాజీ ఎంపీ తర్వాత మళ్లీ అదే పోస్ట్ చేసాడు. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న వారికి అలాంటి చికిత్స అందించాలని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశాడు. తన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతుదారులపై సోషల్ మీడియాలో ఆయన మండిపడ్డారు. అయితే సీనియర్ నాయకుడి చర్య అప్పటికే నష్టాన్ని మిగిల్చింది. పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో ఇది వరస పెట్టి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టింది. ఇక ఈ ట్వీట్‌ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బీజేపీని ఎగతాళి చేసేందుకు ఉపయోగించుకున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇదే ట్రీట్‌మెంట్ అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. బండి సంజయ్ పనితీరుపై అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం జితేందర్ రెడ్డి ట్వీట్‌పై స్పందించారు. ఇతరుల స్వేచ్ఛను అగౌరవపరిచేలా లేదా ఉల్లంఘించేలా ప్రవర్తించారని ఆయన అన్నారు. జితేందర్‌రెడ్డి ఆ ట్వీట్‌ ఎందుకు చేశారో, ఆయన ఉద్దేశం ఏంటనేది ఆయనకే తెలియాలని ఈటల రాజేందర్ అన్నారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు. ఏది పడితే అది మాట్లాడకూడదని, అలా మాట్లాడి పార్టీ పరువు తీయొద్దని చెప్పారు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాల్సిన బాధ్యత సీనియర్ నాయకులపై ఉందని గర్తు చేశారు. ఎవరి స్వేచ్ఛ, గౌరవం తగ్గించొద్దని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వివాదాస్పద ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత, వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో జితేందర్ రెడ్డి బండి సంజయ్‌తో కలిసి వేదిక పంచుకున్నారు. మీడియాలో కథనాలు ప్రచారం చేస్తూ కాషాయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ప్రజల మనసుల్లో ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ అధినేత ప్రయత్నిస్తున్నారని అన్నారు. జితేందర్ రెడ్డి ట్వీట్‌పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి స్పందిస్తూ, బిజెపి రాష్ట్ర శాఖలో అంతర్గత కలహాలను పోల్చడం, ప్రజలకు వివరించడానికి ఇది అద్భుతమైన మార్గం అని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం మంటలను ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నానికి ఈ ట్వీట్ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సంజయ్ నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు గత వారం సమన్లు ​​పంపింది. మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా సంజయ్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయన పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. సంజయ్ కూడా నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు. బిజెపి అవకాశాలను దెబ్బతీసేందుకు కెసిఆర్ పుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పొరుగున ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంజయ్ వ్యవహార శైలిని తప్పుపడుతూ పార్టీలోని ఒక వర్గం నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగా ప్రసారం చేశారు. నాయకత్వాన్ని కూడా మార్చాలని డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితం వరకు దూకుడు పెంచి అధికారాన్ని చేజిక్కించుకుంటామన్న ధీమాతో ఉన్న కాషాయ పార్టీ అంతర్గత పోరుతో ఉలిక్కిపడింది. జితేందర్‌ చేసిన ట్వీట్‌, దానిపై స్పందించిన నేపథ్యంలో అంతర్గత పోరు మరింత ముదురుతుందని, ఎన్నికల వేళ పార్టీని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.
https://www.telugupost.com/movie-news/లక్కు-తిరిగింది-59439/
జై లవ కుశ లో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో పక్కన నటించినా లక్కు కలిసి రాని రాశి ఖన్నాకు, తొలిప్రేమ సినిమాతో మంచి విజయమే లభించింది . వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో వర్ష పాత్రలో రాశి ఖన్నా ఇరగదీసింది. లుక్స్ పరంగాను, యాక్టింగ్ పరంగాను, అలాగే ఎమోషన్స్ ని పలికించడం ఇలా అన్ని కోణాల్లో రాశి ఖన్నా బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చింది. గత కొన్నేళ్లుగా చేతిలో సరైన హిట్ లేకుండా బాధ పడుతూ బొద్దుగా ఎబ్బెట్టుగా తయారైన రాశి ఖన్నా ఇప్పుడు మంచి ఫిట్నెస్ తో సన్నజాజిలా తయారైంది. మరి సన్నని అందాలతో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న రాశి ఖన్నాకి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు.తొలిప్రేమలో రాశి ఖన్నా వరుణ్ తేజ్ తో పోటీపడి నటించడమే కాదు అందరితో శెభాష్ అనిపించుకుంది. వర్ష పాత్రలో అల్లరితో పాటు అభినయంతో అందరిని కట్టిపడేసిన రాశికి ఈ సినిమాతో మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం వంద శాతం ఉంది. రాశి ఖన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు నటించిన ఊహలు గుస గుసలాడే సినిమాలో రాశి పెరఫార్మెన్స్ ఎలా ఉందొ మళ్ళీ ఆ రేంజ్ పెరఫార్మెన్స్ రాశి తొలిప్రేమలో కనబర్చింది. మరి రాశి చేసిన వర్ష పాత్రకి అటు ప్రేక్షకులతో పాటు ఇటు క్రిటిక్స్ సైతం ఫుల్ మార్కులు వేసేసారు. ఇక ఈ సినిమాతో రాశి ఖన్నా కి లక్కు కలిసొచ్చేలా కనబడుతుంది కూడా
https://www.telugupost.com/movie-news/allu-arjun-naa-peru-surya-mahesh-babu-69014/
రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా షూటింగ్స్ సమయంలో విమర్శలు వచ్చాయి. సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా స్టార్ట్ అయిందని మాటలు మొదటగా వినిపించినా.. మహేష్ టీం చూపించిన జోరు చూసి అందరూ ఆ విషయాన్ని మరచిపోయారు. మహేష్ అండ్ టీం సినిమా రిలీజ్ కి ముందు ప్రొమోషన్స్ లో యాక్టివ్ గా ఉండడం. మీడియాతో కూడా రెగ్యులర్ టచ్ లో ఉంటాడటం ఇలా చాలానే టెక్నిక్స్ పాటించారు.ప్రమోషన్స్ తక్కువే.....అంతే కాకుండా రిలీజ్ తర్వాత సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ అండ్ టీం ప్రొమోషన్స్ ఆపలేదు. నిన్ననే మహేష్, కైరా, కొరటాలతో ఓ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు ఈరోజు విడుదల అయిన అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లెక్క మరోలా ఉంది. ఈ సినిమాకు ముందు సినిమాకు సంబంధించి రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసి భారీ హంగామా.. ప్రమోషన్స్ చాలా తక్కువగానే ఉన్నాయి.పాజిటివ్ టాక్ వస్తేనే....అయితే బన్నీ అండ్ టీం ఇంకో ప్లాన్ ఉందంట. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ప్రచారం ఎక్కువగా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి బన్నీ సినిమాపై ఎంత కాంఫిడెన్స్ గా ఉన్నాడో అర్ధం అవుతుంది. ఏది ఏమైనా ఈరోజు రిజల్ట్ ను బట్టి బన్నీ నెక్స్ట్ ప్లాన్ ఉంటుంది.
https://www.telugupost.com/crime/young-woman-nithisha-kandula-from-hyderabad-who-went-to-study-higher-education-in-america-has-disappeared-1538505
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన హైదరాబాద్ కు చెందిన యువతి అదృశ్యమయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉణ్నారు. కందుల నితీషా మే 28వ తేదీ నుంచి కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారుహైదరాబాద్ నగరానికి...హైదరాబాద్ నగరానికి చెందిన కందుల నితీష కాల్ స్టేట్ యూనివర్సిటీలో శాన్ బెర్నార్డినో లో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లారు. అయితే ఆమె మే 28వ తేదీ నుంచి కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిందని సన్నిహితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ అమెరికా పోలీసుుల ప్రకటన ఇచ్చారు. కందుల నితీషా కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.
https://www.telugupost.com/movie-news/ఎన్టీఆర్-అసామాన్యుడు-కా-71115/
ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ రాయలసీమ నేపథ్యంలో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఏ డేట్ అన్నది ఇంకా ఫైనలైజ్ చేయలేదు.ఈ సినిమాకి 'అసామాన్యుడు' అనే టైటిల్ ను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ టైటిల్ కి ఫ్యాన్స్ నుండి సినిమా యూనిట్ నుండి బ్యాడ్ ఫీడ్ బ్యాక్ రావడంతో త్రివిక్రమ్ మరో టైటిల్ అనుకున్నట్టు తెలుస్తుంది. కథను..అందులోని కొత్తదనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి 'రా రా కుమారా' అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు సమాచారం.ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ రావడంతో త్రివిక్రమ్ ఈ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తూ ఫస్టులుక్ ను రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. తమన్ ఇప్పటికే రెండు సాంగ్స్ కంపోజ్ చేసాడంట. మిగిలిన సాంగ్స్ కు ట్యూన్స్ చేసే పనిలో ఉన్నాడు తమన్
https://www.telugupost.com/crime/uttar-pradesh-man-arrested-for-urinating-on-dalit-man-days-after-mp-incident-1485072
ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ లో ఆదివాసీపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వీడియో.. ఏ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత ఆ వ్యక్తిని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటికి పిలిపించి, కాళ్లు కడిగి క్షమాపణలు కోరిన వీడియో సైతం వైరల్ అయింది. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ బయటపడింది. అసలు బాధితుడిని నేను కాదంటూ.. సీఎంతో కాళ్లు కడిగించుకున్న వ్యక్తి చెప్పడం కొసమెరుపు. మరి అసలు బాధితుడెవరన్నదానిపై ఇంతవరకూ క్లారిటీ లేదు. మరోవైపు ప్రవేశ్ శుక్లా రేవా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోనూ చోటుచేసుకుంది.సోన్ భద్ర జిల్లాలో ఓ వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేసినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. కాగా.. ఘటన జరిగిన సమయంలో బాధితుడు మద్యంమత్తులో ఉండటంతో ఈ విషయాన్ని గుర్తించలేదు. ఆ తర్వాత వైరల్ అయిన వీడియో చూసి తన జరిగిన అవమానాన్ని తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జులై 11న జరిగిన ఈ ఘటన నాలుగు రోజులు ఆలస్యంగా వెలుగు చూసింది.జిల్లాలోని జుగైల్ ప్రాంతానికి చెందిన జవహర్ పటేల్, గులాబ్ కోర్ లకు ముందే పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి జులై 11న మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్యన చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. దాంతో జవహర్ పటేల్.. గులాబ్ చెవిలో మూత్ర విసర్జన చేశాడు. అప్పటికే అతను మద్యంమత్తులో ఉండటంతో ఈ విషయాన్ని గ్రహించలేదు ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. మరుసటి రోజున తనకు జరిగిన అవమానంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, జవహర్ పటేల్ ను అరెస్ట్ చేశారు.
https://www.telugupost.com/movie-news/koratala-new-films-82468/
కొరటాల శివ చేసిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాలే. మొదటి రెండు సినిమాలు కంటెంట్ పరంగా అదరగొట్టే హిట్స్ కొడితే.. తర్వాతి రెండు సినిమాలు క్రేజ్ తోనే సగం హిట్స్ కొట్టేశాయి. ప్రభాస్ - కొరటాల కాంబోలో వచ్చిన మిర్చి సూపర్ హిట్. మహేష్ - కొరటాల కాంబోలో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ కి క్రిటిక్స్ పాజిటివ్ మార్క్స్ ఇవ్వకపోయినా.. ప్రేక్షకులు ఆ సినిమాకి సూపర్ హిట్ కలెక్షన్స్ అందించారు. ఇక మహేష్ - కొరటాల రిపీట్ కాంబోలో వచ్చిన భరత్ అనే నేను సూపర్ హిట్ అయ్యింది కానీ.. భారీ లాభాలు రాలేదు. అయినా మహేష్ - కొరటాలకున్న క్రేజ్ తోనే సినిమా హిట్ అయ్యింది.ఇప్పటికే చిరంజీవితో...ఇక కొరటాల శివ తన ఐదో సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరోగా చెయ్యబోతున్నాడు.. అనేది ప్రచారంలో ఉంది.. కానీ అధికారిక ప్రకటన అయితే లేదు. ప్రస్తుతం చిరు సై రా సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే కొరటాల తో మూవీ చేస్తాడు. ఇక ఈ సినిమా ఫుల్లీ యాక్షన్ తో ఉండబోతుందని.. అలాగే చిరంజీవి ఈ సినిమా లో రెండు పాత్రలు చేయబోతున్నాడనే టాక్ ఉంది. ఇకపోతే జనత గ్యారేజ్ నుండి ఫ్రెండిషిప్ ని బాగా మెయింటైన్ చేస్తున్న ఎన్టీఆర్, కొరటాల కాంబో రిపీట్ కాబోతుందనే న్యూస్ హైలెట్ అయ్యింది. కొరటాల చిరుతో సినిమా చేసాక తన తదుపరి ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చెయ్యబోతున్నాడంటూ.. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది కూడా తన మిత్రుడు నిర్మాతగా కొరటాల ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.స్నేహితుడితో సినిమా ఖాయం...కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని కొరటాల కష్టాలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు కాబట్టి.. ఆయనకి ఒక సినిమా చేసిపెడతానని మాటిచ్చాడట కొరటాల. అయితే కొరటాల చిరుతో కమిట్ అవడంతో సుధాకర్ మిక్కిలినేని కాస్త భయపడ్డాడట. కానీ కొరటాల మాత్రం సుధాకర్ మిక్కిలినేని నిర్మాణంలో సినిమా కచ్చితంగా వుంటుందనే కాదు... ఇప్పటికే సుధాకర్ మిక్కిలినేని సినిమాకి సైన్ కూడా చేసాడు. ఇక ఆ సినిమాని కూడా ఎన్టీఆర్ తో చేయబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న అరవింద సమేత పూర్తి కాగానే... రాజమౌళి మల్టీస్టారర్ ని కూడా పూర్తి చేసి కొరటాల తో సినిమా చేస్తాడట. మరి ఎలాగూ ఎన్టీఆర్, కొరటాల ఎలా లేదన్నా వచ్చే ఏడాదో చివరి నాటికి వారి ప్రాజెక్టులతో ఫ్రీ అవుతారు. ఇక 2019 చివర్లో సుధాకర్ మిక్కిలినేని నిర్మాణంలో ఎన్టీఆర్ - కొరటాల సెట్స్ మీదకెళ్ళి 2020 చివరికి తమ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తారట.
https://www.telugupost.com/movie-news/puri-jagannadh-and-vijaydevarakonda-movie-130061/
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానుంది. రీసెంట్‌గా విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్'తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్, సమర్పణ: లావణ్య, నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్, బ్యానర్స్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్.
https://www.telugupost.com/movie-news/pawan-kalyan-jagarlamudi-krish-movie-148218/
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత చాలా సైలెంట్ అయిన దర్శకుడు క్రిష్ తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాతో రోజు మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నాడు. బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా చేసి.. కంగనా రనౌత్ చేతిలో బాగా బుక్ అయిన క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ తోనూ బాగా సఫర్ అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ తో క్రిష్ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసి.. పవన్ తో కలిసి కొత్త సినిమా మొదలెట్టేసాడు. ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో దొంగ గా కనిపిస్తాడని టాక్ ఉంది. ఈ సినిమాకి నాలుగు భాషలకు కలిపి అందరికి ఎక్కేలా విరూపాక్ష అనే టైటిల్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న పవన్ – క్రిష్ చిత్రంలో క్రిష్ యు టర్న్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దర్శక నిర్మాతలు ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. క్రిష్‌కు బాలీవుడ్‌లో కూడా గుర్తింపు ఉండటంతో అక్కడ కూడా విడుదల చేయాలనుకున్నారు. దానికితోడు ఈ సినిమా పీరియాడికల్ సినిమా కావడంతో కచ్చితంగా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావించడం…దీనికోసం బడ్జెట్ కూడా 100 కోట్లకు పైగానే అవుతుందని లెక్కలు వేసుకున్నారు. అయితే తాజాగా సై రా, సాహో సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యి.. హిందీ లో దెబ్బేయ్యడంతో క్రిష్ నిర్మాత ఆలోచనలో పడి… హిందీ లో సినిమా షూట్ చెయ్యకుండా జస్ట్ డబ్ చేసి సినిమాని విడుదల చేద్దామని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.
https://www.telugupost.com/movie-news/sarvanand-new-movies-80721/
ఒకప్పుడు తప్పటడుగులు వేసినా.. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న శర్వానంద్ మాత్రం మంచి కథలను ఎంపిక చేసుకుంటూ.. హిట్స్ కొడుతున్నాడు. ఇక కథలో కొత్తదనం లేకపోతె శర్వానంద్ మొదటి నుండి తొందరగా ఒప్పుకునే రకం కాదు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తప్పులు చేసినా.. ప్రస్తుతమైతే. చాలా మెచ్యూర్డ్ గా సినిమా లు చేసుకుపోతున్నాడు. అలాగే శర్వానంద్ సినిమా షూటింగ్స్ కూల్ గా చేస్తాడు..హరీబరిగా ఒకేసారి రెండు సినిమాలు చెయ్యడని చెబుతుంటారు. కానీ ప్రస్తుతమైతే.. హను రాఘవపూడి తో పాటుగా సుధీర్ వర్మ తో మరో సినిమాని పట్టాలెక్కించాడు శర్వానంద్.హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమాని సాయి పల్లవి తో కలసి నటిస్తున్నాడు. సాయి పల్లవి నటన తో పాటు ఆమె అందం ఈ సినిమా కి హెల్ప్ అవుతాయని.. అలాగే శర్వానంద్ క్రేజ్ కూడా సినిమాకి ప్లస్ అవుతుందని చిత్ర బృందం చెబుతున్న మాట. ఇక భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాతో పాటుగా సుధీర్ వర్మ సినిమాని ఒప్పుకున్న శర్వానంద్ ఇంకా సుధీర్ వర్మ తో పాటుగా రెగ్యులర్ షూటింగ్ లో అయితే ప్రస్తుతం పాల్గొనడం లేదు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత శర్వానంద్ తో కలిసి పని చెయ్యడానికి చాలామంది దర్శకునిర్మాతలు పోటీపడుతున్నారు.తాజాగా శర్వానంద్ ని తన మల్టీస్టారర్ లో ఒప్పించడానికి ఇంద్రగంటి మోహన కృష్ణ రేడి అవుతున్నాడట. ఇక ఈ సినిమా లో శర్వానంద్ తో పాటుగా మరో హీరో నాని ని కూడా ఇంద్రగంటి సెట్ చేసే పనిలో ఉన్నాడట. అలాగే శర్వానంద్ కి మరో దర్శకుడు కూడా కథ వినిపించాడంటున్నారు. శ్రీకాంత్ అడ్డాలతో పాటుగా శ్రీనివాసరాజు అనే దర్శకుడు కూడా శర్వానంద్ కి కథ వినిపించే ప్రయత్నాల్లో ఉన్నారనే టాక్ తో పాటుగా... మరికొంతమంది శర్వాని కలిసి కథ చెప్పాలని ఉవ్విళ్లూరుతున్నారట. మరి మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న శర్వాతో సినిమాలు చెయ్యడానికి దర్శక నిర్మాతలకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. అలాగే ఆ హీరో మీద వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అందుకే శర్వా చుట్టూ ఇంతమంది దర్శకులు పడుతున్నారు. ఇక ఎన్ని కథలు వింటున్నప్పటికీ.. శర్వా మాత్రం తొందరపడి ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తుంది.