link
stringlengths 41
231
| text
stringlengths 29
5k
|
---|---|
https://www.telugupost.com/movie-news/taxiwala-film-plus-point-95640/ | ఈకాలంలోనూ సెంటిమెంట్స్ ఎవరు నమ్మట్లేదు చెప్పండి. సెంటిమెంట్స్ నమ్మొద్దు అని సినిమా వాళ్లే సినిమాల్లో చెప్పి బయట సెంటిమెంట్స్ ని తెగ ఫాలో అవుతుంటారు. ఇది అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్నా మన టాలీవుడ్ లో కొంచం ఎక్కువే అని చెప్పాలి. వారు చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అవుతుంటే వారిని ఐరన్ లెగ్ అనడం.. హిట్ అయితే గోల్డెన్ అనడం మన ఇండస్ట్రీ వాళ్లకి కామన్ అయిపోయింది. ఇలా హీరోయిన్స్ విషయంలో ఎక్కువ జరుగుతుంటాయి. తెలుగులో 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'కల్యాణ వైభోగమే', 'మహానటి' వంటి చిత్రాల్లో నటించిన మాళవిక నాయర్ కు ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ మంచి పేరు తెచుకున్నవే.గెస్ట్ రోల్ లో మాళవిక నాయర్ఈ నేపథ్యంలో ఆమె లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' లో ఒక గెస్ట్ రోల్ లో నటించిందట. ఆమె ఈ సినిమాలో ఉంది కాబట్టి ఈమె రూపంలో 'టాక్సీవాలా'కు కలిసి వస్తుందని అందరూ భావిస్తున్నారు. రెండు నెలల కిందట ఈ సినిమా మొత్తం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పైరేటెడ్ వర్షన్ చుసిన కొంతమంది సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈనెల 16న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా మాళవిక నాయర్ రూపంలో హిట్ అవుతుందని భావిస్తున్నారట. మాళవిక కూడా ఈ సినిమాతో సక్సెస్ అందుకుని గోల్డెన్ లెగ్ అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. |
https://www.telugupost.com/movie-news/rajamouli-trolled-for-that-155209/ | రాజమౌళి సౌత్ లోనే నెంబర్ వన్ డైరెక్టర్ అందులో ఎలాంటి సందేహం లేదు. అసలు సౌత్ అనే కానన్ ఇండియా వైడ్ గానే రాజమౌళి అద్భుతమైన క్రియేటివ్ స్కిల్స్ కలిగిన డైరెక్టర్. రాజమౌళి సినిమాల్తో పోటీపడాలంటే మాములు కథలు చాలవనే ఫీలింగ్ లో బాలీవుడ్ డైరెక్టర్స్ ఉన్నారు అంటే.. రాజమౌళి ని చూసి వారు భయపడుతున్నారని అర్ధం. అయితే అలాంటి దర్శకుడు ఓ ఆస్కార్ అవార్డు సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటిజెన్స్ కి రాజమౌళి అడ్డంగా దొరికేలా చేశాయి. RRR షూటింగ్ వాయిదా పడడంతో.. కోహ్లీగా ఉన్న రాజమౌళి RRR పనులను చక్కబెడుతూనే ఖాళీ సమయంలో హాలీవుడ్ మూవీస్ తోనూ, మీడియా తోనూ గడిపేస్తున్నాడు. అయితే తాజాగా రాజమౌళి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న కొరియన్ మూవీ పారాసైట్ సినిమా చూసి బోర్ కొట్టి నిద్ర పోయా అని చెప్పాడు. ఆ సినిమాలో పెద్దగా విషయం లేదనిపించింది అని.. అందుకే ఆ సినిమా చూస్తూ నిద్రపోయా అంటూ ట్వీట్ చెయ్యడంతో… నెటిజెన్స్ కి కాలింది. రాజమౌళి క్రియేటివ్ అండ్ టాప్ డైరెక్టర్… కానీ ఆయన వరల్డ్ సినిమా అవార్డ్స్ లో అత్యున్నతమైనదిగా భావించే ఆస్కార్ గెలుకున్న మూవీ గురించి అంత చులకనగా మాట్లాడం.. బాగోలేదని రాజమౌళిని తప్పుబడుతున్నారు. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా మాట్లాడే రాజమౌళి.. ఆస్కార్ విన్నింగ్ మూవీ గురించి అలా మాట్లాడడం చాలామందికి నచ్చలేదు. |
https://www.telugupost.com/movie-news/nag-donation-172020/ | వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ సీ ఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల విరాళాన్ని ప్రకటించిన కింగ్ అక్కినేని నాగార్జున కొన్ని రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తభించిపోయింది. బాధితులను ఆదుకోవడానికి కింగ్ అక్కినేని నాగార్జున వెంటనే స్పందించారు. రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించి తన పెద్ద మనసుని చాటుకున్నారు. ” భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో సామాన్యులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం తెలంగాణ ప్రభుత్వం వెంటనే రూ.550 కోట్ల విడుదల చేయడం మంచి పరిణామం. నా వంతుగా రూ.50 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నాను” అన్నారు. |
https://www.telugupost.com/movie-news/aravindasametha-non-bahubali-records-93421/ | ఈనెల 11న దసరా కానుకగా రిలీజ్ అయినా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ల 'అరవింద సమేత' ఓ అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా టికెట్స్ బుకింగ్ వెబ్ సైట్ 'బుక్ మై షో డాట్ కామ్'లో 12 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అంతకముందుకు 'బాహుబలి' పార్ట్ 1 పై ఉన్న ఈ రికార్డ్ ను అరవింద బ్రేక్ చేసింది. 'బాహుబలి 2' తర్వాత స్థానంలో అత్యధికంగా అమ్ముడైంది ఈ సినిమా టికెట్లే. ఈవిషయాన్ని సదరు వెబ్ సైట్ వెల్లడించింది. తెలుగులో మంచి మంచి చిత్రాలు వస్తున్నాయి అనడానికి ఇదే నిదర్శనమని అని 'బుక్ మై షో' ప్రతినిధి ఒకరు తెలిపారు.115 కోట్లు వసూలు చేసి.....త్రివిక్రమ్ మాటలతో..ఎన్టీఆర్ డైలాగ్స్ తో 'అరవింద సమేత' రూ.115 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 55 కోట్లు షేర్ ను రాబట్టింది. నైజాం హక్కులను దిల్ రాజు రూ.18 కోట్లకు కొనగా, ఆయన డబ్బులు ఆయనకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 74 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ చెబుతున్నారు. విదేశాల్లో ఈసినిమాను 12 కోట్లకు విక్రయించగా.. మంగళవారం నాటికే రూ. 11.30 కోట్లు రాబట్టినట్టు సమాచారం.రికార్డ్ తుడిచేస్తుందా...?ఇక కృష్ణా..గుంటూరు..సీడెడ్..ఈస్ట్..వెస్ట్ డిస్ట్రిబ్యూటర్లు ఈ వారం నుండే లాభాలు వచ్చే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే నాన్ 'బాహుబలి' పేరు మీద ఉన్న అన్ని రికార్డ్స్ తుడిచేయడం పెద్ద విషయయేమి కాదు అని అంటున్నారు ట్రేడ్. మరో రెండు మూడు రోజుల్లో ఈసినిమా సక్సెస్ మీట్ జరగనుంది. |
https://www.telugupost.com/crime/nursing-student-suma-heart-attack-nandyala-youth-died-while-playing-cricket-1489732 | చిన్న వయసులోనే పలువురికి గుండె పోటు వస్తూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. గుండెపోటుతో నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకా నెరియా గ్రామంలో చోటుచేసుకుంది. మృతి చెందిన విద్యార్థిని సుమ(19)గా గుర్తించారు. మంగళూరులో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సుమకు ఇటీవల ఒంట్లో సరిగా లేకపోవడంతో ఇంట్లోనే ఉంది. అనారోగ్యం కారణంగా ఆగస్టు 9న స్థానిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది. అనంతరం ఆగస్టు 11న ఆమె తీవ్ర అనారోగ్యంతో మంగళూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. అక్కడ ఆమె కోలుకుంది. ఆగస్టు 13వ తేదీ సాయంత్రం మళ్లీ అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో ఆమె మరణించింది.నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన మహేంద్ర(22) ఆదివారం మధ్యాహ్నం క్రికెట్ ఆడుతూ అకస్మాత్తుగా మరణించాడు. కాలనీ సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అతడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. యువకుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. |
https://www.telugupost.com/crime/tragic-incident-took-place-in-kushaiguda-at-hyderabad-a-software-engineers-family-commits-a-violent-death-1468852 | కుషాయిగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. గాదె సతీష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మంచి జీతం. ఇద్దరు పిల్లలు. ఆనందంతో గడపాల్సిన ఆ కుటుంబంలో అనారోగ్యం ప్రవేశించింది. పిల్లలిద్దరూ అనారోగ్యం పాలవడంతో గత కొద్ది రోజులుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చాలా ఆసుపత్రిలవద్ద చూపించారు.అనారోగ్యమే...కానీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడకపోగా రోజురోజుకూ మరింత క్షీణిస్తుంది. దీంతో సతీష్ తన భార్య వేద, తొమ్మిదేళ్ల నిషికేత్, ఐదేళ్ల నిహాల్ కు టీలో పొటాషియ సెనైడ్ కలిపి ఇచ్చారు. వారు ముగ్గురు మరణించిన తర్వాత సతీష్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో సతీష్, వేదల కుటుంబం సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. |
https://www.telugupost.com/movie-news/అమితాబ్-కాదనడానికి-అసలు-14983/ | బాలకృష్ణ రైతు సినిమా ఆగిపోయినట్టేనా? అవుననే చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బాలకృష్ణ - కృష్ణవంశీ కాంబినేషన్లో బాలకృష్ణ 101 వ సినిమాగా రైతు సినిమా తెరకెక్కనుందని అనౌన్సమెంట్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా కోసం బాలకృష్ణతో కలిసి నటింపచేసేందుకు ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ని కూడా కలిశారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఇక అమితాబ్ కూడా రైతు చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడని అప్పట్లో టాలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే అక్కడ ముంబైలో సర్కారు సినిమా సెట్స్ లో జరిగిన విషయం వేరట. అక్కడ సర్కార్ సెట్స్ లో బాలకృష్ణ, కృష్ణ వంశీ ఇద్దరూ కలిసి మర్యాదపూర్వకం గా అమితాబ్ ని కలిసి తన రైతు సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించమని అడిగారట. దానికి అమితాబ్ తనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని అవి పూర్తికావాలంటే చాలా టైం పడుతుందని చెప్పారట. ఇక అంతకాలం రైతు చిత్రం వాయిదా వెయ్యడం ఇష్టం లేని బాలయ్య వేరే చిత్రానికి కమిట్ అయినట్లు వార్తలొచ్చాయి.అయితే ఇప్పుడు అమితాబ్ ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఈ చిత్రం ఆగలేదంట. అసలు అమితాబ్ తనకి ఉన్న కమిట్మెంట్స్ విషయం బాలయ్యతోగాని కృష్ణవంశీ తో గాని అస్సలు చెప్పలేదంట. కానీ రైతు లో నటించడం మాత్రం కుదరదని చెప్పాడట. అసలు అమితాబ్ అలా డైరెక్ట్ గా ఎలా చెప్పగలిగాడు. ఒక మంచి సందేశాత్మక చిత్రం లో ఒక మంచి పాత్ర తనని వెతుక్కుంటూ వస్తే అమితాబ్ ఎలా నో చెప్పగలిగాడని ఎప్పుడు మీడియా లో తెగ చర్చించుకుంటున్నారు. అయితే అమితాబ్ రైతు చిత్రం లో నటించననడానికి ఒక బలమైన కారణం ఉందట. అదేమిటంటే అమితాబ్ పేరు రాష్ట్రపతి రేస్ లో వుండడమేనంట. ఇక రైతు చిత్రం లో కూడా అమితాబ్ కేరెక్టర్ రాష్ట్రపతి గా ఉందట. మరి నిజం గా రాష్ట్రపతి రేస్ లో పేరు పరిశీలనలో వున్నప్పుడు అటువంటి కేరెక్టర్ లో ఒక సినిమా చెయ్యడం బాగోదని... అందుకే రైతు లో నటించడానికి నో చెప్పాడని వార్తొకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. మరి బాలయ్యేమో అమితాబ్ లేకుండా రైతు లేదంటున్నాడు. కృష్ణ వంశీయేమో ఎలాగైనా రైతు చిత్రాన్ని తెరకెక్కించాలని కంకణం కట్టుకుని కూర్చున్నాడు. చూద్దాం ఏమవుతుందో. |
https://www.telugupost.com/crime/tdp-leader-vinod-kumar-jain-arrested-by-police-in-vijayawada-girl-suicide-case-1351744 | విజయవాడలో బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ లో ఒక అపార్ట్ మెంట్ పై నుంచి నిన్న బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు బాలిక సూసైడ్ నోట్ రాసింది. బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది.రెండు నెలలుగా....అయితే అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న వినోద్ జైన్ బాలికను రెండు నెలలుగా వేధిస్తున్నాడు. బాలిక ఓపిక పట్టినా రోజూ లిఫ్ట్ వద్దకు వచ్చి వేధిస్తున్నాడు. దీంతో బాలిక వినోద్ కుమార్ జైన్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. వినోద్ కుమార్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37 వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. |
https://www.telugupost.com/movie-news/ఈ-హీరోకి-జోడి-కోసం-ఎంతలా-వ-32103/ | ప్రభాస్ బాహుబలి విజయాన్ని అమెరికాలో సేదతీరుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభాస్ నెక్స్ట్ సినిమా సాహో కూడా సెట్స్ మీదకెళ్లడానికి రెడీగా వుంది. ఇప్పటికే సాహో టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సుజిత్ డైరెక్షన్ లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో ప్రభాస్ కి జోడి గా ఎవరిని ఎంపిక చెయ్యాలో తెలియక చిత్ర యూనిట్ తికమక పడుతుందట. సాహో చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో యువీ క్రియేషన్స్ వారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక మూడు భాషల్లో ఈ చిత్రం నిర్మితమవుతుండడంతో మూడు భాషల్లో పరిచయమున్న హీరోయిన్ ని తీసుకుంటే బావుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. అందుకే బాలీవుడ్ భామలైతే మూడు భాషల్లో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందని భావించి బాలీవుడ్ లోని దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లను ప్రభాస్ కి జోడిగా ఎంపిక చేద్దామనే నిర్ణయానికి చిత్ర యూనిట్ వచ్చిందట. కానీ దీపికా హాలీవుడ్ ఫిలిమ్స్ లో నటిస్తూ బాగా బిజీగా ఉండడంతో కత్రినాకి ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ కి జోడిగా కత్రినా అయితే బావుంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.మరో పక్క ప్రభాస్ కి జోడిగా ఒక కొత్త ముఖాన్ని సెలెక్ట్ చేస్తున్నారని చెబుతున్నారు. రష్మిక మడోన్నా అనే కొత్త హీరోయిన్ ని ప్రభాస్ కి జోడిగా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. మరి ఫైనల్ గా ప్రభాస్ కి జోడిగా ఎవరిని తీసుకుంటారో మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. వచ్చేనెల 10 నుంచి సాహో చిత్రం సెట్స్ పైకి వస్తుందంటున్నారు. |
https://www.telugupost.com/politics/tdp-high-command-gave-a-shock-to-former-minister-ganta-srinivasa-rao-he-said-that-there-is-no-seat-in-visakha-district-1521896 | మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లాలో సీటు లేదని చెప్పేసింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావుకు సూచించింది. అయితే గంటా మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి లేదని గంటా శ్రీనివాసరావు తెలిపారు. భీమిలీ కూడా జనసేనకు కేటాయించాల్సి రావడంతో గంటా శ్రీనివాసరావుకు విశాఖ జిల్లాలో నియోజకవర్గం కేటాయించడానికి లేకుండా పోయింది. దీంతో ఆయనను అక్కడి నుంచి తప్పించి విజయనగరం జిల్లాకు పంపేందుకు అధినాయకత్వం సిద్ధమయింది.చీపురుపల్లి నుంచి....ఈ మేరకు గంటా శ్రీనివాసరావు పార్టీ అధినాయకత్వం సూచనప్రాయంగా తెలిసింది. చీపురుపల్లిలో ప్రస్తుత మంత్రి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై ఆయన పోటీ చేయాల్సి ఉంటుంది. ఆ నియోజకవర్గంలో సమర్థుడైన నాయకుడు లేకపోవడంతో గంటా శ్రీనివాసరావును పంపాలని చంద్రబాబు భావించారు. విశాఖ రాజకీయాల నుంచి గంటాను తప్పించే ప్లాన్ లో భాగంగానే ఆయనను విజయనగరం జిల్లాకు షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నట్లు గంటా వర్గీయులు అనుమానిస్తున్నారు. విశాఖలో ఉంటే ఇక్కడ గ్రూపులు గోల ఎక్కువగా ఉంటుందని, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుకు మధ్య అసలు పొసగదు కనుక గంటాను విజయనగరం జిల్లాకు పంపాలని నిర్ణయించింది.150 కి.మీల దూరంలో....అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం తాను విశాఖ జిల్లా నుంచే రాజకీయాలు చేస్తానని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయబోనని తెలిపారు. విశాఖకు చీపురుపల్లి 150 కిలోమీటర్ల దూరంగా ఉ:టుందని, అన్నీ ఆలోచించుకుని హైకమాండ్ కు తన నిర్ణయాన్ని త్వరలోనే చెబుతానని ఆయన మీడియాకు వివరించారు. విశాఖ జిల్లా నుంచే తాను రాజకీయాలను ప్రారంభించానని, తొలుత అనకాపల్లి పార్లెమెంటుకు తర్వాత చోడవరం, ఆ తర్వాత భీమిలీ, అనంతర విశాఖ నుంచి పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు, విశాఖకు విడదీయలేని అనుబంధం ఉందని కూడా అని అన్నారు.టిక్కెట్ రాకుంటే...ఆయన మరో మాట కూడా అనడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. టిక్కెట్లు దక్కని వారు పార్టీ మారడం సహజమేనని అన్నారు. టీడీపీలో టిక్కెట్ రాదని తెలిసి విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వెళ్లారని, వైసీపీలో కీలకంగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీకి చేరువయ్యారని, ఆదిమూలంకు తిరుపతి పార్లమెంటు ఇన్‌ఛార్జిగా నియమిస్తే కాదని వెళ్లిపోయారని ఇలా తమకు ఇష్టంలేని చోట ఉండకపోవడం సహజమేనని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో తనకు విశాఖ జిల్లాలో టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీ మారతానని పరోక్షంగా పార్టీ హైకమాండ్‌కు హెచ్చరికలు పంపినట్లేనని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/దుర్గా-తో-పక్కా-మాస్-అంటూ-36599/ | టాలీవడ్ లో మరో మాస్ మసాలా దర్శకుడు వివివి వినాయక్. ఆయన తీసిన దిల్ చిత్రం నుండి నిన్న మొన్నటి ఖైదీ నెంబర్ 150 చిత్రం వరకు పక్కా మాస్ మసాలా చిత్రాలే కావడం విశేషం. అయితే చిరుని రీ లాంచ్ చేసిన వినాయక్ ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరోసారి మెగా హీరోనే డైరెక్ట్ చేస్తున్నాడు. ఖైదీ తర్వాత వినాయక్ తన తదుపరి చిత్రాన్ని మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో చేస్తున్నాడు.అసలైతే ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభంకావాల్సి ఉన్నా కూడా సినిమా బడ్జెట్, వినాయక్ రెమ్యూనరేషన్‌ల విషయం వల్ల కాస్త ఆలస్యమైందని సమాచారం. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు ఆల్‌రెడీ మెగా హీరోలైన సాయితో 'విన్నర్', వరుణ్‌తేజ్‌తో 'మిస్టర్' నిర్మించి దారుణంగా నష్టాలు చవిచూశారు. దాంతో వారే నిర్మించే సాయిధరమ్‌తేజ్ - వినాయక్‌ల చిత్రం బడ్జెట్, వినాయక్ పారితోషికంగా పలు విషయాలు పెండింగ్‌లో పడ్డాయట. మొత్తానికి ఈ కాంబినేషన్ ఇప్పటికి ఓకే అయినట్లు తెలుస్తోంది.ఇక తనకు ఈ మద్య వచ్చిన గ్యాప్‌లో సాయికి తగ్గ సబ్జెక్ట్‌ని కూడా వినయ్ దాదాపు ఫైనల్ చేశాడట. మరి వినయ్ అంటే భారీ లెవల్లో హీరోయిజం ఉంటుంది. అయితే సాయి ధరమ్ తో వినయ్ చేసే చిత్రానికి 'దుర్గ' అనే టైటిల్ ని నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారని వార్తలొస్తున్నాయి. ఇక ఈ టైటిల్ ని చూస్తుంటే ఇది పక్కా మాస్ చిత్రమనే అనిపిస్తుంది. మరి ఎన్టీఆర్ కి 'ఆది' వంటి పవర్ ఫుల్ హిట్ ఇచ్చిన వినాయక్ ఇప్పుడు సాయి కూడా 'దుర్గ' తో ఎంతటి హిట్ ఇస్తాడో అని మెగా అభిమానులు అప్పుడే తెగ ఇదైపోతున్నారు |
https://www.telugupost.com/movie-news/nagarjuna-telugu-biggboss-season-7-week-six-elimination-contestant-1499341 | నాగార్జున హోస్ట్ గా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 మొదలయ్యి ఫుల్ ఆన్ ఎంటర్‌టైనింగా సాగుతుంది. ఉల్టా పల్టా అంటూ మొదలయిన ఈ సీజన్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్ లో వరుసగా లేడీ కంటెస్టెంట్స్ అంతా బయటకి వచేస్తుండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఐదు వారాల్లో ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని బయటకి పంపించేశారు.కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక, శుభశ్రీ.. ఇలా టాప్ అనుకున్నవారే బయటకి వచ్చేస్తున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారని ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి నెలకుంది. అయితే ఈ వీక్ కూడా లేడీ కంటెస్టెంటే బయటకి వెళ్లబోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్ లో శోభా శెట్టి, అశ్విని శ్రీ, నయని పావని, పూజా మూర్తి, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్, టేస్టీ తేజ ఉన్నారు. వీరిలో శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని నెటిజెన్స్ చెబుతున్నారు.ప్రస్తుతం ఈ అమ్మడి గేమ్ తీరుపై బాగా ట్రోలింగ్ జరుగుతుంది. కొన్ని టాస్క్‌ల్లో శోభా శెట్టి.. మరి చిల్లరిగా ప్రవర్తిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆడియన్స్ లో ఈ భామపై నెగటివిటీ రావడంతో.. ఓట్లు తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో శోభా శెట్టి ఈ వీక్ ఎలిమినేట్ అవ్వబోతుందని గట్టిగా టాక్ వినిపిస్తుంది. ఇక ఈ వారం కూడా లేడీ కంటెస్టెంటే బయటకి వెళ్లబోతుందా అని తెలుసుకున్న నెటిజెన్స్.. నాగార్జునకి ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు.నాగార్జున నటించిన 'మన్మధుడు' సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ మూవీ ఫస్ట్ హాఫ్ లో నాగార్జున లేడీస్ పై కోపం చూపిస్తుంటాడు. ఇప్పుడు ఆ పాత్రలో ఉండే.. హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్స్ అందర్నీ బయటకి పంపించేస్తున్నాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున గారు మీరు ఆ పాత్ర నుంచి బయటకి వచ్చి మాకోసం కొందరి లేడీస్ అన్న లోపల ఉంచండి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి నాగ్ ఈ వారం ఎవరిని బయటకి తీసుకు వస్తాడో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/jayasudha-rejected-jabardasth-offer-117935/ | ఈటీవీ లో ప్రసారమవుతోన్న ‘జబర్దస్త్’ కామెడీ షో .. ఎంతో పాప్యులర్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ప్రతి గురు, శుక్రు వారాల్లో వచ్చే ఈ కామెడీ షో మంచి రేటింగ్స్ వస్తుంటాయి. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా నాగబాబు అండ్ రోజా వ్యవహరించే వాళ్ళు. అయితే ఇద్దరూ తమ తమ పార్టీలకి సంబంధించిన కార్యకలాపాల్లో నిమగ్నమైపోయారు. ఎలక్షన్స్ సమయం కాబట్టి ఇద్దరూ పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రచారం కోసం కొంత కాలం బ్రేక్ తీసుకున్నారు. సో అందు కోసం ఈ కామెడీ షో నిర్వాహకులు .. క్రేజ్ వున్న సీనియర్ ఆర్టిస్టులను న్యాయనిర్ణేతలుగా తీసుకునేందుకు వాళ్లతో సంప్రదింపులు జరిపారట. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ జయసుధను కూడా సంప్రదించారు. అయితే ఆమె సున్నితంగా తిరస్కరించారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన జయసుధ ఆ తరువాత మదర్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు సహజనటి అనే పేరు కూడా ఉంది. రీ ఎంట్రీలో ఆమె తన వయసుకి తగిన హుందాతనంతో కూడిన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. ఆ కారణంగానే ఈ కామెడీ షోకి సెట్ కాదని ఆమె సున్నితంగా తిరస్కరించారని డెక్కన్ క్రానికల్ పేర్కొంది. జయసుధ ప్లేస్ లో మీనా చేస్తుంది. నాగబాబు ప్లేస్ లో శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా చేస్తున్నారు. |
https://www.telugupost.com/telangana/tpcc-president-revanth-reddy-strong-warning-to-party-leaders-and-workers-1485038 | కాంగ్రెస్ కార్యకర్తలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇకపై గాంధీ భవన్ లో ఆందోళనలు చేస్తే.. వారిపై చర్యలు తప్పవని పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. కొద్దిరోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతుందంటూ.. కాంగ్రెస్ లో కొందరు నాయకులు గాంధీ భవన్ లో ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం కూడా రేవంత్ గాంధీ భవన్ కు వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. ఆ ఆందోళనల గురించి వివరాలు తెలుసుకున్న రేవంత్.. వారిపై తీవ్రంగా స్పందించారు.ఆలేరు నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలు ఉండగా.. 7 మండలాలకు అధ్యక్షులను నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారినే నియమించామని, ఒకే ఒక్క మండలానికి మహిళను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ ఆందోళనలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఆందోళన విరమించకపోతే వారందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అందుకు వారి వివరాలను సేకరించాలని గాంధీభవన్ ఇన్ ఛార్జ్, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్ రావును ఆదేశించారు. అలాగే మండల కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్న శంకర్ నాయక్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇకపై ఎవరైనా గాంధీ భవన్ మెట్లపై ధర్నాలు చేస్తే.. వారిని నిర్మొహమాటంగా సస్పెండ్ చేస్తామని రేవంత్ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని హెచ్చరించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికి సూచించారు. ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా పార్టీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వేమ నరేందర్ రెడ్డి లకు వినతిపత్రాలను అందజేయాలని, వాటిని పార్టీ పరిశీలించి, చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందన్నారు. |
https://www.telugupost.com/top-stories/2021-tollywood-movie-roundup-1345914 | కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ వల్ల గతేడాది (2020) సినీ పరిశ్రమకు కష్టాలు తప్పలేదు. చాలా సినిమాలు షూటింగులు పూర్తయి.. విడుదలకు రెడీ అయినప్పటికీ.. వరుస లాక్ డౌన్లు, ఆ తర్వాత థియేటర్లు తెరచుకున్నా 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండటంతో సినిమాలకు పెద్ద కష్టాలు తప్పలేదు. 2021 వచ్చేసరికి సినిమా విడుదలలు కాస్త ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టిలు జంటగా వచ్చిన ఉప్పెన సినిమా టాలీవుడ్ కు ఊపిరి పోసింది. ఉప్పెన పెద్ద హిట్ కావడంతో.. వరుసగా సినిమాలు విడుదలయ్యాయి. కానీ.. మధ్యలో మరోసారి కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో.. పలు సినిమాలు ఓటీటీ బాటపట్టాయి.కొంతకాలానికి మళ్లీ థియేటర్లు ఓపెన్ అవ్వగా.. వారం నుంచి రెండువారాల వ్యవధిలో టాలీవుడ్ నుంచి పలు మీడియం రేంజ్ సినిమాలు విడుదలై.. హిట్ కొట్టాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలై సందడి చేస్తున్నాయి. సంక్రాంతి వరకూ ఇదే హడావిడి ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ విడుదలైన సినిమమాల్లో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సినిమాలు లేకపోలేదు. కానీ.. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోలకు 2021 కలిసొచ్చిందనే చెప్పాలి. క్రాక్ తో రవితేజ హిట్మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజకు 2021లో పెద్ద హిట్ పడింది. సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమాతో రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టింది. వైష్ణవ్ తేజ్ డెబ్యూ ఉప్పెనఫిబ్రవరిలో విడుదలైన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టిలు జంటగా వచ్చిన ఉప్పెన సినిమా సుమారు రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. బ్లాక్ బస్టర్ సినిమా ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. సినిమా బడ్జెట్ రూ.22 కోట్లే అయినప్పటికీ.. ఊహించని రీతిలో కలెక్షన్లు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఇది డెబ్యూ మూవీనే.మూడు సినిమాలతో వచ్చిన తేజటాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి తేజ సజ్జా.. 2021లో హీరోగా పరిచయమయ్యాడు. జాంబిరెడ్డితో హిట్ కొట్టిన ఈ ఇంద్రసేనా రెడ్డి.. ఆ తర్వాత ఇష్క్ తో కాస్త నిరాశపరిచాడు. ఆ తర్వాత శివాని రాజశేఖర్ - తేజ జంటగా వచ్చిన అద్భుతం సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నా.. డిఫరెంట్ కథలను ఇష్టపడే ప్రేక్షకులను మాత్రం మెప్పించింది. వకీల్ సాబ్ తో ట్రీట్ ఇచ్చిన పవన్ఇక ఎంతోకాలంగా మంచి హిట్టుకోసం ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖాతాలోకి వకీల్ సాబ్ రూపంలో హిట్ పడింది. వకీల్ సాబ్ తో ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చారు పవన్. అజ్ఞాతవాసి తర్వాత వచ్చిన వకీల్ సాబ్ మంచి మాస్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది.రెడ్ తో రామ్చాలాకాలం తర్వాత చాక్లెట్ బాయ్ రామ్.. ఇటు మాస్ లుక్ లో.. అటు క్లాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. అదే రెడ్ సినిమా. లవ్ కమ్ క్రైమ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో ఫస్ట్ హిట్అక్కినేని వారసుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో ఎన్నో అంచనాలతో ముందుకొచ్చాడు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు 2021 హిట్ అందించింది. అంతకుముందు అఖిల్ చేసిన సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరచగా.. కాస్త కొత్తదనంతో కూడిన లవ్ స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా వచ్చి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో అఖిల్ విజయాల ఖాతాను తెరిచాడు. బాలకృష్ణకు అఖండ విజయంఅఖండ సినిమాతో.. నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ హిట్ అందుకున్నారు. తనకు కలిసొచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. రోరింగ్ హిట్ గా నిలిచింది. బాలయ్య డబుల్ఫోజ్ గా వచ్చిన అఖండలో.. సెకండాఫే సినిమాకు ప్రాణం పోసింది. అఖండగా బాలయ్య ఇచ్చిన పెర్ఫామెన్స్ మాస్ ఆడియన్స్ ను కట్టిపడేసింది. శ్యామ్ సింగరాయ్ గా థియేటర్లోకి వచ్చిన నానినేచురల్ స్టార్ నాని సినిమా థియేటర్లో విడుదలై రెండేళ్లు అవుతోంది. 2020లో వి సినిమా, 2021లో టక్ జగధీష్ సినిమాలు ఓటీటీలో విడుదలవ్వగా.. శ్యామ్ సింగరాయ్ మాత్రం థియేటర్లో విడుదలైంది. సాయిపల్లవి - నాని - కృతిశెట్టిలు హీరో హీరోయిన్లుగా.. పూర్వ జన్మ - ప్రస్తుత జన్మల నేపథ్యంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే కలెక్షన్లు రాబడుతూ.. సేఫ్ జోన్ లోకి వెళ్లే ప్రయత్నంలో ఉంది శ్యామ్ సింగరాయ్.ఇక శ్రీవిష్ణు నటించిన గాలిసంపత్, రాజరాజచోర సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. అలాగే నవీన్ పోలిశెట్టి - ఫరియా అబ్దుల్లా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు కలిసి నటించిన జాతిరత్నాలు మంచి కామెడీ ఎంటర్టైనర్ నిలిచింది.మాస్టర్, వైల్డ్ డాగ్, శ్రీదేవి సోడా సెంటర్, సీటీమార్ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి తొలిరోజుల్లో అలరించినా.. ఆ తర్వాత పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. సందీప్ కిషన్ నటించిన గల్లీరౌడీ సినిమా ఎవరేజ్ గా నిలిచింది. ఉప్పెనతో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ కొండపొలంతో అభిమానులను నిరాశపరిచాడు. నాగశౌర్య ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. వరుడు కావలెను, లక్ష్యతో నాగశర్య మంచి విజయాలను అందుకున్నాడు. అరణ్యగా వచ్చిన రానా జంతుప్రేమికులను మెప్పించాడు. మ్యాస్ట్రో, రంగ్ దే సినిమాలతో నితిన్ కాస్త బెటరనిపించాడు. రిపబ్లిక్ తో సాయిధరమ్ తేజ్ నిరాశ పరచగా.. సిద్ధార్థ్ - శర్వానంద్ మహాసముద్రంతో మెప్పించారు. లవ్ స్టోరీ సినిమాతో నాగచైతన్య హిట్ అందుకున్నాడు. భారీ అంచనాలతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేమికులను అలరించింది. బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా లవ్ స్టోరీ నిలిచింది.వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు ఓటీటీ రిలీజ్ కే పరిమితమయ్యాయి. కొడుకుని కాపాడుకునే తండ్రి నారప్పగా, కుటుంబాన్ని రక్షించుకునే కుటుంబ పెద్ద రాంబాబుగా దృశ్యం 2 సినిమాల్లో వెంకటేష్ అద్భుతమైన నటనను కనబరిచాడు. |
https://www.telugupost.com/movie-news/tollywood-actress-hema-angry-over-media-1441815 | టాలీవుడ్ ప్రముఖ నటి హేమ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు చేశారు. విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆమెకు ఎంతో కోపం వచ్చింది. దుర్గమ్మను దర్శించుకోలేకపోతానేమోనని అనుకున్నానని, కానీ అమ్మవారి దర్శనం లభించిందని, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జనం రద్దీ ఎక్కువగా ఉందని, ప్రొటోకాల్ ఇబ్బంది కూడా ఉందన్న వార్తలు విన్నానని, కానీ చివరి నిమిషంలో దుర్గమ్మ తనను పిలిచిందని అన్నారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హేమ కస్సుమన్నారు. మీరు ఎంతమంది వచ్చారు? అందరూ టికెట్ తీసుకున్నారా? అని ఆ విలేకరి ప్రశ్నించాడు. స్పందించిన హేమ ఆ రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి హుండీలో తాను రూ. 10 వేలు వేశానని, రూ. 20 వేల విలువైన చీరను సమర్పించానని పేర్కొన్న హేమ.. టికెట్ గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. టికెట్ తీసుకున్నామని, ప్రొటోకాల్ ప్రకారమే దర్శనానికి వెళ్లామని అన్నారు. దీనిని కూడా వివాదం చేస్తారా? అని మండిపడ్డారు.ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ ఈ రోజు భక్తులకు శ్రీ మహిషాసుర మర్ధని దేవి రూపం లో దర్శనమీయనున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని సేవిస్తే.. సర్వదోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య స్థైర్య, విజయాలు చేకూరుతాయని.. ఇతర అడ్డంకులు తొలిగిపోతాయన్నది భక్తుల నమ్మకం. |
https://www.telugupost.com/movie-news/ఈ-ఆలోచన-ధోరణితో-ఉన్నవాడు-56144/ | ఎన్.టి.ఆర్ పై బైయోపిక్ అంటూ 'లక్ష్మీస్ వీరగ్రంధం' అనే టైటిల్ అన్నౌన్స్ చేసి లక్ష్మి పార్వతి తో జరిగిన వాగ్విదాంతో వార్తల్లో నిలిచిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి అసలు ఆ బైయోపిక్ తీస్తారో లేదో తెలియదు, అసలు ఆయన అది హేండిల్ చేయగల సమర్ధులా కాదా అనేది కూడా తెలియదు కానీ ఇప్పుడు అనవసరమైన అనుచిత వ్యాఖ్యలతో డైరెక్టర్ అని పిలిపించుకునే అర్హతనే కోల్పోతున్నారు కేతిరెడ్డి. బాలీవుడ్ లో అనౌన్సమెంట్ జరిగిన ఒక ప్రాజెక్ట్ కాస్టింగ్ పై అనవసరమైన అభ్యంతరాలు తెలియజేస్తూ వార్తల్లో నిలిచే తాపత్రయంతో అవాసుపాలవుతున్నాడు కేతిరెడ్డి.ఇటీవల అనౌన్స్ చేయబడ్డ 'ఇందిరా: ఇండియాస్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్' అనే ఇందిరా గాంధీ లైఫ్ స్టోరీ పై రాబోతున్న ప్రాజెక్ట్ కి సంబంధిత నిర్మాణ సంస్థ రాయ్ కపూర్ ప్రొడక్షన్స్ ఇందిరా గాంధీ పాత్ర ప్రముఖ నటి విద్య బాలన్ పోషించనున్నట్టు ప్రకటించారు. ఈ కాస్టింగ్ విషయంలో తన అభ్యంతరాలని పేస్ బుక్ పోస్ట్ ద్వారా రాయ్ కపూర్ ప్రొడక్షన్స్ కి ఉచిత సలహాలు ఇస్తూ వార్తల్లో నిలిచాడు కేతిరెడ్డి. ది డర్టీ పిక్చర్ లాంటి చిత్రంలో గ్లామర్ షో చేసిన నటిని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రకి ఎంచుకోవటం సమంజసం కాదని, ఒకటికి పది సార్లు కాస్టింగ్ విషయంలో ఆలోచించుకోవాలని పేర్కొంటూ కేతిరెడ్డి తెలిపిన అభిప్రాయాలపై నెటిజన్లు కామెంట్స్ రూపంలో సరైన సమాధానమే చెప్తున్నారు. ఒక పాత్రతో మెప్పించి ఇంతలోనే ఆ పాత్రకి విరుద్ధమైన పాత్రలలో కూడా మెప్పించటమే వృత్తిగా పనిచేసే వారే నిజమైన నటీనటులు. అలాంటి ప్రతిభ కలిగిన విద్య బాలన్ ని ఎంచుకున్న నిర్మాతలకి సలహాలు ఇవ్వటానికి నటుల గత పాత్రలని బేరీజు వేసుకుంటూ వారు ఇతర పాత్రలకి అర్హులు కారని చెప్తున్న కేతిరెడ్డి అసలు కళారంగానికి అనర్హుడు అని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. |
https://www.telugupost.com/crime/gangster-mukhtari-ansari-died-of-heart-attack-in-uttar-pradesh-he-is-63-years-old-1527928 | ఉత్తర్‌ప్రదేశ్ లో గ్యాంగ్‌స్టర్ ముఖ్తారీ అన్సారీ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 63 ఏళ్లు. ఆయన గ్యాంగ్‌స్టర్ నుంచి యూపీలో రాజకీయ నేతగా ఎదిగారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2005 నుంచి అన్సారీ ఒక కేసులో యూపీలోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. నిన్న సాయంత్రం అస్వస్థతకు గురైన అన్సారీని వెంటనే ఆసుపత్రికి తరలించారు.భారీ భద్రత మధ్య...అయితే ఆయన గుండెపోటుతో మరణించినట్లు దుర్గావతి వైద్యశాల వైద్యులు తెలిపారు. అన్సారీ మృతితో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ ను విధించారు. ముఖ్యంగా బాందా, మౌ, ఘాజీపూర్, వారణాసి జిల్లాల్లో ప్రత్యేక భద్రతాదళాలను దింపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. |
https://www.telugupost.com/movie-news/allu-arjun-not-happy-with-ntr-koratala-movie-189646/ | పుష్ప పాన్ ఇండియా మూవీ తర్వాత బన్నీ చెయ్యాల్సినది కొరటాల శివ తో మరో పాన్ ఇండియా మూవీ. కానీ ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ మూవీకి ప్లాన్ చేసేసాడు. ఆచార్య తర్వాత ఇమ్మిడియట్ గా కొరటాల శివ అల్లు అర్జున్ తో కాకుండా ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టబోతున్నాడు. దానికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే కొరటాల శివ – బన్నీ మూవీ ఆగిపోయిందేమో అందుకనే ఎన్టీఆర్ తో కొరటాల మూవీ చేస్తున్నాడని బన్నీ ఫాన్స్ నిర్మాతలను తగులుకోగా.. బన్నీ – కొరటాల నిర్మాతలు బన్నీ – కొరటాల కాంబో మూవీ ఉంటుంది, అది ఏప్రిల్ 2022 తర్వాత అని చెప్పడమే కాదు.. అప్ డేట్స్ ఇస్తుంటామని కూడా చెప్పేసరికి బన్నీ ఫాన్స్ కూల్ అయ్యారు. అయితే అదేదో బన్నీ ఫాన్స్ ని కూల్ చెయ్యడానికి నిర్మాతలు చెప్పినా.. కొరటాల శివ తన ప్రాజెక్ట్ కాకుండా ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్న విషయం తెలిసి బన్నీ బాగా హార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. గీత ఆర్ట్స్ వాళ్లతో మాట్లాడాము, వాళ్ళు ఎన్టీఆర్ తో మూవీకి ఒప్పుకున్నారు.. కాబట్టే కొరటాల హీరో మారాడంటూ మిక్కిలినేని సుధాకర్ చెబుతున్నా.. ఇక్కడ కొరటాల తన మూవీ ని లేట్ చేస్తునందుకు బన్నీ కి బాగా మండుతుంది అనే టాక్ అయితే ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. తాను ఆగష్టు లో ఫ్రీ అయ్యిపోతున్నా.. ఈ మధ్యలో ఎన్టీఆర్ తో కొరటాల మూవీ ఎలా ఒప్పేసుకుంటాడంటూ బన్నీ సన్నిహితుల దగ్గర ఫీలవుతున్నట్లుగా తెలుస్తుంది. |
https://www.telugupost.com/movie-news/lung-cancer-to-sanjaydutt-165604/ | బాలీవుడ్ మీడియా మొత్తం ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం చుట్టూనే తిరుగుతుంది. గత రెండు నెలలుగా సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్యపై పోలీస్ ల శోధన ఎంతో కానీ…. మీడియా శోధన మాత్రం 100 శాతం ఉంది. అయితే ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం కన్నా మరో విషాదకర వార్త బాలీవుడ్ ని కమ్మేసింది. అది బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కి స్టేజ్ 4 ఊపిరి తిత్తుల క్యాన్సర్ అనే విషయాన్నీ బాలీవుడ్ జీర్నిన్చుకోలేకపోతుంది. రెండు రోజుల క్రితం సంజయ్ దత్ శ్వాస తీసుకోవడం కష్టముగా ఉండడంతో హుటాహుటిన ముంబై లోని లీలావతి హాస్పిటల్ లో జాయిన్ అయినా విషయం తెలిసిందే. అప్పటికి సంజయ్ దత్ ఆక్సిజెన్ లెవెల్స్ 90-92 మధ్య ఉండడంతో లీలావతి హాస్పిటల్ డాక్టర్స్ సంజయ్ దత్ కి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకినట్లుగా నిర్ధారణ కాకపోయేసరికి సంజయ్ దత్ కి చాతీ భాగంలో పరీక్షలు నిర్వహించడం, అలాగే మరిన్ని పరీక్షలు చెయ్యగా సంజయ్ దత్ స్టేజ్-4 ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయినట్లుగా సమాచారం. అయితే సోమవారం సంజయ్ దత్ హాస్పిటల్ నుండి డిస్చాజ్ కాగా.. ఆయన మాట్లాడుతూ మెడికల్ చెకప్స్ కోసం, అలాగే కాస్త విశ్రాంతి కోసము సినిమా షూటింగ్స్ కి కాస్త బ్రేక్ ఇస్తున్నట్టుగా చెప్పాడు. అలాగే మీ ప్రేమాభిమానులతో తాను ఈ క్యాన్సర్ నుండి కోలుకుని బయటపడతాను అంటూ ఆశాభావం వ్యక్తం చేసాడు. సంజయ్ కి క్యాన్సర్ సోకడంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ లకు బ్రేకులు పడ్డాయి. |
https://www.telugupost.com/crime/bad-news-for-virat-kohli-fans-fans-are-disappointed-to-know-that-there-is-no-chance-to-play-up-to-four-tests-1519626 | విరాట్ కొహ్లిని చూస్తూ ఉంటే చాలు. మైదానంలో అతడు కనపడితే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలే. విరాట్ కు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ఫామ్ లో ఉన్నా లేకపోయినా ఫ్యాన్స్ పట్టించుకోరు. విరాట్ బ్యాట్ ను ఝళిపిస్తుంటే చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొహ్లి కుదురుకుంటే చాలు. ఇక ప్రత్యర్థికి అందనంత స్కోరును లక్ష్యంగా ఉంచుతాడు. అందుకే విరాట్ ను త్వరగా పెవిలియన్ కు పంపించేందుకు ప్రతి ప్రత్యర్థి బౌలర్ ప్రయత్నిస్తుంటాడు.తొలి రెండు మ్యాచ్‌లకు...అలాంటి విరాట్ కొహ్లి ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లకు దూరంగా ఉంటారని తెలిసి అభిమానులు నిరాశపడుతున్నారు. ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి రెండు మ్యాచ్ లకు విరాట్ దూరంగా ఉన్నారు. హైదరాబాద్, విశాఖలో జరిగే రెండుటెస్ట్ మ్యాచ్ లకు దూరంగా ఉంటారని బీసీసీఐ ప్రకటించడంతో తర్వాత మూడు మ్యాచ్‌లకైనా అందుబాటులో ఉంటారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ మళ్లీ వచ్చిన ప్రకటన ఫ్యాన్స్ ను హతాశులను చేేసింది. ఆయన రానున్న మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండరట.నాలుగో టెస్ట్‌కు కూడా...ఈ నెల 15వ తేదీ నుంచి రాజ్‌కోట్ లో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్ గెలవగా, రెండో మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. అయితే ఈ టెస్ట్ తో పాటు నాలుగో టెస్ట్ కు కూడా విరాట్ దూరంగా ఉంటారని ఒక పత్రిక తెలపడంతో విరాట్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. అయితే ఇది అధికారిక ప్రకటన కాకపోయినా విరాట్ వ్యక్తిగత కారణాలతోనూ ఈ టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. మరి ఐదో టెస్ట్‌కైనా విరాట్ అందుబాటులోకి వస్తారని ఆశిద్దాం. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేద్దాం. |
https://www.telugupost.com/top-stories/group-differences-have-led-to-defeat-of-tdp-in-some-constituencies-no-one-is-declining-even-if-the-leadership-tries-1373812 | గ్రూపు విభేదాలే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థిని ఓటమి వైపునకు నెడుతున్నాయి. ఆధిపత్య పోరుతో చేజేతులా నియోజకవర్గాలను గతకొన్ని ఎన్నికల్లో టీడీపీ వాటిని కోల్పోతుంది. ఆ నియోజకవర్గాలను గుర్తించి అక్కడ నేతలను సమన్వయం చేయడానికి టీడీపీ అధినాయకత్వం చర్యలు ప్రారంభించింది. అందులో శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గం. రాజాం నియోజకవర్గానికి కొండ్రు మురళి పార్టీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో అక్కడ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ టిక్కెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.హ్యాట్రిక్ కోసం...ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కంభాల జోగులు రెండుసార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటంతో కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ వ్యతిరేకతను టీడీపీ సొమ్ము చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ టీడీపీ గ్రూపు విభేదాలతో కొట్టుమిట్టాడుతుంది. కళా వెంకట్రావు వర్గం ఇక్కడ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తుంది. తొలి నుంచి అంతే. కళా వెంకట్రావు, ప్రతిభా భారతి, కొండ్రు మురళి ఇలా మూడు గ్రూపులు రాజాం నియోజకవర్గంలో ఏళ్లుగా తిష్ట వేసి ఉన్నాయి.కొండ్రు కాంట్రావర్సీగా...అయితే ఎవరూ ఎవరి విషయంలో తగ్గేదేలేదంటున్నారు. కొండ్రు మురళి కాంగ్రెస్ నుంచి తనతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని గత ఎన్నికల్లో కళా, కావలి వర్గాలు దెబ్బేశాయి. దీంతో 2019 ఎన్నికలలో టీడీపీ అధినాయకత్వం కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రుమురళికి టిక్కెట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. 2019 ఎన్నికల తర్వాత కొండ్రు మురళి కొంత పార్టీకి దూరంగా ఉన్నారు. మూడు రాజధానుల విషయంలోనూ ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అయితే కొండ్రు మురళి పట్ల చంద్రబాబు పాజిటివ్ గా ఉన్నారని తెలుస్తోంది.మూడు గ్రూపులను...ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ లోకేష్ టీంలో ఉన్నారు. ఇటీవల జరిగిన మహానాడులోనూ ఆమె ప్రసంగం హైలెట్ గా నిలిచింది. తొడకొట్టి మరీ వైసీపీకి సవాల్ విసిరింది. దీంతో లోకేష్ కోటాలో గ్రీష్మకు టిక్కెట్ దక్కవచ్చనే ప్రచారం జరుగుతుంది. గ్రీష్మకు టిక్కెట్ దక్కినా ఇక్కడ కళా, కొండ్రు వర్గాలు మద్దతిచ్చే అవకాశం లేదు. అలాగే కొండ్రుకు టిక్కెట్ ఇచ్చినా ఈ రెండు వర్గాలు పనిచేయవు. దీంతో ఈ నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయం చంద్రబాబుకు సమస్యగా మారింది. ముగ్గురిని ఏకం చేయగలిగితే రాజాం టీడీపీ పరమయినట్లే. కానీ అది సాధ్యం కాదన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మూడు ఎన్నికల్లో రాజాం టీడీపీ పరం కావడం లేదు. మరి ఈసారి ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/prabhas-at-peaks-165542/ | ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదు. పాన్ ఇండియా స్టార్ గా టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ క్రేజ్ ఎల్లలు దాటింది. బాహుబలి హిట్ తో పెంచుకున్న క్రేజ్ తోనే సాహో ప్లాప్ అయినా ప్రభాస్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. కాబట్టే వరసగా పాన్ ఇండియా మూవీస్ తోనే ప్రభాస్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ తో రాధేశ్యాం చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ తో తన తదుపరి మూవీని భారీ బడ్జెట్ తో నేషనల్ వైడ్ గా మొదలు పెడుతున్నాడు. ఈ సినీమా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా తెరకెక్కబోతుంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ నాగ్ అశ్విన్ – అశ్వినీదత్ మూవీ కి ప్రభాస్ తీసుకోబోయే పారితోషకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది. ఇప్పటివరకు సౌత్ లోనే కాదు ఇండియా లోనే టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా రజినీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఒక్క సినిమాకు దాదాపు 70 నుంచి 80 కోట్ల మధ్యలో పారితోషకం తీసుకుంటాడనే ప్రచారం ఉంది. రజినీకాంత్ కి ఎన్ని ప్లాప్స్ ఉన్నప్పటికీ ఆయనకుండే క్రేజ్ కి నిర్మాతలు దాసోహమే. అందుకే అడిగింది కాదనకుండా ఇచ్చేస్తారు. అయితే ఇపుడు రజినీకాంత్ రికార్డుని ప్రభాస్ కొల్లగొట్టబోతున్నాడు. నాగ్ అశ్విన్ తో చెయ్యబోయే సినిమాకి ప్రభాస్ ఏకంగా 100 కోట్లు అందుకోబోతున్నాడనే టాక్ వినబడుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ కి వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నాడని వార్తలైతే హాట్ టాపిక్ గా మారాయి. అదే నిజమైతే ఇండియా నెంబర్ వన్ గా ప్రభాస్ ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. |
https://www.telugupost.com/movie-news/mahesh-babu-maharshi-songs-review-117788/ | సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఉగాది కానుకగా విడుదలై కొన్ని గంటల్లోనే 16 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించి ఆల్‌ైటెమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇంతకుముందే విడుదైలెన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’ యూత్‌కి బాగా కనెక్ట్ అయింది, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 12న ‘వుహర్షి’ చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం.. ప్రతి నిసీ మసై.. నీలో కసే దిశై.. అడుగేైసెయ్ మిసైలులా… అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీప్రసాద్ స్వరపరచగా, యాజిన్ నిజార్ ఎంతో ఉద్వేగంతో గానం చేశారు. శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందర్నీ ఆకట్టుకునేలా ఉండడం వల్ల ఈ పాట మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి. |
https://www.telugupost.com/politics/ycp-leader-sajjala-countered-telangana-cm-kcrs-comments-1482007 | తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కచ్చితంగా పవర్ కట్స్ ఉన్నాయన్నారు. తెలంగాణ పల్లెలకు వెళ్తే కరెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసునన్నారు. మన రాష్ట్రంలో గతంతో పోల్చితే ఇప్పుడు 28 శాతం విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. సాంకేతికంగా ట్రిప్ ఇస్తే తప్ప.. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీలో ఎలాంటి అవాంతరాలు లేవని సజ్జల పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎకరం అమ్మితే ఏపీలో వందెకరాలు కొనచ్చంటున్నారని, అలా అయితే ముంబైలో ఎకరం అమ్మితే ఇంకా ఎక్కువ కొనవచ్చు, అమెరికాలో అమ్మితే 10 వేల ఎకరాలు కొనొచ్చు అంటూ సజ్జల సెటైర్ వేశారు.కేసీఆర్ అలా ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదన్నారు. ఎన్నికలు వస్తున్నందునే కేసీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చని సజ్జల అన్నారు. నిన్న సీఎం కేసీఆర్ రెండు రాష్ట్రాల్లోనూ భూముల అభివృద్ధిని పోల్చి చూసి తెలంగాణలో ఒక ఎకరం అమ్మడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఎకరాలు కొనుక్కోవచ్చని అన్నారు. తెలంగాణలో భూ అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న తీరును ఎత్తిచూపేందుకు ఇలా అన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ నేతలు కౌంటర్ ఇవ్వడంతో భూముల విలువ వివాదం పెద్దదైంది. ఇప్పటికే ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. వైజాగ్‌లో ఒక ఎకరం భూమిని అమ్మడం ద్వారా తెలంగాణలో దాదాపు 150 నుంచి 300 ఎకరాలు కొనవచ్చని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్‌కి మరో పెద్ద వైసీపీ నేత కౌంటర్ ఇచ్చారు. పవన్ పెయిడ్ ఆర్టిస్ట్ జనసేన అధినేత పవన్ పొలిటీషియన్ కాదు.. పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ చదివేది చంద్రబాబు స్క్రిప్టేనన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల అన్నారు. ఇటీవల జరిగిన మహానాడులో మిని మేనిఫెస్టోను ప్రవేశపెట్టి చంద్రబాబు నవ్వుల పాలయ్యారని అన్నారు. కులం కోసం నిలబడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని అన్నారు. ముద్రగడ కులాన్ని వాడుకోలేదు.. త్యాగాలే చేశారన్నారు. పవన్ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. |
https://www.telugupost.com/movie-news/megastar-chiranjeevi-has-made-it-clear-that-he-does-not-want-to-act-much-in-tollywood-industry-1346738 | ిటాలీవుడ్ ఇండ్రస్ట్రీ పెద్దగా తాను వ్యవహరించదలచుకోలేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. తనకు ఆ పెద్దరికం అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇండ్రస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకు ఇష్టం లేదని చిరంజీవి చెప్పారు. ఆ స్థానం తనకు వద్దని, తాను పంచాయతీలు చేయలేనని చిరంజీవి చెప్పారు.ఇద్దరు కొట్టుకుంటే.....ఇద్దరు కొట్టుకుని పంచాయతీ చేయమంటే తాను చేయలేనని, చేయనని కూడా చిరంజీవి చెప్పారు. కానీ సినీ కార్మికులకు మాత్రం తాను అండగా నిలుస్తానని చెప్పారు. ఇండ్రస్ట్రీ ఇబ్బందుల్లో ఉంటే తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. అంతేకాని పెద్దగా తాను మాత్రం వ్యవహరించలేనని చిరంజీవి స్పష్టం చేశారు. సినీ కార్మికుల సంక్షేమ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. |
https://www.telugupost.com/movie-news/anchor-varshini-is-getting-married-soon-1441615 | బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా పేరు తెచ్చుకున్న లేడీ యాంకర్లలో వర్షిణి ఒకరు. పెళ్లిగోల వెబ్ సిరీస్ తో అందరికీ పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత యాంకర్ గా గుర్తింపు పొందింది. పలు టీవీ షోలలో యాంకర్ చేసిన వర్షిణి.. ఒకట్రెండు సినిమాల్లో హీరోయిన్ గానూ నటించింది. కానీ.. అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. యాంకర్ గా రాణించి.. లక్షల ఫాలోవర్లు, అభిమానులను సంపాదించుకున్న వర్షిణి.. త్వరలోనే పెళ్లపీటలెక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి.సోషల్ మీడియాలో రకరకాల ఫోజులతో ఫొటోలు షేర్ చేస్తూ..కొన్ని విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటుంది. కానీ ఎంత గ్లామర్ చూపించినా అవకాశాలు రాకపోవడంతో.. పెళ్లిచేసుకోవాలని డిసైడ్ అయినట్లు టాక్. ఆ వ్యక్తి ఎవరో కాదు. వర్షిణికి వరుసకు బావేనట. చిన్నప్పుడే వారిద్దరి పెళ్లిని పెద్దలు ఫిక్స్ చేశారని.. ఈ క్రమంలోనే వర్షిణి తన బావతో కలిసి ఏడు అడుగులు వేయనుందని తెలుస్తోంది. దీనిపై వర్షిణి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/చిరుకి-చెమటలు-పట్టిస్తున-14958/ | మెగా స్టార్ చిరంజీవి అసాధారణమైన అభిమాన ఘనాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో ఏకంగా రెండు దశాబ్దాలు అగ్ర స్థానంలో తిష్ట వేయగలిగినప్పటికీ ఆయన సినిమాల నుంచి తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రేక్ తీసుకుంటూ ఆయన కెరీర్ లో ఆయన చేసిన 149 వ చిత్రం, ఆయన తొలి ఇన్నింగ్స్ కి ఆఖరి చిత్రం సంఖర్ దాదా జిందాబాద్. ఆ చిత్రం అంచనాలు అందుకోలేక పరాజయం చవి చూసింది. అక్కడినుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన చిరుకి చేదు అనుభవాలు వెంట వెళ్లాయి. ఇటీవలి కాలంలో ఆయన ప్రేక్షకులకు తన సినీ జీవితం పునప్రారంబిస్తున్నట్టు సంకేతాలు ఇవ్వటానికి బ్రూస్ లీ లో అతిధి పాత్ర పోషించగా ఆ చిత్రం కూడా పరాభవం చెందింది.నాటి నుంచి దృష్టి మొత్తం చిరు 150 వ చిత్రం పైనే కేంద్రీకరించింది మెగా ఫామిలీ. కథా చర్చల్లోనే దాదాపు ఏడాదిన్నర్ర కాలం గడిపి కత్తి రీమేక్ వైపు మొగ్గు చూపారు. మాస్ దర్శకుడు వినాయక్ కత్తి కథ లో చిరుకి తగిన మార్పులు అన్నీ చేసి తెరకెక్కించారు. అయినప్పటికీ చిరుకి పూర్తి స్థాయిలో తృప్తి కలగటం లేదు. ఆయనకు సక్సెస్లో హీరోయిన్ సెంటిమెంట్ ప్రభావం చూపుతుంది ఏమో అని భయం పట్టుకుంది. కాజల్ అగర్వాల్ చిరు సరసన ఆది పాడుతుండగా ఈ ఏడాది కాజల్ అగర్వాల్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, లాఫ్జోమ్ కా కహాని, కావాలి వెందాం చిత్రాలు వరుసగా పరాజయం చెంది కాజల్ బాడ్ టైం ని ఇండికేట్ చేస్తున్నాయి. దీనితో చిరు కం బ్యాక్ చిత్రం పై కాజల్ సెంటిమెంట్ పడుతుంది ఏమో అని మెగా ఫామిలీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. |
https://www.telugupost.com/movie-news/మెగాపవర్-స్టార్-రామ్-చ-32491/ | మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి రాజమండ్రి పరిసరాల్లో ఇంత వరకు ఎవరూ చిత్రీకరించని నేచురల్ లోకేషన్స్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశారు.ఆరు గంటలకు షూటింగ్ అంటే అందరూ ఐదు గంటలకే లోకేషన్‌లో ఉండేవారు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, హీరోయిన్ సమంత తో సహా అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అందరి సహకారంతో మొదటి షెడ్యూల్‌ను అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తి చేశాం. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ తన పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించారు. అనుకున్న విధంగా సినిమా మంచి అవుట్‌పుట్‌తో రావడం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాతలు తెలిపారు. మే 9 నుండి హైదరాబాద్‌తో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లో నాలుగు రోజుల షూటింగ్ చేసిన తర్వాత రాజమండ్రిలో 45 నుండి 47 డిగ్రీల అమితమైన ఉష్ణోగ్రతల కారణంగా, మొదటి షెడ్యూల్‌లో సమంతకు వడదెబ్బ తగలడంతో నటీనటులు, టెక్నిషియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి షెడ్యూల్‌ను నిర్మాతలు పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు చిత్రయూనిట్ జూన్ 1 నుండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోదావరి నది ఒడ్డున భారీ సెట్ వేసి అందులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు. అలాగే హైదరాబాద్‌లో సెట్స్ వేసి చిత్రీకరణ చేస్తారు. మెగాభిమానులను, ప్రేక్షకులకు బెస్ట్ అవుట్‌పుట్‌తో సినిమాను అందించడానికి చిత్ర నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి అందిస్తున్నారు. అలాగే ఆగస్టులో సినిమా విడుదల తేదిని కూడా ప్రకటిస్తారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, ఆది తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/జబర్దస్త్-పై-ఆధిపత్యానిక-12999/ | చాలా కాలం క్రితం వారానికి ఒక సారి జెమినీ టెలివిజిన్ లో ప్రసారమయ్యే హాస్య కథనాలతో సాగే అమృతం కి అత్యధికంగా ప్రేక్షకుల సంఖ్య ఉండేది. మళ్లీ ఏ టెలివిజిన్ ధారావాహిక ఆ స్థాయిని చేరుకోలేకపోయింది. కానీ ఈ టీవీ లో ప్రతి గురు,శుక్రవారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రం ఆ స్థాయి గుర్తింపు వచ్చింది. జబర్దస్త్ కార్యక్రమం లో పాల్గొన్న ఎందరో కళాకారులు ఇప్పుడు వెండి తెర నటులు అయిపోయారు అంటే జబర్దస్త్ క్రేజ్ ఏంటో అర్ధం అవుతుంది. ఆ కార్యక్రమానికి మొదటి నుంచి నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న వెండి తెర తారలు నాగ బాబు, రోజా లకు బుల్లి తెర పై గుర్తింపు పెరిగిపోయింది.అయితే ఒక ఛానల్ లో పాపులర్ ఐన కార్యక్రమాల ప్రేరణతో ఇతర ఛానళ్ళు కూడా అటువంటి కార్యక్రమాలు రూపొందించటం సహజమే. జబర్దస్త్ వంటి పాపులర్ షోకి ధీటుగా నేటి వరకు మరే ఛానల్ పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్ ఆ సాహసం చేస్తుంది అని సమాచారం. ఇప్పటికే హాస్య నటులతో స్కిట్స్ ప్రదర్షింపచేసి వాటిని ఎపిసోడ్స్ గా చిత్రీకరించి సిద్ధంగా ఉంచారు అంట. త్వరలో ఆ ఛానల్ ఆ షో తాలూకా ప్రోమో ను విడుదల చెయ్యటానికి సన్నద్ధమవుతోంది. ఈటీవీ జబర్దస్త్ కి రోజా, నాగ బాబులు నిర్ణేతలుగా ఉండగా, ఇప్పుడు ప్రారంభం కాబోతున్న కొత్త కార్యక్రమానికి రమ్య క్రిష్ణ, పోసాని క్రిష్ణ మురళిలు నిర్ణేతలుగా వ్యవహరించబోతున్నారు.మరి ఈ కొత్త హాస్య కార్యక్రమం జబర్దస్త్ కి ధీటుగా నిలుస్తుందో లేక చతికిల పడుతుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/సినిమా-ప్రచారంలో-మోదీ-కి-17522/ | దాదాపుగా 40 రోజుల నుంచి దేశంలో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు స్మరించుకుంటూనే వున్నారు. ఆయన నల్ల ధనం అరికట్టటానికి వేస్తున్న అడుగు అంటూ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో యావత్ భారత దేశం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి ఐయ్యింది. అయితే ఈ చర్య బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ని కూడా కదిలించింది. పీకే చిత్రం తరువాత ఏడాది కాలం రెస్లర్ పాత్ర కోసం శరీరాన్ని సిద్ధం చేసుకోవటానికి, మరో ఏడాది పాటు దంగల్ చిత్రీకరణకు గడిపిన ఆమిర్ ఖాన్ ఇప్పుడు ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో నిర్విరామంగా పాల్గొంటున్నాడు.ఈ నెల 23 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న దంగల్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమిర్ ఖాన్ మీడియా కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సినిమాకి సంబంధించిన కబుర్లతో పాటు ఇతర ముఖ్య విషయాలను కూడా ప్రస్తావించాడు ఆమిర్ ఖాన్. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్య ను సమర్ధిస్తూ, "ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయానికి నేను ఏ మాత్రం ఇబ్బందికి గురి అవలేదు. నా దగ్గర నల్ల ధనం లేకపోవటమే ఇందుకు కారణం. పన్నులు సక్రమంగా కట్టిన వారికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అధిక ఆదాయం కలిగి ఉండి పన్నులు చెల్లించని వారిపై కఠినంగా వ్యవహరించడంలో ఎంత మాత్రం తప్పు లేదు. కరెన్సీ కష్టాలలో సామాన్య ప్రజానీకం అవస్థ పడుతున్నప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా నరేంద్ర మోదీ కే మద్దతు పలుకుతాను. అయితే నేను దేశ ఆర్ధిక వ్యవస్థను బుర్రకెక్కించుకోగల ఆర్ధిక వేత్తను కాదు. అయినప్పటికీ ఈ చర్య దేశం ఉన్నత స్థాయి వైపు అడుగులు వేయటానికి దారి చూపగలుగుతుంది అని నమ్ముతున్నాను." అంటూ మినీ పొలిటికల్ స్పీచ్ తో సినిమా ప్రచార కార్యక్రమంలోనే నరేంద్ర మోదీ ని ప్రశంసలతో ముంచేశాడు ఆమిర్ ఖాన్. |
https://www.telugupost.com/politics/what-extent-will-new-governor-coming-to-telangana-will-cooperate-with-government-has-now-become-hot-topic-politically-1526308 | తెలంగాణకు కొత్త గవర్నర్ రానున్నారు. ఇంకా ఎవరు అన్నది తెలియకున్నా.. తెలంగాణకు రానున్న కొత్త గవర్నర్ ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణతో గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గా కూడా ఆమె రాజీనామా చేసి రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపిన తమిళి సై తమిళనాడుకు వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్త గవర్నర్ ను నియమించాల్సి ఉంది. అయితే కొత్త గవర్నర్ ఈ ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తారన్నది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే తమిళి సై మాత్రం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించారనే అనుకోవాలి.గత ప్రభుత్వంతో అమితుమీ అంటూ...గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, రాజ్‌భవన్ కు మధ్య అస్సలు పొసిగేది కాదు. కేసీఆర్ రాజ్‌భవన్‌కు కూడా అత్యవసర సమయాల్లో తప్ప వెళ్లే వారు కాదు. హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం సమయంలోనే ఆయన రాజ్‌భవన్ కు వెళ్లేవారు. ఇక మంత్రులు కూడా రాజ్‌భవన్ వైపు చూసేవారు కాదు. అప్పటి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగాన్ని కూడా లేకుండా కేసీఆర్ మరింత దూరాన్ని పెంచుకున్నారు. ఇక శానసమండలి సభ్యుల నియామకాల్లోనూ, వివిధ ఫైళ్లను ఆమోదించి పంపడంలోనూ ఆమె ఆలస్యం చేసే వారు. చివరి మంత్రి వర్గ సమావేశంలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించినా దానిని తిరస్కరించిన తమిళి సై తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన జాబితాను ఓకే చెప్పారు.ప్రస్తుత ప్రభుత్వం సత్సంబంధాలు...రాజ్‌భవన్ తో రేవంత్ రెడ్డి కొంత సత్సంబంధాలు నడిపేవారు. గత ప్రభుత్వంలో తలెత్తిన ఇబ్బందులు రాకూడదని ఆయన తొలి నుంచి గవర్నర్ కు కొంత అనుకూలంగానే వ్యవహరించే వారు. గవర్నర్ కూడా పెద్దగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేవారు కాదు. కానీ తమిళి సై సౌందర్ రాజన్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాని భావించి గవర్నర్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడంతో కొత్త గవర్నర్ నియామకం అనివార్యమయింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం... కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కార్. అందుకే కాంగ్రెస్ నేతల్లో కొంత బెరుకు... భయం పట్టుకుంది. పొరుగున ఉన్న తమిళనాడు తరహాలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే గవర్నర్ వస్తే ఎలా అన్న ఆందోళన మాత్రం ప్రభుత్వ పెద్దల్లో ఉంది.కొత్త గవర్నర్ సహకరిస్తే సరి...సహజంగానే కొత్తగా వచ్చే గవర్నర్ కొంత ప్రభుత్వానికి సహకరించకపోవచ్చన్న టాక్ మాత్రం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎవరు వచ్చినా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందేనని కొంత సర్దిచెప్పుకున్నా.. ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించడం..తో పాటు కొర్రీలు వేయకుండా ఉండే గవర్నర్ రావాలని ప్రస్తుత ప్రభుత్వం కోరుకుంటుంది. కానీ అంతా అనుకున్నట్లు జరిగితే ఇక రాజకీయాలు ఎలా అవుతాయి? అందుకే రాజ్్‌భవన్, శాసనసభ మధ్య రానున్న కాలంలో ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొంత కాలం గడిస్తే కాని ఈ సందేహాలకు సమాధానం దొరకదు. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే. |
https://www.telugupost.com/movie-news/dil-raju-sentiment-2-173086/ | దిల్ రాజు ఖచ్చితంగా సంక్రాంతికి సినిమా విడుదల చెయ్యడం హిట్ కొట్టడం అనేది చాలాసార్లు చూసాం. ఎక్కువగా దిల్ రాజుకి సంక్రాతి సెంటిమెంట్ ఉంటుంది. పెద్ద సినిమాలున్నా దిల్ రాజు ఏ మాత్రం లెక్క చెయ్యడు. అయితే చాలా సినిమాలు కరోనా కి భయపడి ప్రస్తుతం విడుదల చెయ్యాల్సిన సినిమాలన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటుంటే దిల్ రాజు మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉండడంతో అందరిలో అనుమానాలు. దిల్ రాజు సెంటిమెంట్ వదిలేశాడా? అని. అదే పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా సెట్స్ మీదకి రాలేదు.. మనం సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేస్తే ఇరుక్కుంటామేమో అనే ధ్యాసలో దిల్ రాజు కామ్ అయ్యాడు. కానీ వకీల్ సాబ్ షూట్ కోసం పవన్ నిన్ననే సెట్స్ మీదకి ఎంటర్ అయ్యాడు. అంటే మరో 20 రోజుల్లో వకీల్ సాబ్ షూట్ మొత్తం ఫినిష్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కి మరో నెల రోజులు. అంటే సంక్రాంతికి పక్కాగా వకీల్ సాబ్ రెడీ. మరి దిల్ రాజు ఇంకెందుకు ఆగుతాడు వకీల్ సాబ్ ని తన సెంటిమెంట్ ప్రకారం సంక్రాంతికే విడుదల చేస్తాడు. ఎంతమంది ఎన్ని సినిమాలు వదిలినా వకీల్ సాబ్ హిట్ అవడం పక్కా. అందులో తనకి సెంటిమెంట్ ఉండనే ఉంది. అందుకే దిల్ రాజు ఇక ఆలస్యం చెయ్యకుండా వకీల్ సాబ్ డేట్ ని ప్రకటించడానికి రెడీ అవడం ఖాయమంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/collections-centres-in-tollywood-93492/ | ప్రతి శుక్రవారం సినిమా ప్రేమికులకు పండగే. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యడానికి ప్రతివారం కొత్త సినిమాలు వస్తుంటాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ హడావిడే వేరు. మొదటిరోజు, మొదటి షో చూసేయాలన్న ఆరాటం అభిమానులదైతే, మొదటి వారం వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్‌లో సినిమా వేసి కలెక్షన్లు కొల్లగొట్టెయ్యాలన్న ఆలోచన నిర్మాతలది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమా ఎన్ని థియేటర్స్‌లో 50 రోజులు ఆడింది...? ఎన్ని సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకుంది...? వంటి ఫిగర్స్ అభిమానుల మధ్య గొడవ రేపేది.కలెక్షన్ ఫిగర్ మాత్రమే.....ఇప్పుడు ట్రెండ్ మారిపోయి సెంటర్స్ స్థానంలో కలెక్షన్ ఫిగర్స్ వచ్చి చేరాయి. ఎప్పుడైతే 'బాహుబలి' సిరీస్ 2000 కోట్లు కలెక్ట్ చేసిందో అప్పటి నుంచి ఆ ఫిగర్స్ జోలికి వెళ్ళకుండా నాన్ బాహుబలి రికార్డ్ పేరుతో స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ ఎవరికి తోచింది వారు ప్రకటించేసుకుంటున్నారు. ఒకరు 100 కోట్లు వేశారని, మరొకరు 150 కోట్లు కలెక్ట్ చేసిందంటూ పేపర్ లెక్కలు చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ బెడద మరింత పెరిగింది. ఈమధ్య విడుదలైన ఓ స్టార్ హీరో సినిమా టాక్ పరంగా వీక్ అయినా కలెక్షన్స్ ఇరగదీసేస్తోందంటూ నిర్మాత ప్రకటించేసుకుంటున్నాడు. వచ్చిన కలెక్షన్‌కి రెండింతలు వేసుకొని యాడ్స్ ఇచ్చేస్తున్నారు.త్వరలోనే 200 కోట్లు అంటూ.....త్వరలోనే ఆ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసిందనే ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కంటెంట్‌ని పట్టించుకోకుండా కలెక్షన్‌పైనే దృష్టి పెడుతున్న ఇలాంటి నిర్మాతలు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఇకనైనా కాంబినేషన్‌ని పక్కన పెట్టి విషయం ఉన్న సినిమాలు తీస్తే నిర్మాతలకు మంచిది. జనం కూడా నిజంగా ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే విషయంలో ఒక క్లారిటీకి వస్తారు. |
https://www.telugupost.com/crime/woman-jumps-into-well-with-4-children-comes-out-with-eldest-daughter-3-children-died-1469129 | క్షణిక ఆవేశంలో కొందరు చేసే పనులతో కొన్ని జీవితాలు అర్థంతరంగా ముగిసిపోతాయి. ఇది కూడా అలాంటి ఘటనే. భర్తతో గొడవ జరగడంతో మనస్తాపంతో నలుగురు పిల్లలతో కలిసి బావిలో దూకింది ఓ మహిళ. తీరా దూకేశాక బతుకుపై ఆశపుట్టి బావిలోకి వేలాడుతున్న తాడు సహాయంతో పెద్దబిడ్డను తీసుకుని పైకి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ జిల్లాలో జరిగిందీ ఘటన.భర్తతో జరిగిన గొడవతో తీవ్రమనస్తాపం చెందిన ప్రమీలా.. ఇక బ్రతకకూడదు అనుకుంది. తానులేకుండా తన నలుగురు పిల్లలు కష్టాలుపడతారని భావించి వాళ్లను కూడా తనవెంటే తీసుకెళ్లాలనుకుంది. ఇంటికి సమీపంలో ఉన్న బావివద్దకు వెళ్లి.. ముందు నలుగురు పిల్లల్నీ బావిలోకి తోసేసింది. బతుకుపై ఆశపుట్టి బావిలోకి వేలాడుతున్న తాడు సహాయంతో పెద్దబిడ్డను తీసుకుని పైకి వచ్చింది. మిగతా ముగ్గురు పిల్లలూ బావిలోనే ఉండిపోయారు. ఆ ముగ్గురిని కాపాడే సరికి కన్నుమూశారు. మృతుల్లో 18 నెలల కుమారుడు, 3, 5 సంవత్సరాల ఇద్దరు కూతుర్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. ప్రమీల, ఆమె కుమార్తె పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు. |
https://www.telugupost.com/crime/dr-macharla-radha-murder-mystery-solved-by-ap-police-1489290 | కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో హత్యకు గురైన డాక్టర్ మాచర్ల రాధ మర్డర్ మిస్టరీ వీడింది. పిల్లల వైద్య నిపుణుడైన ఆమె భర్త లోక్‌నాథ్ మహేశ్వరరావే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. అతడితో పాటు రాధ హత్యకు సహకరించిన కారు డ్రైవర్ మధును కూడా అదుపులోకి తీసుకున్నారు. రూ. 25 కోట్ల విలువైన ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలే ఆమె హత్యకు కారణమని విచారణలో తేలింది.మహేశ్వరరావు ఆస్తులను పోగొట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు. 15 ఏళ్లుగా తన వద్ద నమ్మకంగా డ్రైవర్‌గా, అటెండర్‌గా పనిచేస్తున్న మధుకు బంగారం, నగదు ఆశ చూపి ఈ హత్యకు ఒప్పించాడు. అనంతరం పక్కా ప్రణాళిక ప్రకారం గత నెల 25న రాధను చంపేశారు. రెండో అంతస్తులో ఒంటరిగా ఉన్న రాధ వద్దకు వెళ్లిన డ్రైవర్ మధుతో కలిసి భర్త లోక్‌నాథ్ వెళ్లాడు. మధు ఆమెను పట్టుకోగా భర్త ఆమె తల వెనక నుంచి ఆయుధంతో దాడిచేసి చంపేశాడు. పోలీసు కుక్కలకు దొరక్కుండా మధు ఆ ప్రదేశం మొత్తం కారం చల్లాడు. ఇంట్లో దొంగతనం జరిగిందని నమ్మించేందుకు ఆమె నగలు లేకుండా చేశారు. ఏమీ ఎరగనట్టు కింది అంతస్తులోని ఆసుపత్రికి వచ్చి రోగులకు ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. 10.30 సమయంలో పోలీసులకు సమాచారం అందించాడు. భార్య చనిపోయిందన్న బాధ ఆయనలో కనిపించకపోవడంతో అనుమానించిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపడంతో అసలు విషయం బయటపడింది.రాధ హత్య కేసులో A-1 ముద్దాయి మృతురాలి భర్త డాక్టర్ మహేశ్వరరావు అని తెలిపారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కారణంగా డ్రైవర్ జనార్ధన్ అలియాస్ మధుతో కలిసి డాక్టర్ మహేశ్వరరావు భార్యను హత్య చేసేందేకు ప్రణాళిక సిద్ధం చేశారని వెల్లడించారు. జూలై 25న సాయంత్రం గ్యాస్ సిలిండర్ మూతలు ఓపెన్ చేసే రెంచ్ తో డ్రైవర్ మధు మృతురాలు మాచర్ల రాధ చేతులు వెనక్కి విరచి పట్టుకోగా భర్త డాక్టర్ మహేశ్వరరావు నాలుగు సార్లు బలంగా భార్య తలపై కొట్టగా ఆమె స్పృహతప్పి పడిపోయారని చెప్పారు.అనుమానం వచ్చి మళ్ళీ చనిపోయే వరకు ఆమెను కొట్టారు. కారంను సైతం హత్య స్థలానికి ఒక కిలో మీటరు దూరంలో కొనుగోలు చేసి తీసుకొచ్చినట్టు విచారణలో బయటపడినట్లు చెప్పారు. |
https://www.telugupost.com/movie-news/మిల్కీ-బ్యూటీ-కి-నిరూపిం-15073/ | యువ స్టార్ హీరోస్ అందరితో ఆడి పాడిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బాలీవుడ్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి తహతహలాడి ఎంత వేగంగా వెళ్లిందో అంతే వేగంగా బాలీవుడ్ నుంచి వైఫల్యాలతో వైదొలిగింది. అయితే తమన్నా కి బాలీవుడ్ అధిక పారితోషికాల విషయంలో ఉపయోగపడింది. ఇక్కడి పారితోషికాల కన్నా హిందీ లో పారితోషికాలు ఎక్కువ ఉండటంతో చిత్రాలు ఆడకపోయినా బాగానే మూటకట్టుకుని వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక అంతటి పారితోషికాలు మన నిర్మాతలు భరించలేని పరిస్థితి. అత్యంత తక్కువ కాల్ షీట్స్తో ఎక్కువ మొత్తం సంపాదించే పనిలో పడింది కూడా అందుకే. ఇటీవల తమన్నా ఐటెం సాంగ్స్ లో మెరవటానికి, ప్రైవేట్ వేడుకలలో చిందులు వేయటానికి ఇదే కారణం.పారితోషికాల మాటున తమన్నా అభినయం మరుగున పడిపోయింది కానీ, ఊసరవెల్లి లాంటి కమర్షియల్ హీరో సినిమాలోనూ తమన్నా తన నటనతో మెప్పించగలిగింది అంటే సాధారణ విషయం కాదు. అటువంటి పాత్రలకు విమర్శకుల ప్రశంసలు ఎన్నో అందుకుంది తమన్నా. ఇటీవల అభినేత్రి చిత్రంతో నటనకు ఆస్కారం వున్న పాత్ర దక్కినప్పటికీ ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. అయినప్పటికీ తమన్నా తన పూర్వ వైభవం కథానాయికగా తిరిగి తెచుకోవటానికి ఒక సదావకాశం దక్కింది. బాలీవుడ్ లో కంగనా రనౌత్ ని విజయ శిఖరాల పై నిలిపిన క్వీన్ చిత్ర తెలుగు తమిళ రీమేక్ కు తమన్నా ఎంపిక ఐయ్యింది. కథానాయిక పాత్ర చుట్టూ సాగే ఈ కథలో నటించిన కంగనాకు 2013 జాతీయ పురస్కారం లభించిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. ఐటెం భామ గా మారిపోయిన తమన్నా ఈ అవకాశం ఎలా సద్వినియోగ పరుచుకుంటుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/raviteja-tiger-nageswara-rao-facing-problems-from-stuvartpuram-people-1493789 | రవితేజ (Raviteja) నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ.. 19వ శతాబ్దంలోని ఆంధ్రప్రదేశ్ స్టూవర్టుపురం ప్రాంతంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లైఫ్ స్టోరీ నేపథ్యంతో రాబోతుంది. కొత్త డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.ఈక్రమంలోనే మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాకి ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టువర్టుపురం గ్రామ ప్రజల గౌరవాన్ని, ఎరుకల సామాజికవర్గ మనోభావాలను దెబ్బతీసేలా చిత్రం తెరకెక్కుతోందని ఏపీ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు అవ్వడం, న్యాయమూర్తి సినిమా ప్రొడ్యూసర్ కి నోటీసులు పంపించడం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ వివాదం మరింత పెద్దది అయ్యింది.ఎరుకల జాతి వ్యక్తి అయిన టైగర్ నాగేశ్వర రావుని ఒక భయంకరమైన దొంగ చూపిస్తూ ఎరుకల జాతిని, స్టువర్టుపురం ఊరుని నేర రాజధానిగా చూపిస్తూ గ్రామా ప్రజలను అవమానపరిచేలా సినిమాని తెరకెక్కిస్తున్నారని ఎరుక జాతి వ్యక్తులు, స్టువర్టుపురం గ్రామ ప్రజలు విజయవాడలో నిరాహార దీక్షని మొదలుపెట్టారు. సినిమా తీసేముందు ఎరుకల జాతి వారిని, గ్రామా ప్రజలని చిత్ర యూనిట్ సంప్రదించలేదని, చిత్రం వల్ల తమకి ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు.టైగర్ నాగేశ్వరరావు మూవీ చిత్రకరణను ఆపేయాలి, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్యతో టైగర్ నాగేశ్వరరావుకి తీవ్ర ఇబ్బంది ఎదురయ్యినట్లు అయ్యింది. మరి మూవీ టీం ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ ఈ మూవీలో నటిస్తున్నారు. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. |
https://www.telugupost.com/movie-news/క్రొయేషియాలో-చిరు-సెల్ఫీ-13426/ | చిరు 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 ని ఎలాగైనా 2017 సంక్రాంతి బరిలో నిలపడానికి ప్రొడ్యూసర్ రామ్ చరణ్, డైరెక్టర్ వి.వి.వినాయక్, హీరో చిరంజీవి శతవిధాలా కృషి చేస్తున్నారు. అందుకే విరామం లేకుండా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఖైదీ చిత్ర షూటింగ్ స్లోవేనియా, క్రోయేషియా దేశాల్లో జరుపుకుంటుంది. ఇక ఈ షూటింగ్ కి సంబందించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసున్నాయి. ఈ పిక్స్ ని చిరు పెద్ద కూతురు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తన తండ్రి తో సెల్ఫీ దిగిన ఫోటోని, ఖైదీ సాంగ్ షూట్ చేసిన వీడియో పిక్స్ ని సుస్మిత పోస్ట్ చేసింది. ఇక ఇప్పటికే చిరు 150 వ చిత్ర హీరోయిన్ కాజల్ తన టీమ్ తో ఉన్న కొన్ని ఫొటోస్ ని పోస్ట్ చేసింది. అయితే చిరు కూతురు సుశ్మిత ఈ ఖైదీ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది. ఇక ఈ ఫోటొస్ని పోస్ట్ చేసిన సుశ్మిత ఖైదీ షూటింగ్ చెయ్యడానికి ఇంతకన్నా మంచి లొకేషన్ దొరకదేమో అని ట్వీట్ చేసింది. షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అంతేకాకుండా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసుకుని పబ్లిసిటీ పనుల్లోకి దూకాలని చూస్తోంది. |
https://www.telugupost.com/movie-news/శర్వాతో-సాయి-పల్లవి-49441/ | శతమానంభవతి, మహానుభావుడు చిత్రాలతో ఈ సంవత్సరం విజయాల్ని అందుకున్న శర్వానంద్ తన తదుపరి చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆ చిత్రం పూర్తి కాగానే శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నాడు. అయితే శర్వానంద్ - హను రాఘవపూడి తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా సాయి పల్లవి ఎన్నికైందని సమాచారం. ‘ఫిదా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి.. ఆ చిత్రంతో తిరుగులేని హిట్ అందుకుని... ప్రస్తుతం నానితో ‘ఎమ్.సి.ఏ’ చిత్రంలో నటిస్తుంది. ఆ చిత్రం డిసెంబర్ చివర్లో విడుదల కానుంది.లవ్ స్టోరీతో...ఇక ఈ సంవత్సరం ‘లై’ చిత్రంతో దెబ్బతిన్న హను రాఘవుడి తరువాతి చిత్రంగా తనకు కలిసొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ నే ఎంచుకున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రానికి సంబందించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర బృందం నేపాల్ కు వెళ్లనుందట. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/భలే-స్పీడుగా-ఉంటాడే-36816/ | 'జై లవ కుశ' మొదటి 'జై' టీజర్ వచ్చేసింది. 'జై' టీజర్ తో ఎన్టీఆర్ దుమ్ము దూలపడం స్టార్ట్ చేసాడు. బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న 'జై లవ కుశ' చిత్రం టీజర్స్ ని మూడు భాగాలుగా విడుదల చేస్తున్నారు చిత్ర టీమ్. 'జై' గా ఒక టీజర్ ఆల్రెడీ వచ్చేసింది. ఇక 'లవ, కుశ' టీజర్స్ రావాల్సి వుంది. ఒక్క 'జై' టీజర్ తోనే ఎన్టీఆర్ విలనిజాన్ని పీక్ స్టేజ్ లో పరిచయం చేసాడు డైరెక్టర్ బాబీ. అందులోని ఎన్టీఆర్ డైలాగ్ కి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈ టీజర్ ని తిలకించిన ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా పేరున్న జక్కన ఈ టీజర్ పై ఒకట్వీటేసాడు. తనకు టీజర్ ఎంత నచ్చిందో తన మనసులోని మాటను ట్విట్టర్ లో పెట్టాడు రాజమౌళి. జై టీజర్ తోనే సినిమాకి పబ్లిసిటీ ప్రారంభిచేసావ్ అంటూ.... తారక్ టీజర్ చాలా బాగుంది. సూపర్... ఓ రకంగా సినిమాకు ఇలా ప్రచారం ప్రారంభించేశావ్.. సూపర్ అంటూ స్పందించాడు. మరి టీజర్ ని అలా విడుదల చేసారో లేదో రాజమౌళి ఇలా దాని గురించి స్పందించడం చూస్తుంటే ఆయన ఇతర సినిమాల విశేషాలను ఎంత దగ్గరాగా వాచ్ చేస్తున్నాడో కదా అంటున్నారు.మరి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి 'జై' టీజర్ పై స్పందించాడు అంటే సినిమాపై ఇంకెన్ని అంచనాలు పెరిగిపోతాయో అంటూ ఎన్టీఆర్ అభిమానులు అపుడే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసేసారు. ఇక ఒక్క టీజర్ కే రెస్పాన్స్ ఈ రేంజ్ లో ఉంటె ఇంకో రెండు టీజర్స్ విడుదల చేస్తే ఈ 'జై లవ కుశ'కు ఇప్పున్న క్రేజ్ 100 రేట్లు పెరిగిపోతుంది అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/mehreen-pantham-77021/ | ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మంచి హిట్స్ అందుకున్న మెహరీన్ కౌర్ తన బరువు కారణంగా సూపర్ హిట్ సినిమాల్లో అవకాశాలు కోల్పోయింది. ఆమె లావు కారణంగా దర్శకనిర్మాతలు ఆమెని తమ సినిమాల్లో తీసుకోవడానికి వెనకాడుతున్నారు. కాకపోతే ప్రస్తుతం మెహ్రీన్ కౌర్ వర్కౌట్స్ గట్రా చేసి నాజూగ్గానే తయారైంది. ఇక రాజా ది గ్రేట్ సినిమా నుండి గ్లామర్ డోస్ కూడా పెంచింది. అయినా ఆమెకి మరీ ఎక్కువగా అవకాశాలు మాత్రం రావడం లేదు. కానీ బాగా బొద్దుగా ఉండి... సన్నగా నాజూగ్గా తయారైన రాశి ఖన్నా మాత్రం మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం మెహరీన్ కూడా ట్రాక్ ఎక్కినట్టే అనిపిస్తుంది.గ్లామర్ గేట్లు కూడా ఎత్తేసింది..గోపీచంద్ తో కలిసి పంతం సినిమా చేస్తున్న మెహరీన్ కి ఆ సినిమాలో హీరోని ప్రేమించమని వెంటపడే కేరెక్టర్. మరి ఈ సినిమాలో మెహరీన్ గ్లామర్ షో బాగానే ఉంది. అందాలు ఆరబొయ్యకపోతే కష్టమని భావించిందేమో అందుకే.. ఈసారి గ్లామర్ గేట్స్ ఎత్తెయ్యడానికి ఫుల్ గా ప్రిపేర్ అయినట్టుగానే కనబడుతుంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలిప్రేమలో బరువు కారణంగా వరుణ్ తేజ్ పక్కన మిస్ అయిన మెహరీన్ కౌర్ ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అదేనండి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ - వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ లో వరుణ్ తేజ్ పక్కన నటిస్తుంది.ఇద్దరికీ హిట్ అవసరమే..మరి మెహరీన్ కి పంతం హిట్ ఎంత ముఖ్యమో.. అనేది ప్రస్తుత టాపిక్. ఈ సినిమా అటు ఇటు అయితే.. ఇక అమ్మడుకి మిగిలేది ఎఫ్ 2 లో ఫ్రస్టేషన్ మాత్రమే. అందుకే ఆమెకు పంతం సినిమా హిట్ ముఖ్యం. అలాగే ఈ సినిమా తో గోపీచంద్ కూడా హిట్ కొట్టాలి. లేదంటే గోపీచంద్ కెరీర్ కూడా కష్టాల్లో పడుతుంది. చూద్దాం మెహరీన్ భవిష్యత్తుని పంతం ఏ తీరానికి చేరుస్తుంది అనేది. |
https://www.telugupost.com/movie-news/trivikrma-gave-good-importance-to-pooja-hegde-in-ala-vaikuntapuramlo-teaser-142234/ | సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురములో సినిమాల టీజర్ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. రెండు టీజర్స్ లో మహేష్ యాక్షన్ అండ్ కామెడీ పరంగా, అల్లు అర్జున్ కామెడీ అండ్ మాసివ్ లుక్ తో అదరగొట్టేసాడు. అయితే ఈ రెండు టీజర్ లో ఉన్న ప్రధాన తేడా ఏమిటి అంటే… అల వైకుంఠపురములో టీజర్ లో త్రివిక్రమ్.. హీరోయిన్ పూజ కి అన్యాయం చెయ్యకుండా 80 సెకన్ల టీజర్ లో పూజ హెగ్డే ని కూడా పెట్టాడు. గ్లామర్ లుక్స్ తో పూజ, అల్లు అర్జున్ బాస్ గా ఆకట్టుకుంది. కానీ అనిల్ రావిపూడి సరిలేరు టీజర్ లో అన్ని అంటే అందరు నటులను చూపించినా హీరోయిన్ రష్మికని చూపించకుండా దాచేసాడు. అయితే రష్మిక మీద స్పెషల్ టీజర్ అన్నప్పటికీ.. సరిలేరు టీం చడీచప్పుడు లేదు. ఇక ఇప్పుడు తాజాగా రష్మిక, అల వైకుంఠపురములో పూజ కిచ్చిన ఇంపార్టెన్స్ చూసి తెగ ఫీలవుతుందట. అంత పెద్ద సినిమా టీజర్ కట్ లో తనకి ప్లేసెలేదు కానీ.. మరో సినిమాలో పూజ ని దర్శకుడు ఎంత హైలెట్ చేసాడో కదా అని మధన పడుతుందట. ఇక రష్మిక ఫీలవడం అటుంచి… సోషల్ మీడియాలో కూడా ఆలా వైకుంఠములో పూజని చూసిన వారు.. సరిలేరు లో రష్మిక లేకపోవడంతో.. కామెడీ చేసేస్తున్నారు. |
https://www.telugupost.com/crime/siasat-managing-director-jahiruddhin-ali-khan-died-in-stampede-funeral-of-prajakavi-gaddar-1488568 | గద్దర్ అంతిమ యాత్ర లో విషాదం చోటు చేసుకుంది. గద్దర్ అంత్యక్రియల సమయంలో జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందారు. హార్ట్ స్ట్రోక్‌తోనే జహీరుద్దీన్ చనిపోయినట్టు సమాచారం.సోమవారం సాయంత్రం అల్వాల్‌లోని మహాబోధి స్కూల్లో గద్దర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇంటి నుంచి బయలుదేరిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. చివరి చూపు కోసం వేలాది మంది ఒక్కసారిగా తోసుకుని ముందుకు రావటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడ్డారు. ఈ తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.సియాసత్ వార్తాసంస్థ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గద్దర్‌కు సన్నిహితుడుగా ఉండేవారని చెబుతున్నారు. గద్దర్ ఇంటి వద్ద జహీరుద్దీన్ అలీఖాన్ కు గుండెపోటు వచ్చి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. పడిపోయిన జహీరుద్దీన్ అలీ ఖాన్‌ను స్థానికులు పక్కనే ఉన్న ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లుగా డాక్టర్ వెల్లడించారు. ఆదివారం (ఆగస్టు 6) ఉదయం జరిగిన విద్యావంతుల వేదిక సదస్సులో కూడా జహీరుద్దీన్ అలీ ఖాన్ చురుగ్గా పాల్గొన్నారు. గద్దర్ చనిపోయారని తెలుసుకున్న జహీర్ వెంటనే అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటి నుంచి గద్దర్ అంత్యక్రియలు ముగిసే వరకూ అక్కడే ఉన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి మొదలైన అంతిమయాత్ర వెంట కూడా ఆయన ఉన్నారు. అయితే మహాబోధి స్కూల్ ప్రాంగణం జనాలతో విపరీతంగా నిండిపోవడం, పోలీసులు ఎంత అదుపు చేయడానికి ప్రయత్నించినా తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఒత్తిడిలో జహీరుద్దీన్ అలీ ఖాన్ ఊపిరాడక సొమ్మసిల్లి కిందపడిపోయినట్లు తెలుస్తోంది. అక్కడి వారు సీపీఆర్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించేలోపే ఆయన చనిపోయారు. |
https://www.telugupost.com/movie-news/మొత్తం-మీద-ఐదు-నిమిషాల-ని-56076/ | అజ్ఞాతవాసి వాసి చిత్రం ప్రథమార్ధం లో ఇద్దరు హీరోయిన్స్ తో వచ్చే హీరో రొమాంటిక్ ట్రాక్ మరియు హీరో పవన్ కళ్యాణ్ నంగి గా కనపరిచే హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకి విరక్తి కలిగిస్తుండటంతో సినిమా నిడివి బాగా ఎక్కువ గా అనిపిస్తుంది. మరో వైపు చిత్రం విడుదల నుంచి ఊరిస్తున్న విక్టరీ వెంకటేష్ అతిధి పాత్ర పోషించిన సన్నివేశం జోడించటానికి దర్శక నిర్మాతలకి ఈ నిడివి ప్రధాన సమస్యగా మారింది.వెంకీ నటించిన సన్నివేశం....ఇప్పటికే మేకింగ్ వీడియో కూడా విడుదల కావటంతో వెంకటేష్ అభిమానులు తమ అభిమాన నటుడి సన్నివేశాలు జోడిస్తే మరొకసారి అజ్ఞాతవాసి చిత్రాన్ని వీక్షించటానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే డ్రాప్ అయిన వసూళ్ల జోరు కొంత మేరనైనా పెంచటానికి ఈ మేకింగ్ వీడియో కి వస్తున్న క్రేజ్ సహకరిస్తుంది అని నమ్ముతున్న నిర్మాతకి వెంకటేష్ నటించిన సన్నివేశం జోడించక తప్పని పరిస్థితి. దానితో అజ్ఞాతవాసి చిత్ర నిడివి నుంచి 12 నిమిషాల నిడివిని ట్రిమ్ చేసి ఇప్పుడు వెంకీ కనిపించే సన్నివేశం 7 నిమిషాల 26 క్షణాల నిడివిని జోడించారు. ఈ లెక్కలన్నీ చూస్తే అజ్ఞాతవాసి చిత్ర నిడివి 5 నిమిషాలు తగ్గించబడింది. |
https://www.telugupost.com/movie-news/saira-is-a-two-week-collections-137064/ | నిర్మాత రాంచరణ్, హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా రెండు వారాల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. ఏరియా షేర్ (కోట్లలో) నైజాం 31.71 సీడెడ్ 18.64 నెల్లూరు 4.41 కృష్ణ 7.29 గుంటూరు 9.42 వైజాగ్ 15.76 ఈస్ట్ గోదావరి 8.92 వెస్ట్ గోదావరి 6.39 టోటల్ ఏపీ & టీస్ షేర్ 102.54 |
https://www.telugupost.com/movie-news/sushant-singh-ria-chakravarthi-154918/ | బాలీవుడ్ లో చాలామంది డేటింగ్ చేస్తున్నప్పటికీ మా మధ్యన ఏం లేదు అని చెప్పినట్టుగానే… మరో బాలీవుడ్ జంట తాజాగా ఆ హీరో మధ్యన నా మధ్యన ఏం లేదు అంటుంది. సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ – రియా చక్రవర్తిలు చాల రోజులుగా చట్టాపట్టాలేసుకుని.. రెస్టారెంట్స్ లకు, వెకేషన్స్ కి వెళుతూ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. చాలా రోజులుగా ఇలాంటి వార్తలొస్తున్నప్పటికీ.. అటు రియా కానీ ఇటు సుశాంత్ కానీ పెదవి విప్పలేదు. అయితే తాజాగా రియా చక్రవర్తి.. తన లవ్ మేటర్ పై స్పందించింది. అదేమిటంటే.. సుశాంత్ తనకి మంచి స్నేహితుడని, సుశాంత్ కి నాకు మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ వస్తున్న వార్తలపై తనకేమి బాధ కలగలేదని, ప్రజల దృష్టి అంతా.. సెలబ్రిటీస్ మీదనే ఉంటుంది అని, సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని వారు చాలా ఆత్రుత చూపుతారని, ఎదుట వారి లైఫ్ లో ఏం జరుగుతుందో అనేది వాళ్ళు తెలుసుకుని ఆనందం పొందుతారని, అలాంటి వారు చెప్పే అబద్దాల వలన బాధపడాల్సిన అవసరం లేదని చెబుతుంది రియా. ఇక సినిమా లైఫ్ చాలా బావుంది అని చెప్పిన రియా చక్రవర్తి అసలు సినిమాల్లోకి రావాలని అనుకోనేలేదట. కానీ వచ్చాక మాత్రం తనని తాను నిరూపించుకోవాలని కసి పెరిగింది అని చెబుతుంది. |
https://www.telugupost.com/telangana/minister-harish-rao-challenges-union-minister-nirmala-sitharaman-1436822 | తెలంగాణలో టీఆర్ఎస్.. బీజేపీ నడుమ మరోమారు మాటల యుద్ధం మొదలైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై గులాబీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బాన్సువాడ పర్యటనలో రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో మోదీ ఫొటో లేకపోవడాన్ని నిర్మల తీవ్రంగా తప్పుబట్టారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్ర వాటానే ఎక్కువని.. అలాంటప్పుడు ప్రధాని ఫొటో ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. కామారెడ్డి కలెక్టర్‌కు క్లాస్ కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారడంతో టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. నిర్మలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు నిర్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు అబద్ధాలు చెప్పే పార్టీ బీజేపీ అని.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు అబద్ధాలు మాట్లాడి వెళ్లిపోతున్నారని ఆయన అన్నారు. రేషన్ షాపులో ప్రధాని ఫొటో పెట్టాలనడం హాస్యాస్పదమన్నారు. దేశాన్ని పోషిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని.. కేంద్రాన్ని, కొన్ని రాష్ట్రాలను ఆదుకుంటున్నామని అక్కడ కేసీఆర్ ఫొటో పెట్టాలని అడిగితే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్‌లో చేరలేదని నిర్మల చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని హరీశ్ సవాల్ విసిరారు. |
https://www.telugupost.com/crime/ed-has-issued-notices-to-chikoti-praveen-and-madhavareddy-who-are-doing-hawala-business-abroad-by-running-casinos-1381305 | క్యాసినోలను నిర్వహించడం ద్వారా విదేశాలకు హవాలా వ్యాపారం చేస్తున్న చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం తమ కార్యాలయానికి వచ్చి హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. క్యాసినోలను విదేశాలను నిర్వహిస్తూ వీరిద్దరూ హవాలా ద్వారా సొమ్మును తరలిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈరోజు తెల్లవారు జాము వరకూ వారి ఇళ్లల్లో ఈడీ సోదాలు జరిపింది.ఎమ్మెల్యే స్టిక్కర్ తో...ప్రముఖులు, సెలబ్రిటీలతో చీకోటి ప్రవీణ్ కు సంబంధాలున్నాయని సోదాలు గుర్తించారు. నేపాల్ లో జరిపిన క్యాసినోలకు సినీ తారలను కూడా రప్పించారని కనుగొన్నారు. వారికి చెల్లించిన మొత్తంపై ఆరా తీశారు. మరో వైపు మాధవరెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. అయితే మాధవరెడ్డి వాహనానికి మంత్రి మల్లారెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ వాడుతుండటాన్ని గమనించిన అధికారులు దానిపై కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. మల్లారెడ్డి మాత్రం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎవరికీ స్టిక్కర్లు ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/rajashekhar-as-a-villan-101946/ | బాహుబలితో తో రాజమౌళి ఫ్యామిలీ ఎంతగా హైలెట్ అయ్యిందో.. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా అంతే హైలెట్ అయ్యాడు. రాజమౌళి కి వెన్నంటి ఉండే కార్తికేయ.. తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలు కూడా నిర్మించడం మొదలు పెట్టాడు. రాజమౌళి కున్న అదృష్టం లక్ కానీ కార్తికేయకు నిర్మాతగా కలిసిరాలేదు. తండ్రి చాటు బిడ్డగా కాకుండా తనకంటూ ఇమేజ్ ని సృష్టించుకోవడానికి తపన పడుతున్నాడు. ఇక తాజాగా పెళ్లి కొడుకు అవవడమే కాదు .. తన సొంత బ్యానర్ లో రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు అనే కొత్త కుర్రాడితో డిఫరెంట్ కాన్సెప్ట్ ఆకాశవాణి అంటూ ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.కార్తికేయ పెళ్లి ఈ నెల 31 న జరగబోతుంటే.. ఆకాశవాణి సినిమా మాత్రం జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ కోసం వెళ్లనుంది. భారీ బడ్జెట్ కాదు కానీ.. మీడియం బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమాకి కీరవాణి కొడుకు కాల భైరవ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.ఇక జనవరి నుండి మొదలవ్వబోయే ఈ సినిమాలోని విలన్ పాత్ర కోసం ప్రస్తుతం సెర్చింగ్ జరుగుతుందట. అయితే మలయాళ నటుడు మోహన్ లాల్ ని ఆకాశవాణి టీం విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నారనే న్యూస్ నడుస్తుంది. మరి జనతా గ్యారేజ్, మనమంతా సినిమాల్తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మోహన్ లాల్ ఆకాశవాణి లో విలన్ గా నటిస్తే సినిమాపై భారీ అంచనాలు పెరుగుతాయి.అయితే మోహన్ లాల్ ఒకవేళ ఆకాశవాణి లో విలన్ పాత్ర కి నో చెబితే గనక... మోహన్ లాల్ ప్లేస్ లోకి ఈమధ్యనే గరుడ వేగతో మళ్ళీ హీరోగా ఫామ్ లోకొచ్చిన రాజశేఖర్ ని ఒప్పించి విలన్ పాత్రలో చేయించాలనే ప్లాన్ లో ఆకాశవాణి టీం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి గతంలో రాజశేఖర్ తాను విలన్ పాత్రలు చెయ్యడానికి కూడా రెడీ అని చెప్పాడు. మరి మనం ఆకాశవాణి లో మోహన్ లాల్ ని చూడలేకపోతే రాజశేఖర్ ని విలన్ గా చూడొచ్చన్నమాట. |
https://www.telugupost.com/politics/a-volunteer-is-enough-to-defeat-pawan-kalyan-minister-jogi-ramesh-1485183 | ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం మాంచి కాక మీద ఉంది. వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గ్రామ వాలంటీర్లు పెద్దఎత్తున ఆందోళనలు చేసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. పవన్‌కి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయినా పవన్‌ని ఏదీ ఆపలేదు. అధికార పార్టీపై విమర్శలు చేయడం ఏమాత్రం ఆపడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ వాలంటీర్‌ను రంగంలోకి దింపుతుందని, కేవలం వాలంటీర్‌తోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పవన్‌ను ఓడించడం ఖాయమని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నియోజకవర్గ సమావేశానికి హాజరైన రమేష్.. ఈ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు స్థానికులని, స్థానిక ప్రజల అవసరాలను తీర్చడానికి నియమించబడ్డారని ఆయన అన్నారు. గ్రామ వాలంటీర్లను సంఘ విద్రోహులుగా, మహిళా ట్రాఫికర్లుగా పవన్ కళ్యాణ్ అభివర్ణిస్తున్నారని, ఇది నిజం కాదని మంత్రి రమేష్ అన్నారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని రమేష్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేసిన ఘనత సీబీఎన్‌కే దక్కుతుందని మాజీ సీఎం చంద్రబాబును విమర్శించారు. అధికారంలోకి వస్తే గ్రామ వాలంటీర్లను తొలగిస్తామని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చెబుతున్నారని మంత్రి అన్నారు.పవన్ కళ్యాణ్ కు దమ్ము ఉంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. తమకు తగినంత బలం లేకపోవడంతో టీడీపీ, జనసేన కలిసి సీఎం జగన్‌పై పోటీ చేస్తున్నాయని రమేష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని అన్నారు. వాలంటీర్లపై కొంతమంది విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. ప్రతిపక్షాల కుట్రలను అర్థం చేసుకుని తిప్పికొట్టాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ని పవన్ చదువుతున్నారని, వాలంటీర్ వ్యవస్థని అధ్యయనం చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్ల తల్లిదండ్రులు సైతం బాధ పడేలా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పవన్ అసత్యాలు పలకడం మానుకోవాలని, వాలంటీర్ల జోలికి వస్తే ఊరుకోమని ఆళ్ల నాని హెచ్చరించారు. |
https://www.telugupost.com/movie-news/కేకపుట్టిస్తోన్న-అక్షయ్-1109/ | శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా, అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న 'రోబో2.0' చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతోంది. కాగా ఈచిత్రంలో అక్షయ్‌కుమార్ ఓ సైంటిస్ట్ పాత్రను చేస్తున్నాడు. ఈ పాత్రను చాలా డిఫరెంట్‌గా రూపొందిస్తున్నారు. తనపై తానే ప్రయోగాలు చేసుకుని కాకిలాగా మారిన రూపంలో అక్షయ్ కనిపిస్తున్న పొటోలు లీక్ అయ్యాయి. అతడికి కాకి గెటప్ వేసారు. బ్లాక్ కలర్ డ్రస్, పెద్ద కనుబొమ్మలు, వెరైటీ కనుగుడ్లు, వైట్‌్ హెయిర్‌స్టైల్‌తో చూడాగానే భయం కలిగించేలా ఉంది అక్షయ్ గెటప్. ఈ లుక్ చూసిన వారందరూ షాక్‌కు గురవ్వుతున్నారు. కాగా శంకర్ సినిమా అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా అని అంటున్నారు. 'ఐ' చిత్రంలో విక్రమ్‌ను ఎలుగుబంటి గెటప్‌తో చూపించిన శంకర్ తన తాజా చిత్రం 'రోబో2.0' లో కూడా అందరు ఆర్టిస్ట్‌లను సరికొత్తగా చూపించనున్నాడని సమాచారం |
https://www.telugupost.com/movie-news/new-producers-for-indian-2-movie-120435/ | భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇండియన్ 2 సినిమాని ఎంతో గ్రాండ్ గా అనౌన్స్ చేసాడు. అయితే ఆ సినిమా అనౌన్సమెంట్ చేసాక చాలా రోజులకి దిల్ రాజు శంకర్ పెట్టే బడ్జెట్ కి భయపడి ఇండియన్ 2 నిర్మాతగా తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమాను తామే నిర్మిస్తామని శంకర్ గత చిత్రాల నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు వచ్చారు. మొదటి రెండు షెడ్యూల్స్ లైకా ప్రొడక్షన్స్ లో చిత్రీకరణ కూడా జరిగింది. అయితే శంకర్ కి లైకా వారికీ బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో ఇండియన్ 2 చిత్రీకరణ ఆగిపోయింది. మధ్యలో కమల్ మేకప్ వలన అని ఒకసారి, కాదు కమల్ హాసన్ ఎలక్షన్స్ లో బిజీగా ఉండడంతో షూటింగ్ కి బ్రేకొచ్చిందనే న్యూస్ నడిచింది. లైకా స్థానంలోకి రిలయన్స్ తాజాగా లైకా ప్రొడక్షన్స్ వారు ఇండియన్ 2 నిర్మాతలుగా తప్పుకున్నారని వార్తలోస్తున్నాయి. ఇన్ని పుకార్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నా దర్శకుడు శంకర్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. అయితే లైకా వారు తప్పుకోవడంతో.. ఇండియన్ 2ని నిర్మించమని శంకర్ రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ను సంప్రదించాడట. అయితే రిలయన్స్ వారు శంకర్ కి హామీ ఇవ్వకపోయినా.. లైకా ప్లేస్ లో రిలయన్స్ వారు ఈ సినిమాని నిర్మించే ఛాన్సెస్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక కమల్ కూడా ఈ ఎన్నికల రిజల్ట్ రాగానే ఇండియన్ 2 షూటింగ్ లో పాల్గొంటాడని.. ఈలోపు రిలయన్స్ విషయం కూడా తేలుతుందని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/sai-pallavi-rejected-ad-offer-118161/ | ఫిదా భామ సాయి పల్లవికి తాను చేసే పాత్ర నచ్చాలి. అలాగే సినిమాలో తన క్యారెక్టర్ కి ఓ రేంజ్ ఉండాలి. అలా అయితేనే ఈ పిల్ల సినిమాలు ఒప్పుకుంటుంది. లేదంటే ఒప్పుకోదు అనే ప్రచారం ఎంసీఏ, కణం సినిమాలప్పటి నుండి జరుగుతుంది. ఇక సాయి పల్లవి డామినేషన్ తట్టుకోలేక కొంతమంది హీరోలు సఫర్ అయ్యారనే ప్రచారమూ ఉంది. తాజాగా ఆమె తమిళ డైరెక్టర్ విజయ్ తో ప్రేమాయణం నడుపుతుందని అన్నారు. ఇక లైఫ్ ఇచ్చిన నిర్మాత అడిగినా తన పాత్ర నచ్చనందున సినిమా చెయ్యనని చెప్పిందని శ్రీనివాస కళ్యాణం సినిమా అప్పుడు టాక్ నడిచింది. అందులో నిజమెంతుందో తెలియదు కానీ సాయి పల్లవికి నచ్చని పని మాత్రం అస్సలు చెయ్యదు. మంచి ఆఫర్ వచ్చినా… అందుకే అమ్మాయికి పొగరెక్కువనే ప్రచారం జరుగుతుంది. డాన్సర్ గా వచ్చిన సాయి పల్లవి టాలెంట్ తో హీరోయిన్ అయ్యింది. హీరోయిన్ గా తనకంటూ ఓ క్రేజ్, ఇమేజ్ వచ్చింది. అందుకే సాయి పల్లవితో రకరకాల బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా లాక్ చేసి క్యాష్ చేసుకుందామనుకుంటే ఈ పిల్ల వినడం లేదు. సాయి పల్లవికి ఏదైనా ప్రాడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నటించడం ఇష్టం ఉండదట. అందుకే ఇప్పటివరకు ఏ ప్రొడెక్టుతో ఎలాంటి యాడ్ లోనూ సాయి పల్లవి కనిపించలేదు. తాజాగా ఓ రెండు కోట్ల ఆఫర్ ని కూడా సాయి పల్లవి కాలదన్నిందనే న్యూస్ నడుస్తుంది. ఒక ప్రముఖ ఫేస్ క్రీమ్ యాజమాన్యం సాయి పల్లవిని తమ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని.. తమ ప్రొడక్ట్స్ కి ప్రచారం చేస్తే రెండు కోట్ల పారితోషికం ఇస్తామని ఆఫర్ చేసిందట. రెండు కోట్ల ఆఫర్ ని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించిందిట. నేను మొహానికి మేకప్ వేసుకోకుండా సినిమాల్లో నటిస్తున్నాను.. అలాంటిది ఫేస్ క్రీమ్ వాడమని నేనెలా ప్రచారం చేస్తానని ఆ బిగ్ డీల్ కి నో చెప్పిందట. |
https://www.telugupost.com/movie-news/విలన్-పాత్రలకు-కూడా-సై-అ-1169/ | తెలుగు పరిశ్రమలో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న విలక్షణ నటుడు, నిన్నటితరం కామెడీ హీరో రాజేంద్రప్రసాద్. సపోర్టింగ్ రోల్స్ నుంచి హీరో స్థాయికి ఎదిగి కాలంతోపాటు మారుతూ ప్రస్తుత జనరేషన్‌లో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఇకపై నెగటివ్ రోల్స్‌లోనూ మెప్పించనున్నారని సమాచారం. రాజేంద్రప్రసాద్ ఈ సంవత్సరం కొన్ని నెగటివ్ రోల్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఓ టాప్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్‌ను కలిసి స్క్రిప్ట్ చెప్పాడని, ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత రాజేంద్రప్రసాద్ సైతం ఆ కథలోని నెగటివ్ పాత్రను చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం. ఈమేరకు త్వరలోనే ఆయన అఫీషియల్‌గా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయనున్నాడట. ఇప్పటివరకు దాదాపు అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించిన రాజేంద్రప్రసాద్ ఇకపై నెగటివ్ రోల్స్ కూడా చేయనుండటం ఆసక్తికరమైన విషయమే. |
https://www.telugupost.com/movie-news/avengers-end-game-actros-remunaration-120313/ | ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకటే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. అదే అవెంజర్స్ – ఎండ్ గేమ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి. ఈ మూవీ కలెక్షన్స్ కనీవిని ఎరుగని రీతిలో వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రికార్డుల్ని ఈ మూవీ బ్రేక్ చేస్తుంది. ఇండియాలో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. దాదాపు 8381 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 10400 కోట్లు(1.5 బిలియన్ డాలర్ల) వసూలు చేసి రికార్డు నమోదు చేసిందని ట్రేడ్ అంచనా వేస్తుంది. మరి ఇటువంటి రికార్డు బ్రేకింగ్ మూవీలో నటించిన మార్వల్ హీరోస్ ఎంత పారితోషికం అందుకున్నారో తెలియాలంటే ఇది చదవండి. రాబర్ట్ అదిరిపోయే పారితోషకం ఈ మూవీ కోసం ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుని మొదటి స్థానంలో ఉన్న హీరోగా రాబర్ట్ డౌనీ జూనియర్ పేరు మార్మోగుతోంది. క్రిటిక్స్ సైతం సినిమాలో ఇతని నటన గురించే మాట్లాడుకుంటున్నారు. ఐరన్ మ్యాన్ గా అత్యంత ప్రభావవంతమైన సూపర్ హీరోగా రాబర్ట్ నటించారని ప్రశంసించారు. గతంలో వచ్చిన ఇన్ ఫినిటీ వార్ కోసం రాబర్ట్ 521 కోట్లు(75 మిలియన్ డాలర్లు) అందుకున్నాడు. ఇప్పుడు ఎండ్ గేమ్ కోసం అంతకుమించి తీసుకున్నాడట. ఇన్ ఫినిటీ వార్ కంటే ఎక్కువ ఈయన తరువాత అతడికి దరిదాపుల్లో పారితోషకాలు లేకపోయిన కళ్లు చెదిరే పారితోషకాలు ఎవరెవరికి దక్కాయి అంటే.. స్కార్లెట్ జాన్సన్, క్రిస్ హేమ్స్ వర్త్, క్రిస్ ఇవాన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో స్కార్లెట్ జాన్సన్ ఇన్ఫినిటీ వార్ కోసం 139 కోట్లు(20 మిలియన్ డాలర్లు), క్రిస్ ఇవాన్స్ (కెప్టెన్ అమెరికా), క్రిష్ హేమ్స్ వర్త్ (థోర్) ఇన్ ఫినిటీ వార్ కోసం 139 కోట్లు(20 మిలియన్ డాలర్లు) అందుకున్నారు. ఎండ్ గేమ్ కి ఈ ముగ్గురూ అదే పారితోషికం అందుకున్నారని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇంకా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/rashmi-gautham-anthaku-minchi-movie-86027/ | నిన్న నాలుగు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. అందులో ఒక్కటి రష్మీ నటించిన 'అంతకు మించి' చిత్రం. రష్మీ అందాలని..తన తొడలని కుర్రకారులకు ఏర వేస్తూ రిలీజ్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందొ ఓ చిన్నపాటి రివ్యూలో చూసేద్దాం రండి. ఒక ఇంట్లో దెయ్యం ఉందని రుజువు చేస్తే 5 కోట్లు ఇస్తామని తెలుసుకున్న హీరో ( జై ) అతనికి తోడుగా హీరోయిన్ ( రష్మీ ) కూడా ఉంటుంది.ఈ నేపథ్యంలో తన సోదరి ఇంట్లో కొన్ని అనుకోని సంఘటనలు జరగటం గమించిన రాజు వేటను తీవ్రం చేస్తాడు. మరి ఆ ఇంట్లో దెయ్యం ఉందా లేదా అన్నది మిగతా కథ. టీజర్స్ లో చూపించినట్టు రష్మీ అందాలు తప్ప సినిమాలో విషయం ఏమి లేదు. క్లైమాక్స్ సీన్ లో మాత్రం రష్మీ నెగటివ్ షేడ్ లో ఆకట్టుకుంది. ఇక హీరో జై మాత్రం రష్మీతో సీన్స్ లో రెచ్చిపోయాడు. ఇక మిగిలిన ఆర్టిస్ట్స్ గురించి చెప్పడానికి ఏమి లేదు.ఇక డైరెక్టర్ జానీ ఈ సినిమాను తీయడం లో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ దాకా మొత్తం బోరే. సునీల్ కశ్యప్ సంగీతం కొంచం పర్లేదు అనిపించింది. ఓవర్ అల్ గా ఇది ఒక నాసిరకం చిత్రం. ఈ సినిమా కోసం మన టైం వేస్ట్ చేయడం తప్ప ఇంకా ఇంకేమి లేదు. ఒకేవేళ ఇది టీవిలో వచ్చిన చూడటం వేస్ట్. |
https://www.telugupost.com/movie-news/బాలయ్య-అభిమాని-దాడి-గాయప-56025/ | ఒకే సీజన్లో ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతున్నప్పుడు ఆ పోటీ బాక్స్ ఆఫీస్ వద్ద కనిపిస్తే అది ఆరోగ్యకరమైన పోటీ గా అభివర్ణించొచ్చు. కానీ ఆయా హీరోల అభిమానుల మధ్య శారీరక దాడి తీసే ఘర్షణలు గా మారితే ఆ పోటీ ని ఏమని చెప్పగలం? ఇలాంటి పరిస్థితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సరిహద్దులలో ఒక థియేటర్ వద్ద జరిగింది. ఇచ్చాపురానికి ఒడిశా రాష్ట్రానికి పొలిమేరలలో వున్నా ఒక థియేటర్ వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన అజ్ఞ్యాతవాసి, జై సింహ చిత్రాల ప్రస్తావనతో మొదలైన సంభాషణ బాలయ్య అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని ల మధ్య మాటల యుద్ధంగా మారి చివరికి బ్లేడ్ లతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది.బ్లేడ్లతో దాడి.....అజ్ఞ్యాతవాసి చిత్ర ఫలితం ఏమిటో ఇప్పటికే జగం ఎరిగిన సత్యం కావటంతో థియేటర్ వద్ద జై సింహ తొలి ఆట ప్రదర్శన అనంతరం వస్తున్న యావరేజ్, అబోవ్ యావరేజ్ టాక్ లేక్ సంబరపడిపోయిన బాలయ్య అభిమానులు సంక్రాంతి సింహం బాలయ్యే అంటూ నినాదాలు చేస్తూ కళ్యాణ్ అభిమానులని రెచ్చగొట్టగా ఈ పరిణామం ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యక్తిగత ఘర్షణగా మారిపోయింది. ధనపాన హరిశ్చంద్ర అనే కళ్యాణ్ అభిమాని పై చాట్ల ఫకీరు అనే బాలయ్య అభిమాని బ్లేడ్ తో దాడి చేయగా కళ్యాణ్ అభిమానికి చెవి వెనుక భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించిన పోలీస్ లు, బాలయ్య అభిమానిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేసే విషయమై ఆ ప్రాంతం ఒడిశా రాష్ట్ర పోలీస్ శాఖ పర్యవేక్షణలో వున్న కారణం చేత కేసు ని అక్కడికి బదిలీ చేశారు. |
https://www.telugupost.com/movie-news/sensation-has-created-the-first-look-of-the-romantic-movie-136975/ | మెహబూబా హీరో, పూరి జ్ఙానంద్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రొమాంటిక్ సినిమా టైటిల్ కి తగ్గట్టుగా రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ ఉంది. ఆ రొమాంటిక్ పోస్టర్ మీద కొంతమంది ఆసక్తికరంగా స్పందిస్తే మరికొంతమంది మరీ రొమాన్స్ ఎక్కువైంది. ఇప్పుడే ఆకాష్ పూరికి ఇలాంటివి అవసరమా అన్నారు. అయినా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రొమాంటిక్ సినిమా సెట్స్ లో అగ్నిప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. క్లారిటీ లేని ప్రమాదం… ఇన్‌డోర్ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటున్న రొమాంటిక్ సెట్స్ లోని ఓ బట్టకు మంట అంటుకోవడం తర్వాత ఆ మంటలు క్షణాల్లో సెట్స్ కి పాకిపోవడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాట. యూనిట్ సభ్యులు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదని తెలుస్తుంది. అయితే షూటింగ్ సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగిందా? లేదంటే షూటింగ్ ప్యాకప్ చెప్పాక జరిగిందో అనేది క్లారిటీ లేదు కానీ రొమాంటిక్ సెట్స్ లో అగ్నిప్రమాదం మాత్రం ప్రస్తుతం ఓ వీడియో రూపంలో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. |
https://www.telugupost.com/crime/two-cops-attacked-injured-while-saving-man-from-blade-attack-1378757 | ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఇద్దరు పోలీసు సిబ్బందిపై రేజర్ బ్లేడుతో దాడి చేసిన 39 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని జేజే కాలనీకి చెందిన ఎస్‌కే మసరాఫ్‌గా గుర్తించారు. సాయంత్రం 6:45 గంటలకు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు జితేందర్, ముఖేష్ ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు, నిందితులు రేజర్ బ్లేడ్‌తో మరో వ్యక్తిపై దాడి చేయడానికి వెళుతున్నాడు. ఇది చూసిన పోలీసులు.. దాడి చేయడానికి మరొక వ్యక్తి వెనుక పరిగెత్తారు. పోలీసు సిబ్బంది మసరాఫ్‌ను పట్టుకున్నారు, అయితే ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లపై నిందితుడు దాడి చేశారు. హెచ్‌సి జితేందర్ తలకు గాయం కాగా, హెచ్‌సి ముఖేష్ చేతికి గాయాలయ్యాయి. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన సాయంత్రం 6.45 గంటలకు ద్వారక పరిధిలో చోటు చేసుకుంది. డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) M హర్ష వర్ధన్ మాట్లాడుతూ, ముఖేష్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడని, జితేందర్ చికిత్స పొందుతున్నాడని.. అయితే బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. |
https://www.telugupost.com/top-stories/prathipati-pullarao-who-was-away-from-chilakaluripet-and-party-activities-for-three-years-became-active-1437170 | పార్టీ నేతలకు చంద్రబాబు ఇచ్చే వార్నింగ్ ఎంతమాత్రం పనిచేస్తుందో తెలియదు కాని కొందరైతే ఇన్నాళ్లూ పార్టీకి దూరంగా ఉన్న నేతలు మాత్రం యాక్టివ్ అవుతున్నారే చెప్పాలి. యాక్టివ్ గా లేని నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు అధినేతగా పదే పదే చెబుతున్నారు. అది ఒకరకంగా వార్నింగ్ అనే అనుకోవాలి. ఆ వార్నింగ్ లో ఆచరణ సాధ్యం ఎంత ఉందో తెలియదు కాని బాబు వీక్‌నెస్ తెలిసిన కొందరు నేతలు మాత్రం నేటికీ యాక్టివ్ కాకుండా ధీమాగానే ఉన్నారు. నియోజకవర్గాల్లో తాము తప్ప టీడీపీకి మరో దిక్కులేదన్న భావనతో ఉన్నారు.మూడు నెలల ముందు వరకూ...అలాంటి నేతల్లో ప్రత్తిపాటి పుల్లారావు ఒకరు. ఆయన మొన్నటి వరకూ హైదరాబాద్ కే పరిమితమయ్యారు. తన వ్యాపారాలను చూసుకుంటూ కాలం వెళ్లబుచ్చారు. తన నియోజకవర్గమైన చిలకలూరిపేటకు అడపా దడపా వచ్చి వెళ్లడం తప్ప ఈ మూడేళ్లలో పత్తిపాటి పుల్లారావు ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడిపారు. ఆయనపై కేసులు నమోదు చేస్తారన్న భయం కావచ్చు. ఎన్నికలకు ముందు పేటకు వచ్చి ఫైట్ చేయవచ్చన్న భావన కావచ్చు. ఆయన మొన్నటి వరకూ పార్టీని పెద్దగా నియోజకవర్గంలో పట్టించుకోలేదు. అమరావతి భూముల సేకరణలో క్రియాశీలకంగా వ్యవహరించిన తనపై ఇక్కడ ఉంటే కేసులు నమోదవుతాయని చెప్పి చంద్రబాబు నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకుని ఉండవచ్చు.మరో లీడర్....గత మూడేళ్లుగా చిలకలూరిపేటకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు మూడు నెలల నుంచి యాక్టివ్ అయ్యారు. చిలకలూరిపేటలోనే మకాం పెట్టారు. అప్పటి వరకూ నిరాశలో ఉన్న క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి అక్కడ పుల్లారావు కంటే మరో లీడర్ లేరు. వేరొకరికి టిక్కెట్ ఇచ్చే సాహసం కూడా టీడీపీ అధినాయకత్వం చేయకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రస్తుత మంత్రి విడదల రజనీని ఎదుర్కొనడానికి ప్రత్తిపాటి పుల్లారావుకు మించిన నేత మరొకరు లేరు. మొన్నటి వరకూ అదే ధీమాతో ఉన్న ఆయన చంద్రబాబు సూచనతో తిరిగి యాక్టివ్ అయ్యారంటారు.బాబు సూచనతో...తన సామాజిక వర్గానికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయం అనే ముద్ర పడటం ఇష్టం లేక ప్రత్తిపాటిని నియోజకవర్గంలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. మొన్నటి వరకూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబులు తప్ప మరెవ్వరూ యాక్టివ్ గా లేరు. చంద్రబాబు పదే పదే వార్నింగ్ ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు. పత్తిపాటి ప్రత్యేక పర్మిషన్ తో రెండున్నరేళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండగలిగారు. మిగిలిన నేతలకు ఆ అవకాశమూ లేదు. చంద్రబాబు వద్ద అంతటి చనువు లేదు. అందుకే మిగిలిన నేతలు మిన్నకుండి పోయారు. ప్రత్తిపాటి మాత్రం మూడు నెలల క్రితం పేటలో ఎంట్రీ ఇచ్చి తన సీటుకు తిరుగులేదన్న సంకేతాలను పంపుతున్నారు. నిజమే ప్రత్తిపాటిని కాదని చిలకలూరిపేటలో మరొకరికి టిక్కెట్ ఇచ్చే ధైర్యమూ ఎవరికి లేదు. ఆ స్థాయి నేత కూడా అక్కడ టీడీపీలో లేరు. ప్రచారాలను నమ్మొద్దు....కాగా ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ మారుతున్నారంటూ ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతోంది. తాడేపల్లి లోని జగన్ నివాసానికి వెళ్లినట్లుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. తనపై దుష్ప్రచారానికి కొందరు దిగుతున్నారని, క్యాడర్ ను అయోమయంలో పడేసేందుకు ఈ రకమైన ప్రచారాన్ని చేస్తున్నార్నారు. తాను పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నానని, తిరిగి పార్టీకి ఇక్కడ ఆదరణ లభిస్తుండటంతో ఓర్వలేని కొందరు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. |
https://www.telugupost.com/movie-news/varun-tej-neglegency-on-antariksham-102005/ | మరో ఐదు రోజుల్లో వరుణ్ తేజ్ నటించిన 'అంతరిక్షం' సినిమా విడుదలవ్వబోతుంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా ప్రీ రిలీజ్ బాగానే జరిగింది. 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని క్రిష్ నిర్మిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుంటే ఈ సినిమాకు సంబంధించి ఒక్క ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయలేదు టీం. ప్రమోషన్ లో ముఖ్యుడైన వరుణ్ తేజ్ ప్రస్తుతం హైదరాబాద్ లో లేదట. ఆయన ప్రస్తుతం ముంబైలో ఉన్నాడని తెలుస్తుంది. వరుణ్ తన నెక్స్ట్ మూవీ కోసం డ్రెస్ సెలక్షన్ కు ముంబై వెళ్లాడని సమాచారం. కానీ మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి అప్పటికి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చేస్తాడని అంటున్నారు.ఈ టైంలో ముంబైకి ఎందుకు..?ప్రమోషన్స్ కి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ సరిపోతుందా..? బుధ, గురు వారాల్లో సినిమాను ఏం ప్రమోట్ చేస్తారు..? అయినా వరుణ్ తన సినిమాల ప్రమోషన్ చేయకుండా ముంబై ఎందుకు వెళ్లినట్టు..? అని ప్రశ్నలు మీద ప్రశ్నలు సోషల్ మీడియాలో అడుగుతున్నారు ఫ్యాన్స్. ఈ కాలంలో ఎంత పెద్ద సినిమాకైనా ప్రమోషన్స్ చాలా అవసరం. 'బాహుబలి' లాంటి మూవీకే ప్రమోషన్స్ తప్పలేదు. మరి 'అంతరిక్షం' ఎందుకు లేట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు. |
https://www.telugupost.com/movie-news/vijay-film-with-venkatesh-92791/ | విజయ్ దేవరకొండ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మారు మోగిపోతుంది. చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ దక్కించుకున్నాడు విజయ్. విజయ్ ని పెట్టి సినిమా చేస్తే మినిమం గ్యారంటీ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే మనోడితో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు వస్తున్నారు. మన ఇండస్ట్రీ నుండే కాకుండా ఇతర భాషల నుండి విజయ్ తో సినిమా చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.కన్నడ నిర్మాతతో...రీసెంట్ గా తమిళంలో 'నోటా' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ ఓ కన్నడ నిర్మాత దగ్గర భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. చాలా రోజుల నుంచి విజయ్ కథలు వింటున్నాడు. కానీ అవి ఏవీ విజయ్ కి నచ్చడంలేదు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే తెలుగులో ‘పవర్’, ‘ఆటగదరా శివ’, రజనీకాంత్ తో లింగ లాంటి సినిమా నిర్మించిన రాక్‌లైన్ వెంకటేశ్ 'పెళ్లి చూపులు' ముందే ఓ పాత్ర కోసం విజయ్ ను సంప్రదించారు. అయితే ఆ పాత్ర చేయడం విజయ్ కు కుదర్లేదు.ఇళ్లు కట్టేందుకు డబ్బు...కానీ విజయ్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. 'పెళ్లి చూపులు' నుండి వీరు టచ్ లో ఉండటంలో విజయ్ ఇల్లు కట్టుకునే టైంలో డబ్బులు తక్కువ అయితే..ఆ సమయంలో రాక్‌లైన్ వెంకటేశ్‌కి కాల్ చేయగా, ఆయన పెద్ద మొత్తంలో పంపించారు. అయితే స్క్రిప్ట్స్ విషయంలో కొన్ని విజయ్ కు నచ్చడం లేదు, కొన్ని వెంకటేష్ కు నచ్చడం లేదు. అలా వీరి కాంబినేషన్ లో సినిమా పట్టాలు ఎక్కట్లేదు. మరి ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/ntr-baby-boy-75381/ | మొన్నీ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అమ్మాయి పుట్టింది అనే వార్త సోషల్ మీడియాలో వీర విహారం చేసింది. ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతికి మొదట అబ్బాయి అభయ్ రామ్ కాగా.. రెండోసారి అమ్మాయి పుట్టిందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరు ఖండించారు. ఎన్టీఆర్ కి అమ్మాయి పుట్టలేదని.. అసలు ఇంకా డెలివరీ అవ్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఈ సారి కూడా బాబు...ఇక తాజాగా టైగర్ ఎన్టీఆర్ మరోమారు తండ్రయ్యాడు. రెండోసారి ఆ దంపతులకి బాబు పుట్టాడు. తనకి బాబు పుట్టాడు అనే విషయాన్నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా పేజీ ద్వారా తన అభిమానులకు చేరవేసాడు. The family grows bigger. It’s a BOY! (కుటుంబం పెద్దది అయ్యింది...) అంటూ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. |
https://www.telugupost.com/movie-news/prati-roju-pandage-first-day-collections-143090/ | ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 1.25 సీడెడ్ 0.34 నెల్లూరు 0.18 కృష్ణ 0.21 గుంటూరు 0.30 వైజాగ్ 0.33 ఈస్ట్ గోదావరి 0.30 వెస్ట్ గోదావరి 0.22 టోటల్ ఏపీ & టీస్ షేర్: 3.13 |
https://www.telugupost.com/movie-news/నెలాఖరుకి-శతమానం-భవతి-13046/ | ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2017 కి విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం గోదావరి జిల్లా అమలాపురం లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం టాకీ పార్ట్ నవంబర్ 18 కి పూర్తి అవుతుంది. నవంబర్ 28 కి పాటల తో సహా షూటింగ్ పూర్తి చేసుకుని, చిత్ర బృందం హైదరాబాద్ చేరుకుంటుంది." శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. చిత్రం షూటింగ్ నెలాఖరు కి పూర్తవుతుంది. డిసెంబర్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని, జనవరి లో సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది ", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం : సతీష్ వేగేశ్న , ఎడిటింగ్ మధు , సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, సంగీతం మిక్కీ జె మేయర్, నిర్మాతలు : రాజు , శిరీష్ |
https://www.telugupost.com/movie-news/kushi-cinema-collections-three-days-kushi-cinema-collections-1493046 | విజయ్ దేవరకొండ మరోసారి సక్సెస్ బాట పట్టాడు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’ కాసుల వర్షం కురిపిస్తూ ఉంది. ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.70.23 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.30.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘ఖుషి’.. రెండు రోజుల్లో రూ.51 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక మూడు రోజుల్లో రూ.70 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రికవరీ 60 శాతం పైగా వెళ్ళింది. ఓవర్సీస్‌లో ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. ప్రీమియర్స్‌తో కలుపుకుని మూడు రోజుల్లో యూఎస్‌లో ‘ఖుషి’ 1.4 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ తో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. తన గత చిత్రాలకు భిన్నంగా శివ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు ముందు నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి హైప్ నెలకొంది. దానికి తగ్గట్లే పాటలు, ట్రైలర్ ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి. దానికి తగ్గట్లే సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ వీకెండ్ ను ఖుషీని జనం బాగా ఆదరించారు. |
https://www.telugupost.com/movie-news/ఈసారి-కొత్తగా-ట్రై-చేస్త-38097/ | సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు మొదటి సినిమా ఫలితం ఎలాగున్నా రెండో సినిమా 'అతనొక్కడే' సినిమాతో హిట్ కొట్టినప్పటినుండి మళ్ళీ ఆ రేంజ్ హిట్దే లేకపోయినప్పటికీ అలాగే ఇండస్ట్రీలో హీరోగా ట్రై చేస్తూనే మధ్య మధ్యలో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా మారిన కళ్యాణ్ రామ్ మళ్లీ పదేళ్లకు 'పటాస్' తో హిట్ కొట్టాడు. 'పటాస్' తర్వాత సిక్స్ ప్యాక్ ట్రై చేసిన 'ఇజం' సినిమా ప్లాప్ తో ఖంగుతిన్న కళ్యాణ్ రామ్ లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'మంచి లక్షణాలున్న అబ్బాయి’ చేస్తున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ షూటింగ్లో బిజీగా ఉండడమే కాకుండా తన తమ్ముడు ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' సినిమాని నిర్మిస్తున్నాడు.కొత్త దర్శకుడి ఉపేంద్ర మాధవన్ తో 'ఎమ్మెల్యే' చిత్రాన్ని చేస్తున్న కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. మరో హీరోయిన్ మనాలి రాధోడ్ కూడా ఈ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తాడని... అలాగే ఈ చిత్రంలో కొత్తదనం కోసం చిత్ర టీమ్ ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో యాక్షన్ సీన్స్ ను రూపొందిస్తున్నారట. ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తుంది చిత్ర టీమ్.అలాగే ఈ ఫైట్ రెగ్యులర్ యాక్షన్ సన్నివేశాలకు చాలా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ప్రస్తుతానికి ఈ ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ చిత్రీకరణ జరుపుకుంటుంది. |
https://www.telugupost.com/movie-news/మణి-నెక్స్ట్-సినిమాలో-49519/ | ఒక్కపుడు మణిరత్నం వేరు ఇప్పుడు మణిరత్నం వేరు. అప్పుడు వున్న ఫామ్ మణి ఇప్పుడు లేదు. ఓకే బంగారంతో ఫామ్‌లోకి వచ్చి ఈ ఏడాదే చెలియా సినిమాతో మళ్ళీ ఫామ్ కోల్పోయాడు మణి. చెలియా సినిమా చూసి చాలా మంది ఇక మణి సినిమాలు తీయకపోవడం మంచిది అని కూడా అన్నారు. అయితే ఇవేవి పట్టించుకోని మణి ఒక భారీ కాంబినేషన్లో సినిమాకు రెడీ అయ్యాడు.భారీ తారాగణం....ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన నటీనటుల వివరాల్ని ప్రకటించారు. ఇప్పుడు ఎవరు ఏ పాత్ర చేసేది కూడా వెల్లడించడం విశేషం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ (భార్య భర్తలుగా) తల్లిదండ్రులుగా నటించబోతున్నారు. అరవింద్ స్వామి, శింబు, ఫాహద్ ఫాజిల్ వారి కొడుకులుగా నటించనున్నారట. ఇప్పుఇప్పుడే స్టార్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న విజయ్ సేతుపతి ఇందులో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో కనిపిస్తాడట. ఇక జ్యోతిక, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ల పాత్రల్లో కనిపించనున్నారు.జనవరి నుంచి....ఈ సినిమా సంబంధించి షూటింగ్ కూడా జనవరి నుండి స్టార్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆస్కార్ దిగ్గజం ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందిస్తాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నాడు. మణిరత్నం ఓన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాతో అయినా పాత మణిని చూస్తామో లేదో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/ఆలస్యానికి-కారణం-అదా-37188/ | మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే మహేష్ 'స్పైడర్' చిత్రం అన్ని విషయాల్లోనూ ఎంతో నత్తనడకన సాగుతుంది. అంటే ఫస్ట్ లుక్ కానివ్వండి, టీజర్ కానివ్వండి... ఆఖరికి 'స్పైడర్' విడుదల కానివ్వండి అన్ని విషయాల్లోనూ ఏంతో నెమ్మదిగా వున్న స్పైడర్ చిత్రంపై మహేష్ అభిమానులు మాత్రం చాలా గుర్రుగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇంతిలా ఆలస్యమవడానికి ఏవేవో కారణాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒకసారి మహేష్ వల్ల షూటింగ్ లేట్ అంటారు. మరోసారి మురుగదాస్ వల్ల షూటింగ్ లేట్ అంటూ ఏవేవో గాసిప్స్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి.అయితే 'స్పైడర్' ఆలస్యానికి కారణం మాత్రం పైన చెప్పినవి కాదంటున్నారు. అసలు మహేష్ 'స్పైడర్' ఆలస్యానికి అసలు కారణం మాత్రం 'స్పైడర్' ని రెండు భాషల్లో తెరకెక్కించడమే నట. తెలుగు, తమిళంలో ఏక కాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మురుగదాస్... రెండు భాషలకు కలిపి ఒకే సీన్ చెయ్యడం లేదట. తెలుగు వెర్షన్ కి ఒక సీన్, తమిళ వెర్షన్ కి కావాల్సిన సీన్ షూట్ చెయ్యడం వలెనే ఈ చిత్ర జాప్యానికి కారణమంటున్నారు. రెండు భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ అంటే కేవలం రెండు భాషలకు డబ్బింగ్ చెప్పించేసి విడుదల చెయ్యకుండా రెండు భాషలకు రెండు సార్లు సీన్స్ షూట్ చెయ్యడంతో ఇంత లేట్ అయ్యిందంటున్నారు.మురుగదాస్ ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉండడం వలెనే సినిమా విడుదలకు ఆలస్యమైందని చెబుతున్నారు. అందుకే మహేష్ కూడా మురుగదాస్ పై ఎటువంటి ప్రెజర్ పెట్టకుండా గమ్మునుండిపోయాడట. ఇకపోతే మహేష్ 'స్పైడర్' టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల చివరిలో మరో టీజర్ తో మహేష్ అభిమానులకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందట చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రంలో మహేషుకి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 27 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/మళ్ళీ-పవన్-పాట-ఎత్తుకున్-53295/ | గతంలో దిల్ రాజు.. నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరో గా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దిల్ రాజు తో సినిమా ఏం లేదని కొట్టిపారేశాడు.ప్రస్తుతం దిల్ రాజుకి ఎనలేని విజయాలు అందుకుంటూ మాంచి ఊపుమీదున్నాడు. నిర్మాతగా ఎన్నో సాధించినా ప్రతిసినిమాని తన తొలి సినిమా ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ గానే సినిమాల్ని తెరకేక్కిస్తాడనే పేరు దిల్ రాజు సొంతం. ఇకపోతే దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన తాజా సినిమా 'ఎం.సి.ఎ'. నాని - సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 21 న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజు ఎక్కడలేని విషయాలను మీడియాతో పంచుకుంటున్నాడు. అలాగే కొత్త కొత్త విషయాలు దిల్ రాజు నుండి బయటికి వస్తున్నాయి. అందులో భాగంగానే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ... ఈ మధ్యే తాను పవన్ కళ్యాణ్‌ను కలిశానని..... మీతో కలిసి సినిమా తియ్యడం నా కోరిక అని పవన్ కళ్యాణ్ గారితో చెప్పాను అని పాత మాటే చెబుతున్నాడు.అయితే తనతో సినిమా చేసే విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక హామీ ఇచ్చాడని రాజు వెల్లడించాడు. మంచి స్క్రిప్టుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తన దగ్గరికి రావచ్చని. తన రాజకీయాలు, తన కమిట్మెంట్లు అవన్నీ సంబంధం లేకుండా తాను సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ తనకి మాటిచ్చినట్టు దిల్ రాజు చెబుతున్నాడు. సరైన సమయం వచ్చి మంచి సబ్జెక్ట్ దొరికితే పవన్ కళ్యాణ్ తో తప్పకుండా సినిమా చేస్తానని దిల్ రాజు అన్నాడు. అయితే ఇదే విషయం పవన్ తో దిల్ రాజు సినిమా అన్నప్పుడే ప్రచారం జోరుగా జరుగగా.. ఇప్పుడు దిల్ రాజు ఏదో కొత్త విషయాన్ని చెప్పినట్టుగా చెప్పడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. |
https://www.telugupost.com/movie-news/ntr-koratala-shiva-devara-movie-first-look-and-teaser-update-1512777 | యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు న్యూఇయర్ రోజున ఊహించని గుడ్ న్యూస్. ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'దేవర' సినిమాకు సంబంధించిన అప్డేట్ ను నేడు అభిమానులకు ఇవ్వనున్నారు. ఈ సినిమా గ్లింప్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అదిరే అప్‍డేట్ ఇవ్వనున్నారు. దేవర సినిమా గ్లింప్స్ గురించి అప్‍డేట్‍ను నేడు మూవీ యూనిట్ వెల్లడించనుంది. ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావటంతో దేవర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఉదయం 11 గంటల 7 నిమిషాలకు గ్లింప్స్ డేట్‍పై అనౌన్స్‌మెంట్ రానుంది. దేవర కొత్త పోస్టర్‌తో గ్లింప్స్ అప్‍డేట్‍ను మేకర్స్ ఇవ్వనున్నారు.ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా గ్లింప్స్ చాలా బాగుంటుందని ఇప్పటికే ట్వీట్ చేయడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రతీర వాసుల కోసం పోరాడే యోధుడి పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారు ఎన్టీఆర్. 2024 ఏప్రిల్ 5వ తేదీన దేవర పార్ట్-1 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో రూపొందుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, కలైయరాసన్ కీరోల్స్ చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/slipper-hurled-at-thalapathy-vijay-at-vijayakanth-funeral-video-went-viral-1512347 | లెజెండరీ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రావిడ్స్ కజగం (DMDK) అధినేత, విజయకాంత్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. విజయకాంత్‌కు నివాళులు అర్పించేందుకు ఇళయ తలపతి విజయ్ చెన్నైలోని DMDK కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కొందరు ఆయనపై (Slipper attack)దాడికి పాల్పడ్డారు. ఒకరు అతనిపై తన చెప్పు విసిరినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతుంది. విజయ్ చుట్టూ జనం గుమిగూడగా.. మధ్యలో నుంచి ఓ చెప్పు వచ్చి ఆయనకు తగిలినట్లు వీడియోలో కనిపిస్తోంది. విజయ్ దానిని పట్టించుకోకుండా కారు ఎక్కడానికి వెళ్లారు. పక్కనే ఉన్న వ్యక్తి ఆ చెప్పును అది వచ్చిన దిశలోకే విసిరేశాడు. ఈ అంత్యక్రియల్లో విజయ్ ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్న విషయం తెలియలేదు. విజయకాంత్‌కు నివాళులర్పించిన సందర్భంగా తలపతి విజయ్ కన్నీటిపర్యంతమయ్యారు. విజయకాంత్ భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు విజయ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్‌లను ఆయన ఓదార్చారు.దళపతి విజయ్ తన తండ్రి దర్శకత్వం వహించిన 'నాలయ తీర్పు'తో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ సమయంలో విజయ్‌తో ఓ సినిమాలో నటించాల్సిందిగా ఎస్‌ఏ చంద్రశేఖర్ విజయకాంత్‌ను అభ్యర్థించారు. ఏ మాత్రం భేషజాలకు పోకుండా ఆయన అంగీకరించడంతో ‘సెంధూరపాండి’లో నటించారు. 40 ఏళ్ల విజయకాంత్ ఈవెంట్‌లో 'సెంధూరపాండి' భారీ విజయాన్ని సాధించిందని ఎస్‌ఏ చంద్రశేఖర్ వెల్లడించారు. విజయకాంత్ విజయ్‌కు చేసిన సాయం చాలా పెద్దని, చేయకపోయి ఉంటే విజయ్ ఈ స్థాయిలో ఉండేవాడు కాదని అన్నారు. |
https://www.telugupost.com/movie-news/familyman-record-193831/ | పాన్ ఇండియా వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పై ఎన్ని అంచనాలు, ఎంత క్రేజ్ ఉందో.. ఆ ట్రైలర్ రిలీజ్ అవకముందు నుండే చూస్తున్నాం. రాజ్ అండ్ డీకే లు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి సీజన్ 2 పై అంచనాలు పెంచేశారు. మనోజ్ బాజ్ పేయీ ఎప్పటిలాగే అదిరిపోయే యాక్షన్ తో ఆకట్టుకోగా.. సమంత స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది అనుకుంటే పొరబాటే. ఎందుకంటే ఈ వెబ్ సీరీస్ కి బ్యాక్ బోన్ సమంత అవ్వబోతుంది కాదు.. అవుతుంది. సమంత క్రేజ్, ఆమె పాపులారిటీ ఈ వెబ్ సీరీస్ పై చాలా ఉంది. ఈ సీరీస్ కోసం కోట్లాది ప్రేక్షకులు వెయిటింగ్. రీసెంట్ గా విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ యూట్యూబ్‌లో 24 గంటల్లో.. 15 మిలియన్ల వ్యూస్, 500k లైక్స్‌ను సాధించింది. ఫ్యామిలీ మ్యాన్ క్రేజ్ దెబ్బకి నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న మీర్జాపూర్ 2 రెండో స్థానంలోకి పడిపోయింది. దానితో ఫామిలీ మ్యాన్ సీజన్ 2 ట్రైలర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. సమంత డిఫ్రెంట్ రోల్ ప్లే చెయ్యడం.. ఫామిలీ మ్యాన్ స్టోరీ నార్త్ నుండి సౌత్ చెన్నై కి షిఫ్ట్ అవడం, సీజన్1 బ్లాక్ బస్టర్ కావడంతో సీజన్ 2 పై అంతకంతకు అంచనాలు ఆసక్తి పెరిగిపోతుంది. మరి జూన్ 4 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్న ఫామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ మరిన్ని రికార్డులని క్రియేట్ చేస్తుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/sujith-clarity-on-salman-role-in-saaho-122651/ | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘సాహో’. దాదాపు 300 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా కోసం లేటెస్ట్ గా ఓ యాక్షన్ సీన్స్ కోసమే 90 కోట్ల వరకూ ఖర్చు చేశారట. ఇక సినిమాకి మరింత హైప్ తీసుకుని రావడానికి ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ కీలక రోల్ చేయించారని గత కొన్ని రోజులు నుండి వార్తలు వైరల్ అవుతున్నాయి. క్లారిటీ ఇచ్చిన సుజీత్ అయితే విషయం తెలుసుకున్న దర్శకుడు సుజీత్ స్పందిస్తూ, “ఈ సినిమా షూటింగును పూర్తి చేసేశాము. అతిథి పాత్ర కోసం సల్మాన్ ను సంప్రదిస్తున్నట్టుగా వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అసలు అలాంటి పాత్ర ఏది ఈ సినిమాలో కనిపించదు” అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో కొన్ని రోజులు నుండి వైరల్ అవుతున్న రూమర్ కి చెక్ పెట్టినట్టైంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. |
https://www.telugupost.com/movie-news/ఫైనల్-గా-ఎవరిని-తీసుకొస్-44461/ | తెలుగు బిగ్ బాస్ షో ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. మరొక్క రోజులోనే స్టార్ మా ఛానల్ లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విన్నరెవరో తేలిపోనుంది. గత 69 రోజులుగా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ బిగ్ బాస్ షోకి ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. కేవలం శని ఆదివారాల్లోనే ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వచ్చే ఈ షోలో ఫైనల్ గా ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. ఇక ఈ ఐదుగురులోనే ఫైనల్ విన్నర్ ఎవరు అనేది మరి కొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది. మరి ఇప్పటివరకు బిగ్ బాస్ షోని ఒంటి చేత్తో లాక్కొచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు గ్రాండ్ ఫినాలే కోసం ఒక గెస్ట్ ని ఈ షో స్టేజ్ మీదకి ఆహ్యానించబోతున్నారనే టాక్ వినబడుతుంది. అలాగే వారాంతాల్లో రెండు గంటల పాటు ఎన్టీఆర్ చేసే హైలెవెల్ ఎనర్జీ పెరఫార్మెన్సు ని ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో నాలుగు గంటలు ఉంటుందట.ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు బిగ్ బాస్ సీజన్ వన్ గ్రాండ్ ఫినాలే స్టార్ మాలో స్టార్ట్ కాబోతుంది. అంటే సాయంత్రం ఆరు నుండి రాత్రి 10 గంటలవరకు బిగ్ బాస్ షో ప్రసారం కాబోతుందన్నమాట. ఇక ఈ షో కోసం స్టార్ మా, ఎన్టీఆర్ కలిసి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకురాబోతున్నారని... కాదు కాదు నాగార్జున ని గ్రాండ్ ఫినాలే అతిధిగా పిలవబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి దేవిశ్రీ ప్రసాద్ అయితే తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తాడు. అలాగే నాగార్జున అయితే తన అందం, పెరఫారెమెన్స్ తో అందరిని ఆకట్టుకుంటాడు.ఇక రేపు జరగబోయే గ్రాండ్ ఫినాలే లో శివబాలాజీ బిగ్ బాస్ విన్నరవుతాడా? హరితేజ అవుతుందా? లేకపోతె వైల్డ్ కార్డు ఎంట్రీ నవదీప్ అవుతాడా? అలాగే అందమైన అర్చన విన్నర్ అవుతుందా? అది కాకపోతే ఆదర్శ్ అవుతాడా? అనే ఆసక్తితో తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ ఎనర్జీ పెరఫార్మన్స్ ని ఇక మిస్ అవుతామా అనే ఫీలింగ్ లో కూడా ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/ఇంకా-మొదలెట్టలేదు-అప్పుడ-35353/ | బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ షోని ఇప్పుడు ఇక్కడ తెలుగులో కూడా దింపబోతున్నారు.... స్టార్ మా ఛానల్ వారు. అదీ అలాగిలాగా కాకుండా స్టార్ హీరో అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ బిగ్ షో కి హోస్ట్ ని చేసి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి సిద్ధమవుతోంది. మరి బుల్లితెర మీద ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న షో కాబట్టి ఈ షో కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అయితే ఈ బిగ్ బాస్ షో బాలీవుడ్ లో సెన్సేషన్ తోపాటు చాలా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యి సక్సెస్ అయ్యింది.అయితే ఇప్పుడు టాలీవుడ్ బిగ్ బాస్ షో అంతా ముంబైలోనే బాలీవుడ్ బిగ్ బాస్ కోసం వేసిన సెట్స్ లోనే తెరకెక్కిస్తున్నారట. అలాగే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ ని కూడా ఎంపిక చేసే ఏర్పాట్లను స్టార్ మా ఛానల్ స్టార్ట్ చేసిందట. మరి ఈ షోలో ఎక్కువగా సెలబ్రిటీస్ నే తీసుకుంటారు గనక... టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీస్ కి స్టార్ మా బిగ్ బాస్ షో కోసం ఆహ్వానాలు కూడా పంపుతుందట. మరి ఈ ఆహ్వానాలను అందుకున్న వారిలో ఒక సీనియర్ హీరో కూతురు, హీరోయిన్ కోసం ప్రయత్నాలు మొదలెట్టిన ఒక డైరెక్టర్ కూతురు ఉన్నారట. అయితే ఆ సీనియర్ హీరో తన కూతురు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చెయ్యదని స్పష్టం చేసాడట. అలాగే సదరు డైరెక్టర్ కూడా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాడనే టాక్ వినబడుతుంది. టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరూ ఈ షో లో పాల్గొనడానికి సుముఖంగా లేరని తెలుస్తుంది. మరి వారు ఇంత వ్యతిరేఖత చూపడానికి కారణం బాలీవుడ్ బిగ్ బాస్ షో లో జరిగిన వివాదాలే కారణంగా చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/natural-star-nani-made-interesting-comments-on-shyam-singarai-movie-1339906 | శ్యామ్ సింగరాయ్ సినిమాపై నేచురల్ స్టార్ నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రెండేళ్ల తర్వాత కరెక్ట్ సినిమాతో వస్తున్నానని ఆయన అన్నారు. శ్యామ్ సింగరాయ్ టీజర్ రిలీజ్ సందర్భంగా నాని ఈ వ్యాఖ్యలుచేశారు. శ్యామ్ సింగరాయ్ కు మంచి టీమ్ దొరికిందన్నానరు. ఈ సినిమాలో కొత్తదనాన్ని చూపించామని, ఈ సినిమా కోసం తాను కూడా ఇంట్రస్టింగ్ గా ఎదురు చూస్తున్నానని నాని తెలిపారు.ప్రేమ కథాంశంగా....నాని హీరోగా, సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నీహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్యామ్ సింగరాయ్ మూవీ రానుంది. రాహుల్ సంకృత్యాన్ ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. ఇది ఒక ప్రేమ కధగా నాని చెప్పారు. |
https://www.telugupost.com/movie-news/ramcharan-sarwanand-184658/ | జానూ తో డీసెంట్ హిట్ కొట్టిన శర్వానంద్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ఫ్ సబ్జెక్టు తో తెరకెక్కిన శ్రీకారంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మహా శివరాత్రి రోజున విడుదల కాబోతున్న శ్రీకారం మూవీ ప్రమోషన్స్ లో శర్వా బాగా బిజీగా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన శ్రీకారం ట్రైలర్ లో శర్వానంద్ ఓ సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ గాను, వ్యవసాయం చెయ్యడానికి వచ్చి.. ఆధునిక పద్ధతుల్లో.. లుంగీ కట్టి వ్యవసాయం చేసే కుర్రాడిగా కొత్తగా కనిపిస్తున్నాడు. అంతేకాదు.. శర్వా పుట్టిన రోజున ఆయన నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం మహాసముద్రం నుండి పోస్టర్ రిలీజ్ చేసింది టీం. మహాసముద్రంలో లో శర్వానంద్ ఊర మాస్ లుక్ లో చేతిలో గొడ్డలితో రఫ్ గా కనిపిస్తున్నాడు మహాసముద్రం సినిమాలో శర్వా. ఈ సినిమాలో సిద్దార్ద్ మరో హీరోగా నటిస్తుండగా.. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక శర్వానంద్ మరో సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ టైటిల్ పోస్టర్ ని శర్వా బర్త్ డే రోజున స్పెషల్ గా రిలీజ్ చేసింది ఆ మూవీ టీం. శర్వానంద్ కి అత్యంత స్పెషల్ బర్త్ డే ట్రీట్ ఆయన బెస్ట్ ఫ్రెండ్, క్లాస్ మేట్ అయిన రామ్ చరణ్ ఇచ్చారు. రామ్ చరణ్ స్పెషల్ గా శర్వా బర్త్ డే ని ప్రతి ఏడాది సెలెబ్రేట్ చేసినట్టుగా ఈ ఏడాది కూడా శర్వా తో కేక్ కట్ చేయించడమే కాదు.. శర్వా కి మంచి పార్టీ ఇచ్చినట్లుగా శర్వా చరణ్ కి చెప్పిన థాంక్స్ ని బట్టి, పిక్స్ ని బట్టి అర్ధమైపోతుంది. మరి చరణ్ – శర్వా బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. ఎప్పటిలాగే బెస్ట్ ఫ్రెండ్ కోసం చరణ్ ఇలా కేక్ కట్ చేయించడం శర్వా కి పట్టలేనంత ఆనందం ఇచ్చింది. |
https://www.telugupost.com/movie-news/kqaushal-big-boss-2-winner-90835/ | తెలుగులో 112 రోజులుగా రసవత్తరంగా నాని హోస్టింగ్ లో ఆడుతున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నేడు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు స్టార్ మా లో ప్రసారం అవుతుంది. అయితే బిగ్ బాస్ జూన్ 10 న మొదలైంది మొదలు బిగ్ బాస్ షో గురించిన లీకులు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేసిన 17 మంది కంటెస్టెంట్స్ లో వారానికొకరు ఎలిమినేట్ అవడం... అది కూడా ఆదివారం రాత్రి నాని బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యే వారి పేరు చెప్పడం కన్నా ముందే అంటే ఆదివారం ఉదయానికల్లా బిగ్ బాస్ నుండి ఆ వారం ఎవరు బయటికొచ్చేసారో అనే విషయం ప్రేక్షకులకు తెలిసిపోతుంది. మొదటి వారం నుండి మొన్న ఆదివారం వరకు ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనే విషయం లీకుల ద్వారా సోషల్ మీడియా కి పాకిపోతుంది. ఇక ఆ ఎలిమినేషన్ ప్రక్రియ టివి లో ప్రసారం కాకమునుపే కొన్ని వెబ్ సైట్స్ బిగ్ బాస్ నుండి బయటికొచ్చిన వారి పేర్లను బయటికి చెప్పేస్తున్నాయి. మరి స్క్రిప్ట్ ప్రకారం నడిచే బిగ్ బాస్ స్టార్ మా లో రోజూ ప్రసారం చేసే ఎపిసోడ్ ని ఒకరోజు ముందే షూట్ చేయడం జరుగుతుంది. అయితే బిగ్ బాస్ కి పనిచేసే టెక్నీషియన్స్ నుండే ఆ లీకులు బయటికొస్తున్నాయనే టాక్ ఉంది. కానీ స్టార్ మా యాజమాన్యం ఆ లీకులకు ఫుల్ స్టాప్ పెట్టే పనులేమీ చెయ్యకుండా మౌనం వహించింది. అందుకే తాజాగా ఈ షో లో అంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పేరు కూడా బయటికి వచ్చేసింది. అందరూ అనుకున్నట్టుగానే కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నరంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. ఎప్పటినుండో కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో ఒంటరి శక్తిలా ఎదిగాడు. కొంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినప్పటికీ.. కౌశల్ ఆర్మీ అంటూ బిగ్ బాస్ బయట కొంతమంది హల్చల్ చెయడం.. ఇక వారానికొకరు చొప్పున ఎలిమినేట్ అయినవారు బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ తో గొడవపడి.. బయటికొచ్చి కౌషల్ ఆర్మీకి బుక్ అయ్యామని పలు ఇంటర్వూస్ లో చెప్పడం, హౌస్ లో ఫైనల్ కి చేరిన తనీష్, దీప్తి, గీత మాధురి, సామ్రాట్ లను దాటుకుని కౌశల్ బిగ్ బాస్ సీజన్ టు టైటిల్ విన్నర్ గా నిలిచాడంటున్నారు. అయితే ఎప్పుడూ బయటికొచ్చే లీకుల లాగే ఇదికూడా బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఇది నిజమా కాదా అనేది మాత్రం ఈ రోజు సాయంత్రం నాని ఆధ్వర్యంలో జరగబోయే బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే లో బయటికొస్తుంది. ఇకపోతే తాజాగా కౌశల్ ఒక కప్ చేతిలో పట్టుకుని విజయ గర్వంతో ఉన్న ఫోటో ఒకటి నెట్ లో హల్చల్ చేస్తుంది. అయితే అది బిగ్ బాస్ సీజన్ టు విన్నర్ కప్ అవునా... కదా.. లేదా కౌశల్ మరో పోటీలో నెగ్గిన కప్పా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కానీ కౌశల్ చేతిలో ఉన్న కప్పుతో ఉన్న ఫోటో మాత్రం సోషల్లో మీడియాలో ఇంటర్నెట్ లో కౌశల్ ఆర్మీ తెగ షేర్ చేసి పడేస్తుంది. |
https://www.telugupost.com/crime/another-person-became-a-victim-of-loneapp-harassment-incident-took-place-in-jagadgirigutta-of-medchal-district-1452452 | లోన్‌యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు. మేడ్చల్ జిల్లా జగద్గిరి గుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది. జగద్గిరి గుట్టకు చెందిన రమేష్ బలవన్మరణం పొందాడు. లోన్ యాప్ ద్వారా రమేష్ నలభై వేలు రుణం తీసుకున్నాడు. రుణం తిరిగి చెల్లించాలంటూ రమేష్ పై లోన్‌యాప్ సంస్థ ప్రతినిధులు వత్తిడి తేవడం ప్రారంభించారు.బలవన్మరణం...వత్తిడి తట్టుకోలేని రమేష్ బలవన్మరణాకి పాల్పడ్డాడు. దీంతో జగద్గిరిగుట్టలో విషాదం నెలకొంది. లోన్‌యాప్ నిర్వాహకుల కారణంగానే రమేష్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. |
https://www.telugupost.com/movie-news/i-like-to-be-alone-169933/ | తెలుగులో గబ్బర్ సింగ్, రేసు గుర్రం లాంటి హిట్స్ ఉన్న శృతి హాసన్ కాటమరాయుడు తర్వాత సినిమాలకు దూరమయ్యింది. మ్యూజిక్ , నటన అంటే ఇష్టపడే శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ దొరికాక సినిమాలను లైట్ టీయూస్కుంది. తండ్రి కమల్ హాసన్ ని ఒప్పించి బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటుంది అనుకున్న సమయంలో శృతి హాసన్ మళ్ళీ సింగిల్ గా కనబడింది. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాక మల్లి సినిమాలపై దృష్టి సారించిన శృతి హాసన్ కి ఒంటరి తనం అంటే చాలా ఇష్టమట. అందుకే కరోనా లాక్ డౌన్ సమయంలోను శృతి హాసన్ ఒంటరిగా గడిపినా అస్సలు బోర్ కొట్టలేదని చెబుతుంది. అయితే శృతి హాసన్ ఒంటరిగా ఉంటూనే ఇంటి పని చేసుకోవడం అలవాటట. ఇంట్లోని బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం దగ్గరనుండి ఇల్లు శుభ్రం చేసేవరకు శృతి హాసన్ తన ఇంటి పని తానే చేసుకుంటుదట. ఆ విషయం స్వయానా శృతినే చెబుతుంది. అయితే సెలబ్రిటీస్ అంటే ఇంటి నిండా పని మనుషులు ఉంటారు.. అలాంటి వాళ్ళు ఇలాంటి ఇంటిపనులు కూడా చేస్తారా అంటూ చాలామంది ఆశ్చర్యపోతుంటారు.. కానీ మేము మనుషులమే గా అంటుంది. లాక్ డౌన్ లో ఇంటి పనులు, అంట్లు తోమడం, బట్టలుతకడం విషయంలో ఛాలెంజ్ లు చేసుకున్నారు.. ఇలాంటి పనులు చెయ్యడం ఓ ఛాలెంజ్ అంటారా అంటుంది శృతి హాసన్. ఇక తనకి ఒంటరిగా ఉండడమే ఇష్టమని.. కొంతమంది ఒంటరిగా ఉండడమంటే భయపడతారని.. కానీ తాను చాలా రోజులుగా ఒంటరిగానే ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. |
https://www.telugupost.com/movie-news/naga-shourya-time-pass-at-home-during-corona-break-151637/ | ప్రస్తుతం భారత్ మొత్తం కరోనా జనతా కర్ఫ్యూతో ఎక్కడిక్కడ నిలిచిపోయి.. అంత బంద్ వాతావరణం కనబడుతుంది. ఇండియా మొత్తం 14 గంటలు జనతా కర్ఫ్యూ ఉంటె తెలంగాణాలో కేసీఆర్ మాత్రం 24 గంటల జనతా కర్ఫ్యూ చేయాలంటూ పిలునిచ్చారు. అత్యవరస ప్రయాణాలు తప్ప ఎవరూ రోడ్డు మీదకి రావొద్దు అంటూ అందరూ జనతా కర్ఫ్యూ లో పాల్గొంటున్నారు. అయితే సినిమా ప్రముఖులు అంత ఇంట్లో కూర్చుని జనతా కర్ఫ్యూ పై అందరిలో చైతన్యం నింపడమే కాదు… ఈ కర్ఫ్యూ అనేది మన కోసమే.. అందరూ ఇంట్లో నే ఉండండి అంటూ అభిమానులకు పిలుపునిస్తున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు ఈ జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇంట్లోనే కూర్చుని తల్లితో కలిసి కొత్త ఆవకాయ కలుపుతున్నాడు. అశ్వద్ధామ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన నాగ శౌర్య ప్రస్తుతం పలు సినిమాల్తో బిజీగా వున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్స్ బంద్ అవడం నేడు ఆదివారం జనతా కర్ఫ్యూ కారణంగా ఇళ్లకే పరిమితమైన నాగ శౌర్య తల్లి ఉష తో కలిసి కొత్త ఆవకాయ కలుపుతున్నాడు. ప్రస్తుతం మామిడికాయ పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ కావడంతో.. శౌర్య తన జనతా కర్ఫ్యూని ఇలా వినియోగించుకుంటున్నారు. తల్లి పచ్చడి కి కావాల్సిన సరుకులు వేస్తుంటే నాగ శౌర్య ఆవకాయ ని చేతితో కలుపుతూ ఆ ముచ్చటైన దృశ్యాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసాడు. కొత్త ఆవకాయ.. హోమ్ మెడ్ అంటూ వీడియో షేర్ చేసాడు |
https://www.telugupost.com/movie-news/అవసరాల-ప్రేమ-వ్యవహారం-ని-61734/ | గత నెల రోజులుగా ఒక హాట్ న్యూస్ ఫిలింసర్కిల్స్ లోనే కాదు సోషల్ మీడియాలోనూ తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే డైరెక్టర్ కమ్ కేరెక్టర్ ఆర్టిస్ట్ అయిన శ్రీనివాస్ అవసరాల ప్రేమలో పడ్డాడు అని. అది కూడా ఒక యావరేజ్ హీరోయిన్ తో అని. కానీ నిన్నమొన్నటివరకు ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం బయటికి రాలేదు. ఇండస్ట్రీలోకి నటనతో అడుగుపెట్టిన శ్రీనివాస్ అవసరాల ఆ తర్వాత డైరెక్టర్ గా టర్న్ తీసుకుని సక్సెస్ అయ్యాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాల్తో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న శ్రీనివాస్ అవసరాల జంటిల్మన్ సినిమాతో నెగెటివ్ షేడ్స్ ఉన్న యాక్టర్ గా కూడా ఆకట్టుకున్నాడు.అయితే ఈ మధ్యన శ్రీనివాస్ అవసరాల తన కెరీర్ తోపాటు... ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని... ఆ హీరోయిన్ ఎవరో కాదని ఈ మధ్యనే అ! సినిమాతో న్యూ లుక్స్ తో ఆకట్టుకున్న ఈషా రెబ్బ అని చెబుతున్నారు. ఇకపోతే అ! సినిమాలో ఈషా రెబ్బతో పాటే... శ్రీనివాస్ అవసరాల కూడా నటించాడు. గత కొంతకాలంగా శ్రీనివాస్ అవసరాల, ఈషా రెబ్బలు కలిసి తిరగడమే కాదు.. కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని కూడా ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి వీరిద్దరూ మధ్యన ప్రేమ ఉందని చెబుతున్నా.... అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ..... వీరిద్దరూ మాత్రం తమ ప్రొఫెషన్ లో పూర్తిగా తలమునకలై ఉన్నారు.ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల నటుడిగా బిజీగా ఉంటే... ఈషా రెబ్బ ప్రస్తుతం వెంకటేష్ - తేజ కలయికలో వస్తున్న ఆట నాదే వేట నాదే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం |
https://www.telugupost.com/movie-news/కోరిక-ఓకె-కానీ-అవకాశం-ఇవ్-162427/ | కెరీర్ లో చెప్పుకోవడానికి RX 100 తప్ప మరో సినిమా లేని పాయల్ రాజ్ ఫుట్ ఇప్పుడు ఐటమ్ అవతారమెత్తింది.. ఐటెం గీతాల్లో నటించబోతుంది అంటూ ప్రచారం జరగడంతో.. తొందరగానే మేలుకొన్న పాయల్ రాజపుట్.. తానేమి ఐటెం సాంగ్స్ చెయ్యడం లేదని.. తనకి అలంటి అవకాశాలు రాలేదని క్లారిటీ ఇచ్చింది. లాక్ డౌన్ సమయంలో పెంచిన ఒళ్ళు కరిగించుకోవడానికి ఓ పూట భోజనం మానేయ్యమని చెప్పిన పాయల్ వర్కౌట్స్ స్థానంలో ఇంట్లోని ఎవరి పనులు వారు చేసుకుంటే కెలెరీస్ తగ్గించుకోవచ్చని చెప్పింది. అయితే తాజాగా పాయల్ కోరిక వింటే సహజంగా బాగానే ఉంది కానీ.. ఆమె కోరిక నెరవేరాలిగా అనిపిస్తుంది. అదేమిటంటే పాయల్ రాజపుట్ కి సందీప్ వంగ తో పనిచెయ్యాలని ఉందట. సందీప్ వంగ అంటే బోల్డ్ డైరెక్టర్. అర్జున్ రెడ్డితోనే అదరగొట్టిన సందీప్ వంగ కబీర్ సింగ్ తోనూ బాలీవుడ్ లో జెండా పాతాడు. తదుపరి చిత్రాన్ని మొదలెడమనుకునేలోపు కరోనా లాక్ డౌన్ అడ్డంపడింది. అలంటి క్రేజీ డైరెక్టర్ తో వర్క్ చెయ్యాలని ఉందట పాయల్ రాజపుట్ కి. మరి పాయల్ కోరిక ఓకె కానీ.. సందీప్ వంగ ఇప్పుడు బాలీవుడ్ హీరో తో అయినా లేదంటే విజయ్ దేవరకొండ తో అయినా సినిమా చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నదంటున్నారు. మరి పాయల్ కోరిక విన్న సందీప్ వంగ ఏమైనా అవకాశం ఇస్తాడేమో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/ala-vaikuntapuramlo-hindi-rre-make-rights-147963/ | అల వైకుంఠపురములో సినిమాని త్రివిక్రమ్… ఓన్ బ్యానేర్ లాంటి హరిక హాసిని క్రియేషన్స్ లోనే మొదలు పెట్టాడు. కానీ హీరోగారు అదే అల్లు అర్జున్ ఏమో.. ఈ సినిమాలో తమ గీత ఆర్ట్స్ కి కూడా వాటా కావాలని పట్టుబట్టి మరీ… హారిక హాసినితో కలిసి గీత్ ఆర్ట్స్ ని భాగస్వామిని చేసాడు. త్రివిక్రమ్ కి చినబాబు కి ఇష్టం లేకపోయినా.. హీరో గారి అలక, ఆర్డర్ తో అల వైకుంఠంలో గీత ఆర్ట్స్ వచ్చి చేరింది. అది త్రివిక్రమ్ కి నచ్చకపోయినా .. యాక్సప్ట్ చేసారు. అయితే తాజాగా మరోసారి త్రివిక్రమ్ ని అల్లు అరవింద్ హార్ట్ చేసాడనే న్యూస్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది. అదేమంటే.. త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సక్సెస్ తో చాలా హ్యాపీ గా ఉన్నాడు. అరవింద్ గారు కూడా తెగ సక్సెస్ మీట్స్ నడిపాడు. షేర్ ఇవ్వడం ఇష్టం లేని హరిక హాసిని చినబాబు మాత్రం సైలెంట్ గా సక్సె మీట్స్ కి వచ్చాడు. అయితే ఈమధ్యన అల వైకుంఠపురములో సినిమా హిందీ రీమేక్ రైట్స్ ని సల్మాన్ కోసం బాలీవుడ్ నిర్మాత ఒకరు 8 కోట్లకి కొన్నారని టాక్ నడవడమే కాదు…. సల్మాన్ ఖాన్ అల వైకుంఠపురములో రీమేక్ పై ఆసక్తి చూపుతున్నాడనే అన్నారు. అయితే హిందీ లో అల డీల్ నిజమే కానీ… మధ్యలో అరవింద్ వేసిన అడ్డు పుల్లతో ఆ డీల్ ఆగింది. త్రివిక్రమ్ – చినబాబు కలిసి హిందీ రీమేక్ రైట్స్ ని రికార్డు ధరకి అమ్మడానికి బాలీవుడ్ నిర్మాత ఒకరితో బేరం కుదుర్చుకున్నాక… అబ్బే అల వైకుంఠపురములో హిందీ రీమేక్ రైట్స్ అమ్మొద్దు నేనే హిందీలో రీమేక్ చేసి సినిమా తీస్తా అని అల్లు అరవింద్ త్రివిక్రమ్ కి అడ్డు చెప్పడంతో.. త్రివిక్రమ్ చేసేదేం లేక ఆ హిందీ డీల్ క్యాన్సిల్ చేసాడట. కానీ త్రివిక్రమ్ మాత్రం అరవింద్ అతి కి అసహనంగా ఉన్నాడని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/యంగ్-ఎన్టీఆర్-గా-అతను-కాద-62101/ | గత రెండు రోజులుగా తేజ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయో పిక్ వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులోను బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ టైటిల్ అండ్ రెగ్యులర్ షూటింగ్ గురించి ప్రకటించేసరికి ఆ న్యూస్ కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ బయో పిక్ టైటిల్ ని 'ఎన్టీఆర్' అని... ఇక 'ఎన్టీఆర్' సినిమా కూడా ఈనెల 29 నే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోబోతుందని బాలకృష్ణ అమరావతి సాక్షిగా మీడియాకి తెలియజేశాడు. ఇక బాలయ్య ఎన్టీఆర్ బయో పిక్ విషయాన్ని అలా చెప్పాడో లేదో... ఇలా ఆ సినిమాపై మళ్ళీ బోలెడన్ని న్యూస్ బయలుదేరాయి.అందులో ప్రధానంగా హైలెట్ అయిన న్యూస్ ఏంటయ్యా అంటే.. యంగ్ ఎన్టీఆర్ పాత్రను యంగ్ హీరో శర్వానంద్ చేయనున్నట్టుగా గత రెండు రోజులుగా వార్తలు వ్యాపించాయి. అందులోను నిన్న మంగళవారం శర్వానంద్ పుట్టిన రోజు కావడం ఎన్టీఆర్ బయో పిక్ లో యంగ్ ఎన్టీఆర్ గా శర్వా నటించడం అనే న్యూస్ మాత్రం బాగా హైలెట్ అయ్యింది. కానీ ఈ విషయమై అటు శర్వానంద్ గాని, ఇటు బాలయ్య బాబు గాని స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. ఈ లోపు ఎన్టీఆర్ బయో పిక్ దర్శకుడు తేజ చెవిన శర్వానంద్ న్యూస్ పడగా... ఆ న్యూస్ విషయమై తేజ తనదైన శైలిలో స్పందించాడు. అదేమిటంటే ఎన్టీఆర్ బయో పిక్ లో యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ నటిస్తున్నాడని వస్తున్న వార్తలో ఎటువంటి నిజం లేదని.. అదంతా ఒట్టి పుకారు అని స్పష్టతనిచ్చేసాడు. అలాగే యంగ్ ఎన్టీఆర్ పాత్ర కోసం ఇంతవరకు ఎవరిని సంప్రదించలేదని....అసలు ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేసిన వెంటనే అధికారిక ప్రకటన చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. సాయి కొర్రపాటి, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి.... కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. |
https://www.telugupost.com/movie-news/sharwanand-rrevealed-intresting-97389/ | ప్రస్తుత ఉన్న హీరోలలో సింపిల్ అండ్ స్టడీగా భిన్నమైన కథలతో విభిన్నమైన నటనతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు శర్వానంద్. ప్రస్తుతం అతను నటించిన 'పడి పడి లేచే మనసు' రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే నెలలో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇప్పుడున్న హీరోలు అందరూ అవసరానికి మించి స్టోరీలో తల దూర్చుతున్నారన్న ప్రశ్నకు చాలా ఇంట్రెస్టింగ్ గా సమాధానం చెప్పాడు. "నా వరకు సినిమా వన్ మాన్ షో కాదని నమ్ముతానని చెప్పాడు. ప్రతి విషయంలో చాలా జాగ్రత్త పడతానని.. ప్రతీది సరిగా వస్తుందా లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటానని అన్నాడు. అనుకున్న విధంగా సినిమా రాకపోతే ఆ డైరెక్టర్ కు మొహం మీద చెప్పేస్తానని చెప్పాడు.సుధీర్ వర్మ దర్శకత్వంలో...ఈ సినిమా తరువాత శర్వా సుధీర్ వర్మ డైరెక్షన్ ఓ సినిమా చేయనున్నాడు. దానికి 'విరాట పర్వం' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 'పడి పడి లేచే మనసు' తర్వాత దీనిపై ఒక క్లారిటీ రానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న 'పడి పడి లేచే మనసు' నుండి రీసెంట్ గా టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ సింగిల్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. అలా శర్వా ప్రతి దాంట్లో అంటే స్క్రిప్ట్, కథల విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టే అతని సినిమా మినిమం హిట్స్ అవుతున్నాయేమో. |
https://www.telugupost.com/movie-news/pawan-hit-film-remake-82304/ | తెలుగులో త్రివిక్రమ్ మాటల మాంత్రికుడిగా అందరి మనసులలోకి చొచ్చుకుపోయే సత్తా ఉన్న దర్శకుడు. అందుకే ఆయన సినిమాలకు థియేటర్స్ లో కాసులు రాలేకపోయినా... శాటిలైట్ హక్కులకు కాసుల పంట పండుతుంది. అందుకే ఆయన సినిమాలకు ఛానల్స్ నుండి గట్టి పోటీ ఏర్పడుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది,. జల్సా సినిమాలు సూపర్ హిట్స్ కాగా.. అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్. అయితే అత్తారింటికి దారేది సినిమాతో పవన్, త్రివిక్రమ్ లు ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ సినిమా ఇప్పటికీ మా ఛానల్ లో ప్రసారం అవుతుంటే జనాలు టీవీలకు అతుక్కుపోతారు. ఆ సినిమా అంత అర్ధవంతంగా ఉంటుంది. అలాగే అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంది. అత్త నదియాని తన ఇంటికి తిరిగి తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ గౌతమ్ నందగా చేసే ప్రయత్నాలు అందులో భాగంగా అత్తా కూతుళ్లు సమంత, ప్రణీతలను ప్రేమలోకి లాగే ప్రయత్నాలు ఇలా అన్ని విషయాల్లో అత్తారింటికి దారేది ఆకట్టుకుంది.రీమేక్ రైట్స్ దక్కించుకున్న లైకాప్రస్తుతం అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయ్యాడు. ఇక సినిమాలు చేస్తాడో లేదో అనే క్లారిటీ లేదు. ఇకపోతే ఎప్పుడు తమిళంలో హిట్ అయిన సినిమా తెలుగులో రీమేక్ చేస్తుంటారు తెలుగు హీరోలు. అయితే కోలీవుడ్ వాళ్లు మాత్రం తెలుగు సినిమాలను చాలా రేర్ గా రీమేక్ చేసుకుంటారు. ఎందుకంటే తెలుగులో విడుదలైన చాలా సినిమాలు తమిళంలో డబ్ అవుతుంటాయి. తాజాగా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయినా అత్తారింటికి దారేది సినిమాని తమిళంలో రీమేక్ చేయబోతున్నారట. ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ని తమిళంలో బడా నిర్మాతల్లో ఒకరైన లైకా ప్రొడక్షన్స్ వారు చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తుంది.ఇంకా క్లారిటీ లేకున్నా...మరి తెలుగులో విడుదలైన ఐదేళ్లకు ఇప్పుడు ఈ సినిమాని తమిళంలో రీమేక్ చెయ్యడం అనేది ఎంతవరకు కరెక్టో వారికే తెలియాలి. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ లో తెరకెక్కించిన 2.ఓ సినిమా నవంబర్ 29 న విడుదలకు సిద్దమవుతుంది. అయితే తమిళ రీమేక్ రైట్స్ తీసుకున్న లైకా వారు తెలుగు అత్తారింటికి దారేది సినిమాను తమిళంలో ఎవరు డైరెక్ట్ చేస్తారో.. అలాగే ఏ హీరో ఈ సినిమా లో నటిస్తున్నాడు, హీరోయిన్స్ ఎవరనేది మాత్రం ప్రకటించలేదు. |
https://www.telugupost.com/crime/software-engineer-got-3-marriages-and-he-approach-matrimony-for-4th-marriage-in-hyderabad-1460102 | ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిత్యపెళ్లికొడుకుగా మారాడు. మూడో పెళ్లి చేసుకున్న వారంరోజుల్లోనే నాలుగోపెళ్లికి మ్యాటిమోనీలో దరఖాస్తు చేసుకోవడంతో అతని బాగోతం బయటపడింది. కంటోన్మెంట్ లోని దిల్ ఖుష్ నగర్ నగర్ కు చెందిన వంశీకృష్ణ (39) హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి గతంలోనే రెండు పెళ్లిళ్లవ్వగా ఇద్దరికీ విడాకులిచ్చి.. మూడో పెళ్లికి ఓ మ్యాట్రిమోనీలో దరఖాస్తు చేసుకున్నాడు. అదే సమయంలో నెల్లూరుకు చెందిన ఓ వైద్యురాలు తన భర్త చనిపోవడంతో.. కుటుంబ సభ్యుల అనుమతితో అదే మ్యాట్రిమోనీలో వరుడికోసం దరఖాస్తు చేసుకుంది.ఈ క్రమంలో వంశీకృష్ణకు ఆమెతో పరిచయమైంది. ఆమెను కలిసేందుకు నెల్లూరు వెళ్లాడు. కొద్దిరోజులు అక్కడే ఉండి.. తన మాయమాటలతో ఆమెను నమ్మించాడు. పెళ్లిచేసుకుంటానని చెప్పి జనవరి 4న తన ఇంటికి పిలిపించాడు. ఇప్పటికే.. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఈసారి ఎలాంటి ఆర్భాటం లేకుండా పెళల్లి చేసుకుందామని నమ్మించి తాళికట్టాడు. వారంరోజుల పాటు ఇద్దరూ అన్యోన్యంగా గడిపారు. అనంతరం ఆమె నెల్లూరుకు వెళ్లి.. తిరిగి 24 వంశీకృష్ణ ఇంటికి వచ్చింది. అతను మొహం చాటేసేందుకు ప్రయత్నించడంతో.. తాను మోసపోయానని గ్రహించింది.వెంటనే పోలీసులకు విషయం చెప్తానని అనడంతో ఆమెను రెండ్రోజులపాటు గదిలో నిర్బంధించాడు. ఇంతలోనే మరో వివాహం చేసుకునేందుకు అదే మ్యాట్రిమోనీలో దరఖాస్తు చేసుకున్నాడు వంశీకృష్ణ. అతడి దరఖాస్తును పరిశీలించిన మ్యాట్రిమోనీ ప్రతినిధులు అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు బాధితురాలికి ఫోన్ చేశారు. ఆమె జరిగిందంతా వాళ్లకు వివరించింది. నిందితుడి ఇంటి నుండి బయటపడిన ఆమె మ్యాట్రిమోని ప్రతినిధులతో కలిసి ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడికి అతని కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. |
https://www.telugupost.com/movie-news/vijay-interest-on-plitical-78360/ | అర్జున్ రెడ్డి సినిమాతో యువతకు అభిమాన హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ మళ్లీ విద్యార్థిగా మనముందుకు రాబోతున్నాడు. అయితే, ఈసారి మరింత మాస్ గా, స్టూడెంట్ లీడర్ గా మారిపోతున్నాడు. విజయ్ తన తర్వాతి చిత్రం డియర్ కామ్రేడ్ లో విద్యార్థి నేతగా నటిస్తున్నారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నాది క్రికెటర్ పాత్ర అంటా. ఇందుకోసం ఆమె క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఇప్పటికే విజయ్ నటించిన ట్యాక్సీవాలా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, విజయ్ మనస్సు ఎందుకో రాజకీయాలకు దగ్గరగా ఉన్నట్లుంది. ఆయన రాజకీయ నేపథ్యంతో సాగే ‘నోటా’ తమిళ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థి నేతగా నటించనున్నారు. వరుసగా రాజకీయాల నేపథ్యంలో సాగే కథలను విజయ్ ఎంచుకుంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/అంధుడిగా-అదరగొట్టేస్తు-40690/ | రవితేజ. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న 'రాజా ది గ్రేట్' టీజర్ ని 71 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకంక్షలతో విడుదల చేశారు. మాస్ మహారాజ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రవితేజ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. 25 ఏళ్లుగా అంధుడిగానే కనబడనున్న ఈ చిత్రంలో రవితేజ డైలాగ్ డెలివరీ, ఎనర్జీ లెవల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు అని ఒక వాయిస్ ఓవర్ వినపడగానే వెంటనే రవితేజ నోర్ముయ్ ఆ నయనాలు లేకుండా పాతికేళ్ళు నుండి కుమ్మేత్నానిక్కడ.... సర్వేంద్రియానం సర్వం ప్రధానం ఇక్కడ అంటూ రవితేక మార్క్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా... సినిమాపై అంచనాలు పెంచేలా వుంది.ఇక కళ్ళు లేకపోయినా తెలివితేటలతో ఈ ప్రపంచంలో జీవించడం చాలా తేలిక అని చెప్పే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు.... కానీ నా కొడుకేంటో ఈ ప్రపంచం చూడాలంటూ రవితేజ తల్లి పాత్రలో కనబడనున్న రాధికా చెప్పే తీరు.... ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రో కబడ్డీ మ్యానియాతో పడి కొట్టుకుపోతున్న నేపథ్యంలో డైరెక్టర్ ఈ సినిమాలో రవితేజని కబడ్డీ ప్లేయర్ గా చూపించడం వంటి కొత్త అంశాలతో 'రాజా ద గ్రేట్' టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ టీజర్ లో ప్రకాష్ రాజ్ ని సంపత్ ని పోలీస్ లుగా చూపించి.... హీరోయిన్ మెహరీన్ ని మాత్రం ఆవేశంగా ట్రైన్ పక్కనే పరిగెడుతున్న స్టయిల్లో పరిచయం చేసాడు. 'ఐ యామ్ బ్లైండ్.. బట్ ఐ యామ్ ట్రైన్డ్' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ చూస్తుంటే రవితేజతో ఎనర్జీ లెవల్స్ ఏ మాత్రం తగ్గలేదనిపిస్తుంది.రవితేజ మోహంలో కాస్త గ్లో తగ్గినా కూడా అతని ఎనర్జీతో దాన్ని కప్పెట్టేసాడు. మరి ఈ టీజర్ చూస్తుంటే మాత్రం రవితేజ ఎక్కువ గ్యాప్ తీసుకుని అంధుడిగా కొత్తగా ఒక ప్రయోగం చేసినప్పటికీ మంచి కథతో ఆకట్టుకుని హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు. |
https://www.telugupost.com/movie-news/అస్సలు-ఆగడం-లేదుగా-30792/ | అల్లు అర్జున్ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు. గత ఏడాది సరైనోడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అర్జున్ ఈ ఏడాది హరీష్ శంకర్ డైరెక్షన్ లో డీజే దువ్వాడ జగన్నాథంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం విడుదల చేసిన ఫస్ట్ లుక్ నుండి ఆ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రం కంప్లీట్ కాగానే బన్నీ రైటర్ వక్కంతమ్ వంశి డైరెక్షన్ లో నా పేరు సూర్య... లో నటిస్తాడు. ఇక సినిమాల్లోనే స్పీడు చూపిస్తున్న బన్నీ మరోపక్క యాడ్స్ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు.బన్నీసినిమాలకున్న క్రేజ్ ని బట్టి అతని బ్రాండ్ ఇమేజ్ కూడా బాగా పెరిగింది. ఇప్పటికే పలు కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న బన్నీకి కొత్త కంపెనీలు కూడా బన్నీనే తమ బ్రాండ్ అంబాసిడర్ కావాలనుకుంటున్నాయి. నేషనల్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వున్న బన్నీ ఇప్పుడు మరో నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ఇండియా మొత్తం మీద రెడ్ బస్ సంస్థ అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. దీనికి సంబందించిన యాడ్ షూట్ కూడా జరిగిందని చెబుతున్నారు. అయితే ఈ యాడ్ లో అల్లు అర్జున్ స్టయిల్ లుక్ తో బాగా ఆకట్టుకున్నాడని అంటున్నారు. సూపర్ ఎనెర్జీతో కనబడుతున్నది అంటున్నారు. ఇక్కడ తెలుగులో అయితే ఆ యాడ్ ఇంకా విడుదల కాలేదుగాని హిందీలో ఈ యాడ్ విడుదలై అన్ని ఛానెల్స్ లో ప్రచారం అవుతుందని చెబుతున్నారు. ఇక ఇప్పటికే అభి బస్సు కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుండగా... ఇప్పుడు రెడ్ బస్ సంస్థ కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికై సెన్సేషన్ క్రియేట్ చేశారు. |
https://www.telugupost.com/crime/minor-girl-raped-killed-in-madhya-pradesh-body-found-on-roof-of-her-house-1345921 | మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికను అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహగ్‌పూర్ ప్రాంతంలో ఇంటి పైకప్పుపై గుడ్డలో చుట్టి ఉన్న బాలిక మృతదేహం శనివారం కనిపించిందని సోహగ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విక్రమ్ రజక్ తెలిపారు. ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రాథమిక శవపరీక్ష నివేదికలో ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతుకోసి చంపినట్లు తేలిందని ఆయన తెలిపారు.ఇంటి పై కప్పు పై మృతదేహంబాధితురాలి కుటుంబ పరిసరాల్లో నివసిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని అధికారి తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు వెతికినా తమ గ్రామంలో కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు వారి ఇంటి పైకప్పును పరిశీలించగా మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారి తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/allu-sirish-abcd-movie-116185/ | మెగా హీరోలు ఎన్ని సినిమాలు ప్లాప్ అయినా.. ఏదో ఒక సినిమా హిట్ అవకపోతుందా అని సినిమాలు చేస్తూనే ఉంటారు. ఇక అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కాస్త పేరున్న సినిమాల్లో నటించైనా .. ఇంకా స్టార్ రేంజ్ అందుకోలేకపోయాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తర్వత ప్లేస్ కోసం సాయి ధరమ్, తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ లాంటి హీరోలు పోటీపడుతూనే ఉన్నారు. తాజాగా అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ మూవీ విడుదల విషయంలో వాయిదాలమీద వాయిదాలు తీసుకుంటుంది. కారణం అల్లు శిరీష్ ఆ సినిమా అన్ని విషయాల్లో వేలుపెడుతున్నాడని.. అందుకే ఆ సినిమా ఇంకా విడుదలకాలేదని… సినిమాల్లో ఓ అన్నంత అనుభవం లేని శిరీష్ టాప్ హీరో లెవల్లో చాలా విషయాల్లో మార్పులు చేర్పులు చేసాడనే టాక్ నడిచింది. అయితే ఏబీసీడీ సినిమా షూటింగ్ ని ఎప్పుడో పూర్తి చేసుకుంది. కానీ విడుదల విషయంలోనే డేట్స్ మీద డేట్స్ మార్చుకుంటూ పోతుంది. తాజాగా ఏబీసీడీ సినిమాని అల్లు అరవింద్ వీక్షించాడని.. అందులో ఏయే సీన్స్ రిపేర్లు చేయించాలనే చర్చల్లో అరవింద్ తో పాటుగా ఏబీసీడీ టీం ఉందని చెబుతున్నారు. మరోపక్క ఎడిటింగ్ విషయంలో అల్లు శిరీష్ కి నిర్మాతకి బేధాభిప్రాయాలొచ్చాయనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఎడిటింగ్ విషయంలో శిరీష్, నిర్మాత ఉప్పు, నిప్పులా వున్నారని ఫిలింనగర్ టాక్. అయితే ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ కొడుకు శిరీష్ ను సపొర్ట్ చేయడం లేదని తెలుస్తోంది. అందుకే సినిమాని విడుదల చేసే విషయమై ఇంత స్తబ్దత నెలకొందంటున్నారు. మరి అరవింద్ చొరవ తీసుకుంటేనే సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. చూద్దాం ఏబీసీడీ పరిస్థితి ఏమిటి అనేది. |
https://www.telugupost.com/crime/terrible-road-accident-happened-in-america-five-people-from-andhra-pradesh-died-in-this-accident-1511853 | అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులంతా వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులేనని తెలిసింది. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబీకులు ఈ ప్రమాదంలో మరణించారని చెబుతున్నారు. అమెరికా జాన్సన్ కౌంటీలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులంతా అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు.ఒకే కుటుంబానికి చెందిన...రెండు కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో మరణించినట్లు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వెళ్లి ఈ ప్రమాదానికి గురయినట్లు తెలిసింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఎంబసీ అధికారులతో సంప్రదిస్తున్నారు. మృతదేహాలను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/film-actress-hema-has-lodged-a-complaint-with-the-cyber-crime-police-on-her-youtube-channels-1468206 | సినీనటి హేమ యూట్యూబ్ ఛానల్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. సెలబ్రెటీలే లక్ష్యంగా చేసుకుని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయని, ఇది సినిమా ఇండ్రస్ట్రీని తరచూ ఇబ్బంది పెడుతుందన్నారు.సెలబ్రటీలపై...తాజాగా సినీనటుడు కోట శ్రీనివాసరావు పై కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారా చేశాయి. ఆయన నేరుగా తాను క్షేమంగా ఉన్నట్లు వీడియోను విడుదల చేసుకోవాల్సి వచ్చింది. సెలబ్రటీలకు చికాకు కలిగిస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని హేమ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. |
https://www.telugupost.com/movie-news/ఆ-రోజు-ఫాన్స్-కి-పండగే-40716/ | పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ కి సంబందించిన అప్ డేట్ లేక పవన్ ఫాన్స్ జుట్టు పీకేసుకుంటున్నారు. సినిమా మొదలయ్యి చాలా కాలమైనా కూడా ఇప్పటివరకు ఆ సినిమాపై ఎటువంటి న్యూస్ మీడియాకి అందడంలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి పవన్, త్రివిక్రమ్ చిత్రం గురించిన అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సినిమామొదలై ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటివరకు టైటిల్ కూడా ప్రకటించకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తున్న త్రివిక్రమ్ ఈ ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా పవన్ ఫస్ట్ లుక్ వదులుతారనే ప్రచారం జరిగింది.ఇక స్వాతంత్ర్య దినోత్సవం రోజు కంటే కూడా పవన్ పుట్టిన రోజుకు ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తే బాగుంటుందని యూనిట్ సభ్యులందరూ తమ అభిప్రాయం వ్యక్తం చేయడంతో త్రివిక్రమ్ కి కూడా వారి ఆలోచనే నచ్చి అలా ప్రొసీడ్ అవడానికి మొగ్గు చూపడంతో ప్రస్తుతానికి పవన్ ఫస్ట్ లుక్ ఆగింది. కానీ ఆగష్టు 15 న పవన్ సినిమా గురించి ఎటువంటి న్యూస్ బయటికి రాకపోయేసరికి పవన్ ఫాన్స్ బాగా హార్ట్ అయ్యారు. అయితే పవన్ ఫాన్స్ నిరాశ పడడం చూసిన పవన్ కళ్యాణ్ తన సినిమాకి సంబందించిన టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఫాన్స్ కి భరోసా ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు త్రివిక్రమ్, చిత్ర యూనిట్ ఆలోచన ప్రకారం సెప్టెంబరు 2న పవన్ పుట్టిన కానుకగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసి.. ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేస్తారని సమాచారం బయటికి వచ్చింది. మరి పవన్ - త్రివిక్రమ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇక టైటిల్, ఫస్ట్ లుక్ బయటికొస్తే ఆ అంచనాలు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని పవన్ ఫాన్స్ చంకలు గుద్దేసుకుంటున్నారు. ఇప్పటికే శాటిలైట్ రైట్స్, ప్రీ రిలీజ్ బిజినెస్ తో అదిరిపోయే లెవల్లో రికార్డు సృష్టిస్తున్న పవన్, త్రివిక్రమ్ లు ఈ టైటిల్, ఫస్ట్ లుక్ లతో ఇంకెంత రచ్చ చేస్తారో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/suneel-scenes-in-thank-you-movie-1380631 | అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం థ్యాంక్యూ. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాశీఖన్నా, మాళవికా నాయక్, అవికాగోర్, హీరోయిన్లుగా నటించారు. జులై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమా రన్‌టైం 129 నిమిషాలు. ఒరిజినల్ రన్ టైం మాత్రం 2 గంటల 45 నిమిషాలు ఉందట. సినిమా బోర్ కొట్టకుండా.. మిగిలిన పార్టును తొలగించారని అంటున్నారు. సినిమా పోస్టర్‌లో కనిపించిన సునీల్.. సినిమాలో కనిపించలేదు. డిలీటెడ్ వెర్షన్‌లోనే సునీల్‌కు సంబంధించిన సన్నివేశాలు ఎగిరిపోయారని అంటున్నారు.'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' చిత్రాలతో మంచి సక్సెస్ ను అందుకున్న నాగచైతన్య.. థ్యాంక్యూ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్స్ తొలిరోజు మరీ దారుణంగా ఉన్నాయి. నాగచైతన్య కేరీర్ లోనే 'థ్యాంక్ యూ' మూవీ కలెక్షన్స్ పరిస్థితి ఘోరంగా ఉంది. గత చిత్రాలతో పోల్చితే భారీ విఫలమని తెల్చుతోంది. ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలంగాణ, ఏపీలో కేవలం రూ.1.65 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.20 కోట్లకు పైగా అయినట్టు తెలుస్తోంది. థ్యాంక్యూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.16 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. చైతూ కెరీర్ లో ఇటీవల ఇంత తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'థ్యాంక్యూ' నిలిచింది.నాగచైతన్య గత ఆరు చిత్రాల తొలిరోజు కలెక్షన్స్ ను చూస్తే.. శైలజారెడ్డి అల్లుడు - రూ.6.93 కోట్లు, సవ్యసాచీ - రూ.3.29 కోట్లు, మజిలి - రూ.5.6 కోట్లు, రూ.వెంకీ మామా - రూ.7.05, లవ్ స్టోరీ - రూ.7.13 కోట్లు సాధించగా.. చివరిగా వచ్చిన బంగార్రాజు చిత్రం కూడా రూ.9.06 కోట్లు సాధించింది.ఈ సినిమా తొలిరోజు వసూలు చేసిన కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.నైజాం – 0.72 కోట్లుసీడెడ్ – 0.20 కోట్లుఈస్ట్ – 0.14 కోట్లువెస్ట్ – 0.08 కోట్లుఉత్తరాంధ్ర – 0.22 కోట్లుగుంటూరు – 0.10 కోట్లుకృష్ణా – 0.12 కోట్లునెల్లూరు – 0.07 కోట్లుకర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.06 కోట్లుఓవర్సీస్ – 0.45 కోట్లుటోటల్ వరల్డ్ వైడ్ – రూ.2.16 కోట్లు (రూ.3.70 కోట్లు గ్రాస్) |
https://www.telugupost.com/movie-news/ఈసారి-కామెడీతో-హిట్-కొడత-30655/ | గత ఏడాది 'పెళ్లి చూపులు' చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా విడుదలై భారీ విజయాన్ని మూటగట్టుకుని విజయకేతనం ఎగురవేసింది. మొదటిసారి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ని సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రశంసల జల్లు కురిపించింది. చిన్న చిత్రంగా విడుదలై భారీ హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ చిత్రం జాతీయ పురస్కారాన్ని అందుకోవడం కూడా సంచలనమే అయ్యింది. 'పెళ్లి చూపులు' విడుదలై చాలా నెలలు గడుస్తున్నా ఆ దర్శకుడు మరో సినిమా చెయ్యలేదు. ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ తన రెండో సినిమాని పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడట. ఆ చిత్రం బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన 'దిల్ చాహత హై' తరహాలో ఉండబోతుందని అంటున్నారు. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా వున్న తరుణ్ సినిమా గురించి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి వుంది. మరో పక్క నటీనటుల ఎంపిక జరగలేదట. అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడు మొదలవ్వబోతుందో కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. కానీ తరుణ్ ఈసారి ఒక స్టార్ హీరోతోనే సినిమాకి సిద్ధమవుతున్నాడని అందుకే రెండో సినిమాని మొదలు పెట్టడానికి ఇంత సమయం తీసుకున్నాడని అంటున్నారు. |