id
int64
1.71k
92.9k
url
stringlengths
5
925
title
stringlengths
0
772
text
stringlengths
221
3.81k
summary
stringlengths
85
1.62k
83,655
https://www.prabhanews.com/2020/10/uppa-lbmagar-road-closed/
జలమయమైన హైద రాబాద్ న గ రం
హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఇక -ఉప్పల్ – ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ – కోఠి రోడ్లు మూసివేశారు. -బేగంపేటలో రహదారిపై భారీగా వరద నీరు పారుతోంది. కాచిగూడ రైల్వేష్టేషన్లో పట్టాలపై నిలిచిన వర్షపు నీరు నిలిచింది. అలాగే నిజాంపేటతో పాటు బండారి లేఅవుట్ జలమయమైంది. మెహిదీపట్నం – హైటెక్ సిటీ రహదారి జలమయమైంది. కూకట్పల్లి ఐడీపీఎల్, హాఫిజ్పేట చెరువులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. గచ్చిబౌలి నుంచి హెచ్సీయూ వెళ్లే దారిలో భారీగా వర్షపు నీరు నిలిచింది. బెంగళూరు – హైదరాబాద్, విజయవాడ హైవేలపై రాకపోకలను నిలిపివేశారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలోనికి నీరు ప్రవేశించింది.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తమై హైఅలర్ట్ ప్రకటించి సహాయ చర్యలు ముమ్మరం చేశారు. దానిలో భాగంగా రెండు రోజులు సెలవులు ప్రకటించడంతో పాటు ఉప్పల్- ఎల్బీనగర్ తదితర రోడ్డులపై రాకపోకలను నిలిపివేశారు. ఇదిలా ఉండగా కాచిగూడ రైల్వే స్టేషన్ లో పట్టాలపై వర్షపు నీరు నిలిచిపోయింది. అలాగే వరద నీరు వల్ల రహదారులు జలమయం కాగా చెరువులకు భారీగా వరద నీరు చేరుతోంది.
83,676
https://www.prabhanews.com/2020/09/bihar-election-schedule-released/
ఆకాశాన్నంటిన ఉల్లి ధర
దేశవ్యాప్తంగా ఉల్లి ధర కష్టమర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్లో అయితే ఏకంగా కేజీ ఉల్లి ధర రూ. 70 నుంచి రూ. 80 పలుకుతుంది. హైదరాబాద్ లోని పలు మార్కెట్లలో కేజీ రూ. 50కు పైగా అమ్ముడుపోతుంది. హైదరాబాద్ లో గత 10 రోజుల క్రితం కిలో 15 రూపాయిలున్న ఉల్లి క్రమంగా నేటికి 50కి చేరింది. మహారాష్ట్ర తదితర ఉల్లి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రవాణాకు అంతరాయం కలుగుతుండటంతో సరఫరా తగినంతగా లేకపోవడం ఇందుకు కారణంగా ప్రభుత్వం చెబుతుంది. ఈ క్రమంలోనే ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. పలు రాష్ట్రాల్లో ఉంచిన నిల్వలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. . ఇదే సమయంలో విదేశాలకు ఉల్లి ఎగుమతులను నిషేధించింది. . ఇక ఢిల్లీలో నాఫెడ్, ఎన్ సీసీఎఫ్ , మదర్ డైరీల ద్వారా కేజీ రూ. 22, రూ. 23.90లకు అమ్ముతున్నారు. ఎపిలో కూడా ఉల్లి ధర బాగా పెరిగిపోయింది. ఉల్లి సాగు చేసిన కర్నూలు ప్రాంతాల నుంచి కూడా దీపావళి తర్వాతే ఉల్లి దిగుబడి అయ్యే అవకాశం ఉండడంతో అప్పటివరకు ధరల్లో పెరుగుదల ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా మరోసారి ఉల్లి ధర ఆకాశాన్ని అందుకుంటుంది. ఢిల్లీ మార్కెట్లో అయితే కిలో ఉల్లి ధర 80 రూ. అయ్యింది. ఇక హైదరాబద్ లో గత వారం 15 రూ. కిలో ఉన్న ధర నేడు 50 రూ. చేరింది. భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరగటమే దీనికి కారణమని ప్రభుత్వం చెప్తుంది. ఈ క్రమంలోనే విదేశాలకి ఎగుమతి నిలిపివేయాలని మరియు పలు రాష్ట్రాల్లో ఉంచిన నిల్వలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలంటూ ఆయ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు రాసింది.
83,709
https://www.prabhanews.com/2020/08/temple-idols-venkayya/
రామమందిర నిర్మాణానికి జమచేరుతున్న విరాళాలు
అయోధ్యలో రామమందిర నిర్మాణమంటే శ్రీరాముడు తన జీవితంలో ఆచరించి చూపిన సత్యం, నైతికత, సౌభ్రాతత్వం వంటి ఆదర్శ విలువలకు పున:పట్టాభిషేకం చేయడమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. శ్రీరాముడి సత్ప్రవర్తనే కాదు, స్వయంగా పాటించి చూపిన విలువలు భారతీ య చేతనలోని మూలాలను ప్రతిబింబిస్తాయని ఆయ న #హర్షం వ్యక్తం చేశారు. రామమందిర నిర్మాణాన్ని ఒ క మతపరమైన కార్యక్రమంగా కాక ఉన్నతమైన, సనాతనమైన మానవ విలువలకు ప్రతీకగా మనకు ఎల్లప్పుడూ మార్గదర్శనంగా చూడాలని పిలుపుని చ్చారు. ఆలయ నిర్మాణ సంకల్పంతో ప్రతి పౌరుడి కలలు సాకారమయ్యే భారతావని నిర్మాణం జరగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. అయోధ్యలో రామ మం దిరానికి జరుగుతున్న భూమిపూజను పురస్కరిం చుకుని వెంకయ్య నాయుడు, తన సతీమణి, వ్యక్తిగత సిబ్బందితో కలిసి రామాయణ పారాయణం చేశారు. పీఎం కేర్స్ నిధి, రామమందిర నిర్మాణానికి ఉపరా ష్ట్రపతి సతీమణి శ్రీమతి ఉషారాణి 10 లక్షల చెక్కులు పంపించారు. వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులు పీఎం కేర్స్ నిధికి రూ. 5లక్షలు, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మరో రూ. 5లక్షల చొప్పున మొత్తంగా రూ. 10లక్షలను విరాళంగా ప్రకటించారు. వెంకయ్య నాయుడు కుమారుడు #హర్ష, కోడలురాధ, కూతురు దీపావెంకట్, అల్లుడు వెంకట్ ఇమ్మణ్ని, మనుమడు విష్ణు, మనవరాళ్లు సుష్మాచౌదరి, నిహారిక, వైష్ణవిలు ఈ విరాళం ఇచ్చేందుకు చొరవ తీసుకున్నారు. కరోనా పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు పీఎం కేర్స్ నిధికి రూ. 5 లక్షలు, అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం శ్రీ రామజన్మభూమి క్షేత్ర ట్రస్టుకు మరో రూ. 5లక్షల చెక్కును పంపించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి ఈ ఏడాది మార్చిలో కరోనా పోరాటానికిగానూ పీఎం కేర్స్ నిధికి తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వడంతో పాటు, కరోనా పరిస్థితులు చక్కబడేం తవరకు ఈ నిధికి తన వేతనంలో 30 శాతం కూడా ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయోధ్య రామ మందిరం నిర్మాణం అంటే శ్రీరాముడు తన జీవితంలో ఆచరించి చూపిన సత్యం,నైతికత, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శ విలువలకు పున:పట్టాభిషేకం చేయడం అని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. అయోధ్య రామ మందిరానికి జరుపుతున్న భూమి పూజకు కుటుంబ సమేతంగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణంతో ప్రతి పౌరుడు కలలు సాకారమయ్యే కొత్త భారతావని రూపుదిద్దుకుంటుందన్నారు. అనంతరం ఆయన సతీమణి రామమందిర నిర్మాణానికి,పిఎం కేర్స్ నిధికి 10 లక్షల చెక్కులు అందచేశారు. ఆమెతో పాటు వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యులు కూడా మందిరానికి 5లక్షలు, పీఎం కేర్స్ నిధికి 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. అంతకుముందు కరోనా పరిస్థితులు చక్కబడేంతవరకు మార్చిలో వెంకయ్యనాయుడు తన వంతుగా 1 నెల జీతంతో పాటు,ప్రతి నెల తన జీతంలో 30% పిఎం కేర్స్ కి విరాళంగా ఇస్తున్నట్లు విదితమే.
87,449
https://www.prabhanews.com/2018/10/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1-%e0%b0%a8%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b1%88-%e0%b0%a6%e0%b1%8a%e0%b0%82/
టిడిపి ప్రబుత్వం కూల్చడానికి దొంగల ముఠా ఏర్పడింది: దేవినేని ఉమా
ఐదున్నరకోట్ల మంది తెలుగు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలుచేసేందుకు, కూల్చేందుకు దొంగలంతా కలసి దొంగలముఠాగా ఏర్పడ్డారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం నాడు జి. కొండూరు మండలంలోని చిన్న నందిగామ గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా ప్రసంగించారు. ఈ దొంగల ముఠాకి ప్రధాని మోదీ సూత్రధారి అయితే, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాత్రధారులని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావాల్సిన డబ్బులివ్వాలని ఆడిగినందుకే వందల మంది ఐటీ అధికారులతో కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని, రాష్టంలోని పారిశ్రామిక వేత్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోడికత్తి నాటకామాడి రాష్టంలో అల్లర్లు సృట్టించేందుకు తద్వారా రాష్ట్రపతి పాలన పెట్టేందుకు కుట్ర చేస్తున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి14 మంది పోలీసులతో సెక్యూరిటీ ఇచ్చామని, 3వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఈగ వాలకుండా చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిధిలోని ఎయిర్ పోర్టులో జరిగిన సంఘటన ను సాకుగా చూపి వైకాపా నాయకులు సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. కోడికత్తి లాంటి పిల్ల రాజకీయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు చేతకావని, హత్యా రాజకీయాలకు, ఫ్యాక్షన్ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ ఎంతో దూరమని తెలిపారు. సమస్యలను ఎదుర్కోవడం చంద్రబాబు కు కొత్తకాదని, లక్ష సమస్యలొచ్చినా ఒకే ఒక్కడిగా ఢీ కొంటారని చెప్పారు. గ్రామదర్శిని కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా సమూహాన్ని చూసి మంత్రి ఉమామహేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. చిన్న నందిగామలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశామని, ఎస్సి మత్స్యకారులకు రూ. 40 లక్షలతో బిల్డింగ్ నిర్మాణం చేశామని, రూ. కోటి రూపాయలతో సీసీ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 22 కొత్త ఎత్తిపోతల పథకాలు చేపట్టి రైతులకు సాగు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మూడో జోన్ కు నాగార్జున సాగర్ నీళ్లు తెచ్చేందుకు అహర్నిశలు శ్రామిస్తున్నట్లు, చివరి ప్రాంత భూములకు కూడా సాగు నీరు ఇచ్చి తీరుతామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు.
జి. కొండూర్ లోని చిన్న నందిగమలో శనివారం జరిగిన గ్రామ దర్శిని గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో పల్గున్న మంత్రి దేవినేని ఉమా తెలుగు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు జగన్మోహన్ రెడ్డి, కన్న లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్, కేసిఆర్ ,మోడీ అందరు కలిసి దొంగల ముఠాగా ఏర్పడ్డారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావాల్సిన డబ్బులివ్వాలని ఆడిగినందుకు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసేలా వారిపై ఐటి దాడులు నిర్వహించారన్నారు. కోడికత్తి నాటకామాడి వైకాపా నాయకులు సానుభూతి పొందాలని చూస్తున్నారని, ఇలాంటివి చంద్రబాబు నాయుడు కు చేతకావని, ఆయనకు లక్ష సమస్యలు ఎదురు వచ్చినా ఎదుర్కోగల సామర్ధ్యం ఉందన్నారు. అనంతరం చిన్న నందిగామలో టిడిపి ప్రబుత్వం చేప్పట్టిన, చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయను వివరించారు.
88,437
https://www.prabhanews.com/2019/04/%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2-2/
పవన్ కల్యాణ్ విమర్శలపై స్పందించిన అలీ
జనసేనాని పవన్ కల్యాణ్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నటుడు అలీ కౌంటర్ ఇచ్చారు. రాజమండ్రి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అలీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విమర్శలకు స్పందించిన అలీ, తాను పుట్టింది, పెరిగింది రాజమండ్రి అని చెబుతూ, పుట్టిన గడ్డకు తన తండ్రి పేరున ట్రస్ట్ పెట్టుకుని సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. అలాంటి రాజమండ్రిలో పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు. చుట్టుపక్కల వారి ప్రోద్బలంతోనే పవన్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నానని అలీ అన్నారు. పవన్ ను తన గుండెల్లో పెట్టుకున్నానని చెప్పిన అలీ, ఆయన బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో తానే మొదటి వాడినని చెప్పారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డానని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని అలి తప్పుపట్టారు. ఆయన తనకు ఏ విధంగా సాయపడ్డారో చెప్పాలన్నారు. డబ్బులు ఇచ్చారా, తనకు ఏవైనా సినిమాల్లో చాన్స్ ఇప్పించారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రావడానికి ముందు నుంచీ తాను మంచి పొజిషన్ లో ఉన్నానని అలీ చెప్పారు. తాను జనసేన టికెట్ కోసం ఎవరి పేరునూ సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు. వైసిపిచేరితే తప్పేంటి? అదేమైన నేరమా? రాజ్యాంగంలో రాసుందా అక్కడకు వెళ్లకూడదని అనిఅలీ పశ్నించారు.
రాజమండ్రి ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్, అలీ పై చేసిన విమర్శలపై అలీ స్పందించాడు. ఆ విమర్శలు తనను బాధపెట్టాయని, పుట్టిన గడ్డ పై తండ్రి పేరుతో ట్రస్ట్ పెట్టుకుని సేవలందిస్తున్నానని అలీ చెప్పారు. పవన్ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను మొదటవాడనని అన్నారు. తాను కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్నాడని పవన్ చెప్పిన వ్యాఖ్యల పై తప్పుపట్టాడు. ఎలాంటి విషయంలో సహాయం చేయలేదని, పవన్ సినిమాల్లోకి రావడానికి ముందు నుండే తాను స్థిరపడ్డానని అలీ అన్నారు. అయినా వైసిపిచేరితే అందులో తప్పేమైన ఉందా, అక్కడకు వెల్లోద్దని రాజ్యాంగంలో రాసుందా అని అలీ ప్రశ్నించారు.
90,404
https://www.prabhanews.com/2020/12/%E0%B0%AA%E0%B0%B5%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88-%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81-%E0%B0%86%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%A8
పవన్ విమర్శలపై చంద్రబాబు ఆవేదన
గత నాలుగేళ్లుగా తాను మంచివాడ్ని ఇప్పుడు చెడ్డవాడ్నయ్యానా అని చంద్రబాబు అన్నారు. శాసన మండలిలో ఆయన తన ప్రసంగంలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రతి విమర్శకూ సమాధానం చెప్పారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని ఆయనను హెచ్చరించారు. ఉద్దానం సమస్యను పవన్ తన దృష్టికి తీసుకువచ్చినప్పుడు బాధ్యతతో స్పందించామని, వారిని ఆదుకోవడానికి ఎన్నో చేశామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఎవరు మనకు ఇవ్వాలి? ఎవరిమీద పోరాడాలి? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తాను ఎవరి మీద పోరాడుతున్నాను? కేంద్రంపైన, మోడీ పైనా అయితే ఈయన చేస్తున్నదేమిటి? ఆయన కనీసం ఒక్క మాట మోడీగారిని అన్నారా అని పవన్ కల్యాణ్ ను విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను, రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను, ఇవి తమ హక్కులని చెబుతున్నాను అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అందుకు కారణం ప్రధాని మోడీ అని రాష్ట్రంలోని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని చంద్రబాబు అన్నారు. అలాంటిది మోడీని పల్లెత్తుమాట అనకుండా నాపై విమర్శలేమిటి? ఇది దేనికి సంకేతం అని చంద్రబాబు ప్రశ్నించారు.
శాసన మండలిలో చంద్రబాబు ప్రసంగిస్తూ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు సమాధానమిస్తూ పవన్ ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడని, ఉద్దానవనం సమస్య పవన్ దృష్టికి తేగానే స్పందించానని, ప్రత్యేక హోదా కోసం కేంద్రం, మోడీ పైన పోరాడుతూ విభజన చట్టంలోని హామీలను, రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే పవన్ ఒక్క మాట కూడా మోడీని అనడం లేదు కదా గత నాలుగేళ్లుగా మంచివాడిగా ఉన్న తను తనకు చెడ్డవాడినయ్యానన్నాడు.
90,597
https://www.prabhanews.com/2019/05/%e0%b0%b8%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9f%e0%b1%80-%e0%b0%85%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%86%e0%b0%b3/
ఒక సామాన్యురాలిని వివాహమాడబోతున్న థాయ్ రాజు
బ్యాంకాక్: సాధారణంగా ఒక దేశపు రాజు గాని, రాణి గాని ఎవరిని పెళ్లి చేసుకుంటారు ? మరో రాజవంశానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటారు. అయితే రాజవంశాలకు చెందినవారు ఒక్కోసారి సామాన్యులను వివాహమాడిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. ప్రస్తుతం థాయ్ లాండ్ రాజు ఈ పనే చేయబోతున్నాడు. థాయ్ రాజు మహా వాజిరాలాంకోర్న్ తన వ్యక్తిగత భద్రతా దళంలోని డిప్యూటీ కమాండెంట్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజు హోదా కంటే సెక్యూరిటీ అధికారి తక్కువే కదా. మరి రాజు తలచుకుంటే పెళ్లి ఆగుతుందా. సుతిదా అనే ఈ భద్రతాధికారి గతంలో థాయ్ ఎయిర్వేస్ లో పనిచేసేది. ఓ సారి రాజు గారు విమానంలో వెళుతున్నప్పుడు ఈమెను చూసి మనసు పారేసుకున్నారు. వెంటనే ఆమెను తీసుకొచ్చి తన వ్యక్తిగత భద్రతా దళంలో డిప్యూటీ కమాండెంట్ గా నియమించాడు. ఇప్పుడు ఈమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మనసు పారేసుకున్న ప్రియురాలిని పెళ్లి చేసుకుంటున్న రాజుకు ఇది తొలి వివాహం కాదు. ఇప్పటివరకు ముగ్గురిని చేసుకొని వారికి విడాకులిచ్చాడు. ఇప్పుడు ఇది నాలుగో పెళ్లి. త్వరలోనే ఆయన అధికారికంగా రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు.
సాధారణంగా రాజవంశాలకు చెందినవారు వారి వంశానికి చెందినవారినే పెళ్లాడతారు. కానీ చరిత్రలో రాజవంశీయులు సామాన్యులిని పెళ్లాడిన సంఘటనలు లేకపోలేదు. అదే కోవలో థాయ్ రాజు వాజిరాలాంకోర్న్ తన భద్రతాదళంలో డిప్యూటీ కమాండెంట్ గా ఉన్న సుతిదా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. సుతిదా మొదట్లో థాయ్ ఎయిర్వేస్ లో పని చేసేది. రాజు గారు ఒకసారి విమానంలో వెళ్తుండగా ఈమెను చూసి ఇష్టపడి, తన భద్రతాదళానికి అధికారిగా నియమించారు. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోబోతుండగా, ఆయనికది నాలుగో వివాహం.
90,638
https://www.prabhanews.com/2019/04/%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%a2%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80-%e0%b0%b0%e0%b1%82-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%bf%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/
ఫేస్ బుక్ ప్రకటనలతో జోరుగా సాగిన ప్రచారం
మొదటి దశ ఎన్నికలు మరో మూడు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ప్రచారం హోరెత్తుతోంది. నేరుగా వెళ్లి ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థులు కలుస్తున్నారు. అంతేకాకుండా వివిధ మాధ్యమాల ద్వారా చేరువయ్యేందుకు అందుబాటులో ఉన్న ప్రతి విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫేస్బుక్ అగ్రస్థానంలో నిలిచింది. రాజకీయ నాయకులు, వారి అభ్యర్థులు ఫేస్బుక్ను ఉపయోగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఫేస్ బుక్లో రూ. 10 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రకటనలు ఇచ్చా రు. ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ రిపోర్ట్ వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 51,810 రాజకీయ ప్రకటనలు వచ్చాయి. ఈ ప్రకటనలకు గానూ రూ. 10.32 కోట్లు వెచ్చించారు. అత్యధికంగా బీజేపీ, బీజేపీ మద్దతుదారులు ఇచ్చిన ప్రకటనలే ఉన్నా యి. గతవారం (ఫిబ్రవరి 23న ముగిసింది) నాటికి 41,974 రాజకీయ ప్రకటనలకు రూ. 8.58 కోట్లు చెల్లించారు. రాజకీయ, జాతీయ ప్రాధాన్యత అంశాలుగా ప్రకటనలు ఉంటున్నాయని ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ రిపోర్టు స్పష్టం చేసింది.
రానున్న మూడు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా, వివిధ మాధ్యమాల ద్వారా ఓటర్లకు దగ్గరయ్యేందుకు నేతలు గట్టి ప్రయత్నం చేశారు. కాగా పలువురు రాజకీయ నేతలు, అభ్యర్థులు ఫేస్బుక్ను వినియోగించి ప్రచారం సాగించారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ రిపోర్ట్ వివరాలను పరిశీలించగా, ఫిబ్రవరి-మార్చి నెలల్లో 51,810 రాజకీయ ప్రకటనలు రాగా, ఇందుకోసం రూ. 10.32 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ ప్రకటనల్లో బీజేపీ సంబంధిత ప్రకటనలే అధికంగా ఉన్నాయి.
90,683
https://www.prabhanews.com/2019/05/kaleswaram-chakavhaka/
కాళేశ్వరం ప్రాజెక్టు పై కెసిఆర్ ఆదేశాలు మరియు అభినందనలు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంప్హౌజ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయడంతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యారేజీలు, పంప్హౌజ్ల వద్ద ఇంజనీర్లు, సిబ్బంది బసచేయడానికి వీలుగా క్వార్టర్లు, వాచ్ టవర్ నిర్మించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కె జోషి, ఎంపీ కల్వకుంట్ల కవిత, సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సి హరేరామ్, ఓఎస్డి శ్రీధర్రావు దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ల వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి ఏర్పాట్లు చేయాలని, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, బ్యారేజీల వద్ద రెండు చొప్పున హెలిప్యాడ్లు నిర్మించాలని సీఎం సూచించారు. బ్యారేజీల వద్ద ప్రవాహం ఎంత ఉదృతంగా ఉన్నా ఎంత భారీవర్షం కురిసినా ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హైఫ్లడ్ లెవెల్కు చాలా ఎత్తులో వాచ్ టవర్, సిబ్బంది క్వార్టర్లు ఉండాలని సీఎం చెప్పారు. ప్రస్తుతమున్న హెచ్ఎఫ్ఎల్ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్ఎఫ్ఎల్ ను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. చెరువులను నింపే ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయ్? ప్రాజెక్టుల పరిధిలోని కాల్వల ద్వారా చెరువులను నింపడానికి చేసిన ఏర్పాట్లను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎంతవరకు వచ్చాయ్ అని అధికారులను ప్రశ్నించారు. కాల్వలకు మూడువేలకు పైగా తూములు ఏర్పాటుచేస్తున్నామని, వాటిద్వారా గొలుసుకట్టు చెరువులు నింపడానికి ప్రణాళిక రచించినట్లు అధికారులు తెలిపారు. గతంలో చెరువులు నింపుకోవడానికి రైతులు కాల్వలు తెంపేవారని, ఇపుడు ఆపరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వమే కాల్వలకు తూములు ఏర్పాటుచేస్తున్నదని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీటితో చెరువులు నిండడంతో పాటు వర్షం ద్వారా కూడా నీరు వస్తుందని సీఎం అన్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భూగర్భజలాల మట్టం పెరుగుతుందని సీఎం అన్నారు. కాళేశ్వరంలో తొలివెట్రన్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించిన సీఎం మిగతా పనులన్నీ చకచకా ముందుకు తీసుకువెళ్ళాలని అధికారయంత్రాంగానికి సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు, పంప్హౌజ్ల నిర్మాణానికి, వారి నిర్వహణకు ప్రణాళిక రూపొందించాలని, ఇంజనీర్లకు, సిబ్బందికి ప్రవాహం ఎంత ఉదృతంగా తట్టుకొనే విధంగా చాల ఎత్తులో క్వార్టర్లు, వాచ్ టవర్ లు నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పోలీస్ క్యాంప్లు, బ్యారేజిలు వద్ద రెండు చొప్పున హేలిప్యాడ్లు నిర్మించాలని మంత్రి సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణం తరువాత వచ్చే హెచ్ఎఫ్ఎల్ ను మాత్రమే పరిగానలోనికి తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కాల్వల ద్వారా చెరువులను నింపడానికి చేసిన ఏర్పాట్లను అధికారులను అడగగా, మూడువేలకు పైగా తూములు ఏర్పాటు చేసి వాటిద్వారా గొలుసుకట్టు చెరువులు నింపడానికి ప్రణాళిక చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ వలన భూగర్భజలాల మట్టం పెరుగుతుందని, తొలివెట్రన్ విజయవంతంపై అధికారులందరి అభినందించారు. ఇదేవిధంగా అన్ని పనులను త్వరత్వరగా చేసుకుపోవాలని అధికారులు అందరిని కోరారు.
90,786
https://www.prabhanews.com/2019/04/%e0%b0%ae%e0%b1%81%e0%b0%82%e0%b0%ac%e0%b1%88-%e0%b0%9c%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b9%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%81%e0%b0%97%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf/
జెట్ ఎయిర్ వేస్ సర్వీస్ లు నిలిపివేత
జెట్ ఎయిర్వేస్ పాతికేళ్ల ప్రస్థానానికి తెరపడింది. బుధవారం రాత్రి 10.30 గంటలకు చిట్ట చివరి జెట్ విమానం అమృత్సర్లో రాత్రి 10.30 గం టలకు బయలు దేరి న్యూఢిల్లి విమానాశ్రయంలో దిగింది. గత నాలుగు నెలల నుంచి జెట్ ఎయిర్వేస్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. గత పాతిక సంవత్సరాల నుంచి జెట్ఎయిర్వేస్ దేశీ య, అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులు అం దిస్తూ వచ్చింది. చిట్ట చివరకు బుధవారం అర్ధరాత్రి నుంచి తాత్కాలికంగా విమాన సర్వీసులు నిలిపి వేసింది. కాగా ఎయిర్లైన్స్ను నడపడానికి తక్షణమే రూ. 400 కోట్లు విడుదల చేయడానికి బ్యాంకులు నిరా కరించడంతో విధిలేని పరిస్థితుల్లో అంతర్జాతీయ, దేశీయ రూట్లలో విమానసర్వీసులు నిలిపివేస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం అం దించింది. బుధవారం ఒక్క రోజు మాత్రం విమా నాలు నడుపుతామని ప్రకటించింది. అత్యవసరంగా నిధులు విడుదల చేయడానికి బ్యాంకులు నిరాకరించడంతో పాటు ఇతర మార్గాల ద్వారా నిధులు వచ్చే అవకాశాలు లేకపోవడంతో సర్వీసులు నిలిపివేయాల్సి వచ్చిందని స్టాక్ ఎక్స్చేంజీ లకు వివరణ ఇచ్చింది. విమానాలు నడపడానికి ఇం ధనం బిల్లులతో పాటు ఇతర కీలకమైన సర్వీసులకు చెల్లించడానికి నిధులు లేకపోవడంతో తాత్కాలికంగా ఎయిర్లైన్ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించి నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు జెట్ యాజమాన్యం సమా చారం అందించింది. ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన జెట్ బోర్డు సమావేశం తర్వాత యాజమా న్యం ఎయిర్ లైన్ సీఈవో వినయ్దుబేను చివరిసా రిగా బ్యాంకుల నుంచి అత్యవసరంగా రూ. 400 కోట్లు విడుదల చేయాలని కోరాలని సూచించాయి. ఒక వేళ బ్యాంకులు నిధులు ఇవ్వడానికి నిరాకరిస్తే. . బుధవారం రాత్రి నుంచి విమాన సర్వీసులు నిలిపి వేద్దామని నిర్ణయించాయి. ఇదిలా ఉండగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నే తృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం జెట్ ఎయిర్వే స్కు అత్యవసర ఫండింగ్ సమకూర్చలేమని తేల్చి చెప్పిందని జెట్ ఒక ప్రకట నలో తెలిపింది. దీంతో జెట్ బోర్డు బుధవారం నుంచి విమాన సర్వీసులను తా త్కాలికంగా నిలిపివేయా లని నిర్ణయానికి వచ్చింది.
చిట్టా చివరి జెట్ విమానం అమృత్సర్లో రాత్రి 10.30 గం టలకు బయలుదేరి న్యూఢిల్లి లో దిగింది. గత కొద్ది నెలలుగా జెట్ ఎయిర్వేస్ చాల దారుణంగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకు పోయారు. 25 సంవత్సరాలగా జెట్ఎయిర్వేస్ జాతీయ,అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీస్ లు అందజేస్తుంది. అయితే బుధవారం చివరిగా తాత్కాలికంగా ఈ సర్వీస్ లను ఆపేశారు. ఈ ఎయిర్లైన్స్కు ఇప్పటికిప్పుడు రూ. 400 కోట్లు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించడంతో ఆపేయాల్సి వచ్చింది. ఇంకా ఏ ఇతర విధానాలుగా నిధులు విడుదల కష్టమవడంతో బుధవారం చివరగా విమనాలు నడుపుతామని ప్రకటించింది. విమానాలకు ఇంధనం బిల్లుతో పాటు ఇతర సర్వీసులకు చెల్లించడానికి నిధులు లేవని ఎయిర్లైన్ వాలు తెలియ చేసారు. జెట్ బోర్డు సమావేశంలో ఎయిర్ లైన్ సీఈవో వినయ్దుబేను బ్యాంకుల నుండి చివరగా రూ. 400 కోట్లు విడుదల చేయమని కోరారు. ఒకవేళ బ్యాంకులు నిరాకరిస్తే బుధవారం నుండి సర్వీస్ లు ఆపేద్దామని నిర్ణయించారు.
35,306
https://www.prajasakti.com/WEBSECTION/National/page618/trump-maji-salhadar-flinku-jailushiksh
పసి కందు వయసు పది నెలలు ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాగుచేసి తల్లి పొత్తిళ్ళకు చేర్చాల్సిన పసికందు విగత జీవిగా మారింది. కారణం వైద్యలోపం కాదు ఫక్తు నిర్లక్ష్యం ఇంక్యుబేటర్లో ఉంచిన బాబును ఎలుకలు కొరికిన కారణంగా మరణించాడు. తల్లికి గర్భశోకం మిగిలింది. మాటలకందని ఈ విషాదం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన చావలి లక్ష్మి ఈ నెల 17న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మగబిడ్డను ప్రసవించింది. బాలుడు మూత్ర సంబంధ వ్యాధితో బాధపడుతుండడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 20న శస్త్రచికిత్స చేశారు. ఇంక్యుబేటర్లో పసికందును ఉంచారు. మంగళవారం ఉదయం పసిబిడ్డ చేతివేళ్లు, కాళ్లను ఎలుకలు కొరికేశాయి. గమనించిన తల్లి ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేసింది. 'దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ' అంటూ సిబ్బంది తనపై మండిపడ్డారని బిడ్డ తల్లి తెలిపింది. తాను బుధవారం తెల్లవారుజామున బయటకు వెళ్లిన సమయంలో మళ్లీ ఎలుకలు కరిచాయని వాపోయింది. చికిత్స ప్రారంభించిన గంటకు బిడ్డ మృతిచెందాడని విలపించింది. బిడ్డ మృతివార్త తెలుసుకున్న బంధువులు, ప్రజాసంఘాలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగాయి.
విజయవాడ కృష్ణలంకకు చెందిన చావలి లక్ష్మి ఈ నెల 17 వ తేదీన మగబిడ్డకి జన్మనిచ్చింది, అయితే మూత్ర సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతుండంతో గుంటూరు ప్రభుత్వా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళింది, 20న శస్త్రచికిత్స చేసి ఇంక్యూబేటర్లో పెట్టిన పసికందుని ఎలుకలు కొరికి చెంపేసాయి. తీరా ఆసుపత్రి సిబ్బందికి తెలియజేయగా 'దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని అన్నారు, ఈ విషయం తెలిసిన బంధువులు, ప్రజాసంఘాలు ఆసుపత్రి వద్ద ఆందోళనకి దిగారు.
80,041
https://www.vaartha.com/%e0%b0%9c%e2%80%8c%e0%b0%97%e2%80%8c%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%ad%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%be-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%b5/
పాకిస్థాన్ లో ‘బాహుబలి' .
దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచేశాయి. భారతీయులకే కాదు అమెరికా, జపాన్, చైనా వాసులకూ ఈ సినిమా తెగ నచ్చేసింది. అయితే ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని పాకిస్థాన్లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'బాహుబలి చిత్రం నాకు వివిధ ప్రదేశాల్లో పర్యటించే అవకాశం కల్పించింది. ఆ విదేశాలన్నింటిలో నాకు పాకిస్థాన్ మరింత ఆనందాన్ని కలిగించింది. నన్ను అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్కు ఆహ్వానించినందుకు గానూ పాకిస్థాన్, కరాచీకి ధన్యవాదాలు’ అని రాజమౌళి ట్వీట్లో పేర్కొన్నారు. హిందీలో విడదులయ్యే ప్రతీ చిత్రం పాకిస్థాన్లోనూ విడుదలవుతుంది. ఏవో వివాదాలు ఉంటే తప్ప ప్రతి బాలీవుడ్ చిత్రాన్ని పాకిస్థానీయులు ఆదరిస్తారు. ‘బాహుబలి’ చిత్రం హిందీలోనూ విడుదలైంది కాబట్టి పాకిస్థాన్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తారో లేదో చూడాలి. పాకిస్థాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాహుబలి, డియర్ జిందగీ, జాలీ ఎల్ఎల్బీ 2, హిందీ మీడియం, సైరాట్, నీల్ బత్తే సన్నాటా చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ’ పేరిట ఓ టీజర్ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇందులో రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తారు.
భారతీయులనే కాకుండా అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల ప్రజలను కూడా మెప్పించిన బాహుబలి, బాహుబలి-2 చిత్రాలు ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలను అలరించనున్నాయి. కరాచీలో జరగనున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఎన్నో ఉత్తమ చిత్రాలతో పాటు బాహుబలి ని కూడా ప్రదర్శించనున్నారు. ఈ వేడుకకు ఈ చిత్రాల దర్శకుడు ఎస్. ఎస్ రాజమౌళి కి కుడా ఆహ్వానం అందిందని, దానికి తానూ ఎంతో ధన్యున్నని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, రాజమౌళి దర్శకత్వంలో రామ్చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ ’ టీజర్ విడుదలైంది.
82,632
https://www.vaartha.com/%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a6%e0%b1%80-%e0%b0%a8%e0%b0%be%e0%b0%af%e2%80%8c%e0%b0%95%e2%80%8c%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b5%e0%b1%83%e0%b0%a6/
రాష్ట్రంలో ఉపాధి కల్పనకు పెద్ద పీట…
వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు. రాష్ట్రంలో ఉపాధి కల్పనకు పెద్ద పీట. సీఎం కృషితోనే స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఒంగోలు, మేజర్న్యూస్ : తూర్పు రాయలసీమ శాసన మండలి ఎన్నికల పట్టభద్రుల ( చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వేమి రెడ్డి పట్టాభి రామిరెడ్డి, ఉపాద్యాయ ఎమ్మెల్సీ వాసుదేవనాయుడుల విజయాలను కాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మార్టూరులో రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ గడిచిన రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 10.54 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. రెండున్నర ఏళ్లలో 3,53,536 మందికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి సైబరాబాద్ ను నిర్మించి 13 లక్షల మందికి సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. రాష్ట్రాన్ని నాలేజ్ హబ్గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దే కృషి జరుగుతుందన్నారు. ఉద్యో గుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచడం జరిగిందన్నారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు గ్రాడ్యుటీని 10 లక్షల నుంచి 12లక్షలకు పెంచడం జరిగిందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం మార్టూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ యువకులుకు ఉపాధి కల్పనకై రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని వేలకోట్లు కర్చు చేసి సుమారు 3,53,536 మందికి ఉపాధి కల్పించింది . సిఐఐ భాగస్వామ్య సదస్సులో 10.54 లక్షల కోట్లు విలువగల ఒప్పందాలు జరగడం గర్వకారణం అన్నారు. దీనివల్ల 20 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు సైబరాబాద్ ను స్థాపించి 13 లక్షల మందికి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కల్పించారు. ప్రైవేటు విద్యా సంస్థల కంటే ప్రభుత్వ విద్యా సంస్థలకే మొగ్గుచూపేల అభివృద్ది పరుస్తారని తెలిపారు . ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును రెండేళ్ళు పోడుగించినట్లు మరియు పదవీ విరమణ చేసే ఉద్యోగుల గ్రాడ్యుటీని రెండు లక్షలను పెంచినట్టు తెలిపారు.
86,258
https://www.prabhanews.com/2020/9/%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BF%E0%B0%95-%E0%B0%A8%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D
ఆర్థిక నష్టాల్లో భారత్
మందగమనం నేపథ్యంలో ఆర్థిక వృద్ధి 11 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. భారీ ఉద్దీపనలు, కార్పొరేటు పన్ను కోత వంటి చరిత్రాత్మక నిర్ణయాలు కూడా ఆశించిన ఫలితాలివ్వలేదు. క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో బడ్జెట్ 2020 అత్యంత కీలకమైనది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని ప్రభుత్వం, మౌలిక రంగంలో వ్యయాలను పెంచే అంచనాలున్నాయి. మౌలిక రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం బృహత్తర పథకాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. మౌలిక రంగంపై రానున్న ఐదేళ్లలో రూ. 105 లక్షల కోట్లు(1.48 ట్రిలియన్ డాలర్లు) వ్యయం చేయడమే లక్ష్యంగా ఈ మేరకు కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యం సాధించడంలో ఈ భారీ వ్యయం భాగమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలావుండగా 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్టులు, పోర్టులపై వ్యయాలు పెరిగాయి. బడ్జెట్లో ప్రైవేటీకరణ అంశాలు కూడా ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఆదాయంలో భారీ తగ్గుదల నమోదవ్వడంతో రూ. 1.5 లక్షల కోట్ల మేర ప్రైవేటీకరణ లక్ష్యంగా ప్రతిపాదనలు ఉండొచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ సంస్థల అమ్మకానికి ప్రభుత్వం ప్రతిపాదనలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ఆదాయం అంచనాలు, వృద్ధి, బయట నుంచి రుణాలు అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని, ఈ మేరకే ప్రతిపాదనలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికితోడు దేశీయంగా డిమాండ్ పెంపు, పెట్టుబడుల కోసం వ్యక్తిగత ఆదాయ పన్నులో కోత విధించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
దేశంలున్న ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేటు పన్నుకోత, అధిక ప్యాకేజీలు పూర్తిగా పారకపోగా, ఆర్థిక అభివృద్ధి పదకొండు ఏళ్ల కనిష్ఠానికి తగ్గింది. దీంతో మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచేందుకు మోడీ ప్రభుత్వం యత్నిస్తుంది. అయితే వీటి నుండి వచ్చిన రూ. 105 లక్షల కోట్లతో ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరువవ్వనుంది. అయితే మోడీ అధికారంలోకి వచ్చినప్పటి(2014) నుండి రైల్వే, రోడ్లు, విమానయాన, పోర్టులపై ఖర్చులు పెంచినందున ప్రైవేటీకరణపై చర్చించే అవకాశాలున్నాయన్నారు. కాగా ఈ యేడు వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేసేందుకు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన గవర్నమెంట్ సంస్థల ప్రైవేటీకరణకు యత్నిస్తుంది. దీంతో వ్యక్తిగత ఆదాయ పన్నులోనూ కోతను విధించ వచ్చని భావిస్తున్నారు.
89,344
https://www.prabhanews.com/2020/9/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80-%E0%B0%AA%E0%B0%B5%E0%B0%A8%E0%B1%8D%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A3%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE-%3F
తెలుగుదేశం పార్టీ పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారా ?
”మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పూర్తి దర్శకత్వంలో పనిచేస్తున్నారని వైసీపీ లాంటి పార్టీలు విమర్శిస్తున్నాయి కదా? ఇందులో వాస్తవమెంతుంది ? అని విలేకరులు ప్రశ్నించగా పవన్కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆహా ! అయితే వైసీపీ నరేంద్రమోడీ డైరెక్షన్లో పనిచేస్తోందా? అని పవన్కల్యాణ్ ఎదురు ప్రశ్నించారు. మంగళగిరి సమీపంలోని కాజ సమీపంలో తన సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీనే అలా ఎందుకనుకోవాలి? బీజేపీ కూడా ఉందని అనుకోవచ్చు కదా? అని కూడా పవన్కల్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు పట్టించుకోనని తేల్చిపారేశారు. ప్రజాజీవితంలోకి వచ్చానని, సమయం. . సందర్బం బట్టి అన్ని విషయాలకు బదులు చెబుతానని పవన్ స్పష్టం చేశారు. తనకు స్పష్టమైన పొలిటికల్ స్ట్రేటజీ ఉందన్నారు. ఇటువంటి ఎన్ని శల్య ప్రశ్నలు వేసినా తట్టుకునే శక్తి, బలం, ఓపిక, సాహనం తనకు ఉందన్నారు. అందరీ ఆశిస్సులతో పార్టీని భవిష్యత్లో మరింత ముందుకు తీసుకుపోతానని పవన్కల్యాణ్ తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ మంగళగిరి సమీపంలో తన సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన అన౦తరం విలేకరులతో సంభాషించారు. అందులో భాగంగా తెలుగుదేశం దర్శకత్వంలో మీరు పనిచేస్తున్నారని వైసీపీల విమర్శలకు మీరు ఎలా స్పందిస్తారని విలెకరులు ప్రశ్ని౦చారు. దానికి జవాబుగా తాను ఇలాంటి ప్రచారాలని లెక్కచేయనని పవన్ చెప్పుకొచ్చారు. తనకు స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందన్నారు. అందరీ ఆశిస్సులతో రానున్న రోజుల్లో పార్టీని ఇంకా ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు.
89,416
https://www.prabhanews.com/2017/12/%e0%b0%85%e0%b0%ae%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%a6%e0%b1%80%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf/
కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో చంద్రబాబు
ఐదు రోజులపాటు కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం అమరావతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈనెల 17న హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి, అక్కడి నుండి కుటుంబ సభ్యులతోకలసి 18 తెల్లవారు ఝామున మాల్దివులకు బయలుదేరి వెళ్ళారు. 18 నుండి 22 వరకు వారు మాల్దివుల్లో అనేక ప్రదేశాల్లో పర్యటించారు. అప్పటికే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో పర్యటనలో ఉన్న ఆయన తనయుడు, పంచాయతీ రాజ్, ఐటీ శాఖా మంత్రి లోకేష్ అమెరికా నుండి నేరుగా మాల్ద ులకు వెళ్ళారు. అక్కడ 5 రోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా పర్య టించారు. తిరిగి శుక్రవారం సాయంత్రం అమరావతికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఇతర ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం గుంటూరులో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. శనివారం ఉదయం అమరావతిలోని సచివాలయంలో పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అనంతరం ఈనెల 27 అమరావతి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీల్లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటిం చనున్న సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించ నున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు అమరావతి సచివాలయం వద్దనున్న హెలీప్యాడ్ నుండి ప్రత్యేక హెలీకాప్టర్లో బయలుదేరి 5.20 గంటలకు గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడినుండి బ్రాడీపేటలోని ఎల్ఈఎమ్ పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడ రెండు గంటలపాటు ముఖ్యమంత్రి గడపనున్నారు. అనంతరం 7.30 గంటలకు బలయుదేరి 8.10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రాబునాయుడు ఈనెల 18 న హైదరాబాద్ నుండి తెల్లవారుజామున తన కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవులు కు వెళ్ళారు. 4 రోజుల పాటు అక్కడ పర్యటించి, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న తన కుమారుడు నారా లోకేష్ తో కలిసి నేరుగా మాల్దీవులు వెళ్ళారు. 5 రోజుల తర్వాత స్వస్థలానికి ప్రయాణించారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో కొందరు మంత్రులు స్వాగతం తెలిపారు. ఈ నెల 27న రాష్ట్రపతి సందర్శన గురించి సమీక్ష జరిపి, తరువాత అమరావతి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో గుంటూరు పరేడ్ గ్రౌండ్ కు వెళ్తారు. ఈ శనివారం ఆయన గుంటూరులోని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, తర్వాత పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. అనంతరం సుమారు 8 గంటలకు తన స్వస్థలం ఉందపల్లి కి చేరుకుంటారు.
34,808
https://www.prajasakti.com/WEBSECTION/International/page510/14na-bengal-panchayat-annikal
ఆరేళ్ల చిన్నారి పై ఓ మానవమృగం అత్యాచారానికి పాల్పడిన వైనం అనంతపురం జిల్లా రొళ్ల మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కూతురి పై అత్యాచారాన్ని అవమానంగా భావించిన తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటంబ సభ్యుల వివరాల ప్రకారం రొళ్ల మండలానికి చెందిన అరేళ్ల చిన్నారి ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. గత సోమవారం చిన్నారి తల్లిదండ్రులు పొలం పనుల నిమిత్తం వెళ్లారు. పాఠశాలకు వెళ్లివచ్చిన చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా పక్కనే నివాసముంటున్న గంగప్ప ఆ చిన్నారికి మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. మూడు రోజులుగా అనారోగ్యానికి గురైన చిన్నారి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు విషయం పై ఆరాతీశారు. తీవ్రంగా రక్తస్త్రావమవుతుండడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి బాలిక అత్యాచారానికి గురైందని చెప్పారు. దీంతో చిన్నారిని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలిపింది. ముఖ్యమంత్రి పర్యటన ఉండడంతో రొళ్ల మండలంలో పోలీసులు ఎవరూ లేకపోవడంతో మడకశిర పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. తన కూతురు అత్యాచారానికి గురైందని అవమానంగా భావించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం మడకశిర ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అనంతపురం జిల్లా రొళ్ల మండలంలో అభం శుభం తెలియని 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు . తల్లిదండ్రులు పొలం పనులు చూసుకోవడానికి వెళ్లగా చిన్నారి ఒక్కతే ఇంటి వద్ద ఆడుకుంటుంది. పక్కనే నివాసం ఉంటున్న గంగప్ప ఇదంతా గమనించి బలికాని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని చిన్నారిని బెదిరించడంతో బాలిక ఎవ్వరితో చెప్పలేదు . బాలిక ఆరోగ్యం బాలేకపోవడం గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయట పడింది . దింతో బాలిక తల్లిదండ్రులు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసారు . వెంటనే వారిని ఆసుపత్రికి తరలించడం తో వాళ్ళ ప్రాణాలకు ముప్పు తప్పింది .
80,225
https://www.vaartha.com/%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-3/
సొంత బంధువునే హత్య చేశాడు
ఇద్దరు వ్యక్తులు బంధువులు. . . ఒకే చోట ఉద్యోగం. . . ఒకరి ఇంటికి ఒకరు తరుచూ వెళ్తుండేవారు. కానీ ఆ బంధువే తన భార్యపై కన్నేసాడని పసిగట్టిన భర్త ఆగ్రహంతో అతన్ని అంతమొందించాడు. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఆలమ్ ఓ కంపెనీలో కొన్నేళ్ల నుంచి మెకానిక్గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో అతని బంధువు అహ్మద్(31) కూడా పనిచేస్తున్నాడు. ఇద్దరూ బంధువులు కావడం. . పైగా ఒకే చోట పనిచేస్తుండటంతో. . ఒకరి ఇంటికి ఒకరు తరుచూ వెళ్తుండేవారు. ఈ క్రమంలో అహ్మద్ తీరుపై ఆలమ్కి ఎక్కడో చిన్న అనుమానం మొదలైంది. భార్య ప్రవర్తనలోనూ తేడా గమనించాడు. ఇద్దరిపై నిఘా పెట్టాలనుకున్నాడు. భార్యకు తెలియకుండా ఆమె సెల్ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేశాడు. ఆ యాప్తో ఆమె ఫోన్ కాల్ సంభాషణలను ట్రాక్ చేశాడు. అహ్మద్-ఆలమ్ మధ్య ఆ సంబంధం నిజమే అని తేలింది. దీంతో ఆవేశంతో రగిలిపోయిన అహ్మద్ ఆలమ్పై పగ తీర్చుకోవాలనుకున్నాడు.
భార్యతో అక్రమ సంబంధం కలిగి వున్నడని సొంత బందువును హత్యచేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఆలమ్ మెకానిక్ గా పని చేస్త ేవాడు, అదే చోట తన బందువు అహ్మద్ కూడా పనిచేస్తుండటంతో ఒకరి ఇంటికి ఒకరు తరుచూ వెళ్తుండేవారు. కానీ భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో, భార్య ఫోనులో ఒక యాప్ తో నిఘా పెట్టి, అహ్మద్ కి తన భార్యకి ఉన్న అక్రమ సంభందం తెలుసుకుని అహ్మద్ ని హత్య చేసాడు.
80,831
https://www.vaartha.com/%e0%b0%a8%e0%b0%be%e0%b0%97%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%a4%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a5%e0%b0%ae%e0%b0%82/
షూటింగుల్లో రెండేళ్ళు బిజీగా ఉండనున్న ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదలు పెట్టి మొన్నటికి 19 ఏళ్లవుతుంది. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో సంచలనాలు సృష్టించాడు జూనియర్. తెలుగు స్టార్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ కారణంగా 2019 లో మూవీ విడుదల చేయలేక పోయిన ఎన్టీఆర్, 2020 కూడా థియేటర్స్ లో దిగకుండానే ముగించనున్నాడు. దీనితో ఫ్యాన్స్ కి ఒకింత అసహనం ఎక్కువయ్యాయి. ఐతే తక్కువ వ్యవధిలో ఆయన నుండి రెండు సినిమాలు రానున్నాయి. 2021 లో ఆర్ ఆర్ ఆర్ విడుదల ఉండగా, అదే ఏడాది నెలల గ్యాప్ తో త్రివిక్రమ్ మూవీ కూడా విడుదల కానుంది. ఇది కొంచెం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉపశమనం కలిగించే అంశం. కాగా ఎన్టీఆర్ 2022 వరకు తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ సినిమాలలో ఒకేసారి పాల్గొననున్న ఎన్టీఆర్ ఆ వెంటనే ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారట. ఈ ఏడాది చివర్లో ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 నుండి బయటికి వస్తారు. ఆయన ఎన్టీఆర్ మూవీ 2021 చివర్లో పట్టాలెక్కించనున్నారు. దీనితో ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ షూటింగ్ లో ఏడాదికి పైగా పాల్గొనాల్సివుంది. దీనితో ఎన్టీఆర్ రాబోయే రెండేళ్లలో తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొనాల్సిన పరిస్థితి ఉంది.
సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పటికి 19 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తూ బిజీగా ఉండడంతో 2019, 2020 లో థియేటర్స్ లో అడుగుపెట్టకపోవడం ఫ్యాన్స్ కు నిరాశను మిగిల్చింది. అయితే ఆర్ ఆర్ ఆర్ 2021 లో విడుదల అవ్వనుండగా, నెలల గ్యాప్ తోనే త్రివక్రమ్ తో చేస్తున్న ఇంకో సినిమా కూడా విడుదల కానుండడం ఫ్యాన్స్ కు కొంచెం ఉపసమనం కలిగించనుంది. వీటితోపాటే 2021 చివర్లో ప్రశాంత్ నీల్ తో ఇంకో సినిమాకి పచ్చ జెండా ఊపారు. దీంతో రానున్న రెండేళ్ళలో ఫుల్ బిజీ అయిపోనున్నారు ఎన్టీఆర్
86,276
https://www.prabhanews.com/2019/11/warm-dress-to-cows/
ఇక గూవులకూ కోట్స్
ఉత్తరాదిలో శీతగాలులు ఇప్పటికే విజృంభించి వణికిస్తున్నాయి. మనమైతే చలి నుంచి రక్షించుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ గోశాలల్లో ఉండే ఆవులు, ఎద్దులు, దూడలు, పెయ్యల మాటేమిటి? కానీ దేశంలో తొలిసారిగా ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. సంరక్షణ కేంద్రాల్లోని గోశాలల్లో ఇన్నాళ్లూ అవి నానాయాతనలు పడేవి. ఇప్పుడు ఆ కష్టం లేకుండా ఓ నిర్ణయం తీసుకున్నారు. జనపనారతో చేసిన కోట్స్ ప్రత్యేకంగా తయారు చేయించి వాటికి కప్పనున్నారు. ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అయోధ్య నగరంలోని గోశాలల్లో అమలు చేయనున్నారు. తొలి ప్రయోగం, అక్కడి భైసింగపూర్ గోసంరక్షణ కేంద్రంలోని 1200 మూగజీవాల కోసం ఈ ప్రత్యేక తరహా కోట్స్ (వెచ్చని పై దుస్తులు) కొనాలని నిర్ణయించారు. వీటిలో దూడలు, పెయ్యలకు కాస్త మెత్తటి చేనేత, జనపనారతో చేసిన మూడుపొరల కోట్ను, ఆవులకు రెండు పొరలతో ఉండే దుస్తులను, ఇక ఎద్దులకు కేవలం జనపనారతో చేసిన కోట్లను తెప్పిస్తున్నారు. ఒక్కో కోట్కు రూ. 250 నుంచి రూ. 300 వరకు ఖర్చు చేస్తారు. ఇక గోశాలల్లో నేలపై వెచ్చదనం కోసం ఎండుగడ్డి పరుస్తారు. అయోధ్య మున్సిపాల్టి ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
ఇన్నేళ్ళు నానాయాతలు పడ్డ గోశాలల్లోని ఎద్దులును, దూడలును, పెయ్యలను, ఆవులను సంరక్షణకు ఉత్తర్ప్రదేశ్ నూతన నిర్ణయానికి తెరలేపింది. ఇందులో భాగంగా దూడలు, పెయ్యలకు మెత్తటి చేనేత కోట్స్, ఆవులకు రెండు పొరల కోట్స్, ఎద్దులకు ఒక్క పోర కోట్స్ను తీసుకురానున్నారు. కాగ జనపనారతో తయారయ్యే ఈ కోట్కు ఒక్కదానికి ధర రూ. 250-రూ. 300 వరకు ఉంటుంది. గోశాలల్లో కింద ఎండుగడ్డి పరచడంతో నేల వెచ్చగుంటుందది. కాగా తొలత అయోధ్యలోని భైసింగపూర్ గోశాలలున్న1200 మూగజీవాలపై దీన్ని ప్రయోగించనున్నారు.
26,315
https://www.prajasakti.com/WEBSECTION/International/page913/gujarat-annikall-bijepi-gelupu-tadhyam-sita-nitish-kumar
సుబ్రతా రారుకు సుప్రీంకోర్టు "హెచ్చరిక".
నిబంధనలకు విరుద్దంగా మదుపర్ల నుంచి భారీ మొత్తంలో నిధులు సమీకరించి, తిరిగి చెల్లించడంలో విఫలమైన సహారా గ్రూపు అధినేత సుబ్రతా రారుకు సుప్రీంకోర్టు మరో మారు హెచ్చరిక జారీ చేసింది. మరో పది రోజుల్లో రూ. 1500 కోట్లు చెల్లించపోతే జైలుకు పంపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆయనకు ముందు ఇచ్చిన జూన్ 19 వరకు పెరోల్ గడువును జూలై 5 వరకు పొడిగిస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇది వరకు ఇచ్చిన గడువులో జూన్ 15 వరకు రూ. 1500 కోట్లను చెల్లించాలని లేకపోతే తిహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది. కానీ వాటిలో సహారా రూ. 790 కోట్లను మాత్రమే చెల్లించింది. మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు రారు పెరోల్ పొడిగింపును కోరారు. లండన్లోని గ్రోస్వెనోర్ హౌస్ స్టేక్ ను అమ్మామని, దీని ద్వారా మార్కెట్ రెగ్యులేటరీ సెబీకి చెల్లించాల్సిన నగదును సేకరిస్తున్నామని సహారా సుప్రీంకోర్టుకు చెప్పింది. కాగా మిగతా రూ. 709.82 కోట్ల మొత్తాన్ని కూడా సహారా సంస్థ సెబీకి 10 రోజుల్లో అందజేయాలని సుప్రీం ఆదేశించింది. మొత్తంగా ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ. 25,781 కోట్ల మొత్తంలో అత్యున్నత న్యాయస్థానం అనేక సార్లు హెచ్చరికలు చేయడంతో దఫదఫాల్లో చెల్లింపులు చేయగా, ఇంకా సహారా రూ. 11,169 కోట్లను చెల్లించాల్సి ఉంది.
సుప్రీంకోర్టు సహారా గ్రూపు అధినేత సుబ్రతా రారుకు, భారీ మొత్తంలో నిధులు సమీకరించి, తిరిగి చెల్లించడంలో విఫలమైనందున, పది రోజుల్లో రూ. 1500 కోట్లు చెల్లించపోతే జైలుకు పంపాల్సి ఉంటుందని నిర్దారించింది. సహారా రూ. 790 కోట్లను మాత్రమే చెల్లించిందని, లండన్లోని గ్రోస్వెనోర్ హౌస్ స్టేక్ ను అమ్మామని పొడిగింపును కోరారని, ఇంకా సహారా రూ. 11,169 కోట్లను చెల్లించాల్సి ఉందని పేర్కోంది.
31,891
https://www.prajasakti.com/WEBSECTION/National/page56/hinsan-prerapiste-charyal
మధ్యాహ్నభోజన కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మధ్యాహ్నభోజన పథక కార్మికుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని లేకపోతే సమ్మెకు వెనుకడబోమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు హెచ్చరించారు. జూన్ 1 వరకు సంఘం నాయకత్వంతో ప్రభుత్వం చర్చలు జరపాలని లేకుంటే 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనబోమని తెలిపారు. హైదరాబాద్లోని ఎంబీభవన్లో తెలంగాణ మధ్యాహ్నభోజన పథక కార్మికుల యూనియన్ ( సీఐటీయూ ) రాష్ట్ర విస్తృత సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సాయిబాబు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా, ఏనాడూ మధ్యాహ్నభోజన కార్మికుల బతుకుల గురించి పట్టించుకోలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకంలోని కార్మికుల బాధ్యత తమది కాదన్నట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అయినా విద్యారంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. పాఠశాలల్లోని విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టాలని సీఎం ఆదేశించారనీ, అయినా కొలతలు, లెక్కలు ఎందుకు పెడుతున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీన్నిబట్టే ప్రభుత్వానికి పేద విద్యార్థులంటే ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ప్రగతిభవన్లో వివిధ శాఖలకు చెందిన వారితో సమావేశాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి, మధ్యాహ్నభోజన కార్మికుల గురించి పట్టించుకునేందుకు సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. జూన్1 లోగా ప్రభుత్వం, అధికారు లు స్పందించి, కార్మికుల వేతనాలపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రభుత్వ అధికారులకు తమ సమస్యలపై వినతిపత్రాలు అందిస్తామని తెలిపారు. కార్మికులు చేసే పోరాటాలకు ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపాలని కోరారు. ప్రభుత్వం సమస్యల పరిష్కరించకపోతే, నూతన విద్యాసంవత్సరంలో సమ్మెతో సహా ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రమ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం కొద్దోగొప్పో గౌరవ వేతనం పెంచారని అన్నారు.
శుక్రవారం హైదరాబాద్లోని ఎంబీభవన్లో జరిగిన తెలంగాణ సీఐటీయూ రాష్ట్ర విస్తృత సమావేశానికి ముఖ్యఅతిథిగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా, ఏనాడూ మధ్యాహ్నభోజన కార్మికుల బతుకుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. జూన్1 లోగా ప్రభుత్వం,అధికారులు స్పందించి,కార్మికుల వేతనాలపై ప్రకటన చేయని సందర్భంలో జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రభుత్వ అధికారులకు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించి తమ నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కరించకపోతే జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనబోమని,సమ్మెతో సహా ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు.
34,340
https://www.prajasakti.com/WEBSECTION/National/page737/lallu-kumarthe-intlo-idi-sodal
గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు పనులను ఈ నెల 26వ తేదీ తర్వాత ప్రజలు అడ్డుకోవడం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రూరల్లోని తుందుర్రు ప్రాంతంలో తలపెట్టిన ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ ఫ్యాక్టరీ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యాన మంగళవారం తుందుర్రులో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫ్యాక్టరీ శంకుస్థాపనకు సిఎం చంద్రబాబు వస్తారని యాజమాన్యం హడావిడి చేసిందని, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి శంకుస్థాపన చేయాలని యాజమాన్యం ప్రయత్నించిందని గుర్తు చేశారు. ప్రజల వ్యతిరేకత కారణంగా ఆనాడు శంకుస్థాపన ఆగిపోయిందన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు మొదటి విజయం అందుకున్నారంటూ తదుపరి కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న పోరాట కమిటీ సభ్యులపై కేసులు పెట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచే టన్నారు. ఆనంద గ్ రూప్ కంపెనీ అబద్ధాలతో వ్యాపారం చేయాలనుకుంటే ప్రజలు సాగనీయరని హెచ్చరించారు. తుందుర్రు, జొన్నలగర్వు, కంసాలబేతపూడి గ్రామాలతోపాటు మరో మూడు మండలాల్లోని 50 గ్రామాల ప్రజలకు తాగు, సాగునీరు కరువవు తోందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లాను ఆక్వా హబ్గా ప్రకటించారని, వ్యవసాయం కంటే చేపలు, రొయ్యల చెరువుల మీదే ఎక్కువ ఆదాయమొస్తుందని అన్నారని గుర్తుచేశారు. అన్నపూర్ణగా పేరొందిన జిల్లాలో వ్యవసాయం అభివృద్ధి మైనస్ 9కి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో పాలకోడేరు, గొల్లలకోడేరు, యనమదుర్రు తదితర అనేక ప్రాంతాల్లో చెరువులు తవ్వడాన్ని రైతులు అడ్డుకున్నారని గుర్తు చేశారు. కేరళలో ఒక ఎకరం వరిపండే చేనును వేరే సాగుకు ఉపయోగించాలంటే కేబినెట్ ఆమోదం పొందాలని, అలాంటిది మన రాష్ట్రంలో పంటలు పండే పచ్చని పొలాలను ఇతర అవసరాలకు ఇష్టానుసారం ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. వైసిపి జిల్లా అధ్యక్షులు కె. సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రజల పోరాటానికి అండగా నిలుస్తామన్నారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్లు ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ, ఎం. త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు పనులను ఈ నెల 26న తేదీ తర్వాత ప్రజలు తప్పక అడ్డుకుంటారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఫ్యాక్టరీ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సభలో ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న పోరాట కమిటీ సభ్యులపై కేసులు నమోదుచేయటమే కాకుండా బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు మరియు ఆనంద గ్ రూప్ కంపెనీ అబద్ధాలతో వ్యాపారం చేయాలనుకుంటే ప్రజలు ఒప్పుకోరని చెప్పరు. కేరళలో ఒక ఎకరం వరిపండే చేనును వేరే సాగుకు ఉపయోగించాలంటే కేబినెట్ ఆమోదం పొందాలని, అలాంటిది మన రాష్ట్రంలో పంటలు పండే పచ్చని పొలాలను ఇతర అవసరాలకు ఇష్టానుసారం ఇస్తున్నారని విమర్శించారు.
34,598
https://www.prajasakti.com/WEBSECTION/National/page831/2100-sara-packett-swadhina
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలోని కోరమాండల్ ఫ్యాక్టరీలో ఆదివారం అమోనియా సిలిండర్ పేలడంతో కాంట్రాక్ట్ కార్మికుడు ఈతకోట లోవరాజు ( 27 ) మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాట్రేనికోన మండలం బంటు మిల్లికి చెందిన లోవరాజు ఆదివారం సెలవుదినమైనప్పటికీ కాంట్రాక్టర్ పండ్రంకి చినరాజు ఒత్తిడితో డ్యూటీకి వెళ్లాడు. పనిలో భాగంగా కెమికల్స్ను మారుస్తుండగా అమోనియా సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో లోవరాజు శరీరం తునాతునకలైంది. పక్కనే ఉన్న మరో ఇద్దరు కార్మికులు బంగార్రాజు, షేక్ మొహిద్దీన్ గౌస్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరు కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ రూరల్ ఎంఎల్ఎ అనంతలక్ష్మి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని, క్షత గాత్రులను పరామర్శించారు. మృతుని భార్యకు ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని హోంమంత్రి తెలిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేపట్టారు. ఇద్దరు ఆడపిల్లలకు రూ. 30 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. సిలిండర్ మార్చినప్పుడు పర్యవేక్షిం చాల్సిన సంబంధిత ఇన్స్పెక్టర్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టరు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం బంటు మిల్లికి చెందిన ఈతకోట లోవరాజు ( 27 ) కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలోని కోరమాండల్ ఫ్యాక్టరీలో కెమికల్స్ను మారుస్తుండగా అమోనియా సిలిండర్ పేలడంతో చనిపోయాడు. ఇంకో ఇద్దరు బంగార్రాజు, షేక్ మొహిద్దీన్ గాయపడ్డారు. హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ రూరల్ ఎంఎల్ఎ అనంతలక్ష్మి సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతిని కుటుంబానికి భార్యకి ఉద్యోగం, ఆడపిల్లలుకు రూ. 30 లక్షల ఇవ్వాలని హోంమంత్రి అన్నారు.
34,859
https://www.prajasakti.com/WEBSECTION/International/page437/jokyam-chesukondi-varshity-yajmanya-vedhistondi
విశాఖ జిల్లా, పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రయివేటు లిమిటెడ్ మందుల కంపెనీలో సోమవారం రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనం కాగా, మరో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఫార్మాసిటీలోని సాయినార్ కంపెనీలో రియాక్టర్ బ్లాక్, కెమికల్స్ మిక్సింగ్ వద్ద ఉదయం 11 గంటల సమయంలో రియాక్టర్ ప్రెషర్ ఇవ్వడంతో ఒక్కసారిగా పేలిపోయింది. హరీష్కుమార్ ( 29 ) , ఆపరేటర్ వి. శ్రీనివాసరావు ( 45 ) లపై పడింది. వారిద్దరూ సజీవదహనమయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు నూకరాజు, గంగాధర్, రాజు, కొండలరావు, శేఖర్లను గాజువాకలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు హరీష్కుమార్ది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఇతనికి ఇంకా వివాహం కాలేదు. మరో మృతుడు వి. శ్రీనివాసరావుది విశాఖ జిల్లా కశింకోట. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ పరిశ్రమలో పాత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న యంత్రాలు వాడుతున్నారని గతంలో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో అధికారులు గుర్తించారు. అయినా మార్పు చేయలేదు. పాత యంత్రాలనే కొనసాగిస్తున్నారు. దీనివల్లే తరచూ బ్రాయిలర్, రియాక్టర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు, కార్మికులు అంటున్నారు.
సోమవారం ఉదయం 11 గంటల సమయంలో రియాక్టర్ ప్రెషర్ ఇవ్వడంతో ఒకేసారి పేలిపోయింది. హరీష్కుమార్ ( 29 ) , ఆపరేటర్ వి. శ్రీనివాసరావు ( 45 ) లపై పడటంతో వారు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన విశాఖ జిల్లా, పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రయివేటు లిమిటెడ్ మందుల కంపెనీలో జరిగింది.
34,958
https://www.prajasakti.com/WEBSECTION/International/page42/coral-chastunn-sars
విహారంలో విషాదం చోటుచేసుకుంది. సెలవని సముద్రానికి వెళ్లిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతిచెండారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో శుక్రవారం వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ రెండో సంవత్సరం మెకానికల్ విద్యార్థులు 12 మంది సూర్యలంక వెళ్లారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా మేళ్లచెరువుకు చెందిన మదిర మహేష్రెడ్డి ( 19 ) ఒడ్డుకు కొట్టుకొచ్చాడు. దీంతో అతన్ని వెంటనే బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లగా,అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొద్దిసేపటి తరువాత గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలేనికి చెందిన గుడివాడ కృష్ణప్రసాద్ ( 19 ) మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. గుంటూరు లాలాపేటకు చెందిన తిరుచేటి జయదేవ్ ( 19 ) , కొల్లిపరకు చెందిన ఆళ్ల శ్రీనివాసరెడ్డి ( 19 ) గల్లంతయ్యారు. ఘటనా స్థలిని పరిశీలించిన రూరల్ ఎస్పి నారాయణనాయక్ మాట్లాడుతూ, విద్యార్థులు మద్యం తాగారని, ఒకరు గల్లంతు కావడంతో వెదికేందుకు వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారని, వారిలో ఇద్దరు మృతిచెందినట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలోనూ మరో దుర్ఘటన చోటుచేసుకుంది. చెరువులోపడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన పర్చూరు మండలం వీరన్నపాలెంలో శుక్రవారం జరిగింది. ఓ ప్రయివేటు పాఠశాల్లో 9 వ తరగతి విద్యార్థి ప్రవీణ్కుమార్ ( 15 ) బక్రీద్ సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తోటి విద్యార్థులతో కలిసి చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ ప్రవీణ్కుమార్ చెరువులో పడ్డాడు. గ్రామస్తులు బయటికి తీసుకొచ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. అప్పటికే మృతిచెందాడు.
వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ రెండో సంవత్సరం మెకానికల్ విద్యార్థులు 12 మంది సూర్యలంక వెళ్లారు ,సముద్రానికి వెళ్లిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు నల్గొండ జిల్లా మేళ్లచెరువుకు చెందిన మదిర మహేష్రెడ్డి ( 19 ) ,గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలేనికి చెందిన గుడివాడ కృష్ణప్రసాద్ ( 19 ) చనిపోగా మరో ఇద్దరు అదృశ్యమయ్యారు. ప్రకాశం జిల్లాలో కార్పొరేట్ పాఠశాల్లో 9 వ తరగతి విద్యార్థి ప్రవీణ్కుమార్ ( 15 ) ఈత కొడదామని చెరువుకి వెళ్లి అందులో పది చనిపోయాడు .
62,091
https://cinema.suryaa.com/movies-8545-.html
ఈఎక్స్ పో గురించి మాట్లాడిన సిఈఓ కిశోర్ .
ఫార్మా సప్లై చెయిన్రంగంలో పలువురు భాగస్వాములు కలిసి ఫార్మెర్జింగ్ ఎక్స్పో అని పిలిచే ఎగ్జిబిషన్ను అజిలిటీ సంస్థ నిర్వహించింది. దీనిలో పాల్గొన్న సంస్థలు ఫార్మా సప్లై చెయిన్ సొల్యూషన్ అయిన థర్మల్ బ్లాంకెట్స్, ఐటీట్రాకింగ్ సొల్యూషన్స్,ఐఓటీ సొల్యూషన్స్ప్రదర్శించడానికి అవకాశం లభించింది. నోవోటెల్ ఎయిర్పోర్ట్ హోటల్లో జరిగిన ఈఎక్స్పోలో జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ఎన్జికె కిశోర్. అజిలిటీ సంస్థ నుంచి సంస్థ ఛీప్ కమర్షియల్ ఆఫీసర్ సతీష్ లక్కరాజు పాల్గొని ఎక్స్ఫోను ప్రారంభించారు. ఈసందర్భంగా సిఈఓ కిశోర్ మాట్లాడుతూ ఈఎక్స్పోతో హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు. ఎయిర్పోర్ట్లోని కార్గోలో 60శాతం ఫార్మాకు సంబందించిదేనని. . ఫార్మాషిప్ మెంట్లో టెంపరేచర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ను సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. చెయిన్లోని డేటాను రియల్టైమ్లో అందించేందుకు ఫార్మా రంగంలో బ్లాక్ చెయిన్ను ఉపయోగింకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఫార్మా తర్వాత ప్రధానంగా వెజిటబుల్స్మీద దృష్టి కేంద్రీకరిస్తున్నామని ఆహార పదార్థాలను,కూరగాయలను ఎగుమతి చేసేందుకు చాలా అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన కూరగాయలు పండించేలా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ధిష్టమైన కార్యకలాపాలు చేపడుతుందన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ను ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చడానికి కస్టమ్స్ అధికారులతో కలిసి నితరం పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కార్గో టెర్మినల్లో ఏటా 1.5లక్షల మెగా టన్నుల కార్గోను హ్యాండిల్ చేస్తుందని పేర్కొన్నారు. దీన్నిరెట్టింపు చేయాలనే ఉద్దేశ్యంతో ఫార్వర్డ్,బ్యాక్వర్డ్ లింకేజీలతో కూడిన ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈసందర్భంగా వివిధ ఎయిర్ లైన్,షిప్పింగ్ లైన్స్, ఎయిర్పోర్టులకు సంబంధించిన స్టాల్స్ఏర్పాటు చేశారు. లాజిస్టిక్ సప్లై చెయిన్లోని ప్రముఖ సంస్థలు జీఎంఆర్ కార్గో ఎమిరేట్స్స్కైకార్గో,డల్లాస్ ఫోర్ట్ వర్త్ ,ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ,అల్లార్ లాజిస్టిక్స్,స్కైసెల్ ఏజీ, ఎతిహాద్ కార్గో, ఖతార్ ఎయిర్వేస్ కార్గో,షిపా ఫ్రెయిట్ తదితర సంస్థలు తమ భాగస్వామ్యాన్ని పంచుకున్నాయి. ఫార్మాన్యూటికల్ కోల్డ్చెయిన్లోని భాగస్వాములందర్నీ మొదటిసారిగా ఒకే వేదికపైకి తెచ్చిన ఈఎక్స్ఫోకు పారిశ్రామిక వర్గాల నుంచి మంచి స్పందన లభించింది.
ఫార్మా సప్లై చెయిన్రంగంలో పలువురు భాగస్వాములు కలిసి అజిలిటీ సంస్థ నిర్వహించిన ఫార్మెర్జింగ్ ఎక్స్పో అని పిలిచే ఎగ్జిబిషన్లో ఫార్మా సప్లై చెయిన్ సొల్యూషన్ అయిన థర్మల్ బ్లాంకెట్స్, ఐటీట్రాకింగ్ సొల్యూషన్స్,ఐఓటీ సొల్యూషన్స్ప్రదర్శించడానికి అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా సిఈఓ కిశోర్ మాట్లాడుతూ, ఈఎక్స్పోతో హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని, ఎయిర్పోర్ట్లోని కార్గోలో 60శాతం ఫార్మాకు సంబందించిదేనని, ఫార్మాషిప్ మెంట్లో టెంపరేచర్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అని, ఫార్మా తర్వాత ప్రధానంగా ఆహార పదార్థాలను,కూరగాయలను ఎగుమతి చేసేందుకు చాలా అవకాశాలున్నాయని, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ను ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చడానికి అధికారులతో కలిసి పనిచేస్తుమని,హైదరాబాద్ కార్గో టెర్మినల్లో ఏటా 1.5లక్షల మెగా టన్నుల కార్గోను హ్యాండిల్ చేస్తుందని తెలిపారు.
64,966
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-40017-17.html
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం పంతం
గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె. చక్రవర్తి దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం పంతం. ఈసినిమా ఈనెల 5న విడుదల కాబోతోంది. ఈసందర్భంగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ. . తనలాంటి హీరోని క్రియేట్ చేసింది డైరెక్టర్లు అని. . వారే రియల్ హీరోలు అన్నారు. వాళ్లు ఒక క్యారెక్టర్ అనుకుని దాన్ని ప్రేక్షకులు మెచ్చేలా రాసి ఓ హీరోని క్రియేట్ చేయగల సత్తా ఉన్నది డైరెక్టర్లకేనని అన్నారు. తనతో సినిమా చేసిన దర్శకులందరికీ ధన్యవాదాలు అన్నారు. నేను 25 సినిమాలు చేశానని, అయితే నా తొలిసినమా నిర్మాత నాగేశ్వరరావుగారే అన్నారు. ఆయన సుబ్బయ్యగారు నన్ను ఎంకరేజ్ చేయకపోతే ఈరోజు నేను ఈ ల్యాండ్ మార్క్ రీచ్ అయ్యేవాడిని కానని అన్నారు. ఈ చిత్రం దర్శకుడు కె. చక్రవర్తి మాట్లాడుతూ, గోపీచంద్ నటన చాలా బాగా ఉందన్నారు. ఈనెల 5న సినిమా విడుదల కాబోతోందని అన్నారు. నిర్మాత కెకె రాధామోహన్ మాట్లాడుతూ, గోపీచంద్గారి 25వ చిత్రం మా బ్యానర్లో తీయటం చాలా ఆనందంగా ఉందన్నారు. చక్రి ఓ అనుభవజ్ఞుడైన డైరెక్టర్గా పనిచేశారన్నారు. అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నామని అన్నారు. కార్యక్రమంలో అమ్మ రాజశేఖర్, డైరెక్టర్ మోహన్రాజు, డైరెక్టర్ శివ, డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య, రమణ, బివిఎస్ రవి, కెఎస్ రవీంద (బాబి), డైరెక్టర శ్రీవాస్, సంపత్ నంది, పూరి జగన్నాధ్ తదితరులు మాట్లాడారు.
గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె. చక్రవర్తి దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మిస్తున్న పంతం సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్లో నిర్వహించారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ డైరెక్టర్లె రియల్ హీరోలు అని, ప్రేక్షకులు మెచ్చేలా హీరోని క్రియేట్ చేస్తారని, నిర్మాత నాగేశ్వరరావు, సుబ్బయ్యగారు ఎంకరేజ్మెంట్ లేకపోతే ఈ ల్యాండ్ మార్క్ రీచ్ అయ్యేవాడిని కానని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కెకె రాధామోహన్, దర్శకుడు కె చక్రవర్తి, అమ్మ రాజశేఖర్, పూరి జగన్నాధ్ తదితరులు మాట్లాడారు.
3,239
https://www.prajasakti.com/WEBSECTION/National/page659/srilankalo-upadhyayul-samme
రైతులు, కమిషన్ ఏజెంట్ల నిరసన
ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ హైదరాబాద్ నగరంలోని కొత్తపేట గడ్డి అన్నారంలో కొనుగోళ్లు స్తంభించాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మామిడి పండ్ల లారీలను మార్కెట్లోకి అనుమతించకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. యార్డు ఎదుట రోడ్డుపై రైతులు బైటాయించి నిరసన తెలిపారు. ప్రస్తుతం మామిడి పండ్లను కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకొని లారీలను మార్కెట్ యార్డులోకి పంపించారు. మార్కెట్ యార్డులో షెడ్స్కు 10 శాతం పెంచిన అద్దె చెల్లించడం లేదనే కారణంతో 97 దుకాణాల అనుమతులను అధికారులు రద్దు చేశారు. దీనిపై కమీషన్ వ్యాపారులు నిరసన తెలుపుతూ మార్కెట్లో లావాదేవీలను నిలిపేశారు. ఈ సమాచారం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు మార్కెట్ యార్డుకు చేరుకొని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మామిడి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించేందుకు మంతి రైతులకు భరోసా ఇచ్చారు. కమీషన్ ఏజెంట్ల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మార్కెట్ యార్డులో చైర్మన్ పురుషోత్తంరావు, పాలకవర్గం, అధికారులు, పోలీసుల సమక్షంలో కమీషన్ ఏజెంట్లచే రెండు గంటలు చర్చించారు. వ్యాపారుల అనుమతుల పునరుద్ధరణకు మార్కెట్ అధికారులు హామీ ఇచ్చారు. రాతపూర్వక హామీ ఇవ్వాలని కమీషన్ ఏజెంట్లు పట్టుబట్టడంతో చివరికి నెలరోజుల తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని హామీ పత్రం రాసి ఇవ్వడంతో కొనుగోళ్లు జరిపారు. మామిడి, ఇతర పండ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన కమీషన్ వ్యాపారుల సమ్మె సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు సాగింది.
ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ హైదరాబాద్ నగరంలోని కొత్తపేట గడ్డి అన్నారంలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీనితో రైతులు నిరసన తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మార్కెట్ యార్డులో అద్దె చెల్లించకపోవటంతో కమీషన్ వ్యాపారులు సమ్మె చేపట్టి లావాదేవీలను నిలిపేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు మార్కెట్ యార్డుకు వచ్చి మామిడి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించేందుకు భరోసా ఇచ్చారు. అనంతరం తదితర అధికారులు కమిషన్ ఏజెంట్లు రాతపూర్వక హామీ ఇవ్వటంతో, నెల రోజుల తర్వాత సమస్య పరిష్కరిస్తాం అని చెప్పటంతో కొనుగోళ్లు జరిగాయి.
4,380
https://www.prajasakti.com/WEBSECTION/International/page515/sabhy-maraniste-sabh-wida-pandu
నీతివంతమైన పాలన అందించాలంటే కమ్యూనిస్టులకే సాధ్యం
తెలంగాణ రాష్ట్రంలో 93 శాతం ఉన్న సామాజిక తరగతులవారి అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం సాగుతున్న మహాజన పాదయాత్ర పాలకులపై ఎక్కుపెట్టిన సమర యాత్ర అని, భవిష్యత్తులో సకల జనులను ఏకం చేయగల దీక్షా యాత్ర అని సీపీఐ ( ఎం ) కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. శ్రీనివాసరావు అన్నారు. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న పాదయాత్ర శనివారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కారేపల్లి మండల కేంద్రంలో మండల కార్యదర్శి కొండబోయిన నాగేశ్వరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో శ్రీనివాసరావు ప్రసంగించారు. మోడీ అడుగుజాడల్లోనే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుపై తొలుత వ్యతిరేకించిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసిన తర్వాత మాట మార్చారని అన్నారు. హరితహారం పేరుతో రాష్ట్రంలో గిరిజనులపై దాడులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా చోట్ల గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, ఎందరో మహిళలను వేధింపులకు గురిచేసి పోలీస్స్టేషన్లలో ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. పోడు భూముల్లో దుక్కులు దున్నిన పశువులను సైతం పోలీస్స్టేషన్లలో నిర్బంధించారన్నారు. గిరిజనులు తమ పోడు భూముల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని, అండగా సీపీఐ ( ఎం ) ఉంటుందని హామీ ఇచ్చారు. త్రిపురలో గిరిజనులకు వంద శాతం సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దేశంలో అతి పేద ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్సర్కార్ మాత్రమే చెప్పారు. నల్ల ధనాన్ని వెలికితీస్తానని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని మోడులా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బ్యాంకులకు చేరిన డబ్బును తక్కువ వడ్డీకి కార్పొరేట్లకు అప్పగించేందుకు పథకం వేశారని అన్నారు. ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని మాయమాటలు చెప్పిన మోడీ ఆరు లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని అన్నారు. నీతివంతమైన పాలన అందించాలంటే కమ్యూనిస్టులకే సాధ్యమన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలను పట్టించుకోకపోతే కేసీఆర్కు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న పాదయాత్ర శనివారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో శ్రీనివాసరావు ప్రసంగించారు. మోడీ అడుగుజాడల్లోనే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రము లో వున్నా గిరిగనులకు అన్యాయం చేస్తున్నారన్నారు. హరితహారం పేరుతో వారు భూములను స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. పలుచోట్ల గిరిజనులపై కేసులు పెట్టి జైలు లో వేసి స్త్రీల ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. వారి పశువులను సహితం నిర్బంధించారన్నారు. గిరిజనులకు అండగా సీపీఐ ( ఎం ) ఉంటుందని హామీ ఇచ్చారు. నీతివంతమైన పాలన అందించాలంటే కమ్యూనిస్టులకే సాధ్యమన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలను పట్టించుకోకపోతే కేసీఆర్కు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
4,423
https://www.prajasakti.com/WEBSECTION/National/page791/manipur-takin-dadri
నిరుద్యోగుల ర్యాలీ
ఈ నెల 22న నిర్వహించనున్న నిరుద్యోగుల ర్యాలీకి ప్రభుత్వం అనుమతిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని, ఒకవేళ అనుమతి ఇవ్వకపోయినా నిర్వహించి తీరుతామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ర్యాలీని అడ్డుకుంటే అక్కడే శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పారు. ఈ నెల 22న నిర్వహించనున్న నిరుద్యోగ ర్యాలీకి సంబంధించిన సన్నాహ సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్లోని ఓయూ ఐసీఎస్ఎస్ఆర్హాల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల కోసం సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీతో నిరుద్యోగులు సత్తా చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలతోపాటు, ఓయూ నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. గురుకులాల నోటిఫికేషన్లో కఠిన నిబంధనలు తగవని, ఇది నిరుద్యోగులను భయబ్రాంతులకు గురి చేయడమేనని కోదండరామ్ అన్నారు. ఓయూలో నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట జరుగుతున్న 'గురుకుల దీక్ష'కు ఆయన మద్దతు తెలిపారు. గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు డిగ్రీ పాసైన వారందరికీ అనుమతించాలన్నారు. టెట్ క్వాలిఫై అయినవారికీ అవకాశం కల్పించాలని, నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల అర్హత సాధన కమిటీని ఎన్నుకున్నారు. కొటారి మానవతారారుతోపాటు 13 మంది సభ్యులను ఎన్నుకున్నారు. మానవతారారు మాట్లాడుతూ గురుకులాల్లో ప్రభుత్వ అవినీతిని ఎండగడుతామని, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 22న జరగనున్న నిరుద్యోగుల ర్యాలీకి ప్రభుత్వం అనుమతించిన లేకున్నా ర్యాలీ నిర్వహిస్తామని అడ్డుకుంటే శాంతియుతంగా నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓయూలో నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట జరుగుతున్న 'గురుకుల దీక్ష'కు ఆయన మద్దతు తెలుపుతూ గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్లు అన్ని కఠిన నిబంధనలు తగవని టెట్ క్వాలిఫై అయిన వారికి, డిగ్రీ పాసైన వారికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
4,779
https://www.prajasakti.com/WEBSECTION/National/page338/bharat-kath-mugise
టఫ్ కార్యాలయం సీజ్ పై పోలీసులు కుట్ర.
టఫ్ కార్యాలయం సీజ్పై సోమవారం కోర్టులో విచారణ ఉన్నందున, పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, పాలకులు, ఉద్యమకారులను అణచివేసే చర్యలకు పూనుకుంటున్నారని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ( టఫ్ ) అధ్యక్షురాలు విమలక్క అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని దోమలగూడ టఫ్, అరుణోదయ కార్యాలయం ఎదుట విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూసి ఉంచిన టఫ్ కార్యాలయం తలుపులు తీసి ఉన్నాయని, కిటికీలు పగులగొట్టారని చెప్పారు. కావాలనే పోలీసులు కుట్ర పూరితంగా వ్యవహరించి అణచివేత చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిగోడ వెనుకవైపున సుత్తికొడవలి బొమ్మవేసి జనశక్తి అని రాశారని తెలిపారు. సోమవారం కోర్టులో టఫ్ సీజ్పై విచారణ ఉన్నందున పోలీసులు ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను గమనించి వెంటనే చిక్కడపల్లి సీఐకి తెలియపర్చామని రాతపూర్వక ప్రతిని ఆమె మీడియాకు విడుదల చేశారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ కోర్టులో కేసు నడుస్తున్న సందర్భంలో కార్యాలయంలోకి వెళ్లాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దొంగలు అనుకుంటే గోడ వెనుక వైపు జనశక్తి అని ఎందుకు రాస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఆట-పాటతో ప్రజలను చైతన్యం చేసిన అరుణోదయ, టఫ్ కార్యాలయాన్ని సీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ ( ఎం ) రాష్ట్ర కమిటీ సభ్యులు టి. సాగర్ అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాలపై అణచివేత కొనసాగుతోందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా టఫ్ కార్యాలయం మూసివేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం టఫ్ కార్యాలయాన్ని తెరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఐ ( ఎం. ఎల్ ) న్యూడె మోక్రసీ రాష్ట్ర నాయకులు కె. గోవర్దన్ మాట్లాడుతూ సీజ్ చేసినట్టుగా ధృవీకరించిన కార్యాలయంలో రాత్రికిరాత్రే అక్రమంగా ప్రవేశించి జనశక్తి అని కార్యాలయం వెనుకవైపు రాయడం పోలీసులపై అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
టఫ్ కార్యాలయం సీజ్పై సోమవారం కోర్టులో విచారణ ఉన్నందున, టఫ్ కార్యాలయం సీజ్పై పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులే కిటికీలు పగులగొట్టి, సుత్తికొడవలి బొమ్మవేసి జనశక్తి అని రాశారని,దొంగలైతే జనశక్తి అని ఎందుకు రాస్తారని, కేసు నడుస్తున్న సందర్భంలో అసలు పోలీసులు అక్కడికి ఎందుకు వెళ్లారని, విషయం తెలియగానే చిక్కడపల్లి సీఐకి తెలియపర్చామని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ( టఫ్ ) అధ్యక్షురాలు విమలక్క అరుణోదయ కార్యాలయం ఎదుట మీడియాకు తెలియజేసారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరిచిన టఫ్ కార్యాలయాన్ని సీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఘటనపై ఇతర రాజకీయ నాయకులు పోలీసులపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
9,832
https://www.prajasakti.com/WEBSECTION/International/page402/kichak-guru
"గీతం" లో ప్లేస్ మెంట్ల కళకళలు
హైదరాబాద్లోని గీతం విశ్వవిద్యాలయం విద్యార్థులు రికార్డు స్థాయిలో ప్లేస్మెంట్లు సాధించారు. ఈ మేరకు ప్లేస్మెంట్ల డైరెక్టర్ నాతి వేణుకుమార్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2016-17 విద్యాసంవత్సరం అక్టోబర్ నాటికి బహుళజాతి కంపెనీలైన ఊనిక్ రూ. 12 లక్షలు, వీఎం వేర్ రూ. 9.52 లక్షల గరిష్ట వార్షిక వేతనాలతో గీతం విద్యార్థులను ఎంపిక చేశాయని తెలిపారు. వెరైజోన్ రూ. 5.20 లక్షలు, టెక్ యాస్పెక్ట్ రూ. 4.90 లక్షలు, రాక్వెల్ కొలిన్స్ రూ. 4.40 లక్షలు, పోర్ట్వేర్ రూ. 4 లక్షలు ఇలా పలు సంస్థలు ఆకర్షణీయమైన వార్షిక వేతనాలను గీతం విద్యార్థులకు ఆఫర్ అందించాయని పేర్కొన్నారు. ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ రూ. 18 లక్షల వార్షిక వేతనం, హిటాచీ రూ. 4 లక్షలు వార్షిక వేతనం గీతంలో చేపట్టిన ప్రాంగణ నియామకాలు వెల్లడించాల్సి ఉందని పేర్కొన్నారు. శనివారం ఒకేరోజు 250 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో గీతం విశ్వవిద్యాలయం నుంచి 511 మంది విద్యార్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు.
గీతం విశ్వవిద్యాలయంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధిస్తున్నారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ల డైరెక్టర్ నాతి వేణుకుమార్ బహుళజాతి కంపెనీలైన వీఎం వేర్,ఊనిక్,వెరైజోన్,టెక్ యాస్పెక్ట్,రాక్వెల్ కొలిన్స్,పోర్ట్వేర్,అమెజాన్,హిటాచీ వంటి కంపెనీలు భారీ వార్షిక వేతనాలతో విద్యార్థులను ఎంపికచేస్కుంటున్నారని తెలిపారు.
29,507
https://www.prajasakti.com/WEBSECTION/International/page932/ankshas-samarthanga-adurcontan
కనీస నగదు నిల్వను తగ్గించిన ఎస్ బీఐ
పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వ నిర్వహణ అంశాన్ని భారతీయ స్టేట్ బ్యాంకు మరోసారి సమీక్షించింది. కనీస నగదు నిల్వలతో పాటు, ఆయా ఖాతాలపై విధించే రుసుములను సవరించింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీస నగదు నిల్వను రూ. 5వేల నుంచి రూ. 3వేలకు తగ్గించింది. దీని వల్ల ఐదు కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. నగదు నిర్వహించని ఖాతాలకు విధించే రుసుములను కూడా 20-50 శాతం మేర సవరించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జీలను ఆయా ఖాతాలను బట్టి రూ. 20-40, మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ. 30-50 వరకు విధించింది. అక్టోబర్ నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. జన్ధన్ ఖాతాలకు కనీస నగదు నిల్వల పరిమితి లేదు. తాజాగా పెన్షనర్లు, ప్రభుత్వ ప్రయోజనాలు పొందే ఖాతాదారులు, మైనర్ల ఖాతాలకూ నిల్వ అవసరం లేదని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐలో 42 కోట్ల ఖాతాలుండగా అందులో 13 కోట్లు పీఎంజేడీవై, సాధారణ పొదుపు ఖాతాలే ఉన్నాయి. వీటిని ఇంతకు ముందే ఛార్జీల నుంచి మినహాయించారు.
పొదుపు ఖాతాల్లో కనీస నగదును రూ. 5వేల నుంచి రూ. 3వేలకు భారతీయ స్టేట్ బ్యాంకు తగ్గించింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని ఖాతాలలో తగ్గించగా ఐదు కోట్ల మంది లబ్ది పొందనున్నారు. పెన్షనర్లు, ప్రభుత్వ ప్రయోజనాలు పొందే ఖాతాదారులు, మైనర్ల ఖాతాలకు అసలు నిల్వ అవసరం లేదని తెల్పింది. ఎస్బీఐలోని ఉన్న 42 కోట్ల ఖాతాలలో 13 కోట్లు పీఎంజేడీవై ఖాతాలే ఉన్నాయి.
29,992
https://www.prajasakti.com/WEBSECTION/National/page996/gundepotuto-agrigold-agent-mriti
నోట్లకు రెండోవైపు అసలు ఎలాంటి ముద్రణా లేకుండా ఉండడం మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ జిల్లాలో వెలుగుచూసింది
కొత్తగా విడుదలైన రూ. 2000, రూ. 500 నోట్లలో ఇప్పటివరకు చిన్న చిన్న ముద్రణ లోపాలు చూశాం. కానీ, నోట్లకు రెండోవైపు అసలు ఎలాంటి ముద్రణా లేకుండా ఉండడం మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లాలో వెలుగుచూసింది. ఇవి కూడా ఎటిఎ మిషన్లో రావడం గమనార్హం. వివరాల్లోకెళ్తే జిల్లాలోని సెగాన్ గ్రామంలో ఉన్న ఎటిఎం మిషన్లో హేమంత్ సోని అనే వ్యక్తి మంగళవారం రాత్రి రూ. 1,500 విత్డ్రా చేశాడు. అతడికి వచ్చిన మూడు రూ. 500 నోట్లలో రెండింటికి రెండోవైపు అసలు ముద్రణే లేదు. దీనిపై బాధితుడు బ్యాంకు అధికారులను ప్రశ్నించాడు. తమదే పొరపాటని ఒప్పుకున్న అధికారులు ఖాతాదారుడికి నోట్లు మార్చి ఇచ్చారు. ఆర్బిఐ నుంచి ముద్రణ సరిగా లేని నోట్లు వస్తున్నాయని బ్యాంకు అధికారి ఒకరు వెల్లడించారు. ఇకనుంచి నోట్లను ఎటిఎంల్లో పెట్టే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్లోనే గాంధీజీ బొమ్మలేని రూ. 2 వేల నోట్లు వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే.
సెగాన్ గ్రామంలో ఎటిఎం మిషన్లో హేమంత్ సోని అనే అతను రూ. 1,500 విత్డ్రా చేశాడు. దాంట్ల రెండు రూ. 500 నోట్లలో రెండోవైపు అసలు ముద్రణే లేదు. బ్యాంకు అధికారులను అడగగా, తమదే తప్పని నోట్లు మర్చి ఇచ్చారు. ఎటిఎంల్లో నోట్లను వేసేముందు వాటిని సరిగ్గా పరిశీలిస్తామని చెప్పారు.
34,552
https://www.prajasakti.com/WEBSECTION/International/page51/americalo-kalpul-kalakalam
అప్పులు మరో ఇద్దరు కౌలురైతుల ఉసురుతీశాయి. వీటికితోడు వర్షాలకు పంటనీటమునగడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో వర్షాభావంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుల కుటుంబసభ్యుల, పోలీసుల పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడికి చెందిన కౌలురైతు చేగొండి వీరవెంకట నాగబాబు ( 32 ) కౌలు చేస్తున్న పొలానికి సమీపంలోని మామిడ చెట్టుకు ఉరేసుకుని ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడేళ్లుగా ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్న నాగబాబు, వరుస నష్టాలతో సుమారు మూడు లక్షలు అప్పుల పాలయ్యాడు. రూ. 30 వేలు సొసైటీలో రైతుమిత్ర గ్రూపు ద్వారా తీసుకోగా, మిగిలింది ప్రయివేటు అప్పు. ఇటీవలి వర్షాలకు పంట నీటమునగడంతో నాలుగు రోజులుగా వాటిని ఒడ్డుకు చేర్చుకున్నాడు. పనలు మొలకలు రావడంతో కుటుంబ పోషణ, అప్పులు తీర్చడం ఎలా ? అంటూ భార్య, కుటుంబ సభ్యులతో ఆవేదనగా మాట్లాడిన నాగబాబు, ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం చెన్నంపల్లిలో హనుమన్న ( 55 ) తనకున్న నాలుగెకరాల పొలంతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని కొర్రలు, కంది సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంట చేతికి రాలేదు. పంట సాగుచేసేందుకు రూ. 5 లక్షలు అప్పులు చేశాడు. పంటలు పండక అప్పు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురైన ఆయన పొలంలోనే పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.
అప్పుల భాధకి మరో ఇద్దరు కౌలు రైతులు బలయ్యారు. భారీ వర్షాలకు పంట మునిగిపోయి, చేతికి రాక అప్పులు తీర్చలేక ఒకరు చెట్టుకి ఉరి వేసుకొని, మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడికి చెందిన కౌలురైతు చేగొండి వీరవెంకట నాగబాబు ( 32 ) ఒకరు, ఇంకొకరు కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం చెన్నంపల్లిలో హనుమన్న ( 55 ).
4,774
https://www.prajasakti.com/WEBSECTION/International/page767/modatisari-iddru-mahila-yodhulu
10 టీవీ విలేకర్ సుమన్ అనుమానాస్పద మృతిపై విచారణ.
హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఆల్వాల్ 10 టీవీ రిపోర్టర్ పి. సుమన్ అనుమానాస్పద మృతిపై విచారణ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య ( టీడ బ్ల్యూజేఎఫ్ ) , హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ( హెచ్యూజే ) డిమాండ్ చేశాయి. అల్వాల్ పోలీసుల అక్రమ కేసు నేపథ్యంలో సుమన్ ఆత్మహత్య చేసుకున్నాడని, దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ను కోరాయి. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ అనురాగ్ శర్మను ఆయా సంఘాల నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. జగదీశ్వర్, హెచ్యూజే కార్యనిర్వాహక అధ్యక్షులు బి. విజయానంద్ డీజీపీని కలిసినవారిలో ఉన్నారు. సుమన్ కుటుంబ నేపథ్యం, అనుమానాస్పద మృతి, అల్వాల్ పోలీసుల తీరుపై ఫిర్యాదులో పేర్కొన్నారు. వృత్తిలోకి కొత్తగా వచ్చిన సుమన్పై అకారణంగా కేసు పెట్టారని, కోర్టు నుంచి బెయిల్ పొందిన తరువాత కూడా స్థానిక పోలీసులు వేధించారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో అవమానంగా భావించి, సుమన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారని డీజీపీకి తెలియజేశారు. మూడేండ్ల క్రితమే అతని తండ్రీ చనిపోయాడని, తల్లీ, ఇద్దరు చెల్లెళ్లతో జీవనం సాగిస్తున్నాడని వివరించారు. ఇద్దరు చెల్లెళ్లు వికలాంగులని డీజీపీకి చెప్పారు. సుమన్ మృతితో ఆ కుటుంబం అనాథగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుమన్ కుటుంబానికి రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందుకు అనురాగ్ శర్మ స్పందిస్తూ సుమన్ మృతిపై స్వతంత్య్ర సంస్థతో విచారణ చేయిస్తానని ఫెడరేషన్ బృందానికి హామీ ఇచ్చారు. పరిహారం విషయమై ప్రభుత్వానికి నివేధిస్తామని తెలిపారు.
10 టీవీ రిపోర్టర్ పి. సుమన్ పై అక్రమ కేసు పెట్టడం వల్లే అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ కేసుపై విచారణ చేయాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ( హెచ్యూజే ) ఇతరులు కలిసి డీజీపీ అనురాగ్ శర్మకు వినతిపత్రం ఇచ్చారు. బెయిల్ పొందిన తరువాత కూడా స్థానిక పోలీసులు వేధించారని, తనకు తండ్రి లేడని ఇద్దరు చెల్లెళ్లు వికలాంగు కాబట్టి తన కుటుంబానికి రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వారు కోరగా, స్వతంత్య్ర సంస్థతో విచారణ జరిపిస్తానని ప్రభుత్వంతో మాట్లాడి నష్ట పరిహారం ఇప్పిస్తామని డీజీపీ అనురాగ్ శర్మ గారు వారికి హామీఇచ్చారు.
26,016
https://www.prajasakti.com/WEBSECTION/National/page470/asembli-nirvadik-wida
వ్యాట్ తగ్గింపు
పెట్రోలు, డీజిల్ విక్రయాలపై ప్రస్తుతం విధిస్తున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ను నాలుగు శాతం మేర తగ్గించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి విజరు రూపానీ ప్రకటించారు. కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం మంగళవారం అర్ధరాత్రి నుండి పెట్రోల్, డీజిల్ విక్రయాలపై వ్యాట్ను 4 శాతం మేర తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి రూపానీ మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ తగ్గింపు అనంతరం గుజరాత్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 66.53, డీజిల్ ధర రూ. 60.77 లుగా కొనసాగుతుందన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ. 2,316 కోట్లు నష్టం వాటిల్లుతుందని, అయితే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని రూపానీ చెప్పారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై పన్నులను తగ్గించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. మహరాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై రూ. 2, డీజిల్పై రూ. 1 వ్యాట్ను ప్రతి లీటర్పై తగ్గిస్తూ నిర్ణయించింది. మంగళవారం అర్థరాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లో ఉండనున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఆ మేరకు దీపావళి కానుకగా పెట్రోలుపై పన్ను తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ముంగన్ తివార్ తెలిపారు.
పెట్రోలు, డీజిలపై నాలుగు శాతం పాటు వ్యాట్ ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజరు రూపాని చెప్పారు. తగ్గించిన తర్వాత పెట్రోలు రూ. 66.53 మరియు డీజిల్ రూ. 60.77 గా ఉంటుందని దీని వలన ఖజానాకు 2,136 కోట్లు నష్టం అని, అయినా ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా పెట్రోలుపై రూ. 2, డీజిల్ పై రూ. 1 ప్రతి లీటర్ పై తగ్గించింది.
31,180
https://www.prajasakti.com/WEBSECTION/International/page336/divaiefai-aadhvaryamlo-krida-samskritik-poties-prarambha
ఇంజనీరింగ్ మాదిరి డిగ్రీలో క్రెడిట్స్ విధానం
రాష్ట్రంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం ( సీబీసీ ఎస్ ) అమల్లో భాగంగా డిగ్రీ విద్యలో డిటెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ( టీఎస్సీహెచ్ఈ ) సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్థుల మార్కులకు బదులుగా క్రెడిట్స్ పరిగణనలోకి తీసుకుంటారు. డిగ్రీ కోర్సులో మార్పులు రానున్నాయి. సీబీసీఎస్లో భాగంగా 2017-18 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. శనివారం హైదరాబాద్లోని టీఎస్సీ హెచ్ఈ కార్యాలయంలో ఆరు కన్వెన్షనల్ విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఎస్సీహెచ్ఈ చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మెన్లు కె వెంకటాచలం, ఎస్ మల్లేష్, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, విశ్వవిద్యాలయాల వీసీలు పాల్గొన్నారు. సీబీసీఎస్ అమలు తీరుపై మరింత అధ్యయనం చేయాలని, డిటెన్షన్ విధానం అమల్లో భాగంగా క్రెడిట్స్ను ఎలా లెక్కించాలనే దానిపై వీసీలు మరింత అధ్యయనం చేయాలని భావించినట్టు సమాచారం. మరో సమావేశంలో డిగ్రీలో డిటెన్షన్ విధానం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం డిగ్రీలో డిటెన్షన్ విధానం సబ్జెక్టుల ఆధారంగా అమల్లో ఉంది. ఇక నుంచి క్రెడిట్స్ ఆధారంగా అమల్లోకి రానుంది. ఇంజినీరింగ్ తరహాలోనే క్రెడిట్స్ విధానం అమలు చేయనున్నారు. క్రెడిట్స్ లో సంగం సాధిస్తేనే పై తరగతికి విద్యార్థులు వెళ్తారు. లేదంటే డిటెన్షన్కు గురవుతారు. విశ్వవిద్యాలయాలన్నీ ఆన్లైన్ ప్రక్రియలోకి రానున్నాయి. వర్సిటీల్లోని కోర్సులు, అనుబంధ కాలేజీలు, విద్యార్థులు, పనిచేస్తున్న బోధన, బోధ నేతర సిబ్బంది వివరాల తోపాటు విద్యార్థుల ధ్రువపత్రాలు ఆన్లైన్లో పరిధిలోకి తెచ్చేలా ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంటున్నది.
టి ఎస్ సి హెచ్ ఈ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి మరియు విశ్వవిద్యాలయాల విసీలు డిగ్రీ డిటెన్షన్ విధానం గురించి ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. డిగ్రీ విద్య లో డిటెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇకనుంచి విద్యార్థులు మార్కులకు బదులు గా క్రెడిట్స్ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ తరహాలోనే క్రెడిట్ విధానం అమలు చేయనున్నారని, క్రెడిట్ సగం సాధిస్తేనే పై తరగతులకు విద్యార్థులు వెళ్తారు అన్నారు. విశ్వవిద్యాలయాలన్నీ ఆన్లైన్ ప్రక్రియలోకి తెచ్చేలా ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంటున్నది.
31,611
https://www.prajasakti.com/WEBSECTION/International/page900/naigerilo-mod-atmahuti-dadulu
అప్పులు తీర్చలేక టిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ ఆత్మ హత్యాయత్నం
వేతనం రాక, అప్పులు తీరక టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్లో శుక్రవారం తీవ్ర విషాదాన్ని నింపింది. ముదిరాజ్ కులస్తుడైన శాడ శంకర్ 20 14లో బీజేపీ తరపున అంకుసాపూర్ ఎంపీటీసీగా గెలుపొందాడు. అనంతరం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో 2015లో చేరారు. అప్పటినుండి పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించేవాడు. అయితే ఎన్నికల సమయంలో పోటీ చేసేందుకు దాదాపు రూ. 2 లక్షల వరకు అప్పు చేశాడు. అదేక్ర మంలో శిథిలావస్థలో ఉన్న ఇంటిని తిరిగి మర మ్మతులు చేసేందుకు మరో రూ. 3 లకలు ఖర్చు చేశాడు. కానీ ఉన్న ఎకరంన్నర పొలంలో పండిన ధాన్యం అతని అప్పులు తీర్చలేకపోయింది. మరో వైపు ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహంలే కపోగా, ఎంపీటీసీలకు సంబంధించిన వేతనాలు సైతం నెలనెలా సక్రమంగా రాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ రోజురోజుకీ భారమైంది. పేరుకు పోయిన అప్పులు మానసికంగా వేధించాయి. ఇక మరణమే శరణ్యమని గురువారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసే సరికి విగత జీవిగా కనిపించాడు. మృతుడి భార్య లావణ్య, పద్మ పోలీసులకు సమాచారం అందించఃడంతో ఎస్సై సైదారావు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
జీతం రాక, అప్పులు తీరక టిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే ఎన్నికల సమయంలో పోటీ చేసేందుకు దాదాపు రూ . 2 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టగా, తన ఇంటిని మరమ్మతులు చేసేందుకు మరో మూడు లక్షలు ఖర్చు చేశాడు. ఉన్న ఎకరం నర పొలం ధాన్యం అతని అప్పులు తీర్చలేక పోయింది. దీంతో మానసికంగా కృంగిపోయి అర్ధరాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
33,041
https://www.prajasakti.com/WEBSECTION/National/page957/vicharanku-shiriph-kutumbikulu-garhajaru
కల్తీ మద్యం కేసులో ఒక నిందితుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ముందస్తు బెయిల్ను విజయవాడలోని ఎమ్ఎస్జె కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ బెయిల్ పిటిషన్పై డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బి రామకోటేశ్వరరావు వాదన వినిపిస్తూ, పోలీసులు విష్ణును విచారించి వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. ఆయనకు డిసెంబరు 16,17 తేదీల్లో నోటీసులు జారీ చేసినా విచారణకు సహకరించకుండా అజ్ఞాతంలో ఉన్నారన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి నిరంజన్ పోలీసుల విచారణకు హాజరై కేసు దర్యాప్తునకు సహకరించాలని విష్ణును ఆదేశించారు. ముందస్తు బెయిల్ను తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6 న విచారణకు హాజరుకావాలని సిట్ విష్ణుకు నోటీసులు జారీ చేసింది. నిజాలు చెప్పాల్సిన బాధ్యత విష్ణుదే -సిపి గౌతమ్ సవాంగ్కల్తీమద్యం కేసుకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నామని విజయవాడ పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఈ కేసులో నిందితుడు మల్లాది విష్ణు మినహా బార్ యజమానులు, అతని కుటుంబ సభ్యులంతా విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరిస్తున్నారన్నారు. విష్ణు తల్లి బాలత్రిపురసుందరమ్మను కూడా విచారించామని, అయితే ఆమె తనకేమీ తెలియదన్నారని కమీషనర్ తెలిపారు. కేసులో చాలా అనుమానాలున్నాయని, కల్తీ మద్యం వ్యవహరం గురించి నిజాలు చెప్పాల్సిన బాధ్యత విష్ణుపై ఉందని అన్నారు. తప్పు చేయకపోతే తప్పించుకు తిరగాల్సిన పనిలేదన్నారు. కల్తీమద్యం కేసులో కీలకమయిన విస్రా పరీక్ష ఫలితాలతో పాటు స్టేట్ ఫోరెన్సిక్, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు పూర్తిస్థాయిలో అందలేదని కమీషనర్ చెప్పారు. మొత్తం 70 శాంపిల్స్ పంపామని, పూర్తిస్థాయి రిపోర్టు అందితేనే మరణాలకు కారణాలు తెలుస్తాయని అన్నారు. బార్లో ఏం జరిగిందనేది తెలుసుకు నేందుకు సిసి కెమెరాల దృశ్యాల నాణ్యత బాగా లేదన్నారు. ఎపి పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వివిద దుకాణాలు, వ్యాపారులంతా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని ఈ సందర్భంగా తెలిపారు.
కల్తీ మద్యం కేసులో నిందితుడైన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ ను విజయవాడలోని ఎం ఎస్ జె కోర్టు తిరస్కరించడంతో విష్ణు ను విచారించుట కై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడు మల్లాది విష్ణు మినహా బార్ యజమానులు, అతని కుటుంబ సభ్యులు అంతా విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, బార్ లో సీసీ కెమెరాల దృశ్యాల నాణ్యత బాగోక పోవడం తో, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన 70 శాంపిల్స్ రిపోర్ట్ అందితేనే మరణాలకు కారణాలు తెలుస్తాయని తెలిపారు.
33,059
https://www.prajasakti.com/WEBSECTION/National/page732/congolo-militents-dodilo-9-mandi-mriti
వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా పోలవరం ప్రాజెక్టు తరహా ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ పాదయాత్రను శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఇరపాడు నిర్వాసిత గ్రామంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో నిర్వాసితులైన వారికి ఇంటి నిర్మాణానికి రూ. 3.15 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం వంశధార నిర్వాసితులకు రూ. 45 వేలు మాత్రమే చెల్లిస్తూ తీవ్ర వివక్షత చూపుతోందన్నారు. పోలవరం కుడి కాలువ భూమికి కృష్ణా జిల్లాలో రూ. 30 లక్షల నుంచి రూ. 52 లక్షల వరకూ నష్టపరిహారం చెల్లించిందని తెలిపారు. వంశధార ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు రూ. 1.30 లక్షలతోనే సరిపెట్టిందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు పోలవరంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడంతో పాటు, అమ్మాయిలకు రూ. 5.83 లక్షలు చెల్లిస్తోందనీ, ఇక్కడ ఒక్కరికి కూడా ప్యాకేజీ ఇవ్వలేదనీ తెలిపారు. ఒకే రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లోని నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వం వివక్షత చూపడం దారుణమన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, వంశధార నిర్వాసిత సంఘం నాయకులు పాల్గొన్నారు.
వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా పోలవరం ప్రాజెక్టు ద్వారా నిర్వాసితులకు లబ్ధి చేకూర్చినట్లే, వీరికి కూడా ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులపాటు జిల్లా నుంచి పాదయాత్రను కొనసాగించారు. అంతేకాకుండా 18 ఏళ్లు నిండిన యువతి, యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడంతోపాటు అమ్మాయిలకు 5.83 లక్షల రూపాయలు చెల్లిస్తుందని, అదేవిధంగా ఆధార నిర్వాసితులకు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏం కృష్ణమూర్తి కోరారు.
33,257
https://www.prajasakti.com/WEBSECTION/National/page905/china-nudi-chala-nerchukovali
ప్రస్తుతమున్న తెల్లరేషన్ కార్డుల స్థానంలో పసుపు కార్డులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై 10.30 వరకు కొనసాగింది. ఇసుక విధానం చర్చకు వచ్చినా తుది నిర్ణయం తీసుకోలేదు. బాక్సైట్ తవ్వకాలకు అటవీశాఖ జారీ చేసిన జిఓను రద్దు చేయాలని పలువురు మంత్రులు కోరారు. కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాధితులకు సహాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. చేనేత రుణమాఫీ రూ. 110 కోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. జన్మభూమి కమిటీల్లో నిర్ణయించి జనవరి నుండి ఈ మాఫీని అమల్లోకి తీసుకురానున్నారు. పవన విద్యుత్ ఉత్పత్తికి సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్తో కుదిరిన ఒప్పందం ప్రకారం అనంతపురంలో భూములు కేటాయించనున్నారు. పోర్టు పాలసీ కోసం ఎపి మ్యారిటైమ్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. రేషన్కార్డుల కోసం రాష్ట్రంలో 11.37 లక్షల దరఖాస్తులొచ్చాయి. వారందరికీ త్వరలోనే కార్డులతోపాటు, 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. సంక్రాంతికి ఈ కానుకను అమలు చేయనున్నారు. వెనుకబడిన ఏడు జిల్లాల్లో వాల్టా చట్టానికి లోబడి 50 వేల వ్యవసాయ బోర్లు వేసేందుకు అనుమతివ్వాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించిన మంత్రిమండలి సమావేశంలో తెల్ల రేషన్ కార్డులకు బదులు పసుపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. బాక్సైట్ తవ్వకాల జీవోను రాదు చేయమని, అధిక వర్షపాతానికి నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని మంత్రివర్గం అనుకున్నారు. చేనేత రుణమాఫీ నిలిపివేత, జన్మభూమి అమలు చేయనున్నారు. పవన విద్యుత్ ఉత్పత్తికి సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్తో కుదిరిన ఒప్పందానికి అనంతపురంలో భూములు ఇస్తున్నారు.
34,422
https://www.prajasakti.com/WEBSECTION/International/page928/kashmirpai-guteresto-imran-carch
ఇసుక వ్యాపారాన్ని మరోసారీ మాఫీయా చేతుల్లో పెట్టేందుకే తెలుగుదేశం ప్రభుత్వం తెరవెనుక రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే కొత్త పాలసీలో ప్రభుత్వానికి కాస్త ఆదాయం పెరిగినా మాఫియా గతంలో మాదిరి కాంట్రాక్టర్ల, అధికారపార్టీ నేతల చేతుల్లోకి వెళ్లే ఆస్కారం ఉందంటున్నారు. ఇంతవరకు డ్వాక్రా మహిళా సంఘాల పేరిట ఇసుక వ్యాపారాన్ని నడిపించారు. ఇసుక వ్యాపారంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం ఒక నివేదిక ద్వారా బయటికొచ్చినట్లు సమాచారం. అది సిఎం దృష్టికీ వెళ్లింది. మహిళా సంఘాల పాత్రను నామమాత్రం చేసి ఆ ముసుగులో అధికారపార్టీ నేతలు ఇసుక దందా నిర్వహించారు. ఇప్పుడా ముసుగును తీసేయనున్నారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించే పేరుతో ఇసుక రీచ్ల్లోనే ఆదాయ, వ్యయాలను నిర్వహించే గుమాస్తాలుగా వారి పాత్రను పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుకపై శ్వేత పత్రం గురువారం విడుదల చేసిన విషయం విదితమే. అయితే కొత్త పాలసీని ప్రకటించలేదు. కానీ ఆ పాలసీ జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ఇసుక వ్యాపారాన్ని తెలుగుదేశంపార్టీ నేతలకు అప్పగించే విషయాన్ని తొందరపడి బయట పెట్టేందుకు సిఎం వెనుకాడుతుండటమే కొత్త పాలసీ తేవడానికి కారణం కావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో టిడిపి నేతలు పదవులు, ఆదాయ వనరులను సొంతం చేసుకునేందుకు వెంపర్లాడుతున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నీటిపారుదల శాఖలో ఆ శాఖమంత్రి అనుయాయులు వివిధ ప్రాజెక్టుల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నట్టు ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. పార్టీ బలంగా ఉండాలంటే పార్టీ క్యాడర్ కూడా ఆర్థికంగా బలపడాలని చంద్రబాబూ భావిస్తున్నారు.
ఇసుక వ్యాపారం మరోసారి మాఫియా చేతుల్లోకి వెళ్లనుంది. ఇంతవరకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు డ్వాక్రా మహిళా సంఘాల పేరిట ఇసుక వ్యాపారాన్ని సాగించారని ఇటీవల బయటకిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుకపై శ్వేతపత్రాన్ని విడుదల చేసినప్పటికీ కొత్త పాలిసిని ప్రకటించలేదు కానీ అది జనవరిలో అమలులోకి వస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి అప్పగించేందుకు ముఖ్యమంత్రి వెనకడుతుంటే కొత్త పాలిసీ ప్రవేశపెడతాడేమోనని పార్టీ వర్గాల అభిప్రాయం. పదేళ్ల తర్వాత టిడిపి అధికారంలోకి రావడంతో ఆదయ వనరుల కోసం ఎదురుచూస్తన్నారని రాజకీయా వర్గాల అంచనా. పార్టీ క్యాడర్ బలంగా ఉంటె పార్టీ బలంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.
34,761
https://www.prajasakti.com/WEBSECTION/International/page42/tajnu-sandarshinchin-myanmar-adhyaksh
రైతులు, ఆహార భద్రత పేరిట మరోసారి ప్రపంచ బ్యారకు మురదు రాష్ట్ర ప్రభుత్వం చేతులు చాచిరది. దాదాపు రూ. 500 కోట్ల రుణం తీసుకుంటూ ఒప్పందం చేసుకురది. ఇప్పటికే వివిధ రంగాల నురచి అప్పులకు వెళ్తున్న ప్రభుత్వం తాజాగా ప్రపంచ బారకు నురచీ అప్పు తీసుకురది. గ్రామీణ ఇరక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు పై చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ రుణాన్ని తీసుకున్నారు. మొత్తం 75 మిలియన్ డాలర్ల ( సుమారుగా 496 కోట్ల రూపాయలు ) ను రుణంగా తీసుకునేందుకు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఒప్పందం జరిగిరది. ఈ ఒప్పందంపై కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత, భారత్లో ప్రపంచ బారకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఒన్నో రుల్ సంతకాలు చేశారు. ఈ ఒప్పంద వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రపంచ బారకు నురచి తీసుకున్న ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని పెరచుకునేరదుకు, చిన్న, సన్నకారు రైతుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయిరచారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ రైతుల అభివృద్ధి కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆలాగే ఆహారం, పౌష్టికాహారం, పారిశుధ్యం వంటి అరశాలకు కూడా ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. వివిధ మిషన్లకు సహకారం అరదిరచేరదుకు కూడా ఈ నిధులను వినియోగిరచాలని నిర్ణయిరచారు. ఉత్పత్తులను పెరచాలని భావిస్తున్నారు. వారి ఉత్పత్తులకు మార్కెటిరగ్ సౌకర్యాలు కూడా కల్పిరచేరదుకు ఈ రుణాలు వినియోగిరచాలని నిర్ణయిరచారు. ఐదు లక్షల మంది నిరుపేదల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిరచేరదుకు అవసరమైన కార్యక్రమాలు కూడా ఈ నిధులతో నిర్వహిస్తారు.
గ్రామీణ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ చేపట్టిన ప్రభత్వం 500 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకులో అప్పు తీసుకోడానికి ఢిల్లీలో ఒప్పందం చేసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత, భారత్లో ప్రపంచ బారకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఒన్నో రుల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేయగా, చంద్రబాబు ఒప్పంద వివరాలు ట్విట్టర్ లో చెప్పారు. ఈ రుణాన్ని ముక్యంగా ఎస్సీ, ఎస్టీ రైతుల అభివృద్ధి కోసం, వ్యవసాయ రైతుల ఆదాయాలు, ఖర్చుల కోసం, ఐదులక్షల పేదప్రజల భద్రత కోసం ఉపయోగిస్తామన్నారు.
35,040
https://www.prajasakti.com/WEBSECTION/International/page419/atendarpai-langik-vedhimpulu
రెరడంకెల వృద్ధి అరచనాల పై శాఖల మధ్య వివాదాలు రాజుకురటున్నాయి. ప్రధానంగా పారిశ్రామిక రంగ వృద్ధి శాఖల మధ్య వివాదానికి కారణమవుతోరది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ వృద్ధి కేవలం 7 శాతం మాత్రమే ఉన్నట్లు ప్రణాళిక శాఖ వెల్లడిరచిరది. పరిశ్రమల స్థాపన కోసం దేశ, విదేశాల నురచి ఎరతో మంది వస్తున్న సమయంలో, వారితో ఒప్పందాలు కూడా అవుతుండగా వృద్ధి రేటు కేవలం ఏడు శాతంగా చూపిరచడం ఎరత వరకు సమంజసమని పరిశ్రమల శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెరదుతున్న రాష్ట్రాల్లో ఆరధ్రప్రదేశ్కు రెరడో స్థానాన్ని ఇస్తూ ప్రపంచ బ్యారక్ కూడా ప్రకటన చేసిన విషయాన్ని ఆ శాఖతోపాటు, ఆర్థిక శాఖా గుర్తుచేస్తోరది. అరతా భేషుగ్గా ఉరదని ప్రపంచ బ్యారకు అరటురటే, వృద్ధి తక్కువగా ఉన్నట్లు చూపిరచడమేమిటని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వాదనతో ఏకీభవిరచని ప్రణాళిక శాఖ మాత్రం ఏడు శాతాన్ని సమర్థిరచుకురటోరది. ప్రస్తుతం ఒప్పందాలవుతున్నా, పరిశ్రమలు ఇరకా ప్రారంభం కాలేదని, అరదువల్ల వృద్ధి కనిపిరచదని వీరు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ఏడు శాతం వృద్ధే ఎక్కువని మరో అధికారి వ్యాఖ్యానిరచారు. ఈ వృద్ధి అరచనాలను ఇటీవల విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రణాళిక శాఖ అధికారులు ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనే ఆర్ధిక, పరిశ్రమల శాఖల అధికారులు అరచనాల పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసిరది. ఈ అరచనాలను ప్రణాళిక శాఖ అధ్వర్యంలో గణారకశాఖ తయారుచేస్తురది. వాటిని కూడా అన్ని జిల్లాల్లో ఉన్న స్థానిక, వాస్తవ పరిస్థితుల ఆధారంగా రూపొరదిస్తురది. తాజాగా పరిశ్రమల రంగానికి చెరదిన వృద్ధిని కూడా అలాగే సిద్ధం చేసినట్లు ప్రణాళిక శాఖ అధికారులు చెబుతున్నారు. శాఖల మధ్య వృద్ధి వివాదం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం.
రాష్ట్రంలో 7 శాతం మాత్రమే పారిశ్రామిక రంగ వృద్ధి ఉన్నట్లు ప్రణాళిక శాఖ ప్రకటించింది. పరిశ్రమల స్థాపన కోసం దేశ, విదేశాల నుండి ఎంతో వస్తున్నా వృద్ధి రేటు మాత్రం 7 శాతం చూపించడం ఎంతవరకు న్యాయమని పరిశ్రమల శాఖ అధికారులు అడుగుతున్నారు. ఇప్పటివరకు ఒప్పందాలు మాత్రమే అయ్యాయని , పరిశ్రమలు మొదలు అవ్వలేదని , అందుకే వృద్ధి కనిపించట్లేదని నిజానికి ఏడు శాతం వృద్ధే ఎక్కువని మరో అధికారి వ్యాఖ్యానిరచారు. ఇలా పాళీ శాఖల మధ్య వృద్ధి వివాదం ముక్యమంత్రి దగ్గరికి కూడా వెళ్లినట్లు తెలిసింది .
60,717
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-2456-.html
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ ధరకి కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ
ఢిీల్లీ: ఐపిఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో భారీ ధరకి స్టార్ క్రికెటర్లని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బెంగుళూరు వేదికగా గత శని, ఆదివారం జరిగిన ఈ వేలంలో రూ. 11కోట్లకి ఓపెనర్ కెఎల్ రాహుల్ని దక్కించుకున్న పంజాబ్ రవిచంద్రన్ అశ్విన్ (రూ. 7.6కోట్లు), ఆండ్రూ టై (రూ. 7.2కోట్లు), అరోన్ ఫించ్ (రూ. 6.2కోట్లు), స్టాయినిస్ (రూ. 6.2కోట్లు), కరుణ్ నాయర్ (రూ. 5.6కోట్లు), క్రిస్గేల్ (రూ. 2కోట్లు) కొనుగోలుతో జట్టుని బలిష్టం చేసుకుంది. గత మూడు సీజన్లలోనూ జట్టు ప్రదర్శన మరీ తీసికట్టుగా మారడంతోనే ఫ్రాంచైజీ ఈ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ ఏడాది సీజన్కి జట్టు పేరుని కూడా మార్చాలని ఫ్రాంచైజీ యోచిస్తోందట. ఈ మేరకు బిసిసైకి ఇప్పటికే పేరు మార్పుపై దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పదేళ్ల ఐపిఎల్ చరిత్రలో ఒకసారి మాత్రమే ఫైనల్కు చేరిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 2014 నుంచి కనీసం ప్లేఆఫ్కి కూడా అర్హత సాధించలేకపోయింది. దీంతో వేలంలో మ్యాచ్ల్ని గెలిపించే ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీ ఎక్కువగా దృష్టి సారించి దక్కించుకుంది. ఆటగాళ్ల మార్పుతో పాటు జట్టుపేరు మార్పు పంజాబ్కి ఏమేరకు టైటిల్ తెచ్చిపెడుతుందో చూడాలి.
ఐపిఎల్ 2018 సీజన్ లో ఫ్రాంచైజీ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ ధరకి కొనుగోలు చేసుకుంది. గత మూడు సీజన్లలోనూ జట్టు ప్రదర్శన నామమాత్రంగా ఉండడంతో ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీ ఎక్కువగా దృష్టి పెట్టి 11కోట్లకి కెఎల్ రాహుల్,7.6కోట్లకి రవిచంద్రన్ అశ్విన్,7.2కోట్లకి ఆండ్రూ టై,6.2కోట్లకి అరోన్ ఫించ్,6.2కోట్లకి స్టాయినిస్,5.6కోట్లకి కరుణ్ నాయర్,2కోట్లకి క్రిస్గేల్ ను కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అలాగే జట్టు పేరు కూడా మర్చేయాలనే ఆలోచలనతో ఉంది.
73,756
https://telangana.suryaa.com/telangana-updates-38607-.html
అత్తి పండ్లు ఆరోగ్యానికి మంచిది
అత్తి పండ్లలో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఎండిన అత్తి పండ్లలో ఖనిజాలు మరియు విటమిన్ల యొక్క గాఢమైన మూలం ఉంటుంది. అంజీర్ పండ్లు గోధుమ, ఊదా, పసుపు లేదా నలుపు, ఆకుపచ్చ వంటి రంగులతోను మరియు పరిమాణంలో విభిన్నంగా ఉంటాయి. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ దీన్ని ఔషధ ఫలంగా వాడతారు. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్లయినా అత్తి పండును ఎండురూపంలో గానీ, పండుగా గానీ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తుంది. ప్రయోజనాలు: అత్తి పండ్లను తీసుకోవడం వలన మలబద్ధకంను చాలా బాగా నిరోధిస్తుంది. అత్తి పండు పీచు పదార్థం యొక్క ఒక అద్భుతమైన మూలం కలిగి ఉంటుంది. దీనిని బరువు తగ్గించుకోవటానికి సమర్థవంతమైన ఆహారంగా చెప్పవచ్చు. సాధారణ ఆహారంలో అత్తి పండ్లను తీసుకోవటం వలన మీకు అన్ని సాధారణ మార్గాల్లో మీ కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యం ఉంటుంది. తృణధాన్యాల ఫైబర్ ఉపయోగించిన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రిస్క్ 50% వరకు తగ్గింది. ఆపిల్, డేట్స్, అత్తి పండ్లు, బేరి మరియు ప్రూనే వంటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. లైంగిక శక్తి పెంచుతుందని అత్తి పండ్లను ఎక్కువగా వాడుతున్నారు.
అత్తి పండ్లను ఎండిన రూపంలో లేదా పండ్లుగా తీసుకుంటే ఏదైనా వ్యాధితో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. అత్తి పండ్లలో ఫైబర్ అద్భుతమైన మూలం కలిగి ఉంటుంది. అత్తి పండ్లను రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ ను సాధారణ పద్దతిలో తగ్గించవచ్చు. ఆపిల్, డేట్స్, అత్తి పండ్లు, బేరి, ప్రూనే వంటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. లైంగిక శక్తిని పెంచడానికి అత్తి పండ్లను విస్తృతంగా ఉపయోగిస్తారు.
77,309
https://cinema.suryaa.com/movies-13466-.html
మార్కెట్లోకి మరో రియల్ మీ కొత్త సిరీస్
రియల్ మీ తన కొత్త సిరీస్ రియల్ మీ 20 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్ లో రియల్మే నార్జో 20, నార్జో 20 ఎ, నార్జో 20 ప్రో వంటి మూడు కొత్త ఫోన్లు స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో ప్రవేశించాయి. రియల్ మీ నార్జో 20 ఎ ఎంట్రీ లెవల్ ఫోన్, రియల్మే నార్జో 20 మరియు రియల్మే నార్జో 20 ప్రో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్. రియల్మీ నార్జో 20 ప్రో ఈ సిరీస్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్. కానీ నార్జో 20 సిరీస్ లో అతిపెద్ద బ్యాటరీతో తక్కువ ధరలో వచ్చిన స్మార్ట్ ఫోనుగా ఈ రియల్ మీ నార్జో 20 నిలుస్తుంది. రియల్ మీ నార్జో 20 ధరరియల్ మీ నార్జో 20 ధర 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్తో బేస్ వేరియంట్కు రూ . 10,499 మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్కు రూ . 11,499. ఈ స్మార్ ఫోన్ గ్లోరీ సిల్వర్ మరియు విక్టరీ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది 20 సెప్టెంబర్ 28 నుంచి అమ్మకలకు వస్తుంది. ఫ్లిప్కార్ట్, స్టోర్ మరియు ఆఫ్ లైన్ స్టోర్లలో అమ్మకానికి ఉండనుంది 20 ఫీచర్లురియల్ మీ నార్జో 20 లో ఒక 6.5-అంగుళాల + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే ఉంది, ఇది నార్జో 2 మాదిరిగానే ఉంటుంది, వాటర్డ్రాప్ నాచ్ కటౌట్ తో పాటు. ఫోన్ 9.8 మిల్లీమీటర్ల మందం మరియు 200 గ్రాముల బరువు ఉంటుంది. మీడియాటెక్ హెలియో జి 85 ప్రాసెసర్ తో నడిచే నార్జో 20 స్టోరేజ్ అప్షన్స్ కోసం 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి / 128 జిబి స్టోరేజ్ ఆప్షన్స్తో జతచేయబడ్డాయి. ఈ ఫోన్ 25 వరకు మైక్రో కార్డులకు మద్దతు ఇస్తుంది మరియు లో నడుస్తుంది. రియల్ మీ నార్జో 20 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48 ఎంపి కెమెరా, 11 ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ మరియు 2 ఎంపి మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు వైపు, సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది. నార్జో 20 లో అతిపెద్ద 600 ఎంఏహెచ్ బ్యాటరీ 1 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
రియల్ మీ 20 అనే ఒక కొత్త సిరీస్ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా నార్జో 20, నార్జో 20 ఎ, నార్జో 20 ప్రో వంటి స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వేటిలో ఒకటి ఎంట్రీ లెవెల్ ఫోన్,రియల్మీ నార్జో 20 ప్రో ఈ సిరీస్ ప్రీమియం ఫోన్. దీని కెపాసిటీ 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి ఇంకా దీనిలో రెండు రకాల రంగులు కూడా లభించును. అదనంగా ఫీచర్లురియల్ (1600 x 720 పిక్సెల్స్) ఉంటుంది. ఈ మొబైల్ సెప్టెంబర్ 28 నుంచి అందుబాటులోకి వస్తుంది. 200 గ్రాములు బరువు ఉండే ఈ మొబైల్ 85 ప్రాసెసర్ మరిము 256 జిబి సపోర్ట్ చేస్తుంది. రియల్ మీ నార్జో 20 ప్రత్యేకంగా కెమెరా విషయానికి వస్తే వెనక ట్రిపుల్ కెమెరా,ముందు సెల్ఫీ కెమెరా చూడగలరు.
78,747
https://cinema.suryaa.com/movies-860416-.html
శర్వా గాయం
శర్వానంద్ 'మహానుభావుడు' తర్వాత 3 డిజాస్టర్ లు మూటకట్టుకున్నాడు. గతే నెల విడుదలైన '96' రీమేక్ 'జాను' చిత్రానికి మంచి టాక్ వచ్చింది. . శర్వా నటనకి కూడా ప్రశంసలు దక్కాయి కానీ. . అప్పటికే '96' చిత్రాన్ని అందరూ చూసెయ్యడం. . అలాగే మల్టీ ప్లెక్స్ ఆడియన్సును తప్ప. . ఆ చిత్రం మాస్ ప్రేక్షకులకు ఏమాత్రం మెప్పించలేకపోయింది. సమంత స్టార్ డం. . దిల్ రాజు బ్రాండ్ కూడా ఆ చిత్రాన్ని కాపాడలేకపోయాయి. ఇక ఫిబ్రవరి అన్ సీజన్ కావడంతో కలెక్షన్లు కూడా రాలేదు. దీంతో పెద్ద డిజాస్టర్ గా మిగిలింది ఆ చిత్రం. ఇక ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే శర్వానంద్ భుజానికి గాయమాయిన సంగతి తెలిసిందే. అప్పుడు అతని భుజానికి సర్జరీ అవసరమని వైద్యులు చెప్పినప్పటికీ. . శర్వా లైట్ తీసుకున్నాడట. 'జాను' అలాగే తన తదుపరి చిత్రం 'శ్రీకారం' షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత చూద్దాం అనుకుంటూ. . పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడట. మొత్తానికి ఇప్పుడు అమెరికా వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడని సమాచారం. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ కు తిరిగి వస్తాడని శర్వా సన్నితుల నుండీ సమాచారం. ఇక తన 'శ్రీకారం' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల. . ఈ చిత్రం వాయిదా పడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.
శర్వానంద్ 'మహానుభావుడు' , '96' రీమేక్ ‘జాను’ సినిమాల తరువాత వరుసగా 3 సినిమాలు ఫ్లోప్ గా నిలిచాయి. అయితే జాను సినిమా తీస్తుండగా ఆయన భుజానికి అయిన గాయానికి శ్రీకారం మూవీ పనుల తరువాత అమెరికాకి సర్జరీ కోసం వెళ్ళగా తన 'శ్రీకారం' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే కరోనా ప్రభావంతో ఈ చిత్రం వాయిదా పడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.
78,768
https://telangana.suryaa.com/telangana-updates-868541-.html
డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్ కస్టమర్లకు శుభవార్త
దేశంలో లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్న సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి, ఏప్రిల్ నెలకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తం ఆలస్యమైతే పెనాల్టీ ఉండదని ప్రకటించింది. పలు స్మాల్ సేవింగ్ స్కీమ్స్కు ఇది వర్తిస్తుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ తాజా నిర్ణయంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), రికరింగ్ డిపాజిట్స్ (ఆర్ డి), సుకన్య సమృద్ధి అకౌంట్ వంటి పలు స్కీమ్స్లో చేరిన వారికి ప్రయోజనం కలుగనుంది. జూన్ 30 వరకు పెనాల్టీలను మినహయిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం. . ఆర్డీ, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి వాటికి చెందిన సబ్స్క్రైబర్లు 2019-20 ఆర్థిక సంవత్సరం లేదా ఏప్రిల్ నెలకు సంబంధించిన డిపాజిట్ మొత్తాన్ని జూన్ 30లోగా కట్టేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి పెనాల్టీలు కానీ, ఫీజులు కానీ పడవు. పీపీఎఫ్ అకౌంట్లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 అయినా డిపాజిట్ చేయకపోతే అప్పుడు ఆ అకౌంట్ ఇన్యాక్టివ్ అవుతుంది. ఈ అకౌంట్ను మళ్ళీ యాక్టివ్ చేసుకోవాలంటే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆర్డ అకౌంట్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే డిఫాల్ట్ ఫీజు పడుతుంది. సుకన్య సమృద్ధి అకౌంట్ విషయానికి వస్తే. . ఈ అకౌంట్లో కూడా కనీసం కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లో సంవత్సరానికి కనీసం రూ. 250 ఇన్వెస్ట్ చేయాలి.
లాక్ డౌన్ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తన కస్టమర్లకు మంచి వార్త చెప్పింది. పీపీఎఫ్, ఆర్ డి, సుకన్య సమృద్ధి అకౌంట్ వంటి స్కీమ్స్లోని అకౌంట్ దారులు, 2019-20 సంవత్సరానికి లేదా ఏప్రిల్ నెలకు చెల్లించాల్సిన మొత్తం జూన్ 30 లోగా కట్టేయవచ్చని,పెనాల్టీ పడదని చెప్పారు. ప్రతి అకౌంట్ లో కనీస మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది లేకుంటే అకౌంట్ ఇన్యాక్టివ్ అవ్వడమో ఫీజు పడడమో జరుగుతుంది. ఏడాదికి పీపీఎఫ్ లో రూ. 500 ,సుకన్య సమృద్ధి లో రూ. 250 జమ చేయాలి.
81,763
https://www.vaartha.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8%e2%80%8c/
బోల్డ్ హీరోయిన్ షాలిని పాండేకు అదృష్టం తక్కువయింది..
అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే. . ఆ తర్వాత తెలుగులో కనబడితే ఒట్టు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ కిస్సులతో రెచ్చిపోయి నటించిన షాలిని పాండేకి ఆ సినిమా తర్వాత అలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చాన్సులే వచ్చాయట. కొందరు దర్శకనిర్మాతలైతే. . సినిమాలో అవసరం లేకపోయినా. . . లిప్ లాక్స్ చేస్తావా అని అడిగారని. . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది కూడా. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత తెలుగులో బిజీ కాకపోవడానికి ఏకైక కారణం మాత్రం ఆమెకి అర్జున్ రెడ్డిలో చేసిన ఆ కేరెక్టర్స్ లాంటివి రావడమే అని చెప్పింది. ఇక మహానటిలో సావిత్రి ఫ్రెండ్ కేరెక్టర్ లో చేసిన. . ఆమెకి ఉపయోగం లేకుండా పోయింది. అయితే అర్జున్ రెడ్డి, మహానటి వచ్చిన చానళ్లకు షాలిని పాండే కళ్యాణ్ రామ్ తో కలిసి 118 అనే థ్రిల్లర్ మూవీలో నటించింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గర్ల్ ఫ్రెండ్ గా షాలిని పాండే నటించింది. అయితే ఓ అన్నంత ప్రాధాన్యత లేని పాత్రలోనే షాలిని కనబడి. . అభిమానులను డిజప్పాయింట్ చేసింది. కేవలం కళ్యాణ్ రామ్ కు సపోర్టింగ్ పాత్రల్లో నటించిన షాలిని పాండే. . పాత్రకి ప్రాధాన్యత కనబడదు. కాస్త బొద్దుతనం తగ్గితే కమర్షియల్ సినిమాలకు కూడా పనికి వస్తుంది అనేలా ఉంది. కేవలం ఆమె అందాలు చూపించడానికి పరిమితమైంది అనేలా ఉన్న ఈ పాత్రని ఒప్పుకున్నా షాలిని పాండేని అందరూ. . ఇలాంటి పాత్రల కోసమేనా ఇన్నాళ్లు వెయిట్ చేసింది అని అంటున్నారు. పాపం షాలిని క్యూట్ గా ఉంటే సరిపోదు. . . అదృష్టం కూడా ఉండాలమ్మడూ. . . !
అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ హీరోయిన్గా పరిచయమైనా షాలిని పాండే తనకు ఆ సినిమా తర్వాత ఆమెకు అటువంటి కేరెక్టర్స్ లాంటివి వచ్చాయని, కొందరు దర్శకనిర్మాతలైతే లిప్ ళొచ్క్స్ హేస్తావ అని అడిగారు. మహానటి సినిమాలో సావిత్రికి ఫ్రెండ్ గా నటించిన ఆమెకు అది ఉపయోగపడలేదు. కళ్యాణ్ రామ్ తో కలిసి కళ్యాణ్ రామ్ గర్ల్ ఫ్రెండ్ గా 118 అనే థ్రిల్లర్ సినిమాలో నటించారు. ఆ పాత్రలో ఆమెకు పెద్దగ ప్రాధాన్యత లేదని ,అభిమానులను డిజప్పాయింట్ చేసింది. ఈమె కేవలం అందాలు చూపించడానికి పరిమితమైంది అన్నట్టుగా ఉంది. షాలిని పాండేకి అదృష్టం కూడా ఉంటె బావుంటుంది.
82,332
https://www.vaartha.com/chandra-babu-naidu-stages-protest-against-it-raids-on-tdp-leaders/
రైతుల కు ఏడాదికి రూ.6,000
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 అందిస్తోంది. మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున అన్నదాతలకు ఈ డబ్బులు అందజేస్తోంది మోడీ సర్కార్, పీఎం కిసాన్ స్కీమ్ కోసం ఏకంగా రూ. 75 వేల కోట్లు కేటాయించారు. ఇక ఈ స్కీమ్ ఆరో విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపు (ఆగస్టు 9) ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధిపొందనున్నారు. ఇక, ఆరో విడతగా రూ. 17,000 కోట్లను కేంద్రం విడుదల చేయనుంది. ఈ సారి కూడా రూ. 2 వేలను రైతుల ఖాతాలకు కేంద్రం బదిలీ చేయనుంది. ఆగష్టు 9న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
కేంద్ర ప్రభుతం, రైతులకోసం తెచ్చిన పీఎం కిసాన్ స్కీమ్ లో అర్హులైన రైతులకు, మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున, ఏడాదికి రూ. 6,000 అందజేస్తుంది. ఈ స్కీం కొరకు రూ. 75 వేల కోట్లు కేటాయించారు. ఇక డబ్బు విడతల వారిగా, నేరుగా రైతుల ఖాతాల్లోనె జమ చేసేవిధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది.
83,459
https://www.prabhanews.com/2020/10/trump-effect-america-companies/
ట్రంప్ నిర్ణయంతో నష్టాల్లో కూరుకుపోతున్న అమెరికా కంపెనీలు
విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో అడుగు పెట్టకుండా వీసాలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల సొంత దేశానికే హాని చేశాయి. అమెరికా కంపెనీలకు అపా ర నష్టాలను మిగి ల్చాయి. ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్1 వంటి వీసాలపై ట్రంప్ ఆంక్షల ఫలితంగా అమెరికా కంపెనీలకు 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7.38 లక్షల కోట్లు) నష్టం జరిగిందని అమెరికాకు చెందిన ప్రముఖ మేధో సంస్థ బ్రూకింగ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ అంచనా వేసింది. ఈ ప్రభావం కంపెనీలపై దీర్ఘకా లంపాటు ప్రతికూలం గా ఉండనుందని విశ్లేషించిం ది. భారతీయ ఐటీ నిపు ణులు అధికంగా ఆధారపడే హెచ్-1బీ వీసాపై అమె రికా ఎక్కువ ఆంక్షలు విధిం చింది. నాన్- ఇమ్మిగ్రెంట్ వీసా అయిన హెచ్-1బీ ద్వారా ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అమెరికా కంపెనీలు నియమిం చుకునేందుకు వెసులుబాటు ఉండేది. ఎల్-1 వీసా కంపెనీ అంతర్గతంగా బదిలీలకు ఉప యోగించుకు నేది. కంపెనీలకు కీలకమైన ఈ హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై డిసెంబర్ 31 వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ విధిస్తూ జూన్ 22న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ నిర్ణయంతో ఫార్చూన్ 500 సంస్థల వాల్యూ యే షన్ 100 బిలియన్ డాలర్లకుపైగా నష్టం జరి గిం దని బ్రూకింగ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ పేర్కొంది. ట్రంప్ ఆర్డర్తో 2 లక్షల మంది విదేశీ నిపుణులు, వారిపై ఆధారపడి నవారు అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకున్న ట్టయిందని రిపోర్ట్ సహ రచయిత అయిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఇండియన్- అమెరికన్ లుమ్రీ ఫ్యామిలీ అసోసియేట్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్ చౌదరి, బ్రూ కింగ్కు చెందిన డానీ బహస్, పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన బ్రిట్టా గ్లెన్నోన్ వెల్లడిం చారు. అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల నియామకం లేదా బదిలీలకు కంపెనీలు ఉపయోగించుకునే హెచ్-1బీ వీసా, ఎల్-1 వంటి నాన్ -ఇమ్మి గ్రెంట్ వీసాలను ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా ఆంక్షలు విధించిం దని రిపోర్ట్ పేర్కొంది. కంపెనీల లాభాలు, ఉత్పత్తి, ఉత్పత్తి విస్తర ణ, ఆవిష్కరణలు, పెట్టుబడుల విషయంలో నైపుణ్యం కలిగిన విదేశీయుల సహకారం పెద్ద మొత్తం లో ఉందని చాలా ఆధా రాలున్నాయని రిపోర్ట్ ప్రస్తావించింది. ప్రత్యేకంగా ఇమ్మి గ్రేషన్పై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న చర్యలు అమె రికా కంపెనీలపై దీర్ఘకా లంపాటు ప్రతికూల ప్రభావాన్ని చూపి స్తా యి. అంతేకాకుండా కోవిడ్ బారి నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ఆలస్యమవనుందని రిపోర్ట్ పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ వృత్తి నిపుణుల హెచ్-1బీ, ఎల్1 వీసాలపై పెట్టిన ఆంక్షల వల్ల అమెరికా కంపనీలకే 100 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. నాన్- ఇమ్మిగ్రెంట్ వీసా అయిన హెచ్-1బీ వీసా విదేశీయులను కంపనీలో ఉపయోగించుకునేవారు అలాగే ఎల్-1 వీసా కంపెనీను కూడా కంపనీలో కీలకంగా ఉపయోగించునేవారు. కాని ఇప్పుడు ట్రంప్ నిర్ణయం సొంత దేశానికే నష్టం చేకుర్చాయని మండిపడుతున్నారు. ఈ విషయం పై రిపోర్ట్ సహరచయిత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఇండియన్- అమెరికన్ లుమ్రీ ఫ్యామిలీ అసోసియేట్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్ చౌదరి, బ్రూ కింగ్కు చెందిన డానీ బహస్, పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన బ్రిట్టా గ్లెన్నోన్ స్పందించారు. అసలే కోవిడ్ వల్ల నష్టాల్లో ఉంటె ట్రంప్ నిర్ణయం ఇంకా నష్టాన్ని పెంచింది.
31,393
https://www.prajasakti.com/WEBSECTION/National/page105/ru6440-kotlato-america-rayabar-karyalaya
ముత్తూట్ ఫైనాన్స్ కేసులో దర్యాప్తులు ముమ్మరం చేసిన పోలీస్ సిబ్బంది.
మైలార్దేవ్పల్లిలో ముత్తూట్ఫైనాన్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులు ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్స్లో వాహనం పార్కింగ్ చేసి ఉండటాన్ని గమనించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ చుట్టుపక్కల భారీగా పోలీసులు మోహరించారు. ఈ రోజు ఉదయం ముత్తూట్ ఫైనాన్స్లోకి చొరబడ్డ నిందితులు తుపాకీ, కత్తితో మేనేజర్, క్యాషియర్ను బెదిరించి దోపిడీకి విఫలయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో వారు అక్కడి నుంచి టవెరా వాహనంలో పరారయ్యారు. మైలార్దేవ్పల్లి నుంచి అరాంఘర్ మీదుగా వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు అన్ని చోట్లా తనిఖీలు చేపట్టారు. హ్యాపీహోమ్స్ లోపల వాహనం పార్కింగ్ చేసి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులు అపార్ట్మెంట్లోనే ఉన్నారా లేకపోతే వాహనాన్ని అక్కడ వదిలేసి ఎక్కడికైనా వెళ్లారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి యత్నించిన దుండగులు మంచి దుస్తులు వేసుకొని వ్యాపారుల ఫైనాన్స్ లోపలకు వచ్చారు. వారికి హ్యాపీ హోమ్స్లో ఉన్న వాళ్లెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? లేదంటే తప్పించుకొనేందుకు వాహనాన్ని అక్కడ వదిలి వెళ్లారా అనే విషయాలపైనా పోలీసులు దృష్టిసారించారు. నిందితుల వద్ద తుపాకీ, కత్తి ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దోపిడీకి ప్రయత్నించిన ఘటనలో ఏడుగురు పాల్గొన్నట్టు నిర్థారణకు వచ్చిన పోలీసులు వారిని పట్టుకొనేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
మైలార్ దేవరపల్లిలో ముత్తూట్ ఫైనాన్సులోకి చొరబడ్డ నిందితులపై పోలీసులు గాలింపులు ముమ్మరం చేసారు. హ్యాపీహోమ్స్ లోపల వాహనం పార్కింగ్ చేసి చోరీకి యత్నించిన దుండగులు ఫైనాన్స్ సిబ్బందిలా వేషధారణతో లోపలి రావడంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తులు చేపట్టారు. నిందితుల దగ్గర తుపాకీ, కట్టి ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, విచారణలు చేసి, ఘటనలో ఏడుగురు పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు మరిన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తున్నారు.
32,344
https://www.prajasakti.com/WEBSECTION/National/page298/artisi-karmikul-demands-parishkarinchali
ప్రత్యేకహోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిలదీయాలని వైసిపి అధినేత వైఎస్. జగన్మోహనరెడ్డి విద్యార్థులకు పిలుపు నిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని అంబ్కేదర్భవన్లో బుధవారం నిర్వహించిన యువభేరిలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఆయన ప్రజల వద్ద డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో వెంకయ్య నాయుడు, చంద్రబాబునాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేక హోదాకు అసలు అడ్డు ఏమిటో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక్కో హైదరాబాద్గా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించకపోతే యువత భవిత అంధకారమే అవుతుందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు హయాంలో సుమారు 6 వేల మంది ఆరోగ్యమిత్రలను, 35 వేల మంది ఫీల్డ్వర్కర్లను తొలగించారని తెలిపారు. డిఎస్సి నిర్వహించి నేటికీ ఫలితాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లక్షా 22 వేల 608 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని చెప్పి నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన యువభేరి లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించాలని సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాబు హయాంలో సుమారు 6 వేల మంది ఆరోగ్య మిత్రులను మరియు 36 వేల మంది ఫీల్ వర్కర్లను పదవి నుండి తొలగించారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ముందు చేసిన హామీలను అమలు చేయాలని హెచ్చరించారు.
34,517
https://www.prajasakti.com/WEBSECTION/National/page453/bigep-kalam-manavd-gudbai
చిత్తూరు మేయర్ అనురాధ హత్య నేపథ్యంలో తదుపరి మేయర్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. చిత్తూరు మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ప్రస్తుతం ఎవరధిరోహిస్తారు ? అధినేత చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారు ? అన్నదానిపై టిడిపిలో చర్చ జరు గుతోంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన కఠారి మోహన్ ఓసీ అయినప్పటికీ ఆయన భార్య అనురాధ ( ఈడిగ, తండ్రి వైపు నుంచి ) బీసీ కావడంతో ఆమెకు అప్పట్లో మేయర్ స్థానం దక్కింది. ప్రస్తుతం ఆమె చనిపోవడంతో ఇప్పుడు మరో బీసీ మహిళకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మేయర్ పదవిని అనురాధ కుటుంబసభ్యులకే కేటాయించాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అనురాధ కోడలు హేమలత కూడా బీసీ సామాజిక వర్గానికి ( ఆమె తండ్రి వైపు నుంచి ) చెందినవారే కాబట్టి ఆమెకే మేయర్ పదవి దక్కవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. అనురాధ స్థానంలో కార్పొరేటర్గా హేమలతను గెలిపించి అనంతరం మేయర్ చేయవచ్చని భావిస్తున్నారు. అయితే హేమలత వివాహం అనంతరం ఓసీ అయిన కఠారి ఇంటికి కోడలుగా వచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్ల పరంగా గానీ, మరే ఇతర ఇబ్బందులు ఎదురైన పక్షంలో హేమలత కాకుండా పార్టీకి విధేయులుగా ఉండే మహిళా కార్పొరేటర్లకు అవకాశం కల్పించే అవకాశమూ ఉంది. మరోపక్క కఠారి కుమార్తె హేమలత పేరు కూడా రేసులో వినవస్తోంది. ప్రస్తుతం చిత్తూరులో ఎనిమిది మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. కఠారి ఫ్యామిలీ రేసులో లేనిపక్షంలో తమకు అవకాశం కల్పించాలని పలువురు మహిళా కార్పొరేటర్లు కోరుతున్నారు. ఆ మేరకు ఎవరి పైరవీలు వారు చేస్తున్నారు. కొత్త మేయర్ ఎంపికలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడుదే తుది నిర్ణయమని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
చిత్తూరు మేయర్ అనురాధ చనిపోవడంతో, ఇప్పుడు మేయర్ ఎవరు అనే చర్చలో మొదటి నిర్ణయం చంద్రబాబు చేతుల్లో ఉంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన కఠారి మోహన్ ఓసీ అయినప్పటికీ ఆయన భార్య అనురాధ బిసి కావడంతో, ఇప్పుడు ఇంకో బిసి మహిళకు మాత్రం ఆ అవకాశం ఉంది. చంద్రబాబు మేయర్ గా అనురాధ కుటుంబ సభ్యులనే ఎంచుకునే ఆలోచనలో ఉన్నారని, దానికి అనురాధ కోడలు హేమలతకు అవకాశం ఉందన్నారు. ఎనిమిది మంది మహిళలు పోటీలో ఉన్నారు. కఠారి ఫ్యామిలీ పోటీలో ఉండకపోతే, కొంత మంది మహిళలు ఆ అవకాశం ఇవ్వమని కోరుతున్నారు.
34,667
https://www.prajasakti.com/WEBSECTION/National/page689/nyayamoortyi-nyayam-cheyadaniki-19-ellu
రాబోయే మూడేళ్లలో పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులన్నీ ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. జాతీయ హోదా గల పోలవరం ప్రాజెక్టునూ సాధ్యమైనంత తొందరగా నిర్మిస్తామన్నారు. విజయవాడలో సిఎం క్యాంపు కార్యాలయం వెనుక భాగాన శుక్రవారం ఉదయం మంత్రి జల వనరుల శాఖ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ రాష్ట్రం రూ. 16 వేల కోట్ల ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ పెండింగ్ ప్రాజెక్టుల కోసం సిఎం చంద్రబాబు రూ. 10 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. నదుల అనుసంధానాన్ని వేగవంతం చేస్తామన్నారు. సర్ ఆర్థర్ కాటన్, కెఎల్. రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యల మాదికిగా చంద్రబాబు పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచి పోతుందని మంత్రి పేర్కొన్నారు. సుమారు 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 3 కోట్ల వ్యయంతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. రెండతస్తుల ఈ భవనంలో మొదటి అంతస్తును జల వనరుల శాఖ పరిపాలక విభాగానికి కేటాయించారు. ఈ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ప్రాజెక్టుల పనులను 3జి, 4జి టెక్నాలజితో ఆన్లైన్ ద్వారా వీక్షించే వెసులుబాటు కల్పించామని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని భూగర్భ జలాల పరిస్థితి, సగటు వర్షపాతం ఇక్కడి నుంచే తెలుసుకునే వీలుందన్నారు. ప్రారంభానికి మంత్రులు పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎంపిలు కేశినేని నాని, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండ ఉమ, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కృష్ణా జడ్పి ఛైర్పర్సన్ గద్దె అనురాధ, సిఇ సుధాకర్, ఎస్ఇ శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో సిఎం క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆ శాఖ మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఆర్థిక లోతులో ఉన్నప్పటికీ మూడేళ్ళలో పెండింగ్ సాగునీరు ప్రాజెక్టుల కోసం చంద్రబాబు రూ. 10 వేల కోట్లు ఇచ్చారని అన్నారు. కార్యాలయంలో మొదటి అంతస్థు జల వనరుల శాఖ పరిపాలక విభాగానికి ఇచ్చారు. ఇందులో ప్రాజెక్ట్ పనుల్ని ఆన్లైన్లో చూసే అవకాశం ఇచ్చారని మంత్రి చెప్పారు. వర్షపాతం, భూగర్భ జలాల విషయాలు ఇక్కడినుండి తెలుసుకోవచ్చు అన్నారు.
34,886
https://www.prajasakti.com/WEBSECTION/International/page174/prajaswamyanike-avamana
పారిశ్రామికరంగంలో చిత్తూరుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యతిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్రానికొచ్చిన నాలుగు కంపెనీల్లో రెండు విశాఖలో పెట్టగా మరో రెండు చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఏర్పాటు చేయించింది. దీంతోపాటు పారిశ్రామిక రంగంలో అగ్రభాగం చిత్తూరుకు ఇవ్వనుంది. స్థలాల లభ్యతలో చిత్తూరు తొలిస్థానంలో ఉండటంతోపాటు బెంగుళూరు నుండి రేణిగుంట విమానాశ్రయం దగ్గరగా ఉండటంతో బెంగుళూరు, చిత్తూరు మధ్య పారిశ్రామిక కారిడార్కు ప్రతిపాదించింది. ఇప్పటికే తిరుపతి పర్యాటక కేంద్రంగా మారిన నేపథ్యంలో ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటు చేస్తే రెండు విధాలా లబ్దికలుగుతుందనే అంచనాలు సిద్ధం చేసింది. ఎపిఐఐసి కింద ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పారశ్రామిక సంస్థల కోసం 7,82,296 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించింది. వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాల నుండి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతోంది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం వెల్లడించి ంది. జూన్ నుండి ఇప్పటి వరకూ సుమారు రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించినట్లు తెలిపింది. దీనిలో 37,829 కోట్లు విలువైన పనులు మొదలు పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని వల్ల సుమారు 73,942 మందికి ఉపాధి లభించించనున్నట్లు ప్రకటించి ంది. ఇవి కాకుండా ఇంకా భూములు సేకరించేదిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రకటించింది. చిత్తూరు జిల్లాతోపాటు అనంతరం జిల్లాలోనూ మైనింగ్ ఆధారిత పరిశ్రమలు పెట్టేందకు సిద్ధమైంది. పారిశ్రామిక రంగంలో దీనికీ రెండో ప్రాధాన్యత కల్పించింది.
పారిశ్రామికరంగంలో చిత్తూరుకు సర్కారు మొదటి ప్రాధాన్యతనిస్తుంది,అంతేకాకుండా రాష్ట్రానికి వచ్చిన 2 కంపెనీలను చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఆవిష్కరించారు. స్థలాలు దొరకడంలో చిత్తూరు మొదటి స్తానంలో వుంది. బెంగుళూరు నుండి రేణిగుంట విమానాశ్రయం సమీపంగా ఉండటంతో బెంగుళూరు, చిత్తూరు మధ్య పారిశ్రామిక కారిడార్కు ప్రతిపాదించింది. పార్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే లాభంగానే ఉంటుందని ఊహాగానాలు చేసారు.
35,486
https://www.prajasakti.com/WEBSECTION/International/page420/gujarato-padmavat-vidudalapai-konsaguthunn-andoinal
తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగిలో 21 మంది మహిళలతో సహా మొత్తం 49 మంది పేద రైతులపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఖండించారు. తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ భూమిని పేద రైతులు చాలా కాలంగా సాగు చేసుకొంటున్నారన్నారు. తప్పుడు రికార్డుతో ఒక భూస్వామి ఆ భూమిని ఈ నెల 20వ తేదీన సాగు చేసుకొనేందుకు వచ్చాడన్నారు. అతనిని పేద రైతులు అడ్డుకోగా, పోలీసులు లాఠీఛార్జితోపాటు, భూస్వామి అనుచరులు దాడి చేశారన్నారు. ఈ దాడిలో ఒక దళితుడి చేయి విరిగిందని, దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుపోగా, పేదలపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారని మండిపడ్డారు. పోలీసులు భూస్వామికి కొమ్ము కాసి తప్పుడు కేసులు మోపడం దుర్మార్గమన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసులు ఉపసంహరించుకుని పేదలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కడప నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్ధినుల మృతి పట్ల ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ తదితర విద్యార్ధి సంఘ నాయకులు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఆయన ఖండించారు. వీరందరినీ ఈ నెల 19వ తేదీ రాత్రి జైలుకు పంపారన్నారు. ఇదే సంఘటనపై గుంటూరులో ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై విచక్షణా రహితంగా లాఠీచార్జి చేసి, రోడ్లపై ఈడ్చుకువెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న వారిపై నిర్భంధం ప్రయోగించడం గర్హనీయం అన్నారు. ప్రభుత్వం చేపట్టే ఈ నిర్భంధ చర్యల్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ నిర్భంధాన్ని ప్రజాతంత్ర వాదులంతా ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, తప్పుడు కేసులు ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ భూమిని చాల రోజులు గా కొంతమంది పేదలు సాగు చేస్తున్నారు, అయితే ఒక భూస్వామి ఈమధ్య వచ్చి పత్రాలు చూపించి భూమిని సాగు చేసుకోవడానికి వచ్చానని తెలియజేసాడు. దీనితో రైతులు రైతులు భూస్వామితో గొడవ పడగా, పోలీసులు వచ్చి 49 మంది రైతులు పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. కడప నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్ధినుల మృతి పట్ల నిరసన వ్యక్తం చేసిన ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ సంఘాల్లో 14 మందిని కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు అని, ఇలాంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు తెలిపారు,
55,788
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-23346-.html
<span class="text-big">అల్లు అర్జున్ తో స్టెప్పులేయనున్న అంజలి</span>
'అల్లు అర్జున్తో అంజలి ఐటెం సాంగ్', కొన్నిరోజులుగా టాలీవుడ్లో దీని గురించి బాగానే చర్చ నడుస్తోంది. అంజలి లాంటి ఫ్యామిలీ హీరోయిన్ తో అల్లు అర్జున్ స్టెప్పులా అని ఆశ్చర్యపోయారు. మొదట ఇది రూమర్ అయి ఉండొచ్చని కొట్టి పారేశారు. కానీ తర్వాత స్వయంగా అంజలియే ఈ పాట గురించి కన్ఫర్మ్ చేసింది. మరి ఆమెకు ఈ చాన్స్ ఎలా వచ్చింది ? , ఎందుకు అంజలికే అవకాశమిచ్చారు అంటే అల్లు అర్జున్తో సాంగ్ చేసే అవకాశం రావటానికి కారణం శంకరాభరణం సినిమానే అంట. “శంకరాభరణం సినిమాలో ‘ఘంటా’ అనే పాట ఉంటుంది. అందులో నేను వీర లెవల్లో స్టెప్పులేశాను. తొలిసారి మాస్ అప్పీల్తో కన్పించా. ఆ పాటను టీజర్లో చూసి తన సినిమాలో ఓ సాంగ్ చేయమని బోయపాటి శ్రీను అడిగారు. ఇది ఐటెం సాంగ్ కాదు, స్పెషల్ సాంగ్. ‘ఘంటా’ పాట కంపోజ్ చేసిన శేఖర్ మాస్టరే ఆ పాటా చేస్తున్నారు. అల్లు అర్జున్ పక్కన డ్యాన్సుల్లో నాకూ సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఒప్పుకున్నా. సినిమా చూశాకా మీకు అర్ధమవుతుంది’” అని అంజలి చెప్పింది.
అల్లు అర్జున్తో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు ఫ్యామిలీ హీరొయిన్ అంజలి చెప్పారు. మొదట అంతా రూమర్ అనుకున్నా, బోయపాటి శ్రీను సినిమాలో అల్లు అర్జున్తో డాన్స్ చేస్తున్నానని ధృవీకరించింది. శంకరాభరణం సినిమాలో ‘ఘంటా’ అనే పాటకు తన డాన్స్ ను చూసిన బోయపాటి, అల్లు అర్జున్ సినిమాలో ఒక సాంగ్ చేయమన్నారని అంజలి పేర్కొన్నారు.
78,493
https://cinema.suryaa.com/movies-406873-.html
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీదే హవా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తరువాత తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి పోటీనిచ్చే పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లేవు. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రజల కోసం పోరాటాలు చేయడంలో ఈ రెండు పార్టీలు విఫలమవుతున్నాయి. 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ రాష్ట్రంలో బలంగా పాతుకుపోతూ ఉండగా కాంగ్రెస్, బీజేపీ ఇప్పట్లో బలపడటం కష్టమే అని ఆ పార్టీ నేతలే విశ్వసిస్తూ ఉండటం గమనార్హం. 2014లో పోటాపోటీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుని టీడీపీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా చేసింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన గొప్పగా లేకపోయినా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న కొంత వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవడంలో విఫలమవుతున్నాయి. ఈ పార్టీలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలకు ప్రజలు మద్దతు పలకటం లేదు. కాంగ్రెస్, బీజేపీ పోరాటాలు చేయడం కంటే టీఆర్ఎస్ పార్టీ ఏవైనా తప్పులు చేస్తుందా. . . ? ఆ తప్పులు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తే మంచిది. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజల మద్దతు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమిస్తే మాత్రం రెండు పార్టీలు రాష్ట్రంలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పులపై దృష్టి పెట్టి ఆ తప్పులను ప్రజల్లోకి తీసుకెళితే భవిష్యత్తులోనైనా ఈ పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి విదిపోయినప్పట్నుండి ఆ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీదే హవా ఉంది. దీనికి పోటీని ఇచ్చే పార్టీలు ఏమి లేవు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రములో పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారు ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు దానికి కారణం ప్రజలలో ఈ పార్టీలపై కొంత వ్యతిరేకత ఉండడం. 2014లో గెలిచినా టీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకుంది. దాంతో టీడీపీకి తెలంగాణాలో భవిష్యతు లేకుండా పోయింది. కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ పార్టీ వారు చేసే తప్పులను ప్రజలలోకి ఎలా తీసుకువెళ్లాలని ఆలోచిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
33,364
https://www.prajasakti.com/WEBSECTION/International/page116/alkhaida-netaga-kashmir-yuvak
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు. ఆలస్యరుసుం లేకుండా 23వ తేదీలోగా ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎం. ప్రసన్న కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈ నెల 19వ తేదీ వరకే పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు విధించినా, విద్యార్థులు , ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూ. 50 అపరాధ రుసుంతో డిసెంబర్ 4వ తేదీ వరకు, రూ. 200తో 16వ తేదీ వరకు, రూ. 500తో 30వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు పాత పద్ధతి ఆధారంగానే ఫీజు మినహాయింపు ఇస్తూ, రెగ్యులర్ విద్యార్థులకు తల్లిదండ్రులకు పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 24 వేలు, అర్బన్ ప్రాంతాల్లో రూ. 20 వేలు ఉంటే ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 2.5 ఎకరాల తరి, 5 ఎకరాల మెట్ట కలిగి ఉన్న రైతుల పిల్లలకు ఫీజు మినహాయింపు వర్తింప జేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి చివరి వారంలో గానీ, ఏప్రిల్ మొదటి వారంలో గానీ నిర్వహించేందుకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ సెలవుల ఆధారంగా తేదీలను ఖరారు చేసేపనిలో అధికార యంత్రాంగం నిమగమైంది. మార్చి 26 నుంచి పరీక్షలు నిర్వహించాలని భావించినా ప్రభుత్వం నుంచి సెలవుల ప్రకటన వెలువడకపోవడం, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ జారీ కావడంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఉగాది, శ్రీరామ నవమి పండుగలు మినహా ఎలాంటి సెలవులు లేనందున ఏప్రిల్ మొదటి వారంలో పరీక్షలు ప్రారంభించి వరుసగా రెండు మూడు వారాల్లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు రెండు రకాల ప్రతిపాదలను అధికారులు సిద్ధం చేశారు.
పదో తరగతి పరీక్షా ఫీజు చెల్లించడానికి మొదట్లో 19వ కి అని ప్రకటించిన, విద్యార్థులు , ఉపాధ్యాయ సంఘాల కొరకు ఈ నెల 23 వరకు గడువు పెంచారు. 30వ తేదీ వరకు లెట్ ఫీజు చెల్లించి కట్టవచ్చు. ఎస్సీ, ఎస్టీల విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంది. రెగ్యులర్ విద్యార్థులకు తల్లిందండ్రుల ఆదాయాన్ని, పొలాన్ని బట్టి ఫీజు మినహాయింపు చేస్తున్నారు. పరిక్షలను మార్చ్ ఎండింగ్ లో గాని లేదా ఏప్రిల్ మొదట్లో గాని ప్రారంభించి క్రమంగా రెండు మూడు వరాల వరకు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
35,110
https://www.prajasakti.com/WEBSECTION/International/page585/sania-jodi-nishkraman
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాను ప్రకటించాలని రాష్ట్ర శాసనసభ కేంద్రాన్ని కోరింది. ప్రత్యేక హోదాతో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలన్నింటిని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందు తీర్మానంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విపక్ష నేత జగన్మోహన్రెడ్డి మధ్య మళ్లీ మాటల తూటలు పేలాయి. ఆ పార్టీల సభ్యులు కూడా అదే విధంగా స్పందించడంతో చర్చలో రభస చోటుచేసుకుంది. ఓటుకు నోటుతో పాటు, జగన్ అక్రమాస్తుల వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. వైసిపి సభ్యులు పోడియం వద్దకు దూసుకు వెళ్లి నినాదాలు చేశారు. టిడిపి సభ్యులు కూడా ఇదే విధంగా స్పందించడంతో సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు పలుమార్లు చోటు చేసుకుందని జగన్మోహన్రెడ్డి అనడంతో లక్షకోట్ల మింగిన రాబందు అంటూ టిడిపి సభ్యులు ఎదురుదాడికి దిగారు. టిఆర్ఎస్తో వైసిపి కుమ్మక్కైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సభ వాయిదా పడిన తరువాత విలేకరులతో మాట్లాడిన జగన్మోహన్రెడ్డి ప్రత్యేకహోదా ప్రకటించడానికి ఈ నెల 15వ తేది వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికీ ప్రకటన రాకపోతే 15వ తేది నుండి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తానని ప్రకటించారు. 'ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేయాలి. ఫిబ్రవరి 20, 2014న అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధి కోసం పన్ను రాయితీలు, నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, ఆర్థికలోటు భర్తీకి నిధుల విడుదల, 13వ షెడ్యూల్లోని విద్యాసంస్థల స్థాపన, ఇతర మౌలిక వసతుల కల్పన, చట్టంలోని సెక్షన్ 8 అమలు, పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణం సహా, అన్ని హామీలను అమలు చేయడం ద్వారా పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రానికి సహాయం అందించాలి. '
రాష్ట్ర శాసన సభ ఆంధ్రప్రదేశ్ కి ప్రతేక్య హోదా ఇవ్వాలి అని, కేంద్రాన్ని కోరింది. అంతకుముందు జరిగిన తీర్మానములో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరియు విపక్ష నేత జగన్మోహన్రెడ్డి మధ్య ఓటుకు నోటు, జగన్ అక్రమాస్తుల వ్యవహారం గురించి, ఒకరితో ఒకరు మాటామాటా అనుకున్నారు, జగన్మోహన్రెడ్డి ప్రత్యేకహోదా 15 వ తేదీలోగా ప్రకటించకపోతే గుంటూరులో నిరాహార దీక్ష చేస్తాం అన్నారు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అన్ని అంశాలు, ప్రధాన మంత్రి రాజ్యసభ లో ఇచ్చిన హామీలు అన్ని చెయ్యాలి అని, పోలవరం ప్రాజెక్ట్ పనులను కూడా పూర్తి చెయ్యాలి అని కోరారు.
78,782
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-872746-.html
రూటు మార్చిన లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి. . అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ్యారు. ఆ తర్వాత. . ఆమె పలు సినిమాల్లో నటించిన భలే భలే మగాడివోయ్. . మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనకు మంచి పేరోచ్చింది. ఈ సినిమా లో తన క్యూట్ నెస్ తో మెప్పించింది లావణ్య. లావణ్య అందానికి కుర్రకారు ఫిదా అయ్యారనడం లో అతిశయోక్తి లేదు. అయితే ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఈ వయ్యారికి ఆఫర్లు మాత్రం తగ్గలేదు. అయితే నాని నటించిన 'భలే భలే మగాడివోయ్' సినిమాతో హిట్ అందుకున్నా పెద్ద హీరోల సరసన అమ్మడికి ఛాన్స్ రాలేదు. మరో వైపు కొత్త భామలు టాలీవుడ్ కు పరిచయం అవుతున్న నేపథ్యంలో అమ్మడు తన అందానికి సాన పెట్టే పనిలోపడింది. ఇప్పటివరకు అమ్మడు అంతగా స్కిన్ షో చెయ్యలేదు. గ్లామర్ షోకు అమ్మడు పెద్దగా అంగీకరించలేదు. లావణ్యకు ఆఫర్లు తగ్గడానికి ఇదికూడా ఒక కారణమనే వార్తలు వచ్చాయి. దాంతో ఇక పై అందాల ఆరబోతకు హద్దులు చెరపాలని నిర్ణయించుకుందట. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది. ఇవి చూసైనా స్టార్ హీరోలు అమ్మడికి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.
'అందాల రాక్షసి' సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఈమెకు ఆఫర్లు తగ్గనప్పటికీ పెద్ద హీరోల సరసన మాత్రం ఛాన్స్ దొరకడంలేదు. దీనితో ట్రాక్ మార్చి ఫిట్నెస్ పై దృషి సారిస్తూ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. జనాల్లో క్రేజ్ కోసం నెట్టింట్లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది.
80,008
https://www.vaartha.com/%e0%b0%86%e0%b0%97%e2%80%8c%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e2%80%8c%e0%b0%95%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9/
సినిమా కోసం దిగజారను
సినిమా ఆఫర్ల కోసం దిగజారనని, తాను అలాంటి దానిని కాదని అందాల తార ఇలియానా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆమె ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిందనే విషయంపై ప్రస్తుతం చర్చకు దారి తీసింది. టాలీవుడ్లో అగ్రతార వెలుగొందిన ఆమె ప్రస్తుతం వేషాలు లేక తెలుగు పరిశ్రమకు దూరమైంది. టాలీవుడ్కు దూరమైన ఇలియానా బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నది. గత కొద్దికాలంగా హాట్ హాట్గా ఫొటో షూట్లకే పరిమితమైంది. సినీ ఆఫర్ల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు నాది కాదు. అవకాశాల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతారు. ఛాన్సులు ఇవ్వమని ఎవరినీ ప్రాధేయపడను. అందుకే అవకాశాళు తగ్గాయి తప్ప మరో కారణం కాదు అని ఇలియానా ఇటీవల ఓ మీడియాతో చెప్పినట్టు సమాచారం. అవకాశాలు లేకపోయినా సరే కానీ ఏ పాత్ర పడితే అది చేయను. డబ్బుల కోసం నాసిరకం పాత్రలు ధరించను. అలా చేయడం ద్వారా తనకు ఉన్న ప్రతిష్ఠ దెబ్బ తింటుంది అని ఇలియానా పేర్కొన్నట్టు తెలిసింది. సినిమా అవకాశాలు లేక , దేవదాసు లాంటి భారీ హిట్తో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన ఇలియానా ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోల పక్కన నటించింది. భారీ హిట్లను సొంతం చేసుకొన్నది ఇలియానా. పరిశ్రమలో తనకన్నా వయస్సులో పెద్ద హీరోయిన్లు కూడా రాణిస్తుంటే ఇలియానా మాత్రం ఈ మధ్య కాలంలో ఒక్క సినిమా చేసిన దాఖలాలు లేవు.
దేవదాస్ వంటి భారి హిట్ తో తెలుగు తెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా తనకు ప్రస్తుత౦ టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడానికి కారణం తను ఎవరిదగ్గర దిగాజారకపోవడమే అని చేసిన వ్యాక్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అందో అనేది చర్చనీయంశ౦గ మారింది. కొందరు అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతారు,ఆఫర్ల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు నాది కాదు అంటుంది. బూలీవుడ్ లో ఫొటో షూట్లకే పరిమితమైన ఇలియానా బిటౌన్ అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.
35,491
https://www.prajasakti.com/WEBSECTION/National/page417/otre-jabita-savaranku-pratyek-prachar-karyakram
కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో పింఛన్లు స్వాహా చేస్తున్న వైనం వెలుగుచూసింది. 35 డివిజన్లలో సుమారు రూ. 25 లక్షల వరకూ దారిమళ్లినట్లు తెలిసింది. జూన్, జులై, ఆగస్టు నెలల పింఛన్లను జన్మభూమి కమిటీ సభ్యులు సిబ్బందితో కుమ్మక్కై కైంకర్యం చేసినట్టు బాధితులు కలెక్టర్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. మృతి చెందిన వారి పేరుతో కొంతమందిని తీసుకొచ్చి, వారితో వేలిముద్రలు, సంతకాలు పెట్టించి ఆ సొమ్మును తీసుకున్నట్లు సమాచారం. విదేశాల్లో ఉన్న వితంతువు పేరున పన్నెండేళ్ళ బాలిక ఫొటో పెట్టి పింఛను తీసుకున్నట్టు బయటపడింది. 30వ వార్డులో రెండు, మూడు నెలల పింఛన్ల మొత్తం సుమారు రూ. 66 వేలు దిగమింగేసినట్లు తెలుస్తోంది. కాకినాడ రంగయ్యనాయుడు వీధికి చెందిన గ్రంధి రామారావు 2015 మే 15న చనిపోయారు. ఈయన పేరున జూన్, జులైల్లో పింఛను తీసుకున్నారు. 80 ఏళ్ల వృద్ధురాలు జి. చంద్రభాను పేరున రూ. 3 వేల పింఛను తీసుకున్నారు. ఈమె కూడా చనిపోయినట్లు మున్సిపాల్టీ అధికారులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. రాయుడు సత్తిబాబు 2015 మార్చి 26న చనిపోగా ఆయన పేరున రూ. 2 వేల పింఛను తీసుకున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు.
కాకినాడ నగర పరిధిలో అక్రమంగా ప్రభుత్వమూ ఇచ్చే పింఛన్లను పలువురు జన్మభూమి కార్యకర్తలు స్వాహా చేస్తున్నట్లు భాదితులు వెల్లడించారు, ఇప్పటివరకు 35 డివిజన్ లో సుమారు రూ. 25 లక్షల వరకు దోచుకున్నట్లు సమాచారం, కొంతమంది మరణించిన వారి పింఛన్, మరికొంతమంది వికలాంగ మరియు వేదేశాలుకు తరలిపోయిన వారి పింఛన్ దోచుకుంటున్నారు అని పలువురు భాదితులు వాపోతున్నారు.
84,879
https://www.prabhanews.com/2019/05/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%ae%e0%b0%b9%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82-%e0%b0%92%e0%b0%95%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%81/
వైయస్ జగన్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు.
జగన్ ఒంటరిగా పోరుకు వెళ్లి విజయం సాధించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ఎన్టీఆర్కు వచ్చిన మెజార్టీ జగన్కు కూడా వచ్చిందన్నారు. ఎన్టీఆర్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే జగన్ ఒంటరిగా వెళ్లారన్నారు. ఢిల్ల ో జరిగిన ప్రెస్మీట్లో జగన్ మాట్లాడిన తీరు చూస్తే వైఎస్ఆర్ను గుర్తు చేశారన్నారు. జగన్ పరిపక్వతతోనే మాట్లాడారన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తానని జగన్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. అవినీతి రహిత పాలన జరగాలంటే ముందు మీ ఎమ్మెల్యేలను ఒప్పించండని పేర్కొన్నారు. ప్రజలను కూడా లంచం ఇవ్వకుండా ఆపడానికి ప్రయత్నించాలన్నారు. ప్రజలే ఓటుకు రూ. వెయ్యి ఇస్తారా? రూ. 2వేలు ఇస్తారా అని అడుగుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎలక్షన్ నాటికి డబ్బులు పంచినవాడు ఓడిపోతాడు అనేలా చేయాలన్నారు. డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎవరూ రాజకీయాల్లోకి రారన్నారు. ముందు రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టాలన్నారు. చంద్రబాబు ఓడిపోవడానికి 25 శాతం ఇసుక మాఫియానే కారణమన్నారు.
సీఎం పదవి లోకి వచ్చిన జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కు వచ్చిన ఎంత మెజారిటీ ఇప్పుడు జగన్ కి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో చేయవలసిన మార్పుల గురించి కొన్ని సూచనలు ఇచ్చారు. ఇసుక మాఫియా పూర్తిగా తొలగించాలని కోరారు.
4,563
https://www.prajasakti.com/WEBSECTION/International/page905/nasiklo-kulin-sukhoru30-yuddhvimana
టీఆర్ ఎస్ ఎన్నికల హామీలు అమలు
రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా అభివృద్ధి, సంక్షేమ చేపట్టడం లేదన్నట్టు సీపీఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడటం శోచనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని చెప్పడం దారుణమన్నారు. తమ్మినేనికి దమ్మూ ధైర్యం ఉంటే టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని అమలు చేయలేదో చెప్పడానికి బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. తమ్మినేని చేస్తున్న విమర్శల్లో ఏ మాత్రం వాస్తవాలున్నా ఆయన తమ సవాల్ను స్వీకరించి చర్చకు రావాలన్నారు. సమయం, వేదిక, తేదీ చెబితే తాము వస్తామన్నారు. ఒక నిర్ధిష్టమైన అంశంపై కాకుండా లేని గాలినంత పోగేసి పాదయాత్ర చేస్తున్నానంటేే ప్రజలు స్వాగతించరని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఎన్నికల్లో చెప్పిన విధంగా గత పాలకుల హయాంలో ఇచ్చిన పింఛన్లను రూ. 200 నుంచి రూ. 1000 కి రూ. 500 ఉన్న వాటిని రూ. 1500 కు పెంచి వృద్ధులు, వితంతు, మహిళలు, వికలాంగులకు అందజేస్తున్న చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. తమ్మినేని సొంత ప్రాంతమైన పాలేరు నియోజకవర్గంలో 70 ఏండ్లుగా కరువు తాండవిస్తుంటే ఏం చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తరతరాలుగా నిరాదరణకు గురైన పాలేరు నియోజకవర్గానికి భక్త రామదాసు ప్రాజెక్టును మంజూరు చేసి శరవేగంతో పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకున్న టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా ? అని ప్రశ్నించారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ చివరకు అగ్రవర్ణాలలోని పేదలకు కూడా షాదీముబారక్, కల్యాణలక్ష్మి, పథకాలను అమలు చేస్తున్నామని చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని సీపీఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనడాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఖండించారు. ఈ విశ్యమయి తమ్మినేని చర్చకి రావాలని సవాల్ విసిరారు. పింఛన్లను పెంచి వృద్ధులు, వితంతు, మహిళలు, వికలాంగులకు అందజేస్తున్న చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ప్రాజెక్టులు,షాదీముబారక్, కల్యాణలక్ష్మి, పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ది అన్నారు.
33,420
https://www.prajasakti.com/WEBSECTION/International/page354/america-paryatkulku-china-red-alert
తెలంగాణలో వివిధ జిల్లాల్లో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలో కుసుమంచి మండలం జక్కుపల్లి లో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో సిపిఎం, టిఆఎస్ ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. సి పి ఎం అభ్యర్థిపై 227 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ గెలుపొందింది. భద్రాద్రి జిల్లా భద్రాచలం 7వ ఎంపిటిసి కి జరిగిన ఉపఎన్నికల్లో కూడా టిఆఎస్ గెలుపొందింది. తెరాస అభ్యర్థికి 420 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 1,154 ఓట్లు, 734 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ విజయం సాధించాడు. వీపనగండ్ల మండలం గోపాలదిన్నెలో 491 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి లక్ష్మి దేవమ్మా గెలుపొందింది. నోటాకు 66 ఓట్లు పడ్డాయి మక్తల్ మండలం లింగంపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్థి లింగమ్మ ప్రత్యర్థి అభ్యర్థులపై 451 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. లింగమ్మ 747 ఓట్లు ఇండిపెండెంట్ రాము 296 ఓట్లు. ఇండిపెండెంట్ లక్ష్మన్ 39 ఓట్లు. నోటా కు 29 ఓట్లు. జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో టిఆర్ ఎస్ విజయభేరీ మోగించింది. నిడమనూర్ మండలం ఎర్రబెల్లి ఎంపిటిసి ఉపఎన్నికల్లో 568 ఓట్ల మెజారిటీతో టిఆర్ ఎస్ విజయం. మునుగోడు మండలం కిష్టపురం ఎంపిటిసి ఉపఎన్నికల్లో 508 ఓట్లతో టిఆర్ ఎ స్ గెలుపు. నర్వ మండలం కన్మనూర్ ఎంపిటిసి ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు ఆ పార్టీ అభ్యర్థి 382 ఓట్ల మెజార్టీతో విజయం మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంపిటిసి ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ క్లీన్స్వీప్ వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నె, మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం కన్మనూర్, మక్తల్ మండలం లింగంపల్లి ఎంపిటిసిల ఉపఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు. కౌటల మండల ఎంపిటిసి ఉపఎన్నికల్లో టిఆరేఎస్ పసునూరి స్వప్న 450 ఓట్ల మెజారిటీతో గెలుపు
తెలంగాణలో వివిధ జిల్లాల్లో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలో,భద్రాద్రి జిల్లా భద్రాచలంలో, వీపనగండ్ల మండలం గోపాలదిన్నెలో,మక్తల్ మండలం లింగంపల్లిలో,నిడమనూర్ మండలం ఎర్రబెల్లిలో,మునుగోడు మండలం కిష్టపురంలో,నర్వ మండలం కన్మనూర్ లో,మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో, మక్తల్ మండలం లింగంపల్లి,కౌటల మండలలో ఇలా పలు నియోజకవర్గలలో టిఆర్ ఎస్ విజయభేరీ మోగించింది.
33,692
https://www.prajasakti.com/WEBSECTION/International/page201/dakshin-koreaku-cherukunn-uttar-korea-adhikarulu
హైదరాబాద్లోని గీతం విశ్వవిద్యాలయం విద్యార్థులు రికార్డు స్థాయిలో ప్లేస్మెంట్లు సాధించారు. ఈ మేరకు ప్లేస్మెంట్ల డైరెక్టర్ నాతి వేణుకుమార్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2016-17 విద్యాసంవత్సరం అక్టోబర్ నాటికి బహుళజాతి కంపెనీలైన ఊనిక్ రూ. 12 లక్షలు, వీఎం వేర్ రూ. 9.52 లక్షల గరిష్ట వార్షిక వేతనాలతో గీతం విద్యార్థులను ఎంపిక చేశాయని తెలిపారు. వెరైజోన్ రూ. 5.20 లక్షలు, టెక్ యాస్పెక్ట్ రూ. 4.90 లక్షలు, రాక్వెల్ కొలిన్స్ రూ. 4.40 లక్షలు, పోర్ట్వేర్ రూ. 4 లక్షలు ఇలా పలు సంస్థలు ఆకర్షణీయమైన వార్షిక వేతనాలను గీతం విద్యార్థులకు ఆఫర్ అందించాయని పేర్కొన్నారు. ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ రూ. 18 లక్షల వార్షిక వేతనం, హిటాచీ రూ. 4 లక్షలు వార్షిక వేతనం గీతంలో చేపట్టిన ప్రాంగణ నియామకాలు వెల్లడించాల్సి ఉందని పేర్కొన్నారు. శనివారం ఒకేరోజు 250 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో గీతం విశ్వవిద్యాలయం నుంచి 511 మంది విద్యార్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని గీతం విశ్వవిద్యాలయం విద్యార్థులు రికార్డు స్థాయిలో ప్లేస్మెంట్లు సాధించారు. శనివారం ఒకేరోజు 250 మంది,ఇప్పటి వరకు 511 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్లేస్మెంట్ల డైరెక్టర్ నాతి వేణుకుమార్ హర్షం వ్యక్తం చేసారు.
3,700
https://www.prajasakti.com/WEBSECTION/National/page235/nedu-gujaratku-modi-benjamin
కెసిఆర్ పనితీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి విమర్శలు
ముఖ్యమంత్రి కేసీఆర్కు అహంభావం పెరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఎం ఎప్పటికైనా ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదని హెచ్చరించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానన్న హామీని విస్మరించారన్నారు. మళ్లీ మాయ మాటలతో మభ్యపెడుతున్నారు. మాటలతో కోటలు కడుతున్నారని చెప్పారు. బూర్జువా పార్టీలకు ప్రజలే బాహుబలి అని వ్యాఖ్యానించారు. రాజధానిలో ప్రజల గొంతు నొక్కుతున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పునరేకీకరణ జరగాలన్నారు. 2019 నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుతామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27 న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు వివరించారు. కమ్యూనిస్టులను ఉద్దేశించి అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సిద్ధాంతాలపై కేసీఆర్ పాఠాలు కమ్యూనిస్టులకు అవసరం లేదన్నారు. తమతో కలిసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు అహంభావం పెరిగిందని,పేద ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యవాదులంతా ఏకమయ్యి రాజకీయ పునరేకీకరణ జరిపి,2019 నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా తయారవలని పిలుపునిచ్చారు.
4,148
https://www.prajasakti.com/WEBSECTION/National/page690/olimpic-vijethal-tayare-laksya
అంగ న్ వాడీ కార్య క ర్త ల కు వేతనాలు
ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ అభిప్రాయాలను, సమస్యలను సీఎంకు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అంగన్వాడీల వేతనాన్ని రూ. 10,500 లకు తెలంగాణ సీఎం కేసీఆర్ పెంచుతూ ఆదేశాలను జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలోని సహయకులకు రూ. 6 వేలకు పెంచారు. అర్హత ఉన్న అంగన్వాడీలకు సూపర్వైజర్లుగా ప్రమోషన్లు ఇవ్వనున్నారు. వచ్చే సంవత్సరం మరింత జీతం పెంచుతాము అని సీఎం కేసీఆర్ ముఖాముఖి కార్యక్రమంలో వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలు తిన్నంత అన్నం పెట్టాలన్నారు. ఈ నేపధ్యంలో ప్రైవేట్ డాక్టర్లు రాక్షసులకన్నా హీనంగా తయారైయ్యారు, అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తున్నారు అని అన్నారు. ఈ మేరక గర్బీణీలకు ప్రభుత్వాస్పత్రిలోనే డెలివెరీ చేయిస్తే మంచిదన్నారు. పిల్లలకు ఇమ్యునైజేషన్ కోసం రూ. 13 వేలు ఇస్తాం అన్నారు. ఈ డబ్బును మూడు విడతల్లో ఇవ్వాని అనుకుంటున్నాం అని తెల్పారు. రాష్ట్రంలో పిల్లల మరణాలు తగ్గాలన్నారు.
అంగన్వాడీ కార్యకర్తలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ అంగన్వాడీల సహయకులకు రూ. 6 వేలకు జీతం,సూపర్వైజర్లుగా ప్రమోషన్లు కలిపిస్తారని తెలిపారు. శిశు మరణాలు తగ్గాలని, గర్భిణీలకు కాన్పులను ప్రభుత్వ ఆసుపత్రిలలో చేయించాలని కోరారు.
31,216
https://www.prajasakti.com/WEBSECTION/International/page403/hijral-hakkul-bill-satvar-aamodaniki-demand
ఇసుక అక్రమ రవాణా
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల ఘటనలో ఎనిమిది మంది నిందితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేయటం వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రిమాండ్ నిందితులను బుధవారం పరామర్శించారు. వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి బయట విలేకర్లతో ఆయన మాట్లాడుతూ మనిషి క్రూరంగా మారి పైశాచికంగా వ్యవహరిస్తాడనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ఇసుక అక్రమ రవాణాలో వాహనాల ప్రమాదాల బారిన 48 మంది మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ అసభ్యంగా దూషిస్తూ, స్వయంగా లాఠీలతో చిత్రహింసలు గురిచేశారని, ఆయనతో పాటు ఇందులో పాల్గొన్న పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగి 15 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. మాజీ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలోనూ దళితులహత్య, దాడుల వివరాలు గుర్తు చేశారు. వారి వెంట టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఆరెపల్లి మోహన్, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి చలి మెడ లక్ష్మి నరసింహరావు, సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ఉన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిని చిత్రహింసలకు గురి చేసిన సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ కంపాటిని సస్పెండ్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల కాంతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల అతిథిగృహంలో మాట్లాడారు. లారీల దహనం ఘటనలో సంబంధంలేని వారిని చిత్రహింసలకు గురిచేశారన్నారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల ఘటనలో ఎనిమిది మంది నిందితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క ఆరోపించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా వాహనాల ప్రమాదాల బారి న పడి 48 మంది మృతి చెందారని, ఎస్పి అసభ్యంగా దూషిస్తూ స్వయంగా లాఠీలతో చిత్రహింసలకు గురిచేశారని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
32,191
https://www.prajasakti.com/WEBSECTION/National/page988/harshan
ఎన్నో వేల మైళ్ల నుంచి అలసి సొలసి వచ్చే అతిథి విహంగానికి భంగపాటు ఎదురవుతోంది. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని టూరిజం హబ్గా చేస్తామని, ప్రపంచ దేశాలను ఆకర్షిస్తామని తరచూ చెప్పే ప్రభుత్వాలు సహజ సిద్ధ వలస పక్షుల రక్షిత కేంద్రాన్ని గాలికొదిలేశాయి. కనీస సౌకర్యాల లేమితో వలస పక్షులు తమ దిశను మార్చుకుంటున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పరిధిలోని ఉప్పలపాడులో పదెకరాల చెరువుకు దేశ విదేశాల నుంచి పక్షులు వలసొస్తాయి. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘని స్తాన్, బర్మా, భూటాన్, నేపాల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రష్యా, హిమాలయాలు వంటి అనేక ప్రాంతాల నుంచి 35 రకాల అరుదైన పక్షులు ప్రతి ఏటా ఇక్కడికొస్తాయి. నెల నుంచి రెండు నెలలపాటు ఇక్కడే ఉండి సంతానాన్ని వృద్ధి చేసుకుని తిరిగి వెళ్తుంటాయి. పెలికాన్, గూడబాతు కొంగ, తట కంకణం, కొల్లేటి కొంగ, నీటికాకి, ఎర్రముక్కు కొంగ, ఎర్ర కాళ్ల బాతు, పెయింటెడ్ స్టార్క్ జాతుల పక్షులు ఈ చెరువులకు వస్తాయి. రాష్ట్రంలో అనేక వలస పక్షుల కేంద్రాల్లో అత్యధిక పక్షులు వచ్చే ఏకైక విడిది కేంద్రం ఉప్పలపాడు ఒక్కటే కావడం విశేషం. రూ. 40 లక్షలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తలపోసినా చర్యలు చేపట్టలేదు. గతేడాది వలస పక్షుల కేంద్రంలో తగిన వసతులు లేకపో వడంతో దాదాపు సగానికిపైగా పక్షులు రాకుండా ఆగిపోయినట్లు అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ జ్ఞానప్రకాష్ చెప్పారు. పక్షుల రక్షిత కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన నిధులేమీ లేవని, ఈ కేంద్రాన్ని సంరక్షించుకునే బాధ్యత గ్రామస్తులకే అప్పగించామని తెలిపారు. 15 మంది సభ్యులతో ఎకో డెవలెప్మెంట్ కమిటీ ఏర్పాటు చేశామని, పర్యాటకుల నుంచి టిక్కెట్కు రుసుము వసూలు చేసి, అభివృద్ధి చేసుకుంటున్నారని చెప్పారు. పక్షుల రక్షిత కేంద్రంలో ప్రభుత్వం సమగ్రమైన అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో స్థానికులకు, పక్షు లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని డెవలెప్మెంట్ కమిటీ అధ్యక్షులు పత్తిపాటి నరసింహారావు అన్నారు. పక్షుల కేంద్ర అభివృద్ధికి రూ. 2.15 కోట్లతో అంచనాలు సిద్ధంగా ఉన్నా యని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఉప్పల పాడు రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కేంద్రానికి దాదాపు 30 ఎకరాల స్థలం ఇచ్చేందుకు ప్రజలు ముందుకొస్తారని, అయిఃతే మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని చెప్పారు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పరిధిలోని ఉప్పలపాడులో పదెకరాల చెరువుకు, భారతదేశ సరిహద్దు దేశాల నుంచి దాదాపు 35 రకాల అరుదైన పక్షులు ప్రతి ఏడాది వస్తుంటాయి కానీ ప్రభుత్వాలు ఈ సహజ సిద్ధ వలస పక్షుల రక్షిత కేంద్రాన్ని గాలికొదిలేశాయి. దీనివలన కనీస అవసరాల లేమితో వలస పక్షుల దిశను మార్చుకుంటున్నాయని అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ జ్ఞానప్రకాష్ వాపోయారు. దాదాపు 15 మంది సభ్యులతో ఎకో డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేశామని, పర్యాటకులు ఇచ్చే రుసుముతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కమిటీ అధ్యక్షులు తెలిపారు.
32,250
https://www.prajasakti.com/WEBSECTION/National/page135/parliament-aamoda-avashyam
లేపాక్షి ఉత్సవాలను ఫిబ్రవరి 27,28న నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు శనివారంనాడు రాష్ట్ర సమాచారం శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హిందూపురం నియోజక వర్గంలో లేపాక్షి ఉత్సవాలను నిర్వహించాలని గత కొంత కాలంగా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చొరవతో ఆ జిల్లా మంత్రులను కలుపుకుని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో బాలకృష్ణతోపాటు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లెరఘునాథరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చర్చించి కార్యక్రమం ఖరారు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచాలని తాను భావించి లేపాక్షి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెలుగు భాష, సాహిత్యం, లలిత కళలు, రాయలసీమ రుచులు, సంస్కృతి ప్రపంచానికి తెలియజేయాలని ఈ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. లేపాక్షితోపాటు జిల్లాలో చేనేతలు, ఇతర టూరిస్ట్ స్పాట్లను ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందన్నారు. లేపాక్షికి ప్రపంచ స్థాయి గుర్తింపు తేవాలని కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు పాల్గొంటారన్నారు. తమిళ, కన్నడ, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కళాకారులు కూడా పాల్గొంటారని బాలకృష్ణ తెలిపారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం విభాగాలు సాంస్కృతిక, పర్యాటక శాఖ, పంచాయితీరాజ్, ఆర్టీసి లాంటి సంస్థలు ఈ ఉత్సవాల కోసం సంయుక్తంగా 4 కోట్ల,19 లక్షల,15 వేలు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. 20 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేయనున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో లలిత కళలు, సాహిత్య, సాంస్కృతిక, సంగీత అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. లేపాక్షి ఉత్సవాలను పురస్కరించుకుని వాటికి ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామంటన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ, లేపాక్షి ఉత్సవాల్లో ధర్మవరం, ముదిరెడ్డిపల్లి చేనేతలను ప్రధర్శింప చేస్తామని, వాటికి దేశ విదేశాల్లో ప్రచారం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచడానికై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరియు జిల్లా మంత్రులు కలిసి చర్చలు జరిపిన తర్వాత ఫిబ్రవరి 27,28 తేదీలలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించాలని ఖరారు చేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాల్లో ధర్మవరం, ముదిరెడ్డిపల్లి చేనేతలను ప్రదర్శింప చేస్తామని, వాటికి దేశ విదేశాల్లో ప్రచారం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
32,512
https://www.prajasakti.com/WEBSECTION/International/page960/deepavali-cardulpai-bigepy-vijayal
ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి గంటా వెల్లడించారు. సచివాలయంలో మంత్రి శుక్రవారం మాట్లాడుతూ డిఎస్సీ నియామకాల మీద కోర్టులో ఉన్న కేసులు అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చాయని చెప్పారు. 8,806 ఉపాధ్యాయ పోస్టులకు సాధారణ పరిపాలన శాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి మొదటి వారంలోగా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామన్నారు. మిగిలిన పోస్టులకు కూడా త్వరలోనే ఒక స్పష్టత వస్తుందన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల విషయంలో కోర్టు తీర్పుకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని, కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోబోమని మంత్రి వెల్లడించారు. ఈ దఫా ఆసియన్ ఎడ్యుకేషన్ సమ్మిట్ను రాష్ట్ర్రంలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. యూకే పర్యటనలో తాను పాల్గొన్న ఎడ్యుకేషన్ వలర్డ్ ఫోరమ్-26 విశేషాలను వివరించారు. సరైన బోధన పద్ధతులకు మార్గదర్శకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించినట్టు తెలిపారు. విద్యారంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందన్నారు. భవిషత్తులో ప్రభుత్వ పాఠశాలలను స్వచ్ఛంద సేవా సంస్థ ( ఎన్జీవో ) లకు అప్పగించే అంశం పరిశీలనలో ఉందని మంత్రి గంటా శ్రీనివాస రావు వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తన యూకే పర్యటనలో ఎన్జీవో నడుపుతున్న ఆల్సెయింట్స్ అకాడమీని సందర్శించానన్నారు. ప్రభుత్వ పాఠశాలల అయిన ఆల్సెయింట్స్ అకాడమీని ఒక ఎన్జీవో తీసుకొని చాలా అభివృద్ధి చేసిందని మంత్రి తెలిపారు. ఆ తరహాలోనే రాష్ట్రంలో పైలెట్ ప్రాతిపదికన కొన్ని పాఠశాలలు ఎంపిక చేసి, అభివృద్ధి చేసే అంశం మీద సిఎంతో చర్చిస్తామన్నారు.
రాష్ట్రంలో 8, 806 ఉపాధ్యాయ పోస్టులకు సాధారణ పరిపాలన శాఖ అనుమతి ఇవ్వడంతో ఫిబ్రవరి మొదటి వారంలో డి. ఎస్. సి నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి గంటా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూకేలో ఎడ్యుకేషన్ వరల్డ్ ఫోరం - 26 మేరకు భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు అప్పగించే అంశం పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.
55,890
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-49346-2-000.html
హస్తిన రాజధానిలో ధర్మ పోరాట దీక్ష
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టం హామీలు అమలు చేయడంలోను ప్రత్యేక హోదా కల్పించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విఫలమైన నేపధ్యంలో ఏపి ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో ప్రజాపక్షాన ఢీ కొనడానికి సోమవారం హస్తిన రాజధాని ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు అధికారికంగా సర్వం సిద్దం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఇప్పటికే వేలాది మంది టిడిపి శ్రేణులు ఢిల్లీకి తరలివెళ్ళడం రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,పార్టీలో కీలక పదవులున్న నేతలంతా ఢిల్లీకి చేరుకోవడం ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచే ఆదివారం రాత్రికి చేరుకున్న వారందరికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ దీక్ష ఢిల్లీ ఏపి భవన్లో చేపడుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజాప్రతినిధులకు అధికారులకు పార్టీ కార్యకర్తలకు, ఎపి భవన్లోని 800 గదులను సిద్ధంచేశారు. ఢిల్లీలో జరిగే ధర్మపోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక రైల్లో వస్తున్న వారి కోసం దాదాపు 50బస్సులను సంబంధిత రైల్వే స్టేషన్లు నుంచి ఏర్పాటు చేశారు. అలాగే ఎయిర్పోర్టు నుంచి కూడా కడప, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, గన్నవరం తదితర ప్రాంతాల నుంచి దీక్షకు తరలివస్తున్న నాయకుల కోసం ఏపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్కుమార్ భారీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రికే వేలాది మంది ఏపి నుంచి తరలివచ్చిన ప్రజలకు, పార్టీనాయకులకు ఏపిభవన్తో పాటు దీక్షా ప్రాంగణానికి అందుబాటులో ఉంటున్న ప్రైవేటు లాడ్జిలను ఢిల్లీలో నివాసం ఉంటున్న తెలుగువాళ్ళ కార్యాలయాలను ఏర్పాటుచేశారు. ఏపి భవన్ ప్రాంగణంలో భారీ శిబిరాలను కూడా ఏర్పాటుచేసి వారికి తాత్కాలికంగా అన్ని వసతులు కల్పించనున్నారు. అలాగే టిడిపి పార్లమెంట్,రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో బిజేపేతర పార్టీలకు చెందిన కార్యాలయాలను వారి సమావేశ భవనాలను ఆందోళనకు వచ్చే వారికోసం ఏర్పాటుచేశారు. అటు కేంద్రంలోను,ఇటు రాష్ట్రంలోను 2014 ఎంపికైన పార్లమెంట్ అసెంబ్లీలు మరో నెలరోజులు రద్దవుతున్న తరుణంలో తిరిగి అధికారం దక్కించుకునే దిశగా ప్రత్యేక పార్టీలను బలహీన పరచడానికి ప్రత్యేకించి ఏపిలో విభజన చట్టం హామీలు ప్రత్యేక హోదా కల్పించడం పైనే ఆందోళన మొదలుకావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే మంచి తరుణంగా భావించి కేంద్రంపై ధర్మ పోరాటం చేయడానికి ఢిల్లీ వేదికగా తీసుకొని బిజేపి ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ధర్మపోరాటం పేరుతో కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన సభలు, సమావేశాలు, దీక్షలు విజయవంత మయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో బాబు తన రాజకీయ చాణిక్యత చతురతతో సోమవారం ఢిల్లీలో చేపడుతున్న ధర్మపోరాట దీక్షను పూర్తిస్థాయిలో విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ ఈ నేపధ్యంలో సోమవారం బాబు ఏపిభవన్లో ఉదయం 8నుంచి రాత్రి 8గంటల వరకు చేపట్టే దీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపిలో అడుగుపెట్టి గుంటూరు ప్రజావేదిక సభలో ప్రసంగంపై బాబు కౌంటర్లరూపంలో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలపై దుమ్మెత్తిపోసినట్లు తెలుస్తోంది. ఇటీవల బాబు ఆసెంబ్లీ సమావేశాల్లో ఓటాన్ బడ్జెట్ ఎకౌంట్లో ప్రవేశపెట్టిన అన్ని వర్గాలను ఆకట్టుకునే బడ్జెట్తో ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి గాని,అటు ఏపి ప్రధాన ప్రతిపక్షనేత వైసీపీనేతలకు మింగుడుపడడం లేదు. అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రముఖ నేత కె. ఎ. పాల్,జగన్,ఏ మతస్తులో తెలుసుకోవాలని సవాలు విసరడంతో ఏపిలో వైఎస్సార్సీ నేతలు సమాలోచనలో పడ్డారు. అయితే ధర్మపోరాట దీక్షకు ఏపి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రతిపక్షాలు ఖంగుతింటున్నాయి.
ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టం హామీలు అమలు చేయడంలోను ప్రత్యేక హోదా కల్పించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విఫలమైన నేపధ్యంలో ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్న ధర్మ పోరాట దీక్షకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పోరాట దీక్షలో పాల్గొనేందుకు వస్తున్న ప్రజలు, ప్రజాప్రతినిధుల కోసం ఎపి భవన్లోని 800 గదులు, ప్రైవేటు లాడ్జిలను, వివిధ కార్యాలయాలను బస చేసేందుకు ఏపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్కుమార్ భారీ ఏర్పాట్లు చేశారు. రైల్లో వస్తున్న వారి కోసం దాదాపు 50 బస్సులను సంబంధిత రైల్వే స్టేషన్ల నుంచి ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుంటూరు సభలో ప్రసంగించిన అంశాలపై బాబు కౌంటర్ల రూపంలో బదులిస్తూ, అవలంబిస్తున్న విధి విధానాలపై దుమ్మెత్తిపోసినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో బాబు తన రాజకీయ చాణిక్యత చతురతతో సోమవారం ఢిల్లీలో చేపడుతున్న ధర్మపోరాట దీక్షతో ప్రతిపక్షాలు ఖంగుతిన్నాయి.
83,856
https://www.prabhanews.com/2020/09/bjp-national-executive-two/
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో ఏపీ నుంచి ఇద్దరికి చోటు లభించింది. ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీమంత్రి, జాతీయ మహిళా మోర్చా పర్యవేక్షకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కార్యదర్శిగా వై. సత్యకుమార్ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బీజేపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వీరి పేర్లను ప్రకటించారు. గత ఏడు నెలలుగా ఎదురు చూస్తున్న జాతీయ కార్యవర్గాన్ని జేపీ నడ్డా ఎట్టకేలకు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులను నియమించగా వీరిలో దగ్గుబాటి పురంధేశ్వరికి చోటు దక్కింది. 13 మందితో ఏర్పాటు చేసిన కార్యదర్శుల జాబితాలో అవకాశం దక్కించుకున్న సత్యకు మార్ అమిత్ షా కార్యవర్గంలో సైతం ఇదే బాధ్యతలు నిర్వ హించారు. రాష్ట్రం నుంచి జాతీయ బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న పురంధేశ్వరి పార్టీ కార్యక్రమాల్లో చురుకైన భూమిక నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఎన్డీఏ-1, నరేంద్ర మోడీ పథకాలను పార్టీ నేతలతో కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేషంగా శ్రమించారు. ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపిక, పార్టీ కార్యక్రమాల రూపకల్పన, ప్రచారం సహా అన్ని అంశాల్లో రాష్ట్ర నేతలతో కలిసి ఆమె విస్తృతంగా నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కార్యకర్తలను సమాయత్తం చేశారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన సత్యకుమార్ పార్టీ కార్య క్రమాల నిర్వహణలో దిట్టగా చెపుతారు. ఓ వైపు పార్టీ కార్య క్రమాలు నిర్వహిస్తూనే మరో వైపు సేవా కార్యక్రమాలు నిర్వ హించడం ద్వారా నిత్యం ప్రజలతో మమేకం అవుతుంటారు. పార్టీ పట్ల అత్యంత విధేయత చూపించే సత్యకుమార్కు మరోసారి జాతీయ కార్యవర్గంలో చోటు లభించింది. ఏపీ నుంచి జాతీయ కమిటీలో చోటు దక్కించుకున్న వీరికి పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
ఇటివలే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ స్థాయిలో ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఏపీ నుంచి ఇద్దరు నియమితులయ్యారు. జాతీయ మహిళా మోర్చా పర్యవేక్షకురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి, కార్యదర్శిగా వై. సత్యకుమార్ను నియమించారు. గత ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్రను పోషించినందుకు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించినందుకు పురంధేశ్వరి నియమించినట్లు సమాచారం.
25,422
https://www.prajasakti.com/WEBSECTION/National/page948/wallu-natuly-untarani-ashistunna-kamal
హమాలీల కూలి రేట్లను 15 శాతం పెంపు.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, బేవరేజస్ కార్పొరేషన్ పరిధిలోని గోదాములలో పని చేసే హమాలీల కూలి రేట్లను 15 శాతం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ హమాలీ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కె ఉమామహేశ్వరరావు ( సిఐటియు ) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల తొమ్మిదో తేదీన హైదరాబాద్లో ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్కుమార్ మీనా సమక్షంలో ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కూలి రేటు ఒక బాక్సుకు రూ. 4 నుంచి రూ. 4.60కి, కర్నూలు డిపోలు రూ. 4.50 నుంచి రూ. 4.85కు పెంచినట్లు తెలిపారు. విదేశీ మద్యానికి దిగుబడి కూలి రూ. 5, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరుకుకు రూ. 5.60గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పెంచిన కూలి రేట్లు ఈ నెల ఆరో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కూలి రేట్లు పెంచేందుకు యాజమాన్యాలు అంగీకరించటంపై జెఎసి తరపున ఆయన హర్షం వ్యక్తం చేశారు. 2014 ఫిబ్రవరిలో హమాలీలతో కుదిరిన ఒప్పందం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిందన్నారు. మూడు నెలలుగా ప్రభుత్వానికి యాజమాన్యాలకు పలుమార్లు కార్మిక సంఘాలు రాయబారం నిర్వహించటంతో పాటు, జెఎసి అధికారులతో జరిపిన చర్చలతో కూలి రేట్లు పెరిగాయన్నారు. ఇదిలావుండగా, హమాలీలకు పిఎఫ్, ఇఎస్, ప్రమాద బీమా, వైద్యం, యూనిఫారం, పిల్లల చదువులకు ప్రోత్సాహం తదితర సంక్షేమ పథకాల అమలుకు కమిషనర్ పర్యవేక్షణలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
2014 ఫిబ్రవరిలో హమాలీలతో కుదిరిన ఒప్పందం ఈ ఏడాది మార్చ్ 31 తో ముగియనుంది. ఈ నెల 9న హైదరాబాద్ లో ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్కుమార్ మీనా కూలి రేట్లను 15 శాతం పెంచుతూ ఒప్పందం కుదిర్చినట్లు ,దీనికి ప్రభుత్వవం అంగీకరించినట్లు సిఐటియు నాయకులు తెలిపారు.
31,474
https://www.prajasakti.com/WEBSECTION/International/page256/nyayanni-hethan-cheyadame
లండన్ లో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు
తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్లో బోనాల పండుగను వైభవంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుంచి సుమారు 700 మందికిపైగా తెలంగాణ కుటుంబాలు హాజరయ్యాయి. స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా లండన్ వీధుల్లో తోట్టెలను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలే కాకుండా స్తానికులు సైతం పాల్గొన్నారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి రామచంద్రు తేజావత్ ( రిటైర్డ్ఐఏఎస్ ) స్థానిక ఎంపీలు వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, బాలాజీ ముఖ్య అతిధులుగా హాజరై ప్రసంగించారు. వరుసగా ఆరో సంవత్సరం వైభవంగా బోనాల జాతర నిర్వహించారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ఈ సంవత్సరము ప్రధానంగా చేపట్టిన 'చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతునిద్దాం' అని 'చేనేత వస్త్రాలయం' ద్వారా ప్రవాసులకు, స్థానికులకు చేనేత వస్త్రాలను పరిచయం చేసిన విధానం ప్రశంసనీయమని ముఖ్య అతిధులు చెప్పారు. రామచంద్రుడు తేజావత్ మాట్లాడుతూ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఎన్నారైలు తెలంగాణ అభివద్ధిలో కూడా బాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో భారతీయులు ఐక్యతను చాటాలని పిలుపు నిచ్చారు. తెలుగు సినిమా నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నారై ఫోరం చేపట్టిన ఎన్నారై విత్ వీవెర్స్, చేనేత చేయూతకు తన సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగంతో కలిసి హ్యాండ్లూమ్ వాక్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు బోనాలు పండుగ వేడుకలలో తాను కూడా భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని నటి పూనమ్ కౌర్ పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరం సంస్థ విద్య, సంగీతం, కళలు, సాంస్కతిక, క్రీడలు, వ్యాపారం, స్వచ్చంధ, సమాజసేవ వంటిపనులు చేస్తుందని, ఆయా రంగాలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు, యువతీ యువకులకు ఆచార్య శ్రీ జయశంకర్ పురస్కారాలు అందచేశారు. బోనాల పండుగకు యూకే తెలుగు, తెలంగాణ సంఘాలు, యుక్త, తాల్, టీడీఫ్ తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. తెలంగాణా ఎన్నారై ఫోరం వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, ముఖ్య సలహాదారులు అంతటి ప్రమోద్, అధ్యక్షులు సీకా చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని, తిరుపతి గోలి, ముఖ్య కార్యదర్శిలు నగేష్ రెడ్డి కాసర, సుధాకర్ గౌడ్ రంగుల, ఉమ్మడి కార్యదర్శిలు భాస్కర్పిట్ల, సురేష్ గోపతి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్లో బోనాల పండుగ వైభవంగా, ఘనంగా నిర్వహించారు. స్వదేశంలో జరుగుతున్న సాంప్రదాయ బద్ధంగా లండన్ వీధుల్లో ఊరేగింపులు జరుపుతుండగా, ఈ వేడుకను చూడడానికి యూకె నండి 700 మందికి పైగా తెలంగాణ కుటుంబాలు హాజరయ్యాయి. తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ఈ సంవత్సరం ప్రధానంగా చేపట్టిన 'చేనేతకు చేయూతనిద్దాం నేతన్నకు మద్దతు ఇద్దాం' అని 'చేనేత వస్త్రాలయం' ద్వారా చేనేత వస్త్రాలను స్థానికులకు పరిచయం చేయడం ప్రశంసనీయంగా నిలిచింది. ఈ సందర్భంగా బోనాల కు హాజరైన పలువురు వ్యక్తులు మరియు నాయకులు ప్రసంగించారు.
32,251
https://www.prajasakti.com/WEBSECTION/National/page730/gernalistus-adukunenduku-charyal-tisukondi
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఇంటర్నేషనల్ పేపర్మిల్లులో మూడు రోజులుగా కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన ఆందోళన ఉధృతమౌతోంది. శనివారం జరిగిన ధర్నానుద్ధేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బిబి. నాయుడు మాట్లాడుతుండగా పోలీసులు మైక్ లాక్కున్నారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. యాజమాన్యానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మిల్లులోకి ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ధర్నా నిర్వహించారు. సమస్యలను పరిష్కరించే వరకూ ఐక్యంగా ఉద్యమిస్తామని నినదించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ, 20 ఏళ్లుగా కార్మికులు మిల్లులో వెట్టిచాకిరీ చేస్తున్నా యాజమాన్యం వారి సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులకు ఇఎస్ఐ, పిఎఫ్లను మిల్లు యాజమాన్యమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే పద్ధతుల్లోనే కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి టి. అరుణ్, టిఎన్ టియుసి నాయకులు బ్రహ్మయ్య, రాజారావు మాట్లాడారు. కార్మికులందరికీ యూనిఫారం, సేఫ్టీ షూ, హెల్మెట్, గ్లౌజ్లను తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకూ పోరాడతామని వారు స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఇంటర్నేషనల్ పేపర్ మిల్లులో మూడు రోజులుగా కొనసాగుతున్న కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యమం ఉధృతమైంది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు వి. బి నాయుడు ప్రసంగానికి అంతరాయం కలిగించడం వలన పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వివాదం ఏర్పడింది. కార్మికుల సంక్షేమం యాజమాన్యమే తీసుకోవాలని, కనీసవేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
32,358
https://www.prajasakti.com/WEBSECTION/National/page911/vicendrikarantone-rashtrabhivruddhi-baalakrishna
తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన 1253 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగుల అంశంలో కొత్త ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన విధంగా జనాభా నిష్పత్తిలో విభజించాలన్న వాదన వినిపించింది. ఏపీ ట్రాన్స్కో సిఎండి విజయానంద్ దీన్ని ప్రతిపాదించారు. దీనిపై తెలంగాణ ట్రాన్స్కో యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజా ప్రతిపాదనపై పూర్తి సమాచారాన్ని సేకరించిన తరువాతే నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 30న మరోసారి సమావేశం ఏర్పాటు కానుంది. రిలీవైన విద్యుత్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించడానికి బుధవారం విద్యుత్ సౌధలో ఏపీ ట్రాన్స్కో సిఎండి కె విజయానంద్, తెలంగాణ ట్రాన్స్కో సిఎండి డి ప్రభాకర్రావు సమావేశమయ్యారు. ఉద్యోగుల పంపకాల కోసం కేంద్రం నియమించిన కమల్నాథన్ కమిటీ రూపొందించిన నిబంధనల ప్రకారం విద్యుత్ ఉద్యోగులను విభజించాలని విజయానంద్ సూచించారు. ఇందుకు తెలంగాణ అధికారులు అంగీకరించలేదు. ఉద్యోగంలో చేరే సమయంలో సర్వీసు రిజిస్టర్లో నమోదు చేసిన స్థానికత ఆధారంగానే వారిని విభజించాలని తెలంగాణ ట్రాన్స్కో సిఎండి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. అనంతరం మధ్యేమార్గంగా జనాభా ప్రాతిపదికన విభజించాలన్న విషయాన్ని ఏపీ అధికారులు ప్రస్తావించారు. రిలీవైన 1253 మంది ఉద్యోగులను యూనిట్గా తీసుకుని జనాభా ప్రాతిపదికన విభజించే అంశాన్ని పరిశీలిస్తామని తెలంగాణ ట్రాన్స్కో అధికారులు పేర్కొన్నారు. అలా కాకుండా ఉద్యోగులు, అధికారుల స్థాయి ( క్యాడర్ ) ని ఆధారంగా చేసుకోవాలని ఏపీ అధికారులు సూచించారు దీనిపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేమని, ప్రధాన కార్యాలయం విద్యుత్ సౌధ, ఏపీ, తెలంగాణల్లో పనిచేస్తోన్న సొంత రాష్ట్రానికి చెందిన ఉద్యోగుల పూర్తి డేటాను సేకరించాల్సి ఉందన్నారు. ఉద్యోగుల వివరాలను సేకరించిన తరువాత ఈ నెల 30 న మరోసారి సమావేశం కావాలని ఏపీ, తెలంగాణ ట్రాన్స్కో అధికారులు నిర్ణయించారు.
తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన 1253 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగుల అంశంలో కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీని కారణంగా ఇరుపక్షాల అధికారుల మధ్య అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధాన కార్యాలయం విద్యుత్ సౌధ, ఏపీ, తెలంగాణలో పనిచేస్తున్న సొంత రాష్ట్రానికి చెందిన ఉద్యోగుల పూర్తి డేటాను సేకరించిన తర్వాత విభజన చేయడం మంచిదని ఇరు వర్గాలు భావించాయి.
32,529
https://www.prajasakti.com/WEBSECTION/National/page895/maharashtra-hindutva-karyakarta-vyakhyalpai-dumarn
మహిళా సమస్యలను ఎన్నికల్లో ఓట్ల కోసం వాడుకుంటున్ను రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే ఆ హామీలను మర్చిపోతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి జగ్మతి సంఘ్వాన్ విమర్శించారు. అత్యాచారానికి గురైన మహిళలకు ప్రభుత్వం ఎలాంటి బతుకు తెరువూ చూపించడం లేదన్నారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యు జాతీయ సమావేశాల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన జగ్మతి గురువారం స్థానిక ఐద్వా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం దేశంలోని మహిళలకు ఎలాంటి రక్షణా కల్పించడం లేదన్నారు. నిర్భయ ఫండ్ రాష్ట్రాలకు సక్రమంగా అందలేదన్నారు. రాబోయే బడ్జెట్లో మహిళల వాటాను పెంచాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో విద్యార్హత లేకపోతే పంచాయతీల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. మహిళలు చదువుకోకపోవడానికి ప్రభుత్వాలు కారణం కాదా ? అని నిలదీశారు. ఇప్పటికీ దళిత మహిళల్లో 83 శాతం మంది చదువుకు దూరంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఉపాధి హామీ, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు సరైన జీతాలు ఇవ్వకుండా గొడ్డుచాకిరీ చేయిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని కేంద్ర విశ్వ విద్యాలయంలో విద్యార్థి సంఘాల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా మహిళా సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి ప్రభావతి, రాష్ట్ర కమిటీ సభ్యులు బి పద్మ, విశాఖ జిల్లా అధ్యక్షులు కె ద్రాక్షాయిని పాల్గొన్నారు.
మోడీ ప్రభుత్వం దేశంలోని మహిళా సమస్యలపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాజకీయం లోకి వచ్చిన తర్వాత నెరవేర్చడం లేదని ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శ జగ్మతి విమర్శించారు. అత్యాచారానికి గురైన మహిళలకు ప్రభుత్వం ఎలాంటి బ్రతుకు తెరువు చూపించక పోగా, దళిత మహిళల్లో 83 శాతం మంది చదువుకు దూరంగా ఉండటం గమనార్హం.
32,586
https://www.prajasakti.com/WEBSECTION/National/page22/kaul-ritula-adukovali
పొదుపు పేరిట డిస్కమ్లు ఉచిత విద్యుత్ కనెక్షన్లను నియంత్రిస్తున్నాయి. విద్యుత్ పొదుపు ప్రమాణాలను పాటిస్తామని హామీ పత్రం ఇస్తేనే గానీ రైతులకు కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడం లేదు. విద్యుత్తు పొదుపు పాటించని రైతులకు కొత్త కనెక్షను ఇవ్వబోమని డిస్కమ్ల అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల సెల్ఫోన్లకు ఈ మేరకు సంక్షిప్త సందేశాలు, మౌఖికాదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. ప్రసుతం రాష్ట్రంలో 15.87 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుండగా, 2015-16 లో వ్యవసాయానికి లక్షకు పైగా కొత్త కనెక్షన్లు ఇవ్వాలని సదరన్, ఈస్టర్న్ డిస్కమ్లు నిర్ణయించాయి. ఆశతో రైతులు దరఖాస్తులు చేసుకోగా వారి దరఖాస్తులను పరిశీలించకపోగా డిస్కమ్లు తాఖీదులు ఇస్తున్నాయి. విద్యుత్ పొదుపులో భాగంగా డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ( డిఎస్ఎం ) ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఒత్తిడి తెస్తున్నాయి. అలా హామీ పత్రం ఇవ్వాలని, లేకుంటే కొత్త కనెక్షన్ ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో మూడు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. డిస్కమ్లు మంజూరు చేసిన కొత్త కనెక్షన్ల సంఖ్య 50 వేలు కూడా దాటలేదని తెలుస్తోంది. అధికారులు పేర్కొంటున్న పొదుపు ప్రమాణాలను అనుసరిస్తే ఒక్కో రైతుపై కనీసం రూ. 50 వేల వరకు అదనపు భారం పడుతుంది. దాన్ని ప్రభుత్వమే భరిస్తామని చెబుతున్నా, ఆచరణ సాధ్యం కావడం లేదు. పొదుపు పేరిట వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ను నియంత్రించడానికి ప్రభుత్వం పరోక్షంగా చర్యలు చేపట్టిందని సమాచారం. ఇలా 2016-17 లో మూడు వేల మిలియన్ యూనిట్ల మేర ఉచిత సరఫరాను తగ్గించబోయే అవకాశాలు లేకపోలేదని అధికారులే చెబుతున్నారు.
రాష్ట్రంలో విద్యుత్ను పొదుపుగా వాడని రైతులకు కొత్త కనెక్షన్ ఇవ్వబోమని, డి. ఎస్. ఎన్ ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తామని హామీ పత్రం ఇస్తేనే కనెక్షన్ ఇస్తామని డిస్కంల అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాణాలు అనుసరించడం వల్ల ఒక్కో రైతుపై కనీసం 50 వేల రూపాయలు అదనపు భారం పడుతోంది.
32,994
https://www.prajasakti.com/WEBSECTION/International/page644/2026-winter-olimpix-vedik-kharar
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం రామకృష్ణాపురం గ్రామంలో మంగళవారం టిడిపి కార్యకర్త వల్లూరి నాగేశ్వరరావు అలియాస్ నాగేష్ ( 38 ) ను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం పలుకూరు ఎంపిటిసి-3 నాగేష్ ఉదయం 9.30 గంటలకు తన కుమారుడు మేఘనాథ్ను పాఠశాల వద్ద విడిచిపెట్టడానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా కాపు కాసిన ప్రత్యర్థులు కళ్లలో కారంపొడి చల్లారు. అనంతరం వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికారు. నాగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. 2014 లో గనుల విషయంలో జరిగిన గొడవలో మాజీ సర్పంచి ఆపతి ప్రభాకర్నాయుడును నాగేష్ వర్గం హత్య చేసింది. ఈ కేసులో నాగేష్ మొదటి ముద్దాయి. ప్రత్యర్థులు నాగేష్పై కక్ష పెంచుకుని పథకం ప్రకారం హత్య చేశారు. ఇటీవలే ఆ గ్రామాన్ని నంద్యాల డిఎస్పి హరినాథరెడ్డి దత్తత తీసుకున్నారు. గ్రామంలో పికెటింగ్ ఉన్నా హత్య జరగడం పోలీసుల వైఫల్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా నాగేష్ బంధువులు, అనుచరులు అడ్డుకున్నారు. పోలీసులు సర్దిచెప్పి మృతదేహాన్ని తరలించారు. బనగానపల్లె ఎమ్మెల్యే బిసి జనార్థన్ రెడ్డి, వైసిపి, టిడిపి నాయకులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి బంధువులను పరామర్శించారు. మృతునికి భార్య లక్ష్మిదేవి, కుమారులు కేదార్, మేఘనాథ్, కుమార్తె జాహ్నవి ఉన్నారు. నంద్యాల డిఎస్పి హరినాథరెడ్డి, పాణ్యం సిఐ పార్థసారధి రెడ్డి, ఎస్ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
2014లో గనుల విషయంలో జరిగిన గొడవ లో మాజీ సర్పంచ్ ఆ పత్తి ప్రభాకర్నాయుడు ను టిడిపి కార్యకర్త వల్లూరి నాగేశ్వరరావు హత్య చేసి చంపారు. ఈ ఘటనపై కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు నాగేశ్వరరావును వేట కొడవలితో నరికి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని బనగానపల్లెలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, టిడిపి నాయకులు ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి బంధువులను ప్రారంభించారు.
35,480
https://www.prajasakti.com/WEBSECTION/National/page709/asibi-vallo-matsyashakh-adhikaari
డ్రైవర్ల పిల్లలకు ఉపకార వేతనాలు అందించేందుకు ఆయా కుటుంబాల వివరాలు వెంటనే కాల్సెంటర్లు ఏర్పాటు చేసి సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన కార్మిక శాఖ సమీక్షలో మాట్లాడుతూ, రాష్ట్రం లోని ప్రతి కార్మికుడూ అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం పొందాలన్నారు. డ్రైవర్లకు ప్రమాద బీమా పథకం అమలులో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధవళేశ్వరం ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు వారం రోజుల్లో ప్రమాద బీమా పరిహారం అందించినట్లే, రాష్ట్ర వ్యాప్తంగా అదే చొరవ, స్పందన చూపించాలని సూచించారు. డ్రైవరు, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ కోసం ఒక కంట్రోలు రూము, కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏడాదిలో ఎన్ని రోడ్డు ప్రమాదాలు, ఎంత మంది చనిపోతున్నారనే వివరాలను అధ్యయనం చేయాలని సిఎం ఆదేశించారు. ఈ నెలలో ఇప్పటికిి 92 శాతం పింఛన్లు పంపిణీ చేశామని, చౌక డిపోల ద్వారా ఈ-పాస్ అనుసంధానం వల్ల అక్రమాలు అరికట్టామని చెప్పారు. ఆ వేగాన్ని కార్మికశాఖ కూడా అంది పుచ్చుకోవాలన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిధులు సహా, పరిశ్రమల యాజమాన్యాలనూ భాగస్వామ్యులను చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారికి పక్కా గృహాల నిర్మాణం, ప్రత్యేక టౌన్షిప్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్ర్తంలో లైసెన్స్ ఉన్న ట్రాన్స్పోర్టు డ్రైవర్ల సంఖ్య 5,41,000 కాగా, వీరిలో ఇంతవరకు 3,77,000 మంది వివరాలను నమోదు చేసినట్లు కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాద బీమాకు సంబంధించి 28 క్లెయిమ్స్ వచ్చాయని 22 పరిష్కరించామని, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. సామాజిక భద్రతాపథకం అమలుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సిఎం సూచించారు. రాష్ట్రంలో అసంఘటిత రంగంలో రెండుకోట్ల మంది కార్మికులుండగా నాలుగు నెలల్లో 76 శాతం మాత్రమే నమోదు చేయడంపట్ల అసంతృప్తి వ్యక్తం చే శారు. ఈ కార్యక్రమంలో సిఎంఓ సహకార్యదర్శిప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.
డ్రైవర్, అసంఘటిత రంగ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు ఇవ్వడం కోసం ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చెయ్యాలి అని. ఇప్పటివరకు ప్రమాద భీమా కింద 22 క్లెయిమ్స్ వచ్చాయని 22 పరిష్కరించామని, మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మన రాష్ట్రములో ఉన్న 2 కోట్ల మందిలో 76 శాతం మంది మాత్రమే సామాజిక భద్రతాపథకం కింద నమోదు అయ్యారు అని ముఖ్యమంత్రి తెలిపారు
32,206
https://www.prajasakti.com/WEBSECTION/International/page847/karti-chidambara-kesustay-vidhinchin-madras-hacort
'స్పీకర్గా ఉన్నాను కనుక నేను నోరు విప్పననా నీ ధైర్యం ? పద్ధతి మార్చుకో లేకపోతే సర్వనాశనమై పోతావ్' అంటూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిప్పులు చెరిగారు. రెచ్చగొట్టడం వల్లే తుని కాపు గర్జనలో విధ్వంసం జరిగిందని ఆయన ఆరోపించారు. సోమవారం రాత్రి స్పీకర్ గుంటూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను ఒక క్రిమినల్గా అభివర్ణిస్తూ జగన్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. స్పీకర్గా రాజకీయ నేతలు చేసే ఆరోపణలకు స్పందించకూడదనీ, కానీ జగన్ వంటి క్రిమినల్స్ తనను క్రిమినల్గా పేర్కొనడంతో తగిన సమాధానం చెబుతున్నానని వివరించారు. జగన్ ప్రోద్బలంతోనే అల్లరి మూకలు, రౌడీలు రెచ్చిపోయారని, వారి వాహనాల్లో జగన్ ఫొటోలుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రెండు మూడేళ్లలో తానే సిఎం అవుతానని ప్రకటించుకున్న జగన్ ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరచి ఆ పదవిని అలంకరిస్తారా ? అని ప్రశ్నించారు. తుని విధ్వంసంపై నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంతటి ఘటనలను ముందుగా అంచనా వేయలేకపోయిన ఇంటిలిజెన్స్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు. కాపుల అందోళనలో న్యాయం ఉందనీ, వారి రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించారు. వంగవీటి రంగా హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఈ ఘటన తనను ఎంతో కలచి వేసిందనీ, ఎన్టిఆర్ వారించినా తాను ఆనాడు హోం మంత్రి పదవికి రాజీనామా చేశానని అన్నారు. ప్రతిపక్షం, అధికార పక్షానికి తాను సమ ప్రాధాన్యత ఇస్తున్నాననీ, జగన్ వంటి ప్రతిపక్ష నేత ఉండటం వల్ల ఎన్నో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయనీ చెప్పారు జగన్లో ఇప్పటికీ రాజకీయ పరిపక్వత రాలేదని, తనపై ప్రతిసారీ అవిశ్వాస తీర్మానం పెడతానని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. అవిశ్వాసం పెట్టడం సభ్యులకు ఉన్న హక్కు అని, స్పీకర్గా తాను రాజకీయాలకతీతంంగా పనిచేస్తున్నా తనపై ఆరోపణలు దారుణమని చెప్పారు.
స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్ష నాయకుడయిన వైఎస్ జగన్మోహనరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే అల్లర్లకు, కొట్లాటలకు జగన్ ప్రోద్భలమే కారణమని అయన విమర్శించారు. ఈ సందర్భంగా అయన వొంగవీటి రంగా హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, ఎన్ టి ఆర్ వారించినా తాను ఆనాడు హోం మినిస్టర్ పదవికి రాజీనామా చేసానని, ప్రతిపక్షం మరియు అధికార పక్షానికి తానూ సమ ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు.
32,219
https://www.prajasakti.com/WEBSECTION/National/page775/bismilla-khan-manavd-arest
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా తమ సమస్యల పరిష్కారానికి సమిష్టి పోరాటాలు చేయాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రాంతీయ సదస్సు ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కనీస వేతన చట్టాలను పటిష్టంగా అమలు పరచి జీతాలందించాలన్నారు. చేసిన చట్టాలను ప్రభుత్వాలే అమలు చేయడం లేదనీ, కోర్టులు మొట్టికాయలు పెట్టినా పట్టించుకోవడం లేదనీ విమర్శించారు. సమానపనికి సమాన వేతనాలందించాలన్నారు. ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి సుప్రీంకోర్టు తీర్పును కారణంగా చూపకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని అన్నారు. కోర్టు తీర్పుతో పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సిని అమలు చేసి జీతాలు చెల్లించవచ్చనీ, శాశ్వత ఉద్యోగ స్థానంలో నియమించిన వారిని 180 రోజులు దాటితే పర్మినెంట్ చేయవచ్చనీ ప్రభుత్వానికి గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దశలవారీగా తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తోందనీ, వీరంతా పోరాడితే గాని సమస్యలు పరిష్కారం కావనీ అన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పర్మినెంట్ ఉద్యోగులు సహకరించాలని కోరారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చకు తీసుకు రావాలని కోరారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ, సమాన పనికి సమాన వేతనాలను ప్రభుత్వాలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 40 రకాల ఉద్యోగాల్లో 3 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో కీలక శాఖల్లో పనిచేస్తున్నారని తెలిపారు. 10 వ పిఆర్సి ప్రకారం కనీస బేసిక్ జీతంగా చెల్లించాలనీ, ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేయాలనీ తదితర ఎనిమిది డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని చేశారు. మార్చి 3 న చేపట్టే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బాలకాశి, యూనియన్ నేతలు కోటేశ్వరరావు, మాధవి తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ అమలులోకి వచ్చినప్పటినుంచి దశలవారీగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తుందని, కొనేస వేతనాలు కూడా మంజూరు చేయట్లేదని, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమిష్టి పోరాటానికి పూనుకున్నారు. ఈ సందర్భంగా 10 వ పి. ఆర్. సి ప్రకారం కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగులందరినీ పర్మినెంట్ చెయ్యాలని తదితర అంశాలపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ మాట్లాడారు.
32,222
https://www.prajasakti.com/WEBSECTION/National/page342/25-kots-mokkal-natedame-laksya
తూర్పుగోదావరి తునిలో కాపు గర్జన ఉద్రిక్తంగా మారడంతో రాజధాని విజయవాడ ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణలంక, రామలింగేశ్వరనగర్, రామవరప్పాడు వంటి కొన్ని ప్రాంతాలపై నిఘా పెట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పహారాను పెంచారు. పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకుల ఇంటి వద్ద భద్రత పెంచారు. వారి కదలికలపై నిఘాపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగృహంలోనే మంత్రి నారాయణతో అత్యవసరంగా సమావేశమయ్యారు. పరిస్థితిపై సమీక్షించారు. సామాన్యులకు ఇబ్బందులు కలుగుకుండా శాంతిభద్రతలను పరిరక్షించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు షెడ్యూల్లో లేకపోయినా సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తూ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. విజయవాడలోని ప్రధాన కూడళ్లలో అదనపు పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. గర్జన అనేది కాపుల సభ కాదని పార్టీల సభ అని మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు. కాపు గర్జనపై ఆయన ఆదివారం ముఖ్యమంత్రి నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్, కాంగ్రెస్ పార్టీలు కాపు గర్జన కుట్రపన్నాయని మంత్రి ఆరోపించారు.
తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తతతో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నిఘాపెట్టారు. ఈ విషయంపై సిఎం చంద్రబాబు స్పందిస్తూ, సామాన్య ప్రజలకు భంగం వాటిల్లకుండా సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసారు.
32,363
https://www.prajasakti.com/WEBSECTION/International/page907/speshal-pakeji-peruto-karmikulku-anyayam-cheste-sahincha-siatiu
ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్రం ఇప్పుడు జిల్లాలకు విడుదల చేసిరది. జిల్లాకు రూ. 50 కోట్లు చొప్పున రూ. 350 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిరది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులను ఇవ్వాలని కేంద్రం నిర్ణయిరచిరది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు, రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు ఈ నిధులు గతేడాది ఫిబ్రవరిలోనే విడుదలయ్యాయి. మరో రూ. 350 కోట్లు గతేడాది నవంబర్లో విడుదల చేసిరది. వీటికి సంబంధిరచి రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో, ఈ జనవరి 21 న వేర్వేరుగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లనూ జారీ చేసిరది. అయితే ఆ నిధులను జిల్లాలకు కేటాయిరచడంలో మాత్రం ఆర్థిక శాఖ చొరవ చూపలేదు. కేంద్రం విడుదల చేసిన ఆ నిధులను ఇతర అవసరాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ వినియోగిరచుకురది. రాజధాని నిర్మాణానికి ఇచ్చిన రూ. 1800 కోట్లు ఇతర అవసరాలకు వినియోగిరచిన విధంగానే వెనుకబడిన జిల్లాల నిధులను కూడా ఇతర కార్యక్రమాలకు వినియోగిరచుకురది. తాజాగా కేంద్రం నురచి ఈ నిధుల వినియోగంపై ఒత్తిళ్లు పెరుగుతురడడం, కేంద్ర ఆర్థిక శాఖ నిధుల వినియోగంపై ఆరా తీస్త్తురడడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోరది. అరదుకే హడావుడిగా ఆ నిధులను ఏడు జిల్లాలకు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసిరది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో 7 జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులను ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయం మేరకు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం చూపిన వ్యక్తుల వల్ల రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధులను రిలీజ్ చేసింది ఇతర అవసరాలకు ఉపయోగించి ఉండేదని ప్రజల్లో అపోహలు వెల్లువెత్తాయి.
32,535
https://www.prajasakti.com/WEBSECTION/International/page444/karnululo-27na-mainarty-sadssu
ఆయన రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు సారథ్యం వహిస్తున్న మంత్రి. ప్రభుత్వ వైద్యం పై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఆయనది. కామినేని శ్రీనివాస్ గుంటూరు సమగ్ర ప్రభుత్పాత్రిలో తన మోకాలి శస్త్రచికిత్సను ప్రయివేటు వైద్యులతో చేయించు కోనుండటం వైద్య వర్గాలు నివ్వెరపరుస్తోంది. ఆపరేషన్కు హైదరాబాద్ నుంచి కేర్ ఆస్పత్రి వైద్యులు వస్తుండటం గమనార్హం. ప్రభుత్వాస్పత్రిలో అందరూ చేరాలనే స్ఫూర్తితోనే తానిక్కడ చికిత్స పొందుతున్నానని గురువారం నగరంలో నిర్వహించిన మీట్ది ప్రెస్లో కామినేని చెప్పారు. తాను మోకాలు చిప్ప అరిగి 15 ఏళ్లుగా బాధపడుతున్నానని చెప్పారు. జిజిహెచ్లో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఆపరేషన్ చేయించుకోనున్నట్లు తెలిపారు. ఆపరేషన్కు జిజిహెచ్లో ఆర్థోపెడిక్ విభాగం హెచ్ఒడి ప్రొఫెసర్ ప్రశాంత్తోపాటు ఇతర నిపుణులున్నా కామినేని ప్రయివేటు వైద్యుల సేవలే పొందుతున్నారు. మోకాలి చిప్ప మార్పిడిలో నిపుణులైన హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ పిఎన్బి ప్రసాద్ ప్రత్యేకంగా వస్తున్నారని జిజిహెచ్ అధికారులు తెలిపారు. అలాగే గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రుల అధినేత డాక్టర్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి కూడా ఆపరేషన్లో పాల్గోనున్నారు. మంత్రి ఆపరేషన్కు సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ రాజునాయుడు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం మంత్రి ఆస్పత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్కు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రయివేటు వైద్యం చేస్తున్న 600 మంది ప్రభుత్వ వైద్యులకు మెమోలు జారీచేశామని, ఇంక్రిమెంట్లలో కోత విధించామని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. అనుభవం, నైపుణ్యం లేని ఆరోగ్యమిత్రలను తొలగిస్తామని, వీరిలో నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి విద్యార్హతలున్నవారిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. గుంటూరు జిజిహెచ్, కర్నూలు, నెల్లూరు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని చెప్పారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ 15 ఏళ్లుగా తను మోకాలు చెప్పా అరిగి బాధపడుతున్న తరుణం లో భాగంగా, గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రిలో చికిత్సను చేయించుకోవడం వైద్య వర్గాలను నువ్వేరపరుస్తోంది. మంత్రి కామినేని ఇలా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకోవడం ద్వారా ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల పై విశ్వాసం పెరుగుతోందని ప్రభుత్వ వైద్య అధికారులు తెలిపారు.
73,732
https://telangana.suryaa.com/telangana-updates-23209-.html
పియం-ఎస్వైయం పథకం వివరాలు
దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్ (పిఎయం-ఎస్ వైయం) కింద సరికొత్త ఫించన్ పధకం అమలులోకి రానుందని కేబినెట్ సెక్రటరి ప్రదీప్కుమార్ నిన్హా వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ నుండి ఆయన అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించి ఈపధకం గురుంచి వివరించారు. ఈసందర్భంగా సిన్హా మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తూ వృద్ధాప్యం పొందిన వారికి సామాజిక భద్రతను కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పధకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ పధకం ద్వారా దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాదిమందికి ఫించన్ సౌకర్యం కలుగుతుందని ఈ పధకాన్ని వచ్చే మార్చి 5న భారత ప్రధాని నరేంద్ర మోడి లాంచనంగా ప్రారంభించనున్నారని తెలిపారు. ఇదొక విశిష్టమైన వాలంటరీ మరియు కంట్రిబ్యూటరీ ఫించన్ పధకమని ఈపధకంలో పేర్లు నమోదు చేసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 3 లక్షల 50 వేల కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు సాంకేతికపరమైన వివిధ సందేహాలను నివృత్తి చేసేందుకు కామన్ సర్వీస్ సెంటర్లకు సంబంధించి ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు మేనేజర్ను నియమించామని తెలిపారు. ఈ ఫించన్ పధకంలో ఎంతమందైనా చేరవచ్చని గరిష్టపరిమితి అనేది లేదని కేబినెట్ కార్యదర్శి సిన్హా స్పష్టం చేశారు. నెలకు రూ. 15 వేలు ఆదాయం మించకుండా 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారందరూ ఈ పియం-ఎస్వైయం ఫించన్ పధకంలో నమోదు కావచ్చని అసంఘటిత రంగంలో పనచేసే ప్రతి ఒక్కరూ ఈపధకంలో చేరేందుకు అర్హులేనని కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు. ఈవిధంగా నమోదు అయ్యేవారు విధిగా ఆధార్ కార్డు,సేవింగ్స్ బ్యాంకు ఖాతా/ఐఎఫ్ఎస్సి కోడ్ తోకూడిన జన్ ధన్ ఖాతా కలిగి ఉండాలని ఆయన చెప్పారు. ఆదాయపు పన్ను చెల్లించే వారు,సంఘటిత రంగంలో పనిచేస్తూ ఇపిఎఫ్/ఎన్పిఎస్/ ఈఎస్ఐసిలలో సభ్యత్వం గలవారు ఈపధకానికి అర్హులు కాదని స్పష్టం చేశారు. ఈపధకంలో నమోదు అయిన వారికి 60 ఏళ్ల వయస్సు వచ్చాక నెలకు 3 వేల రూ. లు వంతున ఫించన్ పొందేందుకు వీలుంటుందని తెలిపారు. 18 నుండి 40ఏళ్ల మధ్య వయస్సు కలిగి అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఈపధకంలో చేరి వారు నెలకు చెల్లించే వయస్సును బట్టి 55 రూ. ల నుండి 200 రూ. ల వరకూ గల కంట్రిబ్యూషన్ కు మరో 50 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల కోసం ప్రధాని శ్రమ్ యోగి మాన్ధాన్ ఆధ్వర్యంలో తాజా ఫించన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ నిన్హా చెప్పారు. ఈ పథకం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. మార్చి 5 న భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఫించన్ పథకంలో ఎంతమందైనా చేర్చవచ్చో గరిష్ట పరిమితి లేదని స్పష్టం చేశారు. నెలకు రూ . 15 వేలకు మించని ఆదాయం ఉన్న 18 నుంచి 40 ఏళ్లలోపు వారు పియం-ఎస్వైయం ఫించన్ పథకంలో చేరడానికి అర్హులు.
78,334
https://telugu.suryaa.com/telugu-latest-updates-295073-.html
టాలీవుడ్ లో తగ్గిన చాన్సులు
చెప్పుకోవడానికి పెద్ద హిట్లేమీ లేవు. అయినా సరే పెద్ద హీరోల సరసన ఛాన్సులు దక్కాయి. అయినా పెద్ద హిట్లేమీ రాలేదు. కానీ అప్పటికీ పెద్ద ఛాన్సులు రావడం ఆగలేదు. కానీ ప్రతీసారి టైం ఒకేలా ఉండదు కథా. ఈ సారి పెద్ద ఆఫర్లు వచ్చినా,పక్కన కుర్ర హీరోయిన్లు పెరిగారు. హిట్లు లేకపోయినా ఎక్కువ డబ్బులిచ్చి పెద్ద హీరోయిన్ దగ్గరకి వెళ్ళడం కంటే కుర్ర హీరోయిన్లు నమ్ముకోవడం బెటర్ అని ఈ భామని పక్కన పెట్టేసారు. ఇంతకీ ఎవరు ఈ భామ అనుకుంటున్నారా? ఇంకెవరండీ మన రకుల్ ప్రీత్ సింగ్. మొదట్లో ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘లౌక్యం’ వంటి చిన్న హిట్లు అందుకున్న ఈ భామకి వరుసగా చరణ్, ఎన్టీఆర్ ల సరసన ఛాన్స్ లభించింది. అవే ‘బ్రుస్ లీ’ ‘నాన్నకు ప్రేమతో'! ఇవి కూడా భారీ హిట్లేమీ కాదు. కానీ ఆమెకు ఉన్న క్రేజ్ రీత్యా అల్లు అర్జున్, మహేష్ బాబు, వంటి స్టార్ల పక్కన ఛాన్సులు వచ్చాయి. కానీ కుర్ర హీరోయిన్లు రావడం, రకుల్ రెమ్యూనరేషన్ ని నిర్మాతలు తట్టుకోలేక పోవడంతో ఆఫర్లు తగ్గుమొకం పట్టాయి. దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది.
హిట్లు లేకపోయినా వరుస ఆఫర్లతో ముందుకొచ్చిన భామ రాకుల్ ఇప్పుడు చాన్సులు లేక బాలీవుడ్ బాట పట్టింది. హిట్లు లేకపోవడం, కొత్త హీరోయిన్లు రావడం, రెమ్యూనరేషన్ ని పెంచడం వల్ల రాకుల్ ని పక్కన పెడుతున్నారు.
34,518
https://www.prajasakti.com/WEBSECTION/National/page314/7na-akkineni-75va-jayanti-vedukal
పదో తరగతి పరీక్షలను వచ్చే మార్చి 16 లేదా 24 నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పాఠశాలలకు 220 పని దినాలు పూర్తి చేయాలనే నిబంధనతో పాటు ప్రభుత్వ సెలవులను పరిగణలోకి తీసుకుని ఈ పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మార్చి 23న హోలీ, ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్రామ్ జయంతి, ఏప్రిల్ 8 గుడ్ప్రైడే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మార్చి 24 నుంచి పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైన టైంటేబుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడంపైనా విద్యాశాఖ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఏకకాలంలో పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రశ్నపత్రాల్లో గందరగోళాన్ని నియంత్రించ వచ్చని అధికారులు భావిస్తున్నారు. సెలవు దినాలు ఖరారయ్యాక పూర్తి స్థాయి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్ష ఫీజు పెరగనుంది. ప్రభుత్వ పాఠశాలలను మినహాయించి ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఈ ఫీజు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ. 125గా ఉన్న ఫీజును రూ. 600 పెంచాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్స్నూ ఈ విద్యా సంవత్సరం నుంచి జబ్లింగ్ విధానం లో నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆలోచనలో ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని, అనుమతులు రాగానే ఏర్పాట్లు చేస్తామని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్ బోర్డు గడువు పొడిగించింది. డిసెంబర్ 4 వరకు అవరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. రూ. 120 ఆలస్య రుసుంతో డిసెంబర్ 10 వరకు చెల్లించుకోవచ్చని అధికారులు తెలిపారు.
పాఠశాలలో 220 రోజులు పని చేయాలనేదాన్ని, సెలవులను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం మార్చ్ 16 లేదా 24 నుండి నిర్వహిస్తారని భావన. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పరిక్షలు పెట్టాలనుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో వచ్చే సంవత్సరం నుండి పరీక్షా ఫీజు రూ. 125 ని రూ. 600 కి పెంచమని విద్యాశాఖ చెప్తుంది. ఇంటర్ ప్రకటికల్స్ జంబ్లింగ్ విధానంలో అమలు చేయాలని ఇంటర్ బోర్డు వర్గాలు అనుకుంటున్నాయి.
33,130
https://www.prajasakti.com/WEBSECTION/International/page654/32ki-cherin-agni-pramad-mritul-sankhya
నూతన రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న అతి భారీ రహదారుల వల్ల పలు గ్రామకంఠాలకు ముప్పు వాటిల్లే ప్రమాదమేర్పడింది. మాస్టర్ప్లాన్లో పేర్కొన్న విధంగా ఎక్స్ప్రెస్ హైవే 75 మీటర్ల వెడల్పుతో కీలకమైన రహదారులు నిర్మించనున్నారు. అయితే ఎక్కడా వంపులు లేకుండా నిర్మించాలని తలపెట్టారు. ఈ రహదారులు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రహదారులకు అనుసంధానం చేస్తారు. రాజధాని పరిధిలోని ప్రతి కిలో మీటరుకు ఆయా గ్రామాల వద్ద అంతర్గత రోడ్లతో అనుసంధానం చేయాలని తలపెట్టారు. కొల్కతా-చెన్నై, అనంతపురం-గుంటూరు, విజయవాడ-హైదరాబాద్ రహదారులతో అనుసంధానం చేస్తారు. 127 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్రోడ్డు, 220 కిలోమీటర్ల అవుటర్ రింగ్రోడ్లను ఈ రహదారులతో కలుపుతారు. మొత్తంమీద భారీ రహదారుల నిర్మాణం వల్ల 29 గ్రామాల పరిధిలోని గ్రామకంఠాలకు కొంత ముప్పు ఏర్పడుతుంది. ఆయా గ్రామాల పరిధిలో ఇప్పటి వరకూ నాలుగు, ఏడు మీటర్ల రహదారులు మాత్రమే ఉన్నాయి. భవిష్యత్తులో అన్ని గ్రామాల పరిధిలో నాలుగు, ఆరు, ఎనిమిది లైన్ల రహదారులను నిర్మించి వాటిని రాష్ట్రంలోని ఇతర రహదారులకు అనుసంధానం చేయడం ద్వారా భారీ ఎత్తున భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అంతేగాక రాజధాని పరిధిలోని 29 గ్రామాలకూ భవిష్యత్తులో భారీ ముప్పు వాటిల్లే పరిస్థితులు వస్తాయని రహదారులు, రవాణ రంగ నిపుణులు చెబుతున్నారు. మారుతున్న కాలాని కనుగుణంగా రాజధాని గ్రామాల ప్రజలు తమ నివాసాలను, గ్రామకంఠాల్లో నిర్మించిన కట్టడాలు, పశువుల కొష్టాలు, కోళ్ల ఫారాలను తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుతం గ్రామకంఠాలకు ముప్పు లేకుండా రాజధాని నిర్మాణాలను చేపడతామని చెప్పినా మాస్టర్ప్లాన్లోని అంశాలను పరిశీలించిన తరువాత గ్రామస్తులలోనూ ఆందోళన లేకపోలేదు. సిఎం నివాసం ఏర్పాటు, రాజధాని శంకుస్థాపన నేపథ్యంలో ఇప్పటికే తాడేపల్లి మండలంలో కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి విస్తరణలకే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో 10, 8 లైన్ల రహదారుల ఏర్పాటు ఎలాంటి ముప్పు తెస్తుందోన్న భయం అందరినీ వెన్నాడుతోంది.
నూతన రాజధానిలో భాగంగా విడుదల చేసిన మాస్టర్ ప్లాన్ లో తెలిపినట్లు భారీ రహదారుల నిర్మాణంవల్ల పలు గ్రామకంఠాలకు నష్టం వాటిల్లే అవకాశాలు వున్నాయి. ఈ నిర్మాణాల్లో భాగంగా 127 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు, 220 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును కలపడం వలన దాదాపు 29 గ్రామాలకు ముప్పు వాటిల్లింది. దీనివలన రైతులు భూములను కోల్పోవడమే కాకుండా, తమ ఇళ్లను మరియు నివాస స్థలాలను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా అగుపిస్తున్నాయి.
80,560
https://andhrapradesh.suryaa.com/andhra-pradesh-updates-39757-.html
చంద్రబాబు పాలనలో అమరావతికి రూ. 9060 కోట్లు.
తుళ్ళూరులో వైసీపీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రాజధాని రైతులను గత ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. అమరావతి కోసం చంద్రబాబు హయాంలో రూ. 9060 కోట్లు ఖర్చు చేసారని బొత్స సత్యనారాయణ అన్నారు. వాటిలో రూ. 5674 కోట్లు ఖర్చు చేసారు. ఆర్కిటెక్ కంపెనీలతో రూ. 840 కోట్ల ు చేసుకున్నారు. అందులో రూ. 320 కోట్లు చెలించారు. ఇంకా రూ. 500 కోట్లు చెల్లించాలి. 100 శాతం పూర్తయిన ఒక్క భవనాన్ని చూపించండి అని బొత్స అన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో కిలోమీటర్ రోడ్డు నిర్మాణం ఖర్చు రూ. 42 కోట్లా . . ? అని అంబటి రాంబాబు అన్నారు.
తుళ్ళూరులో వైసీపీ సమావేశంలో బొత్స సత్యనారాయణ, చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి మొత్తం రూ. 9060 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆర్కిటెక్ కంపెనీలతో రూ. 840 కోట్ల ఎమ్ఓయులు కుదుర్చుకుని రూ. 320 కోట్లు చెల్లించారన్నారు. కిలోమీటర్ సీడ్ యాక్సెస్ రోడ్డుకి రూ. 42 కోట్లు అవ్వడమేంటని అంబటి రాంబాబు అన్నారు.
4,173
https://www.prajasakti.com/WEBSECTION/International/page969/yuei-cricket-directorga-rabin-singh
జాత్యహంకారకు గురైన మరో ప్రాణం
పని కోసం అమెరికా వెళ్లడం అవసరమా ? అనిపిస్తోందని మేడసాని అలోక్రెడ్డి తండ్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఘటనపై ఆయన స్పందించారు. మా కుమారుడు కోలుకోవడంతో గండం గడిచినప్పటికీ శ్రీనివాస్ మృతి బాధిస్తుందన్నారు. తన కుమారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా జరిగిన ఘటన గురించి ఆయన పత్రికలకు వివరించారు. అతిగా మద్యం సేవించిన ఆడం పురింటన్ 'మా దేశం నుంచి వెళ్లిపోడంటూ' జాత్యహంకార దూషణలకు దిగారు. దీంతో బార్ యజమానికి అప్రమత్తమై ఆయన్ను బయటకు పంపించాడు. తర్వాత తుపాకీతో తిరిగి వచ్చి కాల్పులకు దిగాడు. తమ కుమారుడు ప్లేటు అడ్డం పెట్టుకున్నాడన్నారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు చెప్పాడు. ఆయన మరో కుమారుడు మేడసాని సురేందర్ రెడ్డి డల్లాస్లో పని చేస్తున్నారు. ఈ ఘటనతో మేం దిగ్బ్రాంతికి లోనయినట్టు చెప్పాడు. కుమారుల్ని చూడటానికి అమెరికా వెళ్లనున్నట్లు తెలిపారు. 11 ఏళ్లుగా కొడుకులను చూడాలని అమెరికా వెళ్లాలనుకుంటున్నా, పని ఒత్తిడి కారణంతో వెళ్లడం కుదరలేదన్నారు. ఈ పర్యాయం వెళ్లనున్నట్టు చెప్పాడు. కొత్తపేట టెలిఫోన్ కాలనీలో నివసిస్తున్న జగన్మోమన్రెడ్డి తెలంగాణ గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్నారు.
తెలంగాణ గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న జగన్మోమన్రెడ్డి ఘటనపై ఆయన స్పందించారు. తన కుమారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా, అతిగా మద్యం సేవించిన ఆడం పురింటన్ తన దేశం నుంచి వెళ్లిపోడంటూ జాత్యహంకార దూషణలకు దిగిన కారణంగా బార్ యజమాని బయటకు పంపించారని చెప్పారు. తర్వాత తుపాకీతో తిరిగి వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు చెప్పారు. తన కుమారుడు కోలుకోవడంతో గండం గడిచినప్పటికీ శ్రీనివాస్ మృతి బాధిస్తుందన్నారు. పని కోసం అమెరికా వెళ్లడం అవసరమా ? అనిపిస్తోందని పేర్కొన్నారు.
23,768
https://www.prajasakti.com/WEBSECTION/International/page933/rend-postel-balet-jaripai-charyal-tisukovali
పెరిగిన పెట్రోల్,డీజిల్ రేట్లు
పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం బుధవారం పెంచింది. పెట్రోల్పై లీటరుకు రు. 0.30, డీజిల్పై లీటరుకు రు. 1.17 పెంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, రిటైల్ ధర తగ్గించకుండా ఎక్సైజు సుంకం రూపంలో ప్రభుత్వం కాజేస్తున్నది. ఈ ఎక్సైజు సుంకం పెంపు ద్వారా ప్రభుత్వం రు. 2500కోట్లు ఆర్జిస్తున్నది. దీంతో బ్రాండ్ రహిత పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రు. 7.06 నుండి రు. 7.36కి పెరిగింది. అలాగే డీజిల్పై లీటరుకు సుంకం రు. 4.66 నుండి రు. 5.83కి పెరిగింది. గత ఆరు వారాల్లో ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ఇది రెండవసారి. నవంబరు 7వ తేదీన మొదటిసారిగా పెట్రోల్పై లీటరుకు రు. 1.60, డీజిల్పై లీటరుకు 30పైసలును పెంచారు
ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్పై లీటరుకు రు. 0.30, డీజిల్పై లీటరుకు రు. 1.17 పెంచి ప్రభుత్వం రు. 2500కోట్లు కాజేస్తుంది. దీంతో ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్ 7.36,డీజేలు 5.83కు చేరింది. గత ఆరు వారాల్లో ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ఇది రెండవసారి.
81,142
https://www.vaartha.com/%e0%b0%8a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf-%e0%b0%a4%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/
దేవూ ఇండియా ఆస్తుల వేలం
ముంబయి: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం భారతీయ విభాగమైన దేవూ మోటార్స్ ఇండియా ఆస్తులు వచ్చే నెల వేలానికి రానున్నాయి. దేవూ మోటార్స్ ఇండియాను 2008లో పాన్ ఇండియా మోటార్స్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ సంస్థ కూడా రుణ ఊబిలో చిక్కుకుపోయింది. దీంతో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏప్రిల్ 11న దేవూ ఇండియా ఆస్తులను వేలం వేయనుంది. దాదాపు రూ. 2,250 కోట్ల బకాయిల వసూలుకు ఈ వేలం జరగనుంది. కంపెనీ మూతపడిన దాదాపు 15ఏళ్ల తర్వాత ఇటీవల డీఆర్టీ నోటీసులు జారీ చేసింది. రెండు విడతలుగా ఆన్లైన్ వేలం నిర్వహించనుంది. వీటిల్లో గ్రేటర్ నోయిడాలో రూ. 204 కోట్లు విలువ చేసే భూమి కూడా ఉంది. ఈ వేలంలో పాల్గొనడానికి కనీస రిజర్వు ధర రూ. 528.61 కోట్లుగా నిర్ణయించారు. ఈ వేలంలో విజయం సాధించినవారు యూపీ స్టేట్ ఇండస్ట్రీయల్ కార్పొరేషన్కు చెల్లించాల్సిన రూ. 66.58 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఏడుగురు రుణదాతలకు సంబంధించిన రుణాల వసూలుకు దీనిని నిర్వహిస్తున్నారు. ఈ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యస్బ్యాంక్, ఎస్బీఐ, బీవోఐలు ఉన్నాయి.
దేవూ మోటార్స్ ఇండియాను పాన్ ఇండియా మోటార్స్ కొనుగోలు చేయగా ఇప్పుడది రుణ ఊబిలో చిక్కుకుపోయింది. డెట్ రికవరీ ట్రైబ్యునల్ దేవూ ఆస్తులను రూ. 2,250 కోట్ల బకాయిల వసూలకు వేలం వేయనుంది. రెండు విడతలుగా ఆన్లైన్ వేలం నిర్వహించనుండగా, ఇందులో గ్రేటర్ నోయిడాలో రూ. 204 కోట్లు విలువ చేసే భూమి కూడా ఉంది. ఇందులో పాల్గొనడానికి రిజర్వు ధర రూ. 528.61 కోట్లు నిర్ణయించారు. విజయం సాధించినవారు యూపీ స్టేట్ ఇండస్ట్రీయల్ కు రూ. 66.58 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.