link
stringlengths 41
231
| text
stringlengths 29
5k
|
---|---|
https://www.telugupost.com/movie-news/nadamuri-balakrishna-v-v-vinayak-70617/
|
ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ విషయం ఏమోగాని బాలకృష్ణ మాత్రం వి. వి. వినాయక్ తో ఒక కొత్త సినిమాతో సెట్స్ మీదకెళ్ళబోతున్నాడు. అది కూడా ఒక రీమేక్ కథతో. కన్నడ సూపర్ హిట్ మూవీ మఫ్తీకి రీమేక్ కథతో బాలకృష్ణ, వినాయక్ కాంబోలో మూవీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దర్శకుడు వినాయక్ కూడా రిస్క్ లేకుండా మాస్ ని మెప్పించే ఈ రీమేక్ కథ వైపు మొగ్గు చూపారంట. మరి బాలకృష్ణ చాలాకాలం నుంచి రీమేక్ సినిమాలు చేయడం లేదు. గతంలో సామీ సినిమా రీమేక్ లక్ష్మి నరసింహాలో నటించినప్పటి నుంచి నేటి వరకు మళ్లీ రీమేక్ ల జోలికి వెళ్ళలేదు.బాలయ్య ఫ్యాన్స ఊరుకుంటారా..?ఇక కన్నడ మఫ్తీ సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఆ సినిమాపై కన్నేశాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. కన్నడలో సీనియర్ హీరో శివరాజ్ కుమార్ ఒక పాత్ర వేయగా మరో పాత్రలో యూత్ హీరో మురళి కనిపిస్తాడు. ఇక తెలుగులో బాలయ్య చేసేది శివరాజ్ కుమార్ పాత్ర. మరి మురళి పాత్రలో కనిపించే సెకండ్ హీరో ఎవరనే క్యూరియాసిటీతో ఉన్నారు నందమూరి ఫాన్స్. ఇక కన్నడ మఫ్తీలో హీరో మురళి పాత్రే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సేపు కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు మాత్రమే శివరాజ్ కుమార్ పాత్ర ఎంట్రీ వస్తుంది. మరి బాలకృష్ణ సినిమాలో బాలయ్య లేట్ గా ఎంట్రీ ఇస్తే బాలయ్య ఫాన్స్ అస్సలూరుకోరు.మాఫియా బ్యాక్ డ్రాస్ లో...అందుకు తగ్గట్టుగానే బాలయ్య పాత్రను సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా కనబడే విధంగా వినాయక్ డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా రఫ్ గా, మాస్ గా ఉంటుంది. మరి బాలయ్యతో సై అంటే సై అంటూ ఛాలెంజ్ చేసే పాత్రలో ఏ హీరోను తీసుకుంటారు అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది. చూద్దాం బాలయ్యకి ఏ హీరో తగులుతాడో అనేది.
|
https://www.telugupost.com/movie-news/rahul-ashu-reddy-180326/
|
బిగ్ బాస్ సీజన్ 3 తో క్రేజీ గా లైమ్ టైం లోకి వచ్చిన న్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నటి పునర్నవితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాడు. దానితో పునర్నవి – రాహుల్ పెళ్లి చేసేసుకుంటారేమో అనుకున్నారు. బయటికి వచ్చాక కూడా పునర్నవితో రాహుల్ కొన్నాళ్ళు జతగానే తిరిగాడు. కానీ తర్వాత అషు రెడ్డి తో రాహుల్ హైలెట్ అవుతున్నాడు. సీజన్ 3 లో అషు రెడ్డి కూడా ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో అషు రెడ్డి తో రాహుల్ పెద్దగా కలవకపోయినా.. బయట మాత్రం రాహుల్ అషులు బాగా క్లోజ్ గా మూవీ అవుతున్నారు. ఈమధ్యన పబ్లిక్ గానే తిరుగుతున్నారు. హాగ్ లు ఇచ్చుకోవడం, అషు ని రాహుల్ ఎత్తుకోవడం అబ్బో వీళ్ళ యవ్వారం మాములుగా లేదు. దానితో రాహుల్ – అషు రెడ్డిల మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి. కానీ అవి రూమర్స్ కాదు నిజాలే అన్నట్టుగా ఉంది ఇప్పుడు వాళ్ళ బిహేవియర్. ఈమధ్యన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ – అషు రెడ్డిలు ఒకరి కోసం ఒకరు పాట పాడుకున్నారు. అంతేకాదు.. మేమిద్దరం కెమిస్ట్రీ చదువుకుంటున్నాం.. ఫిజిక్స్ అనుకుంటున్నాం, హిస్టరీలు రిపీట్ చేసుకుంటున్నాము అంటూ ఏదేదో అర్ధం పర్ధం లేకుండా మాట్లాడడంతో రాహుల్ అషు రెడ్డితో బాగానే పులిహోర కలుపుతున్నాడని అర్ధమైపోతుంది. అంతే కాదు.. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోస్ చూపిస్తే ఇవెలా బయటికి వచ్చాయి.. అయినా ఈ ఫొటోస్ నథింగ్ ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయ్ అంటూ మాట్లాడడం చూస్తే వీరి మధ్యన సం థింగ్ కాదు కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తుంది వ్యవహారం.
|
https://www.telugupost.com/movie-news/tension-in-the-saira-team-135406/
|
సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సినిమా విడుదలకు దగ్గరయ్యాకే సైరా టీం సినిమా ప్రమోషన్స్ ని సుడిగాలి మాదిరిగా.. చెన్నై, బెంగుళూరు అంటూ చుట్టేస్తున్నారు. ఈ విషయంలో రామ్ చరణ్ కూల్ గా కనిపిస్తున్నప్పటికి… సినిమా విడుదలకు దగ్గరయ్యే కొద్దీ చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. చిరుకూడా ఈ వయసులో ఫ్లైట్ ఎక్కడం, ఫ్లైట్ దిగడం సమయంలో కాస్త డల్ అయినట్లుగా చెబుతున్నారు. మరో వైపు సైరా ప్రీమియర్స్ విషయంలోనూ సమస్యలున్నట్లుగా టాక్. బొమ్మ పడుతుందా…. లేదా….? యూఎస్ లో భారీ సినిమాల ప్రీమియర్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసు. అయితే సైరా సినిమా విషయంలో ఈ ప్రీమియర్స్ విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. యుఎస్ కి క్యూబ్ లు చాలా చోట్లకు ఇప్పటికే చేరుకున్నా.. ఇంకా కొన్నిచోట్లకు వాటిని చేర్చాల్సి ఉంది. క్యూబ్ డిస్కులు అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా చేరకపోవడం వల్ల కొన్ని చోట్ల సైరా ప్రీమియర్లు క్యాన్సిల్ చేస్తున్నారని చెబుతున్నారు. మంగళవారం 2 గంటలకు పడాల్సిన సైరా ప్రీమియర్లు వేస్తారా.. లేదా… అన్నది ప్రస్తుతం ఉన్న డౌట్. ఈ విషయాల్తోనే సైరా బృందం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్.
|
https://www.telugupost.com/movie-news/rangasthalam-100-days-function-78718/
|
నటనకు అవకాశం ఉండే పాత్ర కోసం చాలా రోజులు ఎదురు చూసిన రామ్ చరణ్.. మంచి కమెర్షియల్ సినిమా కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న డైరెక్టర్ సుకుమార్.. ఈ ఇద్దరికీ 'రంగస్థలం' రూపంలో వాళ్ల కోరిక తీరింది. చరణ్ సరసన సమంత నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో విజయవిహారం చేసింది. చరణ్, సుకుమార్ కెరీర్స్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈరోజుల్లో వంద రోజులంటే మామూలా మరిప్రేక్షక ఆదరణే కాకుండా క్రిటిక్స్ సైతం మెచ్చిన ఈ చిత్రం తాజాగా 100 రోజులను పూర్తిచేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 15 సెంటర్లలో ఈ సినిమా 100 రోజుల మైలురాయిని దాటేసింది. దానికి సంబంధించి పోస్టర్స్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లో 100 రోజుల వేడుకను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ కారిక్రమానికి చీఫ్ గెస్ట్ గా చిరంజీవిని ఆహ్వానించినట్టు సమాచారం. ఇప్పుడున్న రోజుల్లో సినిమా 100 రోజులు కంప్లీట్ చేసుకోవటం అంటే మాములు విషయం కాదు.
|
https://www.telugupost.com/movie-news/kajal-agarwal-in-bellamkonda-srinivas-kavacham-movie-99710/
|
బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించే హీరోయిన్స్ అంతా... టాప్ హీరోయిన్స్ అయ్యే ఉండాలి. ఒకే ఒక్క సినిమాలో కాస్త పేరు లేని హీరోయిన్ తో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ తన మిగతా సినిమాలన్నిటిలో పేరున్న హీరోయిన్స్ తోనే రొమాన్స్ చేసాడు.అయితే బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి చిన్న హీరోతో క్రేజున్న హీరోయిన్స్ నటించాలి అంటే.. కేవలం పారితోషకాన్ని డబుల్ ఇస్తేనే హీరోయిన్స్ అతనితో నటించడానికి ఒప్పుకుంటారనేది బహిరంగ సత్యం. మరి బెల్లంకొండ సురేష్ కొడుకుని హీరోగా నిలబెట్టడానికి సినిమాలకి భారీ బడ్జెట్స్ పెట్టడమే కాదు... టాప్ హీరోయిన్స్ ని కూడా తెచ్చి పెడుతున్నాడు. మరీ ఓ అన్నంత హిట్స్ కొట్టకపోయిన.. బెల్లంకొండ సినిమాలు యావరేజ్ హిట్స్ అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు సమంత, రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఒకేసారి రెండు సినిమాల్లో చందమామ కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. తేజ డైరెక్షన్ లోని సినిమాతో పాటుగా.. కొత్త డైరెక్టర్ తో కవచం సినిమాలోను బెల్లంకొండ కాజల్ తో జోడి కట్టాడు. తాజాగా కవచం సినిమా వచ్చే వారం విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఆ సినిమాలో కాజల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న రొమాన్స్ లో హాట్ నెస్ కనబడుతుంది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా హాట్ అండ్ సెక్సీ లుక్ లో చింపేస్తుంది. మరి గతంలోనూ సమంత అల్లుడు శీను సినిమాలో హాట్ హాట్ గా శ్రీనివాస్ సరసన నటించింది. అయితే పారితోషకం విషయంలో గట్టిగా ఇవ్వబట్టే హీరోయిన్స్ అంతా బెల్లంకొండ పక్కన గ్లామరస్ గా కనబడుతున్నారంటున్నారు సగటు ప్రేక్షకులు.పారితోషకం దండిగా ఇస్తే హీరోయిన్స్ చాలామంది గ్లామర్ పరంగా కూడా హద్దు లేకుండా ఆరబోస్తున్నారనే టాక్ వినబడుతుంది. మరి సమంత అయినా కాజల్ అయినా రకుల్ అయినా పూజ హెగ్డే అయినా శ్రీనివాస్ లాంటి హీరోలపక్కన డబ్బు కోసమే నటిస్తున్నారంటూ కామెంట్స్ అయితే వినబడుతుంది. మరి తాజాగా విడుదలైన కవచం పోస్టర్స్ లో కాజల్ ఎంతగా గ్లామర్ ఒలకబోసిందో.. బెల్లంకొండ తో ఆ ఘాటు రొమాన్స్ ఎలా ఉందొ మీరే చూడండి
|
https://www.telugupost.com/crime/assam-police-si-junmoni-rabha-dies-in-road-accident-1476686
|
అస్సాం పోలీసు విభాగంలో లేడీ సింగం, దబాంగ్ కాప్ గా పేరొందిన మహిళా ఎస్సై జున్మణి రాభా (30) మంగళవారం (మే16) తెల్లవారుజామున కారుప్రమాదంలో మృతి చెందారు. జున్మణి ప్రయాణిస్తోన్న ప్రైవేటు కారును నగావ్ జిల్లా పరిధి జఖలాబంధా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కంటైనర్ ట్రక్కు ఢీ కొట్టినట్లు అధికారులు తెలిపారు. నగావ్ ఎస్పీ లీనా డోలే ప్రమాద స్థలాన్ని గుర్తించారు.ఈ ప్రమాదం జరగడానికి కొన్నిగంటల ముందు జున్మణిపై దోపిడీ కేసు నమోదైంది. ఈ ప్రమాదంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రమాదానికి కారణమైన ట్రక్కును పోలీసులు సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రాత్రి వేళలో జున్మణి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, యూనిఫాం లేకుండా ప్రైవేటు కారులో ఒంటరిగా ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నారన్నది సస్పెన్స్ గా మారింది. పలు వర్గాల డిమాండ్ మేరకు.. ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు అస్సాం డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.
|
https://www.telugupost.com/movie-news/బాలీవుడ్-లో-తాప్సీకి-క్ర-48230/
|
టాలీవుడ్ పై నోరు పారేసుకుంటూ బాలీవుడ్ లో సెటిల్ అయింది తాప్సీ పన్ను. బాలీవుడ్ లో 'పింక్' మూవీతో తెగ గుర్తింపు తెచ్చేసుకుంది ఈ అమ్మడు. టాలీవుడ్ లో కూడా 'ఆనందో బ్రహ్మ' అంటూ మంచి హిట్ నే అందుకుంది. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది ఈ మిల్క్ బ్యూటీ.అయితే ఇప్పుడు తాప్సీ పై ఓ న్యూస్ మీడియా లో ప్రముఖంగా వినపడుతుంది. ఇప్పటికే జూడ్వా 2 తో అందాల ఆరబోతతో బికినీ షో చేసిన ఈ భామను అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందనున్న లేటెస్ట్ మూవీ కోసం సంప్రదించారట. ఇప్పటి వరకూ తను స్టార్ అనిపించుకోలేకపోయానంటూ ఈ మధ్యనే అసహనం వెళ్లగక్కిన ఈ భామకు ఇది మంచి అవకాశమే అని చెప్పవొచ్చు.నిజానికి ఈ పాత్రను మొదట దంగల్ భామ సాన్యా మల్హోత్రాకు ఆఫర్ చేశారు.. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ తాప్సీ పన్ను ముంగిట వాలిందని తెలుస్తోంది. అటు స్టోరీ పై.. డేట్స్ పై డిస్కషన్స్ కూడా జరిగిందని సమాచారం. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరి కొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్టులోకి తాప్సీ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.
|
https://www.telugupost.com/movie-news/అల్లు-అర్జున్-షో-స్టీలర్-19372/
|
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది ఇచ్చిన బ్లాక్ బస్టర్ సరైనోడు తో ఆయన క్రేజ్ ఎన్నో రేట్లు పెరిగిపోయింది. అల్లు అర్జున్ చేయబోయే తదుపరి చిత్రాల కోసం మెగా అభిమానులు చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అందులోనూ కమర్షియల్ సినిమాలలో ఎంటర్టైన్మెంట్ తో పాటు హీరో కారెక్టరైసెషన్ కి అధిక ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు హరీష్ శంకర్ తెరకేక్కిస్తున్న దువ్వాడ జగన్నాథం అయితే కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు మెగా అభిమానులు. గతంలో హరీష్ శంకర్ మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తో పాటు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయం ఇవ్వటంతో ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న దువ్వాడ జగన్నాథం లో అల్లు అర్జున్ ఎలా చూపిస్తాడో అని ఆతృతగా వున్నారు అభిమానులు.హరీష్ శంకర్ మాత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా పకడ్బందీగా చేసుకుని చిత్రాన్ని పట్టాలెక్కించినట్టున్నారు. చిత్రం మొదలై మూడు నెలలు కూడా పూర్తి కాకముందే మూడు రెగ్యులర్ షెడ్యూల్స్ పూర్తయ్యి నాలుగో షెడ్యూల్ మొదలైపోయింది. నాలుగో షెడ్యూల్ లో హైద్రాబాద్ పరిసర ప్రాంతాలలో చేయనున్న పోరాట సన్నివేశాలు మరియు కొన్ని కీలక సన్నివేశాలతో టాకీ పార్ట్ పూర్తవనుంది. అప్పటి వరకు ఆగకుండా హరీష్ శంకర్ జరిగిన మూడు షెడ్యూల్స్ తాలూకా ఫ్యూటేజి కి ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టించేశాడు. ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణ అనుభవంతో కచ్చితంగా అల్లు అర్జున్ షో స్టీలర్ గా నిలుస్తాడని చెప్పి ఎడిటింగ్ పనులకు నాంది పలుకుతూ తీసిన మోనిటర్స్ ఫోటో తో ట్విట్టర్ లో అభిమానులకు పంచుకున్నాడు ఈ దర్శకుడు.ఈ ఏడాది వేసవికి మెగా అభిమానులకు ఫీస్ట్ ఇవ్వటానికి సిద్దమవుతుంది దువ్వాడ జగన్నాథం.
|
https://www.telugupost.com/crime/shilpa-choudhary-who-is-a-remand-prisoner-in-chanchalguda-jail-was-released-after-she-was-granted-bail-1345267
|
చంచల్ గూడ జైలులో ఉన్న శిల్పా చౌదరి విడుదలయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు కావడంతో ఆమె విడుదలయ్యారు. శిల్పా చౌదరికి షరతులతో కూడిన బెయిల్ ను ఉప్పరపల్లి కోర్టు మంజూరు చేసింది. ప్రతి శనివారం ఖచ్చితంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.మోసం చేసిన కేసులో....ప్రముఖులను మోసంచేసిన కేసులో శిల్పా చౌదరి ఇరవై ఐదు రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆమెను మూడుసార్లు పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు ప్రముఖుల నుంచి తీసుకుని ఎగ్గొట్టడంతో శిల్పా చౌదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
https://www.telugupost.com/movie-news/samantha-akkieneni-oh-baby-collections-126651/
|
ప్రస్తుతం గత మూడు రోజులుగా టాలీవుడ్ ప్రముఖులే కాదు… సాధారణ ప్రేక్షకుడు కూడా సమంత హీరోయిన్ గా నటించిన ఓ బేబీ ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. ఓ బేబీ లో సమంత నటనకు 100 కి 100 మార్కులు పడుతున్నాయి. అందుకే ఓ బేబీ కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫ్యామిలీస్ మాత్రమే కాదు.. చిన్న పెద్ద అంతా ఓ బేబీ మ్యానియాలోనే ఉన్నారు. సమంత క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్ సంపాదించిన ఓ బేబీ… ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా కు వచ్చిన హిట్ టాక్ తో మంచి కాదు కాదు.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఓ బేబీ కి పెట్టింది కేవలం 13 కోట్ల బడ్జెట్ మాత్రమే. అయితే అందులో థియేటర్స్ రైట్స్ కే 10 కోట్లకు పైగానే వచ్చేసాయి. ఇంకా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కి అదనంగా వచ్చాయి. ఇక ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే… ఎప్పుడూ స్టార్స్ సినిమాలనే కాదు.. చిన్న సినిమాలను కూడా డిజిటల్ ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎదిగిన అమెజాన్ ప్రైమ్ వారే ఎగరేసుకుపోతుంటే.. ఈసారి ఓ బేబీ ని మాత్రం అమెజాన్ కి పోటీగా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్కడ పోటీ వాతావర్ణంలోను ఓ బేబీ కి కలిసొచ్చింది. ఇక 13 కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు ఓ బేబీ ఫస్ట్ వీకెండ్ లోనే 17 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందించింది. సమంత క్రేజ్.. సినిమా కొచ్చిన పాజిటివ్ టాక్, అలాగే క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ అన్ని ఓ బేబీ ని కేవలం మూడు రోజులకే 17 కోట్లను కొల్లగొట్టే దిశగా నడిపించాయి. వరల్డ్ వైడ్ గా ఈ రేంజ్ కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కొల్లగొట్టడం సామాన్యమైన విషయం కాదు. మరి ఫస్ట్ వీకండ్ లో దడదడ లాడించిన ఓ బేబీ మొదటి వారం ముగిసేసరికి నిర్మాతలకు ఏ రేంజ్ లాభాలు తెస్తుందో చూడాలి.
|
https://www.telugupost.com/movie-news/bigg-boss-season-3-is-going-to-be-very-bland-134146/
|
బిగ్ బాస్ సీజన్ 3 చాలా చప్పగా సాగుతుంది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ అంతా చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుతున్నారు. ఎక్కడ ఎటువంటి గొడవలకు తావివ్వకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని షో కి వచ్చినట్టుగా కనబడుతుంది. నాగార్జున చెప్పినట్టుగా ఎవరు ఇంతవరకు తమ ముసుగు తియ్యలేదు అనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తమకు కావాల్సిన, క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ ని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హౌస్ లో పునర్నవి, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికాలు కాస్త పేరున్న క్రేజున్న కంటెస్టెంట్స్. వారిని కాపాడడానికి బిగ్ బాస్ ఎత్తులు వేస్తుంది. మిగతా వాళ్ళని ఒక్కొక్కరిగా హౌస్ నుండి బయటికి పంపుతున్నారు. నటిస్తే చాలు….. ఇక వరుణ్ – వితిక భార్యాభర్తలు గనక వారిద్దరూ హౌస్ లో ఉంటే.. బిగ్ బాస్ కి క్రేజ్ వస్తుందని చెప్పి.. వారిని కాపాడుతున్నారు. వరుణ్ సందేశ్ మొదట్లో ఎలా ఉన్నా ప్రస్తుతం మిస్టర్ కూల్ టాగ్ వేసుకున్నాడు. ఇక వితిక అన్నింటికి అగ్రెస్సివ్ అవుతుండేది.. కానీ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతుంది. ఇక వీరి క్రేజ్ తో బిగ్ బాస్ నిర్వాహకులు వారికి ఈ సీజన్ మొత్తానికి కలిపి 30 లక్షల పారితోషకానికి తెచ్చారట. ఫైనల్స్ వరకు ఉన్నా ఇస్తారు, లేకున్నా అదే పేమెంట్ వారికి వస్తుంది. ఇక ఫైనల్ విన్నర్ అయితే మరో 50 లక్షలు ఈ జంటకి అదనం. అప్పటివరకు ఉంచేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తుందంటున్నారు. మరోపక్క శ్రీముఖి, పునర్నవికి కూడా గట్టిగానే ఇస్తున్నారట. మిగతా వాళ్ళకి వారానికి ఇంత అని మట్లాడారు కానీ.. పై నలుగురికి మాత్రం ఒకె ఎమౌంట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది.
|
https://www.telugupost.com/crime/man-refuses-to-show-wife-on-video-call-and-stabbed-by-colleague-in-banglore-1460491
|
వీడియో కాల్ లో తన సహఉద్యోగి భార్యను చూపించలేదన్న కోపంతో.. అతడిపై మరో ఉద్యోగి కత్తెరతో దాడి చేసి గాయపరిచాడు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. హెచ్ఎస్ఆర్ లే ఔట్ లో ఉన్న ఓ దుస్తుల షాపులో సురేష్(56), రాజేశ్ మిశ్రాలు(49) టైలర్ కమ్ సేల్స్ మెన్లుగా పనిచేస్తున్నారు. సురేశ్ హెచ్ఎస్ఆర్ లేఔట్ లో, రాజేశ్ కోరమంగళ దగ్గర వెంకటాపురలో నివాసముంటారు. డ్యూటీలో ఉండగా.. రాజేశ్ మిశ్రాకు అతని భార్య ఫోన్ కాల్ చేయగా.. అతను ఫోన్ లో మాట్లాడుతున్నాడు.ఇంతలో అక్కడికి వచ్చిన సురేశ్.. రాజేశ్ కి అడ్డు తగిలి నీ భార్యను వీడియో కాల్ చేసి చూపించమని అడిగాడు. అందుకు రాజేశ్ ఒప్పుకోలేదు. నా భార్యను నువ్వు చూడటం ఏమిటంటూ.. ససేమిరా కుదరదన్నాడు. ఈ విషయమై ఇద్దరిమధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సురేశ్ ఆవేశంతో చేతికి అందిన కత్తెరతో రాజేశ్ పై దాడిచేశాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. ఈ దాడిలో గాయపడిన రాజేశ్ మిశ్రాను ఇతర సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తనపై జరిగిన దాడి గురించి రాజేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సురేశ్ పై ఐపీసీ సెక్షన్ 324, 504 కింద కేసులు నమోదు చేసి, సురేశ్ ను అరెస్ట్ చేశారు.
|
https://www.telugupost.com/movie-news/lawrence-offer-to-sri-reddy-82172/
|
క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటి శ్రీరెడ్డికి తమిళ డైరెక్టర్ రాఘవ లారెన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీరెడ్డి ఇటీవల పలువురు కోలీవుడ్ దర్శకులు, నటులపై కూడా లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ పైన కూడా ఆమె ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన లారెన్స్... ఏడేళ్ల క్రితం రెబల్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీరెడ్డి తనను కలిసిందని, ఒకవేళ తన తప్పు ఏమైనా ఉంటే ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. తన హోటల్ రూంకి వచ్చినట్లు శ్రీరెడ్డి చెబుతుందని, రూంలో దేవుళ్ల పోటోలు రుద్రాక్ష మాల ఉన్నాయని చెబుతుందని, తాను హోటల్ రూంలో రుద్రాక్ష మాల పెట్టి, దేవుళ్లకు పూజలు చేసేంత ఫూల్ ని కాదన్నారు.టాలెంట్ ఉంటే మంచి పాత్ర ఇస్తా...తాను మహిళలకు అమితంగా గౌరవం ఇస్తానని, అందుకే తన తల్లికి గుడి కట్టించి మహిళలకు అంకితం చేశానని లారెన్స్ గుర్తుచేశారు. శ్రీరెడ్డికి తన చిత్రంలో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ముందు ప్రెస్ మీట్ పెట్టి, అందరి ముందు ఒక సీన్, కొన్ని సులువైన డ్యాన్స్ స్టెప్స్, డైలాగ్స్ ఇస్తానని, ఒకవేళ ఆమెకు టాలెంట్ ఉంటే కచ్చితంగా తన తర్వాతి చిత్రంలో మంచి పాత్ర ఇచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తానన్నారు. తన సినిమాలో నటించడం ద్వారా మరిన్ని అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అందరి ముందు నటించడానికి ఇష్టపడకపోతే, ఒక లాయర్ ను, ఆమె శ్రేయోభిలాషులను తీసుకువచ్చైనా నటించి చూపిస్తే చాలని స్పష్టం చేశారు. అయితే, ఇది శ్రీరెడ్డికి భయపడి చెప్పడం లేదని, ఒక మహిళగా ఆమెను గౌరవిస్తూ చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు.
|
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-world-famous-lover-collections-148121/
|
విజయ్ దేవరకొండ హీరోగా నలుగురు హీరోయిన్స్ నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో సో టాక్ తెచ్చుకున్న వరల్డ్ ఫెమస్ లవర్ ఓపెనింగ్స్ కూడా భారీగా కనబడలేదు. మొదటినుండి ఈ సినిమాపై పెద్దగా క్రేజ్ కానీ, బజ్ కానీ లేదు. దానికి తగ్గట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ ఫెమస్ లవర్ 4.34 కోట్లు కొల్లగొట్టింది. మరి విజయ్ క్రేజ్ కి ఈ ఓపెనింగ్స్ చూస్తుంటే చాలా డల్ అనే చెప్పాలి. ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 2.05 సీడెడ్ 0.37 నెల్లూరు 0.18 కృష్ణ 0.25 గుంటూరు 0.43 వైజాగ్ 0.51 ఈస్ట్ గోదావరి 0.31 వెస్ట్ గోదావరి 0.24 టోటల్ ఏపీ & టీస్ షేర్: 4.34
|
https://www.telugupost.com/movie-news/ఈ-హీరోయిన్-కి-జ్ఞానోదయం-అ-62085/
|
చిన్నగా కెరీర్ మొదలు పెట్టి టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో జోడి కట్టి టాప్ రేంజ్ కి చేరుకున్నాక కూడా... చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ గత ఐదేళ్లుగా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్తో బిజీగా ఉన్నప్పటికీ... టాలీవుడ్ లో మాత్రం పూర్తిగా ఖాళీ అయ్యింది. నిన్నమొన్నటివరకు టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న ఈ భామ ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ వలన గట్టి పోటీ ఎదుర్కుంటూ వెనుకబడిపోయింది. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా కొత్త హీరోయిన్స్ వైపు చూడడంతోనే రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ సినిమాలు తగ్గిపోయాయి.అయితే టాప్ రేంజ్ లో ఉన్న రకుల్ ప్రీత్ రెమ్యునరేషన్ కూడా అంతే టాప్ రేంజ్ లో ఉండడంతో... ఆమెని టాలీవుడ్ దర్శక నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేసారు. అయితే దర్శకనిర్మాతల బాధని రకుల్ పసిగట్టినట్టుగా కనబడుతుంది. తనకి అవకాశాలు తగ్గడానికి రెమ్యునరేషన్ కారణమని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కనబడుతుంది రకుల్ వ్యవహారం. రకుల్ ప్రీత్ ఇప్పుడు తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టుగా తెలుస్తోంది. కథా కథనాలు తో పాటు ఆ సినిమాలో తన పాత్ర బాగుంటే చాలంటూ మాట మార్చేసిందని అంటున్నారు. మరి రకుల్ ప్రీత్ ఇలాంటి డెసిషన్ తీసుకోకపోతే మరో పదికాలాల పాటు టాలీవుడ్ లో మనగలగడం కష్టం. నిన్నమొన్నటివరకు తానే సినిమాలు ఒప్పుకోకుండా రెస్ట్ తీసుకుంటున్నాని బిల్డప్స్ ఇచ్చిన రకుల్ కి ఇప్పుడు బాగా జ్ఞానోదయం అయినట్టుగా ఉంది. అందుకే తన పారితోషకాన్ని తగ్గించేసింది అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.
|
https://www.telugupost.com/movie-news/heroes-afraid-of-corona-162235/
|
కరోనా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమైన స్టార్స్ అంత.. ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడమే కాదు.. కొత్త కథలను ఫోన్ లోనే వింటున్నారు. దర్శకులు నేరేట్ చేసే కథలను వింటున్న హీరోలంతా ఎప్పుడెప్పుడు షూటింగ్ స్పాట్ కి వెళ్దామా అని అస్సలు ఎదురు చూడడం లేదు. కారణం కరోనా భీబత్సం. కరోనా ఉదృతి కొనసాగుతున్న టైం లో షూటింగ్ కి ఆనుమతులొచ్చినా స్పాట్ కి వెళేళ్దుకు ఏ హీరో మొగ్గు చూపడం లేదు. ఆగష్టు నుండి హీరోలకంతా తమ తమ సినిమా సెట్స్ లోకి వెళతారని చెబుతున్నారు. కొంతమంది ఆగష్టు టార్గెట్ గా సిద్ధమవుతున్నారు కూడా. కానీ ఇప్పుడు వాళ్ళని సీరియల్స్ షూటింగ్స్ బాగా భయపెట్టేశాయి. టాలీవుడ్ లో షూటింగ్స్ కి ఆనుమతులు రావడం తరువాయి.. తెలుగు, హిందీ, తమిళ సీరియల్స్ షూటింగ్స్ పొలోమంటూ మొదలయ్యాయి. మూడు నెలల గ్యాప్ తర్వాత సెట్స్ మీదకెళ్ళిన ఆర్టిస్ట్ లు మొదటి రెండు రోజులు మంచి ఉత్సాహంగా కనిపింఛారు. కానీ తర్వాత నుండి ఒక్కో సీరియల్ షూటింగ్ లో ఒక్కో కరోనా పాజిటివ్ లు రావడంతో మొత్తం యూనిట్ తల పట్టుకుని టెస్ట్ లు చేయించుకుని మరీ హోమ్ క్వారంటైన్ కి వెళ్లారు. జీ తెలుగు మొదలు మా టివి సీరియల్స్ లో నటించే నటులకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఆగష్టు నుండి సినిమా షూటింగ్స్ కి హాజరవుదామనుకున్న హీరోలంతా ఇప్పుడు మల్లి గప్ చుప్ అంటున్నారట. సీరియల్స్ కె అలా ఉంటె.. సినిమా షూటింగ్స్ లో వందలాదిమంది పని చెయ్యాలి. అలాంటప్పుడు కరోనా కట్టడి అసాధ్యం. అందుకె ఆగష్టు లో కూడా సినిమా షూటింగ్స్ మొదలయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.
|
https://www.telugupost.com/movie-news/గౌతమీపుత్ర-శాతకర్ణి-ఫస్-3-20176/
|
ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 7 .31సీడెడ్ 6 .47వైజాగ్ 4 .00ఈస్ట్ గోదావరి 3 .02వెస్ట్ గోదావరి 3 .06క్రిష్ణ 2 .57గుంటూరు 3 .66నెల్లూరు 1 .50కర్ణాటక 3 .50యూ.ఎస్.ఏ 5.10రెస్ట్ ఆఫ్ ఇండియా &రెస్ట్ ఆఫ్ వరల్డ్ 1 .50ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 41 .69
|
https://www.telugupost.com/crime/tragedy-struck-on-holi-in-ujjaini-fire-broke-out-in-the-temple-of-mahakaleshwar-1527363
|
ఉజ్జయినిలో హోలీ రోజున విషాదం చోటు చేసుకుంది. మహాకాళేశ్వరుడి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం హోలీ సందర్భంగా పూజారులు భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పూజారులతో సహా పదమూడు మంది భక్తులు గాయాలపాలయ్యారు. హోలీ కావడతో అధిక సంఖ్యలో భక్తులు ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు.పూజారులతో పాటు...ఉదయం భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు పూజారులు గాయపడ్డారు. ఎనిమిది భక్తులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో గాయపడిన వారందరూ కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
|
https://www.telugupost.com/movie-news/mega-daughter-niharika-career-116056/
|
మెగా ఫ్యామిలీ నుండి ఏకైన హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెలకు లక్కు అస్సలు కలిసి రావడం లేదు. ఏదో వెబ్ సీరీస్ తో కాలం గడిపెయ్యకుండా హీరోయిన్ అంటూ సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ మెగా డాటర్. ఒక మనసు సినిమాలో నాగశౌర్యతో కలిసి నటించింది. ఆ సినిమా యావరేజే అయ్యింది. తర్వాత హ్యాపీ వెడింగ్ అంటూ సుమంత్ అశ్విన్ తో కలిసి హడావిడి చేసింది. కానీ ఆ సినిమా కూడా పోయింది. మెగా అభిమానులే నిహారిక సినిమాలను హిట్ చేయలేకపోతున్నారు. మరి ౩౦ ఏళ్లు వచ్చాయి అంటే పెళ్లి చేస్తామని ఇంట్లో వాళ్లు చెప్పారు. ఈలోపే సినిమాలు చేసుకోవాలని చెప్పిన నిహారిక.. ఎడాపెడా సినిమాలేవీ చెయ్యడం లేదు కానీ ఆమెతో సినిమాలు చేసే దర్శకులే సరిగ్గా నిహారికకు హిట్ ఇవ్వలేకపోతున్నారు. నిహారికతో సినిమా అంటేనే సినిమా కథ మొత్తం నిహారికనే హైలెట్ చేస్తూ.. ఆమె చుట్టూనే తిరిగేటట్టుగా రాసుకుంటున్నారు. అక్కడే వాళ్లకి దెబ్బసేది. సూర్యకాంతం కూడా అంతే… తాజాగా రాహుల్ విజయ్ హీరోగా నిహారిక ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రణీత్ సూర్యకాంతం అనే సినిమాని తెరకెక్కించాడు. మారి ఆ సినిమాలో సూర్యకాంతంగా నిహారిక క్యారెక్టర్ బాగుంది కానీ ఆమె నటనకు ప్రేక్షకులే కనెక్ట్ కాలేకపోతున్నారు. ఈ సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. డిజాస్టర్ టాక్ వచ్చింది. రివ్యూ రైటర్స్ కూడా సూర్యకాంతంకి ఫెయిల్ మార్కులే వేశారు. నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పోటీగా దిగిన సూర్యకాంతం పూర్ టాక్ తో మొదలై సాయంత్రానికి థియేటర్స్ దగ్గర జనాలు లేక వెలవెలబోయాయి అంటే మెగా ప్రిన్స్ పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. మరి మార్చి పొతే సెప్టెంబర్, సెప్టెంబర్ పొతే మార్చి అన్నట్టుగా నిహారిక పరీక్షలు రాస్తూనే ఉంది. ఫెయిల్ అవుతూనే ఉంది. నిన్న విడుదలైన సూర్యకాంతం నిహారికకు ఎలాంటి ప్లస్ కాదు కదా ఆ సినిమా చూసిన వారంతా మెగా డాటర్ కి సినిమాలెందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి నిహారిక ఇక సినిమాలు ఆపేస్తుందో.. లేదంటే మరో ట్రయిల్ వేసుకుంటుందో చూద్దాం.
|
https://www.telugupost.com/movie-news/animal-made-my-daughter-cry-congress-mp-ranjeet-ranjan-in-rajya-sabha-1508337
|
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటిరోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. మొదటిరోజు ఈ సినిమా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.356 కోట్లు వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రూ.563 కోట్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా గురించి పార్లమెంట్ దాకా వెళ్ళింది.యానిమల్ మూవీపై ఛత్తీస్‌గఢ్ ఎంపీ రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. సినిమాను చూడడానికి వెళ్లిన తన కూతురు ఏడుస్తూ బయటకు వచ్చిందని అన్నారు. నా కూతురు తన ఫ్రెండ్స్ కలిసి యానిమల్ సినిమాకు వెళ్లింది. సినిమా మధ్యలోనే ఆమె ఏడుస్తూ బయటికి వచ్చేసింది. సినిమాలో హింస, మహిళలపై వేధింపులు సన్నివేశాలు చాలా ఉన్నాయని అన్నారు. అలాంటివి చూపించడం నాకు నచ్చదు. కబీర్ సింగ్ సినిమాలో హీరో తన భార్య, సమాజాన్ని, తోటి మనుషులతో చాలా అగ్రెసీవ్ బిహేవ్ చేస్తాడు. పైగా అలాంటి పాత్రలే కరెక్ట్ అన్నట్లుగా చూపిస్తున్నారు. ఇది కచ్చితంగా ఆలోచనను రేకెత్తించే అంశమే అవుతుంది. ఇలాంటి సినిమాలు ఇంటర్ చదివే పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. అలాంటి వారిని రోల్ మోడల్ గా భావిస్తున్నారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రంజీత్ రంజన్. సినిమా అనేది సమాజానికి అద్దం లాంటిది. మనం సినిమాలు చూస్తూ పెరిగాం.. అది యువతను ప్రభావితం చేయగలదన్నారు. మొదట కబీర్ సింగ్, పుష్ప లాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు యానిమల్ వచ్చింది. నా కూతురు తన కాలేజీ స్నేహితులతో కలిసి సినిమా చూడటానికి వెళ్లి, ఏడుపు ఆపుకోలేక మధ్యలోనే బయటకు వెళ్లిపోయిందన్నారు.
|
https://www.telugupost.com/movie-news/బాహుబలిని-కట్టప్ప-ఎందుక-30661/
|
అందరినీ రెండేళ్లుగా ఊరిస్తున్న బాహుబలి 2 సినిమా అదరహో అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా సీనీ అభిమానులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు బాహుబలి దర్శకుడు రాజమౌళి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. బాహుబలి 2లో యుద్ధసన్నివేశాలు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఐదేళ్ల రాజమౌళి కృషి ఫలించిందనే చెప్పొచ్చు.బాహుబలి అదుర్స్....అమరేంద్ర బాహుబలిని రాజమాత శివగామి రాజ్యానికి రాజుగా ప్రకటిస్తుంది.పట్టాభిషేకానికి ఇంకా సమయం ఉండటంతో రాజ్యంలో పర్యటనకు బయలుదేరుతాడు బాహుబలి. ఆ పర్యటనలోనే కుంతల దేశపు యువరాణి దేవసేన ప్రేమలో పడతాడు. దేవసేన ఫొటోను చూసి భళ్లాలదేవుడు కూడా ప్రేమలో పడతాడు. భళ్లాల దేవుడిని మహేంద్ర బాహుబలి ఎలా చంపుతాడు? కట్టప్ప అమరేంద్ర బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న ప్రశంసలు అందుతున్నాయి. ఫస్ట్ హాఫ్ ను సెంటిమెంట్ కు కామెడీ జోడించడంతో అదిరింది. విజువల్స్ ఎఫెక్ట్ అదిరిపోయాయి. రాజమౌళి ఎంత శ్రద్ధ పెట్టాడనేది ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. మొత్తం మీద బాహుబలి 2 ది కన్ క్లూజన్ అంచనాలకు మించి హిట్ అయింది. బాహుబలి 2 హాలివుడ్ సినిమాల సరన నిలుస్తందని యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు తెలిపారు. హాలివుడ్ లో మరిచిపోలేని చిత్రాలైన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, హ్యారీపోర్టర్ సరసన బాహుబలి చేరనుందని ఆయన తెలపడం విశేషం. చిత్రంలోని ప్రతి ఫ్రేమూ ఆకట్టుకునే విధంగా ఉందని ఆయన కొనియాడారు. సో బాహుబలి సూపర్ సక్సెస్.
|
https://www.telugupost.com/movie-news/హమ్మా-ఇప్పటికి-ఫిక్స్-అయ-40710/
|
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించే సినిమాపై బాహుబలి రిలీజ్ కి ముందే క్లారిటీ వచ్చింది. సుజిత్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్ నిర్మాణంలో ప్రభాస్ సాహో చిత్రాన్ని బాహుబలి విడుదలకు ముందే ఎనౌన్స్ చేసాడు. సాహో సినిమా ని ఎనౌన్స్ చెయ్యడమే కాదు ఆ సినిమా టీజర్ తో కూడా వచ్చేసి అభిమానులకు షో టైం అంటూ షాకిచ్చేసాడు.అదిగొ... అప్పటినుండి ప్రభాస్ పక్కన చెయ్యబోయే హీరోయిన్ విషయంలో వచ్చిన వార్తలు మరే సినిమా హీరో కి వచ్చి ఉండవు . ప్రభాస్ పక్కన సాహోలో ఈ హీరోయిన్ ఫైనల్ అంటే ఆ హీరోయిన్ ఫైనల్ అంటూ వచ్చిన గాసిప్స్ కి లెక్కే లేదు.ముందుగా బాలీవడ్ భామ అన్నారు. కాదు కాదు బాహుబలి భామ అనుష్కనే సాహోలో ప్రభాస్ పక్కన అన్నారు. కాదు అంటూ మళ్ళీ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ అన్నారు. లాస్ట్ కి ఫైనల్ గా శ్రద్ద కపూర్ సాహో చిత్రంలో ప్రభాస్ పక్కన ఫైనల్ అయ్యింది. ఈ విషయాన్నీ యూవీ క్రియేషన్స్ వారు అధికారికంగా ప్రకటించారు. సాహో ఫ్యామిలీ బ్యూటిఫుల్ శ్రద్దా కపూర్ కు స్వాగతం పలుకుతున్నాం అంటూ ట్వీట్ చేసింది. ముందు అనుకున్నట్టుగానే సాహో కోసం బాలీవుడ్ భామనే దింపారు. ఇక సాహో చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు . మరీమూడు భాషల్లో సినిమా అంటే హీరోయిన్ కి కూడా గట్టిగానే సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మూడు భాషల్లో ప్రమోషన్ కార్యక్రమం గట్రా ఉంటుంది కాబట్టి శ్రద్ధకి కూడా సాహో చిత్ర యూనిట్ భారీగానే సమర్పించారని టాక్ ఉంది. శ్రద్ద కపూర్ సాహో లో నటిస్తున్నందుకు గాను ఆమెకి ఏకంగా 8 కోట్లు పారితోషకం ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
|
https://www.telugupost.com/movie-news/చాలా-స్లిమ్-అయ్యాడే-35345/
|
ఎప్పుడూ ఫిట్నెస్ మెయింటైన్ చేసే పవన్ కళ్యాణ్ ఈ మధ్యన రాజీకీయాల్లో పడి కాస్త వళ్ళు చేసాడు. సినిమాల్లో రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ విషయంలో అశ్రద్ధ చేసాడనే చెప్పొచ్చు. అందుకే 'కాటమరాయుడు' సాంగ్స్ లో పవన్ లావుగా ఉన్నాడనే కామెంట్స్ కూడా పడ్డాయి. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కోసం పవన్ లావు తగ్గే ప్రయత్నాలు మొదలు పెట్టాడనే ప్రచారం వుంది. ఫిట్ గా, అందంగా కనబడాలంటే చాలా కష్టపడి వర్కౌట్స్ చెయ్యాలని ఎవరూ పవన్ కి సూచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాలకంటే ముందే పవన్ మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం సంపాదించి ఫిట్ గా వున్నాడు.ఇక ఇప్పుడు పెరిగిన బరువును పవన్ కళ్యాణ్ బెంగుళూరు వెళ్లి కరిగించుకుంటున్నాడట. మొన్నామధ్యన దాసరి మరణం తో మీడియా ముందుకు వచ్చిన పవన్ ఆతర్వాత మళ్ళీ మీడియాకి చిక్కలేదు. అయితే ఈ గ్యాప్ లో పవన్ బెంగుళూరు వెళ్లి బరువు తగ్గించుకున్నాడట. ఆ విషయం ఇప్పుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలోని ఆన్ లొకేషన్ లోని పిక్ ద్వారా అర్ధమవుతుంది. షూటింగ్ లొకేషన్ లో లీకైన పిక్ ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా స్లిమ్మయ్యాడనిపిస్తుంది. మరి ఎంత కమిట్మెంట్ లేకపోతె పవన్ ఇంత తక్కువ సమయంలో అలా సన్నగా తయారయ్యాడో అని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబై పోతున్నారు.అంటే మనం త్రివిక్రమ్ సినిమాలో అందంగా స్లిమ్ గా వుండే పవన్ ని చూడబోతున్నామన్నమాట. ప్రస్తుతానికి ఈ లీకైన పవన్ పిక్ ని చూసి మీరు ఎంజాయ్ చెయ్యండి.
|
https://www.telugupost.com/movie-news/actor-prakash-raj-is-once-again-incensed-at-prime-minister-narendra-modi-1340211
|
ప్రధాని నరంద్రమెదీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి మండిపడ్డారు. రైతులకు క్షమాపణలు చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రైతులకు క్షమాపణ చెబితే సరిపోదని, జరిగిన నష్టానికి బాధ్యత వహిస్తారా? అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. రైతులు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన చేస్తున్న నేపథ్యంలో మోదీ చట్టాలను వెనక్కు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.జరిగిన నష్టానికి....అయితే దీనిపై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఏడాదిన్నరగా రైతులు చలిలో, వర్షంలో తడుస్తూ ఉద్యమం చేశారని, ఎందరో ప్రాణాలు కోల్పోయారని, జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
|
https://www.telugupost.com/movie-news/అన్నీ-చేతులెత్తేశాయి-43876/
|
ఆగష్టు 25 న విడుదలైన అర్జున్ రెడ్డి అనూహ్య విజయం తర్వాత మళ్ళీ ఇప్పటివరకు అంటే గత నాలుగు వారాలుగా బాక్సాఫీసును షేక్ చేసే సినిమా ఒక్కటి రాలేదు. సెప్టెంబర్ 1 న పైసా వసూల్ పైసల్ వసూలు చెయ్యలేక చేతులెత్తేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 8 న యుద్ధం శరణం, మేడ మీద బ్బాయి చిత్రాలు రెండూ బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. ఇక ఆ తర్వాతి వరం అంటే ఈ శుక్రవారం సెప్టెంబర్ 15 న ఏకంగా 5 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సినిమాలైతే వరుసగా క్యూ కట్టాయి కానీ..... ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనేది పచ్చి నిజం. నారా రోహిత్ కథలో రాజకుమారి అంటూ సైలెంట్ గా బాక్సాఫీసు వద్ద యుద్దానికి దిగిపోయాడు. ఇక సినిమా టైటిల్ తో బాగానే ఎట్రాక్ట్ చేసింది కథలో రాజకుమారి. అలాగే ఈ సినిమాలో నాగ సౌర్య వంటి హీరో క్యామియోరోల్ చేసిన ఫలితం మాత్రం ప్లాప్. అలాగే సునీల్ నటించిన ఉంగరాల రాంబాబు సినిమా మొదటి రోజు మొదటి ఆటకే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సోమవారం నుంచి ఈ సినిమా ఆడేది డౌటే అంటున్నారు. ఇక బాహుబలి రైటర్ దర్శకత్వంలో వచ్చిన శ్రీవల్లీ మూవీ కూడా డిజాస్టర్ అయింది. అసలు ఈ సినిమా ఏ యాంగిల్ లో ఆకట్టుకోలేదు. ఇక శ్రీ వల్లికి కి పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఫుల్ గా సపోర్ట్ కూడా చేశారు.రామ్ చరణ్, రాజమౌళి, వెంకటేశ్, ప్రభాస్ లాంటి బడా స్టార్స్ ప్రమోట్ చేసినప్పటికీ.. శ్రీవల్లి సినిమాలో విషయం లేకపోవడంతో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక సచిన్ జోషి హీరోగా తెరకెక్కిన వీడెవడు కూడా దాదాపు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక తమిళ్ నుండి డబ్బింగ్ అయిన సరసుడు కూడా సోది లోకి లేకుండా పోయింది. శింబు-నయనతార కాంబోలో వచ్చిన సరసుడు సినిమాను భరించడం ప్రేక్షకుల వల్ల కాలేదు. అలా ఈ శుక్రవారం విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోగా... ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే చివరికి ఈవారం కూడా అర్జున్ రెడ్డి కి కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటున్నారు.
|
https://www.telugupost.com/top-stories/telugu-desam-party-chief-chandrababu-seems-to-be-mentally-prepared-1448517
|
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మానసికంగా సిద్ధమయినట్లే కనిపిస్తుంది. తనతో జనసేన, బీజేపీ కలసి రాకపోయినా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందుకే తనకు చివరి ఎన్నికలు అని ఆయన ప్రస్తావించారు. జనసేన తనతో కలిసినా, రాకున్నా వచ్చే నష్టమేదీ లేదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లుంది. ఆయనకు అంతా మంచే జరుగుతుందా? జనసేన తనతో కలసి రాకపోయినా చంద్రబాబుకు రాజకీయంగా వచ్చే ఇబ్బంది ఏమీ లేదా? అంటే ప్రస్తుతానికి మాత్రం అవుననే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు పై మధ్యతరగతి, ఉన్నతవర్గాల ప్రజలలో మాత్రం ఒక ప్రత్యేక అభిమానం ఉంది. విజన్ ఉన్న నేతగా ఆయనను అనుకుంటారు. చంద్రబాబు వల్ల రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని నమ్ముతారు. అదే సమయంలో అట్టడుగు వర్గాల్లోనూ ఎన్టీఆర్ వేసిన బీజం కొంత మేర అలాగే ఉంది. ఆ అభిమానం చెక్కు చెదరలేదనడానికి ఉదాహరణ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతమేనని చెప్పాలి.అడ్వాంటేజీ కంటే...ఇప్పుడు పవన్ కల్యాణ్ తన వెంట వస్తే కొంత అడ్వాంటేజీ ఉండి ఉండవచ్చు. కాపు సామాజికవర్గంలోనూ, యువతలోనూ కొంత అదనపు బలం చేకూరవచ్చు. కానీ గంపగుత్తగా కాపులు మొత్తం తమ వెంట నడుస్తారన్న నమ్మకం లేదు. పవన్ వస్తే తమ పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన బీసీలందరూ వ్యతిరేకమవుతారు. అది కూడా చంద్రబాబుకు పవన్ తో కలసి నడిస్తే నష్టమేనన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. తనపై ఒక ముద్ర తొలగించుకోవడానికి కూడా చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు ఉపయోగపడతాయి. ఒంటరిగా పోటీ చేస్తే చంద్రబాబు గెలవలేరన్న అపప్రథ నుంచి తాను బయటపడేందుకు వీలుంటుంది. ఆ రోజులు మారాయి...ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అధికార పార్టీకి అడ్వాంటేజీ అన్నది ఒకప్పుడు మాట. కానీ రోజులు మారాయి. ప్రజల్లో మార్పు వచ్చింది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజల్లో చైతన్యం వచ్చింది. అందుకే ప్రజలు కూడా తాము ఏ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారో ఆ పార్టీకి ఓటు వేస్తారు తప్ప. కులాలు చూడరు. అభిమానం చూపరు. అందరూ కోరుకుంటే వన్ సైడ్ విజయం దక్కుతుంది. దానిని ఆపే శక్తి ఎవరికీ ఉండదు. పొత్తులతో తాము ముందుకు వెళితే జరిగే నష్టాల కంటే లేకుంటే వచ్చే ప్రయోజనాలే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు.లాస్ట్ ఛాన్స్ అంటే...చంద్రబాబుకు ఏపీ రాజకీయాల్లో ఒక అడ్వాంటేజీ వచ్చే ఎన్నికలలో ఉందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. వయసు రీత్యా ఆయనకు కొంత సానుభూతి లభిస్తుంది. పవన్ కల్యాణ్ ఒక్క ఛాన్స్ అన్నా వినరేమో కాని, చంద్రబాబు తనకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వమంటే ప్రజలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. పైగా టీడీపీని అంత తీసేసే పార్టీ కాదు. ప్రతి గ్రామంలో జెండా ఉన్న పార్టీ అది. ప్రతి బూత్ లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీ అది. అందుకే పవన్ తన దరి చేరకుండా వెళ్లినా చంద్రబాబుకు ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీ లేదు. పైగా అందరూ కలసి పెద్దాయనను ఇబ్బంది పెడుతున్నారన్న సానుభూతి దొరుకుతుంది. అందుకే పవన్ తమను కాదనుకుని వెళ్లినా చంద్రబాబుకు ఎలాంటి నష్టం లేదు. అంతే కాదు 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలు, క్యాడర్ మరింత జోరుగా పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. చూడాలి మరి.. పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో జరిగే ప్రత్యేకంగా జరిగే నష్టం లేదు. అలాగని వచ్చే ప్రయోజనం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.
|
https://www.telugupost.com/movie-news/vaibhav-reddy-will-play-ram-charan-brother-role-in-rangasthalam-movie-1509996
|
Rangasthalam : సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ 'రంగస్థలం'. ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రామ్ చరణ్ కెరీర్ కి అయితే.. ఇదొక మైల్ స్టోన్ అయ్యింది. బ్రదర్ సెంటిమెంట్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో రామ్ చరణ్ కి అన్నయ్య ఆది పినిశెట్టి నటించారు. అయితే ఆ పాత్ర కోసం ఆది కంటే ముందు సుకుమార్ మరో హీరోని ఎంపిక చేశారట. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆయన ఎందుకు నటించలేదు..?చిరంజీవితో ఖైదీ, అభిలాష, ఛాలెంజ్ వంటి సూపర్ హిట్స్ తెరకెక్కించిన దర్శకుడు కోదండరామిరెడ్డి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో 'వైభవ్ రెడ్డి'. తెలుగు సినిమా 'గొడవ'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైభవ్.. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ హీరోనే రంగస్థలంలో రామ్ చరణ్ కి అన్నయ్యగా నటించాల్సిందట. వైభవ్, రామ్ చరణ్ కూడా కొంచెం చూడడానికి ఒకేలా ఉంటారు. సుకుమార్ కథ వినిపించగా వైభవ్ కూడా ఓకే చేశారట.ఆ ఛాన్స్ తనకి వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డారట. కానీ ఆ తరువాత కొన్ని రోజులకు ఆది పినిశెట్టిని ఎంపిక చేసుకున్నట్లు తెలియజేశారట. వైభవ్ చూడడానికి రామ్ చరణ్ లా ఉండొచ్చు. కానీ ఆయన చరణ్ కి తమ్ముడిగా కనిపిస్తారు. కానీ సినిమాలో అన్నయ్య పాత్ర చేయాల్సి ఉంది. ఈ కారణంతోనే వైభవ్ ని తప్పించినట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని వైభవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో పూర్తి అవ్వనుందని చెబుతున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అవ్వాల్సిన 'జరగండి' సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ న్యూ ఇయర్ కి అయినా ఆ సాంగ్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి.
|
https://www.telugupost.com/movie-news/nidhi-agarwal-to-dance-for-a-item-song-in-bellamkonda-srinivas-movie-151797/
|
ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తో హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభ నటాషాలకు భారీ క్రేజ్ వచ్చి భారీ అవకాశాలొస్తున్నాయ్ అనుకున్నారు. అంతేకాదు.. ఈ భామలిద్దరు గ్లామర్ షో కోసం తదుపరి సినిమాల్లో భారీగా గా డిమాండ్ చేస్తున్నారనే న్యూస్ నడిచింది. ఇక ప్రస్తుతం నభ నటాషా మాత్రం స్పీడు గేర్ లోనే సినిమాలు చేస్తుంది. కానీ నిధి అగర్వాల్ కే ఇంతవరకు సినిమా దొరకలేదు. నభ నటాషా సాయి ధరమ్ తేజ్ తోనూ, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సినిమాలు చేస్తుంది. ఇక నిధి మాత్రం హీరోయిన్ అయినా పర్లేదు.. ఐటెం అయినా పర్లేదు అంటూ ఆఫర్స్ కోసం ఎదురు చోస్తుంది. అయితే ఈ హాట్ గర్ల్ నిధి కి బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం అవకాశం వచ్చింది అట. అయితే నిధి అగర్వాల్ మాత్రం ఐటెం చెయ్యడానికి ఆసక్తి చూపడంతో పాటుగా ఐటెం సాంగ్ కోసం భారీ పారితోషకం డిమాండ్ చేస్తుందట. అందాలు ఆరబోస్తూ అదిరిపోయే స్టెప్స్ వెయ్యడానికి నిధి భారీ మొత్తాన్ని డిమాండ్ చెయ్యడంతో నిర్మాతలు అవాక్కయ్యారట. అయితే నిధి అందాల కోసం నిర్మాతలు ఎంతైనా వెనుకాడలేదని.. అల్లుడు అదుర్స్ ఐటెం కోసం నిధి అక్షరాలా 80 లక్షలు పారితోషకం పట్టుకుపోయింది అనే టాక్ నడుస్తుంది. మరి ఒక్క ఐటెం కె నిధికి 80 లక్షలంటే.. హీరోయిన్ గా ఏ రెండు కొట్లో అడుగుతుందేమో.
|
https://www.telugupost.com/movie-news/ఈ-స్టార్-హీరోలు-ఈ-విషయంలో-61732/
|
గత కొంత కాలంగా స్టార్ డైరెక్టర్స్ - స్టార్ హీరోల సినిమాలకు మొదట ఎంపిక చేసిన సినిమాటోగ్రాఫర్స్ ని కాకుండా తర్వాత కారణాలు బయటికి రానివ్వకుండా ఉన్నట్టుండి మార్చేస్తున్నారు. అసలు ఒక్కోసారి కొంత షూటింగ్ పూర్తయ్యాక సడన్ గా సినిమాటోగ్రాఫర్స్ తప్పుకోవడం లాంటివి కూడా జరుగుతుంది. అసలు సినిమాకి మంచి సినిమాటోగ్రాఫర్స్ ఉండడం ఎంతో కీలకం కూడా. అసలు సినిమాలు ని ఎంతో కొత్తగా... రిచ్ గా చూపెట్టడంలో సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చాలా కీలకం. అందుకే స్టార్ హీరోస్ తమ సినిమాలకు టాప్ సినిమాటోగ్రాఫర్స్ ని ఎంచుకుంటూ ఉంటారు.అయితే ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు తమ కొత్త చిత్రాల కోసం టాప్ రేంజ్ సినిమాటోగ్రాఫర్స్ ని ఎంచుకుని ఎనౌన్స్ కూడా చేశారు. కానీ వారిప్పుడు ముందు అనుకున్న వారిని కాకుండా కొత్తవారిని తీసుకున్నారు. ఆ స్టార్ హీరోలెవరో కాదు ఒకరు మహేష్ బాబు, మరొకరు ఎన్టీఆర్. మహేష్ - వంశి పైడిపల్లి చిత్రానికి గాను ముందుగా సినిమాటోగ్రాఫర్ గా ‘మనం, ఊపిరి, ధృవ, విక్రమ్ వేద’ లాంటి సినిమాలకు పని చేసిన పి.ఎస్.వినోద్ ను అనుకున్నారట. అలాగే ఎన్టీఆర్ - త్రివిక్రం సినిమాకి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అయిన మోహనన్ ని తీసుకున్నారట.కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి అనుకున్న మోహనన్ మహేష్ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తుండాగా... మహేష్ బాబు కి అనుకున్న పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రాఫర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడట. మరి ఈ స్టార్ హీరోల సినిమాలకు ముందు అనుకున్న సినిమాటోగ్రాఫర్స్ వేరు ఇప్పుడు పనిచేస్తున్నవారు వేరు. మరి ఎన్టీఆర్ కి చెయ్యాల్సిన వాడు మహేష్ కి, మహేష్ కి చెయ్యాల్సిన వాడు ఎన్టీఆర్ కి అలా రివర్స్ అయ్యారన్నమాట.
|
https://www.telugupost.com/movie-news/pooja-about-movies-169870/
|
బాలీవుడ్ లో సక్సెస్ కాలేక టాలీవుడ్ కి వచ్చి ఇక్కడే జెండా పాతిన పూజ హెగ్డే ఇప్పుడు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా పూజ హెగ్డే చుట్టూనే తిరుగుతున్నారు. అయితే పూజ హెగ్డే కెరీర్ తొలినాళ్లలో సెట్స్ లో ఏమైనా ఇబ్బందులు పడ్డారా అన్న ప్రశ్నకు.. ఆబ్బె లేదండి ఇష్టమైన రంగంలోకి వచ్చినప్పుడు అలాంటి ఇబ్బందులు కామన్. అయినా కెరీర్ తొలినాళ్లలో షూటింగ్ ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు సెట్స్ మీదకెళ్తామా? అని ఎదురు చూసేదాన్ని. అలా షూటింగ్ స్పాట్ లో ఉత్సాహంగా ఉండేది. అంతేకాదు.. రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని సెట్ లో నేర్చుకోవాలనే తాపత్రయంతో రోజు సెట్స్ లోకి అడుగుపెట్టేదాన్ని. అలా రోజు కొత్తగా ఎం నేర్చుకుందామా అనే ఆసక్తి, ఉత్సాహం ఇప్పటికి ఉంది. షూటింగ్ లో ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఇప్పటికి పెరుగుతుంది కానీ.. తరగడం లేదంటుంది పూజ హెగ్డే. ఇక పని మీద వ్యాపకం కూడా అలానే పెరుగుతూ వచ్చింది కానీ ఎలాంటి లోపం లేదంటుంది పూజ. నటన మీద, పని మీద ప్రేమశక్తులు సినిమా సినిమాకి పెరుగుతూనే ఉన్నాయంటుంది పూజ హెగ్డే. ఇక నేను వరస సినిమాల్తో బాగా బిజీగా ఉన్నా.. ఎలాంటి అలసట లేకుండా ఉత్సాహంగా పని చేసుకుంటూ వెళ్ళడానికి అదే కారణమంటుంది పూజ హెగ్డే.
|
https://www.telugupost.com/crime/3-men-hanging-dog-to-death-video-goes-viral-in-social-media-1448108
|
ముగ్గురు వ్యక్తులు కుక్కను చిత్రహింసలకు గురిచేసి.. ఆపై ఉరివేసి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లంతా పట్టరాని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేరాలకు నెలవైన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోనీ సమీపంలోని ఎలైచిపురా ప్రాంతం ట్రోనికా సిటీలో చోటుచేసుకుంది. కుక్కను హతమార్చిన ఆ ముగ్గురు వ్యక్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో ముగ్గురు వ్యక్తులు కుక్క మెడను పట్టుకుని గోడకు అదిమిపట్టుకున్నారు. వారి ఒకరు కుక్క మెడకు గొలుసు వేసి కిందికి లాగాడు. దాంతో పాపం.. ఆ మూగజీవి నిస్సహాయ స్థితిలో నొప్పితో బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. కుక్క ఊపిరాడక కొట్టుకుంటుంటే.. ఆ నరరూప రాక్షసులు ఆనందించారు. దాని నిస్సహాయతను చూసి నవ్వుకున్నారు. చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. కాగా.. ఈ వీడియో 3 నెలల క్రితం తీసినట్టుగా తెలిసింది. వారిలో ఒక వ్యక్తిని పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
|
https://www.telugupost.com/movie-news/s-s-thaman-comments-on-his-copy-tunes-90863/
|
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ తర్వాత అంత పేరుంది ఒక్క థమన్ కే. స్టార్ హీరోలంతా తమ తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ లేదంటే... థమన్ అనే అంటారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ కుటుంబ కథా చిత్రాలకు, ప్రేమ కథ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వగలదు. ఇక థమన్ మాస్ ఎంటర్టైన్మెంట్స్ కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఇరగదీసాడు. అయితే థమన్ మీద ఒక కంప్లైంట్ ఎప్పుడు తెగ హైలెట్ అవుతుంది. తాను మ్యూజిక్ అందిస్తున్న సినిమాల పాటలు బయటికొచ్చిన వెంటనే థమన్ ఆ సినిమా నుండి ఈ ట్యూన్ కాపీ కొట్టాడు. కాదు కాదు ఈ సినిమా నుండి కాపీ కొట్టాడు.. అదేమిటి తన పాటల నుండి తానే కాపీ కొట్టాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకే థమన్ ని కాపీ క్యాట్ అంటూ ఆటపట్టిస్తుంటారు. తాజాగా థమన్ మ్యూజిక్ అందిస్తున్న అరవింద సమేత పాటలను కూడా వేరే వాటితో పోలిక పెట్టేసి థమన్ నువ్విక మారవా అంటూ సోషల్ మీడియా సాక్షిగా ఆడేసుకుంటున్నాడు.అయితే ఎప్పుడు తన మీద వస్తున్న కామెంట్స్ ని లైట్ తీసుకునే థమన్ ఈసారి బరస్ట్ అయ్యాడు. థమన్ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో తన కాపీ పాటల విషయంలో తన బాధను వెళ్లగక్కాడు. అయినా నా పాటను మళ్ళీ నేను వాడుకుంటే కాపీ అని ఎలా అంటారు అని తెలివిగా మాట్లాడిన థమన్ ఇంకా... ఓ రచయిత ఒక పాటలో ప్రేమ అని పదాన్ని రాస్తారు. మళ్ళీ ఇంకో పాటలో ప్రేమ’అని రాస్తే కాపీ అంటారా... ఇటువంటి విమర్శలపై ఐ డోంట్ కేర్. సోషల్ మీడియాలో ఎవరో ఏవో కామెంట్స్ చేస్తే పట్టించుకోను. వారికీ ఇంపార్టెన్స్ ఇస్తూ పొతే.. నాపని మీద నేను దృష్టి పెట్టలేనంటూ కామెంట్స్ చేసే వారిపై విరుచుకుపడ్డాడు.ఇక బిజినెస్ మ్యాన్ లో ఒక పాటను థమన్ కాపీ కొట్టాడంటే.. అప్పట్లో ఆ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాధ్ స్వయానా నేనే థమన్ కి ఆ సినిమా పాటను వేరే సినిమా మ్యూజిక్ నుండి తీసుకోమని చెప్పానని చెప్పినా... థమన్ మీద ఆ కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పడలేదు. ఇక వాటన్నిటిని విన్న థమన్ పై విధంగా స్పందించాడు. ఇక మ్యూజిక్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్... తన స్టయిల్ తనదని.. మళ్ళీ మళ్ళీ విమర్శిస్తే నేనేం చేయను. నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడను. కామెంట్ చేయడం వాళ్ళ బతుకు అనుకుంటే బతకనివ్వండి. హ్యాపీగా కామెంట్ చేసుకోమనండి. అంటూ తన కాపీ కంటెంట్ విషయంలో బరస్ట్ అయ్యాడు.
|
https://www.telugupost.com/movie-news/ఇంత-చెబుతుంది-ఏం-లేదంటుం-61738/
|
అఖిల్ తో కలిసి వెండితెరకు హలో అంటూ పరిచయమైన ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ ఆ సినిమా యావరేజ్ టాక్ తో కాస్త ఊపిరి పీల్చుకుంది. ఆ సినిమాలో క్యూట్ లుక్స్ తోపక్కింటి అమ్మాయిలా ఆకట్టుకున్న కళ్యానికి హలో సినిమా తర్వాత ఓ... అన్నంత ఆఫర్స్ ఏం రాలేదు. హలో సినిమాలో ఆమె లుక్స్ ని పొగిడినవారే... ఆ అమ్మాయికి ఆఫర్స్ ఇచ్చే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. అయితే తాజాగా సినిమాలకు పరిచయమైన కళ్యాణి మీద హలో సినిమా విడుదలకు ముందు నుండే ప్రేమ పెళ్లి వార్తలు ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేశాయి.మల్లువుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ తో కళ్యాణి డీప్ లవ్ లో ఉందని... పెద్దల నిశ్చయంతో వారిద్దరూ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని కూడా అన్నారు. కళ్యాణ్, ప్రణవ్ ల పెళ్లిని కళ్యాణి తల్లి తండ్రులు, ప్రణవ్ తల్లి తండ్రులు ఇరువురు పాజిటివ్ గా ఉన్నారని కూడా అన్నారు. అయితే అప్పుడెప్పుడో వచ్చిన వార్తలకు ఇప్పుడు కళ్యాణి క్లారిటీ ఇస్తుంది. మోహన్ లాల్ కుమార్తె' విస్మయ తన బ్రదర్ ప్రణవ్ ఫోటో ని కల్యాణికి పంపగా... ఆ పిక్ ని కళ్యాణి తన పేరెంట్స్ తో షేర్ చేసిందట. ఇక ఆ ప్రణవ్ పిక్ ని చూసిన కళ్యాణి తల్లి ప్రణవ్ తల్లికి చూపించి కళ్యాణి, ప్రణవ్ లు ఇద్దరు ఇష్టపడుతున్నారేమో అని చెప్పిందట. అలా అలా తమ పెళ్లి పుకార్లు బయలుదేరాయని చెబుతుంది. అంతేకాని మా మధ్యన పెళ్లి, ప్రేమ లాంటివి ఏం లేవంటుంది కళ్యాణి. ఆలా ప్రేమపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కళ్యాణి పనిలో పనిగా ప్రణవ్ ఇష్టా ఇష్టాలను కూడా చెప్పేస్తుంది. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ కి అసలు స్టార్ కొడుకుని అనే ఫీలింగ్ ఉండదట. అతని ఎక్కడికి వెళ్లిన కేవలం 500 రూపాయల్తోనే ప్రయాణం చేస్తుంటాడట. అలాగే అవసరమైతే లారీ ప్రయాణం కూడా చేస్తాడట. మరి ప్రణవ్ గురించి అన్ని చెప్పిన కళ్యాణి మనసులో ఏం లేదంటే నమ్మాలా.?
|
https://www.telugupost.com/movie-news/is-ram-charan-really-producing-chiranjeevi-koratala-acharya-movie-151642/
|
చిరు – కొరటాల సినిమా ఆచార్య ని రామ్ చరణ్ మరో నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నట్టుగా చిరు సినిమా మొదలైనప్పుడు అన్నారు. తాజాగా రామ్ చరణ్ ఆచార్య సినిమాలో పార్టనర్ కాదని, కేవలం సినిమాని కొణిదెల ప్రొడక్షన్ లో సమర్పిస్తున్నాడని అంటున్నారు. మరోపక్క చిరు పారితోషకం, లాభాల్లో వాటా, రామ్ చరణ్ గనక ఆచార్య లో నటిస్తే రోజుకి కోటి చొప్పున 30 రోజులకి 30 కోట్లు.. ఇలా రూపాయి సినిమా మీద పెట్టకుండా మూడు వాటాలు తీసుకెళ్తున్నారు మెగా హీరోస్ అంటూ వెబ్ మీడియా, సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి హడావిడిగా ఓ ప్రెస్ నోట్ రిలీస్ చేసారు. అదేమంటే ఆచార్య సినిమాకి రామ్ చరణ్ కూడా వన్ అఫ్ ద ప్రొడ్యూసర్ అని, రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి కలిసి ఆచార్య ని నిర్మిస్తున్నారని, రామ్ చరణ్ వాటాదారుడు కాడని వస్తున్న వార్తల్లో నిజాలు లేవంటూ మీడియాకి ప్రెస్ నోట్ వదిలారు. అయితే చరణ్ భాగస్వామి కాకపోతే సినిమా మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనే ఆలోచనతోనే చరణ్ ఇలా నిరంజన్ రెడ్డి చేత ప్రెస్ నోట్ ఇప్పించాడనే టాక్ వినబడుతుంది
|
https://www.telugupost.com/movie-news/ready-for-class-169931/
|
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏదో ఒక రంగంలో తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నవారే. డబ్బు లేకపోవచ్చు కానీ.. వాళ్ళకి ఓ కేరెక్టర్ ఉంటుంది. క్రేజ్ కోసమో.. లేదంటే డబ్బు కోసమే బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్న కంటెస్టెంట్స్ కోకోల్లలు. కొంతమంది బిగ్ బాస్ ని ఎక్సపీరియన్సు చెయ్యడానికి వచ్చామని చెబుతారు కానీ.. అంత ఖాళీగా అయితే ఎవరూ ఉండదు. పారితోషకాలకి పడిపోవడం కూడా ఇక్కడ మెయిన్ గా ఉంటుంది. అయితే ఈ సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాకా కొంతమంది కన్నింగా ప్రోజెక్ట్ అవడం, కొంతమంది గొడవల్లోగా ఆరితేరిపోయినట్టుగా కనిపించడం, మరికొంతమందిని ప్రేమ పక్షుల్లా ప్రోజెక్ట్ చెయ్యడం, కంటెస్టెంట్స్ మధ్యన గొడవలు పెట్టి ప్రేక్షకులను పడెయ్యడమా అనేది బిగ్ బాస్ గేమ్ స్ట్రాటజీ. అయితే కంటెస్టెంట్స్ కొంతమంది అసహనం, సహనం కోల్పోవడం, హద్దుమీరి మాట్లాడడం, లేదంటే సైలెంట్ గా ఉండిపోవడం చూసిన హోస్ట్ లు ప్రతి శనివారం లివింగ్ రూమ్ లో వాళ్ళని కూర్చోబెట్టి క్లాస్ పీకడం చిన్నపిల్లలకి మాస్టర్ క్లాస్ పీకినట్టుగా పీకడం.. కంటెస్టెంట్స్ మొహాలు చిన్న బోవడం ప్రతి ఒక్క లాంగ్వేజ్ బిగ్ బాస్ లో చూస్తూనే ఉన్నాం. ఎక్కడిదాకో ఎందుకు గత శనివారం నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ ని ప్రతి ఒక్కరిని నిలబెట్టి క్లాస్ పీకాడు. మరి బిగ్ బాస్ లోకి వచ్చాక ఇవన్నీ పేస్ చెయ్యాల్సిందే. కానీ తమ తమ ప్రొఫెషన్స్ లో ఎవరికీ వారే తోపులు. కానీ ఇలా ఓ షో కోసం హోస్ట్ చేతిలో క్లాస్ పీకించుకోవడం మాత్రం బయట నెటిజెన్స్ లో చాలామందికి నచ్చడం లేదు. ఇక ఈ వారం రోబో – మనుషుల టాస్క్ లో రెండు టీమ్స్ సహనాన్ని కోల్పోయి మాటలను హద్దుమీరుతున్నాయి. అంటే ఈ శనివారం మల్లి నాగ్ క్లాసుపీకడానికి రెడీ. క్లాస్ పీకించుకోవడానికి కంటెస్టెంట్స్ రెడీ అవ్వాలన్నమాట. పాపం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి క్రేజ్ కోసం, డబ్బు కోసం ఎన్ని కష్టాలు పడాలో కదా.
|
https://www.telugupost.com/crime/gas-cylinders-exploded-one-after-another-in-bhagalpur-bihar-truck-driver-died-1452461
|
వరసగా గ్యాస్ సిలిండర్లు పేలడంతో భయానక వాతావరణం ఏర్పడింది. ఒకే సారి ముప్ఫయి నుంచి ముప్ఫయి ఐదు సిలిండర్లు పేలడంతో పెద్దయెత్తున శబ్దంతో పాటు మంటలు వ్యాపించాయి. బీహార్ లోని భాగల్‌పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ట్రక్కులో లోడ్ చేసి ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలాయి.ట్రక్కు డ్రైవర్ మృతి...ఈ దుర్ఘటనలో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు. వరసగా సిలెండర్లు పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అర్థరాత్రి ఈ ఘటన జరగడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కి పడి లేచి బయటకు పరుగులు తీశారు. గ్యాస్ సిలిండర్లు పేలిన స్థలానికి కొద్దిదూరంలోనే పెట్రోలు బంకు ఉంది. అయితే పెట్రోలు బంకు వరకూ మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో చాలా సేపు ట్రాఫిక్ స్థంభించిపోయింది.
|
https://www.telugupost.com/movie-news/three-heroins-in-aravinda-sametha-veera-raghava-90833/
|
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో మొదటివారిగా తెరకెక్కుతున్న అరవింద సమేత -వీర రాఘవ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే. అయితే ఒక పాట చిత్రీకరణ కోసం అరవింద సమేత యూనిట్ ఇటలీ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన వెంటనే హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్, ఈషా రెబ్బా ఇతర ప్రధాన తారాగణంపై కొరియోగ్రాఫేర్ రాజు సుందరం నేతృత్వంలో సినిమా లో చాల కీలకమైన పెనివిటి… పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ పాటతో సినిమాకి సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తవుతుందని... ఇక గుమ్మడికాయ కొట్టడమే తరువాయి అంటున్నారు.అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ ఎప్పటిలాగే హీరో కోసం ఇద్దరు హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. పూజ హెగ్డే లీడ్ రోల్ అంటే టైటిల్ అరవింద రోల్ ప్లే చేస్తుండగా...మరో హీరోయిన్ ఇషా రెబ్బ ఎన్టీఆర్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మొదట్లో ఒక సీనియర్ హీరోయిన్ నటిస్తుందని.. మీనా, రంభ పేర్లు వినబడినా చివరికి ఆ సీనియర్ హీరోయిన్ కేరెక్టర్ ఎవరు చేస్తున్నారూ.. అసలా కేరెక్టర్ ఉందొ లేదో అనే క్లారిటీ కూడా లేదు. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కాదు ముగ్గురు హీరోయిన్స్ అనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినబడుతుంది.కన్నడ భామ మేఘశ్రీ కూడా ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతోందని.. అరవింద సమేత లో మేఘశ్రీ ఒక కీలక పాత్రలో నటించబోతుందనేది లేటెస్ట్ న్యూస్. మరి మేఘశ్రీ ఎన్టీఆర్ తో ఎలాంటి రొమాన్స్ చేస్తుందో గాని.. ముగ్గురు హీరోయిన్స్ తో ఎన్టీఆర్ మాత్రం ఈలేస్తూ ఎంజాయ్ చేస్తాడంటూ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం తెగ ఇదై పోతున్నారు. ఇక దసరా కానుకగా అక్టోబర్ 11 న విడుదలకబోతున్న అరవింద సమేత సినిమా ప్రీ రిలీస్ ఈవెంట్ వేడుక హైద్రబాద్ లో గాంధీ జయంతి రోజు అంటే అక్టోబర్ రెండు న గ్రాండ్ గా చెయ్యాలని మేకర్స్ నిర్ణయించారు.
|
https://www.telugupost.com/movie-news/nag-lift-to-abhijith-184548/
|
బిగ్ బాస్ సీజన్ 4 కి అనుకోని విన్నర్ అభిజిత్. అఖిల్ – అభిజిత్ కి పోటాపోటీ టైటిల్ రేసులో అభిజిత్ విన్నర్ అయ్యాడు. అభిజిత్ విన్నర్ గా బయటికి వచ్చి నెలలు గడుస్తున్నా అభిజిత్ నుండి స్పెషల్ న్యూస్ ఏది మీడియాకి కానీ అభిమానులకి కానీ దొరకలేదు. మరోపక్క సోహెల్, అఖిల్, మోనాల్ సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నా అభిజిత్ మాత్రం కామ్ గానే ఉంటున్నాడు. సోహెల్ అంత అభిజిత్ ఫెమస్ అవ్వడం లేదు. మొన్నామధ్యన అభిజిత్ కథలు వింటున్నాడు, ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటున్నాడనే టాక్ నడిచినా అందులో నిజం లేదని తొందరగానే క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా నాగార్జున తో అభిజిత్ మూడు సినిమాలు చేయబోతున్నాడనే న్యూస్ మొదలైంది. నాగార్జున బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కి ఓ అదిరిపోయే భారీ డీల్ ఇచ్చినట్టుగా టాక్ మొదలైంది. నాగార్జున అభిజిత్ తో మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నట్టుగా, అందులో ఓ కొత్త దర్శకుడితో అభిజిత్ సినిమా ఫైనల్ అవడం, దానికి నాగ్ పెట్టుబడి పెట్టడం అన్ని ఓకె అయిపోయినట్లుగా ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున అభిజిత్ తో సినిమాలు నిర్మించబోతున్నాడట. ఇక నాగ్ – అభిజిత్ మూవీ అనౌన్సమెంట్ త్వరలోనే ఉంటుందట. మరి బిగ్ బాస్ కి ముందు అప్పుడెప్పుడో అన్నపూర్ణ స్టూడియోస్ లోనే పెళ్లిగోల వెబ్ సీరీస్ లో నటించిన అభిజిత్ మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ నుండే హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట.
|
https://www.telugupost.com/movie-news/bollywood-actress-kangana-ranaut-has-made-harsh-remarks-against-the-central-government-1340043
|
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ట్వీట్ చేశారు. ఈ దేశానికి నియంతృత్వం అవసరమని కంగనా అభిప్రాయపడ్డారు. రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. ఆందోళనలకు తలవంచాల్సిన అవసరం ఏముందని కంగనా రనైత్ ప్రశ్నించారు.నియంతృత్వమే కరెక్ట్...నిద్రావస్థలో ఉన్న దేశానికి నియంతృత్వమే కరెక్ట్ అని కంగనా అభిప్రాయపడింది. రోడ్డెక్కి ప్రతి ఒక్కరూ నిరసన తెలుపుతుంటే మరో జీహాదీగా మారుతుందని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటులో చేయాల్సిన చట్టాలు రోడ్డు మీద చేయడమేంటని కంగనా రనౌత్ నిలదీశారు. కంగనా కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
https://www.telugupost.com/movie-news/మళ్ళీ-వ్యవహారం-మొదటికే-వ-35373/
|
'డీజే.. దువ్వాడ జగన్నాథం, మరో 48 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అర్జున్ - పూజ హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం హరీష్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కింది. వచ్చే శుక్రవారమే విడుదలవుతున్న 'డీజే' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అయితే 'దువ్వాడ జగన్నాథం' పై బ్రాహ్మణ సంఘాలు కత్తి కట్టిన విషయం తెలిసిందే. 'గుడిలో బడిలో మదిలో' పాటలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా కొన్ని పదాలను పెట్టారని చిత్ర యూనిట్ పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాక చాలా రచ్చ కూడా చేశాయి.అయితే చిత్ర నిర్మాత దిల్ రాజు పాటలోని పాదాలను మారుస్తున్నామని బ్రాహ్మణ సంఘాలకు మాట ఇచ్చాడు. అన్నట్టుగానే పాటలో అస్మైక యోగ- తస్మైక పదాలను మార్చేశామని, అలాగే నమకం, చమకం స్థానంలో గమకం, సుముఖం పదాలు చేర్చి సెన్సార్ సర్టిఫికెట్ పొందామన్నాడు. ఇంకేముంది 'డీజే 'ని బ్రాహ్మణ సంఘాలు వదిలేశాయని అందరూ భావించారు. కానీ బ్రాహ్మణ సంఘాలు 'డీజే' ని వదలకుండ వెంటాడుతూనే వున్నాయి. డీజేపై మంగళవారం బ్రాహ్మణ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.కేవలం 'డీజే' పాటలోనే కూకుండా సినిమాలోని కొన్ని సన్నివేశాలు కూడా బ్రాహ్మణుల మనోభావాలను కించపరచేలా ఉన్నాయంటూ పిటిషన్ వేసాయి. మరి మళ్ళీ డీజే సమస్య మొదటికి వచ్చిందంటున్నారు. ఈ పిటిషన్‌తో 'డీజే' అనుకున్న టైమ్‌కి విడుదల అవుతుందా అన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. తక్కువ సమయం వుండడంతో ఈ ఇష్యూని నిర్మాత ఎలా డీల్ చేస్తారని అంటున్నారు. కానీ 'డీజే' చిత్ర యూనిట్ మాత్రం సినిమా విడుదల పట్ల చాలా ధీమాగా ఉన్నట్లు కనబడుతుంది. చూద్దాం ఈ సమస్య రెండు రోజుల్లో ఎలా సద్దుమణుగుతుందో..?
|
https://www.telugupost.com/movie-news/ఎన్టీఆర్-థాంక్స్-చెబుతున-44455/
|
నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవ కుశ లో అమోఘం. జై ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ కె రాఘవేంద్ర రావు గారు జై లవ కుశ చిత్రం చూసిన తర్వాత స్పందన ఇది. అలాగే దర్శకధీరుడు రాజమౌళి కూడా జయహో జై.. జై.... నాగుండెల్లో ఎప్పటికి నిలిచిపోతావ్ తారక్ అంటూ ఎంతోఅభిమానంతో ట్వీట్ చేసాడు. వీరు మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీస్ జై లవ కుశ సినిమా చూసిన తర్వాత తమ స్పందనను ఇలా సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. జై లవ కుశలోని జై పాత్రని వారంతా పొగిడేస్తున్నారు.ఇక తొలిసారి త్రిపాత్రాభినయంతో అదరహో అనిపించినా ఎన్టీఆర్ తన నటనను, జై లవ కుశ విజయాన్ని పొగుడుతున్న అందరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఎన్టీఆర్ సోషల్ మీడియాలో జై లవకుశ సినిమాపై మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు చూస్తుంటే నాకు ఎంతో సంతృప్తి కలుగుతోంది. నేను ఒక నటుడిగా మీ నుంచి ఇంతకంటే ఇంకేం కోరగలను. ఇక జై లవకుశ చిత్ర బృందం తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు... అంటూ జై లవకుశ సినిమా విడుదల తర్వాత తొలి ట్వీట్ చేసాడు ఎన్టీఆర్.ఇక జై లవ కుశ విడుదలైన అన్నిచోట్లా మిశ్రమ స్పందనతో దూసుకుపోతూ రికార్డు కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మొదటిరోజే ప్రపంచవ్యాప్తం గా జై లవ కుశ 30 కోట్లు కొల్లగొట్టి అదరహో అనిపించింది.
|
https://www.telugupost.com/movie-news/actor-sunil-good-word-about-fans-122654/
|
కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తరువాత హీరోగా కూడా చేసి మళ్లీ తిరిగి కమెడియన్ గా వచ్చిన సునీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని మంచి మాటలు చెప్పారు. సునీల్ మాట్లాడుతూ…” అందరి హీరోల అభిమానులు తన సినిమాలు చూస్తారు. నన్ను ఇష్ట పడతారు. నిజం చెప్పాలంటే ఇది నా అదృష్టం అని చెప్పాలి. ఇలా ఎవరికీ ఉండరు. నాకంటూ ప్రత్యేకంగా అభిమాన సంఘాలు లేవు. అయితే గతంలో కొంతమంది వచ్చి మీకు అభిమాన సంఘాలు పెడతామని అన్నారు.’’ అని తెలిపారు. సమయం వృధా చేసుకోకండి.. ‘‘నేను అటువంటివి ఏమీ చేయకండి… సమయం చాలా విలువైంది. దాని వేస్ట్ చేయకండి. ఆ సమయం మీ ఫామిలీ కోసం కేటాయించండి. జీవితంలో ఏదైనా సాధించదలచుకుంటే దానిపై దృష్టి పెట్టండి. మీరు మీ పని చేసుకుంటూనే నా సినిమాలు కూడా చూస్తా ఉండండి. నా మూవీస్ నచ్చితే పది మందికి చెప్పండి. అంతేగాని ఇలా నా కోసం మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు.. జీవితంలో తిరిగిరానిది సమయమే అని చెబుతుంటాను” అని ఆయన అన్నారు. తన వద్దకు అభిమానులు ఎప్పుడు కలవడానికి వచ్చినా నేను ఇదే చెప్తాను’’ అని ఆయన అన్నారు.
|
https://www.telugupost.com/movie-news/allu-sirish-new-look-193833/
|
యంగ్ హీరో అల్లు శిరీష్ తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి జిమ్ లో రెగ్యులర్ గా కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కండలు తిరిగిన దేహాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియా మధ్యమాలలో పోస్ట్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో ఔరా అనిపిస్తున్నాడు. ఈయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దీని కోసం వర్క్ఔట్స్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు అల్లు శిరీష్. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు శిరీష్. శ్రీరస్తు శుభమస్తు ,ఒక్క క్షణం వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. కమర్షియల్ సినిమాల కంటే కూడా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల వైపు పరుగులు తీస్తున్నాడు శిరీష్. ఎబిసిడి హిందీ డబ్బింగ్ సినిమాతో ఉత్తరాదిన కూడా క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల విలాయటి శరాబ్ అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ తో 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సత్తా చాటాడు. ఎబిసిడి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శిరీష్.. ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 30న అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.
|
https://www.telugupost.com/movie-news/2023-tollywood-movies-hit-and-flop-list-complete-details-with-collections-1512762
|
2023 Rewind : ఈ ఏడాది చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్.. వంటి స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్దకి ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాల్లో హిట్ అయ్యిందేంటి..? ఫట్ అయ్యిందేంటి..? వీరసింహారెడ్డి.. బాలయ్యని మళ్ళీ వింటేజ్ లుక్ లో చూపిస్తూ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా 120 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని సూపర్ హిట్టుగా నిలిచింది.వాల్తేరు వీరయ్య.. చిరంజీవి వింటేజ్ కామెడీని మరోసారి ఆడియన్స్ కి రుచి చూపించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. రవితేజ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం.. 210 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.రైటర్ పద్మభూషణం.. సుహాస్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘రైటర్ పద్మభూషణం’. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అమిగోస్..కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది.వినరో భాగ్యము విష్ణుకథ..కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘వినరో భాగ్యము విష్ణుకథ'.. ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. సుమారు ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 11 కోట్ల పైనే కలెక్షన్స్ ని రాబట్టి హిట్ అనిపించుకుంది.బలగం..జబర్దస్త్ వేణు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతూ తెరకెక్కించిన ‘బలగం’ సినిమా.. కేవలం మూడు కోట్లతో రూపొంది 26 కోట్లకు పైగా వసూళ్లు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు పలు అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకుంది.దాస్ కా ధమ్కీ..విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'దాస్ కా ధమ్కీ'.. 22 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని హిట్ అనిపించుకుంది.దసరా..నానిని ఊర మాస్ క్యారెక్టర్ లో చూపిస్తూ తెరకెక్కిన చిత్రం 'దసరా'.. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. 65 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 117 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.రావణాసుర..రవితేజ నెగటివ్ షెడ్ పాత్రలో కనిపిస్తూ తెరకెక్కిన రావణాసుర డిజాస్టర్ గా నిలిచింది.శాకుంతలం..సమంత నటించిన మైథలాజి చిత్రం శాకుంతలం కూడా డిజాస్టర్ గా నిలిచింది.విరూపాక్ష..సాయి ధరమ్ తేజ్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ మూవీ 'విరూపాక్ష'.. 103 కోట్ల వరకు రాబట్టి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.ఏజెంట్, రామబాణం..అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్', గోపిచంద్ నటించిన 'రామబాణం' గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఉగ్రం..అల్లరి నరేష్ 'ఉగ్రం'.. బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది.కస్టడీ..నాగచైతన్య తెలుగు తమిళ భాషల్లో బై లింగువల్ గా చేసిన కస్టడీ ప్లాప్ గా నిలిచింది.మేమ్ ఫేమస్, పరేషాన్..సుమంత్ ప్రభాస్ 'మేమ్ ఫేమస్', తిరువీర్ 'పరేషాన్'.. ఆడియన్స్ ని అలరించిన మంచి విజయానే అందుకున్నాయి.ఆదిపురుష్..ప్రభాస్ రాముడిగా నటిస్తూ కనిపించిన 'ఆదిపురుష్'.. హిట్ అవ్వడం కాదు కదా.. ఎన్నో విమర్శలు, వివాదాలకు దారి తీసింది.స్పై..సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ అంటూ వచ్చిన నిఖిల్ 'స్పై' ప్లాప్ అయ్యింది.సామజవరగమన..శ్రీవిష్ణు 'సామజవరగమన' ఆడియన్స్ ని అలరించి 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది.బేబీ..ఏ అంచనాలు లేకుండా చాలా సినిమాగా వచ్చిన 'బేబీ' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచనలం సృష్టించింది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 83 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.బ్రో.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో'.. తమిళ చిత్రం 'వినోదయ సిత్తం'కి రీమేక్ గా వచ్చింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 98 కోట్ల కలెక్షన్స్ ని నమోదు చేసి బీలో యావరేజ్ గా నిలిచింది.భోళాశంకర్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'భోళాశంకర్'.. తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ గా వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ.. 40 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అయితే సినిమా ప్రాఫిట్ లెక్కలు ప్రకారం మాత్రం.. నష్టమే కలిగింది.బెదురులంక 2012..ఆర్‌ఎక్స్100 తరువాత సరైన హిట్ లేని కార్తికేయకు ‘బెదురులంక 2012’ సినిమాతో హిట్టు బొమ్మని అందించిన దర్శకుడు 'క్లాక్స్'. దాదాపు 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 16 కోట్ల వరకు కలెక్షన్స్ ని అందుకొని సూపర్ హిట్టుగా నిలిచింది.రంగబలి, గాండీవధరి అర్జున..నాగశౌర్య 'రంగబలి', వరుణ్ తేజ్ 'గాండీవధరి అర్జున'.. బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిచాయి.ఖుషి..విజయ్ దేవరకొండ, సమంత కంబినేషనల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన 'ఖుషి' సూపర్ హిట్టుని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 75 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి హీరోహీరోయిన్లుగా న్యూ ఏజ్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం మంచి విజయానే అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 56 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని నవీన్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది.స్కంద.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన 'స్కంద'.. ఊర మాస్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి కలెక్షన్సే అందుకుంది. ఓవర్ ఆల్ గా ఈ చిత్రం 49 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఏవరేజ్ బొమ్మగా నిలిచింది.పెద్దకపు, మామ మశ్చీంద్ర..శ్రీకాంత్ అడ్డాల 'పెద్దకపు', సుధీర్ బాబు 'మామ మశ్చీంద్ర'.. గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.మ్యాడ్..టాలీవుడ్ లో చాలా కాలం తరువాత ఒక కాలేజీ బ్యాక్‌డ్రాప్ కథతో వచ్చిన సినిమా 'మ్యాడ్'. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 5 కోట్లతో తెరకెక్కి 24 కోట్లకు పైగా వసూళ్లు చేసి సూపర్ హిట్టుగా నిలిచింది.భగవంత్ కేసరి.. బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' సూపర్ హిట్ అందుకొని బాలయ్యకి హ్యాట్రిక్ ఇచ్చింది. అఖండ, వీరసింహారెడ్డి తరువాత ఈ చిత్రం కూడా వరుసగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టింది....
|
https://www.telugupost.com/movie-news/రికార్డ్స్-గురించి-నోరు-53293/
|
సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'టైగర్ జిందా హై'. ఈ సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.సల్మాన్ నుండి ఎప్పుడు సినిమా వచ్చిన దాని పై హై ఎక్సపెక్టషన్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు ఈ సినిమాపై కూడా అంతకు మించి అంచనాలున్నాయన్నది నిర్వివాదాంశం. అయితే, 'రికార్డుల' విషయంలో సల్మాన్‌ఖాన్ కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాడిప్పుడు. అప్పట్లో 'ట్యూబ్‌లైట్' సినిమా ప్రమోషన్స్‌కి వచ్చినప్పుడు.... 'బాహుబలి' వసూళ్ళను దాటేస్తాం.. అని ధీమా వ్యక్తం చేశాడు సల్మాన్ ఖాన్. అయితే ఇప్పుడు మాత్రం, వసూళ్ళ ఊసెత్తడంలేదు. రికార్డ్స్ గురించి మాట్లాల్సి వస్తే.. నో కామెంట్స్ అంటున్నాడు.తాజాగా ప్రొమోషన్స్ కోసం వచ్చిన సల్మాన్.. 'సినిమా వచ్చేస్తోంది.. ప్రీ రిలీజ్ అంచనాలకు ఆకాశమే హద్దు.. సీజన్ కూడా కలిసొస్తుంది. ఖచ్చితంగా మంచి వసూళ్ళనైతే సాధిస్తాం. రికార్డుల గురించి మాత్రం మాట్లాడను అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
|
https://www.telugupost.com/crime/encounter-took-place-in-chennai-today-two-rowdy-sheeters-were-shot-dead-by-the-police-1511793
|
చెన్నైలో ఈరోజు తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు రౌడీషీటర్లను పోలీసులు కాల్చి చంపేశారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని కాంచీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాంచీపురం రైల్వే వంతెన వద్ద పోలీసు సిబ్బందిపై రౌడీషీటర్లు దాడికి యత్నించగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈకాల్పుల్లో రౌడీషీటర్లు రఘువరన్, కరుప్పు హసన్ మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు.హత్య కేసులో నిందితులు...ఒక హత్య కేసులో వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై దాడికి యత్నించడంతో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఒక హత్య కేసులో వీరిద్దరూ నిందితులు. పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా ఎదురుదాడికి దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
https://www.telugupost.com/movie-news/ramgopal-varma-jayalalitha-biopic-116203/
|
గత కొన్ని ఏళ్లుగా రామ్ గోపాల్ వర్మ చిత్రాలకు ప్రేక్షకులు భయపడిపోతున్నారు. రక్త చరిత్ర తర్వాత మళ్లీ ఇంతవరకు ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు చెయ్యలేకపోతున్న వర్మ ఈమధ్యన లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ జనాల్లో కాస్త ఆసక్తి రేకెత్తించాడు. ఎన్టీఆర్ జీవితంలో ఆయన మరణానికి ముందు ఆరు నెలల జీవితాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తెరకెక్కించాడు. వర్మ సినిమాలు మొదలైనప్పటి నుండే కాంట్రవర్సీలకు నెలవుగా మారతాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కూడా అలాగే సినిమా మొదలెట్టినప్పటి నుండి వర్మ చెప్పిన ముచ్చట్లు అన్ని ఇన్ని కాదు. తనకి తానుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి భారీ హైప్ పెంచాడు. కానీ సినిమా విడుదలయ్యాక వర్మ అన్ని సినిమాలలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా బోల్తా పడింది. ఇక తమిళనాడుకు… ఇప్పటికే వర్మ సినిమాలెవరు చూస్తారు అని ఫిక్స్ అయినవాళ్లు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మీద ఆసక్తి చూపారంటేనే ఆ సినిమా మీద వర్మ ఎంతలా క్రేజ్ తెచ్చాడో అర్ధమవుతుంది. ఇక ఆ సినిమా ఏపీలో మినహా అని చోట్ల విడుదలైంది. అయితే వర్మ ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై ఫోకస్ పెడతాడులే అనుకుంటే తాజాగా వర్మ మరో సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఎన్టీఆర్ బయోపిక్ అంటూ బాలయ్య రెండు పార్టులు తీసినా వర్మ మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ మరో పార్టు తీసి చూపించినట్లుగానే ఇప్పుడు తమిళనాట జయలలిత మీద సినిమా చేయబోతున్నట్లుగా ఒక పోస్టర్ విడుదల చేసాడు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకి, ఆమె స్నేహితురాలు శశికళకి మధ్య ఉన్న రిలేషన్ ను బేస్ చేసుకుని ఓ సినిమా చేయబోతున్నట్లు ఆ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు వర్మ. ఇది మూడో బయోపిక్ మరి ఇప్పటికే తమిళనాట జయలలిత మీద రెండు మూడు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. డైరెక్టర్ ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా ఒక బయోపిక్ ది ఐరన్ లేడీ , కంగనా హీరోయిన్ విజయ్ డైరెక్షన్ లో తలైవి అంటూ జయలలిత బయోపిక్ లు తెరకెక్కుతుండగా.. ఇప్పుడు వర్మ జయలలితకి, శశికళకి మధ్య ఉన్న రిలేషన్ తో మరో సినిమా ని మొదలెట్టడం చర్చనీయాంశం అయ్యింది.
|
https://www.telugupost.com/andhra-pradesh/head-conistable-rape-attempt-on-minor-girl-1345919
|
కౌన్సిలింగ్ పేరుతో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో హెడ్ కానిస్టేబుల్. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు పీఎస్ లో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఒక సమస్యపై బాలికకు కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ.. ఆమె తండ్రితో పాటు బాలికను ఇంటికి పిలిపించుకున్నాడు సుధాకర్. బాలిక తండ్రికి సమీపంలోని షాపులో ఓ పని పురమాయించి పంపించాడు.బాలిక ఒంటరిగా ఉండటంతో.. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు సుధాకర్. ఇంటికి వెళ్లగానే జరిగిన విషయం గురించి తండ్రికి చెప్పి బోరుమంది బాలిక. దాంతో బాలిక తండ్రి బిట్టమూరు పోలీసులకు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సుధాకర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. బాలికపై సుధాకర్ అత్యాచారయత్నం చేసినట్లు తేలడంతో ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి.. అతడిని రిమాండ్ కు తరలించారు.
|
https://www.telugupost.com/movie-news/veteran-singer-bhupinder-singh-passed-away-he-died-last-night-while-undergoing-treatment-at-a-hospital-1379714
|
ప్రముఖ గాయకుడు భూపీందర్ సింగ్ మృతి చెందారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి మరణించారు. ఐదు దశాబ్దాల పాటు భూపేందర్ సింగ్ తన పాటలతో అలరించారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కోవిడ్ అనంతరం సమస్యలతో పాటు, కోలన్ క్యాన్సర్ తో ఆయన బాధపడుతున్నారు. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భూపేందర్ సింగ్ కన్ను మూశారు.దిగ్గజ గాయకుడిగా....దిగ్గజ గాయకులైన మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ కు సమకాలీకుడు భూపేందర్ సింగ్, ఆయన భార్య మిథాలీ సింగ్ కూడా ప్రముఖ గాయకురాలే. అనేక బాలివుడ్ చిత్రాల్లో పాటలు పాడి భూపేందర్ సింగ్ అలరించారు. అనారోగ్య సమస్యలతో పది రోజుల క్రితం ముంబై ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి మృతి చెందారు. భూపేందర్ సింగ్ మృతి పట్ల రాజకీయ నేతలతో పాటు బాలివుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
|
https://www.telugupost.com/movie-news/డీజే-లో-అర్జున్-ప్రతినాయ-30794/
|
రాబోయే చిత్రాలలో అంచనాలు భారీగా ఏర్పడ్డ చిత్రాలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథం చిత్రం ఒకటి. సరైనోడు వంటి భారీ విజయం తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం కావటంతో పాటు, ఇప్పటి వరకు అల్లు అర్జున్ పోషించని బ్రాహ్మణ యువకుడి పాత్ర కావటంతో దువ్వాడ జగన్నాథం చిత్రంపై ఇప్పటికే చాలా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ముందుగా మే నెలలో విడుదల చేయాలనుకున్నప్పటికీ చిత్రీకరించాల్సి షెడ్యూల్ బాకీ ఉండటం, రాజి పడి చుట్టేయటం మనస్కరించక నిర్మాత దిల్ రాజు దర్శకుడు హరీష్ శంకర్ కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో చిత్ర విడుదలని జూన్ 23 కి వాయిదా వేసి కూల్ గా షూటింగ్ జరుపుతున్నారు. ఈ చిత్ర కాస్టింగ్ పై ఇప్పటికే ఒక అవగాహన రాగా, సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ పాత్రపై ఎన్నో ఊహాగానాలు చోటుచేసుకుంటున్నాయి.దువ్వాడ జగన్నాథం లో మెయిన్ విలన్ పాత్ర కోసమే అర్జున్ ని హరీష్ శంకర్ తీసుకున్నాడని ప్రచారం జోరుగా సాగింది. కాగా ఈ ప్రచారం లో వాస్తవం లేదని ఇప్పుడు తేలిపోయింది. దువ్వాడ జగన్నాథం చిత్రంలో హీరో తండ్రి పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉండటంతో ఆ పాత్రకి బాగా తెలిసిన సీనియర్ హీరోనే తీసుకోవాలని హరీష్ శంకర్ అనుకున్నప్పుడు కొన్ని పేర్లు పరిశీలనకు రాగా వారిలో అర్జున్ అయితే పాత్రకి సరిగ్గా నప్పుతారని ఫిక్స్ ఐయి ఆయనని సంప్రదించినప్పుడు అర్జున్ ఈ పాత్రని తిరస్కరిస్తూ, ఇప్పుడే తండ్రి పాత్రలు చేయదలచుకోలేదని చెప్పారట. దానితో హరీష్ శంకర్ మరో నటుడి కోసం అన్వేషణ లో ఉండగా నిర్మాత దిల్ రాజు పాత్ర ప్రాముఖ్యత ని అర్జున్ తో చర్చించి కథ వినటానికి ఒప్పించి మళ్లీ హరీష్ శంకర్ తో నేరేషన్ ఇప్పించాడట. పాత్ర నేరేట్ చేసిన ఇంటెన్సిటీతోనే స్క్రీన్ పై ప్రాజెక్ట్ చేస్తామని హామీ దిల్ రాజు ఇచ్చాకే అర్జున్ ఒప్పుకున్నారట. దిల్ రాజు నిర్మాణంలో గతంలో రామ్ హీరోగా నటించిన హరే రామ హరే కృష్ణ చిత్రంలో కథానాయిక ప్రియా ఆనంద్ కి సోదరుడిగా అర్జున్ నటించిన సంగతి తెలిసిందే.
|
https://www.telugupost.com/movie-news/మెగా-హీరో-ఎన్టీఆర్-ని-భయప-40678/
|
యంగ్ స్టర్స్ అందరిలో ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు కూడా మూడు విభిన్న పాత్రల్లో 'జై లవ కుశ'లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. అలాగే 'జై లవ కుశ' ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరిగిందనే టాక్ వినబడుతుంది. అలాగే ఎన్టీఆర్ మరోపక్క బుల్లితెర మీద బిగ్ బాస్ కి హోస్ట్ గా అదరగొట్టే పెరఫార్మెన్సు తో ఆకట్టుకుంటున్నాడు. మరింతిలా ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ని మెగా హీరో భయపెట్టడమేమిటా అని అనుకుంటున్నారా? అవునండి నిన్నగాక మొన్న ఇండస్ట్రీలో అడుగుపెట్టి కేవలం ఐదే సినిమాలు చేసిన మెగా హీరో వరుణ్ తేజ్, ఎన్టీఆర్ ని భయపెట్టేస్తున్నాడట. ఎన్టీఆర్ ని వరుణ్ ఎలా భయపెడుతున్నాడు అంటే... వరుణ్ తేజ్ తాజాగా నటించిన 'ఫిదా' చిత్రం విడుదలైన అన్నిచోట్లా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ కొల్లగొడుతుంది. బాక్సాఫీస్ బోనాంజాగా 'ఫిదా' చిత్రం దూసుకుపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఫిదా' చిత్రం ఇప్పటికే 30 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే 2 మిలియన్ డాలర్స్ క్లబ్బులోకి చేరిపోయి స్టార్ హీరోలకు అక్కడ చమటలు పట్టించడానికి రెడీ అయ్యింది. ఈదెబ్బకి స్టార్ హీరోలు కూడా క్రాస్ చెయ్యలేని కొన్ని రికార్డులని 'ఫిదా' చిత్రం కొల్లగొట్టేసింది. అలాగే 'ఫిదా' చిత్రం ఇప్పుడు ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' రికార్డుని తుడిచెయ్యడానికి రెడీ అయ్యింది. 'నాన్నకు పేమతో' చిత్రం యూఎస్ లో 2.02 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే అక్కడ ఆల్ టైం రికార్డుగా నిలిచిన ఆ రికార్డును 'ఫిదా' చిత్రం సునాయాసంగా బద్దలు కొట్టెయ్యడానికి కాచుక్కూర్చుంది. తాజాగా ఓవర్సీస్ లో 'లై, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక' చిత్రాలు విడుదలైనప్పటి 'ఫిదా' కలెక్షన్స్ ఏ మాత్రం డ్రాప్ అవ్వలేదని.... ఎన్టీఆర్ 'నాకు ప్రేమతో' రికార్డును అతి త్వరలోనే తుడిచేసి ఎన్టీఆర్ కి ఎసరు పెట్టేస్తుందంటున్నారు.
|
https://www.telugupost.com/movie-news/bahubhali-sanju-collections-78366/
|
'బాహుబలి' ఎన్ని సెన్సషన్స్ ను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 'బాహుబలి ది బిగినింగ్' కంటే.. 'బాహుబలి ది కంక్లూజన్' దంచికొట్టిన వసూళ్లయితే ఉత్తరాది పెద్దలకే దిమ్మతిరిగిపొయ్యేలా చేశాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోస్ గా చెప్పుకునే సల్మాన్, ఆమిర్, షారుఖ్‌లు సైతం ప్రభాస్ రికార్డ్స్ ని బీట్ చేయలేక బోల్తాపడ్డ బాపతే.అయితే తాజాగా సంజయ్‌దత్ బయోపిక్ గా రూపొందిన ‘సంజు’ సినిమా సైతం 'బాహుబలి'ని టచ్ చేయడంలో మాత్రం విఫలమైంది. ముఖ్యంగా ఫస్ట్ వీక్ ఎండ్ దగ్గర ‘బాహుబలి ది కంక్లూజన్’ క్రియేట్ చేసిన రూ. 128 కోట్ల బెంచ్ మార్క్ ను క్రియేట్ చేయగా.. 'సంజు' మాత్రం రూ. 120 కోట్లు కొల్లగొట్టి ఆ దగ్గరలో ఆగిపోయింది. ఆ తర్వాత స్తానంలో సళ్ళు భాయ్ సినిమాలు 'టైగర్ జిందా హై' (రూ. 114 కోట్లు), 'సుల్తాన్' (రూ. 104 కోట్లు) లు నిలబడ్డాయి. ఆమిర్ ఖాన్ ‘దంగల్’ కూడా ఫస్ట్ వీకెండ్ వసూళ్ళలో రూ. 104 కోట్ల దగ్గరే ఆగిపోయింది. సో దాంతో 'బాహుబలి' ఫస్ట్ వీక్ ఎండ్ రికార్డు సేఫ్ అయింది. మన తెలుగు సినిమా ఇంతలా ఇండియా మొత్తం విజయం సాధించటం గొప్ప విషయమే
|
https://www.telugupost.com/crime/rtc-bus-hits-school-bus-in-rajanna-sircilla-district-15-students-injured-1460195
|
స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో.. 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, యువకులు గాయపడిన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యం హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను, ప్రమాదానికి గల కారణాలను జిల్లా కలెక్టర్ డీఈఓను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు జిల్లా మంత్రి కేటీఆర్ .. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.
|
https://www.telugupost.com/movie-news/nagababu-as-sarpunch-82300/
|
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ - పూజ హెగ్డే - ఈషా రెబ్బ కలిసి నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ అప్ డేట్ కంటే ఎక్కువగా ఆ సినిమా షూటింగ్ లొకేషన్స్ నుండి పిక్స్ లీక్ అవడం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యి కూర్చుంది. షూటింగ్ లొకేషన్స్ లో కొందరు ఆకతాయిలు అక్కడ జరిగే సన్నివేశంలో కొన్ని ఫొటోస్ ని ఎడా పెడా సోషల్ మీడియాకి అందించేస్తున్నారు. మరి సోషల్ మీడియా అంటే అవి సెకన్స్ లోనే వైరల్ అవుతాయనే విషయం తెలిసిందే. త్రివిక్రమ్ ఎంతగా కట్టుదిట్టం చేసినా షూటింగ్ స్పాట్ నుండి ఏదో ఒక పిక్ లీక్ అవుతూనే ఉంది. ఇకపోతే షూటింగ్ మొదలైనప్పటి నుండి షూటింగ్ ని పరిగెత్తిస్తున్న త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ ని కంప్లీట్ చేసేస్తారని అంటున్నారు. ఇక రాయలసీమ నేపథ్యంలో ఉండబోతున్న అరవింద సమేత సినిమా లో ఎన్టీఆర్ రాయలసీమ భాష ట్రై చేస్తున్నాడంటున్నారు.ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నాగబాబు..?అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా మెగా హీరో నాగబాబు నటిస్తున్న విషయం తెలిసిందే. నాగ బాబు ఎన్టీఆర్ కి తండ్రిగా అలాగే ఈ సినిమాకి ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ కి తండ్రిగా నాగబాబు రాయలసీమ లోని ఒక గ్రామానికి సర్పంచ్ గా తన పవర్ చూపించబోతున్నాడట. మరి మొన్నామధ్యన ఎన్టీఆర్ నాగబాబు ని కారులో కూర్చోబెట్టుకుని దీనంగా చూస్తున్న ఫొటోలో నాగబాబు కు గాయాలై.. స్పృహ లేని పరిస్థితి చూస్తుంటే ప్రచారం జరుగుతున్న ఈ న్యూస్ లో నిజం ఉండొచ్చనే విషయం అర్ధమవుతుంది. మరి గ్రామ సర్పంచ్ గా నాగబాబు మీద ప్రత్యర్ధులు ఎటాక్ చేస్తే.. అప్పుడు తండ్రిని కాపాడుకునే క్రమంలో వీర రాఘవ క్యారెక్టర్ లో చేస్తున్న ఎన్టీఆర్ పడుతున్న ఆవేదన ఆ పిక్ లో స్పష్టంగా తెలుస్తుంది.ఇద్దరు హీరోయిన్లతో...ఇకపోతే అరవింద కేరెక్టర్ లో పూజ హెగ్డే నటిస్తుండగా.. ఎన్టీఆర్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా ఈషా రెబ్బ కనిపిస్తుంది. అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా దసరా బరిలో అక్టోబర్ 12 న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
|
https://www.telugupost.com/movie-news/telugu-bis-boss-2-winner-kaushals-comments-97383/
|
బిగ్ బాస్ 2 విన్ అవ్వగానే ఏదో ప్రపంచాన్ని జేయించినట్టుగా తెగ హడావిడి చేశాడు కౌశల్. బిగ్ బాస్ 2 నుండి టైటిల్ విన్ అయ్యి బయటికి రాగానే కొన్ని టీవీ ఛానల్స్ లో చాలా అతిశయోక్తిగా మాట్లాడాడు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని...గిన్నిస్ బుక్ వారు తనను సంప్రదించబోతున్నారని..తనకి 40 కోట్ల ఓట్లు వచ్చాయని ఇలా ఇష్టమొచ్చినట్టు చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ కి గురైయ్యాడు.తనకు ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఫోన్ వచ్చిందని అయితే ఆ సమయంలో తను ఇంట్లో లేకపోవడంతో మా డాడీ ఫోన్ మాట్లాడారని చెప్పాడు. నిజానికి ఒక రీజనల్ ఛానల్ రియాలిటీ షోలో ఎవరైనా గెలుపొందితే అదే పనిగా పిఎం విష్ చేసేంత సీన్ ఎవరికి ఉండదు. ఇది నిజమో కాదో అని ఓ వ్యక్తి ఆర్టిఐ చట్టం(సమాచార హక్కు) కు ఓ అప్లికేషన్ పెట్టి కనుక్కున్నాడు. అయితే అవతల నుండి అటువంటిది ఏమి లేదు అని క్లారిటీ వచ్చింది. దాంతో కౌశల్ అబద్దం చెప్పినట్టు అయింది.అలానే గిన్నిస్ రికార్డు వాళ్ళు తనను సంప్రదించారని చెప్పాడు కానీ సాధారణంగా వారి కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎవరైతే గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసుకుందాం అనుకుంటున్నారో ఒక పద్ధతి ప్రకారం సదరు బోర్డు ని సంప్రదించాలి. వారు అతనికి సంబంధించి అన్ని జాగ్రత్తగా పరిశీలించి అసలు అతను చెప్పింది నిజమో కాదో తెలుసుకుని కొంత టైం తీసుకుని బుక్ లో ఉంటుందా లేదా అనే సమాచారం పంపుతారు. అంతే తప్ప ఏదో సరదాగా పేరు బుక్ లో నమోదు చేయరు. అలానే 40 కోట్ల ఓట్ల గురించి ఛానల్ వాళ్ళను అడిగి ఆధారాలు చూపిస్తానని చెప్పిన కౌశల్ ఇంతవరకు చూపించలేదు. సో ఇది కూడా ఫేక్ అని అర్ధం అయిపోయింది. సినిమాల్లో కూడా పెద్దగా ఆఫర్స్ ఏమి రావడంలేదు. ఇలా ఏదిపడితే అది మాట్లాడితే ఇలానే ఉంటుంది కౌశల్ అని సోషల్ మీడియాలో మరోసారి ట్రాలింగ్ స్టార్ట్ చేశారు
|
https://www.telugupost.com/movie-news/ఒకే-ఫ్రెములో-చిట్టిబాబు-62145/
|
మరొక్క 20 రోజుల్లో ప్రేక్షకులముందుకు రాబోతున్న రామ్ చరణ్ - సుకుమార్ ల రంగస్థలం గురించిన ముచ్చట్లే ఎక్కడ చూసినా... ఎక్కడ విన్నా కూడా..... మార్చ్ 30 న విడుదలకానున్న రంగస్థలం హంగామా మార్కెట్ లో మాములుగా లేదు. ఇప్పటికే రెండు సింగిల్స్ తో పాటే... చిట్టిబాబు ఉరఫ్ రామ్ చరణ్ టీజర్, రామలక్ష్మి ఉరఫ్ సమంత ల టీజర్స్ హంగామా అలా ఇలా లేదు. చిట్టి బాబు గా సౌండ్ ఇంజినీర్ గా చరణ్ అదరగొట్టేస్తే... చరణ్ కన్నా అమాయకపు పల్లె పడుచులా సమంత రామ లక్ష్మి లుక్ లో ఇరగదీసింది. పాతకాలపు ప్రేమ కదా అందుకే వాళ్ళ లుక్స్ ఆనాటి కాలంతో పాటు ఆనాటి పల్లెటూరి పద్దతులను, ఆనాటి వాతావరణాన్ని కూడా సుకుమార్ ఎంతో అందంగా ఈ సినిమాలో చూపించనున్నాడు.మరి ఇప్పటివరకు రామలక్ష్మి, చిట్టిబాబులు విడివిడిగానే సందడి చేశారు. అలాగే రంగస్థలం సింగిల్స్ లో సైతం చిట్టి బాబు ని, రామలక్ష్మి ని ఒక చోటా అంటే ఒకే ఫ్రెములో ఇంతవరకు చూపెట్టలేదు. కానీ ఇప్పుడు వదిలిన ఒక పోస్టర్ లో రామ లక్ష్మి అండ్ చిట్టిబాబు లను అలా చూస్తుంటే చూడముచ్చటగా కనిపిస్తున్నారు. రేపు గురువారం రంగమ్మ.... మంగమ్మ అనే సింగిల్ ని వదుల్తామని తెలిపే పోస్టర్ లో రామ లక్ష్మి, చిట్టిబాబుల కోపతాపాలు చూపించారు. మరి ఆనాటి పల్లె వాతారవనంలోని గొడుగులు తాటేకులతో అల్లేవారు. ఇప్పుడు రామలక్ష్మి కూడా చిట్టిబాబు చేతిలోని తాటేకుల గొడుగుని లాగుతూ సరసమాడుతుంటే... చిట్టిబాబు మాత్రం తెచ్చిపెట్టుకున్న కోపంతో రామలక్ష్మి మీద చిర్రుబుర్రులాడుతున్నట్టుగా ఉన్న ఈ రంగస్థలం పోస్టర్ మాములుగా లేదు. మరి రామలక్ష్మి, చిట్టిబాబులు ఒకే ఫ్రెములో ఉన్న ఆ పోస్టర్ మీద మీరు ఓ లుక్కేయండి.
|
https://www.telugupost.com/movie-news/mohan-babu-not-acting-in-chiranjeevi-koratala-movie-147968/
|
మెగాస్టార్ చిరు – కొరటాల మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ఇప్పటికే స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరగగా.. ప్రస్తుతం చిరు పై కొన్ని సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు కొరటాల. అయితే ఈ సినిమాలో చిరంజీవికి విలన్ గా మోహన్ బాబు నటిస్తున్నాడు అంటూ ఓ న్యూస్ గత మా డైరీ ఆవిష్కరణ ఈవెంట్ అప్పటినుండి ప్రచారంలో ఉంది. మోహన్ బాబు ని చిరు హగ్ చేసుకోవడంతో మొదలైన ఈ న్యూస్ .. చిరు – మోహన్ బాబు లు కలిపి ఓ ఫ్యాన్ మెడ్ పోస్టర్ తోనే ఈ న్యూస్ ని మెగా ఫాన్స్ కన్ఫర్మ్ చేసేసారు. అయితే నిజంగానే కొరటాల – చిరు సినిమాలో మోహన్ బాబు ఉన్నాడని అనుకున్నారు. అంతలా ఈ న్యూస్ పాపులర్ అయ్యింది కూడా. అందులో గతంలో చిరు సూపర్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో మోహన్ బాబు విలన్ గా నటించడంతో.. ఈ న్యూస్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం మోహన్ బాబు ఈ సినిమాలో నటించడం లేదని.. చిరు మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నాడనే వార్తలు అవాస్తవం అని చెప్పారు. ఆయనకు తగ్గ క్యారెక్టర్ మా సినిమాలో లేదని చెబుతున్నారు. ఒకవేళ మోహన్ బాబు క్రేజ్, స్టామినాకు తగ్గ పాత్ర ఉంటే తప్పక సంప్రదించే వాళ్లం అంటూ క్లారిటీ ఇచ్చారు. మరి దీనితో మోహన్ బాబు చిరు సినిమాలో విలన్ పాత్రపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ విషయం తెలిసిన మెగా ఫాన్స్ కాస్త ఫీలవుతున్నారు. ఎందుకంటే మోహన్ బాబు నటిస్తే చిరు మూవీకి బాగా క్రేజ్ వచ్చేదని.. అలాంటి హిట్ కాంబో చిరు – మోహన్ బాబుది అంటూ ఫీలవుతున్నారు.
|
https://www.telugupost.com/movie-news/blockbuster-directors-162421/
|
టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్స్ కి భారీ డిమాండ్ ఉంటుంది కానీ.. ఇప్పుడు డిమాండ్ సంగతి పక్కనబెడితే.. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన చాలామంది డైరెక్గ్టర్స్ ఇప్పుడు తమ నెక్స్ట్ సినిమాలు మొదలెడటానికి నానా తంటాలు పడుతున్నారు. బ్లాక్ బస్టర్ ఇచ్చాక దాదాపుగా రెండేళ్లు గ్యాప్ వచ్చిన ప్రస్తుతం సినిమాలు చేద్దామని సెట్స్ మీదకెళ్ళిన డైరెక్టర్స్ అందరికి కరోనా షాకిచ్చింది. ముఖ్యంగా భరత్ అనే నేను చేసిన కొరటాల శివకి, రంగస్థలం చేసిన సుకుమార్ కి… తాజాగా అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ అందరూ.. ఇప్పుడు కొరటాల చిరు కోసం రెండేళ్లు టైం స్పెండ్ చేసి ఆచార్య పట్టాలెక్కింఛాక కరోనా తగులుకుంది. ఇక సుకుమార్ అయితే రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ ని మెప్పించలేక రెండేళ్లు ఖాళీగానే ఉండి.. చివరికి బన్నీతో సినిమా మొదలు పెడితే.. కరోనా అడ్డం పడింది. ఇక త్రివిక్రమ్ అయితే అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తరవాత మెరుపు వేగంగా ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాడు. కానీ కరొనతో ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అలాగే సరిలేరు తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి పరిస్థితి అదే. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కానీ ప్రస్తుతం నెక్స్ట్ సినిమాపై ఇంకా సందిగ్ధం. ఇక భీష్మ హిట్ తర్వాత వెంకీ కుడుములు చడీ చప్పుడు లేదు. మరి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన ఈ డైరెక్టర్స్ అందరికి గ్యాప్ అయితే తప్పలేదు.
|
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-injury-102009/
|
విజయ్ దేవరకొండ.. టాక్సీవాలా చిత్రం తరువాత చాలా హోప్స్ పెట్టుకుని 'డియర్ కామ్రేడ్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాకినాడలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. షూటింగ్ లో విజయ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై నుంచి వేగంగా మెట్లు దిగి ఫ్లాట్ ఫామ్ పైన పరుగెత్తుతూ రైలు అందుకోవాలి. ఈ సీన్ లో యాక్ట్ చేస్తున్న టైంలో విజయ్ పరుగెత్తుతూ ట్రైన్ ఎక్కబోయి, ఏకంగా ట్రైన్ కింద పడిపోతుండగా గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది విజయ్ ను పక్కకు లాగేయడంతో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.లైఫ్ లో ఏదీ ఈజీగా రాదు...చేతికి చిన్న గాయంతో బయటపడటంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత విజయ్ హోటల్ కు చేరుకొని తనకు తగిలిన దెబ్బల్ని చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. లైఫ్ లో ఏదీ అంతా ఈజీగా రాదు అని పోస్ట్ చేసాడు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడున్న ఓ వ్యక్తి ఈ యాక్సిడెంట్ ను వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
|
https://www.telugupost.com/top-stories/all-union-ministers-are-roaming-around-telangana-trying-to-make-chief-minister-kcr-sleepless-1437032
|
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు ప్రధాన శత్రువు బీజేపీయే. జాతీయ స్థాయిలో బీజేపీని ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. అక్కడ మీడియా మీట్ లు పెట్టి మోదీ పాలనపై ధ్వజమెత్తుతున్నారు. పెట్రోలు ధరల నుంచి గ్యాస్ తో పాటు నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను ప్రస్తావిస్తూ మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీలుచిక్కినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జాతీయ స్థాయిలో బద్నాం చేయడానికి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు.రంగంలోకి కేంద్రమంత్రులు...అయితే కేసీఆర్ కు విరుడుగా బీజేపీ కూడా కేంద్ర మంత్రులను రంగంలోకి దించుతుంది. ఏ రాష్ట్రంలో పర్యటించని విధంగా కేంద్ర మంత్రులు ఒక్కొక్కరూ తెలంగాణలో తిరుగుతూ కేసీఆర్ కు నిద్ర లేకుండా చేయాలని చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఏకంగా మూడు రోజుల పాటు పర్యటించి కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రేషన్ షాపు దగ్గర నుంచి రైతు సమస్యల వరకూ నిర్మలమ్మ వదిలిపెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆర్థికమంత్రి కావడంతో లెక్కలు చెప్పి మరీ మంత్రులను సయితం ఇరిటేట్ చేసి వెళ్లిపోయారు. మోదీ ఫొటో పెట్టలేదేమిటని ఏకంగా జిల్లా కలెక్టర్ నే నిలదీసి ఐఏఎస్ లకు పరోక్షంగా కేంద్రమంత్రి సంకేతాలు పంపారంటున్నారు.కేసీఆర్ ను ఇరిటేట్ చేస్తూ...మరో కేంద్రమంత్రి మహేంద్ర నాధ్ పాండే మహబూబ్ నగర్ జిల్లాలో ఆసుపత్రిని పరిశీలించారు. మోదీ ఫొటో ఎందుకు లేదని ఆయన కూడా ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు వరసగా పర్యటనలు చేస్తూ కేసీఆర్ పై కవ్వింపు చర్యలకు దిగుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నిజానికి కేసీఆర్ తాను గోకుతూనే ఉంటానని ఆ మధ్య మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యకు ప్రతిగా కేంద్ర మంత్రులు వచ్చి మరీ గోకి వెళుతున్నారు. పథకాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. వివిధ వర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణలో బీజేపీకి కొంత హైప్ క్రియేట్ తెస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్లస్టర్లుగా విభజించి...తెలంగాణపై పట్టు సాధించేందుకు బీజేపీ కొన్ని రోజుల క్రితమే రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించింది. తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహించి కేసీఆర్ తో కయ్యానికి కమలం పార్టీ కాలు దువ్వింది. దీనికి తోడు ప్రతి క్లస్టర్ లో కేంద్ర మంత్రులు తరచూ పర్యటిస్తూ రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయాలని కూడా కేంద్ర నాయకత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించిన పార్టీ అధినాయకత్వం వాటికి ఇన్‌ఛార్జులను నియమించింది. ఆదిలాబాద్ క్లస్టర్ కు కేంద్ర మంత్రి హర్షోత్తం ఖోడా భాయ్, హైదరాబాద్ క్లస్టర్ కు కేంద్ర మంత్రి వెంకటేష్ జోషి, మహబూబ్ నగర్ క్లస్టర్ కు మహేంద్ర నాధ్ పాండే, వరంగల్ క్లస్టర్ కు మరో కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తారు. వీరితో పాటు తరచూ కేంద్ర మంత్రులు పర్యటిస్తూ .. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కేసీఆర్ ను ఇరిటేట్ చేస్తున్నారు.
|
https://www.telugupost.com/crime/youth-killed-for-bad-comments-on-social-media-in-mysuru-1378752
|
సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. పలు అంశాలను బట్టి తిట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కొందరు అప్పటికప్పుడు తిట్టుకొని మరచిపోయే వాళ్లు ఉంటారు. ఇంకొందరు మరీ పర్సనల్ గా తీసుకుని భౌతిక దాడులు చేసుకునే దాకా వెళుతూ ఉంటుంది.సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన యువకుడిని హత్య చేసిన ఘటన మైసూరులో చోటుచేసుకుంది. నితిన్, మను అనే ఇద్దరు కలిసి బెరేష్ (23)ని హత్య చేశారు. మైసూరు జిల్లా హున్సూర్ పట్టణంలోని సరస్వతి ప్లాజా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నితిన్‌పై బీరేష్ చెడు వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ద్వేషం పెంచుకున్న నితిన్, మను కలిసి బెరేష్‌ను కత్తితో పొడిచి చంపారు. కత్తితో దాడి చేయడంతో బీరేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కేఆర్ ఆస్పత్రిలో చికిత్సకు పంపించారు. చికిత్స తీసుకుంటూ బీరేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై హున్‌సూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
|
https://www.telugupost.com/movie-news/sankranti-four-films-are-ready-for-release-136973/
|
వచ్చే సంక్రాంతికి ఒకటికి నాలుగైదు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు తో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మరో రెండు సినిమాలు పోటీకి రానున్నాయి. అయితే ఇంత పోటీ ఉంటే బయ్యర్లు భారీ రేట్లు ఆఫర్ చేయడానికి వెనకాడతారు. కానీ సరిలేరు నీకెవ్వరుకి పోటీకి సంబంధం లేదు అంటున్నారు బయ్యర్లు. నీకెవ్వరుపై నమ్మకం…. ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మాతలే నైజాం, వైజాగ్‌తో పాటు ఈస్ట్ గోదావరిలో కూడా రిలీజ్ చేయనున్నారు. సినిమా మీద కాంఫిడెన్స్ తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్ధం అవుతుంది. ఇక ఈమూవీ మిగిలిన ఏరియాలకి గాను ‘సరిలేరు నీకెవ్వరు’ థియేట్రికల్ రైట్స్ డెబ్బయ్ కోట్ల వరకు పలుకుతున్నాయట. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకునే సరిలేరు నీకెవ్వరుపై బయ్యర్స్ చాలా నమ్మకంగా వున్నారు. మహేష్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అల్లు అర్జున్ సినిమా ఈ సినిమా పై పెద్దగా ఎఫెక్ట్ కాదని నమ్ముతున్నారు ట్రేడ్ వాళ్ళు.
|
https://www.telugupost.com/movie-news/సంక్రాంతి-పండక్కి-మహేష్-56014/
|
సంక్రాంతి పండుగకి అనౌన్స్ చేసిన విడుదలలో ఒక్క రంగుల రాట్నం చిత్రం మినహా మిగిలిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి ఇప్పటికే ఫలితాలని ఖరారు చేసుకున్నాయి. ఈ పండుగకి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు తన చిత్రాన్ని పోటీకి దింపలేకపోయినప్పటికీ అధిక మొత్తానికి శాటిలైట్ హక్కులని విక్రయించిన స్పైడర్ చిత్రం ఈ ఆదివారం భోగి పండుగ (14 జనవరి 2018 ) న సాయంత్రం 4 :00 గంటలకి ప్రసారం కానుంది. విజయదశమి కి విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చెందిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకి టి.ఆర్.పి రేటింగ్స్ రూపంలోనైనా అగ్ర స్థానంలో నిలపాలని అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే పలు పోస్టులతో చెలరేగిపోతున్నారు.టీఆర్పీ రేటింగ్ లోనైనా....మహేష్ బాబు కెరీర్ లో ఉన్నతమైన చిత్రాలలో అతడు, 1 నేనొక్కడినే కచ్చితంగా ఉంటాయి. అయితే అతడు చిత్రం థియేటర్స్ లో ప్రదర్శితమైన కాలంలో ఒక వర్గ ప్రేక్షకులకి మాత్రమే పరిమితమై టెలివిజన్ ఛానెల్స్ లో ప్రసారమైనప్పుడు మాత్రం ఇప్పటికి కూడా అధిక టి.ఆర్.పి రేటింగ్స్ తో అందరి మన్ననలు పొందుతుంది. మరో వైపు 1 నేనొక్కడినే, ఖలేజా చిత్రాలు బాక్స్ ఆఫీస్ డిజాస్టర్స్ గా నిలిచినప్పటికీ బుల్లి తెరపై అవి సృష్టించిన సంచలనం తెలిసిందే. మరి స్పైడర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్లతో మెప్పించలేకపోయినా టి.ఆర్.పి రేటింగ్స్ తో రికార్డ్స్ సృష్టిస్తుందేమో చూడాలి.
|
https://www.telugupost.com/movie-news/kangana-ranaut-on-differences-with-krish-86029/
|
దర్శకుడు క్రిష్ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలీవుడ్ లో కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రను ఎంతో ఇష్టపడి మణికర్ణిక గా తెరకెక్కించాడు. మణికర్ణిక షూటింగ్ కంప్లీట్ అయ్యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా... పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ కావడంతో దర్శకుడు క్రిష్ తెలుగులో బాలకృష్ణ హీరోగా మహోన్నత వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ సినిమాని డైరెక్ట్ చెయ్యడానికి గత నెలలోనే టాలీవుడ్ కి వచ్చేసాడు. అయితే సకాలంలో పూర్తి కావాల్సిన మణికర్ణిక సినిమా టైం కి పూర్తి కాక ఈ ఏడాది విడుదల కావాల్సింది వచ్చే ఏడాది జనవరి పోస్ట్ పోన్ అయ్యింది.అయితే దర్శకుడు క్రిష్ మణికర్ణికా పోస్ట్ ప్రొడక్షన్స్ ని ముంబై వెళ్లి చూసుకోవడమే కాదు.. ముంబై నుండి హైదరాబాద్ కి హైదరాబాద్ నుండి ముంబై కి ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగుతున్నాడు. కానీ ఈలోపులో క్రిష్ మణికర్ణికని గాలికొదిలేసాడు.... మణికర్ణికని పక్కన పెట్టేసి ఎన్టీఆర్ బయో పిక్ ని ఇంట్రెస్టింగ్ తీస్తున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. ఇక తాజాగా అయితే మణికర్ణిక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంగనా దగ్గరుండి చూసుకుంటూ... క్రిష్ ని పక్కన పెట్టేసి అన్ని తానై మణికర్ణికకు పని చేస్తుందని... క్రిష్ ని కంగనా రనౌత్ అవమానిస్తుందని.. ఇలా రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే కంగనా ముక్కు సూటి మనిషి గనక క్రిష్ తో నిజంగానే విభేదించి ఉండొచ్చనే చాలామంది ఫిక్స్ అయ్యారు.అయితే ఇప్పుడు కంగనా... క్రిష్ కి తనకి మధ్యన ఎటువంటి విభేదాలు లేవని... టాలీవుడ్ లో క్రిష్ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయో పిక్ క్రిష్ కి చాలా ఇంపార్టెన్స్ అని... అంతేకాని క్రిష్ మణికర్ణికని ఏమి వదిలెయ్యలేదని... తనకి క్రిష్ కి మధ్య వస్తున్న పుకార్లకు చెక్ పెట్టె ప్రయత్నం చేసింది. మరి క్రిష్ కి కంగనా చెప్పినట్లు ఎన్టీఆర్ బయోపిక్ మాత్రమే ఇంపార్టెంటా.. మణికర్ణిక కోసం తీవ్రంగా కష్టపడ్డానని.... అదే నా సర్వస్వం అని చెబుతున్న కంగనా మణికర్ణిక సినిమా ఇంపార్టెన్స్ కాదా అంటూ క్రిష్ మీద సెటైర్స్ పడుతున్నాయి. మరి షూటింగ్ పూర్తయ్యి ఆరు నెలలయింది.. మణికర్ణిక గ్రాఫిక్స్ వర్క్ ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఈ టైం లో దర్శకుడికి హీరోయిన్ కి విభేదాలంటే సినిమా మీద క్రేజ్ తగ్గే ఛాన్స్ ఉంది కనకనే కంగనా ఇలా ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేసింది అని అంటున్నారు.
|
https://www.telugupost.com/movie-news/ravi-teja-disco-raja-movie-problems-120305/
|
మాస్ రాజా రవితేజ – వి.ఐ ఆనంద్ కాంబినేషన్ లో ‘డిస్కోరాజా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉంది. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. కారణం బడ్జెట్ ఎక్కువ అయిపోవడం. డైరెక్టర్ ఆనంద్.. రవితేజ మార్కెట్ కి మించి బడ్జెట్ డిజైన్ చేయడం వల్లే ఈ సమస్య వచ్చింది. అయితే బడ్జెట్ తగ్గించడానికి వి.ఐ ఆనంద్ చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. స్టార్ హీరోయిన్స్ ప్లేస్ లో కొత్త హీరోయిన్స్ ని తీసుకుందామని డిసైడ్ అయ్యాడు. సెట్స్ వేయాల్సిన అవసరం ఉన్నా అవుట్ డోర్ షూటింగ్‌కి ఫిక్స్ అయ్యాడు. సినిమా పట్టాలెక్కుతుందా..? ఇలా ఎన్ని చేసినా బడ్జెట్ కంట్రోల్ అవ్వడం లేదు. చివరికి పాటల్ని కుదిస్తే కనీసం కోటి రూపాయలైనా బడ్జెట్ కంట్రోల్‌లోకి వస్తుందని ఆనంద్ భావిస్తున్నాడట. రవితేజ సినిమాల్లో సాంగ్స్ లేకపోతే ఎలా అని ప్రొడ్యూసర్ భయం. అందుకే ఈ సినిమాని తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు సమాచారం. కథ ప్రకారం ఖర్చు పెట్టకపోతే క్వాలిటీ రాదన్నది దర్శకుడి అనుమానం. బడ్జెట్ ఇంకా కంట్రోల్ అవ్వాలంటే హీరో, సాంకేతిక నిపుణులు పారితోషకాలు తగ్గించుకోవడం ఒక్కటే మార్గం. అందుకు రవితేజనే ఒప్పుకోడు. మిగిలిన వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పలేం. పాపం ‘డిస్కో రాజా’కు మరి ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయో చూడాలి.
|
https://www.telugupost.com/movie-news/షాకింగ్-కామెంట్స్-చేస-2-1172/
|
కులాలకు, మతాల పట్టింపుకు వీలైనంత దూరంగా ఉండే జగపతిబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ... నాకు కులం, ప్రాంత భేదాలు లేవు. అదే ఉంటే 'జై బోలో తెలంగాణ' సినిమాలో నటించే వాడినే కాదు. కులాలు లేని సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. ఒక కులాన్ని బీసీలో చేర్చాలని, ఇంకో కులాన్ని ఎస్సీ లేదా ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్లు చూస్తే ఆ డిమాండ్‌లు రాజకీయపరమైనవిగా నేను భావిస్తాను. నేను కమ్మకులంలో పుట్టాను. కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు. ఏ కులంలో పుట్టినా ఇవే మాటలంటాను. కమ్మవాడిగా పుట్టినంత మాత్రాన నా గొప్పేమీ ఉండదు. మిగతా అందరిలాగే నేను కమ్మకులంలో పుట్టాను. అలాంటప్పుడు వాళ్ల గొప్పదనం, ప్రత్యేకత ఏముంది? అని ప్రశ్నించారు జగపతిబాబు.
|
https://www.telugupost.com/movie-news/allu-arjun-trivikram-movie-title-118115/
|
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో మూడో సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ లది హిట్ కాంబో. అందుకే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా అని అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి ఆ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో తండ్రి మీద కొడుకుకు ఉన్న ప్రేమను కథగా తీసుకొని సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తీశాడు. తండ్రీకొడుకుల కథతో ఆ సినిమా తెరకెక్కి హిట్ అయింది. తాజాగా అల్లు అర్జున్ తో మరోసారి తండ్రి సెంటిమెంట్ తోనే త్రివిక్రమ్ ఈ సినిమా కూడా తియ్యబోతున్నాడని.. టైటిల్ కూడా ‘‘నేను నాన్నా’’ అంటూ ప్రచారం జోరుగా జరిగింది. ఈసారి తల్లి సెంటిమెంట్ తో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో సన్నాఫ్ సతమూర్తి అంటూ తండ్రి కొడుకుల అనుబంధాన్ని చూపించేశారు. మరోమారు ఎందుకులే అని.. ఈసారి తల్లి సెంటిమెంట్ తో సినిమా చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలో తల్లి పాత్ర ప్రాధాన్యతను సంతరించుకోవడం వల్లనే ఆ పాత్రకి గానూ భారీ పారితోషకం ఇచ్చి మరీ టబును తీసుకున్నారని అంటున్నారు. తల్లి పాత్రకున్న వెయిట్ వలన తల్లి పాత్ర వైపు నుంచి టైటిల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే అలకనంద అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. మరి అలకనంద అనే టైటిల్ కి త్రివిక్రమ్ మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాడట.
|
https://www.telugupost.com/movie-news/బాక్స్-బద్దలైపోవాల్సింద-37192/
|
బాలకృష్ణ - పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇప్పటికే క్లైమాక్స్ షూట్ ని కంప్లీట్ చేసుకున్న ఈచిత్రం దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈచిత్రంలో బాలకృష్ణ కి జోడిగా శ్రియ శరణ్, ముస్కాన్, కైరా దత్ లు నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. అలాగే మొత్తం చిత్రమంతా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. అయితే రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా పూర్తి స్థాయి కమర్షియల్ ఫార్మాట్లో చేస్తున్న పూరి - బాలయ్య ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి.ఇక బాలకృష్ణ అభిమానులకు ఎలాంటి డైలాగ్స్ కావాలో అలాంటి పంచ్ డైలాగ్స్ ఈ 'పైసా వసూల్' ఉంటాయని అంటున్నారు. అందుకు అనుగుణంగా పూరి ఈచిత్రాన్ని తెరకెక్కించినట్లు చెబుతున్నారు. మరి ఎంతటి డైలాగ్ ని అయినా బాలకృష్ణ ఏంతో సునాయాసంగా చెప్పగలడు. అందుకే చాలా భారీ డైలాగ్స్ ని ఈ చిత్రంలో పూరి పెట్టాడని అంటున్నారు. ఈ డైలాగ్స్ బాలకృష్ణ నోటి వెంట వెలువడుతుంటే బాక్స్ లు బద్దలవ్వాల్సిందే అని కూడా చెబుతున్నారు. ఇక ఈ డైలాగ్స్ కి థియేటర్స్ లో బాలయ్య బాబు అభిమానులు కుర్చీల్లో కూర్చోకుండా ఈలలు కేకలతో థియేటర్ ని మార్మోగించేస్తారని ఛాలెంజ్ చేస్తున్నారు.ఇక బాలయ్య ఎనర్జీ, పూరి స్పీడ్ కలగలిసిన ఆ డైలాగ్స్ ఏ రేంజులో ఉంటాయో చూడాలంటే మనం సెప్టెంబర్ 29 వరకు ఆగాల్సిందే మరి.
|
https://www.telugupost.com/movie-news/కొత్తగా-ట్రై-చేస్తున్నా-2-49531/
|
సందీప్ కిషన్ , మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రం తమిళంలో ‘నెంజిల్ తునివిరుందాల్’ పేరుతో విడుదలైంది. తమిళ దర్శకుడు సుశీంద్రన్ ఈ చిత్రాన్ని ఏక కాలంలో రెండు భాషల్లో తెరకెక్కించాడు. నవంబర్ 10న విడుదలైన ఈ చిత్రం ఫలితం ఆ చిత్ర బృందాన్ని కాస్త నిరాశపరిచింది. చిత్ర నిడివి ఆ ఫలితానికి ఒక కారణం అని భావించిన చిత్ర బృందం ఇటీవలే కథానాయిక పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాలను తొలగించి చిత్ర నిడివిని తగ్గించింది. ఆ ఆలోచనా బెడిసికొట్టింది. ఆ చిత్ర ఫలితాన్ని ఆ నిడివి ఏ మాత్రం మార్చలేకపోయింది.తిరిగి విడుదల...దాంతో ఆ చిత్ర దర్శకుడు సుశీంద్రన్ వినూత్నంగా ఆలోచించి ఆ చిత్రాన్ని ప్రదర్శించే అని థియేటర్లలో నుండి ఆ చిత్రాన్ని తొలగిస్తున్నామని.. కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని తిరిగి డిసెంబర్ 15న విడుదల చేయనున్నామని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు సుశీంద్రన్. విడుదలైన ఒక చిత్రంలో చిన్న పాటి మార్పులు చేయడం సహజమే.. కానీ ఏకంగా సినిమానే ఆపేసి తిరిగి విడుదల చేయడం అనేది కాస్త ఆశ్చర్యపరిచే విషయమే.
|
https://www.telugupost.com/movie-news/అతని-పనైపోయినట్లే-38099/
|
మలయాళ నటి భావన కిడ్నాప్ కేసులో మలయాళ స్టార్ హీరో దిలీప్ ని అరెస్ట్ చేసిన పోలీస్ లు అతనినుండి నిజాలు రాబట్టేందుకు కొన్ని రోజులు కష్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు నిజంగా ఒక సినిమా కథని తలపిస్తుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పటికే దిలీప్ మాజీ భార్య మంజు వారియర్‌ని పోలీసులు విచారించారు. సాక్ష్యాధారాల సేకరణలో భాగంగా మంజు వారియర్ స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేశారు పోలీసులు. అయితే భావన కేసులో భాగంగా పోలీసులు మంజు వారియర్‌ని ఇలా ఉన్నట్లుండి విచారించడం చాలామంది నటీనటులకు అంతుబట్టడం లేదు.అయితే మంజు వారియర్ నటి భావన ప్రాణ స్నేహితులు. అందుకే దిలీప్ గురించిన రహస్యాలను భావన తన ఫ్రెండ్ మంజు వారియర్ కి చెప్పడంతోనే దిలీప్ కి ఆమెకు మధ్యన గొడవలు జరిగి విడిపోయారు. ఇక దిలీప్ మలయాళ హీరోయిన్ నే మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భావన కిడ్నాప్ ఉదంతం జరిగిన తర్వాత భావన కిడ్నాప్ వ్యవహారంలో తన మాజీ భర్త దిలీప్ హస్తం ఉన్నట్లు అప్పట్లో మంజు వారియర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు మాజీ భర్త దిలీప్ పెద్ద క్రిమినల్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.ఒక పక్క దిలీప్ మెడకు ఉచ్చు గట్టిగా బిగిస్తుండడం... బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ... బెయిల్ మంజూరుచేస్తే సాక్ష్యాలు నాశనం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడం వంటి అంశాలు దిలీప్ ని అగాధంలోకి నెట్టేస్తున్నాయి.
|
https://www.telugupost.com/movie-news/kollywood-actor-karthi-dhonga-movie-review-143066/
|
కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమా ఫ్లేవర్ ని ఇంకా మర్చిపోకుండానే దొంగ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కోలీవుడ్ హీరో కార్తీ. ఖైదీ సినిమాతో నటనలో 1000 మెట్లెక్కిన కార్తీ… ఆ సినిమాతో మాస్, క్లాస్, ప్రేక్షకులను పడేసాడు. ఖైదీ సినిమాలో కార్తీ నటనకు కోలీవుడ్ ప్రేక్షకులే కాదు, టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఆ సినిమాతో కార్తీ నుండి సినిమా వస్తుంది అనగానే అందరిలో పిచ్చ ఆసక్తి. దానికి తగ్గట్టుగానే వదిన జ్యోతిక తో కలిసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ దొంగ అంటూ వచ్చెయ్యడం.. ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చెయ్యడం జరిగిపోయింది. కొందరు హీరోలు కథలు లేక అల్లాడిపోతుంటే.. కార్తి మాత్రం మంచి కథలను వెతికి పట్టుకుంటున్నాడు అనిపిస్తుంది.. ఖైదీ, దొంగ సినిమాలు చూస్తుంటే. జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో తెరకెక్కిన దొంగ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. జీతూ జోసెఫ్ చిన్న లైన్ తీసుకుని దానికి పట్టుసడలని స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. తెలిసిన కథే అయినా.. కథనం బాగుండటంతో నెక్ట్స్ ఏంటి అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా కామెడీగా సాగింది. అక్కడక్కడా కాస్త స్లో అనే ఫీలింగ్ కలిగినంతలోనే…. కార్తీ కామెడీతో సినిమాని లేపాడు. ఓ చిన్నపిల్లాడికి కార్తితో వచ్చే కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. సత్యరాజ్, కార్తి మధ్య సన్నివేశాలు కూడా ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డల్ అయింది.. కానీ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. జ్యోతిక పాత్ర మొదటి సగంలో అసలు ప్రాధాన్యం లేకుండా సాగగా సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సన్నివేశాలకే పరిమితం అయ్యారు. ఫస్ట్ హాఫ్ స్లోగా మొదలవడం.. సెకండ్ హాఫ్ లో కామెడీ లేకపోవడం, జ్యోతిక కేరెక్టర్ కి ఫస్ట్ హాఫ్ లో పెద్దగా స్కోప్ లేకపోవడం, హీరోయిన్ సీన్స్ కూడా పెద్దగా లేకపోవడం అనే చిన్న చిన్న మైనస్ లు తప్పిదే కార్తీ దొంగ ఓవరాల్ గా ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.
|
https://www.telugupost.com/movie-news/allu-arjun-new-films-75376/
|
బన్నీ లేటెస్ట్ మూవీ 'నా పేరు సూర్య' వసూళ్లు, కంటెంట్ పరంగా పూర్తి నిరాశపరిచింది. దీంతో బన్నీ, తన ఫ్యాన్స్ ఈ సినిమాతో బాగా నిరాశ చెందారు. అందుకోసం బన్నీ తన తర్వాతి సినిమా చేసేందుకు బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఈసారి ఆయన తన సినిమాల విషయంలో, దర్శకుల విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకున్నాడట.స్టార్ డైరెక్టర్లతో రెండు సినిమాలు....విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో బన్నీ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. బన్నీకి.. విక్రమ్ కుమార్ కథ కూడా చెప్పాడు. కాకపోతే అందులో కొన్ని మార్పులు చేయమని బన్నీ కోరగా ఆ మార్పులను చేసేసి విక్రమ్ కుమార్ రంగంలోకి దిగనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ వరుసగా రెండు సినిమాలని లైన్ లో పెట్టుకున్నాడు. అది కూడా స్టార్ డైరెక్టర్స్ త్రివిక్రమ్, సురేందర్ రెడ్డితో తన సినిమాలు ఉండేలా బన్నీ చూసుకున్నాడు. గతంలో త్రివిక్రమ్ తో బన్నీ.. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' చేశాడు. ఆ రెండు సినిమాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డితో 'రేసు గుర్రం' చేయగా అది ఘన విజయం సాధించింది. అందువలన ఈ ఇద్దరి దర్శకులను బన్నీ లైన్లో పెట్టేశాడని అంటున్నారు.
|
https://www.telugupost.com/movie-news/pujahegde-mahesh-prabhash-fans-92847/
|
నిన్నటివరకు ప్లాప్ హీరోయిన్ పూజ హెగ్డే అరవింద సమేత లో ఎన్టీఆర్ సరసన నటిస్తుంది..ఐరెన్ లెగ్ హీరోయిన్ అమ్మో అని ఎన్టీఆర్ ఫాన్స్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. కానీ మొన్న గురువారం విడుదలైన అరవింద సమేత - వీర రాఘవ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఎన్టీఆర్ సరసన అరవింద కేరెక్టర్ లో మెరిసిన పూజ హెగ్డే కి అరవింద ముందువరకు హిట్ అయిన సినిమానే లేదు. ఒక లైలా కోసం, ముకుంద, డీజే వంటి సినిమాలు బావున్నాయనిపించినా.. ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో.. పూజ హెగ్డే ని ఐరెన్ లెగ్ అనేసారు. కానీ అరవింద సమేత హిట్ అవడంతో ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త కుదురుపడ్డారు.ఊపిరి పీల్చుకున్న.......కేవలం ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే కాదు.. ఇప్పుడు మహేష్ ఫాన్స్ తో పాటుగా ప్రభాస్ ఫాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పూజ నటించిన అరవింద సమేత హిట్ అవడంతో.... మహేష్ తో మహర్షి సినిమాలో చేస్తున్న పూజ హెగ్డే విషయంలో కాస్త ఊపిరి పీల్చుకున్నారు మహేష్ ఫాన్స్. అరవింద టాక్ కోసం ఎదురు చూసిన మహేష్ ఫాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఐరెన్ లెగ్ ముద్ర నుండి బయటికొచ్చిన పూజ హెగ్డే విషయంలో అనుమానాలు పక్కన పడేసారు.ప్రభాస్ తోకూడా....అలాగే ప్రభాస్ ఫాన్స్ కూడా అరవింద సమేత హిట్ తో కాస్త జోష్ లోకెళ్లారు. ప్రభాస్ తో పూజ హెగ్డే.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ 20 లో నటిస్తుంది. ఇక అరవింద సమేత లో అరవింద గా పూజ హెగ్డే గ్లామర్ కి మంచి పేరే వచ్చింది. అయితే పూజ హెగ్డే వాయిస్ మాత్రం అంత సెట్ కాలేదనే విమర్శలొచ్చాయి. మహేష్ పక్కన కూడా పూజ గ్లామర్ తో పడేస్తుందని.. ప్రభాస్ పక్కన కూడా హైట్ తో పూజ అదరగొడుతుందనే ధీమాలో మహేష్ అండ్ ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు.
|
https://www.telugupost.com/movie-news/rakul-preet-singh-hot-photo-shoots-142160/
|
రకుల్ ప్రీత్ చేతిలో సినిమాలు ఉన్నాయా… లేదా… అనేది పక్కనబెడితే.. అమ్మడు గ్లామరస్ గా కనిపించడానికి, హాట్ హాట్ ఫోజులివ్వడానికి ఎక్కడా తగ్గదనేది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. మ్యాగజిన్ కవర్ పేజెస్ కోసమో, బాలీవుడ్ లో జరిగే ఈవెంట్స్ కోసమో రకుల్ అందంగా డ్రెస్ వేసుకుని, ఆంటే అందంగా మేకప్ వేసుకుని…. హాట్ హాట్ గా ఫొటోస్ కి ఫోజులివ్వడం… వాటిని ఎంచక్కా సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం.. ఇలా ఎప్పటికప్పుడు రకుల్ వార్తల్లోనే ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ సినిమాల బిజీతో హైలెట్ అవుతుంటే.. రకుల్ మాత్రం గ్లామరస్ ఫోటో షూట్స్ తో హైలెట్ అవుతుంది. తాజాగా FHM కవర్ పేజీ కోసం రకుల్ చేసిన హాట్ ఫోటో షూట్స్ లో ఫొటోస్ ఒక్కోక్కటిగా సోషల్ మీడియాకి చేరుతున్నాయి. నిన్నగాక మొన్న ట్రైబల్స్ వేసుకునే డ్రెస్ లాంటి డ్రెస్ ఫోటో షూట్ తో FHM కవర్ పేజీ ఎక్కిన రకుల్.. తాజాగా FHM కోసం చేసిన మరో హాట్ ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్లీవ్ లెస్ కట్ ఫ్రాక్ లో రకుల్ చేసిన హాట్ షో మాములుగా లేదు. స్లీవ్ లెస్ గౌన్ కి పెద్ద కోటుని వేలాడేసి రకుల్… మోకాళ్ళ పైకి కట్ ఉన్న లాంగ్ ఫ్రాక్ లో హాట్ లుక్ తో చంపేస్తుంది. లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో రకుల్ అందాలను ఎంత పొగిడిన తక్కువే అనేలా ఉంది. కాకపోతే ఓ యాంగిల్ లో అసలు ఈ ఫోటో లో ఉన్నది మన రకులేనా అని అనిపిస్తుంది. అలాంటి మేకప్ తో, హెయిర్ స్టయిల్ తో రకుల్ ఈ పిక్ లో కనబడుతుంది
|
https://www.telugupost.com/crime/andhrapradesh-annamayya-district-madanapalle-altaf-friends-love-angle-1488566
|
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లెలో అల్తాఫ్ అనే యువకుడిపై ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అల్తాఫ్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు, అల్తాఫ్ ను అడ్డుకున్నారు. బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని మదనపల్లెలోని నవోదయ పాఠశాల దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ చూస్తుండగానే అల్తాఫ్ పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. స్థానికులు వెంటనే స్పందించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వాళ్లు పరారయ్యారు. అక్కడే ఉన్న వాళ్లు మంటలను అదుపు చేసి 108కు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన అల్తాఫ్ ను మదనపల్లెలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అల్తాఫ్‌ను డీఎస్పీ పరామర్శించారు. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కుటుంబ సభ్యుల నుండి పలు వివరాలు సేకరిస్తూ ఉన్నారు.
|
https://www.telugupost.com/movie-news/kalyandev-vijetha-event-77019/
|
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి తో పాటు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, కీరవాణి, అల్లు అరవింద్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, నిర్మాత ఎన్. వి.ప్రసాద్ మరియు మైత్రి మూవీస్ చెర్రి హాజరయ్యారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... "35 ఏళ్ల క్రిందట నేను చేసిన విజేత సినిమా టైటిల్ తో ఇప్పుడు సినిమా రావడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు నచ్చింది. తండ్రి, కొడుకుల మధ్య రిలేషన్ ఈ సినిమాలో చక్కగా చూపించారు. కొత్త తరగతి ఆడియన్స్ కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కళ్యాణ్ దేవ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. రొమాంటిక్ సీన్స్, ఎమోషన్స్ సీన్స్ లో తన నటన చక్కగా కనబర్చారు." అన్నారు.అందరినీ మెప్పించేలా ఉంటుంది...డైరెక్టర్ రాకేష్ శశి మాట్లాడుతూ... "కళ్యాణ్ దేవ్ కథను నమ్మి ఈ సినిమా చేశారు. సాయి నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమా అందరిని అలరిస్తోందని నమ్ముతున్నాను" అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..."విజేత సినిమా టైటిల్ తో కళ్యాణ్ దేవ్ సినిమా చెయ్యడం సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి నిర్మాతలు కావాలి. కళ్యాణ్ దేవ్ టాలెంటెడ్ నటుడు. ప్రోమోస్, సాంగ్స్ చూస్తుంటే తెలుస్తుంది. అతను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా" అన్నారు. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ..."ట్రైలర్ చూసాక సినిమాపై అంచనాలు పెరిగాయి. విజేత విడుదల తరువాత నిర్మాత సాయి కొర్రపాటికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నా. ప్రేమ్ రక్షిత్ కోడి సాంగ్ ను బాగా కొరియోగ్రఫీ చేసారు." అన్నారు.నటీనటులు:కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా.
|
https://www.telugupost.com/movie-news/ఈసారి-పక్కాగా-ప్లాన్-చేస-36819/
|
మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో 'స్పైడర్' చిత్రం మొదలు పెట్టినప్పటినుండి సినిమా షూటింగ్ ఏకధాటిగా జరుగుతున్నప్పటికీ అనుకున్న టైంకి సినిమా కంప్లీట్ కాలేదు. కారణం మురుగదాస్ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాకపోవడమనే టాక్ బాగా వినబడుతుంది. ఇక 'స్పైడర్' చిత్రానికి మహేష్ డేట్స్ పూర్తయినప్పటికీ షూటింగ్ డిలే వలన మళ్ళీ కొన్ని డేట్స్ మహేష్ అడ్జెస్ట్ చెయ్యాల్సి వచ్చింది. ఇక రెండు పాటల మినహా ప్రస్తుతానికి 'స్పైడర్' షూటింగ్ పూర్తికానుండడంతో మహేష్ ఇప్పుడు తనతదుపరి చిత్రంపై దృష్టి సారించాడు.మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'భరత్ అను నేను' చిత్రాన్ని కొరటాల డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసందే. ఇక 'భరత్ అను నేను' సినిమా షూటింగ్ విషయంలో మహేష్ ఈసారి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట. 'స్పైడర్' షూటింగ్ ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని 'భారత్ అను నేను' షూటింగ్ విషయంలో అలా జరగకుండా.. ఈ చిత్రాన్ని ఎలాగైనా నవంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ లో ఆడియో విడుదల చేసి వచ్చే సంక్రాంతికల్లా సినిమా విడుదల చెయ్యాలనే సంకల్పంతో మహేష్ ఈ చిత్ర షూటింగ్ కంటిన్యూగా జరిగేలా కాల్షీట్లు కేటాయించినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇక కొరటాల - మహేష్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఇందులో మహేష్ బాబు తొలిసారి పొలిటీషియన్‌గా కనిపించనుండడంతో... ఈ చిత్రంలో మహేష్ లుక్ ఎలా వుంటుందనే క్యూరియాసిటీ అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తుంది.
|
https://www.telugupost.com/movie-news/పాపం-సందీప్-కిషన్-49481/
|
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమా తర్వాత సందీప్ కిషన్ కి చెప్పుకోదగ్గ హిట్స్ ఏమి లేవు. లేటెస్ట్ గా వచ్చిన 'కేరాఫ్ సూర్య' కూడా ఫ్లాప్ కోటాలో చేరిపోయింది. కాన్సెప్ట్ సినిమాలు వదిలేసి కమర్షియల్ హీరోగా ఎదగాలని చూసి చేజేతులా పరాజయాలు కొని తెచ్చుకున్నాడు. దీంతో కెరీర్ ని తన దారిలోకి తిప్పుకోవడంలో విఫలమయ్యాడు.సక్సెస్ రేటు లేక...తీసింది తక్కువ సినిమాలే అయినా సక్సెస్ రేట్ లేకపోవడం తో కొత్తరకం కథలకి పెద్ద పీట వేసాడు. కానీ అవి కూడా అంత సక్సెస్ ను అందుకోలేకపోతున్నాయి. అసలే మిడ్ రేంజ్ హీరోల మధ్య పోటీ పెరిగిపోవడంతో మంచి కథలు దొరకడం కష్టమైపోతోంది. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రాలు చేస్తే మార్కెట్ వుంటుందని భావించి చేసిన సినిమాలేవీ.. కలిసి రావడం లేదు. 'నగరం' సినిమా తనకు పేరు తెచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్‌నివ్వలేదు. ఇక 'కేరాఫ్ సూర్య' మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుంటే అది కూడా నిరాశపరిచింది.కెరియర్ కష్టాల్లో...దీంతో ఇంకా సందీప్ కిషన్ కెరియర్ కష్టాల్లో పడింది. బ్రాండ్లు కంటే ఒక కథని నమ్ముకుని, దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి దాంతోనే నిలబడడానికి సందీప్ ట్రై చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాంటి కథలు, డైరెక్టర్స్ సందీప్ కిషన్ కు దొరుకుతుందని ఆశిద్దాం.
|
https://www.telugupost.com/movie-news/కళ్యాణ్-రామ్-స్నేహితురాల-12725/
|
అనేక లఘు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుని, వెండి తెర పై కూడా తన అభినయాన్ని ప్రదర్శిస్తున్న శ్రావ్య రెడ్డి సామాజిక మాంద్యాలలో నిత్యం ప్రేక్షకులకు అందుబాటులో వుంటూ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో సంపన్నుల నుంచి సామాన్యుల వరకు అందరిని కుదిపేసిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ప్రజలలో నెలకొన్న అపోహల తొలగించటానికి ఈ పరిణామంపై తనకి వున్నా జ్ఞానాన్ని తన ఫాలోయర్స్ తో పంచుకోవటానికి తన పేస్ బుక్ లో లైవ్ చాట్లో ముచ్చటించటానికి పూనుకుంది శ్రావ్య రెడ్డి. తాను చెప్పిన సమయానికి తన ఫాలోయర్స్ తో ముచ్చటించటం ప్రారంభించింది.పేస్ బుక్ లో తన ఫాలోయర్స్ లో వున్న ఒక వ్యక్తి చర్చ మధ్యలో శ్రావ్య రెడ్డి ని తన శరీర భాగాల కొలతలు అడగగా శ్రావ్య రెడ్డి తన సహనాన్ని కోల్పోయింది. అతగాడిపై విరుచుకుపడింది. "జరుగుతున్న చర్చ దేని మీద? నువు అడుగుతున్న ప్రశ్న దేని గురించి? నేను కూడా చర్చ నుంచి బైటకి వచ్చి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తాను. నువ్వు సమాధానం తెలుసుకున్న తరువాత వచ్చి నా శరీర భాగాలని తాకే ధైర్యం చెయ్యగలవా? నీలాంటి వారి వలెనే దేశంలో అనేక సాంకేతిక విషయాలు ప్రజల ప్రయోజనాలకు నోచుకోలేకపోతున్నాయి." అని ధీటుగా స్పందిస్తుండగా, మిగిలిన ఫాలోయర్స్ శ్రావ్య రెడ్డి ని శాంత పరిచారు. తరువాత కూడా 20 నిమిషాల పాటు లైవ్ చాట్ కొనసాగించింది శ్రావ్య రెడ్డి.ఇటీవల విడుదల ఐన ఇజమ్ చిత్రంలో కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ స్నేహితురాలిగా కనిపించింది శ్రావ్య రెడ్డి.
|
https://www.telugupost.com/movie-news/ఇండియన్-సినిమా-ఎరగని-అరు-15039/
|
యువత, కందిరీగ, డిక్టేటర్ తో పాటు పలు చిత్రాలలో మెరిసిన అక్ష పార్దాసాని కి చెప్పుకోదగ్గ విజయాలు కానీ అవకాశాలు కానీ తెలుగు, మళయాళ చిత్ర పరిశ్రమల్లో దక్కలేదు. కానీ అదృష్టవ శాత్తు అక్ష కు ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సువర్ణావకాశం దక్కింది. చిత్ర కథ కథనాలు గురించిన వివరాలు తెలియనప్పటికీ అక్ష ప్రస్తుతం నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'లవ్ యు ఫామిలీ' ఒక అరుదైన చరిత్ర సృష్టించింది. ఈ చిత్ర చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశమే ఈ చిత్రానికి ఆ ఘనత సాధించిపెట్టింది.భారతీయ చిత్రాలు ఇప్పటివరకు కజికిస్థాన్ దేశంలో చిత్రీకరణ జరుపుకున్న దాఖలాలు లేవు. సచ్ఛీంద్ర శర్మ దర్శకత్వంలో ఏబీసీడీ ఫేమ్ సల్మాన్ యూసుఫ్ ఖాన్, అక్ష పార్దాసాని జంటగా నటిస్తున్న లవ్ యు ఫామిలీ చిత్రంలో ఎక్కువ భాగం కజికిస్థాన్ దేశంలో తెరకెక్కుతుంది. అక్కడి ప్రజలు చాలా సహకారం అందిస్తున్నారని, ఎన్నో అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుకునే విధంగా అనుమతుల విషయంలో వెసులుబాటు కలిపించారు అని అక్ష తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అంతే కాక మన బాలీవుడ్ చిత్రాలను అక్కడి ప్రజలు తరచు చూస్తుంటారంట. రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి లకు కజికిస్తాన్లోనూ అభిమానులు వున్నారని తెలిపింది అక్ష.
|
https://www.telugupost.com/movie-news/samantha-in-manmadhu-2-movie-120433/
|
నాగ చైతన్య వరుస ఫ్లాప్స్ కి మజిలీ సినిమా బ్రేక్ వేసింది. మజిలీ సినిమాలో సమంత నటించడం వలన ఆ సినిమాకి బీభత్సమైన క్రేజ్ వచ్చిందనేది వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సమంత మజిలీలో చైతు కోసమే నటించింది అనేది అందరికీ తెలిసిన సత్యం. శివ నిర్వాణ డైరెక్షన్ లో చైతు – సమంత జంటగా వచ్చిన మజిలీ సూపర్ హిట్ అయ్యింది. మజిలీ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉన్నారు అంటే అది కేవలం శ్రావణి క్యారెక్టర్ చేసిన సమంత కోసమే. మజిలీ సెకండ్ హాఫ్ లో సమంత శ్రావణి క్యారెక్టర్ లో జీవించింది. ప్రతి మహిళకు శ్రావణి క్యారెక్టర్ బాగా దగ్గరైంది. మూడు సినిమాల డిజాస్టర్స్ తో ఉన్న చైతుకి.. సమంత ఆ రకంగా హిట్ అందించింది. ప్రత్యేకంగా పాత్ర సృష్టించి మరీ… ఇక మామ నాగార్జున కోసం కూడా సమంత అప్పుడే రంగంలోకి దిగింది. ఆఫీసర్ డిజాస్టర్ తో ఉన్న నాగార్జున ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు 2 చేస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్. కాగా ఈ సినిమాలో సమంత కూడా ఓ గెస్ట్ రోల్ చేస్తున్నది అన్న విషయం తెలిసందే. అసలు మన్మధుడు 2లో సమంత కీరోల్ లేకపోయినా రాహుల్ ఆమె కోసం ఓ రోల్ ని సృష్టించాడట. నాగ్ తో సమంత నటించిన మనం, రాజుగారి గది 2 సినిమాలు హిట్ అవడంతో కాస్త సెంటిమెంట్ గా ఉంటుందని నాగ్ దర్శకుడు రాహుల్ కి సలహా ఇవ్వడంతో సమంత కోసం ఓ పాత్ర ని స్పెషల్ గా సృష్టించారట. ఎలాగూ ఆఫీసర్ సినిమాతో మర్కెట్ పడిపోయిన నాగార్జునకు ఇప్పుడు క్రేజ్ ఉన్న సమంత తోడైతే మన్మధుడు 2కి క్రేజ్ వస్తుందనేది కూడా సమంతని ఈ సినిమాలో తీసుకోవడానికి మరో కారణమట.
|
https://www.telugupost.com/movie-news/ఇది-పవన్-స్టైల్-1112/
|
ఒక్కో సినిమా స్క్రీన్‌ప్లే ఒక్కోవిధంగా ఉంటుంది. 'సర్దార్‌గబ్బర్‌సింగ్' స్క్రీన్‌ప్లే కూడా పవనే స్పెషల్‌గా డిజైన్ చేసుకున్నాడు 'జానీ' చిత్రం తర్వాత పవన్ చాలా గ్యాప్ తీసుకొని ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఈ 'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రం గురించిన ఓ వార్త ఇప్పుడు అన్నిచోట్లా హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ సినిమా ప్రారంభమైన మొదటి 20నిమిషాలు కనిపించడు. అప్పటివరకు విలన్, రతన్‌పూర్ సెటప్, అక్కడి ప్రజలు పడే కష్టాలు, హీరోయిన్ ఇంట్రడక్షన్ వంటివి సాగుతాయట. సరైన టైమ్‌లో పవన్ ఎంట్రీ ఇచ్చి ఓ పదినిమిషాలు అదరగొట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఫస్టాఫ్ పూర్తి పంచ్ డైలాగులతో, సెకండాఫ్ పూర్తిగా ఫన్ మిక్స్‌డ్ యాక్షన్‌తో సాగుతుందని అంటున్నారు. మొత్తానికి ఇప్పటినుండే పవన్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రం విషయంలో రోజుకో వార్త ప్రచారంలోకి వస్తుంది. ఈ చిత్రం కథ పాతదే అయినా ట్రీట్‌మెంట్ బేస్‌డ్‌గా ఈ చిత్రం అదరగొట్టనుందని తెలుస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను చూస్తే కూడా ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.
|
https://www.telugupost.com/andhra-pradesh/tdp-leader-makes-sensational-comments-in-tdp-bus-yatra-1484074
|
ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏ పార్టీ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఎవరికి వారే ప్రజలతో మమేకమయ్యేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. వారాహియాత్ర, యువగళం, టిడిపి బస్సు యాత్ర ఇలా.. వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. అధికార - ప్రతిపక్షాల మధ్య ప్రతిరోజూ మాటలతూటాలు పేలుతున్నాయి. కాగా.. తాజాగా టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ.. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ దేవినేని ఉమ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలో “తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కు గ్యారంటీ” బస్సు యాత్రలో పాల్గొన్న దేవినేని ఉమ తనకు ప్రాణహాని ఉందని చేసిన వ్యాఖ్యలు.. కలకలం రేపుతున్నాయి.టిడిపి చేపట్టిన బస్సుయాత్ర శనివారం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయి.. నన్ను ఎప్పుడైనా తుదముట్టించవచ్చు’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంపల్లిలో తన కారుపై ఎవరో బండరాయితో దాడి చేశారని, ఆ సమయంలో కారు డోర్ తీసి ఉంటే.. తనతో పాటు మరికొందరు కూడా చనిపోయేవారన్నారు. అలాగే పడవ మునిగిపోయినపుడు గోదావరితల్లే తనను కాపాడిందని చెప్పుకొచ్చారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన తన జీవిత ఆశయం ఒక్కటేనని.. టిడిపి అధికారంలోకి వస్తే.. చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని నాగార్జున సాగర్ కాలువల్లో పారేలా చేస్తానని హామీ ఇచ్చారు.
|
https://www.telugupost.com/movie-news/big-boss-telug-2-winner-kaushal-101967/
|
బిగ్ బాస్ సీజన్ టు తో ఒక్కసారిగా టాప్ సెలేబ్రిటిగా మారిపోయిన కౌశల్ మాండా.. ప్రస్తుతం సీరియల్స్ షూటింగ్ తో బిజీగా వున్నాడు. బిగ్ బాస్ లోకి రాకముందే సీరియల్ నటుడిగా, మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకున్న కౌశల్ బిగ్ బాస్ లోకొచ్చాక ఆ క్రేజ్ మరింతగా పెంచుకున్నాడు. కౌశల్ ని కౌశల్ ఆర్మీ హీరోని చేసింది. ఇక బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక చేతినిండా సినిమాలు, పలు యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ కౌశల్ మారతాడు అనుకంటె.. అలాంటిదేం కనబడడం లేదు. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక.. గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్ కి తన పేరు పరిశీలనలో ఉంది, అలాగే ప్రైమ్ మినిస్టర్ నుండి కాల్ వచ్చింది అంటూ గొప్పలు పోయిన కౌశల్ చెప్పినవన్నీ అబద్ధాలని ప్రూవ్ అయ్యాయి.అయితే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ బయటికొచ్చాక ఒక నెల పాటు కౌశల్ ఆర్మీని కలవడం, అలాగే కౌశల్ ఆర్మీతో మంచి పనులు చేపిస్తున్నా అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిన కౌషల్ రిబ్బన్ కటింగ్స్ అంటూ హడావిడి చేసాడు. హీరో హీరోయిన్స్ తో పాటుగా తానూ షాప్ ఓపెనింగ్స్ లో రిబ్బన్స్ కట్ చేస్తూ కాస్త హడావిడి చేసాడు కూడా. బిగ్ బాస్ క్రేజ్ ని ఉపయోగించుకున్న కౌశల్... తనని షాప్ ఓపెనింగ్స్ కి పిలిచిన వారికీ చుక్కలు చూపెడుతున్నాడనే టాక్ వినబడుతుంది. మొదట్లో కౌశల్ కొన్ని విషయాల్లో బిగ్ బాస్ ని యూస్ చేసుకున్నా.... కౌశల్ బిగ్ బాస్ విన్నర్ గా షాప్ కటింగ్స్ తో క్యాష్ చేసుకుంటూ చెలరేగిపోదామనుకున్నాడు.అందుకే తనని సంప్రదించే షాప్ యజమానులు రిబ్బన్ కటింగ్ చెయ్యాలంటే 25 లక్షలు కావాలంటూ డిమాండ్ చేసాడట. కౌశల్ చెప్పిన 25 లక్షల పారితోషకం విన్న షాప్ యజమానులు కౌశల్ కాల్ కట్ చేస్తున్నారట. మరి హీరోయిన్స్ కి కూడా లేని డిమాండ్ తనకి వచ్చేసింది అనుకున్నాడేమో కౌశల్ అందుకే.. ఇలా అడిగాడు. హీరోయిన్స్ అయితే ఐదారు లక్షలకే వచ్చేస్తుంటే.... బిగ్ బాస్ క్రేజ్ తో ఈయనకి 25 ఎక్కడ సమర్పించుకుంటాం అంటూ పారిపోతున్నారట షాప్ యజమానులు
|
https://www.telugupost.com/movie-news/rajamouli-pawan-movie-154915/
|
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యణ్ క్రేజ్ ఇప్పటికి ఎంత మాత్రమూ తగ్గలేదు. పవన్ సినిమాల్లోకి వచ్చి ఏళ్ళు గడిచినా.. పవన్ సినిమా వస్తుంది అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. ఇక టాలీవుడ్ లోనే కాదు, ఇంటర్నేషనల్ గాను రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే పిచ్చ క్రేజ్, క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి జక్కన్న – పవన్ కళ్యాణ్ కలిస్తే బాక్సాఫీసు బద్దలవడం ఖాయం. మరి రాజమౌళి RRR తర్వాత మహేష్ సినిమా అనగానే అందరిలో పిచ్చ క్రేజ్ వచ్చేసింది. జక్కన్న – మహేష్ కాంబోపై అప్పుడే అంచనాలు. మరి అలాంటి జక్కన్నతో పవన్ కళ్యాణ్ కూడా ఓ సినిమా చేస్తే అబ్బో దాని రేంజ్ మాములుగా ఉండదు. మరి రాజమౌళి ఎప్పుడు పవన్ తో సినిమా చెయ్యడానికి ప్రయత్నించలేదా? అంటే అలాంటిదేం లేదు.. పవన్ కళ్యాణ్ తో రాజమౌళి సినిమా ప్రయత్నాలు జరగడం… అది క్రియేటివ్ డిఫ్రెన్సెస్ వల్ల పట్టాలెక్కకపోవడం జరిగింది. తాజాగా రాజమౌళి అదే విషయాన్నీ రివీల్ చేసాడు. పవన్ తో సినిమా ఎందుకు చెయ్యాలనుకోలేదు.. ప్రయత్నించడం, ఆగిపోవడం రెండు జరిగాయని చెప్పిన రాజమౌళిని ఫ్యూచర్ లో పవన్ తో సినిమా ఎమన్నా ఉంటుందా అంటే.. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా బిజీ. సో సినిమాలకు సమయం కేటాయించే అవకాశాలు తక్కువ. నేనా సినిమాని ఏళ్ళ తరబడి తీస్తాను, సో నాకు పవన్ కళ్యాణ్ కి ఫ్యూచర్ లో సెట్ అవ్వొచ్చు, సెట్ కాకపోవచ్చు అంటున్నాడు. అయితే ఏదైనా నిడివి తక్కువున్న పవర్ ఫుల్ కేరెక్టర్ ఉన్న కథ తగిలితే.. పవన్ తో సినిమా ఉంటుందేమో చెప్పలేం అంటూ రాజమౌళి పవన్ సినిమాపై దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.
|
https://www.telugupost.com/andhra-pradesh/ex-mp-undavalli-arun-kumar-comments-about-ys-rajasekhara-reddy-1436764
|
సంక్షేమ సారథి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనతో అనుబంధం ఉన్న నేతలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు కృష్ణా జిల్లా అంపాపురంలో జరిగిన డాక్డర్ వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజమండ్రి మాజీ ఎంపీ, సామాజికవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. పేదల కోసం పరితపించిన వ్యక్తి వైఎస్సార్ అని ఆయన అన్నారు. 2009 సెప్టెంబర్ 2న సీఎం వైఎస్సార్ హెలికాప్టర్ కనిపించకుండా పోవడంతో అంతా ఆందోళన చెందామని.. రాత్రంతా జాగారం చేశామన్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రజలు పూజలు చేశారని చెప్పారు. ఆయన ఇకలేరని తెలిసి కోట్లాది మంది కన్నీరు పెట్టారని.. అది జగతిలో ఒక్క వైఎస్సార్‌కే దక్కిందన్నారు. ఆయన మరణం తర్వాత రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయిందని.. ఆ ఒక్క వ్యక్తి లేకపోవడం వల్ల పేదల జీవితాలు తారుమారయ్యాయని ఆయన అన్నారు. ఇప్పటి పాలకులు కూడా ఆయనను ఆదరంగా తీసుకుని పరిపాలన కొనసాగించాలని ఆయన సూచించారు.
|
https://www.telugupost.com/movie-news/152nd-chiranjeevi-film-in-the-direction-of-koratala-137076/
|
త్వరలోనే కొరటాల డైరెక్షన్ లో చిరు 152 వ చిత్రం చేయనున్నాడు. కొరటాల – చిరంజీవి కాంబినేషన్ అనగానే ఇదొక పక్క కమర్షియల్ సినిమా అని అర్ధం అయిపోతుంది. ఎప్పటి నుంచో చిరు అభిమానులు చిరు కమర్షియల్ సినిమా చేస్తే చూడాలి అనుకుంటున్నారు. అది ఈ సినిమాతో తీరిపోనుంది. చిరు, కొరటాల బలబలాలను బట్టి మనం కూడా వీరి సినిమాలో ఉండబోయే అంశాలు, ఉండని అంశాలు ఏమిటో చూద్దాం. చిరు ఫ్యాన్స్ కోరిక తీరేనా…..? ముందుగా చిరు ఫ్యాన్స్ కోరుకునేది హీరో ఎలివేషన్స్. ఈ విషయానికి వస్తే కొరటాల ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీస్తాడు. కొరటాల సినిమా అంటే ఎలివేషన్స్ కి పెట్టింది పేరు. సో ఎలివేషన్ విషయంలో ఫ్యాన్స్ కి దిగులు లేదు. ఇక చిరు ప్రధాన బలమైన డ్యాన్సులు విషయానికొస్తే తన సినిమాలో మంచి సాంగ్స్, డ్యాన్సులు ఉండేలా చూస్తారు. డ్యాన్సులు లేందే చిరు సినిమా ఒప్పుకోరు. సో ఇది కూడా ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఉండబోతుంది. ఇక మరొకటి చిరు కామెడీ చేస్తే చూడాలని అభిమానులు ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు. కానీ కొరటాల సినిమాలు అంటే కామెడీ అసలు ఉండదు. అతని సినిమాల్లో హీరోస్ అంతా ఏదో సీరియస్ మోడ్ ఆన్ చేసినట్టే ఉంటారు. సో ఈమూవీలో ఫ్యాన్స్ కామెడీ ని పెద్దగా ఎక్స్ పెక్ట్ చేసుకోవద్దు. ఇక లాస్ట్ గా చిరు సోషల్ మెసేజ్ ఇస్తే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సినిమాతో అది కూడా తీరిపోనుంది. మొత్తంగా చెప్పాలంటే ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ అని అర్ధం అయిపోతుంది. నవంబర్ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది
|
https://www.telugupost.com/movie-news/జై-సింహ-డే-1-ఏపీటీఎస్-కలెక్-56074/
|
ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 1 .05సీడెడ్ 1 .40వైజాగ్ 0 .72ఈస్ట్ గోదావరి 0 .85వెస్ట్ గోదావరి 0 .81క్రిష్ణ 0 . 46గుంటూరు 1 .10నెల్లూరు 0 .36డే 1 ఏపీ, టీఎస్ కలెక్షన్స్ 6 .75
|
https://www.telugupost.com/movie-news/ps-1-enters-rs150-club-in-just-twodays-1441587
|
మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ (పీఎస్1) శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి షో తర్వాత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. వసూళ్లలో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. మొదటిరోజు కంటే.. రెండో రోజు వసూళ్లు ఎక్కువగా రావడం గమనార్హం. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. రెండ్రోజుల్లోనే పీఎస్ 1 ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లు వసూళ్లు చేసింది. అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ల చిత్రం 'విక్రమ్ వేద' నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ.. పీఎస్ 1 కు భారీ ఓపెన్సింగ్స్ వచ్చాయి.అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వీకెండ్ లో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా, అందరూ స్టార్ నటీనటులే కావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. మూడోరోజు ఆదివారం, పైగా పండుగ సెలవులు కావడంతో పీఎస్ 1 కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలివీకెండ్ పూర్తయ్యే సరికి పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా రూ.200-రూ.250 కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్ తదితరులు నటించిన ఈ చిత్రంపై ఆది నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పటికి నెరవేరింది. రెండు, మూడు భాగాల్లో రానున్న ఈ చిత్రాన్ని రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
|
https://www.telugupost.com/movie-news/south-lady-superstar-nayanatara-celebrated-new-year-with-her-boyfriend-vignesh-shivan-in-dubai-1346730
|
2021 కి వీడ్కోలు పలికి.. 2022 కి గ్రాండ్ గా స్వాగతం పలికారంతా. రెండ్రోజులుగా అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతున్నారు. పైగా వీకెండ్ కూడా కలిసి రావడంతో.. పలువురు సెలబ్రిటీ కపుల్స్ అండ్ ఫ్యామిలీస్ నూతన సంవత్సర వేడుకలను ఇతర దేశాల్లోనే జరుపుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే బాటలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన్ కూడా ఉన్నారు. తన ప్రియుడితో కలిసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంది.Also Read : వారం క్రితమే పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయనతార.. ఆయనతో కలిసి దుబాయ్ లో న్యూ ఇయర్ కు స్వాగతం పలికింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన తర్వాత ఈ ప్రేమ పక్షులు చెట్టా పట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను నయన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు.. ఇంకా ఎన్నిరోజులు ఇలా తిరుగుతారు త్వరగా పెళ్లిచేసుకోండంటూ కామెంట్స్ చేస్తున్నారు. Also Read : వామ్మో ! కొత్త ఏడాదిలో.. మరో కొత్త వైరస్ వెలుగులోకి !
|
https://www.telugupost.com/politics/congress-will-emerge-as-a-key-contender-before-the-elections-in-telangana-1484794
|
హైదరాబాద్: రెండు నెలల క్రితం పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యంతో తెలంగాణలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి కీలక సవాల్‌గా నిలిచినట్లు కనిపిస్తోంది. పొరుగున ఉన్న కర్నాటకలో కాంగ్రెస్ విజయం, తదుపరి పరిణామాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా గ్రాండ్-ఓల్డ్ పార్టీ తమను తాము ప్రొజెక్ట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా సూచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత తమదేనని చెప్పుకుంటున్నా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కర్ణాటకలో గెలుపొందడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేవలం ఒక్క షాట్‌లో.. 2018 ఎన్నికల తర్వాత డజను మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల షాక్ నుండి, అన్ని అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పేలవమైన పనితీరు, అంతర్గత పోరు నుండి కాంగ్రెస్ కోలుకున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపించింది. ఆ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ చిన్నచూపు చూస్తున్న సమయంలో కర్ణాటక విజయం సాధించింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన కొద్దిమంది నేతలను ఆకర్షించడంలో కాంగ్రెస్ విజయం సాధించడం, ఖమ్మంలో జూలై 2న రాహుల్ గాంధీ నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందన రాష్ట్రంలో ఆ పార్టీ ప్రాముఖ్యత పెరుగుతుందనడానికి ఇతర సూచికలు. ఎన్నికలకు ఇంకా 4-5 నెలలు మాత్రమే మిగిలి ఉండగా, అధికార రేసులో కాంగ్రెస్ అకస్మాత్తుగా కీలక ఛాలెంజర్‌గా అవతరించింది. బీజేపీని మూడవ స్థానానికి నెట్టివేసింది. తెలంగాణ సాధన ప్రాముఖ్యతను గ్రహించిన కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్రంపై దృష్టి సారిస్తోంది. వ్యూహంపై చర్చించేందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర ముఖ్య నేతలు ఇటీవల కీలక సమావేశం నిర్వహించారు. కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీల తరహాలో కాంగ్రెస్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులు, ఇతర లబ్ధిదారులకు నెలకు రూ.4 వేల పింఛను చెల్లిస్తామని రాహుల్ గాంధీ ఖమ్మం సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్‌కు ఇది దాదాపు రెట్టింపు. ‘తెలంగాణ జన గర్జన’ (తెలంగాణ ప్రజల గర్జన) పేరుతో ఖమ్మంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా ఉందని స్పష్టమైంది. ఈ బహిరంగ సభతో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అధినేత ధీమాగా ఉన్నారు. భారీ స్పందన రాష్ట్రంలోని పార్టీ క్యాడర్‌లో స్ఫూర్తిని పెంచింది. కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌కు ఇదే తొలి భారీ బలప్రదర్శన. ఖమ్మం ర్యాలీ ఘనవిజయం సాధించడంతో కాంగ్రెస్ కేడర్‌లో నూతనోత్తేజం, ఉత్సాహం, ఉత్సాహం వచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. తెలంగాణలో ఇక బీజేపీ రేసులో ఉండదని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ప్రత్యక్ష పోరు ఉంటుందని రాహుల్ గాంధీ ప్రకటించడం ద్వారా పార్టీ నైతిక స్థైర్యాన్ని పెంచారు. తెలంగాణలో కర్ణాటక పునరావృతం అవుతుందని అన్నారు. ఈ జోరును ఆ పార్టీ బాగానే ప్రారంభించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అవకాశం ఉందని, దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకుడు పాల్వాయి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఈ సమావేశం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడమే కాకుండా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రకు ముగింపు పలికింది. 2014, 2018 ఎన్నికల్లో పరాజయాలు, ఫిరాయింపులు, అసెంబ్లీ ఉపఎన్నికల్లో పేలవమైన పనితీరు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)కి జరిగిన ఎన్నికల్లో అంతర్యుద్ధం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన శక్తిగా ఉందని నిరూపించుకుంది. కొన్ని జిల్లాలకే పరిమితమైన బీజేపీకి భిన్నంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు బలమైన ఉనికి ఉంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా బీఆర్‌ఎస్‌కు చెందిన 35 మంది నాయకులు ఇటీవల కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంతో గ్రాండ్-ఓల్డ్ పార్టీకి పెద్ద ఊపు వచ్చింది. ప్రత్యేక రాష్ట్రాన్ని అందించిన ఘనత తమదేనంటూ తెలంగాణలో రాజకీయంగా లబ్ది పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. రైతులకు ఉచిత విద్యుత్‌పై రాష్ట్ర పార్టీ చీఫ్ ఎ. రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనలను బిఆర్‌ఎస్ వక్రీకరించిన తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను రేవంత్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారని ఆరోపిస్తూ రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. అమెరికాలో జరిగిన ఓ సమావేశంలో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి ప్రజలను కేసీఆర్ ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారనే విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ వద్ద ఎదురుదెబ్బ తగిలిన కాంగ్రెస్ కూడా విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్‌రెడ్డి ప్రకటనను వక్రీకరించి బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం వల్ల బీఆర్‌ఎస్ భయపడుతున్నట్లు స్పష్టమవుతోందని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాకరే అన్నారు. తమ కాళ్ల కింద భూమి జారిపోతోందని బీఆర్‌ఎస్ నేతలు గ్రహించారని, అందుకే ఈ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో రైతు డిక్లరేషన్‌ను తమ అధినేత రాహుల్‌గాంధీ విడుదల చేశారని గుర్తు చేస్తూ బీఆర్‌ఎస్ చెబుతున్న...
|
https://www.telugupost.com/movie-news/majili-movie-collections-3-117785/
|
ఏరియా: ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (కోట్లలో) నైజాం 9.48 సీడెడ్ 3.00 వైజాగ్ 3.08 గుంటూరు 1.63 కృష్ణ 1.46 ఈస్ట్ గోదావరి 1.3 వెస్ట్ గోదావరి 0.97 నెల్లూరు 0.6 ఇతరప్రాంతాలు 3.03 ఓవర్సీస్ 3.3 వరల్డ్ వైడ్ షేర్స్ 28.05
|
https://www.telugupost.com/movie-news/anasuya-role-in-pushpa-165544/
|
జబర్దస్త్ యాంకర్ గా అనసూయ కి ఎనలేని క్రేజ్. హాట్ యాంకరింగ్ కి కొత్తర్ధం చెప్పిన భామ అనసూయ. అటు సినిమాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్తానం సంపాదించుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ అలాగే ఈటీవీలో ప్రతి రోజు పండగే షో లోను, జీ తెలుగులో ప్రోగ్రామ్స్ కి జెడ్జి గా ను యమా బిజీ. అయితే అనసూయని వెండితెర మీద రంగస్థలంలో రంగమ్మత్తగా మంచి పాత్ర ఇచ్చాడు దర్శకుడు సుకుమర్. ఆ సినిమాలో అనసూయ నడివయస్కురాలిగా అదరగొట్టేసింది. అయితే తాజాగా అనసూయ కి సుకుమర్ పుష్ప సినిమాలోనుగా ఆదిరిపోయే పాత్ర ఇచ్చాడనే న్యూస్ అల్లు అర్జున్ పుష్ప సినిమా అనుకున్నప్పటినుండి ప్రచారం జరుగుతుంది. అయితే అనసూయ బందిపోటు రాణిగా కనిపించనుందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా అనసూయ పుష్పాలో చెయ్యబోయే కేరెక్టర్ పై ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అది పుష్ప సినిమాలో అనసూయ దృష్టి లోపం ఉన్న మహిళగా కనబడనుందని.. ఈ పాత్ర సినిమాలో కీలకం అంటున్నారు. అందుకే ఈ లాక్ డౌన్ లో అనసూయ పుష్ప సినిమాలో చేసే పాత్రలో నటించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ.. చేయాల్సిన హోమ్ వర్క్ చేసే పనిలో ఉందట. మరోపక్క కృష్ణ వంశి కూడా రంగమార్తాండ లో అనసూయ కి సినిమాకే హైలెట్ అనే పాత్ర ఇచ్చాడు. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తుందిఆ ని సమాచారం.
|
https://www.telugupost.com/top-stories/ticket-in-the-bhuma-family-is-provocative-it-is-doubtful-whether-allagadda-and-nandyala-tickets-will-be-given-to-them-1373695
|
రాజకీయాల్లో కుటుంబ బంధాలకు తావులేదు. ఎవరి పార్టీ వారిదేననుకునే రోజులివే. ఎవరికి వారే రాజకీయంగా ఎదగాలనుకుంటారు. ఇప్పుడు భూమా కుటుంబంలోనూ చిచ్చు రేపింది. ఆళ్లగడ్డ, నంద్యాల టిక్కెట్లు ఈసారి భూమా కుటుంబానికి ఇస్తారా? లేదా? అన్నది కూడా అనుమానమే. ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికే ఇచ్చినా, నంద్యాలలో అభ్యర్థిని మార్చే అవకాశముందంటున్నారు. బ్రహ్మానందరెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.నంద్యాలలో....నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి యాక్టివ్ గానే ఉన్నా శిల్పా కుటుంబాన్ని తట్టుకోలేరన్న భావనలో టీడీపీ అధినేత ఉన్నట్లు సమాచారం. పారిశ్రామిక వేత్త ఎస్సీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాలలో ఎస్పీవై కుటుంబానికి ఉన్న పేరు, ప్రఖ్యాతులు ఆయనను గెలిపిస్తాయని, శిల్పా కుటంబంపై ఉన్న వ్యతిరేకతను భూమా బ్రహ్మానందరెడ్డి క్యాష్ చేసుకోలేరని భావిస్తున్నారు. బ్రహ్మానందరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కావడం కూడా ఆయన పట్ల హైకమాండ్ విముఖంగా ఉందని సమాచారం.అఖిలప్రియ కూడా...ఇక ఆళ్లగడ్డ విషయానికి వస్తే అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ఆమె ఈసారి టిక్కెట్ తనకేనని నమ్ముతున్నారు. అయితే ఆమె సొంత సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి కూడా టిక్కెట్ ను ఆశిస్తున్నట్లు ఇటీవల ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే తమ్ముడికి అంత వయసు లేదని, తగిన సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు అభ్యంతరం లేదని భూమా అఖిలప్రియ చెబుతున్నప్పటికీ జగద్విఖ్యాత్ రెడ్డి ఈసారి పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉన్నారని తెలిసింది.ఫరూక్ కామెంట్స్ తో....మరోవైపు భూమా అఖిలప్రియపై ఆళ్లగడ్డలో ఇమేజ్ తగ్గడంతో తాను కూడా పోటీ చేయడానికి సిద్ధమని భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు కిషోర్ కుమార్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. బీజేపీలో చేరినప్పటికీ ఆయన టీడీపీలో చేరి పార్టీ టిక్కెట్ ను సాధించే పనిలో ఉన్నారు. అయితే భూమా కుటుంబంలో ఒకరికి ఆళ్లగడ్డ టిక్కెట్ ఇవ్వనున్నారు. అది అఖిలప్రియకా? జగద్విఖ్యాత్ రెడ్డికా? అన్నది చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన బాదుడే బాదుడే కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు, ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి ఇద్దరిలో ఎవరనేది కార్యకర్తలు నిర్ణయిస్తారని, అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్నారు. ఇది ఆళ్లగడ్డ టీడీపీని షేక్ చేస్తుంది.
|
https://www.telugupost.com/crime/tragedy-has-happened-in-maharashtra-person-who-was-talking-on-facebook-live-was-shot-dead-in-mumbai-1519620
|
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఫైస్ బుక్ లైవ్ లో మాట్లాడే వ్యక్తిని లైవ్‌లోనే కాల్చి చంపిన ఘటన ముంబయిలో జరిగింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన నేత అభిషేక్ ఘోసాల్కర్ ఫేస్ బుక్ లైవ్‌లో మాట్టాడుతున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు అభిషేక్ పై కాల్పులు జరిపాడు. తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు. నిందితుడు మౌరిస్ నోరాన్హగా గుర్తించారు.లైవ్ లో మాట్లాడుతుండగా...ఈ కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిషేక్ ఘోసాల్కర్ గతంలో కార్పొరేటర్ గా పనిచేశాడు. అదే ప్రాంతంలో నోరాన్హ సమస్యల కోసం పోరాడుతున్నాడు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయని పోలీసులు తెిపారు. ఐసీ కాలని అభివృద్ధి పనులకు సంబంధించి మాట్లాడేందుకు అభిషేక్ ను నోరాన్హ ఆహ్వానించడంతో ఆయన వెళ్లాడు. తనను తాను కాల్చుకుని...బోరివిల్లీ ప్రాంతంలోని ఐసీ కాలనీలోని ఆయన కార్యాాలయానికి వెళ్లిన అభిషేక్ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతుండగా నోరాన్హ కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే అభిషేక్ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ ఆయన మృతి చెందాడు. అభిషేక్ ను కాల్చిన నోరాన్హ కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన ముంబయిలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
https://www.telugupost.com/crime/daddy-home-raja-reddy-mysterious-death-1489280
|
ప్రొద్దుటూరు పూజ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకులు, మైలవరం డాడీ హోమ్ నిర్వాహకులు రాజా రెడ్డి అనుమానస్పదంగా మృతి చెందారు. ఆయన ఒంటి పైన పలు గాయాలు ఉన్నాయి. ఆయన మరణం వెనుక ఎవరు ఉంటారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.రాజా రెడ్డి రాజా ఫౌండేషన్ ను స్థాపించి ఎన్నో గొప్ప పనులు చేసుకుంటూ వెళుతున్నారు. 2001లో 40 ఎకరాల భూమిలో ఆయన ఈ ఫౌండేషన్‌ను స్థాపించారు. 3 అంతస్తుల భవనంతో విశాలమైన క్యాంపస్‌ను నిర్మించారు. ఇప్పుడు డాడీ హోమ్ గా పిలవబడుతున్న ఈ ప్రాంతంలో 150 మంది పేద ప్రజలు ఉన్నారు. అనాథలు, వీధి పిల్లలు, HIV సోకిన పిల్లలు, పెద్దలు, అత్యాచార బాధితులు, మానసిక వికలాంగులు, వృద్ధులు ఇందులో భాగంగా ఉన్నారు. డాడీ హోమ్‌లో చాలా మందికి తాము ఒంటరి వాళ్ళము కామని.. అండగా రాజా రెడ్డి ఉన్నారని భావించే వాళ్లు. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోవడం వాళ్లకు తీవ్ర విషాదాన్ని నింపింది.
|
https://www.telugupost.com/crime/19-years-old-girl-killed-by-her-father-honour-killing-in-uttarpradesh-1469127
|
కూతురు మరో వ్యక్తిని ప్రేమిస్తుందని తెలుసుకున్న తండ్రి.. ఆమెను విచక్షణా రహితంగా కొట్టి హతమార్చాడు. ఈ విషయం బయటికి చెప్పొద్దని చిన్నకూతుర్ని బెదిరించాడు. కానీ అక్క మరణాన్ని తట్టుకోలేక ఆమె నోరు విప్పడంతో విషయం వెలుగుచూసింది. ఈ పరువుహత్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ జిల్లా కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..కర్చన సమీపంలోని హిందూబేలా గ్రామానికి చెందిన లల్లన్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె చాందినీ (19), చిన్న కుమార్తె ఆసియా (15). లల్లన్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.అయితే చాందినీ కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. రెండు నెలలక్రితం అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోగా.. కుటుంబ సభ్యులు ఆమెను వెతికి తీసుకొచ్చారు. 20 రోజుల క్రితం చెల్లెలు ఆసియాతో కలిసి మరోసారి పరారైంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అక్కచెల్లెళ్లు ముంబై ఉన్నట్లు గుర్తించి.. ఇద్దరినీ తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ క్రమంలో చాందినీ ఓ యువకుడిని ప్రేమించిందని, అతని కోసమే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తండ్రి తెలుసుకున్నాడు. కోపం పట్టలేక గత శుక్రవారం అనగా మార్చి 24న ఆమెను ఓ గదిలో బంధించి విచక్షణా రహితంగా గొడ్డును బాదినట్లు బాదాడు.తండ్రి కొట్టిన దెబ్బలను తట్టుకోలేక చాందినీ మరణించింది. ఈ విషయం బయట ఎక్కడా చెప్పొద్దని చిన్నకూతురు ఆసియాను బెదిరించాడు. చాందినీ కరెంట్ షాక్ కు గురై చనిపోయిందని అందరినీ నమ్మించాడు. అనంతరం శ్మశానంలో పూడ్చిపెట్టాడు. అక్క మరణాన్ని జీర్ణించుకోలేని ఆసియా తన తండ్రే చాందినీని చంపినట్లు గ్రామస్థులకు తెలిపింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లల్లన్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేశారు. విచారణలో చాందినీది పరువుహత్యగా తేలింది. పాతిపెట్టిన చాందినీ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు యమునా నగర్ డీసీపీ సంతోష్ కుమార్ మీనా వెల్లడించారు.
|
https://www.telugupost.com/movie-news/prabhas-kangana-routh-ek-niranjan-93494/
|
'బాహుబలి' సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయినా ప్రభాస్ ప్రస్తుతం 'సాహూ' చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈసినిమా తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. తన టాలెంట్ తో...తన నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న కంగనా రనౌత్ ప్రస్తుతం 'మణికర్ణిక' పేరిట ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది.వీరి మధ్య......ప్రభాస్ - కంగనా కాంబినేషన్ వచ్చిన చిత్రం ఒకే ఒక్క చిత్రం 'ఏక్ నిరంజన్'. చాలా ఏళ్ళ కిందట రిలీజ్ అయినా ఈచిత్రాన్ని పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసాడు. ఈసినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ - కంగనా మధ్య ఏర్పడిన వివాదం, గొడవ ఏంటో తెలియదుగానీ..సమయం వచ్చినపుడల్లా ప్రభాస్ ను కంగనా దెప్పిపొడుస్తూనే ఉంది.మాట్లాడుకోవడమే మానేశామంటూ......రీసెంట్ గా ఆమె ఆ గొడవ గురించి ప్రస్తావిస్తూ..."ఏక్ నిరంజన్ సమయంలో మా మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆపై మేమిద్దరం మాట్లాడుకోవడమే మానేశాం" అని తన ఫ్రెండ్స్ తో చెబుతుందంట. కానీ ప్రభాస్ నటించిన 'బాహుబలి' చిత్రం చూసి గర్వంగా ఫీలయ్యానని, 'మణికర్ణిక'లో తన నటన చూసి ప్రభాస్ కూడా అదే విధంగా ఫీలవుతాడని చెప్పిందట. మరి ఆ గొడవ ఏంటో మాత్రం బయటికి చెప్పడంలేదు.
|
https://www.telugupost.com/movie-news/himaja-benz-car-173088/
|
చాలామంది చిన్న హీరోయిన్స్ అయినా, లేదంటే యాంకర్స్ అయినా, సింగర్స్ అయినా ఖరీదైన కారు కానీ, ఇంటిని కొన్నప్పుడు చాలామంది నెటిజెన్స్ వీళ్ళకి అంత డబ్బు ఎక్కడిది.. ఇంత లగ్జరీ లైఫ్ ఎలా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తారు. అప్పుడెప్పుడో అనసూయ ఆడి కారు కొన్నప్పుడు ఆమెని చాలామంది నెటిజెన్స్ సెటైరికల్ గా మాట్లాడితే అప్పట్లో వాళ్ళకి అనసూయ దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చింది. అయితే తాజాగా మరో నటి ఇలాంటి ప్రశ్నకి నెటిజెన్ కి తాట తీసే సమాధానం ఇచ్చింది. ఆమె బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించి.. ప్రస్తుతం సీరియల్స్, సినిమాలు, ఓపెనింగ్స్, రిబ్బన్ కటింగ్స్ అంటున్న హిమజ. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక బాగా పాపులర్ అయిన హిమజ ప్రస్తుతం చాలా సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. నటి కాకముందు పలు ఉద్యోగాలు చేశాను అని చెబుతున్న హిమజ అప్పట్లో ఇంటి రెంట్ కి, ఫుడ్ కి తన సంపాదన సరిపోయేది కాదని… ఇక నటిగా మారాక తన లైఫ్ టర్న్ అయ్యింది అని అంటుంది. ఇక ఇప్పుడు హిమజ కొన్న బెంజ్ కారు గురించి ఆమెకి చాలా రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చిన్న నటివి ఇంత పెద్ద కారు ఎక్కడిది అని, దానికి హిమజ నటిని కాబట్టి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద ఈ కారు తనకి ఈఎంఐ లో షోరూం వాళ్ళు ఇచ్చారని.. ప్రతి నెల ఆరో తారీఖున దీనికి ఈఎంఐ కట్ అవుతుంది అని..చెప్పడమే కాదు.. నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఎప్పుడైనా తనకు డబ్బులు ఇబ్బందైతే నీకు ఫోన్ చేస్తా వచ్చి నా ఈఎంఐ కట్టు.. ఎలాగూ కరోనా కారణంగా కొన్ని నెలల నుంచి వర్క్ లేదు.. ఆదాయం లేదు.. నాకు కారు ఎక్కడిది అని అడిగినోడు ఈఎంఐ కడతాడేమో అడుగుతా అంటూ గట్టి కౌంటర్ ఇఛ్చింది
|
https://www.telugupost.com/politics/in-rayalaseema-there-is-a-change-in-the-situation-from-last-time-elections-1526412
|
రాయలసీమలో వైఎస్ జగన్ కు ఎదురు లేదు. అది మొన్నటి వరకూ వినిపించిన టాక్. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. క్రమంగా విపక్షాలు బలం పుంజుకుంటున్నాయి. అభ్యర్థుల మార్పు కావచ్చు. స్థానిక పరిస్థితులు సహకరించకపోవడం కావచ్చు. ఏది ఏమైనా ఈసారి రాయలసీమలో గతంలో వచ్చిన సీట్లు ఈసారి దక్కుతాయా? అన్న అనుమానాలు వైసీపీ నేతల్లోనే కలుగుతున్నాయి. వైసీపీ నేతల్లో నెలకొన్న విభేదాలతో పాటు క్యాడర్ లో అలుముకున్న అసంతృప్తి కూడా ఒక కారణంగా గుర్తించారని చెబుతున్నారు. వైసీపీకి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న రాయలసీమలోనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.నాలుగు జిల్లాల్లో...రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో గత ఎన్నికల్లో ప్రస్తుత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితమయింది. కడప జిల్లాలో పది పదికి పది స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కర్నూలు జిల్లాలోనూ ఫ్యాన్ పార్టీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మాత్రం కొన్ని స్థానాలను కోల్పోయింది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, హిందూపురంతో పాటు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అంత పెద్ద సంఖ్యలో సీట్లు గెలవడం కారణంగానే వైసీపీకి గత ఎన్నికల్లో 151స్థానాలు దక్కాయి.ఈ రెండు జిల్లాల్లో....అయితే ఈసారి కడప, అనంతపురం జిల్లాల్లో కొంత ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కడప జిల్లాలో రాజంపేట, కమలాపూర్, మైదుకూరు వంటి స్థానాల్లో టీడీపీ ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే అనంతపురం జిల్లాలో మాత్రం టీడీపీకి ఎక్కువ సంఖ్యలో స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి ఐదారు స్థానాలకు మించి వైసీపీకి రావన్న అంచనాలు వినపడుతున్నాయి. చిత్తూరు, కర్నూలు జిల్లాలో కొంత పరవాలేదని అంటున్నారు. అదే జరిగితే సీమలో జగన్ పార్టీ అతి తక్కువ స్థానాలు దక్కే అవకాశముంది. ఈ ప్రభావం అధికారంలోకి రావడంపైన కూడ పడనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మార్పు కనిపిస్తుందా?గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకు వైసీపీకి బలంగా ఉన్నప్పటికీ వర్గ విభేదాలే ఆ పార్టీ కొంప ముంచేట్లు కనిపిస్తున్నాయి. నేతల మధ్య కొరవడిన సహకారంతో పాటు క్యాడర్ లో నెలకొన్న నిరాశ, నిస్పృహలు కూడా సీమలో జగన్ పార్టీ బలహీన పడటానికి కారణంగా చెబుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో నష్ట నివారణ చర్యలు చేపడితే ఏదైనా మార్పు వచ్చే అవకాశముందని కూడా అంటున్నారు. రాప్తాడులో సిద్ధం సభ జరిగింది. ఈ సభ తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదంటున్నారు. రెడ్డి సామాజికవర్గం కూడా ఫ్యాన్ పార్టీ పట్ల గుర్రుగా ఉందంటున్నారు. ఇప్పటి వరకూ అయితే మాత్రం సీమలో కొంత పైచేయి వైసీపీదే అయినా గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు మాత్రం రావదన్న అంచనాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.