link
stringlengths
41
231
text
stringlengths
29
5k
https://www.telugupost.com/movie-news/konidela-niharika-photo-shoots-80025/
మెగా ఫ్యామిలీ హీరోస్ కాదు మెగా డాటర్ కూడా ఇప్పుడు సినిమాల్లో తనని ప్రూవ్ చేసుకోవడానికి తహతహలాడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఒక మనసు సినిమాతో ఆకట్టుకోగా... ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదుగాని మెగా డాటర్ నిహారికకు మంచి పేరొచ్చింది. అలాగే తమిళంలోనూ ఈ మెగా పిల్ల అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక తాజాగా తెలుగులో సుమంత్ అశ్విన్ తో జోడి కట్టి నిహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రెడిషనల్ గా అందమైన డ్రెస్సులతో నిహారిక బాగా ఆకట్టుకుంటుంది. గ్లామర్ గా ఉంటూనే అందాలు ఆరబొయ్యకుండా ఇప్పడి ట్రెండ్ కి సరిపడా నిహారిక చాలా పద్దతిగా బావుంటుంది. ఇక హ్యాపీ వెడ్డింగ్ సినిమాలోనూ నిహారిక ట్రెడిషనల్ గా కనబడుతూనే మోడ్రెన్ అమ్మాయిలాగా అదరగొట్టేసిందని సెన్సార్ టాక్ కూడా ఉంది. మరి మీడియం బడ్జెట్ సినిమా అయిన ఆ సినిమా హిట్ అయ్యింది అంటే నిహారిక హీరోయిన్ గా నిలదొక్కుకున్నట్టే.ఇక హీరోయిన్స్ అవకాశాల కోసం హాట్ హాట్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వారు విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తూ గ్లామర్ షో చేస్తారు. కేవలం సినిమా అవకాశాల కోసమే హీరోయిన్స్ ఈ విధంగా రెచ్చిపోతారు. ఇక ఇప్పుడు మెగా డాటర్ కూడా ఇలా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో మరి హాట్ హాట్ ఫొటోస్ తో కాకుండా చాలా ట్రెడిషనల్ గా పద్దతిగా... క్యూట్ అండ్ షార్ప్ లుక్స్ తో ఉన్న ఫొటోస్ ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ తాను హీరోయిన్ అనే విషయాన్నీ అందరూ మర్చిపోకుండా చేస్తుంది. మరి నిహారిక పద్ధతైన ఫొటోస్ ని అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే... అటు మెగా ఫాన్స్ మాత్రమే కాదు... ఇటు మాములు ప్రేక్షకులు కూడా మెగా డాటర్ తెలివితేటల్ని మెచ్చుకుంటున్నారు. కానీ గ్లామర్ ఫీల్డ్ లో ఎన్నిరోజులు ఇంత ట్రెడిషనల్ గా నెట్టుకు రాగలదో సరిగ్గా తెలియదు. మరి హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ కాదు.... నటన కూడా ముఖ్యమే. చూద్దాం నిహారిక కెరీర్ ఎలా వుండబోతుందో అనేది
https://www.telugupost.com/crime/tipper-lorry-rammed-into-vinayaka-temple-in-kakinada-district-three-dead-1479280
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ వినాయకగుడి లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రావెల్ లోడుతో వచ్చిన టిప్పర్ ఆలయాన్ని ఢీ కొట్టడంతో ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నవరం నుండి ఒంటిమామిడి వైపుగా వెళ్తున్న టిప్పర్ లారీ ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును అతివేగంగా ఢీ కొట్టి.. పక్కనే ఉన్న వినాయకుడి గుడిలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ తో పాటు ఆలయంలో నిద్రిస్తున్న మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. మృతులు శేఖర్, నాగేంద్ర లను ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/taxiwala-event-chief-guest-96552/
గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ఈ అంచనాల్ని మరింత పెంచే విధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేశారు. ఈ నెల 11న జరగబోయే ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తుండంటం విశేషం. టాక్సీవాలా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మంచి ప్రశంసలు అందుకుంది. యు/ఏ సర్టిఫికెట్ తో టాక్సీవాలా నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
https://www.telugupost.com/movie-news/devisri-prasad-music-director-in-tollywood-129589/
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి ప్రస్తుతం సినిమాలు తగ్గాయి. కారణం అతను ఈమధ్య అన్ని సినిమాల్లో అవే ట్యూన్లు మార్చి మార్చి కొడుతున్నాడని కొత్తదనం ఏమి లేదని విమర్శలు వస్తున్నాయి. అందుకే ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయి టాక్ కూడా వచ్చింది. సెలెక్టివ్ సినిమాలే ….. అటు దేవిశ్రీ ప్రసాద్ కూడా సెలెక్టివ్ సినిమాలే చేయాలనీ, చేసే కొద్దీ సినిమాలైనా మంచి ట్యూన్స్ ఇవ్వాలని బాగా గట్టిగా డిసైడ్ అయ్యాడట. ఈమధ్య మహేష్ కి బాగా క్లోజ్ అయిన దేవిశ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’ చేయడానికి ఒప్పుకున్నాడు. మహేష్ కెరీర్ లోనే బెస్ట్ ఆల్బం ఇవ్వాలని కసిగా పని చేస్తున్నాడు దేవి. ఈ సినిమా చేస్తున్నప్పుడు మరేమి సినిమా చేయకూడదని…ఫోకస్ మొత్తం దీనిపైనే పెట్టాలని నిర్ణయించుకున్నాడట. అదరగొట్టారట… రీసెంట్ గా దేవిశ్రీ కొన్ని ట్యూన్స్ కంపోజ్ చేసి టీం కి వినిపించాడట. ట్యూన్స్ విన్న వారు అంత ఇరగదీస్తున్నాడని కితాబులు ఇస్తున్నారు. ఈ చిత్రంలో రెండు మాస్ సాంగ్స్ తో పాటు ఒక ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఇచ్చాడట దేవిశ్రీ. ఇవి పీక్స్‌లో ఉన్నాయని టాక్ వస్తుంది. అలానే మహేష్ బాబు బర్త్‌డేకి విడుదల చేసే ఫస్ట్‌లుక్‌లో దేవి మ్యూజిక్‌ బిట్‌ ఒకటి వినిపిస్తారట. ఈ ట్యూన్ విన్న తరువాత సినిమా పై అంచనాలు పెరిగిపోతాయి అని చెబుతున్నారు. ఇక ఈమూవీ వచ్చే సంక్రాంతి కి రిలీజ్ అవ్వనుంది.
https://www.telugupost.com/movie-news/sai-pallavi-ak-remake-180919/
పవన్ కళ్యాణ్ – రానా కాంబోలో తెరకెక్కుతున్న అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూటింగ్ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన లాడ్జి సెట్ లో జరుగుతుంది. ఇప్పటికే అయ్యప్పన్ గా పవన్ లుక్ రివీల్ అయ్యింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వైఫ్ పాత్రకి సాయి పల్లవిని అనుకుంటున్నారని.. దాదాపుగా ఫిక్స్ అని కూడా అన్నారు. ఆతర్వాత సాయి పల్లవితో పారితోషకం దగ్గర పేచీ వచ్చింది కాబట్టి మహానటి కీర్తి సురేష్ ని ఏకే రీమేక్ దర్శకనిర్మాతలు సంప్రదిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వైఫ్ పాత్రకి సాయి పల్లవినే ఫిక్స్ చేశారట మేకర్స్. పవన్ భార్య గా డీ గ్లామర్ రోల్ లో సాయి పల్లవి ఏకే రీమేక్ లో కనిపించనుందట. మరి ఇలాంటి పాత్రలకి సాయి పల్లవి పెట్టింది పేరు. ఏకే రీమేక్ లో అయ్యప్పన్ భార్య ఓ బిడ్డని ఎత్తుకుని భర్త కోసం పోరాడే సన్నివేశాలు ఉంటాయి. పాత్ర నిడివి చిన్నదే అయినా.. ఆ కేరెక్టర్ పెరఫార్మెన్స్ పరంగా హైలెట్ అనేలా ఉంటుంది. సో ఇప్పుడు పవన్ వైఫ్ గా సాయి పల్లవి ఫిక్స్ అనగానే పవన్ ఫాన్స్ అబ్బా పవర్ స్టార్ తో నేచురల్ బ్యూటీ అంటే ఆ క్రేజే వేరు అంటున్నారు.
https://www.telugupost.com/movie-news/prabhas-shradha-kapoor-saaho-collections-2-132207/
ఏరియా: 6 డేస్ కలెక్షన్స్(కోట్లలో) నైజాం 25.60 సీడెడ్ 10.55 అర్బన్ ఏరియాస్ 08 .69 గుంటూరు 07.39 ఈస్ట్ గోదావరి 06.75 వెస్ట్ గోదావరి 05.14 కృష్ణా 04.69 నెల్లూరు 03 .82 ఏపీ అండ్ టీఎస్ షేర్ 72.63
https://www.telugupost.com/movie-news/priyanka-chopra-and-her-boy-friend-77888/
గత శుక్రవారం ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్ నిక్ జొనాసే తో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కనబడేసరికి అందరూ ఈ లవ్ బర్డ్స్ ఏ దుబాయో.. లేదంటే మళ్ళీఅమెరికానో చెక్కేశారనుకున్నారు. అంబానీ ఇంట ఎంగేజ్మెంట్ పార్టీకి హాజరైన ప్రియాంక, నిక్ జొనాసే లు ఆ తెల్లారే ముంబై ఎయిర్ పోర్ట్ లో జంట పక్షుల్లా చేతిలో చెయ్యేసుకుని మరి కనిపించేసరికి అందరూ వీరు దుబాయ్ పెళ్లి షాపింగ్ కోసం ఫ్లైట్ ఎక్కుతున్నారని.. కాదు కాదు.. మళ్ళీ అమెరికాకే చెక్కేస్తున్నారని ప్రచారం వీర లెవల్లో జరిగింది. మరి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్ కూడా ఉండగా.. వీరు ఆ ట్రిప్ వేశారు.అయితే ప్రియాంక అండ్ నిక్ జొనాసే లు వెళ్ళింది దుబాక్ కి కానీ అమెరికాకి కానీ కాదు. వారు వెళ్ళింది బ్రెజిల్ కి. బ్రెజిల్ లో ఈ జంట ఎంజాయ్ చేస్తుంది. అది కూడా నిక్ జొనాసే మ్యూజిక్ కన్సర్ట్ లో. నిక్ జొనాసే మ్యూజిక్ కన్సర్ట్ ని ప్రియాంక ఎంతో మైమరచి పోయి చూస్తుంది. ప్రియాంక తన ప్రియుడు నిక్ జొనాసే మ్యూజిక్ కన్సర్ట్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు.. తాము బ్రెజిల్ లో ఉన్నామని ఫోటో తీసి ఇన్‌స్టా‌గ్రా‌మ్‌లో ఫోటోను కూడా పోస్ట్ చేసింది. మరి ఆ ఫొటోస్ తో పాటుగా ప్రియాంక మూడే మూడు అక్షరాలతో him అంటూ తన ప్రేమ (?) ను చాటుకుంది. ఇక ప్రియాంక మాత్రమే ఆ ఫొటోస్ ని షేర్ చెయ్యలేదు. ఆమె బాయ్‌ఫ్రెండ్ నిక్ జొనాసే కూడా తామున్న కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి తామెక్కడున్నది చెప్పేసారు.
https://www.telugupost.com/movie-news/pspk27-release-date-184017/
పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న విడుదల కాబోతుంది. దిల్ రాజు బ్యానేర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ రిలీజ్ కి సిద్ధమవుతుంటే.. ఆయన నటిస్తున్న మరో మూవీ అయ్యప్పన్ కోషియమ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో PSPK 27 షూటింగ్ లో బిజీగా వున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గజ దొంగగా నటిస్తున్న PSPK 27 టైటిల్ గా హరిహర వీరమల్లు ప్రచారం లో ఉండగా.. మహాశివరాత్రి రోజున పవన్ PSPK 27 టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చెయ్యబోతున్నారు. రీసెంట్ గా PSPK 27 మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది టీం. పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబో PSPK 27 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. దానితో పవన్ కళ్యాణ్ కి మహేష్ కి వార్ షురూ అయ్యింది. మహేష్ బాబు సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతికి కి విడుదల చేస్తామంటూ పరశురామ్ డేట్ లాక్ చేసి ముందుగానే గ్రాండ్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 2021 సంక్రాంతికి వార్ షురూ అయ్యింది.
https://www.telugupost.com/movie-news/అఖిల్-తో-పూజ-ఎలా-ఉంది-141456/
ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్ తో ఓ ఆటాడుకుంటున్న పూజ హెగ్డే కి చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు. తనకి ఎక్కడ బాగా గిట్టుబాటు అవుతుందో అక్కడ అవకాశం పట్టేస్తుంది. తాజాగా మహేష్, ఎన్టీఆర్ లతో చుట్టేసిన పూజ హెగ్డే ఇప్పుడు అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పెయ్యబోతుంది. ప్రభాస్ జాన్ తో మల్లి సెట్స్ మీదకేల్లబోతున్న పూజ, వరుణ్ తో వాల్మీకి అంటూ అదరగొట్టేసింది. పూజ హెగ్డే ఇప్పుడు అఖిల్ తో ప్రయాణం మొదలెట్టీసింది. బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ చేస్తున్న నాలుగో సినిమాలో పూజ హీరోయిన్. అయితే షూటింగ్ మొదలైనప్పుడు పూజ హెగ్డే సెట్స్ లో అడుగుపెట్టే వీడియో ఒకటి తెగ వైరల్ అయ్యింది. అప్పటినుండి ఇప్పటివరకుల్ #అఖిల్4 విషయాలేమి బయటికి రాలేదు. కానీ తాజాగా అఖిల్ తో పూజ హెగ్డే పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పూజ హెగ్డే సారీ లో జడవేసుకుని ట్రెడిషనల్ గా ఉండగా అఖిల్ మాత్రం డిజైనర్ డ్రెస్ తో క్లాసీగా కనిపిస్తున్నాడు. ఇక పూజ హెగ్డే తన ఫోన్ లో అఖిల్ తో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూజ హెగ్డే ట్రెడిషనల్ గా, అఖిల్ కూడా ట్రెడిషనల్ వెర్ లో కనిపిస్తున్నారు అంటే.. వీళ్ళ కేరెక్టర్స్ సినిమాలో ఎలా ఉండబోతున్నాయి అనే క్యూరియాసిటీ అక్కినేని ఫాన్స్ లో మొదలైంది. అలాగే వీరిద్దరూ సాంప్రదాయంగా ఉన్నారు అంటే… సినిమా లో ఏ పెళ్లి సీనో షూట్ చేస్తున్నారేమో అంటున్నారు. మరి బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చే సినిమాలు కావడంతో అఖిల్ – పూజ లు కూడా ట్రెడిషన్ గా క్లాసీ లుక్ లోనే సినిమా ఉండబోతున్నారనే డౌట్ కొడుతోంది
https://www.telugupost.com/movie-news/koratala-siva-chiranjeevi-71800/
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనంతట తానుగా ఎవరినీ సంప్రదించడు. ఏ డైరెక్టరైనా తన దగ్గరకు వస్తే తప్ప. కానీ త్రివిక్రమ్ విషయంలో మాత్రం ఆలా కాదు. త్రివిక్రమ్ నే పిలిచి తనతో సినిమా చేయమని పవన్ అడిగిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టడంతో అతను ఓ స్టార్ డైరెక్టర్ సినిమా మిస్ అయ్యాడని సమాచారం. వరుసగా నాలుగు పెద్ద హిట్స్ ఇచ్చిన కొరటాల తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేయబోతున్నాడు.పవన్ పోయి చిరు వచ్చే...అయితే అధికారిక ప్రకటన చేయకపోయినా ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ ఫర్మ్ అని ఫిలింనగర్ టాక్. యంగ్ హీరోలని వదిలేసి సీనియర్ హీరో చిరంజీవి దగ్గరకి కొరటాల వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది. కానీ నిజానికి కొరటాలకు.. పవన్ తో సినిమా చేయాలనే ఆలోచన ఉందట. అయితే పవన్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోవడంతో చిరంజీవికి అనుగుణంగా ఆ స్క్రిప్ట్ ని మారుస్తున్నాడట.వారు నోరువిప్పితేనే...చిరంజీవికి కూడా పవన్, మహేష్ లా మంచి మార్కెటే ఉంది. చిరుతో అయితే కచ్చితంగా బిజినెస్ అవుతుందని భావించి వేరే యువ హీరోలని కాకుండా చిరంజీవితో సినిమా కమిట్‌ అయ్యాడని తెలిసింది. అయితే ఈ చిత్రంపై క్లారిటీ రావాలంటే ఎవరోఒకరు నోరు విప్పాల్సిందే.
https://www.telugupost.com/movie-news/gudhachari-2-script-102013/
ఈ ఏడాది విడుద‌లైన సినిమాల్లో అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచిన చిత్రం గూఢ‌చారి. అడ‌వి శేష్ హీరోగా న‌టించిన ఈ స్పై థ్రిల్ల‌ర్ సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు సిద్ధ‌మ‌వుతుంది. అడ‌వి శేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సీక్వెల్ గురించి అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసారు యూనిట్. ఇప్ప‌టికే ఈ చిత్ర స్క్రిప్ట్ వ‌ర్క్ మొద‌లైంది. 2019 మ‌ధ్య‌లో గూఢ‌చారి 2 షూటింగ్ మొద‌లు కానుంది. గూఢ‌చారి రెండో భాగం భారీ బ‌డ్జెట్.. అద్భుత‌మైన లొకేష‌న్స్.. పెద్ద స్కేల్లో రాబోతుంది. తొలిభాగం కంటే మంచి ఔట్ పుట్ తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. గూఢ‌చారి సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ లో అసిస్టెంట్ గా ఉన్న రాహుల్ పాకాల గూఢచారి 2కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 2020లో ఈ సీక్వెల్ విడుద‌ల కానుంది. సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే చిత్ర‌ యూనిట్ తెలియ‌జేయ‌నుంది.
https://www.telugupost.com/movie-news/ntr-ram-charan-rajamouli-rrr-movie-title-150703/
ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్‌పై చాలా ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్ ని ఉగాది సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలు దీనిని ప్రకటించవచ్చు. మార్చ్ లో ఆర్‌ఆర్‌ఆర్ అప్ డేట్ ఉంటుంది అని ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాతలు చెప్పారు. అది రామ్ చరణ్ బర్త్ డే అయినా కావచ్చు. లేదంటే ఉగాది అయినా కావొచ్చు. అయితే ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్ విషయంలో రాజమౌళి మరియు చిత్ర బృందం రఘుపతి రాఘవ రాజారామ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అది సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగినా ఆ టైటిల్ పాన్ ఇండియా లెవెల్ టైటిల్ కాదని జక్కన్న వెనక్కి తగ్గుతున్నాడట. అంత సాఫ్ట్ టైటిల్ పెడితే ఎక్కదని ఆలోచిస్తున్నారనే విషయం ఇంతకూ ముందే మాట్లాడుకున్నాం. అయితే తాజాగా మరో ట్రేండింగ్ టైటిల్ మీద రాజమౌళి బృందం ఫోకస్ చేసిందనే న్యూస్ ప్రచారంలోకొచ్చింది. అయితే ఆ టైటిల్ ఇప్పటికే మరొకరిచే రిజిస్టర్ కాబడింది. కాబట్టి ఆర్‌ఆర్‌ఆర్ అయితే రాజమౌళి మరియు నిర్మాతలు ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయించిన వారిని సంప్రదించినప్పుడు.. వారు రాజమౌళి, డివివి దానయ్యలకు టైటిల్ హక్కులు ఇవ్వడానికి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారని చెబుతున్నారు. ఆ టైటిల్ మరేదో కాదు.. రానా కోసం తేజ రిజిస్టర్ చేయించిన రామరావణ రాజ్యం. ఈ టైటిల్ ఇంతకుముందే మరో చిన్న నిర్మాత రిజిస్టర్ చేయించగా.. దానిని తేజ దక్కించుకున్నాడట. తాజాగా ఆ టైటిల్ ఆర్‌ఆర్‌ఆర్ కి పర్ఫెక్ట్ అనుకుంటున్నారట రాజమౌళి బృందం. ఇపప్టికే ఈ టైటిల్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉండడంతో.. పాన్ ఇండియా టైటిల్ గా రామ రావణ రాజ్యానికి జక్కన్న బృందం మొగ్గు చూపుతున్నప్పటికీ… హిందీ లో ఈ టైటిల్ ఎలా ఉంటుందో అనే ఆలోచనలో ఉన్నారట. అసలు ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్ విషయంలో జక్కన్న మధనపడుతున్నడని… సరిగ్గా ఏది పెట్టాలో తేల్చుకోలేకపోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుండగా.. జక్కన్న ఫ్యాన్స్ మాత్రం ఆర్‌ఆర్‌ఆర్ ఎప్పుడో రాజమౌళి మదిలో ఉంది.. కాబట్టే సినిమాని ఇద్దరు స్టార్స్ తో ఓపెన్ చేసాడంటున్నారు.
https://www.telugupost.com/movie-news/ఎంసీఏ-మూడో-రోజు-కూడా-తగ్గ-53814/
రెండు తెలుగు రాష్ట్రాల్లో నాని ఎంసీఏ హవా మాములుగా లేదు. సినిమా రోటీన్ గా ఉన్నప్పటికీ నాని నేచురల్ యాక్టింగ్, సాయిపల్లవి ఎప్పీయరెన్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్ గా మారాయి. అందుకే మొదటి రోజు 7 కోట్ల 57 లక్షల రూపాయల షేర్ రాబట్టిన ఈ సినిమా.. ఈ 3 రోజుల్లో తన కౌంట్ ను అటుఇటుగా 14 కోట్ల రూపాయలకు పెంచుకుంది. నాని కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఎంసీఏ సినిమా అటు ఓవర్సీస్ లో కూడా 5 లక్షల డాలర్లు (హాఫ్-మిలియన్) క్లబ్ లోకి చేరింది.మరి సినిమా యావరేజ్ టాక్ తోనే ఇంత వసూళ్ల పంట పండుతుంటే.. ఇక హిట్ టాక్ వస్తే మాత్రం ఎంసీఏ కి లాభాల పంట పండేవంటున్నాయి ట్రేడ్ వర్గాలు.ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 రోజుల్లో ఎంసీఏ వసూళ్లు చూద్దాంనైజాం – 5.95సీడెడ్ – 2 .0ఉత్తరాంధ్ర – 1.79గుంటూరు- 1.03తూర్పు గోదావరి- 1.04పశ్చిమ గోదావరి – 0.82కృష్ణా – 0.86నెల్లూరు – 0.42 కోట్లు3 రోజుల మొత్తం షేర్ – 13.91 కోట్లు
https://www.telugupost.com/movie-news/డైరెక్టర్-కి-మంచి-గిఫ్టే-23206/
సింగం సీరీస్ తో సూర్య తిరుగులేని హిట్స్ కొట్టుకుంటూ పోతున్నాడు. తాజాగా సింగం సిరీస్ లో విడుదలైన 'సింగం 3 ' చిత్రం తో సూర్య మళ్ళీ హిట్ కొట్టాడు. ఇక పవర్ ఫుల్ చిత్రాలను డైరెక్టర్ హరి ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకుని డైరెక్ట్ చేస్తున్నాడు సింగం సీరీస్ ని. సూర్య డిఫ్రెంట్ డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా అవి సూర్య ఆశించిన రీతిలో ప్రేక్షకులని మెప్పించలేక చతికిలపడుతున్నాయి. అయితే సింగం సీరీస్ లో సూర్య పోలీస్ పాత్రకి మాత్రం ప్రేక్షకులు జై జై లు పలుకుతున్నారు. ఈ ఎస్ 3 చిత్రం గత మూడు నెలలుగా మూడుసార్లు వాయిదాలు పడి ఎట్టకేలకు ఫిబ్రవరి 9 న ఒకేసారి తెలుగు, తమిళ్ లో విడుదలైంది. ఇక విడుదలైన రోజునుండి పాసిటివ్ టాక్ తో రన్ అవుతూ... బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా మంచి యాక్షన్ చిత్రంగా దూసుకుపోతుంది. ఇంతటి మంచి చిత్రాన్ని తనకి గిఫ్ట్ గా ఇచ్చిన డైరెక్టర్ హరికి సూర్య కూడా టొయోటా ఫార్చూనర్ కారును గిఫ్ట్ గా ఇచ్చి కృతజ్ఞతను చాటుకున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో ఇలా బహుమతుల ఆచారం ఈ మధ్యన ఎక్కువగా కనబడుతుంది. ఇక సూర్య కూడా తాజాగా ఇచ్చిన టొయోటా ఫార్చూనర్ కారు గిఫ్ట్ తో అక్కడ కూడా ఈ సంప్రదాయం బాగా ఎక్కువయ్యేలా కనబడుతుంది.
https://www.telugupost.com/movie-news/rrr-movie-legendary-director-james-cameron-liked-rajamouli-very-much-1457685
RRR మూవీకి అంతర్జాతీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అమెరికాలో పర్యటిస్తున్న రాజమౌళి, కీరవాణిలను హాలీవుడ్ ప్రముఖులు అభినందిస్తున్నారు. RRR మూవీ ఆస్కార్ బరిలోనూ పోటీ పడుతుంది. అయితే ఈ చిత్రాన్ని జేమ్స్ కామేరూన్ చూశారని చిత్ర దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.రాజమౌళి ట్వీట్....RRR మూవీ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామేరూన్ కు ఎంతో నచ్చిందన్నారు రాజమౌళి. ఆయన తన భార్యతో కలసి రెండోసారి ఈ చిత్రాన్ని చూశారని రాజమౌళి ట్వీట్ చేశారు. పది నిమిషాల పాటు తన చిత్రాన్ని విశ్లేషించడం నమ్మలేకపోతున్నామని RRR మూవీ దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు.
https://www.telugupost.com/top-stories/janasena-chief-pawan-kalyan-has-a-strong-desire-to-become-the-chief-minister-he-says-he-has-a-strategy-for-that-1453232
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రిని కావాలని బలంగా కోరిక ఉంది. అయితే ఎలా? జనసేనకు ఎన్ని స్థానాలు వస్తే ఆయన సీఎం అవుతారు? కనీసం యాభై స్థానాల్లో గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ మిత్రపక్షం ముందు ప్రతిపాదన పెట్టొచ్చు. కానీ ఆ స్థాయిలో గెలవాలంటే పవన్ కల్యాణ్ ఏం చేయాలి? ఇప్పటిలా వీకెండ్ కు వచ్చి నాలుగు డైలాగులు కొట్టిపోతే జనం నమ్ముతారా? నేతలకే నమ్మకం కలిగించలేదని పవన్ ప్రజలను ఎలా నమ్మించగలుగుతారు? ఈ ప్రశ్నలన్నీ జనసేన నాయకుల నుంచి వస్తున్నవే.అర్థం కావడం లేదే....పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేయాలని కోరుతున్నారు. పైగా పవన్ చేస్తున్న కామెంట్స్ కార్యకర్తలకు కూడా అర్థం కాకుండా ఉన్నాయి. వ్యూహం తనకు వదిలేయాలని, పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. వినటానికి బాగానే ఉంది కానీ, కార్యాచరణలో సాధ్యమైనా? ఒకవైపు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా చూస్తానంటున్నారు. తనను సీఎం చేయడానికి జనం బలంగా కోరుకోవాలని అంటున్నారు. ఈ రెండింటికి ఎలా కుదురుతుంది? అన్న ప్రశ్నకు జనసైనికుల వద్ద సమాధానం దొరకడం లేదు. టీడీపీతో కలసి...వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనీయ్యను.. అంటే తెలుగుదేశం పార్టీతో కలసి పనిచేస్తానని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. మరి టీడీపీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే ఈయన ఎలా సీఎం అవుతారు? ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కాకుండా జనసేనకు సీఎం పదవి ఎందుకు ఇస్తుంది? టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తే అత్యధికస్థానాల్లో టీడీపీయే పోటీ చేస్తుంది. ఇప్పుడున్న బలాల ప్రకారం టీడీపీయే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. తక్కువ స్థానాలు గెలిచిన పవన్ ను పిలిచి మరీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేంత దయార్ద్ర హృదయం ఎవరిక ఉంటుంది? అందునా చంద్రబాబు లాంటి నేతలు పవన్ కు ఉదారంగా సీఎం సీటు ఇచ్చేసి తాను తప్పుకుంటారా? అంటే అంతకంటే వెర్రితనం మరొకటి ఉంటుందా? అన్న ప్రశ్న తలెత్తుంది.ఒప్పందం చేసుకుంటారా?విడిగా పోటీ చేసి ఎవరికీ తగినంత మెజారిటీ రాకపోతే.. జనసేన కొన్ని స్థానాలు గెలిచి దాని మద్దతు అవసరమైతేనే అది సాధ్యమవుతుంది. కానీ ఏపీలో ఆ సీన్ ప్రస్తుతానికయితే లేదు. కర్ణాటకలో జేడీఎస్ మాదిరి అధికారంలోకి రావాలంటే తనంతట తానుగా విడిగా పోటీ చేయాలి. అంతేకాని పొత్తులు ముందే పెట్టుకుని పోటీ చేస్తే సీఎం పదవి పిలిచి ఇచ్చేంత సహృదయం రాజకీయాల్లో అసలు ఉండదు. మరి ముందుగానే పవన్ కల్యాణ్ టీడీపీతో ముఖ్యమంత్రి తనకే ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకుంటారా? లేక ఎక్కువ స్థానాల్లో గెలిచిన అనంతరం తనకు సీఎం పదవి ఇవ్వాలని పట్టుబడతారా? అన్నది తెలియాల్సి ఉంది. బహుశ అదే ఆయన వ్యూహమేమో? చూడాలి.
https://www.telugupost.com/crime/cbi-filed-case-against-guntur-chair-person-husband-kattera-suresh-1369286
గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ క్రిస్టినా భర్త కత్తెర సురేష్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సురేష్ హార్వెస్ట్ ఇండియా సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నారు. FCRA నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా నిధులు పొందినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.చిన్న పిల్లల దత్తత, పిల్లల్ని విదేశాలకు తరలించడం పై కూడా సురేష్ పై అభియోగాలు నమోదయ్యాయి. కత్తెర సురేష్ కార్యకలాపాలపై విచారణ చేసి, అతనిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు బాలల హక్కుల జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
https://www.telugupost.com/movie-news/విడుదల-టైం-దగ్గరపడుతోంది-124003/
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా నుండి ఒక పోస్టర్ విడుదలైన, లేదంటే ఏదో ఓ లుక్ విడుదలైనా.. పేక్షకులకు పండగలా ఉండేది. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మిగతా ప్రేక్షకులు కూడా బాహుబలి సినిమా చూసేందుకు ప్రత్యేకమైన ఆసక్తి కనబర్చారు. భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి విడుదలకు ముందే ప్రేక్షకుల్లో పిచ్చ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో సినిమా అక్కడే సగం సక్సెస్ అయ్యింది. రాజమౌళి కూడా తన సినిమా మీద అంతే క్రేజ్ వచ్చేలా ప్లాన్ చెయ్యడంతో జనాల్లోకి బాహుబలి అలా దూసుకెళ్లింది. ఇక సినిమా విడుదల దగ్గరపడే కొద్దీ.. బాహుబలి క్రేజ్ ఆకాశాన్నంటింది. అయితే తాజాగా రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయంటే… ప్రేక్షకుల్లో ఎందుకో పెద్దగా ఆసక్తి క్రియేట్ అయినట్లుగా అనిపించడం లేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమా అక్టోబర్ 2 న విడుదల అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ క్లారిటీ లేదు. ఇక సినిమా మీద క్రేజ్ ఉంది కానీ.. ఓ అన్నంతగా కనిపించడం లేదు. కారణం తెలియడం లేదు. కానీ ఎక్కడో ఏదో కొడుతోంది. బాహుబలి మాదిరి మాత్రం సై రా మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కనిపించడం లేదు. మరి ప్రేక్షకులకు కావాల్సిన ప్రమోషన్స్ సై రా నుండి రావడం లేదు. ఇక ప్రభాస్ సాహో కూడా సుదీర్ఘంగా ఇండియా వైడ్ గా తెరకెక్కుతుంది. ఆ సినిమా కూడా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, ఇక ఈ రోజు విడుదల కాబోయే టీజర్ లాంటి సమయాల్లోనే ఆ సినిమా ముచ్చట్లు ప్రేక్షకుల దగ్గర వినబడుతుంది. కానీ తర్వాత అంతా కామ్. మరి ఈ రెండు పెద్ద ప్రాజెక్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. సినిమాలు విడుదలకు దగ్గరపడుతుంటే.. ఆ సినిమాల మీద క్రేజ్ కావలిసినంత మాత్రం రావడం లేదనేది పక్కా..!
https://www.telugupost.com/movie-news/ఎవ్వరిని-వదలమంటున్నారు-35997/
'జనతా గ్యారేజ్' హిట్ తర్వాత ఎన్టీఆర్, బాబీ డైరెక్షన్ లో 'జై లవ కుశ' చిత్రాన్ని చేస్తున్నాడు. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'జై లవ కుశ' చిత్రం సెప్టెంబర్ 21 న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దసరా సేవలను క్యాష్ చేసుకోవాలని ఎన్టీఆర్ బ్యాచ్ ఇలా ప్లాన్ చేసింది. అందుకే దసరా బరిలో 'జై లవ కుశ' ని దింపుతోంది.మరి ఫుల్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటనున్న 'జై లవ కుశ' కి సంబందించిన టీజర్ లోని కొన్ని సీన్స్ ని కొంతమంది ఇంటర్నెట్ లో లీక్ చేశారు. ఇక ఆ సీన్స్ ని లీక్ చేసిన కొద్దినిమిషాల్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా సర్కిలేట్ అయ్యాయి. మరి ఈ విజువల్స్ లో ఎన్టీఆర్ 'జై లవ కుశ'లో ఒక పాత్రకు సంబంధించినవిగా ఉన్నాయని అంటున్నారు. ఇక విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్, ఎన్టీఆర్ అభిమానులు కంగారు పడి... వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారట. ఇక చిత్ర యూనిట్ పోలీస్ ల దగ్గరికి వెళ్లడమే కాక సోషల్ మీడియాలో లీకైన విజువల్స్ ను ఒకరికొకరు షేర్ చెయ్యొద్దని వేడుకున్నారట. అయితే ఫిర్యాదును అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 'జై లవ కుశ' సీన్స్ ని లీక్ చేసిన వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేశారట. ఈ విషయాన్ని 'జై లవ కుశ' చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ అధికారికంగా ప్రకటించాడు. అలాగే లీక్ చేసిన వ్యక్తుల వివారాలు కూడా త్వరలోనే బయటపెడతామని చెప్పాడు. ఇక విషయం విన్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు.
https://www.telugupost.com/movie-news/అనసూయ-భర్త-ఇండస్ట్రీలోకి-53932/
యాంకర్ గా అడుగుపెట్టిన అనసూయ జబర్దస్త్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు టీవి షోస్ తో పాటు.. ఆడియో వేడుకలకి హోస్ట్ గా... అలాగే ఇటు సిల్వర్ స్క్రీన్ పై కూడా తన తన సత్తా చాటుతుంది అనసూయ. అప్పుడెప్పుడో సోగ్గాడే చిన్ని నాయన, క్షణం వంటి సినిమా లలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది ఈ హాట్ యాంకర్. ఇప్పుడు కూడా రామ్ చరణ్ రంగస్థలంలో కీ రోల్ ప్లే చెయ్యడమే కాదు.. అనసూయ మెయిన్ లీడ్ లో సచ్చింది రా గొర్రె సినిమాలో నటిస్తుంది.ఇంత బిజీగా ఉంటున్న అనసూయ కి ఒక ఫ్యామిలీ ఉంది. ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా. అయితే అనసూయ పిల్లలను ఆమె భర్త ఎంతో కేరింగ్ గా చూసుకుంటూ అనసూయకి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తూ ఆమె కెరీర్ కి ఉపయోగపడుతున్నాడు. అయితే ఇప్పుడు అనసూయ భర్త కూడా సినిమా ఇండస్ట్రీ లోకి నటుడిగా రావాలి అని ఫిక్స్ అయ్యాడు అని తెలుస్తుంది. సుశాంక్ భరద్వాజ్ కి అనసూయ వల్ల యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ కలిగిందట. సో ఇప్పుడు అనసూయ కి ఉన్న కాంటాక్ట్స్ ని ఉపయోగించి ఏదైనా ఒక మూవీ లేక టీవి షో ద్వారా తన ఎంట్రీ ఇవ్వాలి అని కోరుకుంటున్నాడట.కానీ అనసూయ సన్నిహితులు మాత్రం సుశాంక్ కి నటన అంటే ఇష్టం లేదు.... బ్యాంక్ జాబ్ చేస్తూ హాయిగా ఉన్నాడు. తనకి మూవీ ఫీల్డ్ పై అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నారు. అయితే అనసూయ మాత్రం ఇప్పటికే తన భర్త గురించి పలువురి డైరెక్టర్స్ దగ్గర మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తానికి భర్తని ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి అనసూయ బాగానే కష్టపడుతుంది.
https://www.telugupost.com/movie-news/అబ్బో-సస్పెన్స్-కి-తెరతీ-23106/
ఆ మధ్యన అఖిల్ 'వీడెవడు' అంటూ ఒక వెనక్కితిరిగి ఉన్నపోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.... ఒక బాలీవుడ్ స్టార్, అందులోను ఒక క్రీడాకారుడు అంటూ ట్వీట్ చేసి అందరిని సస్పెన్స్ లో పడేసాడు. గత కొద్దీ రోజులుగా ఆ పోస్టర్ గురించి రకరకాల ఊహగానాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అసలు ఆ పోస్టర్ లో వున్న హీరో ఎవరూ అంటూ చర్చ మొదలెట్టారు. అసలు 'వీడెవడు' అంటూ అందరిని ఆలోచనలో పడేసిన అఖిల్... 'వీడెవడో..' అనేది చిత్ర యూనిట్ రివీల్ చేసేసింది. ఆ 'వీడెవడు' చిత్ర పోస్టర్లో వున్నది వాడెవడో కాదు సచిన్ జోషి. వేలంటైన్స్ డే సందర్భం గా ఈ చిత్ర యూనిట్ విడుదల చేసిన 'వీడెవడు' లుక్ లో ఉన్నది సచిన్ జోషి అని అందరికి తెలిసేలా చేసారు. ఇక సచిన్ జోషి గురించి అఖిల్ అంతలా ప్రచారం చెయ్యడానికి వీరిద్దరికి టాలీవుడ్ క్రికెట్ ఆడే టైములో ఉన్న పరిచయమేనట. అందుకే అఖిల్ ఆ పోస్టర్ గురించి అంతలా జనాల్లో క్యూరియాసిటీ పెంచేసాడు. అయితే సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే. ఇంతకుముందే తెలుగులో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న సచిన్ ఇప్పుడు మళ్ళీ 'వీడెవడు' అంటూ వస్తున్నాడు. మరి ఫస్ట్ లుక్ పోస్టర్ తో అఖిల్ వంటి యాంగ్ స్టార్ తో పబ్లిసిటీ అయితే జరిగింది గాని వీడెవడు చిత్రం కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా? లేదా? లేకుంటే అతని గత సినిమాల వలే మళ్ళీ జరుగుతుందా? అనేది 'వీడెవడు' చిత్రం విడుదల వరకు వేచిచూడాల్సిందే.
https://www.telugupost.com/movie-news/natti-kumar-said-chiranjeevi-felicitated-by-padma-vibhushan-is-because-of-pawan-kalyan-1517307
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై మెగా కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే, చిరంజీవికి ఈ అవార్డు రావడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంతోనే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కూడా సంచలన కామెంట్స్ చేశారు.నట్టి కుమార్ కామెంట్స్.. "అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం అనేది తెలుగు ప్రజలకు గర్వకారణమైన విషయమే. సినిమా పరిశ్రమకి అందించిన సేవలతో పాటు బ్లడ్ బ్యాంక్ మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించే చిరంజీవి.. ఈ పద్మవిభూషణ్ కి అర్హులే. కానీ ఇప్పుడు రావడం అనేది మాత్రం కచ్చితంగా మోదీ, అమిత్ షాల రాజకీయ వ్యూహం. పవన్ కళ్యాణ్ వల్లే చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చారు. దీని వల్ల బీజేపికీ పవన్ నుంచి సపోర్ట్ దొరుకుతుందని మోదీ టీం ప్లాన్. రాజమౌళి తండ్రికి రాజ్యసభ టికెట్ ఇవ్వడం వెనుక కూడా ఇదే కారణం ఉంటుంది.నిజానికి ఈ సమయంలో చిరంజీవి కంటే సోనూ సూద్ కి ఇచ్చి ఉంటే బాగుండేది. కరోనా టైములో ఆయన ఎంతటి సేవలు చేశారో అందరికి తెలుసు. బహుశా బీజీపీ వాళ్ళకి సోనూ సూద్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. భవిషత్తులో అయినా ఆయనని గుర్తించి ఆయనకి అవార్డు ఇస్తారని ఆశిద్దాం" అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
https://www.telugupost.com/telangana/shocking-information-revealed-in-hyderabad-double-murder-case-1368381
హైదరాబాద్ నగర శివారులో జరిగిన జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 30 కిలోమీటర్ల దూరం వెంబడించి మరీ భార్య, ఆమె ప్రియుడు ఏకాంతంగా ఉన్న సమయంలో హత్య చేసినట్లు చెప్పినదంతా అబద్ధమని తేలింది. భర్త, భార్య, ఆమె ప్రియుడు ముగ్గురూ కలిసే నగర శివారుకి వెళ్లినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఊరొదిలి వెళ్లిపోతుండడంతో చివరిసారి ప్రియుడిని కలిసేందుకు ఒప్పుకున్నట్టే నటించి.. వారిద్దరూ ఏకంతంగా ఉన్న సమయంలో భర్త ఒక్కసారిగా దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తేల్చారు. మీడియా సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. విజయవాడలోని పాయకాపురం సుందరయ్య కాలనీకి చెందిన శ్రీనివాసరావుకి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఐదుగురు పిల్లల్లో ఇద్దరికి వివాహం కాగా మరో ముగ్గురు విజయవాడలోనే నానమ్మ వద్ద ఉంటున్నారు. గతేడాది శ్రీనివాసరావు తన భార్యతో కలిసి హైదరాబాద్‌కి వలసొచ్చాడు. తొలుత పార్శీగుట్టలో ఉన్న శ్రీనివాసరావు దంపతులు ఆరు నెలల కిందట వారాసిగూడకి మకాం మార్చారు. పార్శీగుట్టలో ఉంటున్న సమయంలోనే భార్యకి బౌద్ధనగర్‌కి చెందిన క్యాబ్ డ్రైవర్ యశ్వంత్ అలియాస్ బన్నీతో పరిచయమైంది. ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త లేని సమయంలో ఇంట్లోనే ఇద్దరూ రాసలీలలు సాగించారు. ఆ విషయం శ్రీనివాసరావుకి తెలియడంతో భార్యను తీవ్రంగా మందలించాడు. అయినా ఆమె తన ప్రవర్తన మార్చుకోకుండా ప్రియుడితో శారీరక సంబంధం కొనసాగించింది. దీంతో విజయవాడ వెళ్లిపోతే వారిద్దరూ కలిసే అవకాశం ఉండదని భావించిన శ్రీనివాసరావు వారం రోజుల కిందటే సామాన్లు పంపించేశాడు.భార్యాభర్తలిద్దరూ బైక్‌పై విజయవాడ వెళ్లాలని భావించారు. అయితే చివరిసారిగా తన ప్రియుడు బన్నీని కలుస్తానని భార్య చెప్పడంతో రగిలిపోయాడు. ఒప్పుకున్నట్టే నటించి అతన్ని ఇంటికి రప్పించాడు. నగర శివారులో ప్రియుడితో కలవమని.. అటు నుంచి అటే విజయవాడ వెళ్లిపోదామని నమ్మించాడు. భార్యను బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. అది నమ్మేసిన బన్నీ వారిని అనుసరించాడు. దారిలో మద్యం, బిర్యానీ ప్యాకెట్లు తీసుకున్నారు. కొత్తగూడ బ్రిడ్జి వద్దకు వెళ్లిన తర్వాత బైక్‌లు రోడ్డు పక్కన ఆపి చెట్ల పొదల్లోకి వెళ్లారు. భార్య తన ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు వెళ్లగా శ్రీనివాసరావు మద్యం తాగుతూ కూర్చున్నాడు. అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న శ్రీనివాసరావు ఇద్దరూ నగ్నంగా ఉండగా ఒక్కసారిగా దాడి చేసి చంపేశాడు. తలపై బండరాయితో మోది కిరాతకంగా హతమార్చాడు. స్క్రూ డ్రైవర్‌తో పొడిచి పొడిచి కసి తీర్చుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా విజయవాడ పరారయ్యాడు. రెండు రోజుల తర్వాత నగ్నంగా పడి ఉన్న మృతదేహాల వ్యవహారం వెలుగుచూసింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://www.telugupost.com/top-stories/a-blunt-mentality-is-damaging-in-politics-today-ys-jagan-is-acting-in-the-same-way-as-ntr-1469390
తెలుగు సినిమా అభిమానులకు ఎన్టీవోడుగా ఆత్మీయుడైన ఎన్టీయార్ 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు. పార్టీ స్థాపించి నేటికి సరిగ్గా నలభై ఏళ్ళు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీయార్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలలకే దేశంలో కాంగ్రెస్ పార్టీకి నేషనల్ ఫ్రంట్ పేరుతో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. సినిమాల్లో తను నటించిన వివిధ పాత్రల నేపధ్యం వల్లనో మరో కారణమో కానీ ఎన్టీయార్ కు పేదప్రజలంటే అభిమానం కాస్త ఎక్కువే. అందుకే ఆయన పాలనలో ప్రజలకు, ప్రత్యేకించి పేద ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, పనులు అనేకం జరిగాయి.గట్టి దెబ్బలే...ప్రజలు ఎన్టీయార్ లో శ్రీకృష్ణుణ్ణి, శ్రీరాముణ్ణి చూసుకునే వారు. అంతటి ప్రజాదరణ పొందారు ఎన్టీయార్. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో అనేక ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. సినిమాల్లో హీరో వేరు, సినిమాల్లో రాజకీయాలు వేరు. నిజ జీవితంలో హీరోలు, రాజకీయాలు వేరు అని తెలియడానికి ఆయన రెండు సందర్భాల్లో గట్టి దెబ్బలే తిన్నారు. ఎన్టీయార్ లో ముక్కుసూటితనం ఎక్కువ. అలాగే ఓ నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి. కానీ ఎన్టీయార్ కు అలాంటి జిత్తులు తెలియవు. బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేచినప్పుడు తనకు ఏది అనిపిస్తుందో ఇంచుమించు అవే పనులు చేస్తుండేవారు. సలహాదారులు కూడా...ఎన్టీయార్ కు సలహాలిచ్చే సాహసం కూడా ఎవరూ చేసేవారు కాదు. నిర్ణయాలు ఆయనవే. వాటి ఫలితాలు కూడా ఆయనవే. ఓ నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేసే పరిస్థితి ఉండేది కాదు. మంత్రి వర్గాన్ని రద్దు చేయడం, శాసన సభను రద్దు చేయడం, నాయకులను పార్టీ నుండి బహిష్కరించడం, లక్ష్మీ పార్వతిని పెళ్ళి చేసుకోవడం ... ఇలా అనేకానేక నిర్ణయాలు ఎన్టీయార్ తీసుకున్నారు. వాటి ఫలితాలను కూడా ఆయనే అనుభవించారు. ఆయన రాజకీయ జీవితంలో తన నిర్ణయాలను పునఃసమీక్షించుకున్న సందర్భాలు లేవనే చెప్పాలి. ఆ నిర్ణయాల ఫలితాలు ఎలా ఉన్నా ఆయన వెనకడుగు వేయలేదు. పునఃసమీక్ష...ఇటీవల కాలంలో బాలకృష్ణ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తన నిర్ణయాలపై ఎన్టీయార్ పునఃసమీక్ష చేసేవారు కాదు. 1995 ఆగస్టు సంక్షోభంలో "కొన్ని అంశాలపై పునఃసమీక్ష అవసరం అని నేను మూడు గంటలసేపు బ్రతిమాలినా ఆయన వినలేదు" అని ఎన్టీయార్ గురించి చంద్రబాబు నాయుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్టీయార్ ముక్కుసూటి మనిషి కాబట్టి తన నిర్ణయాన్ని సమీక్షించుకున్నా, తిరుగుబాటు ఎమ్మెల్యేల తరపున రాయబారం నడిపిన చంద్రబాబు చెప్పిన అంశాలు అంగీకరించినా పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ఇందిర కూడా...రాజకీయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించిన నేతల్లో ఎన్టీయార్ కంటే ముందు ఇందిరాగాంధీ ఉన్నారు. ఆమె కూడా పేద ప్రజల పట్ల ప్రత్యేక అభిమానంతో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన కామరాజ్, నిజలింగప్ప వంటి నేతలతో వైరం వచ్చినా, పార్టీ నుండి తనను బహిష్కరించినా తాను వేరే పార్టీ పెట్టుకోవాల్సి వచ్చినా ఇందిరా గాంధీ వెనకడుగు వేయలేదు. తన నిర్ణయాలను పునఃసమీక్షించుకోలేదు. ఉద్దండులను, కురువృద్ధులను ఢీ కొట్టి రాజకీయాలు నడిపారు. తేడా ఏంటంటే..?ఈ ఇద్దరి మధ్య తేడా ఏమంటే ఎదురు దెబ్బ తగిలినప్పుడు తట్టుకోగల వయసు ఇందిరా గాంధీకి ఉంది, ఎన్టీయార్ కు లేదు. అప్పటికే ఆయన ఏడు పదుల వయసులో ఉన్నారు. శరీరం, ఆరోగ్యం సహకరించక ఇందిరా గాంధీలా ఎదురు తిరిగి నిలబడలేక పోయారు. వయోభారం తన ముక్కుసూటి తనానికి అపజయాన్ని తెచ్చి పెట్టింది. జగన్ కూడా...ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంచుమించు అలా ముక్కుసూటిగానే పోతున్నారు. అధికారం చేతిలో ఉండి, డబ్బుకు కొదవ లేకపోయినా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, అసెంబ్లీ నుండి మరో ఎమ్మెల్సీ స్థానంలో జగన్ ఓడిపోయారు. బేరసారాలు చేసి గెలవాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకంటే అధికారంలో ఉన్న పార్టీకే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అధికార పార్టీకి ఉండే వనరులు, అవకాశాలు కాస్త ఎక్కువే. అయినా తన ముక్కుసూటితనం ఆయనకు ఓటమిని తెచ్చింది.లౌక్యంగా వ్యవహరించినా...డబ్బు మాత్రమే కాదు కాస్త లౌక్యంగా వ్యవహరించినా ఓటమి దరిదాపుల్లోకి వచ్చేది కాదు. క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలతో లౌక్యంగా మాట్లాడినా, నాలుక మడతేసి హామీలు ఇచ్చినా ఆ నాలుగు ఓట్లు కాపాడుకోవడమే కాదు మరో నాలుగు ఓట్లు ప్రతిపక్షం నుండి తెచ్చుకునేవారు. కానీ అలా జరగలేదు. కారణం ఏమంటే ముక్కుసూటి తనం.తాను అనుకున్నదాన్నుండి, తాను తీసుకున్న నిర్ణయం నుండి పక్కకు తప్పుకోకపోవడం లేదా తన నిర్ణయాలను పునఃసమీక్షించుకోక పోవడం వంటి తత్త్వం.అదే ఇబ్బంది పెడుతుందా?ఈ ముక్కుసూటి తత్త్వం, పునఃసమీక్ష లేని నిర్ణయాలు తీసుకోవడం... తాత్కాలిక లబ్ది కోసం రాజకీయం చేయకపోవడం అప్పట్లో ఇందిరా గాంధీని, ఆ తర్వాత ఎన్టీయార్ ను ఇబ్బంది పెట్టింది. ఓటమికి గురిచేసింది. ఈ ముక్కుసూటి తత్వమే ఇప్పుడు జగన్ ను ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వారు గెలుపైనా, ఓటమైనా తమ ఖాతాలోనే వేసుకుంటారు. 2009లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ పొత్తు ప్రతిపాదనలు తిరస్కరిస్తూ గెలుపైనా, ఓటమి అయినా పూర్తి బాధ్యత నాదే అన్నారు. ఆయన అప్పుడు గెలిచారు. అయితే ఈ ముక్కుసూటి తనానికి విజయం అన్నివేళలా వెన్నంటి రాదు. పరాజయం మాత్రం తరచూ తలుపు తోసుకుని వచ్చేస్తుంది.గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్
https://www.telugupost.com/movie-news/sukumar-going-back-to-allu-arjun-again-123892/
గత ఏడాది ఇద్దరు టాప్ మోస్ట్ డైరెక్టర్స్ తమ తమ సినిమాలతో ఒక నెల అటు ఇటుగా ప్రేక్షకుల ముందుకు రావడం ఆ సినిమాల్తో ఆ డైరెక్టర్స్ హిట్ అందుకోవడం జరిగింది. ఆ డైరెక్టర్స్ ఎవరంటే ఒకరు సుకుమార్. మరొకరు కొరటాల. సుకుమార్ రంగస్థలంతో బ్లాక్ బస్టర్ అందుకుంటే…. కొరటాల భరత్ అనే నేను తో జస్ట్ హిట్ కొట్టాడు. అయితే గత ఏడాది నుండి ఈ ఇద్దరు డైరెక్టర్స్ ఖాళీగానే ఉన్నారు. ఇక కొరటాల శివ, చిరంజీవితో సినిమా కమిట్ అయితే సుకుమార్, మహేష్ కి కమిట్ అవడము.. అది క్యాన్సిల్ అవడము జరిగింది. ఇక సుకుమార్ మళ్ళీ అల్లు అర్జున్ తో మరో సినిమా అంటూ ప్రకటించాడు. శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను తో టాప్ లిస్ట్ లో చేరిన కొరటాల శివ ఇప్పుడు మెగా స్టార్ చిరు తో సినిమా చెయ్యబోతున్నాడు. కొరటాల – చిరు కాంబో మూవీ ఆగష్టు నుండి పట్టాలెక్కబోతుందంటూ ప్రచారం జోరుగా జరిగింది. మరి కొరటాల గతఏడాది నుండి చిరు స్క్రిప్ట్ మీద కూర్చుని చివరికి ఆ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. కానీ సుకుమార్ బ్లాక్ బస్టర్ కొట్టినా… ఆయనకు సినిమాలిచ్చే హీరోలు కనబడ్డం లేదు. మహేష్ సినిమా క్యాన్సిల్ అయినా.. అల్లు అర్జున్ అవకాశమిచ్చాడు. కానీ అల్లు అర్జున్ తో తన సినిమా ఎప్పుడు మొదలవుతుందో సుకుమార్ కే క్లారిటీ లేదు. ఎందుకంటే అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమాతో పాటుగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ కూడా చెయ్యబోతున్నాడు. మరా సినిమాలు ఫినిష్ అవ్వాలి సుకుమార్ కి ఛాన్స్ రావాలి. గత ఏడాది మంచి హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ లో కొరటాల అలా అయితే సుకుమార్ ఇలా…ఉన్నాడు.
https://www.telugupost.com/movie-news/all-set-for-rrr-blasting-prerelease-event-in-mumbai-1344597
తెలుగు సినీ ప్రపంచంలో ప్రస్తుతం పెద్ద హైప్ ఉన్న సినిమా ఏదైనా ఉందా అంటే.. అది ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమానే. భారీ మల్టీస్టారర్ తో పాన్ ఇండియాలో ది మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమా అదొక్కటే. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. మన జక్కన్న సినిమా టీజర్లు, ట్రైలర్లతో అంత హైప్ పెంచేశారు మరి. ఈ సినిమాపై బాలీవుడ్ లోనూ భారీ అంచనాలున్నాయి. ఇంకా అంచనాలను పెంచేందుకు మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ తో సిద్ధమవుతున్నారు.టైటిల్ రిలీజ్ చేయడానికే మూడు భాషల్లో ప్రెస్ మీట్ లు పెట్టిన జక్కన్న.. సినిమా రిలీజ్ ముందు ఎన్ని భాషల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తాడోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.చెర్రీ , తారక్ లైవ్ పెర్ఫామెన్స్అనుకున్న సమయం రానే వచ్చింది. మొదటగా.. బాలీవుడ్ లో బ్లాస్టింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేశారు మేకర్స్. ముంబైలో ఈ ఈవెంట్ జరగనుంది. బ్లాస్టింగ్ ఎపిసోడ్ కు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఈ తొలి ప్రమోషన్ ఈవెంట్ ను కని వినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియా యూనిట్ అప్డేట్స్ ఇస్తోంది. భారీ సెట్టింగ్స్ తో గతంలో ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు జరగని విధంగా, బాలీవుడ్ ఆడియన్స్ అభిరుచి మేరకు.. మంచి హంగులతో ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ నెవెర్ బిఫోర్ అనేలా ఉండేందుకు స్వయంగా రాజమౌళి, తారక్, చరణ్ రంగంలోకి దిగి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. అంతేకాదు.. చెర్రీ, తారక్ లు లైవ్ ఫెర్ఫామెన్స్ కూడా ఇస్తారని టాక్. ఈ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరిగింది ? ఎవరెవరు వచ్చారన్న విషయాలు తెలియాలంటే.. సాయంత్రం వరకూ ఆగాల్సిందే.
https://www.telugupost.com/movie-news/ntr-tweet-on-check-movie-183600/
గత ఏడాది ఇదే టైం కి భీష్మ హిట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు నితిన్. ఈ ఏడాది నెల తిరిగే లోపు రెండు సినిమాల రిలీజ్ లకు ప్లాన్ చేసాడు. ఈ శుక్రవారం నితిన్ చెక్ మూవీ రిలీజ్ కాబోతుంది. మల్లి మార్చి 26 న నితిన్ రంగ్ దే రిలీజ్ డేట్ ఇవ్వడం, ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడం జరిగిపోయింది. ఇక ఇప్పుడు నితిన్ ఇప్పుడు ఈ టైం కి చెక్ రిజల్ట్ టెంక్షన్ లో ఉన్నాడు. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ మీద మంచి బజ్ ఉంది. ప్రియా ప్రకాష్ వారియర్ అందాలు, రకుల్ పెరఫార్మెన్స్ అన్ని సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే చెక్ ప్రమోషన్స్ పరంగాను అదరగొట్టేస్తుంది. మంచి బజ్ ఉన్న సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి ఊహించని ట్వీట్ పడితే ఆ యూనిట్ పరిస్థితి ఎలా ఉంటుంది. ఎన్టీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి చంద్ర శేఖర్ ఏలేటి సినిమాలకు నేను ఫ్యాన్ ని, ఆయన ఎంచుకునే కథలు, వాటిని చెప్పే తీరు అన్ని ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.. వాటికి నేనెప్పుడూ అభిమానినే. చెక్ మూవీ పోస్టర్స్ అన్నీ బావున్నాయి. హీరో నితిన్ అలాగే ఎంటైర్ టీం కి శుభాకాంక్షలు అని ట్వీట్ చెయ్యడంతో నితిన్ అండ్ దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి అలర్ట్ అయ్యిపోయారు. వెంటనే నితిన్ అయితే మీ ప్రేమకు, ప్రేమ పూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు.. తారక్ బ్రదర్. మీకు మా చెక్ మూవీ తప్పక నచ్చుతోంది అంటూ ట్వీట్ చేసాడు. ఇక డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి కూడా నీకున్న కోట్లాది అభిమానుల్లో నేను ఒకడిని.. నీ సహకారం ఎప్పటికి మరిచిపోను అంటూ ట్వీట్ చేసారు.
https://www.telugupost.com/movie-news/kalyandev-new-movie-70823/
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్ర నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నేటి నుండి హీరో కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ ప్రారంభించారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా ‘ఎవడే సుబ్రమణ్య’ ఫేమ్ మాళవిక నాయర్ నటించారు. చిత్ర టైటిల్, రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తారు.నో కాంప్రమైజ్.....రాకేష్ శశి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో కథ అందించిన ఈ చిత్రం ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. ‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్ర కెమెరామెన్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు. ‘రంగస్థలం’ చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.తారాగణం....కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు.
https://www.telugupost.com/movie-news/allu-arjun-pooja-hegde-ala-vaikuntapuramlo-teaser-141291/
ఒక సంక్రాతి పుంజు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ టీజర్ వచ్చింది.. అందులో కామెడీ, యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్, మహేష్ లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక మరో సంక్రాతి పుంజు అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో టీజర్ రావాల్సి ఉంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా… అలా వైకుంఠపురములో సినిమాకి సాంగ్స్ అన్ని ఒక బలం కాగా.. ఇప్పుడు డిసెంబర్ 1 న టీజర్ రాబోతుంది. మరి అల్లు అర్జున్ – త్రివిక్రమ్ లు కలిసి అలా వైకుంఠపురములో టీజర్ లో ఏం చూపిస్తారో అనే క్యూరియాసిటీ మెగా ఫాన్స్ లోనే కాదు… ప్రేక్షకుల్లోనూ మొదలైంది. ఆలా వైకుంఠపురములో ఇంతకుముందే విడుదలైన అల్లు అర్జున్ – మురళి శర్మల పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో పాటుగా ఈ టీజర్ ఫ్యామిలీ ఎమోషన్స్, త్రివిక్రమ్ మార్కు కామెడీ పంచ్ లు మరియు అల్లు అర్జున్ – పూజ హెగ్డే ల రొమాన్స్ అన్ని హైలెట్ గా ఉండబోతున్నాయని.. ప్రేక్షకులకు నచ్చేలా.. ప్రేక్షకులు, అభిమానులు మెచ్చేలా అలా వైకుంఠపురములో టీజర్ ని కట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి త్రివిక్రమ్ మార్క్ కామెడీ, పంచ్ లకు అల్లు అర్జున్ మ్యానరిజం తోడైతే… ఆ డైలాగ్స్ పటాసుల్లా పేలడం ఖాయం అంటున్నారు. మరి పూజ హెగ్డే – బన్నీ రొమాన్స్, అల్లు అర్జున్ అండ్ మురళి శర్మల ఎమోషనల్ కామెడీ డైలాగ్స్ ని ఊహించేసుకుంటూ మెగా ఫాన్స్ పండగ చేసేసుకుంటున్నారు.
https://www.telugupost.com/movie-news/adavi-sesh-on-his-direction-plans-89098/
తెలుగులో ‘క్షణం’.. ‘గూఢచారి’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలని అందించిన అడివి శేష్ ఆ సినిమాలను డైరెక్ట్ చేయకపోయినా అతనికే ఎక్కువ పేరు వచ్చింది. ఆ రెండు సినిమాలకి స్టోరీ ఇవ్వడంతో పాటు స్క్రీన్ ప్లే లో కూడా భాగస్వామిగా ఉండటంతో అతనికే ఎక్కువ క్రెడిట్ వచ్చింది. అంతే కాదు మేకింగ్ విషయంలో కూడా తాను ఇన్వాల్వ్ కావడంతో ఆ డైరెక్టర్స్ పేరు కన్నా ఇతని పేరు ఎక్కువ బయటికి వచ్చింది.మరి ఇంత చేస్తున్న శేష్..మీరు ఎందుకు డైరెక్ట్ చేయకూడదు.. మీ సినిమాలని మీరే డైరెక్ట్ చేయొచ్చుగా అని అడిగితే.. ఇంతకముందు ఆలా చేసే చాలా దెబ్బ తిన్నానని చెప్పుకొచ్చాడు. గతంలో శేష్ ‘కర్మ’.. ‘కిస్’ అనే సినిమాలు తీయడమే కాదు తానే స్వయంగా అందులో నటించాడు. అయితే ఆ రెండు సినిమా డిజాస్టర్ గా నిలవడంతో తనకు పెద్ద గుణపాఠమే నేర్పాయని శేష్ చెప్పాడు.ఇక తను నటించే సినిమాలను తాను డైరెక్ట్ చేయనని.. డైరెక్ట్ చేస్తే నటించను అని క్లారిటీ ఇచ్చాడు. దర్శకత్వం మెదడుతో చేయాలని..నటన మనసుతో చేయాలని అంతే కానీ రెండు కలిపి చేయడం కష్టం అని అందుకే నేను ఇంకా ఆలా చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు శేష్. నా ఫస్ట్ ఇంపార్టెన్స్ నటనకే అని..సినిమాల్లో కి వచ్చిన తర్వాత డైరెక్షన్ స్టార్ట్ చేసానని..ఇక ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాడు. ప్రస్తుతం తాను ‘2 స్టేట్స్’ రీమేక్‌లో నటిస్తున్నానని.. నెక్స్ట్ మూవీ ఇంకా కంఫర్మ్ చేయలేదని.. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తానని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు శేష్.
https://www.telugupost.com/movie-news/rajamoulis-son-karthikeya-wedding-102163/
దర్శక ధీరుడు రాజమౌళి కి టాలీవుడ్ లో చాలామంది స్నేహితులు..సన్నిహితులు ఉన్నారని తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళి కి ఇష్టమైన వాళ్లలో ఎన్టీఆర్..ప్రభాస్ ముందు ఉంటారు. ఏ హీరోతో అయినా చెప్పలేం కానీ వీరితో సినిమా తీయడానికి రాజమౌళి..చేయడానికి ప్రభాస్, ఎన్టీఆర్ లు ఇద్దరు ముందు ఉంటారు. ఈనేపధ్యంలో త్వరలోనే రాజమౌళి కొడుకు కార్తికేయ వెడ్డింగ్ జరుగనుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఈ వెడ్డింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు.ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ డిన్నర్ గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రభాస్..ఎన్టీఆర్ ఇద్దరు కలిసి రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహానికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవడ్ లో పెద్ద హీరోస్ నుండి చిన్న హీరోస్ దాకా..ప్రముఖ డైరెక్టర్స్..ప్రముఖ ప్రొడ్యూసర్స్..ప్రముఖ హీరోయిన్స్ ఈ డిన్నర్ కి అటెండ్ అవుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ దగ్గరలో ఒక విలాస వంతమైన రిసార్ట్ లో ఈ భారీ పార్టీ ఈవారం జరగబోతున్నట్లు సమాచారం.వీరిని ప్రభాస్..ఎన్టీఆర్ లు వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. కార్తికేయ - పూజా ల వెడ్డింగ్ కూడా చాలా బారి ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. డిసెంబర్ 31 న జరిగే ఈ మ్యారేజ్ కి ఇండస్ట్రీ నుండి పొలిటికల్ నుండి చాలామంది సెలెబ్రెటీస్ హాజరవనున్నారు. మరి ప్రభాస్..ఎన్టీఆర్ లు ఇచ్చే డిన్నర్ పార్టీ కి ఎవరు ఎవరు వస్తున్నారు అని ఇప్పటి నుండే ఆసక్తిగా చూస్తున్నారు అందరి ఫ్యాన్స్. మరోపక్క వెడ్డింగ్ కోసం వేసే మండపం సెట్ గురించి రకరకాల ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ కొడుకు కాబట్టి ఆ మాత్రం క్యూరియాసిటీ ఉంటుంది.
https://www.telugupost.com/movie-news/కిస్-సీన్స్-లో-యాక్ట్-చేయ-60151/
మొదటి సినిమాతోనే రాఘవేంద్రరావు లాంటి సీనియర్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించేసే ఛాన్స్ కోటేసింది తాప్సీ. ఝుమ్మంది నాదం సినిమా అప్పుడు ఎంత అమాయకంగా కనిపించిందో...ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్ళాక తన సినిమాలో కిస్ సీన్స్ ను తానే ప్రమోట్ చేసుకుంటుంది.బాలీవుడ్ కి వెళ్లిన తాప్సీ అక్కడ వాతావరణంకి అలవాటు పడినట్టు వుంది. అక్కడికి వెళ్ళాక ఎక్సపోజింగ్ చేయటం..లిప్ కిస్సులు వున్న సీన్స్ లో నటించడం ఇలా చాలానే చేస్తుంది. అయితే లేటెస్ట్ గా దిల్ జుంగ్లీ అనే సినిమాలో నటించింది తాప్సీ. అందులో సాధిక్ సలీమ్ హీరోగా నటించాడు. ఆ సినిమాలో ఓ కిస్ సీన్ ఉంది. ఆ సీన్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది తాప్సీ. ఇలా ముద్దు సీన్ ను ప్రమోట్ చేస్తే జనాలు వస్తారన్న ఆశ పాపం తాప్సీది.అలానే నేను ముద్దు సీన్లకు సిద్దమేనని సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా భావించవచ్చు. వాస్తవానికి ఈ సినిమా ఈనెల 6నే విడుదల కావాల్సి ఉంది. కానీ అదే రోజు రకుల్ ప్రీత్ సింగ్ అయ్యారి సినిమా విడుదల ఉండంతో మార్చి 9 కి ఈ సినిమాను వాయిదా వేశారు.
https://www.telugupost.com/movie-news/ntr-nuclear-title-159889/
ఎన్టీఆర్ రాజమౌళి RRR తరవాత త్రివిక్రమ్ తో అయినను పోయిరావలె హస్తినకు(వర్కింగ్ టైటిల్) అనే టైటిల్ తో ఓ పొలిటికల్ బ్యాగ్డ్రాప్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ విదేశాల్లో పుట్టి పెరిగి అనుకోకుండా ఇండియా రాజకీయాల్లో అడుపెడతాడని.. ఇదే కథతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని బిజినెస్ అండ్ పొలిటికల్ మ్యాన్ గా చూపించబోతున్నాడనే టాక్ ఉంది. ఇక త్రివిక్రమ్ తర్వాత ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చెయ్యబోతున్నాడు. ఈ మధ్యనే ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా విషయంలో, రేడియేషన్, న్యూక్లియర్ అంటూ ప్రచారం జరగడంతో వాళ్ళ కాంబో ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే కెజిఎఫ్ సీక్వెల్ తరవాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం ఓ కథ ప్రిపేర్ చేసి స్క్రిప్ట్ రెడీ చేస్తాడని.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకి షిట్ అవుతాడట. అయితే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ టైటిల్ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని నూక్లియర్ ప్లాంట్ పక్కనే కూర్చుంటే ఎలా ఉంటుందో తనకు తెలిసిందంటూ సంబోధించడం, మైత్రి వారు రేడియేషన్ సూట్ రెడీనా అంటూ ప్రశాంత్ నీల్ ని సంబోదించడంతో… ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కి రేడియేషన్, కాదు న్యూక్లియర్ అంటూ టైటిల్స్ పెట్టె అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో పవర్ ఫుల్ టైటిల్ వినబడుతుంది. అది ఎన్టీఆర్ ఎనేర్జికి సరిపోయేలా మిస్సైల్ అనే టైటిల్ ని, అలాగే ‘నూక్లియర్ అనే టైటిల్ ని మైత్రి వారు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తుంది. ఇక నూక్లియర్, మిసైల్ టైటిల్స్‌ లో ఏదైనా అన్ని భాషలకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అని ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ – మైత్రి వారు భవిస్తున్నారట.
https://www.telugupost.com/movie-news/balakrishna-junior-ntr-shooting-in-ramoji-filmcity-80282/
ప్రస్తుతం ఇండస్ట్రీలో బాబయ్ అబ్బాయిలు ఉన్నది మెగా ఫ్యామిలోను, నందమూరి ఫ్యామిలీలోను. మెగా ఫ్యామిలి లో స్టార్ హీరోస్ అయిన పవన్ కళ్యాణ్ బాబాయ్ అయితే... రామ్ చరణ్ అబ్బాయ్. ఇక నందమూరి ఫ్యామిలి బాలకృష్ణ బాబయ్ అయితే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు అబ్బాయిలు. అయితే పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ కి ఉన్నంత రిలేషన్ షిప్.. బాలకృష్ణ కి ఎన్టీఆర్ కి లేదు. నందమూరి ఫ్యామిలిలో ఉన్న లుకలుకలు వల్ల బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరు ఏడ మొహం పేడ మొహంగానే ఉంటారు. అయితే తాజాగా బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ లు ఒకే చోట తమ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ని క్రిష్ డైరెక్షన్ లో మొదలు పెట్టేసాడు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జోరుగా సాగుతుంది. మొన్న దర్శకుడు క్రిష్ కూడా మర్యాదపూర్వకముగా రామోజీ ఫలింసిటి అధినేత రామోజీ రావు ని కలిసాడు.ఇక విద్యాబాలన్, బాలకృష్ణ లపై రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నవేశాలను క్రిష్ చిత్రీకరిస్తున్నారు. అయితే అక్కడే దగ్గరలోనే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ లు తమ అరవింద సమేత షూటింగ్ ని కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఫిలిం సిటీలో వేసిన కాలేజ్ సెట్ లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ - హీరోయిన్ పూజ హెగ్డే ల మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.రాయలసీమ బ్యాగ్ద్రోప్ లో తెరకెక్కుతున్న త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ ల సినిమా ఇక్కడ ఫిలిం సిటీలో వేసిన కాలేజ్ సెట్ సీన్స్ పూర్తి కాగానే పొల్లాచ్చి బయలు దేరుతుంది. అక్కడ హీరో ఎన్టీఆర్ హీరోయిన్ పూజ హెగ్డే ల మీద పాటలతో పాటుగా మరికొన్ని సీన్స్ ని త్రివిక్రమ్ షూట్ చేస్తాడు. మరి ఇలా ఒకేచోట బాబయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ లు తమ సినిమాల షూటింగ్స్ తో దున్నేస్తున్నారు
https://www.telugupost.com/crime/hyderabad-woman-killed-by-live-in-partner-in-bengaluru-1479634
హైదరాబాద్ కు చెందిన యువతి బెంగళూరులో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని పోలీసులు ఆకాంక్షగా గుర్తించారు. ఆమెతో సహజీవనం చేసిన బాయ్ ఫ్రెండ్ అర్పిత్ ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు నగరంలోని జీవన్‌బీమా నగర్‌లో ఈ ఘటన సోమవారం (జూన్5) రాత్రి ఈ ఘటన జరిగింది. ఆకాంక్ష, అర్పిత్ లు రెండేళ్లపాటు హైదరాబాద్ లో సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. ఆకాంక్షకు వేరే ఉద్యోగం రావడంతో ఆమె బెంగళూరుకు షిఫ్ట్ అయి.. అక్కడే ఒక ఫ్లాట్ తో ఉంటుంది.ఆకాంక్షను కలిసేందుకు అర్పిత్ బెంగళూరుకు తరచూ వచ్చేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జీవన్ భీమా నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఆకాంక్ష వద్దకు ఇటీవలే అర్పిత్ రాగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. క్షణికావేశంలో అర్పిత్ ఆకాంక్షను హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించడంలో విఫలమైనట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఆకాంక్ష మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసి.. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అర్పిత్ ప్రయత్నించాడు. తనవల్ల కాకపోవడంతో మృతదేహాన్ని కిందే వదిలేసి ఇంటి తలుపులు వేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఆకాంక్ష రూమ్ మేట్ అపార్ట్ మెంట్ కు రావడంతో ఈ ఘటన వెలుగుచూసింది. పరారీలో ఉన్న ఢిల్లీకి చెందిన అర్పిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/anupama-parameshwaran-director-96941/
తెలుగులో కథానాయికల నుండి డైరెక్టర్స్ గా మారిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విజయనిర్మల, సావిత్రి, శ్రీప్రియ, భానుమతి, జీవితా రాజశేఖర్ ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరు మొదట తమ కెరీర్ ని హీరోయిన్స్ గా స్టార్ట్ చేసి తరువాత నెమ్మదిగా డైరెక్టర్స్ గా మారారు. హిట్స్, ప్లాప్స్ పక్కన పెడితే మన తెలుగులో దర్శకులుగా మారిన కథానాయికల సంఖ్య మరీ తక్కువ. ఇప్పుడున్న హీరోయిన్స్ లో కొంతమందికి ఆ కోరిక ఉంది. 'అలా మొదలైంది' సినిమాతో తన టాలెంట్ ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసిన నిత్య మీనన్ కు దర్శకత్వం చేయాలనే తన కోరిక అని ఆ మధ్య ఒకసారి చెప్పింది. దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ లో కూడా ఉన్నాను అని చెప్పింది. అయితే ఇంతవరకు తను డైరెక్షన్ చేసే సినిమాల గురించి ఎక్కడా చెప్పలేదు.త్రివిక్రమ్ మాత్రమే స్పందించి...ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరింది. ‘అ ఆ’, ‘ప్రేమమ్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాల్లో నటించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు దర్శకత్వం అంటే ఆసక్తి అని చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.." నాకు కెమెరా ముందు కన్న కెమెరా వెనక ఉండటమే ఇష్టమని... డైరెక్టర్ గా కావాలనే కోరిక ఉందని.. అది తన కల అని.. తన మనసులో మాట బయటపెట్టింది. మణిరత్నం ఏ ఫ్రేమ్ పెట్టినా బాగుంటుందని... నాకు ఆయనలా అందమైన విజువల్స్ తీయాలనేది నా కల అని చెప్పింది. తన దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయని అవి స్క్రిప్ట్స్ గా మార్చాలని అంటుంది. నేను పని చేసిన దర్శకుల్లో కొంతమందిని.. మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వమని అడిగా. అందులో త్రివిక్రమ్ రెస్పాండ్ అయి ఓకే అన్నారు అంది. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన తరువాతే డైరెక్టర్ అవుతా. కానీ ఎప్పుడు అవుతానో మాత్రం చెప్పలేను అని చెప్పింది". సో ఈ మలయాళ బ్యూటీ త్వరలో డైరెక్టర్ గా మారబోతుందన్నమాట....
https://www.telugupost.com/crime/tragedy-happened-in-bangalore-two-killed-as-metro-pillor-collapses-on-two-wheeler-1456762
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. మెట్రో రైలు పిల్లర్ కూలి ద్విచక్ర వాహనంపై పడటంతో ఇద్దరు మరణించారు. వెంటనే తల్లిని, బిడ్డను ఆసుపత్రిలోకి చేర్చినా ఫలితం లేదు. నాగవార - గొట్టిగెరె మార్గంలో మెట్రోలైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా పనులు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.స్థానికుల ఆందోళన...నాగవార సమీపంలో మెట్రో పిల్లర్ కూలడంతో దాని కింద ప్రయాణిస్తున్న తల్లి, బిడ్డలు మరణించారు. గాయపడిన తండ్రి కోలుకుంటున్నారని తెలిసింది. నాగవారా రింగ్ రోడ్ లోని హెచ్‌బీఆర్ లే అవుట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారాన్ని చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
https://www.telugupost.com/crime/innova-car-overturned-at-kusumanchi-in-khammam-district-one-and-a-half-million-cash-was-recovered-from-this-car-1535046
ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద ఇన్నోవా కారు బోల్తా పడింది. ఈ కారులో నుంచి కోటిన్నర నగదు బయటపడింది. నాయకనగూడెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఒక ఇన్నోవా వచ్చి ఆగకుండా వెళ్లింది. ఆ ఇన్నోవా కారును దాదాపు పది కిలోమీటర్లను పోలీసులు ఛేజ్ చేశారు. అయితే పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ఇన్నోవా కారు బోల్తా పడింది. అందులో ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కోటిన్నర నగదును...ఇన్నోవా కారు నుంచి కోటిన్నర నగదు బయటపడింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకే నగదును తీసుకెళతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు వేగంగా వెళుతూ ఈ కారు బోల్తా పడటంతో నగదు బయటపడింది. ఈ నగదు ఎవరిది? ఎక్కడకు తీసుకెళుతున్నారు? ఎవరికి పంపిణీ చేయడానికి వెళుతున్నారు? అన్న దానిపై పోలీసులు దొరికిన నిందితులను విచారిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/no-release-date-for-liger-181117/
టాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ జాతర ఓ యుద్ధంలా జరిగింది. ఫిబ్రవరి 12 న మెగా హీరో వైష్ణవ తేజ్ ఉప్పెన తో స్టార్ట్ అవుతున్న క్రేజీ మూవీస్ రెలీసెస్.. అక్టోబర్ 13 రాజమౌళి RRR వరకు ఓ జాతరలా జరగనుంది. మధ్యలో క్రేజీ మూవీస్, మీడియం, భారీ, చిన్న బడ్జెట్ సినిమాలు అన్ని తమ తమ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసి సోషల్ మీడియాని ఊపిరి పీల్చుకోకుండా చేసాయి. మధ్యలో ఫాన్స్ హంగామా. తమ అభిమాన హీరోల రిలీజ్ డేట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. మరి చిరు దగ్గరనుండి చిన్న చితక, స్టార్ హీరోలంతా తమ సినిమా రిలీజ్ డేట్స్ ని గ్రాండ్ గా ప్రకటించినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నాగార్జున లు తమ సినిమాల విషయంలో సైలెంట్ గా ఉండిపోయారు.పూరి జగన్నాధ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం లైగర్ రిలీజ్ డేట్ ఇవ్వలేదు. ఎప్పుడూ స్పీడుగా ఉండే పూరి ఇప్పుడు కామ్ గా సైలెంట్ గా ఉండడం రౌడీ ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందరి కన్నా ముందే రిలీజ్ డేట్ ఇస్తారనుకుని కలలు కన్న రౌడీ ఫాన్స్ కి విజయ్ దేవరకొండ హ్యాండ్ ఇచ్చాడు. మరోపక్క ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఇవ్వయ్యా బాబూ అంటే.. ప్రేమికుల రోజున రాధేశ్యామ్ టీజర్ అన్నాడు ప్రభాస్. మరోపక్క నాగార్జున వైల్డ్ డాగ్ విషయం తేల్చకుండా సస్పెన్స్ లో పెట్టాడు. మరి స్టార్ హీరోలంతా సినిమా రిలీజ్ డేట్స్, అలాగే కొత్త పోస్టర్స్ సోషల్ మీడియాలో చేసిన హంగామాలో విజయ్ దేవరకొండ, ప్రభాస్ అండ్ నాగ్ లు మాత్రం మిస్ అయ్యారు.
https://www.telugupost.com/movie-news/allari-naresh-role-in-mahesh-babu-movie-77845/
అల్లరి నరేష్ ప్రస్తుతం వరస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. అస్సలు కొంత కాలం నుండి ఈ కామెడీ హీరోకి హిట్ అనే పదమే ఎదురు కావడం లేదు. రొటీన్ కామెడీతో అల్లరి నరేష్ హీరోగా హిట్స్ కొట్టలేక సతమతమవుతున్న టైం లో మహేష్ బాబు సినిమాలో ఒక కీలక పాత్ర చెయ్యడానికి ఒప్పుకుని కొత్తగా ట్రై చేస్తున్నాడు. మహేష్ - వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 25 వ సినిమాలో అల్లరి నరేష్, మహేష్ కి స్నేహితుడిగా నటిస్తున్నాడు. ఇక మహేష్ సినిమా తో అయిన అల్లరి నరేష్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అందరూ ఆశిస్తున్నారు. ఇక తాజాగా నిన్న శనివారం అల్లరినరేష్ పుట్టిన రోజు జరుపుకున్నాడు.. అల్లరి పుట్టిన రోజుకి టాలీవుడ్ లో చాలామంది ఆయన సన్నిహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.అయితే మహేష్ బాబు - వంశి సినిమాలో అల్లరి నరేష్ పాత్ర పేరు రవి అని ఆ సినిమా దర్శకుడు వంశి కాస్త క్లూ ఇచ్చేసాడు. అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా వంశి పైడిపల్లి అతనికి బర్త్ డే విషెస్ చెబుతూ... మా రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీతో పనిచేయడం గొప్ప అనుభూతినిస్తోంది. మహేష్ 25వ మూవీ నీకు మరింత మంచి భవిష్యత్తునిస్తుందని ఆశిస్తున్నాం... అంటూ ట్వీట్ చెయ్యడంతో.. మహేష్ సినిమాలో అల్లరి పాత్రపేరు రవి అని మహేష్ ఫాన్స్ తోపాటుగా ఫిలింసర్కిల్స్ అంతా ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే అల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్ గా నటిస్తున్నాడని... అనుకోకుండా అల్లరి పాత్ర ఈ సినిమాలో చనిపోవడంతో.. మహేష్ ఆ హత్యకి గల కారణాలు వెతుకుతాడనే న్యూస్ ప్రచారంలో ఉంది.ఇక తాజాగా వంశి పైడిపల్లి ఇచ్చిన రవి అనే క్లూతో అందరూ అల్లరి పేరు రవి అని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాతో వంశి చెప్పినట్లుగా అల్లరి కెరీర్ టర్న్ అయ్యి మళ్ళీ నిలదొక్కుకుంటాడేమో చూడాలి. రాస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఒక నెల లేట్ గా మహేష్ సినిమా డెహ్రాడూన్ లో మొదలై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పూజ హెగ్డే మొదటిసారి మహేష్ తో జోడి కడుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతమందిస్తున్నాడు.
https://www.telugupost.com/movie-news/brahmanandam-in-harish-shankar-movie-132232/
వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ వాల్మీకి ఈనెల 20 న రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హరీష్ శంకర్ అన్ని విధాలుగా ఆకట్టుకునే విధంగా ఈసినిమాలో ఇప్పటికే మాస్ కోసం ఐటమ్ సాంగ్ లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సెట్ చేసిన హరీష్ లేటెస్ట్ గా కామెడీ ప్రేక్షకుల కోసం కామెడీ ట్రాక్ సెట్ చేసే పనిలో ఉన్నాడు.కామెడీ ట్రాక్ కోసం కమెడియన్ బ్రహ్మానందాన్ని సినిమాలోకి తీసుకున్నారు. కావాలనే హరీష్ బ్రహ్మి ని తీసుకున్నారు అని అర్ధం అవుతుంది. ఆయన కోసం ప్రత్యేకంగా….. చివరి నిమిషంలో ఆయనను తీసుకుని ఆయన కోసం ప్రేత్యేకంగా కామెడీ ట్రాక్ రాసుకుని షూటింగ్ జరుపుతున్నారట. సినిమాలో కామెడీ మిస్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాడు హరీష్.మరి సినిమాకి ఇది ఎంత వరకు ప్లస్ అవుతుందో వేచిచూడాలి. ఏమాత్రం తేడా కొట్టినా సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. చాలా గ్యాప్ తరువాత బ్రహ్మానందం తెరపై కనిపించనున్నారు. మరి మునుపటిలా నవ్విస్తారేమో చూడాలి. ఈసినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది.
https://www.telugupost.com/movie-news/అంత-మెతక-హీరోకు-అసలు-గొడవ-10036/
నటులు, దర్శకులు, నిర్మాతలకు చిన్న పెద్ద తేడా లేకుండా ఎప్పుడూ ఏదో ఒక వివాదం వారిని వెంటాడుతూనే ఉంటుంది. వెంకటేష్ లాంటి ఒకరో ఇద్దరో నటులు సినిమా కుటుంబం నుంచి వచ్చి మూడు దశాబ్దాలు పైగా నట జీవితం సాగిస్తున్నా వివాదాలకు కాస్త దూరంగా ఉంటుంటారు. అటువంటి కోవకే చెందుతాడు హీరో గోపి చంద్. ఎప్పుడైనా వచ్చే పుకార్లు తప్ప ఆయనను వార్తల్లో ఉంచే వివాదం అంటూ ఏదీ ఉండదు. అటువంటి హీరో సెట్స్ పై ఉన్న సినిమా దర్శకుడితో అభిప్రాయం భేదాలు ఏర్పడి చిత్రీకరణ ఆలస్యం అవుతుంది అంటే వినటానికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.గోపి చంద్ ప్రస్తుతం ఏ.ఎం రత్నం నిర్మాణం లో ఆయన తనయుడు ఏ.ఎం జ్యోతి క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆక్సిజన్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రణాళిక ప్రకారం అయితే ఈ చిత్రం అక్టోబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. కానీ అనివార్య కారణాల వలన చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ విషయంలో హీరో దర్శకుడి మధ్య అభిప్రాయం భేదాలు తార స్థాయికి చేరటంతో గోపి చంద్, జ్యోతి క్రిష్ణ ఒకరినొకరు చూసుకోవటానికి కూడా ఇష్ట పడటం లేదు అంట. ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం ఈ మనస్పర్థలు సర్ది చిత్రం విడుదల చెయ్యటానికి శ్రమిస్తున్నారంట.గోపి చంద్ ప్రతి ఏడాది రెండు విడుదలలు ప్లాన్ చేసుకుంటాడు. కానీ ఈ ఏడాది ఆయనకీ బి.గోపాల్ చిత్రం మధ్యలో ఆగిపోయి ఇప్పుడు మొదలుకావటం, ఆక్సిజన్ దర్శకుడితో మనస్పర్థల వలన ఈ ఏడాది అనుకున్నా విడుదలలు వాయిదా పడుతూ వున్నాయి.
https://www.telugupost.com/movie-news/ఎన్టీఆర్-హోస్టింగ్-అదిరి-42129/
నాగార్జున ఒక నటుడే కాదు... చాలా వ్యాపారాలకు అధిపతి కూడా. ఒక పక్క సినిమా ఇండస్ట్రీలో హీరోగా చేస్తూనే మరోపక్క అనేక వ్యాపారాలను నెలకొల్పి కింగ్ నాగార్జున గా వెలుగొందుతున్నాడు. ఇక హీరోగా... వ్యాపారవేత్తగా వెలుగొందుతూనే బుల్లితెర మీద మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. టివిలో మొదటిసారిగా హీరో హోస్ట్ చెయ్యడంలో మీలో ఎవరు కోటీశ్వరుడికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అసలు నాగార్జున ఆ ప్రోగ్రాంని రక్తి కట్టించిన తీరు అందరిని ఆకట్టుకుంది. అయితే అదే ప్రోగ్రాం ని ఆ తర్వాత చిరంజీవి కూడా హోస్ట్ చేసాడు.సీనియర్ స్టార్స్ మాత్రమే బుల్లితెర మీద చూపిస్తే మేమేం తక్కువ తిన్నాం అంటూ.... ఇప్పుడున్న స్టార్ హీరోలు కూడా బుల్లితెర మీద తమ టాలెంట్ చూపిస్తున్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ అయితే స్టార్ మా లో బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. అలాగే హీరో రానా కూడా జెమిని ఛానల్ లో వచ్చే నెంబర్ వన్ యారీ తో అదరగొడుతున్నాడు. అలా యువ హీరోలు ఇలా తమ టాలెంట్ తో బుల్లితెర మీద దూసుకుపోతుంటే వీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరవడానికి బుల్లితెర అనేది అత్యుత్తమ మార్గం. అసలు నేను మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం చేయడానికి కారణం కూడా ఇదే అని చెప్పిన నాగ్... బిగ్ బాస్ ప్రోగ్రాంలో ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న తీరు అదిరిపోతోంది. ఈ షోకి ఎన్టీఆర్ హోస్టింగ్ చాల బావుంది అని చెబుతున్నాడు. బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ మనందరికీ ఎలా కనపడుతున్నాడో రియల్ లైఫ్ లోను ఎన్టీఆర్ అలాగే ఉంటాడు. ఈ షోలో మనకు ఎన్టీఆర్ నిజ జీవిత పాత్రలా మన కళ్లముందు కనిపిస్తోంది... అంటూ ఎన్టీఆర్ ని నాగార్జున స్పెషల్ గా పొగిడేసాడు. ఎన్టీఆర్ ఈ బిగ్ బాస్ షోని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడని కూడా చెప్పాడు. మరి ఉన్నట్టుండి నాగ్, ఎన్టీఆర్ ని ఇంతిలా పొగిడేసాడంటే.... బిగ్ బాస్ ని హైప్ చేసే పనిలో భాగంగా చేశాడా? లేకుంటే నిజంగానే ఎన్టీఆర్ మీద ప్రశంసల జల్లు కురిపించాడా? అంటూ నెటిజెన్ట్లు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే నాగ్ చెప్పినదాన్ని బట్టి ఎన్టీఆర్ రియల్ లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఆయన అభిమానులే కాకుండా ప్రేక్షకులంతా ఊహించుకుని ఆనందించే పనిలో ఉన్నారు.
https://www.telugupost.com/andhra-pradesh/vinod-jain-has-pleaded-guilty-molestation-in-minor-girl-suicide-case-in-vijayawada-1352129
లైంగిక వేధింపులు భరించలేక.. విజయవాడలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక ఆత్మహత్య కేసులో.. భవానీపురం పోలీసులు.. టీడీపీ నేత వినోద్ జైన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. పోలీసుల విచారణలో వినోద్ జైన్ తన తప్పును ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.Also Read : ఆమె కూడా మనతో ఉంటుంది.. భార్యకు ప్రపోజల్ పెట్టిన భర్త.. ఆ తర్వాత ?బాలిక ఆత్మహత్యకు పాల్పడిన అపార్ట్ మెంట్ వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజీలో నిందితుడి వికృతచేష్టలు, బాలిక ఆత్మహత్య దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఫుటేజీలను చూపించి.. వినోద్ జైన్ ను ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లోని లోటస్‌ లెజెండ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండే వినోద్ జైన్.. అదే అపార్ట్ మెంట్ కు చెందిన బాలిక మెట్లు ఎక్కేటపుడు, దిగేటపుడు, లిఫ్ట్ వద్ద వేధించినట్లు అంగీకరించినట్లుగా సమాచారం. స్కూల్ కు వెళ్లేటపుడు, వచ్చేటపుడు ఆ బాలిక కోసం ఎదురుచూసి మరీ.. ఆమెను ఇబ్బందులకు గురిచేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ పాపను తాకుతూ.. ఆనందం పొందేవాడినని వినోద్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ బాలికతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. Also Read : నిర్మలమ్మ బడ్జెట్ నిండా ముంచిందే? తాను చేసింది తప్పేనని అంగీకరించిన వినోద్ జైన్.. తాను చేసిన తప్పుకు బాలిక ఆత్మహత్య చేసుకునేంత వరకూ వస్తుందని ఊహించలేదన్నాడు. బాలిక ఆత్మహత్య చేసుకునే ముందర డాబాపైన పిట్టగోడ వద్దకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కిందపడతావు.. జాగ్రత్త అని హెచ్చరించినట్లు సమాచారం. అయినా బాలిక వినకుండా ఆత్మహత్య చేసుకుందని వారు చెప్తున్నారు.
https://www.telugupost.com/movie-news/sarwanand-negative-comments-on-rangasthalam-movie-124493/
రెండు రోజులు కిందట టాలీవుడ్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేసింది. శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘రణరంగం’ విషయం శర్వా తన ఫ్రెండ్స్ తో సినిమా ఆడితే ఆడుతుంది లేకపోతే లేదు అని నెగటివ్ ప్రచారం చేసాడని..దాంతో డైరెక్టర్ తో పాటు ప్రొడ్యూసర్స్ కూడా శర్వా పై కోపంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందొ మాత్రం క్లారిటీ లేదు. ఎందుకుంట రీసెంట్ గా శర్వా ‘రణరంగం’ ఫైనల్ ఎడిట్ అయిన కాపీ చూసుకున్నాడు. చూసిన తరువాత తన టీమ్ తో ముచ్చటిస్తూ, సినిమా బాగా వచ్చిందని అన్నట్లు బోగట్టా. మొదటి నుండే శర్వా ఈమూవీ పై కొంచం కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ఫైనల్ కాపీ అవ్వకుండానే ఎడిటెడ్ కాపీ చూసాడు. అలానే సితారకు బ్యాక్ బోన్ అయిన హారిక హాసిని చినబాబు కూడా ఎడిట్ కాపీ చూసి… రెండు మూడు చిన్న మార్పులు చెప్పి చేంజ్ చేయమని చెప్పి హీరో శర్వా కు కంగ్రాట్స్ చెప్పారని తెలుస్తుంది. ఈమూవీ అన్ని కుదిరితే ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో శర్వా మాఫియా లీడర్ గా కనిపించనున్నాడు
https://www.telugupost.com/movie-news/majili-collections-116959/
నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సినిమా ప్రేక్షకులు బాగా మెప్పించింది. క్రిటిక్స్ మజిలీకి యావరేజ్ మార్కులేసినా ప్రేక్షకులు మాత్రం హిట్ మార్కులేశారు. నాగ చైతన్య – సమంత – దివ్యంశ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ నిర్మాణంలో తెరకెక్కిన మజిలీ సినిమా కి ప్రేక్షకాదరణ సూపర్బ్ గా వుంది. చాలారోజుల తర్వాత మజిలీ సినిమా తో బాక్సాఫీసు కళకళలాడడమే కాదు… థియేటర్స్ లో ప్రేక్షకుల హడావిడి మాములుగా లేదు. మరి చైతు, సామ్ లు ఈ ఉగాది కి ఎప్పటికి మరిచిపోలేని హిట్ అందుకున్నారు. మజిలీ హిట్ టాక్ తో తొలిరోజు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ మీ కోసం… ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 1.95 సీడెడ్ 0.70 నెల్లూరు 0.17 కృష్ణ 0.37 గుంటూరు 0.68 వైజాగ్ 0.76 ఈస్ట్ గోదావరి 0.28 వెస్ట్ గోదావరి 0.27 టోటల్ ఏపీ & టీఎస్ షేర్ 5.18 కర్ణాటక 0.80 యుఎస్ఏ 0.95 ఇతర ప్రాంతాలు 0.30 టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 7.23
https://www.telugupost.com/movie-news/2-0-సినిమాపై-షాకింగ్-న్యూస్-47624/
రజినీకాంత్ - శంకర్ కలయికలో '2 .0 ' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం '2 .0 ' సినిమా ఆడియో వేడుకని దుబాయ్ వంటి మహానగరం లో నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుక అందరి మతులని పోగొట్టింది. ఆ రేంజ్ లో ఈ వేడుకని దుబాయ్ లో నిర్వహించారు నిర్మాతలు. అయితే ఇప్పుడు తాజాగా '2 .0 ' సినిమాపై ఒక న్యూస్ వెలుగులోకొచ్చింది. అదేమిటంటే రజినీకాంత్ హీరోగా.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా తెరకెక్కిన ఈ సినిమా రన్ టైం కేవలం 140 నిమిషాలేనట.మరి శంకర్ తెరకెక్కించిన సినిమాలన్నీ దాదాపు 170 నిమిషాల రన్ టైం కలిగిఉంటాయి. అంత సేపు రన్ టైం ఉన్నప్పటికీ శంకర్ తన మ్యాజిక్ తో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా కుర్చీలలో అతుక్కుపోయేటట్లు చెయ్యగల టాలెంటెడ్ పర్సన్. మరి అలాంటి శంకర్ ఇలా '2 .0 ' కి ఇంత తక్కువ రన్ టైం ఫిక్స్ చెయ్యడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ ని బేస్ చేసుకుని శంకర్ ఇలా ప్లాన్ చేశాడని అంటున్నారు. అంతేకాకూండా '2 .0 ' బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో.. ఈ రన్ టైం విషయంలో కాంప్రమైజ్ కావాల్సివచ్చింది అంటున్నారు.ఒకవేళ నిడివి ఎక్కువ ఉంటే ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడుతుంది కాబట్టే ఇలా నిడివిని దర్శకుడు శంకర్ తగ్గించేశారంటున్నారు. మరోపక్క ఈ సినిమాకి సంబందించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి స్థాయిలో ఫినిష్ కాలేదని.. అందువలన కూడా డ్యురేషన్ తగ్గిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఏది కరెక్ట్ అనేది దర్శకుడు శంకర్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.
https://www.telugupost.com/movie-news/ravanasura-first-day-collections-1470950
మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర ఏప్రిల్ 7 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో.. కలెక్షన్స్ పై దాని ఎఫెక్ట్ పడింది. హీరోగా రవితేజ కెరియర్ లోనే సరికొత్త క్యారెక్టర్ లో కనిపించడంతో.. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ.. ఊహించిన మేర భారీ ఓపెనింగ్స్ అయితే జరగలేదు. దసరా మినహా మరే ఇతర చిత్రంతోనూ పోటీ పడలేకపోయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. నాని హీరోగా నటించిన దసరా సినిమా 9వ రోజు కలెక్షన్లను కూడా రావణాసుర ఫస్ట్ డే కలెక్షన్లు అధిగమించలేకపోయింది.గతేడాది రవితేజ హీరోగా వచ్చిన కిలాడీ రూ.6.8 కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ రూ. 6.3 కోట్లు, ధమాకా రూ.9.48 కోట్లు ఫస్ట్ డే వసూళ్లు రాగా.. రావణాసురకు కేవలం ఐదున్నర కోట్ల వసూళ్లే రావడం గమనార్హం. వాటితో పోలిస్తే.. రావణాసురకు మంచి ఆరంభం రాలేదనేది వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది కోట్ల వసూళ్లు రాబట్టింది. మిశ్రమ స్పందనతో ఉన్న ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే రూ.25 కోట్లు వసూళ్లు రావాల్సి ఉంది. వీకెండ్ లో అంటే శని, ఆదివారాల్లో ఏమన్నా సినిమాకు మంచి వసూళ్లు వస్తాయోమోనని చిత్రబృందం ఎదురుచూస్తోంది. అభిషేక్ నామా, రవితేజ కలిసి నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా, రావు రమేష్, జయరామ్, సంపత్ రాజ్, మురళీశర్మ కీలక పాత్రల్లో కనిపించారు.
https://www.telugupost.com/movie-news/ప్రిన్స్-మహేష్-బాబుకు-కో-22020/
హీరో మహేష్ బాబుకు నాంపల్లి కోర్టు సమన్లు కొద్ది సేపటి క్రితం జారీ చేసింది. మార్చి 3వ తేదీన నాంపల్లి న్యాయస్థానానికి హాజరు కావాలని కోరింది. మహేష్ బాబుతో పాటు శ్రీమంతుడు సినిమా దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ లకు కూడా సమన్లు జారీ చేసింది. తన ‘చచ్చేంత ప్రేమ’ నవలను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని కవి, రచయిత శరత్ చంద్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.శ్రీమంతుడు కాపీనా..?2012లో స్వాతి మాసపత్రికలో వచ్చిన చచ్చేంత ప్రేమ కథను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమాగా మలిచారన్నది శరత్ చంద్ర ఆరోపణ. ఈయన కొద్ది రోజుల క్రితం నాంపల్లి కోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు చేశారు. అప్పడు చిత్ర యూనిట్ కు నాంపల్లి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఈరోజు దీనిపై మళ్లీ విచారించిన నాంపల్లి కోర్టు కాపీ రైట్స్ యాక్ట్ 63, కుట్ర పూరిత నేరం భారతీయ శిక్ష్మాస్మృతి120 బి కింద కేసు నమోదు చేయాలని పిటిషనర్ తరుపున న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ లను మార్చి 3వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
https://www.telugupost.com/movie-news/భరత్-అనే-నేను-గురించి-కైర-64752/
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే చాలానే కష్టపడాలి కానీ బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ మాత్రం చాలా అవలీలగా తెలుగులోకి ఎంటర్ అయ్యి ఏకంగా మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. మొదట 'భరత్ అనే నేను' సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల - మహేష్ చాలా మంది హీరోయిన్ ల పేర్లు అనుకున్నారు. కానీ చివరికి ఆ అదృష్టం కైరాకే దక్కింది.అయితే లేటెస్ట్ గా ఆమె తన మనసులో మాటలు ప్రేక్షకులతో పంచుకుంది. 'ఇలాంటి టీంతో పని చేసే అదృష్టం రావడం నా అదృష్టం. వారంతా నాపై ఎంతో నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకునేందుకు అన్నివిధాలుగా ప్రయత్నించాను' అని చెప్పింది కైరా. నా డిగ్రీ ఫినిష్ అవ్వగానే నేను ఇండస్ట్రీలోకి రావాలని భావించాను కానీ ఇక్కడ ఒక్క గ్లామర్ ఉంటే సరిపోదు బోలెడంత హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. అలానే పక్కా హైద్రాబాదీ అమ్మాయి పాత్రను పోషిస్తున్నానని.. ముందే డైలాగ్ వెర్షన్ ను దర్శకుడు ఇవ్వడంతో.. బాగా ప్రాక్టీస్ చేశానని..ఈ క్యారెక్టర్ ప్రతీ మహిళకు కనెక్ట్ అవుతుందని చెప్పింది. అంతేకాదు మహేష్ అసలు స్టార్ హోదా ఫీల్ కాడని.. తనకు డైలాగ్స్ విషయంలో చాలా సార్లు హెల్ప్ చేశాడంటోంది కైరా.
https://www.telugupost.com/movie-news/accident-in-kamal-hasan-indian-2-sets-148555/
భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా శంకర్.. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో భారీ హంగులతో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారతీయుడు గెటప్ లో కమల్ హాసన్ అద్భుతంగా కనిపిస్తుండగా… కాజల్, రకుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇండియన్ 2 సెట్స్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, దర్శకుడు శంకర్ గాయపడడంతో పాటుగా మరో పదిమంది కి తీవ్రగాయాలైనట్టుగా తెలుస్తుంది. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ లో సినిమా షూటింగ్ చిత్రీకరణజరుగుతుంది. అయితే ఆ ప్రదేశంలో ఒక పెద్ద క్రేన్ ఒక్కసారిగా కిందపడటంతో ముగ్గురు వ్యక్తుల అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ మధు, చంద్రన్ మరో టెక్నిక‌ల్ అసిస్టెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దర్శకుడు శంకర్ కి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మృతదేహాలను చెన్నై లోని రాజీవ్ గాంధి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో హీరో కమల్ హాసన్ కి గాయాలు అవలేదని, దర్శకుడు శంకర్ కి కూడా చిన్న చిన్న దెబ్బలే తగిలాయని చెబుతున్నారు.. ఈప్రమాదంతో అక్కడున్న వారంతా షాక్ కి గురైనట్లుగా ప్రత్యక్ష సాక్షుల కథనం.
https://www.telugupost.com/movie-news/rrr-trial-shoot-160452/
ఇప్పుడు సినిమా చిత్రీకరణలకు ప్రభుత్వ అనుమతులు వచ్చేసాయి. అందరూ షూటింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు రాజమౌళి పని మొదలెడితే.. మిగతా వాళ్ళు రంగంలోకి దిగడానికి ఎదురు చూసున్నారు. అయితే రాజమౌళి RRR కోసం ట్రయిల్ షూట్ మొదలెట్టబోతున్నాడు. అంతకన్నా ముందే RRR టీం తో ఆన్ లైన్ లో మీటింగ్ పెట్టాడట. రాజమౌళి ఈ మీటింగ్ లో సినిమా బడ్జెట్, రెమ్యూనరేషన్స్ వంటి విషయాలతో పాటు.. కరోనా వైరస్ నుండి తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి అనేక విషయాలు తన RRR టీం తో చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ట్రయిల్ షూట్ లో ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం 50 మంది టీం తోనే షూటింగ్ చేయబోతున్నాడట రాజమౌళి. అంత తక్కువమందితో సినిమా షూటింగ్ సాధ్యమేనా అనేది రాజమౌళి ట్రయిల్ షూట్ తో తేలిపోతుంది. ఈ ట్రయిల్ షూట్ ని గండిపేటలో అల్యూమినియం ఫ్యాక్టరీలో సాబు సిరిల్ నేతృత్వంలో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూట్ జరుగుతుంది అని చెబుతున్నారు. ఇంతకుముందు రాజమౌళి RRR కోసం అద్భుతమైన లొకేషన్స్ నార్త్ ఇండియాలో ఎంపిక చేసి ఉంచారు. ఈ వైరస్ రీత్యా అక్కడికి వెళ్లి షూటింగ్ జరపలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇక్కడ హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్స్ లో పనికానిచ్చేస్తున్నారట.
https://www.telugupost.com/movie-news/vijay-sarkar-movie-collections-96391/
దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సర్కార్' చిత్రం తమిళం తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. నవంబర్ 6న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మురగదాస్ - విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తుంది. తెలుగులో డివైడ్ టాక్ తో నడుస్తున్న ఈసినిమా తమిళనాట మాత్రం బాక్సాఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భారీ గా రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. కేవలం రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసి రికార్డు సృటించిందని టాక్. పైగా నిన్న సెలవు కావడంతో ఈసినిమాకు కలిసొచ్చింది.తెలుగులో డివైడ్ టాక్ వచ్చినప్పటికి ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. సుమారు గా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో ఆ మొత్తాన్ని రాబట్టడం ఖాయం గా కనిపిస్తుంది. రీసెంట్ గా ఈసినిమాను మహేష్ బాబు చూసి టీంకు కంగ్రాట్స్ చెప్పారు
https://www.telugupost.com/crime/tragedy-happened-in-the-cockfight-young-man-died-after-being-stabbed-by-a-knife-during-a-cockfight-1457636
కోడిపందేల్లో విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న కోడిపందేల్లో కత్తి గుచ్చుకుని ఒక యువకుడు మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లాా నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఈ ఘటన జరగింది. పందెం కోడి కత్తి గుచ్చుకుని పద్మారావు అనే యువకుడు మరణించాడు.తోపులాట జరిగి...కోడిపందేల సందర్భంగా తోపులాట జరగడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు బరులు వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. పద్మారావు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కోడిపందేల నిర్వహణ చట్ట విరుద్ధమని తెలిసినా ఎందుకు నిర్వహించారని నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
https://www.telugupost.com/movie-news/atagallu-release-date-82710/
నారా రోహిత్, జ‌గ‌ప‌తి బాబు హీరోలుగా తెర‌కెక్కుతోన్న సినిమా ఆట‌గాళ్లు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 24న విడుద‌ల కానుంది. ప‌రుచూరి ముర‌ళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్ష‌న బానిక్ ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది చిత్ర‌ యూనిట్. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ప‌రుచూరి ముర‌ళి. అందుకే ట్యాగ్ లైన్ కూడా గేమ్ ఆఫ్ లైఫ్ అని పెట్టారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్, ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పందన వ‌చ్చింది. నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబుపై వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిల‌వ‌నున్నట్లు చెబుతున్నారు. సాయికార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విజ‌య్ సి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ ఆట‌గాళ్లు చిత్రానికి మ‌రో మేజ‌ర్ హైలైట్.
https://www.telugupost.com/movie-news/do-you-like-vijay-or-nitin-155700/
విజయ్ దేవరకొండ తో రెండు సినిమాలు, నితిన్ తో ఒక్క సినిమా చేసిన రష్మిక మందన్న కి మీకు విజయ్ అంటే ఇష్టమా? నితిన్ అంటే ఇష్టమా? అని అడిగితె.. మీకు ఎవరంటే ఇష్టం అంటూ తెలివైన సంధానం చెప్పింది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ క్వారంటైన్ గడుపుతున్న రష్మిక సరదాగా… సోషల్ మీడియా లైవ్ చాట్ లో అభిమానులతో ముచ్చటించింది. లాక్ డౌన్ ముగియగానే తాను చేసే మొదటి పని.. వెంటనే వెళ్లి ఫ్రెండ్స్ ని కలవడం అని..ఖాళీ సమయంలో కేకులు, వంటలు తయారు చేస్తుంటా అని చెబుతుంది. ఇక మీకు హిందీ మాట్లాడడం వచ్చా.. అని అడిగితే.. వారికీ హిందీలో సమాధానం చెప్పి సర్ప్రైజ్ చేసింది. ఇక రష్మిక పుష్ప కోసం పాన్ ఇండియా హీరోయిన్ గా మారడంతో ఆమెపై మరింత క్రేజ్ పెరిగింది. అయితే పుష్ప కోసం మీరు విభిన్న యాస నేర్చుకుంటున్నారా అని అడిగితె….అది మీకెలా తెలుసు అంటూ నవ్వేసింది. ఇక హిందీలో నటిస్తారా అనగా… ఆలోచిస్తా అని… తమిళ సినిమా ఎమన్నా చేసారా.. అని అడిగితె.. నటించాను.. కానీ లాక్ డౌన్ ముగిసాక ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చని చెప్పడమే కాదు… నటి కాకపోయి ఉంటే… అనగా జీవితాంతం క్వారంటైన్ లో ఉండేదాన్ని అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది.
https://www.telugupost.com/movie-news/balakrishna-ntr-biopic-2-77927/
మహానటి సినిమా వచ్చాక ఎన్టీఆర్ బయోపిక్ లో కొన్ని మార్పులు జరగనున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలయ్యకు కొన్ని ఐడియాలు ఉండగా అవి ఇప్పుడు మార్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ బయోపిక్ లో బాలయ్య ఒక్కడి గురించే కాకుండా ఇతర నటీనటులు గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మహానటి సినిమాలోని కొంత మంది నటీనటులను ఎన్టీఆర్ బయోపిక్ లో తీసుకోవాలని బాలయ్య.. నిర్మాతలు డిసైడ్ అయ్యినట్టు టాక్.వారి పక్కన బాలయ్య నటిస్తే..?ప్రస్తుతం ఈ బయోపిక్ లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య.. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్టు భావిస్తున్నారు అంతా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎన్టీఆర్ పాత్ర బాలయ్య చేస్తున్నాడు. అంటే కీర్తి సురేష్ కానీ, చైతూ కానీ బాలయ్య పక్కన నటిస్తే అంతగా బాగోదు. ఎందుకంటే బాలయ్యకు ఏజ్, వెయిట్ ఎక్కువ కాబట్టి. మరి యంగ్ ఏజ్ లో ఎన్టీఆర్ పాత్ర ఎవరు పోషిస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బాలయ్య కాకుండా ఇంకెవరైనా చేస్తే దానికి బాలకృష్ణ అంగీకరిస్తాడా? ఒకవేళ అంగీకరించినా ఎంత భాగం మరో నటుడికి అవకాశమిస్తారు? ఇలా ప్రస్తుతం మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.
https://www.telugupost.com/movie-news/భారీ-ప్రాజెక్ట్-కోసం-బాగ-30216/
ఈ మధ్యన మీడియాలో, ఇండియాలోని ఆల్ ఫిలిం ఇండస్ట్రీస్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మహాభారత గురించే చర్చించుకుంటున్నారు. సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మహా భారత మూవీలో పలువురు సూపర్ స్టార్స్ నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. వాసుదేవన్ నాయర్ రచించిన ‘రాందామూజం’ నవల ఆధారంగా శ్రీ కుమార్ మీనన్ ఈ మహాభారత ని తెరకెక్కిస్తున్నాడు. అయితే తెలుగు, తమిళం, కన్నడ, ఆగ్లం, హిందీ, మలయాళం భాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆయా భాషల సూపర్ స్టార్స్ చాలామంది ఈ చిత్రంలో నటిస్తారని.... ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మహాభారత లో భీముని పాత్రకి ఎంపికయ్యాడని అంటున్నారు.అయితే ఈ భీముని పాత్ర కోసం మోహన్ లాల్ కొంతమంది గురువుల వద్ద తాను సుమారు రెండేళ్ళు శిక్షణ పొందుతానని చెబుతున్నాడు. అసలు ఇప్పటివరకు మహాభారత లోని భీముడు బాగా కండలు పెంచి బొద్దుగా కనబడతాడు. అందుకే భీముని పాత్రకు మోహన్ లాల్ ని ఎంపిక చేశారా? అనే డౌట్ వచ్చేసింది జనాలకు. కానీ ఈ నవల కథనం ప్రకారం భీముడు భావోద్వేగాలున్న వ్యక్తి అని అందరూ గుర్తిస్తారని చెబుతున్నారు. వాసుదేవన్ ఈ చిత్రానికి స్వయంగా స్క్రీన్ ప్లే రాశారని అంటున్నారు. ఇక వచ్చే ఏడాది సెట్స్ మీదకెళ్లనున్న మహాభారత చిత్రాన్ని 2020 లో విడుదల డేట్ ప్రకటించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
https://www.telugupost.com/movie-news/మళ్లీ-బంపర్-ఆఫర్-ఇస్తున్-42685/
ఎన్టీఆర్ హోస్టింగ్ లో వస్తున్న బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్స్ అందరిలో హరి తేజ బలమైన కంటెస్టెంట్ లా కనిపిస్తుందని అంటున్నారు. షోలో అల్లరి చేస్తూ అందరిని ఆటపట్టిస్తూ దూసుకుపోతున్న హరితేజ అందరికి టీవీ సీరియల్స్ లో పరిచయమే.... కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ... ఆ' సినిమాలో మాత్రం సూర్య కాంతంలా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో త్రివిక్రమ్ ఇచ్చిన అవకాశాన్ని హరితేజ సద్వినియోగం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోతో హరితేజకు మరిన్ని సినిమా అవకాశాలు రావొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. హరితేజ ఎనర్జీకి బిగ్ బాస్ హోస్ట్ ఎన్టీఆర్ కూడా బాగానే ముచ్చట పడుతున్నాడు.అయితే హరితేజకు ఇప్పుడొక అదిరిపోయే అవకాశం తగిలింది అంటున్నారు. అదేమిటంటే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాలో హరితేజని ఒక కీలక పాత్రకి దర్శకుడు త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి 'అ.. ఆ' సినిమాలో హరితేజ నటనకు, బిగ్ బాస్ షోలో హరితేజ రియాలిటీకి ముగ్దుడైన త్రివిక్రమ్ ఆమెను దృష్టిలో ఉంచుకునే ఒక బలమైన పాత్ర రాసుకున్నట్టుగా చెబుతున్నారు. నిజంగా హరితేజకి త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమాలో బెర్త్ గనక కన్ఫర్మ్ అయితే హరితేజ జాక్ పాట్ కొట్టినట్టే అంటున్నారు.మరి 'అ... ఆ' సినిమాతో త్రివిక్రమ్ ని ఇంప్రెస్స్ చేసిన హరి ఇప్పుడు బిగ్ బాస్ షో తో ఇంప్రెస్స్ చేసి..... మరి వారి కలయికలో రాబోతున్న సినిమాలో నటించి ఇద్దరినీ ఒకేసారి ఇంప్రెస్స్ చెయ్యడానికి రెడీ అవుతుందన్నమాట. ఇక బిగ్ బాస్ షో లో ఆమె చెప్పిన హరికథ స్టయిల్ కి ఫిదా అయిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆమె ఆ షో విన్ అవ్వాలని కోరుకుంటున్నారు.
https://www.telugupost.com/andhra-pradesh/andhra-pradesh-bjp-leader-somu-veerraju-arrest-1350910
కృష్ణాజిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారంపై రాజకీయ వేడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయంపై ఏపీలో రగడ జరుగుతూనే ఉంది. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ సీనియర్ నేతలు గుడివాడ వెళ్తుండగా.. నందమూర వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడ వెళ్లడానికి వీల్లేదని నిలువరించారు. ఈ క్రమంలో.. తాము సంక్రాంతి సంబరాలు ప్రజలకు తెలియజేసేందుకే గుడివాడ వెళ్తున్నామని.. మరో కారణం లేదని సోము వీర్రాజుతో పాటు బీజేపీ నేతలు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారు.Also Read : వివాదంలో సింగర్ సునీత భర్త.. ఏం జరిగింది ?గుడివాడలో 144 సెక్షన్ అమల్లో ఉన్నకారణంగా అనుమతి లేదని తేల్చి చెప్పారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో.. కలువపాముల ప్రాంతంలో సోము వీర్రాజుతో పాటు ఇతర బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. వేడుకలు చేయడానికి వెళ్తుంటే.. అరెస్ట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రవర్తనపై బీజేపీ కార్యకర్తలు నిరసన చేయడంతో.. గుడివాడ పరిసరాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
https://www.telugupost.com/movie-news/mahesh-babu-trivikram-allu-arjun-116549/
అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అధికారిక ప్రకటన వచ్చి ఆరు నెలలైనా ఆ కాంబో ఇంకా పట్టాలెక్కలేదు. బన్నీ – త్రివిక్రమ్ సినిమా మీద రకరకాల వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ మీద నమ్మకం లేక సుకుమార్ వైపు చూస్తున్నాడని.. సుకుమార్ తో ఎప్పుడెప్పుడు సినిమా మొదలెడదామా అన్నట్లుగా బన్నీ చూస్తున్నాడనని అంటున్నారు. ఈలోపు త్రివిక్రమ్.. మహేష్ తో పని చేయబోతున్నాడనే న్యూస్ హైలెట్ అయ్యింది. మహేష్ తో త్రివిక్రమ్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు చేసాడు. మహేష్ తో యాడ్ షూట్ అయితే మహేష్ తో గత కొంతకాలంగా సినిమాలు చెయ్యకపోయినా చాలా యాడ్ షూట్స్ చేస్తున్నాడు. ఆ రకంగా త్రివిక్రమ్ – మహేష్ కలిసే పనిచేస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్, మహేష్ తో సినిమా చెయ్యడం లేదు కానీ ఒక యాడ్ ఫిలింని ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ స్టార్స్ తో కొన్ని క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ డైరెక్ట్ చేశాడు. అయితే ప్రస్తుతం మహేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న ఆ యాడ్ ఒక యాప్‌కి సంబంధించినదని, ఈనెల 10 నుండి ఆ యాడ్ షూటింగ్ జ‌ర‌గ‌బోతోందట. ప్రస్తుతం మహేష్ మ‌హ‌ర్షి షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి ఈ యాడ్ షూట్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.
https://www.telugupost.com/top-stories/comedian-and-director-manobala-passed-away-he-has-been-suffering-from-illness-for-some-time-1474666
ప్రముఖ హాస్యనటుడు, డైరెక్టర్ మనోబాల మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కమెడియన్ గా మనోబాల గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఈ ఏడాది జనవరి నెలలో గుండెకు సంబంధించిన చికిత్స చేయించుకున్నారు. యాంజియో చేయించుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.తమిళ పరిశ్రమలో...అయితే ఆయన ఈరోజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో తమిళ పరిశ్రమ ఒక గొప్ప హాస్యనటుడిని కోల్పోయిందని చిత్ర ప్రముఖులు అనేక మంది పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిది అని కూడా పలువురు వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు.
https://www.telugupost.com/movie-news/మహేష్-అభిమానుల-ని-థ్రిల్-53650/
తన అభిమానుల కు తన సినిమా ద్వారా ఏదొక ట్రీట్ ఇవ్వాలని చూస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమాతో అతడి కెరీర్ లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు మహేష్. ప్రస్తుతం వరస పరాజయాలతో ఉన్న మహేష్ తన అభిమానుల్లో జోష్ నింపేలా ప్రస్తుతం తీస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూస్తున్నాడు.శ్రీమంతుడు సినిమాలో ఓ పాటలో మహేష్ లుంగీలో కనిపించాడు. ఆ లుక్ అభిమానులకు తెగ నచ్చడంతో...అదే తరహాలో ఇప్పుడు తీస్తున్న భరత్ అనే నేనులో ఫ్యాన్స్ కోసం అచ్చ తెలుగు పంచెకట్టుతో ఓ పాట తీయాలని డైరెక్టర్ కొరటాల శివ ఆలోచన చేస్తున్నాడట. అంతకు ముందు పోకిరి, శ్రీమంతుడు సినిమాల్లో లుంగీలో కనపడ్డాడు మహేష్. తొలి సారిగా పంచెకట్టుతో కనపడనున్నాడు ‘భరత్ అనే నేను’ సినిమాలో.అయితే ఈ ప్రపోజల్ గూర్చి కొరటాల శివకు ఫిలిం మేకర్లకు తప్ప ఎవరికి తెలీదని సినిమా యూనిట్ సభ్యుడొకరు తెలిపారు. ఇక భరత్ అనే నేను సినిమాలో మహేష్ కెరీర్ లో మొదటి సారి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలిసిన విషయమే. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతుంది.
https://www.telugupost.com/movie-news/ysr-biopic-yatra-movie-108616/
సినిమా పై అంచనాలు ఉంటె మంచిదే. కానీ అది కొన్నికొన్ని సార్లే. సినిమాపై మరీ అంచనాలు ఎక్కువ అయిపోతే సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశముంది. సినిమాలో ఎక్కడో కొంచం తేడా కొట్టిన ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుంది. కొన్నిసార్లు ఎక్సపెక్టషన్స్ లేకుండా వచ్చిన సినిమాలు సక్సెస్ అయినా దాఖలు కూడా ఉన్నాయి. మహానటి అదే కోవకి చెందింది. ఈసినిమా వచ్చేవరకు పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కానీ సినిమా వచ్చాక సినిమా చూసి ఔరా అనుకున్నారు. ఇక సంక్రాంతికి రిలీజ్ అయినా ఎన్టీఆర్ కథానాయకుడు పై ముందు నుండే బారి అంచనాలు ఉన్నాయి. సినిమాలో విషయం లేకపోవడంతో ఎమోష‌న్లు వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం చేటు చేసింది. మరి మహానాయకుడు పరిస్థితి ఏంటో చూడాలి. ఈసినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు అయితే లేవు. ఇక టాలీవుడ్ లో మరో బయోపిక్ రానుంది. అదే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద తీసిన “యాత్ర‌”. ఈసినిమా పై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే వైఎస్ ఏమీ సినిమా వాడు కాదు కాబ‌ట్టి.. గ్లామ‌ర్ ట‌చ్ మిస్స‌యింది.అందులోనూ ఇది ప్ర‌ధానంగా వైఎస్ పాద‌యాత్ర నేప‌థ్యంలో సాగే చిత్రం. దాంతో ఈసినిమాపై అంతగా బజ్ లేదు. అయితే డైరెక్టర్ మ‌హి.వి.రాఘ‌వ్ ఒక క‌న్విక్షన్‌తో ఈ సినిమా తీశాడు. ఇది వైఎస్ సినిమాగా కాకుండా మామూలుగా చూసినా ఇది న‌చ్చే సినిమా అంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మ‌మ్ముట్టి నటించారు.
https://www.telugupost.com/AndhraPradesh-Assembly-Elections/tdp-has-created-history-in-this-election-this-time-it-has-seen-victories-that-were-not-achieved-in-united-andhra-1538735
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో హిస్టరీని క్రియేట్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ సాధించని విజయాలను ఈసారి చవి చూసింది. జనం ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ఒక్కటై సైకిల్ కు జై కొట్టారు. ఎస్సీ నియోజకవర్గాల్లో సహజంగా తొలి నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి పట్టు ఉంది. అయితే ఇప్పుడు ఆ చరిత్రను టీడీపీ తిరగరాశారు. ఒకటంటూ ఏమీ లేదు. అసలు అభ్యర్థులను చూడలేదు. ఒకే ఒక లక్ష్యం. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జనం బటన్ నొక్కారని రిజల్ట్ ను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతటి ఘన విజయాన్ని చంద్రబాబు పార్టీ పగ్గాలుచేపట్టిన తర్వాత ఎప్పుడూ సాధించలేదు.గతంలో ఏనాడూ...చంద్రబాబు అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నారు కూటములను ఏర్పాటుచేశారు. అయితే అప్పుడు కూడా ఈ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అంతటి విజయం వస్తుందని బహుశ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. ప్రభుత్వంపై చాపకిందనీరులా ఇంతటి వ్యతిరేకత ఉందని ఫలితాల తర్వాతనే అర్థమయిందని చెప్పాలి. విశ్లేషకులకు సయితం అర్థం కాకుండా జనం నాడి ఉందని ఈ రిజల్ట్ తేల్చి చెప్పాయి. ఇది పాలకులకు ఒక గుణపాఠం అని చెప్పాలి. ఎందుకంటే సహజంగా ఓటమి పాలయితే తక్కువ మెజారిటీతో ఓటమి పాలు కావడం, తక్కువ ఓట్లతోతృటిలో అధికారాన్నికోల్పోవడాన్ని చూశాం. కానీ ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులందరికీ దాదాపు వేల మెజారిటీలు. గతంలో ఎన్నడూ రానంత మెజారిటీలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ...వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పట్టు ఉందని భావించారు. అర్బన్ ప్రాంతాల్లో తొలి నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించినా రూరల్ ఏరియాలో అస్సలు కనిపించలేదు. దీంతో రూరల్ లో పట్టు తమకే ఉందన్న అభిప్రాయం దాదాపు అందరిలోనూ ఉంది. అయితే ఈ ఫలితాలతో పటాపంచలయింది. రూరల్ లేదు.. పట్టణం లేదు... అంతా ఏకమైంది... ఒకే మాట.. అందరూ కలసి మాట్లాడుకున్నట్లు ఓటేసినట్లే అనిపిస్తుంది. ఇంత భారీ స్థాయిలో ఓటమిని జగన్ కూడా ఊహించి ఉండడు. చంద్రబాబు మీద నమ్మకం అయి ఉండవచ్చు. లేకుంటే జగన్ పాలన పై విసుగు పుట్టి ఉండవచ్చు. అందరూ కూడబలుక్కుని బటన్ నొక్కినట్లే ఓటింగ్ జరిగిందని ఈ రిజల్ట్ స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.
https://www.telugupost.com/movie-news/telugu-movie-collections-in-may-june-124242/
మే నెలలో ఒకే ఒక్క పెద్ద సినిమా బాక్సాఫీసు వద్దకు వచ్చింది. మే 9 న మహేష్ బాబు మహర్షి సినిమా విడుదలైంది. కానీ ఆ సినిమాకి యావరేజ్ టాకొచ్చినా.. చిత్ర బృందం మాత్రం సూపర్ హిట్ అంటూ వాయించేశారు. ఇక తర్వాతి వారంలో వచ్చిన అల్లు శిరీష్ ఏబీసీడీ, ఆ తర్వాత వచ్చిన సీత లాంటి సినిమాలతో ప్రేక్షకులకు పిచ్చెక్కింది. వేసవి సెలవలన్నీ చాలా చప్పగా చాల డ్రై గా ముగిసిపోయాయి. మరో వారంలో స్కూల్స్ రీ ఓపెన్ కూడా అవుతున్నాయి ఇక ఈవారం విడుదలైన 7, హిప్పీ సినిమాలు అయితే ప్రేక్షకుల తలకు బొప్పి కట్టించాయి. అసలు వేసవి సెలవలు అంటే గనక భారీ బడ్జెట్ సినిమాల హంగామా మమూలుగా ఉండదు. కానీ ఈవేసవి లో మహర్షి తప్ప భారీ బడ్జెట్ మూవీ ఒక్కటి లేదు. ఏదో తమిళం నుండి సూర్య ఎన్జీకే మంచి అంచనాలతో విడుదలయింది. అది కూడా ప్లాప్ అయ్యింది. ఇక ఈ నెల లో కూడా పెద్ద సినిమాలేమి కనిపించడం లేదు. జూన్ మొదటి వారంలో హిప్పీ, 7 విడుదలైతే.. తర్వాత కూడా చిన్న సినిమాల హడావిడే ఉంది. అందులో మల్లేశం, గేమ్ ఓవర్, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, విశ్వామిత్ర, కిల్లర్, వజ్రకవచదర గోవింద లాంటి ఓ ఏడెనిమిది సినిమాలు ఈ జూన్ లోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాలంటే కేవలం సాహో, సై ర సినిమాలే కనబడుతున్నాయి. ఆ సినిమాల విడుదలకు ఇంకా రెండు నెలల టైం ఉంది. ఈలోపు చిన్న సినిమాల హడావిడే బాక్సాఫీసు వద్ద కనబడుతుంది. ఏది ఏమైనా మే తో పాటుగా జూన్ కూడా ప్రేక్షకులకు పెద్దగా ఆశాజనకంగా కనిపించడం లేదు.
https://www.telugupost.com/movie-news/rrr-forth-song-coming-out-from-december-4th-1345138
భారీ అంచనాల జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు టీజర్లు రాగా.. మూడు పాటలను విడుదల చేశారు మేకర్స్. దోస్తీ, నాటు నాటు పాటలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ లు ట్విట్టర్ వేదికగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. కొమురం భీముడో.. కొమురం భీముడో అంటూ సాగే ఈ పాటను సింగర్ కాలభైరవ ఆలపించగా.. ఇదొక ఎమోషనల్ సాంగ్ అని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎమోషనల్ ట్రాక్ మీద వచ్చే పాట ఇదేనని, ఈ పాట మీ అందరికీ చాలా కాలం గుర్తుండిపోతుందని తారక్, చరణ్ లు తెలిపారు. డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారు మేకర్స్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ తో తెరకెక్కుతోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం దర్శకుడితో పాటు కథానాయకులిద్దరూ ఎంత కష్టపడ్డారో టీజర్లలోనే చూపించారు రాజమౌళి.
https://www.telugupost.com/movie-news/ఈ-టూర్-వెనుక-అసలు-కారణమేమ-36194/
మెగాస్టార్ చిరంజీవి తన 151 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా మొదలు కావడానికి కాస్త టైం పట్టేలా వుంది. అందుకే మెగాస్టార్ ఇపుడు ఒక ప్లాన్ చేస్తున్నాడట . ఇటీవలే మెగాస్టార్‌ చైనా వెళ్లి వచ్చాడు. నాటి 1980నాటి సౌతిండియన్‌ సినీనటుల కలయిక సెలబ్రేషన్స్‌ కోసమే ఆయన తన సతీమణి సురేఖతో ఆ వేడుకకు హాజరయ్యారు. దాంతోనే ఆయన దాసరి మరణవార్తను విన్నప్పటికీ కడచూపు చూసేందుకు రాలేదు. మళ్ళీ ఇపుడు ఆయన హఠాత్తుగా ఫ్యామిలీ టూర్‌ వేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ అమెరికా టూర్‌ ఎందు కోసమో ఏమో తెలియదు కానీ ఆయన వెంట భార్య సురేఖతో పాటు అల్లుఅరవింద్‌ ఫ్యామిలీ కూడా కలిసి వెళ్తోంది. ఈ ట్రిప్‌లోప్రత్యేకతఏమీ లేదని, సాధారణంగా జరిగే ట్రిప్పేనంటున్నారు. అదే సమయంలో ఉయ్యాలవాడలో తన మేకోవర్‌ విషయంలో పలువురు హాలీవుడ్‌ సాంకేతికనిపుణుల నుంచి సలహ తీసుకుంటారని అంటున్నప్పటికీ ఇది కేవలం జాలీ ట్రిప్పే అని తెలుస్తోంది.
https://www.telugupost.com/movie-news/మళ్ళీ-వీరో-కాంబోలో-మూవీన-41741/
బాలకృష్ణ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ సెట్స్ మీదకెళ్లే వరకు వారి కాంబోలో సినిమా వస్తుంది అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ వారి కాంబోలో సినిమా సెట్స్ మీదకెళ్ళడం... ఆ సినిమా రికార్డు స్థాయిలో పూర్తి కావడం.... విడుదలకు సిద్దమవడం జరిగిపోయాయి. ఇక వీరి కాంబోలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం వచ్చే శుక్రవారమే విడుదలకానుంది. వీరి కాంబినేషన్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. స్టంపర్, ట్రైలర్ తోనే బాలయ్య ఎనర్జీ పీక్స్ లో చూపించిన పూరి ప్రోమో సాంగ్స్ లో కూడా బాలయ్య డాన్స్ స్టెప్స్ ని చూపించేసాడు.ఇక వీరి కాంబోలో సినిమా సెట్స్ మీదున్నప్పుడే బాలయ్య అంటే అభిమానమని ఆయనతో సినిమా చెయ్యడం అదృష్టమని పూరి చెప్పేవాడు. ఇక పూరి మార్క్ డైలాగ్స్ ఎలా ఉంటాయో 'పైసా వసూల్' లో చూడమని బాలయ్య కూడా చెబుతున్నాడు. ఇంకా ఈ సినిమా విడుదల కాకముందే వీరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. 'పైసా వసూల్' షూటింగ్ లోనే పూరి... బాలయ్యకి ఒక కథ వినిపించాడని... కథ విన్న బాలయ్య కూడా ఆ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడనే టాక్ నడుస్తుంది.ఇక ఇప్పుడు పూరి, బాలయ్యని 'పైసా వసూల్' లో గ్యాంగ్ స్టర్ గా చూపెడుతుండగా... మళ్ళీ వీరి కాంబో లో రిపీట్ అయ్యే మూవీని మాత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తాడని అంటున్నారు. మరి మళ్ళీ వీరి కాంబో రిపీట్ అవ్వాలంటే ముందు 'పైసా వసూల్' విడుదలయ్యి ఆ సినిమా హిట్టవ్వాలిగా అంటున్నారు. నిజంగానే 'పైసా వసూల్' ఫలితం మీదే పూరి - బాలయ్య ల మరో సినిమా ఆధారపడివుంది. ఇక బాలయ్య తాజాగా కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో 102 వ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేసి సెట్స్ మీదకెళ్ళిపోయాడు.
https://www.telugupost.com/movie-news/no-more-item-songs-183359/
హాట్ యాంకర్ అనసూయ అందాలు కేవలం జబర్దస్త్ లోనే కాదు వెండితెర మీద వెలిగిపోతున్నాయి. అటు ఐటెం సాంగ్స్, ఇటు కీ రోల్స్ అబ్బో అనసూయ వెండితెర వెలుగులు మాములుగా లేవు. రవితేజ ఖిలాడీ సినిమాలో కీలక పాత్ర అంటే రవితేజతో ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న అనసూయ రీసెంట్ మూవీ థాంక్యూ బ్రదర్ విడుదలకు సిద్దమవుతుంది. ఇక అనసూయ గతంలో సాయి ధరమ్ తేజ్ విన్నర్ మూవీలో సూయా సూయ అనసూయ అనే సాంగ్ లో క్లాసీ స్టెప్స్ వేస్తే.. ఇప్పుడు కార్తికేయ చావు కబురు చల్లగా సినిమాలో మాస్ ఐటెం స్టెప్స్ తో అవసరమని వేడుకుంటారు. అవసరానికి వాడుకుంటారు అంటూ అదరగొట్టబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఐటెం సాంగ్ స్టిల్స్ లో అనసూయ లుక్ మాస్ కాదు ఊర మాస్ లా కనిపిస్తుంది. అయితే అనసూయ ఇలా ఐటెం సాంగ్స్ చేస్తుంది కదా అని మరికొంతమంది ఈ హాట్ యాంకర్ అనసూయని సంప్రదించగా.. నేను ఇకపై ఐటెం సాంగ్స్ చెయ్యను. చావు కబురు చల్లగా సినిమానే లాస్ట్ ఐటెం సాంగ్. అది కూడా నా ఫ్రెండ్ జానీ మాస్టర్ అడిగాడని చేస్తున్నా.. అంటూ చావుకబురుని చల్లగా చెప్పేసరికి అనసూయ అభిమానులు హార్ట్ అవుతున్నారు. అనసూయ గ్లామరస్ గా ఊర మాస్ స్టెప్స్ తో స్క్రీన్ మీద కనిపిస్తుంటే చూడాలనుకుంటున్న యూత్ కి అనసూయ సమాధానం షాకిచ్చింది. మరి జానీ మాస్టర్ తో గతంలోనూ అనసూయ స్పెషల్ షోస్ లో స్టేజ్ మీద ఆదిరిపోయే స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి జానీ మాస్టర్ ఆధ్వర్యంలో చావుకబురు చల్లగా లో మాస్ స్టెప్స్ తో ఇరగదియ్యబోతుంది కానీ.. ఇకపై ఐటెం సాంగ్స్ చెయ్యను అనడమే ఫాన్స్ ని కలవరపెడుతుంది.
https://www.telugupost.com/crime/key-development-has-taken-place-in-the-delhi-liquor-scam-amit-arora-has-been-arrested-by-the-enforcement-directorate-1450491
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాంలో మద్యం వ్యాపార వేత్త అమిత్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ముఖ్య అనుచరుడిగా గుర్తించారు. అర్ధరాత్రి అమిత్ అరోరాను ఈడీ అధికారులు పోలీసులు అరెస్ట్ చేశారు.మనీష్ సిసోడియాకు...ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెంచింది. ఇప్పటికి ఈ స్కాంలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లయింది. ఈ కేసులో మరికొందరిని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఎవరిని అధికారులు ఈ స్కాంలో అరెస్ట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
https://www.telugupost.com/movie-news/ntr-attending-big-boss-finale-89495/
నిన్నమొన్నటివరకు బిగ్ బాస్ సీజన్ టు నాని హోస్టింగ్ పై, హౌస్ కంటెస్టెంట్స్ పై పెద్దగా జనాలలో ఆసక్తి లేకుండా పోయింది. బిగ్ బాస్ సీజన్ వన్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా హిట్ అయిన బిగ్ బాస్ షో.. నాని రాకతో కాస్త డల్ అయ్యింది. మొదటి సీజన్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిన ఎన్టీఆర్ రెండో సీజన్ కి డేట్స్ సర్దుబాటు లేవంటూ బిగ్ బాస్ టీం కి హ్యాండిచ్చాడు. నిన్నమొన్నటివరకు బిగ్ బాస్ సీజన్ టు పై పెద్దగా ఆసక్తి లేదుకానీ.. ఇపుడు బయట కౌశల్ ఆర్మీ పేరిట జరుగుతున్నా 2 కే రన్ లు, ర్యాలీలు హంగామా సృష్టిస్తుంటే... లోపల అదేనండి బిగ్ బాస్ హౌస్ లో ధర్నా జరుగుతుంది. హౌస్ లోని సభ్యులంతా కౌశల్ ని టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ కూడా కౌశల్ ని బ్యాడ్ చేసే ప్రయత్నాలేవో మొదలెట్టినట్టుగా టాక్ ఉండనే ఉంది.ప్రస్తుతం 101 రోజులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మరో పది రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది. అయితే సీజన్ వన్ గ్రాండ్ ఫినాలే ని ఎన్టీఆర్ ఎంతో చక్కగా అందరూ ఆకట్టుకునేలా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈసారి నాని స్టామినా చాలదని స్టార్ మా యాజమాన్యం నాని కి తోడుగా బిగ్ బాస్ సీజన్ టు కి స్పెషల్ గెస్ట్ గా ఒకరిని తీసుకురాబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే మొదట్లో ఎన్టీఆర్ పేరు వినబడినప్పటికీ... ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్, హరికృష్ణ మరణంతో కుంగిపోవడంతో.. బిగ్ బాస్ గ్రాండ్ ఫైనలేకి రాడని అన్నారు. ఈ లోపు నాగార్జున పేరు తెర మీదకి రావడం జరిగింది. నాని, నాగార్జున కలిసి దేవదాస్ ని ప్రమోట్ చేస్తూ గ్రాండ్ ఫినాలేని పూర్తి చేస్తారని, నాగార్జున కి స్టార్ మా కి ఉన్న అనుబంధంతో నాగ్ ఫైనల్ ఈవెంట్ కి వస్తున్నాడన్నారు.కానీ తాజాగా మళ్ళీ ఎన్టీఆర్ ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి హాజరవుతున్నాడని.. బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రేక్షకులను, మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్ ని ఎంటర్టైన్ చేస్తూ.. ఫైనల్ విన్నర్ ని ఎన్టీఆర్ ప్రకటిస్తాడంటూ.. లేటెస్ట్ గా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినబడుతుంది. మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి హాజరవుతాడని వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియదు గాని... నిన్నటినుండి సోషల్, వెబ్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ బిగ్ బాస్ కి వచ్చే విషయమై వచ్చిన వార్తలు నిజమే అని... అధికారిక ప్రకటన రావడమే తరువాయంటున్నారు కొంతమంది. ఏది ఏమైనా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి ఎన్టీఆర్ గనక హాజరయితే.. స్టార్ మా టీఆర్పీ రేటింగ్ ఒక రేంజ్ లో పెరగడం ఖాయం.
https://www.telugupost.com/movie-news/బాలయ్య-స్టామినాకు-తగ్గ-స-59647/
పోయిన ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల మధ్య ఎంత పోటీ ఉందొ.... అదేవిధంగా ఈ సంక్రాంతికి కూడా కచ్చితంగా పోటీ ఉంటుంది అనుకున్నారు అంత. కానీ అజ్ఞాతవాసి డిజాస్టర్ వల్ల ఈ పోటీ చప్పపడిపోయింది. విడుదల ఐన మూడు స్ట్రెయిట్ సినిమాలో బాలయ్య సినిమా జై సింహ పర్లేదు అనిపించుకుంది.ఈ జైసింహ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయిపోయింది. ఇప్పటి దాకా 35.86 కోట్ల షేర్ తో సేఫ్ అనిపించాడు బాలయ్య. ఈ సినిమా బిజినెస్ ప్రకారం సుమారు 28 కోట్లకు అమ్ముడైంది. 8 కోట్ల లాభంతో మరోసారి బాలయ్య సెంటిమెంట్ వర్క్ అవుట్ అయింది.కానీ ఇది బాలయ్య స్టామినాకి తగ్గ సినిమా కాదు. ఎందుకంటె గత ఏడాది గౌతమిపుత్ర శాతకర్ణి 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించి కొత్త రికార్డు సెట్ చేసింది. కానీ జై సింహ మాత్రం 36 కోట్ల మాత్రమే వసూల్ చేసింది. విన్నర్ అని చెప్పుకుంటున్న బాలయ్య స్టామినాకు తగ్గ సక్సెస్ మాత్రం జైసింహ ఇవ్వలేదు.
https://www.telugupost.com/movie-news/tamannah-bhatia-comments-on-lip-lock-scenes-150489/
హీరోయిన్స్ గా 15 ఏళ్ళు ఘంటాపధంగా ఛాన్స్ లు చేజిక్కించుకుంటూ.. ఇప్పటికి హీరోయిన్ గా బిజీగా వున్నా తమన్నా మీద ఈమధ్యన పెళ్లి రూమర్స్ చాలానే వచ్చాయి. తమన్నా కి ఆఫర్స్ తగ్గాయి, కెరీర్ లో చూడాల్సిన ఎత్తుపల్లాలు చూసేసింది.. ఇక త్వరలోనే తమన్నా పెళ్ళికి సిద్దమంటూ వార్తలొచ్చాయి. కానీ తమన్నా మాత్రం పెళ్లి విషయం ఎత్తగానే సిగ్గుపడకుండా.. తానిప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పింది. ఇంకా సినిమాలు చెయ్యాలి అంటున్న తమన్నాని ఓ మీడియా ప్రతినిధి మీరు గనక పెళ్లి కోసం స్వయంవరంలో పాల్గొంటే ఆ స్వయం వారానికి ఏ హీరోలు రావాలనుకుంటారో అందులో ముగ్గురు పేర్లు చెప్పమనగానే తమన్నా టక్కున బాహుబలి ప్రభాస్, బాలీవుడ్ నటులు హ్రితిక్ రోషన్, విక్కీ కౌశల్ పేర్లు చెప్పేసింది. మరి బాహుబలి ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పకనే చెప్పిన తమన్నా తనకు ముద్దు సీన్ లో నటించాలంటే అది కేవలం ఒక్క హీరో సినిమాలోనే అది.. కూడా హ్రితిక్ రోషన్ సినిమాలో అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఒక్క ముద్దు సీన్ లో కూడా తమన్నా నటించలేదట. సినిమా కథ విన్నప్పుడే డైరెక్టర్ కి తమన్నా తన కండిషన్స్ వినిపిస్తుందట. హాట్ గా కనబడమంటే ఓకె కానీ.. ముద్దు సీన్స్ కి నై అంటుందట. ఇక కేవలం ఆ ముద్దు సీన్స్ ని హ్రితిక్ రోషన్ సినిమా కోసం తన నియమాన్ని ఉల్లంగిస్తా అని… హ్రితిక్ రోషన్ అనగానే ముద్దు సీన్స్ కి కూడా సై అంటా అంటుంది తమన్నా
https://www.telugupost.com/movie-news/koratala-naveen-polisetty-171527/
అదేమిటి చిరంజీవి ఆచార్య ని కొరటాల తేరకెక్కిస్తున్నాడు. తర్వాత అల్లు అర్జున్ మూవీకి కమిట్ అయ్యి ప్రకటన కూడా ఇచ్చేసాడు. మధ్యలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ హీరో నవీన్ పోలిశెట్టి కొరటాలతో సినిమా ఏమిటి అనే కన్ఫ్యూషన్ లో ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ అటు నిర్మాతగానూ, ఇటు దర్శకుడిగానూ సినిమాలు చేస్తున్నాడు. చిరు తో ఆచార్య సినిమా తో పాటుగా కొత్త కథలను సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఆ కథలతో సినిమాలు చెయ్యడానికి కాదు.. ఓటిటి వాళ్ళకి కొరటాల వెబ్ సీరీస్ చెయ్యడానికి. అదిగో అందుకే శ్రీనివాస్ ఆత్రేయ అదేనండి నవీన్ పోలిశెట్టి తో కొరటాల వెబ్ సీరీస్ ప్లాన్ చేసాడు. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ తో డీల్ మాట్లాడిన కొరటాల శివ.. నవీన్ పోలిశెట్టితో వెబ్ సీరీస్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ వెబ్ సీరీస్ కి కొరటాల శివ శిష్యుడు దర్శకత్వం వహిస్తాడని.. కొరటాల కేవలం కథ, ఇటు నిర్మాతగానూ కొనసాగుతాడు.. అయితే వెబ్ సీరీస్ డైరెక్షన్ కూడా కొరటాల శివ కనుసన్నల్లోనే జరగబోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో అదరగొట్టిన నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమాని పూర్తి చేసాడు. ఇక కొరటాల నవీన్ అయితే తన వెబ్ సీరీస్ కి పర్ఫెక్ట్ అని నవీన్ పోలిశెట్టితో మాట్లాడి ఓకే చేసాడని అంటున్నారు. నవీన్ కూడా కొరటాల కథకి ఇంప్రెస్స్ అయ్యి ఈ వెబ్ సీరీస్ కి ఒప్పేసుకున్నాడనే టాక్ నడుస్తుంది.
https://www.telugupost.com/crime/fire-accident-in-hyderabads-gandhi-nagar-1450884
హైదరాబాద్ లోని గాంధీనగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జబ్బార్ కాంప్లెక్స్ పక్కనున్న అసెంబుల్ వాటర్ ఫిల్టర్ దుకాణంలో గత అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని.. రెండుగంటల పాటు శ్రమించిన మంటలను ఆర్పివేశారు. కాగా.. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/vikram-movies-89926/
తన కెరీర్ స్టార్టింగ్ లో తెలుగులో సక్సెస్ రాకపోవడంతో తమిళనాట వెళ్లి అక్కడ వైవిధ్యభరిత చిత్రాలు చేసి స్టార్‌ అయ్యాడు విక్రమ్. 'శివపుత్రుడు', 'అపరిచితుడు' వంటి చిత్రాలతో తన టాలెంట్ ని బయట పెట్టిన అది అతనికి ఏమి సక్సెస్ ఇవ్వలేకపోతుంది. ఏమైందో ఏమో 'అపరిచితుడు' తర్వాత ఇప్పటివరకు విక్రమ్ ఒక హిట్ సినిమా కూడా లేదు. 'అపరిచితుడు' వచ్చి పదమూడేళ్ళ అవుతున్న సరయిన హిట్‌ లేదు.శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఐ' కూడా విక్రమ్ కు సక్సెస్ ఇవ్వలేకపోయింది. మధ్యలో వచ్చిన 'నానా' తో పర్లేదు అనిపించుకున్నాడు తప్ప సక్సెస్ అయితే అందుకోలేకపోయారు. రీసెంట్ గా వచ్చిన 'స్కెచ్‌' కూడా నిరాశకు గురిచేసింది. ఇక మొన్న శుక్రవారం రోజు విడుదలైన 'సామి స్క్వేర్‌' కూడా డిజాస్టర్ గా నిలవడంతో విక్రమ్ ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు. అంతేకాకుండా యాభై రెండేళ్ల వయసులో విక్రమ్‌ మునుపటి గ్లామర్‌ కూడా కోల్పోయాడు. ఈసినిమాలో కీర్తి సురేష్ పక్కన చాలా పెద్దవాడిలా అనిపించాడు. వయసు మళ్లిన వాడిలా కనిపించాడు. మరి ఎందుకని విక్రమ్ ఇన్ని ఏళ్ళు అవుతున్న సరైన సక్సెస్ ని అందుకోలేక పోతున్నాడో అర్ధం కావట్లేదు. మరోపక్క విక్రమ్ కొడుకు ధ్రువ సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. మరి గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో చేస్తోన్న 'ధృవ నచ్చిత్రమ్‌' చిత్రంతో ఐన విక్రమ్ కు హిట్ వస్తుందేమో చూడాలి
https://www.telugupost.com/movie-news/ravi-teja-cut-his-remuneration-after-failures-150969/
వరస ప్లాప్స్ పలకరిస్తున్నా.. పారితోషకం మాత్రం తగ్గనని భీష్మించుకుని కూర్చుని.. వరస అవకాశాలు కోల్పోతున్న రవితేజ ఎట్టకేలకు లైన్ లో కొచ్చినట్టే అనిపిస్తుంది. ఇంతకుముందు పైసా కూడా తగ్గనని నిర్మాతల కు మొహమాటం లేకుండా చెప్పే రవితేజ ఇప్పుడు నిర్మాతలు ఎలా చెబితే అలా అంటూ తల ఊపుతున్నాడట. ఎందుకంటే వరసగా నాలుగు డిజాస్టర్స్ పడే సరికి తలకెక్కిన దెయ్యం దిగింది ఈ హీరోగారికి. లేదంటే ఒక్క పైసా తక్కువైనా సినిమా చెయ్యనని చెప్పేవాడు. ఇప్పడు రవితేజ తో సినిమా అంటే దర్శకనిర్మాతలెవరు ఆసక్తి చూపడం లేదు. అందుకే రవితేజ తన పద్దతిని మార్చుకున్నాడు. భారీ పారితోషకం అంటే కెరీర్ ముగించేయ్యాలని భయపడిన రవితేజ ఇప్పుడొక నిర్ణయానికి వచ్చాడట. అది పారితోషకం లేకుండా లాభాల్లో వాటా తీసుకోవాలని రవితేజ నిర్ణయించుకోవడమే కాదు… ఇప్పటికే రవితేజ మేనేజర్ నిర్మాతలకు ఈ కబురు చేరవేస్తున్నాడట. దానితో దర్శకుల్తో పాటు వచ్చి నిర్మాతలు రవితేజ ని కలుస్తున్నారట. ఎలాగూ రవితేజ ఓ మెట్టు దిగి సినిమా లాభాల్లో వాటాకు సిద్దమయ్యాడు కాబట్టి.. సినిమా ఖర్చు విషయంలోనూ రవితేజ కాస్త జాగ్రత్తగా ఉంటాడు. అందుకే నిర్మాతలు కూడా ధైర్యంగా రవితేజ తో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పాపం నిర్మాతలు వెనక్కి తగ్గేసరికి దర్శకులు కూడా రవితేజతో సినిమా అంటే సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. లేదంటే ఈపాటికి రవితేజ రెండు మూడు లైన్ లోపెట్టేవాడు
https://www.telugupost.com/movie-news/ఇలా-అయితే-వేషాలు-వస్తాయా-59007/
నిన్న బుధవారం నుండి హీరోయిన్స్ చాలామంది హాట్ హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. నిన్నటికి నిన్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కోసం అన్ని విప్పేసి బికినీ వంటి చిన్న బట్టలతో కవర్ పేజ్ మీద రచ్చ చేసిన విషయం మరువక ముందే ఇప్పుడు జూలీ 2 తో బాలీవుడ్ లో బోల్తాపడిన లక్ష్మి రాయ్ బీచ్ ఒడ్డున బికినీతో రచ్చ మొదలెట్టింది. ప్రస్తుతానికి కోలీవడ్, బాలీవుడ్ , టాలీవుడ్ లలో ఎటువంటి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న లక్ష్మి రాయ్ ఇలా వెకేషన్స్ అంటూ బీచ్ లో నానా హడావిడి చేస్తుంది.బాలీవుడ్ లో తాజాగా విడుదలైన జూలీ 2 సినిమా ఘోరమైన ప్లాప్ తర్వాత కూడా లక్ష్మి రాయ్ అందాల ఆరబోతకు అడ్డుకట్టవెయ్యలేదు. ఎప్పటికప్పుడు అందమైన, గ్లామరస్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అవకాశాల కోసం కాచుకుని కూర్చుంది. ఇప్పుడు తాజాగా లక్ష్మి రాయ్ సెక్సీ లుక్ తో బీచ్ లో బికినీ వేసుకుని పడుకుని రెచ్చగొడుతూ మతులుపోగొడుతుంది. ఇలా బికినీ షో చేస్తేనే సినిమా అవకాశాలు వస్తాయని చాలామంది హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు. అందులోనూ బాలీవుడ్ లోకి అడుగెట్టగానే అంద చందాలను మరి అలా గాలికొదిలేస్తున్నారు.జూలీ 2 లో ఎంతో గ్లామర్ గా బికినీ షో చేసిన లక్ష్మి రాయ్ కి ఆ సినిమా హిట్ అయితే దున్నేసేదే. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో అమ్మడు మళ్ళీ ఇలా సోషల్ మీడియా ని తగులుకుంది. సోషల్ మీడియాలో రకరకాల బికినీ ఫొటోస్ తోపాటు... హాట్ అందాల ఫోటో షూట్స్ ని పోస్ట్ చేస్తూ బిజీగా ఉన్న పాపకి కాస్త ఎవరైనా పిలిచి అవకాశం ఇవ్వండయ్యా. లేదంటే అవకాశాల కోసం ఇంకేం చూపిస్తోందో అంటూ తెగ సెటైర్స్ వేస్తున్నారు నెటిజెన్లు.
https://www.telugupost.com/movie-news/ravi-teja-krack-restarted-171423/
‘క్రాక్’ చిత్రంలో “స్టేష‌న్‌లో ఉన్న‌ప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి దొబ్బిచ్చుకో” అంటున్న ర‌వితేజ‌ మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ఇదివ‌ర‌కు ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ‘డాన్ శీను’, ‘బ‌లుపు’ సినిమాలు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి హిట్ట‌య్యాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్‌పై క‌న్నేశారు. ‘క్రాక్’ షూటింగ్ గ‌త వారం రామోజీ ఫిల్మ్ సిటీలో పునఃప్రారంభ‌మైంది. ర‌వితేజ, ఇత‌ర న‌టీన‌టుల‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్త‌వుతుంది. సోమ‌వారం ‘క్రాక్’ షూటింగ్‌కు సంబంధించిన ఒక వ‌ర్కింగ్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇందులో షూటింగ్ సెట్ మొత్తాన్ని ప్రాప‌ర్‌గా శానిటైజ్ చేయ‌డం, ఎంట్ర‌న్స్‌లో డిజిన్‌ఫెక్టెంట్ ట‌న్నెల్‌ను ఏర్పాటు చేయ‌డం మ‌నం చూడొచ్చు. ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని స‌హా సెట్‌లో ఉన్న ప్ర‌తి యూనిట్ మెంబ‌ర్ మాస్క్ ధ‌రించి క‌నిపిస్తున్నారు. కెమెరా ముందుకు వ‌చ్చి న‌టిస్తున్న‌ప్పుడు మాత్ర‌మే యాక్ట‌ర్లు మాస్క్‌లు తీసేస్తున్నారు. “స్టేష‌న్‌లో ఉన్న‌ప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి దొబ్బిచ్చుకో” అని తోటి పోలీస్‌తో ర‌వితేజ గ‌ట్టిగా చెబుతున్న లేటెస్ట్ డైలాగ్ సీన్ ఒక‌దాన్ని ఈ వీడియోలో మ‌నం చూడొచ్చు. ఆ డైలాగ్‌తో ర‌వితేజ క్యారెక్ట‌రైజేష‌న్ ఏ రీతిలో ఉంటుందో చిత్ర బృందం మ‌న‌కు హింట్ ఇస్తోంది. అలాగే త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ క‌థ‌లోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసే రీతిలో ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు, మాస్ ఎలిమెంట్స్‌తో క‌నిపించిన టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా, ర‌వితేజ ఫ్యాన్స్‌ను, ప్రేక్ష‌కుల‌ను అవి అమితంగా ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు వ‌ర్కింగ్‌ వీడియోతో ఈ చిత్రంపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి.
https://www.telugupost.com/movie-news/samantha-akkineni-hot-photos-108591/
అక్కినేని సమంత ఎక్కడా తగ్గడం లేదు. గ్లామర్ షో విషయంలో వెనకడుగు వెయ్యడం లేదు. ఎంత గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నా.. ఒ ఇంటి కోడలయ్యాక కాస్త తగ్గితే బెటర్ అన్న నెటిజెన్లకు తన అందాలతోనే జవాబు చెప్పేస్తుంది. పెళ్లయ్యాక కూడా ఇసుమంత మార్పు కూడా సమంత లో కనిపించడం లేదు. పెళ్ళికి ముందు హాట్ హాట్ గా ఎలా గ్లామర్ షో చేసిందో.. పెళ్లయ్యాక కూడా అలానే చేస్తుంది. యు టర్న్ లో అందాల ఆరబోతతో రెచ్చిపోయిన సమంత.. తర్వాత భర్త నాగ చైతన్య తో కలిసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూనే హాట్ హాట్ ఫొటోస్ తో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. రంగస్థలంలో రామలక్ష్మిలా… అభిమన్యుడిలా సైక్రటిస్ట్ గా, మహానటి లో మధురవాణిగా డి గ్లామర్ షోతో మెప్పించిన సమంత తాజాగా భర్త చైతు తో కలిసి మజిలీ సినిమా చేస్తుంది. అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో బేబీ సినిమాలో 60 ఏళ్ళ వృద్ధిరాలిగా, 20 ఏళ్ళ పడుచుపిల్లగా నటించబోతుంది. అంతేకాకుండా తమిళ క్లాసిక్ 96 ని దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ తో కలిసి తెలుగు రీమేక్ లోను ఒక కూల్ కేరెక్టర్ చేయబోతుంది. మరి నటనకు ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ పోతున్న సమంత హాట్ షోకి మాత్రం తెర పడడం లేదు. నిన్నగాక మొన్న బ్లాక్ ఫ్రొక్ తో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపిన సమంత.. తాజాగా క్లివేజ్ షో తో రెచ్చగొడుతుంది. వయ్యారంగా పక్కకి చూస్తూ కూర్చున్న సమంత హాట్ అందాలు చూసిన వారికీ చూపు మరల్చుకోవడం కష్టమే సుమీ.. మరి అక్కినేని కోడలు ఘాటు అందాలు మీరు చూసెయ్యండి.
https://www.telugupost.com/movie-news/tollywood-actress-didi-no-1-host-rachana-banerjee-to-contest-in-lok-sabha-2024-election-1524840
యాక్ట్రెస్ రచనా.. తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కన్యాదానం, బావ గారూ బాగున్నారా!, మావిడాకులు, పిల్ల నచ్చింది లాంటి పలు తెలుగు సినిమాల్లో నటించి బాగా దగ్గరైంది. దిగ్గజ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ రచనను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. ఇక ఒరియాలో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. బెంగాలీ టీవీ షోలలో కూడా నటించి బెంగాల్ ప్రజలకు కూడా బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు రచనా ఎంపీగా పోటీ చేయబోతున్నారు.నటి రచనా బెనర్జీ రాజకీయ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. రాబోయే లోక్‌సభ 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. నటి హుగ్లీ నుంచి పోటీ చేయనున్నారు. మార్చి 10న, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ బ్రిగేడ్ గ్రౌండ్ మార్చ్ నుండి లోక్‌సభ 2024 ఎన్నికల కోసం పూర్తి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. నటి రచనా బెనర్జీ హుగ్లీ నుంచి పోటీ చేయనున్నారని తెలిపారు. అక్కడ ఆమె బెంగాలీ పరిశ్రమకు చెందిన మరో నటిపై పోటీ చేయనున్నారు. లాకెట్ ఛటర్జీ ఇదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున పోటీ చేస్తున్నారు.ఒక వారం క్రితం, CM మమతా బెనర్జీ.. రచన ప్రముఖ రియాలిటీ షో దీదీ నంబర్ 1 లో కనిపించారు. ప్రత్యేక ఎపిసోడ్ మార్చి 3 న ప్రసారం చేశారు. ఆ ఎపిసోడ్‌లో మమత ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తన కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించేందుకు రచన స్వయంగా మమత వద్దకు వెళ్లారు. అప్పటి నుంచి రచన రాజకీయాల్లోకి వస్తున్నారనే వదంతులు వ్యాపించడం మొదలయ్యాయి. తన రాజకీయ రంగ ప్రవేశంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని స్వయంగా సీఎం ప్రకటిస్తారని ఆమె మీడియాకు తెలిపారు. నబన్నాలో దీదీని కలిసిన కొన్ని రోజుల తర్వాత, హౌరాలోని తిలజలా స్టేడియంలో సీఎంతో కలిసి దీదీ నంబర్ 1 స్పెషల్ ఎపిసోడ్‌ని చిత్రీకరించారు.
https://www.telugupost.com/top-stories/tdp-is-very-short-of-parlament-members-criticisms-are-being-heard-that-chandrababu-is-not-focusing-in-that-direction-1466237
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు కీలకం. అసెంబ్లీ ఎన్నికలు ఎంత ముఖ్యమో అదే స్థాయిలో పార్లమెంటు ఎన్నికలు కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాలన్నా, తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలన్నా పార్లమెంటు సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాల్సి ఉంటుంది. లేకుంటే ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లెక్క చేయరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఏరకంగా చూసినా ఢిల్లీ మద్దతు అవసరం అన్నది అందరికీ తెలిసిందే. గతంలో బీజేపీని కాదనుకుని బయటకు వచ్చి తప్పు చేశామని ఇప్పటికే చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీకి ఆయన మద్దతిచ్చే విధంగా మాట్లాడటం కూడా ఇందులో భాగమే. నాలుగేళ్లుగా...అందుకే గతనాలుగేళ్లుగా బీజేపీని పన్నెత్తు మాట అనలేదు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికీ చంద్రబాబు పొత్తు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలో వస్తుందన్న లెక్కలు కూడా చంద్రబాబు వేసుకుని బీజేపీతో సయోధ్య కోసమే ఆయన గత నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోరకుండానే బీజేపీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించుకోవాల్సిన దీన స్థితికి చేరుకోవాల్సి వచ్చింది. గతంలో ఢిల్లీకి వెళితే ఇతర పార్టీల నేతలు వచ్చి మరీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. కానీ ఇప్పుడా పరిస్థిితి లేదు. చంద్రబాబు ఎప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న పరిస్థితి తెలియక విపక్ష నేతలు కూడా ఆయనకు దూరమయ్యారనే చెప్పాలి. ఢిల్లీలో చంద్రబాబు వైపు...బీజేపీ కాదు కదా.. పార్లమెంటు సభ్యులు లేకపోతే కాంగ్రెస్ వంటి విపక్షాలు కూడా చంద్రబాబును కేర్ చేయడం లేదు. అనేక ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. అయితే శాసనసభ స్థానాలపై పెట్టిన దృష్టి పార్లమెంటు స్థానాలపై చంద్రబాబు పెట్టడం లేదని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మూడు పార్లమెంటు స్థానాలు మాత్రమే దక్కాయి. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళంలో మాత్రమే టీడీపీ ఎంపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఢిల్లీ పర్యటనలు కూడా గత నాలుగేళ్ల నుంచి వేళ్ల మీద లెక్కపెట్టుకునే సంఖ్యలోనే చంద్రబాబు చేయాల్సి వచ్చింది. మరోసారి ఈ తప్పిదం జరగకూడదంటే పార్లమెంటు స్థానాల్లో గెలవడం కూడా ముఖ్యమే. కానీ టీడీపీకి పార్లమెంటు సభ్యుల కొరత బాగా ఉంది. అధికారంలో లేకపోవడంతో ఆర్థికంగా బలహీనపడిన నేతలు ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు. ఎవరు పోటీకి?కానీ ఆ దిశగా అధినేత చేసిన ప్రయత్నాలు కూడా శూన్యమనే చెప్పాల్సి ఉంటుంది. కోస్తా ప్రాంతంలోని రెండు మూడు నియోజకవర్గాల్లో తప్ప టీడీపీకి పార్లమెంటుకు పోటీ చేసే బలమైన అభ్యర్థులు లేరన్నది పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్న అంశం. ఇప్పటి వరకూ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా గంటా నరహరిని మాత్రమే అధికారికంగా ప్రకటించారు. ఆయన పారిశ్రామికవేత్త కావడంతో వెంటనే నరహరిని అభ్యర్థిగా ప్రకటించేశారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకూ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన వారిలో అధికశాతం మంది నలుగురైదుగురు తప్ప ఎవరూ యాక్టివ్ గా కూడా లేరు. పొత్తులు కుదురుతాయని భావించ వచ్చు. అందుకే కొన్ని నియోజకవర్గాలకు మినహాయింపు ఇవ్వవచ్చు. గత ఎన్నికలలో ఎంపీలుగా పోటీ చేేసిన ఆదినారాయణరెడ్డి, బీద మస్తాన్ రావు, శిద్దారాఘవరావులు పార్టీలు వీడారు. మాగంటి రూప లాంటి వాళ్లు ఇన్ యాక్టివ్ అయ్యారు. మరి ఎన్నికల నాటికి టీడీపీకి అన్ని విధాలుగా బలమున్న నేతలు ఎవరైనా ముందుకు వస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతుంది.
https://www.telugupost.com/top-stories/థర్డీ-ఇయర్స్-ఇండస్ట్రీ-న-36144/
ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మికి భరణం కింద నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తాజాగా ఆదేశించింది. పృధ్వీరాజ్ విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు. అయితే సినిమాల్లో బిజీ అయిన పృధ్వీరాజ్ భార్యను బయటకు పంపించివేశారు. దీంతో పృధ్వీరాజ్ భార్య విజయవాడ కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు భరణం కింద నెలకు 8 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. సమన్లు పంపినా పృధ్వీరాజ్ కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ తీర్పు చెప్పింది. అయితే పృధ్వీరాజ్ ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు.ఎవరో నడిపిస్తున్నారు.....ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ తనయుడు సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, తన తల్లి, తండ్రి మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. కుటుంబ గొడవలు కోర్టు వరకు వెళ్తాయని అనుకోలేదని, తన తల్లి వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని సాయి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. తనను, తన చెల్లెలని తన తండ్రి పృథ్వీరాజ్ బాగా చూసుకునేవారని చెప్పారు. కాగా, పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మిని గత ఏడాది ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. రాజీకి యత్నించినా భర్త పట్టించుకోకపోవడంతో శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీంతో,ఆమెకు ప్రతినెలా భరణం కింద రూ.8 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది...
https://www.telugupost.com/top-stories/telugu-bigg-boss-season-6-will-be-24-hours-live-on-ott-soon-says-nagarjuna-1345336
బిగ్ బాస్ సీజన్ -6. ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ కు దీనిపైనే ఆసక్తి ఎక్కువగా ఉంది. నెక్ట్స్ సీజన్ లో ఎవరెవరు కంటెస్టంట్లుగా వస్తున్నారు ? ఎలా ప్లాన్ చేస్తున్నారన్న విషయాలను తెలుసుకునేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే రోజున రెండు నెలల్లోనే సీజన్ 6 ను మొదలు పెట్టనున్నట్లు నిర్మాతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి ఎప్పుడు ఈ సీజన్ మొదలవుతుందా ? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 6 పై పలు కామెంట్స్ చేశారు.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో..ఆరుపదుల వయస్సులోనూ మన్మథుడిలా కనిపించే నాగార్జున.. ప్రెజర్ ఎంత ఎక్కువగా ఉంటే.. అంతబాగా పనిచేస్తానంటున్నారు. వరుస సినిమాలు, యాడ్స్, టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంటున్నారు బంగార్రాజు. బిగ్ బాస్ సీజన్ 1 జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్ ను నాని హెస్ట్ చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి వరుసగా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాగ్ మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'బిగ్ బాస్' చెయ్యబోతున్నట్లు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.24 గంటలు బిగ్ బాస్ లైవ్..ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. బిగ్ బాస్ ను ఇంతలా ఆదరించిన లవర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. "తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్నీ చూశాను. చేతిలో రాసుకొని కంటెస్టంట్స్‌‌తో మాట్లాడేవాడిని. బిగ్ బాస్ షో తర్వాత చాలా మంది మెసేజెస్ పెట్టారు. 'బిగ్ బాస్' ఓటీటీలో చేద్దాం అన్నారు. ఇది చాలా డిఫరెంట్ ఫార్మేట్. ఇది నంబర్ వన్ షో.. అలాగే ఓటీటీలో 24 గంటల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా లైవ్‌లో ఈ షో చెయ్యబోతున్నాం" అని తెలిపారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 ఓటీటీలో 24 గంటలు లైవ్ లో చేస్తున్నట్లు నాగార్జున చెప్పేశారు. ఇక బంగార్రాజు సినిమా గురించి మాట్లాడుతూ.. బంగార్రాజు పండుగ లాంటి సినిమా అంటూనే.. సంక్రాంతి బరిలోకి సినిమా రానున్నట్లు హింట్ ఇచ్చేశారు.
https://www.telugupost.com/movie-news/పైసా-వసూల్-లో-ఛార్మి-సోయగ-42034/
బాలకృష్ణ - పూరి కాబోలో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం వచ్చే నెల 1 న విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా చిత్ర టీమ్ 'పైసా వసూల్' ఆడియో సక్సెస్ మీట్ ని భారీ లెవల్లో నిర్వహించింది. ఆడియో వేడుకని ఖమ్మంలో భారీగానే నిర్వహించారు. అలాగే 'పైసా వసూల్' పాటలు యూట్యూబ్ లో వీడియో ప్రోమోలతో సహా ఆకట్టుకున్నాయి. 'పైసా వసూల్' పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సందర్భాల్లో చిత్ర టీమ్ ఈ ఆడియో సక్సెస్ మీట్ ని గొప్పగా నిర్వహించింది. అయితే ఈ వేడుకలో బాలయ్య బాబు ఫుల్ జోష్ లో కనిపించాడు.సినిమాలో నటిస్తున్న శ్రియ, ముస్కాన్, కైరాలతోనే కాకూండా 'పైసా వసూల్' లైన్ ప్రొడ్యూసర్, పూరికి వ్యాపారవ్యవహారాలు చక్కబెడుతున్న ఛార్మి తో కూడా బాలకృష్ణ ఫుల్ జోష్ లో కబుర్లు చెబుతూ కనబడ్డాడు. వారితో సరదాగా అల్లరి చేస్తూ బాలయ్య ఎనర్జీతో రెచ్చిపోయాడు. కేవలం సినిమాలోనే కాక బయట ఈ ఈవెంట్ లో కూడా బాలయ్య జోష్ చూస్తుంటే సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోతూన్నాయి. అయితే ఈ ఈవెంట్ కి మోహన్ బాబు అతిధిగా పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇకపోతే ఈ ఈవెంట్ కి హాజరైన అందరూ బాలయ్య, పూరీలా కాంబోని పొగుడుతూ ఆకాశానికెత్తేశారు.ఇక ఈ ఈవెంట్లో లో ఛార్మి హడావిడి అందరికన్నా ఎక్కువగానే కనబడింది..బాలకృష్ణ ని అందరు బాలయ్య బాబు అనో లేకుంటే బాలకృష్ణ అనో, బాలయ్య అనో, నందమూరి నటసింహం అనో పిలుస్తుంటారు. అయితే బాలకృష్ణకి బాలకృష్ణ గారు అనో బాలయ్య గారు అనో పిలిస్తే అస్సలు ఇష్టం ఉందట. అందరూ బాలా అనిపిలిస్తే ఆయనకి చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారట. అందుకే ఇక్కడ 'పైసా వసూల్' ఫంక్షన్ లో సదరు హీరోయిన్ ఛార్మి గారు బాలయ్య మనసెరిగి బాలా... బాలా అంటూ తెగ వయ్యారాలు పోతూ మాట్లాడేసింది. ఇక బాలకృష్ణ - శ్రియ శరణ్ లు కెమెరా ముందే గాక బయట కూడా నిజమైన భార్య భర్తల్లాగా కనబడ్డారని చెప్పుకొచ్చింది. అంత ముచ్చటగా వాళ్ళ పెయిర్ ఉందని... చెప్పుకొచ్చింది.అయితే ఛార్మి అలా బాలా అనిపిలుస్తుంటే అక్కడేఉన్న బాలకృష్ణ ఆనందం చూడాలి... పిచ్చ హ్యాపీగా కనబడ్డాడు. ఇక పక్కనే ఉన్న బాలయ్య అక్కడ వున్న ఛార్మిని దగ్గరకు తీసుకుని మరీ అభినందించడం అక్కడ ఆ వేదికపై హైలెట్ అయ్యింది. ఇక ఈ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
https://www.telugupost.com/movie-news/మరోసారి-వివాదం-అవుతున్న-29774/
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ గా యావత్ దేశంలోని యువతకి చేరువ ఐన సన్నీ లియోన్ పై నిత్యం ఏవో ఒక ఆరోపణలు విలయతాండవం చేస్తూనే ఉంటాయి. కొన్ని ఆవిడ వ్యక్తిగత జీవితం పై ఆరోపణలు ఉంటుండగా మరి కొన్ని ఆవిడ వృత్తి పరమైన జీవితంపై చేసే ఆరోపణలు వుంటుంటాయి. ఇలాంటి వాటన్నిటికీ కెరీర్ తొలి నాళ్ళల్లో రెస్పాండ్ ఐన సన్నీ లియోన్ రాను రాను ఇదే అలవాటుగా మారిపోతుందని గ్రహించి అనుచిత వ్యాఖ్యలకి, ఆధారాలు లేని ఆరోపణలకు రియాక్ట్ కావటం మానేసింది. అయినా సన్నీ లియోన్ పై కానీ సన్నీ లియోన్ చేసే సినిమాలు, వాణిజ్య ప్రకటనలపై కానీ ప్రొటెస్ట్ చేసే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే వుంది.తాజాగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) మహిళా విభాగం వారు సన్నీ లియోన్ నటించిన ఒక కండోమ్ కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటనపై తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఆ వాణిజ్య ప్రకటన బుల్లి తెరపై ప్రసారం చేయటం మహిళలకి అవమానం కలిగించేలా ఉందని, కుటుంబ సమేతంగా టెలివిషన్ కార్యక్రామాలు వీక్షించే సమయంలో ఇలాంటి వాణిజ్య ప్రకటనలు ప్రాసరం అయితే పిల్లలకి ఎం సంకేతాలు వెళ్తాయో ఆలోచించమంటూ సదరు కంపెనీ కి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా విభాగం అధ్యక్షురాలు షీలా నోటీసు పంపారు. వారం రోజులలోపు సదరు కండోమ్ యాడ్ ప్రసారం నిలిపి వేయని పక్షంలో తమ ప్రొటెస్ట్ తీవ్ర రూపు దాలుస్తుందని హెచ్చరించారు. మరి నిర్ణీతగడువు లోపు కండోమ్ కంపెనీ వారు ఆ యాడ్ కి ప్రత్యామ్నాయం ఏమైనా చేసుకుంటారా లేక వారు కూడా చట్టపరంగానే సమాధానం ఇవ్వదలిచారో చూడాలి.
https://www.telugupost.com/movie-news/suma-kanakala-responds-on-their-divorce-rumors-1367644
హైదరాబాద్ : ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల చాలా సంవత్సరాల తర్వాత జయమ్మ పంచాయితీ అనే సినిమా తో వెండితెరపై కనిపించనుంది. మే 19న ఈ సినిమా విడుదల కానుండగా.. శనివారమే ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ తో విడాకులపై వస్తున్న రూమర్లపై స్పందించారు. పెళ్లై 23 ఏళ్లు అయిందని, ఈ 23 ఏళ్ల దాంపత్య జీవితంలో తాము చాలా సంతోషంగా ఉన్నామని సుమ కనకాల చెప్పింది.రూమర్లు వచ్చినప్పుడల్లా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేయడం ద్వారా ఆ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశానని సుమ పేర్కొంది. ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సాధారణమేనని, ముఖ్యంగా ఫేమస్ అవుతూ.. స్టార్ డమ్ వస్తుందంటే ఇలాంటి గాసిప్ లు, పుకార్లు మరింత ఎక్కువవుతాయని సుమ చెప్పుకొచ్చింది. వీటి వల్ల మానసికంగా చాలా బాధ కలిగినా.. అందుకు అలవాటుపడి ఉన్నామని పేర్కొన్నారు.
https://www.telugupost.com/movie-news/ఆ-ముగ్గురు-ఓకే-మరి-నాలుగో-42699/
ఆగష్టు 11 యుద్ధం మరోసారి జరగబోతుంది. ఆగష్టు 11 న మూడు సినిమాలు లై, నేనేరాజు నేనే మంత్రి, జయ జానకి నాయక పోటీ పడ్డట్టే... ఇప్పుడు వచ్చే శుక్రవారం సెప్టెంబర్ 8 న కూడా మరో నాలుగు సినిమాలు యుద్దానికి సై అంటున్నాయి. నిన్నటిదాకా ఎవరుంటారో.. ఎవరు తప్పుకుంటారో అనుకున్నవారికి ముగ్గురు క్లారిటీ ఇచ్చినట్లేగాని... నాలుగోవాడే ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్సులోకి నెట్టేస్తున్నాడు. ఈ 8 న నాగ చైతన్య 'యుద్ధం శరణం'తో లావణ్య త్రిపాఠి తో కలిసి వస్తున్నాడు . ఆమేరకు 'యుద్ధం శరణం' పబ్లిసిటీని వేగవంతం చేసాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు గట్రా ఇస్తూ హడావిడి చేసేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హాట్ లుక్స్ తో కనబడనున్న ఈ మూవీలో శ్రీకాంత్ విలన్.ఇక రెండో వాడు అల్లరి నరేష్. నరేష్ కూడా 'మేడ మీద అబ్బాయి' అంటూ అల్లరితో కామెడీ చెయ్యడానికి సిద్దమైపోయాడు. అల్లరి నరేష్ కూడా తన సినిమా పబ్లిసిటీని షురూ చేసాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి మొదలెట్టాడు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ తో జోడి కడుతున్న భామ నిఖిల విమల్. ఇకపోతే మూడోవాడు బాలీవుడ్ నటుడు సచిన్ జోషి కూడా 'వీడెవడు' తో తెలుగు హీరోల మీద యుద్దానికి సై అన్నాడు. నిన్నమొన్నటివరకు సైలెంట్ గా కూర్చుని ఉన్నట్టుండి 'బిగ్ బాస్' అనే తెలుగు రియాలిటీ షోలో తన సినిమా ప్రమోషన్ కి శ్రీకారం చుట్టేశాడు. ఈ ముగ్గురు పక్కాగా సెప్టెంబర్ 8 కే స్ట్రాంగ్ గా ఫిక్స్ అవడమూ... పబ్లిసిటీని పీక్ కి తీసుకెళ్ళడమూ బాగానే ఉన్నాయి.కానీ నాలుగోవాడు మంచు మనోజ్ మాత్రం తన 'ఒక్కడు మిగిలాడు' చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 8 నే విడుదల అన్నాడు. కానీ ఎటువంటి కన్ఫర్మెషన్ లేకుండా... ఇప్పటికి సినిమాకి సంబందించిన ప్రమోషన్ ని మొదలెట్టకుండా సైలెంట్ గా నే ఉంటున్నాడు. అసలు మనోజ్ రాక ఉన్నట్టా.. లేనట్లా అనేది క్లారిటీ రావడం లేదు. మరి మంచు మనోజ్ తప్పుకున్నాడో.. లేదో తెలియదు గాని ఈ ముగ్గురు హీరోలు నాగ చైతన్య, అల్ల్లరి నరేష్, సచిన్ జోషీలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా బలాబలాలు చూపించేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించేసారు
https://www.telugupost.com/movie-news/maharshi-release-late-because-mahesh-babu-116673/
ఏప్రిల్ 5న మహర్షి సినిమా విడుదల అంటూ గత ఏడాది మహర్షి సినిమా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ ఏడాది మొదట్లో మహర్షి సినిమా విడుదల ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 25కి వెళ్లిందని స్వయానా మహర్షి ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పాడు. కారణం మహర్షి సినిమా షూటింగ్ ని వంశీ నత్తనడక నడిపిస్తున్నాడని… అలాగే కొన్ని సీన్స్ ని రీషూట్స్ చేస్తున్నాడని.. అందుకే సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుందని అన్నారు. ఇక మొన్నీమధ్యన మహర్షి సినిమాని మహానటి సెంటిమెంట్ తో మే 9న విడుదల చేస్తున్నట్టుగా దిల్ రాజు ప్రకటించాడు. యాడ్ ల కోసం షూటింగ్ కు బ్రేక్ కానీ ఇప్పటివరకు మహర్షి సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే షూటింగ్ వంశీ పైడిపల్లి వలన లేట్ కాలేదని.. మహెష్ వల్లనే లేట్ అయ్యిందని అంటున్నారు. ఎందుకంటే మహర్షి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మహేష్ కమర్షియల్ యాడ్ షూట్స్ కోసం వెలుతున్నాడని, అందుకే మహర్షి సినిమా షూటింగ్ ఇలా లేట్ అవుతూ రావడంతో విడుదల పోస్ట్ పోన్ అవడం జరిగిందని అంటున్నారు. మొన్నామధ్యన ఒక యాడ్ షూట్ కోసం సౌతాఫ్రికా వెళ్లిన మహేష్ తాజాగా మరో యాడ్ షూట్ కోసం మహర్షి షూటింగ్ కి బ్రేక్ ఇస్తున్నాడట.
https://www.telugupost.com/movie-news/అబ్బో-మెగా-ఫ్యాన్స్-కి-పి-21807/
ఎప్పుడెప్పుడు పవన్ 'కాటమరాయుడు' టీజర్ చూద్దామా.. అని ఎదురు చూస్తున్న మెగా ఫాన్స్ నిరీక్షణ ఫలించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' టీజర్ తో వచ్చేసాడు. 'కాటమరాయుడు' గురించి ఇప్పటిదాకా వినబడిన గాసిప్స్ అన్నిటికీ ఒకా టీజర్ తోనే చెక్ పెట్టేసాడు పవన్. ఉన్న అనుమానాలన్నీ ఒక్క టీజర్ తో ఎగిరిపోయాయి. ఇప్పటిదాకా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పుడు సైలెంట్ గా కుమ్మడానికి వచ్చేసాడు పవన్. డాలి డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న 'కాటమరాయుడు' లో అసలు పవన్ ఎలా ఉంటాడో అని అందరూ ఎదురు చూస్తున్న టైములో పంచె కట్టు తో ఫస్ట్ లుక్ వదిలి టీజర్ అతి త్వరలోనే అంటూ ఊరించిన చిత్ర యూనిట్ ఇప్పుడు పవన్ ని రాయుడు లుక్ లో ఫస్ట్ లుక్ టీజర్ లో చూపించి అరిపించేసారు.ఇక 'కాటమరాయుడు' టీజర్ 'రాయుడా... అంటూ సాంగ్ తో మొదలై పవన్ డాన్స్ తో పిచ్చేక్కిన్చేసి.... ఫైట్ సీన్ తో ఇరగదీసిన పవన్ ,ఎంతమందున్నరన్నది ముఖ్యం కాదు ఎవడున్నాడన్నదిముఖ్యం, అంటూ చెప్పే డైలాగ్ తో థియేటర్స్ బద్దలయిపోయేలా వుంది. అసలు పవన్ అలా పంచె కట్టుతో కూర్చునే సీన్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగతా ప్రేక్షకుడు కూడా కుర్చీ లోనుండి లేచి ఈల వెయ్యడం గ్యారెంటీ అనిపించేలా ఉందా సీన్. ఇక పూర్తి యాక్షన్ తో నింపేశారు 'కాటమరాయుడు' టీజర్ మొత్తాన్ని. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనూప్ రూబెన్స్ అరిపిన్చేసాడు. అదరహో అనిపించేలా మ్యూజిక్ అందించాడని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ టీజర్ లో హీరోయిన్ శృతి హాసన్ ని మాత్రం చూపించకుండా హైప్ క్రియేట్ చేశారు. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం 'కాటమరాయుడు' టీజర్ తోనే పవన్ మాకు పండగ వాతావరణాన్ని తీసుకువచ్చాడని ఫీల్ అవుతున్నారు.
https://www.telugupost.com/crime/two-mothers-died-trying-to-save-their-children-who-fell-into-pit-in-nellore-1478751
గుంతలో పడిన ఇద్దరు పిల్లల్ని రక్షించబోయి వాళ్లిద్దరి తల్లులు మృతి చెందారు. ఈ విషాద ఘటన నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్నానది రివిట్ మెంట్ వాల్ నిర్మాణం కోసం ఇటీవల గుంతలు తవ్వాలు. బుధవారం సాయంత్రం ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ..ఆడుకుంటూ.. గుంతలు తవ్వినవైపుగా వెళ్లి.. ప్రమాద వశాత్తు వాటిలో పడిపోయారు. ఈ విషయం గమనించిన తల్లులు షాహీనా, షబీనా పిల్లల్ని కాపాడుకునేందుకు ఆ గుంతల్లో దూకారు. చిన్నారులను కాపాడిన అనంతరం ఇద్దరు తల్లులు పైకి రాలేక.. ఆ గుంతల్లోని బురదలో చిక్కుకుపోయి మరణించారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పైకి తీయించారు. వివరాలు నమోదు చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. కొంతకాలంగా రివిట్ మెంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే జేసీబీతో గుంతలు తవ్వి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ గుంతలు తవ్వి.. వాటి వద్ద ఎలాంటి హెచ్చరికలు, రక్షణ లేకపోవడం, నిర్మాణంలో జాప్యం కారణంగా ఇద్దరు తల్లులు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు వాపోయారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
https://www.telugupost.com/movie-news/mega-fans-still-waiting-for-ram-charan-first-look-in-rrr-148590/
రాజమౌళికి మెగా ఫ్యాన్స్ చుక్కలు చూపించడం ఏమిటి? చూపిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ కలిపి చూపించాలిగా అనుకుంటున్నారేమో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కూల్ గానే ఉన్నారు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి ని వదిలేలా కనిపించడం లేదు. కారణం సినిమా ఫస్ట్ లుక్ విషయం కాదు కానీ.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర తాలూకు లుక్ తో పాటు ఓ వీడియో కూడా లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఎన్టీఆర్ కొమరం భీం లుక్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ అంచనాకి వచ్చేసారు. కానీ అల్లూరి సీతారామరాజు చరణ్ లుక్ విషయం ఇంకా ఎటూ తెగలేదు. అందుకే రాజమౌళిని మెగా ఫ్యాన్స్ వేపుకు తింటున్నారట. రామ్ చరణ్ అల్లూరి లుక్ ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ కి ఉన్నట్టే చరణ్ కి కూడా హీరోయిజం సీన్స్ ఉంటాయా? అసలు బయట అల్లూరి మీసకట్టుతో తప్ప చరణ్ మామూలుగానే కనబడుతున్నాడు. సినిమా కోసం చరణ్ ఎలా మారుతున్నాడు? అందులోను చిరు కూడా ఈమధ్యనచరణ్ పాత్ర విషయంపై రాజమౌళి మీద అలిగాడనే న్యూస్ ఉంది. మరి ఇంత జరుగుతున్నా రాజమౌళి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఉన్నాడు.. మాకు చరణ్ లుక్ కొద్దో గొప్పో లీక్ చేయొచ్చుగా అంటూ రాజమౌళి పై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారట.
https://www.telugupost.com/movie-news/రెండోసారి-తాతయ్య-అయిన-బా-64297/
మొదటి కుమార్తె బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ పుట్టుకతో తాతయ్య హోదా సంపాదించుకొన్న నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు తన రెండవ కుమార్తె తేజస్వినికి కుమారుడు జన్మించడంతో మరోమారు తాతయ్య అయ్యారు. మార్చి 22వ తారీఖు తెల్లవారుఝామున తేజస్విని-శ్రీభరత్ లకు పండంటి మగ బిడ్డ పుట్టాడు. వారసుడి ఆగమనంతో నందమూరి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
https://www.telugupost.com/movie-news/trisha-social-media-160152/
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా నిమిషాల్లో అందరికి చేరిపోతుంది. మీడియాలో రాక ముందే సోషల్ మీడియాలో న్యూస్ లు కుప్పలు తెప్పలుగా ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. మంచి విషయాలు, చెడు విషయాలు ఏవైనా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో వినకూడానవి కూడా ఉంటున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య అందరి మనసులను కలిచివేసింది. దేశ ప్రధాని మోడీ దగ్గరనుండి బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మల్లువుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అయన అభిమానులు అందరూ సుశాంత్ ఆత్మహత్యకు ఎమోషనల్ పోస్ట్ లు పెట్టారు. అయితే ఇలాంటి విషయాలను వినాల్సి వస్తుంది అని ఓ టాప్ హీరోయిన్ సోషల్ మీడియాకి కొన్నాళ్ళు దూరంగా ఉందామనుకుంటుందట. చిరు ఆచార్య నుండి అర్ధాంతరంగా తప్పుకుని న్యూస్ గా మారిన త్రిష ఇప్పుడు సోషల్ మీడియా నుండి తప్పుకుంటుందట. ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా నుండి తప్పుకోవడం చాలా అవసరమని చెబుతుంది. నేను చాలా హ్యాపీ గా ఉన్నాను అంటూనే.. ప్రస్తుతం నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది నాకు తెలియకపోవడమే మంచిది. అది అవరసరం కూడా. మైండ్ కి ఇది డిజిటల్ చికిత్స లాంటిది. కరోనా తో బయట తిరగకండి.. ఇంట్లోనే ఉండండి.. సేఫ్ గా ఉండండి లవ్ యు గైస్ అంటూ సోషల్ మీడియాకి దూరమవుతున్నట్టుగా త్రిష ట్వీట్ చేసింది. మరి త్రిష కి బయట జరుగుతున్న పరిణామాలు చూసి ఎంత వేదన పడితే కానీ ఇలా సోషల్ మీడియాకి దూరమైందో అంటూ ఆమె అభిమానులు ఫీలవుతున్నారు.
https://www.telugupost.com/crime/gang-assault-on-minor-in-gujarat-minor-died-accused-abscond-1458112
దేశమంతా సంక్రాంతి పండుగ సంబరాల్లో బిజీగా ఉన్న వేళ.. గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. 8 సంవత్సరాల బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి.. కామాంధులు తమ పైశాచికాన్ని ప్రదర్శించారు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ రాష్ట్రంలోని బొటాడ్ లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం (జనవరి 15) సాయంత్రం 4.30 గంటల సమయంలో గాలిపటం తెచ్చుకునేందుకు బయటికెళ్లింది బాలిక. ఎంతసేపటికి కూతురు ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు కంగారుగా చుట్టుపక్కల వెతికారు.తెలిసిన వారిళ్లల్లో ఆరా తీశారు. ఎక్కడా ఎవరికీ కనిపించకపోవడంతో.. చివరికి స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. బాలిక ఆచూకీ కోసం విస్తృతంగా గాలించారు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో అర్థనగ్నంగా ఉన్న బాలిక శవాన్ని గుర్తించారు. కామాంధులు బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి.. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల్ని తక్షణం అరెస్టు చేసి శిక్షించాలంటూ.. బాలిక కుటుంబ సభ్యులతో పాటు.. స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఒకచోట చేరి.. ఆందోళన చేశారు.
https://www.telugupost.com/movie-news/rakul-in-jayalalitha-role-82978/
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మెల్లిగా ఫామ్ లోకొస్తుంది. గత ఏడాది నుండి బాగా అవకాశాలు తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు మెల్లిగా అవకాశాలు వస్తున్నాయి. స్పైడర్ సినిమా దెబ్బకి కోలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు రావేమో అనుకున్నారు. కానీ సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకే సినిమా రకుల్ కి సెకండ్ హీరోయిన్ పాత్ర దొరికింది. అయితే మొదటి హీరోయిన్ గా సాయి పల్లవి కి ఛాన్స్ రాగా పెద్దగా క్రేజ్ లేని రకుల్ ప్రీత్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఇకపోతే ఎన్జీకే లో సాయి పల్లవి సూర్య భార్య‌ పాత్రలో నటిస్తుంది.ఎంజీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా...ప్రస్తుతం బయోపిక్స్ సీజన్స్ నడుస్తున్న ఈ టైం లో టాలీవుడ్, కోలీవుడ్స్ లో బయోపిక్స్ పిచ్చి పీక్స్ కి చేరింది. మహానటి సినిమా హిట్ తో అది మరింత ముదిరింది. టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయో పిక్, వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమాలు పోటాపోటీగా తెరకెక్కుతుండగా.. తమిళనాట ఎంజీఆర్, జయలలిత బయోపిక్స్ కూడా అతి త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే సూర్య - సెల్వ రాఘవన్ కాంబోలో వస్తున్న ఎన్జీకే సినిమా నటుడు, పొలిటీషియన్ అయినా ఎంజీఆర్ జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారనే టాక్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.ఎంత దాచిపెట్టాల‌ని చూసినా...అయితే ఈ సినిమాలో సూర్య భార్య రోల్ లో సాయి పల్లవి నటిస్తుండగా... మరో ముఖ్యమైన అంటే తమిళనాడులో ఎంజీఆర్ జీవితంలో ఎంతో కీలకమైన మాజీ సీఎం జయలలిత పాత్రని రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఇంతవరకు రకుల్ ప్రీత్ సింగ్ జయలలిత పాత్ర పోషిస్తున్నట్టుగా బయటికి పొక్కకుండా చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుందట. ఎందుకంటే జయలలిత పాత్ర ఒక సినిమాలో కనబడుతుంది అంటే.. ఎక్కడ లేని సమస్యలు వస్తాయని భావించి రకుల్ జయలలిత పాత్రని బయటకి రానివ్వకుండా జాగ్రత్త పడితే ఇప్పుడేమో అదే సెన్సేషన్ అయ్యి కూర్చుంది. అయితే రకుల్ నిజంగానే ఎన్జీకేలో జయలలితగా కనబడనుందా..? అంటే ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు.
https://www.telugupost.com/movie-news/only-rajamouli-rrr-can-beat-bahubhali-collections-131914/
బాహుబలి ని తలదన్నే సినిమాని కేవలం బాహుబలి దర్శకుడు రాజమౌళి వల్లే అవుతుందా?ఎందుకంటే బాహుబలి ని తన్నాలని కలలు కన్నా చాలామంది చివరికి సౌండ్ లేకుండా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి. బాహుబలి ని టార్గెట్ చేసిన రోబో 2.0 కి చుక్కలు కనబడ్డాయి. ఇక బాహుబలి ని కొట్టాలనే కసితో సల్మాన్ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద తుస్ మన్నాయి. మరి తాజాగా ప్రభాస్ సాహో కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నా… టాక్ పరంగా చాలా వీక్ గా వుంది. మరి బాహుబలి రేంజ్ మూవీ ని మళ్లీ మనం రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న #RRR తోనే చూడగలమా అనే అనుమానమైతే అందరిలో ఉంది. మరి అక్టోబర్ 2 న విడుదల కాబోతున్న సై రా నరసింహారెడ్డి మీద కూడా ఇప్పుడు సాహో చూసాక… నమ్మకం పోయినట్లే కనబడుతుంది. ఎందుకంటే సురేందర్ రెడ్డి ఇప్పటివరకు టాలీవుడ్ హీరోలతో చిన్న కథలతో మిడియం బడ్జెట్ సినిమాలు చేసిన దర్శకుడు. మరి ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా ఐదు భాషల్లో సినిమాని హ్యాండిల్ చెయ్యాలంటే కూసింత కష్టమే. అందుకే సై రా మీద హోప్స్ పెట్టుకున్నోళ్ళు.. సాహో చూసాక టెన్షన్ పడుతున్నారు. మరి బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ ని రాజమౌళి తన #RRR తోనే కొడతాడని ప్రచారం ఊపందుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఖచ్చితంగా రాజమౌళి బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు.. బాహుబలి రికార్డులని తన #RRR తో ఖచ్చితంగా బద్దలు కొడతాడని అంటున్నారు.
https://www.telugupost.com/crime/rachakonda-police-destroy-five-crore-worth-narcotics-1543265
గత ఏడాది కాలంలో 23 పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఐదు కోట్ల రూపాయలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను రాచకొండ పోలీసులు ధ్వంసం చేశారు. నిషేధిత పదార్థాలను యాదాద్రి భోంగీర్‌ జిల్లా కేంద్రంలో ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. డ్రగ్స్‌లో గంజాయి, ఓపియం గసగసాల స్ట్రా, ఎక్స్‌టసీ మాత్రలు, హషీష్ ఆయిల్ ఉన్నాయి. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని సాధించేందుకు నిరంతర అప్రమత్తత, సంఘటిత ప్రయత్నాల ఆవశ్యకత ఉందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.ఐదు కోట్లకు పైగా విలువైన 3891 కిలోల 813 గ్రాముల మాదకద్రవ్యాలను రాచకొండ పోలీసులు ధ్వంసం చేశారు. రాచకొండ పరిధిలో 23 పోలీస్ స్టేషన్లలో 106 కేసులు నమోదయ్యాయి. రాచకొండ సిపి తరుణ్ జోషి ఆధ్వర్యంలో భువన గిరి జిల్లాలోనితుక్కా పూర్ గ్రామంలోని కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ వద్ద మొత్తం ధ్వంసం చేశారు. డ్రగ్స్ ,గంజాయి వంటి వాటికి బానిసలైన వారిపై కేసులు నమోదు చేస్తామని రాచకొండ పోలీసులు హెచ్చరించారు.
https://www.telugupost.com/movie-news/mahesh-new-look-4-80065/
'పోకిరి', 'అతిధి' సినిమాల్లో తప్ప తను నటించిన ఏ సినిమాలోనూ మహేష్ తన లుక్ ని మార్చలేదు. అయితే రీసెంట్ గా స్టార్ట్ అయిన వంశీ పైడిపల్లి సినిమాలో మహేష్ లుక్ మార్చాడు. తన కెరీర్లో తొలిసారిగా కొంచెం ఎక్కువ గడ్డం, జుట్టు పెంచి.. రఫ్ లుక్‌లోకి మారాడు. ఈ లుక్ తోనే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఆల్రెడీ ఆ లుక్ కు సంబంధించి పిక్స్ కూడా బయటకి వచ్చి వైరల్ అయ్యాయి.మళ్లీ పాత లుక్ లోకి...దాదాపు నెల పాటు ఉత్తరాఖండ్‌లో జరిగిన షెడ్యూల్ లో మహేష్ ఆ లుక్ లోనే యాక్ట్ చేశాడు. షూటింగ్ మధ్యలో ఓ ప్రకటనలో కూడా అదే లుక్ తో నటించాడు. అయితే ఆ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ లుక్ తోనే మహేష్ సినిమా మొత్తం ఉంటాడు అనుకుంటే అందరికీ షాక్ ఇచ్చాడు. సడన్ గా గడ్డంని బాగా ట్రిమ్ చేసి కనిపించాడు.ఒక షెడ్యూల్ వరకే ఆ లుక్ఆదివారం చెన్నై సిల్క్స్ వాళ్ల కొత్త షోరూం ఓపెనింగ్‌కి వచ్చిన మహేష్ ను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఎందుకు అలాగా గడ్డం ట్రిమ్ చేసి కనిపించాడో అన్నది అర్థం కాలేదు. బహుశా సినిమాలో ఒక ఎపిసోడ్ వరకు మహేష్ గడ్డంతో కనిపిస్తాడేమో అనుకుంటున్నారు అంతా. ఇక త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది.. ఇందులో ఎవరు పొల్గొంటారో ఇంకా తెలియాల్సి ఉంది.