link
stringlengths
41
231
text
stringlengths
29
5k
https://www.telugupost.com/movie-news/nani-may-act-in-big-budget-movie-113730/
నాని వరుస డిజాస్టర్స్ తరువాత జెర్సీ అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19న విడుదల అవుతున్న ఈ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని మొదలుపెట్టాడతడు. ఈ చిత్రం షూటింగ్ చకచకా జరుపుకుని ఆగస్టులో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఇక విక్రమ్ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నాడు నాని. ఇందులో సుధీర్ బాబు హీరో. ఇక్కడ అసలు విషయం ఏంటంటే నాని హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా పట్టాలెక్కబోతోంది అనే విషయం టాలీవుడ్ సీనియర్ పీఆర్వో ఒకరు ట్విట్టర్ లో వెల్లడించారు. హైదరాబాదీ బ్యూటీతో… ఇందులో నాని సరసన హైదరాబాదీ అమ్మాయి అదితీ రావు హైదరి నటించనుందట. సుధీర్ బాబు ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీకి నాని లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం రావడం అంటే మాములు విషయం కాదు. అయితే ఓ సెన్సేషనల్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. భారీ బడ్జెట్ అని కూడా చెప్పారు. అయితే మరి ఆ సెన్సషనల్ డైరెక్టర్ ఎవరు? అసలు సినిమా బడ్జెట్ ఎంతో మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. త్వరలోనే అధికార ప్రకటన రానుంది.
https://www.telugupost.com/movie-news/అప్పుడే-అత్తింటివారు-చెప-15007/
నాగ చైతన్య - సమంత ల పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుందని చెబుతున్నారు. ఈలోపు అఖిల్ నిశ్చితార్ధం చెయ్యడానికి నాగార్జున రెడీ అయిపోయాడు. అన్న పెళ్లి జరగకుండా తమ్ముడి పెళ్లి జరిపించేస్తున్నారేమిటా అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు. అయితే నాగ చైతన్య, సమంతల జాతకాల్లో ఏదో దోషం ఉండడం వలన వారి పెళ్లి వాయిదా పడిందనే పుకార్లు బయలుదేరాయి. మరి నాగార్జున కూడా రీజన్ చెప్పకుండా నాగ చైతన్య పెళ్లి వచ్చే ఏడాది జరిపిస్తామని... ఈలోపు అఖిల్ పెళ్లి చేసేస్తామని చెబుతున్నాడు. అందుకే ఎవరికీ తోచినట్టు వారు ఊహించేసుకుంటున్నారు.ఇక సమంత టాలీవుడ్ లో ఏ చిత్రాలు ఒప్పుకోకుండా కేవలం తమిళ సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. అయితే సమంత, నాగ చైతన్యల ప్రేమ విషయం బయటికి తెలిసాక వీరిద్దరూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఒక చిత్రం లో నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే సమంత ఉన్నట్టుండి కళ్యాణ్ కృష్ణ - నాగ చైతన్య ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఇక సమంత ప్లేస్ లోకి రకుల్ వచ్చి చేరింది. అయితే సమంత - నాగ చైతన్య కలిసి సినిమా చేయకపోవడానికి కారణం మాత్రం నాగార్జున అని అంటున్నారు. నాగార్జున సమంతని పిలిచి పెళ్ళికి ముందు మీరిద్దరూ ఒకే చిత్రం లో గనక జోడిగా నటిస్తే చిన్న విషయాల్లో ఏమన్నా మనస్పర్థలు వస్తాయని... అందుకే ఈ ప్రాజెక్ట్ నుండి సమంతని తప్పుకోమన్నాడనే వార్త ఎప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి కాబోయే మామగారు పిలిచి అలా చెబితే సమంత వినకుండా ఉంటుందా... . మామగారు చెప్పినట్టు పెళ్ళికి ముందే ఏదైనా మనస్పర్థలు వస్తే కష్టమని భావించి ఈ ప్రాజెక్ట్ నుండి సమంత సున్నితంగా తప్పుకుందట. అది అసలు విషయం.
https://www.telugupost.com/movie-news/హాజీ-మస్తాన్-కథ-కాదని-చెప-32208/
సూపర్ స్టార్ రజని కాంత్ క్రేజ్ ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో, దేశానికో పరిమితం అయినది కాదు. ప్రపంచ నలుమూలలలో ఎక్కడ ఎక్కడైతే సినిమా మనుగడ ఉందొ అక్కడ రజని కాంత్ ప్రస్తావన తప్పకుండా ఉండి తీరుతుంది. సూపర్ స్టార్ రజని కాంత్ సినిమాలు విడుదలైనన్ని ఎక్కువ దేశాలలో బాలీవుడ్ కి చెందిన ఖాన్ ల త్రయంలో హీరోల చిత్రాలు కూడా విడుదల అవ్వవు అంటేనే రజని క్రేజ్ అంచనా వేసుకోవచ్చు. అలాంటి రజని కాంత్ సినిమా అంటే ప్రారంభోత్సవం నుంచి విడుదలై చరిత్ర సృష్టించేవరకు ప్రతి వార్త ఒక సంచలనమే. అతి చిన్న సినిమాలనే వివాదం చేసి మరీ పబ్లిసిటీ పొందాలని తాపత్రయ పడుతున్న వారెందరో ఉండగా రజని కాంత్ సినిమాని ఎందుకు వదులుతారు చెప్పండి.కబాలి దర్శకత్వం వహించిన పా.రంజిత్ మరొక సారి రజని కాంత్ తో సినిమా చేయటానికి ఇప్పటికే సూపర్ స్టార్ అల్లుడు ధనుష్ నిర్మాతగా ఒప్పందం కుదుర్చుకుని ఆ సినిమా పనులలో నిమగ్నం అయిపోగా ఆ చిత్ర కథ మాఫియా డాన్ హాజీ మస్తాన్ జీవిత కథ అనే వార్త ప్రచారం ఊపందుకుంది. దానితో వాస్తవాల నిర్ధారణ కి తావివ్వకుండా హాజీ మస్తాన్ దత్త పుత్రుడు రజని కాంత్ సినిమా బృందంపై కోర్ట్ నోటీసులు జారీ చేపించాడు. తన తండ్రి జీవిత కథ అని సినిమా రూపంలో తన తండ్రి ని ప్రతికూల శక్తిగా చూపే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణతో కోర్ట్ లో కేసు వేసిన హాజీ మాస్థాన్ కొడుకు పా.రంజిత్, ధనుష్ లు తమ కథాంశం బైయోపిక్ కాదని చెప్తున్నా వివాదానికి తెర దింపటం లేదు. రజని కాంత్ చిత్రం ద్వారా తాను హెడ్ లైన్స్ లో నిలవాలని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు హాజీ మస్తాన్ కొడుకు. ఈ పరిణామంతో అసలు పబ్లిసిటీ అవసరం ఉండని రజని కాంత్ సినిమాకి ఫ్రీ ప్రచారం కలిపిస్తున్నాడు.
https://www.telugupost.com/movie-news/traffic-police-removes-black-film-from-director-trivikram-car-and-fined-1363194
జూబ్లిహిల్స్ : హైదరాబాద్ లో బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. కార్లకు బ్లాక్ ఫిల్మ్, వాహనాలపై వీఐపీ, పోలీస్, ప్రెస్ సంబంధిత స్టిక్కర్లను తొలగించి, జరిమానా విధిస్తున్నారు. ఇప్పటి వరకూ సినీ పరిశ్రమకు చెందిన పలువురి వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ ల కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు. తాజాగా ఆ లిస్ట్ లోకి టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ కూడా చేరిపోయారు. జూబ్లిహిల్స్ మీదుగా వెళ్తున్న సమయంలో త్రివిక్రమ్ కారును పోలీసులు ఆపారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో.. దానిని తొలగించి జరిమానా విధించారు.
https://www.telugupost.com/movie-news/ఈసారి-అరెస్టులు-38476/
డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో రోజుకో మలుపు తీసుకుంటుంది. కేసులో నోటీసులు అందుకున్న వారు సిట్ ఎదుట హాజరై విచారణలో పాల్గొంటూ కొన్ని నమ్మలేని నిజాలను బయటపెడుతున్నారని అంటున్నారు. అయితే ఇప్పటివరకు కెల్విన్ అనే డ్రగ్స్ డీలర్ తో ఉన్న వారిని విచారిస్తున్న సిట్ అధికారులు ఇప్పుడు జీషన్‌అలీని కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇక పోలీస్ ల కష్టడీలో ఉన్న జీషన్‌ విచారణలో మరికొందరి పేర్లు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి సెకండ్ లిస్ట్ లో యువ హీరోల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే డ్రగ్స్ర కేసులో బాగా ఎక్కువగా కూరుకున్న వారిలో రవితేజ, నవదీప్ లను సిట్ అధికారులు ఇంకా విచారించాల్సి ఉంది. కానీ ఈలోపే రవితేజ, నవదీప్‌కు జీషన్‌ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు సిట్‌ వద్ద ఆధారాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక తాజాగా తరుణ్ ని విచారణ చేపట్టిన సిట్ అధికారులు తరుణ్ నుండి చాలా విషయాలు బయటపెట్టించినట్లు చెబుతున్నారు. ఇక తరుణ్ విచారణలో పలు విషయాలు తెలిసినట్లు సమాచారం. అయితే తరుణ్ ని గోవా ట్రిప్పులు, డ్రగ్ డీల్స్, బినామీ పబ్‌ల వ్యవహారంపై సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు చెబుతున్నారు.తరుణ్ మాత్రం తాను ఉదయం నుంచి ఉపవాసం ఉన్నానని సిట్ అధికారులకు చెప్పడంతో సాయంత్రం తరుణ్‌కు డాక్టర్స్ చేత బీపీ చెక్‌ చేయించారు. ఇక పబ్స్ వ్యవహారంలో కూడా సిట్ అధికారులు చాలా సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. తరుణ్ ని విచారణ చేపట్టినప్పుడే సిట్ అధికారులు చాలామంది పబ్ ఓనర్స్ ని కూడా విచారించారు.
https://www.telugupost.com/crime/son-kills-father-with-hammer-in-ramanthapur-1471319
కన్న తండ్రిని కొడుకు సుత్తితో కొట్టి చంపిన దారుణ ఘటన హైదరాబాద్ లోని రామంతాపుర్ లో వెలుగుచూసింది. ఇంటి ఖర్చులకోసం డబ్బులివ్వలేదన్న కోపంతో కొడుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్ వివేక్ నగర్ కి చెందిన పాండు సాగర్ కి 30 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పవన్, సాయి ప్రశాంత్, యశ్వంత్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. పాండు సాగర్ రామంతపూర్ లోనే టెంట్ హౌస్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య భర్తల మధ్య ఏం గొడవలు జరిగాయోగానీ.. పాండు నాలుగేళ్ల క్రితం పీర్జాధిగూడకి చెందిన విజయలక్ష్మి అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.ప్రస్తుతం ఆమెతోనే కాపురం ఉంటున్నాడు. మొదటి భార్య, ఆమె పిల్లల బాగోగులను పట్టించుకోవడం లేదు. ఇటీవల టెంట్ హౌస్ సామాన్లు పెట్టుకునేందుకు శ్రీనివాసపురంలో ఒక అపార్ట్ మెంట్ లో రెంటుకి తీసుకున్నాడు. ఆ అపార్ట్ మెంట్ వద్దకి మొదటి భార్య పెద్ద కొడుకైన పవన్ వెళ్లాడు. ఖర్చులకు డబ్బు కావాలని అడగ్గా.. ఒక్కరూపాయి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. సంపాదనంతా రెండో భార్యకే పెడుతున్నాడన్న కోపంతో టెంట్ హౌజ్ నుండి తెచ్చిన సుత్తితో పవన్ తండ్రి తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయి.. ప్రాణం విడిచాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు నిందితుడైన పవన్ ను అదుపులోకి తీసుకున్నారు. పాండు సాగర్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు.
https://www.telugupost.com/movie-news/allu-arjun-donates-to-kerala-84315/
తుఫాను బీభత్సంతో అతలాకుతలం అయిన కేరళ ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు. కేరళ ప్రజలంటే తనకెంతో అభిమానం ఉందని...తన మనసులో వారికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే అక్కడ వరదలు కారణంగా 37 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఎడతెరిపి వర్షాలతో అక్కడ రోడ్లు అన్ని మునిగిపోయాయి..చాలా ప్రాంతాలు ఇంకా వరదల్లో చిక్కుకున్నాయి.అండగా నిలిచిన సినీ నటులుఈ విషయాలన్నీ తెలుసుకున్న స్టైలిష్ స్టార్ తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను కేరళ ప్రజల కోసం విరాళమిస్తున్నట్టు ట్విటర్‌ లో ప్రకటించారు. కోలీవుడ్ నుండి కార్తీ, సూర్య 25 లక్షల ప్రకటించగా.. కమల్ హాసన్ కూడా విరాళం ప్రకటించారు. అంతే కాదు మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ 5 లక్షల ప్రకటించాడు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నుండి ఇంకొంతమంది స్టార్స్ ముందుకు వచ్చి కేరళ ప్రభుత్వానికి విరాళాలు ప్రకటించనున్నారు.
https://www.telugupost.com/movie-news/rashmika-mandanna-in-sarileu-nekevvaru-pooja-hegde-in-ala-vaikuntapuramlo-144974/
ఈమధ్యన టాలీవుడ్ లో హీరోయిన్స్ లిస్ట్ లో రష్మిక మందన్న పేరు, పూజ హెగ్డే పేరు మాత్రమే వినబడుతుంది. కాజల్, తమన్నా, అనుష్క, నయనతార అందరూ సీనియర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోవడంతో రష్మిక, పూజ హెగ్డే లే బెస్ట్ ఆప్షన్ గా కనబడుతున్నారు. యంగ్ అండ్ స్టార్ హీరోల ఆప్షన్ రష్మిక, పూజానే. అంతగా వారు హైలెట్ అవడమే కాదు ఈ పండక్కి ఈ ఇద్దరు హీరోయిన్స్ పోటీపడ్డారు. స్టార్ హీరోలతో కలిసి నటించిన రష్మిక సరిలేరు నీకెవ్వరూ, పూజ హెగ్డే అల వైకుంఠపురములో సినిమాలు నువ్వా నేనా అంటూ సంక్రాతి బరిలో దిగాయి. మరి మహేష్ పక్కన రష్మిక, అల్లు అర్జున్ పక్కన పూజ హేగ్డ్ లకు ఎన్ని మార్కులు పడ్డాయో.. ఫైనల్ గా ఈ సంక్రాతి కి ఎవరు పై చెయ్యి సాధించారో చూద్దాం. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రష్మిక నార్మల్ లుక్స్ తో సంస్కృతి పాత్రలో మహేష్ ని ఎలాగైనా పడేసి పెళ్లి చేసుకోవాలనే పాత్రలో కనబడింది. అల్లరిగా కామెడీగా అర్ధమయ్యిందా… అనే రైమింగ్ వర్డ్ తో రష్మిక పాత్ర సరిలేరు లో ఓకె ఓకె. అయితే రష్మిక అల్ల్లరి అక్కడక్కడా అతిగా అనిపించడం, మహేష్ మీద మాట్లాడితే పడిపోవడానికి ట్రై చెయ్యడం వంటివి ప్రేక్షకులకు రుచించవు. ఇక రష్మిక పాత్ర సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకే పరిమితమైంది. అయితే స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ పాత్ర ఇంతకన్నా ఎక్కువగా ఆశించడం కరెక్ట్ కాదేమో అనే ఫీలింగ్ . ఇక మరో హీరోయిన్ పూజ హెగ్డే కూడా అలా వైకుంఠపురములో గ్లామర్ లుక్స్ తో అదరగొట్టేసింది. అల్లు అర్జున్ తో పాటలో అందాలు ఆరబోస్తూ గ్లామర్ డాల్ గా డాన్స్ లు కుమ్మేసింది. కానీ పూజ హెగ్డే పాత్రకి సినిమాలో అంతగాప్రాముఖ్యత లేదు. కేవలం గ్లామర్ డాల్ గా మాత్రం పనికొచ్చింది. నాకన్నా ఎక్కువగా గ్లామర్ ఎవరూ చూపించలేరు అన్నట్టుగా పూజ కనిపించింది కానీ.. టీజర్ లో, ట్రైలర్ లో చూపించినట్టుగా పూజ పాత్ర అల వైకుంఠపురములో హైలెట్ అవ్వలేదు. మరి ఆ రకంగా రష్మిక, పూజ పాత్రలు భారీ బడ్జెట్ సినిమాల్లో భారీగా ఊహించుకుంటే చివరికి ఇలా అయ్యింది. మరి ఫైనల్ గా రష్మిక బెస్ట్ పెరఫార్మరా? లేదంటే పూజ బెస్ట్ పెరఫార్మరా? అనేది మీరే చెప్పండి.
https://www.telugupost.com/movie-news/వరుణ్-పక్కన-కొత్త-భామ-65089/
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మాస్ మాస్ అంటూ మాస్ సినిమాల వెంట పడుతుంటే మరో మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం డీసెంట్ గా ప్రేమ కథా చిత్రాలతో హిట్ కొట్టుకుంటూ పోతున్నాడు. ఫిదా, తొలిప్రేమ వంటి హిట్స్ తో వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు. ప్రేమ కథ చిత్రాలతో లవర్ బాయ్ లా మారిపోయిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో హిట్ ని తన ఖాతాలో వేసుకొనడానికి తహతహలాడుతున్నాడు. అందుకే ఈసారి సంకల్ప్ రెడ్డి తో కలిసి ఒక విభిన్న కథా చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి బిజీగా వున్నాడు.ఈ సినిమా మొత్తం స్పేస్ చుట్టూతా తిరగనుండడం, వరుణ్ తేజ్ కూడా వ్యోమగామిగా కనిపించడం, అలాగే బాలీవుడ్ భామ అదితి రావు వరుణ్ తేజ్ కి జోడిగా నటించడం వంటి విషయాలతో ఈ సినిమాపై మంచి అంచనాలు మొదలైపోయాయి. అయితే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ఎక్కువశాతం నగర శివార్లలోని నిర్మిస్తున్న స్పేస్ సెంటర్ సెట్ లో జరగనుంది. ఈ సెట్ నిర్మాణం కూడా చాలా భారీగా జరుగుతుందట. అయితే వరుణ్ తేజ్ పక్కన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారట. అందులో ఒక హీరోయిన్ గా అతిధి ని తీసుకున్న చిత్ర బృందం.. ఇప్పుడు మరో హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసిందని సమాచారం.వరుణ్ పక్కన మరో హీరోయిన్ గా కావ్యా థాపర్ అనే కొత్తమ్మాయిని సెలెక్ట్ చేశారట. మరి కావ్యా థాపర్ సినిమాలకు కొత్త. వరుణ్ తేజ్ సినిమా ద్వారానే కావ్యా థాపర్ వెండితెరకు పరిచయం కాబోతుంది. ఇకపోతే ఈ సినిమాలో కీలకమైన సైంటిస్ట్ పాత్ర ప్రకాశ్ రాజ్ పోషించనున్నాడనే సమాచారం ఉంది. త్వరలోనే సెట్స్ మీదకెళ్లనున్న ఈ మూవీని ఈ ఏడాది చివరికల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట.
https://www.telugupost.com/movie-news/rana-marriage-165507/
దగ్గుబాటి వారసుడు రానా పెళ్లి గత శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా ఎఫెక్ట్ వలన చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నా.. ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉన్నాయి. దగ్గుబాటి రానా పెళ్లి అంటే ఇండస్ట్రీలో ఓ రేంజ్ ఉండాలి. కానీ కరోనా ఆ రేంజ్ ని పక్కనబెట్టి సింపుల్ గా పెళ్లి చేసుకునేలా చేసింది. రానా – మిహిక బజాజ్ వివాహం కొంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్యన జరిగింది. రానా పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పెళ్ళికి రానా ఫ్రెండ్ రామ్ చరణ్ సతీ సమేతంగా హాజరవగా.. అక్కినేని కోడలు సమంత – నాగ చైతన్య ఈ పెళ్ళికి హాజరయ్యారు. చైతు – సమంతలు పెళ్లి వేడుకలైన సంగీత్, మెహిందీ అన్ని ఫంక్షన్స్ కి హాజరయ్యారు. అయితే ఈ పెళ్ళిలో అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ అయిన నాగార్జున కానీ అమల కానీ అఖిల్ కానీ కనిపించలేదు. దగ్గుబాటి రామానాయుడి కూతురు లక్ష్మి ని నాగార్జునా మొదటి వివాహం చేసుకున్నాడు. ఆతర్వాత అమలాని రెండో పెళ్లి చేసుకున్న నాగార్జునకి దగ్గుబాటి ఫ్యామిలీతో తత్సంబందాలే ఉన్నాయి. కానీ రానా పెళ్ళిలో నాగ్ మిస్సింగ్ పై ఇప్పుదు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. కరోనా భయంతో నాగార్జున రాలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే నాగార్జున కరోనా ని లెక్క చెయ్యకుండా బిగ్ బాస్ సీజన్ 4 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. పిలవలేదు అనుకోవడానికి లేదు. ఆ ఫ్యామిలిలో చైతు ఉన్నాడు. ఫ్రెండ్ రామ్ చరణ్ ని పిలిచి నాగ్ ని వదలరు. కానీ నాగ్ అక్కడ కనిపించలేదు. ఇక చిరు ఫ్యామిలీ నుండి చరణ్ దంపతులు వస్తే.. నందమూరి ఫ్యామిలీ నుండి ఎవరూ హాజరవలేదు. అలాగే మోహన్ బాబు ఫ్యామిలీ నుండి కూడా హాజరవలేదు. అయితే కరోనా టైం పిలవలేదు అనుకోవచ్చు. కానీ నాగార్జున రాకపోవడమే ఇప్పుడు హైలెట్ అయ్యింది. మరి పెళ్లి ఎంత బాగా జరిగిన ఇండస్ట్రీ లోని ముఖ్యమైన అతిధులు అంటే ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలు లేని లోటు మాత్రం స్పష్టంగా కనబడుతుంది.
https://www.telugupost.com/movie-news/ntr-learning-malayalam-155099/
రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడినప్పటికీ… రాజమౌళి మాత్రం ఎడిటింగ్ అని, గ్రాఫిక్ వర్క్స్ అని ఇంట్లోనే RRR టీం చేత పనులు చేయిస్తున్నాడు. ఇంట్లోనే ఉండి ఎవరి పని వారు చక్కబెట్టేలా రాజమౌళి ప్లాన్ చెయ్యడం, కరోనా కాలాన్ని RRR పబ్లిసిటీ కోసం పక్కాగా వాడడంతో.. రాజమౌళి మీడియా కి దగ్గరగా ఉంటున్నాడు. అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కూడా రాజమౌళి ఏమైనా డబ్బింగ్ పనులు అప్పజెబితే వాటిని తమ ఇంటి నుండే పూర్తి చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కి RRR కష్టాలు మొదలయ్యాయి అంటున్నారు. RRR సినిమా పాన్ ఇండియా ఫిలిం కాబట్టి.. ఐదు భాషల్లో RRR సినిమా విడుదలవుతుంది. అయితే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పట్టున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఆ మూడు భాషల డబ్బింగ్ ని మాత్రం చెప్పుకుంటున్నారు. ఇప్పటికే హిందీ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అదిరింది. తాజాగా ఎన్టీఆర్ మలయాళం నేర్చుకుంటున్నాడట. RRR మలయాళం వెర్షన్ కి ఎన్టీఆర్ ఓన్ డబ్బింగ్ చెప్పుకునే ప్లాన్ లో భాగంగా మలయాళం నేర్చుకుంటున్నాడట. లాక్ డౌన్ తో ఇంటిపట్టునే ఉంటున్న ఎన్టీఆర్ తిని కూర్చోకుండా మలయాళం భాషనీ సాధన చేస్తున్నాడట.
https://www.telugupost.com/movie-news/కోలీవుడ్-హీరో-పెళ్లి-ముచ-59292/
కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది హీరో విశాల్. విశాల్ పెళ్లీడు వచ్చినా ఇప్పటివరకు పెళ్లి పేరెత్తకుండా గమ్మునున్నాడు. అయితే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తో ప్రేమాయణం సాగించిన విశాల్ పెళ్లి పేరు మాత్రం ఎత్తేవాడు కాదు. అలాగే పెళ్లి పేరు మీడియా వారు ఎత్తగానే సైలెంట్ గా ఆ పెళ్లి టాపిక్ ని డైవర్ట్ చేసేవాడు. ఈ మధ్యన విశాల్ కి వరలక్ష్మి కి మధ్యన విభేదాలు తలెత్తాయని టాక్ కూడా నడిచింది. అసలు విషయం మాత్రం బయటికి రాలేదుగాని వరలక్ష్మి కి విశాల్ కి మధ్య బ్రేకప్ మాత్రం నిజమంటారు.పొతే విశాల్ నడిగర్ సంగం ఎన్నికలప్పుడు... నడిగర్ సంగం బిల్డింగ్ కట్టాక అందులో తన పెళ్లి మొదటి పెళ్లి అవుతుందని మాటిచ్చాడు. ఇప్పుడు మాట ప్రకారం విశాల్ నడిగర్ సంగం బిల్డింగ్ పూర్తయ్యాక తన పెళ్లి అని అంటున్నాడు. నడిగర్ సంగం బిల్డింగ్ పనులు పూర్తి కావడమే కాదు.... వచ్చే ఏడాది జనవరిలో నడిగర్ సంగం బిల్డింగ్ ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పిన విశాల్ అందులో జరగబోయే మొదటి పెళ్లి తనదే అని.. ఇచ్చిన మాటకి కట్టుబడడమే కాదు... తన పెళ్లి కోసం అప్పుడే నడిగర్ సంగం బిల్డింగ్ కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చానని చెప్పాడు.కానీ పిల్లెవరూ, ఇప్పటికే పెళ్లి కుదిరిపోతే నే కదా పెళ్లి కోసం అడ్వాన్స్ ఇచ్చేది.... అని అందరు చెవులు కొరుక్కుంటున్నారు. కానీ విశాల్ మాత్రం తనకు కాబోయే వధువు వివరాలు బయటపెట్టలేదు. మరి పెళ్లి పనులు స్టార్ట్ అయ్యేవరకు విశాల్ పక్కన ఏ అమ్మాయి పెళ్లి కూతురుగా కూర్చోబోతుందో సస్పెన్స్ అన్నమాట.
https://www.telugupost.com/movie-news/pushpa-from-november-166722/
కరోనా గిరోనా జన్తా నై అంటూ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కోసం హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కి రెడీ అవడము… పట్టాలెక్కించడం జరిగింది. టాలీవుడ్ హీరోలే కాస్త కంగారు పడుతున్నారు. కరోనా సోకితే ప్రమాదం అనుకుని ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా రాధాకృష్ణ రాధేశ్యాం కోసం రెడీ అవుతున్నాడని టాక్ ఉండగా.. బన్నీ పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాని నవంబర్ నుండి మొదలవుతుంది అని అంటున్నారు. నవంబర్ నుండి మొదలు కాబోయే షెడ్యూల్ లో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ చాలావరకు అడవుల్లోని తియ్యాల్సి ఉంది. అందుకే సుకుమార్ ఫస్ట్ షెడ్యూల్ నుండే అడవుల్లోకి వెళ్లాలని టీం ని ప్రిపేర్ చేస్తున్నాడట. ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఇప్పటికే దేవిశ్రీ పుష్ప సినిమాకి కావాల్సిన ట్యూన్స్ ని కూల్ గా రెడీ చేస్తున్నాడట. ఇప్పటికే మంచి ఐటెం ట్యూన్స్ ని రెడీ చేసాడట దేవి. ఇక ఐటెం పాప కోసం సుక్కు బాలీవుడ్ నే అప్రోచ్ కాబోతున్నాడట. రష్మిక మందన్న హీరోయిన్ గా అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పుష్ప గెటప్ లోనే తిరుగుతున్నాడు. అంటే నవంబర్ వరకు బన్నీ పుష్ప లుక్ నే కంటిన్యూ చేస్తాడన్నమాట.
https://www.telugupost.com/crime/school-van-hits-two-kids-at-ibrahimpatnam-one-died-1438510
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులపైకి స్కూల్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొక చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగుడలో మంగళవారం ఉదయం జరిగింది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్.. బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు.ప్రమాదంలో చనిపోయిన విద్యార్థి స్థానికుడు కాదని.. బీహార్ కు చెందిన కుటుంబంగా గుర్తించారు. తీవ్రగాయాలైన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు.. మృతదేహంతో సాగర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. నిరసనకారులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
https://www.telugupost.com/movie-news/rakul-preeth-tollywood-87792/
కెరటం అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా చేశాక కెరీర్ లో నిలదొక్కుకుంది. ఇక మొదట్లో చిన్న సినిమాల్లో వరస ఆఫర్స్ తో దూసుకుపోయిన రకుల్ ప్రీత్ కి స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడానికి ఏమంత సమయం పట్టలేదు. రకుల్ టాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చోకపోయినా... స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఎప్పుడూ టాప్ చైర్ కి దగ్గరగానే ఉంది. మంచి బాడీ ఫిట్నెస్ తో అందమైన కళ్లతో... గ్లామర్ షో కి అడ్డు చెప్పని భామగా రకుల్ చాలా తక్కువ సమయం లోనే టాప్ పొజిషన్ కి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ మెల్లిగా అవకాశాలు దక్కించుకున్న రకుల్ ప్రీత్ కి తెలుగు, తమిళంలో ఒకేసారి మహేష్ తో కలిసి నటించిన స్పైడర్ దెబ్బకి కెరీర్ లో భారీ గ్యాప్ వచ్చేసింది.స్పైడర్ దెబ్బకి...స్పైడర్ తో తెలుగు, తమిళంలో రకుల్ కి కోలుకోలేని దెబ్బతగిలింది. తెలుగులో అసలు ఆఫర్స్ లేకుండా పోయాయి. తమిళంలో మాత్రం సూర్య, కార్తీ సరసన నటిస్తూ కాస్త బిజీ అయ్యింది. అయితే అవకాశాలు లేకపోయినా బాడీని బాగా మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ అంతే అందాన్ని, అంతే గ్లామర్ ని రకుల్ మెయింటైన్ చేస్తోంది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రను దక్కించుకున్న ఈ సుందరి ఒక గ్లామర్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మారి ఆ ఫోటో చూసిన ఎవరైనా ఇంత అందాన్ని టాలీవుడ్ ఎందుకు పక్కన పెట్టేసిందబ్బా.. అనిపించకమానదు.పోటీగా వచ్చేసిన పూజా హెగ్డే...తెల్లని డిజైనర్ డ్రెస్సులో చెవులకు పెద్ద పెద్ద బుట్టలు, మేడలో చిన్నపాటి బంగారు ఆభరణం, చేతులకు గాజులతో స్లీవ్ లెస్ బ్లౌజ్ తో చాలా సింపుల్ గా తన అందాన్ని చూపిస్తోంది ఈ పంజాబీ బ్యూటీ. మరి రకుల్ ప్రీత్ కి ఒక్క స్టార్ హీరో సినిమాలో అవకాశమొచ్చినా... మళ్లీ టాప్ పొజిషన్ లోకి వచ్చెయ్యడం ఖాయం. ఇక రకుల్ కి గ్యాపొచ్చిన టైం లో హీరోయిన్ పూజ హెగ్డే ఒక్కసారిగా టాలీవుడ్ టాప్ చైర్ కి దగ్గరయింది.
https://www.telugupost.com/movie-news/bellamkonda-srinivas-there-is-also-a-good-market-in-hindi-136855/
బెల్లంకొండ శ్రీనివాస్ కు తెలుగులో లాగానే హిందీ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా అతని సినిమాలు తెలుగు లో ఎలా ఉన్నా హిందీ శాటిలైట్ విష‌యంలో బెల్లంకొండ‌కు బాగానే గిట్టుబాటు అవుతోంది. అక్కడ నుంచి కనీసం శ్రీనివాస్ కి 6 నుంచి 7 కోట్ల వ‌ర‌కూ వ‌స్తున్నాయి. తెలుగులో శాటిలైట్ డిజిట‌ల్ రైట్స్ అన్నీ క‌లుపుకుంటే మ‌రో 4 కోట్లు వేసుకోవచ్చు. ఇలా మనోడి సినిమా అంటే రిలీజ్ కి ముందే 10 కోట్లు బిజినెస్ ఈజీగా జరిగిపోతుంది. పదికోట్లు……. ఈ బిజినెస్ ను ఆసరాగా తీసుకుని మనోడు రెమ్యూనరేషన్ 10 కోట్లు చెబుతున్నాడు అంట. రీసెంట్ గా ఓ డైరెక్టర్ వెళ్లి కథ చెబితే కథ నచ్చింది కానీ రెమ్యూనరేషన్ 10 కోట్లు అయితే చేస్తా అని కండిషన్ పెట్టడంతో ఆ దర్శకుడు వేరే హీరో దగ్గరకు వెళ్ళిపోయాడు. నిజానికి బెల్లంకొండ సినిమాల‌న్నింటికీ ఒకప్పుడు తన తండ్రి సురేష్ బ్యాక్ బోన్‌గా ఉంటూ వ‌స్తున్నాడు. కానీ ఇప్పుడు మనోడికి మార్కెట్ ఉండడంతో వేరే నిర్మాతలు వస్తే శాటిలైట్ రేట్లు చూపించి పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడు. దాంతో మనోడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరు పెద్దగా ఇంట్రస్ట్ చూపట్లేదు. శ్రీనివాస్ వెనక్కి తగ్గి 5 – 6 అయితే బెల్లంకొండ‌తో సినిమా గిట్టుబాటు అయిపోతుంది. లేకపోతే కష్టమే అంటున్నారు. ఈ రెమ్యూనరేషన్ పెంచడానికి మరో కారణం కూడా ఉంది. అదే అతని లాస్ట్ మూవీ రాక్ష‌సుడు మూవీ హిట్ అవ్వడం.
https://www.telugupost.com/movie-news/బానే-బాదేశాడు-33481/
ఎన్టీఆర్ స్టార్ మా ఛానల్ లో 'బిగ్ బాస్' షో కి హోస్ట్ గా మరుతున్నాడని నిన్నటినుండి మీడియాలో ఒకటే న్యూస్ ప్రచారం అవుతుంది. 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ లో బిజీగా వున్న యంగ్ టైగర్ ఇప్పుడు బుల్లితెర మీద కూడా తన టాలెంట్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'బిగ్ బాస్' షో ని మా టీవీ వారు ఇక్కడ తెలుగులో షో చెయ్యడానికి రైట్స్ ని చేజిక్కిన్చుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కి ఈ 'బిగ్ బాస్' షో ఒక్క సీజన్ చేసినందుకు గాను దాదాపు ఎనిమిది కోట్ల పారితోషకాన్ని ముట్టజెబుతున్నారట. మరి ఒక్క సీజన్ కి 8 కోట్లు అంటే మాటలు కాదు.'మీలో ఎవరు కోటీశ్వరుడు' హోస్ట్ గా చేసిన నాగార్జున, చిరంజీవులు అంత పెద్ద మొత్తం అందుకోలేదు. చిరంజీవికి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చేసినందుకు గాను 4 కోట్లు ఇచ్చారు. అదీ ఒక్క సీజన్ కి మాత్రం కాదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి ఏకంగా 8 కోట్లు ఇచ్చేస్తున్నారు. అసలు 'బిగ్ బాస్' ఒక్క సీజన్ అంటే కేవలం 10 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి ఒక్క సీజన్ కే పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి ఎన్టీఆర్ ని బుట్టలో పడేసింది మా ఛానల్. ఇక ఎన్టీఆర్ ఇప్పటివరకు తన ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ కింద 15 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. మరి 'బిగ్ బాస్' ఒక్క సీజన్ కే 8 కోట్లు తీసుకుని రికార్డు సృష్టించినట్లే.మరో వైపు ఎన్టీఆర్ ని హోస్ట్ గా చెయ్యడానికి నాగార్జున, చిరంజీవులు వెనకుండి కథనడిపించారనే వార్తలొస్తున్నాయి. మా టీవీ స్టార్ చేతిలోకి వెళ్లిపోయినా... దానితో నాగ్, చిరులకి మంచి సంబంధాలు వున్నాయి. అందుకే మా టీవీ వారు 'బిగ్ బాస్' షో కి హోస్ట్ ఎవరైతే బావుంటుందని నాగ్, చిరు ల సలహా అడగగా వారు ఎన్టీఆర్ పేరుని సూచించినట్లు సమాచారం.
https://www.telugupost.com/movie-news/స్పైడర్-పనిపడతాం-45254/
మహేష్ బాబు తాజా చిత్రం అయిన స్పైడర్ దసరా కనుకనగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెగటివ్ టాక్ తో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా వల్ల చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారనే ప్రచారం మొదలైంది. మరి స్పైడర్ తో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవడంతోపాటే ఇప్పుడు ఈ సినిమా ఒక వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే ఈ సినిమా లో విలన్ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాటి కాపర్లని కించపరిచే విధంగా చూపించారని ఆ సంఘం ప్రతినిధులు ఆందోళనకి రెడీ అయ్యారు.అలా స్పైడర్ సినిమాలో కాటికాపర్లని కించ పరిచే విధంగా ఉన్న సన్నివేశాలని తక్షణం తొలగించాలని రాష్ట్ర కాటి కాపర్ల సంఘం అధ్యక్షులు శీలం సత్యనారాయణ డిమాండ్ చేసారు.వీరంతా హైదరాబాద్ రామంతపూర్ హిందూ స్మశాన వాటికలో సమావేశం అయ్యారు. అసలు శ్మశానంలో కాటికాపర్లు చాలా కష్టపడి..... చనిపోయిన శవాలని దహన సంస్కారాలు, పూడ్చి పెట్టడం వంటి పనులని సంప్రదాయ పద్ధతిలో చేస్తూ ఉంటారని... అలాంటి వారిని కించపరుస్తూ చూపించడం కరెక్ట్ కాదని ఆ సంఘం ప్రతినిధులు వాదిస్తున్నారు. అందుకే స్పైడర్ సినిమాలోని ఆ సన్నివేశాలని తక్షణం తొలగించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని వారు హెచ్చరికాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫలితంతో ఉసూరుమంటున్న చిత్ర బృందం ఇప్పుడు ఈ కాటి కాపర్ల హెచ్చరికలతో ఇంకెలాంటి ఇబ్బందుల్లో పడనున్నారో అంటున్నారు. మరో పక్క ఈ వివాదం పై మురగదాస్, ప్రొడ్యూసర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి
https://www.telugupost.com/movie-news/regina-cassandra-fires-on-reporters-in-sakini-dakini-press-meet-1437648
రెజీనా, నివేదా థామస్‌ మెయిన్ లీడ్స్ గా కొరియన్ సినిమా మిడ్‌నైట్ రన్నర్స్ సినిమాకి కి రీమేక్ గా రూపొందిన సినిమా "శాకిని డాకిని". సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సునీత తాటి నిర్మించింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదల కానుండగా.. తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో రెజీనా విలేఖరులపై ఫైరయింది. ప్రెస్ మీట్ లో భాగంగా ఓ రిపోర్టర్.. మేడమ్‌ మీకు ఈ సినిమాలో ఓసీడీ ఉన్నట్లు చూపించారు. నిజ జీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా ? అని ప్రశ్నించాడు.దాంతో రెజీనా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా? సినిమాలో మేము కేవలం నటిస్తామంతే. పాత్ర డిమాండ్‌ చేయడం వల్ల మేము అలా నటిస్తాము. అమ్మాయిల్ని చాలా గొప్పగా చూపిస్తూ ఈ సినిమాని తీస్తే మీరేమో నా పాత్ర, ఓసీడీ గురించి అడుగుతున్నారు. వ్యక్తిగతంగా నేను శుభ్రంగా ఉండటానికి చూస్తాను, అంతేకాని ఓసీడీ లాంటి సైకలాజికల్‌ డిజార్డర్‌ నాకేమీ లేదు. మీ వద్ద ఇలాంటి ప్రశ్నలే ఉంటాయా? అని ఫైరయింది. అనంతరం విలేఖరుల ఫోన్లు వరుసగా రింగ్ అవడంతో రెజీనా అసహనానికి గురైంది. ప్రెస్ మీట్ లో ఉన్నపుడు మీరందరూ ఫోన్లు సైలెంట్‌లో పెట్టుకోరా? అంటూ ప్రశ్నించింది.
https://www.telugupost.com/movie-news/pragya-jaiswal-film-career-112564/
క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోతుందని అంతా అనుకున్నారు. టాలీవుడ్ లో ఆమెకు మంచి భవిషత్తు ఉందని అంతా నమ్మరు. మంచి పర్సనాలిటీ, అందం ఉండటంతో అవకాశాలు ఎక్కువ వస్తాయి అని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమెకు టాలీవుడ్ లో సరైన ఆఫర్స్ రావడం లేదు. స్టార్ హీరోస్, డైరెక్టర్స్ ఎవరూ ఆమెని పటించుకోవడం లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్కటి అంటే ఒక్క సినిమా కూడా లేదు. ఫోటో షూట్స్ చేస్తున్నా… రెండు మూడు సినిమాలు ఉన్నా అవి చర్చల దశలోనే ఉన్నాయి. టాలీవుడ్ లో సినిమా ఆఫర్ల కోసం చాలానే ప్రయత్నించింది. చిన్న సినిమాల నుండి ఆఫర్స్ వచ్చినా నో అని చెప్పకుండా చేస్తాను అని చెపుతుందని టాక్. తెలుగులో ఆఫర్స్ కోసం సినీ వర్గాల వారి దృష్టిని ఆకర్షించేందుకు ఫొటో షూట్ లను వదులుతూనే ఉంది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో వాల్స్ పై వారంలో మూడు నాలుగు ఫొటో షూట్ స్టిల్స్ పోస్ట్ అవుతూనే ఉన్నాయి. కనీసం ఈ ఫొటోస్ చూసి అయినా ఆఫర్స్ ఇస్తారేమో అని ఆమె ఆశ. మరి ఆ ఫోటో షూట్స్ ఎంతవరకు పనికోస్తాయో చూద్దాం.
https://www.telugupost.com/hyderabad/that-is-why-telangana-chief-minister-revanth-reddy-has-focused-on-twin-cities-he-succeeding-in-holding-on-to-twin-cities-fo-hyderabad-1549023
ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టినా రాని ఇమేజ్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రజలు అభివృద్ధితో పాటు అక్రమాలను కూడా అదే స్థాయిలో ఆహ్వానిస్తారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి కూడా అదే రకమైన ఇమేజ్ వస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ జంట నగరాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. రూరల్ ఏరియాలో బలం పెంచుకుని అధికారంలోకి రాగలిగినా, హైదరాబాద్ నగరంపై ఎంత మాత్రం గ్రిప్ సంపాదించుకోలేకపోయింది. నాయకత్వ లోపమా? గత ప్రభుత్వం జంట నగరాలలో చేసిన అభివృద్ధి కారణమా అని పక్కన పెడితే కాంగ్రెస్ కు మాత్రం హైదరాబాద్ లో ఇప్పటికీ నాయకత్వ లోపంతోనే ఉంది.జంటనగరాలపై ఫోకస్...జంట నగరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మెట్రో రైలును విస్తరించడంతో పాటు హైదరాబాద్ లో నాలుగో నగరానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఇటు ఐటీ సంస్థలను ఆహ్వానించడం, హైదరాబాద్ లో పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించడం ఇవన్నీ ఒక ఎత్తు. జంట నగర వాసుల గ్రిప్ ను మరింత సంపాదించుకోవాలంటే ఇది ఒక్కటే సరిపోదు. అందుకే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. దానికి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా వ్యవహరిస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాధ్ ను కమిషనర్ గా నియమించి ఫుల్లు పవర్స్ ఇచ్చారు.ప్రజలు స్వాగతిస్తారని తెలిసే...అక్రమ కట్టడాలు కూల్చివేతను ప్రజలు స్వాగతిస్తారని తెలుసు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రమే కాకుండా ఉద్యోగ వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తుందని ఆయన ఆశించారు. అయితే ఇదే కూల్చివేతలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కో, లేక హైదరాబాద్ మెట్రో డెవెలెప్‌మెంట్ అథారిటీకి అప్పగించే అవకాశముంది. కానీ ఆ రెండింటి నుంచి ముందుగానే కబ్జాదారులకు విషయం లీకవుతాయి. న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఎన్నాళ్ల నుంచో అవినీతికి పాల్పడిన ఆ రెండు సంస్థల్లో ఉద్యోగుల మీద రేవంత్ రెడ్డికి నమ్మకం లేకపోవడం వల్లనే హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా నెక్ట్స్ టార్గెట్...హైదరాబాద్ లో ఒక్క హీరోలు మాత్రమే కాదు. ఎక్కువ మంది రాజకీయ నాయకులు, బిల్డర్లు ఎఫ్‌టీఎల్ నిబంధలనకు విరుద్ధంగా పెద్దయెత్తున నిర్మాణాలు చేపట్టారు. వీటిని కూల్చివేస్తే జంట నగరాల జనాలు జేజేలు కొట్టడం ఖాయం. అదే రేవంత్ రెడ్డి వ్యూహం. ఆ వ్యూహం వర్క్ అవుట్ అయింది. ఇప్పడు తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి అని ప్రచారం జరుగుతుంది. ఆయన చెరువులు,నాలాలు ఆక్రమించి యూనివర్సిటీ, కాలేజీలు, హాస్పిటల్ ను నిర్మించారు. ఇప్పటికే మల్లారెడ్డి ఆక్రమణలపై ఫిర్యాదు అందడంతో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అని అంటున్నారు. అలాగే మరో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదయింది. బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారాని ఆయనపై ఫిర్యాదు అందడంతో ఆయనపై కేసు నమోదయింది. ఇంకా లిస్ట్ లో చాలా మంది ఉన్నట్లే ప్రచారం జరుగుతుంది.
https://www.telugupost.com/movie-news/అర్జున్-సినిమాలో-అర్జున్-27753/
అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'డీజే... దువ్వాడ జగన్నాథం' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో, టీజర్ తో సంచలనాలు క్రియేట్ చేస్తున్న 'డీజే' మే లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ 'డీజే' చిత్రం కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ - రైటర్ వక్కంతం వంశీ కాంబినేషన్ మూవీ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం కూడా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతుందని సమాచారం.ఇక ఈ చిత్రానికి అప్పుడే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారని 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే టైటిల్ ని వక్కంతం, అల్లు అర్జున్ చిత్రానికి టైటిల్ గా పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఇప్పుడొక ఆసక్తికర వార్త వినబడుతుంది. అదేమిటంటే అలనాటి స్టార్ హీరో అల్లు అర్జున్ కొత్త చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడని చెబుతున్నారు. తెలుగులో సుపరిచితుడు అయిన 'ఒకే ఒక్కడు, జెంటిల్మన్' చిత్రాల హీరో అర్జున్ ఈ అల్లు అర్జున్ చిత్రం లో నటించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే అర్జున్ హీరో, విలన్ పాత్రలే కాకుండా కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు భాషల్లో నటిస్తున్నాడు. అందుకే అల్లు అర్జున్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం వంశీ అర్జున్ ని ఎంచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈవిషయం ఇంకా అధికారికం గా ప్రకటించవలసి వుంది.
https://www.telugupost.com/movie-news/liger-first-glimpse-released-1346425
రొమాంటిక్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా.. మైక్ టైసన్ ప్రధాన పాత్రలో వస్తోన్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా మూవీ లైగర్. దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూ.125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ 2022 ఆగస్ట్ 25వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈలోగా విజయ్ అభిమానులకు న్యూ ఇయర్ కానుకగా వరుస అప్ డేట్స్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గురువారం లైగర్ బీటీఎస్ పిక్స్, ఇన్స్టా ఫిల్టర్ ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా లైగర్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ముంబై ఛాయ్ వాలా టు ఎంఎంఏ ఛాంపియన్53 సెకండ్ల నిడివితో వచ్చిన ఈ ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ.. మునుపెన్నడూ చూడనంత పవర్ ఫుల్ గెటప్ లో కనిపించాడు. పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో రౌడీ బాయ్ పవర్ ఫుల్ డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ ని పెంచేస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ తో రౌడీ బాయ్స్ లైగర్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పోనీ టైల్ తో సరికొత్త లుక్ లో కనిపించాడు విజయ్ దేవరకొండ. ముంబై వీధుల్లో ఛాయ్ వాలాగా ఉండే ఓ కుర్రాడు.. ఎంఎంఏ ఛాంపియన్ గా ఎలా ఎదిగాడన్నది సినిమా కథగా తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. అలాగే కన్నడ, తమిళం, మళయాళంలో డబ్ చేయనున్నారు. లైగర్ సినిమాలో విజయ్ కు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించినట్లు తెలుస్తోంది. అలాగే రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు.
https://www.telugupost.com/movie-news/అది-అదే-ఇది-ఇదే-33441/
'బాహుబలి-ది బిగినింగ్‌, 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌'లతో రాజమౌళి ఎక్కడికో వెళ్లిపోయాడు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా మంది సినీ ప్రియులు ఈయన ఎవరా? అని ఆరా తీస్తున్నారు. ఇక 'బాహుబలి' తర్వాత రాజమౌళి చేసే సినిమా ఏదీ? ఏ హీరోతో? ఏ నిర్మాతలకు? అనేది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనేదాని కన్నా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన బాలీవుడ్‌లో ఓ చిత్రం చేస్తాడని, కాదు.. కాదు రజనీతో ఓ చిత్రం చేస్తాడని, ఇక మహాభారతం తీస్తాడని ఎన్నెన్నో వార్తలు వస్తున్నాయి. జక్కన్న వాటిని చేయాలని ఉంది అని చెప్పాడే గానీ ఎప్పుడు అదే సినిమా చేయనున్నానని మాత్రం చెప్పలేదు. ఆయన కథను బట్టే హీరోని ఎంచుకుంటానని చెబుతున్నాడు. మరోపక్క ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌ నా కుమారుడి కావాల్సి వస్తే గంటలో కథ రాస్తానంటున్నాడు. ఇలా వీరిద్దరు కలిసి సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు. తాజాగా కూడా రాజమౌళి మీరు ఎన్టీఆర్‌తో తదుపరి చిత్రం చేస్తారా? అంటే ఎన్టీఆర్‌ అంటే ఇష్టమని ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నా. అది తదుపరి చిత్రం కావచ్చు...కాకపోవచ్చు.. ఇక నా తండ్రి ఇప్పటికే మూడు కథలు ఇచ్చారు. అవేమీ నా బుర్రకు ఎక్కలేదు. ఇక నాకు దానయ్య, కె.ఎల్‌.నారాయణలతో కమిట్‌మెంట్‌ఉంది. ఇక వారాహి అధినేత సాయికొర్రపాటికి కూడా ఓ చిత్రం చేయాల్సివుందని తేల్చాడు.సో.. ప్రస్తుతం ఆయన సినిమా తెలుగులో చేస్తే పాత కమిట్‌మెంట్స్‌ కింద ఈ ముగ్గురు మాత్రమే క్యూలో ఉన్నారు. కానీ వీరికి జక్కన్న సినిమాలు చేస్తానని మాట ఇచ్చాడే గానీ ఇంకా రెమ్యూనరేషన్‌ చెప్పలేదని, వారి చిత్రాలు ప్రారంభమయ్యే నాటికి తన స్థాయిని బట్టి రెమ్యూనరేషన్‌ తీసుకుంటానని మాత్రమే హామీ ఇచ్చాడని సమాచారం. సో.. వీరు ముగ్గురితో ముగ్గురు హీరోలతో జక్కన్న చిత్రాలు చేసినా ఆయన పారితోషికం, సినిమా బడ్జెట్‌ మాత్రం కమిట్‌మెంట్‌ సమయంలోలా ఉండవని, పరిస్థితి ప్రస్తుతం ఎక్కడికో ఎదిగిందని అంటున్నాయి సినీ వర్గాలు
https://www.telugupost.com/movie-news/చరణ్-కోసం-బన్నీ-హీరోయిన్-45339/
సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ఎంతగా ఇంపార్టెన్స్ ఉంటుందో అతగాడి గత సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో ఆ ఐటెం సాంగ్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే సుకుమార్ కూడా తన సినిమాల్లో అదిరిపోయే ఐటెం సాంగ్స్ కోసం ప్లాన్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 లో ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ కోసం ప్లాన్ చెయ్యడం... దానికి సంబందించిన ఐటెం భామను పట్టుకోవడం జరిగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. సుకుమార్ రంగస్థలంలో రామ్ చరణ్ తో ఐటెం సాంగ్ లో ఆడి పాడడానికి దువ్వాడ జగన్నాధం హీరోయిన్ పూజ హెగ్డేని సెలెక్ట్ చెయ్యడం... దానికి సంబంధించి పూజ హెగ్డే తో అగ్రిమెంట్స్ చేసుకోవడము జరిగిపోయినట్లుగా చెబుతున్నారు. దువ్వాడలో అల్లు అర్జున్ తో పోటీగా స్టెప్స్ వేసిన పూజ డాన్సింగ్ స్కిల్స్ నచ్చి సుకుమార్ ఈ ఐటెం కోసం పూజని తీసుకున్నాడట. మరి ఇప్పటికే హీరోయిన్ సమంత సన్నివేశాలు రంగస్థలంలో పూర్తి కాగా.. ఇప్పుడు మిగిలిన నటీనటులకు సంబందించిన సన్నివేశాలతో పాటు పూజ హెగ్డే తో ఈ ఐటెం సాంగ్ కూడా తెరకెక్కిస్తాడట. ఇక రామ్ చరణ్ కూడా ఈ ఐటెం సాంగ్ కోసం పూర్తి కసరత్తులు ప్రారంభించడమే కాదు... దాని కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ఇక రంగస్థలంలో ఐటెం అవకాశం దొరకడంతో పూజ హెగ్డే ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంటున్నారు. మరి అంతేగా రెండు రోజులు ఐటెం కోసం కష్టపడితే కోట్లు దండుకోవచ్చు. అందుకే ఆ మాత్రం హ్యాపీ నెస్ ఉంటుందిలే.
https://www.telugupost.com/movie-news/body-of-rebel-star-krishnam-raju-was-kept-at-his-house-his-funeral-will-be-held-today-1438262
రెబల్ స్టార్ కృష్ణంరాజు పార్ధీవ దేహాన్ని ఆయన ఇంటిలోనే ఉంచారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఆయన ఇంటి నుంచి రంగారెడ్డి జిల్లాలోని సొంత ఫాం హౌస్ వరకూ అంతిమ యాత్ర కొనసాగనుంది. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కనకమామిడి లోని ఆయన ఫాం హౌంస్ లో అంత్యక్రియలు జరుగుతాయి. ఐదేళ్ల క్రితం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని కృష్ణంరాజు కొనుగోలు చేశారు. అక్కడ ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే కన్నుమూశారు.ఫాంహౌస్ లో....ఆయన అంత్యక్రియలు అక్కడ నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్వహించారు. కృష్ణంరాజు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఫాం హౌస్ వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణంరాజు అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు తరలి వస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
https://www.telugupost.com/movie-news/bharatiyudu-2-shankar-110817/
కమల్ హాసన్ – ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ‘భారతీయుడు 2’ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా గురించి గత కొన్ని రోజుల నుండి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందని… శంకర్ ఈ చిత్రానికి భారీ బడ్జెట్ ను కోట్ చేశాడట అందుకే లైకా అందుకు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి సినిమా ఆగిపాయిందని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది విడుదల అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఆగిపోలేదని ఇప్పటికే రెండు ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తి అయ్యాయని, త్వరలోనే మరో భారీ షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నామని లైకా ప్రతినిధి స్పష్టం చేశారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
https://www.telugupost.com/top-stories/bharathiya-janatha-party-prepares-to-conduct-jamili-elections-will-andhra-pradesh-chief-minister-chandrababu-naidu-be-ready-for-this-that-is-the-question-1551838
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశమంతా ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. గతం నుంచే జమిలి ఎన్నికలకు ప్రణాళికను సిద్ధం చేసిన కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ మూడోసారి అధికారం రావడంతో ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అయితే జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే ఇందుకు చాలా సమయం పడుతుందన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇప్పటికే రామ్‌నాధ్ కోవిండ్ కమిటీ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడంతో పాటు రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆలోచనగా ఉంది.బాబు అంగీకరిస్తేనే?అయితే ఇందుకు ప్రధాన అడ్డంకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలకు అంగీకరించాల్సి ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లులు ఆమోదం పొందాలంటే ఇటు చంద్రబాబు, అటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ల మద్దతు అవసరం అవుతుంది. అయితే చంద్రబాబు అంత సులువుగా మధ్యంతర ఎన్నికలకు అంగీకరిస్తారని అనుకోలేం. ఎందుకంటే 2014 అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన జమిలీ ప్రతిపాదనను చంద్రబాబు పార్టీ వ్యతిరేకించింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్నారు. అయినా సరే ఆయన మధ్యంతర ఎన్నికలను కోరుకోను కాక కోరు అన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో 175 స్థానాలకు కూటమికి 164 స్థానాలు సాధించడం ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇదే ప్రధమం కావడం కూడా జమిలికి అంగీకరించక పోవడానికి ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రజల మూడ్ ఎప్పటికప్పుడు...అంతే కాకుండా ఎన్నికలు జరిగితే అదే రకమైన ఫలితాలు వస్తాయని చెప్పలేం. చంద్రబాబు కూడా అంచనా వేయలేరు. ఎందుకంటే ప్రజల మూడ్ ఎప్పటికి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే మూడు నెలలు గడిచినా పింఛను మినహా మరే ఇతర సూపర్ సిక్స్ హామీలను అమలుచేయలేదు. ఎంత లేదని భావించినా ప్రజల్లో అసంతృప్తి మాత్రం ఉంటుందన్న అంచనా వేయలేని అనుభవం ఆయనకు లేక కాదు. అదే సమయంలో మరోసారి ఎన్నికలు అంటే ఆర్థిక భారం నేతలపైనా, పార్టీపైనా పడుతుందని ఆయనకు తెలుసు. ప్రత్యర్థులు బలంగా ఉన్న సమయంలో జమిలీ పేరుతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కూడా మూర్ఖమైన చర్యగా ఆయన భావిస్తారు. ఇందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు ఆలోచనకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే సాఫీగా సాగిపోతున్న సమయంలో జమిలీ ఎన్నికల కుదుపుతో మరోసారి ఇబ్బందులు ఎదుర్కొనాలని ఆయన కూడా ఆలోచన చేయవచ్చు.చాలా తతంగం...చంద్రబాబు, పవన్ మద్దతు లేకుండా లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదు. బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబును బుజ్జగించినా పెద్దగా ప్రయోజనం జమిలీ ఎన్నికల విషయంలో ఉండక పోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే చంద్రబాబు మద్దతు అవసరం కావడంతో కేంద్రం కూడా పునరాలోచనలో పడే అవకాశం ఉంది. దీంతో పాటు శీతాకాల సమావేశాల్లో జమిలి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందినప్పటికీ తర్వాత రామ్‌నాధ్ కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. అంతే కాకుండా ముఖ్యంగా జనగణన పూర్తి కావాల్సి ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే ఆచరణలో కొంత కష్టమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు మరో పదిహేను పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మళ్లీ 2029 వరకూ ఎన్నికలు జరిగే అవకాశాలు కష్టమేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది.
https://www.telugupost.com/movie-news/jabardast-punch-prasads-two-legs-are-not-working-when-his-health-was-failing-1448886
జబర్దస్త్ షో చూసే వారికి పంచ్ ప్రసాద్ అంటే తెలుసు. ఆయన పంచ్ లతో అందరినీ అలరించేవారు. ఆయన గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తన స్కిట్ లలో కిడ్నీలపైన కూడా పంచ్ లు వేసుకుని ప్రసాద్ అందరినీ నవ్వించే వారు. జబర్దస్త్ నటులు ప్రసాద్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయం కూడా అందించారు. ప్రసాద్ ఆరోగ్యం పై ఇతర కెమెడియన్లు కూడా పంచ్ లు వేసినా ఈజీగా తీసుకునే వారు.పంచ్ ప్రసాద్ రెండు కాళ్లు...ప్రసాద్ ఆరోగ్యం కుదుట పడుతుందనుకుంటున్న సమయంలో ఆయన రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఆయన నడవలేని స్థితికి చేరుకున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగడంతో కాళ్లు చచ్చుపడి పోయాయని జబర్దస్త్ టీం సభ్యులు తెలిపారు. ప్రసాద్ నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఫొటోలను కొందరు జబర్దస్త్ టీం సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్ త్వరగా కోలుకుని పంచ్ లతో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/రామలక్ష్మి-వచ్చేసిందోచ్-59113/
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ - సమంత జంటగా రంగస్థలం షూటింగ్ పూర్తికావొచ్చింది. మరి సినిమా షూటింగ్ మొదలెట్టుకున్న ఏడాదికి గాని విడుదలకు సిద్దమవని ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనూ, రంగస్థలం టీజర్ తోనూ భారీ హైప్ ని క్రియేట్ చేసింది సుకుమార్ అండ్ టీమ్. నిన్నగాక మొన్న చిట్టిబాబు అంటూ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ లోను టీజర్ లోను చించి ఆరేస్తే... ఇప్పుడు రామలక్ష్మిగా సమంత అదరగొడుతుంది. రామ్ చరణ్ ని సోలోగా పెట్టి రంగస్థలం టీజర్ ని కట్ చేసిన సుకుమార్ ఇప్పుడు రామలక్ష్మి అంటే సమంతని సోలోగా దించాడు. చిట్టిబాబుగా సౌండ్ ఇంజినీర్ గా రామ్ చరణ్ ని పక్కా మాస్ కాదు కాదు ఊర మాస్ మాదిరిగా లుంగీ, చొక్కా, కండువాతో మెగా ఫాన్స్ ని ఉర్రుతలూగిస్తే... ఇప్పుడు సమంత రామలక్ష్మీగా పాతకాలపు పరికిణి ఓణీ, డొక్కు సైకిల్, తల మీద మొక్కజొన్న చొప్ప తో అదరగోట్టేసింది.ఎప్పుడు మోడరన్ డ్రెస్సుల్లో అదరగొట్టే నవ్వుతో గ్లామర్ గా ఉండే సమంత... రంగస్థలం కోసం డి గ్లామర్ లుక్ లోకి మారినా ఆమె మొహంలో కళ గాని, నవ్వు గాని చేరగలేదు. ఎంత మేకప్ లేకపోయినా సమంత లుక్స్ చాల బావున్నాయి రంగస్థలంలో. ఇకపోతే ఈ రంగస్థలం టీజర్ లో సమంత వయ్యారంగా తిప్పుకుంటూ బింది తీసుకొని నీళ్ల కోసం వెళుతుంటే... బ్యాగ్రౌండ్ లో చిట్టి అదేనండి రామ్ చరణ్.... ఓహోహో .. ఏం వయ్యారం ఏం వయ్యారం.. ఏమాటకామాటే సేప్పుకోవాలండి.. ఈ పిల్లేదురోత్తంటే మన ఊరికే పద్దెనిమిది సంవత్సరాలు వయసొచ్చినట్టు ఉంటదండి.... సైకిల్ మీద అలా అలా రామలక్ష్మి వస్తుంటే... మళ్ళీ బ్యాగ్రౌండ్ లో చిట్టి బాబు... ఈ చిట్టిగాడి గుండెకాయని గోలెత్తించేసింది ఈ పిల్లేనండీ... పేరు రామలక్ష్మి అండి....ఊరు రంగస్థలమండి అని చెబుతుంటే సమంత నవ్వుతుంది చూడండి గుండె లయ తప్పాల్సిందే. అలాగే టీజర్ చివర్లో సమంత బట్టలుతుకుతూ పెట్టిన ఫోజుంది చూడండి అమ్మో కేక. మరి చిట్టిబాబే కాదు రామ లక్ష్మి కూడా రంగస్థలంతో అదిరిపోయింది. మంచి కథ ఉంది కాబట్టే ఇలాంటి డి గ్లామర్ లుక్స్ కి అటు రామ్ చరణ్, ఇటు సమంత ఓకె చెప్పింది. ఇక దర్శకుడు సుకుమార్ ఈసారి డిఫ్రెంట్ గా స్టయిల్ మార్చాడనేది పూర్తిగా అర్ధమయ్యింది. అలాగే దేవిశ్రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అనిపించేలా ఉంది. మరి మార్చ్ 30 న మెగా ఫాన్స్ కాసుకోండి పండగ చేసుకోవడానికి.
https://www.telugupost.com/movie-news/praneetha-likes-alia-156486/
హీరోయిన్స్ అందరూ కరోనా లాక్ డౌన్ లో జిమ్స్, యోగా అంటూ ఇంట్లోనే కష్టాలు పడుతుంటే… టాలీవుడ్ ఫెడవుట్ హీరోయిన్ ప్రణీత సుభాష్ మాత్రం పేదలకు అన్నదానాలు చేయడం, ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయపడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణీత చాలా విషయాలు అందరితో పంచుకుంది.. పవన్ కళ్యాణ్ తో నటించి సూపర్ హిట్ కొట్టినప్పటికీ.. టాలీవుడ్లో నిలబడలేకపోయిన ప్రణీత ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసినప్పుడు లైఫ్ గురించి మాట్లాడుకునే వారమని.. పవన్ కళ్యాణ్ తో మరోసారి అవకాశం వస్తే బావుంటుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక ఎన్టీఆర్ విలక్షణ నటుడు అని.. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అద్భుతమని.. రేర్ నటుల్లో ఆయన ఒకరని ఎన్టీఆర్ ని ఆకాశానికెత్తేసింది. ఇక టాలీవుడ్ లో నటించడం లేదు.. అవకాశాలు రావడం లేదా అని అడిగితె.. లేదు నాకు కథలు నచ్చడం లేదు, అవకాశాలు వస్తున్నాయి. కథ నచ్చితే సినిమా చేస్తా అంటుంది. ఇక బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో సినిమా చేస్తున్న.. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్న అని చెప్పిన ప్రణీత సుభాష్.. అలియా భట్, దీపికా పదుకునే అంటే ఇష్టమని.. వాళ్ళు కెరీర్ లు మలుచుకున్న తీరు బావుంటుంది అని చెబుతుంది. ఇక పెళ్ళి గురించిన ఆలోచనలు ఇప్పుడప్పుడే లేవంటుంది.
https://www.telugupost.com/movie-news/ntr-bulk-dates-for-prashant-166007/
ఎన్టీఆర్ రాజమౌళి RRR షూటింగ్ కోసం రెండేళ్లుగా టైం స్పెండ్ చేసాడు. ఇంకా మరో ఆరు నెలల టైం పట్టేలా ఉంది. అయితే RRR తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలి. RRR తో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కూడా చెయ్యాల్సి ఉండగా… ప్రస్తుతం ఏ సినిమా చేసే ఛాన్స్ కరోనా ఇవ్వడం లేదు. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి కమిట్ అయ్యాడనే న్యూస్ ఉండడం.. ఈమధ్యనే ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ కి కథ చర్చలు జరిగినట్టుగా కూడా సోషల్ మీడియాలో టాక్ ఉంది. తాజాగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించడమే కాదు… ఈ సినిమా ని తెలుగు లో తెరకెక్కించి అన్ని భషాల్లో డబ్ చెయ్యకుండా.. తెలుగుతో పాటుగా అన్ని భాషల్లోనూ స్ట్రయిట్ మూవీగా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడట. అందుకే ఎన్టీఆర్ ని ఏడాది పాటు బల్క్ డేట్స్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని కోరినట్టుగా ఫిలింనగర్ టాక్. మరి ఎన్టీఆర్ స్క్రిప్ట్ నచ్చితే ఒప్పుకోక ఏం చేస్తాడు చూద్దాం అంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్.
https://www.telugupost.com/movie-news/2-o-collections-in-telangana-100930/
రజనీకాంత్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ సినిమా నవంబర్ 29న విడుదలైంది. మొదటి షోకే ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ రివ్యూ రైటర్స్ మాత్రం 2.ఓ ని బాగా లేపారు. శంకర్ వీఎఫెక్స్ కి పడిపోయారు క్రిటిక్స్. అయినా 2.ఓ లో కథ లేకపోవడం మైనస్. అయితే రజనీకాంత్ కన్నా ఎక్కువగా ఈ సినిమాలో విలన్ రోల్ పోషించిన అక్షయ్ కి ఎక్కువ ఆధరణ దక్కింది. అక్షయ్ మేకప్, అక్షయ్ కష్టం స్క్రీన్ మీద అడుగడుగునా కనబడింది. ఇకపోతే 2.ఓ సినిమా నెగెటివ్ టాక్ వలన బయ్యర్లు నష్టపోతారని... భారీ లాస్ అవుతారని... టాక్ మాములుగా స్ప్రెడ్ అవలేదు.తెలంగాణలో రికార్డు...ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే ఎవ్వరైనా అదే మాట అంటారు. కాకపోతే 2.ఓ బాలీవుడ్ లో మాత్రం అక్షయ్ కుమార్ క్రేజ్ కారణంగా మొదటి పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి చేరుకొని రికార్డు సృష్టించింది. ఇక తాజాగా తెలంగాణలోనూ 2.ఓ హావా కొనసాగుతుంది. మొదటి రోజు నుండి నైజంలో 2.ఓ కలెక్షన్స్ బాగున్నాయి. ఇప్పటికీ 2.ఓ అదే హావా కొనసాగిస్తోంది. గత శుక్రవారం విడుదలైన సినిమాలలో పస లేకపోవడం ఒక కారణం అయితే... తెలంగాణలో వరసగా సెలవులు రావడం మరో కారణం. కేవలం 10 రోజుల్లోనే తెలంగాణలో 2.ఓ 20 కోట్ల మార్కు దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది.హిందీలోనూ అదే జోరు...మరో రెండు రోజులు ఇదే వసూళ్ల పర్వం కొనసాగితే తెలంగాణలో 2.ఓ బ్రేక్ ఈవెన్ రావడం ఖాయంగానే కనబడుతుంది. మరి నెగెటివ్ టాక్ తో ఇలా రెండు కోట్ల 2.ఓ కలెక్షన్స్ రావడం చూస్తుంటే... 2.ఓ గ్రాఫిక్స్ కి ప్రేక్షకులు ఎంతెలా కనెక్ట్ అయ్యారో అర్ధమవుతుంది. ఇక 2.ఓ కి మిగతా ఏరియాల్లో, మిగతా భాషల్లో నష్టాలు తప్పేలా లేదు. ఇక హిందీలో కూడా 2.ఓ రెండో వారంలో కూడా స్టెడీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. గత శుక్రవారం విడుదలైన సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ల కేదార్‌నాథ్‌ కి అక్కడ నెగెటివ్ టాక్ రావడం 2.ఓ కి కలిసొచ్చింది.
https://www.telugupost.com/crime/an-incident-in-bihar-where-a-thief-traveled-for-fifteen-kilometers-holding-the-spokes-of-the-train-window-1438975
రైలు కిటికీ చువ్వలు పట్టుకుని పదిహేను కిలోమీటర్ల మేర ఒక దొంగ ప్రయాణించిన సంఘటన బీహార్ లో జరిగింది. బీహార్ లోని సాహిబ్ పూర్ కమాల్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు రైలు బయలుదేరింది. ఈలోపు ప్లాట్‌ఫాం పై ఉన్న ఒక దొంగ కదిలిన రైలు ఎక్కి ఒక ప్రయాణికుడి సెల్ ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ ప్రయాణికుడు వెంటనే ఆ దొంగ చేయి పట్టుకున్నారు.కిటికీ చువ్వలు పట్టుకుని...రెండో చేతితో కిటికీ చువ్వ పట్టుకోగా రైలు అప్పటికే ప్లాట్‌ఫాం దాటి వేగం అందుకుంది. వెంటనే బోగీలో ఉన్న ప్రయాణికులు దొంగ రెండో చేతిని పట్టుకున్నారు. దీంతో ప్రయాణిస్తున్న రైలులో దొంగ పదిహేను కిలోమీటర్లు ప్రయాణించాడు. ఖగారియా రైల్వే స్టేషన్ చేరుకునేంత వరకూ చువ్వలు పట్టుకునే కిటీకీకి దొంగ వేలాడుతున్నాడు. అక్కడ రైల్వే పోలీసులకు ప్రయాణికులు దొంగను అప్పగించాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.telugupost.com/movie-news/mahesh-babu-new-look-3-87955/
మహేష్ బాబు టాలీవుడ్ అందగాడు. మహేష్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిలా మహేష్ ఫిట్ నెస్, బాడీ లాంగ్వేజ్, అందం, ఆకర్షణ... ఏదైనా సరే.. మహేష్ తర్వాతే అన్నట్టుగా ఉంటుంది. భరత్ అనే నేను లో యంగ్ అండ్ సూపర్ సీఎంగా అదరగొట్టిన మహేష్ బాబు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహర్షి మూవీ లో ఎంబీఏ స్టూడెంట్ గా స్టూడెంట్ లుక్ లో అదరగొడుతున్నాడు. జుట్టు పక్కకి దువ్వి, గళ్ళ చొక్కా వేసుకుని.. స్టూడెంట్ అంటే ఇలానే ఉంటాడనిపిస్తున్నాడు. స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో మహేష్ అదరగొడుతున్నాడు.శరవేగంగా షూటింగ్మహర్షి షూటింగ్ ఇప్పటివరకు డెహ్రాడూన్ లోని కాలేజ్ సెట్ లో, హైదరాబాదులో మరో షెడ్యూల్ పూర్తి చేసుకుని... ఫారిన్ షూటింగ్ కోసం పయనం కాబోతుంది. ఇక ఫారిన్ షూటింగ్ లో దాదాపుగా నెల రోజుల పాటు స్పెండ్ చేయబోతుంది మహర్షి టీం. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నమహర్షి లో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ఫారిన్ లొకేషన్స్ లో అమెరికా లోని కొన్ని నగరాల్లో పోష్ కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేలా రిచ్ లొకేషన్స్ ఎంపిక చేసుకుని ఆ లొకేషన్స్ లో మహర్హి లోని కీలక సన్నివేశాలను వంశి పైడిపల్లి చిత్రీకరించన్నారు.
https://www.telugupost.com/movie-news/senior-heros-heroines-72090/
టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత బాగానే ఉంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు హీరోయిన్లని వెతకాలంటే చాలా కష్టంగా మారింది. ఒక్కప్పుడు హీరోల కోసం హీరోయిన్స్ వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ కోసం హీరోలు వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. లేటెస్ట్ గా రవి తేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' నుంచి అను ఇమ్మానియేల్ తప్పుకోవడంతో ఇలియానాను తీసుకుందాం అనుకున్నారు. అయితే ఆమె 2 కోట్లు డిమాండ్ చేసిందంట. ప్రొడ్యూసర్లకి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇల్లి అడిగిన దానికి ఒకే చెప్పారని సమాచారం. వాస్తవానికి ఇలియానాకు టాలీవుడ్ లో ఆఫర్లు ఎప్పుడో ఆగిపోయాయి. బాలీవుడ్ కి వెళ్లి అక్కడ అజయ్ దేవగన్ లాంటి సీనియర్ హీరో పక్క వైఫ్ క్యారక్టర్స్ లేదా ఓ మోస్తరు పాత్రలే తప్పించి కెరీర్ పీక్స్ లో ఎంజాయ్ చేసిన పాత్రలు అయితే ఏమీ వేయలేదు. మరి ఇప్పుడు ఆమెకు అంత ఇచ్చి రవితేజ సినిమాలో తీసుకోవడానికి కారణం హీరోయిన్ కోసమే అమెరికా షెడ్యూల్ వాయిదా వేసి పరిస్థితి లేకపోవడం.నయనతార కోసం ఎదురుచూపులు..మరోపక్క బాలకృష్ణ - వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి నయనతారని తీసుకుందాం అనుకున్నారు, కానీ ఆమెకు తెలుగులో 'సైరా'తో పాటు తమిళ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలో ఆమె చేసే ఛాన్స్ తక్కువే అని తెలుస్తుంది. వీరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. ఆ సెంటిమెంట్ పరంగా ఆమెను తీసుకుందాం అనుకున్నారు కానీ కుదరటం లేదు.సీనియర్ హీరోలకే ఎక్కువ కష్టం..ఇక విక్టరీ వెంకటేష్ ఎఫ్ 2 లో తమన్నా కోసం ఇలియానా తరహాలోనే భారీగా ఆఫర్ చేసారని తెలిసింది. నాని - నాగార్జున మల్టీ స్టారర్ లో కూడా నాగార్జున సరసన పెళ్ళైన ఆకాంక్ష సింగ్ ను తీసుకోవడానికి కారణం ఇదే సో సీనియర్ హీరోలకు హీరోయిన్ ని సెట్ చేయటం కత్తి మీద సాములా మారింది.
https://www.telugupost.com/movie-news/kiara-about-kiss-176621/
బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ తారగా వెలిగిపోతుంది. వరస సినిమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సౌత్ పిలిచినా రాలేని పరిస్థితి. నిన్నగాక మొన్న హ్రితిక్ రోషన్ సినిమాలో కియారా అద్వానీ ఎంపికైందనే న్యూస్ తో అమ్మడు క్రేజ్ మరింతగా పెరింది. అయితే ప్రస్తుతం ఇందూ కి జవానీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కియారా అద్వానీ చేస్తున్న బోల్డ్ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. కియారా ప్రేమలో ఉంది.. బాలీవుడ్ లో బాయ్ ఫ్రెండ్ ని మెయింటింగ్ చేస్తూ వెకేషన్స్ కి వెళుతూ.. డేటింగ్ చేస్తుందనే న్యూస్ ఉంది. కియారా ఇప్పుడు ప్రేమ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ.. తాను చిన్నప్పుడే ప్రేమలో పడ్డా అని.. కానీ తన కుటుంబం వలన అది వదులుకోవాల్సి వచ్చింది అంటుంది. ఫ్యామిలీ విషయంలో తాను చాలా ఎమోషనల్ అని.. అందుకే తన ప్రేమ విషయంలో వాళ్ళు కఠినంగా ఉంటే అప్పట్లో బాయ్ ఫ్రెండ్ ని మిస్ అయ్యా అని, చదువు మీద శ్రద్ద పెట్టమని నా తల్లితండ్రులు చెప్పబట్టే నేను అతన్ని మిస్ చేసుకున్నా అంటుంది. ఇక ఇప్పుడు ఎవరినైనా ప్రేమిస్తే.. మొదటి డేట్ లోనే ముద్దు ఇచ్చెయ్యనని.. ముద్దు కోసం నా వెంట పడేలా చేసుకుంటానంటుంది కియారా అద్వానీ. ఇక తన మనసుకు నచ్చినవాడు దొరికితే డేటింగ్ చెయ్యడానికి సిద్ధం అంటూ అబ్బాయిలకి ఆఫర్ ఇచ్చింది కియారా.
https://www.telugupost.com/top-stories/cbi-officials-increased-speed-in-ys-vivekananda-reddy-murder-case-gajjala-uday-kumar-reddy-was-taken-into-custody-1471765
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు స్పీడ్ పెంచారు. కడపకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్నారు. హత్యజరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ భాస్కర్‌ రెడ్డి ఇంట్లో ఉన్నారని గుర్తించింది.గూగుల్ టేక్ అవుట్...గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా హత్యజరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన సీీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గుజ్జుల ఉదయ్ కుమార్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. హత్య జరిగిన రోజు అవినాష్, శివశంకర్ రెడ్డితో పాటుగా హత్య జరిగిన ప్రాంతానికి ఉదయ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. వివేకా మృతదేహానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజీ కట్టినట్లు కూడా అనుమనిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/u-turn-trailer-release-84810/
స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న యు ట‌ర్న్ సినిమా ట్రైల‌ర్ ను సినీమాక్స్ లో చిత్ర‌యూనిట్ స‌మ‌క్షంలో విడుద‌ల చేసారు. ఈ సంద‌ర్భంగా స‌మంత మాట్లాడుతూ.. ‘‘యు ట‌ర్న్ అనేది ఓ హానెస్ట్ సినిమా.. దీనికి ప‌ని చేసిన‌వాళ్లంతా వంద‌శాతం త‌మ కృషి పెట్టారు. ఇది మంచి సినిమా అని.. మేం మంచి ప్ర‌యత్నం చేసామ‌నే అనుకుంటున్నాం. కెరీర్ లో తొలిసారి కొత్త నిర్మాత‌ల‌తో పని చేస్తున్నాను.. చాలా కంఫ‌ర్ట్ గా ఉంది. మా ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ కూడా అద్భుతంగా ప‌ని చేసాడు. క‌న్న‌డ‌లో పెద్ద ద‌ర్శ‌కుడు అయినా కూడా ఇక్క‌డ బాగా స‌పోర్ట్ చేసాడు. ఫ్యూచ‌ర్ లో మ‌రో సినిమా కూడా చేయాల‌ని కోరుకుంటున్నాను. రాహుల్ ర‌వీంద్ర‌న్, ఆది పినిశెట్టి ఈ చిత్రానికి మ‌రింత స్టార్ ప‌వ‌ర్ అందించారు. సినిమాటోగ్ర‌ఫ‌ర్ నికేత్ ఇండ‌స్ట్రీలో చాలా దూరం వెళ్తాడ‌ని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
https://www.telugupost.com/movie-news/వీళ్ళు-ఓకె-వాళ్లేందుకు-ర-65045/
బాలకృష్ణ తన తండ్రి బయో పిక్ అంగరంగ వైభవంగా తన తండ్రి నిర్మించిన రామ కృష్ణ స్టూడియో లో లాంచ్ చేసాడు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి పాలిటిక్స్ నుండి అతిరధ మహారథులు హాజరయ్యారు. మరి బాలయ్య తేజ కాంబో లో వస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ షాట్ అదరగొట్టేస్తుంది. అచ్చం తండ్రిలా అభినయం చేస్తూ తన తండ్రి సినిమాలోని డైలాగ్స్ ని దుసుర్యోధనుని పాత్రలో బాలకృష్ణ చీల్చి చెండాడాడు. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులలో 95 శాతం మంది హాజరైయ్యారు. అందులో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఫ్యామిలీ తప్ప మిగతావాళ్ళు అందరూ దాదాపుగా ఎన్టీఆర్ బయో పిక్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసారు.మరి నందమూరి ఫ్యామిలిలో ఉన్న విభేదాలు ఈ కార్యక్రమంలో స్పష్టంగా బయటపడ్డాయి. కళ్యాణ్ రామ్ ఈ కార్యక్రమానికి హాజరయిన హరికృష్ణ మాత్రం చిన్న కొడుకు ఎన్టీఆర్ ని పిలవలేదని అలిగి ఈ కార్యక్రమానికి విచ్చేయ్యలేదు. మరి ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే బాలకృష్ణ బావగారు, వియ్యంకుడు అయిన ఏపీ సీఎం చంద్రబాబు రాలేదు. ఆఖరికి బాలయ్య అల్లుడు లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయ్యలేదు. మరి చంద్రబాబు నాయుడు గనక ఈ కార్యక్రమానికి వస్తే ఎన్టీఆర్ బయో పిక్ లో చంద్రబాబుకి అనుకూలంగా తీస్తున్నారని అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందనా... లేదంటే బాబు గారికి ఖాళీ లేక హాజరవలేదా అనేది తెలియదు గాని.. చంద్రబాబు ఈ ఓపెనింగ్ కి రాకపోవడం మాత్రం ఇప్పుడు పొలిటికల్ గా కూడా చర్చనీయాంశమైంది. మరి బాలకృష్ణ తన తండ్రి బయో పిక్ ఎన్టీఆర్ సినిమా విషయంలో నిక్కచ్చిగా జరిగింది చూపిస్తాడా? లేదంటే తనకు అనుకూలంగా వున్నవి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాడో తెలియదు గాని.. ఈ సినిమాలో చంద్రబాబు, లక్ష్మి పార్వతి పాత్రలను ఎలా డిజైన్ చేసాడో అనే క్యూరియాసిటీ మాత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉంది. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య 50 నుండి 60 కేరెక్టర్స్ వేస్తాడని తెలుస్తుంది. అలాగే బాలకృష్ణ ఇంకా ఈ సినిమాకి సంబందించిన నటీనటులను పూర్తిగా ఎంపిక చెయ్యలేదు. ఎందుకంటే ఈ సినిమాకి దర్శకుడు తేజ డమ్మీనే. అంతా బాలయ్య ఆధ్వర్యంలోనే జరుగుతుందనేది మాత్రం ఇక్కడ అందరికి తెలియాల్సిన విషయం.
https://www.telugupost.com/movie-news/ram-charan-kiara-advani-to-act-in-chiranjeevi-koratala-movie-145068/
చిరంజీవి – కొరటాల కాంబోలో ని సినిమా ఈ నెలాఖరు నుండి పట్టాలెక్కబోతుంది. భారీ అంచనాల నడుమ మొదలవుతున్న ఈ సినిమాని 95 రోజుల్లో పూర్తి చెయ్యాలంటూ.. చిరు సరదాగా కొరటాలకు ఓ ఈవెంట్ లో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదటినుండి రామ్ చరణ్ నటిస్తాడనే ప్రచారం ఉంది. ఇక తాజాగా చరణ్ కొరటాల – చిరు సినిమా కోసం 40 రోజుల్ కాల్షీట్స్ ఇచ్చాడనే న్యూస్ నడుస్తుంది. ఆ 40 రోజుల్లో కొరటాల శివ చిరు యంగ్ పాత్రలో చరణ్ ను చూపించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే యంగ్ చిరుగా చరణ్ 20 నిమిషాల పాటు సినిమాలో కనిపిస్తాడని.. అయితే యంగ్ కేరెక్టర్ లోనే చిరు కి లవర్ ఉంటుందట. మారా యంగ్ చిరు పాత్రధారి చరణ్ సరసన ఓ హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తుందని.. ఆ పాత్రకి కొరటాల శివ, కియారా అద్వానీ పేరు పరిశీలిస్తున్నాడనే టాక్ మొదలైంది. వినయ విధేయరామ తో డిజాస్టర్ కొట్టినా.. బాలీవుడ్ లో మాత్రం కియారా అద్వానీ చెలరేగిపోతుంది కాబట్టి.. ఆ క్రేజ్ ఇక్కడ చిరు సినిమాకి పనికొస్తుందని.. ఎలాగూ చెర్రీ – కియారాలు దోస్త్ లు గనక కియారా చరణ్ తో నటించడానికి ఒప్పుకుంటుందని అంటున్నారు. ఇక చిరు సరసన అయితే త్రిష ఫైనల్ అంటున్నారు కానీ… చిత్ర బృందం నుండి క్లారిటీ రావడం లేదు
https://www.telugupost.com/movie-news/ntr-bommarillu-164967/
ఎన్టీఆర్ అంటే మాస్ హీరోగానే లైక్ చేస్తారు ఆయన అభిమానులు. ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా కన్నా ఎన్టీఆర్ మాస్ చిత్రాలు చేస్తాడంటే ఆయన అభిమానులకు పండగే. అందుకే ఎన్టీఆర్ కూడా ఎక్కువగా మాస్ మాస్ అంటూ మాస్ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఓ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ని ఎలా మిస్ చేసుకున్నాడో చెబుతున్నాడు.అప్పుడెప్పుడో లవర్ బాయ్ సిద్దార్ధ్ – బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వచ్చిన బొమ్మరిల్లు సినిమా అటు మ్యూజిక్ పరంగానే కాదు… ఇటు ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గాను బ్లాక్ బస్టర్ అయిన చిత్రం. అలాంటి చిత్రం ముందు ఎన్టీఆర్ వద్దకే వచ్చిందట. నిర్మాత దిల్ రాజు ఆ కథను ముందు ఎన్టీఆర్ కే వినిపించాడట. ఆ సినిమా స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి బాగా నచ్చినా.. తనకున్న ఇమేజ్ కారణంగా ఆ సినిమా చెయ్యలేకపోయాడట. తరవాత మంచి స్క్రిప్ట్ పోతుందే అని చాలా బాధపడ్డాడట ఎన్టీఆర్. నాకున్న ఇమేజ్ తో ఆ సినిమాకి న్యాయం చెయ్యలేననిపించింది. ఎన్టీఆర్ సినిమాలంటే డాన్స్ లు, ఫైట్స్, కామెడీ, హీరోయిజం తో పాటుగా పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయనుకుని ప్రేక్షకులు అభిమానులు థియేటర్స్ కి వస్తారు. కాని అవేమి లేకుండా నేను సినిమా చేస్తే అది అభిమానులను, మోసం చెయ్యడమే కాదు.. ఆ సినిమాని నేను న్యాయం చెయ్యలేను అని చెబుతున్నాడు ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ తో సిద్దార్ధ్ మంచి హిట్ కొట్టాడు. ఆ సినిమాలో సిద్దార్ద్ నటనతో పాటుగా జెనీలియా నటన, ప్రకాష్ రాజ్ నటన, కోట నటన అన్ని హైలెట్ అనే అంశాలు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, భాస్కర్ మేకింగ్ స్టయిల్ అన్ని బొమ్మరిల్లు సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది. మరి అలాంటి మంచి ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ ని ఎన్టీఆర్ వదులుకుని తప్పు చేసాడేమో..!
https://www.telugupost.com/movie-news/జీవితపై-గుణశేఖర్-ఫైర్-49570/
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా గుణశేఖర్ తన మనసులో ఉన్న బాధను మీడియాతో పంచుకున్నాడు. నంది అవార్డుల జ్యూరీ చైర్మన్ జీవిత మాట్లాడిన మాటలు తనకు బాధ కలిగించాయని, బాహుబలి చిత్రం తరువాతైనా తమ రుద్రమను పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. జీవిత, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించి అవార్డులు ఎంతో నిష్పక్షపాతంగా ఇచ్చారని చెప్పిందని గుణశేఖర్ గుర్తు చేశారు.మానసికంగా క్షోభపెట్టి....రుద్రమదేవి చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చినా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా మానసికంగా క్షోభ పెట్టిందని చెప్పారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి ఇవ్వడం గురించి తాను తప్పుపట్టడం లేదని, తన చిత్రానికి ఎందుకివ్వలేదని మాత్రమే ప్రశ్నించానని గుణశేఖర్ చెప్పారు. జాతీయ అవార్డులు, ప్రాంతీయ అవార్డులకు ఎంతో వ్యత్యాసముందని, జాతీయ దృష్టి వేరు, ప్రాంతీయ దృష్టి వేరని ఆయన అన్నారు. తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన రుద్రమదేవి చిత్రానికి ఆనాడు పన్ను రాయితీ ఇవ్వలేదు, ఈనాడు అవార్డు ఇవ్వలేదు అంటూ గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
https://www.telugupost.com/movie-news/trivikram-srinivas-allu-arjun-movie-2-112844/
మహేష్ – సుకుమార్ కాంబోపై గత ఆరు నెలలులుగా ఏదో ఒక వార్త మీడియాలో నానుతూనే ఉంది. అనేక ప్రచారాల తర్వాత మహేష్.. సుకుమార్ మూవీకి మంగళం పాడేశాడు. ఇక సుకుమార్ సీక్రెట్ గా అల్లు అర్జున్ కి కథ చెప్పి ఒప్పించి సినిమాపై అధికారిక ప్రకటన ఇప్పించేసాడు. మరి మరోపక్క అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబో పై కూడా ఇలాంటి కథనాలే మీడియాలో వినబడుతున్నాయి. త్రివిక్రమ్ మాట మీదే అన్నీ జరుగుతున్నాయని, బన్నీ మాట త్రివిక్రమ్ వినడం లేదని అంటున్నారు. మరోపక్క కథ బాగా రావడానికి త్రివిక్రమ్ చాలా కష్టపడుతుండగా.. ఫుల్ స్క్రిప్ట్ తోనే సెట్స్ మీదకెళదామని బన్నీ పట్టుబడుతున్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇప్పటివరకు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రమే పూర్తి చేసాడు త్రివిక్రమ్ కు నొ చెప్పినట్లే..! ఇక త్రివిక్రమ్ టైంకి కథ సిద్ధం చెయ్యకపోగా… అనుకోకుండా సుకుమార్ తో కనెక్ట్ అయిన అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చేసి సుకుమార్ తో సెట్స్ మీదకు వెళ్లిపోవచ్చనే ప్రచారం స్టార్ట్ అయ్యింది. మరి మహేష్ కి.. సుకుమార్ హ్యాండ్ ఇచ్చి అల్లు అర్జున్ కి కమిట్ అయితే.. ఇప్పుడు అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కి హ్యాండిచ్చి సుకుమార్ తో సినిమా మొదలు పెట్టినా మొదలు పెట్టొచ్చు అంటూ ఊహాగానాలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.
https://www.telugupost.com/movie-news/renu-desai-said-she-didnt-take-any-money-for-criticizing-pawan-kalyan-1500364
సెలబ్రిటీస్ కపుల్ విడాకులు తీసుకోని విడిపోయిన తరువాత కూడా.. వారిపై ఏదొక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక టాలీవుడ్ స్టార్ కపుల్ అయిన పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్ వివాహ బంధం, విడాకులు విషయం అయితే పొలిటికల్ టాపిక్ అయ్యిపోయింది. పవన్, రేణూ ప్రమేయం లేకుండానే.. వీరిద్దరి చుట్టూ అనేక రూమర్స్ తిరుగుతుంటాయి. ఈక్రమంలోనే రేణూదేశాయ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విడాకుల విషయం గురించి ఎమోషనల్ అయ్యింది.ఆ సమయంలో పవన్ గురించి మాట్లాడిన మాటలు నెగటివ్ గా వచ్చాయి. ఇక అదే టైములో రేణూదేశాయ్ ఒక ప్రముఖ పొలిటికల్ న్యూస్ ఛానల్ తో కలిసి పని చేయడంతో నెట్టింట కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. "రేణూదేశాయ్ పలానా వారికి డబ్బుకి అమ్ముడుపోయి పవన్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తుందని" కామెంట్స్ రావడం మొదలయ్యాయి. తాజాగా దీని గురించి రేణూదేశాయ్ స్పందించింది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీని పై ఒక క్లారిటీ ఇచ్చింది.రేణూదేశాయ్ కామెంట్స్..నేను గతంలో ఆ ప్రముఖ న్యూస్ ఛానల్ కోసం పని చేసింది నిజమే. అయితే మీరు అనుకున్నట్లు నా మాజీ భర్త పై విమర్శలు చేయడానికి.. నేను వాళ్ళతో కలవలేదు. రైతులు కోసం పని చేయడం కోసమే నేను వాళ్ళతో కలిసి ప్రయాణించాల్సి వచ్చింది. ఆ ఛానల్ వాళ్ళు రైతులు గురించిన ఒక ప్రోగ్రాం చేయడం కోసం నన్ను సంప్రదించారు.నేను దర్శకురాలిని, రచయితని అని మీకు తెలుసు. రైతు బ్యాక్‌డ్రాప్‌తో నేను ఒక స్క్రిప్ట్ ని రాసుకుంటున్నాను. ఆ స్క్రిప్ట్ రీసెర్చ్ కి ఆ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని వాళ్లతో కలిసి పని చేయడానికి ఒప్పుకున్నాను. ఆ సమయంలో ఆ ఛానల్ తో కలిసి పలు గ్రామాల్లో ప్రయాణించాను. అంతేతప్ప వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు.నేను ఎప్పుడు నాకు అనిపించిందే చేసుకుంటూ వెళ్తాను. ఎక్కడ అనిపించింది అక్కడే చెప్పేస్తాను. అంతేగాని ఎప్పుడు ఎవరికి అమ్ముడు పోయి మాత్రం వ్యాఖ్యలు చేయలేదు. ఈ మనస్తత్వంతోనే ఇటీవల నా పిల్లల్ని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పాను, రాజకీయంగా నా మాజీ భర్తకే నా సపోర్ట్ అని చెప్పాను. ఆ కామెంట్స్ చేశాను కదా అని.. నేను పాలిటిక్స్ లోకి వస్తాను అనుకుంటే కూడా తప్పే.
https://www.telugupost.com/movie-news/యవ్వనంలో-సాధించని-ఘనత-వృ-14781/
బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నట జీవితంలో అర్ధ శతాబ్ధాన్ని పూర్తి చేసుకున్నారు. ఐనా ఆయన అలుపు లేకుండా నేటికీ వరుస చిత్రాలతో ప్రేక్షకులను రంజింపచేస్తున్నారు. లేట్ వయసులో బిగ్ బి కమర్షియల్ అప్పీల్ తక్కువ వున్న కథలలో ఆయనకీ తగ్గ హుందా పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆయన లోని నటుడిని స్నాతృప్తి పరచుకుంటున్నారు. ఇటీవల ఆయన నటించిన పింక్ చిత్రం బాలీవుడ్ లో విజయాన్ని నమోదు చేయగా ఇప్పుడు భారతీయ చలన చిత్ర కీర్తిని మరో మెట్టు ఎక్కించటానికి పింక్ చిత్రం దోహదపడింది.నేటి సమాజంలో సామాన్య ప్రజలకు అందుబాటులోలేని చట్ట పరమైన తప్పిదాల ఇతివృత్తంతో ముగ్గురు యువతుల జీవితాలు ప్రభావితమయ్యాయో తెలిపే కథనంతో తెరకెక్కిన పింక్ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ బైపోలార్ డిస ఆర్డర్ తో బాధపడే రిటైర్డ్ న్యాయవాది పాత్ర పోషించగా తాప్సి పన్ను, ఆండ్రియా తరియాంగ్, కీర్తి కొల్హర్ ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రం పౌరులను చైతన్య పరిచే అంతర్లీన ఇతివృత్తం కలిగి ఉండటంతో న్యూయార్క్ లోని అంతర్జాతీయ సదస్సు లో పింక్ చిత్రాన్ని ప్రదర్శనకు స్వీకరించింది అంతర్జాతీయ సదస్సు కమిటీ. ఆసియా ఖండం నుంచి ఫిలిం ఫెస్టులకు తరచు గ మన చిత్రాలు వెళ్తున్నప్పటికీ అంతర్జాతీయ సదస్సు లో ప్రదర్శనకు నోచుకున్న చిత్రం గా పింక్ చరిత్ర సృష్టించనుంది.
https://www.telugupost.com/movie-news/rakshasudu-movie-world-wide-collection-129418/
ఏరియా షేర్ (కోట్లలో ) నైజాం 2.30 సీడెడ్ 0.86 నెల్లూరు 0.17 కృష్ణ 0.43 గుంటూరు 0.45 వైజాగ్ 0.86 ఈస్ట్ గోదావరి 0.40 వెస్ట్ గోదావరి 0.33 టోటల్ ఏపీ & టీస్ షేర్ 5.80 ఇతర ప్రాంతాలు 0.60 ఓవర్సీస్ 0.25 టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 6.65
https://www.telugupost.com/movie-news/komma-uyyala-kona-jampala-song-sing-by-prakruthi-reddy-1363320
హైదరాబాద్ : RRRసినిమాలో "కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా" పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటతోనే అసలు కథ మొదలవుతుంది. గోండు జాతికి చెందిన మల్లి అనే పిల్ల ఈ పాటపాడుతూ బ్రిటీష్ వాళ్ల చేతులపై అందమైన డిజైన్లు వేస్తుంటుంది. దాంతో తెల్లదొరసాని మల్లిని తనతోపాటు ఢిల్లీకి తీసుకుపోతుంది. మల్లి కోసం రంగంలోకి దిగుతాడు భీమ్(ఎన్టీఆర్). "కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా" పాట పాడింది ఎవరు ? గొంతు ఎంత బావుందో అని ఖచ్చితంగా అందరూ అనుకునే ఉంటారు.తాజాగా.. ఆ పాటపాడిన చిన్నారి పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. "కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా" పాట పాడింది ఈ చిన్నారే అంటూ.. సంగీత దర్శకుడు కీరవాణి ప్రకృతి రెడ్డి అనే పాపను పరిచయం చేశారు. ప్రకృతి చాలా టాలెండెట్ అమ్మాయి అని, త్వరలోనే పాట ఒరిజినల్ ట్రాక్ ను విడుదల చేస్తామని, అప్పుడు పూర్తి పాటను విని ఆస్వాదించవచ్చని కీరవాణి తెలిపారు. 2019లో ప్రసాద్ ల్యాబ్స్ లో రికార్డు చేసిన "కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా" మేకింగ్ వీడియోను ప్రకృతి షేర్ చేసింది. RRRలో ఈ ఈ అద్భుతమైన పాటను పాడే అవకాశం ఇచ్చిన కీరవాణి సార్‌కి చాలా ధన్యవాదాలు అని తెలిపింది.
https://www.telugupost.com/movie-news/పెళ్లి-చూపులు-హీరోతో-రొమ-32314/
ఆలా ఎలా చిత్రంతో తెలుగు సినిమాలలో కథానాయికగా పరిచయం అయినప్పటికీ సుకుమార్ రచన, నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ లో కథానాయికగా చేసిన పెరఫార్మెన్స్ తో మంచి మార్కులతో పాటు కమర్షియల్ గా పెద్ద విజయాన్ని అందుకుంది హెబ్బా పటేల్. అనంతరం తన లక్కీ ఆన్ స్క్రీన్ పార్టనర్ రాజ్ తరుణ్ సరసన ఈడో రకం ఆడో రకం చిత్రంలో నటించి ఆ చిత్ర విజయంలో తన వంతు పాత్ర పోషించింది. అలా హెబ్బా పటేల్ ని బంగారు బాతులా నిర్మాతలు చూస్తున్న సమయంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రం చేదు అనుభవాన్ని మిగల్చటం, ఇటీవల విడుదలైన మిస్టర్ ఘోర పరాజయం చవి చూడటంతో హెబ్బా పటేల్ కి గడ్డు కాలం ప్రారంభం ఐయ్యింది అనే సంకేతాలు మొదలయ్యాయి.ప్రస్తుతం తాను నటిస్తున్న అంధగాడు, ఏంజెల్ చిత్రాలలో అంధగాడు చిత్రం వచ్చే నెల 2 న ప్రేక్షకుల ముందుకి రానుంది. తన సెంటిమెంట్ ఆన్ స్క్రీన్ కో స్టార్ ఐన రాజ్ తరుణ్ తో జత కట్టిన సినిమా కావటంతో అంధగాడు తో తన సక్సెస్ ట్రాక్ తిరిగి పుంజుకుంటుంది అనే ఆశతో వుంది హెబ్బా పటేల్. ఇప్పటికే ఏంజెల్ చిత్రాన్ని కూడా పూర్తి చేసిన హెబ్బా పటేల్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రారంభం కానున్న ఒక యాక్షన్ మిళితమైన ప్రేమ కథలో అతని సరసన కథానాయికగా నటించటానికి అంగీకరించింది. ఇప్పటికే పెళ్లి చూపులు ఫేమ్ తో విజయ్ దేవరకొండ కి ప్రేక్షకులలో గుర్తింపు ఉండగా హెబ్బా పటేల్ తో తన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయితే ఈ జంటకి భారీ విజయం తధ్యం.
https://www.telugupost.com/movie-news/అబ్బే-అదేం-ఉండదంటున్న-డై-38513/
శ్రీమంతుడు కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. మహేష్ - కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అదే కాంబినేషన్ లో ఇప్పుడు మహేష్ బాబు పొలిటీషియన్ గా భరత్ అను నేను చిత్రం తెరకెక్కుతుంది. కొరటాల శివ తన సినిమాలలో ఎక్కువగా సమాజానికి ఎదో ఒక మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు మహేష్ తో తెరకెక్కిస్తున్న భరత్ అను నేను చిత్రం కూడా ఇలా సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతోందని అనుకుంటున్నారు. కానీ మొదటి నుండి ఈ చిత్రం పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లోనే ఉండబోతుందని ప్రచారమైతే జరుగుతుంది.అంటే కొరటాల ఈసారి పొలిటికల్ గా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడా? మరి ముఖ్యమంత్రిగా మహేష్ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాడో అనే క్యూరియాసిటీ మాత్రం మహేష్ అభిమానుల్లో అంతకంతకు ఎక్కువైపోతోంది. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నకు సమాధానంగా కొరటాల శివ ఏం చెబుతున్నాడో చూడండి. ఈ విషయమై కొరటాల స్పందిస్తూ భరత్ అను నేను సినిమా ఏ పొలిటికల్ పార్టీని గాని, లీడర్ ని గాని మనసులో పెట్టుకుని రూపొందిస్తున్నసినిమా కాదని.... ఇందులో ఎటువంటి సెటైరికల్ డైలాగ్స్ ఉండవని చెబుతున్నాడు.అయితే ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, ఎమోషన్స్ కు ఎక్కువ ప్లేస్ ఈ సినిమాలో ఉండబోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేష్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు
https://www.telugupost.com/movie-news/ariana-not-abhijith-176762/
బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ని ప్రేక్షకులు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. అఖిల్, సోహైల్, హారిక, అరియనాలను కాదని అందరూ గా కూల్ పర్సన్ అభిజిత్ ని అందరూ ఫిక్సయిపోయారు. దాదాపుగా అభిజిత్ విన్నర్ టైటిల్ ని పట్టుకుపోవచ్చని అనుకుంటున్న సమయంలో బిగ్ బాస్ లో భారీ ట్విస్ట్ కి ప్లాన్ జరుగుతుంది అనే సంకేతాలు అందుతున్నాయి. బిగ్ బాస్ రియాలిటీ షో అని స్ట్రాంగ్ గానే చెబుతున్నప్పటికీ.. అప్పుడప్పుడు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో లానే కనిపిస్తుంది. ఈ సీజన్ 4 లో మోనాల్ విషయంలో బిగ్ బాస్ లో పెద్ద స్క్రిప్ట్ నడిచింది అని బుల్లితెర ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు కూడా. మోనాల్ ని ప్రేక్షకులు బయటికి పంపాలని చూస్తే బిగ్ బాస్ ప్లాన్ లో భాగంగా మోనాల్ హౌస్ లోనే కొనసాగింది. ఇక తాజాగా మరో భారీ ట్విస్ట్ ఇవ్వడానికి బిగ్ బాస్ యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఈసారి అబ్బాయిలకు టైటిల్ ఇవ్వకుండా తమ ప్లాన్ ప్రకారం అమ్మాయిలకు టైటిల్ ఇచ్చే ఏర్పాట్లు జరిగితున్నాయని అంటున్నారు.. కానీ తాజా సమాచారం ప్రకారం సీజన్ 4 విన్నర్ అవకాశాలు ఎక్కువగా ఉన్న అభిజిత్ వైపు ఉన్న ట్రోఫీ గాలి అరియనా వైపు తిరిగినట్టుగా చెబుతున్నారు. గత సీజన్స్ లో అమ్మాయిలని టాప్ 2 వరకు తీసుకొచ్చి అబ్బాయిలకు టైటిల్ ని ఇవ్వడం జరుగుతుంది. కాని ఈసారి ఆ సెంటిమెంట్ ని మార్చి అమ్మాయిలను రంగంలోకి దింపాలని, అందరిలో స్ట్రాంగ్ అయిన అరియనకు ఈసారి బిగ్ బాస్ ట్రోఫీ అందించే ఏర్పాట్లు జరుగుతూన్నాయనే టాక్ వినిపిస్తుంది. మరి ఓట్స్ పరంగా అభిజిత్ టాప్ లో ఉంటే ఆ తర్వాత అఖిల్, సోహైల్ ఉన్నారని అంటున్నారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారం అరియానా ఓటింగ్స్ లో ముందంజలోకి వచ్చేసింది అని అంటున్నారు. అంటే దీన్ని బట్టి అరియనకి ఈసారి ట్రోఫీ కట్టబెట్టడం ఖాయంగానే కనబడుతుంది.
https://www.telugupost.com/movie-news/hebba-patel-in-filfare-awards-75947/
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హెబ్బా పటేల్ పేరు ఎక్కడా వినబడడం లేదు. కుమారి 21 ఎఫ్ లో బోల్డ్ గా నటించిన హెబ్బా పటేల్... రాజ్ తరుణ్ తో జోడికట్టిన సినిమాలన్నీ పర్వాలేదనిపించాయి. అయితే వీరిద్దరి జోడి తో సినిమాలు బాగా ఆడడంతో రాజ్ తరుణ్ కి హెబ్బా కు మధ్య లవ్ ఎఫ్ఫైర్ ఉదని గాసిప్స్ మొదలయ్యాయి. ఇక రెండు మూడు సినిమాల తర్వాత హెబ్బా పటేల్ కి ఇలాంటి ప్రశ్నలు ఎదురవగా.. అబ్బే మా మధ్యన అలాంటిదేం లేదండీ అంటూనే రాజ్ తరుణ్ పక్కన నటించడం బోర్ అనేసింది. ఇక రాజ్ తరుణ్ వేరే హీరోయిన్స్ తో బిజీ అవగా హెబ్బా మాత్రం పెద్దగా అవకాశాలు లేక క్రేజ్ పోయింది.తాజాగా హెబ్బా పేరు రాజ్ తరుణ్ కొత్త సినిమాలో ఫైనల్ చేస్తున్నట్టుగా వినబడుతుంది. మరోపక్క రాజ్ తరుణ్ కూడా ప్లాప్స్ లో ఉన్నాడు. అతని సినిమాలు వరసగా ఫెయిల్ అవడంతో.. ఇప్పుడు కథల మీద కాన్సన్ట్రీట్ చెయ్యడమే కాదు... తన పక్కన నటించే హీరోయిన్స్ మీద కూడా శ్రద్ద పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ జంటగా ఒక సినిమా చేయబోతున్నారనే న్యూస్ వినబడుతున్న వేళ హెబ్బా పటేల్ తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్ లో పిచ్చెక్కించింది. గత శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన 65th జియో ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో హెబ్బా పటేల్ హాటెస్ట్ డ్రెస్సుతో అదరగొట్టింది.వైట్ కలర్ గౌన్ లో క్లివేజ్ అందాలతో... రెచ్చిపోయింది. ప్రస్తుతం ఫెడవుట్ అయ్యే సమయంలో ఇలా అందాల ఆరబోతకు దిగి మళ్ళీ బిజీ అవుదామని హెబ్బా కలలు కంటుంది. కానీ హెబ్బకి పిలిచి అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలే కరువయ్యారు. మరి నిజంగానే రాజ్ తరుణ్ పక్కన హెబ్బకి మరోమారు ఛాన్స్ వచ్చింది అంటే... తన అందచందాలతో అందరిని మెస్మరైజ్ చేసి మళ్ళీ సెటిల్ అవాలని హెబ్బా అనుకుంటుంది. ఇక ఫిలింఫేర్ అవార్డ్స్ లో హెబ్బా వేసిన డ్రెస్సు తో గ్లామర్ గేట్లు మాములుగా తెరవలేదు. ఎప్పుడూ పొట్టి నిక్కర్లతో... స్లీవ్ లెస్ జాకెట్స్ తో అదరగొట్టే హెబ్బా ఆ వైట్ కలర్ డిజైనర్ డ్రెస్సులో మత్తెక్కిస్తోంది
https://www.telugupost.com/movie-news/saira-right-now-the-name-of-the-film-is-changing-in-the-state-136604/
సైరా నర్సింహారెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఈ సినిమా పేరు మారుమోగిపోతోంది. అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ చిత్రం రెండురోజుల మొదట్లో కలెక్షన్లే కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత కలెక్షన్లు పడిపోయాయి. దీనికి తోడు గద్దలకొండ గణేష్, వాల్మీకి సినిమాలు కూడా పోటీగా ఉండడంతో సైరాపై కలెక్షన్లు తగ్గిపోయాయి. ఒక సినిమా కిక్ ఇస్తే ప్రేక్షకుడు అదే సినిమాను నాలుగైదు సార్లు చూస్తాడు. దీంతో సినిమా డిస్టిబ్యూటర్లకూ కలెక్షన్ల పంట పండుతుంది. కాని ఇప్పుడు సైరా పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. సైరాకు ఎదురుదెబ్బ సైరా సినిమాకు సుమారు 270 కోట్లు ఖర్చు చేశారు. కాని 9 రోజుల్లో కలెక్షన్లు 92.64కోట్లు మాత్రమే వసూలైంది. కనీసం 9 రోజుల్లో ఖర్చులో సగం కూడా వసూళ్లు రాలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద దెబ్బే. తెలుగు సినిమాల చరిత్రలోనే రాజమౌళి నిర్మించిన బాహుబలి రెండు పార్టుల చిత్రాలకు భారీగా ఖర్చు చేశారు. ఆ సినిమా క్లిక్ కావడంతో జనం ఎగబడి చూశారు. బాహుబలి పార్ట్ 1 సినిమా వచ్చిన తరువాత ఏడాదికి రెండో పార్ట్ వచ్చింది. అప్పటి వరకు ప్రేక్షకులు ఎదరుచూశారు. ఈ సినిమాకు వెయ్యి కోట్లు చిత్రం విడుదలైన కొన్ని రోజుల్లోనే వచ్చింది. అలానే సైరాకు కూడా వసూళ్ల కలెక్షన్లు వస్తాయని అందరూ భావించారు. కాని సైరాకు ఎదురుదెబ్బే తగిలింది. టాక్ వస్తేనైనా చూస్తారా…..? సైరా సినిమాపై టాక్ వస్తే నైనా కనీసం జనం సినిమా చూస్తారేమోనని సైరా టీం భావిస్తోంది. దీంతో తరచూ ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం కావడం, ఈ సైరా సినిమాకు ఆయన తనయుడు రాంచరణ్ నిర్మాత కావడం విశేషం. భారీ బడ్జెట్ తో నిర్మించిన సైరాకు కలెక్షన్లు రాకపోవడంతో ఆ తరువాత ఏం చేయాలనే దానిపై సైరా టీం చర్చించినట్లు తెలిసింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రాంచరణ్ లు సైరా సినిమాపై ప్రచారం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాత రాంచరణ్ సినిమాకు ఎక్కడ రాజీ పడకుండా బడ్జెట్ కు వెనకాడకుండా జాగ్రత్తలు తీసుకుని ఖర్చు చేశారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 17 కంపెనీలకు చెందిన వారు డిజైన్ చేసినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉండడంతో సైరా సినిమాపై కూడా ఈ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. జనాలకు రవాణా సదుపాయం లేకపోవడంతో ఎవరూ కూడా దియేటర్లకు వెళ్లలేదు. కలిసొచ్చేనా….. కొద్ది రోజులుగా సైరా టీం సినిమాపై విస్రృత ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి సైతం తెలంగాణ గవర్నర్ తమిళసై ను మర్యాద పూర్వకంగా కలిసి సైరా చిత్రం చూడాలని కోరారు. అదే విధంగా ఏపీ సీఎం జగన్ ను కూడా కలిసేందుకు చిరంజీవి, రాంచరణ్ లు అపాయింట్ మెంట్ కోరారు. ఈ నెల 14న చిరంజీవి, రాంచరణ్ లు జగన్ ను కలువనున్నారు. జగన్ కు కూడా సైరా చిత్రం చూడాలని కోరనున్నారు. ఇలా ప్రముఖులను కలిస్తే కొంత ప్రచారం జరిగి జనం సినిమాను చూస్తారనే భావనలో సైరా టీం ఉన్నట్లు తెలుస్తోంది.
https://www.telugupost.com/movie-news/geetha-arts-vijay-84411/
'గీత గోవిందం'కి రిలీజ్ టైం దగ్గర పడింది. ఇందులో అల్లు అరవింద్ నుండి డైరెక్టర్ పరుశురాం వరకు అందరూ హీరో విజయ్ ను మంచి మాటలతో పొగిడేవాల్లే. కానీ వాస్తవ పరిస్థితి వేరే అంట. ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో విజయ్ సరిగా సహకరించడం లేదని ఇన్సైడ్ టాక్. ప్రచార కార్యక్రమాల విషయంలో గీత జనాలకు చుక్కలు చూపిస్తున్నాడట.ప్రత్యేక పీఆర్ టీం పెట్టుకుని...'అర్జున్ రెడ్డి' సినిమాతో మంచి ఫేమ్ రావడంతో తనకు సపరేట్ గా ఒక పీఆర్ టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు విజయ్. ఆ టీం ప్రొమోషన్స్ విషయంలో ఇచ్చే ఐడియాస్ హీరో విజయ్ పాటిస్తాడు. 'టాక్సీవాలా' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ టీం చిన్న పిల్లలతో ఒక వీడియో చేసి వాదిలారు. అలా ఆ టీం ఐడియాస్ ఇస్తూ ఉంటుంది అంట. అందులో విజయ్ కి నచ్చినవి తీసుకుని ఇంప్లీమెంట్ చేస్తాడట.నిర్మాతలు చెప్పింది వినడం లేదా..?'గీత గోవిందం' ప్రమోషన్స్ విషయంలో కూడా తన టీం ఇచ్చిన ఐడియాలను పాటించాలన్నదే తన అభిమతం. కాకపోతే గీత సంస్థకు ఆల్రెడీ పీఆర్ టీమ్ ఒకటి వుంది. వాళ్లు గీతలోని పైస్థాయి వ్యక్తుల ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ల సూచనల మేరకు ఈ టీమ్ నడుచుకుంటుంది. దీంతో వారు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వీడియోస్..ప్రెస్ మీట్స్ వగైరా వగైరా వంటివి ప్లాన్ చేసారంట. అవి విజయ్ తో చెప్పితే ఒకే అన్నాడట. తర్వాత తన టీంతో డిస్కస్ చేసి చివరి నిమిషంలో టైం మార్చండి లేదా వద్దు అని అంటున్నాడట. దాంతో గీత ఆర్ట్స్ వారు తలలు పట్టుకుంటున్నారట. ఈ ఒక్క సినిమాకే కాదు 'టాక్సీవాలా' విషయంలో విజయ్ అదే చేస్తున్నాడు అని టాక్.
https://www.telugupost.com/movie-news/madhavan-condition-to-savyasachi-makers-95210/
తమిళంలో 'సఖి’, ‘చెలి’, ‘యువ’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మాధవన్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ దాదాపు తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. మాధవన్ ఇంతవరకు తెలుగులో ఒక్క స్ట్రెయిట్ మూవీ కూడా చేయలేదు. ఆమధ్య ‘ఓం శాంతి’లో నటించినా… అది అతిథి పాత్రే. ఇప్పుడు నాగ చైతన్య - చందూ మొండేటి కాంబినేషన్ వస్తున్నా ‘సవ్యసాచి’లో విలన్‌గా నటించాడు. దీంతో ఈయన తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి.తమిళంలో విడుదల చేయరంటేనే...మణిరత్నం డైరెక్షన్ లో మాధవన్ 'యువ' సినిమాలో పూర్తిస్థాయి విలన్‌ రోల్‌ చేశాడు. మళ్లీ ఇప్పుడు ‘సవ్యసాచి’లో పూర్తి స్థాయి విలన్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే మాధవన్ ఈ సినిమా చేసే ముందు టీంకు ఒక కండిషన్ పెట్టాడట. దానికి ఓకే అంటేనే సినిమా చేస్తా అని చెప్పాడట. అదేంటంటే... ‘'సవ్యసాచి’ని తమిళంలో విడుదల చేయకూడదు’ అని! 'సవ్యసాచి’ని తమిళంలో విడుదల చేస్తే, తను హీరోగా చేసే సినిమాలపై, కెరీర్‌పై ఎఫెక్ట్‌ పడుతుందని మాధవన్‌ భావించడంతో మేకర్స్ ఓకే చెప్పారంట.తెలుగు వర్షన్ లో మాత్రమే...తమిళంలో రెగ్యులర్ గా రిలీజ్ అయ్యే ఏరియాస్ లో ‘సవ్యసాచి’ తెలుగు వెర్షన్‌ విడుదల చేస్తున్నారు. దీంతో మాధవన్ పెట్టిన కండిషన్స్ కి దర్శక నిర్మాతలు సరే అని చెప్పడంతో మాధవన్ ఇందులో విలన్ గా చేయడానికి ఓకే అన్నాడు. నవంబర్ 2న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. సినిమాపై పూర్తి కాంఫిడెన్స్ తో ఉన్నారు హీరో అండ్ టీం.
README.md exists but content is empty.
Downloads last month
31