link
stringlengths 41
231
| text
stringlengths 29
5k
|
---|---|
https://www.telugupost.com/crime/there-was-tragedy-in-konaseema-three-died-after-falling-into-godavari-1535035 | కోనసీమలో విషాదం నెలకొంది. గోదావరిలో పడి ముగ్గురు మరణించారు. గోదావరి నది స్నానానికి వెళ్లిన ముగ్గురు అందులో మునిగిపోయి మరణించారని స్థానికులు చెబుతున్నారు. కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం బడుగువాని లంకలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.ఈతకు వెళ్లి...మృతులు ముగ్గురూ ఆలమూరు మండలం చిలకపాలపాడు గ్రామస్థులగా గుర్తించారు. మృతదేహాలను బయటకు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి మృతితో బడుగువాని లంకలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈత రాకపోవడం వల్లనే మరణించినట్లు ప్రాధమికంగా గుర్తించారని తెలిసింది. |
https://www.telugupost.com/movie-news/shock-for-prabhas-181119/ | ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ ని వరస బెట్టి మొదలు పెట్టడమే కాదు.. అందుకు తగిన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్న ప్రభాస్ కి ఒకే ఒక్క రోజు షాకుల మీద షాకులు తగిలాయి. ఎంతో ఉత్సాహంతో ముంబై వెళ్లి అక్కడ ఓ స్టూడియోలో వేసిన సెట్ లో ఆదిపురుష్ సినిమాని గ్రాండ్ గా ఓపెనింగ్ చేద్దాం అనుకున్న ప్రభాస్ కి ఆదిపురుష్ సెట్ లో ఫైర్ ఆక్సిడెంట్ జరగడం షాకిచ్చింది. ఆదిపురుష్ ఓపెనింగ్ కి అటు ఇటుగా ఆదిపురుష్ షూటింగ్ కోసం వేసిన ఓ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో ఆదిపురుష్ ఓపెనింగ్ ని హడావిడి లేకుండా ముగించేసింది ఓం రౌత్ టీం. ఇక ఆదిపురుష్ సెట్ దగ్ధం అయినా.. అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రభాస్ అండ్ ఆదిపురుష్ టీం ఊపిరి పీల్చుకుంది.ఆ గొడవ ఇంకా సద్దు మణగక ముందే ప్రభాస్ కి మరో షాక్ తగిలింది. అదేమిటి అంటే ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ షూటింగ్ ముగించుకుని వెళుతున్న సలార్ టీం సభ్యులు రీసెంట్ గా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గోదావరి ఖని – పెద్దపల్లి లోని సింగరేణి బొగ్గు గనుల్లో సలార్ షూటింగ్ జరుగుతుంది. అయితే అక్కడ షూటింగ్ ముగించుకుని వెళుతున్న టెక్నీకల్ సిబ్బంది వ్యాను హైవే మీద యూటర్న్ తీసుకుంటుండగా.. లారీ గుద్దడంతో సలార్ టెక్నీకల్ సిబ్బందిలో ఐదుగురు గాయాలపాకలవగా.. వారిని దగ్గర్లోనే ఉన్న మమత హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం కలగకపోవడంతో సలార్ టీం ఊపిరి పీల్చుకుంది. మరి ఒకే రోజు రెండు భారీ పాన్ ఇండియా మూవీస్ షూటింగ్ విషయంలో ఇలా జరగడం నిజంగా ప్రభాస్ కి పెద్ద షాకే. |
https://www.telugupost.com/crime/up-woman-kills-infant-son-with-spade-to-dispel-sickness-1456658 | టెక్నాలజీ యుగం.. కంప్యూటర్ యుగమంటూ.. ఓ పక్క అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే.. మరోవైపు ఇప్పటికీ మూఢ నమ్మకాలతో చేయరాని పనులు చేస్తున్నారు కొందరు. ఆ మూఢనమ్మకాలతో కన్నబిడ్డల ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడట్లేదు. స్వార్థం, మూఢ నమ్మకాలు, చేతబడులతో తమ జీవితాలను తామే చేజేతులా నాశనం చేసుకుంటూ.. బిడ్డల జీవితాలను ఆగం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి యూపీలో వెలుగుచూసింది. 35 ఏళ్ల మహిళ మూఢనమ్మకంతో తన నాలుగు నెలల కొడుకుని చంపుకుంది.ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ జిల్లా ధనుదీ గ్రామానికి చెందిన మంజూ అనే మహిళ.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె భర్త కాన్పూర్ లో కూలీ పనులు చేస్తుంటాడు. మూఢ నమ్మకంతో తన కొడుకుని హతమార్చింది. నాలుగు నెలల పసిగుడ్డు అని కూడా చూడకుండా పారతో కొట్టి అత్యంత దారుణంగా చంపేసింది. ఆ సమయంలో ఆమెకు కన్న మమకారం కూడా గుర్తు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు మంజూని అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/taxiwala-movie-story-96946/ | విజయ్ దేవరకొండ కొత్త సినిమా టాక్సీవాలా 17న విడుదలవుతున్న సందర్భంగా ఆ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది టాక్సీవాలా టీం. అయితే టాక్సీవాలా ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ.... ఇప్పుడు టాక్సీవాలా మీద కొన్ని సెటైర్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదల కష్టాలు ఎదుర్కొని.. సినిమా మొత్తం లీకైన టాక్సీవాలా మీద ప్రేక్షకుల్లో హైప్ పెంచేందుకు విజయ్ దేవరకొండ నానా తిప్పలు పడుతుంటే.. ఇపుడు వినబడుతున్న రూమర్ చూస్తుంటే ఈ సినిమా మీద అంచనాలు తగ్గిపోయేలా ఉన్నాయి. నిన్న విడుదలైన టీజర్ లో ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న విజయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మేరకు ఒక పాత వింటేజ్ కారు కొనుక్కుంటాడు. ఆ కారుతో ఎంతోకొంత సంపాదించి సమస్యల నుండి బయటపడొచ్చనేది అతని ఉద్దేశ్యం.అచ్చం డోరా కథలానే..?అయితే ఆ కారులో దెయ్యం ఉంటుంది. ఆ కారులోని దెయ్యం అందరినీ భయపెడుతోంది. మరి ఈ టాక్సీవాలా కథతో ఇప్పుడు నయనతార గతంలో తమిళంలో నటించిన డోరా కథతో ముడిపెడుతున్నారు కొందరు. టాక్సీవాలా కథ, నయనతార డోరా కథ ఒకేలా ఉన్నాయని... డోరాలో కూడా నయనతార ఒక కారు కొనుక్కుంటే... ఆ కారులో మరణించిన చిన్న పాప ఆత్మ... తనని చంపిన వారి మీద పగ తీర్చుకోవడానికి చూడడం, దానికి నయనతార హెల్ప్ చెయ్యడం జరుగుతుంది. మరి నిన్న టాక్సీవాలా ట్రైలర్ లో కూడా విజయ్ కొన్న కారులో దెయ్యం కాన్సప్ట్ చూస్తుంటే అది... డోరా కథతో మ్యాచ్ అవుతుందని అంటున్నారు.కాపీ కొట్టాడా..? చూడకుండానే తీశాడా..?మరి విజయ్ డోరా సినిమాని కాపీ కొట్టి కొత్తగా చేశాడా..? అనే అనుమానాలు ఇప్పుడు ఫిలింనగర్ లో మొదలయ్యాయి. కొత్త దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డోరాని కాపీ కొట్టాడా..? లేదంటే అతను ఆ సినిమా చూడకుండా ఈ కథను ప్రిపేర్ చేశాడా..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ రేజ్ అయ్యాయి. |
https://www.telugupost.com/crime/man-ends-his-life-by-jumping-from-balanagar-flyover-1479546 | ఫ్లై ఓవర్ పై నుంచి దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని బాలానగర్ లో వెలుగుచూసింది. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కోమటిబస్తీకి చెందిన కొర్రా అశోక్ (35)గా గుర్తించారు. బాలానగర్ సీఐ కె.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ వృత్తిరీత్యా వెల్డింగ్ పని చేస్తుంటాడు. కొన్నేళ్లుగా సరిగ్గా పనిచేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. భార్య, సంజీవరెడ్డినగర్ లో ఉండే బంధువుల నుంచి డబ్బులు తీసుకుని ప్రతిరోజూ మద్యం సేవించేవాడు.డబ్బులు ఇవ్వకపోతే ఫ్లై ఓవర్ పై నుంచి దూకుతానని, లేదంటే ఉరేసుకుంటానని పలుమార్లు కుటుంబ సభ్యుల్ని బెదిరించాడు. ఆరు నెలల క్రితం ఇలాగే చనిపోతున్నానంటూ తమ్ముడు అభిలాష్ కు ఫోన్ చేయగా.. అతని వచ్చి రక్షించాడు. సోమవారం మరోసారి తప్పతాగి ఎవరికీ చెప్పకుండా బాలానగర్ ఫ్లై ఓవర్ ఎక్కి దూకేశాడు. ఈ దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఇది గమనించిన స్థానికులు అశోక్ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీకి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు. |
https://www.telugupost.com/movie-news/this-combination-is-super-159891/ | కొరటాల శివ కి స్టార్ హీరో రామ్ చరణ్ తో చేస్తే మెగా హీరోతో సినిమా బోణి అవుతుంది అనుకుని రామ్ చరణ్ తో సినిమాకి లైన్ క్లియర్ చేసుకుని ముహూర్తం కూడా పెట్టాడు. కానీ ఏమైందో రామ్ చరణ్ కొరటాల శివ సినిమా నుండి తప్పుకుని.. కొరటాల ని తండ్రి చిరు ఆచార్యకి తగిలించాడు. రామ్ చరణ్ కాకపోయినా చిరు తగలడంతో కొరటాల హాప్పీనే. కాకపోతే యంగ్ హీరో స్టార్ హీరో రామ్ చరణ్ అయితే ఇంకా సూపర్. అయితే కొరటాల కి ఇప్పుడు మరో స్టార్ మెగా హీరో దొరకబోతున్నాడట. ప్రస్తుతం అలా వైకుంఠపురములో హిట్ తో పాన్ ఇండియా లెవల్లో పుష్ప ని సుకుమర్ తో కలిసి చేస్తున్న అల్లు అర్జున్ తర్వాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ చేసినా.. చెయ్యకపోయినా.. కొరటాలతో సినిమా చేయబోతున్నాడనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. కొరటాల శివ తో బన్నీ కొత్త కలయిక అయినప్పటికీ.. మెగా కంపౌండ్ లోనే ఏడాది కాలంగా ఉంటున్న కొరటాల శివ బన్నీ కి అదిరిపోయే ఓ లైన్ చెప్పాడట. దానితో బన్నీ చేద్దాం సర్ అంటూ కొరటాలకి మాటిచ్చినట్లుగా అది కూడా పాన్ ఇండియా లెవల్ స్క్రిప్ట్ తోనే సినిమాకి దిగుదామని అల్లు అర్జున్ కొరటాలతో గట్టిగ చెప్పినట్టుగా న్యూస్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. కొరటాల శివ పంధాలోనే బలమైన సామజిక సందేశమున్న కథాంశంతోనే ఈ సినిమా ఉండబోతుంది అని.. దానికి బన్నీ అల్లరిని, కామెడీని జోడించి పాన్ ఇండియా మెచ్చే స్క్రిప్ట్ తోనే కొరటాల – అల్లు అర్జున్ మూవీ ఉండబోతుంది ఆనే టాక్ నడుస్తుంది. |
https://www.telugupost.com/movie-news/allu-arjun-new-record-80308/ | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , డైనమిక్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సరైనోడు సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా మరో మైల్‌స్టోన్ ఈ చిత్ర విజయం లో భాగమయింది. యూట్యూబ్ లో హిందీ డబ్బింగ్ తో విడుదలైన సరైనోడు చిత్రం కనీవినీ ఎరుగని రీతిలో ఇండియాలో ఏ చిత్రం కూడా సాధించలేని రికార్డుని చేరుకుంది. 200 మిలియన్ వ్యూస్ ని క్రాసయ్యింది. అంతేకాదు తెలుగు సినిమా సత్తా మరోసారి ఈ చిత్రం తో నిరూపించడం విశేషం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఫెర్‌ఫార్మెన్స్ కి బోయపాటి శ్రీను టేకింగ్ తోడై తెలుగు చలనచిత్ర రికార్డులే కాకుండా ఇండియాలో ఇలాంటి అరుదైన రికార్డు సాధించటం తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం.ఇందుకే కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అనేదిఅంతే కాకుండా 6 లక్షల 66 వేల లైక్స్ తో హైయ్యస్ట్ వ్యూవ్స్ సాధించిన చిత్రం గా బన్ని మరోక్కసారి తన సత్తా చాటుకున్నాడు. గతం లో బన్ని నటించిన దువ్వాడ జగన్నాధం చిత్రం 176 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు నెలకోల్పాడు. తన రికార్డు తనే సరైనోడు చిత్రంతొ బ్రేక్ చేసుకున్నాడు. ఇవేకాకుండా గతంలో రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు కూడా రికార్డు స్థాయి వ్యూస్ సాధించాయి. అందుకే బన్నిని ఫ్యాన్స్ అందరూ కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని ముద్దుగా పిలుచుకుంటారు.. |
https://www.telugupost.com/movie-news/mega-studio-in-rangasthalam-set-77860/ | దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన రంగస్థలం సినిమా కోసం చాలా రోజులు గోదావరి జిల్లాల్లోని గోదావరి పరిసరప్రాంతాల్లో షూటింగ్ చేసాడు. కానీ అక్కడ చరణ్ ఫాన్స్ వలన షూటింగ్ కి ఇబ్బంది కలగడంతో... హైదరాబాద్ నడిబొడ్డున అంటే జూబ్లీహిల్స్ వంటి కాస్ట్లీ ప్రాంతంలో రంగస్థలం కోసం 12 కోట్లతో పల్లెటూరి సెట్ వేశారు. మరా సెట్ లోనే సినిమా సగభాగం ని తెరకెక్కించారు. అయితే ఆ రంగస్థలం సెట్స్ ని సినిమా పూర్తయ్యాక కూడా తియ్యకుండా సందర్శనార్ధం అలానే ఉంచేశారు. ఇక అదే రంగస్థలం సెట్స్ లో చిరంజీవి తన సై రా నరసింహారెడ్డి షూటింగ్ కొంత కానిచ్చేశాడు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ రంగస్థలం సెట్స్ వేసిన స్థలం లో ఒక స్టూడియో ని నిర్మించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లోని ఈ స్థలాన్ని రామ్ చరణ్ కొన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ప్లేస్ లోనే ఓ మెగా స్టూడియో ని కట్టాలన్న ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడట. నిజానికి చిరంజీవి కూడా ఎప్పటినుండో ఓ స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడు. గతంలో చిరంజీవి వైజాగ్ లో సినిమా స్టూడియో కట్టే యోచనతో స్థలం చూసినట్టు టాక్ వినిపించింది. కానీ చిరు తర్వాత రాజకీయాల్లో బిజీ అవడంతో..ఆ ఆలోచన సైడ్ అవ్వడం జరిగింది.అయితే ప్రస్తుతం హీరోగా, నిర్మాతగానే కాకుండా పలు వ్యాపారాల్లో కొనసాగుతున్న రామ్ చరణ్ ఇప్పుడు స్టూడియో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే సై రా నిర్మతగా చేస్తూనే... బోయపాటి తన 12 వ సినిమాలో రామ్ చరణ్ బిజీగా వున్నాడు. |
https://www.telugupost.com/movie-news/harish-shankar-varun-tej-pooja-hegde-jigarthanda-remake-valmiki-132202/ | హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వాల్మీకి ఈ నెల 20 న విడుదల కాబోతుంది. తమిళ జిగర్తాండ కి రీమేక్ గా వస్తున్న వాల్మీకి సినిమా మీద మంది అంచనాలే ఉన్నాయి. వరుణ్ తేజ్ మాస్ లుక్, పూజ హెగ్డే లంగా ఓణీ లో పల్లెటూరి లుక్స్ అన్ని సినిమా మీద మంచి ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మరో తమిళ హీరో కూడా నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ లో ఎలా ఉంటాడో అనే క్యూరియాసిటిలో మెగా అభిమానులున్నారు. ఇక వాల్మీకి అసలైతే ఈ నెల 13 నే విడుదల కావాల్సి ఉంది. కానీ నాని గ్యాంగ్ లీడర్ కోసం వాల్మీకి వెనక్కి వెళ్ళింది. ఇక పోస్టర్స్ తో టీజర్ తో సాంగ్స్ తో సినిమా మీద అంచనాలు పెరుగుతుంటే.. లేటెస్ట్ గా బయటికొచ్చిన న్యూస్ తో సినిమా మీద మరింత హైప్ పెరిగేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే న్యూస్ తాజాగా సోషల్ మీడియాలో వినబడుతుంది. తమిళ జిగర్తాండ లో ఓ హీరో తో గెస్ట్ రోల్ ప్లే చేయిస్తున్నట్టుగా…. వాల్మీకి లోను ఓ హీరో గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రోల్ కోసం నితిన్ సంప్రదించగా నితిన్ ఒప్పుకున్నాడని తెలుస్తుంది. మరి నితిన్ రాకతో ఈ వాల్మీకి పై మరింత హైప్ పెరగడం ఖాయమంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/shooting-begun-adi-purush-181004/ | ప్రభాస్ పాన్ ఇండియా జోరు చూస్తుంటే.. ఈసారి ప్రభాస్ ఫాన్స్ కి ఊపిరి తీసుకోలేనన్ని సెలెబ్రేషన్స్ ఖాయంలాగే అనిపిస్తుంది. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ జాడ లేదు.. ఈలోపే ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ సెట్స్ మీదకెళ్ళిపోయాడు. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనుల్లో సలార్ కి సంబందించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఫిబ్రవరి 10 వరకు జరగనున్న సలార్ షూటింగ్ నుండి ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఆదిపురుష్ కి జంప్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ రోజే అధికారికంగా ప్రభాస్ – ఓం రౌత్ కాంబో ఆదిపురుష్ ఆరంభమైంది. భారీ అంచనాలు మధ్యన అనౌన్స్ చేసిన ఆదిపురుష్ ప్రాజెక్ట్ ని ఓం రౌత్ మొదలు పెట్టేసాడు. ఇప్పటికే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని సెట్ చేసుకున్న ఓం రౌత్ తన టీం తో ఆదిపురుష్ ఆరంభానికి రంగం సిద్ధం చెయ్యడమే కాదు.. అధికారికంగా మొదలు పెట్టేసి ప్రభాస్ ఫాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చేసాడు. మరి ప్రభాస్ సలార్ అండ్ ఆదిపురుష్ అండ్ నాగ్ అశ్విన్ సినిమాలకు పక్కాగా డేట్స్ కేటాయించుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా సెట్ చేసుకోవడంతో ప్రభాస్ దర్శకులు ఒక్కొక్కరిగా రంగంలోకి దిగేస్తున్నారు. ఆదిపురుష్ సీత వేటలోనే ఉన్న ఓం రౌత్ ఆదిపురుష్ కోసం డ్రీం గర్ల్ హేమమాలిని ని తీసుకోబోతున్నాడనే న్యూస్ ఉంది. |
https://www.telugupost.com/crime/ap-youth-drowns-in-canada-waterfall-silver-falls-canada-1483500 | ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన తెలుగు విద్యార్థి అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మచిలీపట్నం చింతగుంటపాలెంకు చెందిన ట్రెజరీ ఉద్యోగి పొలుకొండ శ్రీనివాస్, మీనాకుమారిల కుమారుడు లెనిన్ నాగకుమార్ లేక్‌హెడ్ యూనివర్శిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. అతడు 2021లో కెనడా వెళ్లాడు. నాగకుమార్ గత సోమవారం స్నేహితులతో కలిసి కెనడాలోని సిల్వర్‌ఫాల్స్‌కు వెళ్లాడు. అక్కడ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు.మచిలీపట్నానికి చెందిన 23 ఏళ్ల విద్యార్థి కెనడాలోని అంటారియో సమీపంలోని సిల్వర్ ఫాల్స్ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. మృతుడు పోలుకొండ నాగ లెనిన్ కుమార్ గా గుర్తించారు అక్కడి అధికారులు. లెనిన్ లేక్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో MSc చదువుతున్నాడు, 2021లో కెనడా వెళ్ళాడు. అతను ఇటీవలే తన చివరి సెమిస్టర్ పరీక్షలను రాశాడు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. చదువు పూర్తి కావడంతో ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. సోమవారం లెనిన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి సిల్వర్ ఫాల్స్ వద్దకు వెళ్లాడు. అక్కడే నీటిలో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన తర్వాత లెనిన్‌తో పాటు ఉన్న అతని స్నేహితుల్లో ఒకరి నుండి తమకు ఫోన్ వచ్చిందని అతని మామ వేణుగోపాలరావు చెప్పారు.సిల్వర్ ఫాల్స్‌కి విహారయాత్రకు వెళ్లారు. ఇద్దరు ఒడ్డున కూర్చొని ఉండగా, లెనిన్ మరో స్నేహితుడితో కలిసి జలపాతం దిగువన ఈత కొట్టడానికి వెళ్ళారు. లెనిన్‌కు ఈత తెలుసని చెప్పారు వేణుగోపాల రావు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో ఈత కొడుతుండగా అతను మునిగిపోయాడని అతని స్నేహితులు తెలిపారని అన్నారు రావు. లెనిన్ కష్టపడటం చూసి, అతని స్నేహితులు ఎమెర్జెన్సీ నెంబర్ ను సంప్రదించారు. స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ వారు అతని మృతదేహాన్ని బయటకు తీశారు. మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌తో పాటు ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మతో మాట్లాడి లెనిన్ భౌతికకాయాన్ని మచిలీపట్నానికి తీసుకురావడంలో సహాయం చేయాలని కోరారు. |
https://www.telugupost.com/movie-news/sradha-kapoor-renumaration-in-saho-movie-129587/ | మన టాలీవుడ్ హీరోయిన్స్ కి రెమ్యూనరేషన్ మహా అయితే కోటిన్నర, రెండు కోట్లు లోపే ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఉండదు. మన టాలీవుడ్ లో ఒక్క అనుష్కనే అంత తీసుకుంటుంది. లేటెస్ట్ గా విజయశాంతి తన రీఎంట్రీ సినిమా కోసం రెండు నుంచి మూడుకోట్ల వరకు రెమ్యూనిరేషన్ ఇవ్వనున్నారని టాక్ వస్తుంది. ఈమె రీఎంట్రీ సినిమా సరిలేరు నీకెవ్వరు. సాహోలో మాత్రం…. సమంత కూడా కోటి, కోటిన్నర వరకు తీసుకుంటది. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ అయినా అంతకు మించి ఉండదు. రకుల్ ప్రీత్ సింగ్ మన్మధుడు 2 సినిమాకు కోటిన్నరకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుందని టాక్. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాప్ సాహో విషయానికి వస్తే ఆ సినిమాలో హీరోయిన్ శ్రద్ధ కపూర్. అమ్మో అంతా…? ఈసినిమా కోసం ఆమె అక్షరాలా అయిదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంది. ఆమె బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి అక్కడ రేట్లు తగ్గట్టుగానే తీసుకుంది. పైగా పాన్ ఇండియా మూవీ కాబట్టి ఆమె అడిగినంత ఇచ్చేసారు మేకర్స్. అయితే శ్రద్ధ కపూర్ ను తీసుకోవడం వల్ల నిర్మాతకు వచ్చేలాభం ఏంటంటే ఈమూవీ బాలీవుడ్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది. అక్కడ కలెక్షన్స్ కి ఏ ఢోకా ఉండదు. అందుకే ఆమెని తీసుకోవడానికి కారణం. |
https://www.telugupost.com/movie-news/heroine-koratala-chiranjeevi-film-96562/ | చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం పూర్తి కాగానే.. కొరటాల శివతో సినిమాకి కమిట్ అయ్యాడు. భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ... చిరు కోసం కథను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ కొరటాల శివ - చిరు కాంబో ఫిక్స్ అనేది నిజం. ప్రస్తుతం చిరంజీవి సైరా షూటింగ్ లో బిజీగా ఉంటే... కొరటాల మాత్రం చిరు సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. సైరా షూటింగ్ కొలిక్కి రావడమే తరువాయి. కొరటాల మూవీ కోసం చిరు రెడీ అవుతాడు. అయితే చిరు - కొరటాల సినిమా కోసం కథలో ఇంకా పర్ఫెక్షన్ రాని కారణంగా డిసెంబర్ లో మొదలవుతుంది అనుకున్నా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతి తర్వాత మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా ఈమధ్యన వార్తలొచ్చాయి.కాలా హీరోయిన్ ను తీసుకొస్తారా..?ఇక ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడనే టాక్ ఉంది. అలాగే చిరు పక్కన తమన్నా భాటియా నటిస్తుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇక తమన్నా అయితే చిరుకి సెట్ కాదని మెగా అభిమానులు కూడా లబోదిబోమన్నారు. తాజాగా చిరు సరసన కొరటాల మూవీలో నటించబోయే హీరోయిన్ బాలీవుడ్ నుండి రాబోతుంది. రజనీకాంత్ సరసన కాలా సినిమాలో నటించిన హ్యూమా ఖురేషి చిరు సరసన నటించబోతుందనే టాక్ మొదలైంది. చిరు మూవీ కోసం హ్యూమా ఖురేషీని ఎంపిక చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.వెంకీ మామతో కూడా...మరి కాలా సినిమాలో రజనీకి స్పేహితురాలిగా పనిచేసి ఆకట్టుకున్న హ్యూమా... వెంకటేశ్ - నాగ చైతన్య కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ వెంకీ మామాలో వేంకటేశ్ సరసన నటిస్తుందనే న్యూస్ ఉంది. మరి తాజాగా చిరు పక్కన కూడా ప్లేస్ కొట్టేసిన హ్యూమా ఇప్పుడు తెలుగులో సీనియర్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. |
https://www.telugupost.com/crime/top-maoist-leader-from-telangana-katakam-sudarshan-dies-due-to-heart-attack-1479278 | సీపీఐ మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆదివారం ఉదయం మీడియా ద్వారా ప్రకటించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్ మే 31న గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన సంస్మరణార్థం నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప సభలను నిర్వహించనున్నట్లు తెలిపింది. కటకం సుదర్శన్ బస్తర్ మావోయిస్టు పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి.వరంగల్ లో పాలిటెక్నిక్ చదివిన ఆయన.. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో దోపిడీకి గురవుతున్న ఆదివాసీల హక్కుల కోసం పోరాడేందుకు నక్సల్‌లో జాయిన్ అయ్యాడు. 1978లో సుదర్శన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. 2011 నవంబర్ లో కిషన్ జీ ని హతమార్చిన తర్వాత 14 మంది సభ్యులతో పొలిటికల్ బ్యూరోకు నాయకుడిగా వ్యవహరించారు. ఏపీ, తెలంగాణ నక్సల్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీలోనే సాధన అనే మహిళను వివాహం చేసుకోగా.. గత కొంతకాలం క్రితం నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో ఆమె మరణించారు. 2011 చత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడ మారణకాండలో ప్రధాన సూత్రదారిగా ఉన్న సుదర్శన్‌పై 21 కేసులు నమోదయ్యాయి. |
https://www.telugupost.com/movie-news/koratala-shiva-kaira-advani-80042/ | కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా 2018లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో మంచి వసూళ్లు సాధించిన చిత్రం. డీవీవీ దానయ్య నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం సుమారు 200 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా. అయితే, ఇంత భారీ విజయం సాధించినా, వసూళ్లు కూడా బాగా జరిగినా చిత్ర దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ కైరా అద్వానీకి ఇంకా పారితోషకం పూర్తిగా ఇవ్వలేదట నిర్మాత.పారితోషకం ఇవ్వకుండానే .....తన పారితోషకం చెల్లించాలని కొరటాల శివ ఎన్నిసార్లు అడిగినా సదరు నిర్మాత నుంచి స్పందన లేదంట. అయితే, దానయ్యతో మరో సినిమా చేయాల్సి ఉన్నందున కొరటాల గట్టిగా అడగలేకపోతున్నారని తెలుస్తోంది. ఇక కైరా అద్వానీకి కూడా భరత్ అనే నేను సినిమా పారితోషకం పూర్తిగా అందకముందే బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ తో డీవీవీ నిర్మిస్తున్న చిత్రానికి సైన్ చేసింది. దీంతో తన పారితోషకం వస్తుందనే ఆశతో ఉందట. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ తో మల్టీస్టారర్ సినిమా కూడా నిర్మిస్తున్నారు దానయ్య. అయితే, పారితోషకం విషయంలో దానయ్య ఇలానే వ్యవహరిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. |
https://www.telugupost.com/movie-news/తెలుగులో-నటించనన్నాడుగా-22301/ | మొన్నామధ్యన తెలుగులో నటించాలంటే తెలుగు వచ్చి ఉండాలని... ఒకవేళ తెలుగు రాకపోతే మొహంలో హావభావాలను పలికించడం కష్టం కాబట్టి తెలుగులో ఇక నటించకపోవచ్చని స్టేట్మెంట్ ఇచ్చాడు అరవింద్ స్వామి. గతంలో రోజా, బొంబాయి చిత్రాలతో 90 వ దశకంలో ఒక ఊపు ఊపిన ఈ హీరో కొంతకాలం సినిమాలకి దూరమయ్యాడు. అయితే చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ తమిళంలో 'తని ఒరువన్' చిత్రంతో విలన్ గా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ సినిమా ఏ రేంజ్ హిట్టో అందరికి తెలిసిందే. అదే చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ 'ధ్రువ'గా రీమేక్ చేసాడు. అయితే తెలుగులో కూడా అరవింద్ స్వామి, రామ్ చరణ్ కి విలన్ గా నటించి కేక పుట్టించాడు. మళ్ళీ 'ధ్రువ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరయ్యాడు అరవింద్ స్వామి 'ధ్రువ' చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయ్యాక అరవింద్ స్వామి తెలుగులో మరిన్ని సినిమాలు ఒప్పుకుంటాడేమో అని అనుకున్నారు. కానీ అరవింద్ మాత్రం తెలుగు భాష రాదు కాబట్టి తెలుగులో నటించడం అనేది కొంత సమస్యే అని చెప్పాడు.అయితే ఇప్పుడు అరవింద్ స్వామి తమిళంలో నటించిన మరో మూవీ తెలుగులో రీమేక్ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఆ మూవీలో అరవింద్ మళ్ళీ తెలుగు రీమేక్ లో కూడా నటిస్తాడని అంటున్నారు. అరవింద్ స్వామి - జయం రవి తాజాగా నటించిన 'బోగన్' చిత్రం తమిళంలో గత వారం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'బోగన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు. జయం రవి, హన్సిక హీరో హీరోయిన్స్ గా నటించిన 'బోగన్' లో అరవింద్ స్వామి ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించాడని... ఇక తెలుగు రీమేక్ లో కూడా ఆరోల్ ని అరవిందే చేస్తాడని అంటున్నారు. అయితే తెలుగు రీమేక్ నిజంగా ఉంటే తాను అందులో నటించడానికి నో చెప్పక పోవచ్చని అంటున్నాడు అరవింద్ స్వామి. అంటే అరవింద్ తెలుగులో మరొకసారి నటిస్తానని చెప్పకనే చెప్పినట్లు లేదూ...! |
https://www.telugupost.com/movie-news/రాజశేఖర్-అందుకే-కన్నీళ్ల-47528/ | సీనియర్ హీరో రాజశేఖర్ - శ్రద్ద దాస్, పూజ కుమార్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన ‘పి.ఎస్.వి.గరుడవేగ 126.18 ఏఎం’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే గత రాత్రి అంటే శుక్రవారం రాత్రి ‘పి.ఎస్.వి.గరుడవేగ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర బృందం. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కి నర్తించిన బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ఈ ఫంక్షన్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.అయితే ఈ వేడుకలో హీరో రాజశేఖర్ వేదిక మీద కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయన అంతలా ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఈ సినిమా విడుదలకు ముందే ఆయన తల్లి కాలం చెయ్యడంతో.. ఈ ఈవెంట్ లో ఆయన అంతగా ఎమోషన్ అయ్యారు. ఈ మధ్య కాలంలో రాజశేఖర్ కి సక్సెస్ అనేదే లేకుండా పోయింది. ‘పి.ఎస్.వి.గరుడవేగ' తో మళ్ళీ సక్సెస్ బాట పట్టాలని రాజశేఖర్ ఆశపడుతున్నారు. అయితే తనకు సక్సెస్ రావాలని తన తల్లి ఎంతగానో ఇదయ్యారని.. కానీ ‘పి.ఎస్.వి.గరుడవేగ' సినిమా విడుదల కాకుండానే ఆమె చనిపోవడంతో తన నెత్తిన పిడుగుపడిన ఫీలింగ్ వచ్చిందని చెప్పారు.అలాగే తన బావమరిది మురళి కూడా తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నారని.. ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. కానీ సినిమా నిర్మాతలకు ఎటువంటి లాస్ రాకూడని భావించి ఈ ఫంక్షన్ కి అటెంట్ అయ్యానని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనదని.. ఈ సినిమా టీజర్ విడుదల చేసిన ఐదు రోజుల్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చాయని.. తెలిసినప్పుడు మా అమ్మ గారు నా దగ్గరే ఉన్నారని... తన కొడుక్కి చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయం దక్కుతుందని... చాలా సంతోషంగా కనిపించారు అని చెప్పడమే కాకుండా..... నేను సినిమాల్లో చాలా నష్టపోయానని మా అమ్మానాన్నలకు బాధ. నాకు సెట్ కానీ సినిమాల్లో నటించి చాలా ఆస్తులు కోల్పాయని చెప్పారు. |
https://www.telugupost.com/movie-news/chalaki-chanti-acident-125195/ | జబర్దస్త్’ లాంటి కామెడీ షో తో చాలామంది తెలుగు ఇండస్ట్రీ వస్తున్నారు. అలానే చలాకీ చంటి కూడా. కాకపోతే చంటి సినీ ఇండస్ట్రీకి వచ్చినా తరువాతే ‘జబర్దస్త్’ లోకి వచ్చాడు. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు చేస్తూ ‘జబర్దస్త్’ షో చేస్తున్న చంటి ఈ తెల్లవారుఝామున రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చలాకీ చంటి విజయవాడ నుండి హైదరాబాద్ కి తన కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. కోదాడ మండలం కొమరబండ దగ్గర ఆయన ప్రయాణిస్తోన్న కారు ఆగివున్న లారీని వెనుకనుండి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారని సమాచారం. వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి వైద్యం చేస్తున్నారు అని టాక్. టాలీవుడ్ కి ఏదో జరుగుతుంది. వరసగా గాయాలు అవుతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్,వరుణ్ తేజ్, శర్వానంద్,నాగ శౌర్య, సందీప్ కిషన్, నితిన్ ఇలా వరస అందరికి గాయాలు అవ్వడం అందరిని ఆశర్యనికి గురి చేస్తుంది |
https://www.telugupost.com/international/pakistani-hindu-businessman-shot-dead-in-sindh-over-land-dispute-1352653 | భారత్ శత్రుదేశమైన పాకిస్థాన్ లో మరో దారుణం జరిగింది. దేశం విడిచి వెళ్లాలని ఓ హిందూ వ్యాపారిని హెచ్చరించగా.. అతను ససేమిరా వెళ్లనని చెప్పడంతో దారుణంగా కాల్చి చంపారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. సింధు ప్రావిన్స్ లోని ఘోట్కీ జిల్లాకు చెందిన సతన్ లాల్ ను దహర్ సామాజిక వర్గానికి చెందిన కొందరు కొన్నేళ్లుగా బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఆయనకు ఉన్న భూమిని తమకు అప్పగించి, దేశం విడిచి వెళ్లిపోవాలని బెదిరించారని తెలిపారు.Also Read : నేటి నుంచి తెలంగాణలో డిజిటల్ క్లాసులుకళ్లు పొడిచారని, కాళ్లు, చేతులపై కత్తితో గాయాలు చేశారని ఆ వీడియోలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ దేశానికి చెందినవాడినని, చావనైనా చస్తాను కానీ వారికి మాత్రం లొంగేది లేదని స్పష్టం చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టుతో పాటు స్థానిక అధికారులను కూడా వేడుకున్నారు. కానీ.. అంతలోనే ఊహించని దారుణం జరిగింది. సతన్‌లాల్‌కు చెందిన భూమిలో ఏర్పాటు చేసిన కాటన్ ఫ్యాక్టరీ, ఫ్లోర్ మిల్ ప్రారంభోత్సవం జరుగుతుండగా వచ్చిన దుండగులు ఆయనను కాల్చి చంపారు. సతన్‌లాల్ స్నేహితుడు ముఖి అనిల్ కుమార్‌ను ఉటంకిస్తూ 'ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' ఈ విషయాన్ని వెల్లడించింది. లాల్ హత్యకు నిరసనగా మంగళవారం ఘోట్కీ జిల్లాలో నిరసనలు చేపట్టారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బచల్ దహార్, అతడి మద్దతుదారులను అరెస్ట్ చేశారు. |
https://www.telugupost.com/movie-news/100-థియేటర్స్‌లో-గౌతమిపు-10137/ | నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం కావడం, తెలుగు జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఆధారంగా రూపొందుతోన్న చిత్రం కూడా కావడంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టు దర్శకుడు క్రిష్, నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.సినిమా ఫస్ట్‌లుక్‌కి ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఇటీవలవిడుదల చేసిన టీజర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌ను 2.6 మిలియన్స్ ఆడియెన్స్ వీక్షించారు. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి భారీ ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసందర్భంగా... చిత్ర నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - ''నందమూరి బాలకృష్ణగారు నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానులు జనవరి 12, సంక్రాంతికి విడుదలవుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి కోసం ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం అవుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణగారు నటించిన 100వ చిత్రం కావడంతో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను యు.ఎస్., యు.కె. సహా ప్రపంచ వ్యాప్తంగా వంద లోకేషన్స్‌లో ఒకేసారి విడులయ్యేలా ప్లాన్ చేశాం. డిసెంబర్ మొదటివారంలో ఈ వేడుకను గ్రాండ్ లెవల్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించనున్నాం. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం'' అన్నారు.నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, కబీర్ బేడి తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంతన్ భట్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్. |
https://www.telugupost.com/movie-news/జూలై-నెలాఖరున-కథలో-రాజకు-35989/ | వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి". శిరువూరి రాజేష్‌వర్మ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సౌందర్య నర్రా, ప్రశాంతి , సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగశౌర్య మరో కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నమిత ప్రమోద్, నందితలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, విశాల్ చంద్రశేఖర్ లు సంగీత సారధ్యం వహించిన పాటలు ఇటీవల ఆన్ లైన్ ద్వారా విడుదల చేయగా శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. అదే విధంగా.. టీజర్-ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకొంది. తొలుత ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేసినప్పటికీ.. సినిమా అందరికీ చేరువవ్వాలన్న ఆలోచనతో.. "కథలో రాజకుమారి" చిత్రాన్ని జూలై నెలాఖరుకు విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం 'కథలో రాజకుమారి'. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన మా చిత్రాన్ని జూన్ లో విడుదల చేద్దామనుకొన్నాం. కానీ.. జూలై నెలాఖరుకు విడుదలను వాయిదా వేయడం జరిగింది. సినిమా ఎక్కువమంది జనాలకు చేరాలన్న ఆలోచనతోనే సినిమాను జూలై నెలాఖరుకు వాయిదా వేయడం జరిగింది" అన్నారు. |
https://www.telugupost.com/movie-news/ntr-role-in-rrr-movie-123915/ | రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో #RRR మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రెండో షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కి గాయాలవడంతో… షూటింగ్ కి కాస్త బ్రేకిచ్చిన రాజమౌళి ఇప్పుడు మళ్ళీ #RRR షూటింగ్ ని పట్టాలెక్కిన్చాబోతున్నాడు. ప్రస్తుతం ఎటువంటి హంగామా లేకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌళి… ఆ షూటింగ్ లో కొమరం భీం పాత్రధారి పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సన్నివేశాల్లో కొమరం భీంకు బ్రిటిష్ సైనికులకు మధ్య ఫైట్ సీన్ ను ఉందట. అయితే ఆ సీన్స్ అన్ని రాత్రివేళలల్లో చిత్రీకరణ జరపాలట. ప్రస్తుతం ఆ నైట్ సీన్ కి సంబంధించే షూట్ జరిగినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ సైన్యంతో తలపడే సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్ సరసన ఇంకా హీరోయిన్ ని రాజమౌళి ఫైనల్ చెయ్యలేదు. నిత్యా మీనన్ ఒక హీరోయిన్ గా ఎన్టీఆర్ కి సెట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి కానీ.. ఎక్కడా కంఫార్మేషన్ లేదు. ఇక మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీత రామ రాజు కేరెక్టర్ లో అలియా భట్ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు.ఇంకా ఈ సినిమా లో అజయ్ దేవగణ్, సముద్రఖని కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు |
https://www.telugupost.com/crime/sons-brutally-murder-their-father-for-property-in-suryapet-district-1369290 | సూర్యాపేట : మానవత్వం మంటగలిసిపోతుంది. రోజురోజుకూ మానవ బంధాలు, అనుబంధాలు విలువ లేకుండా పోతోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు.. వారిపాలిట యమపాశాలుగా మారుతున్నారు. ఆస్తులు పంచివ్వకపోతే.. తల్లిదండ్రులను సైతం మట్టుబెట్టేందుకు వెనకాడటం లేదు. అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో జరిగింది. ఆత్మకూరు(ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది.తమకు భూమిని పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కన్నతండ్రిని దారుణంగా నరికి చంపారు. ఎరగాని శ్రీను గౌడ్ (50)కి సంతు, రాజశేఖర్ ఇద్దరు కొడుకులు, భార్య, కూతురు ఉన్నారు. శ్రీను కి కొంత వ్యవసాయభూమి ఉంది. ఆ భూమిని ఇద్దరికీ పంచివ్వాలని తరచూ తండ్రితో గొడవలు పడేవారు. ఎన్నిసార్లు అడిగినా భూమిని పంచివ్వకపోవడంతో.. తమలోని రాక్షసత్వాన్ని చూపించారు. కని, పెంచి, పెద్దచేసిన తండ్రిని గురువారం ఉదయం గొడ్డలి, కత్తితో దారుణంగా నరికి చంపారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. గ్రామానికి చేరుకొని,సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. |
https://www.telugupost.com/top-stories/one-party-is-criticizing-one-party-for-moving-people-to-public-meetings-in-whose-media-they-are-promoting-1453404 | నిజమే.. కొన్ని వార్తలు చదువుతుంటే నవ్వు తెప్పిస్తాయి. ప్రత్యక్షంగా చూసిన వారయితే పడీ పడీ మరీ నవ్వుకోవాల్సి వస్తుంది. "జగన్ సభలకు వెళ్లిపోతున్న జనం" చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న ప్రజలు" ఇవి ఒక వర్గం మీడియాలో. మరొక వర్గం మీడియాలో దీనికి భిన్నంగా వార్తలు దర్శనమిస్తాయి. అసలు ఈ కాలంలో స్వచ్ఛందంగా సభలకు వచ్చి నేతల మాటలు వింటారా? అన్నది పెద్ద సందేహం. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్, ఇందిరాగాంధీలను చూసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సభలకు తరలి వచ్చేవారు. ఎప్పుడూ పెద్దగా రాష్ట్రానికి రారు కాబట్టి ఇందిరాగాంధీని చూసేందుకు, సినిమాల్లో చూసిన ఎన్టీఆర్ ను ప్రత్యక్షంగా చూసేందుకు జనం స్వచ్ఛందంగానే తరలి వచ్చేవారు. వారి రాకకోసం ఎదురు చూసేవారు.నాడు అలా కాదు...అంతేకాదు ఆ ఇద్దరు నేతలు మంచి వక్తలు. ఇందిర హిందీలో మాట్లాడినా, ఎన్టీఆర్ తెలుగులో మాట్లాడిన అలవోకగా ప్రసంగాలు సాగేవి. వారి ప్రసంగం వినడానికి కూడా ఎంతో మంది తరలి వచ్చేవారు. ఆరోజు ఇంత మీడియా లేదు. టీవీలు ఉన్నా ఇంతమందికి అందుబాటులో లేదు. ఇన్ని న్యూస్ ఛానెళ్లు లేవు. అందుకే ప్రత్యక్షంగా వారిని చూసి ప్రసంగాలు చూసేందుకు జనం ఎగబడేవారు. ఎవరికి వారే తరలి వచ్చారు. ఎన్టీఆర్ ను చూసేందుకు అయితే చద్ది మూటలు కట్టుకుని, ఎడ్లబండలపైన వచ్చి రోజంతా ఆయన కోసం ఎదురు చూసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.పసలేని ప్రసంగాలే...కానీ ఇప్పుడలా కాదు. ఇప్పటి రాజకీయ నేతల ప్రసంగాలు ఎప్పటికప్పుడు లైవ్ లో టీవీలో వస్తున్నాయి. నేరుగా అక్కడకు వెళ్లకపోయినా ఇంట్లో కూర్చోనో.. మొబైల్ లోనో ఎక్కడి నుంచైనా చూసే వీలుంది. దీంతో పాటు ఇప్పటి నేతల ప్రసంగాలు వినేటంత గొప్పవేమీ కావు. చంద్రబాబు కాని.. జగన్ కాని.. పవన్ కాని.. చేసేవి పసలేని ప్రసంగాలే. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మినహా పెద్దగా సబ్జెక్ట్ లేని ప్రసంగాలు ఎక్కువగా వినిపిస్తాయి. పెద్దగా కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. దీంతో వారి సభలకు స్వచ్ఛందంగా వచ్చే వారు ఎవరూ ఉండరు. జనసమీకరణ చేయకుంటే...ఏ పార్టీ అయినా అందరూ తరలించనిదే జనం వీళ్ల సభలకు రారన్న సంగతి అందరికీ తెలుసు. కాకుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి కొంత కసితో నేతలు జనసమీకరణ చేస్తారు. అధికారంలో ఉన్న వైసీపీకి మాత్రం ప్రభుత్వ అధికారులే డ్వాక్రా మహిళలనో, మరొకరినో తెచ్చి ప్రాంగణాన్ని నింపుతారు. పవన్ కల్యాణ్ విషయానికి వస్తే కొంత మినహాయింపు ఇవ్వొచ్చు. ఆయన సినీ హీరో కావడంతో ఒకసారి చూసి వెళదామని వచ్చే వారు ఎక్కువగా ఉంటారు. అంతే తప్ప జనసేన నేతలు కూడా జనసమీకరణ చేయనిది ఎక్కువ సంఖ్యలో రారన్నది కూడా అంతే నిజం. మొత్తం మీద ఏ పార్టీకి అనుకూలమైన మీడియా ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసుకోవడం తప్ప జనం వీరి సభలకు వచ్చేది అనడం ట్రాష్. అందరూ జనసమీకరణ చేయాల్సిందే. వాహనాలను పెట్టి తోలాల్సిందే. |
https://www.telugupost.com/movie-news/another-tragedy-happened-in-the-film-industry-noted-writer-balamurugan-passed-away-1457682 | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత బాలమురుగన్ మరణించారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. తెలుగు, తమిళ రచయిత భూపతిరాజా తండ్రి బాలమురుగన్. ఆయన వయసు 86 సంవత్సరాలు. తన తండ్రి మరణించినట్లు భూపతి రాజా వెల్లడించారు.తెలుగు, తమిళం...బాలమురుగున్ తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలకు కధలను అందించారు. జీవనతరంగాలు, సావాసగాళ్లు, సోగ్గాడు, ఆలుమగలు, ధర్మదాత వంటి చిత్రాలకు కధలు రాసింది బాలమురుగన్. తమిళంలో శివాజీ గణేశన్ సినిమాలకు ఎక్కువగా కథలను అందించారు బాలమురుగన్. ఆయన మృతి పట్ల తమిళ, తెలుగు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. |
https://www.telugupost.com/movie-news/ఘాజి-మూవీ-రివ్యూ-రేటింగ్-3-23151/ | నటీనటులు: రానా దగ్గుబాటి, తాప్సీ, నాజర్, ఓంపురిసంగీతం: కెనిర్మాతలు: పివిపిదర్శకత్వం: సంకల్ప్దగ్గుబాటి రానా 'లీడర్' చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక హీరోగా రానా మరికొన్ని చిత్రాలు చేసినప్పటికీ అతనికి అనుకున్నంత పేరు రాలేదు. అయితే 'బాహుబలి'తో భల్లాల దేవగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. తన పేరు అందరికి తెలిసేలా రానా తన నటనతో అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఒక కొత్త కథతో 'ఘాజి' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో తాప్సి ఒక ప్రధానపాత్రలో నటించింది. ఇప్పటివరకు ఇలాంటి డిఫరెంట్ స్టోరీ తో నాగార్జున 'గగనం' వంటి చిత్రంలో కనబడ్డాడు. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా మంచి పేరైతే తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు రానా కూడా అలాంటి ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతూ... తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ అందరిలో హైప్ క్రియేట్ చేయాడు. 70 ల్లో భారత్ - పాకిస్తాన్ కు మధ్యజరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకున్న ఈ 'ఘాజి' చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకుంటుందో సమీక్షలో తెలుసుకుందా.కథ: ఎప్పుడూ పాకిస్తాన్, భారత్ పై తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతుంటుంది. ఎలాగైనా భారత్ ని మట్టుబెట్టాలని చూస్తుంటుంది. పశ్చిమ పాకిస్తాన్ కి, తూర్పు పాకిస్తాన్ కి మధ్యన యుద్ధం జరుగుతుంటుంది. అయితే పశ్చిమ పాకిస్తాన్లో యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు సహాయం చేసేందుకు కరాచీ నుండి ఘాజి అనే సుబ మెరైన్ ని పంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ఘాజి ఇండియా సముద్ర మార్గం నుండి ప్రయాణించవలసి ఉంటుంది. సముద్రం మధ్యలో ఇండియాకి చెందిన ఎస్సెస్ విక్రాంత్ యుద్ధ నౌకొకటి కాపలా ఉంటుంది. ఆ నౌకాని పేల్చేసి ఘాజి తన గమ్యం చేరాలనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న భారత్ తమ కమాండోలను రంగంలోకి దించుతుంది . వారిలో అర్జున్ వర్మ( రానా) రణ్వీర్ సింగ్ ( కె కె మీనన్) లు వుంటారు. వీరంతా ఘాజి పై యుద్ధం చేస్తారు. మరి ఈ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు? అర్జున్ వర్మ తన టీమ్ తో ఘాజీపై గెలిచాడా? ఇవన్నీ తెలియాలంటే తెర మీద ఘాజీని వీక్షించాల్సిందే..నటీనటులు: రానా అర్జున్ వర్మ పాత్రలో చక్కటి నటన ప్రదర్శించాడు. అసలు రానా ఇలాంటి పాత్ర చేయగలడా అని అనుకున్నవాళ్ళ నోరుమూసుకునేలా చేసాడు. అంతటి హావభావాలను పలికించాడు. పవర్ ఫుల్ రోల్ లో పవర్ ఫుల్ గా నటించి మెప్పించాడు. రానా ఈ సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలుస్తాడు. కెకె మీనన్ కూడా డైలాగ్స్, నటనతో చక్కటి నటన కనబర్చాడు. ఓం పూరి, నాజర్ లు నటనతో మెప్పించారు. ఇక తాప్సి కి అందరూ ఎక్సపెక్ట్ చేసిన రోల్ దక్కకలేదు. పేద ప్రాముఖ్యత లేని పాత్రలో తాప్సి కనబడింది. ఇక ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ చిరంజీవి వాయిస్ ఓవర్. సినిమా ని ఎక్కడికో తీసుకెళ్లడానికి చిరు వాయిస్ ఓవర్ ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.సాంకేతిక వర్గం: దర్శకుడు సంకల్ప్ సినిమాని ఎలా ప్రెజెంట్ చెయ్యాలనుకున్నాడో అలాగే తెరకెక్కించాడు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీసి మెప్పించాడు. ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ సినిమా తీయాలనుకుని పెద్ద సాహసమే చేసాడు. ఒక యుద్ధ నేపధ్య కథతో సినిమాని తెరకెక్కించాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇక ఈ సినిమాకి మరో బలమైన పాత్ర బ్యాగ్రౌండ్ స్కోర్ ది. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ చాలాబావుంది. మంచి నిర్మాణ విలువలు ఈ చిత్రంలోకనబడ్డాయి.ప్లస్ పాయింట్స్: కథ, దర్శకత్వం, రానా, చిరు వాయిస్ ఓవర్, క్లైమాక్స్, సినిమాటోగ్రఫీమైనస్ పాయింట్స్: కామెడీ, కమర్షియల్ ఎలెవెంట్స్ లేకపోవడంరేటింగ్: 3 .0 /5 |
https://www.telugupost.com/movie-news/సై-రా-లో-విజయ్-పాత్ర-ఏమిటం-53834/ | చిరంజీవి సై రా నరసింహారెడ్డి సినిమా సెట్స్ మీదకెళ్ళిపోయి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా ఓపెనింగ్ జరుపుకున్న దాదాపు మూడు నెలలకు సెట్స్ మీద కెళ్లిన ఈ సినిమాలో అమితాబచ్చన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి వంటి వారు నటిస్తున్నారు. అలాగే హీరోయిన్స్ లో మెయిన్ లీడ్ లో నయనతార నటిస్తుండగా... ప్రగ్యా జైస్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే సై రా కోసంమరో హీరోయిన్ ఎంపిక బ్యాలెన్స్ ఉంది. ఇక టాప్ టెక్నీకల్ టీమ్ ఈ సై రా నరసింహారెడ్డి కోసం పనిచేస్తున్నారు.అయితే ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా.. రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సై రా నరసింహారెడ్డిగా చిరు నటిస్తుండగా.. మిగతా టాప్ స్టార్స్ ఏ ఏ పాత్రల్లో నటిస్తున్నారణే విషయం క్లారిటీ లేదు. ఇకపోతే తమిళంలో ప్రస్తుతం స్టార్ హీరో హోదాలో కొనసాగుతున్న విజయ్ సేతుపతి సై రా లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలియసిందే. అసలు సై రా లో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్నప్పటికీ ఎలాంటి రోల్ అనేది క్లారిటీ లేదు.కానీ ఇప్పుడు విజయ్ సై రా లో ఎలాంటి పాత్ర చేస్తున్నాడో అనేది బయటికి వచ్చింది. నిజ జీవితంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అత్యంత నమ్మకమైన అనుయాయుల్లో ఓబయ్య ఒకడు. ఎప్పుడూ ఉయ్యాలవాడ వెన్నంటే ఉంటాడు. ఉయ్యాలవాడ పోరాటంలో తనూ పాలుపంచుకున్నాడు.అయితే ఈ పాత్ర సై రా సినిమాలో చాలా కీలకమట. దాదాపుగా సినిమా అంత ఈ పాత్ర ఉంటుందని సమాచారం. కచ్చితంగా ఈ పాత్ర సై రా నరసింహారెడ్డి సినిమాలో మేజర్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఇలాంటి పవర్ఫుల్ రోల్ లో విజయ్ సేతుపతి ని చూడబోతున్నమాట. |
https://www.telugupost.com/movie-news/anushka-15-years-industry-celebrations-150701/ | అనుష్క ఎప్పుడెప్పుడు కనబడుతుంది అనే ఆశతో చాలామంది అభిమానులే ఉన్నారు. సైజు జీరో దెబ్బకి మాయమైన అనుష్క మల్లి నిశ్శబ్దంగా ప్రేక్షకుల ముందుకూ రాబోతుంది. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ..ఫేస్ లో ఉన్న క్యూట్ నెస్ తో అనుష్క స్టార్ హీరోలతో చాన్సు కొట్టేసింది. అనుష్క స్ట్రెక్సర్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ అనుష్క మాత్రం టాలీవడ్ హీరోలందరి సినిమాల్లో నటించింది. అయితే సైజు జీరో తో బొద్దుగా మారిన అనుష్క మునపటి ముద్దుగుమ్మ కాలేకపోయింది. చాలా ప్రయత్నాలు చేసి బరువు తగ్గించించిన అనుష్క మునుపటి గ్లో మిస్ అయ్యింది. తాజాగా జరిగిన నిశ్శబ్దం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుష్క 15 ఇయర్స్ జర్నీ లో చక్కగా ట్రెడిషనల్ గా తయారయింది కానీ.. ఫేస్ లో గ్లో కనబడలేదు. అయితే నిశ్శబ్దం ఈవెంట్ లోనే అనుష్క 15 ఇయర్స్ జర్నీ ఈవెంట్ కూడా జరగడం దానికి అనుష్క నటించిన సినిమాల దర్శకుల్లో చాలామంది హాజరవడం జరిగింది. రాజమౌళి, పూరి, రాఘవేంద్ర రావు, శ్యాం ప్రసాద్ రెడ్డి, పివిపి ఇలా చాలామంది దర్శనిర్మాతలు హాజరై అనుష్క 15 ఇయర్స్ జర్నీ గురించి గొప్పగా మట్లాడారు. అనుష్క ఇండస్ట్రీ లో అడుగుపెట్టి.. 15 ఏళ్ళు అయినా సందర్భంగా ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసారు. అయితే ఈ ఈవెంట్ లో అనుష్క తో కలిసి నటించిన హీరోలెవరు హాజరవలేదు. అంటే కేవలం దర్శకనిర్మాతలతోనే అనుష్క సరిపెట్టేసింది కానీ.. హీరోలకు మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. లేదంటే ప్రభాస్, మహేష్, బాలకృష్ణ, చిరు, నాగ్ ఇలా అందరూ ఆనుష్క ఈవెంట్ లో వాలిపోయారు. అనుష్క పిలవలేదు కానీ.. పిలిస్తే ఆ ఈవెంట్ మరింత సందడిగా మారి.. అనుష్క గొప్పదనం మరికాస్త తెలిసేది అంటున్నారు అభిమానులు |
https://www.telugupost.com/movie-news/pawan-comments-on-sathyagrahi-102025/ | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో అప్పట్లో “సత్యాగ్రహి” సినిమాను అనౌన్స్ చేశారు. దీనికి ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యహరించారు. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమాకు మొదట్లోనే బ్రేక్ పడింది. దాదాపు స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యి సెట్స్ మీదకు వెళ్తున్న టైంలో ఈ సినిమాను పవన్ కల్యాణే ఆపేసారు. దానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియలేదు. ఈ సినిమాను నిర్మిద్దామనుకున్న రత్నం కూడా సినిమాలకు దూరంగా జరిగి చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. ఈ నేపధ్యంలో చాలాకాలం తరువాత 'సత్యాగ్రహి' ప్రసక్తి వచ్చింది.నిజజీవితంలో చూపించడానికే...ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమెరికా టూర్ లో ఉన్నాడు. జనసేన తరుపు ప్రవాస గర్జన పేరుతో ప్రవాసులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 'సత్యాగ్రహి' సినిమా టాపిక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ...'సత్యాగ్రహి' అనే సినిమా ఆపేసింది.. దాన్ని నిజ జీవితంలో చేసి చూపించడానికేనన్నారు. అప్పట్లో పొలిటిక్స్ లోకి రావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ఆపేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆ సినిమాను నిజ జీవితంలో నిజం చేయడానికి ట్రై చేస్తున్నా అని పవన్ అనడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. దీంతో ఇప్పుడు “సత్యాగ్రహి” సినిమా ఆపేసారు అనే బాధ ఫ్యాన్స్ లో లేదు. |
https://www.telugupost.com/movie-news/allu-arjun-new-film-71790/ | డీజే సినిమా హిట్ టాక్ రాకపోయినా తనకున్న క్రేజ్ తో అదిరిపోయే కలక్షన్స్ రాబట్టాడు అల్లు అర్జున్. ఇక వక్కంతం వంశీకి అవకాశమిచ్చి నా పేరు సూర్య తో చేతులు కాల్చుకున్నాడు. నా పేరు సూర్య కనీసం లేడి ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన మహానటి పోటీని కూడా తట్టుకోలేక చేతులెత్తేసింది. ఇక నా పేరు సూర్య సినిమా పోవడంతో కాస్త చికాకుగా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఏ డైరెక్టర్ కి అవకాశం ఇస్తాడో గాని, అందరూ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నా పేరు సూర్య బిజినెస్ క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో ఉంది. అందుకే ఈసారి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.కథ ఓకే కానీ దర్శకుడెలా..?అల్లు అర్జున్ కి కొరటాల శివ తో సినిమా చెయ్యాలని ఉంటె కొరటాల మాత్రం బన్నీ కి అవకాశం ఇవ్వకుండా చిరంజీవి వైపు మొగ్గు చూపాడు. దీంతో అల్లు అర్జున్ చివరికి ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ కి కమిట్ అవుతున్నాడని న్యూస్ హల్చల్ చేసింది. అయితే విక్రమ్ కుమార్ తో కథ సెట్ కాకపోవడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ - విక్రమ్ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే పరిస్థితి లేదు. అయితే అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య, రన్ సినిమాల దర్శకుడు అనీ కన్నెగంటి బన్నీకి ఒక కథ వినిపించాడట. అయితే అనీ కన్నెగంటి చెప్పిన కథ బాగా నచ్చడంతో బన్నీ ఆ కథతో సినిమా చేస్తా కానీ దర్శకుడిగా అనీ కన్నెగంటి ని కాదని వేరే దర్శకుడి కోసం వేట మొదలెట్టాడట.బిజీబిజీగా దర్శకులు..అనీ కన్నెగంటి చేసిన సినిమాలేవీ మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ అతను చెప్పిన కథని భారీ రేటుకి కొనేసి, ఆ కథతో మరో దర్శకుడితో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. మరి కథ ఒకే గాని దర్శకుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే సుకుమార్ మహేష్ కి, బోయపాటి రామ్ చరణ్ కి... ఇలా అందరు దర్శకులూ బిజీగా ఉండడంతో బన్నీ కి దర్శకుడు దొరికే ఛాన్స్ ప్రస్తుతానికి లేదు. అలాగే కొత్త దర్శకుడికి అవకాశం ఇద్దాం అంటే వక్కంతం తో చేసిన ప్రయోగం విఫలమవడంతో ప్రస్తుతానికి కొత్త దర్శకుడు అనే పదం అల్లు అర్జున్ నోటి నుండి వినబడదు. మొత్తానికి బన్నీ మొదటిసారిగా బాగా ఇరుకున పడినట్లే అనిపిస్తుంది. |
https://www.telugupost.com/movie-news/nikhil-doesnt-want-to-remake-the-films-from-languages-141454/ | స్ట్రయిట్ కథలతో సినిమాలు చేసినప్పుడు యావరేజ్ హిట్స్ అయినా కొట్టిన నిఖిల్ కి రీమేక్స్ కలిసి రావడం లేదు. కిర్రాక్ పార్టీ అంటూ కన్నడ రీమేక్ చేసిన నిఖిల్ ఆ సినిమా ఘోరమైన ఫలితాన్ని ఇచ్చింది. అయితే కిర్రాక్ పార్టీ పోయాక కూడా నిఖిల్ మల్లి తమిళ హిట్ రీమేక్ నే నమ్ముకుని ముద్ర అంటూ సినిమా చెయ్యడం అది కాస్తా అర్జున్ సురవరం గా ప్రేక్షకులముందు కు రావడానికి నానా కష్టాలు పడింది. సినిమా విడుదలకు బోలెడంత సమయం తీసుకోవడంతో.. నిర్మాతలకు తలకు మించిన భారం అవడంతో నిఖిల్ కూడా ఆసినిమా వలన ఇబ్బందులు పడ్డాడు. పోనీ విడుదలయ్యాక ప్లాప్ టాక్ పడింది. రీసెంట్ గా విదూడలైన అర్జున్ సురవరం సినిమాకి ప్లాప్ టాక్ తోనే మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం వరకు కలెక్షన్స్ పరంగా ఓకే.. కానీ చివరిగా అర్జున్ సురవరం కలెక్షన్స్ తో నిర్మాతలు సేఫ్ అవుతారో.. లేదో తెలియాల్సి ఉంది. అయితే వరసగా రెండు రీమేక్స్ చేసి దెబ్బతిన్న నిఖిల్ మాత్రం ఈసారి రీమేక్స్ జోలికి పోను అంటున్నాడు. ఎందుకంటే తాను బేసిక్ గా రీమేక్స్ కి వ్యతిరేకమని చెబుతున్నాడు. అందుకే ఇకనుండి తన పాలసీకి వ్యతిరేఖంగా రీమేక్ చెయ్యనని చెప్పేస్తున్నాడు. |
https://www.telugupost.com/movie-news/salar-release-date-2-184020/ | ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ 'సలార్'. సౌత్ ఇండియా సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తూ భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరంగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2022, ఏప్రిల్ 14న సలార్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ – “ప్రభాస్‌తో సినిమా అంటే ఆయన అభిమానులు, ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో, సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్‌ను ఆయన అభిమానులు ఎలా చూడాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ అంచనాలను మించేలా సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 2022, ఏప్రిల్14న మీ అందరితో కలిసి సలార్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను“ అన్నారు. |
https://www.telugupost.com/crime/once-again-there-is-a-riot-in-america-13-people-died-in-the-shooting-at-wal-mart-1449464 | అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వాల్ మార్ట్ లో జరిగిన కాల్పుల్లో 13 మంది మరణఇంచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వర్జీనియాలోని వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పులు జరిగాయి. కాల్పులను స్టోర్ మేనేజర్ జరిపినట్లు పోలీసు అధికారులు గుర్తించారు.వాల్‌మార్ట్ మేనేజర్ ....గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం రాత్రి స్టోర్ మేనేజర్ బ్రేక్ రూంలోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు అరగంట సేపు ఈ కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. అయితే కాల్పులు జరిపిన మేనేజర్ తనను తాను కాల్చుకుని చనిపోయాడని అక్కడకు చేరుకున్న పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. |
https://www.telugupost.com/crime/news-1550673 | ఒక వ్యక్తి తన భార్య, నవజాత శిశువును ఆసుపత్రిలో డబ్బులు కట్టి బయటకు తీసుకుని రావడానికి ఊహించని పని చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి తన మూడేళ్ల కుమారుడిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు వేగంగా స్పందించారు. శిశువును తీసుకెళ్లిన జంటతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు.బర్వా పట్టి నివాసి హరీష్ పటేల్ తన భార్య ప్రసవం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల ప్రకారం, రోజువారీ కూలీ అయిన పటేల్‌కు ఇది ఆరవ సంతానం. ఈసారి ఆసుపత్రిలో డబ్బులు చెల్లించలేకపోయాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది తల్లి, నవజాత శిశువును బయటకు వెళ్లనివ్వలేదు. హరీష్ పటేల్ తన మూడేళ్ల కొడుకును కొన్ని వేల రూపాయలకు ఓ జంటకు విక్రయించడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, నేరంలో భాగమైన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు భోలా యాదవ్, అతని భార్య కళావతి లను అదుపులోకి తీసుకున్నామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ కేసులో చర్య తీసుకోవడంలో పోలీసు కానిస్టేబుల్ నిర్లక్ష్యం వహించడంతో యాక్టివ్ డ్యూటీ నుండి తొలగించి, ఎస్పీ ద్వారా పోలీసు లైన్‌లకు పంపారు. పిల్లవాడు సురక్షితంగా ఉన్నాడని, అతని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/naa-peru-surya-collections-68866/ | ఈ సమ్మర్ కి వచ్చిన 'రంగస్థలం'.. 'భరత్ అనే నేను' రెండు సినిమాలు కమెర్షియల్ గా మంచి హిట్ అందుకున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ రెండు సినిమాలు వండర్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ సమ్మర్ లో పెద్ద సినిమాల్లో రిలీజ్ అయ్యే చివరి సినిమా అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. ప్రస్తుత బన్నీ మార్కెట్ 70 కోట్లు ఉంది కానీ ఈసారి బన్నీ టార్గెట్ ఎనభై కోట్లు. 80 కోట్లు షేర్ వస్తే సక్సెస్ కింద లెక్క. మరి బన్నీ ఈ సినిమాతో అత్యధిక వసూళ్లు సాధించగలడా? కొత్త దర్శకుడుతో తాను అనుకున్న గోల్ రీచ్ అవ్వగలడా? అని సోషల్ మీడియాలో బన్నీ పై కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్స్ చూస్తే మినిమం గ్యారెంటీలానే అనిపిస్తున్నా కానీ ఒక సినిమా విజయానికి చాలా ఫ్యాక్టర్లు ఉంటాయి.మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు 'రంగస్థలం'..'భరత్ అనే నేను' తో పాటు నా సినిమా హ్యాట్రిక్ కొడుతుంది అని చెప్పాడు. వరుసగా రెండు భారీ విజయాలు రావడం వల్ల మార్కెట్లో కాస్త స్తబ్ధత వచ్చే అవకాశముంది. మంచి టాక్ వస్తే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం 80 కోట్లు టార్గెట్ అంత కష్టమైనది ఏమి కాదు. కానీ సినిమాకు డివైడ్ టాక్ వస్తే మాత్రం టార్గెట్ క్లిష్టతరమవుతుంది. ఆల్రెడీ రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై ఈసారి ఒత్తిడి కాస్త ఎక్కువగానే వుంటుంది. అసలు భరత్ అనే నేను కలెక్షన్స్, రంగస్థలం కలెక్షన్స్ ముందు అల్లు అర్జున్ నా పేరు సూర్య 80 కోట్ల టార్గెట్ పెద్దదేమీ అనిపించడం లేదు. చూద్దాం మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది సినిమాలో ఎంత దమ్ము ఉందొ అనేది. |
https://www.telugupost.com/movie-news/actress-varalakshmi-sarathkumar-is-going-to-get-married-1523503 | ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కుమార్తె, నటి 'వరలక్ష్మి శరత్‌కుమార్' పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఎంతో ప్రైవేట్ గా వరలక్ష్మి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆర్ట్ గ్యాలరీ యజమాని 'నికోలాయ్ సచ్‌దేవ్'ను ఆమె వివాహం చేసుకోనుంది. పద్నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉందని తెలుస్తోంది. సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ మార్చి 1న జరిగింది. ముంబైలోని ఒక హోటల్‌లో సమీప కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కు హాజరయ్యారు.వరలక్ష్మి 2012లో "పోడా పోడి" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. మొదట హీరోయిన్ గా వరలక్ష్మి అంతగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం దుమ్ము దులుపుతోంది. వీర సింహా రెడ్డి, హనుమాన్ సినిమాల్లో వరలక్ష్మి మంచి క్యారెక్టర్లు చేసింది. ధనుష్ కొత్త సినిమా "రాయాన్"లో కూడా ఆమె కనిపిస్తుంది. ఈ సంవత్సరం చివరి నాటికి వరలక్ష్మి వివాహం జరగబోతోంది. |
https://www.telugupost.com/telangana/assembly-elections-in-telangana-will-be-commensed-before-december-1482206 | ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో అంతకన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సాధారణంగా డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈసారి అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలిపింది.ఎన్నికల విషయమై ఇటీవలే ఎలక్షన్ కమిషన్ బృందం తెలంగాణలో మూడురోజులు పర్యటించి, ఉన్నత అధికారులతో వరుస భేటీలు నిర్వహించింది. రాష్ట్రంలో పర్యటించిన బృందంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, ఆర్ కే గుప్తా, సంజయ్ కుమార్, అండర్ సెక్రటరీ అవినాశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ హిర్దేశ్ కుమార్, ఇతర డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, కలెక్టర్లు, ఐటీ, పోలీసు ఉన్నత అధికారులతో రెండురోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించింది. సమయం ప్రకారం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఈసీ సూచించినట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 7 లోపే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని ఈసీ పరోక్షంగా సంకేతాలిచ్చింది. అధికారులు కూడా అదే జరగవచ్చని చెబుతున్నారు.ఈసీ కొత్తగా తీసుకు వచ్చిన సాంకేతికత, కొత్త అప్లికేషన్ల వాడకంపై అవగాహనతో పాటు.. ఓటర్ జాబితా, నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమలు, పోలీస్ చెకింగ్ పాయింట్ల ఏర్పాటు, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో ఈసీ బృందం చర్చించింది. ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అధికారులను త్వరగా బదిలీ చేయాలని కూడా ఈసీ బృందం ఆదేశించినట్లు సమాచారం. |
https://www.telugupost.com/movie-news/balakrishna-ntr-biopic-review-105165/ | బాలకృష్ణ డ్రీం ప్రోజెక్ట్ ఎన్టీఆర్ జీవిత కథ వచ్చేసింది. నిన్న ఈసినిమా యొక్క మొదటి పార్టు ‘కథానాయకుడు’ రిలీజ్ అయి మంచి సక్సెస్ ని అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రివ్యూస్ అండ్ రేటింగ్స్ కూడా మంచిగా వచ్చాయి. అయితే మొదటి నుండి ఎన్టీఆర్ పాత్ర లో బాలకృష్ణ ఎలా నటిస్తాడో అనేది ఆసక్తి కరంగా మారింది. ఎన్టీఆర్ లా హావభావాల్ని పలికించడంలో బాలకృష్ణ ప్రయత్నం సంపూర్ణ ఫలితం ఇవ్వలేదన్న కామెంట్స్ వినిపించాయి. అలానే సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా జరిగింది. మొదటినుండి బాలకృష్ణ ఇబ్బందులు ఎదుర్కోవాల్సివచ్చింది. స్టార్టింగ్ లో డైరెక్టర్ తేజ తప్పుకోడం..రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని కౌంటర్ ప్రోజెక్ట్ ని స్టార్ట్ చేయడం…నాగబాబు బాలకృష్ణ పైన నెగటివ్ కామెంట్స్ చేయడం…విడుదలైన రోజు ధియేటర్ల వద్ద టిక్కెట్లు ఉచితంగా పంచిపెడ్తున్నారంటూ ప్రచారం జరగడం ఇలా చాలానే జరిగాయి. అంతే కాదు ఈసినిమాకి థియేటర్స్ సమస్య కూడా వచ్చింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ..’కథానాయకుడు’ మంచి సక్సెస్ ని అందుకుంది. కమర్షియల్ గా కాకపోవచ్చు కానీ ఒక సామాజికపరమైన చిత్రంగా ఇది గుర్తు ఉండిపోతుంది. సంక్రాంతి సెలవులకు మంచి సినిమా అని అంటున్నారు ప్రేక్షకులు. |
https://www.telugupost.com/movie-news/ఆ-ఫ్యామిలీతో-ఆటాడుకుంటున-35738/ | మెగాఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి వైరం ఇప్పటిది కాదు.. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక పవన్‌కి మోహన్‌బాబు అంటే అసలు పడదు. చిరంజీవైనా పట్టువిడుపులు ప్రదర్శిస్తాడు...కానీ పవన్ అలా కాదు.. ఎవ్వరి మీదా కోపం రాదు.. వచ్చిందంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడని అతడిని తెలిసిన వారు చెబుతుంటారు. ఇక మోహన్‌బాబు పలు వేదికలపై మెగాకాంపౌండ్ హీరోల మీద వ్యంగ్యబాణాలు వదులుతుంటాడు. పోనీ పవనేమైనా తక్కువ తిన్నాడా? అంటే లేదు. 'తమ్ముడు' మోహన్‌బాబుపై తనదైన వ్యంగ్య శైలిలో తన సినిమాలలో ఇమిటేట్‌చేయడం చేస్తుంటాడు. 'సన్నాఫ్‌సత్యమూర్తి'లో 'చా..లా..బా...గో..దు' అంటూ పదే పదే డైలాగ్ చెప్పి మంచు అక్కకు మంచి షాకిచ్చాడు. అయినా బన్నీకి మోహన్‌బాబు అండ్ బ్యాచ్ మీద కసిపోలేదు. తాజాగా మంచు మోహన్‌బాబును అనుకరిస్తూ ఆయన తన 'పెదరాయుడు' చిత్రంలో చెప్పిన ఫేమస్ డైలాగ్‌ను ఓఆటాడుకున్నాడు. 'ది రిలేషన్ షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హజ్బెండ్' అంటూ కేకపుట్టించాడు. అసలు బన్నీ కొన్ని డైలాగ్స్‌ను తనదైనశైలిలో చెప్పడంలో ఇప్పుడిప్పుడే ఆరితేరుతున్నాడు. 'రేసుగుర్రం'లో చెప్పిన 'ద్యా..వుడా' అనేది ఎంతగా పాపులర్‌అయిందో తెలుసు. తాజాగా 'డిజె'లో బ్రాహ్మణ వేషధారణ, వారి మాటతీరుతో పాటు ఈ పాపులర్ డైలాగ్‌లో ఆయన మోహన్‌బాబును కాపీ కొడుతూ ఆ డైలాగ్‌కు థియేటర్లు దద్దరిల్లేలా చేశాడు.మరి మంచు ఫ్యామిలీ దీనికి కౌంటర్‌ని ఏదైనా వేడుకలో ఇవ్వనున్నారా? తమ సినిమాల ద్వారా ఇవ్వనున్నారా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. |
https://www.telugupost.com/andhra-pradesh/10th-class-telugu-question-paper-leak-case-12-arrested-in-nandyala-district-in-ap-1367176 | నంద్యాల : ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి హైస్కూల్లో నిన్న టెన్త్ తెలుగు పరీక్ష పేపర్ లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తిస్తూ పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. పేపర్ లీకవడానికి సూత్రధారి అయిన రాజేష్ తో పాటు మరో 11 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పరీక్షల డ్యూటీకి హాజరై మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ప్రధాన వ్యక్తి రాజేశ్ గా గుర్తించామన్నారు.తెలుగు ప్రశ్నాపత్రం లీకైందని తెలిసిన వెంటనే డీఈఓ, పోలీస్ అధికారులు విచారణ చేశారని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన వెంటనే తన మొబైల్ తో పరీక్షపత్రాన్ని ఫొటోలు తీసి, బయట వేచి ఉన్న 9 మంది తెలుగు టీచర్లకు పోస్ట్ చేశాడని జిల్లా కలెక్టర్ చెప్పారు. అరెస్టైన వారిలో టీచర్లు నాగరాజు, నీలకంఠేశ్వరరెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మి, దుర్గ, పోతునూరు, ఆర్యభట్ట, రంగనాయకులు ఉన్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్టుమెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్ కు చెందిన నలుగురిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. మరోవైపు అరెస్ట్ చేసిన వారిని గురువారం ఉదయం కోర్టులో హాజరు పరిచారు. |
https://www.telugupost.com/movie-news/అర్జున్-రెడ్డి-కోసం-పోటీ-45817/ | తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకుడిగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయ్యి పెద్ద సంచలనం సాధించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా హక్కులను ఇతర బాషల నిర్మాతలు చేజిక్కించేసుకున్న విషయం తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ లో హీరోగా ఎవరు చేస్తారు అనే సస్పెన్స్ కి తెర దించుతూ తమిళ అర్జున్ రెడ్డి సినిమాలో విక్రం తన కొడుకు అయిన ధ్రువ్ ని హీరో గా పరిచయం చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేసాడు. అలాగే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ని తమిళంలో ప్రముఖ డైరెక్టర్ అయిన బాల డైరెక్ట్ చేయబోతున్నారు అనేది కూడా అనౌన్స్ చేసాడు విక్రమ్.ఇక బాల దర్శకత్వంలో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా పరిచయం కాబోతున్న ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడిపోయిది. అయితే అర్జున్ రెడ్డి చిత్రం కేవలం కుర్రకారుకి కనెక్ట్ అయ్యిందిగాని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంటే.. కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూసే సినిమాగా లేదనేది తెలిసిన విషయమే. మరి ఇలాంటి సినిమాలో విక్రమ్ తన కొడుకు ధృవ్ ని పరిచయం చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అని వాదించేవాళ్లు ఉన్నారు. ఏదిఏమైనా అన్ని కుదురుకుని ఇలా ఈ రీమేక్ సినిమా కి హీరో ఇంకా దర్శకుడు ఇద్దరూ సెట్టైపోవడంతో.... ఇప్పుడు హీరోయిన్ ఎవరనే ప్రశ్న కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది.అర్జున్ రెడ్డి తెలుగు వెర్షన్ లో విజయ్ దేవరకొండ సరసన షాలిని పాండే నటించింది. మరి తమిళంలో ధృవ్ పక్కన నటించబోయే ఆ భామ ఎవరు అంటే ఇద్దరి పేర్లు గట్టిగా విబడుతున్నాయి. ధ్రువ్ సరసన కమల్ హాసన్ రెండో కుమార్తె అయిన అక్షర హాసన్ నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి గాని విక్రం నుంచి గాని ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్షర హాసన్ బదులు నిర్మల కాన్వెంట్ ఫేమ్ శ్రియ శర్మ ని తీసుకుందాం అనే ఆలోచనల్లో ఉన్నారట చిత్ర బృందం. మరి అక్షర హాసన్, శ్రియ శర్మలలో ఎవరు అర్జున్ రెడ్డి రీమేక్ లో ధృవ్ పక్కన నటించే అవకాశం కొట్టేస్తారో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/hero-balakrishna-undergoes-a-minor-knee-surgery-1366778 | హైదరాబాద్ : గతేడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో యాక్షన్ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇటీవలే ఆయన కుడిభుజానికి శస్త్ర చికిత్స జరిగింది. అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదంలో ఆయన కుడిభుజంకు గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన విషయం విధితమే. తాజాగా బాలకృష్ణకు మరో శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు.కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతోన్న బాలకృష్ణకు వైద్యులు.. మైనర్ సర్జరీ నిర్వహించారు. బాలకృష్ణ మోకాలికి జరిగింది చిన్న ఆపరేషనే అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. కొద్దిరోజులపాటు బాలకృష్ణ విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుందని తెలిపారు. సర్జరీ అనంతరం బాలకృష్ణ వైద్యులతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆ ఫొటో కింద కామెంట్స్ చేస్తున్నారు. |
https://www.telugupost.com/politics/brs-chief-kcr-is-coming-to-public-for-the-first-time-after-a-gap-of-almost-two-months-he-will-come-before-the-people-1520341 | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు తొలిసారి ప్రజల్లోకి వస్తున్నారు. దాదాపు రెండు నెలల గ్యాప్ తర్వాత ఆయన జనం ముందుకు రానున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జనంలోకి రాలేకపోయారు. కాలికి గాయం కావడంతో విశ్రాంతిలోనే ఉన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. అయితే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన తొలి బహిరంగ సభ నల్లగొండలో నిర్వహిస్తున్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులపై పెత్తనాన్ని కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్దపడిందని ఆరోపిస్తూ ఆయన ఈ సభను పెద్దయెత్తున నిర్వహిస్తున్నారు.తనదే అధికారమని...నిజానికి కేసీఆర్ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఓటమిని ఊహించలేదు. తనదే మూడోసారి కూడా అధికారమని భావించారు. కానీ పదేళ్ల కాలంలో ఆయన వ్యవహార శైలితో పాటు ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఆయన ఊహించని ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ వ్యూహాలు దెబ్బతిన్నాయి. అంచనాలు అందని రిజల్ట్ రావడంతో ఆయన తట్టుకోలేక ఫలితాలు వస్తున్న వేళ కాన్వాయ్ లేకుండానే ఫాం హౌస్ కు వెళ్లారంటే ఎంత ఫ్రస్టేషన్ కు గురయ్యారో వేరే చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రెండు నెలల తర్వాత ఆయన ఓటమి నుంచి తేరుకుని తొలిసారి బయటకు వస్తున్నారు. భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.పలు అంశాలపై...ఇప్పటి వరకూ ఎన్నికల ఫలితాలపైనా, ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలపైన ఆయన ఎక్కడా స్పందించలేదు. ఈరోజు నల్లగొండ వేదికగా అన్నింటికీ సమాధానమిచ్చే అవకాశముందని అంటున్నారు. ముఖ్యంగా తాను అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు విద్యుత్తు, నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు రైతు బంధు వంటి కార్యక్రమాలపై కూడా ఆయన ప్రసంగం కొనసాగే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపైనా, పార్టీపైనే చేసే ఆరోపణలకు ఆయన సూటిగా ఈ వేదిక పైనుంచే సమాధానం చెప్పనున్నారని తెలిసింది. అసెంబ్లీలో తమకు సమయం ఇవ్వకపోవడం, పదే పదే తమ పార్టీ నేతల ప్రసంగాన్ని అడ్డుతగలడం వంటి వాటిని కూడా ప్రస్తావించనున్నారు.నేతలు, క్యాడర్ లో...మరోవైపు బీఆర్ఎస్ నుంచి నేతలు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. కాంగ్రెస్ మరింత బలపడితే తమకు పార్లమెంటు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురువుతాయని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసమే ఆయన రెండు నెలల తర్వాత తొలిసారి జనంలోకి వస్తున్నారు. క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి మాత్రమే కాదు. లీడర్లు కూడా కారు దిగకుండా ఉండేందుకు ఈ సభను కేసీఆర్ ఉపయోగించుకోనున్నారు. అందుకే రాష్ట్రమంతా కేసీఆర్ ప్రసంగంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఆయన సహజంగా మాటకారి. వాగ్బాణాలు సంధించడంలో మేటి. అలాంటి కేసీఆర్ ఎలాంటి పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడతారన్నది ఆసక్తికరంగా మారింది. |
https://www.telugupost.com/crime/it-was-clear-who-the-body-was-in-the-resalagadda-water-tank-police-identified-the-deceased-as-kishore-of-musheerabad-1342880 | రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో మృతదేహం ఎవరన్న దానిపై స్పష్టత వచ్చింది. మృతుడు ముషీరాబాద్ కు చెందిన కిషోర్ గా పోలీసులు గుర్తించారు. కిషోర్ సోదరి మృతదేహాన్ని చూసి గుర్తించారు. దీంతో రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో ఉన్న మృతదేహం మిస్టరీ వీడిపోయింది. కిషోర్ గత కొంతకాలం క్రితం ఇంట్లో గొడవ పెట్టుకుని వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.హత్య కేసుగా దర్యాప్తు....మరి కిషోర్ ను హత్య చేసి వాటర్ ట్యాంకులో పడేశారా? ఎవరు వారు? హత్యకు కారణాలేంటి? అన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో మృతదేహం కలకలం రేపింది. హత్య చేసి వాటర్ ట్యాంకులో పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిషోర్ స్నేహితులు, సన్నిహితులను, బంధువులను విచారించే అవకాశముంది. |
https://www.telugupost.com/movie-news/the-entire-of-the-kadhanam-is-that-anusuya-is-a-key-character-129780/ | అనసూయ బుల్లితెర హాట్ యాంకర్. పెళ్ళైనా ఇప్పటికీ అనసూయని ఆరాధించే వారు కోకొల్లలు. మరి హీరోయిన్స్ చాలామంది మడికట్టుకుని… అందాల ఆరబోతలో ఆలోచిస్తారు కానీ.. పెళ్ళై పిల్లలున్న అనుసయ మాత్రం అందాల ఆరబోతకు ఆలోచనే చెయ్యదు. ఎలా కావాలంటే అలా చూపించేస్తుంది. ఇక బుల్లితెర మీద హాట్ హాట్ యాంగిల్స్ లో చంపేసే అనసూయ సోషల్ మీడియాలోనూ ఏ మాత్రం తగ్గదు. ఇక వెండితెర మీద మాత్రం కాస్త స్కోప్ ఉన్న పాత్రలు, డి గ్లామర్ పాత్రలే దొరుకుతున్నాయి అనసూయకి . ఓ క్షణం, ఓ రంగస్థలం, తాజగా కథనం సినిమా. కథనం సినిమా లో అనసూయ లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. ప్రమోషన్స్ లో…. అయితే సినిమామొత్తం అనసూయ కీలక పాత్ర కాబట్టి ప్రమోషన్స్ లో అనసూయ తప్ప కథనం డైరెక్టర్ గాని, అందులో నటించిన ధనరాజ్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ లు కనిపించని లేదు. కేవలం అనసూయ కథనం కర్త, కర్మ, క్రియ అన్నట్టుగా ప్రమోషన్స్ లో హాట్ హాట్ అందాలతో చెలరేగిపోయింది. ఇక అనసూయ ప్రమోషన్స్ మాత్రమే చాలనుకున్నట్లుగా ఉన్నారు. అనసూయ 12 కథలను రిజెక్ట్ చేసి మరీ కథనాన్ని చేసానని చెబుతుంది. మరి నాగార్జున మన్మధుడు 2 తో పోటీపడుతున్న కథనం టాక్ మరికాసేపట్లో తెలిసిపోతుంది. ఇక సినిమా హిట్ అయితే మళ్ళి అనసూయ తన ప్రమోషన్స్ తో సినిమాని ఇంకా ప్రమోట్ చేస్తుంది. లేదు సినిమా టాక్ తేడా కొడితే అనసూయ అందరిమీద తోసేసి సైలెంట్ అవుతోందో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/kiara-advani-tollywood-bollywood-movie-80366/ | బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కి ఈమధ్య బాగా కలిసొస్తుందని అర్ధం అవుతుంది. బాలీవుడ్ లో అంతంత మాత్రాన సినిమాలు చేస్తున్న టైంలో ఆమెకు టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె సీఎం గర్ల్ ఫ్రెండ్ గా బాగానే మెప్పించింది. ఆ సినిమా అవ్వగానే ఆమెకు నెట్ ఫ్లిక్స్ లో 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ మూవీ చేసే ఛాన్స్ వచ్చింది.ఆ వెబ్ మూవీలో ఆమె ఎంతలా బోల్డ్ గా నటించిందో మనకి తెలిసిందే. బాగా హాట్ గా యాక్ట్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. దాంతో ఆమెకు టాలీవుడ్ లో తెగ ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దింతో పాటు మరో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ లో నటిస్తుందంట.అయితే ఆ రెండు మూవీస్ కు సంబంధించి పూర్తి వివరాలు ఆఫిషల్ గా అనౌన్స్ చేయాల్సివుంది. బాలీవుడ్ లో ఎన్ని మంచి ఆఫర్స్ వచ్చిన టాలీవుడ్ లో సినిమాలు మాత్రం వదలటం లేదు. అటు బాలీవుడ్ లోను.. ఇటు టాలీవుడ్ లోను సమానంగా సినిమాలు చేసుకొస్తానంటోంది. ఒకప్పుడు ఇలానే ఇలియనా తెలుగులో కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్ లో ఆఫర్స్ రాగానే అటు వెళ్ళిపోయింది. అక్కడ రెండు మూడు సినిమా చేయగానే ఆమెను పట్టించుకునే వారు లేకపోయారు. కానీ ఈ విషయంలో కియారా మాత్రం ఇలియానా కన్నా తెలివిగానే ఆలోచిస్తోంది. |
https://www.telugupost.com/movie-news/why-ntr-is-silent-159395/ | ప్రస్తుతం కరోనా కన్నా పెద్ద హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే.. అది ఎన్టీఆర్ ఫాన్స్ కి నటి మీరా చోప్రా కి మధ్యన జరుగుతున్నా సోషల్ మీడియా యుద్ధం. మాజీ హీరోయిన్ మీరా చోప్రా ఎన్టీఆర్ అంటే నాకిష్టం లేదు.. నేను ఆయన అభిమానిని కాదు అన్నందుకు గాను.. ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది మీరా చోప్రా కి సోషల్ మీడియాలోనే చుక్కలు చూపెడుతున్నారు. మీరా చోప్రా పోలీస్ లకు ఫిర్యాదు చెయ్యడమే కాదు… తెలంగాణ మంత్రి కేటీఆర్ కి కూడా ట్విట్టర్ నుండి మెస్సేజ్ పెట్టింది. అయితే మీరా చోప్రా కి వ్యతిరేఖంగా ఎన్టీఆర్ అభిమానులకు తమిళ నటి ఖుష్బూ మద్దతు పలకడం… తాజాగా నటి పూనమ్ కౌర్ కూడా ఎన్టీఆర్ కి సపోర్ట్ గా మీరా కి కౌంటర్ వేయ్యడం,.. ఇలా సోషల్ మీడియా వ్యాప్తంగా రాద్ధాంతం జరుగుతుంది. ఇంతజరుగుతున్నా ఎన్టీఆర్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. కానీ అభిమానులకు ఓ సందేశం ఇవ్వడం లేదు. అభిమానులే తన బలం, వారికీ సదా రుణపడి ఉంటా అంటూ ఎప్పుడు చెప్పే ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా మౌనం గా ఉండడం చూస్తే మాత్రం.. ఎందుకు ఎన్టీఆర్ ఇలా చేస్తున్నాడనిపిస్తుంది. మరోపక్క మీరా చోప్రా ఎన్టీఆర్ ని టాగ్ చేస్తూ ఎన్టీఆర్ స్పందించాలని, అభిమానులను కంట్రోల్ లో పెట్టుకోవాలంటూ ట్వీట్ చేసింది. అయినా ఎన్టీఆర్ సైలెన్స్ నే మైంటైన్ చేస్తున్నాడు. మరోపక్క ఎన్టీఆర్ తన అభిమానుల విషయంలో మనస్తాపానికి లోనయ్యాడని.. ఇంత హాట్ గా ఉన్న టైం లో ఎన్టీఆర్ చెప్పినా అభిమానులు వినరనే ఉద్దేశ్యంతోనే మౌనంగా ఉన్నాడని చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/pawan-fans-pressure-on-dil-raju-180771/ | రెండు రోజుల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ జాతర హంగామా గంట గంటకి అందరిలో టెంక్షన్, క్యూరియాసిటీని పెంచేసింది. ఏ డేట్ లో ఏ సినిమా రిలీజ్ అవుతుందో? ఎవరి సినిమాతో ఎవరి సినిమా డేట్ క్లాష్ అవుతుందో? సినిమా సినిమాకి గ్యాప్ ఎంతుందో? అంటూ కేవలం దర్శకనిర్మాతలు కాదు ప్రేక్షకుల్లోనూ పిచ్చ టెంక్షన్ క్రియేట్ అయ్యింది. జనవరి 28 , 29 డేట్స్ టాలీవుడ్ లో ఎప్పటికి గుర్తుండిపోయే తేదీల మాదిరి రిలీజ్ డేట్స్ హంగామా జరిగింది. అయితే పాన్ ఇండియా ఫిలిం దగ్గరనుండి మీడియం బడ్జెట్ మూవీ అలాగే చిన్న సినిమాల డేట్స్ కూడా వదిలారు. కానీ ప్రభాస్, పవన్ కళ్యాణ్ లు ఈ రిలీజ్ డేట్స్ రేసులో వెనుకంజలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్దమయినా దిల్ రాజు వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇవ్వకుండా టెంక్షన్ పెంచేస్తున్నాడు. పవన్ కూడా పెద్దగా పని లేదు మనకెందుకు అన్నట్టుగా ఏకే రీమేక్ షూటింగ్ కి వెళ్ళిపోయాడు. ఇది ఎలాగూ రీమేక్ కనీసం శేఖర్ కే చంద్ర అయినా ఏకే రీమేక్ సినిమా రిలీజ్ డేట్ ఇస్తాడనుకుంటే.. పవన్ తో షూటింగ్ ఇప్పుడే డేట్ ఇవ్వడం కుదరదు అన్నట్టుగా ఉండిపోయాడు. మరోపక్క వకీల్ సాబ్ డేట్ కోసం పవన్ ఫాన్స్ దిల్ రాజు మీద దండెత్తినా పని జరగలేదు. దిల్ రాజు ఏదో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీకి స్టిక్ అవడం వలనే డేట్ ఇవ్వలేదని అంటున్నారు. మరి ఇప్పడు పవన్ ఫాన్స్ పవన్ మీద ఒత్తిడి పెంచుతున్నారు. వకీల్ సాబ్ కోసం ఏడాదిగా ఎదురు చేసూతున్నాం కనీసం ఇప్పటికైనా డేట్ ప్రకటించి మమ్మల్ని సంతోష పెట్టండి అంటూ పవన్ కే రిక్వెస్ట్ లు పెడుతున్నారట ఫాన్స్. |
https://www.telugupost.com/crime/conman-arrested-he-posed-as-doctor-on-matrimonial-websites-married-over-15-women-1484228 | మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్నాయి. మంచి అమ్మాయి భార్యగా రావాలని వెతుకుతున్నానంటూ.. మ్యాట్రిమోనీల ద్వారా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని.. అవసరం తీరాక వారిని వదిలేయడం ఈ నిత్యపెళ్లికొడుకు ప్లాన్. అలా ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 మందిని మోసం చేశాడు. ఇప్పటివరకూ నిత్యపెళ్లికొడుకు అవతారమెత్తిన ప్రబుద్ధులు ఉన్నారు కానీ.. వారంతా నాలుగైదు పెళ్లిళ్లకే దొరికిపోయారు. మనోడు మాత్రం 15 వరకూ వచ్చాడు. కొందరిని పెళ్లి చేసుకుని, మరికొందరితో నిశ్చితార్థం చేసుకుని డబ్బు అందగానే పరార్. వదిలేస్తే.. ఇంకా చేసుకుంటాడు కూడా. ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు మహేశ్ (35) ను కువెంపు నగర పోలీసులు అరెస్ట్ చేసి, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బనశంకరికి చెందిన మహేశ్.. తాను డాక్టర్ ని అంటూ షాదీ డాట్ కామ్ లో హేమలత (30) అనే యువతికి పరిచయమయ్యాడు. మైసూరు విజయనగరలో అద్దెకు తీసుకున్న ఇంటిని చూపించి.. సొంత ఇల్లు అని నమ్మించాడు. జనవరి 1వ తేదీన ఇద్దరూ విశాఖపట్నంలో పెళ్లి చేసుకుని.. మైసూరుకు వెళ్లి కాపురం పెట్టారు. తాను డాక్టర్ ని అని ముందే నమ్మించిన అతడు.. క్లినిక్ పెట్టేందుకు రూ.70 లక్షల నగదు అవసరం అవుతుందని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో చంపేస్తానని బెదిరించాడు. సందుచూసి బీరువాలో ఉన్న రూ.15 లక్షల విలువైన నగలు దొంగిలించి పరారయ్యాడు. భర్త తిరిగొస్తాడని ఎంత ఎదురుచూసిన అతని జాడ లేదు.ఇంతలో హేమలతను దివ్య అనే మరో మహిళ కలిసి.. మహేశ్ బాగోతాన్ని బయటపెట్టింది. అతడో వంచకుడని, తనను కూడా ఇలాగే పెళ్లిచేసుకుని మోసం చేశాడని చెప్పడంతో.. మహేశ్ పై కువెంపునగర పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆదివారం నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.2 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్ఫోన్లు, నగలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మహేశ్ ఇప్పటి వరకూ 15 మంది మహిళలను ఇదే తరహాలో మోసం చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/rakul-preet-singh-in-nagarjuna-manmadhudu-2-movie-129881/ | రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో ఉన్న ఏకైన సినిమా మన్మధుడు 2. ఇప్పుడు మన్మధుడు 2 కూడా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన మన్మధుడు 2 కి ప్రేక్షకులు యావరేజ్ టాక్ ఇచ్చారు. రాహుల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ నాగ్ సరసన టీనేజ్ అమ్మాయిలా నటించింది. మన్మధుడు 2 లో రకుల్ ప్రీత్ నాగార్జున కి అద్దెకొచ్చిన లవర్ అవంతిక పాత్రలో నటించింది. ఏజెడ్ హీరో నాగ్ సరసన రకుల్ టీనేజ్ అమ్మాయిగా బాగానే సెట్ అయ్యింది. అయితే సినిమాకొచ్చిన టాక్ వలన రకుల్ కి ఏం వరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే ఈ సినిమాలో నటన పరంగా నాగార్జున కన్నా రకుల్ ప్రీత్ సింగ్ కే ఎక్కువ మార్కులు పడతాయి. తొలిసగంలో అందాలు ఆరబోసినా.. టీనేజ్ అమ్మాయిగా కవ్వించే చూపులు విసిరినా…. క్లయిమాక్స్ లో ఎమోషన్ బాగా పండించింది. రకుల్ బోల్డ్ లుక్స్.. యాక్టింగ్ తో ఓకే అనిపించింది. గత సినిమాలతో పోలిస్తే రకుల్ భిన్నంగా కనిపించిందీ సినిమాలో. అయితే అవంతిక పాత్ర తేలిపోవడంతో రకుల్ ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ పర్వాలేదనిపించింది. ఇక సినిమాలో నాగార్జున తో రకుల్ కెమిస్ట్రీ కూడా పరవాలేదనిపిస్తుంది. మరి ప్రస్తుతం తెలుగులో ఏం సినిమాలు కూడా రకుల్ చేతిలో లేవు. తమిళనాట మాత్రం రెండు సినిమాల్లో రకుల్ నటిస్తుంది. ఇక మన్మధుడు 2 కూడా హిట్ కాకపోయేసరికి ఇపుడు రకుల్ పరిస్థితి ఏమిటా అని అందరూ తెగ చర్చించేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/ramcharan-next-movie-159635/ | RRR లో నటిస్తున్న రామ్ చరణ్ – ఎన్టీఆర్ లు తమ నెక్స్ట్ సినిమాల విషయంలో ఎన్టీఆర్ ఒక్కడే ఫుల్ క్లారిటీగా ఉన్నాడు…. త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ మూవీ మొదలు పెట్టేసాడు. కానీ రామ్ చరణ్ ఆచార్య సినిమాలో ఓ పాత్ర చెయ్యాలి కనక తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం, లేదు. రామ్ చరణ్ RRR, ఆచార్య తర్వాత ఏ డైరెక్టర్ తో చెయ్యబోతున్నాడో అనేది కనీసం చిన్న లీక్ కూడా లేదు. తన వద్దకు వచ్చే డైరెక్టర్స్ ని రామ్ చరణ్ తన తండ్రికి తగిలిస్తున్నాడు. అయితే తాజాగా రామ్ చరణ్ నెక్స్ట్ డైరెక్టర్ విషయం ఇంకా సస్పెన్స్ లోనే ఉండగా.. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కథ పై సోషల్ మీడియాలో ఓ పుకారు మొదలైంది. రామ్ చరణ్ RRR లో అల్లూరి పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే తన నెక్స్ట్ మూవీ లో రామ్ చరణ్ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ పాత్రే చేయబోతున్నాడని… ఆస్థి కోసం ఓ పాపను వెంటాడే గ్యాంగ్ నుండి కాపాడే పోలీస్ గా రామ్ చరణ్ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరి ఏ డైరెక్టర్ ఈ కథ చరణ్ కి చెప్పాడో తెలియదు కానీ… ఈ కథలోనే రామ్ చరణ్ నటించబోతున్నాడని న్యూస్ మాత్రం కరెక్ట్ అంటారా.. ఏమో చూడాలి ఇందులో నిజమెంతుందో అనేది. ఇక ఆచార్య లో రామ్ చరణ్ పాత్ర అద్భుతంగా ఉంటుంది అని… ఆచార్య కె రామ్ చరణ్ పాత్ర హైలెట్ అంటున్నారు. |
https://www.telugupost.com/crime/anger-on-his-wife-father-took-shocking-decision-on-children-khammam-district-1484388 | ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యతో ఉన్న విబేధాల నేపథ్యంలో ఓ తండ్రి కన్న బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. మధిర మండలం రాయపట్నం గ్రామానికి చెందిన పార్షపు శివరామ గోపాల్, మార్తమ్మ దంపతులు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తరచుగా ఈ దంపతుల మధ్య గొడవలే. ఇటీవల శివరామగోపాల్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. మూడు రోజుల కిందటే విడుదలై వచ్చాడు. భార్య మార్తమ్మ రాయపట్నం గ్రామంలోనే ఉన్న పుట్టింట్లో ఉంటుంది. జైలు నుండి వచ్చిన తర్వాత మళ్లీ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. కోపం పెంచుకున్న శివరామ గోపాల్ తన బిడ్డలైన రామకృష్ణ (8), ఆరాధ్య (6)లను చంపేశాడు.రామకృష్ణ , ఆరాధ్య లు రాయపట్నం ప్రభుత్వ పాఠశాలలో 3, 1 తరగతులు చదువుతున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాలకు వెళ్లిన శివరామగోపాల్ పిల్లల్ని తనతో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోనే వారి గొంతు నులిమి చంపేసి, శవాలను దుప్పట్లో మూటకట్టి పరారయ్యాడు. పిల్లలను తీసుకొచ్చేందుకు మార్తమ్మ పాఠశాలకు వెళ్లగా వాళ్ల నాన్న వచ్చి తీసుకెళ్లాడని సిబ్బంది తెలిపారు. మార్తమ్మ ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. అనుమానం వచ్చిన మార్తమ్మ చుట్టుపక్కల వారి సహాయంతో ఇంటి తాళం పగలగొట్టింది. లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు పిల్లలు దుప్పట్లో చుట్టేసి ఉండడాన్ని గుర్తించారు. వైద్యులను సంప్రదించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించారు. పిల్లల మృతదేహాలని మధిర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివరామ గోపాల్ కోసం గాలిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/ఓం-కార్-ఆ-స్టార్-ని-పటాయిస-46171/ | జీనియస్ సినిమాతో దర్శకుడిగా ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓం కార్ ఆ సినిమా ప్లాప్ తో.. మరొక సినిమా చెయ్యడానికి బాగా గ్యాప్ తీసుకున్నాడు. తర్వాత తన తమ్ముడు అశ్విన్ ని హీరోగా పెట్టి రాజుగారి గదిని తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఆ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా.... అదిరిపోయే కామెడీ ఉండడంతో భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇక హర్రర్ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు మొహం మొత్తడం మొదలయ్యాక చిన్న స్టార్స్ తో సినిమా తీస్తే లాభం లేదని గుర్తించిన ఓం కార్ ఏకంగా సీనియర్ హీరో నాగార్జునని... టాప్ హీరోయిన్ సమంతని ఒప్పించి మరీ ఓంకార్ రాజు గారి గది 2 ని తెరకెక్కించాడు. మరి యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఓం కార్ ఇప్పుడు దర్శకుడిగా సక్సెస్ సాధించేసాడు. రాజుగారి గది 2 సినిమా పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. నాగార్జున, సమంత లతో ఓం కార్ మంచి హిట్ కొట్టేసాడనే టాక్ బయలుదేరింది. మరి ఓం కార్ నెక్స్ట్ సినిమా ఏంటంటూ అప్పుడే చర్చలు మొదలైపోయాయి. ఈ సినిమా హిట్ తో ఇప్పుడు ఓం కార్... మెగా ఫ్యామిలీ హీరో అయిన రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడని... ఇప్పటికే స్టోరీ లైన్ సిద్ధం చేసుకున్నాడని... ఈ సినిమాతో తన ట్యాలెంట్ ని మరింతగా చూపించడానికి ఓం కార్ రెడీ అవుతున్నట్టుగా వార్తలు ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి.మరి రామ్ చరణ్ కూడా యంగ్ డైరెక్టర్స్ ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటాడు. అందుకే చరణ్ ఇప్పుడు ఓం కార్ ని కలిసి స్టోరీ డిస్కషన్ కి కూడా ఒకే చెప్పసాడనే టాక్ వినబడుతుంది. మరి రాజుగారి గది 2 సినిమా అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ.. భారీగా పెట్టిన బడ్జెట్ తెస్తుందా అనే అనుమానంలో చాలామందే ఉన్నారు. నాగార్జున, సమంత ల ఎంట్రీతో ఈ సినిమాకి భారీగానే బడ్జెట్ ఎక్కింది. దాదాపు ఈ సినిమాకి 25 కోట్లు బడ్జెట్ ఎక్కినట్టుగా సమాచారం. మరి సినిమా గనక పెట్టిన బడ్జెట్ తెచ్చేసి.. లాభాల పంట పండిస్తే మాత్రం ఖచ్చితంగా ఓం కార్ కి రామ్ చరణ్ అవకాశమిస్తాడంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/director-tatineni-ramarao-passes-away-1365745 | హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ 'యమగోల' సినిమాకు తాతినేని దర్శకత్వం వహించారు.ఆయన వయసు 84 సంవత్సరాలు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రామారావు 'నవరాత్రి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరిచయమయ్యారు. తాతినేని 70కిపైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో యమగోల, జీవనతరంగాలు, దొరబాబు, ఆలుమగలు, అనురాగదేవత, న్యాయానికి సంకెళ్లు వంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. రాజేంద్రప్రసాద్‌తో గోల్‌మాల్ గోవిందం, సూపర్‌స్టార్ కృష్ణతో అగ్నికెరటాలు వంటి సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో నవరాత్రి, బ్రహ్మచారి, సుపుత్రుడు, రైతు కుటుంబం, దొరబాబు, ఆలుమగలు, శ్రీరామరక్ష, యమగోల, ఆటగాడు, అనురాగ దేవత, జీవనతరంగాలు, ఇల్లాలు, తల్లదండ్రులు, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి వంటి విజయవంతమైన సినిమాలు ఆయన దర్శకత్వంలో తెరకెక్కినవే. వీటితోపాటు హిందీలో లోక్-పరలోక్, అంధా కానూన్, ఇంక్విలాబ్, బేటీ నవంబర్ వన్ వంటి సినిమాలను రూపొందించారు. తాతినేని మృతికి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. |
https://www.telugupost.com/crime/even-if-she-doesnt-like-it-wife-was-angry-with-her-husband-who-tried-to-have-sex-by-force-1343800 | తనకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించిన భర్తపై భార్య(24) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపం పట్టలేక అతని మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని టీకంగఢ్ జిల్లాలోని రామ్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ నెల 7వ తేదీ జరిగిన ఈ ఘటన భర్త ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులొకిచ్చింది. జాతర పోలీస్ స్టేషన్ అధికారి తివేంద్ర త్రివేదీ తెలిపిన వివరాల మేరకు రామ్ నగర్ లో బాధిత భర్త (26) భార్యతో కలిసి ఉంటున్నాడు.ఇష్టం లేకుండా...ఆదివారం అతను ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. " నా భార్యకు ఇష్టం లేనప్పటికీ శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించా. దీంతో ఆమె ఈ ఘోరానికి పాల్పడింది" అని బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2019లో వారికి వివాహం జరగ్గా.. కొన్ని గొడవల కారణంగా విడిపోయారు. పెద్దలు సర్దిచెప్పడంతో ఇటీవలే ఈ జంట మళ్లీ కలిశారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని ఆయన వివరించారు. కాగా.. ఘటనానంతరం భర్త శస్త్ర చికిత్స చేయించుకుని ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా తెలిసిందని త్రివేదీ వివరించారు. |
https://www.telugupost.com/politics/ycp-chief-ys-jagan-will-release-the-manifesto-at-a-public-meeting-in-raptadu-on-18th-of-this-month-1520389 | మ్యానిఫేస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని తరచూ చెప్పే వైసీపీ అధినేత జగన్ దానిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 18వ తేదీన మ్యానిఫేస్టోను విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు. రాయలసీమలో జరగనున్న సిద్ధం సభలో ఈ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. 18వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే జగన్ మ్యానిఫేస్టోను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఆయనతో పాటు ఒక టీం మ్యానిఫేస్టో రూపకల్పనలో కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే టీడీపీ తొలి విడత మ్యానిఫేస్టో విడుదల చేయడంతో జగన్ మ్యానిఫేస్టోలో ఏ అంశాలుంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.రాప్తాడు సభలో...సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు తన తొలి విడత మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఆరు గ్యారంటీలను ప్రజల ముందు ఉంచారు. మహిళలు, యువత, బీసీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా చంద్రబాబు తొలి విడత మ్యానిఫేస్టో విడుదలయింది. దీనికి సూపర్ సిక్స్ గా నామకరణం చేశారు. మలి విడత మ్యానిఫేస్టో ప్రకటన కూడా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. పొత్తులతో ఉన్న భాగస్వామ్య పార్టీలతో కలసి చంద్రబాబు రెండో విడత మ్యానిఫేస్టోను అతి త్వరలోనే విడుదల చేయనున్న నేపథ్యంలో జగన్ ఈ నెల 18వ తేదీన రాప్తాడులో జరిగే సిద్దం సభలో విడుదల చేయనున్న మ్యానిఫేస్టోలో ఏ ఏ అంశాలుంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.రైతు రుణమాఫీ....గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేశామని చెప్పుకునే జగన్ ఈసారి ఎన్ని హామీలను ప్రజలకు ఇస్తారన్నది అందరిలోనూ ఆసక్తిరేపుతుంది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా 2.50 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారులకు అందచేశామని చెబుతున్న జగన్ సర్కార్ ఈసారి రైతులు, ఉద్యోగులు, మహిళలు లక్ష్యంగా మ్యానిఫేస్టోను రూపొందిస్తున్నట్లు తెలిసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉండే అవకాశముందని తెలిసింది. అలాగే రెండు లక్షల వరకూ రైతు రుణ మాఫీని జగన్ ప్రకటిస్తారని అంటున్నారు. ఉద్యోగులకు కూడా వరాలను ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం.సామాజికవర్గాల వారీగా...సామాజికవర్గాల వారీగా ఆకట్టుకునే విధంగా ప్రకటన ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీసీ మంత్రం జపిస్తున్న వైఎస్సార్ పార్టీ ఈ మ్యానిఫేస్టోలో కూడా వారికే అగ్రస్థానం కల్పిస్తూ అనేక హామీలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీంతో పాటు మైనారిటీలు, ఎస్సీల సంక్షేమంతో పాటు ప్రాంతాల వారీగా కొన్ని హామీలను వైసీపీ మ్యానిఫేస్టోలో చోటు కల్పించాలని నిర్ణయించారు. మ్యానిఫేస్టో ఒక పేజీ కంటే ఎక్కువ ఉండకూడదని మాత్రం జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఒక టీం మాత్రం దీనిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మ్యానిఫేస్టో రూపకల్పనకు జగన్ నడుంబిగించారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ మ్యానిఫేస్టో కోసం ఇటు రాజకీయ పార్టీలేకాదు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/తెలుగు-అమ్మాయి-తమిళ-ఇంటి-27900/ | తెలుగు అమ్మాయి అంజలిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన తమిళ చిత్రం జర్నీ. ఆ చిత్రంలో అంజలికి జంటగా నటించిన తమిళ యువ కథానాయకుడు జై తో అంజలి వ్యక్తిగతంగా బాగా చనువుగా ఉంటోందని గత కొద్ది నెలలుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ కోలీవుడ్ పెయిర్ గురించి ప్రస్తావించని తమిళ మీడియా ఛానల్ ఉండదేమో. అంతలా పబ్లిసిటీ పొందిన ఈ ప్రేమ జంట మాత్రం తమ మధ్య వున్న బంధానికి ఎటువంటి పేరుని ఆపాదించుకోకుండా ఏ ఇంటర్వ్యూ లో ఈ విషయమై ప్రశ్న ఎదురైనా సమాధానం చెప్పకుండా దాట వేస్తూ వస్తున్నారు. ఆ మధ్య జై ఇంట్లో వంట చేస్తూ దొరికిన అంజలి వీడియోస్ ని చూసి వీరిద్దరూ ఇప్పటికే సహజీవనం చేస్తున్నారనే టాక్ కూడా వచ్చింది.అయితే కొద్ది రోజుల క్రిందట ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అంజలి ఈ విషయమై స్పందిస్తూ తనకి జై కి మధ్యన వున్న అనుబంధంపై వస్తున్న వార్తలన్నీ ఖండించింది. మీడియాలో వచ్చే వార్తలనే నమ్మితే ఇప్పటికే తనకి ఒక నిర్మాతతో వివాహం పూర్తయిపోయింది అని కూడా నమ్మాలి కదా అని ఎదురు ప్రశ్నించింది. ఆ మధ్య అంజలి సినీ పరిశ్రమకి చెందిన ఓ నిర్మాతని వివాహమాడిందనే పుకార్లు హల్చల్ చేసిన సంగతి విదితమే. అప్పటికి చిత్రంగధ ప్రమోషన్ కోసం ఒకింత ఘాటుగా ఈ ప్రశ్నని మలుచుకున్నప్పటికీ అంజలికి ఇదేమి కలిసిరాలేదు. అయితే ఇప్పుడు అంజలి సన్నిహితులు మాత్రం ఇప్పటికే వీరి ప్రేమాయణం పెద్దల వరకు చేరిందని, వారందరి సమ్మతితోనే వచ్చే ఏడాది ఆఖరు లోపు అంజలికి జై తో వివాహం జరుగుతుందని చెప్తున్నారు. మరి అంజలి ఈ విషయమై ముహుర్తాలు ఖరారు అయ్యే వరకు వాస్తవాలు వెల్లడించదేమో. |
https://www.telugupost.com/movie-news/kadambari-kiran-helped-senior-actress-pavala-syamala-through-manam-saitham-1513485 | Pavala Shyamala : ఒకప్పటి తెలుగు చిత్రాల్లో లేడీ కమెడియన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాలు చేసిన నటి పావలా శ్యామల.. గత కొంతకాలం అనారోగ్యం, ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయసు సహకరించక సినిమాలకు దూరమైన శ్యామల.. ఇటు తన అనారోగ్యంతో, అటు కూతురు అనారోగ్యం సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధాశ్రమంలో దీనస్థితిలో జీవనం సాగిస్తూ వస్తున్నారు.ఇక ప్రస్తుతం శ్యామల పరిస్థితిని ఒక మీడియా ద్వారా తెలుసుకున్న నటుడు కాదంబరి కిరణ్.. ఆమెకు ఆర్ధిక సాయం అందించారు. తెలుగు నటుడు కాదంబరి కిరణ్ ‘మనం సైతం' అనే ఫౌండేషన్ ద్వారా గత 10 ఏళ్ళ పై నుంచి.. సినీ పేద కార్మికులకు, కష్టాల్లో పేదలకు సహాయం చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు శ్యామల పరిస్థితి తెలుసుకున్న కాదంబరి కిరణ్.. ఆమెను వెతుకుంటూ వెళ్లి సహాయం చేశారు.హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న పావలా శ్యామలని కలుసుకొని ఆమె రూ.25,000 నగదుని చెక్ రూపంలో అందించి సహాయం చేశారు. ఆమెకు కావాల్సిన కనీస అవసరాలు, మెరుగైన వైద్యం కలిగేలా చేయూతని అందించారు. ఇక ఒకప్పుడు అందర్నీ నవ్వించిన నటి శ్యామలని ఈ పరిస్థితిలో చూసిన ఆడియన్స్ తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. అలాగే సహాయం అందించిన కాదంబరి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. |
https://www.telugupost.com/politics/why-is-congress-interested-in-sending-ys-sharmila-to-andhra-pradesh-1482497 | వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఆమె పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ వారంలో చర్చల కోసం ఆమె న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని దాదాపు నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే, షర్మిల తెలంగాణపై మాత్రమే ఆసక్తి చూపుతుండగా, తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీల పాత్ర పోషించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తనను ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా చేయాలనే ప్రతిపాదన ఉందని, కర్ణాటక నుంచి తనకు కాంగ్రెస్ రాజ్యసభ టిక్కెట్టు ఆఫర్ చేశారంటూ వచ్చిన వార్తలను ఆమె బహిరంగంగానే కొట్టిపారేశారు. తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడం కోసం తానెప్పుడూ కట్టుబడి ఉన్నానని, ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని ఆమె పునరుద్ఘాటించారు. తన భవిష్యత్తు తెలంగాణా ప్రజలతోనే ఉంది అని ఆమె అన్నారు. షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అధిష్టానం ధీమాగా ఉన్నట్లు సమాచారం. భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్‌ఎస్) చంద్రబాబు నాయుడుని ఆంధ్రా నాయకుడిగా చూపి తెలంగాణ సెంటిమెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకుని మళ్లీ అధికారంలోకి వచ్చింది. షర్మిల తెలంగాణా కాంగ్రెస్‌లో చేరితే బీఆర్‌ఎస్ మళ్లీ అదే సెంటిమెంట్‌ను ప్లే చేసే అవకాశం ఉంది, ఎందుకంటే షర్మిలను ఆంధ్రాలో ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి అని. అందుకే షర్మిల ఆంధ్రాకు వెళ్లి వైఎస్‌ఆర్ సెంటిమెంట్‌ను పుణికి పుచ్చుకుని పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఆ ప్రయత్నంలో విజయం సాధించకున్నా, ఆమె రాజకీయ ప్రయోజనాలను పార్టీ కాపాడుతుందని హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే షర్మిల దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. |
https://www.telugupost.com/movie-news/ఏడాది-తరువాత-అమ్మడి-చూపు-22327/ | 2016 జనవరి నెలలో విడుదలైన జై గంగాజల్ చిత్రం తరువాత బాలీవుడ్ ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్ర ఇతర ఇండియన్ ఫిలిమ్స్ కి సంతకం చేయలేదు. గత ఏడాది నుంచి హాలీవుడ్ టెలి సిరీస్ క్వాన్టికో లో నటిస్తూ బిజీ అయిపోయిన ప్రియాంక చోప్రా తన మకాం కూడా బొంబాయి నుంచి న్యూయార్క్ కి మార్చేసి అక్కడే నివాసం ఉంటోంది. ఈ ఏడాది కాలంలోనే బేవాచే అనే ఆంగ్ల చిత్రంలోనూ ప్రియాంక చోప్రా నటించింది. ఈ చిత్రం ఇదే ఏడాది మే నెలలో విడుదల కాబోతోంది. 2016 లో జై గంగాజల్ అనంతరం న్యూయార్క్ వెళ్లిపోయిన ప్రియాంక ఈ ఏడాది కాలంలో అస్సాం రాష్ట్ర పర్యాటక శాఖతో బ్రాండ్ అంబాసడర్ గా కుదుర్చుకున్న ఒప్పొందం కారణంగా ఆ ప్రకటనలలో నటించటానికి మాత్రమే ప్రియాంక ఇండియా విచ్చేసింది తప్ప గత ఏడాది జనవరి నుంచి నేటి వరకు ప్రియాంక చోప్రా ఒక్క బాలీవుడ్ వేడుకకి కూడా హాజరు కాలేదు.2015 లో విడుదలైన చారిత్రాత్మక చిత్రం బాజీరావు మస్తానీ చిత్రంతో దర్శకుడు సంజయ్ లీల బన్సాలి తో తొలిసారి పనిచేసిన ప్రియాంక చోప్రా ఇప్పుడు మరోసారి బన్సాలి దర్శకత్వంలో పనిచేయటానికి తిరిగి బాలీవుడ్ రానుంది. ప్రస్తుతం దీపికా పదుకొనె టైటిల్ రోల్ పోషిస్తున్న పద్మావతి చిత్రీకరణలో నిమగ్నమైన సంజయ్ లీల బన్సాలి తన తదుపరి చిత్రంగా తాను చదివిన ఒక పుస్తకం ఆధారంగా సినిమా చేయనున్నారట. ఆ చిత్రంలో కథానాయిక పాత్రని ప్రియాంక చోప్రాతోనే నటింపచేయాలని నిశ్చయించుకున్న బన్సాలి తన చిత్రానికి కథ తయారు కానప్పటికీ, ప్రియాంక కి ఆ పుస్తకాన్ని నేరేట్ చేసాడట. బన్సాలి నేరేషన్ కి పూర్తిగా కన్విన్స్ అయిపోయిన ప్రియాంక ఆయన పై వున్న నమ్మకంతో కథ తో రానప్పటికీ బన్సాలి తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. పద్మావతి చిత్రం నుంచి ఫ్రీ ఐన అనంతరం బన్సాలి ప్రియాంక చోప్రా ప్రధాన కథానాయికగా తెరకెక్కించబోయే చిత్రం స్క్రిప్ట్ పై పని చేయనున్నారట. |
https://www.telugupost.com/movie-news/జాగ్వార్-పై-పంపిణీదారులక-4799/ | సినిమా పరిశ్రమలో పలుకుబడి ఉన్న వాళ్ళు, రాజకీయ పరపతి ఉన్న వాళ్ళు వారి వారి వారసులని పరిచయం చేసే సినిమాలకు పరిమితికి మించి ఖర్చు చేయటం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ప్రముఖ చలన చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయ చిత్రానికి తన సొంత డబ్బుని భారీగా ఖర్చు చేసి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నటి తమన్నా భాటియా చేత ప్రేత్యేక గీతం చేపించారు. పరిమితికి మించిన వ్యయం కారణంగా ఆ చిత్రం ఆర్ధిక నష్టాలూ చెవి చూసింది. అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తొలి చిత్రం అఖిల్ కూడా వినాయక్ దర్శకత్వంలో పరిచయ నటుడి మార్కెట్ పరిధికి మించిన వ్యయంతో తెరకెక్కి ఘోర పరాజయం చెందింది.ఈ విజయ దశమి పండుగకు విడుదల కానున్న జాగ్వార్ చిత్ర కథానాయకుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి మనువడు అని తెలిసిన విషయమే. నిఖిల్ పరిచయ చిత్రం ఐన జాగ్వార్ 75 కోట్ల భారీ వ్యయంతో నిర్మితం కావటం, పైగా తమన్నా ప్రత్యేక గీతం కూడా ఉండటం ఈ చిత్ర పంపిణీదారులకు దడ పుట్టిస్తుంది. ఈ నెల 6 వ తారీకున విడుదల కానుంది ఈ చిత్రం. మరుసటి రోజున నాగ చైతన్య నటించిన ప్రేమమ్, సునీల్ నటించిన ఈడు గోల్డ్ ఎహె, ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన మన ఊరి రామాయణం, ప్రభు దేవా తమన్నాల అభినేత్రి విడుదల కానున్నాయి.నాలుగు చిత్రాల పోటీ ని తట్టుకుని జాగ్వార్ ఏ మేరకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో చూడాలి. జాగ్వార్ చిత్ర దర్శకుడు మహాదేవ్ గతం లో తన తొలి చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన మిత్రుడు చిత్రానికి దర్శకత్వం వహించారు. జాగ్వార్ దర్శకుడిగా ఆయనకు రెండవ చిత్రం. |
https://www.telugupost.com/movie-news/అక్కడ-పూర్తయిపోయింది-మర-35960/ | బాలీవుడ్ లో ఫేమస్ అయిన బిగ్ బాస్ షోని కోలీవుడ్, టాలీవుడ్ లలోకి దించుతున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. కానీ తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా ఈ షో అప్పుడే గ్రాండ్ గా లాంచ్ చేసుకుని పార్టిసిపేట్స్ ఇంట్రడక్షన్స్ కూడా పూర్తి చేసుకుంది. ఇంకా తెలుగులో అయితే పార్టిసిపేట్స్ ఎంపిక పూర్తికాలేదుగాని తమిళంలో ఎప్పుడో పూర్తైపోయిందని కోలీవుడ్ పార్టిసిపేట్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. కమల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో లో మొత్తం 15 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే బాలీవడ్ లో ఫెమస్ మోడల్స్ గట్రా ఈ షో లో పార్టిసిపేట్ చేసారు గాని సౌత్ లో అలాంటి వారెవరు కనబడంలేదు. అందుకే కోలీవుడ్ బిగ్ బాస్ పార్టిసిపేట్స్ ని చూస్తుంటే అబ్బో అనే రీతిలో ఎవరూ లేరు. ఇక కోలీవుడ్ బిగ్ బాస్ పార్టిసిపేట్స్ వివరాలు ఇలా వున్నాయి. శ్రీ, అనుయ, వైయాపురి,గాయత్రి రఘురాం, భరణి, రైజా,స్నేహన్, ఒవియా, హారతీ గణేష్,ఆరర్, గంజా కరుప్పు,జులియానా, గణేష్ వెంకట్రామ్, శక్తి , నమితలు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇక వీరందరిలో ముఖ్యంగా మనం నమిత గురించే చెప్పుకోవాలి. కోలీవుడ్ తోబాటు టాలీవుడ్ కి పరిచయమైన నమితకు ఇప్పుడు తెలుగులోకాని, తమిళంలోకాని అవకాశాలు లేక పాపంఖాళీగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ షో తమిళంలోనే గనక నమిత ఈ షోతో మరింత పాపులర్ అయిపోదామని ఈ షోలో పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. ఎలాగూ తమిళులకు నమిత అంటే ఇష్టం కాబట్టి ఈ షోలో సెలెక్ట్ చేశారన్నమాట. ఇక ఇందులో వీరంతా ఈ బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొని అక్కడిఅందరిని ఓడించి ప్రైజ్ మెనీ కొట్టేయాలని చూస్తున్నారు. |
https://www.telugupost.com/crime/tragedy-took-place-in-gujarat-incident-of-seven-deaths-in-the-same-family-was-filled-with-tragedy-1535677 | గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి ఏడుగురు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఈతకు వెళ్లి వీళ్లంతా మరణించారు. మృతుల్లో పెద్దల నుంచి చిన్నారుల వరకూ ఉన్నారు. నర్మదానదిలో దిగిన ఏడుగురు నదీ ప్రవాహానికి కొట్టుకుపోయారు. బాధితులు సూరత్ నంచి నర్మదా పోయిచా వద్దకు పర్యాటక బృందంలో సభ్యులుగా పోలీసులు గుర్తించారు.నదిలోకి దిగి...ఏడుగురు ఈతకొట్టేందుకు నదిలో దిగి ప్రవాహానికి కొట్టుకుపోయారని తెలిపారు. సమ్మర్ లో పిక్నిక్ కోసం ఈ ప్రాంతానికి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. అందులో భాగంగా వచ్చి ఇక్కడ వాళ్లు నదిలో ఈత కొట్టడానికి దిగి కొట్టుకుని పోయారని, మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టానమి పోలీసులు తెలిపారు. |
https://www.telugupost.com/crime/bus-going-from-andhra-pradesh-to-sabarimala-fell-into-the-valley-some-people-got-serious-injuries-in-this-accident-1448863 | ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల వెళుతున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళుతున్న బస్సు పతనంతిట్ట వద్ద లోయలో పడిందని అధికారులు తెలిపారు.ముగ్గురి పరిస్థితి విషమం...ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి బస్సు లోయలో పడినట్లు తెలిసింది. బస్సు ఎక్కడి నుంచి బయలుదేరింది? అన్న సమాచారం తెలియాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/naa-peru-surya-allu-arjun-2-68933/ | ఇప్పుడు ఏ ఒక్క సినిమా విడుదలైన ఆ సినిమా ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చేస్తున్నారు. తమ సినిమా మీద ప్రేక్షకులకు బాగా ఆసక్తి కలిగించాలి అంటే ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చెయ్యాలని దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఫిక్స్ అవడం.. ఒక రేంజ్ లో తమ సినిమాలను ప్రమోట్ చెయ్యడం వంటివి ఇప్పుడు కామన్ అయ్యింది. కేవలం బడా సినిమాలే ఇలా చెయ్యడం లేదు. చిన్న సినిమాల నిర్మాతలు కూడా తమ సినిమాల మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించేందుకు పబ్లిసిటీకి కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందులో భాగంగానే ప్రింట్ మీడియా కి, ఛానల్స్ కి, వెబ్ మీడియా కి ఆయా సినిమాల యాడ్స్ ని ఇవ్వడమే కాదు... తమ సినిమాల మీద పాజిటివ్ గా న్యూస్ లు రాపిస్తూ... తమ సినిమా యాడ్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.యాడ్స్ ఇవ్వకుండా....ఇలా సినిమాలు భారీ రేంజ్ లో హిట్ అవుతున్నాయి అంటే... అందులో మెయిన్ గా పబ్లిసిటీనే కారణమవుతున్నాయి. అయితే రామ్ చరణ్ రంగస్థలం, మహేష్ భరత్ అనే నేను సినిమాలకు ఈ పబ్లిసిటీ చాలా ఉపయోగపడింది. సినిమాకి ఎంతగా పాజిటివ్ టాక్ వచ్చినా మౌత్ టాక్ కూడా చాల అవసరం. అయితే ఇప్పుడు నా పేరు సూర్య విషయం లో ఈ పబ్లిసిటీ విషయంలో నిర్మాతలు నాగబాబు , శ్రీధర్ లు మాత్రం నా పేరు సూర్య పబ్లిసిటి విషయంలో ఎందుకో సఫర్ అవుతున్నారు. అదేమిటంటే ప్రస్తుతం శ్రీరెడ్డి, పవన్ ఇష్యుతో సినిమా ప్రముఖులు ఎడతెగని చర్చలు జరిపి కొన్ని ఛానల్స్ ని బ్యాన్ చేస్తున్నారనే టాక్ రావడమే కాదు.. ఆయా ఛానల్స్ కి ముఖ్యమైన యాడ్స్ ని ఆపేసారు కూడా. ప్రముఖ ఛానల్స్ కి ఈసారి నా పేరు సూర్య యాడ్స్ ఇవ్వలేదు. ఛానల్స్ లో తమ సినిమాకి పబ్లిసిటీ చేస్తే చాలనుకుని లెవల్లో ఉన్న నిర్మాతలు ఇప్పుడు సినీ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవడానికి రెడీ అయ్యారు.తప్పుచేశారా?మరి ఇలాంటి టైం లో నా పేరు సూర్య యాడ్స్ ఇవ్వకుండా ఆపి సూర్య నిర్మాతలు ఏదన్నా తప్పు చేసారా అనిపిస్తుంది. ఎందుకంటే రోజూ ప్రజలు తిలకించే ఛానల్స్ లో నా పేరు సూర్య గురించిన యాడ్స్ గాని.. సినిమాకి సంబందించిన పబ్లిసిటి కానీ ఎక్కడా కనబడడం లేదు. మరి ఈ లెక్కన నాగబాబు, శ్రీధర్ లు కావాలనే ఆయా ఛానల్స్ వారిని అవాయిడ్ చేసినట్లుగా అనిపిస్తుంది. మరి ఇలా ఇప్పుడు అవాయిడ్ చెయ్యడం వలన నా పేరు సూర్య కి ఏమన్నా దెబ్బపడే అవకాశం ఉందా అనేది ప్రస్తుతం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆ బడా ఛానల్స్ కి కూడా ఆయా సినిమాల యాడ్స్ తగ్గితే అది పెద్ద దెబ్బె అని చెప్పాలి. |
https://www.telugupost.com/movie-news/bigg-boss-5-season-goes-juicy-202966/ | బిగ్ బాస్ 5 సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం ఎలమిలనేషన్ లో ప్రియాంక, శ్రీరామచంద్ర, ప్రియ, మానస్, లహరి ఉన్నారు. వీరిలో శనివారం ప్రియాంక, శ్రీరామచంద్రలు సేవ్ అయ్యారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు ఈరోజు ఎలిమినేట్ కానున్నారు. అందులో మానస్, లహరి స్ట్రాంగ్ గా కన్పిస్తున్నారు. గత వారం వివాదం కావడం ప్రియకు మైనస్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈవారం హౌస్ నుంచి బయటకు వచ్చేది ప్రియ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. |
https://www.telugupost.com/movie-news/బాలయ్య-జై-సింహ-టీజర్-ఎలా-వ-53525/ | బాలకృష్ణ - కె ఎస్ రవికుమర్ కాంబినేషన్ లో వస్తున్న.. జై సింహ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. సినిమాని జనవరి 12 న విడుదల చేస్తామని మూవీ యూనిట్ ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు పాటల చిత్రీకరణలోనే బిజీగా వుంది. తాజాగా జై సింహ ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టిన మూవీ యూనిట్ ఇప్పుడు గత రెండు రోజుల నుండి బాలకృష్ణ తో కూడిన జై సింహ పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు జై సింహ టీజర్ ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం.బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి,హరిప్రియ లు నటిస్తున్న ఈ మూవీ టీజర్ లో బాలకృష్ణ ఉగ్ర రూపాన్ని చూపించేసాడు. డైలాగ్ తో ఇరగదీసాడు. అసలు బాలయ్య బాబు సినిమా అంటేనే.. యాక్షన్ సీన్స్ కి, పవర్ ఫుల్ డైలాగ్స్ కి పెట్టింది పేరు. మరి జై సింహ లో కూడా అలాంటి యాక్షన్ సీన్స్ ని, పవర్ ఫుల్ డైలాగ్స్ తోనే నింపేశారు. యాక్షన్ సీన్స్ లో రౌడీలను ఎడా పెడా బాదేస్తూ బాలయ్య బాబు విశ్వ రూపాన్ని చూపించడమే కాదు.. హీరోయిన్ నయనతార, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా అలా వచ్చి ఇలా మాయమయ్యారు. మరి బాలకృష్ణ సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు... సైలెంట్ గా ఉంది కదా అని కెలికితే తలకొరికేస్తుంది.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో అలరించేసాడు. మరి నందమూరి అభిమానులు బాలయ్య సినిమా అంటే ఎలా ఉండాలి అని కోరుకుంటారో ఈ జై సింహ కూడా అలానే ఉండబోతుందనేది ఈ టీజర్ లో తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన చిత్తరంజన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరింది. ఇక జై సింహ ఆడియో వేడుక ఈ నెల 24 న విజయవాడలో జరగనుంది |
https://www.telugupost.com/movie-news/rajinikanth-petta-collections-104784/ | ప్రస్తుతం రజినీకాంత్ మార్కెట్ కి ఓ అన్నంత క్రేజ్ లేదు. ఎందుకంటే ఆయన.. గత ఏడెనిమిదేళ్ళుగా హిట్ కొట్టిన సందర్భమే లేదు. రోబో సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ రజినీకాంత్ కొట్టలేకపోయాడు. కనీసం మొన్న విడుదలై 2.0 సినిమాని కొన్న బయయ్ర్లు కూడా బాగా లాస్ అయ్యారు. ఇక లింగా, కబాలి, కాల ఇలా వరసగా సినిమాలు పోవడంతో రజినీకాంత్ కి మార్కెట్ అనూహ్యంగా పడిపోయింది. రజిని చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ… సినిమా టాక్ తో కలక్షన్స్ మాత్రం అమాంతం పడిపోతాయి. తాజాగా రజిని – కార్తీక్ సుబ్బరాజుల పేట చిత్రం వరల్డ్ వైడ్ గా జనవరి 10 న విడుదలకాబోతుంది. అయితే తెలుగులో ఓ మాదిరి బిజినెస్ ని జరుపుకున్న పెటా సినిమ తమిళనాట మాత్రం భారీ బిజినెస్ జరుపుకుంది. తెలుగులో గతంలో రజినీకాంత్ సినిమాలకు భీభత్సమైన పోటీ ఉండేది. కానీ గత కొంతకాలంగా రజిని నుండి వస్తున్నా సినిమాల్తో బయ్యర్లు బెంబేలెత్తుతున్నప్పుడు.. ఇక నిర్మాతలెవరూ రజినీకాంత్ సినిమాలు ఏ ధైర్యంతో కొంటారు. అయితే తెలుగులో వల్లభనేని అశోక్ పేట తెలుగు డబ్బింగ్ హక్కులను దక్కించుకోగా… ఓవర్సీస్ లో తెలుగు, తమిళ హక్కులను కలిపి 10 కోట్లకు అమ్మారు. అయితే ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు జోరెక్కువ. మరి ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు ఎన్టీఆర్, వినయ విధేయరామ, ఎఫ్ టు లను తట్టుకుని పెటా లాభాలను తేవాలంటే కాస్త కష్టమైనా పనే. మరి అక్కడ పేట బ్రేక్ ఈవెన్ రావాలంటే ఎలా లేదన్నా.. 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. కానీ తెలుగు సినిమాల హడావిడిలో పెటా 2.5 మిలియన్ డాలర్లు వసూలు చెయ్యడం సామాన్యమైన విషయం కాదు. అందులోను రజిని సినిమాలకు క్రేజ్ బాగా పడిపోయింది. మరి ఇప్పుడు ఈ సంక్రాంతికి ఓవర్సీస్ లో తెలుగు సినిమాల హడావిడిలో పేట పరిస్థితి ఏమిటో చూద్దాం. |
https://www.telugupost.com/movie-news/హైపర్-ట్రైలర్-ఇవాళే-2483/ | రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న హైపర్ చిత్రం ట్రైలర్ విడుదల శుక్రవారం హైదరాబాదులో జరగబోతోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలుగా తయారవుతున్న ఈ చిత్రంలో సత్యరాజ్ తదితరులు నటిస్తున్నారు. ట్రైలర్ మరియు జూక్ బాక్స్ ఆడియో విడుదల హైదరాబాద్ లోని జెఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతోంది. |
https://www.telugupost.com/crime/road-accident-happened-in-andhra-pradesh-private-travel-bus-overturned-1538282 | ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట లింగంగుంట్ల వద్ద అదుపుతప్పి బస్సు ప్రమాదానికి గురయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులున్నారు. హైదరాబాద్ నుంచి...హైదరాబాదు నుంచి కామాక్షి ట్రావెల్ బస్సు చిలకలూరిపేట మీదుగా కందుకూరు వెళ్లే క్రమంలో చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో పల్టీ కొట్టింది. అందులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మందికి స్వల్ప గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని,108 అంబులెన్సుల ద్వారా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. |
https://www.telugupost.com/movie-news/ntr-new-film-title-71155/ | ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎన్టీఆర్ ఫాన్స్ కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఈ రోజు సాయంత్రం 4.30 కి ఎన్టీఆర్ న్యూ లుక్ బయటికొస్తుంది. అయితే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాపై ట్రేడ్ లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి, కాదు భారీ అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ గత సినిమా పెద్ద డిజాస్టర్ అయినా అయన దర్శకత్వానికి భారీ క్రేజ్ ఉంది. అయితే ఎన్టీఆర్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ని కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేసే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది.టైటిల్ అదేనా...?ఇప్పటికే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ గా 'అసామాన్యుడు' వాడుకలో ఉండగా నిన్నటికి నిన్న 'రా రా కుమారా' అనే టైటిల్ వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ టైటిల్ ని, ఈ సినిమా లో ఎన్టీఆర్ పేరు కు లింక్ చేస్తూ 'అరవింద సమేత సిద్దార్ద్' అయినా, లేదంటే 'అరవింద సమేత రాఘవ' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ని చిత్ర బృందం ఫైనల్ చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫ్యామిలీ బాయ్ అండ్ లవర్ బాయ్ లా కనబడతాడని అలాగే ఎన్టీఆర్ పాత్ర పేరుతోనే ఈ సినిమా టైటిల్ ఉంటుందంటూ వార్తలొస్తున్నాయి.సీనియర్ హీరోయిన్ కోసం పోటాపోటీ...పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో సీనియర్ హీరోయిన్ రంభ నటిస్తుందనే టాక్ కూడా ఉంది. మరి ఫైనల్ గా సీనియర్ హీరోయిన్ గా త్రివిక్రమ్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడేమో గాని ఆ పాత్రకి మీనా, లయ, రంభ పేర్లు వినబడుతున్నాయి. ఇకపోతే హారిక అండ్ హాసిని బ్యానర్ మీద రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తుండగా ఈ సినిమా ని దసరాకి విడుదల చెయ్యాలనే టార్గెట్ గా పెట్టుకున్నారు. |
https://www.telugupost.com/top-stories/another-by-election-will-be-held-in-andhra-pradesh-by-election-is-likely-to-be-held-later-this-year-1349208 | ఆంధ్రప్రదేశ్ లో మరో ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఏడాది చివరలోనే ఉప ఎన్నికల జరిగే అవకాశముంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వచ్చే నెల 5వ తేదీ తర్వాత రాజీనామా చేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో మార్చి 14వ తేదీ వరకూ జరగనున్నాయి. ఆ సమావేశాల తర్వాతనే బహుశ రఘురామ కృష్ణరాజు రాజీనామా ఉండవచ్చు. రాజీనామా చేసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది.ఈ ఏడాది చివరిలోపు...అంటే ఈ ఏడాది సెప్టంబరులోపుగా నరసాపురం పార్లమెంటుకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. రఘురామ కృష్ణరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో డిసైడ్ అయ్యారు. రాజీనామా చేసిన వెంటనే ఆయన ఆ పార్టీలో చేరతారు. అందుకు రంగం కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వైసీపీయేతర పార్టీల సహకారం తీసుకోనున్నారు. వైసీపీ వర్సెస్ రఘురామ కృష్ణరాజులాగానే ఎన్నిక జరిగేలా ఆయన చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.పెద్దగా ప్రయత్నం చేయకపోయినా?రఘురామ కృష్ణరాజు పెద్దగా ప్రయత్నం చేయనక్కరలేదు. జగన్ కొమ్ములు వంచాలంటే ఈ ఎన్నికలో ఓడించాలి. అందుకే ఆయన అడగకపోయినా అన్ని పార్టీలూ మద్దతిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వైసీపీకి ఈ ఎన్నికలో నెగ్గుకు రావడం కష్టమే. ఇప్పటి వరకూ జరిగిన తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ సునాయాసంగా గెలిచింది. అయితే ఆ ఎన్నికల నేపథ్యం వేరు. ఈ ఎన్నిక వేరు. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ లుగా ఉన్న వారు మరణించారు. అక్కడ ప్రత్యర్థులకు కూడా పెద్దగా బలం లేదు. కానీ ఇక్కడ గత ఎన్నికల్లోనే వైసీపీకి పెద్దగా మెజారిటీ రాలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజుకు కేవలం 35 వేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.ఎవరు గెలిచినా..?కానీ నరసాపురం అలా కాదు. అన్ని పార్టీలూ బలంగా ఉన్నాయి. ఇక్కడ సామాజికవర్గాల పరంగా చూసినా ప్రత్యర్థుల బలాన్ని తక్కువ అంచనా వేయలేం. క్షత్రియులు, కాపు సామాజికవర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇద్దరూ కలిస్తే వైసీపీకి విజయం కష్టమే. అందుకే లెక్కలు వేసుకుని మరీ రాజుగారు బరిగీశారు. జగన్ కు కూడా ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. తనను కాదని కాలుదువ్వి వెళ్లిన రాజు గెలిస్తే తన పరువు గోదారిలో కలవడం ఖాయం. ఈ ఎఫెక్ట్ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కనపడుతుంది. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు జగన్ కు పెద్ద పరీక్ష పెట్టారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఇక జగన్ కు వచ్చే ఎన్నికల్లోనూ తిరుగులేనట్లే. |
https://www.telugupost.com/movie-news/2-0-trailer-review-95815/ | ఎప్పటినుండో 2.0 సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ మధ్యలో గ్రాఫిక్స్ పనుల లేట్ తో సినిమా విడుదల కూడా లేట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం విడుదల సమయం దగ్గరపడుతున్న టైం లో 2.0 సినిమా ప్రమోషన్స్ తో శంకర్ అండ్ టీం పిచ్చెక్కించే ఏర్పాట్లు చేశారు. ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లోని ప్రతి ఒక్క విషయంపై ప్రేక్షకులు కూడా భారీగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఆ అంచనాలు అందుకునేలా శంకర్ 2.0 సినిమాని తెరకెక్కించాడనేది నిన్న శనివారం చెన్నై లో విడుదల చేసిన 2.0 ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది చెప్పిన మాట.అయితే సోషల్ మీడియాలో 2.0 ట్రైలర్ మీద కామెంట్స్ మరోలా ఉన్నాయి. శంకర్ - రజినీకాంత్ కాంబోలో తెరకెక్కిన ఈ 2.0 సినిమా మరి ఓవర్ గ్రాఫిక్స్ తో ఉన్నదనే టాక్ వినబడుతుంది. అలాగే ప్రేక్షకుల అంచనాలను ఈ 2.0 సినిమా ట్రైలర్ అందుకునేలా లేదని కొందరి వాదన. ట్రైలర్ చూస్తే విజువల్స్ భారీగా ఉన్నప్పటికీ, ప్రేక్షకులు వావ్ అంటూ థ్రిల్ అయ్యేవిధంగా ఎక్కడా కనబడలేదని..చాలామంది డిజప్పాయింట్ అవుతున్నారు. ఇక అక్షయ్ కుమార్ పాత్రకు చెప్పిన డబ్బింగ్ ట్రైలర్ రెండు మూడు సార్లు చూస్తే గాని అర్ధమయ్యేలా లేదని అంటున్నారు.మరి బాహుబలి ని తలదన్నేలా సౌత్ నుండి మరో భారీ అంటే 600 కోట్ల బడ్జెట్ మూవీ వస్తుందని ఆశపడ్డ చాలామంది సినీ లవర్స్ కి ఈ 2.0 సినిమా ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఇవ్వడం లేదనేది లేటెస్ట్ న్యూస్. అందుకేనేమో 2.0 యూట్యూబ్ రికార్డ్స్ ని కొల్లగొటింది... అని ఎక్కడా ఆ టాపిక్ చర్చకే రాకుండా పోయింది |
https://www.telugupost.com/movie-news/rakul-preet-singh-food-habits-148204/ | తెలుగులో టాప్ చైర్ కి దగ్గరయినట్లే అయ్యి.. ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లోకెళ్ళిపోయిన రకుల్ ప్రీత్ సింగ్.. ఫిట్నెస్ కోసం బోలెడన్ని జిమ్ ఎక్సరసైజెస్ చేస్తుంది. బాడీ ని ఫిట్ గా వుంచుకోవడానికి నిరంతరం శ్రమిస్తోంది. ప్రస్తుతం తమిళ, బాలీవుడ్ సినిమాల్తో సరిపెట్టుకుంటున్న రకుల్ ఒక్కప్పుడు మాంసాహారం ప్రియురాలు. మాంసాహారాన్ని ఇష్టం గా తినే రకుల్ ప్రీత్… . శాకాహారం అంటే కూడా ఇష్టపడేదట. అయితే రకుల్ డైట్ లో ఎక్కువు భాగం మాంసాహారం ఉండేదట. అందులోను ఉడికించిన కోడిగుడ్లును ఎక్కువగా తినేదాన్ని అని చెప్పిన రకుల్.. అనుకోకుండా శాకాహారిగా మారిపోయిందట. శాకాహారిగా మారాలని అనిపించడమే తడువుగా శాకాహారిగా మారిపోయా అని.. ముంబై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్ప్పుడు ఇంటి నుండే ఫుడ్ వస్తుంది అని.. అందులో పండ్లు, అన్నం, పప్పు రైస్ తీసుకుని వెళుతుందట రకుల్. ఇక ముంబై మినహా అవుట్ డోర్ షూట్ కి వెళ్ళినప్పుడు అక్కడ మాంసాహారమైన చేపలు, చికెన్ లాంటివి ఎక్కువగా దొరుకుతాయని.. అలాంటాప్పుడు కాస్త ఇబ్బంది పడతా అని.. ఏవైనా కూరగాయలు దొరికితే మాత్రం వాటిలో అన్నం, పప్పు వేసి కిచిడీలాగా చేసి నెయ్యి వేసుకొని తింటానని చెబుతుంది రకుల్. |
https://www.telugupost.com/crime/34000-kg-of-explosives-seized-in-bengal-100-people-arrested-says-bengal-cops-1477575 | పశ్చిమ బెంగాల్ లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాణసంచాను నిషేధించినా అక్రమ తయారీ కర్మాగారాలను నడుపుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 100 మందిని అరెస్ట్ చేసినట్లు బెంగాల్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కబ్జాలకు సంబంధించి పోలీసులు 132 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో అక్రమ బాణసంచా తయారీ యూనిట్లలో వరుస పేలుళ్ల ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. సోమ, మంగళవారాల్లో బెంగాల్ లోని నడియా, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో పోలీసుల దాడులు కొనసాగాయి. ఇప్పటివరకూ 34 వేల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, బాణసంచా స్వాధీనం, అరెస్టులపై మే 29 వ తేదీలోగా రాష్ట్ర సచివాలయానికి నివేదిక ివ్వాలని వివిధ జిల్లాల పోలీసులను ఉన్నతాధికారులు కోరారు. బాణసంచా కర్మాగారాల్లో జరిగిన ప్రమాదాల్లో 17 మంది మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. |
https://www.telugupost.com/top-stories/chandrababu-did-not-err-on-the-side-of-caution-there-is-no-justification-for-practice-of-ycp-leaders-in-the-assembly-1340176 | చంద్రబాబు ఆవేదనను తప్పుపట్టడం లేదు. అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహారశైలిని సమర్థించడమూ లేదు. కానీ జరిగిన విషయాన్ని ఒక కోణంలోనే చూడటం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే చెల్లింది. జర్నలిస్టు గా రెండు కోణాల్లో రాయాల్సిన వీకెండ్ కామెంట్ వన్ సైడ్ గానే ఉంది. అసలు రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ చూస్తే సభలో ఎంత అరాచకం జరిగిందో అని ప్రజలు అనుకోవాలనే రాసినట్లుంది. చంద్రబాబు సీనియర్ నేత. ఆయన ఏడుపు విషయంలోనూ ఎవరికీ అభ్యంతరం లేదు.మూడు నిమిషాల ఎపిసోడ్ ను...కానీ సభలో దుశ్వాసన పర్వమట. కురుక్షేత్ర సభ లాగుందట. వైసీపీ ఆంబోతులట. సంస్కార హీనులు రాజ్యమేలుతున్నారట. సోషల్ మీడియాలో ఉన్మాదం చూసి విస్తుపోయారట. ఏడ్వాల్సింది చంద్రబాబు కాదట. ప్రజలేనట. ఏపీ అసెంబ్లీలో ఇదేమీ కొత్త విషయం కాదు. భువనేశ్వరి పేరునే తాము ప్రస్తావించడం లేదంటున్నా ఆమెను వీధుల్లోకి లాగే ప్రయత్నం చేస్తుంది ఎవరు? మూడు నిమిషాల అసెంబ్లీలో జరిగిన విషయాన్ని మూడు రోజుల నుంచి సాగదీయడమే అనుకూల మీడియా పనిగా పెట్టుకుంది. అసలు మాధవరెడ్డి పేరు ఎత్తితే ఎందుకు అంత ఆగ్రహం అన్న అనుమానాలను రేకెత్తెంచేలలా ఆర్కే వ్యాసం కొనసాగింది. నిజంగా ప్రేమ ఉంటే...చివరకు లోకేష్ పుట్టుక ప్రస్తావనను కూడా ఆర్కే తేవడం సముచితం కాదు. దానిని ఎవరూ ఆకళింపు చేసుకోలేరు. సమర్థించరు కూడా. నిజంగా నారా కుటుంబం మీద ప్రేమ ఉంటే ఈ ఎపిసోడ్ కు అంతటితో ఫుల్ స్టాప్ పెట్టడం సన్నిహితులు చేసే పని. కానీ చంద్రబాబుకు సానుభూతిని మరింత తెచ్చే పెట్టే ప్రయత్నంలోనే ఆర్కే ఉన్నారని పిస్తుంది. రాధాకృష్ణ గత అసెంబ్లీలో జరిగిన విషయాలను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది. ఇక చంద్రబాబుకు వచ్చేవే చివరి ఎన్నికలట. ఆయనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదట. ప్రజలకే ఆయన అవసరం ఉంటే గెలిపించుకోవాలట. నాడు కనపడలేదా?బోండా ఉమ, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడులు అధికారంలో ఉండగా క్లిప్పింగ్ లు చూడలేదా? గుర్తు లేదా? రోజాపై అన్న మాటలు నీ కలానికి కనపడలేదా? వినపడలేదా? రాజకీయంగా చంద్రబాబుకు మరింత బలం సమకూర్చాలంటే వైసీపీ ప్రభుత్వంలో అవినీతిని బయట పెట్టాలి. జగన్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రస్తావించాలి. అంతే తప్ప ఇంట్లో ఉన్న భువనేశ్వరిని బయటకు లాగుతుంది ఇప్పుడు ఎవరు? మీరు కాదా? ఎన్టీఆర్ కుటుంబం ఇప్పడు గుర్తొచ్చిందా?ఎన్టీఆర్ కుటుంబం అంటూ ఇప్పుడు నిక్కీ నీలుగుతున్న రాధాకృష్ణ ఆరోజు ఆయనను కూలదోసేందుకు చంద్రబాబుకు సహకరించలేదా? ఆరోజు ఆయనకు ఎన్టీఆర్ కుటుంబం కనపడలేదా? ఎన్టీఆర్ కుటుంబం అంటే చంద్రబాబు, భువనేశ్వరి మాత్రమేనా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంద్రేశ్వరి కాదా? ఆరోజు దగ్గుబాటిని వాడుకుని తర్వాత వదిలేస్తే ఈయనకు ఆ కుటుంబంపై ప్రేమ ఎక్కడకు వెళ్లింది? భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని వైసీపీ నేతలు చెబుతున్నా రాధాకృష్ణ మాత్రం ఒప్పుకోకుండా ఈ మెలో డ్రామాను మరికొంత కాలం కొనసాగించాలనే నిర్ణయించుకున్నట్లుంది. మొత్తంగా వైసీపీ సంగతి ఏమో కాని టీడీపీ దాని అనుకూల మీడియా కారణంగానే భువనేశ్వరి బజారు కెక్కుతున్నారు. ఈ విషయాన్ని నందమూరి కుటుంబం గమనిస్తే మంచిది. |
https://www.telugupost.com/movie-news/maruthi-next-film-80852/ | యూత్ ని అట్రాక్ట్ చేసి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ తీయడంలో డైరెక్టర్ మారుతీ సిద్ధహస్తుడు అనే చెప్పాలి. అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించే అంశాలు కూడా తన ప్రతి సినిమాలో ఉంటాయి. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను... ఇటు యూత్ ను టార్గెట్ చేసి సినిమాలు తీసే మారుతీ ప్రస్తుతం 'శైలజా రెడ్డి అల్లుడు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.హిట్ ఇచ్చిన బ్యానర్ లో...నాగ చైతన్య - అను ఇమ్మానుయేల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. త్వరలోనే దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మారుతి తనకు పేరు తెచ్చిపెట్టిన బ్యానర్ లో ఇంకో సినిమా చేయనున్నాడు.కుదిరితే అన్నతో లేదా తమ్ముడితో...'భలే భలే మగాడివోయ్' సినిమాతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన గీతా ఆర్ట్స్ లో ఇంకో సినిమా చేయడానికి రెడీ ఉన్నాడు మారుతి. అల్లు అర్జున్ తనకి మంచి మిత్రుడు కావడంతో అతనితో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో మారుతి ఉన్నట్టు సమాచారం. మంచి కథను ఆయన రెడీ చేస్తే అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. విక్రమ్ కుమార్, త్రివిక్రమ్ ల సినిమా తర్వాత అల్లు అర్జున్.. మారుతీ చెప్పిన స్టోరీ నచ్చితే అతనితో చేసే అవకాశముంది. ఒకవేళ అల్లు అర్జున్ తో లేట్ అయ్యే అవకాశం ఉంటే అల్లు శిరీష్ తో చేసే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. |
https://www.telugupost.com/movie-news/samantha-akkineni-to-play-as-a-shuttler-131792/ | అక్కినేని సమంత ప్రస్తుతం తన భర్త తో హాలిడే ని ఎంజాయ్ చేస్తుంది. లక్కీ లేడీగా పిలవబడే సామ్ ప్రస్తుతం శర్వానంద్ సరసన 96 సినిమా రీమేక్ లో నటిస్తుంది. దీనితో పాటు అమెజాన్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు. ఈ రెండు కంప్లీట్ అయినా తరువాత సామ్ ఏ సినిమా చేబోతుందని క్యూరియాసిటీ మొదలైంది. ఫిలింనగర్ సమాచారం ప్రకారం సామ్ నెక్స్ట్ అన్నపూర్ణ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతోందని తెలుస్తుంది. అది కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అని తెలుస్తుంది. ఈమధ్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వస్తున్నాయి కాబట్టి సామ్ కూడా ఒక షటిల్ క్రీడాకారిణిగా నటించబోతున్నట్లు సమాచారం. అయితే షటిల్ క్రీడాకారిణిగా అంటే కల్పిత కథతోనా, లేకా బయోపిక్ లాంటిదా అన్నది ఇంకా తెలియదు. ఇంకా డైరెక్టర్ ఎవరో క్లారిటీ లేదు కానీ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. |
https://www.telugupost.com/movie-news/i-saw-her-in-sangeeth-156607/ | బ్యాట్మెంటన్ క్రీడా కారిణి గుత్తా జ్వాలా ఎప్పుడు సంచలనాత్మక విషయాలతో న్యూస్ లో నిలుస్తూనే ఉంటుంది. అందరూ ఎడ్డెమ్ అంటే తెడ్డెమనే టైప్ జ్వాలాది. క్రీడల్లో ఆటలో అరటిపండులా మిగిలిపోతున్నా అని ఆవేదన చెందిన గుత్తా జ్వాలా ఒకొనొక సమయంలో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే అనుకుంది. అది వరౌట్ అవ్వలేదు. అయితే ఒకసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న జ్వాలా తమిళ నటుడు విష్ణు విశాల్ తో ప్రేమాయణం నడుపుతుంది. ఆ విషయాన్నీ జ్వాలానే రివీల్ చేసింది. హీరో విష్ణు విశాల్ తో డేటింగ్ లో ఉన్న అని.. త్వరలోనే మా పెళ్లి అంటూ ప్రకటించింది. అయితే తాజాగా గుత్తా జ్వాలతో విష్ణు విశాల్ పరిచయం ఎలా ఏర్పడిందో చెప్పాడు. అసలు కరోనా లాక్ డౌన్ తో తన లవర్ విష్ణు ని కలవలేకపోతున్నందుకు బాధపడుతున్న అన్న గుత్తా జ్వాలతో పరిచయంపై విష్ణు విశాల్ తాజాగా నెటిజెన్స్ తో ముచ్చటించాడు. గుత్తా జలతో తన మీ పరిచయం ఎలా ఏర్పడింది అని అడగగా…గుత్తా నాకు హీరో విశాల్ సోదరి సంగీత్ ఫంక్షన్ లో పరిచయం అయ్యింది అని…. అప్పటినుండి తనతో పెరిగిన పరిచయం ప్రేమగా మారినట్లుగా చెబుతున్నాడు. ఇక లాక్ డౌన్ ముగియగానే తమ పెళ్లి అని చెప్పాడు. |
https://www.telugupost.com/movie-news/త్రివిక్రమ్-trivikram-bought-a-theater-in-east-godavari-124769/ | స్టార్ హీరోస్ తోనే సినిమాలు తీస్తూ సినిమాకి 10 – 15 కోట్లు తీసుకుంటున్న త్రివిక్రమ్ ఓ సామెతను ఫాలో అవుతున్నాడు. ” దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి”. సినిమా సినిమాకి అంత వస్తున్నప్పుడు దాని చక్కబెట్టుకోవాలంటే ఏదొక వ్యాపారం చేయాలి. అదే చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆది నుండే మంచి పెట్టుబడులు పెడుతూనే వున్నారు త్రివిక్రమ్. హైదరాబాద్ శివార్లలో భూములు కొన్నారు. మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా థియేటర్ ఓనర్ కానున్నాడు. అవును త్రివిక్రమ్ ఇటీవలే 6 కోట్లు పెట్టి ఈస్ట్ గోదావరి రాజానగరంలో ఓ థియేటర్ ను కొన్నారు. అక్కడ రాయుడు థియేటర్ ఉంది. దాన్ని త్రివిక్రమ్ కొన్నారు. లాస్ట్ ఇయర్ ఈ థియేటర్ ని రిన్మోవేట్ చేసి 4 కోట్లు కి అమ్మాలని చూశారట. కానీ ఎవరు కొనలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ అదే థియేటర్ ని 4.90 కోట్లకు కొన్నట్లు బోగట్టా. ఎందుకంటే అక్కడ ల్యాండ్ కాస్ట్ నే 2.50 కోట్ల వరకు వుంది. రాయుడు థియేటర్ పూర్తిగా పడిగొట్టేసి కొత్తగా థియేటర్ ను నిర్మించాలని డిసైడ్ అయ్యాడు త్రివిక్రమ్.ఆ థియేటర్ ను ఈస్ట్ లోనే ఒకరికి నిర్వహణకు అప్పగించారు. |
https://www.telugupost.com/movie-news/అద్గదీ-సూపర్-స్టార్-అంటే-10677/ | రజినీకాంత్ కి దేశ వ్యాప్తం గానే కాదు, ప్రపంచవ్యాప్తం గా ఆయనకు ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. అయన సినిమాల్లో ఎంత స్టయిల్ గా ఒక రేంజ్ లో కనిపిస్తాడో... నిజ జీవితం లో అంత సింపుల్ గా.... ఆధ్యాత్మికత కలిగిన ఒక యోగిలా దర్శనమిస్తాడు. రజినీ సినిమా విడుదలవుతుంది అంటే ఫాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాడు. అంత సింపుల్ గా వుండే రజినీకాంత్ కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. రజినీకాంత్ కి బాగా తాగే అలవాటు... అలాగే సిగరెట్స్ ఎక్కువగా కాల్చే అలవాటు ఉండేదట. ఇదంతా ఆయనే చెప్పాడు. సూర్య, కార్తీ ల తండ్రి శివకుమార్ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయనికి ఒక లేఖ రాసాడు. ఆ లేఖలో తనకు ఉన్న మందు, సిగరెట్స్ అలవాట్లు గురుంచి ప్రస్తావించాడు.మందు, సిగరెట్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకునే నాకు శివ కుమార్ గారు పిలిచి నువ్వు ఒక గొప్ప నటుడిగా ఎదగాలి అంటే మందు, సిగరెట్ కి కొంచెం దూరం గా ఉండమని ఒక సలహా ఇచ్చారట. ఆయన సలహా తీసుకున్న తర్వాత నేను మానసికం గా, శారీరకం గా దృఢం గా తయారవ్వగలిగానని... ఇదంతా ఆ మహానటుడు నాకు ఇచ్చిన సలహా వల్లే సాధ్యమైందని రజినీ - శివకుమార్ కి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఇంకా శివ కుమార్ నుండి నేను ఎన్నో జీవితపాఠాలు నేర్చుకున్నానని లేఖలో పేర్కొన్నారు. అంత గొప్ప సూపర్ స్టార్.. ఒక నటుడు గురించి ఇంత గొప్పగా పొగిడి , మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సత్యాన్ని తెలియజేశాడు. |
https://www.telugupost.com/lok-sabha-elections/brs-chief-kcr-is-unable-to-digest-the-developments-after-his-defeat-1527084 | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు వీళ్లనా తాను నమ్మింది? అని ముఖ్య సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇంత మంది తనను మోసం చేసి వెళ్లిపోతారని కలలో కూడా ఊహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉండగా అనేక సమీకరణాలను చూసి వారికి పదవులను కేసీఆర్ కట్టబెట్టారు. కొందరికి రెండు సార్లు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మరికొందరికి ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చి మరీ రాజకీయ హోదాను కల్పించారు. అయితే వారే బీఆర్ఎస్ ఓటమి తర్వాత వెళ్లిపోతుండటం కలవరపరస్తుంది.అవకాశమిచ్చినా....దానం నాగేందర్ కు రెండు సార్లు ఖైరతాబాద్ టిక్కెట్ ఇచ్చారు. ఆయన కారణంగా ఉద్యమం నుంచి తమ పార్టీతో పయనిస్తున్న దాసోజు శ్రావణ్ లాంటి వారిని కూడా పక్కన పెట్టారు. అలాగే ఇంద్రకిరణ్ రెడ్డి లాంటి నేతలకు తొలి దఫాలో బీఎస్పీ నుంచి నెగ్గినా తాను మంత్రివర్గంలో చోటు కల్పించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయనకు కేబినెట్ లో చోటు కల్పించారు. అలాగే 2019 ఎన్నికల్లో రంజిత్ రెడ్డికి తాను టిక్కెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నప్పటికీ ఆయన చివరకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవడం కేసీఆర్ ను కలచి వేస్తుందంటున్నారు. తాను తిరిగి పోటీ చేయాలని కోరినా రంజిత్ రెడ్డి పోటీ చేయనని చెప్పి మరీ కాంగ్రెస్ లోకి వెళ్లి పోటీ చేస్తుండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.పట్నం ఫ్యామిలీకి...అలాగే ఎమ్మెల్యే పట్నం మహీందర్ రెడ్డి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా, తొలి దఫా మంత్రివర్గంలో చోటు కల్పించామని, రెండోసారి ఆయన ఓటమి పాలయినా ఎమ్మెల్సీగా ఇచ్చి చివరిలో మంత్రివర్గంలో స్థానం కల్పించానన్న విషయాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆయన సోదరుడికి కొడంగల్ స్థానంలో రెండు సార్లు పోటీకి అవకాశం ఇచ్చి తాను తప్పు చేశానని మధనపడుతున్నాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కోనేరు కోనప్ప కూడా తనను మోసం చేసి పార్టీ వీడి వెళతాడని ఊహించలేదని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. పదవులు ఇవ్వని వాళ్లు సరే.. ఇచ్చిన వాళ్లు కూడా వెళ్లిపోవడమేంటన్నది ఆయనకు మింగుడుపడటం లేదు.కేశవరావు కుటుంబానికి...తాజాగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలు కేసీఆర్ ను కలవరపరుస్తున్నాయి. ఆమె తండ్రి కేశవరావుకు రెండుసార్లు రాజ్యసభ ఇవ్వడమే కాకుండా ఆమెకు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా అవకాశం కల్పించారు కేసీఆర్. అలాంటి కుటుంబం కూడా తాను సమస్యల్లో ఉన్నప్పుడు వీడి వెళ్లడంపై కేసీఆర్ కు ఎవరిని నమ్మాలి? అన్నది కూడా అర్థం కాకుండా ఉందంటున్నారు. ద్వితీయ శ్రేణి నేతలే నయమని, వారికి పదవులు దక్కకపోయినా.. తనను, తన పార్టీని నమ్ముకుని ఉంటూ తనకు కష్టకాలంలో అండగా ఉంటున్నారని కూడా ఆయన అంటున్నారని తెలిసింది. మొత్తం మీద కేసీఆర్ కు ఎవరు తనవారో.. పరాయి వారో ఇప్పుడు తెలిసి వచ్చిందని పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/లేనిపోని-వివాదాలలో-ఇరుక్-28287/ | కథానాయికగా తెలుగు, తమిళ, మళయాళ భాషలలో పలు సినిమాలు చేసి అతి చిన్న వయసులో వివాహం, విడాకుల అనుభవాలు చూసేసింది డస్కీ బ్యూటీ అమల పాల్. వాటితోపాటు కెరీర్ తొలి నాళ్ళ నుంచే ఏవో ఒక వివాదాలు నిత్యం అమల పాల్ ని వెంటాడుతూనే వున్నాయి. ఇప్పుడు కథానాయికగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తమిళ్ మరియు మళయాళ భాషలలో వరుస సినిమాలతో బిజీగా వున్న అమల పాల్, తన సెకండ్ ఇన్నింగ్స్ అట్టెంప్ట్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చినప్పుడు తన ముఖం వారికి ఎబెట్టుగా అనిపించకూడదని ఇంత కాలం వచ్చిన గ్యాప్ ని తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా లో ఫిల్ చేస్తూ ప్రేక్షకులకి సెకండ్ ఇన్నింగ్స్ అనే ఫీల్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.తన ఫోటో షూట్స్ ద్వారా అభిమానుల దృష్టిని ఆకర్షించటం ఒక అలవాటుగా మార్చుకున్న అమల పాల్ ఇప్పుడు తాజాగా తాను అప్లోడ్ చేసిన ఒక ఫోటో షూట్ ద్వారా పీకల్లోతు వివాదాలలో కూరుకుపోతోంది. తాను యోగాసనాలు వేసుకుంటున్న సమయంలో తీయబడ్డ ఫోటోలని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది అమల పాల్. అయితే తాను యోగా చేసుకునే గదిలో గోడలకి గౌతమ బుద్ధుని ఫోటో వాల్ ఫాస్ట్గా ఉండటంతో అమల చేస్తున్న యోగాసనాలలో భాగంగా తన కాళ్ళు బుద్దిని తాకుతునట్టు కనిపిస్తున్నాయి. ఈ ఫోటో లోని దృశ్యానికి నొచ్చుకున్న బుద్ధిజం వక్తలు సోషల్ మీడియాలో అమల పాల్ పై విరుచుకు పడ్డారు. తక్షణమే ఈ ఫోటో లు తొలగించి క్షమాపణ తెలుపవలసినదిగా డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన నష్టానికి సంజాయిషీ ఇవ్వటం కానీ ఫోటోలు డిలీట్ చెయ్యటం వంటివేమీ చెయ్యలేదు అమల పాల్. గతంలో భారత దేశపు జెండా వైపు కాళ్ళు పెట్టినందుకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇలాంటి వివాదాలతోనే చిక్కుకుని చివరికి క్షమాపణ చెప్పవలసి వచ్చింది. అయితే అమల పాల్ ఈ ప్రక్రియని కూడా పబ్లిసిటీ కి వాడుకోవాలనుకుంటుంది కాబోలు. అందుకే ఇప్పటి వరకు రాచుకున్న వివాదానికి ఎలాంటి స్పందన తెలియజేయలేదు ఏమో. |
https://www.telugupost.com/movie-news/bellamkonda-srinivas-బెల్లంకొండ-శ్రీనివాస-124635/ | కవచం ప్లాప్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అంటే స్పీడుగా సీత సినిమాని పూర్తి చేసి విడుదల చేస్త అది ప్లాప్ అయ్యింది. ఆ సినిమా విడుదలై ఇంకా నెల కాలేదు. ఈలోపే శ్రీనివాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాక్షసుడు సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. అబ్బో బెల్లంకొండ శ్రీనివాస్ ఇంత స్పీడుగా ఉన్నాడేమిటి అనుకున్నారు. రచ్చసన్ తమిళ రీమేక్ ని తెలుగులో రమేష్ వర్మ రాక్షసుడుగా రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తెలుగు షూటింగ్ చాలా స్పీడుగా జరిగిపోతుందని అంటున్నారు. స్పీడు గా కాదు.. చాలా చాలా స్పీడు గా… రాక్షసుడు షూటింగ్ అప్పుడే ముగింపు దశకు చేరుకుంది. మరింత ఫాస్ట్ గా రాక్షసుడు షూటింగ్ ని బెల్లంకొండ – రమేష్ వర్మ చేసారా అంటే? అనే దానికి సమాదానం ఇదే అంటున్నారు. తమిళ రీమేక్ రచ్చసన్ లోని చాలా సీన్స్ ని తెలుగు రాక్షసుడులో పెట్టేశారట. అంటే ఈ సినిమాలో సగం వరకూ వర్జినల్ సీన్లే వాడుకున్నారట. మొన్న విడుదలైన రాక్షసుడు టీజర్లో కనిపించిన కొన్ని షాట్స్ చూసిన వారు తమిళ రచ్చసన్ ఒరిజినల్ సీన్స్ నే అనుకున్నారు. అది నిజమేనట. తమిళంలో నటించిన చాలామంది నటులు తెలుగు రాక్షసుడులో కూడా కనిపిస్తారు. ఆ నటీనటులతో చేయాల్సిన సన్నివేశాల్ని తమిళ రచ్చసన్ నుంచి యధావిధిగా తీసుకొచ్చేశారు. అయితే హీరో చేసిన కొన్ని సీన్లు మాత్రం మళ్లీ కొత్తగా తీశారంతే. అందుకే ఈ తెలుగు రీమేక్ అంత త్వరగా పూర్తయ్యింది. మరి రెండు సినిమాల వరస డిజాస్టర్స్ తో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఎలాగూ చాలా సీన్స్ ని తమిళం నుండి యధావిధిగా పెట్టేసారు కాబట్టి ఈ సినిమాకి పెద్దగా బడ్జెట్ కూడా అవడం లేదట. చాలా తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా నిర్మితమవుతుందట. మరి బెల్లకొండ కెరీర్ లోనే ఈసినిమాకి అతి తక్కువ బడ్జెట్ పెట్టారట. |
https://www.telugupost.com/movie-news/పవన్-కళ్యాణ్-మళ్ళీ-తండ్ర-45792/ | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ నాన్నయ్యాడు. పవన్ కళ్యాణ్ - అన్నాలేజ్నేవా దంపతులకు పండంటి మగ పిల్లాడు పుట్టాడు. తన వారసుణ్ణి పవన్ కళ్యాణ్ తన చేతుల్లోకి తీసుకుని ఆ క్షణాన్ని ఎంతో ఆనందించాడనే విషయం ఈ ఫోటో ద్వారా అర్ధమవుతుంది. పవన్ కి ఈ బాబు మొదటి బిడ్డ కాదు. పవన్ కళ్యాణ్ కి ఇదివరకే ఒక బాబు అకీరా నందన్, ఒక పాప ఆద్య ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన లైఫ్ లో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య నందినికి పిల్లలు లేరు. ఆమెతో విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ సహా నటి రేణు దేశాయ్ ని ప్రేమించి ఒక బిడ్డ కు తండ్రయ్యాక ఆ బిడ్డ అసాక్షిగా రేణుని వివాహమాడాడు. రేణు దేశాయ్ - పవన్ కళ్యాణ్ పెళ్లి తర్వాత వారికీ మరో పాప పుట్టింది.మూడో భార్యకు ఇప్పుడు కొడుకు.....ఇక రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్.. మూడో భార్యగా చెప్పబడే అన్నాలేజ్నేవా తో సహజీవం చేస్తున్నాడు. ఇప్పడు అన్నా లేజ్నేవా కి - పవన్ కళ్యాణ్ కి ఒక బాబు పుట్టాడు. దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ కి మరో వారసుడొచ్చేసాడు. రేణు దేశాయ్ తో అకీరా నందన్ కి తండ్రయి వారసుని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్నా తో మరో వారసుణ్ణి ఎత్తుకున్నాడు. మరి ఆ వారసుడు రాకతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ, సినిమాల్లో అనుకున్నంత సక్సెస్ లు సాధిస్తాడేమో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఎత్తుకుని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. |
https://www.telugupost.com/movie-news/పాపం-హిట్-కోసం-విలవిల్లా-10803/ | గత మూడేళ్లుగా తాను నటించిన నాలుగు చిత్రాలు బాగా ఆడలేదు. దీంతో రణబీర్‌కపూర్ చిక్కుల్లో పడ్డాడు. ఆయనకు ఇప్పుడు అర్జంట్‌గా ఓ హిట్ కావాలి. కాగా ఆయన హీరోగా నటించిన 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంపై ఆయనతో పాటు సినీ ప్రేక్షకులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నటించిన ఐశ్వర్యారాయ్ తన 42ఏళ్ల వయసులో కూడా తన కంటే చిన్నవాడైన రణబీర్‌కపూర్‌తో పాటు లిప్‌లాక్‌లు చేసి, ఇంకా సినిమా నిండా హాట్‌హాట్ అందాలతో కనువిందు చేయడం చర్చనీయాంశం అయింది. దీంతో ఈ చిత్రంపై శృంగార ప్రియులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.మరోపక్క ఈ చిత్రానికి దర్శకుడు కరణ్‌జోహార్ దర్శకుడు కావడంతో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి నాలుగురోజుల్లో 100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం ఇండియాలో కంటే ఓవర్‌సీస్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇదంతా కరణ్‌జోహార్‌కు ఓవర్‌సీస్‌లో ఉన్న క్రేజ్ పుణ్యం. ఇక వరుసగా సెలవులు రావడం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయింది. ఇదే ఊపులో మరో వారం రోజులు కనుక ఈ చిత్రం థియేటర్లలో నిలబడితే రణభీర్‌కపూర్‌కు ఉన్న ఒకే ఒక్క హిట్ కోరిక కూడా నెరవేరుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఒకే ఒక్కవారం రణబీర్ భవిష్యత్తును తేల్చనుందని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/భారీగానే-ఖర్చు-పెడుతున్న-28491/ | బాలకృష్ణ తన 101 చిత్రాన్ని పూరి డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. పూరి గురించి ఎవరెన్ని చెప్పిన వినకుండా బాలకృష్ణ తన 101 ప్రాజెక్ట్ ని పూరి చేతిలో పెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పటికే మొదలైన ఈ చిత్రం అప్పుడే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అయ్యింది . మొదటి షెడ్యూల్ లో బాలకృష్ణ పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన పూరి ఇప్పుడు రెండో షెడ్యూల్ లో బాలకృష్ణ, హీరోయిన్ ముస్కాన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఒక భారీ సెట్ ని వేయిస్తున్నాడట.1. 5 కోట్ల రూపాయల వ్యయంతో భారీ కాలనీ, మార్కెట్ సెట్ ను బాలకృష్ణ కోసం పూరి వేయించాడట. ఈ సెట్ లోనే బాలయ్య, ముస్కాన్ లపై ఆ సన్నివేశాలను చిత్రకరిస్తారని సమాచారం. మరి ఇప్పటికే బాలయ్యని మునుపెన్నడూ చూపెట్టని విధంగా చూపెట్టి ఫ్యాన్స్ మెచ్చేలా చేస్తానని చెప్పిన పూరి, బాలకృష్ణ ని ఎలా చూపిస్తాడో అనే ఆత్రుత అభిమానులకు విపరీతంగా పెరిగిపోతుంది. |
https://www.telugupost.com/movie-news/kerala-govt-invited-allu-arjun-96106/ | కేరళ సినీ ప్రేక్షకుల్లో తెలుగు నటుల్లో ఎవరికీ లేనంత క్రేజ్ అల్లు అర్జున్ కి ఉంది. ఆర్య సినిమా నుంచి అల్లు అర్జున్ నటించిన ప్రతీ సినిమా కేరళలో హిట్ అవుతున్నాయి. దీంతో మళయాళీ ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ కి అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ఇక కాలేజీ క్యాంపస్ లలో అయితే బన్నీ క్రేజ్ మరింత ఎక్కువ. ఇక ఇటీవల కేరళ వరదలతో కష్టకాలంలో ఉంటే అల్లు అర్జున్ తనవంతు ఆర్థిక సహాయం అందించి మరింత అభిమానులను పెంచుకున్నారు. ఇక తాజాగా కేరళ ప్రభుత్వ అల్లు అర్జున్ ని ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో అలప్పిలో నవంబర్ 10న జరగనుంది. మరి, మన తెలుగు హీరో కేరళ ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా వెళుతున్నారంటే గొప్ప విషయమే. |
https://www.telugupost.com/top-stories/ycp-rebel-mp-raghurama-krishna-raju-will-resign-after-february-5-he-himself-made-this-clear-1351866 | నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు కత్తి వేలాడుతుంది. ఆయనకు స్పష్టమైన సిగ్నల్స్ వచ్చిన తర్వాతనే రాజీనామా యోచనకు దిగినట్లు తెలిసింది. ఫిబ్రవరి ఐదు తర్వాత రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు పడుతుందని తెలియడంతోనే ఆయన ముందుగానే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కొందరు పెద్దల సూచనలు కూడా అందడంతో ఆయన రాజీనామా ఆలోచన చేశారంటున్నారు.మొండోడుగానే...నిజానికి రఘురామ కృష్ణరాజు జగన్ కంటే మొండోడు అన్న పేరుంది. ఆయన పార్టీలోనే ఉండి ఇబ్బంది పెట్టాలని భావించారు. వచ్చే ఎన్నికలకు ముందు పార్టీ మారితే సరిపోతుందనుకున్నారు. ఏ పార్టీలో చేరాలన్నది అప్పుడే నిర్ణయించుకోవచ్చని, అప్పటి వరకూ అన్ని పార్టీలతో సఖ్యత కొనసాగించాలని రఘురామ కృష్ణరాజు భావించారు. ఈ మేరకు బీజేపీ పెద్దలతో ఆయన టచ్ లోకి వెళ్లారు. అందుకే పార్టీని థిక్కరించకుండా విమర్శలు చేస్తూ వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు.పార్టీలోనే ఉంటూ...ఇదే పద్ధతిని 2024 ఎన్నికల వరకూ కంటిన్యూ చేయాలని రఘురామ కృష్ణరాజు భావించారు. ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతల కూడా ఇదే రకమైన సలహా ఇవ్వడంతో రచ్చ బండ పేరుతో మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి ఆయన వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం కదిలింది. రఘురామ కృష్ణరాజు అనర్హత పిటీషన్ ను స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ప్రాధమిక దర్యాప్తు జరపాలని ఆదేశించారు.అనర్హత వేటు పడుతుందని.....రఘురామ కృష్ణరాజుకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని కొందరు బీజేపీ పెద్దలు కూడా అభిప్రాయపడినట్లు తెలిసింది. అందుకే ఆయనను గౌరవంగా రాజీనామా చేసి తప్పుకోవాలని సూచించారని, లేకుంటే అనర్హత వేటు పడుతుందని చెప్పడంతోనే ఆయన రాజీనామాకు సిద్దమయ్యారు. మరో వారం రోజుల్లో రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయనున్నారు. ఆయన రాజీనామా వెనక ఇదే ప్రధాన కారణమన్న కామెంట్స్ ఢిల్లీలో వినిపిస్తున్నాయి. అనర్హత వేటు తనపై పడేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని ఆయన చెబుతున్నా, కొందరి సూచనల మేరకే ఆయన రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. |
https://www.telugupost.com/crime/online-loan-app-operators-harassing-non-loan-takers-also-case-filed-in-east-godavari-district-1478286 | వ్యక్తిగత అవసరాలు లేదా.. కుటుంబ అవసరాల నిమిత్తం ఆన్ లైన్ లోన్ యాప్ లలో లోన్లు తీసుకున్నవారిని సదరు ఏజెంట్లు ఎలా వేధిస్తుంటారో చూస్తూనే ఉన్నాం. తీసుకున్న మొత్తానికి బదులుగా తిరిగి అధిక సొమ్ము చెల్లించినా.. ఇంకా డబ్బు కట్టాలంటూ ఫోన్లు, మెసేజ్ లు చేసి.. న్యూడ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడగా.. చాలా మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అయితే లోన్ తీసుకున్న వారికే కాదు.. తీసుకోని వారినీ లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియంలో చోటుచేసుకుంది.కడియం మండలంలో నివాసం ఉండే దేవి అనే మహిళ మే27న దిశ SOS కు కాల్ చేసి తనను లోన్ యాప్ నిర్వాహకుడు వేధిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఇంటికి వెళ్లిన దిశ పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల క్రితం గుర్తుతెలియని నంబర్ నుండి తనకు 2000 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయని, వెంటనే అదే నంబర్ కు అమౌంట్ తిరిగి పంపినట్లు దేవి పోలీసులకు తెలిపింది. అప్పటి నుంచి అదే నెంబర్ నుండి సదరు వ్యక్తి వాట్సాప్ కాల్స్ చేస్తూ.. హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు వాపోయింది. తనకు అదనంగా డబ్బు చెల్లించాలని లేదంటే.. ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బాధితురాలిని బెదిరించాడు.ఆగంతకుడు చెప్పిన విధంగానే బాధితురాలి ఫొటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలను పంపించడం మొదలు పెట్టాడు. అగంతకుడి వేధింపులు శృతిమించడంతో బాధితురాలు దిశా పోలీసులకు కాల్ చేసి సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అతను కాల్ చేసిన ఫోన్ నంబర్ ఇతర వివరాల ఆధారంగా కడియం పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడితే వెంటనే దిశా SOS కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు. |
https://www.telugupost.com/movie-news/lavanya-tripati-in-bollywood-moviews-80692/ | ఏ హీరో.. హీరోయిన్ అయినా తమ ప్రాంతీయ సినిమాల్లో నటించి కొంచం పేరు రాగేనే బాలీవుడ్ లో ఒక్క సినిమా ఐన చేయాలి అనుకుంటారు. ఎందుకంటే అక్కడ చేస్తే ప్రపంచం వ్యాప్తంగా క్రేజ్ వస్తుంది కాబట్టి. అయితే ఈ విషయంలో ఎక్కువగా హీరోయిన్స్ ఫోకస్ పెడుతుంటారు. అలానే చాలామంది హీరోయిన్స్ ఇప్పటికే ఫోకస్ పెట్టారు.అయితే ఈ లిస్ట్ తాజాగా మన టాలీవుడ్ హీరోయిన్ ఉంది. ప్రస్తుతం అందాల రాక్షసి బాలీవుడ్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. ఆ అందాల రాక్షసి ఎవరు అని అనుకుంటున్నారా? మీ గెస్ కరెక్టే. ఆ అందాల రాక్షసి ఎవరో కాదు లావణ్య త్రిపాఠి. టాలీవుడ్ లో 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా త్వరగానే తెలుగులో మంచి క్రేజీ హీరోయిన్ గా మారింది.అయితే ఈ మధ్యే ఆమె కు ఆశించిన స్థాయి విజయాలు దక్కడం లేదు అందుకే .. అవకాశాలు బాగా తగ్గాయి. దాంతో లావణ్య కన్ను బాలీవుడ్ పై పడింది. బాలీవుడ్ లో అవకాశాలు కోసం పలువురు బాలీవుడ్ మేకర్స్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటుందని టాక్. వన్స్ అక్కడ ఛాన్స్ వస్తే బట్టలు సద్దుకుని వెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది. |
https://www.telugupost.com/movie-news/is-prabhas-responsible-for-saaho-disaster-131766/ | బాహుబలి తో ఒక్కసారిగా ఇండియా వైడ్ గా హీరో అనిపించుకున్న హీరో ప్రభాస్. బాహుబలి పార్ట్ 1, 2 లకు ముందు ప్రభాస్ అంటే ఎవరో తెలియదు. కానీ బాహుబలితో నేషనల్ హీరోగా మారిన ప్రభాస్ అదే ఫ్లో ని కంటిన్యూ చెయ్యాలనుకున్నాడు. బాహుబలి క్రేజ్ తో సినిమా చేస్తే పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాడు. అందుకే మంచి కథతో అంటే 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన కథని కాస్త 300 కోట్ల బడ్జెట్ సినిమాగా ప్రభాస్ మార్చేశాడు. సుజిత్ మొదట్లో మీడియం బడ్జెట్ కథతోనే ప్రభాస్ ని కలవడం, ప్రభాస్ ఒప్పుకోవడం జరిగింది. కానీ బాహుబలి ప్రభంజనంలో కొట్టుకుపోయిన ప్రభాస్ కి ఆ 50 కోట్ల బడ్జెట్ ఆనలేదు. అందుకే అదే స్టోరీ లైన్ తో సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ గా మార్చేశాడు. ఎలాగూ యువీ నిర్మాతలు ప్రభాస్ సన్నిహితులే. ప్రభాస్ అడగడమే తరువాయి వారు ప్రభాస్ బాహుబలి క్రేజ్ తో సై అన్నారు. అలా సాహో సినిమా నేషనల్ వైడ్ గా తెరకెక్కింది. సినిమాని నేషనల్ వైడ్ గా తీస్తున్నామంటే.. బాలీవుడ్ లాంటి పెద్ద మార్కెట్ ఉన్న ప్రేక్షకులను తమ వైపు తిప్పుకోవాలంటే అక్కడి నటులను ఎక్కువగా తీసుకోవాలని ఆలోచించారు. ఆలోచన బాగుంది. కానీ ఆయా నటులను వారు వాడుకున్న తీరు సాహో సినిమా చూస్తే తెలుస్తుంది. చిన్నపాటి సీన్స్ కోసం.. బాలీవుడ్ నుండి పెద్ద నటులను తీసుకున్నారు. ఇక హాలీవుడ్ రేంజ్ యాక్షన్ చూపించాలి అనుకున్నారు…. చూపించారు. అలాగే అన్నిటిలో భారీతనం కొట్టొచ్చినట్లుగా చూపిస్తే ప్రేక్షకులు పడిపోతారనుకున్నారు. కానీ అది కాస్త రివర్స్ అయ్యింది. ఇక హిందీ సినిమాల ప్రమోషన్స్ తో పోలిస్తే సాహో ప్రమోషన్స్ వీక్. తెలుగు, హిందీ లో చేసిన ప్రమోషన్స్ తమిళ, మలయాళంలో చేయలేకపోయారు. ఇక నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన సాహో సినిమాకి కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు.. అంటే సాహో సినిమా పరిస్థితి ఏమిటో అర్ధమవుతుంది. బాహుబలి ని చూసి వాతలు పెట్టుకుంటే.. చివరికి మిగిలేది అనేది సాహో సినిమా చూపించింది. సినిమాలో కంటెంట్ లేదు, కామెడీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, యాక్షన్ మితిమీరిపోవడం, బలవంతంగా ఇరికించి న లవ్ ట్రాక్ అన్ని సాహో ని ఇరుకున పడేశాయి. అయితే సాహో విషయంలో ఇంత జరగడానికి కేవలం ప్రభాస్ మాత్రమే కారణమవుతాడనేది ఫిలింనగర్ టాక్. చిన్న డైరెక్టర్ చేతిలో ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు పెడితే.. అతను ఎలా హ్యాండిల్ చేస్తడో అనేదీ ప్రభాస్ ఆలోచించాలి. డబ్బుంది కదా అని చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది మరి. |
https://www.telugupost.com/movie-news/i-am-not-big-enough-to-do-biopic-156754/ | మిల్కి బాయ్ మహేష్ వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ సినిమాల హిట్ ఆతర్వాత వంశి పైడిపల్లి సినిమాని పక్కనబెట్టి.. పరశురామ్ కి కనెక్ట్ అయిన మహేష్ బాబు.. తదుపరి చిత్రాన్ని రాజమౌళి తో చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో తన పిల్లలతో ఆడుకుంటున్న మహేష్ బాబు తన భార్య తో కలిసున్న ప్రతి క్షణమే తనకి రొమాంటిక్ అంటున్నాడు. తనకు తన ఫ్యామిలీ కంటే మరేదీ ఎక్కువ కాదని…. ఇక తనగురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే హంబుల్ హంబుల్ హంబుల్ అంటూ చెబుతున్నాడు. ఇక తాను కెరీర్ తొలినాళ్లలో నటించిన మురారీ మూవీ చూసి తండ్రి కృష్ణగారు తన భుజం మీద చేయి వేసి, ఆయన ఇచ్చిన ఎక్సప్రెషన్ తనకి బెస్ట్ మూవ్మెంట్స్ అంటున్నాడు. ఇక తాను చాలా అణుకువుగా ఉంటా అని.. ఇక నిజాయితీ లేని మనుషులను చూస్తే తనకు ఒళ్ళు మంట చెబుతున్నాడు మహేష్ బాబు. ఇక ఎవరైనా మీ బయోపిక్ తీస్తా అని అడిగితె మాత్రం.. తనకు బయోపిక్ తీసేంత అవసరం లేదని… తాను చాలా సాధారణ జీవితం గడుపుతున్నా అని.. అలాంటి నాపై బయోపిక్ తియ్యాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు మహేష్ బాబు. |
https://www.telugupost.com/movie-news/dil-raju-attitude-82475/ | ఇలానే ఉంది ఒక టాలీవుడ్ నిర్మాత వ్యవహారం. టాలీవుడ్ తోపుగా చెప్పుకునే దిల్ రాజు చిన్న హీరోలతో, మీడియం హీరోలతో బడా హీరోలతో సినిమాలు చేసి హిట్స్ కొడుతుంటాడు. ఆయన నిర్మాణంలో పనిచేస్తే గ్యారెంటీ హిట్ అనుకునే హీరోలు చాలామందే టాలీవుడ్ లో ఉన్నారు. ఇక తనకు కలిసొచ్చిన హీరోనైతే రెండు మూడు సినిమాలకు ముందే లాక్ చేసి పారేస్తాడు దిల్ రాజు. ఇక డిస్ట్రిబ్యూటర్ గా కూడా చక్రం తిప్పుతున్న దిల్ రాజు నిర్మాతగా సినిమాలు చేస్తే తమ సినిమాకి ఢోకా ఉండదని చెబుతుంటారు. అయితే అలా హీరోలు చెప్పడం వలన దిల్ రాజుకి ఓవర్ కాన్ఫిడెన్స్ బాగానే ఎక్కువైనట్లుగా కనబడుతుంది. అందుకే ఫ్లాప్స్ లో ఉండి తన దగ్గరకొచ్చే హీరోల గురించి పబ్లిక్ గా ఏదేదో మట్లాడేస్తున్నాడు.ఫ్లాప్స్ లో ఉన్నాడనే అతనితో సినిమా...ఈ మధ్యన దిల్ రాజు మాట్లాడే మాటలు చూస్తుంటే కొంత మంది హీరోలను తనకి తెలిసి అవమానిస్తున్నాడో తెలియకుండా అవమానిస్తున్నాడో అనే విషయం అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న లవర్ సినిమా విషయంలోనూ అంతే. అసలే కష్టాల్లో ఉన్న రాజ్ తరుణ్ ఏదో దిల్ రాజు నిర్మాతగా సినిమా చేస్తే హిట్ అవుతుందని.. లక్కు మళ్ళీ కలిసొస్తుందని అనుకుంటే.. లవర్ ని తన బ్యానర్ లోనే నిర్మించిన.. పెద్దగా పట్టించుకోకపోగా... రాజ్ తరుణ్ ఫ్లాప్స్ లో ఉన్నాడు కాబట్టే లవర్ సినిమా చేశానని చెప్పిన దిల్ రాజు తాజాగా మరో హీరోపై నోరు పారేసుకున్నాడు.నితిన్ పైన కూడా జాలి చూపించాడు...నితిన్ హీరోగా శ్రీనివాస కళ్యాణం సినిమాని శ్రద్దగా నిర్మించిన దిల్ రాజు..నితిన్ మీద కూడా సెటైర్ వేసేశాడు. శ్రీనివాస కళ్యాణం కి ముందు రెండు సినిమాల ఫ్లాప్స్ తో ఉన్న నితిన్ దిల్ రాజు దగ్గరకెళ్ళి తనకో సినిమా చేసి పెట్టమన్నాడట. ఇక సతీష్ వేగేశ్న కథతో నితిన్ తో సినిమా చేసిన దిల్ రాజు గమ్మునుంటే ఓకె.. కానీ నితిన్ ని ఫ్లాప్స్ నుండి బయటెయ్యడానికే శ్రీనివాస కళ్యాణం సినిమాని నిర్మించినట్లుగా... నితిన్ తనని సినిమా చెయ్యమని అడిగినట్లుగా... గొప్పగా చెబుతున్నాడు. మరి సినిమా విడుదలకు ముందే హీరోల మీద జాలితో సినిమాలు చేస్తున్నట్లుగా దిల్ రాజు చెప్పడం ఎంత వరకు కరెక్ట్. అయినా ఇలా చేస్తే దిల్ రాజుకి ఏ స్టార్ హీరో అయినా సినిమాని నిర్మించే అవకాశం కల్పిస్తారా అంటూ సెటైర్స్ వేస్తున్నారు జనాలు. మరి దిల్ రాజు కావాలని మాట్లాడుతున్నాడో... లేదంటే పొరపాటున మాట్లాడుతున్నాడో గానీ ఈ వ్యవహారం మాత్రం దిల్ రాజు పీకకి చుట్టుకునేలా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. |
https://www.telugupost.com/movie-news/anu-emmanuel-71442/ | ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ కి అవకాశాలు రావాలే గాని ఎడాపెడా రెండు, మూడు సినిమాలు చేసుకుపోతున్నారు. గతంలో సమంత, కాజల్, అనుష్క లాంటి వాళ్లు అలానే స్టార్ హీరోయిన్స్ అయ్యారు. ప్రస్తుతం కూడా అలాంటి హీరోయిన్స్ ఉన్నారు. ఆ లిస్టులో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు డీజే దువ్వాడ జగన్నాధంలో బికినీ తో దున్నేసిన పూజ హెగ్డే. డీజే సినిమాతో వరుస ఆఫర్స్ ని ఒడిసిపట్టుకున్న పూజ హెగ్డే ప్రస్తుతం ముగ్గురు స్టార్ హీరోలతో సెట్స్ మీదకెళ్లబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్న పూజ హెగ్డే మహేష్ తో వంశి పైడిపల్లి తెరకెక్కించబోతున్న సినిమాతో సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అయ్యింది. అలాగే ప్రభాస్ - రాధాకృష్ణ సినిమాలోనూ హీరోయిన్ గా చేయబోతుంది. మరి ఎన్టీఆర్ తో మాస్ స్టెప్స్ వేస్తూ చాలా కష్టపడాలి. కానీ మహేష్ సినిమాలో పెద్దగా డాన్స్ లు చెయ్యాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రభాస్ తో సినిమా కూడా. మరి ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న పూజ హెగ్డే కి రాని డేట్స్ క్లాష్ ఒకే ఒక సినిమా చేతిలో ఉండగా మరో సినిమాకి ఎందుకు వస్తుంది.అనునే తప్పుకుందా...తప్పించారా..?ఆ విషయం ఏదో అను ఇమ్మాన్యుయేల్ కే తెలియాలి. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య సినిమాలు రెండూ పోవడంతో ఢీలా పడ్డ అను ఇమ్మాన్యుయేల్ కి నాగ చైతన్య - మారుతిల శైలజారెడ్డి సినిమా ఆఫర్ ఉంది. అలాగే రవితేజ - శ్రీను వైట్ల సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. అయితే తాజాగా అను ఇమ్మాన్యువల్ తాను రవితేజ సినిమా నుండి తప్పుకుంటున్నట్టుగా చెప్పడమే కాదు, కారణం కూడా చెప్పేసింది. తనకి శైలజ రెడ్డి సినిమా డేట్స్ రవితేజ - శ్రీను ల సినిమా డేట్స్ సెట్ కాకపోవడంతోనే రవితేజ సినిమా నుండి తప్పుకున్నా అని చెప్పింది. మరి కేవలం రెండు సినిమాల్లో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం జోక్. మరి అనునే తప్పుకుందా? లేకపోతే ప్లాప్ హీరోయిన్ మనకెందుకులే అని రవితేజ అండ్ కో తప్పించారో? అనేది ప్రస్తుతానికున్న పెద్ద డౌట్.కుటుంబసమస్యలతో సతమతం....అయితే అను ఇమ్మాన్యువల్ తన ఫ్యామిలీ విషయంలో ఎదో సఫర్ అవుతుందని, అందుకే ఇలా సినిమాలు వదిలేసుకుంటుందని అంటున్నారు. గతంలో నా పేరు సూర్య సక్సెస్ మీట్ కి కూడా తాను రాలేకపోతున్నానని, క్షమించమని, తనకున్న ఫ్యామిలీ ప్రోబ్లమ్స్ తోనే తాను ఈ ఈవెంట్ కి రాలేదని చెప్పింది. మరి అనుకి ఉన్నఆ ఫ్యామిలీ ప్రోబ్లెమ్స్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఏదైనా అను రవితేజ సినిమా విషయంలో అబద్ధమాడుతుందనే టాక్ మాత్రం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. |
https://www.telugupost.com/top-stories/nara-lokesh-is-out-of-the-side-he-had-been-on-the-offensive-until-earlier-has-now-backed-down-1348720 | నారా లోకేష్ సైడ్ అయిపోయాడు. మొన్నటి వరకూ దూకుడు మీద ఉన్న చినబాబు ఇప్పుడు కొద్దిగా వెనక్కు తగ్గాడు. ఎన్నికలు దగ్గరపడే సమయం కొద్దీ చినబాబును కొంత బ్యాక్ ను పెడుతున్నట్లే కనిపిస్తుంది. నారా లోకేష్ టీడీపీకి భవిష్యత్ లో సారథ్యం వహించాలి. దానిని ఎవరూ కాదనరు. చంద్రబాబు తర్వాత పార్టీలో ఆయనదే రెండో స్థానం. అందులో నో డౌట్. ఇప్పుడిప్పుడే ఆయన రాజకీయంగా రాటుదేలుతున్నారు. ట్విట్టర్ కే పరిమితమయ్యారన్న విమర్శలున్నప్పటికీ దానికి లెక్క చేయకుండా తాను చెప్పాల్సింది చెబుతున్నారు. తిట్టాల్సింది తిట్టిపారేస్తున్నారు.అప్పటి నుంచే....చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి రావడం, తర్వాత పార్టీ కార్యలయంలో గుక్కపెట్టి ఏడ్వడం వంటి సంఘటన తర్వాత నారా లోకేష్ పార్టీ యాక్టివిటీస్ కు కొంత దూరంగా ఉంటున్నారు. ఆయన మంగళగిరి నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. అమరావతికి వచ్చినప్పుడల్లా లోకేష్ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. అక్కడ నేతగా ఉన్న చిరంజీవిని కూడా చీరాలకు పంపేందుకు నారా లోకేష్ సిద్ధమయ్యారు.చినబాబు జోక్యాన్ని....ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు లోకేష్ జోక్యాన్ని పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారట. పూర్తిగా మంగళగిరిలో గెలవడంపైనే దృష్టి పెట్టాలని కోరారట. ఈసారి గెలవకుంటే రాజకీయంగా మరింత ఇబ్బందులు ఎదురవుతాయని, ఆలోచించుకోవాలని లోకేష్ కు చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయాల్లోనూ లోకేష్ జోక్యం లేకుండా చంద్రబాబు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ ఎన్నికలకు....లోకేష్ పట్ల టీడీపీ క్యాడర్ లో మంచి అభిప్రాయమున్నా, ప్రజల్లో ఇంకా ఏర్పడకపోవడంపై లోకేష్ ను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచనున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ, పొత్తుల అంశంపైన కూడా లోకేష్ జోక్యం ఉండబోదు. కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ సైకిల్ యాత్ర చేయాలని భావించినా అందుకు కూడా చంద్రబాబు అంగీకరించలేదని తెలిసింది. లోకేష్ ఫోకస్ అవ్వడానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు. అందుకే చినబాబు సైకిల్ యాత్ర కూడా లేనట్లేనని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/నా-పేరు-సూర్య-ప్రీ-రిలీజ్-68603/ | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా వస్తున్న చిత్రం 'నా పేరు సూర్య'. ఈ సినిమాలో బన్నీ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చాలా సినిమాలకి స్టోరీ అందించిన వకాంతం వంశీ తొలిసారిగా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. కొన్ని రోజులు కింద ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్ అని ( టీజర్ ) రిలీజ్ చేసారు. ఆ టీజర్ లో బన్నీ పాత్ర ఏంటో అర్ధం అయ్యిపోయింది. ఇక లేటెస్ట్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోవడంతో... ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది.ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 77.65 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. తెలుగు స్టేట్స్ లో 61.95 కోట్లు.. ఓవర్సీస్ 7.2 కోట్లుకు అమ్ముడైంది. నా పేరు సూర్య ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మీకోసం..ఏరియా బిజినెస్ ( కోట్లు )నైజాం 20.20సీడెడ్ 11.25నెల్లూరు 2.60కృష్ణ 4.50గుంటూరు + వైజాగ్ 14.00ఈస్ట్ గోదావరి 5.20వెస్ట్ గోదావరి 4.20టోటల్ (ఏపీ & టీఎస్) 61.95రెస్ట్ అఫ్ ఇండియా (తమిళ్ +కర్ణాటక +నార్త్) 8.50ఓవర్సీస్ 7.20టోటల్ (వరల్డ్ వైడ్ ) 77.65 |
https://www.telugupost.com/movie-news/movie-artist-association-elections-are-about-to-begin-elections-are-taking-place-at-jubilee-hills-public-school-203888/ | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ లు పోటీ పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు జరుగుతున్నాయి. కులం, ప్రాంతం అన్ని అంశాలు ఈ ఎన్నికల్లో ఆరోపణలుగా మారాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరిది గెలుపు అన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం రెండు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. |
https://www.telugupost.com/movie-news/దిల్-రాజు-కే-టోకరా-వేశారే-53394/ | పైరసీ చీడపురుగు సిని నిర్మాతలను భయపెట్టిస్తుంది. విడుదలకు ముందే మీ సినిమా ఫైరసీ కాకుండా ఉండాలంటే మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని భయాందోళనకు గురిచేస్తున్నారు. 2012 నుంచి జవాన్ సినిమా వరకు ఓ ముఠా ఫైనాన్సియర్స్ నుంచి ఇలాగే డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దిల్ రాజ్ కే టోకరా పెడుతామని హెచ్చరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైరసీ కారణంగా టాలీవుడ్ కు ఏటా వెయ్యి కోట్ల మేర నష్టం వాటిళ్లుతోంది. ఫైరసీ పేరుతో విడుదల కాకముందే ఓ భయంపట్టుకుంటుంది. పెద్ద సినిమాలకు ఫైరసీ భూతం పట్టి పీడిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా పైరసీ బారినపడిందని నిర్మాత రాధాకృష్ణ... న్యాచురల్ స్టార్ నానీ ఎంసీఏ పైరసీ అయిన సినిమాల జాబితాలో ఉందని దిల్ రాజ్ లు బుధవారం హైదరాబాద్ సి.సి.ఎస్. పోలీసులను ఆశ్రయించారు.పైరసీ కాకుండా ఉండాలంటే....గతంలోనూ పవన్-త్రివిక్రమ్- రాధాకృష్ణ కాబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడింది. దీనికి తోడు మళ్లీ ఫైరసీ గాళ్లు కాపుకాసుకుని కూర్చోవడంతో రాధాకృష్ణకు పోన్లు చేసి మరి సినిమా ఫైరసీ కాకుండాఉండాలంటే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రాధాకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. అయితే 2012 నుంచి పైరసీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గిరిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టా సుధాకర్ చౌదరీ, పుట్ట ప్రభాకర్ చౌదరీ, విజయలక్ష్మి చౌదరీలను అరెస్ట్ చేశారు. అయితే సినిమా ఫైరసీల పై చీమకుట్టిన దొంగలా ఉన్న సినిమా పెద్దలు.. ఇప్పుడు హాట్ హాట్ కామెంట్లు చేశారు. ఎంసీఏ సినిమాను విడుదలకు ముందే పైరసీ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు.. డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు జవాన్ సినిమా అప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని తెలిపారు. తమకు ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తున్నా ..... అటు ప్రభుత్వానికి , ఇటు సినిమా ఇండ్రస్టీకి నష్టం చేస్తున్నారని సినిమా పెద్దలు వాపోతున్నారు. ఫైరసీని అరికట్టేందుకు పోలీసులు ఐ.టీ. మినిస్టర్ కు కొత్త చట్టం పై నివేదిక అందించారు. టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని పోలీసులు ప్రభుత్వానికి విన్నవించారు. |
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-next-movie-105291/ | టాక్సీ వాలా’ లాంటి డీసెంట్ హిట్ తరువాత విజయ్ దేవరకొండ భరత్ కమ్మ అనే కొత్త డైరెక్టర్ తో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి కాకినాడ షెడ్యూల్ కంప్లీట్ అయింది. చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈసినిమా తరువాత విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని మనకు అందించిన క్రాంతి తన నెక్స్ట్ మూవీ విజయ్ తో చేయనున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోవడంతో త్వరలోనే ఈ ప్రోజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. దీన్ని కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు. హీరో గా విజయ్ అయితే ఫిక్స్ అయ్యాడు కానీ హీరోయిన్ ఎవరు అనేది ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు. చాల పేర్లు విపిస్తున్న లేటెస్ట్ గా కేథరిన్ ను ఎంచుకున్నారనేది తెలుస్తుంది. తేజ డైరెక్ట్ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ తో అందరిని ఫిదా చేసిన కేథరిన్ తొలిసారిగా విజయ్ తో చేయనుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉండడంతో ఆమెను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. |