link
stringlengths
41
231
text
stringlengths
29
5k
https://www.telugupost.com/movie-news/chiru-pawan-not-ready-for-shooting-163945/
కరోనా ముగిస్తే సినిమాలు పట్టాలెక్కుతాయనుకుంటే.. కరోనా మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు. కరోనా విజ్రంభిస్తుంది కానీ.. తగ్గే సూచనలు కనిపించడం లేదు. హీరోలెవరైనా ముందుకొస్తారని దర్శకులు ఎదురు చూసి చూసి కరొనకి దణ్ణం పెట్టారు. కానీ కరోనా శాంతించలేదు. ఇక హీరోలు కూడా కిమ్మనకుండా ఇంట్లోనే ఉంటూ కరోనా ఎప్పుడు తగ్గిద్దో అప్పుడే సినిమా షూటింగ్ అంటున్నారు. అయితే చిరు, పవన్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి షూటింగ్ మొదలెడతారు.. ఆగష్టు నుండి సినిమా షూటింగ్ మొదలవుతాయి అని అనుకుంటుంటే.. అటు చిరు కొత్త లుక్ తో శంకిస్తే.. ఇటు పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్షతో షాకిస్తున్నాడు. చిరు – కొరటాల ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా అందరికన్నా ముందే ఆపేసారు. ఇక ఆగష్టు నుండి అయినా ఆచార్య పట్టాలెక్కుతోంది అనుకుంటే.. ఇప్పుడు చిరంజీవి ఆచార్య లుక్ నుండి కొత్త లుక్ లోకి వచ్చేసాడు. చిరు ఇప్పుడు మీసం, గెడ్డం తీసేసి స్లిమ్ గా హీరోల తయారయ్యాడు. ఇక పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో గోవులకు అరటిపళ్ళు, గడ్డి వేసుకుంటూ గడిపేస్తున్నాడు. అందులోనూ నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్ష అంటున్నాడు. మరి మరో 20 రోజుల షూటింగ్ చేస్తే పవన్ – వేణు శ్రీరామ్ ల వకీల్ సాబ్ షూటింగ్ పూర్తవుతుంది. కరోనా తగ్గి ప్రజలు బావుండాలని పవన్ చతుర్మాస దీక్ష చేస్తున్నాని చెబుతున్నాడు. ఇక ప్రజల కోసం దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ నిర్మాతల కోసం మాత్రం ఆలోచించడం లేదు. మరి పవన్ – చిరు ఇప్పుడప్పుడే సినిమాల కోసం సిద్దమయ్యేలా కనిపించడం లేదు.
https://www.telugupost.com/movie-news/kcr-family-watched-film-91383/
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'నవాబ్' సినిమాకు మంచి టాక్ వచ్చింది. ప్రక్షకుల్లో ఆధరణ లభిస్తుంది. మణిరత్నం మార్క్ సినిమాగా ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. సామాన్య ప్రేక్షకుల తో పాటు స్టార్ హీరోలు కూడా సినిమా మహా అద్భుతం అంటూ ట్వీట్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు మహేష్ బాబు, శ్రీకాంత్, రాజశేఖర్, వి.వి వినాయక్ తదితరులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కూడా ఈ సినిమాను వీక్షించి సినిమా చాలా బాగుందని, ప్రతి ఒక్క కుటుంబం చూడాల్సిన సినిమా అని ప్రశంసించారు.
https://www.telugupost.com/crime/telangana-jagadgirigutta-auto-driver-attacked-a-boy-1490835
హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ తొమ్మిదేళ్ల బాలుడిని చంపేందుకు ఓ ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ఆటోతో వచ్చిన డ్రైవర్ కొద్దిసేపు మాట్లాడి.. ఆ బాలుడిని నమ్మించి పక్క వీధుల్లోకి తీసుకెళ్లాడు. అయితే అతడు ఉన్నట్లుండి బ్లేడుతో బాలుడి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు చూసి.. కేకలు వేయడంతో ఆ డ్రైవర్ పరారయ్యాడు. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డ్ అయ్యింది. అనంతరం బాలుడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆ ఆటోడ్రైవర్.. ఆ పిల్లాడినే ఎందుకు చంపాలని ప్రయత్నించాడు అనే విషయమై కూడా ఆరాతీస్తున్నారు.ఆ బాలుడికి ఏం జరుగుతుందో తెలుసుకొనే లోపే ఆటో డ్రైవర్ బాలుడి గొంతు కోసేశాడు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/షారూఖ్-చిత్రానికి-ఏం-కష్-17058/
ఇటీవలి కాలంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస పరాజయాలతో అగ్ర స్థానం నుంచి దిగిపోయే పరిస్థితికి వచ్చేశాడు. హ్యాపీ న్యూ ఇయర్, దిల్వాలే, ఫ్యాన్ చిత్రాలు ఒకదాని తరువాత ఒకటి ప్రేక్షకుల తిరస్కారానికి గురి కావటంతో షారుఖ్ తన పాత్ర నిడివి ని కూడా పట్టించుకోకుండా కథని బలంగా నమ్మి సక్సెస్ ఖాయం అన్న ధీమాతో చేసిన చిత్రం డియర్ జిందగీ. అయితే ఈ చిత్రం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించలేకపోయింది. షారుఖ్ ఖాన్ ఇటీవలి దశాబ్ద కాలంగా అతి తక్కువ వసూళ్లు చేసిన చిత్రం డియర్ జిందగీనే. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయల షేర్ కూడా తాకకముందే ఈ సినిమా వ్యాపారం ముగిసిపోయింది. ఆర్ధిక నష్టంతో పాటు ఈ చిత్రానికి ఇప్పుడు మరిన్ని తలవంపులు వచ్చి పడ్డాయి.బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన డియర్ జిందగీ చిత్రం విడుదల ఐన నాటి నుంచే ఇది కెనడియన్ ఫిలిం 'బీయింగ్ ఎరికా' కి ఫ్రీమేక్ అనే స్పందన ప్రేక్షకుల నుంచి వస్తున్నది. కానీ పేక్షకుల స్పందనకు చిత్ర బృందం ఏకీభవించలేదు. డియర్ జిందగీ దర్శకురాలు గౌరీ షిండే డియర్ జిందగీ స్క్రిప్ట్ తన ఆలోచనల్లో నుంచి పుట్టినదేనని బలంగా వాదిస్తునప్పటికీ బీయింగ్ ఎరికా చిత్రానికి డియర్ జిందగీ కి అనేక విషయాల్లో దగ్గరి పోలికలు ఉండటంతో ఆవిడ వాదన ఎవరికి నమ్మశక్యంగా లేదు. మరో వైపు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థకి బీయింగ్ ఎరికా నిర్మాతలు కాపీరైట్ నోటీసులు పంపటంతో ధర్మ ప్రొడక్షన్స్ సంస్థకి ఇది అదనపు భారం అయిపోయింది. ఇప్పుడు డియర్ జిందగీ స్క్రిప్ట్ పూర్వాపరాలు పై సరైన వివరణ ఇవ్వలేని పక్షంలో ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
https://www.telugupost.com/movie-news/advallu-meeku-joharlu-movie-shooting-completed-movie-ready-to-release-on-february-25th-1354545
కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ - రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ.. చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక సినిమా విషయానికొస్తే.. శర్వానంద్ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటారు. ఆయన చేసే సినిమాల నుంచి మంచి మెసేజ్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ను రీచ్ అయ్యేలా సినిమాలు చేస్తుంటారు.Also Read : ప్రేమికుల రోజు భర్త నుంచి విడాకులు తీసుకున్న నటి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా కూడా అలాంటిదే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ విడుదలవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడవాళ్ల మధ్యలో పెరిగిన ఓ అబ్బాయి పెళ్లికోసం పడే పాట్లను దర్శకుడు అందంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో.. సీనియర్ నటీమణులు రాధిక, ఖుష్బూ, ఊర్వశి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈనెల 25వ తేదీన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
https://www.telugupost.com/politics/telugu-desam-party-chief-chandrababu-naidu-is-going-to-be-politically-active-again-in-a-few-days-of-december-1507193
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబరు మరికొద్ది రోజుల్లో తిరిగి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి 52 రోజుల పాటు జైలులో ఉండి వచ్చిన చంద్రబాబు కంటికి చికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆయన తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని విజయవాడకు వచ్చారు. రాజకీయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు నెలల నుంచి చంద్రబాబు కేసుల కారణంగా పార్టీలో ఒకరకమైన స్తబ్దత నెలకొంది. జైలుకు వెళ్లకపోతే ఇప్పటికే అన్ని ప్రాంతాలను ఒకసారి చుట్టి వచ్చేవారు. అలాంటిది కేసుల కారణంగా ఆయన మూడు నెలల సమయాన్ని రాజకీయంగా కోల్పోవాల్సి వచ్చింది. ఆయన వరసగా జిల్లాల పర్యటనకు కూడా నడుంబిగించారు.తెలంగాణ ఫలితాలను బట్టి...ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. అందుకే ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబరు 3వ తేదీన తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అక్కడ బీఆర్ఎస్ వస్తే ఒకలా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరోలా నిర్ణయం ఉండేలా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉన్నాయి. అక్కడ పోటీ చేయకుండా పరోక్షంగా ఓటు బ్యాంకును కాంగ్రెస్ కు తరలించారన్న టాక్ కూడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానితో నేరుగా పొత్తు పెట్టుకోవడానికి అయినా సిద్ధపడే అవకాశాలున్నాయి. ఎందుకంటే అందుకు చాలా కారణాలున్నాయని చెబుతున్నారు. ఒకటి ఏపీలో బీజేపీ కంటే కాంగ్రెస్ పట్ల తక్కువ వ్యతిరేకత ఉండటం ఒక కారణం కాగా, పొరుగు రాష్ట్రం నుంచి సహకారం కూడా లభించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువ మంది ఏపీకి చెందిన ఓటర్లు హైదరాబాద్‌లో ఉంటారు కాబట్టి కాంగ్రెస్ తో పొత్తు తనకు కలసి వస్తుందని నమ్ముతున్నారు. కాంగ్రెస్ తో పొత్తు వల్ల...మరొక కీలకమైన కారణం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ బలమైన నేతలున్నారు. ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేని వారు ఉన్నారు. సామాజికవర్గం పరంగా కూడా పేరున్న నేతలున్నారు. అదీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా పెద్దగా కోరుకోకపోతే కాంగ్రెస్ కు ఎంపీ స్థానాలను అధికంగా ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సిద్ధపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. విభజన జరిగి పదేళ్లు కావడంతో రాష్ట్రాన్ని విభజించారన్న ఆగ్రహం కాంగ్రెస్ పై ప్రజల్లో క్రమంగా తొలిగిపోయిందన్న అంచనాలో టీడీపీ అధినేత ఉన్నట్లు తెలిసింది. ఏ రకంగా చూసినా బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అని ఆయన భావిస్తుండటం ఈ రెండింటికి కారణం. ప్రధానంగా దళిత, ముస్లిం ఓటర్లు తమకు మద్దతు తెలిపే అవకాశాలు కూడా లేకపోలేదన్న అభిప్రాయంలో పెద్దాయన ఉన్నారు. పవన్ కూడా వదిలించుకునే ఆలోచనలోనే ఉన్నారు. బీజేపీ కలిసి వస్తే సరి. లేకుంటే దానిని వదిలేసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పవన్ ను పక్కన పెట్టైనా....ఇక పవన్ కల్యాణ‌్ విషయం అంటారా? అవసరమైతే పవన్ కల్యాణ్ కు కూడా ఝలక్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాంగ్రెస్ తో కలసి వెళ్దామని తొలుత బుజ్జగింపులు చేస్తారు. లేకుంటే వదులుకోవడానికైనా వెనుకాడరు. పవన్ కు అన్ని సీట్లు ఇచ్చి పార్టీ నేతల్లో అసంతృప్తిని తట్టుకోలేమన్న ఆలోచన కూడా ఈ దారి వెతుక్కునేలా చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ తో పొత్తు అయితే ఇరవైకి పైగా స్థానాలను ఇవ్వాల్సి ఉంటుందని, కాంగ్రెస్ అన్ని స్థానాలు ఆశించదని, అప్పుడు సీట్ల కేటాయింపు సులువవుతుందని నమ్ముతున్నారు. పవన్ తో పొత్తు అధికారికంగా ఖరారయినప్పటికీ సీట్ల విష‍యంలో కిరికిరి పెట్టి వదిలించుకుంటారన్న టాక్ వినపడుతుంది. అయితే చెప్పలేం. తెలంగాణ ఎన్నికల ఫలితాలను బట్టి మాత్రమే అక్కడ నిర్ణయం ఉంటుంది. బీఆర్ఎస్ తెలంగాణలో గెలిస్తే పవన్ తో నే ప్రయాణం సాగించే వీలుంది. బీజేపీని కూడా కలుపుకునే ప్రయత్నం ఆయన చివర వరకూ చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
https://www.telugupost.com/movie-news/asin-dismisses-divorce-rumours-with-husband-rahul-1482713
అసిన్.. ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు ముందు గుర్తొచ్చే సినిమా గజిని. అంతకుముందు అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, ఘర్షణ, శివమణి, అన్నవరం సినిమాల్లోనూ నటించిన అసిన్.. సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అసిన్.. 2016లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ శర్మను పెళ్లాడింది. అప్పటి నుంచి అసిన్ సినిమాలకు దూరంగా ఉంటోంది. వీరి వివాహ బంధానికి గుర్తుగా ఓ పాప కూడా ఉంది. అయితే.. ఇటీవల అసిన్ తన భర్తతో విడిపోతోందంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. అందుకు కారణంలో ఆమె తన సోషల్ మీడియా ఖాతా నుంచి భర్తతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించడమే. ఈ రూమర్స్ పై స్పందించిన అసిన్.. విడాకులపై క్లారిటీ ఇచ్చేసింది.ఈ మేరకు తన ఇన్ స్టా ఖాతాలో ఓ స్టోరీ పెట్టింది. "ప్రస్తుతం మేము మా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నాము. ఇద్దరం ఒకరికి ఒకరం ఎదురెదురుగా కూర్చొని టిఫిన్ చేస్తూ ఈ వార్తలు చూశాం. ఇవి పూర్తిగా అవాస్తవం, నిరాధార వార్తలు. గతంలో కూడా పెళ్లి సమయంలో మేము బ్రేకప్ చెప్పుకున్నామని వార్తలు రాశారు. ఇలాంటి వార్తలు చూసి 5 నిమిషాల సమయాన్ని వేస్ట్ చేసుకున్నందుకు నిరాశ చెందుతున్నాను. దయచేసి మంచి వార్తలు రాయండి" అని రూమర్స్ స్ప్రెడ్ చేసిన వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దీంతో అసిన్ విడాకుల వార్తలు అబద్ధమని చెప్పకనే చెప్పింది.
https://www.telugupost.com/movie-news/తను-ఎప్పుడు-స్పెషలే-38199/
మహేష్ బాబు తన పనిలో ఎంత కమిట్మెంట్ చూపిస్తాడో... ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. షూటింగ్స్ తో ఎంత బిజీగా వున్నా కూడా దొరికిన కాస్త సమయమైనా ఫ్యామిలీతో గడిపేస్తాడు. షూటింగ్స్ కి బ్రేక్ వచ్చినప్పుడు తన భార్య పిల్లల్తో కలిసి వెకేషన్స్ కి విదేశాలకు చెక్కేస్తూ అక్కడ పిల్లలతో బాగా ఎంజాయ్ చేసే మహేష్ కి తన కూతురు సితార అంటేప్రత్యేకమైన ప్రేమ. తనకి కూతురు పుట్టినప్పుడు తన ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిందంటూ ఆనందపడ్డ మహేష్ సితార ఏ పని చేసినా చాలా ముద్దుగా చేస్తుందని... సితార అల్లరి చూస్తుంటే డే ఎలా గడిచిపోయిందో కూడా తెలియదని చెప్పే మహేష్ ఇప్పుడు తన కూతురు పుట్టినరోజు రోజున ఒక స్పెషల్ ట్వీట్ చేసాడు.తన కూతురు సితార బర్త్ డే స్పెషల్ గా సోషల్ మీడియాలో గ్రీటింగ్స్ తెలియజేశాడు. ఆ ట్వీట్ ఏమిటో మీరే చూడండి. సితార నా ప్రతి రోజును స్పెషల్ గా మారుస్తుంది. తనకు ప్రత్యేకమైన ఈ రోజున మరింత ప్రేమ, అంతులేని ఆనందం దక్కాలి. నా కూతురు ఐదో వసంతంలో అడుగుపెట్టింది. తానూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ పోస్ట్ చేసాడు. కేవలం కూతురు మీద ప్రేమను అక్షరాలా రూపంలో మాత్రమే చెప్పకుండా కూతురుతో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసాడు.ఇక మహేష్ నటిస్తున్న 'స్పైడర్' చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం దసరా కానుకగా విడుదలవుతుండగా... ఇప్పుడు తాజాగా మహేష్ కొరటాల డైరెక్షన్ లో 'భరత్ అను నేను' చిత్రంలో నటిస్తున్నాడు.
https://www.telugupost.com/movie-news/మరో-ఖరీదైన-విడాకులకు-తెర-16966/
హాలీవుడ్ హీరోయిన్ యాంజిలీనా జోలీ నుంచి మోలీవుడ్ హీరోయిన్ అమల పాల్ వరకు ఈ ఏడాది సెలబ్రిటీ స్టేటస్ వున్నా అనేక మంది విడాకులు మంజూరు చేయండి అంటూ న్యాయస్థానానికి అభ్యర్ధనలు పెట్టుకున్నారు. ఈ జాబితాలోకి తాజాగా హాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ జార్జ్ క్లోని కూడా చేరిపోయాడు. ఆయనకీ చాలా ఏళ్ళ క్రితం తొలి వివాహం పెటాకులు కావటంతో వివాహం పట్ల విముఖత పెంచుకుని చాలా కలం ఎఫైర్స్ ని డేటింగులకే పరిమితం చేసాడు తప్ప వైవాహిక జీవితం జోలికి పోలేదు. కానీ సోషల్ యాక్టీవిస్ట్ కం న్యాయవాది ఐన అమల్ తో ఆయన సాన్నిహిత్యం వివాహానికి దారి తీసింది. 2014 లో ఇటలీలో ఈ జంట తమ సాన్నిహిత్యాన్ని వైవాహిక జీవితంగా మార్చుకుంది.రెండు సంవత్సరాలు గడిచే సారికే వీరి వైవాహిక జీవితం బెడిసికొట్టింది. వీరి మధ్య ఏర్పడ్డ విభేదాలు విడాకులకు దారి తీయటానికి వీరి మధ్య తీవ్రంగా వచ్చిన ఒక అభిప్రాయం భేదమే కారణమని సమాచారం. అమల్ సంతానం కోరుకుంటుండగా జార్జ్ క్లోని మాత్రం తనకు పిల్లలు మీద పెద్దగా శ్రద్ద ఉండదు అని తాను పిల్లలకి తండ్రిగా ఉండలేను అని అమల్ ని వ్యతిరేకించడంతో వీరి మధ్య సమసిపోని అభిప్రాయం భేధంగా మారి విడాకులకు దారి తీసింది అంట. అయితే ఈ విడాకులు మంజూరు అయ్యేనాటికి జార్జ్ క్లోని భరణం కింద అమల్ కు 300 మిలియన్ డాలర్లు చెల్లించనున్నాడంట. దీని బట్టి చూస్తే ఈ విడాకులు అతి ఖరీదైన విడాకులలో ఒకటిగా నిలవనుంది.
https://www.telugupost.com/movie-news/ఎక్కడికి-పోతావు-చిన్నవా-2-13922/
కార్తికేయ మరియు ప్రేమమ్ చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంతో పాటు ఆయన స్క్రిప్ట్స్ కి గొప్ప గుర్తింపు వచ్చింది. నిఖిల్ తాజా చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపుతుంది. ఈ చిత్రం ప్యాక్డ్ కొంబో తరహా లో లవ్, కామెడీ, థ్రిల్లర్, హారర్, రొమాన్స్ అన్ని అంశాలు కలిగి ఉండి అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతుంది.ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి సంభాషణల రచయిత అబ్బూరి రవి అయినప్పటికీ చిత్రంలోని ఒక కీలక సన్నివేశానికి చందూ మొండేటి సహాయ పడ్డారు అంట. నిఖిల్ కి కార్తికేయ చిత్రం నుంచి చందూ తో వున్న సత్సంబంధాలు నెమరు వేసుకుంటూ నిఖిల్ ఈ విషయాన్ని బైట పెట్టారు. ప్రేమమ్ చిత్ర చిత్రీకరణలో ఎంతో బిజీగా వున్న రోజులలో అడిగిన వెంటనే రచన లో సహాకారం ఇవ్వటానికి చందూ మొండేటి తన అమూల్యమైన సమయాన్ని కేటాయించారు అని చందూ ని పొగడ్తలతో ముంచేశాడు నిఖిల్.
https://www.telugupost.com/movie-news/rajanikanth-daughter-aiswarya-comments-about-love-after-her-divorce-with-dhanush-1355139
ప్రముఖ స్టార్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్, కూతురు ఐశ్వర్యలు తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులతో స్వస్తి పలికిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం తామిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఈ దంపతులు. వారిద్దరూ విడిపోకుండా ఉండేందుకు.. రజనీకాంత్ ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. పిల్లల భవిష్యత్, చదువుల కోసమైనా కొన్నాళ్లు కలిసి ఉండాలని కోరినా.. అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. భర్తతో విడిపోయిన తర్వాత ఐశ్వర్య తొలిసారి స్పందించారు.Also Read : కేంద్ల్రంపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కొత్త తరహా యుద్ధం ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రేమ అనేది చాలా అద్భుతమైనదని ఐశ్వర్య పేర్కొన్నారు. అంత అద్భుతమైన ప్రేమ కేవలం ఒక వ్యక్తికో లేదా ఒక వస్తువుకో సంబంధించినది కాదని చెప్పారు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేస్తుకోవడం, వ్యక్తపరుచుకోవడమే ప్రేమ అని అన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ.. తన మనసులో ప్రేమకు నిర్వచనం మారుతూ వచ్చిందని, ప్రేమ ఒక వ్యక్తితో మారిపోదని అన్నారు. ప్రస్తుతం తనకు తన తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే అత్యంత ఇష్టమైన వ్యక్తులు అని ఐశ్వర్య పేర్కొన్నారు.
https://www.telugupost.com/politics/there-are-many-doubts-about-the-resumption-of-the-nara-lokesh-yuvagalam-padayatra-1502770
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. ఆయన మరో నాలుగు వారాల పాటు బెయిల్ పై ఉంటారు. ఈలోపు న్యాయస్థానాల్లో కేసులు అనుకూలంగా వస్తే సరి. లేకుంటే తిరిగి జైలుకెళ్లాల్సిన పరిస్థితి. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పై తీర్పును రిజర్వ్ చేసి ఉంది. అది తమకు అనుకూలంగా వస్తే వెల్ అండ్ గుడ్. లేకుంటే 28వ తేదీన చంద్రబాబు జైలు బాట పట్టక తప్పదు. మరోవైపు చంద్రబాబు పై వరస కేసులు నమోదవుతున్నాయి. కేసులన్నింటిలోనూ బెయిల్ రావాల్సి ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు.. అన్నింటిలో బెయిల్ వస్తేనే ఆయన బయట ఉండగలుగారు.వరస కేసుల్లో...స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసుతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసు, ఫైబర్ నెట్ కేసు.. మద్యం కేసు... ఇసుక కేసు ఇలా వరస కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ లభించినా వాటి గడువు కూడా ముగియనుంది. ఇప్పుడు అన్ని కేసుల నుంచి చంద్రబాబు బయటపడాల్సి ఉంది. మధ్యంతర బెయిల్ వచ్చినా రాజకీయ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు జరపకూడదని న్యాయస్థానం షరతు విధించింది. దీంతో రాజకీయంగా మధ్యంతర బెయిల్ చంద్రబాబుకు పెద్దగా లాభించింది లేదు. కాకుంటే తనకు వైద్య పరీక్షలు, నెల రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకునే అవకాశం మాత్రమే చిక్కింది. పార్టీని బలోపేతం చేయాల్సిన...అయితే ఇదే తరుణంలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ పై ఉంది. నిన్న మొన్నటి వరకూ ఆయన చంద్రబాబుపై కేసుల కోసం ఢిల్లీ టు రాజమండ్రి తిరగడమే సరిపోయింది. న్యాయనిపుణలతో చర్చించడంతోనే కాలం గడిచిపోయింది. దీంతో యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించి రెండు నెలలు పైగానే అయింది. ఈ ఏడాది సెప్టంబరు 8వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాజోలు నియోజకవర్గంలో జరుగుతుంది. చంద్రబాబు అరెస్టయ్యారన్న వార్త తెలిసి తాత్కాలికంగా పాదయాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపి అక్కడి నుంచి వచ్చేశారు. చంద్రబాబు ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చినా రాజకీయ వ్యవహారాలన్నీ లోకేష్ మాత్రమే చూసుకోవాల్సి వస్తోంది. యువగళాన్ని ప్రారంభించడానికి వీలుకుదరడం లేదు. అంతా తానే అయి...మరోసారి యువగళం యాత్ర ప్రారంభించాలనుకున్నా లోకేష్ మీద కూడా కేసులు నమోదు కావడం, సీఐడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో ఆయన యాత్ర చేపట్టడానికి వీలు కాలేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 150 రోజులు మాత్రమే సమయం ఉంది. లోకేష్ తన పాదయాత్రను తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకూ చేపట్టాల్సి ఉంటుంది. దీనికి ఎంత లేదన్నా ముప్ఫయి రోజుల నుంచి నలభై రోజులు పడుతుంది. ఒకవేళ చంద్రబాబు కేసుల్లో అరెస్టయి జైలులోనే ఉండాల్సి వస్తే యాత్ర చేయడానికి వీలుండదు. అందుకే యువగళం పాదయాత్ర పై పార్టీలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత లోకేష్ పైనే ఉండటం, పొత్తుల చర్చలు కూడా ఆయనే దగ్గరుండి చూసుకోవాల్సి రావడంతో యువగళం యాత్రపై అనుమానాలు బయలుదేరాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/pawan-nidhi-174645/
పవన్ కళ్యాణ్ వరస సినిమాల్తో బిజీ. సినిమాల మధ్యలో రాజకీయాలు. అంతేకాకుండా అన్న కూతురు పెళ్లి. అయినా పవన్ సినిమాల కమిట్మెంట్స్ మాములుగా లేవు. పవన్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు అవుతుందో అనేది దర్శకనిర్మాతలకు క్లారిటీ ఉన్నట్టుగా లేదు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి మద్దతు పలికింది. అంటే మరో వారం పాటు ఈ ఎన్నికల హడావిడిలో పవన్ ఉండడం, తర్వాత నిహారిక పెళ్ళికి రాజస్థాన్ వెళ్లొచ్చాక, వకీల్ సాబ్ షూటింగ్ కూడా ఫినిష అయ్యాక పవన్, క్రిష్ సినిమా కోసం రెడీ అవుతాడు. మరి పవన్ కళ్యాణ్ సెట్స్ మీదకొచ్చేలోపు క్రిష్ కూడా పవన్ కోసం హీరోయిన్ ని ఫైనల్ చెయ్యాలి. ముందు నుండి క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అనే టాక్ వుంది. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబో మూవీ కోసం ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ ని చిత్ర బృందం సంప్రదించినట్టుగా.. పవన్ సరసన అవకాశం అనగానే నిధి మరు మాట్లాడకుండా క్రిష్ కి ఓకె చెప్పినట్టుగా ప్రచారం షురూ అయ్యింది. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో నిధి హీరోయిన్ గా దాదాపుగా ఫిక్స్ అంటున్నారు. ఇక పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న పవన్ – క్రిష్ సినిమా డిసెంబర్ రెండో వారం నుండి సెట్స్ మీదకెళుతుందని.. ఈలోపు నిధి ఫోటో షూట్ చేసి పవన్ పక్కన నిధి సరిపోతుందో లేదో చూసుకుంటారని తెలుస్తుంది.
https://www.telugupost.com/movie-news/mega-compound-not-responding-162890/
ఎప్పుడూ మెగా కాంపౌండ్ హీరోలతో పెట్టుకుని..వాళ్ళని రచ్చ చేసి.. పైశాచిక ఆనందం పొందే రామ్ గోపాల్ వర్మ ని మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఆడుకుంటూనే ఉంటారు. రామ్ చరణ్ ఏదో లైట్ గా వదిలేస్తే.. నాగబాబు మాత్రం రామ్ గోపాల్ వర్మని సోషల్ మీడియాలో ఆడుకున్నాడు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ అంటూ నానా రచ్చ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో, ఎలా ఉండేవాడో, ఇండస్ట్రీలో ఎలాంటి పని చేసాడో, ఎన్నికల తర్వాత పవర్ స్టార్ అంటూ నానా యాగీ చేస్తూ పోస్టర్స్ మీద పోస్టర్స్ వదులుతున్నాడు. అయితే వర్మ ఏం చేసిన, ఎంత చండాలం చేసినా పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించడం లేదు. అది చూసిన వర్మ మరింతగా రెచ్చిపోతున్నాడు తప్ప తగ్గడం లేదు. పవన్ కళ్యాణ్ వర్మ పై ఎదురు దాడి చేస్తే రామ్ గోపాల్ వర్మకి పబ్లిసిటీ వచ్చేది. కానీ వర్మని మెగా కాంపౌండ్ పట్టించుకోవడం లేదు. కనీసం నాగబాబు కూడా వర్మ ని ఏమి అనకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ని ఏమైనా అంటే రెచ్చిపోయి.. సోషల్ మీడియాకెక్కి రచ్చ చేసే నాగబాబు ఇప్పుడు పవర్ స్టార్ బయోపిక్ విషయంలో మాట్లాడక పోవడం వెనుక పవన్ ఉన్నాడేమో అనిపిస్తుంది. వర్మని కెలికితే అది మనకి మనమే రచ్చ చేసుకుని రోడ్డెక్కినట్టు.. అందుకే మీరెవరు మాట్లాడవద్దు.. వర్మ ఎంత వరకు వేళ్తాడో వెళ్లనీయండి.. మీరు మాత్రం సైలెంట్ గా ఉండండి అని మెగా హీరోలకు పవన్ చెప్పాడేమో.. లేదంటే ఈపాటికి వర్మపై మెగా హీరోలు ఒకొక్కరిగా పడిపోయేవారే.
https://www.telugupost.com/movie-news/anthariksham-updates-91044/
వరుణ్ తేజ్, అదితీరావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న 'అంతరిక్షం 9000 KMPH ' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.. ఈ విషయాన్ని సినిమా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ లో తెలియజేశారు. షూటింగ్ స్పాట్ లో ని ఓ ఫోటోని యాడ్ చేస్తూ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో అమేజింగ్ గా అనిపించింది అని వెల్లడించారు. మొదటి సినిమా 'ఘాజి' తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైటెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ని హాలీవుడ్ నిపుణులు డిజైన్ చేయగా విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా హై లెవెల్లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.నిర్మాతగా మారిన క్రిష్ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలు పెరిగాయి.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుండగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని మిగిల్చబోతుంది. తెలుగులో పూర్తిస్థాయి 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన తొలి సినిమా ఇదే.
https://www.telugupost.com/crime/software-engineer-deepthi-murder-mystery-solved-by-telangana-police-1492796
జగిత్యాల జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి కేసును పోలీసులు ఛేదించారు. దీప్తి సోదరి చందన ఆమె ప్రియుడు ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. దీప్తి సోదరి చందనతో పాటు ఆమె ప్రియుడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రహస్య ప్రాంతంలో విచారించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో సోదరిపై మొదటి నుంచి అనుమానం ఉంది. అయితే హత్య జరిగిన రెండో రోజు తన అన్నకు ఫోన్ చేసిన చందన తనకు ఏ పాపం తెలియదని కన్నీరుమున్నీరైంది. దీంతో అసలు హంతకుడు ఎవరనే ఉత్కంఠ కొనసాగింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దీప్తి మృతి చెందిన రోజే చెల్లెలు చందన కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. భీమునిదుబ్బ ప్రాంతంలో దంపతులు బంకా శ్రీనివాస్‌రెడ్డి, మాధవి నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి (24), చందన, సాయి అనే ముగ్గురు పిల్లలు. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. రెండో కూతురు చందన బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఖాళీగా ఉంది. కొడుకు సాయి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. బంధువులు రావడంతో శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులిద్దరూ తమ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫోన్ చేయగా పెద్దమ్మాయి దీప్తి ఫోన్ రిసీవ్ చేయలేదు. చిన్న కూతురు చందన ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌లో ఉంది. స్థానికులు ఇంటి తలుపులు తెరిచి చూడగా దీప్తి అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సోఫాలో దీప్తి మృతదేహం పడి ఉండగా వంటగదిలో రెండు మద్యం సీసాలు, శీతల పానీయం సీసా, ఫుడ్ ప్యాకెట్లు కనిపించాయి.చందన కనిపించకుండా పోవడంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సోమవారం ఉదయం 5.12 గంటల నుంచి 5.16 గంటల వరకు ఓ యువకుడితో కలిసి నిజామాబాద్‌ బస్టాండ్‌లో కూర్చుంది. ఆ తర్వాత నిజామాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కినట్లు కెమెరాల్లో రికార్డు అయింది. విచారణలో తానే తన అక్క దీప్తిని చంపినట్టు చందన ఒప్పుకుంది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి, పైనుంచి చున్నీ కూడా చుట్టి గాలాడకుండా చేసి వెళ్లిపోయినట్టు చెల్లి చందన ఒప్పుకుంది. బాయ్ ఫ్రెండ్, అతడి తల్లి, మరో బంధువుతో పాటు కారు డ్రైవర్‌ కూడా ఇందులో భాగమైనట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న చందన.. సీనియర్ అయిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని వాళ్లింట్లో చెప్పటంతో.. మతాతంతర వివాహం కావడం వల్ల చందన తల్లిదండ్రులు, అక్క దీప్తి ఒప్పుకోలేదని విచారణలో తెలిసింది.
https://www.telugupost.com/crime/drugs-being-supplied-in-the-form-of-fruits-were-caught-by-directorate-of-revenue-intelligence-officials-in-navi-mumbai-1441595
పండ్ల మాటున సరఫరా చేస్తున్న డ్రగ్స్ ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు నవీ ముంబయిలో పట్టుకున్నారు. 198 కిలోల క్రిస్టల్ మెథాంఫేటమిస్, తొమ్మిది కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,476 కోట్ల రూపాయలు అని డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దేశంలో ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న యాంఫెటమైన్, కొకైన్ లలో ఇదే అధిక మొత్తం అని అధికారులు తెలిపారు.ఆరెంజ్ పండ్ల మాటున...పక్కా సమాచారం అందడంతో పండ్ల ట్రక్కులో ఈ డ్రగ్స్ ను కనుగొన్నారు. ఆరెంజ్ పండ్ల బాక్సులలో ఈ డ్రగ్స్ ఉంచి భారత్ లోకి తీసుకువచ్చారు. డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకున్నారు. ఈ డ్రగ్స్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డగ్ర్స్ ను సప్లయ్ చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
https://www.telugupost.com/crime/suspect-in-killing-of-8-people-in-suburban-chicago-shoots-self-dead-say-us-cops-1516576
అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రం‌‌లోని షికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసు అధికారులు వెల్లడించారు. జోలియట్‌లోని వెస్ట్ ఎకర్స్ రోడ్‌లో ఉన్న 2200 బ్లాక్‌లో ఈ కాల్పుల ఘటన జరిగిందని, నిందితుడిని రోమియో నాన్స్‌ గా గుర్తించారు. రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడని, మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారని జోలియట్‌ పోలీసు చీఫ్ బిల్ ఎవాన్స్ మీడియాకు వెల్లడించారు.23 ఏళ్ల రోమియో నాన్స్ తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నాన్స్ కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తాడని తెలిపారు. ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కారులో పరారయ్యాడు. అతడి వద్ద ఆయుధం ఉండడంతో స్థానిక పౌరులను జోలియట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తం చేసింది. టెక్సాస్‌లోని నటాలియా సమీపంలో నాన్స్ ను గుర్తించారు. పోలీసులు చుట్టుముడుతూ ఉన్నారని భావించే సమయంలో అతను తనను తాను కాల్చుకుని చనిపోయాడు. చికాగో శివార్లలోని మూడు ప్రదేశాలలో నాన్స్ ఎనిమిది మంది వ్యక్తులను ఘోరంగా కాల్చిచంపాడు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదని, అయితే బాధితులు నాన్స్‌కు తెలుసునని పోలీసులు తెలిపారు.
https://www.telugupost.com/politics/ntrs-100th-birth-anniversary-celebrations-tdp-to-held-mahanadu-in-ongole-district-on-may-27th-and-28th-1369901
అమరావతి : దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టిడిపి మహానాడుగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది మాదిరి.. ఈ ఏడాది కూడా టిడిపి మహానాడు నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈసారి శతజయంతి వేడుకల సందర్భంగా నూతన భావజాలాన్ని చాటేలా.. ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం గ్రామ పరిధిలో మహానాడు నిర్వహించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఈ మేరకు నిర్వహణ కమిటీలతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. తొలుత ఒంగోలు మినీ స్టేడియం వద్ద మహానాడు నిర్వహించాలనుకున్నా.. అందుకు ప్రభుత్వం నిరాకరించడంతో వేదికను మార్చినట్లు చంద్రబాబు తెలిపారు. మొదట పరిశీలించిన మండువారి పాలెంలోనే మహానాడు నిర్వహిస్తామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు.మండువారిపాలెం రెవెన్యూ విలేజ్ పరిధిలో గల త్రోవగుంట ప్రాంతంలో మే 27,28 తేదీల్లో టిడిపి మహానాడు జరగనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మహానాడు నిర్వహణ సమయానికి వర్షాలు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ఒంగోలు మినీ స్టేడియం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా.. చివరి నిమిషంలో నిరాకరించడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో..తొలుత పరిశీలించిన బృందావన్ ఫంక్షన్ హాల్ ప్రాంతంలోనే మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. నూతనత్వంతో, భావజాలం చాటేలా మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. స్టేడియం కోసం దరఖాస్తు చేసి, అవసరమైన ఫీజు చెల్లించినా ప్రభుత్వం ఒంగోలు మినీ స్టేడియం ఇవ్వకపోవడంపై టిడిపి నేతలు మండిపడ్డారు. మే 17 నుంచి సభా ప్రాంగణంలో మహానాడు పనులు మొదలవుతాయని పార్టీ నేతలు తెలిపారు.
https://www.telugupost.com/movie-news/no-fight-in-mega-family-says-producer-ravishankar-1549732
మెగా కుటుంబంలో విబేధాలు వచ్చాయంటూ ఇటీవల వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే బూతులు తిట్టుకునేలా చర్చా వేదికను ఏర్పాటు చేసి హీరో అభిమానులను రెచ్చగొట్టాయి కూడా. సినీ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు 'పుష్ప 2' గురించి కాదని అన్నారు. పవన్ ఎప్పుడూ ఒకరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడరని మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటేనని అన్నారు. 'మ‌త్తు వ‌ద‌ల‌రా-2' మూవీ టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌విశంక‌ర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవ‌లే మేము ప‌వ‌న్ కళ్యాణ్ ను క‌లిశామన్నారు, 'ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్' షూట్ కొన్ని వారాల్లోనే మొద‌లు కానుందన్నారు. చిత్రం తాలూకు మొత్తం షూటింగ్ జ‌న‌వ‌రి 2025 వ‌ర‌కు పూర్తి చేసేయాల‌ని నిర్ణ‌యించామని తెలిపారు. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తైన పార్ట్ నుంచి ఏదో ఒక స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ అభిమానుల‌కు ఇస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా వస్తోంది.
https://www.telugupost.com/Telangana-assembly-elections-2023/election-heat-is-on-in-telangana-there-is-a-political-scene-like-never-before-1500355
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పొలిటికల్ సీన్ ఉంది. ఎవరిది గెలుపు అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీగా ఉన్నాయి. సర్వేల్లో కాంగ్రెస్ పార్టీదే కొంచెం పై చేయి కనిపిస్తున్నా చివరి నిమిషంలో ఏమవుతుందోనన్న టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా కారు పార్టీకి ఈ ఎన్నికలు అంత సులువు కాదు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నప్పటికీ అది అధికారం అందుకునేంతగా అంటే.. చెప్పలేని పరిస్థితి. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న విశ్లేషణలు కూడా ఊపందుకుంటున్నాయి.హంగ్ వస్తుందన్న...తెలంగాణలో హంగ్ వస్తుందన్న అంచనాలు నిజమవుతాయా? లేదా? అన్నది పక్కన పెడితే ఈసారి మాత్రం ఫైట్ వన్ సైడ్ మాత్రం కాదన్నది సుస్పష్టం. అది అధికార బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసు. బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా కాంగ్రెస్ మాత్రం విజయం అంచు వరకూ వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు నిజమవుతాయని ఎక్కువ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కొంత మార్పును కోరుకోవడం వల్లనే కాంగ్రెస్ బలోపేతమయిందని చెబుతున్నారు. కొన్ని రంగాల ప్రజలు అధికార పార్టీపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వల్ల ఈసారి ఏకపక్ష గెలుపు బీఆర్ఎస్ కు సాధ్యం కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.కాంగ్రెస్ పుంజుకోవడంతో...కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అయితే క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. అలాగే వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమన్న అంచనాలు వినపడుతున్నాయి. హంగ్ అసెంబ్లీ వస్తే ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందన్న చర్చ కూడా ఇప్పుడు తెలంగాణలో ఊపందుకుంది. బీఆర్ఎస్ ‌తో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా బీజేపీ ఆ పార్టీ పక్షాన నిలుస్తుందన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా నిలువరించడమే బీజేపీ లక్ష్యం కాబట్టి ప్రభుత్వంలో కలవకుండా బయట నుంచి బీజేపీ మద్దతు ప్రకటించే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు.స్వతంత్ర అభ్యర్థులకు...ఇక కాంగ్రెస్ కు ఎవరు మద్దతిస్తారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఎమ్మెల్యేల కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉంటాయన్న లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో మంచి ఫైట్ జరుగుతుంది. ఈసారి గెలిచే స్వతంత్ర అభ్యర్థులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు? ఒకవేళ గెలిచినా వారు ఏ గూటికి చేరతారు? అంటే అప్పటికప్పడు వారికి దక్కే పదవులు, అందే ప్యాకేజీపైనే ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మొత్తం మీద హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న విశ్లేషణలతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం అప్రమత్తమై ప్రచారాన్ని ఉధృతం చేశాయి. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.
https://www.telugupost.com/movie-news/maharshi-records-before-movie-release-120474/
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ ఈ నెల 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో భారీ స్థాయిలో రిలీజ్ అవ్వబోతుంది. అక్కడ ఈ చిత్రానికి తొలి రోజు 2500కు పైగా ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ రేంజ్ లో అమెరికాలో తెలుగు సినిమా రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి. అలా ముందుగానే రికార్డు క్రియేట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డును సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ అదే రేంజ్ లో రిలీజ్ అవుతుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు ట్రేడ్ వారు. ఇక ఈ చిత్రాన్ని రెండేళ్లు గ్యాప్ తరువాత వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. ఇందులో అల్లరి నరేశ్, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ ఈ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందించాడు.
https://www.telugupost.com/movie-news/దానిపై-కేసు-వెయ్యడం-అనేద-33911/
పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా.. అన్నట్లుగా నిర్మాతలందు అల్లుఅరవిందే వేరయ్యా అని చెప్పాలి. ఈ నిర్మాత నీతులు చెప్పమంటే బహు చక్కగా, వినసొంపగా చెబుతాడు. ఇక తన విషయానికి వస్తే అన్నీ అడ్డమైన వాదనలే. ఇక తెలుగులోనే కాదు.. ఏ భాషలోనైనా ఫ్రీమేక్‌లు ఎంతో కామన్‌. అసలు ఏ కథ అయినా గతంలో తీసిన ఏదో ఒక చిత్రం నుంచి స్ఫూర్తిగా పొంది.. వాటి ప్రభావంతో కొత్త కథలను రాసుకుంటూ ఉంటారు. ఒకే కథను ఒక్కో క్యారెక్టర్‌ యాంగిల్‌లోంచి చూసి, కొత్త కథ అనే కలరింగ్‌ ఇస్తుంటారు. ఇక సాంకేతిక పెరిగిన ఈరోజుల్లో ఏ కొరియన్‌ చిత్రాన్నో, చైనీస్‌ చిత్రాన్నో వాడుకుంటారు. స్వాతి, విపుల, చతుర వంటి పుస్తకాలలో వచ్చే కథలు, క్యారెక్టర్లను బేస్‌ చేసుకుంటారు. మహాభారతంలోని ఎపిసోడ్స్‌నో, రామాయణంలోని స్పూర్తినో పొందుతుంటారు. ఒకే ఒక్క 'గాడ్‌ఫాదర్‌' అనే పాయింట్‌ని తీసుకొని వందల చిత్రాలు తీశారు. ఇక అల్లుగారి విషయానికి వస్తే ఆయన నిర్మించిన అనేక చిత్రాలలోని కథలు, క్యారెక్టర్లు కూడా ఎక్కడో చూసిన తలంపులు తెచ్చేవే అని చెప్పడం తప్పుకాదు. ఇక తన 'మగధీర' చిత్రాన్ని తీసుకుని బాలీవుడ్‌లో 'రాబ్తా' అనే చిత్రం రూపొందిందని అల్లు వారు కోర్టు మెట్టెక్కారు. కాగా తాను 1998లో రాసిన 'చందేరి' అనే నవలను కాపీ కొట్టి 'మగధీర' తీశారని రచయిత ఎస్‌.పి.చారి అంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఆర్చారాజ్యానికి చెందిన ఇద్దరు ప్రేమికులు మరణించి 400ఏళ్ల తర్వాత మరలా జన్మించి ఎలా ఒకటయ్యారు అనేది తన నవల మెయిన్‌ పాయింట్‌ అని ఆయన చెబుతున్నాడు. నా నవలలో మెయిన్‌ విలన్‌ హీరో సోదరుడు అయితే 'మగధీర'లో హీరోయిన్‌కి బావగా చూపించారట. గీతాఆర్ట్స్‌కి వ్యతిరేకంగా తాను ఫిల్మ్‌ చాంబర్‌కి వెళ్లినా తనను పట్టించుకోలేదని, ఈ కథ విషయంలో తాను కాపీ రైట్స్‌ యాక్ట్‌ కింద కోర్టుకి వెళ్తానంటున్నాడు. ఇక 'మగధీర'ను షాహిద్‌ కపూర్‌హీరోగా హిందీలో తీయాలని సాజిద్‌ నదియావాలా భావించి, అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడని కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇక 'మగధీర'లోని ఓ లిరిక్‌పై వంగపండు కూడా ఆక్షేపణ తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఈ కథను రాసింది విజయేంద్రప్రసాద్‌. ఈయన గారు కూడ ఎప్పుడో వచ్చిన 'పసివాడి ప్రాణం' కథను స్ఫూర్తిగా తీసుకొని 'భజరంగీ భాయిజాన్‌' కథను రాశాడు. మరి ఇప్పుడు 'మగధీర' విషయంలో 'రాబ్తా'ను నిందించడం, కోర్టు వరకు వెళ్లడం అల్లువారికి సరిపడదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
https://www.telugupost.com/movie-news/mrunal-thakur-hikes-her-remuneration-after-sitaramam-success-1435951
టాలీవుడ్ లో ఇటీవల వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ప్రేక్షకుల మనసులు దోచుకున్న చిత్రం "సీతారామం". హను రాఘవపూడి దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.. రామ్ గా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీత పాత్రలో ఒదిగిపోయింది. తన అందంతో ప్రేక్షకుడిని కట్టిపడేసింది మృణాల్. సీత క్యారెక్టర్ తో ఈ బ్యూటీకి మంచి పేరు వచ్చింది. బింబిసార - సీతారామం ఒకేసారి విడుదలైనప్పటికీ.. ఆ పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచిందీ సినిమా.సీతారామంలో అమ్మడి అందచందాలతో పాటు అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించిన లుక్స్, ఆమె హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక మృణాల్ అందానికి చాలామంది టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఫిదా అయ్యారు. సీతారామం హిట్ తో.. మృణాల్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నట్లు టాక్. ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతున్న పేరు మృణాల్. టాలీవుడ్ లో తన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో.. మృణాల్ తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసిందట. ఇప్పటికే రెండ్ ప్రాజెక్టుల్లో మృణాల్ కు ఆఫర్ లభించగా.. అందులో ఒకటి వైజయంతి మూవీస్ బ్యానరే కావడం విశేషం.సీతా రామం తరువాత మరోసారి వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నటించే ఛాన్స్ రావడంతో, మృణాల్ తన రెమ్యునరేషన్ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోందట. సీతా రామం సక్సెస్‌ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. తన నెక్ట్స్ సినిమాల్లో రెమ్యునరేషన్ ను ఏకంగా కోటిరూపాయలకు పెంచేసిందని తెలుస్తోంది. అయితే.. సీతా రామంలో ఈ అమ్మడి పెర్ఫామెన్స్ కు ఫిదా అయిన నిర్మాతలు.. అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు వెనుకాడట్లేదట.
https://www.telugupost.com/movie-news/హమ్మయ్య-జై-లవ-కుశ-పనైపోయి-44326/
గత పది రోజుల నుండి ఎవరినోట విన్న జై లవ కుశ.. జై లవ కుశ. ఆ రేంజ్ లో పబ్లిసిటీ కార్యక్రమాలను చేపట్టింది చిత్ర బృందం. ఏనోట విన్నా అదేమాట. ఏ ఛానల్ లో విన్నా అదే న్యూస్, ఏ పేపర్ చూసినా అదే వార్త, ఏ వెబ్ సైట్ చూసినా అదే కథనం... ఇక నిన్న శుక్రవారంతో జై లవ కుశ పబ్లిసిటీ కార్యక్రమాలకు స్వస్తి చెప్పేసారు చిత్ర బృందం. ఇప్పుడు జై లవ కుశ చిత్రం థియేటర్స్ లో దిగిపోయి మంచి టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇక జై లవ కుశ వార్తలేవి మీడియాలో వెలువడవా అనే అనుమానాలు వచ్చేస్తున్నాయా అయితే ఆగండి... అక్కడే ఆగండి.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ దసరా రేస్ లో ఉన్న జై లవ కుశ సినిమా విడుదలైపోయింది. ఇక మహేష్ స్పైడర్ విడుదల కావాల్సి ఉంది. ఇక ఇప్పుడు పబ్లిసిటీ కార్యక్రమాలను స్పైడర్ స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇప్పటికే స్పైడర్ పబ్లిసిటీ కార్యక్రమాలు వీక్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక జై లవ కుశ థియేటర్స్ లోకి వచ్చాక ఫస్ట్ డే కలెక్షన్స్ తోనూ, జై లవ కుశ సక్సెస్ మీట్ తోనూ .. లేకుంటే థాంక్స్ మీట్ అంటూ హడావిడి చేస్తారు. ఇక ఒక వారం తర్వాత జై లవ కుశ మొదటి వారం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ అంటూ వేస్తారు. ఇక దానితో జై లవ కుశ మరుగున పడిపోతుంది.ఇక స్పైడర్ తోపాటు ఈ దసరా బరిలో ఉన్న మరో సినిమా మహానుభావుడు పబ్లిసిటీ కూడా మొదలుపెడుతుంది చిత్ర బృందం. శర్వానంద్ - మారుతీ తమ సినిమా మీద ఉన్న నమ్మకంతోనే రెండు పెద్ద సినిమాల మధ్యన మహానుభావుడిని దింపుతున్నారు. మరి చిన్న సినిమాకి గట్తిగా ప్రమోషన్ చేస్తే... సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ పడినా దాన్ని అందుకోవడం కష్టమే. మరి జై లవ కుశ పబ్లిసిటీ హవా ముగిసినా మళ్ళీ ఇప్పుడు స్పైడర్, మహానుభావుడు పబ్లిసిటీ హవా మొదలవుతుంది. అదన్న మాట జై లవ కుశ పనైపోయింది అనడానికి మీనింగు.
https://www.telugupost.com/crime/a-love-couple-attempts-suicide-by-jumping-into-sagar-canal-as-the-elders-do-not-agree-to-love-1360675
ప్రేమకు పెద్దలు అంగీకరరించలేదని ఒక ప్రేమ జంట కాల్వలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో యువతిని స్థానికులు కాపాడగా యువకుడు మాత్రం నీటిలో కొట్టుకుపోయారు. ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నల్లగొండ జిల్లా హాలియా వద్ద ఈ ఘటన జరిగింది. నల్లగొండ జిల్లా పీఏ పల్లికి చెందిన బాలకృష్ణ తన మరదలిని ప్రేమించాడు. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించేలేదు.యువకుడు మాత్రం....దీంతో ఈరోజు ఉదయం ఇద్దరూ హాలియా వచ్చి సాగర్ కాల్వలోకి దూకారు. అయితే గమనించిన స్థానికులు తాడు సాయంతో యువతిని కాపాడగలిగారు. ఈ ఘటనలో బాలకృష్ణ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.
https://www.telugupost.com/movie-news/rrr-first-look-110042/
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న #RRR చిత్రం ను రాజమౌళి తన స్టైల్ లో తీర్చిదిద్దుతున్నారు. ఎక్కడ రాజి పడకుండా పక్క ప్లాన్ తో షూటింగ్ జరుపుతున్నాడు. స్టిల్స్ అండ్ లుక్స్ ఎక్కడ రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ లుక్స్ విడుదల చేసే ప్రక్రియ షురూ అయింది. రీసెంట్ గా రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి పనులు ముగించుకుని #RRR కి పని చేయడం స్టార్ట్ చేసాడు. ఈనేపధ్యంలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే నెల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ ఒక్కడిదే రెడీ చేయాలనేది టార్గెట్. అయితే కేవలం ఓ స్టిల్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటారా లేక బాహుబలి టైపులో ఓ థీమ్ క్రియేట్ చేసి వీడియో విడుదల చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. బాహుబలి ప్రమోషన్స్ విషయంలో కార్తికేయ కీలక పాత్ర పోషించాడు. స్టిల్స్ తో పాటు ప్రత్యేకంగా ఓ థీమ్ ను సెలక్ట్ చేసి దాన్ని ప్రమోట్ చేసాడు. ఇప్పుడు #RRR విషయం సేమ్ 2 సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతాడో లేదో చూడాలి. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయిపోతుంది ఇంకా హీరోయిన్స్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ దాదాపు కంఫర్మ్ అయినట్టు టాక్.
https://www.telugupost.com/movie-news/హీరోయిన్-ని-చంపేస్తామంటూ-25238/
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాతైన మహేష్ భట్ కి వరుసగా అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తాము కోరిన విధంగా 50 లక్షల రూపాయలను ఇవ్వకపోతే తన కూతురు ఆలియా భట్ ని హతమారుస్తామని ముందుగా ఒక ఫోన్ కాల్ రాగా, ఏదో ప్రాంక్ కాల్ ఐయి ఉండొచ్చు అని మహేష్ భట్ తేలికగా తీసుకున్నారు. అయితే అదే వ్యక్తి నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ తోపాటు వాట్స్ అప్ మెసేజెస్ అందుతుండటంతో ఆందోళన చెందిన మహేష్ భట్ బొంబాయి పోలీసులను సంప్రదించి తనకు వచ్చిన ఫోన్ నెంబర్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేపించారు. వెంటనే రంగంలోకి దిగిన బొంబాయి పోలీస్ లు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అయితే ఆ యువకుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఉత్తర ప్రదేశ్ పోలిసుల సహకారంతో కేసును విచారిస్తున్న బొంబాయి పోలీసులు త్వరలోనే ఆ అజ్ఞాత వ్యక్తిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మహేష్ భట్ ఇచ్చిన కంప్లైంట్ కు వెంటనే రియాక్ట్ ఐన బొంబాయి పోలీసులు మరియు వారికి సహకరిస్తున్న ఉత్తర ప్రదేశ్ పోలీస్ లు చాలా సమర్ధవంతంగా పని చేస్తున్నారని మహేష్ భట్ తన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
https://www.telugupost.com/movie-news/actress-hansika-marrying-her-best-friends-ex-husband-1446850
నటి, యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిసిందే. ఇటీవలే తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది. పారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద తన బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసిన ఫోటోలని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది హన్సిక. అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. హన్సిక భర్తకి ఆల్రెడీ పెళ్లైపోయిందని, అది కూడా హన్సిక ఫ్రెండ్ తోనే అని, వాళ్ళు విడాకులు తీసుకోవడంతో ఇప్పుడు వీరిద్దరి పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.అందుకు తగ్గట్టుగా.. సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. హన్సిక పెళ్లి చేసుకోబోయే సోహెల్ కి.. 2016లోనే హన్సిక పెళ్లైపోయిందని తెలుస్తోంది.వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఓ వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది. రింకీ హన్సికకి స్నేహితురాలేనట. సోహెల్ కూడా ఎప్పట్నుంచో హన్సికకి స్నేహితుడు అట. రింకీ - సోహెల్ విడిపోయాక సోహెల్ హన్సికకు దగ్గరయ్యాడని సమాచారం. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నాకే ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు, నెటిజన్లు ఇది నిజమేనా అని హన్సికను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై హన్సిక ఇప్పటి వరకూ స్పందించలేదు.
https://www.telugupost.com/movie-news/బాలయ్య-జోరుకు-కుర్రాళ్ళు-51725/
బాలయ్య కి వయసొస్తున్న కొద్దీ ఊపోస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే గత ఏడాది నుండి బాలకృష్ణ సినిమాల్లో యమ జోరు చూపిస్తున్నాడు. 99 వ చిత్రం దగ్గరనుండి ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా బాలకృష్ణ సినిమాలను లైన్ లో పెడుతూ పిచ్చెక్కిస్తున్నాడు. 99 వ సినిమానుండే బాలయ్య జోరు పెరిగింది. డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ వంటి చిత్రాలను వరసబెట్టి ప్రేక్షకులకు అందించిన బాలకృష్ణ ఇప్పుడు రవికుమార్ దర్శకత్వంలో జై సింహ ని థియేటర్స్లోకి దింపెయ్యడానికి రెడీగా ఉన్నాడు. జై సింహ షూటింగ్ రెండు రోజుల క్రితమే పూర్తయ్యింది. ఇక జై సింహ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. 103 వ చిత్రాన్ని ఎన్టీఆర్ బయో పిక్ గా తీస్తానని ప్రకటించిన బాలకృష్ణ ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టి... సీనియర్ దర్శకుడు ఎస్ వి కృష్ణ రెడ్డి దర్శకత్వంలో తన 103 వ చిత్రాన్ని చెయ్యబోతున్నాడు. జనవరి నుంచి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ తన కొత్త చిత్రాన్ని మొదలుపెడతాడని తెలుస్తోంది. ఎస్ వి కృష్ణారెడ్డి యమలీల.. ఘటోత్కచుడు తరహాలో మరోసారి ఫ్యాంటసీ సబ్జెక్టును తీసుకుని బాలకృష్ణను ని కలవగా..... ఆయన చెప్పిన సబ్జెక్టు బాలయ్యను ఆకట్టుకుందని తెలుస్తోంది. జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించేద్దామని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.అంటే జై సింహ అలా విడుదలవుతుందో లేదో... నెల రోజుల గ్యాప్ లోనే బాలకృష్ణ మరో సినిమా మొదలుపెట్టేస్తుండడం విశేషం. మరోపక్క 104 వ సినిమాని బోయపాటికి కమిట్ అయినట్లుగాకూడా తెలుస్తుంది. మరి ఇదంతా చూస్తుంటే బాలయ్య బాబుని చూసిన కుర్ర హీరోలకు దడ పుట్టడం ఖాయంగా కనబడుతుంది. ఎందుకంటే బాలకృష్ణ లాగ కుర్ర హీరోలెవరు సినిమాల మీద సినిమాలు చెయ్యడం లేదు. అందుకని బాలయ్య స్పీడు కి కుర్రాళ్లకు దడదడే.
https://www.telugupost.com/movie-news/tiktok-durgarao-168011/
టిక్ టాక్ లో దుర్గారావు అనే వ్యక్తి ఆయన భార్య కలిసి హిట్ సాంగ్స్ కి దుర్గరావు నాట్యమండలి అని పేరు పెట్టి వేసిన ఫన్నీ డాన్స్ లు సోషల్ మీడియాలో టిక్ టాక్ లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. దుర్గారావు దంపతులు తమ రోజువారీ పనులతో పాటుగా ఇలా ఫన్నీ గా డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. వీళ్ళకి టిక్ టాక్ లో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. అయితే టిక్ టాక్ యాప్ కేంద్రం ఆపేసినా.. దుర్గారావు దంపతులు యూట్యూబ్ లోను తమ హావ కొనసాగిస్తున్నారు. అయితే జబర్దస్ ఆది అటు యాంకర్స్ ని కానీ, ఇటు పాపులర్ ఫిగర్స్ ని కానీ తన జబర్దస్త్ స్కిట్స్ లో హైలెట్ చేసి మార్కులు కొట్టేస్తుంటారు. అయితే ఈమధ్యనే ఆది స్కిట్ లో దుర్గారావు దంపతుల ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు జబర్దస్త్ మీద పోటీగా మొదలైన అదిరింది ప్రొగ్రాంలోను దుర్గారావు దంపతులు మొదటిగా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు. అయితే జబర్దస్త్ లో ఆది స్కిట్ లో ఓ అర నిమిషమే కనబడిన దుర్గారావు.. అదిరింది షోలో మాత్రం బాగా హైలెట్ అయ్యాడు. అయితే సుధీర్ బ్యాచ్ దుర్గారావు ఆయన భార్య ని జబర్దస్త్ లోకి ఆహ్వానించడానికి వాళ్ళ ఊరు వెళ్లారని.. అంటున్నారు. ఇక దుర్గారావు జబర్దస్త్ కన్నా ఎక్కువగా అదిరిందిలోనే పాపులర్ ఫిగర్ లా కనబడుతునాన్డు. జబర్దస్త్ దుర్గారావు ని అంతగా వాడలేదు కానీ అదిరింది సద్దాం స్కిట్ లో దుర్గారావు ని బాగా వాడేశారు.
https://www.telugupost.com/movie-news/ntr-kathanayakudu-opening-shot-103295/
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో బాలకృష్ణ – క్రిష్ ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు రిలీజ్ చేసిన ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు ఉండడంతో సినిమా ఎలా ఉండబోతుంది..? అసలు ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తున్నారు..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో రీసెంట్ గా “కథానాయకుడు” సినిమా ఓపెనింగ్ సీన్ ఎలా ఉండబోతుందని చర్చ జరిగింది. హాస్పిటల్ సీన్ తో స్టార్ట్ తాజా సమాచారం ప్రకారం సినిమా ఓపెనింగ్ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని చెబుతున్నారు. హాస్పిటల్ లో ఎన్టీఆర్ భార్య బసతారకంపై ఓపెన్ సీన్ ఉంటుందట. బసతారకం కాన్సర్ తో పోరాడే సీన్ ను చూపిస్తారట. బసతారకం పరిస్థితి చూసి అక్కడే హాస్పిటల్ లో చైర్ మీద ఎన్టీఆర్ కూలబడిపోయి అసలు తాను స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు అనేది ఆలోచించుకుంటున్నపుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడని చెబుతున్నారు. ఇలా ఓపెనింగ్ సీనే ఎమోషనల్ గా చూపిస్తే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని క్రిష్ భావిస్తున్నాడు. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న, రెండవ పార్ట్ ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్నాయి.
https://www.telugupost.com/movie-news/దిల్-రాజు-ఫీల్-అవుతున్నా-53988/
ఫిదా సినిమాతో తెలంగాణ యాసలో సాధారణ ప్రేక్షకులని కాదు సినీ క్రిటిక్స్ ని కూడా ఫిదా చేసింది సాయి పల్లవి. న్యాచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి 'ఎంసీఏ'లో న‌టించింది. దీంతో, ఆ సినిమాలో కూడా సాయి ప‌ల్ల‌వి క్యారెక్ట‌ర్ ఫిదా రేంజ్ లో కాక‌పోయినా...ఓ మోస్త‌రుగా ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు ఊహించుకున్నారు.అయితే 'ఎంసీఏ' కథ మొత్తం నాని - భూమిక మధ్యే జరగడం..సాయి పల్లవి - నాని మధ్య లవ్ సీన్స్ ఎక్కువ లేకపోవడంతో సినిమా కలెక్షన్స్ పైన ప్రభావం ఉందని దిల్ రాజు భావిస్తున్నాడట. నాని-సాయి ప‌ల్ల‌వి ల మ‌ధ్య నాలుగు రొమాంటిక్ సీన్ల‌ను దిల్ రాజు లేపేయ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.డబల్ హాట్ ట్రిక్ కొట్టేశామ‌ని దిల్ రాజు చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం ఎంసీఏ క‌లెక్ష‌న్ల‌పై కొద్దిగా అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. సినిమాలో నాని - భూమిక మధ్య సీన్స్ హైలైట్ అవుతాయని దిల్ రాజు భావించారట. అందుకే నాని - సాయిపల్లవి మధ్య గల నాలుగు రొమాంటిక్ సీన్స్ క‌ట్ చేశార‌ట‌. అయితే వీరిద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటే బాగుండేద‌నే టాక్ వ‌చ్చింద‌ట‌. ఆ సీన్స్ ఉంటే ఎంసీఏకు మ‌రింత కిక్ వ‌చ్చేద‌ని.... కలెక్షన్స్ కూడా బాగానే వచ్చేవని దిల్ రాజు ఫీలవుతున్నారట. అయితే, చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్లు ఇపుడు ఆ సీన్స్ ను యాడ్ చేస్తారా....లేక అలాగే వ‌దిలేస్తారా అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.
https://www.telugupost.com/movie-news/nayanatara-to-act-in-pawan-kalyan-re-entry-movie-139076/
పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు ఇది ఫిక్స్ అంటూ వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్.. ఏ. ఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ సినిమా మొదలవుతుంది అనగానే… ఆ సినిమాపై రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ రీ ఎంట్రీ తో డబుల్ అయ్యిందని… పవన్ క్రేజ్ తో ఆయన అడిగింది నిర్మాత ఇస్తున్నారని అంటున్నారు. ఇక జానపద కథగా పవన్ సినిమా స్క్రిప్ట్ ని క్రిష్ ప్రిపేర్ చేశాడంటూ మరో న్యూస్. తాజాగా పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమాలో పవన్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని అంటున్నారు. సై రా లో చిరు సరసన సిద్దమ్మగా కొత్త లుక్ లో అదరగొట్టిన నయనతార ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం రెడీ అవుతున్నట్లు టాక్. ఇప్పటికే క్రిష్ .. నయనతార తో ఉన్న పరిచయంతో పవన్ కళ్యాణ్ కోసం ఆమెని సంప్రదించినట్లుగా చెబుతున్నారు. అయితే నయనతార గతంలో క్రిష్ కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో నటించింది. మరి పవన్ కోసం నయనతార ఓకె చెబుతుందో…లేదంటే పవర్ స్టార్ కోసం మరో హీరోయిన్ కోసం క్రిష్ ప్రయత్నం చెయ్యాలో అనేది చూడాలి.
https://www.telugupost.com/movie-news/megha-akash-rajini-movie-73856/
టాలీవుడ్ లో 'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయిన మెగా ఆకాష్ తన మొదటి సినిమాతోనే యూత్ మనసులు గెలుచుకుంది. తన క్యూట్ ఎక్స్ ప్రే షన్స్ తో అందరి మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ వెంటనే నితిన్ సరసన ' ఛల్ మోహన్ రంగ' సినిమాలో యాక్ట్ చేసింది. ఆమె చేసిన రెండు సినిమాలు ప్లాప్స్ అయ్యాయి.మరి ఎవరి సరసన..?దీంతో ఆమె ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న టైములో ఆమె దృష్టి తమిళ సినిమాలపై పడింది. ఆల్రెడీ అక్కడ సినిమాలు చేసిన అనుభవం ఉండటంతో.. ఈ అమ్మడుకి రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినపడుతుంది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజినీకాంత్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివరలో స్టార్ట్ కానుంది. బాబీ సింహ.. విజయ్ సేతుపతిలు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. మరి వీరిలో మెగా ఆకాష్ ఎవరి సరసన నటిస్తుందో తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం భాగం కానుంది. మరి ఇది ఎంతవరకు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
https://www.telugupost.com/movie-news/rrr-ugadi-updates-189403/
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ పై ఫాన్స్ లో ఎంత క్రేజ్ ఉందో.. పాన్ ఇండియా లేవల్లో ట్రేడ్ లోనూ అంతే క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ కోసం ఫాన్స్ ఎప్పటికప్పుడే ఎదురు చూడడం అలవాటైపోయింది. నిన్నటికి నిన్న ఆర్ ఆర్ ఆర్ నుండి ఉగాది స్పెషల్ గా ఏదైనా సాంగ్ వదలొచ్చు కదా అని ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలని హీరోల ఫాన్స్ అడిగితే వారు దానికి రిప్లై గా టైం ఉంది.. సాంగ్స్ కన్నా ముందు చాలా ఉన్నాయ్ అన్నారు కానీ ఉగాది కి ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ రిలీజ్ అని మాత్రం చెప్పలేదు. ఉగాదికి ఆర్.ఆర్.ఆర్ ట్రీట్ ఉండదనుకున్న ఫాన్స్ కి ఆర్.ఆర్.ఆర్ టీం సర్ప్రైజ్ ఇచ్చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ని వాళ్ళ ని ఆరాధించే ప్రజలు ఎత్తుకుని గాల్లోకి ఎగేరెయ్యగా.. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నవ్వుతున్న పోస్టర్ ని ఆర్.ఆర్.ఆర్. నుండి ఉగాది స్పెషల్ గా వదిలింది టీం. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చేతుల మీద అలా గాల్లో ఎగురుతుంటే.. అదేదో తామే తమ హీరోలని ఎత్తి పైకి ఎగెరిసినట్టుగా ఫీలవుతున్నారు ఎన్టీఆర్ మరియు చరణ్ ఫాన్స్. అసలు ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ అంటే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఉగాది పోస్టర్ ఫాన్స్ లో జోష్ నింపింది.
https://www.telugupost.com/movie-news/2020-sankrati-josh-has-just-begun-134784/
2020 సంక్రాతి జోరు అప్పుడే మొదలయ్యింది. మహేష్ – అల్లు అర్జున్ – రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలు సంక్రాంతిని బుక్ చేసేసుకున్నారు. ఇక మధ్యలో కళ్యాణ్ రామ్ కూడా నేను ఉన్నాను ఆగండి అంటున్నాడు. తాజాగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల అలా వైకుంఠాపురానికి సంక్రాతి విడుదల డేట్ కూడా ఇచ్చేసారు. జనవరి 12 న అలా కి డేట్ ఇవ్వగా.. రజినీకాంత్ తన దర్బార్ ని ప్రతి ఏడు లాగే జనవరి 10 న ఖాయం చేసేలా కనబడుతున్నాడు. ఇక మిగిలిన మహేష్ సరిలేరు నీకెవ్వరూ డేట్ విషయంలో లెక్క తేలడం లేదు. ఆగాల్సిందే….. కారణం అల్లు అర్జున్ కన్నా ముందు జనవరి 11న వద్దామని నిర్మాతలు చెబుతున్నప్పటికీ… మహేష్ వద్దంటున్నాడట. కారణం జనవరి 9, 10, 11 తేదీల్లో విడుదలైన సినిమాలేవీ పెద్దగా హిట్ కావడం లేదని.. అందుకే అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో తర్వాత అంటే… జనవరి 14 వస్తే బెటర్ అంటూ నిర్మాతలకు మహేష్ సరిలేరు నీకెవ్వరూ చిత్రానికి డేట్ సూచిస్తున్నాడట. 11 న వస్తే క్యాష్ చేసుకోవచ్చని నిర్మాతలంటుంటే.. మహేష్ మాత్రం లెట్ అయినా.. లేటెస్ట్ గా దిగుదామని చెబుతున్నాడట.
https://www.telugupost.com/movie-news/ramcharan-tej-film-75768/
మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్‌ిర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా నాలుగో షెడ్యూల్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. హీరోలోని మాస్ యాంగిల్‌ను ప్రెజెంట్ చేస్తూ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను సిద్ధ‌హ‌స్తుడు. ఇప్‌ టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్‌ని మ‌రే ద‌ర్శ‌కుడు చూపించ‌ని యాక్ష‌న్ సీక్వెన్స్‌ లో బోయ‌పాటి ఆవిష్క‌రించ‌నున్నా రూ.5 కోట్ల భారీ వ్య‌యంతో ఈ యాక్ష‌న్ పార్ట్ ను చేస్తున్నారు. ఇందులో 60 మంది ఆర్టిస్టులు, 500 మంది బాడీ బిల్డ‌ర్స్ పాల్గొంటారు. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి మాట్లాడుతూ... ''మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్‌తో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మేకింగ్‌లో ఎక్కడా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఇటీవ‌లే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చేస్తున్నాం. హైఎండ్‌ యాక్ష‌న్ పార్ట్‌ లో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న అభిమానులను డెఫ‌నెట్‌గా మెప్పిస్తుంది. మెగా అభిమానులు, ప్రేక్ష‌కులను అల‌రించేలా రామ్‌చ‌ర‌ణ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ తో పాటు ప‌వ‌ర్ ప్యాక్డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌ తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందిస్తున్నాం. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే సంక్రాంతికి వ‌ర‌ల్డ్‌ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.తారాగణం...రామ్‌చరణ్‌, కైరా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టిల్స్: జీవ‌న్‌, పి.ఆర్‌.ఒ : వంమశీ కాకా, మాటలు: ఎం.రత్నం, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరామెన్‌: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వి.వై.ప్రవీణ్ కుమార్, స‌హ నిర్మాత‌: క‌ల్యాణ్ డి.వి.వి, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.
https://www.telugupost.com/movie-news/samantha-akkineni-christmas-party-177509/
అక్కినేని ఫ్యామిలీ పిక్స్ చాలా అరుదుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. నాగ్ ఫ్యామిలీ తప్ప మిగతా ఏవరు అంతగా సోషల్ మీడియాలో కనబడరు. కానీ అక్కినేని కోడలు సమంత అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే ఫ్రేమ్ లో నించోబెట్టింది. అక్కినేని సమంత క్రిస్మస్ ని ఎంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటుందో అందరికి తెలిసిన విషయమే. నాగ చైతన్య ని హిందూ సంప్రదాయంలోనూ, క్రిష్టియన్ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకున్న సమంత క్రిస్మస్, జనవరి 1 వేడుకల కోసం ఎప్పుడు వెకేషన్ ప్లాన్ చేసుకునేది. అలాగే తన ఇంట్లో క్రిస్మస్ ట్రీ కోసం కష్టపడి డెకరేట్ చేస్తుండేది. అయితే ఈ ఏడాది మాత్రం సమంత ఇంట్లోనే క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. క్రిస్మస్ పండగని తన ఇంట్లో అక్కినేని ఫ్యామిలీ మధ్యన సమంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చైతన్య, సమంత, నాగార్జున, అమల, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ తో పాటుగా నాగార్జున అన్నగారు..ఆయన భార్య, నాగ సుశీల, నాగ్ మేనల్లుళ్లు, మేనకోడలు ఇలా నాగేశ్వరరావు ఫ్యామిలీ మొత్తాన్ని సమంత గేదెర్ చేసి క్రిస్మస్ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీ లో దిగిన అక్కినేని ఫ్యామిలీ పిక్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరి అక్కినేని కోడలా మజాకా అన్నట్టుగా ఉంది.. ఈ క్రిస్మస్ పిక్ చూస్తే. అక్కినేని ఫ్యామిలిలో ప్రతి ఒక్కరిని ఈ పార్టీ కోసం తీసుకొచ్చింది సమంత. అది నాగ్ కొడలంటే అంటున్నారు అక్కినేని అభిమానులు.
https://www.telugupost.com/movie-news/box-office-hit-movie-prathiroju-pandage-143131/
ఈ శుక్రవారం రెండు తెలుగు స్ట్రయిట్ సినిమాలు, ఒక తమిళ సినిమా, మరొక బాలీవుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ నాలుగు సినిమాల్లో తెలుగునుండి ప్రతిరోజూ పండగే సినిమా, రూలర్ విడుదల కాగా, తమిళం నుండి ఖైదీ కార్తీ దొంగ సినిమాతోనూ, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 ను బాక్సాఫీసు వద్ద పోటీకి దిగారు. అయితే సాయి తేజ్ ప్రతిరోజూ పండగే సినిమాకి హిట్ టాక్, రూలర్ ప్లాప్ టాక్ తెచ్చుకోగా… కార్తీ దొంగా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సల్మాన్ దబాంగ్ 3 ని ఎవరు పట్టించుకుననట్టుగా లేదు. బెస్ట్ ఓపెనింగ్…. ఇక ఈ నాలుగు సినిమాలు మొదటి రోజు వసూళ్లలో సాయి తేజ్ బెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకోగా రెండో రోజు ఫ్యామిలీ ఆడియన్స్ తో పండగ థియేటర్స్ కళకళలాడాయి. ఇక రూలర్ సినిమాకి అనూహ్యంగా అభిమనులే షాకిచ్చారు. బాలయ్య నుండి పవర్ ఫుల్ ఎంటెర్టైనెర్ వస్తుంది అనుకుంటే రొటీన్ రొడ్డకొట్టుడు వచ్చిందిరా అంటూ..అభిమానులే షాకవుతున్నారు. ఇక కార్తీ దొంగ సినిమాకి హిట్ టాక్ పడింది. కానీ సినిమాకి అనుకున్నంత ప్రమోషన్స్ లేవు. ఖైదీ తో ఇరగదీసిన కార్తీ దొంగ కి పక్కా ప్రమోషన్స్ చేసినట్టయితే.. దొంగ ముందు పండగ సినిమా కూడా పడుకోవాల్సి వచ్చేది. ఇక దబాంగ్ 3 అనుకున్నంతగా లేకపోవడం, మూడు సినిమాలతో పోటీ పడడంతో. సల్మాన్ తెలుగులో తన పవర్ చూపించలేకపోయారు. ఇక రూలర్, దొంగ, దబాంగ్ 3 లు రెండో రోజు వీకవడంతో.. ప్రతి రోజు పండగ పుంజుకుని.. సినిమాని హిట్ దిశగా నడిపిస్తున్నారు ప్రేక్షకులు. మరి ఫైనల్ గా ఈ వారం బాక్సాఫీసు విన్నర్ పండగ సినిమానే.
https://www.telugupost.com/movie-news/rashmika-mandanna-new-movies-85073/
ఈమధ్య టాలీవుడ్ లో వచ్చిన హీరోయిన్స్ లో యూత్ ని బాగా యాట్ట్రాక్ట్ చేసిన వారు ఇద్దరు. ఒక్కరు సాయి పల్లవి..ఇంకోరు రష్మిక మందాన్నానే. ఆమె నటించిన రెండు సినిమాలు 'ఛలో'..'గీత గోవిందం' సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడమే కాదు తన నటనతో చాలామంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. అయితే సాయి పల్లవిలా హీరోయిన్ కు ప్రాధాన్యం ఉండే పాత్రల్లో చేస్తాను అని మాత్రం చెప్పడంలేదు.ఏ పాత్రలు ఐన చేయడానికి రెడీ అంటుంది ఈ కన్నడ బ్యూటీ. స్టార్ హీరోస్ తో నటించడానికైనా నేను రెడీ అంటూనే.. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా ఆమె అభ్యంతరం లేదని చెబుతుంది. అందుకే మన నిర్మాతులు కూడా సాయి పల్లవి నో చెప్పితే వెంటనే ఏం ఆలోచించకుండా రష్మికను సంప్రదించుతున్నారు.రష్మికకి కూడా సాయి పల్లవిలా యూత్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో..ఆమెనే ఎక్కువ సంప్రదించుతున్నారని వినికిడి. అందుకేనేమో ఆమె కు డిమాండ్ కూడా ఎక్కువ అవడంతో రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ చెబుతుంది అని టాక్. స్టార్ హీరోస్ పక్కన ఛాన్స్ రాకపోయినా మీడియం రేంజ్ హీరోస్ కి రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు తెలుగు కూడా చక్కగా మాట్లాడుతుంది కాబట్టి ఆమె కు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
https://www.telugupost.com/movie-news/vijay-in-taxiwala-promotions-94355/
విజయ్ దేవేరుకోండ తన సినిమాల ప్రమోషన్స్, రిలీజ్ డేట్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా చేస్తుంటారు. ప్రమోషన్స్ లో చాలా యాక్టీవ్ గా ఉండే విజయ్ తన కొత్త సినిమా 'టాక్సీవాలా' విషయంలో చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాలు వల్ల రిలీజ్ కాలేదు. 'నోటా' సినిమాకి ముందు 'టాక్సీవాలా' రిలీజ్ కావాలి కానీ విజయ్ దీన్ని హోల్డ్ లో పెట్టి 'నోటా' ని రిలీజ్ చేశాడు. 'గీత గోవిందం' టైంలో 'టాక్సీవ్వాలా' సినిమా మొత్తం బయటికి రావడంతో విజయ్ చాలా డల్ అయ్యిపోయాడు. అందుకే 'గీత గోవిందం' తరువాత 'నోటా' ని రిలీజ్ చేశాడు. ఇప్పుడు మల్లి తెరపైకి ఈ చిత్రం రిలీజ్ ను తీసుకొచ్చాడు. నవంబర్‌ 16న ఈ సినిమా విడుదల అవుతుంది.సినిమా బయటకు వచ్చేసిందనా..?అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో విజయ్ చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. మరి కారణం ఏంటో తెలియలేదు. బహుశా ఈ సినిమా బయటికి వచ్చేసింది కాదా అందుకే ప్రమోషన్స్ చేసినా వేస్ట్ అని భవిస్తున్నాడేమో..'నోటా' రిలీజ్ తరువాత విజయ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో 'నోటా' ఫ్లాప్‌ అయిందని ఇండస్ట్రీలో కొందరు పండగ చేసుకున్నారని విజయ్‌ ఆరోపించాడు. అటువంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడే చేసుకోండి.. తరువాత మళ్లీ అవకాశం ఇవ్వనని కూడా అన్నాడు. విజయ్ మీద పడి ఏడుస్తుంది ఎవరు.? అసలు విజయ్ ఎందుకు ప్రమోషన్స్ విషయంలో డల్ అయ్యాడు అనేది తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/simran-aunty-66568/
అత్తారింటికి దారేది సినిమాలో నదియా పవన్ కళ్యాణ్ కి యంగ్ అత్తగా నటించి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నదియాకి మిర్చి ఇలా మరికొన్ని మంచి ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఆ తరవాత చాలామంది మాజీ హీరోయిన్స్ అత్తలుగా మారడానికి రెడీ అయ్యారు. నా అల్లుడు సినిమాతో ఎన్టీఆర్ కి అత్తగా రమ్యకృష్ణ నటించింది. అయితే నిన్నటితరం హీరోయిన్ అయిన మరొకరు ఇప్పుడు కొత్తగా అత్త అవతారమెత్తబోతుంది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోస్ పక్కన నటించిన సిమ్రాన్ ఇపుడు టాలీవుడ్ లోకి అత్త పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి, డాడీ, బావ నచ్చాడు సినిమాల్తో అప్పట్లో ఉర్రుతలూగించిన సిమ్రాన్ పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక సినిమాలకు దూరమైంది . అయితే పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యాకా మళ్ళీ నటన గురించి ఆలోచించిన సిమ్రాన్ తమిళంలో ఎప్పుడో రీ ఎంట్రీ ఇచ్చినా... టాలీవుడ్ కి మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు ఒక టాలీవుడ్ సినిమాలో తన వయసుకు తగ్గట్టుగా అత్త పాత్ర చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈమధ్యన కమెడియన్ సప్తగిరి హీరోగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సప్తగిరి ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది.అయితే ఇది అత్తకి తగిన అల్లుడు తరహాలో కొనసాగే కథనట. అందువల్లనే అత్త పాత్ర కోసం సిమ్రాన్ ను సంప్రదించగా ఓకే చెసినట్టు తెలుస్తోంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా.... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది .. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోయే సినిమాలో సిమ్రాన్ దాదాపుగా అత్త పాత్రకి ఖాయమంటున్నారు. చూద్దాం సప్తగిరి అత్తగా సిమ్రాన్ ఏ మేర ఆకట్టుకుంటుందో అనేది.
https://www.telugupost.com/movie-news/తెరపై-ఎలా-కనిపించినా-వాళ-20853/
హాలీవుడ్ చిత్రాలను చూసి భారత దేశంలో ప్రేక్షకులతో పాటు అన్ని భాషల చిత్ర పరిశ్రమ వర్గాలు కూడా నిత్యం స్ఫూర్తి పొందుతున్నప్పటికీ హాలీవుడ్ నటీమణులు ప్రదర్శించినంత బోల్డ్ నెస్ ని మన కథానాయికలు ప్రదర్శించే సాహసం చేయరు. ఒకవేళ వాళ్ళు ఆ సాహసానికి ఒడికట్టినా సెన్సార్ కత్తెరకు బలికావాల్సిందే. పొరపాటున సెన్సార్ కత్తెర పదునుకి దొరకకుండా బైటకి వచ్చినా ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఎవరైనా యుక్త వయసు కథానాయిక ఒకవేళ నగ్నంగా నటిస్తే సంగతి. అదే వివాహం ఐన భామలను అసలు అటువంటి సన్నివేశాలలో ఊహించుకోను కూడా ఊహించుకోలేరు. కానీ రాధికా ఆప్తే మాత్రం వివాహానంతరం కూడా పర్చేద్ వంటి హిందీ చిత్రం కోసం నగ్న ప్రదర్శన ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచింది.ఇంత ధైర్య సాహసాలను బాలీవుడ్ సినిమాలలో కనబరుస్తున్న ఏకైక కథానాయిక రాధికా ఆప్తే ని, మీ నగ్న ప్రదర్శన సన్నివేశాలు వెండితెర పై మీ భర్త చూసినప్పుడు ఆయన ఎలా స్పందిస్తారని రాధికా ఆప్తే ని ప్రశ్నించగా, "మా వారు నేను నటించిన సినిమాలలో నన్ను చూడరు. నా పాత్రలనే చూస్తారు. నా పాత్ర తీరు తెన్నులకు అనుగుణంగా నేను ఎలా కనిపించినా ఆయన అసలు ఆక్షేపణ తెలుపరు. అలా అని చెప్పి నేను చేసే ప్రతి సినిమాలో అలాంటి హాఫ్ న్యూడ్ మరియు న్యూడ్ సీన్స్ చేయను కదా. అలా కనిపించటానికి అవసరం ఉందా లేదా అనేది నాకు కథ విన్నప్పుడే అంచనా ఏర్పడుతుంది. పబ్లిసిటీ కోసమో సినిమా పై అంచనాలు పెంచే ఉద్దేశంతోనే అలాంటి ట్రిక్స్ ఎప్పుడూ ప్లే చేయలేదు. భవిష్యత్తు లో కూడా పర్చేద్ లాంటి సినిమా చేయాల్సివచ్చినప్పుడు నగ్నంగా కనిపించాల్సి వస్తే నా వయసు నాకు అడ్డు రాకుండా చూసుకుంటాను తప్ప అలాంటి చిత్ర అవకాశాలను తిరస్కరించను." అని స్పష్టత ఇచ్చేసింది రాధికా ఆప్తే.
https://www.telugupost.com/movie-news/movies-and-webseries-releasing-july-third-week-in-theatres-and-ott-platforms-1485300
బాక్సాఫీస్ వద్ద రెండు వారాలుగా వస్తున్న సినిమాలు మంచి విజయాలందుకుంటున్నాయి. స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా.. చిన్న సినిమాలే కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కంటెంట్ ఉంటే చాలు..ఆ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువు చేశాయి సామజవరగమన, బేబీ సినిమాలు. ఇక ఈ వారం కూడా థియేటర్లలో మంచి బజ్ ఉన్న సినిమాలు విడుదలవుతున్నాయి. లవ్, క్రైమ్, రొమాన్స్.. ఇలా అన్ని జోనర్లలోనూ సినిమాలు విడుదలవుతుండటం విశేషం. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు, నందిత శ్వేతా జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ సినిమా జులై 20న రిలీజ్ కాబోతుంది.30 వెడ్స్ 21 సిరీస్ ఫేమ్ చైతన్య రావు, లావణ్య జంటగా నటించిన ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ జులై 21న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా 90లలో ప్రేమ కథలా ఉండబోతుంది. ఇటీవలే బిచ్చగాడు 2తో హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ.. ఈ వారం‘హత్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమా జులై 21న విడుదల కాబోతోంది. రుహానీ శర్మ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘HER’ జులై 21న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. బ్రహ్మాజీ తనయుడు, ఓ పిట్టకథ ఫేమ్ సంజయ్, ప్రణవి జంటగా నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా జులై 21న రాబోతుంది. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లా ఉండబోతుంది.ఇంకా.. అలా ఎలా ఇలా, జిలేబి, నాతో నేను, ఒక్కడే వీరుడు.. అనే చిన్న సినిమాలు జులై 21న రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో జిలేబి, నాతో నేను సినిమాల విడుదల వాయిదా పడొచ్చని సమాచారం. ఇక హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలాన్‌ దర్శకత్వంలో రాబోతున్న ఒప్పెన్‌ హైమర్‌ సినిమా డబ్బింగ్ లో జులై 20న రిలీజ్ కానుంది. మరో డబ్బింగ్ సినిమా నాగ ద్వీపం కూడా జులై 22న రిలీజ్ కానుంది.ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల విషయానికొస్తే.. అమెజాన్ ప్రైమ్ ల జులై 21 నుంచి బవాల్ హిందీ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో జులై 17న అన్నోన్- కేవ్ ఆఫ్ బోన్స్, 19న ది డీపెస్ట్ బ్రీత్, 20న స్వీట్ మంగోలియాస్ వెబ్ సిరీస్, 21నదే క్లోన్ డ్ టైరోస్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. జీ 5లో జులై 18 నుంచి స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ యానిమేషన్ మూవీ స్ట్రీమ్ అవనుంది. జియోలో ట్రయల్ పీరియడ్ హిందీ సినిమా జులై 21 నుండి, స్పెషల్ ఒప్స్ - లయనెస్ జులై 23 నుండి స్ట్రీమింగ్ అవనుంది.
https://www.telugupost.com/movie-news/విజయ్-సిక్స్-ప్యాక్-మహాన-48713/
'అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగి స్టార్ హీరో గా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే మనవాడు మళ్లీ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాడు. తాజాగా విజయ్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. 'నా శరీరంతో ప్రయోగం చేస్తున్నానని, ఈ ప్రయోగం ద్వారా ఏం జరుగుతుందో చూద్దామని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాడు'. తన ట్రైనర్ కులదీప్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని ట్రైనర్ కులదీప్ ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ చేశాడు. విజయ్ మరో ఛాలెంజ్‌కు అంగీకరించాడు. అర్జున్‌రెడ్డి సిక్స్ ప్యాక్‌గా మారేందుకు, 360 డిగ్రీస్ ఫిట్‌నెస్‌కు అంగీకరించాడని తెలిపాడు. అయితే విజయ్.. తాను చేస్తున్న ప్రాజెక్ట్‌ గురించి ముందుగానే చిన్న హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు ప్రాజెక్టు (మహానటి, సిక్కార్, ఏ మంత్రం వేశావే)లు ఉన్నాయి..అయితే విజయ్ సిక్స్ ప్యాక్‌.. నాగ్ అశ్విన్ తెరకెక్కించే మహానటి సావిత్రి సినిమాలో అలనాటి దేవదాసు పాత్రలో మోడ్రన్ దేవదాసు నటించబోతున్నాడని... అందుకే ఈ సిక్స్ ప్యాక్‌ అని ఫిలింనగర్ సర్కిల్ లో వినికిడి. అయితే విజయ్...సిక్స్ ప్యాక్ చేస్తున్నది మహానటి చిత్రం కోసమా? లేక వేరే చిత్రం కోసమా అన్న సంగతి తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/ram-gopal-varma-comments-on-ismart-shankar-127649/
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ నిన్ననే రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లు కలెక్ట్ చేస్తుంది. మొదటి ఆట నుండే మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈసినిమా మాస్ ఎంటర్టైనర్ అని చూస్తే అర్ధం అయిపోతుంది. రామ్ నటన హైలైట్ గా ఉందంటున్నారు. చాలా ఏళ్ళ తరువాత పూరి ఈసినిమాతో హిట్ కొట్టాడనే అనుకుంటున్నారు అంత. ఇటు పూరి అటు తన గురువు రామ్ గోపాల్ వర్మ ఈ హిట్ తో మంచి హ్యాపీ గా ఉన్నారు. ఈనేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘హేయ్ పూరి.. త్వరగా ఇస్మార్ట్ శంకర్ 2 స్టార్ట్ చెయ్. ఈసారి డబుల్ దిమాక్ కాదు ట్రిపుల్ దిమాక్ ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు. దానికి పూరి ఇలా రీట్వీట్ ఇచ్చారు…”ఆల్రెడీ ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ రిజిస్టర్ చేయించాను సర్” అని సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేసేశారు. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? అందులో హీరో రామేనా లేదా వేరే హీరోని పెట్టి చేస్తారా? అన్నది ఇంకా తెలియాల్సిఉంది. అయితే పూరి ఇస్మార్ట్ తరువాత ఏ మూవీ చేస్తాడో ఇంకా చెప్పలేదు. సో అంత ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తాడు అనుకుంటున్నారు. మరి పూరి ఏం ఆలోచించుకున్నాడో తెలియాలి
https://www.telugupost.com/crime/father-rapes-daughter-nizamabad-court-sentence-20-years-jail-to-father-1358382
నిజామాబాద్ : ఆకతాయిల నుంచి కూతురిని జాగ్రత్తగా కాపాడాల్సిన తండ్రే.. కామంతో కాటేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా .. దారుణానికి ఒడిగట్టాడు. కన్నకూతురిపై అత్యాచారానికి తెగబడిన ఆ కామాంధుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో.. పిల్లల్ని ఇంట్లోనే వదిలి తల్లి శుభకార్యానికి వెళ్లింది. 2018 మే16వ తేదీన మద్యంమత్తులో ఇంటికొచ్చిన తండ్రి.. పెద్దకూతురిపై అత్యాచారం చేశాడు.ఎవరికైనా చెప్తే.. చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. కొన్నాళ్లకి గర్భం దాల్చడంతో గర్భస్రావ మాత్రలు వేశాడు. 2019 జూన్‌ 28న మరోసారి భార్యను కొట్టి కూతురిని తన దగ్గరికి పంపించాలని బెదిరించాడు. భర్త నీచమైన ప్రవర్తనను భరించలేని భార్య రుద్రూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. కన్నకూతురిపై తండ్రి దాష్టీకాన్ని సీరియస్ గా తీసుకున్న న్యాయస్థానం కీచక తండ్రికి కఠిన శిక్ష విధించింది. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే న్యాయసేవా సంస్థ ద్వారా రూ.1.50 లక్షల పరిహారం కోసం బాలిక దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
https://www.telugupost.com/movie-news/ముంబై-కన్నా-తెలుగు-పరిశ్-13627/
ఆలా ఎలా వంటి చిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఐన హెబ్బా పటేల్ కి ఆ చిత్రం విజయం సాధించినప్పటికీ రిమోట్ ప్రాంతాలలో కూడా గుర్తింపు తెచ్చిన చిత్రం సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన కుమారి 21 ఎఫ్. ఆ చిత్రం విజయం తరువాత కొంచం ఆలస్యంగా నైనా హెబ్బా పటేల్ బిజీ అయిపోయింది. కుమారి 21 ఎఫ్ లో తన కో ఆర్టిస్ట్ ఐన రాజ్ తరుణ్ సరసన ఈడో రకం వాడో రకం లో మెరిసి ప్రేక్షకులను మరో సారి ఆకట్టుకుంది హెబ్బా పటేల్. ఈ శుక్రవారం హెబ్బా పటేల్ నిఖిల్ జంటగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.పుట్టి పెరిగింది ఉత్తరాదిన అయినప్పటికీ హెబ్బాకు తెలుగు పరిశ్రమ బాగా నచ్చేసింది అంట. ఎక్కడికి పోతావు చిన్నవాడా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న హెబ్బా తెలుగు పరిశ్రమలో పోటీ వాతావరనమ్ పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, "బాలీవుడ్ కన్నా ఇక్కడే ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం వుండే అవకాశం ఎక్కువ వుంది. వరుస చిత్రాలు చేస్తున్నా ఇక్కడ పని తీరు వల్ల నటులకు ఎలాంటి వత్తిడి ఎదురు కాదు. నేను తెలుగు, కన్నడ, తమిళ భాషలలో దాదాపు నెల వ్యవధిలోనే పరిచయం అయ్యాను. దానితో నాకు ఒకేసారి విజయాపజయాలు చవి చూసే అదృష్టం దక్కింది. ఎప్పటికి నన్ను ఆదరించిన తెలుగు పరిశ్రమలో అవకాశాలు వదులుకోను." అని మనసులో మాట పంచుకుంది హెబ్బా పటేల్.హెబ్బా పటేల్ నటిస్తున్న రెండు చిత్రాలు నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్, అందగాడు చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి.
https://www.telugupost.com/movie-news/ilaya-dalapathi-joseph-vijay-ready-to-join-in-politics-but-on-these-conditions-1484562
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో ప్రభుత్వం మీద మంచి దూకుడు మీద ఉన్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతో వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన సినిమా కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉంది. అయితే ఒకప్పుడు రాజకీయాల్లోకి రావడానికి సినిమాలను వదిలేసిన సంగతి తెలిసిందే..! రాజకీయాల్లో పూర్తిగా టైమ్ కేటాయించాలంటే తప్పకుండా సినిమాలకు దూరం అవుతాయని అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పడం అభిమానులను ఎంతో బాధపెట్టింది. మెగా స్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ను సినిమాలు చేయాల్సిందే అంటూ కోరారు. దీంతో పవన్ మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలను పూర్తీ చేసి.. వచ్చే ఏడాది ఎన్నికల్లో జనసేనానిని గెలిపించుకోడానికి ప్రయత్నించాలని అనుకుంటూ ఉన్నారు.కట్ చేస్తే తమిళనాడులో కూడా ప్రస్తుతం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎదురైన పరిస్థితే అక్కడి టాప్ హీరో విజయ్ కు ఇప్పుడు ఎదురవుతూ ఉంది. విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుండో ప్రచారం సాగుతూ ఉంది. ఆయన కూడా ఒక కండిషన్ పెడుతూ ఉన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే సినిమాలకు పూర్తిగా దూరం అవుతానని అంటున్నాడు ఇళయదళపతి. ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేస్తున్నారు. కానీ ఆయన అభిమానులకు ఇది మింగుడు పడని విషయమే..! విజయ్ చెన్నై నగర శివారు ప్రాంతమైన పనైయూరులో ‘విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం’కు చెందిన జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. తాజాగా తిరువళ్ళూరు, అరియలూరు, పెరంబలూరు, దిండిగల్‌, సేలం, తేని జిల్లాలకు చెందిన నిర్వాహకులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన బయటకు వచ్చిన మక్కల్‌ ఇయ్యక్కం సభ్యులు కీలక విషయాలను చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే సినిమాల్లో నటించడం మానేసి పూర్తిస్థాయిలో రాజకీయాలపైనే దృష్టి సారిస్తానని విజయ్‌ చెప్పారని అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము చేశామన్నారు. త్వరలో విజయ్ పొలిటికల్ జర్నీ మొదలు కాబోతోందని తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.
https://www.telugupost.com/movie-news/అందమైన-సెల్ఫీ-లతో-ఆకట్టు-19737/
తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లతో పాటు యూత్ లో క్రేజ్ వున్నా అక్కినేని నాగ చైతన్య ల సరసన నటించినప్పటికీ మళయాళ బ్యూటీ అమల పాల్ కి ఇక్కడ అవకాశాల కొదవ తగ్గలేదు. కానీ అమల పాల్ కెరీర్ తొలి దశ నుంచి విరామం లేకుండా మళయాళ, తమిళ చిత్రాలు వరుసగా చేస్తూనే ఉండేది. అనంతరం అతి పిన్న వయసులోనే తమిళ దర్శకుడు విజయ్ ని మనువాడి రెండు సంవత్సరాలకే విడాకులు ఇచ్చింది. ఈ రెండు సంవత్సరాలు సినిమా ప్రపంచానికి దూరం కావటంతో విడాకుల అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోవాలని అమల చేసిన ప్రయత్నాలు ఫలించాయి కూడా. ప్రస్తుతం మళయాళ, తమిళ భాషలలో కలిపి అమల నటిస్తున్న అరడజను చిత్రాలు సెట్స్ మీద వున్నాయి. తెలుగు లో మాత్రం అమల పాల్ కి ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎదురైన అనుభవాలే ఎదురవుతుండటం బాధాకరం.అయితే సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటో షూట్స్ అండ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకట్టుకుంటుంది. ఇటీవలి కాలం లో అయితే సోషల్ మీడియా లో అమల పాల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అమల పోస్ట్ చేస్తున్న ఫొటోస్ లో గ్లామర్ డోస్ పెంచటమే ఇందుకు కారణం. విడాకులతో విజయ్ తో వివాహ బంధం రద్దవటంతో వచ్చిన స్వేచ్ఛ ని పూర్తిగా వాడేసుకుంటుంది అమల పాల్. తన ఫోటో షూట్స్ లోనే కాక తన స్నేహితులతో దిగిన సెల్ఫీల లోకూడా అమల ఎంత మాత్రం తగ్గటం లేదు. తాజా గా తన స్నేహితురాలితో కలిసి అమల పాల్ దిగిన సెల్ఫి ని తన పేజీ పై పోస్ట్ చేసింది అమల పాల్. ఆ ఫొటోలో బాగా కురచ షాట్స్ వేసుకుని, డీప్ కట్ టాప్ తో అందాలు ప్రదర్శిస్తూ దర్శనమిచ్చింది ఈ డస్కీ బ్యూటీ. మరి ఫొటోలకే ఇలా కనిపిస్తుంటే రానున్న చిత్రాల అమ్మడి ప్రదర్శన ఎలా వుండబోతుందో...
https://www.telugupost.com/Telangana-assembly-elections-2023/list-of-candidates-for-the-first-phase-of-congress-has-been-released-candidates-are-waiting-for-the-second-list-1501138
కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదలయింది. యాభై ఐదు మంది అభ్యర్థులతో వచ్చిన తొలి జాబితాలో అక్కడక్కడ కొంత అసంతృప్తులున్నా పెద్దగా అవి కనిపించలేదు. ఫస్ట్ లిస్ట్ సూపర్బ్ అని మెచ్చుకున్న వారు కూడా లేకపోలేదు. అన్ని వర్గాలకూ స్థానం కల్పిస్తూ విడుదల చేసిన జాబితాతో కొంత కాంగ్రెస్ కు హైప్ క్రియేట్అయింది. గాంధీభవన్ వద్ద నిరసనలు, డౌన్ డౌన్ నినాదాలు వినిపించినా వాటిని పెద్దగా పట్టించుకోలేని పరిస్థితి. కానీ రెండో జాబితా ఇంత వరకూ విడుదల కాలేదు. ఎన్నికలకు ఇంకా నలభై రోజులకు మించి సమయం లేదు. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి వెళ్లింది.కర్ణాటక తరహాలోనే...కర్ణాటక తరహాలో ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పిన పార్టీ హైకమాండ్ తెలంగాణ విషయానికి వచ్చే సరికి మాత్రం కొంత వెనక్కు తగ్గింది. నలభై రోజులే ఎన్నికలకు సమయం ఉన్నా ఇంకా సగానికి మించిన సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. సీనియర్ నేతలకే టిక్కెట్లు దక్కకపోవడంతో అభ్యర్థులు కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి నెలన్నర అవుతున్నా నియోజకవర్గాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి అభ్యర్థుల ఖరారు కాకపోవడమేనని చెబుతున్నారు. రాహుల్ గాంధీ మొదటి విడత బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆయన రెండో విడత కూడా రాష్ట్రానికి రానున్నారు.ఇంకా భర్తీ కాకపోవడంతో...ముఖ్యమైన స్థానాలను ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా ఢిల్లీలో కసరత్తు జరగుతూనే ఉంది. నేతలు హస్తినలోనే మకాం వేశారు. దసరా పండగ కూడా ఈసారి నేతలకు లేకుండా పోయింది. ఏఐసీసీ భవన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమ అనుచరులతో వెళ్లి కొందరు అక్కడ ఆందోళనకు కూడా దిగుతున్నారు. చివరి నిమిషంలోనైనా పార్టీ హైకమాండ్ మనసు మార్చే ప్రయత్నం మరికొందరు చేస్తున్నారు. నెల రోజులలో నియోజకవర్గమంతటా తిరగాలంటే అభ్యర్థులకు కష్టమవుతుంది. ఎన్నికలంటే కేవలం ప్రచారం మాత్రమే కాదు. ప్రచార సామాగ్రిని సిద్ధం చేసుకోవడంతో పాటు ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. పనంతా పెండింగ్‌లోనే...ముఖ్యమైన కార్యకర్తలను బూత్ ల వారీగా గుర్తించి, నమ్మకమైన వారిని నియమించుకోవాలి. అంత టైమ్ ఉంటుందా? సమయం లేకుండా హైకమాండ్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు తప్పవన్న కామెంట్స్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. రెండో విడతలో పూర్తి స్థాయిలో స్థానాలను ప్రకటించాలని నేతలు కోరుతున్నారు. లేకుండా మలి విడతగా మళ్లీ మరో జాబితా అంటే ఇక సమయం ఉండదని చెబుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ అన్ని సర్వేల్లో ముందంజలో ఉన్నప్పటికీ అభ్యర్థుల ఖరారు విషయంలో మాత్రం వెనకబడి పోయిందనే చెప్పాలి. మరి ఈరోజు, రేపట్లోనైనా పూర్తి స్థాయి జాబితా వస్తుందని నేతలు భావిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/త్రివిక్రమ్-కి-నచ్చిన-హీ-49346/
ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా పూజ కార్యక్రమాలతో ఒక మంచి ముహూర్తాన మొదలైపోయింది. కానీ సినిమా మాత్రం కొంచెం లెట్ గానే సెట్స్ మీదకెళుతుంది. త్రివిక్రమ్.. పవన్ సినిమా పూర్తవగానే ఎన్టీఆర్ సినిమాతో సెట్స్ మీదకెళతాడు. ఈ మధ్యలో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమా కోసం నటీనటుల ఎంపిక, ప్రి ప్రొడక్షన్ పనులను చక్కబెట్టస్తాడట. అయితే ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్.... అను ఇమ్మాన్యువల్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నాడని ప్రచారం బాగా జరిగింది. కానీ ఎన్టీఆర్ పక్కన అను కాదు డీజే భామ పూజ హెగ్డే అన్నారు. ఇక పూజ హెగ్డే, ఎన్టీఆర్ హీరోయిన్ గా ఫైనల్ అన్నారు. ఇలా ఎన్టీఆర్ పక్కన చాలామంది హీరోయిన్స్ ప్రచారంలోకి రాగా... ఇప్పుడు కొత్తగా త్రివిక్రమ్ మరో హీరోయిన్ ని ఎన్టీఆర్ కోసం తెగ ట్రై చేస్తున్నాడంటున్నారు.అవునా... నిజమా?మరి త్రివిక్రమ్ కి అంతగా నచ్చిన హీరోయిన్ ఎవరో కాదు... కృష్ణగాడి గర్ల్ ఫ్రెండ్ మెహ్రీన్ కౌర్. వరుసగా మూడు సినిమాల విజయంతో దూసుకుపోతున్న మెహ్రీన్ కౌర్ ని తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ భావించి ఆమెని సంప్రదించగా... మెహ్రీన్ డైరీ ఫుల్ అవడంతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి తన దగ్గర డేట్స్ లేవని చెప్పిందట. కానీ త్రివిక్రమ్, మెహ్రీన్ నే ఎన్టీఆర్ కోసం కావాలని పట్టుబట్టి మరి మెహ్రీన్ కి ఫోన్ మీద ఫోన్స్ చేస్తున్నాడట. మరి ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతో జోడి కట్టిన మెహ్రీన్ కి ఎన్టీఆర్ పక్కన నటిస్తే హీరోయిన్ గా నిలదొక్కుకోవచ్చని ఉన్నా కూడా ఆమెకున్న బిజీ షెడ్యూల్ మూలంగా నో చెప్పిందట.డేట్లు అడ్జెస్ట్ చేసి...అయితే త్రివిక్రమ్ ఎక్కువసార్లు ఫోన్ చేసి అడగడంతో ఈ ముద్దుగుమ్మ తన డేట్స్ అడ్జెస్ట్ చేసి మరి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని టాక్ వినబడుతుంది. అయితే మెహ్రీన్, ఎన్టీఆర్ సినిమాలో నటించే విషయం త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తారట. ఇకపోతే ఇప్పటికే హిట్స్ మీదున్న మెహ్రీన్ కి సన్నాఫ్ సూర్య తో ఎదురు దెబ్బ తగిలింది. అయినా ఆమె నటించిన జవాన్ విడుదలకు సిద్ధం గా ఉండగా... సంఘం సినిమా చేతిలో ఉంది.
https://www.telugupost.com/movie-news/nani-taking-clases-to-diriector-indraganti-mohan-krishna-127540/
నాని ని ఇంద్రగంటి మోహన కృష్ణ అష్టాచమ్మతో హీరో ని చేసాడు. నాని ఒకే ఒక్క సినిమాతో హీరోగా నేచురల్ స్టార్ అవతారమెత్తాడు. మధ్యలో మాస్ వెంటబడిన నాని ప్లాప్స్ లో కొట్టుకుపోయాడు. కానీ గత కొన్నేళ్లుగా కథల ఎంపిక లో నాని చూపిస్తున్న వేరియేషన్స్ తో నాని వరస హిట్స్ అందుకున్నాడు. ఎంతో ఇష్టపడి చేసిన కృష్ణార్జున యుద్ధం ఫలితం తారుమారవడం, జెర్సీ సినిమాకి బ్లాక్ బస్టర్ టాకొచ్చినా.. కలెక్షన్స్ రాకపోవడంతో.. ఇప్పుడు నాని తన తదుపరి చిత్రాలు మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. విలన్ గా…. విక్రమ్ కుమార్ తో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్న నాని ఆ సినిమాని ఆగష్టు 30 న విడుదల చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ గ్యాంగ్ లీడర్ షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇక నాని మొదటిసారిగా ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చెయ్యబోతున్నాడు. అది కూడా తనకి లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ వ్ సినిమాలో. సుధీర్ బాబు హీరోగా అదితి రావు, నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నఈ సినిమాలో నాని విలన్ రోల్ చెయ్యబోతున్నాడు. గెస్ట్ రోల్ అన్నప్పటికీ…. మొదట్లో గెస్ట్ రోల్ అన్నప్పటికీ. సినిమా మొత్తం నాని రోల్ ఉండబోతుంది. అయితే ఈ సినిమా కొంతమేర షూటింగ్ జరిగిన తర్వాత తన సీన్స్ కన్నా ఎక్కువగా సుధీర్ బాబు సీన్స్ సినిమాలో హైలెట్ అనేలా అనిపించడంతో… నాని ఈ సినిమా షూటింగ్ అపి మరీ ఇంద్రగంటి మోహనకృష్ణ తో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని సూచించాడట. మరి విలన్ గా చేసినా కూడా ఆ పాత్ర కి ఎంత ప్రాధాన్యత లేకపోతే నాని ఒప్పుకున్నాడో అనుకున్నారు. మరి తన పాత్ర కి ప్రాధాన్యత తగ్గితే ఓ సక్సెస్ ఫుల్ హీరో ఊరుకుంటాడా.. అందుకే తనకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కే నాని పాఠాలు చెబుతున్నాడు.
https://www.telugupost.com/crime/it-is-three-years-since-the-murder-of-former-minister-ys-vivekananda-reddy-he-was-murdered-on-march-15-2019-1359570
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి మూడేళ్లవుతుంది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. పులివెందులలోని ఆయన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఈ హత్య మిస్టరీగా మారింది. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఈ హత్య జరగడంతో అప్పట్లో సంచలనమే అయింది. టీడీపీ అధికారంలో ఉండటంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేశారు.సీబీఐ దర్యాప్తుతో....జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మరో టీం ను విచారణ కోసం ఏర్పాటు చేశారు. అయితే హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరో తెలియకపోవడంతో వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తును కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.రాజకీయంగా....బెంగళూరులోని ఒక ల్యాండ్ సెటిల్‌మెంట్ వ్యవహారంలోనే ఈ హత్య జరిగినట్లు సీబీఐ ఒక నిర్థారణకు వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితుడు దస్తగిరిని అప్రూవర్ గా మారాడు. అయితే ఇటీవల ఈ హత్య కేసు రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతోంది. మొత్తం మీద వైఎస్ వివేకా హత్య జరిగి మూడేళ్లవుతున్నా హత్య విషయంలో ఇంకా ఒక స్పష్టత రాకపోవడం విశేషం.
https://www.telugupost.com/movie-news/జూన్-2న-రాజ్‌త‌రుణ్-అంధ‌గ-31860/
మ‌ల్టీ టాలెంటెడ్, ఎన‌ర్జిటిక్ యాక్ట‌ర్ రాజ్‌త‌రుణ్ పుట్టిన‌రోజు నేడే(మే 11). ఇప్పుడు రాజ్‌త‌రుణ్ 'అంధ‌గాడు'గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'అంధ‌గాడు' ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈడోర‌కం-ఆడోర‌కం, కుమారి 21ఎఫ్ వంటి హిట్ చిత్రాలు త‌ర్వాత రాజ్‌త‌రుణ్‌, హెబ్బాపటేల్ హిట్ కాంబినేష‌న్‌లో రిపీట్ అవుతుంది. . రాజ్‌త‌రుణ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ 'అంధ‌గాడు' మూవీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. భ‌విష్య‌త్‌లో ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో అసోసియేట్ కానున్నారు.డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్‌కు హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుంది. రాజ్‌త‌రుణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 'దెబ్బ‌కు పోయే పోయే..' అనే సాంగ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సాంగ్ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన సాంగ్స్‌ను సోష‌ల్ మీడియా, ఎఫ్‌.ఎం. రేడియో స్టేష‌న్స్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్ష‌ను నిర్వ‌హించి జూన్ 2న సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/అక్కినేని-వారసులకు-రెండవ-14595/
అక్కినేని మూడవ తరం వారసులు కథానాయకులుగా బిజీ అయిపోయారు. అక్కినేని నాగ చైతన్య తొలి చిత్రం జోష్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో భారీ అంచనాల మధ్యన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. కానీ జోష్ చిత్రానికి కనెక్ట్ ఐన యూత్ కొందరు ఉండటం విశేషం. చైతు తదుపరి చిత్రం ఏ మాయ చేసావే గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో చైతూకి తొలి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది.అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని తొలి చిత్రం మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో మితిమీరిన అంచనాలు, భారీ ప్రచారాల నడుమ విడుదలై అఖిల్ అక్కినేని కి జీవిత కాలం మర్చిపోలేని చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. నాటి నుంచి తన రెండవ చిత్ర కథ నిర్ణయం పై అనేక తర్జన భర్జనలు పడుతూనే వున్నాడు అఖిల్ అక్కినేని. తాజాగా మనం ఫేమ్ విక్రమ్ చెప్పిన కథ ను అంగీకరించాడు. కాగా దర్శకుడు విక్రమ్ ఈ చిత్రం సంగీతానికి రెహ్మాన్ తో సంప్రదింపులు జరుపుతున్నాడు. తొలి చిత్ర వైఫల్యం తరువాత ఆకలి మీద వున్నా అఖిల్ కు అన్న చైతు తరహాలో రెహమాన్ సంగీతం రెండవ సినిమా సెంటిమెంట్ ను నిలుపుతుందో లేదో చూడాలి.
https://www.telugupost.com/movie-news/kalyan-ram-sudheer-babu-movie-75700/
ఈ వారం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ సపోర్ట్ తో నా నువ్వే అంటూ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ నా నువ్వే ని ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా తిరస్కరించారు. కళ్యాణ్ రామ్ పదేళ్ల క్రితం చెయ్యాల్సిన సినిమా ని ఇప్పుడు చేసాడని... అవుట్ డేటెడ్ దర్శకుడిని నమ్ముకుని కళ్యాణ్ రామ్ చేసిన తప్పే మళ్ళీ చేసాడని అన్నారు. ఇక తమన్నా అందాలు కూడా సినిమాని కాపాడలేని పరిస్థితి. ఇక ఇదే వారం అంటే నిన్న శుక్రవారం మహేష్ బాబు బావ సుధీర్ బాబు మహేష్ సపోర్ట్ తో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో... అదితి రావు తో కలిసి సమ్మోహనం అంటూ థియేటర్స్ లో దిగిపోయాడు. అయితే సుధీర్ బాబు సమ్మోహనం అందరిని సమ్మోహన పరిచేసింది. క్లాస్ ప్రేక్షకులకు నచ్చే సినిమానే అయినా... క్రిటిక్స్ నుండి ప్రేక్షకుల నుండి కూడా సమ్మోవాహనం మంచి మార్కులే వేయించుకుంది.సుధీర్ బాబు సమ్మోహనం సినిమాలో బాగా నటించాడని... మంచి బాడీ బిల్డింగ్ తో ఇరగదీశాడని... ఇంకా అదితి రావు కూడా ఈ సినిమా విజయంలో పాలు పంచుకుందని... అదితి అందాలు, సీనియర్ నరేష్ కామెడీ సమ్మోహనం మెయిన్ హైలెట్ గా ప్రేక్షకులు సమ్మోహనం సినిమాకి పాజిటివ్ టాక్ ఇచ్చేసారు. భలే మంచి రోజు, శమంతకమణి తో ఓ మాదిరి విజయాలను సొంతం చేసుకున్న సుధీర్ బాబు కి ఈ సినిమా హిట్ ఊరటనిచ్చింది. గత వారం రోజులనుండి థియేటర్ లలో మంచి సినిమాలు లేక బోర్ ఫీల్ అవుతున్న ప్రేక్షకులకు సమ్మోహనం సినిమా కాస్త ఊరటనిచ్చింది.కాలా సినిమా కూడా ప్రేక్షకులు కొత్త సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది. ఇక మంచి టైం లో కళ్యాణ్ రామ్ తో పోటీకి సై అన్న సుధీర్ బాబు ఈ పోటీలో పై చెయ్యి సాధించాడు. నా నువ్వే ని ప్రేక్షకులు రిజెక్ట్ చేసి.. సమ్మోహనాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్ లో సమ్మోహనంతో మంచిఓపెనింగ్స్ తెచ్చుకున్నాడు. సుధీర్ బాబు విజయాన్ని సాధించడానికి మెయిన్ కారణం దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. ఇంద్రగంటి తన సినిమాల్లో కథ కథనం అన్ని బలంగా ఉండేలా చూసడుకుంటాడు. అష్టాచెమ్మ, జెంటిల్మెన్, అమీ తుమీ ఇలా అన్ని సినిమాల్లోనూ ఇంద్రగంటి మార్క్ కనబడినట్లే ... సమ్మోహనం లోను ఇంద్రగంటి మార్క్ స్పష్టంగా కనబడుతుంది.
https://www.telugupost.com/movie-news/rakul-gave-her-the-red-dress-she-was-wearing-134889/
రకుల్ కి అవకాశాలు లేవని ఆమె అభిమానులు కంగారు పడుతూ బాధపడుతున్నారు కానీ.. రకుల్ మాత్రం ఎలాంటి బాధ పడుతున్నట్లుగా కనిపించడం లేదు. నిన్న రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో భాగంగా బాలీవుడ్ నటి మలైకా అరోరా తనకు విసిరిన ఛాలెంజ్ ను తాను పూర్తి చేశానని… ఇదే ఛాలెంజ్ ను మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, అజయ్ దేవగణ్, రానా దగ్గుబాటి, మోహన్ శక్తిలకు విసురుతున్నానని తెలిపింది. మరి వారి ఫిట్నెట్ మూవ్స్ ను చూపించాలని ఛాలెంజ్ చేసింది. ఇక తాజాగా రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాటెస్ట్ ఫొటోస్ చూస్తే మతి పోవాల్సిందే. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గానని మరోసారి ఈ హాట్ లుక్ తో రకుల్ చూపించింది. ఇరగదీసిన రకుల్… క్లివేజ్ అందాలతో… హాట్ లుక్ తో మత్తెక్కించే చూపుతో.. రకుల్ ని చూస్తుంటే… అబ్బ పోరి భలే గా వుంది అంటారు. రకుల్ అందాలతో ఆమె వేసుకున్న ఆ రెడ్ డ్రెస్సుకే అందమొచ్చింది. ఎలాంటి అచ్చేదన లేకుండా అలా కసిగా రెడ్ హాట్ చూపులతో చూస్తున్న రకుల్ చూపుల గాలానికి కుర్రాళ్ళు చిక్కడం ఖాయం. ఎప్పుడూ అందాల ఆరబోతకు అడ్డు చెప్పని రకుల్ ఈమధ్యన మరిన్ని అందాలతో అందరికి విందు చేస్తుంది. హీరోయిన్ అంటే హాట్ గా ఉండాలని రకుల్ ని చూసి అందరూ నేర్చుకోవాల్సిందే.
https://www.telugupost.com/movie-news/krish-pawan-heroine-177688/
పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో తెరకెక్కనున్న జానపద చిత్రం షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఈ నెలలోనే మొదలవ్వాల్సి ఉండగా.. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ వలన జనవరి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ వల్ల సినిమా లేట్ అవడం కన్నా ఇప్పుడు పవన్ సినిమా కోసం క్రిష్ వేయించిన సెట్స్ నిర్మాణం మళ్ళీ చేపట్టిన కారణంగానే క్రిష్ – పవన్ సినిమా లేట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చేసే సినిమా కోసం క్రిష్ ఫిబ్రవరిలోనే అల్యూమినియం ఫ్యాకటరీలో ఓ సెట్ ని నిర్మించగా అది ఇప్పుడు లాక్ డౌన్ వల్ల వాడకపోవడం, అలాగే భారీ వర్షాలకు సెట్ నిర్మాణం దెబ్బతినడంతో.. మళ్ళీ ఆ సెట్ నిర్మాణం చేపట్టినట్టుగా తెలుస్తుంది. అందుకే క్రిష్ తో పవన్ సినిమా కొద్దిగా లేట్ అవుతుందట. మరోపక్క క్రిష్ పవన్ సినిమాలో నటించబోయే హీరోయిన్ వేటలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ముందు రకుల్ ప్రీత్ నే హీరోయిన్ గా అనుకున్నారు. అందుకే క్రిష్ వైష్ణవ తేజ్ సినిమాలో రకుల్ ని తీసుకున్నాడనే టాక్ నడిచింది. అయితే క్రిష్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా కోసం రకుల్ ప్రీత్ ని అనుకోలేదట. ఎందుకంటే రకుల్ ప్రీత్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడమే కాదు.. తెలుగులోనూ రెండు సినిమాలు చేస్తుంది. అందుకే రకుల్ ని అసలు క్రిష్ పవన్ సినిమా కోసం సంప్రదించలేదట. మరి పవన్ కళ్యాణ్ సినిమా కోసం క్రిష్ ఏ భామని తీసుకొస్తాడో గాని.. ఈ సినిమాలో అయితే రకుల్ కాదంటున్నారు.
https://www.telugupost.com/movie-news/venkatesh-nagachaitanya-venkymama-collections-142695/
శుక్రవారం విడుదలైన వెంకిమామ శుక్ర, శని, ఆదివారాల్లో కలెక్షన్స్ కుమ్ముడే కుమ్ముడు. ఈ మూడు రోజుల కలెక్షన్స్ తో వెంకిమామ చాలా వరకు సేఫ్. మూడు రోజులు కలెక్షన్స్ చూసిన ట్రేడ్ వర్గాలు వెంకిమామ కి తొందరగానే బ్రేక్ ఈవెన్ చేరుతుందని అంచనా వేశారు. కానీ వీక్ డేస్ లో వెంకిమామ కలెక్షన్స్ డ్రాప్ కనబడుతుంది. మండే వెంకిమామ వసూళ్లు బాగా పడిపోయాయి. థియేటర్స్ లో ప్రేక్షకులు కూడా చాలా పల్చగా కనబడ్డారు. దీనితో సోమవారం వెంకిమామ రెండున్నర కోట్ల తోనే సరిపెట్టుకుని.. మొత్తం నాలుగు రోజులకు గాను రెండు రాష్ట్రాల్లో వెంకిమామ 19.44 వసూళ్లు కొల్లగొట్టింది. ఏరియా: షేర్ (కోట్లలో) నైజాం 7.52 సీడెడ్ 3.34 నెల్లూరు 0.71 కృష్ణ 1.17 గుంటూరు 1.62 వైజాగ్ 2.60 ఈస్ట్ గోదావరి 1.57 వెస్ట్ గోదావరి 0.91 టోటల్ ఏపీ & టీస్ షేర్: 19.44
https://www.telugupost.com/movie-news/negative-comments-on-rakul-preeth-94107/
గత కొంతకాలం నుండి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎందుకో కనిపించడం మానేసింది. ఒక్కప్పుడు తెలుగులో స్టార్ట్ హీరోల సరసన నటించిన రకుల్ జోరు ఈ మధ్య తగ్గిపోయింది. ఇక్కడ సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ అమ్మడుకు బాగానే కలిసొచ్చింది. గత ఏడాది కార్తీ సరసన 'ఖాకీ' సినిమాలో నటించింది. అక్కడ అది ఘన విజయం సాధించింది. దీంతో ఆమెకు కార్తీ మరో సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. అలానే సూర్య పక్కన 'ఆర్జికె' లో కూడా ఛాన్స్ కొట్టేసింది రకుల్. అంతేకాదు శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తుంది. ఇలా కోలీవుడ్ నుండి మంచి ఆఫర్స్ రకుల్ చేతిలో ఉన్నాయి. కోలీవుడే కాదు బాలీవుడ్ లో కూడా రకుల్ అజయ్ దేవగన్ సరసన 'దే దే ప్యార్ దే' లో ఛాన్స్ కొట్టేసింది.జీరో సైజ్ కోసం...అంతా బాగానే ఉంది కానీ రకుల్ శరీరంలో ఈ మధ్య విపరీతమైన మార్పు కనిపిస్తోంది. డైలీ గంటల తరపడి జిమ్ లో వర్కవుట్స్ చేయడం... దీంతో ఆమె మొహంలో గ్లో పోతోంది. జీరో సైజు కోసం ఈ బ్యూటీ మరీ పీలగా అవ్వడంతో అభిమానులకు నచ్చడం లేదు. సోషల్ మీడియాలో ఆమెపై నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. హీరోయిన్స్ కొద్దిగా బొద్దుగా ఉంటేనే మొహంలో గ్లోతో పాటు ఆకర్షణ ఉంటుంది. మరీ ఇలా ఉంటె ఆఫర్స్ రావడం కూడా కష్టమే. మరి రకుల్ ఏం చేస్తుందో చూడాలి.
https://www.telugupost.com/movie-news/after-disco-raja-ravi-teja-working-in-krack-cinema-146370/
రవితేజ వరస ప్లాప్స్ తో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు అనుకుంటే పొరబాటే. ఎందుకంటే పారితోషకం విషయంలో ప్లాప్స్, డిజాస్టర్స్, హిట్స్ తో పనిలేకుండా డిమాండ్ చేస్తాడు. అవకాశం ఉంది ఇస్తారంటూ రెమ్యునరేషన్ లెక్కలు చెబుతాడు. ప్రస్తుతం నాలుగు ప్లాపులతో ఉన్న రవితేజ క్రాక్ సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ తో కలిసి నటిస్తున్న క్రాక్ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం బయటికొచ్చిన క్రాక్ పోస్టర్స్ చూస్తే రవితేజ మల్లి ఫామ్ లోకి రావడం ఖాయంగా కనబడుతుంది. అయితే తాజాగా క్రాక్ సినిమా తమిళ సినిమాకి ఫ్రీమేక్ అంటూ ప్రచారం మొదలైంది. హిట్స్ లేని రవితేజ ఈసారి ఫ్రీమేక్ ని నమ్ముకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న క్రాక్ సినిమా త‌మిళ సేతుప‌తికి ఫ్రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. తమిళ సేతుపతి కథకి, క్రాక్ సినిమా కథకి దగ్గర పోలికలు ఉన్నాయని అంటున్నారు. అయితే తమిళ సేతుపతి ని గతంలోనే గంటా శ్రీనివాస్ కొడుకు తెలుగులో జయదేవ్ అంటూ రీమేక్ చేసి ప్లాప్ కొట్టాడు. మల్లి అదే సినిమాకి ఫ్రీమేక్ అంటే… కాస్త ఆలోచించదగిన విషయమే. అయితే సేతుపతి కథని రవితేజ పర్సనాలిటి సరిపోయే రీతిలో స్రిప్ట్ రాసుకుని.. ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/movie-news/daggubati-rana-follows-rajamouli-103504/
మొన్నటివరకు టాలీవుడ్ లో కామెడీ హర్రర్స్ ట్రెండ్ అయితే నిన్నటివరకు బయోపిక్స్ ట్రేడ్ గా నడిచాయి. ఇక రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ కూడా మారి కొత్త ట్రేడ్ కు శ్రీకారం చుట్టున్నారు మేకర్స్. అదే పీరియాడిక్ మూవీస్. మనకి ఇవేమి కొత్త కాదు. రీసెంట్ గా #RRR కూడా పీరియాడిక్ కథతోనే తెరకెక్కుతుంది. ఇప్పుడు మరో సినిమా కూడా పీరియాడిక్ కథతో రూపొందనుంది. రానా హీరోగా….. ఇందులో ఎటువంటి అబద్దం లేదు. ఇది నిజం. దగ్గుబాటి రానా హీరో గా ఓ పీరియాడిక్ కథ త్వరలోనే తెరకెక్కనుంది. ఈ విషయాన్ని దర్శకుడు వేణు ఉడుగుల స్పష్టంచేశాడు. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో పాపులర్ అయిన ఈ డైరక్టర్.. విరాటపర్వం సినిమా 50 ఏళ్ల టైమ్ గ్యాప్ లో జరుగుతుందని చెబుతున్నాడు. శర్వా ఏం చెప్పకపోవడంతో…. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసినా అది పీరియాడిక్ మూవీ అని ఎవరికి తెలియదు. ఇప్పటివరకు వచ్చిన పీరియాడిక్ సినిమాలకు భిన్నంగా ఇది ఉంటుందని చెబుతున్నారు. రానా కి జోడిగా సాయి పల్లవి ని సంప్రదిస్తునట్టు సమాచారం. ఆమె ఓకే చెప్పితే త్వరలోనే సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. మొదట ఈసినిమాకి శర్వానంద్ ని అనుకున్నారు. కానీ శర్వా ఏ విషయమూ చెప్పకపోవడంతో ఇప్పుడు ఆ కథ రానా దగ్గరకు వెళ్ళింది. కథ విన్న రానా వెంటనే ఓకే చేసేసాడట. స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు ఫినిష్ అవ్వడంతో త్వరలోనే అధికారంగా అనౌన్స్ చేయనున్నారు అని తెలుస్తుంది.
https://www.telugupost.com/movie-news/బ‌న్నీ-నెక్ట్స్-సినిమా-ఆ-54279/
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ ఉర‌ఫ్ బ‌న్నీతో సినిమా చేసేందుకు చాలా మంది ద‌ర్శ‌కులు క‌ల‌లు కంటుంటారు. ఈ జాబితాలో చాంతాండంత‌ లిస్ట్ ఉన్నా ఆ ఛాన్స్ మాత్రం త‌క్కువ మందికే వ‌స్తుంది. డీజే సినిమాతో ఈ యేడాది యావ‌రేజ్‌ను త‌న ఖాతాలో వేసుకున్న బ‌న్నీ ప్ర‌స్తుతం స్టార్ స్టోరీ రైట‌ర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నా పేరు సూర్య సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ సినిమా ఏ డైరెక్ట‌ర్‌తో ఉంటుందా ? అన్న‌దానిపై ఓ క్లారిటీ వచ్చిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. తాజాగా బ‌న్నీ త‌మ్ముడు శిరీష్‌తో ఒక్క క్ష‌ణం సినిమా తీసి మంచి మార్కులు వేయించుకున్న వి ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది.బ‌న్నీతో ఎప్ప‌టి నుంచో సినిమాలు చేయాల‌నుకుంటున్న ఆనంద్ బ‌న్నీ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌డంతో మ‌ధ్య‌లో గ్యాప్‌లో శిరీష్‌తో ఒక్క క్ష‌ణం సినిమా చేశాడు. ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లతో పాటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు కూడా వ‌స్తున్నాయి. సినిమా టాక్ బ‌ట్టి బ‌న్నీ కూడా ఆనంద్ పనితీరు పట్ల ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. బ‌న్నీతో ముందు నుంచి అనుకున్న క‌థ‌తోనే ఆనంద్ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాకు నిర్మాత ఎవ‌రు ? ఇత‌ర సాంకేతిక నిపుణులు ఎవ‌రు అన్న‌ది ? త్వరలోనే వెల్ల‌డ‌య్యే ఛాన్సులు ఉన్నాయి.
https://www.telugupost.com/movie-news/ntr-heroine-74761/
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి పెద్దగా పేరుండదనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఎక్కడో ఒకటీ, అర హీరోయిన్స్ మాత్రమే నిలదొక్కుకుని చక్రం తిప్పారు. కానీ, తెలుగమ్మాయిలకు అందం తక్కువో, అభినయం రాదనో తెలియదు గానీ దర్శక నిర్మాతలెప్పుడు పరభాషా హీరోయిన్స్ మీదే మోజుపడతారు. అంతేలే తెలుగు హీరోయిన్స్ ని పెట్టి సినిమాలు చేస్తే తెలుగు ప్రేక్షకులు కనికరించరనేది వారి వాదన. ఇకపోతే తెలుగమ్మాయిగా 'అమీతుమీ, అ' వంటి సినిమాల్లో నటించిన ఈషా రెబ్బకి టాలీవుడ్ లో ఇప్పటివరకు బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలు హిట్ అయినా అమ్మడుకి మాత్రం పేరు రాలేదు.ఎన్టీఆర్ పై ప్రశంసలు....ప్రస్తుతం త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత - వీర రాఘవ' సినిమా లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. 'అరవింద సమేత'లో పూజ హెగ్డే మెయిన్ లీడ్ రోల్ నటిస్తుంది. ఇకపోతే 'అరవింద సమేత' షూటింగ్ లో పాల్గొన్న ఈషా రెబ్బ ఆ సినిమా ముచ్చట్లను కథలు కథలు గా చెబుతున్నది. 'అరవింద సామెత'లో తనకు ఒక డిఫరెంట్ రోల్ దొరికిందని, ఇలాంటి పాత్రలు చెయ్యడం తనకి ఛాలెంజ్ అని చెబుతుంది. అలాగే ఈ పాత్రకి తనని ఎంపిక చేసినందుకు గానూ త్రివిక్రమ్ కి థాంక్స్ చెప్పడమే కాదు పనిలోపనిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెగ పొగిడేస్తోంది. సరదాగా ఉంటారు...'అరవింద సమేత' సెట్స్‌లో ఎన్టీఆర్‌తో కలిసి పని చేయడం యాగ్జయింటింగ్‌గా ఉందని, ఎన్టీఆర్ ని, అతని ఎనర్జీని ‘విద్యుత్ ప్రవహించే ఓ లైవ్ వైర్’ అంటూ ఆకాశానికెత్తేస్తుంది ఈ అమ్మడు. ఎన్టీఆర్ ఎనర్జీతో సమానంగా పని చెయ్యడం అనేది మాటలు కాదని ఎన్టీఆర్ ని పొగడడమే కాదు, ఎన్టీఆర్ 'అరవింద సమేత' సెట్స్ లో అందరితో ఫన్నీ గా ఉంటారని చెబుతుంది. అలాగే చిత్ర యూనిట్ మొత్తం సరదాగా జోకులు వేసుకుంటూ హాయిగా పనిచేస్తుంటామని కూడా చెబుతుంది ఈషా రెబ్బ.
https://www.telugupost.com/movie-news/megastar-chiranjeevi-to-host-big-boss-season-4-139316/
తెలుగు బిగ్ బాస్ సీజన్ సీజన్ కి వ్యాఖ్యాతలు మారిపోతూనే ఉన్నారు. సీజన్ 1 కి ఎన్టీఆర్, 2 కి నాని, రీసెంట్ గా ముగిసిన 3 కి నాగార్జున హోస్టింగ్ చేశారు. ఇక అప్పుడే బిగ్ బాస్ సీజన్ 4 హోస్టింగ్ ఎవరు చేస్తే బావుండు అనే దానిమీద అప్పుడే సోషల్ మీడియాలో రకరకాల పేర్లు ప్రచారంలోకొచ్చేశాయి. అయితే అందరిలో ఎక్కువగా చిరంజీకి పేరు వినబడుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద చిరంజీవి ఇచ్చిన స్పీచ్, కామెడీ, హావభావాలు అందరూ ముగ్దులవుతున్నారు. కంటెస్టెంట్స్ తో చిరు ప్రవర్తించిన తీరుకు అందరూ చిరు హోస్టింగ్ మీద మనసు పాడేసుకుంటున్నారు. అంతలా చిరు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో స్పషల్ గెస్ట్ గా మెప్పించాడు. అందుకే సీజన్ 4 కి చిరు పేరే హైలెట్ అవుతుంది. మరి చిరు దానికి ఒప్పుకుంటాడో లేదో అనేది… తెలియలంటే చాలా సమయమే పడుతుంది. అయితే చిరంజీవి ఒప్పుకోకపోవటానికి కూడా కారణాలున్నాయి. ఎన్టీఆర్ ఎంతో హుందాగా హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 కి, సీజన్ 2 విషయానికొచ్చేసరికి…నానిని సోషల్ మీడియా లో తెగ ట్రోల్ చేశారు. ఇక సీజన్ 3 కి నాగార్జున కూడా చివరిలో ట్రోల్ కి గురైయ్యాడు. మరి కాంట్రవర్సీలకు వేదికగా మారిన బిగ్ బాస్ హోస్టింగ్ కి చిరు సై అంటాడా.. లేదంటే నో చెబుతాడో అంటూ వార్తలొస్తున్నాయి
https://www.telugupost.com/movie-news/vakeel-saab-amazon-prime-189120/
గత శుక్రవారం థియేటర్స్ లో విడుదలైన వకీల్ సాబ్ థియేటర్స్ దుమ్ముదులుపుతుంది. బాక్సాఫీసుని షేక్ చేస్తుంది. గత మూడు నెలలుగా ఓ మాదిరి సినిమాలే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాయి. ఈ మూడు నెలల్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రావడం ఇదే తొలిసారి కావడం, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో వకీల్ సాబ్ పై అందరిలో క్యూరియాసిటీ, అలాగే ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడ్డాయి. అందులోను రిలీజ్ అయిన ఫస్ట్ షో కే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, సోషల్ మీడియాలో మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో వకీల్ సాబ్ వసూళ్ల పరంగాను అదరగొట్టేస్తుంది. వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 36 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరోవైపు ఓవర్సీస్ ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది.ఇక అద్భుతంగా థియేటర్స్ లో దూసుకుపోతున్న వకీల్ సాబ్ ని చూడడానికి ప్రేక్షకులు కరోనని కూడా లెక్క చెయ్యకపోవడం గమనార్హం. కరోనా సెకండ్ వెవ్ ఉధృతంగా ఉన్న టైం లోను వకీల్ సాబ్ థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం గనక వకీల్ సాబ్ సినిమాకి రేట్లు పెంచకుండా ఇబ్బందులకు గురి చేసినా పవర్ స్టార్ ప్రభంజనం ఆగలేదు. ఇకపోతే ఇంత పెద్ద హిట్ అయిన వకీల్ సాబ్ ని అమెజాన్ ప్రైమ్ 30 కోట్లకి దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి లాక్ డౌన్ లోనే అమెజాన్ వారు 100 కోట్ల ఆఫర్ ఇవ్వగా దిల్ రాజు మాత్రం వకీల్ సాబ్ ని ఎట్టి పరిస్తితుల్లో థియేటర్స్ లో విడుదల చేస్తామని పట్టుబట్టి బట్టి హిట్ కొట్టాడు.తాజాగా అమెజాన్ ప్రైమ్ తో డీల్ పూర్తయిన వకీల్ సాబ్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 23న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుందని తెలుస్తోంది.
https://www.telugupost.com/movie-news/mahesh-babu-guntur-kaaram-story-is-first-go-to-ntr-hands-news-viral-1514902
NTR : మహేష్ బాబుని పక్కా మాస్ రోల్ లో చూపిస్తూ త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం 'గుంటూరు కారం'. ఈరోజు జనవరి 12న భారీ అంచనాలు మధ్య రిలీజైన ఈ సినిమా.. ఆ అంచనాలను అందుకోవడంలో తడబడిందని చెబుతున్నారు. మూవీ మొత్తాన్ని మహేష్ ముందుండి నడిపించినప్పటికీ.. కథలో దమ్ము లేకపోవడంతో థియేటర్ లో నిరాశ కలిగిస్తుంది. దీంతో మహేష్ అభిమానులు త్రివిక్రమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు వేస్తున్నారు.మరో పక్క ఎన్టీఆర్ అభిమానులు సంతోషం పోస్టులు వేస్తున్నారు. అయితే వారు సంతోష పడుతుంది.. మహేష్ సినిమా ప్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నందుకు కాదు, ఆ సినిమాని ఎన్టీఆర్ వదులుకున్నందుకు. గుంటూరు కారం సినిమాని ముందుగా ఎన్టీఆర్ తోనే అనుకున్నారట త్రివిక్రమ్. 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సక్సెస్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.త్రివిక్రమ్ 'అల వైకుంఠపురంలో' తెరకెక్కిస్తున్న సమయంలో.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ టైటిల్ కూడా అప్పటిలో బయటకి వచ్చింది. 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ తో ఓ పొలిటికల్ టచ్ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలు ఎక్కలేదు. అయితే ఆ కథనే త్రివిక్రమ్.. అటు ఇటు మార్చి మహేష్ తో గుంటూరు కారం చేశారని ఇప్పుడు గట్టిగా టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా కథ అంతా పొలిటికల్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. అధికారంలోకి రావడం కోసం సొంత కూతురి కొడుకుని, భర్తని దూరం చేసిన తండ్రి. అలా అమ్మకి దూరంగా పెరిగిన కొడుకు.. పొలిటికల్ గేమ్ లో భాగంగా మళ్ళీ ఆ కుటుంబంలోకి ఎలా వచ్చాడు అనే స్టోరీ లైన్ తో సినిమా సాగుతుంది. మహేష్ క్యారెక్టర్ కూడా మాస్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎన్టీఆర్ కోసమే అలా డిజైన్ చేసి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా, గుంటూరు కారం ఒకటేనా అనేది తెలియాల్సి ఉంది.
https://www.telugupost.com/crime/a-major-fire-broke-out-in-delhi-seven-people-were-burnt-alive-in-an-accident-in-a-slum-1359078
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మురికివాడలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీలోని గోకుల్ పురిలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు రేగడంతో పూరి గుడెసెల్లో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశారు. 60 గుడెసెలు అగ్నికి ఆహుతయ్యాయి.మంటలు అదుపులోకి...మరికొందరు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు తెలిసింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటాలు ప్రయత్నాలు చేస్తున్ానయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
https://www.telugupost.com/andhra-pradesh/pre-election-changes-in-ysr-congress-party-are-now-troubling-the-leaders-leaders-are-waiting-for-partdy-chief-ys-jagans-decision-1547156
వైఎస్సార్సీపీలో ఎన్నికలకు ముందు జరిగిన మార్పులు ఇప్పుడు నేతలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా స్పష్టత లేకపోవడంతో వారంతా ఇప్పుడు తాడేపల్లి జగన్ నివాసం వైపు చూస్తున్నారు. ఎవరు ఎక్కడ ఏం చేయాలో తెలియడం లేదు. నియోజకవర్గాల వైసీపీ ఇన్‌ఛార్జులుగా ఎవరు ఉండాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో అనేక నియోజకవర్గాల్లో పార్టీ నేతలు లేక క్యాడర్ ఇబ్బందులు పడుతుంది. ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. ఇటీవల తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వైసీపీ క్యాడర్ ఈ విషయంపై నేరుగా జగన్ కు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.ఎన్నికలకు ముందు...ఎన్నికలకు ముందు అనేక మంది వైసీపీ నేతలను నియోజకవర్గాలను మార్చారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను మార్చారని అప్పట్లో వైసీపీ అధినేత జగన్ తెలిపారు. దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో ఈ మార్పులు చేర్పులు జరిగాయి. అప్పట్లో మంత్రులుగా ఉన్న వారిని, ఎమ్మెల్యేలను కూడా నియోజకవర్గాలను మార్చారు. దీంతో వారు కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అయితే గత ఎన్నికలలో దాదాపు మార్చిన చోటంతా ఓటమి పాలయ్యారు. నియోజకవర్గాలను మార్చిన వారిలో ఏ ఒక్కరూ గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. అయితే వీరంతా అయిష్టంగా తమ సొంత నియోజకవర్గాలను వదిలి అధినాయకత్వం కేటాయించిన నియోజకవర్గాలకు తాత్కాలికంగా వెళ్లారు.బదిలీ చేసిన చోటుకు...ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ వైపు వైసీపీ నేతలు చూడటం లేదు. ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గానికి యర్రగొండపాలెం లో 2019 ఎన్నికల్లో గెలిచిన ఆదిమూలం సురేష్ ను షిఫ్ట్‌ చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయన కొండపికి దూరంగా ఉన్నారు. యర్రగొండపాలెంలో మాత్రం కొత్త అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వడంతో అక్కడ గెలిచారు. ఇక సంతనూతలపాడు నుంచి అప్పటి మంత్రి మేరుగ నాగార్జును ను పోటీ చేయించారు. వాస్తవానికి ఆయన గుంటూరు జిల్లా వేమూరు నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు వేమూరు నాగార్జున సంతనూతలపాడు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. 2019 లో పోటీ చేసి గెలిచిన సుధాకర్ కూడా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో అక్కడ వైసీపీ ఇన్‌ఛార్జి ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది.ఇన్‌ఛార్జులు లేక...ఇక గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన విడదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. ఆమె ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండటం లేదు. కనిగిరి నియోజకవర్గం నుంచి కందుకూరుకు బదిలీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ పరిస్థితి కూడా అంతే. ఆయన ఇప్పుడు బెంగళూరులో తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి కంభాల జోగులును పాయకరావుపేటకు పంపారు. అక్కడ ఓడిపోవడంతో ఇటు రాజాం, అటు పాయకరావుపేటలను పట్టించుకునే నేత లేరు. ఇప్పటికైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల విషయంలో స్పష్టత ఇవ్వాలని క్యాడర్ కోరుతుంది.
https://www.telugupost.com/movie-news/bollywood-model-and-actor-siddhaanth-veer-passed-away-while-doing-workouts-at-gym-1447704
బాలీవుడ్ లో విషాద ఘటన జరిగింది. జిమ్ చేస్తూ.. ప్రముఖ మోడల్, నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (46) కన్నుమూశాడు. జిమ్ లో వర్కవుట్ చేస్తూ.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు సిద్ధాంత్. అతని మరణ వార్తతో బాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సిద్ధాంత్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కసౌతి జిందగీ కే సీరియల్ ద్వారా సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ పేరు సంపాదించుకున్నాడు.సీరియల్ లో నటించక ముందు.. అతని పేరు ఆనంద్ కాగా.. ఇటీవలే పేరు మార్చుకున్నాడు. సుఫియానా ఇష్క్ మేరా, జిద్ది దిల్ మానే నా , వారిస్, సాత్ ఫేరే సలోని కా సఫర్ వంటి సీరియల్స్ తో పాటు.. పలు టెలివిజన్ షోలలోనూ కనిపించాడు. చివరిసారిగా సిద్ధాంత్ జీ టీవీ షో కూ రిష్టన్ మే కట్టి బట్టిలో కనిపించాడు. సిద్ధాంత్ మృతి పట్ల బాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా.. గతేడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇదే రీతిలో కన్నుమూశారు.
https://www.telugupost.com/movie-news/పవన్-క్లాస్-పనిచేస్తుందా-25392/
శృతి హాసన్ ఒకప్పుడు సౌత్ లో ఐరెన్ లెగ్ గా పేరు మోసింది. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేసిన 'గబ్బర్ సింగ్' తో ఆమెకు సుడి తిరిగి ఒక్కసారే గోల్డెన్ లెగ్ గా అవతారమెత్తింది. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అడపా దడపా బాలీవుడ్లోకి వెళ్ళొచ్చినప్పటికీ ఆమెకు సౌత్ లో వున్న క్రేజ్ మరెక్కడా లేదు. ఇప్పటికే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న శృతి హాసన్ ప్రస్తుతానికి టాలీవుడ్ లో పవన్ పక్కన 'కాటమరాయుడు'లో తమిళంలో తన తండ్రి చేస్తున్న 'శభాష్ నాయుడు'లో నటిస్తోంది.అయితే పవన్ తో 'గబ్బర్ సింగ్' సినిమా చేస్తున్నప్పుడే శృతి కి పవన్ అంటే అభిమానం ఏర్పడిపోయిందట. ఇక ఇప్పుడు ఎలాగూ ఇద్దరు కలిసి 'కాటమరాయుడు' చేస్తున్నారు కాబట్టి ఆ స్నేహం ఇంకా గట్టిపడిందని అంటున్నారు. ఇక ఆ స్నేహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ఒక హిత బోధ చేసాడట. అదేమిటంటే ఏదో ఒక సందర్భంలో శృతి, పవన్ తో తానూ సౌత్ లో చేసే సినిమాలు మీద ఫోకస్ తగ్గించి బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు పవన్ తో చెప్పిందట. అయితే దానికి పవన్ శృతి కి క్లాస్ పీకినంత పని చేసాడట. బాలీవుడ్ కంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ కాలం కెరీర్ ని కొనసాగించవచ్చని.... అదే బాలీవుడ్ లో అయితే కాంపిటీషన్ తట్టుకుని నిలబడడం మామూలు విషయం కాదని... అందుకే సౌత్ లో కెరీర్ ని బాగా మలచుకుంటే ఇక ఇబ్బంది ఉండదని చెప్పాడట.మరి పవన్ చెప్పిన మాటలు శృతి చెవికి ఎక్కించుకుందా? లేకపోతె ఇంకా బాలీవుడ్ మోజులోనే ఉందా? అనేది మాత్రం క్లారిటీ లేదు. మరి పవన్ ఆమెతో ఉన్న స్నేహం తోనే ఇలా చెప్పాడని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ చెప్పింది అక్షర సత్యం. ఇక్కడ సౌత్ లో దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యంగా వెలుగొందేందుకు వీలుంది కానీ.... బాలీవుడ్ లో కేవలం గ్లామర్ షో చేసినంత వరకే కెరీర్ నిలబడుతుంది.
https://www.telugupost.com/movie-news/నాగ్-వర్మ-మూవీ-టైటిల్-51550/
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఫిలిం పది రోజుల మొదటి షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ కోసం ముంబై చెక్కెయ్యడానికి హీరో నాగార్జున కోసం వెయిట్ చేస్తుంది. నాగ్ అఖిల్ హలో ఫిలిం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో వర్మ సినిమా షూటింగ్ కి కొంతమేర బ్రేక్ ఇచ్చాడు. శివ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇండస్ట్రీకి అందించిన ఈ కాంబినేషన్ మరలా రిపీట్ అవడంతో ఈ మూవీ కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది. మాఫియా బ్యాక్డ్రోప్ తో తెరకెక్కించనున్న ఈ మూవీలో నాగార్జున సరసన మైరా సరీన్ అనే కొత్తహీరోయిన్ ని ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించాడు వర్మ.ఇకపోతే వర్మ - నాగ్ సినిమాకి ఇప్పటివరకు టైటిల్ ని ఎనౌన్స్ చెయ్యలేదు. అయితే ఇప్పడు ఈ మూవీకి వర్మ రెండు టైటిల్స్ ని అనుకుంటున్నట్టుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఈ రెండు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ని వర్మ ఇప్పటికే రిజిస్టర్ చేయించాడు కూడా. అయితే ఆ ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఏమిటంటే.. ఒకటి గన్, రెండు సిస్టమ్ అనే టైటిల్స్ ని వర్మ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. అయితే చిత్ర బృందం నుండి అందుతున్న సమాచారం ప్రకారం వర్మ - నాగ్ మూవీకి సిస్టమ్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లుగా చెబుతున్నారు. చిత్ర కథకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యే టైటిల్ సిస్టమ్ అని.. అందుకే వర్మ కూడా ఆ టైటిల్ కె మొగ్గు చూపుతున్నాడని టాక్. చూద్దాం ఫైనల్ గా నాగార్జున సినిమాకి వర్మ ఏ టైటిల్ ని తీసుకుంటాడో?
https://www.telugupost.com/movie-news/pawan-political-movies-167844/
పవన్ కళ్యాణ్ మూడు సినిమాల్తోనే ముగించేస్తాడనుకుంటే.. కొత్తగా సురేందర్ రెడ్డి మూవీని ప్రకటించి షాకిచ్చాడు. పవన్ బర్త్ డే రోజున పవన్ సినిమాలపై పక్కా క్లారిటీ వచ్చేసింది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటే సినిమాల షూటింగ్ చేయబోతున్నాడని ఫిక్స్ అయ్యింది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ తో సమాజానికి ఓ మెస్సేజ్ తో రాబోతుంటే.. క్రిష్ సినిమాలో చరిత్రత్మక కథని టచ్ చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో చెయ్యబోయే సినిమాని పొలిటికల్ బ్యాగ్రౌండ్ లో చేయ్యబోతున్నాడనే అనుమానం హరీష్ వదిలిన పవన్ బర్త్ డే పోస్టర్ తో అర్ధమైంది. ఇక నెక్స్ట్ మూవీ సురేందర్ రెడ్డి తో పవన్ కమిట్ అయిన మూవీ కూడా పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లోనే ఉండబోతుంది అనే టాక్ మొదలైంది. తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు చెయ్యాలి అనుకున్నది, ప్రభుత్వం మీద పవన్ పోరాటం, వచ్చే ఎన్నికల్లో పవన్ గెలుపుకు కావాల్సిన కమర్షియల్, పొలిటికల్ అంశాలతో అటు హరీష్ శంకర్ ఇటు సురేందర్ రెడ్డి మూవీస్ ఉండబోతున్నాయనేది ఫిలింనగర్ టాక్. ఈ పొలిటికల్ మూవీస్ వలన పవన్ రాజకీయ ఎత్తుగడ ఫలించేలా ఈ దర్శకులు ప్లాన్ చేస్తున్నారని వినికిడి.
https://www.telugupost.com/movie-news/చెర్రీ-అన్నఎవరో-తెలుసా-56829/
రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం విడుదల కాకమునుపే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక మాస్ ఎంటెర్టైనెర్ కి శ్రీకారం చుట్టాడు. బోయపాటి డైరెక్షన్ లో సినిమా మొదలవ్వడమే కాదు అధికారికంగా సెట్స్ మీదకెళ్ళి రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలెట్టేసింది. రంగస్థలం వంటి ఒక విభిన్న కథ తర్వాత చేస్తున్న ఈ సినిమా పక్కా మాస్ గా ఉండబోతుంది. ఇక ఈ సినిమాని డి వి వి దానయ్య నిర్మిస్తుండగా మహేష్ తో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కైరా అద్వానీ చరణ్ కి హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఇప్పుడు బోయపాటి - రామ్ చరణ్ సినిమాకి సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో చెర్రీ కి అన్నగా ఒక తమిళ సీనియర్ హీరో నటిస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు జీన్స్ చిత్రంతో అమ్మాయిల మదులు దోచేసిన ప్రశాంత్. ఈ సినిమాలో రామ్ చరణ్ అన్నయ్యగా ప్రశాంత్ నటిస్తున్నాడని న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. మరి బోయపాటి మార్క్ తో ఈ మాస్ ఎంటెర్టైనెర్ లో రామ్ చరణ్ అన్న ప్రశాంత్ తో కలిసి ఎలాంటి బీభత్సాలు సృష్టిస్తాడో చూద్దాం.
https://www.telugupost.com/movie-news/vishwak-about-ntr-154621/
ఎన్టీఆర్ నట విశ్వరూపం అంటే ఏ దర్శకుడికైనా, అభిమానికైనా పిచ్చ ఇంట్రెస్ట్. ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా డైలాగ్ చెప్పాడంటే థియేటర్స్ లో విజిల్స్. ఇక సెట్స్ లోను ఎన్టీఆర్ సింగల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ అందరూ కితాబునిచ్చినట్టే… టాలీవుడ్ ఓ కుర్ర హీరో కూడా ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్ అంటూ చెబుతున్నాడు హిట్ తో హిట్ కొట్టిన కుర్ర హీరో విశ్వక్ సేన్. ఏ సీన్ అయినా ఎన్టీఆర్ సింగల్ టేక్ లో చెయ్యడం ఎన్టీఆర్ ప్రత్యేకత. ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే బెస్ట్ డాన్సర్. నేను తెలుగులో ఎక్కువగా ఇష్టపడే హీరో ఎన్టీఆర్ అంటున్నాడు. ఇక మహేష్ అంటే హ్యాండ్సమ్ హీరో అని, అల్లు అర్జున్ స్టైలిష్ హీరో అని చెబుతున్న విశ్వక్ సేన్ కి మల్టీస్టారర్ అవకాశం వస్తే.. మాత్రం తన ఫెవరెట్ నిర్మాత నాని తో చెయ్యాలని ఉందని చెబుతున్నాడు. ఇక దర్శకుల్లో తనకిష్టమైన దర్శకుడు తరుణ్ భాస్కర్ అని చెబుతున్నాడు. తనని హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ ఎప్పటికి తన ఫెవరెట్ అని చెబుతున్నాడు విశ్వక్.
https://www.telugupost.com/movie-news/allu-arjun-next-movie-2-86583/
నా పేరు సూర్య ఫ్లాప్ తో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడానికి బాగా టైం తీసుకుంటున్నాడు. దాదాపుగా ఐదు నెలలు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పటికి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అనే వార్తలు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ... అల్లు అర్జున్ నుండి మాత్రం క్లారిటీ రావడం లేదు. తాజాగా అల్లు అర్జున్ బై లింగ్యువల్ మూవీ ఒకటి తెర మీదకొచ్చింది.డైరెక్టర్ ను మార్చేసి...నా పేరు సూర్య కన్నా ముందు అల్లు అర్జున్ తెలుగు, తమిళంలో కలిపి లింగు స్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఒక బై లింగువల్ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసాడు. కానీ ఏళ్లుగా అర్జున్ ఆ సినిమాని హోల్డ్ లో పెట్టి నా పేరు సూర్య సినిమా చేసాడు. కొన్ని అనుకోని కారణాలతో ఆ బై లింగ్యువల్ మూవీని వదిలేసిన అల్లు అర్జున్ ఇప్పుడు స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఆ మూవీని మొదలెట్టా బోతున్నాడని, కానీ డైరెక్టర్ గా లింగుస్వామిని తప్పిస్తున్నారనే న్యూస్ వినబడుతుంది.వేసవిలో పట్టాలపైకి...లింగు స్వామి ప్లేస్ లో తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఈ మూవీ చేయబోతున్నాడనే టాక్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. వీరం, వేదాళం చిత్రాల దర్శకుడు శివతో అల్లు అర్జున్ తో కలిసి ప్రాజెక్ట్ ను తెరకెక్కించనున్నారని సమాచారం. కాకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇంకా ఈ శివ - అల్లు అర్జున్ కాంబో మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://www.telugupost.com/crime/11-year-old-allegedly-gang-raped-by-seniors-in-delhi-school-washroom-1442199
దేశ రాజధానిలోని కేంద్రీయ విద్యాలయం బాత్రూమ్ లో 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు గురువారం తెలిపారు. కేంద్రీయ విద్యాలయ సంగతన్ ప్రాంతీయ కార్యాలయం కూడా ఈ అంశంపై విచారణకు ఆదేశించింది. అయితే ఈ సంఘటన జూలైలో జరిగింది, ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) దృష్టికి వచ్చిన తర్వాత బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనను "తీవ్రమైన విషయం"గా పేర్కొన్న DCW, ఈ అంశంపై ఢిల్లీ పోలీసులకు, పాఠశాల ప్రిన్సిపాల్‌కు నోటీసు జారీ చేసింది. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో తెలియజేయాలని పాఠశాల అధికారులను కోరారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) అధికారులు ఈ సంఘటనను బాధితురాలు లేదా ఆమె తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్‌కు నివేదించలేదని, పోలీసుల విచారణ తర్వాత మాత్రమే వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.బాలిక తన క్లాస్ రూములోకి వెళ్తుండగా పొరపాటున ఇద్దరు సీనియర్లను ఢీకొట్టింది. ఆమె వారికి క్షమాపణలు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా బలవంతంగా టాయిలెట్‌లోకి తీసుకెళ్లి గడియపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్లగా, నిందితులైన ఇద్దరినీ స్కూలు నుంచి బహిష్కరించామని, ఈ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని చెప్పినట్లుగా ఆరోపణలు వచ్చాయి. తానీ విషయాన్ని టీచర్‌కు చెప్పానని బాధిత బాలిక చెబుతుండగా, బాలిక కానీ, ఆమె తల్లిదండ్రులు కానీ తమకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్కూలు యాజమాన్యం పేర్కొంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ KVS అనేది విద్యా మంత్రిత్వ శాఖ కింద ఒక స్వయంప్రతిపత్త సంస్థ.. ఇది దేశంలోని 25 ప్రాంతాలలో విస్తరించి ఉన్న 1,200 కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లను పర్యవేక్షిస్తుంది. అత్యాచారానికి పాల్పడ్డ అబ్బాయిలు 11, 12వ తరగతులకు చెందిన వారని తెలుస్తోంది.
https://www.telugupost.com/movie-news/pranita-subs-hot-yoga-photos-139464/
రకుల్ ప్రీత్ ఈ మధ్యన సినిమాల విషయం కన్నా జిమ్ లో వర్కౌట్స్ చేసే హాట్ వీడియోస్ తోనూ, హాట్ హాట్ యోగాసనాలతోను తెగ హైలెట్ అవడమే కాదు.. సోషల్ మీడియాలో యూత్ ని ఓ ఊపు ఊపుతుంది. రకుల్ యోగ వీడియో నిమిషాల్లో వైరల్ అవడమే కాదు… భీభత్సమైన లైక్స్ తో సోషల్ మీడియా ఊగిపోతోంది. అయితే ఇప్పుడు రకుల్ హాట్ యోగాసనాలు మరో హీరోయిన్ పోటికొస్తుంది. స్టార్స్ సినిమాలలో నటించినా పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేక.. ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లో ఉన్న ప్రణీత సుభాష్ హాట్ యోగాసనాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. Flying start to the week ! #acroyoga అంటూ యాష్ టాగ్ తో ప్రణీత పోస్ట్ చేసిన హాట్ యోగ భంగిమలున్న ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. మరి ప్రణీత అలా వివిధ భంగిమల్లో వేసిన యోగాసనాలు చూస్తుంటే.. ఈమధ్యన రకుల్ ప్రీత్ చేసిన హాట్ అండ్ స్పైసి యోగాసనాలు టక్కున గుర్తొస్తున్నాయి. ప్రణీత వేస్తున్న ఈ సెక్సీ, హాట్ యోగాలు చూస్తుంటే… బాపుగారి బొమ్మ హొట్నెస్ అందాలు అదరహో అన్న రేంజ్ లో ఉన్నాయి. మరి హాట్ హీరోయిన్స్ ఇలా యోగాసనాలతో పోటీ పడుతూ.. యూత్ కి నిద్ర లేకుండా చేస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/మహానుభావుడు-కాపీనా-44095/
మారుతీ ఏ గ్రేడ్ సినిమాలతోనే డైరెక్టర్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో మారుతి ట్రాక్ మార్చేశాడు. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించి బంపర్ హిట్ కొట్టాడు. నాని హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో మారుతి ఏ గ్రేడ్ దర్శకుడు అనే పదం నుండి తప్పించుకున్నాడు. అయితే ఆ సినిమా వచ్చిన కొత్తలోనే ఈ సినిమాని మారుతీ తెరకేక్కిన్చాడంటే ఎవ్వరూ నమ్మలేదు. ఆయన ఇంతమంచి కథతో ఇంత మంచి కామెడీ సినిమాని తెరకెక్కించడమా అంటూ దీర్ఘాలు తీశారు. ఇక తర్వాత వెంకటేష్ హీరోగా బాబు బంగారం తెరకెక్కించగా ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు తాజాగా శర్వానంద్ హీరోగా మహానుభావుడు చిత్రంని తెరకెక్కించిన మారుతీ ఈ చిత్ర షూటింగ్ ని చడీ చప్పుడు లేకుండా కానిచ్చేశాడు. ఈ చిత్రం ఈ నెల 29 న దసరా కానుకగా విడుదల కాబోతుంది. భలే భలే మగాడివోయ్ చిత్రం వలె ఈ మహానుభావుడు చిత్రం కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. అయితే మహానుభావుడు ట్రైలర్ నిన్న రాత్రి అలా యూట్యూబ్ లో విడుదల చేశారో లేదో ఈ మహానుభావుడు సినిమాని మారుతి ఒక మలయాళం సినిమా నుండి కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం మొదలయ్యింది. ఈ మహానుభావుడు చిత్రాన్ని మారుతీ మలయాళం సినిమా నార్త్ 24 కాథం అనే సినిమా స్పూర్తిగానో..... లేకపొతే అదే సినిమాను యాజిటీజ్ గా కాపీ కొట్టాడో... అంటూ ఫిలింనగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నార్త్ 24 కాథం అనే మలయాళం సినిమా ట్రైలర్స్, క్లిప్పింగ్స్ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసే మారుతీ ఇలా మహానుభావుడు చిత్రాన్ని తెరకెక్కించాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మారుతీ మాత్రం ఈ మహానుభావుడు లాంటి సినిమాలు అంటే ఓసిడి మీద ప్రపంచవ్యాప్తంగా అయితే సినిమాలు చాలానే వచ్చాయి.... కానీ వాటితో ఈ మహానుభావుడు సినిమాకి పోలిక ఉండదు అని చెప్బుతున్నాడు. చూద్దాం మహానుభావుడు సినిమా విడుదలయ్యాక ఆ సినిమాకి కాపీనా... లేదా అనేది.
https://www.telugupost.com/gossip/nagarjuna-is-not-hosting-bigg-boss-telugu-ott--1355958
బిగ్ బాస్.. హిందీ మొదలైన ఈ బుల్లితెర షో.. క్రమంగా పలు భారతీయ భాషల్లోనూ ప్రారంభమై బాగా పాపులర్ అయింది. హిందీ బిగ్ బాస్ ఇప్పటికే ఓటీటీ లో ప్రసారం చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు అదేబాటలో తెలుగు బిగ్ బాస్ కూడా పయనిస్తోంది. టీవీలో తెలుగు బిగ్ బాస్ ఐదు సీజన్లు పూర్తి చేసుకోగా ఫిబ్రవరి 26 నుండి 24 గంటలు ప్రసారమయ్యే బిగ్ బాస్ షో తెలుగు ఓటీటీ షో కూడా మొదలు కానుంది. ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు వదిలారు మేకర్స్.Also Read : ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులురెండు ప్రోమోల్లోనూ నాగార్జునే బిగ్ బాస్ ను ప్రమోట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ను కూడా ఆయనే హోస్ట్ చేస్తారని అందరూ భావించారు. భావించడమేంటి.. స్వయంగా నాగార్జునే ఈ విషయాన్ని చెప్పారు. అయితే 24 గంటల టెలీకాస్ట్ కావడంతో.. ఈ షో కోసం కాస్త ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. అక్కడే అనుమానం మొదలైంది నెటిజన్లకు. ఇంకేముంది బిగ్ బాస్ ఓటీటీ షో ను నాగార్జున హోస్ట్ చేయడం లేదా ? అంటూ చర్చ మొదలు పెట్టేశారు. Also Read : సమంతా నువ్వు ప్రెగ్నెంటా ? కాకపోతే నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా!ఆ చర్చ అంతటితో ఆగలేదు.. బుల్లితెర స్టార్ యాంకర్ అయిన రవి.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ను హోస్ట్ చేయనున్నాడంటూ ప్రచారం చేశారు. ఇప్పుడీ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. అంతపెద్ద రియాలిటీ షో ను హోస్ట్ చేసేందుకు.. స్టార్ స్టేటస్ తో పాటు క్రేజ్ ఉన్న హీరోలనే హోస్ట్ గా తీసుకుంటారని రవి హోస్ట్ అనేది వాస్తవం కాదని కూడా బిగ్ బాస్ అభిమానులు వాదిస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఫిబ్రవరి 26 వరకూ ఆగాల్సిందే.
https://www.telugupost.com/movie-news/అంత-బలమేముందో-34388/
టాలీవుడ్ లో సుకుమార్ కి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఆయనగారు స్వతాహాగా లెక్కల మాస్టర్ కావడం వలన లెక్కలు కొందరికి అర్ధం కానట్టే... ఆయన తెరకెక్కించిన సినిమాలు సామాన్యుడికి కొన్నిసార్లు అర్ధం కాదు. ఎంతో మేధాశక్తితో కొన్ని సినిమాలను తెరకెక్కిస్తాడు సుకుమార్. అలాంటి సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది. రామ్ చరణ్ 'ధ్రువ' వంటి హిట్ చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మొదలు పెట్టినప్పటినుండి మంచి అంచనాలే వున్నాయి. ఇక రామ్ చరణ్ ఇంతకుముందు నటించిన చిత్రాలకంటే కాస్త భిన్నంగా ఈ చిత్రం ఉండబోతుందని ఈరోజు శుక్రవారం విడుదలచేసిన టైటిల్ ని బట్టి చెప్పొచ్చు.సుకుమార్ - రామ చరణ్ కాంబోలో తెరకెక్కే చిత్రానికి టైటిల్ 'రంగస్థలం 1985' గా ఫిక్స్ చేశారు. వినడానికే ఆసక్తికరంగా ఉన్న ఈ టైటిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందని చెప్పాలి. చాలా రోజులనుండి ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి ఈ టైటిల్ ఎంతగానో నచ్చిందని అంటున్నారు. వినడానికి ఈ రంగస్థలం అనే పదం పాతగా ఉన్నప్పటికీ కూడా ఎంతో కొత్తగా అనిపిస్తుందని అంటున్నారు.మరి 1985 లో సాగే పల్లెటూరి ప్రేమకథని సుకుమార్ కొత్తగా విభిన్నంగా అందరిమన్సులు దోచుకునేలా తెరకెక్కిస్తున్నాడట. ప్రతి సినిమాని ఎంతో రియలిస్టిక్ గా తీసే సుకుమార్ ఇంత బలమైన 'రంగస్థలం' టైటిల్ పెట్టాడంటే సినిమాలో కూడా బలమైన విషయమే ఏదో ఉంటుందనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. మరి ఈ 'రంగస్థలం 1985 ' చిత్రాన్ని వచ్చే సంక్రాతి బరిలో నిలుపుతున్నట్టు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించేసింది.
https://www.telugupost.com/andhra-pradesh/ycp-chief-ys-jagan-has-been-staying-in-bengaluru-for-the-past-few-days-1546818
వైసీపీ అధినేత జగన్ గత కొద్ది రోజుల నుంచి బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు. గతంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉండే జగన్ ఇప్పుడు మాత్రం దాదాపు పదేళ్ల తర్వాత బెంగళూరును ఎంచుకున్నారు. తనకు అదే సురక్షిత ప్రాంతమని ఆయన నమ్ముతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ అయినా, తాడేపల్లి అయినా తనకు సురక్షితం కాదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు అంటున్నారు. అందుకే తాడేపల్లికి అలా వచ్చి ఇలా బెంగళూరుకు వెళ్లి అక్కడ గడుపుతున్నారు. ఫ్యామిలీతో సహా అక్కడే ఎక్కువ కాలం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారంటే ఆయనకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.దాడులు జరుగుతాయని...వైఎస్ జగన్ కు తాడేపల్లిలో పెద్ద నివాసం ఉంది. ప్రభుత్వం ఎన్నికల తర్వాత సెక్యూరిటీని తొలగించింది. అంతే కాదు. ఆయన ఇంటికి వెళ్లే దారిని కూడా ఓపెన్ చేసింది. దీంతో ఆయన ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. తనపై దాడులు జరిగే అవకాశముందని ఆయనకు తెలియడం వల్లనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని వైసీపీ సీనియర్ నేత ఒకరు తెలుగు పోస్టుకు చెప్పారు. తనను అడ్డుతొలగించుకునే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానం ఆయనలో బలంగా ఉండటం కారణంగానే జగన్ బెంగళూరును సేఫ్ ప్లేస్ గా ఎంచుకున్నారని, అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి వెళుతుంటారని పార్టీనేతలు చెబుతున్నారు.లోటస్ పాండ్ కు కూడా...మరో వైపు హైదరాబాద్ లో లోటస్ పాండ్ నివాసం కూడా సురక్షితం కాదని ఆయన గుర్తించారని అంటున్నారు. అక్కడ తన ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశముందని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా లోటస్ పాండ్ లో పక్కనే తన చెల్లెలు వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మ కూడా ఉండటం ఆయనకు కొంత ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. అందుకే లోటస్ పాండ్ వైపు ఆయన ఓటమి చెందిన తర్వాత కన్నెత్తి చూడలేదు. అంతా బెంగళూరు వైపు చూస్తున్నారు. బెంగళూరులో ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని కొంత ప్రశాంతంగా ఉండవచ్చన్న నమ్మకంతో జగన్ ఉన్నారని పార్టీనేతలు అంటున్నారు. అవసరమైతే తప్ప తాడేపల్లికి ఆయన రారు అని కూడా చెబుతున్నారు. కార్యకర్తల ముసుగులో...తాడేపల్లిలో ఉంటే పార్టీ కార్యకర్తల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కార్యకర్తల ముసుగులో తనపై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన భావించి ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన తాజాగా తనకు ప్రాణహాని ఉందని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు సెక్యూరిటీని పెంచాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు తగినంత సెక్యూరిటీనీ ప్రభుత్వం కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. మొత్తం మీద జగన్ మాత్రం తనకు ప్రాణహాని ఉందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఏపీకి దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నారని పార్టీనేతలు చెబుతున్నారు.
https://www.telugupost.com/movie-news/payal-rajpoot-in-venky-mama-110342/
కెరీర్ అవసాన దశకు చేరుకున్న టైం లో శ్రియ శరణ్ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయినా కానీ గ్లామర్ ని వదిలిపెట్టనని… సినిమాల్లో నటిస్తానని బోల్డ్ స్టేట్మెంట్స్ చాలానే ఇచ్చింది. అలాగే పెళ్లయ్యాక కూడా శ్రియ హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోనే ఉంది. ఇక సీనియర్ హీరోలకు శ్రియ ఒక్కటే బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. కానీ తాజాగా సీనియర్ హీరోలు కూడా శ్రియ ని పక్కనబెడుతున్నారు. ఇక పెళ్లయ్యాక బాబీ దర్శకత్వంలో వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమా చేసే అవకాశం శ్రియ ని వరించిందనే టాక్ మాములుగా నడవలేదు. తాజాగా శ్రియ అవకాశాన్ని మరో యంగ్ హీరోయిన్ తన్నుకుపోయిందనే న్యూస్ వినబడుతుంది. శ్రియ కి వచ్చిన అవకాశాన్ని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజపుట్ చెంతకు చేరిందని చెబుతున్నారు. RX 100 తర్వాత సీత సినిమాలో బెల్లంకొండ సరసన ఐటెం సాంగ్ ఒప్పుకున్నా పాయల్ రాజపుట్… రవితేజకి జోడిగా డిస్కో రాజాలోను ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా నాగార్జున సరసన మన్మధుడు 2 లోను పాయల్ పేరు వినబడుతుండగా….. లేటెస్ట్ గా వెంకటేష్ సరసన పాయల్ రాజపుట్ వెంకిమామలో నటించబోతుందని అంటున్నారు. ఫిబ్రవరి 22 న షూటింగ్ మొదలుపెట్టుకోనున్న వెంకిమామ సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనుంది. ఇకఈ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా రకు ప్రీత్ నటిస్తుండగా… వెంకటేష్ సరసన హాట్ గర్ల్ పాయల్ పేరు వినబడుతుంది. ఇక వెంకీ మామలో పాయల్ రాజపుట్ హీరోయిన్ గా నటించడం ఖాయమని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు.
https://www.telugupost.com/movie-news/ఇప్పటికి-బుద్దొచ్చిందా-25303/
నాగార్జున చాలా విషయాలలో చాలా డిసిప్లెయిన్‌గా ఉంటారు. ఇంత అనుభవం ఉన్నా కూడా స్క్రిప్ట్‌ను లాక్‌ చేసిన తర్వాత ఆయన ఇక దర్శకులకు పూర్తి స్వేఛ్చనిస్తారు. ఆయన తన అనుభవంలో సినిమాల షూటింగ్‌ సమయంలోనే ఆ దర్శకుడు చెప్పినట్లు తీస్తున్నాడా? సినిమా ఆడుతుందా? లేదా? వంటి విషయాలపై కూడా ఓ అవగాహనకు రాగల సమర్దుడు. కాగా ఆయన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్‌ బలవంతం మీద అతని మొదటి చిత్రం 'అఖిల్‌' విషయంలో నాగ్‌ పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఆ చిత్రం పరాజయం పాలైన తర్వాత కూడా తన కొడుకు... ప్రపంచాన్ని కాపాడే భారీ బాధ్యత ఇంకా తీసుకొనే వయసులేదని చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన అఖిల్‌ రెండో చిత్రం విషయంలో తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. 'మనం' వంటి క్లాసిక్‌నిచ్చిన విక్రమ్‌ కె.కుమార్‌ మొదట చెప్పిన కథ బాగా నచ్చినప్పటికీ ఈ కథ సెకండాఫ్‌ వింటుంటే తనకే పలు సందేహాలు వచ్చాయని, మరి రేపు ప్రేక్షకులకు మరెన్ని సందేహాలు వచ్చే అవకాశం ఉందని భావించి, మొదటి కథను పక్కనపెట్టించి మరో కథపై కూర్చొనేలా విక్రమ్‌ని ప్రోత్సహించాడు. ఈ కథ బాగా రావడంతో స్క్రిప్ట్‌ను లాక్‌ చేయించి త్వరలో సినిమా ప్రారంభించడానికి ముహూర్తం చూసుకుంటున్నాడు.ఈ చిత్రం విషయంలో ఆయన దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌పై ఎంతగానో నమ్మకం ఉంచి, ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో కేవలం దర్శకుడు చెప్పినట్లు వినాలని, మిగిలిన విషయాలను తాను, విక్రమ్‌ జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి అఖిల్‌ను ఈ చిత్రం విషయంలో వేలు పెట్టవద్దని ఆదేశించాడట. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చి, సినిమాలో ఏదీ ఓవర్‌గా చేయకుండా, దర్శకుని వ్యూలోనే ఆలోచించమని అఖిల్‌కు సూచించాడని సమాచారం. ఈ విషయంలో నాగ్‌ నిర్ణయాన్ని సినీ విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు.
https://www.telugupost.com/movie-news/balakrishna-raviteja-fight-at-box-office-with-bhagavanth-kesari-tiger-nageswara-rao-1498370
ఈ దసరాకి నటసింహ బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమాతో, మాస్ మహారాజ్ రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో పోటీ పడబోతున్నారు. ఈ రెండు చిత్రాలు ఏంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్ లో ఉన్న బాలయ్య.. భగవంత్ కేసరితో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక రవితేజ.. టైగర్ నాగేశ్వరరావుతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇద్దరికీ ఈ రెండు సినిమాల విజయం చాలా ముఖ్యం అయ్యింది.కాగా వీరిద్దరూ కలిసి పోటీ పడడం.. ఇదేమి మొదటిసారి కాదు. ఇప్పటికే వీరిద్దరూ మూడుసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డారు. అయితే ప్రతిసారి బాలయ్య పైన రవితేజనే విజయం సాధిస్తూ వచ్చాడు. దీంతో రవితేజ అభిమానులు.. ఈసారి కూడా విజయం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ వీరిద్దరూ కలిసి ఎప్పుడెప్పుడు, ఏయే సినిమాలతో పోటీ పడ్డారు. మీరుకూడా వాటిపై ఒక లుక్ వేసేయండి.మొదటిసారి 2008లో బాలయ్య 'ఒక్కమగాడు', రవితేజ 'కృష్ణ' సినిమాలతో ఇద్దరు పోటీ పడ్డారు. ఇక వాటి ఫలితాలు చెప్పనవసరం లేదు అనుకుంటా. ఆ తరువాత 2009లో మిత్రుడు, కిక్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. అభిమానులకు రవితేజ కిక్‌ని, బాలయ్య షాక్‌ని కలిగించాడు. ఈ పోటీ తరువాత 2011లో బాలయ్య ‘పరమవీరచక్ర’, రవితేజ ‘మిరపకాయ్’ వచ్చాయి. ఈసారి కూడా రవితేజనే విజయం సాధించాడు.ఇక్కడ గుర్తించాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. పోటీలో హిట్ అందుకున్న ప్రతి సినిమా రవితేజ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ప్లాప్ అయిన ప్రతి సినిమా బాలయ్య కెరీర్ లో మర్చిపోలేని డిజాస్టర్స్ గా నిలిచింది. మరి ఈసారి ఎలాంటి రిజల్ట్స్ ని అందుకుంటారో చూడాలి. ఇక సోషల్ మీడియాలో దీని గురించి పోస్టులు వేస్తూ.. బాలయ్య ఈసారైనా రవితేజపై గెలుస్తాడా..? కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'భగవంత్ కేసరి' అక్టోబర్ 19న, 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20న రిలీజ్ కానున్నాయి.
https://www.telugupost.com/movie-news/mahesh-babu-maharshi-run-time-113293/
మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో దిల్ రాజు – అశ్వినీదత్ – పీవీపీ అనే మూడు దిగ్గజాలు నిర్మిస్తున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ మహర్షి సినిమా ఇంకా షూటింగ్ లోనే ఉంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరిస్తున్న మహర్షి టీం.. ప్రమోషన్స్ మీద దృష్టి సారించింది. అయితే మహర్షి సినిమా ని రేపు ఏప్రిల్ మొదట్లోనే విడుదల చేద్దామని ముందుగా మేకర్స్ ప్లాన్ చేసిన.. తర్వాత అది కాస్తా ఏప్రిల్ చివరికి పోస్ట్ పోన్ అయ్యి… తర్వాత మే తొమ్మిదికి వెళ్ళింది. అయితే సినిమా మాటిమాటికి పోస్ట్ పోన్ అయితే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గకుండా మహర్షి మూవీ వర్కింగ్ స్టిల్స్… అంటూ హడావిడి చేస్తూ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇక తాజాగా మహేష్ మహర్షి విషయంలో ఇప్పుడొక న్యూస్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. అదేమిటంటే మహర్షి సినిమా నిడివి దాదాపుగా నాలుగు గంటలు వచ్చిందట. మరి ఈమధ్యన సినిమాని మూడు గంటలు థియేటర్స్ లో కూర్చుని చూసే ప్రేక్షకులంతా ఎంత బోర్ ఫీల్ అవుతున్నారో చూస్తూనే ఉన్నాం. అయితే అటు ఇటుగా ఎడిటింగ్ లో రెండున్నర గంటల నిడివి అయితే వస్తుంది కానీ.. మూడు గంటల కు దగ్గరగా మహర్షి రన్ టైం తేవడం ఇప్పుడు మహర్షి టీం కి సవాల్ గా మారిందట. ఏది ఎడిటింగ్ లో తీసేయాలన్నా… కాస్త ఇబ్బందిగా ఉందనే టాక్ వినబడుతుంది. మరి ఎడిటింగ్ టీం షార్ప్ గా పనిచేసి మహర్షి రన్ టైం ని ఓ కొలిక్కి తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారట. మరి ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా వున్న వంశి పైడిపల్లి మహర్షి రన్ టైం మీద దృష్టి పెట్టి.. దాన్ని ఒక కొలిక్కి తెచ్చే బాధ్యత తీసుకోబోతున్నాడట.
https://www.telugupost.com/movie-news/స్పీడుతో-పిచ్చెక్కిచ్చే-40178/
ఏడాది కి రెండు మూడు సినిమాలతో దూసుకుపోతున్న హీరో నాని వరుసగా సినిమాలు లైన్ లో పెట్టేస్తూ స్టార్ హీరోలకు పిచ్చెక్కించేస్తున్నాడు. నాని అలా సినిమాలు చేసుకుంటూ హిట్స్ కొట్టేస్తుంటే మాత్రం స్టార్ హీరోలు పైకి ఏడవలేక నవ్వుతున్నారు. వారైతే భారీ బడ్జెట్ తో ఏడాదికి ఒక సినిమానే విడుదల చెయ్యడానికి నానా తంటాలు పడుతూ... ఆ సినిమా హిట్ అవుతుందో? లేదో అనే టెన్షన్ తో కొట్టుమిట్టాడే వారికి, నాని వరుస సినిమాలు, వరుస హిట్స్ గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. కానీ నాని మాత్రం రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు.ఒక చిత్రాన్ని విడుదలచేయకముందే మరో చిత్రాన్ని లైన్ లో పెట్టేస్తున్న నాని 'నిను కోరి' చిత్రం అలా విడుదలైందో లేదో ఇలా 'ఎంసీఏ' షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం నాని, దిల్ రాజు నిర్మాణంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసుకుని డిసెంబర్ మొదటి వారంలో థియేటర్స్ లోకి దిగిపోనుంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే... మేర్లపాక గాంధీ డైరెక్టన్ లో 'కృష్ణార్జున' చిత్రాన్ని ఫైనల్ చెయ్యడమే కాదు... 'కృష్ణార్జున' షూటింగ్ ని ఆఫిసియల్ గా అనౌన్స్ చేసేసాడు. నాని ఈ 'కృష్ణార్జున' చిత్రం కోసం ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక బైక్ మీద కృష్ణుడి ఫ్లూట్ పెట్టుకుని వెళ్తున్న ఫోటోను ఒకటి షేర్ చేస్తూ.. ఈ సినిమా షూటింగ్ మొదలైందని చెప్పకనే చెప్పాడు నాని. ఇక ఈ చిత్రంలో 'అ... ఆ' ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని టాక్ బాగా వినబడుతుంది. ఇక అనుపమ ఒక హీరోయిన్ గా 'కృష్ణార్జున' లో ఫైనల్ అయితే మరో హీరోయిన్ ని కూడా ఈ సినిమా కోసం ఫైనల్ చెయ్యాల్సి ఉంటుంది.
https://www.telugupost.com/movie-news/actor-prakash-raj-was-angry-with-the-ap-government-he-tweeted-what-is-this-dominant-trend-on-the-film-industry-1356829
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమారంగంపై ఈ ఆధిపత్య ధోరణి ఏంటని ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం పేరు ఎత్తకుండానే ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. సృజన, సాంకేతిక మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం ఏంటని నిలదీశారు. క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నామని చెప్పడమేంటని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.పరోక్షంగా ఏపీ సర్కార్ పై.....ప్రకాష్ రాజ్ ఇటు భీమ్లా నాయక్ సినిమా పేరును, అటు ఏపీ ప్రభుత్వం పేరును నేరుగా ప్రస్తావించకుండా ఈ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. భీమ్లా నాయక్ సినిమాను ప్రభుత్వం తొక్కేస్తుందని, తెలంగాణ ప్రభుత్వం చిత్రసీమను ప్రోత్సహిస్తుంటే ఏపీ సర్కార్ మాత్రం వెనక్కు లాగుతుందని పలువురు ఆరోపణలు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం టిక్కెట్ ధరల నిర్ణయం ఇంకా జరగలేదని, పుష్ప, అఖండ, బంగర్రాజు సినిమాల షరతులే భీమ్లా నాయక్ కు వర్తించాయని చెబుతుంది. మొత్తం మీద ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏపీలో హాట్ టాపిక్ గా మరింది.
https://www.telugupost.com/movie-news/నటసింహ-నందమూరి-బాలకృష్ణ-31790/
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సంచలన చిత్రంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రాన్ని రజనీకాంత్‌తో నరసింహ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తొలిసారి చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంబంధించిన వివరాలు నిర్మాత సి.కళ్యాణ్‌ తెలియజేస్తూ - ''నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నరసింహ డైరెక్టర్‌ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, మాటలు అందిస్తున్నారు. బాలకృష్ణగారి కెరీర్‌లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుంది. జూన్‌ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. జూలై 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. నటసింహ బాలకృష్ణతోపాటు భారీ తారాగణం నటించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము. నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్‌గా గౌతమి పుత్ర శాతకర్ణితో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. రజనీకాంత్‌తో నరసింహ వంటి సెన్సేషనల్‌ హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్‌.రవికుమార్‌, నటసింహ బాలకృష్ణ ఫస్ట్‌ కాంబినేషన్‌లో మా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం'' అన్నారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై నిర్మాణం జరుపుకోనున్న ఈ భారీ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కో-ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సి.తేజ, సి.వరుణ్‌కుమార్‌, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌.
https://www.telugupost.com/movie-news/ntr-teaser-sunil-84600/
నిన్న విడుదలైన 'అరవింద సమేత వీరరాఘవ’ టీజర్ రికార్డు లైక్స్, వ్యూస్ తో దూసుకుపోతుంది. త్రివిక్రమ్ నుండి ఇటువంటి టీజర్ ఎక్స్ పెక్ట్ చేయలేదు తన ఫ్యాన్స్. త్రివిక్రమ్ టేకింగ్ కానీ..ఎన్టీఆర్ చెప్పే స్టైలిష్ డైలాగ్స్ కానీ టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఎన్టీఆర్ ఒక్కడినే చూపించి తనపైనే జనాల దృష్టి పడేలా చేశాడు త్రివిక్రమ్. కానీ మీరు టీజర్ మొత్తం ఫ్రేమ్ టూ ఫ్రేమ్ చూస్తే నటుడు సునీల్ కనిపిస్తాడు. ఏంటీ నమ్మట్లేదా? ఒకసారి టీజర్ చూడండి.మళ్లీ రీఎంట్రీ...!టీజర్ లో ఎన్టీఆర్ ‘కంటబడ్డావా… కనికరిస్తానేమో! యెంటబడ్డానా… నరికేస్తా’ అని ఎన్టీఆర్‌ డైలాగ్‌ చెప్పడానికి ముందు కుర్చీ గాల్లోకి లేచిన సమయంలో జాగ్రత్తగా గమనిస్తే సునీల్‌ కనిపిస్తాడు. కావాలంటే పై ఫోటో ను సరిగా చూడండి. ఇంతకాలం దాకా సునీల్ హీరోగా నటించాడు. స్టార్టింగ్ లో పర్లేదు అనిపించుకున్నా ఆ తర్వాత అన్ని సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో మళ్లీ తిరిగి కమెడియన్ వేషం వేసుకోవటానికి రెడీ అయ్యాడు.హీరో స్నేహితుడిగా..?ఆలా అనుకున్నాడో లేడో..తన స్నేహితుడైన త్రివిక్రమ్ తొలి అవకాశం ‘అరవింద సమేత వీరరాఘవ’లో ఇచ్చాడు. టీజర్ బట్టి చూస్తుంటే సునీల్ ఇందులో ఎన్టీఆర్ కి స్నేహితుడిగా నటించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎంత మంది ఆర్టిస్ట్స్ ఉన్న టీజర్ లో వాళ్లెవరినీ చూపించకుండా ఎన్టీఆర్ ఒక్కడినే చూపించి తనతో పాటు సునీల్ కూడా కనపడలేలా చేశాడు త్రివిక్రమ్. దీంతో ఈ సినిమాతో సునీల్ హాస్య నటుడిగా ఈ సినిమా గ్రాండ్‌ రీఎంట్రీ ఇచ్చినట్టే. గతంలో వీరి కాంబినేషన్ ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే.
https://www.telugupost.com/crime/police-seized-huge-amount-of-drugs-in-hyderabad-accused-who-was-selling-drugs-was-arrested-1465655
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను విక్రయిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నుంచి డగ్ర్స్ తీసుకు వచ్చి విక్రయిస్తున్నానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించారు. రాజేంద్ర నగర్ లోని హిమాయత్ సాగర్ వద్ద ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎన్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు.ఆడి కారులో వచ్చి...ఆడి కారులో వచ్చిన పాతబస్తీకి చెందిన మహ్మద్ హమీద్ ఆలీ కొందరికి డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. అందిన సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న దానిపై సమాచారం సేకరిస్తున్నారు.
https://www.telugupost.com/movie-news/ramcharan-twitter-record-173665/
రామ్ చరణ్ ని ఒకప్పుడు ఇతనేం హీరో అన్నవాళ్ళే.. ఇతను స్టార్ హీరో అన్న రేంజ్ కి చేరాడు చరణ్. బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. చరణ్ కష్టపడి పై కోచ్చిన హీరోనే. లక్కు, క్రేజ్ ఉండాలి కానీ.. బ్యాగ్రౌండ్ ఉంటేనే హీరో అవరు అనేది చరణ్ నిరూపించాడు. చరణ్ కెరీర్ లో మగధీర, ధ్రువ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రకున్నాయి. ఇక వినయ విధేయరామ ప్లాప్ అయినా చరణ్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ RRR లో నటిస్తున్న రామ్ చరణ్ క్రేజ్ సోషల్ మీడియాలో పైపై కి పోతుంది. ఎప్పుడూ ఫేస్ బుక్ లో యాక్టీవ్ గా ఉండే చరణ్ గత మార్చ్ లో ట్విట్టర్ లోకి అడుగుపెట్టాడు. ట్విట్టర్ లోకి అడుగుపెట్టినప్పటినుండి రామ్ చరణ్ క్రేజ్ ని ఆయన అభిమానులు మరింత పెంచేశారు. కాబట్టే రామ్ చరణ్ ట్విట్టర్ లో ఇప్పుడు ఓ రికార్డుని సెట్ చేసాడు. మెగా అభిమానుల పుణ్యమా అని.. రామ్ చరణ్ ట్విట్టర్ లో 233 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1 మిలియన్ ఫాలోవర్స్ ను రాబట్టుకొని టాలీవుడ్ హీరోల్లో ఏ హీరో సెట్ చెయ్యలేని రికార్డుని చరణ్ సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న చరణ్ ఫాస్టెస్ట్ రికార్డుని నెలకొల్పాడు. మరి మెగా హీరో రికార్డు ని సెట్ చేసాడంటే మెగా ఫాన్స్ ఊరుకుంటారా. అప్పుడే సెలెబ్రేషన్స్ స్టార్ట్ కూడా చేసేసారు. ఒకపక్క చిరు కరోనా నుండి కోలుకోవాలని పూజలు చేస్తున్న మెగా ఫాన్స్.. ఇప్పుడు చరణ్ ఫాస్టెస్ట్ రికార్డుని పార్టీలతో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
https://www.telugupost.com/movie-news/hit-remake-in-hindi-163028/
రాజ్‌కుమార్ రావ్ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో.. హిందీలో రీమేక్ అవుతున్నతెలుగు సెన్సేష‌న‌ల్ యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్‌’ఈ ఏడాది ప్రారంభంలో విడుద‌లై, ప్రేక్ష‌కాద‌ర‌ణతో బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌హిట్‌గా నిలిచిన చిత్రం ‘హిట్‌’. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల‌కు మ‌రింత చేరువ కానుంది. ‘హిట్‌’ చిత్రం హిందీలో రీమేక్ అవుతుంది. పోలీస్ డ్రామాగా రూపొందిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ హిందీ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావు హీరోగా న‌టిస్తున్నారు. హిట్‌..హోమిసైడ్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌లో ప‌నిచేసే ఓ పోలీస్ ఆఫీస‌ర్ అనుమానాస్ప‌దంగా మిస్ అవుతున్న అమ్మాయిల గురించి అన్వేషిస్తుంటాడు. ఈ కేసుల‌ను ఆ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేదిస్తాడు? అ‌నేదే సినిమా క‌థాంశం. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను అద్భుతంగా తెర‌కెక్కించారు. హిందీ రీమేక్‌ను కూడా శైలేష్ కొల‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. 2021లో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ – ‘‘హిట్ సినిమాకు సంబంధించి ఫస్ట్ కేస్ అనే క్యాప్షన్ పెట్టాం. ఈ ఫస్ట్ కేస్‌లో హీరో తన గతం, వర్తమానానికి సంబంధించి ఏదో మానసిక సంఘర్షణను అనుభవిస్తుంటాడు. ఇలాంటి ఓ సంఘర్షణతో కూడిన పాత్రను ప్రేక్షకులను కన్విన్స్ చేసేలా ఓ మెచ్యూర్డ్ యాక్టర్ చేస్తే బావుటుందని ఆలోచిస్తున్న తరుణంలో రాజ్ కుమార్ రావ్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నటించిన ‘సైతాన్’ సినిమా నుండి ఆయన సినిమాలను ఫాలో అవుతున్నాను. ఆయనొక అద్భుతమైన నటుడు. ప్రతి సందర్భంలో నటుడిగా నన్ను ఆశ్చర్యపరుస్తూనే వచ్చారు. రాజ్‌కుమార్ రావ్, దిల్‌రాజుగారితో కలిసి పనిచేయనుండటం ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది. హిట్ సినిమా ఫ్రాంచైజీ మన దక్షిణాది ప్రేక్షకులనే కాదు ఉత్తరాది ప్రేక్షకులను కూడా క‌చ్చితంగా ఆక‌ట్టుకుంది. యూనివ‌ర్స‌ల్ పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. బాలీవుడ్ ప్రేక్ష‌కుల అభిరుచి, నెటివిటీకి త‌గిన‌ట్లు చిన్న చిన్న మార్పుల‌ను చేస్తాను’’ అన్నారు. హీరో రాజ్‌కుమార్ రావ్ మాట్లాడుతూ – ‘‘నేను హిట్ సినిమాను చూడగానే కనెక్ట్ అయిపోయాను. ప్రస్తుతం మన సమాజానికి అవసరమైన కథాంశంతో తెరకెక్కిన ఎంగేజింగ్ మూవీ. ఓ నటుడిగా ఇలాంటి ఓ పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో హిట్ సినిమా చేసే అవకాశం వచ్చింది. దిల్‌రాజుగారు, శైలేష్ కొలనుగారితో కలిసి ఈ సినిమాకు పనిచేయనుండటం హ్యాపీగా ఫీలవుతున్నాను’’ అన్నారు. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై నాని ‘జెర్సీ’ చిత్రాన్నిషాహిద్ క‌పూర్‌తో హిందీలో రీమేక్ చేస్తున్న టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు. . బాలీవుడ్ నిర్మాత కుల్‌దీప్ రాథోర్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.
https://www.telugupost.com/movie-news/ప్రభుత్వంపై-వ్యతిరేఖ-డైల-67244/
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు సీఎం గా నటించిన భరత్ అనే నేను సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న భరత్ కి సెన్సార్ వారు కూడా యు/ఏ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో పాటు ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ కూడా ప్లస్ అయ్యింది. సెన్సార్ బోర్డు వారు భరత్ అనే నేను సినిమా చూసి .... సినిమాపై పాజిటివ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా చెబుతున్నప్పటికీ... ఈ సినిమాలో ప్రస్తుత ప్రభత్వాలమీద ఏడెనిమిది సెటైరికల్ డైలాగ్స్ ఉన్నాయని... వాటికి కట్స్ ఇచ్చి మరీ సెన్సార్ వారు ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా టాక్ బయటికి వచ్చింది.ప్రభుత్వానికి వ్యతిరేఖంగా డైలాగ్స్ ఉండడంతో వాటికి కట్స్ చెప్పాల్సి వచ్చిందని సెన్సార్ సభ్యుడొకరు తెలిపారు. కానీ కొరటాల ఈ సినిమా ద్వారా ఒక మెస్సేజ్ ని పాస్ చేయబోతున్నాడని... ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ సినిమాలో చాలా సామాజిక సందేశాల్ని అందించాడని అంటున్నారు. ఇక కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ మీద పట్టా పొందిన ఒక విద్యార్థి ఎలా పోరాడన్నదే ఈ భరత్ అనే నేను.. అని చెప్పిన వారు కొంతమంది రాజకీయనాయకుల మీద భారీ సెటైరికల్ డైలాగ్స్ కూడా భరత్ లో ఉండబోతున్నాయంటున్నారు.ఇక సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా కొరటాల తీర్చి దిద్దాడని... సినిమాలో 80 శాతం రాజకీయ నేపథ్యంలోనే సినిమా ఉందంటున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. మరి ప్రేక్షకుల అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా కొరటాల శివ ఈ సినిమా రన్ టైం ని ఫిక్స్ చేసాడట.. అయితే భరత్ అనే నేను రన్ టైం ఏకంగా 2.53 నిముషాలు అన్నట్లుగా తెలుస్తుంది. అయితే సినిమాలోని అద్భుతమైన ట్విస్టులు సినిమా రన్ టైం ని తినేస్తాయనే టాక్ మాత్రం బాగా వినబడుతుంది.
https://www.telugupost.com/movie-news/కీర్తి-ఆఫర్-కొట్టేసిన-సీ-145605/
మహానటి తర్వాత కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అజయ్ దేవగన్ మైదాన్ సినిమాతో ఎంట్రీకి ఏర్పాట్లు జరిగాయి. ఒక్కసారిగా తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాల్తో బిజీ తారగా మారిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్ ని వదులుకుంది . కారణం ఆమె అజయ్ దేవగన్ భార్య పాత్రలో మైదాన్ లో కనిపించాలి. అయితే అంత సీయర్ హీరో ముందు కీర్తి సురేష్ మరీ యంగ్ గా సన్నగా కనిపించడంతో.. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ రషెస్ చూసిన కీర్తి సురేష్.. అతను అజయ్ పక్కన మరీ తేలిపోయానని..అందుకే కీర్తి సురేష్ నిర్మాత బోని తో సంప్రదించి మరీ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా బాలీవుడ్ మీడియా కథనం. మహానటి తర్వాత బాగా సన్నగా నాజూగ్గా మారిన కీర్తికి ఇప్పుడు ఆమె బరువు తగ్గడం శాపంగా మారింది. అయితే కీర్తి సురేష్ మైదాన్ నుండి బయటికి రావడంతో.. అజయ్ దేవగన్ భర్య రోల్ కి ఇప్పుడు సీనియర్ హీరోయిన్ ప్రియమణి చెంతకి చేరింది. ఇప్పటికే బాలీవుడ్ లో ఒకటి అరా పాత్రలతో కెరీర్ లో ముందుకెళుతున్న ప్రియమణి తాజాగా ద ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ తో ఇరగదీసింది. ఇక కీర్తి సురేష్ మైదాన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అజయ్ సరసన ప్రియమణి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని.. చిత్ర బృందము ఆమెని సంప్రదించడం ప్రియమణి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయనే టాక్ బాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.
https://www.telugupost.com/movie-news/rajinikanth-stopped-his-upcoming-movie-shooting-177311/
హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నా రజినీకాంత్ – శివ కాంబోలో తెరకెక్కుతున్న అణ్ణాతే షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. రజినీకాంత్ ఒక్కసారిగా రాజకీయాల గురించి క్లారిటీ ఇచ్చెయ్యడంతో మీడియా అటెన్షన్ అంతా రజినీ మీదే ఉంది. ఈ నెల 31 న తన పార్టీ పేరు, గుర్తు పై వివరణ ఇస్తానని చెప్పిన రజినీకాంత్ తాను ఒప్పుకున్న సినిమాను త్వరగా పూర్తి చెయ్యాలనే కసితో ఈమధ్యనే ఆయన నటిస్తున్న అణ్ణాతే షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చారు. రామోజీ ఫిలిం సిటీలో శివ దర్శకత్వంలో అణ్ణాతే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే సినిమాని త్వరగా పూర్తి చెయ్యాలని రజినికాంత్ రోజులో మొత్తంగా 14 గంటల పాటు షూటింగ్ కోసం కష్టపడుతున్నాడనే టాక్ నడుస్తుంది. మరి రజినీకాంత్ అంత స్పీడుగా షూటింగ్ చేసుకుంటుంటే.. కరోనా ఎందుకు ఊరుకుంటుంది. రజిని స్పీడుకి కరోనా బ్రేకులు వేసింది. కరోనా కి భయపడకుండా రంగంలోకి దిగిన రజినీకాంత్ ని కరోనా భయపెట్టేసింది. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న రజిని అణ్ణాత షూటింగ్ స్పాట్ లోని 8 మందికి క‌రోనా సోకింది. దీంతో ఎంటైర్ యూనిట్ హైద‌రాబాద్ నుండి చెన్నై కి తిరిగొచ్చేశారు. రజినీకాంత్ కోవిడ్ టెస్ట్ చేయించుకోగా ఆయనకి నెగెటివ్ అని తేలడంతో ప్రస్తుతం రజినీ హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. దీనితో అణ్ణాతే షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి.
https://www.telugupost.com/movie-news/bunny-party-to-geetha-team-84716/
గీత గోవిందం సినిమా విడుదలకు మరో పది రోజులు టైం ఉంది అనుకున్న సమయంలో ఆ సినిమాలోని కొన్ని సీన్స్, ఫొటోస్ లీక్ అవడంతో.. ఆ గందరగోళంలో గీత గోవిందం సినిమా ట్రైలర్ ని కానీ... సినిమాకి ప్రి రిలీజ్ ఈవెంట్ ని కానీ చేయలేకపోయారు. సినిమా విడుదలకు ముందు భారీ క్రేజ్ తో బరిలోకి దిగిన గీత గోవిందం ట్రైలర్ విషయమై అందరూ మరిచిపోయారు. టీజర్, సాంగ్స్ ని వదిలారు కానీ గీత ట్రైలర్ మాత్రం కొన్ని కారణాల వలన వదలలేదు. కానీ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్స్ తో ఒక రేంజ్లో థియేటర్స్ లో దూసుకుపోతుంది. మే నెలలో.. మహానటి హిట్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ గీత గోవిందం అందుకుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి బన్నీ వాష్ నిర్మాతగా పరశురామ్ కేవలం 13 నుండి 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు మొదటి రోజుకే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల షేర్ కోల్లగొట్టింది.ఘనంగా సక్సెస్ మీట్...అలాగే శాటిలైట్స్ హక్కుల ద్వారా వచ్చిన మొత్తం, మొదటి రోజు వచ్చిన మొత్తానికే గీత గోవిందానికి పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. మరి రెండో రోజు నుండి గీత గోవిందం నిర్మాతలు లాభాల బాట పట్టారు. విజయ్ దేవరకొండ క్రేజ్, రష్మిక అందం తో సినిమా సూపర్ హిట్ అవడం.. పరశురామ్ డైరెక్షన్ స్కిల్స్ వావ్ అనిపించేలా ఉండడం.. వెరసి గీత ఆర్ట్స్ వారు అదరగొట్టే హిట్ అందుకున్నారు. అందుకే మెగాస్టార్ చిరు కూడా సినిమా విడుదలైన రోజే గీత గోవిందం సినిమా చూసి యూనిట్ సభ్యులను అభినందించారు. ఇక అల్లు అర్జున్ తన మిత్రుడు బన్నీ వాస్ గీత గోవిందం తో హిట్ అందుకోవడంతో.. ఇప్పుడు గీత గోవిందం బృందానికి మంచి పార్టీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గీత గోవిందం సినిమాకి పనిచేసిన దర్శకనిర్మాతలు, టెక్నీషియన్స్, హీరో హీరోయిన్ ఇలా గీత గోవిందంకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్ లో ఈ గ్రాండ్ పార్టీ ప్లాన్ చేసాడు. హైదరాబాద్ శివారులో ఉన్న బన్నీ ఫామ్ హౌస్ లో ఈ పార్టీని అరేంజ్ చేసాడు.సినిమా నచ్చితే పార్టీ...ఇక గీతగోవిందం సినిమా కి ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యకపోయినా.. ఇప్పుడు సక్సెస్ మీట్ ని మాత్రం ఓ రేంజ్ లో చేపడుతున్నారు. మెగాస్టార్ చిరు ముఖ్యఅతిథిగా గీత గోవిందం సక్సెస్ సెలెబ్రేషన్స్ ని ఆదివారం నిర్వహించబోతున్నారు. మరి సినిమాని ఆల్రెడీ వీక్షించిన చిరు ఈ సక్సెస్ మీట్ లో గీత గోవిందం గురించి ఎలాంటి విషయాలు చెప్పి సినిమాపై మరింత క్రేజ్ పెంచుతాడో అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలో బయలుదేరింది. ఇకపోతే బన్నీకి సినిమా నచ్చితే ఆ సినిమా బృందానికి పార్టీ ఇవ్వడమనేది మహానటి మూవీ నుండి మొదలు పెట్టాడు. తాజాగా గీత గోవిందం బృందానికి ఇప్పుడు ఇలా పార్టీ ఇస్తున్నాడన్నమాట. ఇక గీత గోవిందం సినిమా కేరళలో కొల్లగొట్టే కలెక్షన్స్ ని అక్కడ కేరళలో వరద బాధిత సహాయార్థం విరాళంగా ఇచ్చేస్తున్నటుగా ఆ సినిమా నిర్మాత బన్నీ వాస్ ప్రకటించాడు.
https://www.telugupost.com/crime/anantapur-police-have-arrested-the-hawala-gang-189-crore-cash-was-recovered-from-them-1465961
అనంతపురం పోలీసులు హవాలా గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1.89 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో కేరళ గ్యాంగ్ ఈ డబ్బును తరలిస్తుండగా అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు కేరళకు చెందిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.హవాలా రూపంలో...హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హవాలా మార్గంలో పెద్దయెత్తున నగదు తరలి వెళుతుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ నగదుకు సంబంధించి వారివద్ద ఎలాంటి ఆధారాలు, రశీదులు లేకపోవడంతో హవాలా సొమ్ముగా అనుమానిస్తున్నారు. పోలీసులు నలుగురిని విచారిస్తున్నారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.