link
stringlengths
41
231
text
stringlengths
28
5k
https://www.telugupost.com/movie-news/నాని-రొటీన్-స్టారా-53744/
మారుతి దర్శకత్వంలో నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో నాని హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ సినిమాలో మతిమరుపు లక్కీ గా నటించి అందరిని నేచురల్ గా ఆకట్టుకున్నాడు. అప్పటికే నేచురల్ స్టార్ గా మారిన నాని ఆ సినిమా దగ్గర నుండి ఆ బిరుదుకి పక్కాగా సూట్ అయ్యాడంటూ అందరూ నేచురల్ స్టార్ నాని అంటూ హోరెత్తించారు. అయితే ఆ సినిమా తర్వాత చేసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, జెంటిల్మన్, మజ్ను, నేను లోకల్, నిన్నుకోరి, ఇపుడు తాజాగా ఎంసీఏ. ఈ సినిమాలన్నిటిలో నాని చాలా చక్కగా నేచురల్ గా నటించాడు. కానీ నాని ఒకేలా రొటీన్ గా నటిస్తున్నాడనే టాక్ మిడిల్ క్లాస్ అబ్బాయితో బయటికి వచ్చింది.నాని నుండి వచ్చే సినిమాలన్నీ కామెడీతో ఎమోషనల్ గా ఉన్న సినిమాలే ఉంటున్నాయనే ఫీలింగ్ ఎంసీఏ సినిమాతో బాగా వచ్చేసింది ప్రేక్షకులకు. అందుకే నానికి నేచురల్ స్టార్ ని వదిలేసి రొటీన్ స్టార్ అని పెట్టుకుంటే బావుంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ తన సినిమాలు ప్లాప్ అవుతాయో అని భయపడిన నాని ఇలా రొటీన్ కథలకే ఓటు వేస్తున్నాడని... అలాగే కొత్తగా ఆలోచించడానికి కూడా అస్సలు ట్రై చెయ్యడం లేదంటున్నారు. అందుకే ఇప్పుడు ఎంసీఏ సినిమా పక్కా రొటీన్ కథతోనే వచ్చి ప్రేక్షకులకు కొంచెం బోర్ కొట్టించాడని టాక్ రావడమే కాదు.... క్రిటిక్స్ నుండి కూడా నాని నటన రొటీన్ అనే కామెంట్స్ పడ్డాయి.అయినా తన సినిమా హిట్ అనే మూడ్ లోనే ఉన్నాడు నాని. నాని అనడం కాదుగాని..... ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకాదరణ పొందిన నాని ఎంసీఏ సినిమా బాగుందనే విషయం ఎంసీఏ కలెక్షన్స్ ఓపెన్ గానే చెబుతున్నాయి. మరి నాని ఈ కామెంట్స్ ని దృష్టిలో ఉంచుకుని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న కృష్ణార్జున యుద్దాన్ని అయినా కాస్త డిఫరెంట్ గా చేస్తే బావుంటుందంటున్నారు. మరి నాని ఒకవేళ ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే... ఫ్యూచర్ లో ఇబ్బందులు తప్పవంటున్నారు. చూద్దాం కృష్ణార్జునలో నాని ఎలా కనబడతాడో.
https://www.telugupost.com/movie-news/mahesh-babu-emotional-post-on-his-brother-ramesh-demise-1348085
సూపర్ స్టార్ కృష్ణ పెద్దకొడుడు, మహేష్ బాబు అన్నయ్య అయిన రమేష్ బాబు గతరాత్రి తీవ్ర అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. రమేష్ బాబు మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా.. తన అన్నయ్య అకాలమరణం పట్ల మహేష్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అన్న మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.Also Read : టాలీవుడ్ లో కరోనా కలకలం.. రాజేంద్ర ప్రసాద్ కు పాజిటివ్ !మహేష్ కు కోవిడ్ పాజిటివ్ రావడంతో.. అన్నయ్య కడసారి చూపుకు కూడా నోచుకోలేక.. తీరని వేదనతో కుమిలిపోతూ.. సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. "నువ్వే నాకు స్ఫూర్తి. నువ్వే నాకు అండ. నిన్ను చూసుకునే నేను ధైర్యంగా ఉన్నాను. నువ్వే నా సర్వస్వం. నువ్వు నా జీవితంలో లేకపోతే ఇవాళ నేనున్న స్థాయిలో సగం కూడా ఉండేవాడ్ని కాదేమో! నా కోసం నువ్వు చేసిన ప్రతి పనికి కృతజ్ఞతలు. ఈ జన్మలోనే కాదు, మరో జన్మంటూ ఉంటే నువ్వే నాకు అన్నయ్య. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను... ఎప్పటికీ! విశ్రాంతి తీసుకో అన్నయ్యా... విశ్రాంతి తీసుకో!" అంటూ మహేశ్ బాబు తీవ్ర భావోద్వేగాలతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై మహేష్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. స్ట్రాంగ్ గా ఉండాలి మహేష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.pic.twitter.com/pAhrH2Npc2— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2022
https://www.telugupost.com/movie-news/ప్రభాస్-బాలీవుడ్-ఎంట్రీ-35759/
టాలీవుడ్‌లోని స్టార్స్‌లో సౌమ్యుడు, వివాదరహితుడు, మహా మొహమాటస్తుడు. కులం పట్టించుకోని మంచి వారిలో ముందుగా ప్రభాస్‌ గురించి చెప్పుకోవాలి. ఇక ఆయన రెమ్యూనరేషన్‌ విషయం కూడా పట్టించుకోడు అంటారు.కాగా ప్రభాస్‌ ఇమేజ్‌ను ఇటీవల వచ్చిన 'బాహుబలి-ది బిగినింగ్‌', 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌'లు ఎవరెస్ట్‌ స్థాయిలో కూర్చోబెట్టాయి. కాగా నేడు ప్రభాస్‌ మామూలు యంగ్‌రెబెల్‌స్టార్‌ కాదు.. నేషనల్‌ స్టార్‌. ఈ క్రేజ్‌ను వాడుకుని 'బాహుబలి' క్రేజ్‌ను వాడుకోవాలని ప్లాన్‌ వేసిన నిర్మాతలకు బాహుబలి టైంలోనే తన తదుపరి చిత్రం 'సాహో'అని చెక్‌పెట్టాడు. కాగా ప్రభాస్‌ ప్రస్తుతం ముంబైలో 'సాహో'లో ఉన్నాడట. ఇంకా తన వర్క్‌ని ప్రారంభించలేదని, ప్రస్తుతం విలన్‌ నీల్‌ నితిష్‌ పై కొన్ని యాక్షన్‌ సీన్స్‌ని సుజీత్‌ దర్శకత్వంలోచిత్రీకరిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌ని అబుదాబిలో ప్లాన్‌ చేశారు. కాగాముంబైలో ఉన్న ప్రభాస్‌ తాజాగా భాహుబలిని బాలీవుడ్‌లో రిలీజ్‌ చేసిన కరణ్‌జోహార్‌ ఇచ్చిన గ్రాండ్‌ పార్టీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన కరణ్‌జోహార్‌ తోనే 'సాహో' తదుపరి చిత్రం చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్‌ 'సాహో' తర్వాత సినిమా కరణ్‌జోహార్‌కి చేయడం లేదని, మరో పెద్ద నిర్మాత సాజిద్‌ నదియావాలాతో చర్చలు పూర్తయ్యాయని, ప్రభాస్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేశాడని ఓ జాతీయ దినపత్రిక కధనం ప్రచురించింది. ఇక సాజిద్‌ నదియావాలా దర్శకుడు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది...!
https://www.telugupost.com/movie-news/ఎన్టీఆర్-మహేష్-కన్నా-శర్-42323/
ఈ దసరా బరిలో ఎన్టీఆర్ 'జై లవ కుశ', మహేష్ బాబు 'స్పైడర్' లు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఈ దసరాకే ఫిక్స్ అయ్యి డేట్స్ కూడా అనౌన్స్ చేశాయి కూడా. అయితే ఈ రెండు చిత్రాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు ఓవర్సీస్ లో కూడా మంచి బిజినెస్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలతోపాటే మారుతీ డైరెక్షన్ లో శర్వానంద్ - మెహ్రీన్ లు జంటగా వస్తున్న 'మహానుభావుడు' చిత్రం కూడా ఈ దసరాకే రాబోతున్నట్టు చెబుతున్నారు. కానీ పక్కా సమాచారం అయితే లేదు.అయితే ఇప్ప్పుడు ఈ దసరాకి వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు 'జై లవ కుశ, స్పైడర్' ల కన్నా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ 'మహానుభావుడు' మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఎందుకంటే ఈ మధ్యన ఓవర్సీస్ లో చిన్న చిత్రాలైన 'ఫిదా, నిన్నుకోరి, అర్జున్ రెడ్డి' చిత్రాలు బయ్యర్స్ కి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు పెద్ద చిత్రాల కన్నా ఎక్కువగా 'మహానుభావుడు' చిత్రానికే ఓవర్సీస్ బిజినెస్ వర్గాలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయట. అందులోను మారుతీ ఈ మధ్యన ఏ గ్రేడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ కే ఓటెయ్యడంతో.. మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలకు ఇప్పుడు ఓవర్సీస్ లో గిరాకీ ఏర్పడింది.నాని ని మతిపరుపు కేరెక్టర్ లో పెట్టి 'భలే భలే మగాడివోయ్' అంటూ తెరకెక్కించిన ఆ చిత్రం సూపర్ హిట్ అవడం... ఇప్పుడు 'మహానుభావుడు' టీజర్ తోనే సినిమాపై మంచి అంచనాలు తీసుకురావడం వంటివాటితో మారుతి సినిమాలకు మంచి డిమాండ్ వచ్చేసింది. అంతేకాకూండా శర్వానంద్ చిత్రాలన్నీ ఓవర్సీస్ లో మంచి విజయాలు సాధించడంతోనే ఈ 'మహానుభావుడి' సినిమాపై అంచనాలు ఏర్పడడానికి కారణం అంటున్నారు. మరి మారుతీ - శర్వాల కాంబోలో వచ్చిన ఈ 'మహానుభావుడు' కూడా రెండు భారీ చిత్రాలని తట్టుకుని నిలబడగలదనే నమ్మకంతో ఉన్నారు ఓవర్సీస్ జనాలు. ఇప్పటికే 'మహానుభావుడు' ఓవర్సీస్ రైట్స్ కి మూడు కోట్లు పలికిందని టాక్ కూడా వినబడుతుంది.
https://www.telugupost.com/movie-news/sai-tei-next-movie-budget-123896/
త్వరలోనే సాయి ధరమ్ తేజ్..మారుతీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని గీత ఆర్ట్స్ వారు నిర్మించనున్నారు. వరస ఫ్లాపులతో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ డౌన్ అయింది. ఒకప్పుడు తేజు సినిమాలను 20 కోట్లు వరకు బిజినెస్ చేశాయేమో కానీ ఇప్పుడు మనోడి పరిస్థితి అలా లేదు. హిట్ హిట్ అని ప్రచారం చేసిన చిత్రలహరి సినిమాకే 14 కోట్లు షేర్ వచ్చిందంటే ఆలోచించవచ్చు మనోడి మార్కెట్ ఎంతలా పడిపోయిందో అని. ఈ తరుణంలో మెగా మేనల్లుడి కొత్త సినిమా మీద ఏకంగా పాతిక కోట్లు పెడుతున్నారట ఈ నిర్మాతలు. మారుతీ ఉన్నడులే అనుకుంటే అతనికి మార్కెట్ లేదు. తన లాస్ట్ టూ మూవీస్ శైలజారెడ్డి అల్లుడు, బాబూ బంగారం ఫ్లాపులు అయ్యాయి. మరి ఇంత బడ్జెట్ అంటే రిస్క్ అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఒకవేళ నిజంగానే ఈమూవీకి 25 వరకు ఖర్చయితే దానిని ఎంతకు అమ్ముతారు? శాటిలైట్ అండ్ ఇతర రైట్లు ఒక 5 కోట్లు వచ్చినా, సినిమాను 20 కోట్లకు అమ్మాలి. మరి ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి. ఈమూవీ సూపర్ హిట్ అయితే తప్ప తేజుకి ఈ కలెక్షన్స్ రావు.
https://www.telugupost.com/crime/a-fire-broke-out-in-delhis-chandni-chowk-a-fire-broke-out-in-the-bhagiradha-palace-market-and-the-shops-were-gutted-1450074
ఢిల్లీలోని చాందినీ చౌక్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భగీరధ ప్యాలెస్ మార్కెట్ లో అగ్నిప్రమాదం జరగడంతో షాపులు దగ్దమయ్యాయి. దాదాపు రెండు వందలకు పైగా దుకాణాలు అగ్నికి ఆహుతి అయినట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. పథ్నాలుగు అగ్నిమాపక యంత్రాలు పనిచేసి మంటలను అదుపులోకి తెచ్చాయి.రూ.400 కోట్ల నష్టం...చుట్టుపక్కలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఆస్తినష్టం కోట్లలోనే ఉంటుందని అధికారులు ప్రాధమిక అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక ఇతర మరేదైనా కారణం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా? అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. 400 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/mahesh-again-with-koratala-89342/
ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లేటెస్ట్ గా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని మూడవ షెడ్యూల్ కోసం రెడీగా ఉంది. అందుకుగాను టీం మొత్తం వచ్చే నెల అమెరికాకి వెళ్లనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు సాంగ్స్ కూడా చిత్రీకరించే అవకాశముంది. ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడనే విషయం తెలిసిందే.కొరటాల శివతో యాడ్ఇలా వరస సినిమాలు చేస్తూ మరో పక్క కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నాడు మహేష్. మహేష్ ఇప్పటివరకు చాలా యాడ్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని త్రివిక్రమ్ చేయగా మిగతావి బయట వ్యక్తులు చేశారు. అయితే ఇప్పుడు మహేష్ తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ తో ఓ కమర్షియల్ యాడ్ చేస్తున్నాడు. 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల డైరెక్షన్ లో మహేష్ ఓ కమర్షియల్ యాడ్ చేస్తున్నట్లు తెలిసింది.ఇంతకుముందు త్రివిక్రమ్ డైరెక్షన్ లో...మహేష్ కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ కొరటాల డైరెక్షన్ లో అభిబస్ యాడ్ చేయనున్నాడు. త్వరలోనే ఆ యాడ్ ను కొరటాల శివ చిత్రీకరించనున్నారు. గతంలో అభిబస్ యాడ్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడే అదే కంపెనీకి సంబంధించి రెండో యాడ్ ని కొరటాల డైరెక్ట్ చేయనున్నాడు.
https://www.telugupost.com/movie-news/pawan-as-hari-hara-viramallu-183710/
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఏకే రీమేక్ షూటింగ్ కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అటు రాజకీయాల పరంగా పంచాయితీ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న జనేసేన పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్ విషయంలో కోర్టుకు వెళ్ళింది. అయితే క్రిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని స్పెషల్ గా వేసిన గండికోట సెట్స్ లో జరుగుతుంది. క్రిష్ – పవన్ కళ్యాణ్ కాంబో టైటిల్ గా హరిహర వీరమల్లు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే మార్చ్ 11 మహా శివరాత్రి కి క్రిష్ మూవీ టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించింది టీం. మరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని టీం చెప్పిందో లేదో ఇలా క్రిష్ మూవీ షూటింగ్ నుండి పవన్ కళ్యాణ్ లుక్ లీకైంది. PSPK 27 లో పవన్ కళ్యాణ్ ఎలాంటి కేరెక్టర్ చెయ్యబోతున్నాడో.. ప్రస్తుతం పైన కనబడుతున్న లీక్డ్ పిక్ చూస్తే తెలుస్తుంది. వీరమల్లుగా పవన్ ఎలా ఉంటాడో అనేది ఈ పిక్ తో ఓ క్లారిటీ వచ్చేసింది. క్రిష్ సినిమాకు సంబంధించి కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ లీకెడ్ పిక్స్ లో పవన్ కళ్యాణ్ పాతబస్తీకి చెందిన పహిల్వాన్లతో కుస్తీ చేసే సీన్లు షూట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి హరిహర వీరమల్లు గా పవన్ ఎలా ఉండబోతున్నాడో అనేది మార్చి 11 వరకు సస్పెన్స్ లో పెట్టి ఊరిద్దామనుకున్న టీం కి ఇలా లీకుల రాయుళ్లు పవన్ లుక్ లీక్ చేసి షాకిచ్చారు. ప్రస్తుతం పవన్ – క్రిష్ కాంబో లీకెడ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
https://www.telugupost.com/movie-news/ఏమండోయ్-ఇది-విన్నారా-ప్ల-60147/
రెండేళ్ల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ తో హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకొచ్చిన రవితేజ టచ్ చేసి చూడుతో భారీ ప్లాప్ ని అందుకున్నాడు. మరి టచ్ చేసి చూడు తర్వాత రవితేజ ప్లాప్ హీరోల లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు. అయితే టచ్ చేసి చూడు తర్వాత రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోకుండా నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడని... దేనికి తగ్గడం లేదనే ప్రచారం జరిగింది. గతంలోనే రవితేజ నిర్మాతలకు చుక్కలు చూపించాడన్నారు. ఇప్పుడు టచ్ చేసి చూడు తర్వాత ఏమైనా డిమాండ్ తగ్గిస్తాడు అనుకుంటే... అబ్బే లేదు.. ఎప్పటిలాగే తన రెమ్యునరేషన్ విషయంలో గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. ఇక టచ్ చేసి చూడు సినిమా తర్వాత రవితేజ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక మూవీ, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో మూవీకి కమిట్ అవడమే కాదు... కళ్యాణ్ కృష్ణ మూవీని అప్పుడే పట్టాలెక్కించేసాడు. మరి కళ్యాణ్ కృష్ణ కి సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు హిట్ ఉండడంతో ఇప్పుడు రవితేజకి కళ్యాణ్ కృష్ణ హిట్స్ అదృష్టం కలిసొచ్చినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే... టచ్ చేసి చూడు భారీ డిజాస్టర్ తో రవితేజ క్రేజ్ తగ్గినా కళ్యాణ్ కృష్ణతో ఒక సినిమా చెయ్యడం వలన టచ్ చేసి చూడు సినిమా రిజల్టుతో సంబంధం లేకుండా రవితేజ కొత్త సినిమాకు ఒక భారీ ఆఫర్ ఇచ్చారట సన్ టీవి వారు. కళ్యాణ్ కృష్ణ - రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా శాటిలైట్ రైట్స్.... అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ కు గాను సన్ టీవీ వారు ఏకంగా 25 కోట్లు ఆఫర్ చేశారట. మరి రవితేజ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి డీల్ సెట్ అయితే సూపరే. మరి ఈసినిమా నిర్మాత రామ్ తాళ్ళూరి వెంటనే డీల్ కి ఓకె చెప్పేస్తే బావుంటుంది. లేకపోతె సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేస్తే గనక ఆ సినిమా టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా ఉన్నది.. ఉంచుకున్నది రెండు పోతుంది మరి.
https://www.telugupost.com/movie-news/allu-arjun-ala-vaikuntapuramlo-collections-5-150719/
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా వైకుంఠపురములో ఇద్దరు హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేసారు. సంక్రాంతి కి విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చాలా మంది దర్శకులు కమర్షియల్ సబ్జెక్టులతో సూపర్ హిట్స్ సాధించగా… బ్లాక్ బస్టర్స్ మరియు ఇండస్ట్రీ హిట్లను అందించడంలో త్రివిక్రమ్ తనదైన శైలిని తో ఆకట్టుకుంటున్నాడు.లాంగ్ రన్ లో అల వైకుంఠపురములో తెలుగు రాష్ట్రాల్లో 132.33 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 162.68 కోట్లు షేర్ ని కొల్లగొట్టింది. ఏరియా: క్లోసింగ్ బిజినెస్ (కోట్లు) నైజాం 44.80 సీడెడ్ 18.95 నెల్లూరు 4.80 కృష్ణ 11.02 గుంటూరు 11.78 వైజాగ్ 20.60 ఈస్ట్ గోదావరి 11.45 వెస్ట్ గోదావరి 8.93 టోటల్ ఏపీ & టీస్ షేర్: 132.33 కర్ణాటక 10.40 కేరళ 1.35 ఓవర్సీస్ 14.00 ఇతర ప్రాంతాలు 4.60 టోటల్ వరల్డ్ వైడ్ షేర్: 162.68
https://www.telugupost.com/movie-news/kerrthi-as-sister-171699/
చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు. చిరు ఎప్పుడొస్తాడో అని కొరటాల వెయిటింగ్. అయితే చిరు ఆచార్య తర్వాత మెహెర్ రమేష్ తో తమిళ వేదాళం రీమేక్ చేయబోతున్నాడు. ఇప్పటికే వేదాళం రీమేక్ స్క్రిప్ట్ పూర్తయ్యింది అని… చిరు అందులో మార్పులేమి చెప్పలేదని, కానీ బడ్జెట్ తగ్గించి సినిమా చెయ్యమని మాత్రం మేహేర్ కి సలహా ఇచ్చాడనే న్యూస్ నడుస్తుంది. అయితే ఈ వేదాళం రీమేక్ కోసం చిరంజీవి గుండు తో ఫోటో షూట్ కూడా చేయించుకున్నాడు. ఇక ఈ రీమేక్ లో చిరు కి చెల్లెలిగా సాయి పల్లవి నటించబోతుంది అనే న్యూస్ నడిచింది. అయితే యూనిట్ నుండి కానీ, సాయి పల్లవి నుండి కానీ స్పష్టత రాలేదు. హీరోయిన్ గా పీక్స్ లో ఉన్న సాయి పల్లవి చిరుకి చెల్లిగా ఒప్పుకుంటుందా అన్నారు. కానీ సాయి పల్లవి కేరెక్టర్ బావుంది అంటే ఒప్పేసుకుంటుంది… అని తెలిసిన విషయం కావడంతో అందరూ నమ్మారు. అయితే తాజాగా సాయి పల్లవి చిరు కి సోదరిగా వేదాళం రీమేక్ లో నటించడమనేది కేవలం రూమర్ అని, అసలు తనపై వస్తున్న ప్రచారానికి తెర దించాలని సాయి పల్లవి కూడా అనుకోలేదట. కారణం అలాంటి న్యూస్ పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని సన్నహితుల దగ్గర చెప్పినట్లుగా తెలుస్తుంది. మరో పక్క సాయి పల్లవి ని అనుకున్న కేరెక్టర్ లోకి ఇప్పుడు కీర్తి సురేష్ ని దింపుతున్నారు. అంటే చిరు సోదరి పాత్ర కోసం మహానటిని రామ్ చరణ్ అండ్ టీం సంప్రదించింది అంటున్నారు. మరి ఇది కూడా నిజమని నమ్మలేం ఎందుకంటే.. కీర్తి సురేష్ ప్రస్తుతం స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ మూవీస్ చేస్తున్న టైం లో చిరు కి సోదరిగా అంటే ఒప్పుకోకపోవచ్చు అంటున్నారు. సో ఇది కూడా ఫేక్ న్యూస్ అవుతుంది.
https://www.telugupost.com/movie-news/samantha-remuneration-in-u-turn-68396/
సమంత ఇప్పుడు 'రంగస్థలం' హిట్ తో ఫుల్ ఖుషీగా ఉంది. అలాగే 'మహానటి' సినిమా విడుదల కోసం వేచి చూస్తుంది. మరి 'మహానటి' సినిమాలోనూ సమంత పాత్రకి మంచి ప్రాధాన్యతే ఉన్నట్టుగా వుంది... 'మహానటి' ప్రమోషన్స్ చూస్తుంటే. ఎందుకంటే మధురవాణిగా జర్నలిస్ట్ పాత్ర చేస్తున్న సమంత మీదే 'మహానటి' ప్రమోషన్స్ ఉన్నాయి. సమంత, విజయ్ దేవరకొండ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి 'మహానటి' టీమ్ చాలానే ప్లాన్స్ చేస్తుంది. మరి 'మహానటి' కూడా హిట్ అయితే సమంత కి మరింత క్రేజ్ పెరగడం ఖాయం. ఇక ప్రస్తుతం సమంత తనకి ఎంతో ఇష్టమైన కన్నడ మూవీ రీమేక్ చేస్తుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన 'యు -టర్న్' మూవీ ని తెలుగులో సమంత హీరోయిన్ గా మెయిన్ లీడ్ లో రీమేక్ చేస్తుంది. మరి ఈ సినిమాని తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నంలో సమంత భర్త తో కలిసి వెళ్లిమరీ 'యు - టర్న్' హక్కులు తెచ్చుకుంది.ఈ సినిమాలో జర్నిలిస్ట్ గా నటిస్తున్న సమంత... ఈ సినిమా కోసం నయా పైసా తీసుకోవడం లేదట. వైవిధ్యభరితమైన సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మాతృక దర్శకుడే తెలుగు, తమిళ భాషల కు కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఓ మాదిరి బడ్జెట్, అంటే లో బడ్జెట్ తో రూపొందిస్తుండటం వలన..... ఈ సినిమాకి సమంత పారితోషికం తీసుకోవడం లేదట. పారితోషకం వద్దంది కానీ సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో వాటా కావాలని సమంత అడిగినట్టుగా చెబుతున్నారు. అయితే సినిమా తనకి బాగా నచ్చింది.. అలాగే ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యి హిట్ అవుతుందనే నమ్మకంతోనే సమంత ఇలా తన కి లాభాల్లో వాటా ఇమ్మని అడిగిందనే టాక్ వినబడుతుంది. అయితే సమంత అస్సలు పారితోషకం తీసుకోకుండా ఇలా లాభాల్లో వాటా అంటూ చేస్తున్న మొదటి సినిమా 'యు - టర్న్' కావడం విశేషం
https://www.telugupost.com/movie-news/chiranjeevi-vishwambhara-is-sister-sentiment-story-with-these-actress-1524770
Vishwambhara : 'అంజి' మూవీ తరువాత చిరంజీవి మరోసారి సోషియో ఫాంటసీ నేపథ్యంతో చేస్తున్న చిత్రం 'విశ్వంభర'. మల్టీ యూనివర్స్, పంచభూతాలు కాన్సెప్ట్ తో గ్రాఫికల్ వండర్ గా దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకేక్కిన్చాబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గురించి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్‌తో రాబోతుందట.ఈ సినిమాలో చిరంజీవికి మొత్తం ముగ్గురు చెల్లెళ్ళు ఉంటారట. చెల్లెళ్ళు కోసం అన్న చేసే పోరాటమే విశ్వంభర అని తెలుస్తుంది. ఇక చిరుకి చెల్లెళ్లుగా నటించబోతున్నది ఈ ముగ్గురే అంటూ ఓ ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతుంది. ఆ పిక్ లో హీరోయిన్ సురభి కూడా ఉంది. అయితే ఈ మూవీ నిజంగానే సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతుందో లేదో అనేది తెలియాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.Megastar Chiranjeevi Sister's #Vishwambara pic.twitter.com/Vh9S0BmZ8A— Milagro Movies (@MilagroMovies) March 9, 2024 మూవీలోని 70 శాతం షాట్స్ ని గ్రాఫిక్ తోనే చూపించబోతున్నారట. ఈక్రమంలోనే దాదాపు 13 సెట్స్ ని నిర్మించారట. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ లోని గ్రాఫిక్స్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేసాయి. మరి మూవీలో ఎలా ఉండబోతున్నాయో చూడాలి. కాగా ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక చిరుకి జోడిగా త్రిష నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
https://www.telugupost.com/movie-news/రుమర్-పై-స్పందించిన-ప్రి-53640/
ఎప్పుడు ఏదొ ఒక టాపిక్ తో సోషల్ మీడియాలో నానుతూ ఉంటుంది ప్రియాంక చోప్రా. రీసెంట్ గా ఈ అమ్మడు మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఈమె ఓ అవార్డ్ ఫంక్షన్ లో పెర్ఫామెన్స్ కోసం హెవీగా ఛార్జ్ చేసిందనే గాసిప్స్..... ఈ ప్రోగ్రాం కోసం అక్షరాలా 6 కోట్లు వసూల్ చేసిందని టాక్.ఓ ఈవెంట్ లో 6 నిమిషాల పాటు డాన్స్ ప్రదర్శన కోసం ఏకంగా ఆరు కోట్ల రూపాయలను ప్రియాంక చోప్రా వసూలు చేసింది. అంటే నిమిషానికి కోటి చొప్పున పారితోషికం పుచ్చుకుంటోందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పుడు ప్రియాంక చోప్రా స్పందించింది.నేను చెప్పేది ఏంటంటే.. '6 నిమిషాలు కాదు.. 12 నిమిషాల పాటు ఉండే ప్రదర్శన అది. నేను ఈ ప్రదర్శన కోసం బుర్జ్ ఖలీఫా పై నుంచి 700 మీటర్లు కిందకు జారాల్సి ఉంటుంది' అని చెప్పింది ప్రియాంక చోప్రా. అందుకే నేను అంత వసూలు చేశానని చెప్పకనే చెప్పింది కానీ.... ప్రియాంక రెమ్యూనరేషన్ గుట్టు మాత్రం విప్పలేదు
https://www.telugupost.com/movie-news/kalyanam-kamaneeyam-movie-trailer-out-now-1456000
టాలీవుడ్‌లో వరుసగా రొమాంటిక్, ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేస్తూ.. అతి తక్కువ కాలంలో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న హీరోల్లో సంతోష్ శోభన్ కూడా ఒకరు. సంతోష్ హీరోగా.. తాజాగా తెరకెక్కిన సినిమా కళ్యాణం కమనీయం. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఈ సంక్రాంతికే పెద్దసినిమాలకు పోటీగా బరిలోకి దిగనుంది. ప్రియా భవానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి చేతులమీదుగా రిలీజ్ అయింది.ట్రైలర్ మొత్తం పెళ్లి, రొమాన్స్ ను చూపించారు. సినిమా కథ ఏంటో ట్రైలర్ లోనే చూపించేశారు. ఉద్యోగం లేని ఓ యువకుడికి పెళ్లి, భార్య ఉద్యోగం చేసివస్తే.. ఇంట్లో ఖాళీగా కూర్చుంటాడు. అల్లుడికి సపోర్ట్ చేసే మామ. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత తన భర్త ఉద్యోగం చేయాలని కోరుకుంటుంది భార్య. ఆ విషయంలో వెనక్కి తగ్గదు. దాంతో భార్య కోసం హీరో ఎలాంటి పాట్లు పడ్డాడు. తన భార్య కోరినట్లుగా ఉద్యోగం చేశాడా.. లేక వేరే ఏదైనా పని చేస్తాడా.. ఈ క్రమంలో వారిమధ్య ఏర్పడే మనస్పర్థలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి. చివరకు వారిద్దరు మళ్లీ ఎలా కలుసుకుంటారు అనేది ఈ సినిమా కథగా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యువీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మించిన "కళ్యాణం కమనీయం" జనవరి 14న విడుదల కానుంది.
https://www.telugupost.com/movie-news/ఓం-నమో-వెంకటేశాయ-ఫస్ట్-డే-22819/
ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 0 .54సీడెడ్ 0 .26వైజాగ్ 0 .27ఈస్ట్ గోదావరి 0 .17వెస్ట్ గోదావరి 0 .23క్రిష్ణ 0 .09గుంటూరు 0 .37నెల్లూరు 0 .12రెస్ట్ ఆఫ్ ఇండియా &రెస్ట్ ఆఫ్ వరల్డ్ 0 .35ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 2 .40
https://www.telugupost.com/movie-news/tollywood-producer-natti-kumar-condemns-nani-comments-on-tickets-issue-1345203
ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది సినిమా టికెట్ల అంశమే. ఈ విషయమై నేచురల్ స్టార్ నాని స్పందించిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్ల కంటే కిరాణా షాపుల కలెక్షన్లే బాగున్నాయని, టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సముచితం కాదని నాని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ తప్పుబట్టారు. నానికి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. నాని కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని నట్టికుమార్ పేర్కొన్నారు.క్షమాపణలు చెప్పాలి..సినిమా టికెట్ల రేట్లు, వసూళ్లు, షేర్ వంటి విషయాలపై నానికి కనీస అవగాహన లేదని విమర్శించారు. ఈ అంశంపైనే తాము ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్న ఆయన.. మరోవైపు కోర్టులోనూ ఈ వ్యవహారం నడుస్తోందని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో నాని చేసిన వ్యాఖ్యల ప్రభావం మిగతా సినిమాలపై పడుతుందన్నారు. నాని ఏపీ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ.. క్షమాపణలు చెప్పాలని నిర్మాత నట్టికుమార్ డిమాండ్ చేశారు.
https://www.telugupost.com/top-stories/station-ghanpur-mla-rajaiah-is-getting-involved-in-some-controversy-every-time-1466714
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రతి దఫా ఏదో వివాదంలో చిక్కుకుంటున్నారు. తొలి దఫా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవి, వైద్య ఆరోగ్య వంటి ప్రతిష్టాత్మకమైన శాఖను కేసీఆర్ ఇచ్చినా రాజయ్య అది నిలుపుకో లేకపోయారు. అవినీతి ఆరోపణలతో ఆయన మంత్రివర్గం నుంచి తొలిసారి బర్త్‌రఫ్ అయ్యారు. అయినా 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టిక్కెట్ ను తిరిగి రాజయ్యకే కేసీఆర్ కేటాయించారు. కానీ అది కూడా ఆయన నిలుపుకోలేని బలహీన పరిస్థితికి వెళ్లిపోయారు. ఒక మహిళ సర్పంచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడటం నిజంగా సిగ్గుచేటు. అయితే ఆ వివాదాన్ని పెద్దల జోక్యంతో పరిష్కరించుకున్నా రాజయ్యకు మాత్రం ఆ మచ్చ తొలిగే ఛాన్స్ ఉండకపోవచ్చు. నాలుగుసార్లు గెలిపించి...నిజానికి రాజయ్య లాంటి నేతకు రెండోసారి మంత్రివర్గంలోనైనా కేసీఆర్ స్థానం కల్పించి ఉండాల్సిందన్న కామెంట్స్ నిన్న మొన్నటి వరకూ వినిపించాయి. కానీ దళిత మహిళ సర్పంచ్ పట్ల ఆయన అనుసరించిన వైఖరితో ఆ మాత్రం సానుభూతి కూడా తుడుచు పెట్టుకుపోయింది. స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలు రాజయ్యను గుండెలో పెట్టుకున్నారు. వరసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. 2009, 2012 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో రాజయ్య వరసగా గెలిచారు. అంటే నాలుగు సార్లు ఆయన ప్రజామోదం పొందారు. ప్రజలు అలా ఆదరించినప్పుడు ఎలా వ్యవహరించాలి? అందరిని కలుపుకుని వెళ్లాలి. ఎవరినీ నొప్పించకూడదు. వీలయితే ప్రత్యర్థులను సయితం ఆకట్టుకోవాలి. ఎన్నికల ఏడాది కావడంతో...కానీ జానకీపురం సర్పంచ్ నవ్య విషయంలో రాజయ్య వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన. దళిత మహిళ సర్పంచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడటం క్షమించరాని నేరం. అయితే ఇది ఎన్నికల ఏడాది కావడంతోనే రాజయ్య దిగివచ్చారన్నది అనేక మంది మాట. పార్టీ హైకమాండ్ కూడా మొట్టికాయలు వేయడంతో రాజయ్య హడావిడిగా సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి క్షమించాలని వేడుకోవాల్సి వచ్చింది. తాను తెలియక చేసిన తప్పును క్షమించాలని కోరారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని, తాను తప్పు చేశానని భావిస్తే మహిళలందరూ క్షమించాలంటూ రాజయ్య వేడుకోవాల్సిన పరిస్థిత తలెత్తింది. నిజానికి ఈ వి‍షయంలో దళిత సర్పంచ్ నవ్యను అభినందించి తీరాల్సిందే. శభాష్ నవ్యా...సొంతపార్టీ అని కూడా చూడకుండా సాక్షాత్తూ ఎమ్మెల్యేపైనే ఆమె పోరాటానికి దిగారు. నవ్య వద్ద పూర్తి ఆధారాలుండటంతోనే రాజయ్య తలవొంచక తప్పని పరిస్థితి వచ్చిందనేవాళ్లు లేకపోలేదు. ఈ విషయాన్ని నవ్య తన గ్రామ అభివృద్ధికి టర్న్ చేయడం కూడా అందరి ప్రశంసలను అందుకుంటుంది. తన గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలంటూ మీడియా ముందే రాజయ్యను కోరడంతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాకుండా జానకీపురం గ్రామానికి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే మంజూరు చేయడం కూడా ప్రశంసలు అందుకుంది. జానకీపురంలోనే రామాయణ గాధలో సీత గుర్తుకు రాలేదా? అన్న ప్రశ్నలు కూడా రాజయ్యకు ఎదురవుతున్నాయి.రాజకీయాల్లోకి వచ్చిన మహిళలను చులకనగా చూసే వారికి రాజయ్య ఘటన ఒక గుణపాఠంగా చెప్పాలి.
https://www.telugupost.com/crime/young-man-died-while-taking-selfie-at-railway-track-1369525
శంషాబాద్ : సెల్ఫీ సరదా ఎంతో మందికి ఊహించని ప్రమాదాలను తెచ్చిపెట్టింది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం.. అయినా కూడా కొందరు అసలు పట్టించుకోరు. తమ పిచ్చిలో తాము ఉంటామని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటి వలన ప్రాణాలే కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఏవైనా ఎత్తైన ప్రదేశాల వద్ద సెల్ఫీలు తీసుకోవాలని ప్రయత్నిస్తూ జారిపడి పోయిన వాళ్ల శవాలు కూడా దొరకని పరిస్థితుల గురించి మనం వార్తల్లో చదివే ఉంటాం. ఇంకొందరు ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ఘోరమైన చావును కూడా చవి చూసి ఉంటారు. అలాంటి విషయాలు కూడా తెలుసు. అయితే ఓ యువకుడు రైల్వే పట్టాలపై సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.సెల్ఫీ సరదా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓ యువకుడి ప్రాణాలను తీసింది. రైల్వే పట్టాలపై సెల్ఫీ వీడియో తీసుకుంటున్న అరుణ్ కుమార్ అనే యువకుడిని ఢీకొట్టింది రైలు. దీంతో ఘటనా స్థలంలోనే సదరు యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. సంఘటనా స్థలంలోనే సదరు యువకుడు మృతి చెందాడని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
https://www.telugupost.com/movie-news/anand-devarakonda-shivatmika-dorasani-movie-124149/
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తొలి చిత్రం, యాంగ్రీ హీరో రాజశేఖర్ రెండో అమ్మాయి శివాత్మిక డెబ్యు మూవీగా రూపొందిన చిత్రం దొరసాని యొక్క టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. ఇందులో రాజుగాడు(ఆనంద్ దేవరకొండ)తన స్నేహితులతో కలిసి రోజులు గడుపుతూ ఉంటాడు. తొలి చూపుతూనే ఓ పెద్దింటి అమ్మాయి ని దేవకీ(శివాత్మిక) పై మనసు పారేసుకుంటాడు. ఆమెను ఫాలో అవుతున్న తరణంలో ఆమె కూడా ఈ కుర్రోడి ప్రేమలో పడుతుంది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరిని ఒకరు వదిలి ఉండలేని స్థితికి వస్తారు. విషయం బయటపడుతుంది. రాజు ప్రాణాల మీదకు వస్తుంది. మరి ఆ తరువాత ఏమైంది అనేది సినిమా. ఇందులో ఆనంద్ దేవరకొండ లేతగా పల్లెటూరి కుర్రాడిగా ఒదిగిపోయాడు. అలానే శివాత్మిక లుక్స్ లో దొరసానిని తలపించింది. టీజర్ లో మంచి నేటివిటీ ఫీల్ కలిగించారు. స్టోరీ లైన్ పాతది అయినప్పటికీ ట్రీట్ మెంట్ పరంగా చూపించిన ఫ్రెష్ నెస్ కనెక్ట్ అయ్యేలా అనిపిస్తోంది. కెవిఅర్ మహేంద్ర దర్శకత్వం తెరకెక్కిన ఈమూవీ కి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు. సురేష్ బాబు-యష్ రంగినేని-మధుర శ్రీధర్ సంయుక్తంగా ఈమూవీని నిర్మించారు.
https://www.telugupost.com/movie-news/keerti-suresmh-over-weight-problems-89914/
నిన్నగాక మొన్న నటి కీర్తి సురేష్ కి అవకాశాలు తగ్గిపోయి డిప్రెషన్ లో ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. మహానటితో మెస్మరైజ్ చేసిన కీర్తి సురేష్ తన బరువు కారణంగా అవకాశాలు కోల్పోతుందని టాక్ మొదలైంది. టాలీవడ్ అజ్ఞాతవాసి సినిమా టైం కే కీర్తి సురేష్ బాగా బరువు పెరగడం.. మహానటి లో కొంత సమయం సన్నగా అందంగా కనిపించినప్పటికీ.. కొన్ని సీన్స్ లో బాగా లావుగా కనబడింది. అయితే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ సరిగ్గా అతికినట్టుగా యుక్తవయసు నుండి.. అవసాన దశ వరకు సరిపోయింది. కానీ మహానటి తరవాత తెలుగులో అవకాశాలు లేకే అమ్మడు కోలీవుడ్ కి వెళ్లిందనేది లేటెస్ట్ న్యూస్. కోలీవుడ్ లో మహానటి కి ముందే రెండు మూడు సినిమాలకు సైన్ చేసిన కీర్తి సురేష్ కి అప్పుడే ఆ సినిమా ల షూటింగ్స్ దగ్గర పడ్డాయి. ఇప్పటికే విక్రమ్ సరసన హరి డైరెక్షన్ లో సామి 2 సినిమాలో కీర్తి సురేష్ నటించింది. ఆ సినిమాలో కీర్తిసురేష్ నటించడం వలనే తెలుగులో భారీ క్రేజ్ ఏర్పడు తెలుగు డబ్బింగ్ హక్కులు భారీ రేటు పలికినట్టుగా ప్రచారం జరిగింది.మరి శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామి స్కర్ సినిమాకి కనీసం తెలుగులో యావరేజ్ టాక్ కూడా రాలేదు. సామి సినిమాకి సీక్వెల్ గా చేసిన ఈ సినిమా లో ఎలాంటి కొత్తదనం లేదంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇక హీరో విక్రమ్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకున్నాడు కానీ.. ఆ పాత్ర సినిమాలో తేలిపోయిందంటున్నారు. కథలో బలం లేకపోవడం, హరి డైరెక్షన్ మైనస్ ఇలా అన్నిటి వలన సినిమాకి యావరేజ్ టాక్ పడడం.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ వలన కూడా సినిమాకి మైనస్ అనే టాక్ వినబడుతుంది. విక్రమ్ తో లవ్ ట్రాక్ మరియు విలన్ హీరోని బెదిరించడం కోసం తప్ప ఇంకెందుకు కీర్తి సురేష్ ఈ సినిమాకి ఉపయోగపడలేదు. మహానటి చూసిన కళ్ళతో ఇందులో దియా పాత్రలో కీర్తి సురేష్ ని ఒప్పుకోవడం కష్టం. పైగా బొద్దుగా మారి ఇబ్బందిగా కదలడం ప్రేక్షకుడి కి చిరాకు పుట్టించింది.చక్కనమ్మ బొద్దుగా మారితే కష్టమే. హీరోయిన్స్ కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ సన్నగా నాజూగ్గా ఉండడమే. కానీ కీర్తి సురేష్ నటనతో నెట్టుకొస్తూ.. బరువుని గాలికొదిలెయ్యడం ఆమె కెరీర్ కే ప్రమాదం. సామి 2 సినిమాలో పాటల్లో అయితే కీర్తి సురేష్ విక్రమ్ కన్నా లావుగా కనబడుతూ ఎబ్బెట్టుగా ఉండడం... ఆమె పర్సనాలిటీ మీద బోలెడన్ని కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే అవకాశాలు తగ్గిపోతుంటే.. ఇప్పుడు ఈ బరువు వలన వచ్చే అవకాశాలు కూడా రావడం కష్టమనే వాదన రేజ్ అవుతుంది. కీర్తి కాస్త ఆలోచించమ్మా.
https://www.telugupost.com/movie-news/weak-collections-for-check-183912/
ఈ శుక్రవారం రిలీజ్ అయిన మూవీస్ లో చెప్పుకోదగ్గ మూవీ నితిన్ – చంద్ర శేఖర్ యేలేటి కాంబోలో తెరకెక్కిన చెక్ మూవీ ఒక్కటే. చెక్ రిలీజ్ కి ముందు నుండి కూడా నితిన్ రంగ్ దే కున్న క్రేజ్ చెక్ మూవీ కి లేకుండా పోయింది. ప్రోపర్ బజ్ క్రియేట్ అవ్వలేదు. చెక్ మూవీ కి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో అనుకున్న ఓపెనింగ్స్ కూడా రాలేదు. కేవలం ఫస్ట్ డే మూడు కోట్లతో చెక్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో రోజు అంటే ఈ శనివారం.. మొదటి రోజు కలెక్షన్స్ తో పోలిస్తే సగానికి సగం పడిపోయింది. అంటే కేవలం ఒకటిన్నర కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మూడో రోజు అంటే సండే మాత్రం మ్యాగ్జిమమ్ చెక్ మూవీకి ఓ రెండు కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ త్రీ డేస్ తోనే ఎండ్ అయిపోయినట్టే. అంటే చెక్ మూవీ థియేట్రికల్ రన్ ఈ వీకెండ్ తో ఎండ్ అయిపోయినట్లే. కానీ చెక్ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 16 కోట్లు రావాల్సి ఉంది. కానీ చెక్ మూవీ ఈ వీకెండ్ తో కలెక్షన్స్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చేలా ఉంది. అటు డిస్ట్రిబ్యూటర్స్, ఇటు నిర్మాతలకు కూడా భారీ నష్టాలను చెక్ చవి చూపించబోతుంది.
https://www.telugupost.com/movie-news/rajanikanth-kaala-71206/
సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తోన్న తాజా చిత్రం కాలా. ర‌జ‌నీకాంత్ గ‌త చిత్రం క‌బాలి ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన కబాలి ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయి బ‌య్య‌ర్ల‌ను నిండా ముంచేసింది. అయితే అదే ద‌ర్శ‌కుడికి ర‌జ‌నీ అనూహ్యంగా వెంట‌నే మ‌ళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబోలో కాలా వ‌స్తోంది. ముంబైలోని పెద్ద మురికివాడ అయిన ధార‌వి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.పూర్తయిన సెన్సార్....ఏప్రిల్ 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా ప‌డి ఎట్ట‌కేల‌కు జూన్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టికే సెన్సార్ కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న కాలా ర‌న్ టైం కాస్త టెన్ష‌న్ పెడుతోంది. కాలా రన్ టైమ్ 2 గంటల 45 నిముషాలుగా ఉంటుందని తెలుస్తోంది. అంటే ఓవ‌రాల్‌గా 165 నిమిషాల నిడివి.భారీ ధరలు పలికిన హక్కులు....ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా జూన్ 7వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ ఓవ‌రాల్ రైట్స్ ను లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ రూ.125 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ స్వ‌యంగా నిర్మించిన ఈ సినిమాలో నానా పటేకర్, హుమా ఖురేషి, ఈశ్వరి రావులు కీలక పాత్రల్లో నటించారు.అంచనాలు ఏవి..?ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై ఎలాంటి అంచ‌నాలు పెంచ‌లేదు. ఇంకా చెప్పాలంటే ర‌జ‌నీ సినిమా వ‌స్తుందంటే ఉండే అంచ‌నాల్లో ప‌దో వంతు అంచ‌నాలు, హ‌డావిడి కూడా కాలాకు లేదు. ఇక సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా ప్రేక్ష‌కుడు బోర్ ఫీల‌వుతాడు. క‌బాలి మాఫియా నేప‌థ్యం, ఇప్పుడు కాలా కూడా అదే లైన్‌తో రావ‌డం, అంచ‌నాలు లేక‌పోవ‌డంతో మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.
https://www.telugupost.com/movie-news/nagababu-comments-on-jabardast-and-mallemala-productions-141782/
ఈమాటన్నది ఎవరో కాదు… జబర్దస్త్ జడ్జ్ స్థానం నుండి బయటికొచ్చి… వారానికో వీడియో చొప్పున వదులుతూ.. జబర్దస్త్ పై కామెంట్స్ చేస్తున్న నాగబాబు. జబర్దస్త్ నుండి బయటికెళ్ళాక మల్లీ జబర్దస్త్ గురించి కెలుకుతున్న నాగబాబు ఇప్పుడు మల్లెమాల టివి జబర్దస్త్ కమెడియన్స్ ని బెదిరిస్తుందని చెబుతున్నాడు. జబర్దస్త్ సక్సెస్ కి కారణం కేవలం నితిన్ – భరత్ లే అని పాత పాటే పాడుతున్నడు. వారు జబర్దస్త్ ని వీడిన తర్వాత జబర్దస్త్ కి కళ పోయిందంటున్నాడు, క్రియేటివ్ మైండ్ ఉన్న, టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేయాలని మల్లెమాల టీం చూసిందని, అందులో భాగంగానే నితిన్ – భరత్ లను నడి రోడ్డు మీద నిలబెట్టారని చెబుతున్నాడు నాగబాబు. వాళ్ళనలా అన్యాయం చేసినందుకే నేను కూడా వాళ్లతో బయటికి రావాల్సి వచ్చిందని, వాళ్ళని ఏదైనా ఛానల్ లో కొత్త షో పెట్టండి మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పానని.. అది, అనసూయ లాంటి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసారని, అలాగే నాతో పాటుగా చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్ బయటికి వచ్చేసినా. అది, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్ళు జబర్దస్త్ ని వదలకుండా అగ్రిమెంట్ అంటూ మల్లెమాల బెదిరించడం వల్లనే వాళ్ళు బయటికి రావడం లేదని సంచలన విషయాలు జబర్దస్త్ గురించి నాగబాబు బయటపెట్టాడు. అసలు జబర్దస్త్ కామెడీ షోలో చాలా రాజకీయాలు నడుస్తున్నాయని, అక్కడ జరిగే రాజకీయాలన్నీ నాకు తెలుసని, ఆ చెత్త జబర్దస్త్ రాజకీయాల వలన చాలామంది నష్టపోయారని చెప్పి జబర్దస్త్ మీద మొదట పాజిటివ్ గా మాట్లాడిన నాగబాబు.. చివరి ఎపిసోడ్ లో మాత్రం జబర్దస్త్ ని కడిగిపారేసాడు
https://www.telugupost.com/movie-news/బిగ్-బాస్-అంటే-ఆ-మాత్రం-ఉం-58919/
బిగ్ బాస్ షో బాలీవుడ్ సక్సెస్ అయ్యి టాలీవుడ్ కి పాకింది. కోలీవుడ్ లో కూడా వచ్చినప్పటికి అక్కడ సక్సెస్ కాలేదు. టాలీవుడ్ లో ఎన్టీఆర్ హోస్ట్ చేయటం వలన మరింత సక్సెస్ అయింది ఈ షో. అయితే బిగ్ బాస్ ఈసారి నిర్వాహకులు హంగామాను కాస్త ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.ఈ ఏడాది జూన్ లో స్టార్ట్ అయ్యే ఈ షోకి ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసారు. మొదటి సీజన్ పది వారలు పాటు సాగింది. ఐతే ఈసారి 14 వారాలు పాటు ఈ షో కోనసాగనుంది. మల్లి ఈ సీజన్ కి కూడా ఎన్టీఆర్ ఏ హోస్ట్ చేయనున్నాడు. మొదటి సీజన్ షూటింగ్ టైంలో అటు జైలవ కుశ షూటింగ్ ఇటు బిగ్ బాస్ షూటింగ్ ఒకేసారి కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అలానే త్రివిక్రమ్ సినిమాలో చేస్తూ ఇటు బిగ్ బాస్ సీజన్ 2 ను ఎన్టీఆర్ ఫినిష్ చేయనున్నాడు.మొదటి సీజన్ కంటే ఈసారి ఎక్కువ మంది తారలు ఉన్నట్టు తెలుస్తుంది. డిమాండ్ పెరగడంతో కొన్ని రికమండేషన్స్ కూడా నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఎవరిని నిర్ణయిస్తారో అనేది షో స్టార్ట్ అయ్యే దాక చెప్పలేం. ఈసారి హైదరాబాద్ లోనే సీజన్ 2 సెట్ వేయనున్నారు.
https://www.telugupost.com/movie-news/2-0-collections-5-101048/
రజినీకాంత్ 2.0 సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసినంత సేపు లేదు 2.0 థియేటర్స్ లో దిగడం.. యావరేజ్ టాక్ తెచ్చుకోవడానికి. అసలు 2.0 సినిమానే దర్శకధీరుడు రాజమౌళి తీసిన సినిమా బాహుబలిని తలదన్నే సినిమాగా అభివర్ణించడం, బాహుబలి మూవీ కి పోటీగా 2.0 నే నిలుస్తుందని... 2.0 విడుదలయ్యేవరకు గట్టిగా ప్రచారం జరిగింది. కానీ 2.0 విడుదలయ్యాక బాహుబలి కొట్టే సీన్ లేదని తేలిపోయింది. 2.0 గురువారం విడుదలవడంతో ఫస్ట్ వీకెండ్ హౌసేఫుల్ కలెక్షన్స్ తో నడిచినా.... సోమవారం నుండి 2.0 కలెక్షన్స్ అన్నిచోట్లా డ్రాప్ అయ్యాయి. ఒక్క హిందీ లో తప్ప. బాలీవుడ్ లో 2.0 విడుదలైన నాటినుండి మంచి కలెక్షన్స్ తోనే దూసుకుపోతుంది. అక్కడ పదిరోజుల్లోనే 150 కోట్లు కొల్లగొట్టి... బ్రేక్ ఈవెన్ కి చేరుకోగా.. తాజాగా తెలంగాణ నైజం లోను 2.0 అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇక తమిళనాట మాత్రం 2.0 బయ్యర్స్ కి కష్టలు తప్పవనే న్యూస్ గతవారమే స్ప్రెడ్ అయ్యింది. అక్కడ బ్రేక్ ఈవెన్ కి రావడం దేవుడెరుగు... చివరికి పెట్టిన పెట్టుబడిలో సగం వచ్చిన చాలన్నారు. అయితే హిందీ, తెలంగాణ, ఓవర్సీస్ లో 2.0 హావ సాగినట్టుగా తాజాగా తమిళనాట చెన్నై లోను 2.0 కలెక్షన్స్ అదురుతున్నాయి. చెన్నై లో 2.0 చిత్రం దాదాపుగా 19 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 ని దాటేసింది.మరి ఇంతకుముందున్న భరత్ అనే నేను, బాహుబలి, సర్కార్ ఇలా చాలా సినిమాల రికార్డుని 2.0 నామరూపాలు లేకుండా చెరిపెయ్యబోతుంది. ఇక ప్రస్తుతం 19 కోట్లు గ్రాస్ దాటినా 2.0 లాంగ్ రన్ లో 25 కోట్లు వసూలు చేసి హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని.. ప్రస్తుతం 2.0 చెన్నై రికార్డులను తలదాన్నలంటే మళ్ళీ ఏ బాహుబలి లాంటి మూవీ నో రావాలంటున్నారు. మరి ఎక్కడా బాహుబలిని మట్టికరిపించలేకపోయిన 2.0 చెన్నై లో మాత్రం మట్టికరిపించిందనే చెప్పాలి. 2.0 ఫస్ట్ వీకెండ్ లో దూసుకుపోయింది వీక్ డేస్ లో వీక్ అవడం, అన్ని భాషల్లోనూ రెండో వారంలో మంచి సినిమాలు లేకపోవడంతో.. 2.0 రెండో వారంలో పుంజుకుని కలెక్షన్స్ పెంచుకుంది
https://www.telugupost.com/movie-news/akhil-as-mr-majnu-96321/
అక్కినేని అఖిల్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మిస్టర్‌ మజ్ను'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, నవంబర్ 7న‌ దీపావళి పర్వదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అఖిల్‌ కొత్త స్టిల్‌ను, పోస్టర్‌ను విడుదల చేశారు. అఖిల్‌ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/no-iisue-acting-with-ex-lover-160072/
టాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న రష్మిక మందన్న కన్నడ నుండి టాలీవుడ్ కి వచ్చిన భామ. టాలీవుడ్ కి రాకముందే రష్మిక కన్నడ కిర్రాక్ పార్టీ ద్వారా హిట్ కొట్టడం ఆ సినిమా హీరో రక్షిత్ తో ప్రేమలో పది ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. కానీ టాలీవుడ్ లో రష్మిక సక్సెస్ బాట పట్టాక రక్షిత్ తో బ్రేకప్ చేసుకుంది. దానితో రక్షిత్ అభిమనులు రష్మికని దుమ్మెత్తిపోసారు. అయినా రక్షిత్ రష్మిక తన మాజీ లవర్ అయినా తనకు నాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది అన్నాడు. అయితే అతడే శ్రీమన్నారాయణతో అంతగా సక్సెస్ కానీ రక్షిత్ శెట్టి ఇప్పుడు కిర్రాక్ పార్టీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే కిర్రాక్ పార్టీ కి పనిచేసిన వారే సీక్వెల్ లో ఉంటారని రక్షిత్ అనడం, హీరోయిన్ గా రశ్మికని కాకుండా వేరే హీరోయిన్ ని తీసుకుందామని చెప్పిన.. కిర్రాక్ పార్టీ నిర్మాతలు మాత్రం రష్మిక ఉంటేనే సీక్వెల్ కి క్రేజ్ వస్తుంది అని చెబుతున్నారట, అయితే ఈ విషయం తెలిసిన రష్మిక రక్షిత్ తో కిర్రాక్ పార్టీ సీక్వెల్ లో నటించేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. అయితే అక్కడ రక్షిత్ ని రష్మిక తో కలిసి పని చేసేందుకు ఒప్పించే పనిలో నిర్మతలు ఉన్నారట.
https://www.telugupost.com/crime/progress-in-rajeshs-death-case-here-is-the-full-details-of-rajesh-and-teacher-deaths-1478814
హయత్ నగర్ లో మే 29వ తేదీన కుళ్లిపోయిన స్థితిలో రాజేష్ (25) అనే యువకుడి మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. అతనిది హత్యా ? లేక ఆత్మహత్య? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా.. ఓ ఉపాధ్యాయురాలితో ఉన్న సంబంధం బయటపడింది. అప్పటికే ఆమె కూడా చనిపోవడంతో.. రెండుకేసుల దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ ఇద్దరి మరణాల వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు. రాజేష్, ఉపాధ్యాయురాలు (45) కలిసే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన ఎల్లావులా పరశురాములు, విజయ దంపతుల కుమారుడైన రాజేష్ (25) కుంట్లూర్ డాక్టర్స్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్థారించారు. ప్రేమించిన టీచర్ తనను నమ్మించి, పెళ్లికాలేదని మోసం చేయడాన్ని భరించలేక రాజేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరు నెలల క్రితం ఓ మిస్డ్ కాల్ ద్వారా ఆమెకు రాజేష్ తో పరిచయం ఏర్పడింది. ఆమె వాట్సాప్ అకౌంట్ కి ఉన్న ఫొటో చూసి రాజేష్ ప్రేమలో పడ్డాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు.రాజేష్ తనకు కూడా నచ్చడంతో.. ఓకే చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్, నల్గొండ ప్రాంతాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. టీచర్ ను పెళ్లి చేసుకోవాలని భావించిన రాజేష్ కు.. ఆమెకు పెళ్లై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలియడంతో ఆమెను దూరం పెట్టాడు. అటు కుటుంబాన్ని వదులుకోలేక, ఇటు రాజేష్ దూరం పెట్టడాన్ని తట్టుకోలేక ఓ రోజు మాట్లాడుకుందాం రమ్మని చెప్పడంతో ఇద్దరూ కలుసుకున్నారు. తామిద్దరం కలిసి జీవించలేమని భావించిన టీచర్, రాజేష్ లు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.మే 24వ తేదీన ఇద్దరూ కలిసి ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో పురుగులమందు కొనుగోలు చేశారు. ఇద్దరూ కలిసి చనిపోదామని శివారు ప్రాంతానికి వెళ్లాలనుకున్నారు. ఆఖరిసారి తన పిల్లల్ని చూసి వస్తానని టీచర్ హయత్ నగర్ లోని తన ఇంటికి వెళ్లింది. కాసేపు కూతురు, కొడుకుతో గడిపి వెంటతెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అదేరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తిరిగివస్తానని ఇంటికి వెళ్లిన టీచర్‌ ఎంతకీ రాకపోవటంతో రాజేశ్‌ ఆమె వాట్సాప్‌ కు వరుసగా మెసేజ్ లు పంపాడు. ఫోన్ కాల్స్ చేశాడు. అవన్నీ చూసిన టీచర్ కూతురు వాటిని తన తమ్ముడికి చూపింది. రాజేశ్‌ ఉన్న ప్రాంతానికి వెళ్లి మందలించాడు. తాను ప్రేమించిన టీచర్‌ మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న రాజేశ్‌.. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగిన తర్వాత శరీరం మంటగా అనిపించడంతో అతను దుస్తులు తీసేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/krack-director-complaint-181343/
రవితేజ క్రాక్ సినిమా జనవరి 9 న విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ లిస్ట్ లో చేరింది. 18 కోట్లు థియేట్రికల్ రైట్స్ కి గాను.. బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాలు కొల్లగొట్టింది. సంక్రాంతి పండగకి విడుదలైన మూడు సినిమాలకన్నా రవితేజ క్రాక్ సినిమాకే ప్రేక్షకులు జై కొట్టారు. ఈ సంక్రాంతి విన్నర్ క్రాక్ సినిమానే ఇది ఎవరూ కాదనలేని నిజం. లాక్ డౌన్ లో సినిమాకి ఎన్ని ఓటిటి ఆఫర్స్ వచ్చినా దర్శకుడు గోపీచంద్ పట్టుబట్టి థియేటర్స్ లోనే విడుదల చేయించిన క్రాక్ సినిమా వలన ఇప్పుడు ఆ దర్శకుడే ప్రోబ్లెంస్ ఫేస్ చేస్తున్నాడు. కారణం క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు.ఠాగూర్ మధు గతంలో ఠాగూర్ సినిమా సెంటిమెంట్ తో ఆయన తర్వాత నిర్మించిన సినిమాలు టైగెర్, విన్నర్, మిస్టర్, స్పైడర్ వరసగా నాలుగు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ఆ నాలుగు సినిమాలు ఠాగూర్ మధుకి కరెక్ట్ ఝలక్కే ఇచ్చాయి. అయితే ఇప్పుడు క్రాక్ సినిమా కి లాక్ డౌన్ లో ఓటిటి ఆఫర్స్ కి నిర్మాత ఠాగూర్ మధు టెంప్ట్ అయినా.. దర్శకుడు గోపీచంద్ మలినేని గట్టిగా పట్టుబట్టి సినిమా రిలీజ్ తర్వాతే తన రెమ్యునరేషన్ తీసుకుంటాను అంటూ థియేట్రికల్ రిలీజ్ మీద చాలా కాన్ఫిడెన్స్ చూపించాడు. ఇక థియేటర్స్ లో క్రాక్ విడుదలయ్యే ముందు కూడా ఠాగుర్ మధు క్రాక్ ని టైం కి రిలీజ్ చెయ్యలేకపోయాడు.జనవరి 9 న రిలీజ్ అంటే క్రాక్ మార్నింగ్ షోస్ పడలేదు. లేట్ గా క్రాక్ సినిమా రిలీజ్ అయినా కూడా సంక్రాంతి సినిమాల మీద పోటీ పడి తన దమ్ము చూపించుకుని కలెక్షన్స్ రాబట్టుకున్న సినిమా క్రాక్ అని తేలింది. సంక్రాంతి సినిమా క్రాక్ సినిమానే. అప్పుడు అంత నమ్మకంతో సినిమా మీద ఉన్న దర్శకుడు గోపీచంద్ తనకు రావాల్సిన బకాయిల కోసం కంప్లైంట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడమనేది కరెక్టేనా? ఎందుకంటే లాభాలు జేబులో వేసుకున్న ఠాగూర్ మధు క్రాక్ డైరెక్టర్ కి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వలేదట. అడిగితే పట్టించుకోవడం లేదట. అందుకే దర్శకుడు గోపీచంద్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెట్లు ఎక్కితే.. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువే అయ్యింది.. దానికి ఈ ఎగ్గొట్టిన దానికి లెక్క సరిపోయింది అంటూ అడ్డంగా వాదిస్తున్నాడట క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు. మరి హిట్ ఇచ్చిన దర్శకుడిని ఇలా పారితోషికం విషయంలో ఇబ్బందులు పెట్టడం ఎంత వరకు కరెక్ట్..
https://www.telugupost.com/crime/phd-scholar-victor-james-raja-sentenced-five-life-imprisonment-for-sexually-assaulting-eight-minors-1543395
తమిళనాడులోని తంజావూరులో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడి, డబ్బు సంపాదించేందుకు వీడియోలు పోస్ట్ చేసినందుకు న్యాయస్థానం మంగళవారం పీహెచ్‌డీ స్కాలర్‌కి ఐదు జీవితకాల జైలు శిక్ష విధించింది. తమిళనాడుకు చెందిన పీహెచ్‌డీ స్కాలర్‌ విక్టర్ జేమ్స్ రాజా (35) ఈ దారుణాలకు పాల్పడ్డాడు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతనికి శిక్ష పడింది. పలు నేరాలకు సంబంధించి అతనికి రూ.6,54,000 జరిమానా కూడా విధించినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాజాపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై దాదాపు 14 నెలల తర్వాత తంజావూరులోని ప్రత్యేక కోర్టు తీర్పును ప్రకటించింది. 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న ఎనిమిది మంది మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడి, ఆ దారుణాన్ని రికార్డు చేసి ఇంటర్నెట్‌లో విక్రయించి డబ్బు సంపాదించినందుకు సీబీఐ అతడిని అరెస్టు చేసింది. ఇంటర్‌పోల్‌కు చెందిన ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్ (ఐసిఎస్‌ఇ) డేటాబేస్ నుండి చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సిఎస్‌ఎఎమ్) చిత్రాలు, వీడియోలను సీబీఐ గుర్తించినప్పుడు మాత్రమే ఈ నేరం వెలుగులోకి వచ్చింది. నిందితులను కనిపెట్టడానికి దర్యాప్తు సంస్థ ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ప్రత్యేక సాధనాలను ఉపయోగించగా తంజావూరులో లింక్స్ ఉన్నాయని బయటపడ్డాయి. దీంతో విక్టర్ జేమ్స్ రాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో.. రాజా రెండేళ్లుగా ఎనిమిది మంది పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని దర్యాప్తు బృందం గుర్తించింది. ఇందులో అబ్బాయిలు మరియు బాలికలు ఉన్నారు. చాలా కేసుల్లో బాధితులు 12 ఏళ్ల లోపు వారేనని సీబీఐ గుర్తించింది.
https://www.telugupost.com/movie-news/ee-nagaraniki-success-meet-78144/
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ తో ప్రదర్శింపడుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు తరుణ్ భాస్కర్ తో పాటు చిత్ర నటీనటులు పాల్గొన్నారు. అలాగే కేర్ అఫ్ కంచరపాలెం చిత్ర యూనిట్, ఆ చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా పాల్గొన్నారు. ఈ చిత్ర పోస్టర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేసారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... "ప్రేక్షకులు ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. దయచేసి సినిమాను పైరసిలో చూడకండి." అన్నారు.పాత జ్ఞపకాలు గుర్తుకొస్తాయి...దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ..."కొత్త నటినటుల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఆడియన్స్ నుండి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. సినిమాలో ఎక్కడా అశ్లీలత లేదు. కుటుంభ సభ్యులు అందరూ సినిమాను చూసి ఆనందించే విధంగా ఎంటర్ టైన్మెంట్ ఉంది. ఈ సినిమా చూస్తే మీకు మీ పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి" అన్నారు.
https://www.telugupost.com/movie-news/will-chiranjeevi-syra-beat-bahbhali-collections-131937/
ఆగస్టు 30 న వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయినా ప్రభాస్ సాహో డివైడ్ టాక్ తో కలెక్షన్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ అయినా రోజు రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక రెండు రోజుల్లో ఈమూవీ వరల్డ్ వైడ్ గా 205 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది. మిగిలిన రాష్ట్రాలు పక్కన పెడితే ఏపీ, తెలంగాణాల్లోని అనేక ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక మొదటి రోజు ఈచిత్రం రూ. 42 కోట్ల షేర్, నైజాంలో రెండు రోజుల్లో రూ.14.42 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం అన్ని చోట్ల సాహో చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఇదే స్థాయిలో రిలీజ్ అవుతున్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సైరా. దీనిపై కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇది కచ్చితంగా సాహో రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని డిస్కషన్స్ ఇప్పటి నుండే మొదలయ్యాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం సైరా చిత్రం బాహుబలి రేంజ్ ఓపెనింగ్స్ సాదిస్తుందని నమ్ముతున్నారు. భారీ అంచనాలు మధ్య ఈమూవీ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.
https://www.telugupost.com/movie-news/prabhas-leading-in-bollywood-156906/
బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా హిందీ లో. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభాస్ “సాహో” ని రిలీజ్ చేసాడు. తెలుగును పక్కన పెడితే బాలీవుడ్ లో ఈమూవీ మంచి వసూళ్లు చేసింది. అంతే కాదు రీసెంట్ ఈమూవీ బుల్లితెరను కూడా షేక్ చేసింది. గత వారంలో ఈమూవీతో పాటు పలు హిందీ సినిమాలతో పాటుగా తాను లేటెస్ట్ గా నటించిన బాహుబలి 2 మరియు సాహో చిత్రాలను అక్కడ ఛానెల్స్ లో టెలికాస్ట్ చెయ్యగా ఆ చిత్రాలకు మించి అక్కడ ఈ రెండు చిత్రాలకు మంచి ఇంప్రెషన్స్ వచ్చాయి. బాహుబలి 2 కి 73.89 లక్షల ఇంప్రెషన్స్ రాగా సాహో కు 83.34 లక్షల ఇంప్రెషన్స్ వచ్చినట్టుగా బిఆర్ఎసి(బ్రాడ్ క్యాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా) వారు పొందుపరిచారు. దీనితో అర్ధం చేసుకోవచ్చు మన డార్లింగ్ క్రేజ్ ఏంటో..
https://www.telugupost.com/crime/tragedy-took-place-in-vikarabad-district-incident-drowning-four-people-who-die-during-the-festival-filled-with-tragedy-1457767
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పండగ వేళ నీటిలో మునిగి నలుగురు మరణించని సంఘటన విషాదం నింపింది. పండగకు సొంతూళ్లకు వచ్చిన మన్నెగూడ వాసులు కోటిపల్లి ప్రాజెక్టును చూసేందుకు వెళ్లారు. అక్కడ నీటిని చూసి దిగారు. లోతు తెలియకుండానే లోపలికి వెళ్లడంతో ఒకరు నీటిలో మునిగిపోతున్నారు. అతనిని కాపాడేందుకు మరో ముగ్గురు ప్రయత్నించి వారు కూడా నీటిలో మునిగిపోయారు.ఈతకు దిగి...మరణించిన వారంతా పూడూరు మండలం మన్నెగూడకు చెందిన యువకులుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన యువకులు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడకు వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు లోకేష్, జగదీష్, వెంకటేష్, రాజేష్ లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
https://www.telugupost.com/crime/psycho-son-murdered-his-mother-with-rod-1350674
నవమాసాలు మోసి.. కని పెంచిన పిల్లలే తల్లికి ప్రపంచం. వాళ్లు ఏం చేసినా చూసి మురిసిపోతుంటుంది. తప్పు చేస్తే మందలిస్తుంది. నొప్పి వస్తే తట్టుకోలేదు. అలాంటి తల్లిని కడతేర్చాడు కన్నకొడుకు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాపమ్మ అనే మహిళ.. కొడుకు, కూతురితో కలిసి సుల్తాన్ బజార్లో నివాసం ఉంటోంది. పాపమ్మ కొడుకు సుధీర్ మతిస్థిమితం కోల్పోవడంతో.. తల్లే అన్నీ తానై కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తోంది.Also Read : కోవిడ్ ఎఫెక్ట్ : ఏపీలోనూ లాక్ డౌన్ తప్పదా ?ఆదివారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో సుధీర్ ఉన్నట్లుండి లేచి ఎక్సైజ్ చేయడం మొదలు పెట్టాడు. అది గమనించిన తల్లి పాపమ్మ.. సుధీర్ ను మందలించింది. అంతే.. కోపంతో ఊగిపోయిన సుధీర్ పక్కనే ఉన్న రాడ్ తో తల్లిపై విరుచుకుపడ్డాడు. రాడ్ తో ఆమె తలపై గట్టిగా కొట్టడంతో.. స్పృహ కోల్పోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తల్లిపై దాడి చేస్తున్న సమయంలో అడ్డొచ్చిన చెల్లిపై కూడా రాడ్ తో దాడి చేయడంతో ఆమె కూడా స్పృహ కోల్పోయింది. Also Read : గుడ్ సఖి ట్రైలర్.. పక్కా పల్లెటూరి యాస, భాషలో కీర్తి సురేష్స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకోగా.. అప్పటికే పాపమ్మ మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన సుధీర్ చెల్లెలిని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించి, పాపమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సుధీర్ కు మతిస్థిమితం లేనికారణంగా అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని, చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/rrr-made-good-business-overseas-124876/
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న #RRR మూడువందల కోట్ల బడ్జెట్ తో భారీగా నిర్మితమవుతుంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ విడివిడిగా సినిమాలు చేస్తేనే ఆ సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. అదే ఇద్దరు కలిసి నటిస్తే ఆ సినిమాపై ఇంకెన్ని అంచనాలుంటాయో వేరే చెప్పాలా… ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణలో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. త్వరలోనే రామ్ చరణ్ కూడా #RRR షూటింగ్ లోకి జాయిన్ అవుతానని తెలుస్తుంది. అయితే RRR సినిమాపై ఇప్పుడొక న్యూస్ మీడియాలో తెగ హైలెట్ అవడమే కాదు.. ఆ న్యూస్ చూస్తేనే RRR పై ఎంతగా అంచనాలు పెరిగాయో అర్ధమవుతుంది. #RRR బిజినెస్ అప్పుడే మొదలైంది. అందులో భాగంగానే RRR మూవీ ఓవర్సీస్ హక్కులకు భారీ రేటు పలికిందని అంటున్నారు. గతంలో అనుకున్నట్లుగా RRR ఓవర్సీస్ హక్కులను దుబాయ్ కి చెందిన ఓ సంస్థకి నిర్మాత దానయ్య అమ్మేసినట్లుగా.. అది కూడా సింగిల్ పేమెంట్ ఇచ్చేలా డీల్ సెట్ అయినట్లుగా చెబుతున్నారు. అయితే కనివిని ఎరుగని రీతిలో RRR ఓవర్సీస్ హక్కులకు 65 కోట్లకు వచ్చాయని.. అది కూడా రెండు మూడు పేమెంట్స్ లో కాకుండా సింగిల్ పేమెంట్స్ చేసేలా ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయినట్లుచెబుతున్నారు. మరి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒకే ఒక్క ఓవర్సీస్ డీల్ తెలియజెప్పింది. మరి RRR పూర్తి బిజినెస్ చూస్తే ఆ అంచనాల ఎలా ఉంటాయో చూద్దాం.
https://www.telugupost.com/movie-news/సై-రా-అంతా-భారీనే-42690/
చిరంజీవి 151 వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి' సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా రూపుదిద్దుకోబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ 'సై రా' చిత్రం ఆఫీషియల్ గా సెట్స్ మీదకెళ్ళిపోయింది. ఈ చిత్రంలో భారతదేశంలోని నాలుగు ఇండస్ట్రీలకు చెందిన టాప్ నటీనటులు భాగం పంచుకోబోతున్నారు. సినిమా అనౌన్సమెంట్ దగ్గరనుండే సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్ ఇందులోకి ఇండియాలోనే టాప్ స్టార్స్ తీసుకుని మరిన్ని అంచనాలు పెంచేసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో విడుదల చెయ్యడానికి ఫిక్స్ అయ్యారు.ఇకపోతే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగానే జరుపుతున్న చిత్ర బృందంలో ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ 1840 ల నాటి వాతావరణాన్ని సృష్టించేందుకు హైద్రాబాద్, పొలాచ్చి, రాజస్థాన్ లతో పాటు పలు ప్రాంతాలలో భారీ సెట్స్ నిర్మాణం చేపట్టారు. అలాంటి సెట్స్ ని రూపొందించేందుకు ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ చాల కష్టపడుతున్నారట. అయితే ఆనాటి కాలానికి సంబందించిన గుర్తులు ఏమి లేవు కాబట్టే.... బ్రిటిష్ పాలన నాటి తొలి స్వతంత్ర సమరానికి ముందు కాలం నాటి సెట్స్ వేయాల్సి ఉంటుంది. వాటికోసం కేవలం పలు పుస్తకాలు, వీడియోలు మీద ఆధారపడి... స్కెచ్ లు తయారు చేస్తున్నారట. ఇక స్కెచ్ లపైనే 15 మంది పని చేస్తున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా చరిత్ర కారులనుండి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నారట.పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రియాలిటీకి దగ్గరగా తీర్చిదిద్ధేందుకు చిత్ర బృందం బాగా కష్టపడుతున్నారని సమాచారం అందుతుంది. మరి 'సై రా' తో 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని కసితో చిత్ర బృందం పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు కి జోడిగా నయనతార ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో ఇద్దరు హీరోయిన్స్ ని ఫైనల్ చెయ్యాల్సి ఉంది
https://www.telugupost.com/movie-news/టాలీవుడ్-స్టార్-డైరెక్ట-47731/
ఇప్పుడు టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒక స్టార్ హీరో ఒక స్టార్ డైరెక్టర్ కి డెడ్ లైన్ విధించాడనే న్యూస్ సోషల్ మీడియా సాక్షిగా హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ 'రంగస్థలం 1985 ' చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం మొదలు పెట్టుకుని నెలలు గడుస్తున్నా ఈ సినిమా షూటింగ్ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత సీన్స్ అన్ని షూట్ చేసినా.. మిగతా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే చాలా పాటల చిత్రీకరణ కూడా పెండింగ్ లోనే ఉంది.మరి సినిమా మొదలు పెట్టి చాలా కాలం గడుస్తున్నా సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో.. రంగస్థలం నిర్మాతలు వడ్డీ లెక్కలు అవి వేసుకుంటే... చాలా ఎక్కువ బడ్జెట్ ఈ సినిమాకి అవుతుందనే టాక్ వుంది. అలాగే నవంబర్ కల్లా సుకుమార్ ని ఈ సినిమా షూటింగ్ పూర్తి చెయ్యమని... లేకుంటే ఆ తర్వాత తన డేట్స్ సర్దుబాటు చేయలేనని 'రంగస్థలం' హీరో రామ్ చరణ్ సుకుమార్ కి డెడ్ లైన్ పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ నవంబర్ ఎండ్ కల్లా తనకు సంబందించిన షూట్ మొత్తం కంప్లీట్ చేసుకోమని దర్శకుడికి చరణ్ చెప్పాడనే న్యూస్ హల్చల్ చేస్తుంది. తనకి నవంబర్ ఎండ్ నుండి తన తండ్రి 'సై రా నరసింహారెడ్డి' సినిమాకి సంబందించిన పనులు ప్రారంభమవుతాయని....ఇక 'సై రా' నిర్మాతగా తాను బిజీ అవుతానని.. అందుకే 'రంగస్థలం' షూటింగ్ ని త్వరగా కంప్లీట్ చేసుకోమని సుకుమార్ తో చరణ్ చెప్పాడట. మరి చరణ్ చెప్పిన డెడ్ లైన్ కి సుకుమార్ రీచ్ కాగలడా...అంటున్నారు. ఎందుకంటే సుకుమార్ తన సినిమాలను హరీబరిగా తెరకెక్కించడు. చాలా నెమ్మదిగా తన సినిమాని నీట్ అండ్ క్లీన్ గా చెక్కుతూనే ఉంటాడు. అయితే అసలు చరణ్.. సుకుమార్ కి డెడ్ లైన్ పెట్టడం నిజమేనా? లేదా కేవలం గాసిప్పా... అనేది మాత్రం క్లారిటీ లేదు.
https://www.telugupost.com/movie-news/tragedy-befell-the-house-of-famous-music-director-ilayaraja-his-son-pavlar-sivan-passed-away-1474629
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు పావళర్ శివన్ మృతి చెందారు. శివన్ గుండెపోటుతో మరణించారని వైద్యులు తెలిపారు. తెల్లవారు జామున నిద్రిస్తున్న సమయంలో శివన్ మంచం మీద నుంచి కింద పడి పోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పావళర్ శివన్ మరణించారని వైద్యులు నిర్ధారించారు.గిటార్ వాయిద్య కళాకారుడిగా...దీంతో ఇళయరాజా కుటుంబంలో విషాదం నెలకొంది. అరవై ఏళ్లశివన్ గిటార్ వాయిద్య కళాకారుడిగా గుర్తింపు పొందారు. తండ్రి సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఆయన మాత్రం గిటార్ వాయిద్య కళాకారుడిగానే ఉన్నారు. శివన్ మృతి పట్ల తమిళనాడు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. శివన్ మృతి పట్ల ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఇళయరాజాకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/త్రిష-నయన్ల-వయసుపై-బొద్ద-21867/
సినిమా పరిశ్రమకి చాలా పిన్న వయసులో వచ్చి నిరూపించుకున్న కథానాయికల్లో ఒకరైన హన్సిక మోత్వానీ వెండి తెరకి పరిచయం ఐయింది దేశముదురు వంటి తెలుగు సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించినప్పటికీ హన్సిక కి తెలుగులో కంటే తమిళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు, స్టార్ డం ఎక్కువ లభించాయి. దేశముదురు సినిమా విడుదలై దశాబ్ద కాలం కావటంతో హన్సిక మోత్వానీ బాగా సీనియర్ కథానాయిక అనిపిస్తుంది తప్పితే అమ్మడి వయసు ఇప్పటికి 25 మాత్రమే. ఇప్పటికీ తమిళంలో విరివిగా, తెలుగులో అరుదుగా స్టార్స్ సరసన హీరోయిన్ గా నటిస్తూనే వుంది.తాజాగా తెలుగులో మంచు విష్ణు సరసన నటించిన తెలుగు సినిమా లాక్కున్నోడు విడుదల కాగా, తమిళంలో జయం రవి, అరవింద్ స్వామి లు నటించిన భోగం చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇప్పటికే చిత్ర పరిశ్రమలోకి వచ్చి దశాబ్దం గడిచిపోయిందనో ఏమో మీడియా విలేకరి ఒకరు హన్సిక ని ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తారా అని ప్రశ్నించగా ఎవరూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చి ఆశ్చర్య పరిచింది హన్సిక. "త్రిష, నయనతార ల లా నేను కూడా ముప్పైల వయసు దాటితే అప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి సారిస్తానేమో. ఇప్పుడైతే ఆ ఆలోచన లేదు." అంటూ బదులిచ్చింది హన్సిక. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో త్రిష, నయన్ ల అభిమానులు హన్సిక పై మండిపడుతున్నారు.
https://www.telugupost.com/movie-news/sreenu-vaitla-next-movie-hero-116648/
వరుస సినిమాలు డిజాస్టర్స్ అవడంతో దర్శకుడు శ్రీని వైట్ల పనైపోయిందని అంటున్నారు. ఏదో ఒక సినిమా తనని నిలబెట్టలేకపోతుందా అని శ్రీను వైట్ల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆగడు, బ్రుస్ లీ, మిస్టర్ సినిమాలతో ఫ్లాప్ ఇచ్చిన శ్రీను వైట్లని నమ్మి రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేస్తే.. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక శ్రీనుకి మరో హీరో ఛాన్స్ ఇస్తాడా అంటూ సోషల్ మీడియాలో చాలానే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. కానీ ఇప్పుడు శ్రీను వైట్లకి ఒక ఫ్లాప్ హీరో ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా తనకి ఢీ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన మంచు విష్ణు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ హిట్ కాంబో 12 ఏళ్ల క్రితం మంచు విష్ణు – శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన ఢీ సినిమా కామెడీ హిట్ అయ్యింది. అయితే ప్రస్తుతం విష్ణు కూడా హిట్ లేకుండా ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. మరి మళ్లీ ఇన్నాళ్లకి శ్రీను వైట్లతో విష్ణు అంటే ఆ సినిమా మీద మార్కెట్ లో ఎలాంటి అంచనాలుంటాయో తెలియదు కానీ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ 12 ఏళ్ల తరువాత తాను శ్రీను వైట్లతో సినిమా చేయనున్నానని అన్నాడు. విష్ణు నటించిన ఓటర్ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఫ్లాప్ దర్శకుడు, ప్లాప్ హీరో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూద్దాం.
https://www.telugupost.com/national/6-cops-suspended-after-clash-with-students-at-prayagraj-station-1351169
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) పరీక్ష 2021 ఫలితాలు జనవరి 15వ తేదీన విడుదలయ్యాయి. ఫలితాలు చూసిన అభ్యర్థులు.. భారీగా అవకతవకలు జరిగాయంటూ ఆందోళనలు చేపట్టారు. ఫలితాలపై దేశ వ్యాప్తంగా అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. ఫలితాలకు వ్యతిరేకంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. అభ్యర్థులను కట్టడిచేయటానికి పోలీసులు లాఠీచార్జీలు, టియర్‌గ్యాస్‌లను ప్రయోగించారు.Also Read : బహిరంగ మార్కెట్లోకి కొవాగ్జిన్, కొవిషీల్డ్.. ధరలిలా ఉండొచ్చు!నలంద, నవాడ, సీతామర్హి, బక్సర్‌, అర్రా, ముజఫర్‌పూర్‌లలో అభ్యర్థులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. రెండు, మూడ్రోజులుగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రైళ్లను ధ్వంసం చేయడంతో పాటు.. రైళ్లపైకి రాళ్లు రువ్వుతున్నారు. తాజాగా బీహార్ లోని గయా జంక్షన్ లో భభువా - పట్నా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ని తగలబెట్టారు అభ్యర్థులు. ఈ ఘటనలో రైలులోని పలు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇదిలా ఉండగా.. రైల్వే పరీక్ష ఫలితాలకు సంబంధించి ప్రయాగ్ రాజ్ లోనూ ఆందోళన జరగ్గా.. ఆ సమయంలో విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు అధికారులు.Also Read : కనుమరుగు కానున్న కడప.. ఇక చరిత్రకే పరిమితమా !ఈ ఘటనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఎస్‌ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విద్యార్థులను ప్రేరేపించినందుకు ఖాన్ సర్‌తో సహా పాట్నాలోని చాలా కోచింగ్ సెంటర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు పోలీసు సిబ్బందిలో ఒక ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరంతా అనవసరంగా విద్యార్ధులను కొట్టారని ఆరోపిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/namrata-controls-mahesh-babu-మహేష్-బాబు-movies-124836/
మహేష్ హీరోగానే కాదు ప్రొడ్యూసర్ కూడా. తనకంటూ ఓ సొంత బ్యానర్ ని క్రియేట్ చేసుకుని దాంట్లో సినిమాలు చేయాలన్నదే మహేష్ ఆలోచన. తన పేరు మీద మహేష్ బాబు ప్రొడక్షన్ అంటూ మహేష్ ఎప్పుడో ఈ బ్యానర్ ని స్టార్ట్ చేసాడు. కాకపోతే ఆరంభం సరిగ్గా జరగలేదు. 1 నేనొక్కడినే, ఆగడు లాంటి ఫ్లాపులతో మహేష్‌కి నిర్మాణం కలిసి రాలేదు. ఆ తరువాత చేసినా బ్రహ్మూెత్సవంతో కలిసి రాకపోవడంతో కొంత విరామం తీసుకున్నాడు మహేష్. అయితే గత రెండేళ్ల నుండి తన సినిమాలు బాగా ఆడుతున్నాయి కాబట్టి కెరీర్ కి ఏమి డోకా లేదు కాబట్టి మళ్లీ తన ఎంబి ప్రొడక్షన్స్‌ యాక్టివ్‌ చేస్తున్నాడు. పైగా ఏ నిర్మాతల చేతిలో సినిమా పెట్టాలి లాంటి వాటిపై మహేష్‌కి క్లారిటీ రావడంతో తన నెక్స్ట్ చేయబోయే సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరు’కి ఈ బ్యానర్‌ కూడా భాగస్వామిగా చేరింది. మహేష్ సొంత బ్యానర్ కాబట్టి తన భార్య నమ్రత పార్టిసిపేషన్‌కి వాయిస్‌ వస్తుంది. నమ్రత కూడా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ కావడంతో నిర్మాత హోదాలో మహేష్‌ చిత్రాలని పర్యవేక్షిస్తుంది. మహేష్ నటించిన సినిమాలకి కూడా నమ్రత నిర్మాణ బాధ్యతలు తీసుకుంటోంది. ఇక నుంచి మహేష్ నటించే సినిమాలన్నిటికి నమ్రత ఫుల్ కంట్రోల్
https://www.telugupost.com/movie-news/మహానుభావుడు-టోటల్-వరల్డ-48021/
మారుతీ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం 'మహానుభావుడు'. ప్రేక్షకులని మెప్పించిన ఈ చిత్రం కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. రిలీజ్ అయినా మొదటి షో నుండే హిట్ టాక్ తో నడిచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్లు చేయగా, వరల్డ్ వైడ్ షేర్ మాత్రం దాదాపు 24 కోట్లు వసూల్ చేసింది. 'మహానుభావుడు' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు..ఏరియా షేర్స్(కోట్లలో)నైజాం 6.10సీడెడ్ 2.70నెల్లూరు 0.63కృష్ణ 1.63గుంటూరు 1.80వైజాగ్ 2.80ఈస్ట్ గోదావరి 1.70వెస్ట్ గోదావరి 1.08ఏపి & టీఎస్ 18.44 కోట్లురెస్ట్ ఆఫ్ ఇండియా 1.95ఓవర్సీస్ 2.80టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 23.19 కోట్లు
https://www.telugupost.com/movie-news/వర్మ-వైఖరి-పై-మెగా-ఫామిలీ-21797/
మెగా స్టార్ చిరంజీవి అనగానే చిత్ర పరిశ్రమ అంతా ప్రశంసలతో పొగిడేస్తుంటారు. ఒక్క రామ్ గోపాల్ వర్మ తప్ప. చిరంజీవి స్టోరీ సెలక్షన్ పై వేలెత్తి చూపిన ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మే నేమో. వర్మ మెగా స్టార్ పై చేసిన ట్వీట్లు చిరంజీవి క్యాపబిలిటీని ప్రశ్నించే విధంగా వున్నప్పుడు కూడా మెగా ఫామిలీ లో ఎవరూ వర్మ ట్వీట్స్ ని ఖండించటం కానీ, వర్మ పై విమర్శలు చేయటం కానీ జరగలేదు. కానీ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైతే మెగా స్టార్ ని దాటుకుని తన పైత్యాన్ని మెగా అభిమానులపై చూపటం ప్రారంభించాడో అప్పటి నుంచి కొణిదల నాగ బాబు తో మొదలుకొని ఇప్పుడు చిరంజీవి కూతురు సుస్మిత వరకు అందరూ వర్మ శైలిని ఎండకడుతూనే వున్నారు.మెగా స్టార్ తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తరువాత నటించిన ప్రతిష్టాత్మక 150 వ చిత్రం ఖైదీ నెం.150 చిత్తానికి కాస్ట్యూమర్ గా పని చేసిన సుష్మిత తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మెగా ఫామిలీ మొత్తం గర్వంగా భావించిన ఖైదీ నెం.150 చిత్రం ఒక తమిళ సినిమాకు రీమేక్ కావటం చిరంజీవి తన అభిమానులకు చేస్తున్న అవమానంగా అభివర్ణించడం మీకెలా అనిపించింది అని అడిగిన ప్రశ్నకు, "నేను ఖైదీ నెం.150 సెట్స్ లో వున్నన్ని రోజులలో ఆర్.జి.వి ట్వీట్స్ ని సీరియస్ గా తీసుకుని వచ్చి చర్చించిన వారిని ఎవరినీ చూడలేదు. ఇక మా ఇంట్లో అయితే మేము అంతా కలిసి లంచ్ చేస్తున్నప్పుడు వర్మ ట్వీట్స్ గురించి చర్చించుకుని నవ్వుకుంటుంటాం తప్ప మరోలా అసలు రియాక్ట్ అవ్వము." అంటూ చాలా ఈజీ గా తీసుకుంది సుష్మిత.
https://www.telugupost.com/movie-news/chalaki-chanti-got-heart-attack-now-he-is-in-hospital-1473154
జబర్దస్త్.. ఎంతో మందికి జీవితాన్నిచ్చిన కామెడీ షో ఇది. ఈ షో ద్వారానే చలాకీ చంటికి మంచి పేరొచ్చింది. కమెడియన్ గా కడుపుబ్బా నవ్వించిన చంటి.. నెమ్మదిగా సినిమాల్లోనూ నటిస్తూ.. కెరీర్ ను ఏర్పరచుకున్నాడు. గతేడాది బిగ్ బాస్ -6లోనూ చంటి కంటెస్టంట్ గా వచ్చాడు. ఇప్పుడు అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇదివరకులా పెద్దగా కామెడీ షోలలో కనిపించడం లేదు.అయితే.. ఈ రోజు చలాకి చంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుండెపోటుకు గురైన చంటిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆ వార్త సారాంశం. అయితే తొలుత ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. కానీ.. ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినదాన్ని బట్టి నిజమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న చంటి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. చంటి పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో చలాకీ చంటికి కూడా గుండెపోటు వచ్చిందన్న వార్త ఆయన అభిమానులను కలవరపరిచింది. ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.
https://www.telugupost.com/movie-news/mega-star-chiranjeevi-family-deepawali-celebrations-96412/
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కుండే ప్రత్యేకతే వేరు. ఆ ఫ్యామిలిలో ఉన్నంతమంది హీరోలు మరే ఫ్యామిలోను లేరు. చిన్న పెద్ద స్టార్ హీరోలు ఆ ఫ్యామిలీలోనే ఉన్నారు. ఆఖరుకి మెగా ఫ్యామిలీనుండి ఒక హీరోయిన్ కూడా వచ్చింది. మెగాస్టార్ చిరు ని ఆసరాగా చేసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా హీరోలు అనతికాలంలోనే స్వశక్తితో పైకి వచ్చి తమకంటూ ఒక స్టార్ స్టేటస్ ని ఏర్పరుచుకున్నారు. చిరంజీవి నీడ కింద చల్లగా ఉంటున్నారు. ఇక ఇప్పటికి చిరంజీవి హీరోగానే సినిమాల్లో కొనసాగుతున్నాడు. పవన్ మాత్రం రాజకీయాలనంటూ మెగా ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉంటున్నారు కానీ... మిగతావాళ్ళు అంటే నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ అంతా సినిమాల్లోనే ఉన్నారు.ఇక ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలి లో పండగ సెలెబ్రేషన్స్ దగ్గరనుండి ఫ్యామిలీ పార్టీలవరకు అందరు కలిసి చాలా సందడిగా చేసుకుంటారు. గత నెలలోనే హేలోవిన్ పార్టీలో సందడి చేసిన చిరు అండ్ ఫ్యామిలీ ఇప్పుడు దీపావళి పార్టీ ని ఎంజాయ్ చేశారు. చిరు ఫ్యామిలి చిన్న పిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు ఈ దీపావళి ని బాగా సెలెబ్రేట్ చేఉకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, కల్యాణ్ దేవ్, వరుణ్ తేజ్, నాగబాబు, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఒకే చోటకు చేరారు. ఇక ఉపాసన, స్నేహ. సురేఖ, శ్రీజ, నీహారిక, అర్హ, అయాన్, శ్రీజ కూతురు, సుష్మిత పిల్లలు అంతా కలిసి ట్రెడిషనల్ డ్రెస్సులతో ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు.మరి మెగా ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ లో ఒక్క పవన్ ఫ్యామిలీ తప్ప మిగతా మెగా ఫామిలీస్ అన్ని హాజరయ్యాయి. మరి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా బిజీగా ఉండడంతో ఈ సెలెబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయాడు. మెగా ఫ్యామిలీ మొత్తం మెగా పిక్ లో అంటే మెగా ఫ్రెమ్ లో కనబడితే మెగా అభిమానుల అందానికి అవధులేముంటాయ్ చెప్పండి. మరి తమ దీపావళి సెలెబ్రేషన్స్ తో పాటుగా మెగా ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ ని మెగా అభిమానులు ఎంజాయ్ చేశారు
https://www.telugupost.com/crime/youngster-rajesh-dead-body-found-in-pedda-amberpet-1478555
హైదరాబాద్ నగర శివారు అయిన పెద్ద అంబర్ పేట్ లో ఓ యువకుడి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద అంబర్ పేట్ డాక్టర్స్ కాలనీ సమీపంలో కుళ్లిన స్థితిలో రాజేశ్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించి అతని సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేస్తుండగా.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో జరిపిన చాట్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఆమె భర్త నాగేశ్వరరావే రాజేశ్ ను హత్య చేసినట్లు భావిస్తున్నారు. టీచర్ భర్తతో పాటు ఇతర బంధువులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కాగా.. రాజేశ్ మరణంతో తనకు సంబంధం లేదని నాగేశ్వరరావు చెబుతున్నాడు. అతనిపై తాము దాడి చేశామనడంలో వాస్తవం లేదని, రాజేశ్ ఎవరో కూడా తనకు తెలియదన్నాడు. తన భార్యకు ఎవరో ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని, ఆమెకు రాజేశ్ తో సోషల్ మీడియాలో పరిచయం ఉండి ఉండవచ్చని నాగేశ్వరరావు తెలిపాడు. తన భార్య సూసైడ్ చేసుకుందని, దానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశాడు.హయత్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో రాజేశ్ కు కొంతకాలం క్రితం ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి తన భర్త తనను పలుమార్లు మందలించాడని ఆమె రాజేశ్ కు తెలిపింది. మనస్తాపానికి గురైన ఆమె తాను చనిపోతానంటూ రాజేశ్ కు మెసేజ్ లు పంపింది. అలా చేస్తే తాను కూడా చనిపోతానని రాజేశ్ చెప్పినట్లు అతని వాట్సాప్ చాట్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. మే 24వ తేదీన టీచర్ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ సోమవారం (మే29)న మరణించింది. 24వ తేదీ నుంచీ రాజేశ్ టీచర్ ఇంటిచుట్టూ తిరగడాన్ని గమనించిన ఆమె కొడుకు అతడిని పట్టుకుని నిలదీశాడు. సెల్ ఫోన్ చెక్ చేయగా అసలు విషయం తెలియడంతో రాజేశ్ ను మందలించి, కొట్టి వదిలేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాజేశ్ ను నాగేశ్వరరావు, అతని కుటుంబ సభ్యులు హత్య చేసి ఉంటారా ? లేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/crime/woman-married-fifty-people-in-tamil-nadu-and-was-finally-caught-by-the-police-1543055
ఒకరు రెండో పెళ్లి చేసుకుంటేనే వెంటనే దొరికిపోతున్నారు. అలాంటి ఈరోజుల్లో యాభై పెళ్లిళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకోవడం సాధ్యమా? అంటే సాధ్యమేనంటుంది నిత్య పెళ్లకూతురు. ఏకంగా యాభై మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది. తమినాడులో ఈ ఘటన చోటుకుంది. తమిళనాడులో మరో నిత్య పెళ్లి కూతురు ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకుంది. నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోందని విచారణలో వెల్లడైంది.పెళ్లి కాని యువకులను...తమిళనాడు- తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన మూడు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చి, పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. సంధ్య వలల్లో డీఎస్పీ, ఇద్దరు పోలీస్ అధికారులు కూడా చిక్కుకున్నారు అని తెలిసి అవాక్కవ్వడం పోలీసుల వంతయింది. మొత్తం మీద ఇంత మందిని మోసం చేసిన ఈ యువతి ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
https://www.telugupost.com/movie-news/krack-final-collections-181294/
కరోనా తో మూతపడిన థియేటర్స్ ని క్రాక్ నిద్ర లేపింది. బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల హడావుడితో క్రాక్ కి టికెట్స్ బాగా తెగాయి. అందులోను సంక్రాంతి సినిమాలు కాస్త అటు ఇటుగా అవడంతో క్రాక్ దూసుకుపోయింది. దానితో రవితేజ కి సూపర్ హిట్ పడింది. మాస్ మహారాజ్ రవితేజ – శృతి హాసన్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ థియేటర్స్ హడావిడి ముగిసి ఆహా లో ఆన్ లైన్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. దానితో క్రాక్ క్లోజింగ్ కలెక్షన్స్ ఫిగర్ బయటికి వచ్చింది. క్రాక్ క్లోసింగ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా.. ఏరియా కోట్లలోనైజాం 11.69 కోట్లు సీడెడ్ 05.99ఉత్తరాంధ్ర 04.12 ఈస్ట్ 03.19 వెస్ట్ 02.38 కృష్ణా 02.31 గుంటూరు 02.70నెల్లూరు 01.75ఏపీ అండ్ టీఎస్ 34.13 కోట్లుఇతర ప్రాంతాలు 01.65ఓవర్సీస్ 00.85 టోటల్ వరల్డ్ వైడ్ 36.63 కోట్లు
https://www.telugupost.com/movie-news/is-rx-100-ajay-bhapathi-called-ravi-teja-a-cheap-hero-132113/
RX 100 సినిమాతో హిట్ కొట్టిన అజయ్ భూపతికి ఇప్పటి వరకు రెండో సినిమా చేసే ఛాన్స్ దక్కలేదు. RX 100 తర్వాత అజయ్ భూపతి, నితిన్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరగడమే కాదు.. ఈ దర్శకుడు పారితోషకం ఎక్కువ డిమాండ్ చెయ్యడం వలనే అతని రెండో సినిమా పట్టాలెక్కలేదనే ప్రచారము జరిగింది. ఇక మహాసముద్రం అనే పవర్ ఫుల్ స్క్రిప్ట్ పట్టుకుని అక్కినేని కాంపౌండ్ లోకి వెళ్లి చైతు తో సినిమా చేస్తున్నారు అని అన్నారు. కానీ రవితేజ తో మహాసముద్రం సినిమాని అజయ్ పట్టాలెక్కించేస్తున్నాడని అన్నారు. అనడమే కాదు…. రవితేజ డిస్కో రాజా తర్వాత అజయ్ భూపతి తో మహాసముద్రం సినిమా చేస్తాడని.. ఆ సినిమా కోసం ఇప్పటికే హీరో సిద్దార్ధ్ ని కూడా సెట్ చేసుకున్నారనే టాక్ నడిచింది. అయితే తాజాగా అజయ్ భూపతి కి రవితేజ షాకిచ్చాడని.. ఈ సినిమా కోసం భారీ పారితోషకం రవితేజ డిమాండ్ చెయ్యడమే కాదు.. అజయ్ ని కథలో మార్పులు చేర్పులు చెయ్యమన్నాడని.. నిర్మాతలకు, అజయ్ కి రవితేజ చుక్కలు చూపించాడని అంటున్నారు. అందుకే అజయ్ భూపతి కి బాగా మండి పేరుని మెన్షన్ చెయ్యకుండా తన ట్విట్టర్ లో చీప్ స్టార్ అంటూ రవితేజని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసాడనే టాక్ నడుస్తుంది. మరి అజయ్ ఇలా చీప్ స్టార్ అంటూ రవితేజపై కామెంట్ చెయ్యడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
https://www.telugupost.com/movie-news/anupama-parameshwaran-in-rangasthalam-77952/
రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ పాత్రకి ఎంతగా పేరొచ్చిందో.. పల్లెటూరి అమ్మాయిలా.... పొలం పనులు చేసుకునే రామలక్ష్మి సమంత పాత్రకి అంతే పేరొచ్చింది. సమంత కెరీర్ లోనే రామలక్ష్మిగా కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇవ్వడమే కాదు... ఆ పాత్ర సమంత కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. డి గ్లామర్ గా, లంగావోణీ లో సమంత లుక్స్ అండ్ నటన కూడా అదుర్స్. ఇక రంగమ్మ, మంగమ్మ సాంగ్ లో అయితే సమంత రెచ్చిపోయి డాన్స్ చేసి అందరి హృదయాల్లో నిలిచిపోయింది. మరి అలంటి పాత్రలను ఏ హీరోయిన్ కూడా మిస్ చేసుకోదు. ఈవెన్ అలాంటి పాత్రల కోసం హీరియిన్స్ ఎంతో ఎదురు చూస్తారు.అలాంటిది రంగస్థలంలో రామలక్ష్మి రోల్ ని ఒక అందమైన హీరోయిన్ మిస్ చేసుకుంది. ఆమె ఎవరో కాదు... శతమానంభవతి, ఉన్నది ఒకటే జిందగీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. టాలీవుడ్ లో కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెరుస్తున్న అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో నటించిన తేజ్ ఐ లవ్ యు సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అనుపమ రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర కోసం ముందుగా తననే సంప్రదించారనే విషయం బయటపెట్టింది. అయితే గతంలోనే రామ్ చరణ్ పక్కన అనుపమ ఒక బిగ్ ప్రాజెక్ట్ చేయబోతోందని... కానీ తర్వాత అనుపమ చెయ్యడం లేదనే న్యూస్ ప్రచారం జరిగింది.తాజాగా అనుపమ చెప్పిన దాని బట్టి నిజంగానే చరణ్ పక్కన అనుపమ రామలక్ష్మి పాత్ర చెయ్యాల్సింది. కానీ కొన్ని కారణాల వలన తాను చేయలేకపోయానని.. కానీ తనకన్నా సమంత రామలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించిందని చెప్పింది. ఇక ఆ సినిమా చూసాకా.. నాకన్నా.. సమంత నే ఆ పాత్రకి దర్శక నిర్మాతలు తీసుకోవడం కరెక్ట్ అనిపించిందని కూడా చెప్పింది. అలాగే అదే విషయాన్నీ తాను సుకుమార్ కి కూడా చెప్పానని చెబుతుంది అనుపమ. ఇక అనుపమ అభిమానులు మాత్రం పాపం అనుపమ కెరీర్ బెస్ట్ మిస్ అయ్యిందని తెగ ఇదైపోతున్నారు.
https://www.telugupost.com/movie-news/prabhas-nag-ashwin-story-line-157045/
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా.. మెచ్యూర్డ్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీగా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం పక్కనబెడితే.. ఈసినిమా ఓపెనింగ్ ఫొటోస్ ని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. ఆ ఫొటోస్ విపరీతమైన వైరక్ అయ్యాయి,. ఆ సినిమా ఇంకా పూర్తికాకుండానే ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో మరో పాన్ ఇండియా మూవీకి కనెక్ట్ అయ్యాడు. భారీ బడ్జెట్ తో భారీగా నాగ్ అశ్విన్ ప్రభాస్ ని పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసాడు. అయితే తాజాగా ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా కథనం ప్రకారం ఇది ఓ సోసియో ఫాంటసీ మూవీ అని తెలుస్తుంది. సామాన్య మానవుడు, దేవకన్యకు పుట్టిన ఓ వన్దర్ కిడ్ స్టోరీనే అని.. ఒకానొక చిత్రమైన పరిస్థితిలో సాధారణమైన మానవుడికి .. దేవకన్యకి జన్మించిన వాడిగా కనిపిస్తాడనేది తాజా సమాచారం. మానవుడికి .. దేవకన్యకి జన్మించిన బిడ్డ పెరిగి పెద్దయ్యాక అతను ఎలాంటి అద్భుతాలు చేస్తాడనేదే ప్రధానమైన కథాంశమని అంటున్నారు.
https://www.telugupost.com/movie-news/buchibabus-next-movie-183467/
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించుకున్న డెబ్యూ డైరెక్టర్ బుచ్చి బాబు సాన. మొదటి సినిమాకే పెద్ద బ్యానర్ దొరకడం బుచ్చి బాబు రేంజ్ ని పెంచింది. బడా నిర్మాతలతో ఫస్ట్ సినిమా అంటే.. సినిమాకి బడ్జెట్, అలాగే ప్రమోషన్స్ విషయం, సినిమా మీద అంచనాలు ఎలా ఉంటాయో ఉప్పెన సినిమా చూసాక అర్ధమయ్యింది. అయితే ఉప్పెన సినిమాతో సుకుమార్ అసిస్టెంట్ గా దర్శకుడిగా మారిన బుచ్చి బాబు వెంట యంగ్ హీరోలు పడుతున్నారనే టాక్ నడుస్తుంది. అసలు తారక్ అయితే బుచ్చి బాబుకి ఓ ఛాన్స్ ఇవ్వబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరో పక్క బుచ్చి బాబు అక్కినేని కాంపౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నాడనే న్యూస్ మొదలయ్యింది.ఒకరు బుచ్చి బాబు సాన అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో సినిమా చెయ్యబోతున్నాడు అంటే.. మరొకరు నాగ చైతన్య తో బుచ్చి బాబు సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. ఇంతకీ బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమా కథని ఏ హీరోకి వినిపించకపోయినా.. బుచ్చి బాబు ని లాక్ చేసేందుకు యంగ్ హీరోలు రేడి అవుతున్నారనేది నిజమే అయినా.. ప్రస్తుతం బుచ్చి బాబు నెక్స్ట్ మాత్రం ఫిక్స్ అవలేదు. ప్రస్తుతం ఉప్పెన సక్సెస్ టూర్ అంటూ థియేటర్స్ విజిట్ కి వెళ్లిన బుచ్చి బాబు సానా ఉప్పెన సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాకపోతే బుచ్చి బాబు ని రెండు సినిమాలకు మైత్రి మూవీస్ వారు లాక్ చేశారనే టాక్ ఉండగా ఇప్పుడు అందరి చూపు బుచ్చి బాబు నెక్స్ట్ మీదే ఉంది.
https://www.telugupost.com/movie-news/rashmika-mandanna-tired-of-shooting-with-her-bak-to-back-movies-141842/
కన్నడ నుండి కెరటంలా దూసుకొచ్చిన రష్మిక మందన్న తెలుగులో పట్టుమని నాలుగైదు సినిమాలు చెయ్యలేదు అప్పుడే అలిసిపోతున్నానని చెబుతుంది. అంటే రెండు మూడు సినిమాలను ఓకె టైం లో మ్యానేజ్ చెయ్యడం కష్టమని ఈ భామ భావన అన్నమాట. మరి పూజ హెగ్డే గతంలో అరవింద సమేత, మహర్షి, బాలీవుడ్ హౌస్ ఫుల్ 4, ప్రభాస్ తో జాన్ షూటింగ్ ని ఒకే టైం లో చేసింది. అంటే ఉదయం ఓ హీరో, సాయంత్రం ఓ హీరో, రాత్రికి మరో హీరో అన్నట్టుగా ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగింది కూడా. అయినా చేతిలో సినిమాలున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే సామెతని పూజ హెగ్డే పక్కాగా ఫాలో అయ్యింది. కానీ రష్మిక అలా కాదు. ప్రస్తుతం స్టార్ హీరోలకే నా డేట్స్ అంటుందట. మరో పక్క పారితోషకం డబుల్ చేసిందనే న్యూస్. అది నిజమే.. డిమాండ్ ఉన్నప్పుడు అడిగితె తప్పేమిటి అంటుంది. మరోపక్క యంగ్ అండ్ చిన్న హీరోల సినిమాలు రిజెక్ట్ చేస్తుందనే ప్రచారం ఉంది. తాజాగా ఒకదానిమీద మరొక సినిమా చేస్తూ త్వరగా అలిసిపోతున్న అంటూ కబుర్లు చెబుతుంది. మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్న రష్మిక, నితిన్ తో భీష్మ సినిమాలో నటిస్తుంది. మరోపక్క నాగ చైతన్య – పరశురామ్ మూవీలో రష్మిక హీరోయిన్ అంటున్నారు. క్లారిటీ లేదు. బన్నీ – సుక్కు సినిమాలో రష్మిక నే హీరోయిన్. మరోపక్క తమిళనాట రష్మిక నటిస్తుంది. అయితే ఇలా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నందుకు గాను తానూ త్వరగా అలిసిపోయి నీరస పడిపోతున్నట్లుగా రష్మిక చెబుతుంది. అందుకే ఈ సినిమాలు అయ్యాక కాస్త విశ్రాంతి తీసుకుంటా అంటుంది. మరి కెరీర్ కి ఏమాత్రం జాలి బ్రేకిచ్చినా.. తర్వాత మళ్ళీ కష్టం అనే విషయం రష్మిక కు తెలియదంటారా..!
https://www.telugupost.com/movie-news/balakrishna-boyapati-new-film-71569/
బాలకృష్ణ - బోయపాటి కాంబో లో ఎలాంటి సినిమాలొచ్చాయో, అవెంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి కాంబోలో రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాక కూడా మూడో ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి ఏళ్ళు పట్టింది. అయినా బాలయ్య - బోయపాటి సినిమా మీద స్పష్టత లేదు. అదిగో ఇదిగో బాలయ్య- బోయపాటి కాంబో మూవీ సెట్స్ మీదకొస్తుందనే న్యూస్ లు తప్ప అటు బాలయ్య మాత్రం బోయపాటి మూవీపై క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ బోయపాటి మాత్రం బాలయ్య అవకాశం ఎప్పుడిస్తాడా అని తెగ ఎదురు చూస్తున్నాడు. అయితే తాజాగా బోయపాటి - బాలయ్య సినిమాకి ముహూర్తం ముందుంది అంటున్నారు.త్వరలోనే అధికారిక ప్రకటన....బాలకృష్ణ - బోయపాటి శ్రీను ల సినిమా పూజా కార్యక్రమాలను వచ్చేనెల మొదటివారంలో జరపాలనే నిర్ణయానికి వీరిద్దరూ వచ్చినట్టుగా సమాచారం. మరి సినిమా పూజ కార్యక్రమాలను ఇప్పుడు జరిపించినా ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తోపాటుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా చేస్తున్న సినిమాలు పూర్తయ్యాకే బోయపాటితో బాలయ్య సినిమా సెట్స్ మీదకెళుతుందట. ఆ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే బాలకృష్ణ బోయపాటితో రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. అయితే బాలకృష్ణ - బోయపాటి సినిమాపై అతి తొందరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు.
https://www.telugupost.com/movie-news/attack-on-big-boss-3-winner-rahul-sipligunj-150360/
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో జరిగిన దాడి రాజకీయ రంగు పులుముకుంది. తనపై దాడి చేసిన వారు ఎమ్యెల్యే కొడుకు, అలాగే ఎమ్యెల్యే బంధువు అంటూ రాహుల్ సిప్లిగంజ్ తన మీద బీర్ బాటిల్ దాడి తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ప్రెస్ మీట్ పెట్టి.. ప్రెస్ వాళ్లతో కాస్త చిరాకుగా మట్లాడ్డం అయ్యింది. రాహుల్ తనకు ఎవరు సపోర్ట్ చేయడం లేదని, రాజకీయనాయకులు ఈ సీన్ లో ఇన్వాల్వ్ అయ్యారని.. కేటీఆర్ కి డైరెక్ట్ మెసేజ్ పెట్టాడు. అయితే ఇంతజరిగినా సినిమా ప్రముఖులెవరు రాహుల్ పై జరిగిన దాడిపై పెదవి విప్పలేదు. రాహుల్ ఒంటరి పోరాటమంటూ ప్రచారం జరగడంతో.. తాజాగా సినిమా ప్రముఖులు రాహుల్ పై దాడి గురించి మాట్లాడుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అయితే రాహుల్ సిప్లిగంజ్ కి ఎవరు లేరనుకున్నారా.. అంటూ రాహుల్ కి మద్దతు పలకడమే కాదు…. రాహుల్ తో కలిసి ఈరోజు టీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ ని కలిసి రాహుల్ పై దాడిని వివరించి న్యాయం చెయ్యమని అడగడమే కాదు.. తర్వాత మీడియా తో మట్లాడుతూ..రాహుల్ వెనుక ఎవరూ లేరనుకోవద్దు.. రాహుల్ వెనుక మేమంతా ఉన్నామని.. పబ్ లకి వెళ్లడం తప్పుకాదని, కానీ అక్కడ రాహుల్ పై దాడి చెయ్యడం కరెక్ట్ కాదని, అలా వెళితే కొట్టి చంపేస్తారా అంటూ ఫైర్ అవుతున్నాడు. అదే ప్రెస్ మీట్ ని రాహుల్ ఫ్రెండ్ నోయల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి రాహుల్ కి మద్దతు తెలిపాడు. ఇక ప్రకాష్ రాజ్.. పబ్ లో జరిగిన గొడవలో రాహుల్ సిప్లిగంజ్ తప్పులేదని.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. సో దాడి జరిగిన నాలుగురోజుల కు ఇంతా ఆలస్యంగా ప్రముఖులు స్పందించడం కాస్త విడ్డురమే అయినా.. ఇప్పటికి రాహుల్ వెనక నిలబడ్డారు.
https://www.telugupost.com/movie-news/ntr-hits-to-directors-101518/
“సక్సెస్” పదానికి ఇండస్ట్రీలో ఇచ్చే వేల్యూ మనుషులకి కూడా ఇవ్వరు. ఒక దర్శకుడు, హీరో లేదా హీరోయిన్ సక్సెస్ సొంతం చేసుకొంది అంటే వారి చుట్టూ అందరూ చీమల మంద కంటే దారుణంగా మూగుతారు. కానీ.. ఎన్టీఆర్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. అతడి మునుపటి సినిమాలు చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. “టెంపర్”కి ముందు పూరీ జగన్నాధ్ కు, “నాన్నకు ప్రేమతో”కి ముందు సుకుమార్ కి, “జైలవకుశ”కి ముందు బాబీకి, తాజాగా “అరవింద సమేత”కి ముందు త్రివిక్రమ్ కి కానీ సరైన హిట్ లేదు. పైగా.. వారి మునుపటి సినిమాలు డిజాస్టర్స్ గా డిక్లేర్ చేయబడ్డాయి.ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్లు ఇస్తూ...కానీ.. ఎన్టీఆర్ వారి పాలిట కల్పవృక్షంలా మారాడు. “టెంపర్”తో పూరీ జగన్నాధ్ కి, “నాన్నకు ప్రేమతో” సుకుమార్ కి, “జైలవకుశ”తో బాబీకీ.. ఇక రీసెంట్ గా “అరవింద సమేత”తో త్రివిక్రమ్ కి సూపర్ హిట్స్ ఇవ్వడమే కాక వాళ్ళ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను కట్టబెట్టాడు. దాంతో అప్పటివరకూ ఫ్లాప్ సినిమా డైరెక్టర్స్ తో సినిమాలు చేయకూడదు అనే సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. ఎన్టీఆర్ అభిమానులందరూ సరదాగా “ఎన్టీఆర్ గ్యారేజ్.. ఇచ్చట ఫ్లాప్ డైరెక్టర్స్ కి సక్సెస్ లు ఇవ్వబడును” అని మీమ్స్ చేయడం మొదలెట్టారు. ఏదేమైనా.. ఒక దర్శకుడి కెరీర్ గ్రాఫ్ ను పట్టించుకోకుండా తాను పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడు సదరు దర్శకుడి ప్రతిభను నమ్మి తన కెరీర్ ను రిస్క్ చేయడం అన్నది కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే చెల్లింది.
https://www.telugupost.com/movie-news/డైరెక్ట‌ర్‌కు-షాక్-ఇచ్చి-53664/
టాలీవుడ్ లో రామ్ హీరోగా వచ్చిన నేనూ శైలజ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో ‘నేను లోకల్’ సినిమాతో మరో అద్భుతమైన విజయం అందుకొని టాప్ పొజీషన్లోకి వెళ్లింది. ప్రస్తుతం కీర్తి పవన్ కళ్యాణ్‌ సరసన ‘అజ్ఞాతవాసి’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘మహానటి’ సినిమాలో నటిస్తున్నంది. ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తే..నెంబర్ వన్ రేస్ లోకి దూసుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది..కీర్తి సుకేష్. తెలుగు తో పాటు తమిళ ఇండస్ట్రీ లో కూడా తన సత్తా చాటుతుంది. రీసెంట్ గా తమిళ హీరో విజయ్ తో నటించిన కీర్తీ ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు సమాచారం. భారతీ సినిమా చరిత్రలో నటీనటులపై సినిమాలు తీసింది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో తెలుగులో మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను తీస్తున్నాను అని ప్రకటించేస్తే.. మరోవైపు బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ కూడా వడివడిగా ముందుకు సాగుతుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘మహానటి’ సినిమా కోసం కీర్తి సురేష్ ని బ‌రువు పెర‌గాల‌ని కీర్తికి ద‌ర్శ‌కుడు సూచించాడ‌ట‌. 'మ‌హాన‌టి' సినిమా కోసం కీర్తి చాలా మేకోవ‌ర్ సాధించింది. అయితే మ‌రింత బ‌రువు పెరిగేందుకు మాత్రం కీర్తి సురేష్ నో చెప్పిందట. ఎందుకంటే తాను మరింత లావు పెరిగితే..చాలా లుక్ పోతుందని..మళ్లీ సన్నబడటం చాలా కష్టమని ఖచ్చితంగా చెప్పేసిందట. వాస్తవానికి కీర్తి కాస్త కురచగా ఉంటుంది..దానికి తోడు మరీ లావెక్కితే..చూడటానికి అసహ్యంగా కనిపిస్తుందని భావించి దర్శకుడికి ససేమిరా అని చెప్పేసిందట. గతంలో అనుష్క ‘సైజ్ జీరో’ కోసం విపరీతంగా బరువెక్కి తగ్గడానికి నానా కష్టాలు పడ్డ విషయం తెలిసిందే. బహుషా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని కీర్తి దర్శకుడికి నో చెప్పి ఉండవొచ్చని అనుకుంటున్నారు.
https://www.telugupost.com/movie-news/తన-కొడుకుల-ఫోటోలని-వాడిన-22933/
బాలీవుడ్ స్టార్ హీరో చాలా కాలంగా వేచి చూసిన విజయం కాబిల్ చిత్రం ద్వారా దక్కినప్పటికీ కాబిల్ తో పాటు విడుదలైన రాయిస్ గట్టి పోటీ ఇవ్వటంతో కమర్షియల్ గా ఆశించిన స్థాయి సక్సెస్ సాధించనప్పటికీ విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకులతోనూ మరొక సారి అద్భుతమైన నటుడని కితాబు పొందాడు. తొలి నుంచి వివాదాలకు దూరంగా వుండే హ్రితిక్ రోషన్ కి ఈ మధ్య కాలంలో అటు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తో పాటు ఇటు పూజ హెగ్డే తో ఎఫ్ఫైర్ వార్తలతో పూర్తిగా వివాదాస్పదమైన హ్రితిక్ తాజాగా ప్రముఖ క్లోతింగ్ బ్రాండ్ టామీ హిల్ ఫిగర్ విమర్శిస్తూ వివాదాస్పద ట్వీట్ చేసాడు. స్ప్రింగ్ సమ్మర్ ఆఫర్ అంటూ తమ బ్రాండ్ దుస్తుల్ని ప్రచారం చేసుకునే ప్రాసెస్ లో టామీ హిల్ ఫిగర్ సంస్థ హ్రితిక్ రోషన్ తో పాటు తన అనుమతి లేకుండా హ్రితిక్ వారసుల ఫోటోలని ప్రమోషన్ కి వాడుకుంది. ఈ పరిణామం పై ఘాటుగా స్పందించిన హ్రితిక్ రోషన్, టామీ హిల్ ఫిగర్ పై వ్యంగ్య విమర్శ చేయటానికి తన ట్విట్టర్ ని ప్లాట్ఫార్మ్ గా వినియోగించుకున్నారు. తాను టామీ హిల్ ఫిగర్ బ్రాండ్ దుస్తుల్ని వాడనని, తన పిల్లలు ఆ బ్రాండ్ కి ప్రచార కర్తలు అసలే కారు అని సోషల్ మీడియా సాక్షిగా హ్రితిక్ బ్రాండ్ పరువు తీయటంతో పాటు టామీ హిల్ ఫిగర్ వారి వ్యాపార దృక్పథ కోణాన్ని ఎండగట్టాడు. హ్రితిక్ చేసిన ఈ ట్వీట్ కి వేళా సంఖ్యలో రీ ట్వీట్స్ చేస్తున్నారు హ్రితిక్ రోషన్ ఫాలోయర్స్.Dear Tommy.I dont wear u, neither do my kids endorse u.If u hv lost ur spine I hv a great team 2help u find it.Please (hil)figure urself out
https://www.telugupost.com/movie-news/rrr-receives-golden-globe-award-for-natu-natu-song-1456887
రాజమౌళి దర్శకత్వంలో.. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా RRR. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకూ.. RRR సినిమాపై ప్రశంసలు కురిపించారు. RRRకు వరుసగా అవార్డులొస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవల్ లో అనేక అవార్డులు అందుకున్న RRR.. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును తన సొంతం చేసుకుంది.ఆస్కార్ తర్వాత.. హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఇటీవల RRR నామినేట్ అయింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ నేడు నిర్వహించగా.. RRRసినిమాలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు పొంది.. కొత్త చరిత్రను సృష్టించింది. బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాలులో జరిగిన ఈ వేడుకకు రాజమౌళి, రమ, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణిలు కుటుంబ సమేతంగా హాజరవ్వగా.. కీరవాణి అవార్డును అందుకున్నారు. అభిమానులు, సినీ ప్రియులు కీరవాణికి, RRR చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు.ఇండియా నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న రెండో వ్యక్తిగా కీరవాణి నిలిచారు. తొలిసారి AR రెహమాన్ స్లమ్ డాగ్ మిలినియర్ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. అయితే.. గోల్డెన్ గ్లోబ్ అవార్డునందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా కీరవాణి, తొలి తెలుగు పాటగా నాటు నాటు, తొలితెలుగు సినిమాగా RRR చరిత్ర సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. కీరవాణి స్వరపరిచారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు.. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులతో దుమ్ములేపేశారు. కాగా.. ఆస్కార్ బరిలోనూ..RRR ఈ పాటతోనే పోటీ పడుతోంది.And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie pic.twitter.com/CGnzbRfEPk— RRR Movie (@RRRMovie) January 11, 2023
https://www.telugupost.com/movie-news/దసరాకి-పక్కాగా-అంటున్నార-36161/
మురుగదాస్ డైరెక్షన్ లో స్పైడర్ చిత్రం మొదలు పెట్టి చాలా కాలమే అయ్యింది. కానీ ఇప్పటివరకు చిత్రం షూటింగ్ ఒక కొలిక్కిరాలేదని అంటున్నారు. కారణం మురుగదాస్ ఏ విషయంలోనూ సంతృప్తి పొందకపోవడమే అంటున్నారు. అసలు తన సినిమాల విషయంలో దేనిలోనైనా మురుగదాస్ తీరు ఇలాగే వుంటుందట. తాను అనుకున్నదే కానీ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడని డైరెక్టర్ గా మురుగదాస్ కి పేరు. అందుకే ఇప్పుడు మహేష్ హీరోగా రూపొందుతున్న స్పైడర్ విషయంలోనూ మురుగదాస్ అదే పద్దతి ఫాలో అవుతున్నాడట.అందుకే ఇప్పటివరకు స్పైడర్ చిత్రం షూటింగ్ పూర్తికాలేదని అంటున్నారు.ఇక ఈ విషయంలో మహేష్ కు ముందు కొంచెం కోపం వచ్చినప్పటికీ మురుగదాస్ మీదున్న నమ్మకంతోనే తన డేట్స్ అడ్జెస్ట్మెంట్ కూడా చేసాడట. అయితే ఇప్పుడు స్పైడర్ చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కమిట్ అవ్వడంతో షూటింగ్ ని కాస్త జోరుగా చేస్తున్నారట. ఇకపోతే క్లైమాక్స్ విషయంలో రాజీపడని మురుగదాస్ ఇప్పుడు పాటల విషయంలోనూ అస్సలు రాజీ పడడంలేదట. ఇంకా మిగిలిన రెండు సాంగ్స్ లో ఒక్కోదానికి వారం పది రోజులు షూటింగ్ కోసం కేటాయిస్తున్నాడట. మరి రెండు పాటలకే ఒక నెల సమయం పడుతుండడంతో ఈ సినిమా కోసం మహేష్ మళ్ళీ కొన్ని డేట్స్ ఇవ్వాల్సి వచ్చిందట.ఇక సినిమా షూటింగ్ , పాటల షూటింగ్ మొత్తం జులై ఆఖరివారానికి కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ మీద ఫోకస్ పెడతారట. అసలు ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు కొన్ని నెలల ముందు నుంచే జరుగుతున్నాయట.మరి షూటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ వర్క్ అంతా పూర్తి చేసేసి దసరా విడుదల డేట్ కే స్పైడర్ తో పక్కాగా రావాలని చిత్ర యూనిట్ సమాయత్తమవుతుందట.
https://www.telugupost.com/crime/thieves-attack-women-with-big-stones-in-the-visakha-district-1367937
ఖాకీల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధిత మహిళ విశాఖ జిల్లా కొత్త వెంకోజిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. ఫుల్ గా తాగిన వెంకోజిపాలేనికి చెందిన కల్లేపల్లి వాసు, లోకేశ్ సహా మొత్తం నలుగురు బృందం అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన సమయంలో వారిపై స్థానిక మహిళలు తిరగబడ్డారు. దీంతో దుండగులు మహిళలపై పెద్ద పెద్ద బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గంగలక్ష్మి (60) తమ ఇంటి ముందు మామిడిచెట్టు వద్ద దొంగల అలికిడితో అప్రమత్తమై వారిని తరిమికొట్టే క్రమంలో దొంగలు ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో ఆమె కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా సోమవారం ఉదయం 2 గంటల సమయంలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ ద్వారా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకొచ్చాయి. ఇంత జరిగినా పోలీసులు స్పందించడంలో విఫలమయ్యారు. దుండగులు పారిపోతూ పెద్ద రాయిని తీసుకొచ్చి తనపై విసిరారని.. అది తలకు బదులు తప్పిపోయి కాలుకు తగిలిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అయినా కాలు విరిగి అల్లాడుతున్న మహిళపై కరుణ లేకుండా.. నిందితులను అరెస్ట్ చేయడంలో ఖాకీలు అలసత్వం వహించారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటన జరిగిన వెంటనే 100కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందన కరువైందని.. నేరుగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంది. దీంతో తమ ఇంటి యజమాని గంగలక్ష్మికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాలుకు బదులు తలకు తగిలుంటే మా పరిస్థితి ఏంటని గంగలక్ష్మి కూతుళ్లు ప్రశ్నించారు. ఇలాంటి అల్లరి మూకల ఆట కట్టించేందుకు వెంటనే స్పందించే పోలీస్ వ్యవస్థ కావాలని విశాఖ వాసులు కోరుకుంటున్నట్లు బాధిత కుటుంబీకులు కోరారు. తమకు జరిగిన నష్టాన్ని దొంగల నుంచి వసూలు చేయాల్సిందేనని స్థానికుల డిమాండ్ చేశారు.
https://www.telugupost.com/top-stories/robin-sharma-is-working-as-an-election-strategist-for-tdp-many-programs-are-taking-shape-under-his-leadership-1454801
గతంలో ఎన్నడూ జరిగిన ఘటన కందుకూరు ఘటన. రాజకీయ పార్టీల అగ్రనేతల సభలకు వచ్చి వెళుతూనో, వస్తూనో రోడ్డు ప్రమాదానికి గురయిన ఘటనలు చూశాం. కానీ తొక్కిసలాట జరిగిన ఘటన మాత్రం ఇదే. గతంలో ఎన్నడూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇలాంటి చోట్ల సభలు పెట్టలేదు. రోడ్ షోలు నిర్వహించినా సరైన స్థలంలో ఆయన నిర్వహించేలా చర్యలు తీసుకునే వారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. జగన్, పవన్ కల్యాణ్ వంటి నేతల సభల్లోనూ ఇలాంటి తొక్కిసలాట జరగలేదు. కందుకూరులో నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమే.టీవీల్లో ఎక్కువ మంది...దానిని ఎవరూ కాదనలేరు. కేవలం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ప్రజల్లో జనం ఎక్కువగా వచ్చారని చూపించడమే అసలు లక్ష్యం. దాని కారణంగానే ఇరుకు రోడ్లలో రోడ్ షోలను పెట్టడం ఇటీవల అందరికీ అలవాటుగా మారింది. ఇది రాబిన్ శర్మ ఐడియానే అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక ప్రోగ్రాంలు రూపుదిద్దుకుంటున్నాయి. మహానాడు తర్వాత మినీ మహానాడులకు ప్లాన్ చేశారు. అది మైదానంలో జరగడంతో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. అనంతరం బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టారు. ఇది కూడా కొంత ఇరుకు సందుల్లోనే పెట్టారు.ఐడియా రాబిన్ శర్మదే...ఈ ఐడియా రాబిన్ శర్మ ఇచ్చిందేనంటారు. టీవీల్లో ఎక్కువ మంది జనం కన్పించడానికి ఈ రకమైన ప్లాన్ వ్యూహకర్త రాబిన్ శర్మ చేశారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అదే ఇప్పుడు పార్టీకి అప్రదిష్ట తెచ్చి పెట్టింది. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని రాబిన్ శర్మ టీం ప్లాన్ చేసింది. చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు పర్యటనలను రాబిన్ శర్మ ప్లాన్ చేశారు. అలా వెళ్లిన సందర్భంలో మొదటి రోజునే కందుకూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టూర్ కో-ఆర్డినేటర్ ఎక్కడ?వ్యూహకర్త కేవలం ప్రోగ్రాం డిజైన్ లు చేయడమే కాదు.. అందుకు అనుగుణమైన కార్యక్రమాలను దగ్గరుండే టీంను కూడా ఆయన పర్యవేక్షించాల్సి ఉంటుంది. పార్టీ అధినేత టూర్ ప్రోగ్రాంలకు ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఒక విభాగాన్ని రూపొందించుకోవాలి. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ గా ఒకరిని నియమించుకోవాల్సి ఉంది. అలాంటివేమీ చేయకుండా కేవలం లోకల్ పార్టీ నేతలపైనే వదిలేస్తే ఇలాగే జరుగుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. టిక్కెట్ల కోసం పోటీ పడే నేతలు అలాంటి చోట్లనే సభలను ఏర్పాటు చేస్తారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి నేతల మధ్య పోటీ ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధినేత టూర్ లను చూసుకోవడానికి కో-ఆర్డినేటర్ ను నియమించుకోవాలని, సభల నిర్వహణలకు మార్గదర్శకాలను రూపొందించుకోవాలన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
https://www.telugupost.com/movie-news/lavanya-tripati-124332/
యంగ్ హీరోలందరి తో కలిసి నటించింది. కానీ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది లేదు. పాపం ఆ అన్ లక్కీ హీరోయిన్ ఎవరో కాదు. లావణ్య త్రిపాఠి. భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ అయ్యింది. కానీ ఆ హిట్ క్రెడిట్ మొత్తం నాని, మారుతీ ఖాతాలోనే పడింది. లావణ్య త్రిపాఠి తర్వాత నటించిన సినిమాలన్నీ ప్లాప్ బారినే పడ్డాయి. ఇక ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేతిలో లేని లావణ్య త్రిపాఠి ఒకే ఒక్క సినిమా విడుదల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. అదే నిఖిల్ సరసన నటించిన అర్జున్ సురవరం. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో హీరో నిఖిల్ కే క్లారిటీ లేదు. ఇక హీరోయిన్ లావణ్య కి ఎలా తెలుస్తుంది. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ యాంగిల్స్ తో ఫొటోస్ దిగి పోస్ట్ చేస్తుంది. ఇక చేతిలో ఒక్క అవకాశం కూడా లేని లావణ్య త్రిపాఠి ఎవరన్నా అవకాశం ఇస్తారేమో ఎదురు చూస్తుంది. పండగలకి పబ్బాలకి విషెస్ చెబుతూ అందమైన ఫోజులిస్తుంది. కానీ లావణ్యకి పెద్దగా ఉపయోగం మాత్రం కనబడ్డం లేదు. ఎన్ని అందమైన ఫొటోస్ ఎన్ని యాంగిల్స్ లో పెట్టినా.. లావణ్యానికి మాత్రం అదృష్టం లేదనిపిస్తుంది. పాపం అందమైన లావణ్య త్రిపాఠి అవకాశాల కోసం అర్రులు చాచాల్సిన పరిస్థితి.
https://www.telugupost.com/top-stories/telangana-pcc-president-revanth-reddys-assembly-seat-is-almost-finalized-1478501
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంకా ఎన్నికలకు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఆరు నెలల్లోపు అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. ముందుగానే ప్రజల్లోకి వెళ్లడం వల్ల కొంత సానుకూలత ఏర్పడుతుందని ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సయితం నివేదిక అందించారు. గెలుపు గుర్రాల కోసం ఆయన సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ ఖాయంగా కనిపిస్తుంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అసెంబ్లీ ఎన్నికల్లో...నిజానికి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి పోటీ చేస్తారని నిన్న మొన్నటి వరకూ అనుకునే వారు. 2009, 2014లో రేవంత్ రెడ్డి అక్కడి నుంచే గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. కొడంగల్ నియోజకవర్గం రేవంత్ కు పెట్టని కోట.కొండల్ నుంచి కాకుండా...అయితే ఆయన తన మనసు మార్చుకున్నారని తెలిసింది. కొడంగల్ నుంచి ఈసారి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల కొడంగల్ లో ముఖ్యనేత గుర్‌నాథ్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకువచ్చారు. గుర్‌నాథ్ రెడ్డి సీనియర్ నేత. గతంలో ఐదు సార్లు కొడంగల్ నుంచి గెలిచిన నేత. ఇదే తనకు చివరి ఛాన్స్ అని ప్రజల ముందుకు ఆయన వెళుతున్నారు. ఆయన వైఎస్సార్టీపీలోకి వెళతారనుకున్నా ఎందుకో మళ్లీ ఆగిపోయారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆయనే కొడంగల్ టిక్కెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఎల్బీనగర్ నుంచి...తాను అవసరమైతే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇతర జిల్లాల ప్రజలతో పాటు సెటిలర్లు ఎక్కువగా ఉండటం తనకు కలసి వచ్చే అంశంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎల్బీనగర్ అయితే సులువుగా గెలిచే అవకాశముందని సర్వే రిపోర్టులు కూడా అందాయని చెబుతున్నారు. కొడంగల్ అయితే కొంత కష్టపడాల్సి ఉంది. అంతేకాకుండా పీసీసీ చీఫ్ గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండటంతో కొడంగల్ అయితే ఇబ్బంది ఎదురువుతుందని భావించి రేవంత్ తన మనసు మార్చుకున్నారని చెబుతున్నారు. రేవంత్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/mahesh-babu-movie-stories-fans-108094/
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు డిజాస్టర్ లు కావడంతో ఎంచుకునే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథల విషయంలో ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడు. వంశీ పైడిపల్లి సినిమా లేట్ అవ్వడానికి అదే కారణం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న మహర్షి ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా తరువాత మహేష్.. సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. అంతకముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలా కాకుండా కొంచం జాగ్రత్త పడి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మహర్షిలా ఇది కూడా యూనిక్ సబ్జెక్టుతో ఉండే కథ అని చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ స్టోరీతో… ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. జూన్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. ఇందులో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే అన్ని డీటెయిల్స్ తెలియనున్నాయి. అయితే మహేష్ రీసెంట్ గా తన ఫ్యాన్స్ తో జరిపిన చిట్ చాట్ లో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనెర్ చిత్రాలు చేయనని ఓన్లీ యూనిక్ సబ్జెక్టులను మాత్రం సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తానని చెప్పాడట.
https://www.telugupost.com/movie-news/శోభన్-బాబు-తరుణ్-ల-పేరు-వా-6068/
నలుపు తెలుపు చిత్రాల కాలంలో శోభన్ బాబు నటించిన సోగ్గాడు చిత్రం మహా పెద్ద సంచలనం. ఆ రోజుల్లో దగ్గుబాటి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో నిర్మించారు. 2005 లో అదే సంస్థలో దగ్గుబాటి సురేష్ బాబు తరుణ్, ఆర్తి అగర్వాల్ నటీనటులుగా రవి బాబు దర్శకత్వంలో సోగ్గాడు అనే టైటిల్ తో చిత్రాన్ని నిర్మించి ఎదురు దెబ్బ తిన్నారు. కాని ఆ టైటిల్ పై ఇంకా మన వాళ్లకు మోజు పోలేదు. దర్శకుడిగా జ్యో అచ్చుతానంద చిత్రంతో విజయ పతాకం ఎగుర వేసిన అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా ప్రముఖ చిత్ర పంపిణీ సంస్థ ఐన అభిషేక్ పిక్చర్స్ ఒక చిత్రాన్ని నిర్మిస్తుంది.బాలీవుడ్ లో వినూత్న కథాంశంతో తెరకెక్కి ఒక వర్గ ప్రేక్షకులకు బాగా చేరువ ఐన చిత్రం హంటర్. ఆ కథను తెలుగులో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేసే విధంగా కథనం లో శ్రద్ద తీసుకుంటున్నారంట నిర్మాతలైన అభిషేక్ పిక్చర్స్ వారు. నటుడిగా కూడా అవసరాల శ్రీనివాస్కు గుర్తింపు ఉంది. అయితే ఈ చిత్రంతో కామెడీ చేయగల అవసరాల శ్రీనివాస్ ను ఇండిపెండెంట్ కామెడీ హీరో గా నిలబెట్టే సరైన ప్రయత్నం ఇది అని బలంగా నమ్ముతుంది అభిషేక్ పిక్చర్స్ యాజమాన్యం. హంటర్ చిత్ర తెలుగు రీమేక్ కి కూడా సోగ్గాడు అనే పేరును ఖరారు చేయనున్నారు.ఈ హిందీ రీమేక్ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ సరసన మిష్టి చక్రవర్తి, శ్రీ ముఖి నటించనున్నారు.
https://www.telugupost.com/movie-news/akkineni-samantha-in-a-new-look-139523/
అక్కినేని కోడలు సమంత సినిమాల్లోనే కాదు.. బయట కూడా పిచ్చేక్కిస్తూనే ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో దూసుకుపోతున్న సమంత కి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు లేకపోయినా… తనకు నచ్చిన మెచ్చిన కథల్లో నటిస్తూ బిజీ తారగా వెలిగిపోతుంది. కెరీర్ లోనే కాదు భర్త చైతు తో కలిసి వెకేషన్స్ అంటూ ఎపుడు బిజీగా గడిపే సమంత జిమ్ లో వర్కౌట్స్ కూడా మానదు. శరీరాకృతిని ఫిట్ గా వుంచుకోవడానికి నిరంతరం జిమ్ చేసే సమంత ఇప్పటికి ఫిట్ గా హాట్ గా స్పైసి గా వెలిగిపోతుంది. తాజాగా సమంత చాలా స్టైలిష్ లుక్ లో రాయల్ గా నడిచొచ్చే రాజా హంస లా అదిరిపోయే ఫోజుతో అదిరిపోయే లుక్ తో… కనబడుతుంది. చేతిలో డైరీ తో, మేడలో హ్యాండ్ బాగ్ తో.. కళ్ళకు కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకుని ఉన్న సమంత ని చూస్తుంటే… స్టార్ హీరోస్ ఎందుకు సమంత ని మిస్ చేసుకున్నారో అనిపించక మానదు. మరి నిజంగా సమంత లుక్ చూస్తే అదే అనిపిస్తుంది. అంతలాంటి అందంతో.. చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న సమంత నటించిన 96 విడుదలకు సిద్దమవుతుంది. అలాగే మరో వెబ్ సీరీస్ కూడా త్వరలోనే ప్రైమ్ లోకి రాబోతుంది.
https://www.telugupost.com/movie-news/big-boss-contestent-sentiment-90186/
మొదట్లో బిగ్ బాస్ సీజన్ 2 మీద ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. నాని యాంకరింగ్, కంటెస్టెంట్స్ విషయంలో బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరిచారు. కానీ క్రమేణా నాని చెప్పినట్లుగా ఏదైనా జరగొచ్చు అంటూ.. వారానికో రచ్చ జరగడం ప్రేక్షకుల్లో రేపేమవుతుందా అనే క్యూరియాసిటీ కలిగేలా చేసి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేసింది స్టార్ మా యాజమాన్యం. తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 చివరి వారంలోకి ఎంటర్ అయ్యింది. టాప్ ఫైవ్ లో కౌశల్, తనీష్, దీప్తి నల్లమోతు, గీత మాధురి, సామ్రాట్ లు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా దీప్తి, తనీష్, కౌశల్ మధ్య గట్టి పోటీ ఉంటుందని, వారు టాప్ త్రీ లో ఉంటారని గత వారం ఎలిమినేట్ అయిన రోల్ రిడా చెప్పినట్లుగా అందరూ భవిస్తున్నారు కూడా.బ్యాలెన్స్ తప్పిన కౌశల్...అయితే అందులో ఎక్కువగా కౌశల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అంటూ బయట కౌశల్ ఆర్మీ నానా రచ్చ చేస్తున్నారు. నాని గనక కౌశల్ ని బిగ్ బాస్ విన్నర్ గా ప్రకటించకపోతే నాని సినిమాలు ఆడనివ్వమనే రేంజ్ లో హంగామా సృష్టిస్తున్నారు. ఇక కౌశల్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో తానేదో ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. మొదట్లో సైలెంట్ గా ఉన్న కౌశల్... కిరీటి, తేజు, భాను, బాబు గోగినేని చేసిన చిన్న చిన్న తప్పులతో హీరో అయ్యి కూర్చున్నాడు. అయితే వాళ్లు షో నుండి వెళ్లిపోయాక కౌశల్ ఫ్రెండ్ నూతన నాయుడు రెండుసార్లు బయటికెళ్లోచ్చి కౌశల్ నీకు బయట బాగా సపోర్ట్ ఉంది నువ్వే బిగ్ బాస్ విన్నర్ అని చెప్పడంతో.. బాగా ఎక్కించుకున్న కౌశల్ ఒకానొక టైం లో బ్యాలెన్స్ తప్పి హౌస్ మేట్స్ ని కుక్కలతో పోల్చడం.. యాంకర్ నాని వివరణ అడిగితె.. తలా తోక లేని సమాధానం చెప్పడం.. నీకు నీవు క్యాంపైన్ చేసుకో అని నాని అంటే.. ఏదో పులి మేక కథ చెప్పడం.. హౌస్ మేట్స్ అంతా వేస్ట్ తానే బెస్ట్ అని... తనకి హౌస్ మేట్స్ మొత్తం కలిసి బిగ్ బాస్ టైటిల్ ని తన చేతిలో పెట్టెయ్యాలన్నట్టుగా డబ్బా కొట్టుకోవడం కౌశల్ తీరుని మరింతగా దిగజార్చాయి.తల్లి.. కూతురి సెంటిమెంట్..!అయితే కౌశల్ తాను ఒంటరిగా పోరాడుతున్నానంటూ... తనకి హౌస్ మేట్స్ అస్సలు హెల్ప్ చెయ్యడం లేదంటూ.. తన అమ్మ సెంటిమెంట్ ని ఎక్కువగా అప్లై చేస్తూ వస్తున్నాడు. అవసరమైనప్పుడు, అనవసరమైనప్పుడు తల్లి సెంటిమెంట్ తో ప్రేక్షకుల మైండ్ ని వీక్ చేస్తున్నాడు. ఇక రెండేళ్ల కూతురు లల్లి సెంటిమెంట్ ని కూడా కౌశల్ వదలడం లేదు. హౌస్ మేట్స్ నవ్వుతూ అన్న చిన్న మాటను పట్టుకుని దాన్నే కొండంత చేసి రెండేళ్ల పాప మీద పడి ఏడుస్తున్నారనడం కౌశల్ లోని మరోకోణాన్ని చూపెడుతుంది. మరి టాప్ ఫైవ్ లోకి కౌశల్ పేరు ఎనౌన్స్ చెయ్యగానే.. అమ్మ అంతా నీ వల్లే... నీ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పడం.. ఇక కూతురు లల్లి చేసిన ప్రేయర్ కూడా తనని టాప్ ఫైవ్ లోకి చేర్చినదని... ఇక టైటిల్ విన్నర్ అవడం కోసం తనకి ఎవరి సపోర్ట్ అక్కర్లేదన్నట్టుగా మాట్లాడటం చూస్తుంటే కౌశల్ కి తానే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అని ముందే తెలిసిపోయిందేమో... అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఏదైనా దీప్తి వంటి వాళ్లు చేసిన హెల్ప్ మర్చిపోయి.. కౌశల్ ఇలా ఒంటరి పోరాటం చేస్తూ తల్లి సెంటిమెంట్ ని, కూతురు లల్లి సెంటిమెంట్ ని పుష్కలంగా వాడుతున్నాడంటూ సెటైర్స్ వేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/bharat-ane-nenu-collections-in-chennai-67689/
కొరటాల - మహేష్ క్రేజీ కాంబో లో వచ్చిన 'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ హిట్. మళ్ళీ అదే క్రేజీ కాంబో రిపీట్ అవడము 'భరత్ అనే నేను' తో మళ్ళీ హిట్ కొట్టడము జరిగిపోయాయి. నిన్న శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భరత్ అనే నేను' అప్పుడే కలెక్షన్స్ మోత మోగించేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు థియేటర్స్ లలో విడుదలైన 'భరత్ అనే నేను' హిట్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దున్నేస్తుంది. అయితే నిన్నగాక మొన్న థియేటర్స్ సమ్మె విరమించుకున్న తమిళనాట కూడా 'భరత్ అనే నేను' విడుదలై విజయదుందుభి మోగించింది. అక్కడ తమిళ ప్రేక్షకులు గత పది రోజులుగా తెలుగు సినిమాలు కూడా థియేటర్స్ లో ఆగిపోవడం.... మరి సినిమా ప్రియులు వెండితెర మీద బొమ్మ కోసం మొహం వాచిపోయి ఉన్నారు.అందుకే 'భరత్ అనే నేను' చెన్నైలో తొలిరోజున భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజునే తొలి రికార్డును చెన్నై నుంచే 'భరత్ అనే నేను' మొదలుపెట్టింది. చెన్నై లో అత్యధిక థియేటర్స్ లో విడుదలైన 'భరత్ అనే నేను' తొలిరోజున చెన్నైలో 27 లక్షలకి పైగా గ్రాస్ ను వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది. మార్చ్ 30 న రామ్ చరణ్ 'రంగస్థలం' కూడా చెన్నై లో అధిక థియేటర్స్ లో విడుదలై మొదటిరోజున రికార్డు స్థాయిలో 25 లక్షల గ్రాస్ ను వసూలు చేసి అప్పటికి గాను మొదటిస్థానంలో నిలిచింది. కానీ మహేష్ 'భరత్ అనే నేను' 'రంగస్థలం' కన్నా రెండు లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి మొదటి స్థానానికి చేరిపోయి రికార్డు కోట్టేసింది.మరి కొరటాల శివ మహేష్ కి మళ్ళీ మరిచిపోలేని హిట్ అందించాడు. ఇంతకూ ముందు శ్రీమంతుడితో రికార్డులు సృష్టించిన ఈ కాంబినేషన్ లో మళ్ళీ భరత్ అనే నేనుతో కూడా రికార్డుల వేట మొదలెట్టేసింది. ఇక భరత్ అనే నేను మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 21.88 కోట్ల షేర్స్ రాబట్టింది.
https://www.telugupost.com/movie-news/dhanaraj-comments-on-jabardast-show-and-nagababu-151453/
ఈటీవీలో జబర్దస్త్ మొదలవ్వడానికి వెనుక నాగబాబు ఉన్నాడు.. ఆయన వలనే జబర్దస్త్ మొదలైంది. ఇక అప్పటినుండి నాగబాబే జబర్దస్త్ ని బాగా హ్యాండిల్ చేసాడనే ప్రచారం జరిగింది. చాలామంది అదే నిజమనుకున్నారు. కానీ తాజాగా ఓ కమెడియన్ మాత్రం జబర్దస్త్ పుట్టడానికి నాగబాబు కారణం కాదు.. నేనే అంటున్నాడు. ఒకప్పుడు జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్ గా మంచి స్కిట్స్ కొట్టిన ధనాధన్ ధనరాజ్…. జబర్దస్త్ మొదలైనప్పుడు జబర్దస్త్ స్కిట్స్ లో చాలా ఆక్టివ్ గా ఉంటూ… మంచి స్కిట్స్ చేసిన ధనరాజ్ సినిమా అవకాశాలతో బిజీ కావడం.. తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇవ్వలేక… నాగబాబు తో పాటు జీ ఛానల్ అదిరింది ప్రోగ్రాంలో చేరి.. స్కిట్స్ చేస్తున్నాడు. ఇక జబర్దస్త్ పుట్టడానికి గల కారణాలు ఏమిటనేది ధనరాజ్ మాటల్లో…. జగడం, పరుగు, గోపి గోపిక గోదావరి, భీమిలి కబడ్డీ జట్టు తో ఫామ్ లోకొచ్చిన మేనేజర్ ఎడుకొండలు తనను కలుసుకుని కామెడీ షో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అని అడగడం తర్వాత చంద్ర ని వేణు, రఘు వంటి కమెడియన్స్ ను పిలిపించి ఒప్పించి ఈ జబర్దస్త్ షో మొదలెట్టినట్టుగా చెబుతున్నాడు. ఇక నేనే ప్రతి ఒక్కరికి వారి పారితోషికాన్ని కూడా ఖరారు చేశానని అలా 13 ఎపిసోడ్లు చేశానని చెబుతున్నాడు. అలాగే జబర్దస్త్ షో మొదలైనప్పటినుండే మంచి క్రేజ్ తెచ్చుకుందని.. తర్వాత కొత్తవాళ్లు రావడంతో.. షోలో మార్పులు జరిగాయని.. ఇక నాగబాబు గారు జబర్దస్త్ ని చక్కగా హ్యాండిల్ చేసేవారని చెప్పిన ధనరాజ్.. నాగబాబు జబర్దస్త్ ని వదిలి అదిరింది షో చేస్తున్నప్పుడు ధనరాజ్ ని పిలిచి అదిరింది చెయ్యమన్నారని.. అయితే జబర్దస్త్ కి స్టార్ డం తెచ్చి.. జబర్దస్త్ ఎదుగుదలకి పాటుపడడంతో.. ఆయన మాట కాదనలేక అదిరింది చేస్తున్నా అంటూ.. జబర్డస్ట్ పుట్టుపూర్వోత్తరాలు వివరించాడు.
https://www.telugupost.com/movie-news/పూజ-కి-బంపర్-ఆఫర్-తగిలింద-61800/
డీజే చిత్రంతో హీరోయిన్ గా నిలదొక్కుకున్న హాట్ భామ పూజ హెగ్డే... దువ్వాడ జగన్నాథంలో గ్లామర్ షో చేసినందుకు బాగానే వర్కౌట్ అయినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే డీజే తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సాక్ష్యంలో నటిస్తున్న పూజ హెగ్డే ఆ సినిమాకి కోటిన్నర అందుకుంటుందనే టాక్ ఉంది. కేవలం శ్రీనివాస్ పక్కన కొట్టిన్నర ఛాన్స్ మాత్రమే కాదు... సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన వంశి పైడిపల్లి డైరెక్ట్ చెయ్యబోయే సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. మరి డీజే తో అదృష్టం తన్నుకొచ్చిన పూజ కి ఇప్పుడు మరో బడా ఆఫర్ తగిలిందని న్యూస్ వినబడుతుంది.అదేమిటంటే బాహుబలి తర్వాత సాహోలో నటిస్తున్న ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. మరి బాహుబలితో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ పక్కన సాహోలో ఏకంగా బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ నటిస్తుండగా.. ఇప్పుడు రాధాకృష్ణ డైరెక్ట్ చెయ్యబోయే సినిమాలో పూజ హెగ్డేని హీరోయిన్ గా ఫైనల్ చేసారని అంటున్నారు. హీరోయిన్ గా పూజ హెగ్డే ఫైనల్ అని... కేవలం అధికారిక ప్రకటనే ఆలస్యం అంటున్నారు. మరి ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గోపికృష్ణ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పక్కన పూజ హెగ్డే ఫిక్స్ అన్నమాట.ఈలెక్కన ఒక్కసారిగా పూజ హెగ్డే వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో బుక్ అవుతుంది. ఇదిలా ఉంటె మరో పక్కన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో కూడా పూజ హెగ్డేని పరిశీలనలోకి తీసుకుంటున్నారనే టాక్ ఉంది. మరి నిజంగానే ఎన్టీఆర్ పక్కన కూడా పూజ హెగ్డే గనక నిజమైతే ఇక పూజ కి టాలీవుడ్ లో తిరుగులేని కిరీటం దక్కుతుంది. మరి పూజ కి వస్తున్నా ఆఫర్స్ తో ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న అను ఇమ్మాన్యువల్, కీర్తి సురేష్, సమంత ల పరిస్థితి ఏమిటో.
https://www.telugupost.com/movie-news/prabhas-shradha-kapoor-saaho-movie-review-131682/
దాదాపు 350 కోట్లు బడ్జెట్ తో ప్రభాస్ నటించిన సాహో చిత్రం నైట్ యూఎస్ లో ప్రీమియర్స్ రూపంలో రిలీజ్ అయింది. దాంతో ఈసినిమా ఎలా ఉందనే టాక్ వచ్చేసింది. దర్శకుడు సుజీత్‌ తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సినిమాను ప్రేక్షకుడి ఊహకందని రీతిలో అదరగొట్టాడని టాక్. అందరు ఇంటర్వల్ ట్విస్ట్ అదిరిపోయిందని మాట్లాడుతున్నారు. చాలా గ్రాండ్‌ విజువల్స్‌తో అదరిపోయిందని టాక్‌ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రధాన పాత్రల పరిచయం చేస్తూ సెకండ్ హాఫ్ హై వోల్ట్ ఏజ్ యాక్షన్ సీక్వెన్స్ తో అదిరిపోయిందని చెబుతున్నారు. ఓవరాల్ గా ఈమూవీ గురించి ఓవర్సీస్ ఆడియెన్స్ చెబుతున్న ప్రకారం ..అసలు మనం చూసింది ఇండియన్ సినిమానా లేదంటే హాలీవుడ్ సినిమానా అనే ఆశ్చర్యంలోకి వెళ్లిపోయారని తెలుస్తుంది. ఇండియా లో ఈమూవీ కనీసం 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెబుతున్నారట. ఫ్యాన్స్ కు ఈమూవీ ఒక ఫీస్ట్ అని చెబుతున్నారు. ఇండియన్ హిస్టరీ లోనే మునుపెన్నడూ చూడని బెస్ట్ యాక్షన్ సీక్వెన్సులు ఈ చిత్రంలో ఉన్నాయంటున్నారు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి అని చెబుతున్నారు. ‘సాహో’ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదల అయ్యింది.
https://www.telugupost.com/crime/delhi-man-sets-up-camera-suspecting-dad-of-black-magic-accidentally-films-him-rping-girl-1482873
16 ఏళ్ల బాలికపై 68 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ లో దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో కలకలం రేగింది. ఆ వీడియోను వృద్ధుడి కుమారుడే తీయడం గమనార్హం. వీడియో బయటపడటంతో బాధిత బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఇంటి పక్కనే నిందితుడైన వృద్ధుడు ఉండేవాడు. తాత వయసున్న వ్యక్తి కావడంతో.. ఆ బాలిక ఇంటికి తరచూ వెళ్లినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. పూజల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక యాత్రలకు కూడా వాళ్లతో కలిసి వెళ్లేవాడు.ఒక రోజు బాలికకు ఏదో విషయం చెప్పి.. తన ఇంటికి తీసుకెళ్లిన వృద్ధుడు.. ఓ మూలకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించాడు. అయితే ఇదంతా ఆ వృద్ధుడి కొడుకు(40) వీడియో తీశాడు. అందుకు కారణం తండ్రి చేతబడులు చేస్తున్నాడేమో అని అతనికి కలిగిన అనుమానమే. అందుకే ఆ గదిలో ఒక ఫోన్ ను రికార్డింగ్ లో పెట్టి ఉంచాడు. ఆ ఫోన్ లో వృద్ధుడు బాలికపై చేసిన అఘాయిత్యం రికార్డయింది. ఆ వీడియోను వృద్ధుడి కొడుకు బాలిక తండ్రికి చూపగా.. అతను పోలీసులను ఆశ్రయించాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆ తండ్రి-కొడుకులకు మధ్య మాటల్లేవంట. నిందితుడితో పాటు అతని కొడుకుని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీడియో ఉన్న ఫోన్లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
https://www.telugupost.com/movie-news/పెద్దగా-ఏం-లేదంటూనే-రికా-40353/
మహేష్ బాబు - మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రం విడుదలకు రంగంసిద్ధం చేస్తూనే పబ్లిసిటీ స్టెంట్ స్టాట్ చేసింది. మహేష్ పుట్టినరోజు కానుకగా 'స్పైడర్' సెకండ్ టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ విషయమై కాస్త గందరగోళమే ఏర్పడింది. ఎందుకంటే ఈ టీజర్ '1 నేనొక్కడినే' టైప్ లో ఎవ్వరికి అర్ధమవలేదనే కామెంట్స్ పడుతున్నాయి. కేవలం ఇంటిలిజెంట్ బ్రైన్స్ కి మాత్రమే 'స్పైడర్' టీజర్ అర్ధమవుతుందని.... బిసి సెంటర్స్ కి 'స్పైడర్' సినిమా ఎలా అర్ధమవుతుందంటూ కొత్త వాదనకు తెర తీశారు కొందరు. ఈ టీజర్ లో 'స్పైడర్' కథ ఏమిటనేది రివీల్ కాకుండా మురుగదాస్ అతి జాగ్రత్త వలెనే ఈ టీజర్ అర్ధం కాలేదనే వాదన వినబడుతుంది. మరి మహేష్ అభిమానులేమో మహేష్ బాబు ఎంతో అందంగా వున్నాడని టీజర్ కేక అని అంటున్నారు. కేవలం మహేష్ అభిమానులే కాదు వెబ్ మీడియా, సోషల్ మీడియాలో కూడా 'స్పైడర్' టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక 'స్పైడర్' టీజర్ యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. మరి పైన చెప్పినట్టు 'స్పైడర్' టీజర్ లో భారీతనం తప్ప కొత్తదనం లేదనే విమర్శలొస్తున్నప్పటికీ.... 'స్పైడర్' సినిమా టీజర్ మాత్రం సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మరి ఈ దూకుడుతోనే 'స్పైడర్' టీజర్ యూట్యూబ్లో కోటి వ్యూస్ కి చేరువైంది. తెలుగు తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మురుగదాస్ ఎప్పటినుండో మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. మహేష్ స్పై గా కనిపించనున్న ఈచిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ కి జోడిగా, ఎస్ జె సూర్య 'స్పైడర్' లో విలన్ గా భరత్ వంటి హీరో మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 27 న విడుదల చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/బాబు-ద్విపాత్రానభినయం-చే-46383/
తెలుగులో విలన్ గా, హీరోగా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా ఇరగదీసిన మోహన్ బాబు ప్రస్తుతానికి సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు అనలేం గాని సినిమాలు చేసే వేగాన్ని మాత్రం తగ్గించాడు. 30 ఏళ్ళ పాటు విరామం లేకుండా నటించి ప్రస్తుతానికి సెలెక్టెడ్ గా కాకుండా అతి తక్కువ సినిమాలు చేస్తున్నాడు. విష్ణు హీరోగా మోహన్ బాబు రౌడీ సినిమా తర్వాత ప్రస్తుతానికి గాయత్రీ సినిమాలో నటిస్తున్నాడు. మోహన్ బాబు మెయిన్ లీడ్ లో పెళ్లైన కొత్తలో ఫేమ్ మదన్ దర్శకత్వంలో గాయత్రీ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ఈ మధ్యనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నిఖిల ముఖ్యపాత్రలో నటిస్తుంది.ఇకపోతే ఈ గాయత్రీ చిత్రంలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. ఇక ద్విపాత్రాభినయం అంటే ఏ తండ్రి, కొడుకులుగానో.. లేకుంటే అన్నదమ్ములుగానో కాదండోయ్.... ఒక పాత్ర హీరో పాత్ర అయితే మరొక పాత్ర విలన్ పాత్ర అంటున్నారు. మరి మోహన్ బాబు హీరోగా, విలన్ గా ఎలా కనిపించాడో అనేది గతంలోనే తెలుసు. మోహన్ బాబు విలనిజాన్ని కామెడీతో కలిపి పండించేవాడు. హీరోగా కూడా ఆరడుగుల అందగాడిగా మెప్పించేవాడు. మరి ఇలా ఒకే సినిమాలో హీరో, విలన్ కేరెక్టర్స్ అంటే మాత్రం మోహన్ బాబు ఎలా కనబడతాడో అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగానే ఉంది.లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్ మీద మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న ఈసినిమాలో నిఖిల, మెహన్ బాబుకి కూతురిగా కనబడనుందట. ఇక మోహన్ బాబు హీరో, విలన్ పాత్రలు రెండు నడివయసు పాత్రలు అంటున్నారు.
https://www.telugupost.com/movie-news/అబ్బో-మెగా-అవకాశాలు-బాగా-29090/
హాట్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ ఎప్పుడూ టాక్ అఫ్ ద ఇండస్ట్రీనే. యాంకరింగ్ లో హాట్ హాట్ గా కనిపిస్తూ అదే అదనుగా వెండితెర మీద కూడా అవకాశాలు పెట్టేస్తూ దూసుకుపోతుంది. 'క్షణం' సినిమాలో కీ రోల్ పోషించిన అనసూయ 'విన్నర్' సినిమాలో ఐటెం సాంగ్ లోచెలరేగిపోయింది. అయితే అనసూయ నాకు నచ్చితే ఏదైనా చేస్తానంటుంది. అందుకే ఐటెం సాంగ్ లో నటించానని చెబుతుంది. బులితెరమీద క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అనసూయ ఇప్పుడు వెండితెర మీద బాగా బిజీ అయ్యేట్టు కనబడుతుంది.ఇప్పుడు అనసూయకి ఒక బంపర్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చినట్లు చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్క చిత్రంలో అనసూయ కి ఒక రోల్ కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా సమంత నటిస్తుండగా మరో ముఖ్య పాత్ర కోసం అనసూయని సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సమంత షూటింగ్ లో జాయిన్ కాగా అనసూయ కూడా రేపోమాపో ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా అనసూయ కష్టం ఊరికే పోలేదు. ఆమధ్యన చాలా హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేయించుకుని డైరెక్టర్స్ కి, కుర్రకారుకి సవాల్ విసిరిన అనసూయకి హీరోయిన్ గా అయితే అవకాశాలు రాలేదు గాని ఇలా ఐటమ్స్ కి, స్పెషల్ రోల్స్ కి మాత్రం అవకాశాలు తెగ వచ్చేస్తున్నాయి. ఒకే ఏడాది ఇలా ఇద్దరి మెగా హీరోల సినిమాల్లో నటిస్తున్న అనసూయకి అదృష్టం బాగానే పట్టిందని చెప్పాలి.
https://www.telugupost.com/crime/road-accident-took-place-in-komurambhim-asifabad-district-two-bikes-collided-and-three-died-1532589
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి వద్ద జరిగింది. ప్రమాద సమాచారాన్ని వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతులు ముగ్గురూ...మృతులు మహేష్, వెంగళరావు, నర్సింహగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి ముగ్గురు వ్యక్తులు మరణించడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా, వేగంగా బైకులు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది.
https://www.telugupost.com/telangana/political-parties-seem-to-put-brakes-on-the-hydra-bulldozer-situation-has-changed-with-revanth-reddy-on-one-side-and-all-the-other-political-parties-on-one-side-1549268
హైడ్రా బుల్‌డోజర్ కు రాజకీయ పార్టీలు బ్రేకులు వేసేటట్లే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే ఒక వైపు మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపుగా పరిస్థితి మారింది. గత నెలరోజుల నుంచి హైడ్రా దూకుడుగా ముందుకు వెళుతుంది. చెరువులను, నాలాలను, కుంటలను ఆక్రమించిన వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేస్తుంది. ఇందులో రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. సామాన్యులు మాత్రం ఎవరూ లేరు. ఇక అక్రమంగా నిర్మించిన తమ కట్టడాలను ఎక్కడ కూల్చివేస్తారోనని బిల్డర్లకు కూడా భయం పట్టుకుంది. అన్నీ వెరసి రాజకీయ పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒంటి కాలు మీద లేస్తున్నాయి.నెల రోజుల నుంచి జరుగుతున్నా...హైడ్రా ఇప్పటి వరకూ పద్దెనిమిది చోట్ల కూల్చివేతలను చేపట్టింది. దీంతో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులను ఆక్రమించి పెద్దపెద్ద భవంతులను కట్టారు. అయితే ఇది మొదలు మాత్రమే. ఇంకా చాలా మిగిలి ఉంది. అనేక ఫాం హౌస్ లో ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. బఫర్ జోన్ ను ఆక్రమించి మరీ బడాబాబులు నిర్మాణాలు చేపట్టారు. కేవలం ఫాం హౌస్ లు మాత్రమే కాదు మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీలను నిర్మించారు. వారు ముందుగానే జాగ్రత్త పడి న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే లు తెచ్చుకుంటున్నారు. దీంతో వాటి జోలికి వెళ్లడానికి బుల్ డోజర్ కు బ్రేకులు పడినట్లయింది. పొలిటికల్ పార్టీలు...ఇక ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ అయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని పార్టీలూ ఏకమై తమ గొంతును హైడ్రా వైపు తిప్పాయి. రాజకీయ కుట్రలుగా దీనిని కొట్టిపారేస్తూ తేలిక పర్చే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా ఒక వైపు మాత్రమే చూస్తుందని, రెండో వైపు చూడటం లేదని ఆరోపిస్తూ మానసికంగా అధికారులను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ తొలి నుంచి ఈ కూల్చివేతలను వ్యతిరేకిస్తుంది. ఇక బీజేపీ మాత్రం ఎంఐఎం నేతల ఆస్తుల జోలికి ఎందుకు పోరంటూ ప్రశ్నలు సంధిస్తుంది. అయితే ఇప్పటికే ఎంఐఎం, ఎమ్మెల్సీల నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది. ఎంఐఎం అయితే ప్రభుత్వ భవనాలు కూడా ఎల్‌ఎఫ్‌టీ పరిధిలో ఉన్నాయని వాటిని కూల్చేస్తారా? అని ప్రశ్నిస్తుంది. రేవంత్ స్పందించిన తర్వాతే....కానీ ఇదంతా రేవంత్ రెడ్డి హైడ్రా కూల్చివేతలపై స్పందించిన తర్వాతనే రాజకీయ పార్టీల నేతల నోళ్లు తెరుచుకున్నాయి. చెరువులను ఆక్రమించిన నిర్మాణాలను దేనినీ వదలబోమని ఆయన స్పష్టం చేశారు. చెరువులకు పూర్వ వైభవం తెస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. రాజకీయ పార్టీల నేతలు కూడా తమ నిర్మాణాలను కూల్చివేస్తుంటే సహకరించాలని కోరారు. అదిగో అప్పటి నుంచే ఈ రచ్చ మొదలయింది. కొందరు హామీలు అమలు చేయలేక డైవర్ట్ రాజకీయాలు చేస్తారంటున్నారు. మరికొందరు ముందు మమ్మల్ని కాల్చమని ఛాలెంజ్ లు విసురుతున్నారు. మరికొందరు దమ్ముంటే అవతల వారి భవనాలను కూల్చివేయండి అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే హైడ్రాకు రాజకీయ చెదలు పట్టుకున్నట్లే కనిపిస్తుంది.
https://www.telugupost.com/movie-news/మళ్ళీ-మళ్ళీ-అదే-తప్పు-చేస-40226/
టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న ప్రకాష్ రాజ్ నటన అంటే అందరికి ఎంతో ఇష్టమే. ప్రకాష్ రాజు స్టార్ హీరోల సినిమాల్లో తండ్రి, అన్న, విలన్ పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రకాష్ రాజ్ సినిమాల్లో నటనకు ఎంత పేరుందో .... సినిమాల సెట్స్ లో మాత్రం ఆయన చెప్పిన సమయానికి, ముందుగా ఇచ్చిన షెడ్యూల్‌కి తగ్గట్లుగా రాడు. వచ్చినా కూడా ఆయనతో ఓ సీన్‌ తీసేసరికి ఆయనను భరించడం కష్టమవుతుందని పలువురు దర్శకనిర్మాతలు చెబుతూ ఉంటారు. నిత్యం వివాదాల్లో ఉండే ఈయన తన ప్రవర్తన కారణంగా అనేక చిత్రాలలో చాన్స్‌లు పోగొట్టుకున్నాడు. ఇక రాజమౌళి వంటి దర్శకుడే 'విక్రమార్కుడు'లో ఓ చిన్న పాత్ర ఇచ్చి షూటింగ్‌లో నానా ఇబ్బందులు పడి వదిలేశాడు.అలాగే ప్రకాష్ రాజు ఇండస్ట్రీలో శ్రీనువైట్లతో పాటు పలువురితో తగాదాలు కూడా పెట్టుకుంటాడు. ఇక ఈయన దెబ్బకు బలైన నిర్మాతల ఒత్తిడితో ఆయనపై ఒకసారి బహిష్కరణ వేటు కూడా పడింది. ఇక నేటి దర్శకులలో కొరటాల శివది డిఫరెంట్‌ స్టైల్‌. ఆయన పెద్దగా ఎవరిని కోపగించుకోడు. ప్రస్తుతం ఆయన దానయ్య నిర్మాతా 'శ్రీమంతుడు' తర్వాత మహేష్‌బాబుతో రెండో చిత్రం 'భరత్‌ అనే నేను' చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఇక ఇందులో మహేష్‌బాబు యంగ్‌ సీఎంగా నటిస్తుండగా మరో కీలకమైన పాత్రకు కొరటాల ప్రకాష్‌రాజ్‌ని తీసుకున్నాడు. కానీ ఆయన అసలు సమయానికే రావడం లేదట. ఉదయం రావాల్సిన వ్యక్తి, సాయంత్రం బ్రేక్‌ చెప్పే సమయంలో వస్తూ ఉండటం, ఆయన మీద ఒక్క సీన్‌ కూడా తీయకుండానే ప్యాకప్‌లు జరుగుతుండటంతో కొరటాల శివ ఆయనపై ఎంతో కోపంగా ఉన్నాడట.మరి ఇంతగా యిబ్బంది పెడుతున్న ప్రకాష్ రాజ్ స్థానంలోకి వేరే వారిని తీసుకోవాలని కొరటాలఫిక్స్‌ కాగా, దానికి నిర్మాత దానయ్య కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మహేష్‌బాబు ను కూడా సంప్రదించి, ప్రకాష్‌రాజ్‌ ప్రవర్తనను ఆయనకు కూడా విడమరిచి చెప్పి, తమను ఆయన ఇబ్బంది పెడుతున్న తీరు, ఈ చిత్రాన్ని ఎలాగైనా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనే పట్టుదలతో ఉండటంతో మహేష్‌ అనుమతితో ఈ పాత్రకు వేరొకరిని తీసుకోనున్నారని తెలుస్తోంది. ఆయన పాత్రలో రావు రమేష్‌ని తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది...!
https://www.telugupost.com/movie-news/గణేష్-మళ్ళీ-వస్తున్నాడు-46325/
కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి... ఆ తర్వాత నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. నిర్మాతగా కూడా బడా సినిమాలు నిర్మించే నిర్మాతగా మారి అందరికి షాక్ ఇచ్చాడు. గణేష్ ఒక్కసారిగా నిర్మాత అవతారం ఎత్తడం.... బడా హీరోల సినిమాలు నిర్మించడం వంటి విషయాలతో మనోడు అప్పట్లో బాగా ఫెమస్ అయ్యాడు. ఇక బడా హీరోలంటే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో చిత్రాలు నిర్మించి ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తీసిన గణేష్ మళ్ళీ ఏ హీరోతో ఇప్పటివరకు సినిమాని నిర్మించలేకపోయాడు. కారణం గణేష్ బండ్ల కి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదనే చెప్పాలి.రెండున్నరేళ్ల గ్యాప్ తో బండ్ల గణేష్ ఇప్పుడొక సినిమాని నిర్మించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ మధ్యన టు కంట్రీస్ సినిమాని రీమేక్ చేస్తున్నాడని ప్రచారం జరిగినప్పటికీ గణేష్ ఆ సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు తాజాగా బండ్ల, హీరో రవితేజ సినిమాని నిర్మించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు గుప్పుమన్నాయి. రవితేజ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమా చేసాడు. ఆ సినిమా విడుదలకు సిద్దముగా ఉండగా.. రవితేజ మరో సినిమా టచ్ చేసి చూడు సినిమా కూడా సెట్స్ మీదుంది. మరి ఇప్పుడు తాజాగా బండ్ల నిర్మణంలో కూడా నటించడానికి రవితేజ సానుకూలంగా వున్నాడని... ఇప్పటికే కథ చర్చలు ప్రారంభమైనట్టుగా చెబుతున్నారు.మరి రవితేజ... గణేష్ సినిమా ఒప్పుకున్నప్పటికీ ముందు టచ్ చేసి చూడు పూర్తి చెయ్యాలి. అలాగే తమిళ బోగాన్ రీమేక్ లో నటించాలి. ఆతర్వాతే బండ్ల నిర్మాణంలో రవితేజ నటించేది. చూద్దాం రవితేజతో మళ్ళీ నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చెయ్యాలని ఆశపడుతున్న బండ్ల గణేష్ కోరిక ఏ మాత్రం నెరవేరుతుందో అనేది.
https://www.telugupost.com/movie-news/మళ్ళీ-చెట్టెక్కేసిందట-47933/
గత ఏడాది బ్రహ్మ్మోత్సవం సినిమావంటి డిజాస్టర్స్ తో చేతిలో సినిమాలు లేక ఖాళీగా కూర్చున్న కాజల్ అగర్వాల్ కి ఖైదీ నెంబర్ 150 హిట్ తో మళ్ళీ దశ తిరిగింది. అయినా కూడా చిన్న బడ్జెట్ సినిమా అయిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా సరసన తక్కువ పారితోషకానికే పనిచేసింది. ఆ సినిమా హిట్ అవడం.. తమిళంలో అజిత్ తో నటించిన వివేగం ప్లాప్ అయినప్పటికీ... విజయ్ సరసన నటించిన మెర్సల్ కమర్షియల్ హిట్ సాధించడం తో కాజల్ అగర్వాల్ మళ్ళీ ఫామ్ లోకొచ్చేసింది. దెబ్బకి దశ తిరిగిన కాజల్ కి ఇప్పుడు కొంచెం ఎక్కువైంది అంటున్నారు.వరుస హిట్స్ తో మళ్ళీ ఫామ్ లోకొచ్చిన కాజల్ అగర్వాల్ పారితోషకం విషయంలో చెట్టెక్కి కూర్చుంది. గతంలో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు డిమాండ్ కి తగ్గ పారితోషకం వసూలు చేసిన కాజల్ గత ఏడాది ప్లాప్స్ తో తన పారితోషకాన్ని తగ్గించుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వరుస హిట్స్ తో దూసుకుపోతూ తన పారితోషకం విషయంలో రాజీపడనంటుంది. ఇప్పుడు కాజల్ చేతిలో కళ్యాణ్ రామ్ సినిమా ఎమ్యెల్యే ఉండగా.. ఇప్పడూ తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించబోయే సినిమాలో హీరోయిన్ పాత్ర ఆఫర్ చేయగా.. కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పిందట కాజల్. కానీ ఈ సినిమాకు నిర్మాతలు 70 లక్షల పారితోషకం అని చెప్పగానే ఆమె ఈ సినిమాలో చెయ్యడానికి నో అనేసిందట. కోటికి తక్కువైతే తన దగ్గరకి రావద్దని.... అసలు కోటికి తక్కువ ఉంటె ఎటువంటి సినిమా చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పిందట. దీంతో భయపడ్డ నిర్మాతలు కాజల్ కు బై బై చెప్పేసి వేరే హీరోయిన్ల మీద ఫోకస్ పెట్టారట. మరి కాస్త ఫామ్ లోకి రాగానే ఇలా చెట్టెక్కి ఆకాశాన్ని చూసే హీరోయిన్స్ ని ఏమనాలి.
https://www.telugupost.com/telangana/telangana-chief-minister-revanth-reddy-is-on-speed-decisions-are-taken-very-fast-and-the-hearts-of-the-opponents-are-pounding-1549483
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ మీదున్నారు. డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటూ ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలంటే ముందు ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతల వ్యవహారశైలిని చూసీ చూడనట్లు వదిలేశారు దీంతో బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారు. పదేళ్లలో అందిన కాడికి దండుకున్నారు. వ్యాపారాలతో పాటు కంటి ముందే ఆర్థికంగా బలపడ్డారు. ఇన్నోవా కార్లతో పాటు ఫాంహౌస్ లు నిర్మించుకుని ఎంజాయ్ చేశారు.తక్కువ సమయంలోనే...నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల అండ చూసుకుని వారి ప్రధాన అనుచరులు తక్కువ సమయంలోనే కోట్లకు పడగలెత్తారు. అతి విలువైన స్థలాలను సొంతం చేసుకున్నారు. లిక్కర్ వ్యాపారంలో వాళ్లే. ఇసుక దందా చేసేది వాళ్లే. ఏచిన్న కాంట్రాక్టు అయినా తమ చేయి దాటి పోనివ్వరు. అలా తొమ్మిదేళ్ల పాటు ఆడింది ఆటగా..పాడింది పాటగా వ్యవహరించారు. ఇక పరిశ్రమల నుంచి వసూళ్లు మామూలుగా చేయలేదన్న ఆరోపణలున్నాయి. ఏ చిన్న కార్యక్రమం జరిగినా విరాళాలు సేకరించి అందులో కొంత ఖర్చు చేసి మిగిలింది జేబులో వేసుకున్నారన్న విమర్శలు జోరుగా వినిపించాయి. బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక కారణం.అందుకే హైడ్రా...అయితే ఇప్పుడు నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి హైడ్రాను ముందుకు తెచ్చారంటున్నారు. ఒకవైపు ప్రజల్లో మంచి పేరు రావడంతో పాటు మరొక వైపు వారు ఆర్థికంగా నష్టపోతారు. వచ్చే ఎన్నికల నాటికి నేతలు ఖర్చు చేయడానికి కూడా భయపడేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే హైడ్రా ను ఏర్పాటు చేసింది సదుద్దేశ్యంతోనే. చెరువులను, నాలాలను, కుంటలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూలగొట్టి హైదరాబాద్ కు భవిష్యత్ లో తాగు నీటి ఇబ్బందులు, భూగర్భ జలాల సమస్య తీరడంతో పాటు ముంపు సమస్య నుంచి కూడా జంట నగరాలు బయటపడే అవకాశాలున్నాయి. ఇది మరో కోణం. బీఆర్ఎస్ నేతలే....ఇక బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా హైడ్రా పనిచేస్తుందన్న ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ కు ఆర్థికంగా సహకరిస్తున్న వారి మూలాలను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే రేవంత్ దీనిని తీసుకువచ్చారంటున్నారు. నిజంగానే బీఆర్ఎస్ నేతలు భయపడి పోతున్నారు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిబంధనలను అతిక్రమించి గత పదేళ్లుగా ప్రభుత్వ స్థలాలను, నాలాలను, చెరువులను, కుంటలను ఆక్రమించారు. ఇక కొందరు బిల్డర్లు కూడా బీఆర్ఎస్ కు ఆర్థికంగా అండగా నిలిచారు. వారిని దెబ్బతీయడం ఒక లక్ష్యమైతే.. మరొకటి ప్రజల్లో మంచి పేరు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతను రేవంత్ రెడ్డి చేతల్లో నిరూపిస్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
https://www.telugupost.com/crime/huge-amount-of-drugs-seized-in-gujarat-230-crore-worth-of-drugs-seized-1532813
గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 230 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్కాడ్ తో కలసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ డ్రగ్స్ ర్యాకెట్ కు చెక్ పెట్టింది. గుజరాత్, రాజస్థాన్ లో కలసి చేసిన ఆపరేషన్ లో పెద్దయెత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు దాడులు చేసి డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.పదమూడు మందిని...ఈ కేసులో మొత్తం పదమూడు మందిని అరెస్ట్ చేశారు. ఏకకాలంలో దాడులు చేయడంతో అటు నిందితులతో పాటు ఇటు పెద్దమొత్తంలో డ్రగ్స్ స్వాధీనం అయ్యాయి. అహ్మాదాబాద్ కు చెందిన మనోహర్ లాల్ ఎనాని, రాజస్థాన్ కు చెందిన కుల్దీప్ సింగ్ లు ఈ డ్రగ్స్ ర్యాకెట్ ను నడుపుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/నిఖిల్-హీరోయిన్-ప్లాన్-వ-61924/
నిఖిల్ తో కలిసి సూర్య vs సూర్య లో నటించిన హీరోయిన్ గుర్తుందా... గుర్తుండే ఛాన్స్ లేదులెండి. ఎందుకంటే సూర్య vs సూర్య తర్వాత ఆ అమ్మాయి పెద్దగా ఫోకస్ అయిన సందర్భాలే లేవు. ఆ సినిమా హీరో నిఖిల్ కి కాస్త పేరు తీసుకొచ్చినా..... ఆ హీరోయిన్ త్రిధా చౌదరికి మాత్రం పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే త్రిధా చౌదరి సినిమాల్లో మాత్రం పెద్దగా యాక్టీవ్ కాలేకపోయింది. సినిమాల్లో ఎలాగైనా బిజీ కావాలనుకున్న ఆ భామకు ఇక్కడ నిరాశే మిగిలింది. ఎంతగా గ్లామర్ షో చేసినా కొంతమంది హీరోయిన్స్ కి అది కలిసిరాదు. కారణం లక్కు లేకపోవడమే అనేది జగమెరిగిన సత్యం.సినిమాల్లో గ్లామర్ షో చెయ్యకపోతేనే మనకి సోషల్ మీడియా ఉందిగా.. మన అందచందాలు చూపెట్టడానికి అంటూ హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటుంది. అందులో భాగంగానే సముద్రం నడిబొడ్డున ఒక బికినీ వేసుకుని చేతులతో ముంగురులును స్టయిల్ గా పైకెత్తి అలా అలా తలెత్తి ఆకాశాన్ని చూస్తూ... నా అందాలను ఆస్వాదించండి అంటూ అందచందాలను చూపిస్తూ త్రిధా చౌదరి తన అందాలతో కైపెక్కిస్తుంది. మరి అలా బికిని షో చేస్తే ఏదైనా చిన్న సినిమాలో అయినా వేషం దొరక్కపోతుందా అని ఆశ పడుతున్నట్లుగా కనబడుతుంది అమ్మడు యవ్వారం.ఎందుకంటే ఈ మధ్యనే మంజుల డైరెక్ట్ చేసిన మనసుకు నచ్చింది లో సందీప్ పక్కన కాసేపు మెరిసింది. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో అమ్మడు యవ్వారం మళ్ళీ మొదటికే వచ్చింది. అందుకే ఇలా బికినీ షోస్ మొదలెడితే పనిజరిగిద్దని పాప మంచి ప్లాన్ చేసింది.
https://www.telugupost.com/movie-news/rx-100-promotions-79950/
గత గురువారం విడుదలైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ RX 100 విడుదలైన ఫస్ట్ షోకి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా మాత్రం యూత్ ని టార్గెట్ చేసి తియ్యడంతో.. ఈ సినిమా యూత్ కి బాగానే కనెక్ట్అయ్యింది. అయితే అది చాలా నెమ్మదిగా. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజపుట్ జంటగా నటించారు. ఈ సినిమాలో కార్తికేయ - పాయల్ రాజపుట్ ల జంట మధ్యన రొమాంటిక్ అండ్ లవ్ అండ్ కెమిస్ట్రీ అదుర్స్ అనే రేంజ్ లో సినిమా ఉంది. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్దగా నచ్చక పోయినా యూత్ కి మెల్లగా కనెక్ట్ అవుతూ పోవడం వలనే సినిమా కి కలెక్షన్స్ ఈ రేంజ్ లో పెరుగుతూ పోతున్నాయి. ఇక సినిమా కి రామ్ చరణ్ అభినందనలు కూడా బాగా పనికొచ్చాయనే చెప్పాలి. రామ్ చరణ్ ని RX 100 చూడమని మూవీ యూనిట్ కోరగా.. ఖాళీ సమయంలో తప్పక చూస్తానని మాటిచ్చిన రామ్ చరణ్ ని స్వయంగా చిత్ర బృందం కలవగా... రామ్ చరణ్ ఈ సినిమా బాగా ఆడాలని కోరుకోవడంతో.. కాస్త మెగా ఫాన్స్ కూడా RX 100 పై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాగే సినిమాపై యూత్ కి ఆసక్తిపెరిగేలా మూవీ యూనిట్ బాగానే ప్లాన్ చేస్తుంది.అందుకే నెమ్మదిగా ఈ సినిమాలో ఉన్న రొమాంటిక్ ఫొటోస్ అంటే హీరో హీరోయిన్స్ హగ్ చేసుకున్న ఫొటోస్ దగ్గరనుండి... సినిమాలో కిస్ పెట్టుకున్న ఫొటోస్ వరకు.. అలాగే స్విమ్మింగ్ ఫూల్ లోని హాట్ హాట్ ఫొటోస్ ని మూవీ యూనిట్ విడుదల చేస్తూ సినిమాలో ఏదో ఉంది అన్నట్లుగా క్రియేట్ చేసి సినిమా ని విజయం దిశగా చేరుకునేలా చేస్తుంది. మరి ఇలా కొత్తగా మూవీ ఫొటోస్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజంగానే ఆ హాట్ హాట్ ఫొటోస్ చూసిన ఎవ్వరైనా సినిమాకెళ్లి ఒక్కసారి చూడాలనే కోరిక కలుగుతుంది. మరి కుర్రకారు మాత్రం ఇలాంటి ఫొటోస్ చూస్తే ఎందుకాగుతారు. అందుకే మెల్లి మెల్లిగా RX 100 కి యూత్ బాగా కనెక్ట్ అవుతూ కలెక్షన్స్ ని ఈ రేంజ్ లో కొల్లగొట్టేలా చేస్తున్నారు. ఇక ఈ సినిమా నిర్మాతలకైతే అన్ని లాభాలే. లో బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడి ని థియేట్రికల్ రైట్స్ ద్వారానే రాబట్టేసింది. సో ఇప్పుడొచ్చే కలెక్షన్స్ మొతం లాభాలే అన్నమాట.
https://www.telugupost.com/movie-news/prabhas-shradha-kapoor-saaho-us-premier-shows-131587/
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సాహో యూఎస్ ప్రీమియర్స్ బుకింగ్స్ లో దూకుడు చూపిస్తుంది. అక్కడ ఈమూవీ రెగ్యులర్ షో తో పాటు ఐమాక్ షోస్ తో రికార్డు కలెక్షన్స్ వైపు దూసుకుపోతుంది. అక్కడ ఆగష్టు 28 వరకు బుకింగ్స్ జరిగిన దాని ప్రకారం అన్ని భాషలు కలిపి $532,727 వసూళ్లు రాబట్టింది. తెలుగు వర్షన్ ఐమాక్స్ మరియు రెగ్యులర్ షోస్ $511,702 వసూళ్లు. హిందీ వర్షన్ ఐమాక్స్ మరియు రెగ్యులర్ షోస్ $16,899 వసూళ్లు. తమిళ వర్షన్ ఐమాక్స్ మరియు రెగ్యులర్ షోస్ ద్వారా $4,126 వసూళ్లు వచ్చాయి. అన్ని భాషల ఐమాక్స్ షో ల వరకు $77418 కలెక్ట్ చేసింది. అన్ని భాషల రెగ్యులర్ షోస్ ల $455309 కలెక్ట్ చేసి రికార్డు వైపు దూసుకుపోతుంది
https://www.telugupost.com/crime/ganja-smuggling-in-andhrapradesh-405-kilos-ganja-smuggling-caught-by-vijayawada-police-1482424
తెలుగు రాష్ట్రాలలో గంజాయి స్మగ్లింగ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లోని మేడ్చల్ లో 210 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్న విషయాన్ని మరచిపోక ముందే విజయవాడలో ఏకంగా 405 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు.విజయవాడ కస్టమ్స్‌ అధికారులు కారు డిక్కీలో, ఉల్లిపాయల బస్తాల కింద పెట్టి తరలిస్తున్న 405 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను గుర్తించారు. 150 కిలోలు డిక్కీలో పెట్టి తరలిస్తున్న కారును, ఉల్లిపాయల బస్తాల అడుగు భాగాన గోనెసంచుల్లో ఉన్న 255 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ సరకు విలువ రూ.81 లక్షలు ఉంటుందని అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితులను విజయవాడ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించారు.మేడ్చల్‌లో సోమవారం భారీగా గంజాయి పట్టుబడింది. ఎస్‌వోటి శంషాబాద్, మేడ్చల్ పోలీసులు కలిసి సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా.. ఆ సమయంలో కారులో తరలిస్తున్న 210 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. గంజాయి విలువ మార్కెట్‌లో దాదాపు రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలోని బెర్హంపూర్ నుండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు దీన్ని తరలిస్తున్నారని విచారణలో కనుగొన్నారు.
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-film-release-89174/
వచ్చే నెల 4న విడుదల కావాల్సిన 'నోటా' చిత్రం వాయిదా పడింది. అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 18 కు వెళ్లింది ఈ చిత్రం. అందుకు కారణం నిర్మాత జ్ఞానవేల్ అని తెలుస్తుంది. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయిన ఈ సినిమాను తెలుగులో 30 కోట్ల దాకా ఆశించడంతో ఇక్కడ బయ్యర్లు మాత్రం పాతిక కోట్లకు మించి ఆఫర్ చేయలేకపోతున్నారట. అందుకే రాజా వెనక్కి తగ్గి అక్టోబర్ 18న విడుదల చేయనున్నాడు. ఈ లోపు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేస్తే.. ఆ హైప్ తో సినిమాను ఎక్కువ రేట్ కు అమ్ముకోవచ్చని భావిస్తున్నాడు.రవితేజ సినిమా కూడా...అయితే ఇది అసలు కారణం కాదని, రీ రికార్డింగ్ ఆలస్యం అవ్వడంతో సినిమాను వాయిదా వేస్తున్నారని పైకి చెప్పినా అది నిజం కాదని కామెంట్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటె రవితేజ నటిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' కూడా అక్టోబర్ 5 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు కానీ ఇప్పుడు కాస్త అనుమానంగానే ఉంది. మరి ఏమైందో ఏమిటో తెలియదు కానీ ఈ చిత్రం డిసెంబర్ 14 కు వాయిదా పడినట్టు తెలుస్తుంది.దసరాకు భారీ పోటీఇలా ఈ రెండు సినిమాలు వాయిదా పడడంతో చిన్న సినిమాలు లైన్ క్లియర్ అవ్వడమే కాదు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశాయి. శ్రీ విష్ణు, నారా రోహిత్ ఇద్దరు కలిసి నటిస్తున్న 'వీర భోగ వసంత రాయలు', అలీ తమ్ముడు ఖయ్యుమ్ హీరోగా నటించిన 'దేశంలో దొంగలు పడ్డారు'కి లైన్ క్లియర్ అయింది. ఇక అక్టోబర్ 18న రామ్ 'హలో గురు ప్రేమ కోసమే', విశాల్ 'పందెం కోడి 2' ఆల్రెడీ రేస్ లో ఉన్నాయి. మరి వీటితో పాటు 'నోటా' కూడా పోటీకి సిద్ధం అవుతుంది. ఏది ఏమైనా ఈసారి దసరా ఎన్నడూ లేని విధంగా భారీ పోటీ ఉండటం కచ్చితం అని అర్ధం అవుతుంది.
https://www.telugupost.com/movie-news/rangasthalam-collections-4-68217/
మార్చ్ 30 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ - సుకుమార్ ల రంగస్థలం సినిమా బాక్సాఫీసుని చెడుగుడు ఆడేసింది. పక్కా పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా, పిల్ల, పెద్ద అందరిని మెస్మరైజ్ చేసింది. రంగస్థలం బంపర్ హిట్ కలెక్షన్స్ తో సునామి సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొడుతూ... రామ్ చరణ్ మగధీర, చిరంజీవి ఖైదీ నెంబర్ 150 రికార్డులను తిరగరాసింది. రంగస్థలం సినిమా విడుదలైన 15 రోజుల పాటు థియేటర్స్ లో సరైన సినిమా లేకపోవడంతో రంగస్థలానికి ఎదురులేకుండా పోయింది. రెండు వారాలకే 150 కోట్ల క్లబ్బుకి చేరిన ఈ సినిమా ప్రస్తుతం 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విధంగా ఈ సినిమా మ‌రో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనే నేను గత శుక్రవారం విడుదలై రంగస్థలం సినిమా కలెక్షన్స్ కి అడ్డుకట్ట వేసింది కానీ..... లేదంటే రంగస్థలం సినిమా ఎప్పుడో రెండొందల కోట్ల క్లబ్బులో చేరేది. మరి రామ్ చరణ్ ఇండస్ట్రీలోకొచ్చాక మగధీర తో ఇండస్ట్రీ రికార్డు ని క్రియేట్ చేస్తే.... అప్పటినుండి మళ్ళీ ఇలా 150 నుండి 200 కోట్ల క్లబ్బుని చేరడానికి రంగస్థలం వంటి హిట్ పడాల్సి వచ్చింది.మరి సుకుమార్ కూడా తన ఫార్మేట్ మర్చి క్లాస్ నుండి మాస్ కొచ్చి కొత్తగా ప్రయోగం చేసి మరీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రామ్ చరణ్ ని చిట్టిబాబుగా, సమంత ని రామలక్ష్మిగా, రంగమ్మగా అనసూయని, ప్రెసిడెంట్ గా జగపతి బాబుని, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి ని ఎంతో చక్కగా 1980 లో కేరెక్టర్స్ గా చూపించిన సుకుమార్ పల్లెటూరి కథని సినిమాగా మార్చి అందరిని ఆకట్టుకున్నాడు. మరి రంగస్థలం సినిమా ఇలా 200 కోట్ల క్లబ్బుని టచ్ చెయ్యడం మాత్రం స్టార్ హీరోలకు కాస్త కంగారు పుట్టించే విషయమే. మరి ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనే నేను కూడా రంగస్థలం సినిమా కలెక్షన్స్ వెనుకనే పరిగెడుతుంది. చూద్దాం మహేష్ భరత్ ఎంత లాగుతుందో అనేది.
https://www.telugupost.com/movie-news/taxiwala-weekend-collections-97972/
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సీవాలా సినిమా థియేటర్స్ లో పాజిటివ్ టాక్, సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండ క్రేజ్ ఈ సినిమా కలెక్షన్స్ కి కారణమని చెప్పొచ్చు. విజయ్ క్రేజ్ ప్రేక్షకుల్లో మాములుగా లేదు. విజయ్ నటన... ఈ సినిమా స్క్రీన్ ప్లే, రాహుల్ దర్శకత్వం అన్నీ సినిమాని విజయ తీరాన్ని చేర్చాయి. జర్నలిస్ట్ ఎస్ కే ఎన్ మొదటిసారి నిర్మాతగా మారి నిర్మించిన ఈ సినిమాతో బోలెడన్ని లాభాలను మూటగట్టుకునేలా కనబడుతున్నాడు. ఈ శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా చిత్రం శని, ఆదివారాలలోనే అంటే ఫస్ట్ వీకెండ్ కే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల షేర్ సాధించింది. మరి ఈ వారంలో టాక్సీవాలాతో పోటీపడిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాని ప్రేక్షకులు తిరస్కరించడంతో విజయ్ దేవరకొండ పంట పండింది. ఏదయినా విజయ్ మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.ఏరియా షేర్స్ (కోట్లలో)నైజాం 2.76సీడెడ్ 0.80అర్బన్ ఏరియాస్ 0.76గుంటూరు 0.53ఈస్ట్ గోదావరి 0.39వెస్ట్ గోదావరి 0.35కృష్ణ 0.52నెల్లూరు 0.21ఏపీ అండ్ టీఎస్ 6.32 కోట్లుఇతర ప్రాంతాలు 1.05ఓవర్సీస్ 1.75వరల్డ్ వైడ్ షేర్స్ 9.12 కోట్లు
https://www.telugupost.com/movie-news/corona-virus-impact-on-tollywood-movies-release-dates-151355/
ప్రస్తుతం సినిమాల విడుదల తేదీలంతా గజిబిజి గందరగోళంగా ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 2 తర్వాత విడుదల డేట్స్ ఇచ్చిన సినిమాలన్నీ పక్కా డేట్ కి వస్తాయో రావో తెలియదు. ప్రస్తుత థియేటర్స్ బంద్ వలన వాయిదా పడిన సినిమాలు ఎప్పుడు ఏ డేట్ లాక్ చెయ్యాలో తెలియదు. ఏప్రిల్, మే సెలవుల కి చాల సినిమాలు లైన్ కట్టేశాయి. ఈమధ్యలో చిన్న సినిమాలు వదలాలి అంటే మిగతా నిర్మాతలు ఒప్పుకోరు. ప్రస్తుతం వాయిదా పడిన సినిమాల నిర్మాతలు ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకున్నారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ భాష అయినా.. సినిమాల విడుదల తేదీ మార్చి.. మరో తేదీ సెట్ చేసుకోవడానికి నానా తంటాలు పడాలి. కరోనా వైరస్ వలన ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఇదివరకు నిర్మాతలు నష్టపోకుండా… అందరూ కూర్చుని మాట్లాడుకుని సినిమాల విడుదలలో కన్ఫ్యూజన్ లేకుండా సెటిల్ చేసుకునేవారు. కానీ తాజా పరిస్థితులు అలా కాదు. ఇప్పుడు వాయిదా వేసిన సినిమాలు ఎప్పుడు విడుదల చెయ్యాలి… మే చివరికి వరకు మంచి వారం దొరక్కపోతే.. జూన్ కి వెళ్లాలా లేదంటే ఏంటి పరిస్థితి అనేది మాత్రం నిర్మాతలకు అర్ధం కావడం లేదు. ఇక కొంతలో కొంత నయం ఏమిటంటే.. ప్రస్తుతం తెలుగులో భారీ మూవీస్ విడుదలకు లేకపోవడం… వేసవి సెలవలకి భారీ బడ్జెట్ మూవీస్ దూరమవడంతో.. చిన్న, మీడియం నిర్మాతలు ఊపిరిపీపీల్చుకుంటున్నారు. కానీ చిన్న సినిమాల విడుదల సమయంలో నిర్మాతలకు కీచులాట తప్పేలాలేదు.
https://www.telugupost.com/politics/it-is-reported-that-ycp-chief-jagan-has-said-the-same-thing-about-perni-kittu-political-entry-1477678
ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వారసులు సిద్ధమవుతున్నారు. ఇందులో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు మొదటి వరుసలో ఉంటారు. రాష్ట్ర రాజకీయాల్లో పేర్ని నానికి స్పెషల్‌ ఐడెంటిటీ ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్‌లో పేర్ని నాని మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వం వచ్చే విమర్శలకు కౌంటర్‌ ఇవ్వడంలో నాని స్టైలే వేరు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ చేసే ఆరోపణలను మొదట ఎన్‌కౌంటర్‌ చేసేది పేర్ని నానినే. విమర్శలకు కౌంటర్‌ ఇవ్వడంలో పేరు పొందిన నానికి.. సీఎం జగన్‌ దగ్గర మంచి పేరు ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు పేర్ని నాని ద్వయం విమర్శలకు కౌంటర్‌లో ఇవ్వడంలో పెట్టింది పేరు. రెండోసారి కేబినెట్‌ విస్తరణలో మంత్రి పదవి పోయినప్పటికీ ప్రతిపక్షాలపై విమర్శల వర్షాన్ని నాని ఏ మాత్రం తగ్గించలేదు. సీరియస్‌ మ్యాటర్‌లో సెటైరికల్‌ కామెంట్స్‌ జోడించి విమర్శలు చేసే నాని.. ఇప్పుడు వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని, తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని సీఎం జగన్‌ దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. దీనికి సీఎం జగన్‌ ఒకే చెప్పినట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం. మొన్ననే సీఎం జగన్‌ సాక్షిగా రాజకీయాలకు స్వస్తి పలకబోతున్నట్లు నాని ప్రకటన చేశారు. సీఎం జగన్‌తో మరో మీటింగ్‌లో పాల్గొంటానో లేదా కూడా తెలియదన్నారు. ఇక నాని తనయుడు పేర్ని కిట్టు రాజకీయాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారట. కిట్టుకి రాజకీయ ఓనమాలు దిద్దించడంతో పాటు, రాజకీయాల్లో ఎలా నడుచుకోవాలనేదానిపై అవసరమైన సలహాలు, సూచనలను కూడా నాని అందించారట. ఇప్పటికే పార్టీ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కిట్టుని పంపిస్తున్నారు నాని. రాష్ట్ర స్థాయి పార్టీ కార్యక్రమాలకు కూడా కిట్టు ఒక్కడికే నాని పంపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో పేర్ని నానికి మంచి పేరు ఉంది. ఆ పేరును కిట్టు ఏ మేర నిలబెడతాడో ముందు ముందు చూడాలి.
https://www.telugupost.com/movie-news/hanuman-director-prashanth-varma-announce-12-super-hero-films-in-telugu-1512511
Tollywood : టాలీవుడ్ మేకర్స్ నేటి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా న్యూ ఏజ్ స్టోరీస్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే సూపర్ హీరో మూవీస్ కూడా రాబోతున్నాయి. అది కూడా ఒకటి కాదు రెండు కాదు 12 సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయి. సాధారణంగా సూపర్ హీరో సినిమాలు అంటే.. హాలీవుడ్ చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఐరన్ మెన్, స్పైడర్ మెన్, ఐరన్ మెన్ అంటూ ఫిక్షనల్ క్యారెక్టర్స్ తో పలు సూపర్ హిట్ సినిమాలను హాలీవుడ్ మేకర్స్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.అంతేకాదు గ్రీక్ దేవుడిగా చెప్పే ‘థోర్’ని కూడా సూపర్ హీరోగా ప్రపంచానికి పరిచయం చేశారు. మరి మన హిందూ ధర్మంలో కూడా ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి సూపర్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సూపర్ పవర్స్ ని వరల్డ్ ఆడియన్స్ కి తెలియజేస్తూ.. మన దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేసే భాద్యత టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసుకున్నారు.ప్రస్తుతం ఈ హీరో 'హనుమాన్' చిత్రంతో మన మొదటి సూపర్ హీరోని పరిచయం చేయబోతున్నారు. ఆ తరువాత దేవుళ్ళ రాజైన 'ఇంద్రుడి' పాత్ర స్ఫూర్తి పొంది 'అధీర' అనే సూపర్ హీరో ఫిలిం తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాలతో ప్రశాంత్ వర్మ.. ఒక సూపర్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో మొత్తం 12 సూపర్ హీరోల సినిమాలు రాబోతున్నాయని ప్రశాంత్ తెలియజేసారు.ఈ 12 సూపర్ హీరోలు మన హిందూ ధర్మంలోని దేవుళ్ళ పాత్రని స్ఫూర్తి పొందే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మరి ఇన్నాళ్లు హాలీవుడ్ సూపర్ హీరోల చూసి ఎంజాయ్ చేసిన ఇండియన్ ఆడియన్స్.. ఇప్పుడు మన సూపర్ హీరోస్ ని ఎక్స్‌పిరెన్స్ చేయబోతున్నారు. కాగా హనుమాన్ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.
https://www.telugupost.com/movie-news/katrina-kaif-in-mahesh-babu-sukumar-movie-105918/
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. మహేష్ ఇందులో సరికొత్తగా కనిపించనున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయినా స్టిల్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈసినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు.దీనిపై అధికార ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈసినిమా లో మహేష్ కు సరసన బాలీవుడ్ బామ కత్రినాను తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. తెలుగులో కత్రినా చాలా తక్కువ సినిమాలు చేసింది. వెంకటేష్ ‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ బామ తరువాత బాలయ్య సరసన ‘అల్లరి పిడుగు’ లో నటించింది. ఆ తరువాత నుండి తెలుగు సినిమాలు ఒప్పుకోలేదు. బాలీవుడ్ లో వరసగా పెద్దపెద్ద ఆఫర్స్ రావడంతో తెలుగు వైపు చూడలేదు. అయితే రీసెంట్ గా సుకుమార్ ఆమెను సంప్రదించినట్టు సమాచారం. అయితే ఆమె నిర్ణయం ఏంటో ఇంకా చెప్పలేదని తెలుస్తుంది.
https://www.telugupost.com/movie-news/ramcharan-as-siddha-184152/
చిరంజీవి – కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ రంపచోడవరం అడవుల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అక్కడే ఆ ఫారెస్ట్ లో ఆచార్య లో స్పెషల్ రోల్ చేస్తున్న రామ్ చరణ్ సిద్ద గా చిరు కాంబో సీన్స్ లో పాల్గొంటున్నాడు. ఆచార్యగా చిరు – సిద్ద గా రామ్ చరణ్ కాంబో సీన్స్ ఎలా ఉండబోతున్నాయో అనే క్యూరియాసిటిలో మెగా ఫాన్స్ ఉన్నారు. అయితే ఆచార్య లో స్పెషల్ రోల్ చేస్తున్న రామ్ చరణ్ సిద్ద గా ప్రీ లుక్ లో ఎప్పుడో దర్శనమిచ్చాడు. తాజాగా సిద్ధగా రామ్ చరణ్ లుక్ చాలా వరకు రివీల్ చేసి.. ఆచార్య సిద్ధ మవుతున్నాడు అంటూ టీం ఏదో సస్పెన్స్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ ఆచర్యలో నటిస్తున్నాడు అనగానే సినిమాపై మంచి అంచనాలు వచ్చేసాయి. ఇప్పుడు రామ్ చరణ్ సిద్ద లుక్ లో కనిపించిన తీరుతో రామ్ చరణ్ పాత్రపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే మహాశివరాత్రి రోజున ఆచార్య కి సంబందించిన రామ్ చరణ్ పాత్రని ఏమైనా రివీల్ చేస్తారేమో.. అందుకే ఆచార్య సిద్ధ మవుతున్నాడు అంటూ ప్రకటించింది టీం. ఆ పోస్టర్ లో రామ్ చరణ్ భుజంపై చిరు ఆచార్య చెయ్యి కనిపిస్తుండగా.. ఎదురుగా తుపాకీ పెట్టి ఉంది. దానిని బట్టి ఆచార్య గా చిరు, సిద్ధగా రామ్ చరణ్ లు నక్సలైట్ కేరెక్టర్స్ లో కనిపిస్తారేమో అనే ప్రచారానికి ఊతమిస్తుంది ఈ సిద్ద పోస్టర్. మరి రామ్ చరణ్ సిద్ద కేరెక్టర్ కి సంబందించిన ఏదైనా టీజర్ ఉండొచ్చనే ఊహాగానాలు ఫాన్స్ లో మొదలయ్యాయి. మరి కొరటాల సిద్ద కేరెక్టర్ పై ఏం ప్లాన్ చేసాడో చూద్దాం.
https://www.telugupost.com/movie-news/akkineni-nageswararao-biopic-68001/
ఒకప్పుడు బాలీవుడ్ లో బయో పిక్ ల పరంపర కొనసాగింది. అక్కడ అనేక రకాల ప్రముఖుల బయో పిక్స్ ని తెరకెక్కించి బంపర్ హిట్స్ కొట్టారు. అదే హవా ప్రస్తుతం టాలీవుడ్ లో మొదలైంది. ప్రస్తుతం తెలుగులో 'మహానటి' సావిత్రి బయో పిక్ 'మహానటి' సినిమా వచ్చేనెలలోనే విడుదల కానుంది. ఇక మహోన్నత వ్యక్తి 'ఎన్టీఆర్' బయో పిక్ ని బాలకృష్ణ ఆఘమేఘాల మీద తేజ దర్శకత్వంలో తెరకెక్కించేస్తున్నాడు. అలాగే వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను మమ్ముట్టి హీరోగా 'యాత్ర'గా తెరకెక్కిస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ హడావిడి చేసి ఇప్పుడు మౌనంగా కూర్చున్నాడు.అక్కినేని జీవిత చరిత్రపై.....అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో బయో పిక్స్ పరంపర కొనసాగుతున్న టైం లో అక్కినేని నాగేశ్వర రావు జీవిత చరిత్రను ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కళ్ళు వంటివారు. మరి బాలకృష్ణ తన తండ్రి బయో పిక్ ని 'ఎన్టీఆర్' గా మొదలు పెడితే... ఇప్పడు నాగార్జున కూడా తన తండ్రి అక్కినేని బయో పిక్ ని తెరకెక్కించే ఏర్పాట్లు తెర వెనుక మొదలెట్టినట్టుగా ఫిలిం నగర్ టాక్. అక్కినేని చనిపోయే వరకు సినిమా ఇండస్ట్రీతో తన అనుబంధాన్ని పెనవేసుకుని వున్నారు. ఆయన మరణించేటప్పటికీ అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం' ఇంకా సెట్స్ మీదే ఉంది. 'మనం' సినిమాలో నాగేశ్వర రావు చైతన్య పాత్ర పోషించాడు. మరి ఆయన మరణాంతరం ఇప్పుడు ఆయన బయో పిక్ పై చర్చ మొదలైంది.రీసెర్చ్ మొదలయింది....అయితే గత ఆరునెలల నుండే అక్కినేని బయో పిక్ పై రీసెర్చ్ మొదలైందని... అది కాస్త ఇప్పుడు చివరి దశకు చేరుకొని పట్టాలెక్కేందుకు రెడీ అయ్యిందనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది. మరి అక్కినేని బయో పిక్ లో ఆయన వ్యక్తిగత జీవితం, నట జీవితం ఆఖరికి అయన అంతిమ యాత్ర వరకు ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే ఈ అక్కినేని బయో పిక్ లో యంగ్ అక్కినేనిగా చైతు, ఆ తర్వాత నాగ్ కనిపిస్తాడని టాక్ కూడా వినబడుతుంది. మరి ఇప్పటికే చైతు 'మహానటి' లో ఏఎన్నార్ పాత్ర పోషించాడు.
https://www.telugupost.com/movie-news/ram-gopal-varma-biopic-started-169015/
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూడు భాగాల బయోపిక్ లో తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. హైదరాబాద్ లోని ఓ కళాశాలలో మొదలైన ఈ షూటింగ్ కు రామ్ గోపాల వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ ఇచ్చారు. ఈ మూడు భాగాల బయోపిక్ ను బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు దొర సాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగంలో దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ పార్ట్ 1 లో వర్మ కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది కథాంశంగా చూపించబోతున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బొమ్మాకు మురళి మాట్లాడుతూ….రాము గారు ఒక సూపర్ హ్యూమన్. టాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఆయన జర్నీ అద్భుతం. ఇప్పటికీ రాము గారు సినిమాల పట్ల చూపించే ప్యాషన్ ఆశ్చర్యపరుస్తుంది. ఆయన బయోపిక్ తీసే అవకాశం నాకు కలగడం సంతోషంగా ఉంది. రాము గారి మూడు భాగాల బయోపిక్ లో పార్ట్ 1 షూటింగ్ ఇవాళ ప్రారంభించాం. ఆర్జీవీ మాతృమూర్తి సూర్యావతి, సోదరి విజయ గారు షూటింగ్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. దర్శకుడు దొరసాయి తేజ రాము గారి టీనేజ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. నగరంలోని ఓ కాలేజ్ లో తొలి భాగం షూటింగ్ బుధవారం నుంచి మొదలై 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఇతర పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం. అన్నారు.